
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. గేదె, ఆవు పాల ధరలను లీటర్కు రూ.4 చొప్పున పెంచుతున్నామని, ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నిజానికి పాడి రైతుల సమక్షంలో డెయిరీ బోర్డు సమావేశం నిర్వహించి.. ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ అధికారికంగా అలాంటి సమావేశమేమీ నిర్వహించకుండానే.. గుట్టుచప్పుడు కాకుండా మూడు రోజుల క్రితమే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. అయితే నెలవారీ కార్డులు తీసుకున్న వారికి ఆ పరిమితి ముగిసేంతవరకు.. అంటే సెప్టెంబర్ 10, 13 తేదీల వరకు పాత రేట్లే వర్తిస్తాయని డెయిరీ యాజమాన్యం ప్రకటించింది.