
Srh vs Pbks live Updates and highlights:
పంజాబ్ కింగ్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్ ఘన విజయం
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి పుంజుకుంది. ప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిర్ధేశించిన 246 పరుగుల భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.
సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ పంజాబీ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 66) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.
అభిషేక్ శర్మ సెంచరీ..
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో తన తొలి ఐపీఎల్ సెంచరీని అభిషేక్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి.
తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్..
ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన హెడ్.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎస్ఆర్‌హెచ్ విజయానికి 45 బంతుల్లో 74 పరుగులు కావాలి.
11 ఓవర్లకు ఎస్ఆర్‌హెచ్ స్కోర్: 154/0
11 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ నష్టపోకుండా 154 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(59), అభిషేక్ శర్మ(88) ఉన్నారు.
అభిషేక్ శర్మ ఫిప్టీ
ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(49), అభిషేక్ శర్మ(67) ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న ఎస్ఆర్‌హెచ్..
246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.క్రీజులో హెడ్(22), అభిషేక్ శర్మ(18) ఉన్నారు.
పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం.. ఎస్‌ఆర్‌హెచ్ ముందు భారీ టార్గెట్
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(42), ఆర్య(36), స్టోయినిష్(11 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు.
హర్షల్ నాలుగు వికెట్లు..
18 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో 42 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్ ఫిప్టీ..
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అయ్యర్ 53 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.
రెండో వికెట్ డౌన్..
ప్రభ్ సిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రాన్.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
పంజాబ్ తొలి వికెట్ డౌన్..
ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన ఆర్య.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో ప్రభుసిమ్రాన్ సింగ్(17), ప్రియాన్ష్ ఆర్య(12) ఉన్నారు.
ఐపీఎల్-2025లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఎస్ఆర్‌హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.జట్టులోకి హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ వచ్చాడు. మలింగకు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. పంజాబ్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పు చేయలేదు.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ,