
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడంటూ యువకుడిని తండ్రి హత్య చేశాడు.
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో చనువుగా ఉంటున్నాడని యువకుడిని తండ్రి హత్య చేశాడు. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న తన కూతురితో చనువుగా ఉండటంతో దశరథ్(26)పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడిని హత్య చేసి నిజాంపేట మండల శివారు అటవీప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.
అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతదేహం కోసం దశరథ్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దశరథ్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.