
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. జూలై 14,15,18,19,20 తేదీల్లో తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయ. జూలై 13న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 23 రిజినల్ సెంటర్లలో 105 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు జరగుతాయి. ఎంసెంట్‌లో అగ్రికల్చర్ పరీక్షలు జూలై 14,15 తేదీల్లో, ఇంజనీరింగ్ పరీక్షలు జూలై 18,19,20 తేదీల్లో జరగనున్నాయి.