దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర సోమవారం ఆకులపేట నుంచి ప్రారంభమైంది. బాగువలస, వెదుళ్లవలస, వెంకటాపురం క్రాస్‌రోడ్డు, బిల్లాలవలస, కుంచుగుమ్మాడ, గర్బాం గ్రామాల మీదుగా ఆమె పాదయాత్ర సాగుతోంది. అయితే ఆమె చేపట్టిన పాదయాత్ర సోమవారానికి 210వ రోజుకు చేరుకుంది.