Top Stories
ప్రధాన వార్తలు

వారి దయ, జనం ప్రాప్తం... అదే పీ–ఫోర్!
‘ఏరు దాటకముందు ఓడ మల్లయ్య... దాటిన తర్వాత బోడి మల్లయ్య!’ – ఇది పాత సామెత. ఎన్నికలకు ముందు ‘సూపర్ సిక్స్’... ఎన్నికలయ్యాక ‘పీ–ఫోర్’ – ఇది కొత్త సామెత. ఎన్ని కల్లో గెలవడానికి చంద్రబాబు ఎంత అలవికాని హామీలిస్తారో గెలిచిన తర్వాత వాటిని ఎలా అటకెక్కిస్తారో తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ బోడి మల్లయ్య వైఖరిపై వై.ఎస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య వంటి పెద్దలు వేసిన సెటైర్ల వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఐదొందలకు పైగా వాగ్దానాలు చేశారు. అన్నిట్లోకి ప్రధానమైన హామీ... రైతులకు సంపూర్ణ రుణ మాఫీ. ఎన్నికల నాటికే 87 వేల కోట్లకు పైగా ఉన్న రైతు రుణాల సంపూర్ణ మాఫీ రాష్ట్ర వనరులతో సాధ్యం కాదని, ఆ హామీని ఇవ్వడానికి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నిరాకరించారు. కానీ, ఏరు దాటడమే ముఖ్య మని భావించే చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆ హామీని అమలు చేస్తానని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేశారన్నది రాష్ట్ర రైతాంగానికి తెలుసు.ఇప్పుడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాల సాక్షిగా దేశ ప్రజలందరికీ చంద్రబాబు రైతు రుణమాఫీ బండారం బట్టబయలైంది. సరిగ్గా వారం రోజుల కిందనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సమర్పించింది. 2018 జూలై నుంచి 2019 జూన్ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రైతుల సగటు రుణభారం రూ.2,45,554గా ఉన్నట్టు ఈ సమాధానం వెల్లడించింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) రూపొందించిన జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్ రైతుల రుణభారం అధికంగా ఉన్నది. ఇది చంద్రబాబు గద్దె దిగేనాటికి రైతాంగ పరిస్థితి. సంపూర్ణ రుణమాఫీ వాగ్దానం ఒక ప్రహసనం అని చెప్పేందుకు ఇంతకంటే పెద్ద రుజువు ఏముంటుంది?జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత, అంటే 2021 జూలై – 2022 జూన్ మధ్యకాలంలోని ఏపీ రైతుల సగటు రుణభారం 66,205 రూపాయలకు తగ్గిపోయింది. ఇది కూడా ఎన్ఎస్ఎస్ఓ తయారుచేసిన లెక్కే. రాజ్యసభలో కేంద్రం వెల్లడించినదే. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయడంతోపాటు, క్రమం తప్పకుండా బాకీ తీర్చే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయడం వల్ల కలిగిన సత్ఫలితమిది. చంద్రబాబు బూటకపు హామీల అమలు తీరుకూ, జగన్ సంక్షేమ పథకాల అమలు తీరుకూ మధ్యన ఉండే తేడాను చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కూటమి చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనది ‘సూపర్ సిక్స్’. పది నెలల తర్వాత కూడా ఈ ఆరు పథకాల ప్రారంభం ఆచరణకు నోచుకోలేదు. ఒక్క దీపం పథకంలో భాగంగా ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు బదులు ఒక సిలిండర్‌ను అందజేసి మమ అనిపించుకున్నారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేయాలంటే ఈ సంవత్సరానికి అవసరమైన 70 వేల కోట్ల రూపాయలకు బదులు బడ్జెట్లో 17 వేల కోట్లే కేటాయించడాన్ని బట్టి రెండో సంవత్సరం కూడా ప్రధాన హామీ అమలు లేనట్టేనని భావించవలసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మరిపించడానికి ‘పీ–ఫోర్’ అనే దానధర్మాల కార్యక్ర మాన్ని చంద్రబాబు ముందుకు తోస్తున్నారు. ఇక ‘సూపర్ సిక్స్’ జోలికి వెళ్లరని చెప్పడానికి ఇటీవల చంద్రబాబు చేసిన వింత వ్యాఖ్యానం కూడా ఒక రుజువని చెప్పవచ్చు. జగన్మోహన్రెడ్డి అమలుచేసిన సంక్షేమ కార్య క్రమాలన్నీ ఒక ఎత్తు – తాను పెంచి అమలుచేస్తున్న పెన్షన్ కార్యక్రమం ఒక ఎత్తని ఒక విచిత్రమైన పోలికను ఆయన తీసుకొచ్చారు. ఈ రెండూ సమానమే కనుక ఇక అదనంగా చేసేదేమీ లేదనేది ఆయన మనోగతం కావచ్చు. కానీ ఈ పోలిక నిజమేనా? ‘సూపర్ సిక్స్’తో సహా మేనిఫెస్టోలోని మొత్తం హామీల్లో వెయ్యి రూపాయల పెన్షన్ పెంపు ఒక్కదాన్నే చంద్ర బాబు ప్రభుత్వం అమలు చేస్తున్నది. అది కూడా సంపూర్ణంగా కాదు! ఎస్సీ, బీసీలకు యాభయ్యేళ్ల నుంచే వృద్ధాప్య పెన్షన్‌ను అమలు చేస్తానని కూటమి మేనిఫెస్టో చేసిన హామీని విస్మరించారు. ఆ రకంగా ఈ పది నెలల్లో ఎగవేసిన సొమ్మెంతో అంచనా వేయవలసి ఉన్నది.ఐదేళ్ళ పదవీకాలంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 2,73,756 కోట్ల రూపా యలను జనం ఖాతాల్లో వేసింది. ఇతర పథకాల (నాన్–డీబీటీ) ద్వారా 1,84,604 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. మొత్తం ప్రజా సంక్షేమ పథకాల కోసం ఐదేళ్ళలో వెచ్చించిన సొమ్ము 4,58,360 కోట్లు. అంటే ఏడాదికి రమారమి 92 వేల కోట్లు. ఈ కాలంలో వరసగా రెండేళ్లు కోవిడ్ దాడులు జరిగిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్ సర్కార్ 66 లక్షల పైచిలుకు మందికి మూడు వేల రూపాయల చొప్పున నెలకు సుమారుగా రెండు వేల కోట్ల మేర పెన్షన్లు అందజేసింది. పెన్షనర్లలో మూడు లక్షలమందికి కత్తెర వేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయల చొప్పున పెంచి నెలకు 2,700 కోట్లు పంపిణీ చేస్తున్నది. ఈ పెరుగుదల నెలకు ఏడు వందల కోట్ల చొప్పున సంవత్సరానికి 8,400 కోట్లు. ఇది జగన్ సర్కార్ ఏడాదికి సంక్షేమం కింద ఖర్చుపెట్టిన 92 వేల కోట్లకు సమానమేనని చంద్రబాబు వాదిస్తున్నారు. ఎట్లా సమానమవుతుందని ఎవ రైనా ప్రశ్నిస్తే ‘ఎర్ర బుక్కు’లో పేరు రాసుకుంటారట!‘సూపర్ సిక్స్’ హామీల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు ఒక కొత్త నామవాచకాన్ని రంగంలోకి దించారు. అదే ‘పీ–ఫోర్’ (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్). దీని ప్రకారం సమాజంలోని అగ్రశ్రేణి పది శాతం సంపన్నులు సామాజిక బాధ్యత తీసుకుని అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను ఉద్ధరించాలట! సంపన్నులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ పేదలను ఆదుకోవాలనే సిద్ధాంతాలు ఇప్పటివి కావు. పేద, ధనిక తేడాలు సమాజంలో ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నాయి. చంద్రబాబు దానికి కొత్త పేరు పెట్టుకున్నారు. అంతే తేడా! కానీ ఈ సిద్ధాంతంతో అంతరాలు తొలగిపోయిన సమాజం చరిత్రలో మనకెక్కడా కనిపించదు. ఏపీలో ఆదాయం పన్ను చెల్లిస్తున్న అధికాదాయ వర్గాలవారు ఎనిమిది లక్షల మందేనట! మరోపక్క పేదరికం కారణంగా తెల్ల రేషన్‌కార్డు లున్న కుటుంబాలు కోటీ నలభై ఎనిమిది లక్షలు. చంద్రబాబు ‘పీ–ఫోర్’ సిద్ధాంతపు డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఈ గణాంకాలను ఉటంకించారు.ఆదాయం పన్ను చెల్లించేవారి సంఖ్య ఈ లెక్కన రెండు శాతం కూడా లేదు. అందులోనూ వేతన జీవుల సంఖ్యే ఎక్కువ. వీళ్లకు సేవా కార్యక్రమాలు చేసేంత స్థోమత ఉండదు. ఈ లెక్కన కాస్త అటూఇటుగా ఒక్కశాతం మందే పేదల బాధ్యత తీసు కోవాలి. తెల్లకార్డుల సాక్షిగా పేదలు 90 శాతం మంది. ఇందు లోంచి 70 శాతాన్ని తొలగిస్తూ 20 శాతం మంది పేదలను మాత్రమే ‘పీ–ఫోర్’ స్కీములోకి చేర్చుకున్నారు. ఈ పేదల మీద తనకు ఏ రకమైన అభిప్రాయాలున్నాయో మొన్నటి ఉగాది నాడు జరిగిన సభలో స్వయంగా చంద్రబాబు వెల్లడించారు. ‘ఈ బీసీల ఆలోచనంతా ఆ పూట వరకే! సభకొచ్చారు. మధ్య లోనే లేచి వెళ్లారు. మార్గదర్శులు (సంపన్నులు) మాత్రం కూర్చునే ఉన్నార’ని పేదలను ఈసడిస్తూ సంపన్నులను మెచ్చు కున్నారు. పేదవాళ్లకు క్రమశిక్షణ ఉండదనీ, ముందుచూపు ఉండదనీ, డబ్బున్నవాళ్లే పద్ధతైనవాళ్లనే అభిప్రాయంలోంచి మాత్రమే అటువంటి మాటలు వస్తాయి. పేదల పట్ల చంద్ర బాబు ఈసడింపు ధోరణికి ఇదొక్కటే ఉదాహరణ కాదు. చాలా ఉదంతాలున్నాయి. ఎస్.సీల గురించి, బీసీల గురించి గత పదవీ కాలంలో చేసిన కామెంట్లు ప్రజలకు ఎల్లకాలం గుర్తుంటాయి.2013లో చేసిన కంపెనీల చట్టం సెక్షన్ 135 ప్రకారం కార్పొరేట్ కంపెనీలన్నీ వాటి లాభాల్లో రెండు శాతానికి తగ్గకుండా సామాజిక సేవా రంగాలపై ఖర్చు చేయాలి. అది చట్ట బద్ధమైన బాధ్యత. దయాదాక్షిణ్యం కాదు. సగటున దేశ వ్యాప్తంగా సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద 15 వేల కోట్ల రూపాయలను ఇప్పటికే ఖర్చు చేస్తున్నారు. దీన్ని ఏపీ భాగం కింద విడదీస్తే వెయ్యి కోట్ల లోపే ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పనిచేస్తే రెండు వేల కోట్లో, మూడు వేల కోట్లో రావచ్చు. ఈ సొమ్ముతో ఇరవై శాతం మంది జీవితాల్లో వెలుగులు పూయించాలని ఆయన ఆలో చిస్తున్నారు.ప్రతి పౌరునికీ జీవించే హక్కును మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. 21వ అధికరణం ప్రకారం గౌరవప్రదమైన జీవనం ప్రతి వ్యక్తికీ ప్రాథమిక హక్కు. ఈ హక్కును ప్రభుత్వం సంరక్షించాలి. అందుకు విరుద్ధంగా నలుగురు డబ్బున్న వాళ్లను పోగేసి వేదికపై కూర్చోబెట్టి, వేదిక ముందు పేదల్ని చేతులు జోడించి కూర్చు నేలా చేసి, ‘ఒక అయ్యగారి సాయం పదివేలు, ఒక దొరగారి సాయం ఇరవై వేలం’టూ వేలం పాటలు పాడటం రాజ్యాంగ విరుద్ధం. అందుకే సీఎం సభ నుంచి పేద ప్రజలు మధ్యలోనే నిష్క్రమించి ఉంటారు. ముందుచూపు లేక కాదు, మోకరిల్లడం ఇష్టం లేక వెళ్లిపోయుంటారు. అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడం, అందరికీ మేలైన వైద్య సదుపాయాలు లభించేలా చేయడం, అందరూ సమాన స్థాయిలో పోటీపడగలిగే లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ను తయారు చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. రాజ్యాంగ ఆదేశాన్ని మన్నించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వపు ప్రాథమిక విధి. దిద్దుబాటా... ఇంకో పొరపాటా?ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల పుట్టినిల్లుగా పేరుండేది. ఉద్యమాల పర్యవసానంగా పుట్టిన యూనివర్సిటీ హైదరా బాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఒక భావోద్వేగ పూరితమైన నేపథ్యం హెచ్‌సీయూ ఆవిర్భావానికి కారణమైంది. 1969, 1972 సంవత్సరాల్లో రెండు ఉధృతమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలను తెలుగు నేల చూడవలసి వచ్చింది. ఆ ఉద్యమాలను చల్లార్చి ఉమ్మడి రాష్ట్రాన్ని కొనసాగించడం కోసం ఒక రాజీ ఫార్ములాగా ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. అందులో ఒక అంశం హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు! విద్యారంగంలో వెనుకబాటుతనా నికి గురైన ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటు, రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభించే విధంగా దాన్ని కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఉభయతారకంగా ఉంటుందని భావించారు.ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమైంది. 32వ సవరణ ద్వారా 371వ అధికరణానికి ‘ఈ’ అనే సబ్‌క్లాజ్‌ను జోడించారు. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా హైదరాబాద్‌లో ఒక ‘సెంట్రల్’ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఈ క్లాజ్ అవకాశం కల్పించింది. ఆ మేరకు హైదరాబాద్ విశ్వవిద్యాలయ చట్టం 1974ను పార్లమెంట్ ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో గెజెట్‌లో ఈ చట్టాన్ని ప్రచురించారు. భారత రాజ్యాంగంలో 371వ అధికరణం కింద ప్రస్తావించిన ఏకైక విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ మాత్రమే! అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా 2,300 ఎకరాల భూమిని హైదరాబాద్ నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో కేటాయించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడమో, లేక ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించడమో చేయలేదు.పూర్వపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో వాటిని ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న భూములన్నీ నవాబ్ సొంత భూములుగా (‘సర్ఫెఖాస్’గా) పరిగణించేవారు. పోలీస్ యాక్షన్ తర్వాత ‘హైదరాబాద్ స్టేట్’ ఇండియన్ యూని యన్‌లో విలీనమైంది. నైజాం... భూములన్నీ హైదరాబాద్ స్టేట్‌కు వారసత్వంగా లభించాయి. ఇందుకోసం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జీవించి ఉన్నంతకాలం పెద్దమొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రాజభరణం చెల్లించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలో డజన్లకొద్ది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు ఈ భూముల లభ్యతే కారణం.హెచ్‌సీయూను ఒక ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా మలచాలని కేంద్రం భావించినందు వల్ల అప్పటికి ప్రపంచ స్థాయిలో పేరున్న యూనివర్సిటీలను దృష్టిలో పెట్టుకొని వాటి స్థాయిలోనే భూములను కేటాయించాలని భావించారు. ఈ భూములను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. కాకపోతే భూముల రిజిస్ట్రేషన్ జరగలేదు. అటువంటిది అవసరమని కూడా నాటి యూని వర్సిటీ పాలకవర్గాలు భావించలేదు. హెచ్సీయూకు చీఫ్ రెక్టార్‌గా ఒక గౌరవ హోదా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పార్లమెంట్ చట్టపరంగానే కట్టబెట్టింది. కంచే చేను మేస్తుందని ఎవరు భావిస్తారు! అందువల్ల టెక్నికల్‌గా ఆస్తుల బదలాయింపు జరగలేదు.కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్‌సీయూ ప్రతి ష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్ర మించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగిపోయింది.మిగిలిన దాంట్లో 400 ఎకరాల భూమిని తాడూ బొంగరం లేని క్రీడా నిపుణుల పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టారు. అదీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కేబినెట్ అనుమతి కూడా లేకుండానే ఈ కేటాయింపులు జరిగాయి. ఈ నాలుగొందల ఎకరాలు చాలవని ఎయిర్‌పోర్టు సమీపంలో మరో నాలుగొందల యాభై ఎకరాలను కూడా కట్టబెట్టారు. ఆనాటికి దేశంలోని అతిపెద్ద స్కాముల్లో ఈ బిల్లీరావు భూబాగోతం కూడా ఒకటి. వెంటనే ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం, తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ కేటాయింపును రద్దు చేయడం తెలిసిన విషయాలే!రద్దును సవాల్ చేస్తూ బిల్లీరావు కోర్టుల్ని ఆశ్రయించి ఇరవయ్యేళ్లపాటు వ్యాజ్యాన్ని నడిపాడు. రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే నిలవడంతో ఇరవయ్యేళ్ల తర్వాత గత సంవత్సరమే సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ఈ 400 ఎకరాలు ప్రభు త్వానివేనని తేల్చేసింది. కేవలం టెక్నికల్‌గానే ప్రభుత్వ భూములు అనుకోవాలి. యూనివర్సిటీకి ఈ భూములను కేటాయించినట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ అధికా రులకు 1975లోనే ఫిబ్రవరి 21న డీఓ లెటర్ ద్వారా కమ్యూ నికేట్ చేశారు. 2,300 ఎకరాలు కేటాయించినట్టు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు గానీ, ఆ రోజుల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి కాంపౌండ్‌వాల్ కట్టించింది.ఇక్కడ తలెత్తుతున్న కీలకమైన ప్రశ్న ఏమిటంటే, రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన యూనివర్సిటీ ఇది. పార్లమెంట్లో ప్రత్యేకంగా చట్టాన్ని చేసి ఏర్పాటుచేశారు. రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భూముల్ని కేటాయించింది. ఈ భూముల్ని అకడమిక్ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే షరతు కూడా విధించింది. ఆ షరతును ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధపడటం, అమ్ముకోవడానికి కూడా తెగించడం చెల్లుబాటయ్యే విషయాలేనా? నైతికంగానే కాదు, న్యాయపరంగా కూడా! విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్ప స్టేక్ హోల్డర్లు ఇంకెవరూ లేరా?కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకున్నదట! ఇప్పుడు వేలానికి సిద్ధపడింది. ఈ 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదన్న వార్తలు వ్యాపించడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇది జాతీయ సమస్యగా మారింది. ఈ నాలుగొందల ఎకరాల పరిధిలోని దట్టమైన పొదలు స్క్రబ్ అడవిగా అల్లుకున్నాయి. మంజీరా బేసిన్లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి కుంటల్లో చేరిన నీరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలకు ఊపిరిపోస్తున్నాయని చెబుతున్నారు. హెచ్‌సీయూ వెబ్సైట్ లోనే ఇక్కడున్న బయో డైవర్సిటీ గురించి అధికారికంగా పొందుపరిచారు.వంద ఎకరాల్లో బయో డైవర్సిటీని ధ్వంసం చేశారన్న వార్తలను అధికారికంగా రూఢి చేసుకున్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ఏప్రిల్ 16వ తేదీ లోగా నివేదికను ఇవ్వాలని రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించింది. న్యాయ స్థానం జోక్యంతో ప్రస్తుతం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా,ఎంపిక చేసుకున్న పత్రికల్లో వస్తున్న లీకు వార్తలు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి. 400 ఎకరాలే కాదు, మొత్తం రెండువేల ఎకరాల్లో ‘ఎకో పార్క్’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదనీ, ఇందుకోసం సెంట్రల్ వర్సిటీకి ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాలు కేటాయించి, అక్కడికి తర లిస్తారనీ ముందుగా ఒక తెలుగు పత్రిక రాసింది. దానికి ప్రభుత్వ అనుకూల పత్రికగా పేరున్నది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. రెండోరోజు ఒక జాతీయస్థాయి ఇంగ్లిషు పత్రికలో మరింత ప్రముఖంగా, సమగ్రంగా అదే వార్త వచ్చింది. ఎవరూ ఖండించలేదు. అధికారికంగా ప్రకటించనూ లేదు. ఇటువంటి వార్తల్నే జనం పల్స్ తెలుసుకోవానికి ప్రయోగించే ‘లీకు వార్త’లంటారు. నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నదా? వేలానికి అడ్డుపడ్డ సెంట్రల్ వర్సిటీ విద్యార్థులపై కోపమా? వాళ్ల మీద కోపంతో యూనివర్సిటీ స్థాయిని తగ్గించాలనుకుంటున్నారా? వాళ్లదేముంది. రెండు మూడేళ్లు చదువుకొని వెళ్లిపోతారు. నిజంగానే సెంట్రల్ వర్సిటీని వంద ఎకరాల్లోకి పంపించే ఉద్దేశం ఉంటే మాత్రం దాని స్థాపిత లక్ష్యాలను అవహేళన చేసినట్టే అవుతుంది. ఒక తప్పును దిద్దుకోవడానికి మరో తప్పు చేసినట్టవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంతో ఫుట్‌బాల్ ఆడుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా అనే సంగతి కూడా తేలవలసి ఉన్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు.. టీడీపీ శ్రేణులపై కేసులు
కాకినాడ జిల్లా,సాక్షి: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమెల్సీ నాగబాబు పర్యటన కూటమిలో కుంపట్లు రాజేస్తోంది. పిఠాపురంలో వరుస పర్యటనలు చేస్తున్న నాగబాబును టీడీపీ శ్రేణులు అడుగడునా అడ్డుకుంటున్నారు. ఈ తరుణంలో పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.శనివారం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో భాగంగా గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలు జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆహ్వానించడం లేదంటూ ఆయన అభిమానులు,టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఈ తరుణంలో తనను అడ్డుకుని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని టీడీపీ కార్యకర్తలపై జనసేన నేత మొయిళ్ళ నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సంఘటనలో తమ విధులకు ఆటంకం కల్పించారని టీడీపీ కార్యకర్తలపై పిఠాపురం అడిషనల్ ఎస్సై జానీ భాష మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు వేరు వేరుగా కేసులు నమోదు చేశారు.అంతకుముందు పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీ నాగబాబు రాగా.. టీడీపీ, జనసేన కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేయగా.. ప్రతిగా జై జనసేన, జై పవన్ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ తరుణంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పిఠాపురం కూటమిలో నాగబాబు పర్యటన కుంపట్లు రాజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

IPL 2025: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. సింహం గర్జించేందుకు సిద్దమైంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ముంబై ఏప్రిల్ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఇన్ ఫామ్ ఆర్సీబీని ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టుకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. బుమ్రా ఐపీఎల్ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి సింహం గర్జించేందుకు సిద్దంగా ఉందని క్యాప్షన్ జోడించింది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians)ఈ వీడియోలో బుమ్రా భార్య సంజనా తమ కొడుకు అంగద్‌కు తండ్రి ఐపీఎల్ ప్రస్తానాన్ని వివరిస్తుంది. 2013లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా నాటి నుంచి ముంబై సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున 133 మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు తీశాడు.బుమ్రా ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీలో జరిగిన చివరి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు (వెన్ను సమస్య). ఫలితంగా అతను భారత్ ఛాంపియన్‌గా నిలిచిన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమ్యాడు. గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత బుమ్రా దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేశాడు. కొన్ని రోజులు అక్కడ రీహ్యాబ్‌లో ఉండిన బుమ్రా.. తాజాగా ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరాడు. బుమ్రా జట్టులో చేరినా ఏప్రిల్ 7న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది. బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోలేమని చెబుతున్న బీసీసీఐ మరికొన్ని రోజులు అతన్ని అబ్జర్వేషన్లోనే ఉంచాలని భావిస్తుంది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బుమ్రాను ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సీజన్లో బుమ్రా లేని లోటు ముంబై ఇండియన్స్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. యువ బౌలర్లు విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ సత్తా చాటినా బుమ్రా స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ కూడా తమ సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బంతితో సత్తా చాటినా (4-0-36-5) ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ముంబై వేగంగా పరుగులు సాధించలేక 12 పరుగుల తేడాతో ఓడింది. హర్దిక్ పాండ్యా చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా ముంబైని గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో సాంట్నర్‌కు స్ట్రయిక్ ఇవ్వకుండా హార్దిక్ ఓవరాక్షన్ చేశాడు. స్ట్రయిక్ అట్టిపెట్టుకుని అతనైనా పరుగులు రాబట్టాడా అంటే అదీ లేదు. వరుసగా రెండు డాట్ బాల్స్ చేసి ముంబై ఓటమిని ఖరారు చేశాడు. బుమ్రా రాకతోనైనా ముంబై ఫేట్ మారుతుందేమో చూడాలి. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా ఆడలేదు. గాయం కారణంగా హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.

కూటమి కుట్ర.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసిన చంద్రబాబు సర్కార్.. అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అరెస్ట్‌కు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్ చేసింది. అహ్మద్ బాషా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, అహ్మద్ బాషా గతంలో రాజీ పడిన ఓ కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక, సదరు కేసులో ఇరు వర్గాలు ఇప్పటికే రాజీపడటం గమనార్హం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా అహ్మద్‌ను ఇప్పుడు అరెస్ట్ చేసింది.

'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్
'పెద్ది' సినిమాతో దుమ్మురేపేందుకు రామ్‌చరణ్ రెడీ అయిపోయాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన రామ్‌చరణ్ ఫస్ట్ లుక్కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షాట్ పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరామ నవమి (ఏప్రిల్ 6) సందర్భంగా విడుదలైన తొలి షాట్ అదిరిపోయింది. ఫస్ట్ బాల్కే చరణ్ సిక్సర్ కొట్టేశాడని చెప్పవచ్చు. తన జట్టును గెలిపించేందుకు మాస్ లుక్‌లో బరిలోకి దిగాడు చరణ్. సినీ అభిమానులను మెప్పించేలా పెద్ది గ్లింప్స్ ఉంది. గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఈ సినిమా బయటపడేస్తుందని ఆయన ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్‌లో తెలిపారు.జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించగా కెమేరామెన్‌గా ఆర్. రత్నవేలు ఉన్నారు. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం ఉంటుందని రామ్‌చరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్ ఓవరాక్షన్.. బ్రిటన్ ఎంపీలతో అనుచిత ప్రవర్తన!
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ ఎంపీలను అక్కడి అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. దీంతో, ఈ ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ మండిపడ్డారు.వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్, అబ్తిసామ్ మొహమ్మద్ ఇద్దరూ శనివారం ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. లుటాన్ నుంచి ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. అనంతరం కొంత సమయం తర్వాత వారిద్దరినీ విడిచిపెట్టారు. తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచేందుకు ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే వారి రాకను అడ్డుకున్నట్లు తెలిపారు. సమాచారం లేకుండా ఇక్కడ వచ్చారు? అని ప్రశ్నించారు అధికారులు. దీంతో, ఇజ్రాయెల్ టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.ఈ నేపథ్యంలో డేవిడ్ లామీ స్పందిస్తూ..‘ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన యూకే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇద్దరు ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో వారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు స్పష్టం చేశాను. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలకు సంబంధించిన చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది’ అని తెలిపారు.ఇక, యువాన్ యాంగ్ బిట్రన్‌లోని ఎర్లీ, వుడ్డీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అబ్తిసామ్ మొహమ్మద్ (Abtisam Mohamed) షెఫీల్డ్ సెంట్రల్‌కు ఎంపీగా ఉన్నారు. వీరిద్దరి నిర్భందానికి సంబంధించిన కథనాలు పలు మీడియా చానల్స్‌లో ప్రసారం అయ్యాయి. Israel detained British MPs Yuan Yang and Abtisam Mohamed, denying them entry over suspicions they aimed to document Israeli security forces and spread anti-Israel narratives. UK Foreign Secretary Lammy condemned the move as “unacceptable” and “deeply concerning.” pic.twitter.com/jUcApToxis— Nassim Chalhoub (@WarRoomIntel1) April 6, 2025

Tamil Nadu: బీజేపీ బలోపేతానికి ‘పంబన్’ వారధి?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తమిళనాడు ప్రజలకు పంబన్ బ్రిడ్జి(Pamban Bridge) రూపంలో భారీ కానుకను అందించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ ఈ అద్భుత వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ దక్షిణ భారతదేశంలో తన పట్టును బలోపేతం చేసుకునేందుకే ఈ వంతెనను వ్యూహాత్మకంగా ప్రారంభిస్తున్నదనే వాదన వినిపిస్తోంది. 2.08 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన పంబన్ వంతెన రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది.పంబన్ బ్రిడ్జి భారతదేశంలోని మొట్టమొదటి సముద్రపు వంతెన. ఓడల రాకపోకలకు అనుగుణంగా ఈ బ్రిడ్జి గేట్లు తెరుచుకుంటాయి. నూతనంగా నిర్మించిన ఈ వంతెన మరింత ధృడంగా ఉండనుంది. ఇది తమిళనాడు(Tamil Nadu) ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేయనుంది. అలాగే పర్యాటకరంగానికి ప్రోత్సాహాన్ని అందించనుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామేశ్వరంనకు రాకపోకలు సాగించేందుకు ఈ వంతన ఉపయోగపడనుంది. శ్రీరాముని జన్మదినోత్సవమైన రామ నవమిని దక్షిణ భారతదేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రామేశ్వరంనకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు.రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు లంకను చేరుకునేందుకు ఇక్కడ స్వయంగా వారధి నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాగా తమిళనాడు ప్రజలలో తన హిందూత్వ ఎజెండాను బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు బీజేపీ పంబన్ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించి, జాతికి అంకితం చేస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. 2026లో తమిళనాడులో ఎన్నికల జరగనున్న దృష్ట్యా బీజేపీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు శాసనసభకు జరిగే ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.తమిళనాడు రాజకీయాలలో(Tamil Nadu politics) డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యం కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలో బలమైన పట్టు ఉన్న బీజేపీ, దక్షిణాదిలో ఇంకా గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయితే పంబన్ బ్రిడ్జి వంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టి, తద్వారా తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బీజేపీ తమిళనాడు ప్రజలకు తెలియజెప్పాలనుకుంటోంది. తమిళనాడులో రెండవ అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఆ కూటమి ఎన్నికల్లో విఫలం కావడంతో, బీజేపీకి ఏఐడిఎంకే దూరమయ్యింది. ఇప్పుడు 2026 ఎన్నికలకు ముందు బీజేపీ మరోసారి అన్నాడీఎంకేతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తోందని భోగట్టా. అయితే బీజేపీ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో కాలమే చెబుతుంది. ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్

వీడియో వైరల్: అందరిని నవ్వించి.. చివరికి కన్నీళ్లను మిగిల్చిన విద్యార్థిని
ముంబై: సంతోషంగా, ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో స్మృతులతో సంతోషంగా జరుగుతున్న ఫెర్వెల్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. వేదికపై ప్రసంగిస్తున్న ఓ విద్యార్థిని గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటనలో బాధిత విద్యార్థినికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ ప్రాణాలు కోల్పోవడంపై తోటి విద్యార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు.మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలో పరండా పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పరండా ఆరాజి షిండే కాలేజీలో ఫేర్వెల్ పార్టీ విషాదంగా ముగిసింది. వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్ (20) వేదికపై ప్రసంగిస్తున్నారు. అప్పటివరకు విద్యార్థులు, లెక్చరర్ల గురించి మాట్లాడారు. మధ్య మధ్యలో తన ప్రసంగంతో అటు విద్యార్థుల్ని, ఇటు లెక్చరర్లను నవ్వించారు.At RG Shinde College in Dharashiv, Maharashtra, a student, Varsha Kharat, collapsed and died during her farewell speech 😢😢https://t.co/O4Rx9pmtnp#suddendeath https://t.co/gPlhM9qaGh pic.twitter.com/fcCdm6PWFX— Dee (@DeeEternalOpt) April 5, 2025 అయితే అప్పటి వరకు అందరిని నవ్వించి వర్ష మాట్లాడుతూ కుప్పకూలారు. ఫెర్వెల్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థిని కుప్పకూలిపోవడంతో అప్రమత్తమైన తోటి విద్యార్థులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం పరండా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే విద్యార్థిని వర్ష మరణించినట్లు ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వర్ష ఎనిమిదేళ్ల వయసులో గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత 12 ఏళ్లుగా ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, మందులు కూడా వాడటం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణంగా ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు (సడెన్ కార్డియాక్ అరెస్ట్) రావడం వల్ల బ్రెయిన్ డెత్ వచ్చి మృతి చెందిందని నిపుణులు అనుమానిస్తున్నారు. వర్ష మరణంపై కాలేజీ యాజమాన్యం తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె స్మృతిగా ఒక్కరోజు సెలవు ప్రకటించారు.

ఫ్రీగా జియో హాట్‌స్టార్.. ఆఫర్ ప్లాన్ల పొడిగింపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఐపీఎల్-2025 18వ సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ ఈసారి కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను జియో లాంచ్ చేసింది.జియో ప్రకటించిన ఆఫర్ల ప్రకారం.. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ప్రత్యేక ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉండేది. అయితే ఈ టోర్నమెంట్ కు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ జియో నిర్ణయం తీసుకుంది. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ కోసం కొత్త జియో సిమ్ కొనడం లేదా ప్రత్యేక ప్లాన్లతో ఇప్పటికే ఉన్న ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు 4కే రిజల్యూషన్ లో టీవీ, మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అభిమానులు ఈ సీజన్‌లోని ప్రతి మ్యాచ్‌ను ఇంట్లో లేదా ప్రయాణంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.ఫ్రీ జియో హాట్‌స్టార్ ప్లాన్లు ఇవే..రూ.100 ప్లాన్: ఇది డేటా యాడ్ఆన్ ప్లాన్. దీంతో 5జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.195 ప్లాన్: ఇది జియో క్రికెట్ డేటా ప్యాక్. దీంతో 15జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.949 ప్లాన్: ఇది 84 రోజుల కాంప్రహెన్సివ్ ప్లాన్. దీంతో ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్, 5జీ ప్రయోజనాలు ఉంటాయి. 84 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది. అదనంగా జియోక్లౌడ్, ఓటీటీ, ఇతర టెలికమ్ బెనిఫిట్లు ఆనందించవచ్చు.

కేన్సర్‌తో పోరాడటంలో బీట్రూట్ హెల్ప్ అవుతుందా..?
బీట్రూట్కు ఎరుపు రంగును ఇచ్చే బిటాలెయిన్స్ అనే పోషకం చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే విటమిన్–సీ కూడా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో ఇది కూడా కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అంతేకాదు... కొలాజెన్ ఉత్పాదన కూడా ఎక్కువగా జరుగుతుండటంతో చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండటానికి ఆ కొలాజెన్ సహాయపడుతుంది. బీట్రూట్ జ్యూస్ తీసుకునేవారికి అలసిపోకుండా చాలాసేపు పనిచేయగల స్టామినా పెరుగుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే... వ్యాయామం చేస్తూ బీట్రూట్ను క్రమం తప్పకుండా తీసుకునేవారు అనేక రకాల కేన్సర్ల నుంచి రక్షణ పొందుతారు. అలాగే బీట్రూట్ బీటాలైన్ పిగ్మెంట్ల కారణంగా కణితి కణాలను తగ్గించగలదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్ కేన్సర్ కణాలను తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్ రసంలోని నైట్రేట్లు గుండెపనితీరుని మెరుగ్గా ఉంచుతుంది(చదవండి: జుట్టుని మింగేసే మందులివే..)
‘హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటం కాదు.. అది చేసిన కేసీఆర్ పుణ్యం’
అతిచిన్న అంతర్జాతీయ వారధి..!
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. సింహం గర్జించేందుకు సిద్దమైంది..!
బాలీవుడ్ హీరోయిన్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత
నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!
Sri Rama Navami: అయోధ్యకు ఐదు లక్షల మంది భక్తులు.. భద్రత కట్టుదిట్టం
హీరోయిన్గా అవకాశాలు రాక ఐటం సాంగ్? కేతిక ఏమందంటే?
వీడియో వైరల్: అందరిని నవ్వించి.. చివరికి కన్నీళ్లను మిగిల్చిన విద్యార్థిని
ఇజ్రాయెల్ ఓవరాక్షన్.. బ్రిటన్ ఎంపీలతో అనుచిత ప్రవర్తన!
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు.. కార్యజయం
అది మాయ లేడి కాదు స్వామీ! హెచ్‌సీయూ నుంచి వచ్చిన నిజమైన లేడికూన!!
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
‘రింగు’ 6 వరుసలు!
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
'అమెరికాలో ఉద్యోగాలుండవు'
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
మోసం చేశావ్ చంద్రబాబూ.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
డ్యాన్స్‌తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
ఇల్లు అమ్మిన ఇషా అంబానీ
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
గొడ్రాలు అనే మాట పడలేకే ఈ నాటకం
వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?
అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి
రాయల్స్ ఘనవిజయం
అంత కష్టం ఏమొచ్చిందో..
MI Vs LSG: ఏం చేస్తున్నావ్ హార్దిక్?!.. ఆకాశ్ అంబానీ ఆగ్రహం!
కూటమి కుట్ర.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ నిలిపేసిన ఎస్బీఐ
ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్
అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్
చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైళ్లు
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
బావిలో పడిన కోడలు రక్షించేందుకు బావిలోకి దూకిన అత్త
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. నేను ఫెయిల్యూర్ కాదు!
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
బౌలింగ్ వేస్తుండగా పవర్ కట్.. భయపడిన పాక్ బ్యాటర్! వీడియో వైరల్
అమెరికాలో ట్విస్ట్.. ట్రంప్, మస్క్‌కు ఝలక్!
ఆ పాన్ కార్డులకు కొత్త డెడ్‌లైన్..
ట్రంప్ సుంకాల జోరు దేశాలన్నీబేజారు
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
మాళవిక లుంగీ లుక్.. అనసూయని ఇలా చూస్తే!
బాబోయ్ ఈ–స్కూటర్లు!
అదే మా కొంపముంచింది.. ఏదీ కలిసి రావడం లేదు: సీఎస్కే కెప్టెన్
బంగారం రెండోసారి.. వెండి మూడోసారి..
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వైష్ణవి
కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్.. గంభీర్ రికార్డు సమం
వరంగల్: ఎస్బీఐ బ్యాంకుకు తాళం
కోపంతో ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన ఖుష్దిల్!.. మద్దతుగా పీసీబీ ప్రకటన
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు.. టీడీపీ శ్రేణులపై కేసులు
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
జైపూర్ లో దేవసేన బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
దర్గాలో సీతారామ కల్యాణం
అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్ వీడియోలపై సీఎం రేవంత్ సీరియస్
వామనరావు దంపతుల కేసు.. సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
డేట్ ఫిక్స్
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపుతావా.. లేదా.. ? భర్తపై భార్య దాడి
ఐదేళ్ల క్రితం అంత్యక్రియలు.. ఇప్పుడు ప్రత్యక్షం
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా ప్రభాస్
‘ఇందిరమ్మ’కు ప్రైవేట్ ఇంజనీర్లు
జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్.. వీడియో వైరల్
ఖైదీ సీక్వెల్లో అమలాపాల్
'టెస్ట్' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్ మెప్పించారా..?
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గడువు ఎప్పటిదాకా అంటే..!
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
బబుల్ గమ్కాదు..చెక్క నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీ
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
అందరి చూపు... టాలీవుడ్ వైపు...
వైఎస్సార్సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి
ఏఐ కూడా ఊహించలేదుగా...
ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
ధోని ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్
OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
వారియర్ లుక్‌లో రష్మిక.. పాటతో అలరించిన విజయ్ దేవరకొండ!
'భరోసా'.. మెల్లమెల్లగా!
కొత్త లోన్ రూల్.. అమల్లోకి..
‘హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటం కాదు.. అది చేసిన కేసీఆర్ పుణ్యం’
అతిచిన్న అంతర్జాతీయ వారధి..!
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. సింహం గర్జించేందుకు సిద్దమైంది..!
బాలీవుడ్ హీరోయిన్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత
నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!
Sri Rama Navami: అయోధ్యకు ఐదు లక్షల మంది భక్తులు.. భద్రత కట్టుదిట్టం
హీరోయిన్గా అవకాశాలు రాక ఐటం సాంగ్? కేతిక ఏమందంటే?
వీడియో వైరల్: అందరిని నవ్వించి.. చివరికి కన్నీళ్లను మిగిల్చిన విద్యార్థిని
ఇజ్రాయెల్ ఓవరాక్షన్.. బ్రిటన్ ఎంపీలతో అనుచిత ప్రవర్తన!
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు.. కార్యజయం
అది మాయ లేడి కాదు స్వామీ! హెచ్‌సీయూ నుంచి వచ్చిన నిజమైన లేడికూన!!
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
‘రింగు’ 6 వరుసలు!
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
'అమెరికాలో ఉద్యోగాలుండవు'
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
మోసం చేశావ్ చంద్రబాబూ.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
డ్యాన్స్‌తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
ఇల్లు అమ్మిన ఇషా అంబానీ
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
గొడ్రాలు అనే మాట పడలేకే ఈ నాటకం
వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?
అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి
రాయల్స్ ఘనవిజయం
అంత కష్టం ఏమొచ్చిందో..
MI Vs LSG: ఏం చేస్తున్నావ్ హార్దిక్?!.. ఆకాశ్ అంబానీ ఆగ్రహం!
కూటమి కుట్ర.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ నిలిపేసిన ఎస్బీఐ
ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్
అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్
చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైళ్లు
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
బావిలో పడిన కోడలు రక్షించేందుకు బావిలోకి దూకిన అత్త
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. నేను ఫెయిల్యూర్ కాదు!
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
బౌలింగ్ వేస్తుండగా పవర్ కట్.. భయపడిన పాక్ బ్యాటర్! వీడియో వైరల్
అమెరికాలో ట్విస్ట్.. ట్రంప్, మస్క్‌కు ఝలక్!
ఆ పాన్ కార్డులకు కొత్త డెడ్‌లైన్..
ట్రంప్ సుంకాల జోరు దేశాలన్నీబేజారు
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
మాళవిక లుంగీ లుక్.. అనసూయని ఇలా చూస్తే!
బాబోయ్ ఈ–స్కూటర్లు!
అదే మా కొంపముంచింది.. ఏదీ కలిసి రావడం లేదు: సీఎస్కే కెప్టెన్
బంగారం రెండోసారి.. వెండి మూడోసారి..
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వైష్ణవి
కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్.. గంభీర్ రికార్డు సమం
వరంగల్: ఎస్బీఐ బ్యాంకుకు తాళం
కోపంతో ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన ఖుష్దిల్!.. మద్దతుగా పీసీబీ ప్రకటన
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు.. టీడీపీ శ్రేణులపై కేసులు
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
జైపూర్ లో దేవసేన బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
దర్గాలో సీతారామ కల్యాణం
అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్ వీడియోలపై సీఎం రేవంత్ సీరియస్
వామనరావు దంపతుల కేసు.. సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
డేట్ ఫిక్స్
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపుతావా.. లేదా.. ? భర్తపై భార్య దాడి
ఐదేళ్ల క్రితం అంత్యక్రియలు.. ఇప్పుడు ప్రత్యక్షం
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా ప్రభాస్
‘ఇందిరమ్మ’కు ప్రైవేట్ ఇంజనీర్లు
జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్.. వీడియో వైరల్
ఖైదీ సీక్వెల్లో అమలాపాల్
'టెస్ట్' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్ మెప్పించారా..?
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గడువు ఎప్పటిదాకా అంటే..!
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
బబుల్ గమ్కాదు..చెక్క నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీ
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
అందరి చూపు... టాలీవుడ్ వైపు...
వైఎస్సార్సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి
ఏఐ కూడా ఊహించలేదుగా...
ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
ధోని ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్
OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
వారియర్ లుక్‌లో రష్మిక.. పాటతో అలరించిన విజయ్ దేవరకొండ!
'భరోసా'.. మెల్లమెల్లగా!
కొత్త లోన్ రూల్.. అమల్లోకి..
సినిమా

రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
ఆలసించిన ఆశాభంగమే! పురజనుల వేడుకోలు వలన కొద్ది రోజులు మాత్రమే హెచ్చింపబడినది. తెనుగు టాకీల కనులారా వీక్షించి జన్మము సార్థకము చేసికొనుడు. అనేకులకు టిక్కెట్లు దొరకక వెనుకకు మరలిపోవలసి వచ్చుచున్నది. – దుర్గా కళా మందిరం, బెజవాడ. (93 ఏళ్ల క్రితం, ఆనాటి పత్రికల్లో వచ్చిన ఒక సినిమా ప్రకటన ఇది).∙∙ ఈ మాటాడు చిత్రమును చూడని వారి జన్మ నిరర్థకము. ఒకవేళ మీకు తెలుగు భాషయందు ప్రవేశము లేకున్నను, ఒక దఫా వచ్చి కనులార గాంచవలసిందే. – సెలక్టు పిక్చర్సు సర్క్యూట్స్, బెంగుళూరు. (ఇది కూడా అదే సినిమాకు సంబంధించిన వాల్ పోస్టర్ ప్రకటన). ఆ సినిమా : శ్రీరామ పాదుకా పట్టాభిషేకము! శ్రీరాముడి పాత్ర ఉన్న తొలి తెలుగు టాకీ చిత్రం. సినిమాల్లో ఇప్పటికీ శ్రీరాముడంటే శ్రీ నందమూరి తారక రామారావు అన్నట్లుగానే ఉంటుంది. ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తే– ఆయన ఆ పాత్రలో కాక, ఏకంగా శ్రీరాముడిలోనే ఒదిగిపోయారా అన్నట్లుగా ఉంటుందని ఆయన అభిమానులు అంటారు. శ్రీ రాముడిగా ఎన్టీఆర్ తొలి సినిమా ‘సంపూర్ణ రామాయణం’ (1958). రెండోది లవకుశ (1963), మూడు రామదాసు (1964), నాలుగు శ్రీరామాంజనేయ యుద్ధం (1975), ఐదు శ్రీరామ పట్టాభిషేకం (1978). ఎన్టీఆర్ కంటే ముందు అక్కినేని నాగేశ్వరరావు; ఎన్టీఆర్ తర్వాత హరనాథ్, శోభన్‌బాబు, కాంతారావు, రవికుమార్, శ్రీకాంత్, సుమన్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ శ్రీరాముడి పాత్రల్లో కనిపించారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు, ఏఎన్నార్ కంటే కూడా ముందు... తొలిసారి తెలుగు తెర మీద ప్రత్యక్షమైన రాముడొకరు ఉన్నారు. ఆయనే యడవల్లి సూర్యనారాయణ!∙∙ ‘జననానికి’ ముందే ‘పట్టాభిషేకం’తెలుగులో తొలి మాటల చిత్రం (టాకీ) ‘భక్త ప్రహ్లాద’ అయితే రెండో టాకీ చిత్రం ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. రెండూ ఒకే ఏడాది పూర్తయ్యాయి. భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరిలో, శ్రీరామ పాదుకా పట్టాభిషేకం 1932 డిసెంబరులో విడుదలయ్యాయి. ఈ రెండో చిత్రంలోనే రాముడిగా నటించారు యడవల్లి సూర్యానారాయణ. అంటే, ఏఎన్నార్ రాముడిగా నటించిన ‘సీతారామ జననం’ (1944) చిత్రానికి పన్నెండేళ్లకు ముందు, ఎన్టీయార్ తొలిసారి రాముడిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి 26 ఏళ్లకు ముందే ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’లో రాముడి పాత్రను పోషించి, తెలుగు టాకీ తొలి రాముడిగా ప్రఖ్యాతిగాంచారు యడవల్లి. ∙∙ యువ దర్శకుడి చేతిలో తొలి రాముడు‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రాన్ని బాదామి సర్వోత్తమ్ దర్శకత్వంలో సాగర్ స్టూడియోస్ వారు నిర్మించారు. సీతగా సురభి కమలాబాయి నటించారు. రాముడు అరణ్యవాసం నుండి తిరిగి వచ్చేవరకు, సింహాసనంపై రాముడి పాదుకలను (పాదరక్షలను) ఉంచి భరతుడు రాజ్యపాలన చేయటమే ఈ చిత్ర కథాంశం. బాదామి సర్వోత్తమ్ (1910–2005) ఇరవై ఏళ్ల వయసులో ముంబైలోని ‘సాగర్ మూవీ టోన్’ కంపెనీలో పని చేస్తూ ఆ స్టూడియో వాళ్లు నిర్మించిన అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ సినిమాలలో తొలి టాకీ చిత్రాలకు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహిస్తే, రెండు భాషల్లోనూ తర్వాతి చిత్రాలకు బాదామి సర్వోత్తమ్ దర్శకత్వం వహించారు. ఇరవై రెండేళ్ల వయసుకే ఆయనకు ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. సీతమ్మగా ‘కమలమ్మ’‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రంలో సీతగా నటించే నాటికి సురభి కమలాబాయి వయసు 25 ఏళ్లు. తొలి తెలుగు సినిమా నటి. గాయని. 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ‘భక్త ప్రహ్లాద’లో లీలావతి పాత్రను ధరించారు. రంగస్థల కుటుంబంలో జన్మించిన కమలాబాయి బాల్యంలో కృష్ణుడిగా, ప్రహ్లాదుడిగా నటించారు. కౌమార దశ దాటాక మగ పాత్రలు వేయటం మాని, మహిళల పాత్రలలోకి వచ్చేశారు. కమలాబాయి నటనా ప్రతిభ గురించి విని సాగర్ స్టూడియోస్ వాళ్లే ఆమెను సగౌరవంగా బొంబాయి ఆహ్వానించారు. ఆ స్టూడియో ఆర్టిస్ట్‌గా కమలాబాయి పదేళ్ల పాటు అక్కడే ఉండి, వారు నిర్మించిన అనేక సినిమాలలో నటించారు. ∙∙ రాముడి పాత్ర ‘సాగర్’ ఇచ్చిందేతొలి తెలుగు సినీ రాముడు యడవల్లి సూర్యనారాయణ (1888–1939) కూడా రంగస్థలం నుంచి వచ్చినవారే. సినిమాల్లోకి రాకముందు రంగస్థలంలో ఆయన సూపర్ స్టార్. వివిధ నాటక సమాజాలతో ఉన్న సత్సంబంధాలున్న వారి ప్రోత్సాహంతో ఆయన కూడా సాగర్ మూవీటోన్ గ్రూప్ వారి ప్రతిష్ఠాత్మక యాక్టర్ అయిపోయారు. ‘పాదుకా పట్టాభిషేకంలో’ శ్రీరాముడి పాత్రకు ఎంపికయ్యారు. సినిమాల్లోకి వచ్చేసరికి యడవల్లి వయసు 46 ఏళ్లు. అప్పట్నుంచి మూడేళ్లు సినిమాల్లో ఉండి, తిరిగి నాటక రంగంవైపు వచ్చారు.

అభినయ, సన్నీల పెళ్లి ఎప్పుడంటే..?
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారు పెళ్లి ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉన్నారట. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళ్లోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇక్కడ 'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, అందులో ఒక సీన్లో ఆమె బోల్డ్‌గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి.అభినయ, సన్నీ వర్మల వివాహాం ఏప్రిల్ 16న జరగనున్నట్లు తెలుస్తోంది. ఆమె సన్నిహితులకు ఇప్పటికే ఆహ్వానం కూడా పంపారట. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. అభినయ పుట్టుకతోనే మాటలు రావు, వినిపించవని తెలిసిందే. అయినప్పటికీ తన టాలెంట్‌తో సినిమాల్లో రాణించింది. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు సన్నీ వర్మతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది. అతనికి కూడా పుట్టుకతోనే మాటలు రావని ఇండస్ట్రీలోని ఆమె సన్నిహితులు కొందరు చెబుతున్నారు. అయితే, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.ఆమె ఇటీవలే నిశ్చితార్థం సమయంలో తీసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినయ పంచుకుంది. తనకు కాబోయే భర్తను ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేసింది. ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి కుటుంబం కూడా వ్యాపార రంగంలో ఉందని సమాచారం. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official)

అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
అక్కినేని వారి ఇంటికి కోడలు అనే కేరాఫ్ శోభితా ధూళిపాలా (Sobhita Dhulipala)ను ఇటీవలే వరించి ఉండొచ్చు గానీ... ఆమె పేరుకు ముందు అత్యంత ప్రాచుర్యం కలిగిన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ చేరడం మాత్రం చాలా రోజుల నుంచే ఉంది. అందాల సుందరి కిరీటం దక్కించుకోవడం దగ్గర నుంచి మొదలుపెడితే... ఒకటొకటిగా ఈ తెలుగమ్మాయి దక్కించుకున్న విజయాలు అంత చిన్నవేమీ కావు. బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాల నుంచి మంకీ మ్యాన్ వంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లకు కూడా విస్తరించింది ఓ వైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో రాణిస్తూనే మరోవైపు కమర్షియల్ బ్రాండ్స్ రూపొందించే ప్రకటనల యాడ్ వరల్డ్ కి కూడా హాట్ ఫేవరెట్‌గా మారింది శోభిత. ఆమె భీమా జ్యువెల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్, అలాగే జాక్వార్ ఇండియా హర్ స్టోరీ ప్రచారాలలో కూడా తళుక్కుమన్నారు.యాడ్ గల్లీ డాట్ కామ్ ప్రకారం...ఆమె ఇండో–ఫ్యూజన్ ఫ్యాషన్ డిజైనర్ లేబుల్ అయిన క్యుబిక్ ప్రచారాలలో కూడా కనిపించింది. అంతేకాక ఆమె దాసోస్ క్యాబినెట్ల ప్రచారాలలో కూడా పాల్గొన్నారు. ఐశ్వర్య, సుష్మితాసేన్, ప్రియాంకచోప్రాలను మినహాయిస్తే.. అందాల సుందరి కిరీటం దక్కించుకున్నవారిలో శోభిత స్థాయి విజయాలు మరెవరూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ప్రకటనల్లో , యాడ్ వరల్డ్ అయితే ఆమెకి తిరుగేలేదు. నటిగా సరే, ప్రకనటల్లోనూ యాడ్ క్వీన్‌గా ఆమె రాణించడానికి ఏయే అంశాలు దోహదం చేశాయి? దీని గురించి మోడలింగ్, యాడ్ రూపకల్పన నిపుణులు ఏమంటున్నారంటే... అందం...విలక్షణం... ఆమె అందం కళాత్మక సున్నితత్వంల విలక్షణ సమ్మేళనం, అందుకే శోభితా ధూళిపాళ క్లాస్, మాస్‌లకు ఇష్టమైన సెలబ్రిటీగా ఉద్భవించింది, ఒక ప్రత్యేకమైన అద్భుతమైన అందం ఆమె స్వంతం.డస్కీ కలర్ క్లాసిక్ ఛార్మ్ సాంప్రదాయ మోడల్స్, సెలబ్రిటీల నుంచి శోభితను ప్రత్యేకంగా నిలబెడుతోంది. లగ్జరీ బ్రాండ్లు ఆమె విలక్షణమైన రూపాన్ని ఇష్టపడతాయి, ఆమె హై–ఎండ్ ఫ్యాషన్, అందం ఆభరణాల బ్రాండ్లకు అనువైన ఎంపికగా మారింది. భారతీయతను ప్రతిబింబిస్తూనే.. ఆమె గ్లోబల్ అప్పీల్ ఆమెను వేర్వేరు ప్రాంతాలలోని వైవిధ్యభరిత అభిరుచులు కలిగిన విభిన్న రకాల వినియోగదారులతో కనెక్ట్ కావాలనుకునే బ్రాండ్లకు అనువైన, విలువైన అంబాసిడర్‌గా మార్చింది. ఫ్యాషన్...ఓ స్టోరీ టెల్లింగ్... వ్యక్తిగతంగా ఆమె పాతకాలపు చీరలు, టైలర్డ్ సూట్లు లేదా మినిమలిస్టిక్ సిల్హౌట్‌లు లాంటి కాండిడ్ ఫ్యాషన్ సె¯Œ ్సకు ప్రసిద్ధి చెందింది.ఆమె ఫ్యాషన్‌ను కేవలం ధరించదు దాని ద్వారా ఓ చక్కని కథ చెబుతుంది ఆమె రెడ్ కార్పెట్ ఎడిటోరియల్ లుక్స్ జాగ్రత్తగా క్యూరేట్ చేయబడినట్లు అనిపిస్తుంది, తద్వారా హస్తకళను ప్రదర్శించే హెరిటేజ్ బ్రాండ్లకు ఆమె సరైన ప్రతినిధిగా మారింది. ఆమెకు ఇంటెలక్చ్యువల్ లుక్స్ ఓ వరం. ఆమె తరచుగా సాహిత్యం, కళ చరిత్ర గురించి అనర్గళంగా మాట్లాడుతుంది, ఇవి ఆమెను కేవలం ఒక గ్లామర్ క్వీన్‌గా మాత్రమే కాకుండా ఆలోచనా పటిమ కలిగిన శక్తివంతమైన మహిళగా చూపిస్తోంది. ఈ మేధోపరమైన ఆకర్షణ ఆమెను సంస్కారవంతమైన, వివేకం గల వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే బ్రాండ్లు ఎంచుకోవడానికి కారణమవుతోంది. శోభితా ధూళిపాలా ఆధునిక అందపు స్టైలిష్ లుక్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుతుందని నిరూపితం కావడమే ఆమె మరిన్ని బ్రాండ్స్‌తో పనిచేసేందుకు ఉపకరిస్తోంది.

'జాట్' తెలుగు వర్షన్‌కు ఇబ్బంది ఏంటి..?
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా 'జాట్'. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భారీ మాస్ యాక్షన్ సీన్స్ కనిపించడంతో వారికి కొత్తగా జాట్ సినిమా కనిపిస్తోంది. తమన్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. రీసెంట్గా ఊర్వశి రౌతేలా స్టెప్పులేసిన ఒక స్పెషల్ సాంగ్‌ను విడుదల చేసి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా తెలుగులో విడుదల కావడం మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో హిందీతో పాటుగా టాలీవుడ్లో ఈ మూవీ విడుదల కాకపోవచ్చని సమాచారం. అయితే, పాన్ ఇండియా రేంజ్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఏప్రిల్ 10లోపు పనులు పూర్తి కాకుంటే తెలుగు వర్షన్ మరో వారం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.టాలీవుడ్‌కు సన్నీ డియోల్ ఫిదాజాట్ సినిమాలో రణదీప్ హుడా విలన్‌గా నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమాని లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించారు. జాట్ సినిమాకు దర్శకుడు, నిర్మాత తెలుగు వారే కావడం విశేషం. అయితే, బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ వాళ్లని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సన్నీ డియోల్ తాజాగా అన్నారు. టాలీవుడ్ వాళ్లతో కలిసి వర్క్ చేయడం తనకు నచ్చిందని ఆయన ప్రశంసించారు. సౌత్ వాళ్లతో మరో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఆయన ఆశించారు. భవిష్యత్‌లో సౌత్ పరిశ్రమలో స్థిరపడాలని ఉంది అని సన్నీ డియోల్ అన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
క్రీడలు

వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్ ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 నిమిషం 26.983 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేశాడు. చివరి ల్యాప్‌లో అతడు ఈ టైమింగ్ నమోదు చేశాడు. కాగా... వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 41వ పోల్ పొజిషన్. మెక్లారెన్ డ్రైవర్లు నోరిస్ (1 నిమిషం 26.995 సెకన్లు), పియాస్ట్రి (1 నిమిషం 27.027 సెకన్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జపాన్ గ్రాండ్‌ప్రిలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన వెర్స్టాపెన్ ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో దూకుడు కనబర్చలేకపోయాడు. గత 16 రేసుల్లో అతడు కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో తనకు అచ్చొచ్చిన ట్రాక్‌పై నేడు జరగనున్న ప్రధాన రేసును వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. ఆదివారం ఇక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించగా... తడిసిన ట్రాక్‌పై మెరుగైన రికార్డు ఉన్న వెర్స్టాపెన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. వెర్స్టాపెన్ కెరీర్లో ఇప్పటి వరకు 63 ఎఫ్1 రేసులు నెగ్గాడు. ఈ జాబితాలో లూయిస్ హామిల్టన్ (105), షూమాకర్ (91) మాత్రమే అతడికంటే ముందున్నారు. ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి మెక్లారెన్ డ్రైవర్ నోరిస్ (44 పాయింట్లు) అగ్ర స్థానంలో ఉండగా... 36 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో ఉన్నాడు. రసెల్ (మెర్సిడెస్; 35 పాయింట్లు), పియాస్ట్రి (మెక్లారెన్; 34 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇషా సింగ్ రజత గురి
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషా సింగ్ వెండి వెలుగులు విరజిమ్మింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా సింగ్ 35 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా షూటర్లు సున్ యుజీ 28 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఫెంగ్ జియాన్ 30 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్, ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ మనూ భాకర్ 24 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో మనూ భాకర్ 585 పాయింట్లు సాధించి మూడో స్థానంతో, ఇషా సింగ్ 579 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పసిడి పతకం కైవసం చేసుకుంది. దీంతో సీజన్ ప్రారంభ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం చేరింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ 458.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అనిట మంగోల్డ్ (జర్మనీ; 455.3 పాయింట్లు), అరినా అటుఖోవా (కజకిస్తాన్; 445.9 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో స్విఫ్ట్ కౌర్‌కు ఇదే తొలి పతకం మొత్తం 45 షాట్ల పాటు జరిగిన ఫైనల్లో తొలి 15 షాట్లు ముగిసిన అనంతరం జర్మనీ షూటర్ అనిట మంగోల్డ్ కంటే... 7.2 పాయింట్లు వెనుకబడిన సిఫ్ట్ కౌర్ ఆ తర్వాత అదరగొట్టింది. నీలింగ్ పొజిషన్లో సరైన గురి పెట్టలేకపోయిన భారత షూటర్... ఆ తర్వాత ప్రోన్, స్టాండింగ్ పొజిషన్లలో సత్తాచాటింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో సిఫ్ట్ కౌర్ 590 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఫైనల్లో అభినాశ్
న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్లో భారత బాక్సర్ అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు) పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. బ్రెజిల్‌లోని ఫాజ్ డు ఇగాకు నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అభినాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో అభినాశ్ 5–0తో ఇటలీ బాక్సర్ మలంగపై ఏకపక్ష విజయం సాధించాడు. 22 ఏళ్ల అభినాశ్... ఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన యూరీ రెయిస్తో తలపడతాడు. ఐదుగురు జడ్జీల్లో నలుగురు జమ్వాల్‌కు ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు ఇచ్చారు. మొదటి, మూడో రౌండ్లో అందరూ ఏకగ్రీవంగా అతనికే పాయింట్లు అందించడం విశేషం. మరో సెమీఫైనల్లో మనీశ్ రాథోడ్ ఓటమి పాలై కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 55 కేజీల సెమీస్‌లో మనీశ్ 0–5తో నూర్సుల్తాన్ అల్టిన్బెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. ఈ టోర్నీలో భారత బాక్సర్ హితేశ్ (70 కేజీలు) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా... జాదూమణి సింగ్ (50 కేజీలు), విశాల్ (90 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. 19 దేశాలకు చెందిన 130 మంది బాక్సర్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్లో... భారత్ నుంచి 10 మంది బరిలోకి దిగారు. అందులో నలుగురు బాక్సర్లు ఆరంభ రౌండ్లలోనే ఓడిపోగా... మరో నలుగురు కాంస్య పతకాలు సాధించారు.

సన్‌రైజర్స్ కోలుకునేనా!
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–2025లో తమ తొలి మ్యాచ్‌లో 286 పరుగులు చేసి రాజస్తాన్‌పై ఘనవిజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్‌ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఒక్కసారిగా పడిపోయింది. సొంత మైదానంలో లక్నో చేతిలో ఓడిన టీమ్...ఆపై వరుసగా ఢిల్లీ, కోల్‌కతా చేతుల్లో చిత్తుగా ఓడింది. ఇప్పుడు మళ్లీ హోం గ్రౌండ్‌కు చేరిన జట్టు వరుస ఓటముల నుంచి కోలుకోవాలని పట్టుదలగా ఉంది.నేడు జరిగే పోరులో గుజరాత్ టైటాన్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఐపీఎల్లో అతి పెద్ద పరాజయాన్ని గత మ్యాచ్‌లో మూటగట్టుకున్న టీమ్‌ను మళ్లీ ముందంజలో నిలిపే బాధ్యత బ్యాటర్లపైనే ఉంది. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ చెలరేగితే భారీ స్కోరు సాధించవచ్చు. క్లాసెన్ మెరుగ్గానే ఆడుతున్నా... నితీశ్ రెడ్డి ఇంకా ఫామ్‌ను అందుకోలేదు. కమిందు మెండిస్ ఆల్‌రౌండ్ ఆట సానుకూలాశం. షమీ, కమిన్స్ బౌలింగ్‌లో మరింత ప్రభావం చూపించాల్సి ఉంది. బెంగళూరుపై చెలరేగిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు గుజరాత్ తరఫున తన సొంత ఊరిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సుదర్శన్, గిల్, బట్లర్ తదితరులతో టైటాన్స్ బ్యాటింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది.
బిజినెస్

వినియోగదారుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
ముంబై: నియంత్రణ కార్యాచరణను మరింత మెరుగ్గా మార్చడం ద్వారా వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఆర్థిక స్థిరత్వం, సామర్థ్యాలను సమతుల్యం చేయ డం ద్వారా దీన్ని సాధిస్తామన్నారు. ఆర్బీఐ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. ఆరంభం నుంచి చూస్తే ఆర్బీఐ పాత్ర ఎంతో విస్తృతమైనట్టు చెప్పారు. ‘‘సంప్రదాయం–మార్పునకు మధ్య మనం నిలబడి ఉన్నాం. ధరల స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వృద్ధి అన్నవి అత్యాధునిక టెక్నాలజీలు, అంతర్జాతీయ అనిశ్చితులు, వాతావరణ మార్పుల సవాళ్లు, పెరుగుతున్న ప్రజల అంచనాలు వేగవంతమైన సాంకేతిక పురోగతితో అనుసంధానమై ఉన్నాయి’’అని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక నిర్మాణాన్ని తీర్చిదిద్దడంలో వచ్చే దశాబ్ద కాలం ఎంతో కీలకమని పేర్కొన్నారు. మరింత మందికి ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ‘‘కస్టమర్ల సేవలు, వినియోగదారుల పరిరక్షణ స్థిరంగా మెరుగుపడే సంస్కృతిని పెంపొందించడానికి కృషి చేస్తాం. టెక్నాలజీ ఆవిష్కరణలకు మా మాద్దతు కొనసాగుతుంది’’అని ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం సహా భాగస్వాములు అందరి సహకారాన్ని తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.

ఈపీఎఫ్ఓ ప్యానెల్లో మరో 15 బ్యాంకులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించిన చెల్లింపులను స్వీకరించేందుకు కొత్తగా మరో 15 బ్యాంకులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తమ ప్యానెల్లో చేర్చింది. దీంతో మొత్తం బ్యాంకుల నెట్వర్క్ 32కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమక్షంలో ఈపీఎఫ్‌వో, ప్రభుత్వ.. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫెడరల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్ మొదలైనవి కొత్తగా ప్యానెల్లో చేరిన వాటిలో ఉన్నాయి. 78 లక్షల పైచిలుకు పింఛనుదారులు ఏ బ్యాంకు ఖాతా నుంచైనా పింఛన్లను పొందేందుకు కూడా ఇది తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. నవ భారత లక్ష్యం దిశగా దేశ పురోగతికి ఈపీఎఫ్ఓలాంటి సంస్థలు దోహదపడుతున్నాయని తెలిపారు. 8 కోట్ల మంది పైగా యాక్టివ్ సభ్యులు, 78 లక్షల మందికి పైగా పెన్షనర్లకు .. సంస్థ సామాజిక భద్రత ప్రయోజనాలను కలి్పస్తోందని ఆయన చెప్పారు. 2024–25లో 6 కోట్ల పైగా క్లెయిమ్‌లను సెటిల్ చేసిందని తెలిపారు. 2023–24లో నమోదైన 4.45 కోట్లతో పోలిస్తే ఇది 35 శాతం అధికమని మాండవీయ వివరించారు.

ఏఐలో ప్రయివేట్ పెట్టుబడులు గుడ్
న్యూయార్క్: వర్ధమాన దేశాలలో ఏఐ ప్రయివేట్ పెట్టుబడులకు 2023లో చైనా రెండో ర్యాంకును దక్కించుకోగా.. భారత్ టాప్–10గా నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ దేశాలలో ఏఐపై యూఎస్ అత్యధికంగా 67 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు వెచ్చించినట్లు వెల్లడించింది. గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్లో ఇది 70 శాతంకాగా.. తద్వారా యూఎస్ టాప్ ర్యాంకులో నిలిచినట్లు తెలియజేసింది. వర్ధమాన దేశాలలో చైనా 7.8 బిలియన్ డాలర్లు, భారత్ 1.4 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు కేటాయించినట్లు తెలియజేసింది. యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(యూఎన్‌సీటీఏడీ) విడుదల చేసిన టెక్నాలజీ, ఇన్నోవేషన్ నివేదిక 2025లో ఈ వివరాలు తెలియజేసింది. 2033కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వెరసి డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాలు కొన్ని ఆర్థిక వ్యవస్థలకే పరిమితమవుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా గ్లోబల్ ఆర్అండ్డీ కేటాయింపుల్లో యూఎస్, చైనా 40 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది.

ఫిన్‌టెక్ సంస్థలకు పెట్టుబడుల జోష్..
ముంబై: దాదాపు రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫిన్‌టెక్ రంగంలోకి పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం 2025లో ఇప్పటివరకు వృద్ధి దశలో ఉన్న అంకుర సంస్థలు దాదాపు 550 మిలియన్ డాలర్లు సమీకరించాయి. మరికొన్ని డీల్స్ ముగింపు దశలో ఉన్నాయి. పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్, ఎపిస్, యాక్సెల్, మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్, ఎస్ఎంబీసీ గ్రూప్ లాంటి భారీ ఫండ్స్, ఫిన్టెక్లో భాగమైన వివిధ విభాగాల్లోని సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. నియంత్రణ నిబంధనలపరమైన అనిశ్చితి తగ్గడంతో రాబోయే రోజుల్లో ఫిన్‌టెక్ రంగంలో మరిన్ని డీల్స్ నమోదవుతాయని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వర్గాలు తెలిపాయి. ఫిన్‌టెక్ రంగంలోకి 2023, 2024లో కేవలం 1.3 బిలియన్ డాలర్లు మాత్రమే రాగా.. తాజాగా ఈ ఏడాది తొలి నాళ్లలోనే అర బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు రావడం సానుకూల పరిస్థితులను సూచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి. వెల్త్టెక్కు ప్రాధాన్యం.. ఫండ్స్ పెట్టుబడుల్లో వెల్త్‌టెక్ విభాగానికి ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, పేమెంట్స్, బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లాంటి ఇతరత్రా విభాగాలకు కూడా గత మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో గ్రోత్ స్టేజ్ పెట్టుబడులు మెరుగ్గానే లభిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన క్యాష్‌ఫ్రీ సంస్థ ఫిబ్రవరిలో 43 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది. అలాగే, టోన్‌ట్యాగ్ అనే సౌండ్ ఆధారిత పేమెంట్స్ స్టార్టప్ 78 మిలియన్ డాలర్లు అందుకుంది. ఇక ఈజ్‌బజ్ అనే పేమెంట్ అగ్రిగేటర్ సంస్థలో బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్ సారథ్యంలో ఇన్వెస్టర్లు 40 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. టోన్‌ట్యాగ్‌కు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దన్ను ఉంది. ఈ విభాగంలో వృద్ధి చాలా నెమ్మదిగా ఉండొచ్చు కానీ తాజా పరిణామాలతో వ్యాపారాలకు కాస్త స్థిరత్వం లభిస్తుందని ఓ వెంచర్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, ఫిన్‌టెక్ రంగంలో అంతర్గతంగా వెల్త్‌టెక్ విభాగం విస్తరణకు గణనీయంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటక్ చెర్రీ సీఈవో శ్రీకాంత్ సుబ్రమణియన్, ఐఐఎఫ్ఎల్ వెల్త్‌కి చెందిన సందీప్ జెత్వానీ వంటి ప్రముఖ వెల్త్ మేనేజర్ల సారథ్యంలోని సంస్థలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. పేటీఎం మనీ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ జాదవ్ నెలకొలి్పన ధన్ సుమారు 1.1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో దాదాపు 200 మిలియన్ డాలర్లు సమీకరించే యత్నాల్లో ఉంది. 2022లో ప్రారంభమైన స్టేబుల్ మనీ సంస్థ 130 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 20 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంటోంది. 2024 జూన్‌లో నిధులు సమీకరించినప్పటితో పోలిస్తే వేల్యుయేషన్ మూడు రెట్లు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి నియంత్రణ నిబంధనల విషయంలో స్పష్టత నెలకొనడమే ఈ విభాగంపై వెంచర్ క్యాపిటల్ సంస్థలకు ఆసక్తి పెరగడానికి కారణమని పలువురు ఇన్వెస్టర్లు వెల్లడించారు.
ఫ్యామిలీ

వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!
పాలకొల్లు సెంట్రల్: వేసవిలో చిన్నారులకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి ప్రారంభమైందంటే చాలు చికెన్ పాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు పాలకొల్లు మండలం లంకలకోడేరు పీహెచ్సీ వైద్యుడు అడ్డాల ప్రతాప్ కుమార్.చికెన్ పాక్స్ అన్ని వయసుల వారికి సోకినా.. ముఖ్యంగా చిన్నారులకు వేగంగా సోకే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి సోకిన వారు ఆహారం సరిగా తీసుకోలేకపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో నీరసంగా కనిపిస్తుంటారు. ఆటలమ్మ, గవద బిళ్లల లక్షణాలు కనిపించిన వెంటనే సంబందిత వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీ బయోటిక్ మందులు వాడాల్సి ఉంటుంది.గవద బిళ్లలుచల్లటి పానీయాలు అతిగా తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి గవద బిళ్లలు వస్తాయి. ప్రధానంగా లాలాజల గ్రంధులు ఉబ్బడంతో గవద బిళ్లలు ఏర్పడతాయి. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. ఏ ఆహారం తిన్నా నోటిలో నీళ్లు వేసుకుని పుక్కిలించాలి. ఎంఎంఆర్ టీకా వేయించుకోవడం వల్ల గవద బిళ్లలు రాకుండా నివారించవచ్చు. గవద బిళ్లలకు మందులు వాడితే మూడు రోజుల్లో తగ్గుతుంది. వాపు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ఏడు రోజులు పడుతుంది.చికెన్ పాక్స్ఆటలమ్మ వైరస్ వల్ల వస్తుంది. జ్వరం.. శరీరంలో వేడి ఎక్కువై పొక్కులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో స్కిన్ ఎలర్జీని కూడా ఆటలమ్మ అనుకుంటారు. ఆటలమ్మ అరి చేతులు, పాదాలు, నెత్తి మీద రాదు. అలా వచ్చాయంటే అవి స్కిన్ ఎలర్జీగా గుర్తించాలి. ఆటలమ్మ సోకిన వాళ్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ప్రతి రోజూ శుభ్రంగా స్నానం చేయాలి. టీకా అందుబాటులో ఉంది. వేయించుకోవడం మంచిది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి దురద ఎక్కువగా ఉంటుంది. ఒక చోట గోకి మరో చోటు గోకితే అక్కడ పొక్కులు వస్తాయి. అందువల్ల గోర్లు పెరగకుండా చూసుకోవాలి.తీసుకోవాల్సిన జాగ్రత్తలుఆటలమ్మ సోకిన వారిని ఇంట్లో మిగిలిన సభ్యులకు దూరంగా ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే అందించాలి. గవద బిళ్లలు వచ్చిన వారికి గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్ధాలు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. మూఢ నమ్మకాలు, అపోహలకు పోకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ఈ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు సోకకుండా ఉండాలంటే వేడి నీళ్లు తాగడంతో పాటు.. శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ శ్రీరామ నవమి. ఈ రోజున శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలను ఉత్సాహంగా జరుపు కుంటారు. శ్రీరామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేవి చలిమిడి, వడపప్పు పానకం. వేడిని తగ్గించి, శరీరానికి చలువనిచ్చే ఆరోగ్యకరమైన వంటకాలతోపాటు, చక్కెర పొంగలి, పాయసం లాటివాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేక నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.మండువేసవిలో వచ్చే పండుగ శ్రీరామనవమి ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వలన శరీరంలో ఉండే ఖనిజాలు (పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం) చెమట రూపంలో బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. బెల్లం పానకం తాగడం వలన తిరిగి ఈ ఖనిజాలను పొందవచ్చు. ఎండ తాపాన్ని తట్టుకునే శక్తిని బెల్లంలో ఉండే ఇనుము ఇస్తుంది. అంతేకాదు, వేసవిలో తగ్గుతూ పెరుగుతూ ఉండే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. అలాగే పెసరపప్ప కూడా శరీరానికి చలువనిస్తుంది. చలిమిడి కావాల్సినవి: బియ్యం, బెల్లం, కొబ్బరి తురుము, యాలకులు, నెయ్యి తయారీ: నానబెట్టిన ఉంచుకున్న తడి బియ్యాన్ని వడగట్టుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. బియ్యపిండిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికొబ్బరి తురుము, చక్కర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నెయ్యి, పాలు పోసి ముద్దలా కలపాలి. అంతే చలిమిడి రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు– పదితయారి: పెసరపప్పును కడిగి పప్పు మునిగేటట్లు నీటిని పోసి నాననివ్వాలి. రెండు గంటల పాటు నానిన తర్వాత నీటిని వడపోసి కొబ్బరి పలుకులు కలపాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టే వడపప్పును ఇలాగే చేయాలి. రుచికోసం నానిన పెసరపప్పులో అరకప్పు మామిడి తురుము, చిటికెడు ఉప్పు కలిపిపోపు పెట్టుకోవచ్చు.పానకంకావలసినవి: బెల్లం – 100 గ్రా, మిరియాలు – పది ( పొడి చేయాలి), ఏలకులు - ఆరు (పొడిచేయాలి)తయారి: బెల్లంలో ఒక గ్లాసు నీటినిపోసి కరగనివ్వాలి. ఒక గంట తర్వాత బెల్లం నీటిని పలుచని తెల్లని వస్త్రంతో వడపోయాలి. వడపోసిన బెల్లం నీటిలో మిరియాల పొడి, ఏలకుల పొడి కలిపితే పానకం రెడీ. చక్కెర పొంగలి కావలసినవి: బియ్యం -కప్పు, శనగపప్పు -గుప్పెడు, పాలు-మూడు కప్పులు, చక్కెర - ఒకటిన్నర కప్పు, ఏలకులు -పది, (పొడి చేయాలి), జీడిపప్పు, కిస్మిస్– ఒక్కొక్కటి పది, నెయ్యి-మూడు టీ స్పూన్లుతయారి: ముందుగా బాణలిలో నెయ్యివేసి, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన ఉంచాలి. బియ్యం, శనగ పప్పు కడిగి అందులో పాలుపోసి, జీడిపప్పు వేయించగా మిగిలిన నేతిని కూడా బియ్యం -పాలలో వేసి ప్రెషర్ కుకర్‌లో ఉడికించాలి. కుకర్‌లో ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి పాయసం మిశ్రమంలో చక్కెర, ఏలకుల పొడి వేసి, చక్కెర కరిగే వరకు కలిపి జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసి మూత పెట్టాలి. పది నిమిషాలకు అన్నానికి తీపి బాగా పట్టి రుచిగా ఉంటుంది.

శ్వాస మరింత మెరుగ్గా! సింపుల్ అండ్ హెల్దీ యోగ!
శరీరం, మనస్సును సమన్వయం చేయడంలో శ్వాస కీలక పాత్ర పోషిస్తుంది. యోగా ద్వారా శ్వాసలోని లోపాలు, ఒత్తిడి, నిరాశ లను అదుపు చేయవచ్చు. మానసిక స్థిర త్వాన్ని మెరుగ పరచుకోవచ్చు.శ్వాస వ్యాయామాలు...ఉజ్జయి శ్వాసను సముద్ర శ్వాస పద్ధతితో పోల్చుతారు. ముక్కు ద్వారా దీర్ఘంగా గాలి పీల్చి, ముక్కు ద్వారా వదలడం. దీనిని సాధారణంగా అష్టాంగ, విన్యాస తరగతులలో ఉపయోగిస్తారు. మూడుభాగాల శ్వాసగా పిలిచే ఈ పద్ధతిలో బొడ్డు, ఛాతీ, దిగువ వీపును గాలితో నింపి, ఆపై రివర్స్ క్రమంలో ఉచ్ఛ్వాసం చేయడం జరుగుతుంది. ఇది విశ్రాంతిని, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మెరుగైన దృష్టిని ప్రోత్సహిస్తుంది.నాలుకను గొట్టం మాదిరి ముడిచి, వంకరగా ఉంచుతూ నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం, ఆపై ముక్కు ద్వారా ఊపిరి పీల్చడాన్ని సితాలి శ్వాస అంటారు. భ్రమరి శ్వాస ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. చూపుడు వేలును ముక్కుపైన ఉంచాలి. ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు తేనెటీగ లాగా హమ్ చేయాలి.చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో కపాలభాతి శ్వాసను ‘బ్రెయిన్ మెరిసే శ్వాస’ అని కూడా పిలుస్తారు. ఇది చిన్న, శక్తివంతమైన ఉచ్ఛ్వాసాలపై దృష్టి పెడుతుంది. దీర్ఘంగా శ్వాస పీల్చుకుని, ఆపై ముక్కు ద్వారా 15–30 సార్లు గాలిని వదలాలి. చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంనాడి శోధన శ్వాసను ‘ప్రత్యామ్నాయ నాసికా ప్రాణాయామం’ అని కూడా అంటారు. ఒక ముక్కు రంధ్రాన్ని మూసి, మరొకదాని ద్వారా శ్వాస తీసుకొని, వదలాలి. ఈ వివిధ యోగా శ్వాస పద్ధతులను సాధన చేయడం వల్ల శారీరక, మానసిక శ్రేయస్సు బాగా పెరుగుతుంది.

కిచెన్ గార్డెన్తో పిల్లల అల్లరికి చెక్, ఎలాగో తెలుసా?
వేసవి వచ్చేసింది. పరీక్షలు అయి పోగానే పిల్లలకు సెలవలు. తల్లిదండ్రులకు అసలు పరీక్షాకాలం మొదలవుతుందప్పుడే. అయితే ఈ సెలవల్లో వారిని వేసవి ‘శిక్ష’ణా కేంద్రాలలో చేర్చేసి చేతులు దులుపుకునే కంటే వారి చేత క్రియేటివ్‌గా ఏదైనా పని చేయిస్తే ఎలా ఉంటుంది? అదీ వంటింటి వ్యర్థాలతోనే వారి చిట్టి చేతులతో పెరటి తోట పెంచి, అందులో పూలు, కాయలు, పళ్లూ పెంచితే..? ఇంకెందుకాలస్యం? వెంటనే పనిలోకి దిగుదామా మరి!వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువు తయారు చేసి కిచెన్ గార్డెన్లో పెరిగే మొక్కలకు ఎరువుగా వాడితే అవి ఏపుగా పెరిగి నవనవలాడే పూలూ, కాయలూ, పండ్లూ ఇస్తాయి. అసలు ఇంత వరకూ కిచెన్ గార్డెన్ లేదా టెర్రస్ గార్డెన్ లేనివారు ఏం చేయాలి మరి?టమోటా పంటటెర్రస్ గార్డెన్లో సులువుగా పెంచదగ్గవి టమోటాలే. ఈసారి టొమోటోలు తరిగేటప్పుడు బాగా పండిన టొమోటోలోని గింజలను ఒక పేపర్ టవల్ మీదికి తీసుకోవాలి. మీ పిల్లలను ఆ పేపర్ టవల్‌ను గాలికి ఎగిరిపోకుండా జాగ్రత్తగా ఎండబెట్టమనండి. ఒక కంటెయినర్లో మట్టి నింపి, ఆ మట్టిలో ఈ విత్తనాలను నాటి రోజూ కాసిని నీళ్లు చిలకరిస్తూ ఏం జరుగుతుందో గమనించమనండి. వారం తిరిగేసరికి వాటిలోనుంచి మొలకలు రావడం గమనించి వాళ్ల పెదవులు సంబరం తో విచ్చుకోవడాన్ని మీరే గమనిస్తారు. వాటిని సంరక్షించి ఒకదానికి ఒకటి తగలకుండా కొంచెం దూరం దూరంగా పాతి, కాస్త ఎండ తగిలేలా పెట్టి, రోజూ నీళ్లు పోస్తూ ఉంటే నెల తిరిగేసరికల్లా చిన్ని చిన్ని టొమాటోలను చూసి వాళ్లే ఎగిరి గంతులేస్తారు చూడండి. ఉల్లి మొక్కలు...ఉల్లిమొక్కలు.. స్ప్రింగ్ ఆనియన్లు పెంచుకోవడం అన్నింటికన్నా తేలిక. ఉల్లిపాయలు తరిగేటప్పుడు పైన ఆకుపచ్చటి మొలకల్లా ఉండే భాగాన్ని తీసి పారేస్తుంటాం కదా... అలాంటివన్నింటినీ సేకరించాలి. ఒక కంటెయినర్ లో నీళ్లు పోసి వాటికి నీళ్లు తగిలేలా ఈ తొడిమ భాగాన్ని ఉంచాలి. రెండు మూడు రోజులకోసారి ఆ నీటిని మారుస్తూ ఉండాలి. వారం తిరిగేసరికల్లా రెండు మూడు అంగుళాలకు పైగా ఉల్లి కాడలు రావడం గమనిస్తారు. వాటిని తీసి కుండీలలో లేదా నేరుగా గార్డెన్‌లోని మట్టిలో పాతి రోజూ కాసిని నీళ్లు చిలకరిస్తూ ఉంటే సరి.. కొద్దిరోజులలోనే పైన ఉండే కాడలు ఎండిపోయి కింద ఉల్లిపాయలు ఊరి ఉంటాయి. ఉల్లి కాడల్ని కూడా అప్పుడప్పుడు పైనుంచి కట్ చేసుకుని సలాడ్స్‌లో వాడితే రుచిగా ఉంటాయి. మెంతి మొక్కలు...స్పూను మెంతులు తీసుకుని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. వాటిని ఒక పేపర్ టవల్లో వేసి మట్టిలో పెట్టి రోజూ నీళ్లు చిలకరిస్తూ ఉంటే సరి మెంతికూర పెరుగుతుంది. మనకు కావలసిన సైజులోకి రాగానే వాటిని కోసుకుని వాడుకోవచ్చు. బంగాళదుంప...బంగాళ దుంప మీద కళ్లలా ఉండే చిన్న చిన్న భాగాలుంటాయి. అలా ఉన్న వాటిని కొద్దిగా ముక్క ఉండేలా కోసి తీసి కుండీలో పాతి, రోజూ నీళ్లతో తడపాలి. వారం తిరిగేసరికి వాటినుంచి మొలకలు వస్తాయి. వాటిని నేరుగా గార్డెన్లో నాటవచ్చు లేదా కుండీల్లోనే ఉంచి రోజూ కొద్దిగా నీళ్లు పోస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే ఏపుగా పెరిగి పైన ఉన్న ఆకులు ఎండిపోయి, కింద బంగాళదుంపలు ఊరి ఉండటాన్ని గమనించవచ్చు. చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంఇవే కాదు.. ఇంకా పుదీనా కాడలను కూడా ఆకులు కట్ చేసుకుని కాండాన్ని కుండీలలో నాటి రోజూ కాసిని నీళ్లు పోస్తూ ఉంటే మొక్కలు పచ్చగా చిగురిస్తాయి. అలాగే ధనియాలను కూడా వాటిని ఒక పాత న్యూస్ పేపర్ మీద పోసి పైన ఫ్లాట్‌గా ఉండే కంటెయినర్‌తో రుద్దాలి. ఒక్కొక్కటి రెండుగా విడిపోయేలా చేయాలి. వాటిని నీళ్లలో నానబెట్టి కుండీలలో పాతితే కొత్తిమీర పెరుగుతుంది. గార్డెనింగ్ నేర్పించడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఓపిక, క్రమశిక్షణ, జాగ్రత్తగా సంరక్షించడం, నా అనే భావన కలుగుతాయి. కాబట్టి ఈ వేసవిలో వారి చేత గార్డెనింగ్ చేయించండి. మొక్కలతో;eటే వారిలో వికాసం కూడా పెరుగుతుంది.చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
ఫొటోలు


రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఫస్ట్ షాట్ (ఫొటోలు)


వెండితెర శ్రీరామచంద్రులు వీళ్లే.. (ఫొటోలు)


విజయవాడ : ‘జాక్’ మూవీ ప్రమోషన్ లో సిద్ధూ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)


విజయవాడలో సందడి చేసిన సినీ నటి హన్సిక (ఫొటోలు)


#SRHvsGT : సిరాజ్, గిల్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే (ఫొటోలు)


ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం..డ్యాన్స్ లతో అదరగొట్టిన యవత (ఫొటోలు)


భద్రాచలం : కనుల పండువగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం (ఫొటోలు)


పిల్లలతో రాధిక సమ్మర్ వెకేషన్.. యష్ ఎక్కడ? (ఫోటోలు)


చంటి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)


బంగారపు బొమ్మలా యాంకర్ రష్మీ... ఆడియన్స్‌కి పండగే (ఫోటోలు)
అంతర్జాతీయం

ఆర్థిక మాంద్యం భయాల వేళ ట్రంప్ ఏమన్నారంటే..
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై అమెరికా పరస్పర సుంకాలతో.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలం అవుతున్నాయి. ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొని.. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో కుదేలు అవుతోంది. వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్‌తో పలు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ.. మరేం ఫర్వాలేదని ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. మార్కెట్ క్రాష్ భయాలను తోసిపుచ్చిన ఆయన.. తన టారిఫ్‌ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కుండబద్ధలు కొట్టారు. టారిఫ్ నిర్ణయం వల్ల అమెరికాలోకి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తున్నారని, మున్నుపెన్నడూ లేని స్థాయిలో ధనవంతులు కావడానికి ఇదే మంచి సమయమని ట్రూత్‌లో ఓ పోస్టు చేశారు. పైగా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్ ఛార్జ్‌గా పనికొస్తుందని.. టారిఫ్‌ల వల్ల బడా వ్యాపారాలకు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారాయన. తాను విధించిన పరస్పర సుంకాలతో దిగుమతికి బదులు.. కంపెనీలు అమెరికా గడ్డపై ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, అటుపై అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారాయన.

మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం
కొలంబో: మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శ్రీలంకకు చేరుకున్నారు. ఘన స్వాగతంలో భాగంగా.. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద భారత ప్రధానికి గార్డ్ ఆఫ్ ఆనర్ దక్కింది. ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో మోదీ భేటీ కానున్నారు. కాగా, ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఇంధనం, రక్షణ, వాణిజ్య, డిజిటల్ ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. భారత్ సహకారంతో ఆ దేశంలోనూ పలు ప్రాజెక్టులు నిర్మాణం జరిగే అవకాశం ఉంది.మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారంశ్రీలంకలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీని ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డు అందుకోవడానికి మోదీ అన్నివిధాల అర్హుడని అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు. Glimpses from the ceremonial welcome in Colombo this morning.@anuradisanayake pic.twitter.com/88k2T1NN20— Narendra Modi (@narendramodi) April 5, 2025

కెనడాలో భారతీయుడి దారుణ హత్య
ఒట్టావా: కెనడాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు దుండగులు కత్తితో పొడిచి భారతీయుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారతీయుడి హత్యపై విచారణ వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. కెనడా రాజధాని ఒట్టావా సమీపంలోని రాక్లాండ్లో ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. కత్తితో పొడిచి అతడిని హత్య చేశారు. ఈ ఘటనపై కెనడాలో భారత రాయబార కార్యాలయం స్పందించింది. హత్య ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, కెనడా పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. ఇక, ఈ ఘటనలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. We are deeply saddened by the tragic death of an Indian national in Rockland near Ottawa, due to stabbing. Police has stated a suspect has been taken into custody. We are in close contact through a local community association to provide all possible assistance to the bereaved…— India in Canada (@HCI_Ottawa) April 5, 2025

ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
వాషింగ్టన్: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్‌చుప్‌గా ఆసియా రీజియన్‌లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్‌లోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్‌వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా.. షెల్టర్‌లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్ రీజియన్‌లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్‌లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్ఎస్ నిమిట్జ్హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్, యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్‌ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ వద్ద యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారీయర్‌ను, మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది.
జాతీయం

ఆయుధం వీడి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి
దంతెవాడ(ఛత్తీస్‌గఢ్): మావోయిస్ట్ పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్నేహ హస్తం చాపారు. ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అమిత్ షా వారికి పిలుపునిచ్చారు. నక్సలైట్ చనిపోతే ఎవరూ హర్షించరన్న ఆయన.. 2026 మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. బస్తర్ ప్రాంత గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోగల సత్తా మావోయిస్టులకు నేడు లేదని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘బస్తర్ పాండుమ్’ఉత్సవం ముగింపు కార్యక్రమంలో శనివారం మంత్రి షా ప్రసంగించారు. ‘బస్తర్‌లో తుపాకీ కాల్పులు, బాంబుల మోతలు వినిపించే రోజులు పోయాయి. ఇకనైనా ఆయుధాలను విడనాడి, ప్రధాన జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్ట్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరూ ఈ దేశ పౌరులే. నక్సలైట్ చనిపోతే ఎవరూ సంతోషపడరు. మీ ఆయుధాలను అప్పగించండి. ఆయుధాలు చూపి బస్తర్ ప్రాంత గిరిజన సోదరసోదరీమణుల పురోభివృద్ధిని ఆపలేరు’అని ఆయన స్పష్టం చేశారు. లొంగిపోయి అభివృద్ధి ప్రక్రియలో పాలుపంచుకునే మావోయిస్ట్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి భద్రత కల్పిస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు. ‘బస్తర్ గత 50 ఏళ్లుగా ఎంతో వెనుకబాటుకు గురైంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందుకోసం అవసరమైనవన్నీ సమకూర్చేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ సుసాధ్యం కావాలంటే బస్తర్ ప్రజలు తమ గ్రామాలను నక్సలైట్ రహితంగా మార్చాలని నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్య బీమా సమకూర్చడంతోపాటు చిన్నారులు స్కూలుకు వెళ్లగలిగి, ఆరోగ్య కేంద్రాలు పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం’అని అమిత్ షా అన్నారు. మావోయిస్ట్ విముక్త గ్రామాలకు రూ. కోటి నక్సలైట్లు లొంగుబాట పట్టేలా కృషి చేసి, మావోయిస్ట్ రహితంగా ప్రకటించుకునే గ్రామాలకు రూ.కోటి చొప్పున అందజేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అమిత్ షా గుర్తు చేశారు. రూ.కోటి అందుకునేందుకు ప్రతి గ్రామం తీవ్రంగా కృషి చేయాలని కోరారు. నక్సలిజాన్ని తుదముట్టించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామంటూ ఆయన...‘అభివృద్ధికి ఆయుధాలు, గ్రనేడ్లు, మందుపాతరలతో అవసరం లేదు, కంప్యూటర్లు, పెన్నులు ఉంటే సరిపోతుందని అర్థం చేసుకునే వారు లొంగిపోయారు. 2024లో 881 మంది, 2025లో ఇప్పటివరకు మొత్తం 521 మంది మావోయిస్ట్‌లు ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారు జన జీవన స్రవంతిలో కలుస్తారు, మిగిలిన వారి పనిని భద్రతా బలగాలు చూసుకుంటాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా రెడ్ టెర్రర్ నుంచి దేశానికి విముక్తి కలుగనుంది’అని అమిత్ షా అన్నారు.

భూ వాతావరణంలోకి పోయెమ్–4
సాక్షి, బెంగళూరు: అంతరిక్ష వ్యర్థాల నిర్వహణలో ఇస్రో మరోసారి తన ఘనతను చాటింది. అంతరిక్ష ప్రయోగాల కోసం వినియోగించిన వ్యోమనౌక సంబంధిత భాగాలు అక్కడే అంతరిక్ష చెత్తగా పేరుకుపోకుండా వాటిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చే ప్రక్రియను ఇస్రో మరోసారి విజయవంతంగా పూర్తిచేసింది. అంతరిక్షంలో ఉపగ్రహాల వంటి వస్తువుల అనుసంధానం(డాకింగ్), విడతీత(అన్‌డాకింగ్) కోసం వినియోగించిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్(పీఎల్ఎల్వీ–సీ60)లోని పైభాగం(పీఎల్4) అయి న పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పరిమెంటల్ మాడ్యూల్ (పోయె మ్–4)ను విజయవంతంగా తిరిగి భూవాతావరణంలోకి తీసు కొచ్చారు. తర్వాత దానిని ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం 8.03 గంటలకు హిందూమహాసముద్రంలో పడేలాచేశామని ఇస్రో శని వారం వెల్లడించింది. అంతరిక్ష నుంచి జాగ్రత్తగా కక్ష్య తగ్గిస్తూ సముద్రంలో పడేసే పనిని ఇస్రో వారి సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టేనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్(ఐఎస్4ఓఎం) విభాగం పూర్తిచేసింది. గతేడాది డిసెంబర్ 30న రెండు స్పేడెక్స్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ వ్యోమనౌక ద్వారా 475 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో చేర్చారు. అదే కక్ష్యలోనే పోయెమ్–4ను ప్రవేశపెట్టారు. తర్వాత నెమ్మదిగా 350 కిలోమీటర్ల ఎత్తు కక్ష్యలోకి తీసుకొచ్చారు. పోయెమ్–4 మొత్తంగా 24 పేలోడ్లను వెంట తీసుకెళ్లింది. ఇందులో 14 ఇస్రోకు చెందినవి కాగా, మరో 10 ప్రభుత్వేతర సంస్థలకు చెందినవి. ప్రస్తుతం అన్ని పేలోడ్లు సక్రమంగా పని చేస్తున్నాయి. వాటిని నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తూ అంతరిక్ష డేటాను పంపిస్తున్నాయి.

కర్వార్ నేవీ బేస్‌లో ‘సాగర్’ జలప్రవేశం
కర్వార్ (కర్నాటక): వ్యూహాత్మకంగా కీలకమైన కర్నాటకలోని కర్వార్ నేవీ బేస్‌లో శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇండియన్ ఓషన్ షిప్ ఐవోఎస్ సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్)ను జెండా ఊపి జల ప్రవేశం చేయించారు. దీంతోపాటు ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మిలటరీ హెలికాప్టర్లో కర్వార్‌కు చేరుకున్న రాజ్‌నాథ్ ‘సీబర్డ్’లో భాగమైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారని రక్షణ శాఖ తెలిపింది. జల ప్రవేశం చేయించిన ఐవోఎస్ సాగర్‌లో 9 దేశాల నావికా దళాలకు చెందిన 44 మంది సిబ్బంది ఉంటారని పేర్కొంది. హిందూ మహా సముద్ర ప్రాంత భవిష్యత్తును నిర్ణయించడంలో ఐవోఎస్ సాగర్ కీలకంగా మారనుందని రక్షణ శాఖ ‘ఎక్స్’లో తెలిపింది. ఈ ప్రాంత దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్‌కు ఇది ఎంతో సాయపడుతుందని తెలిపింది. సీబర్డ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విస్తరణ పనులతో కర్వార్ నేవీ బేస్‌లో 32 యుద్ద నౌకలు, సబ్మెరీన్లను నిలిపేందుకు అవకాశమేర్పడింది.

ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే
ఇది ఏ ఒక్కరి పరిస్థితో కాదు.. సుమారు 25 వేల మందికిపైగా ఉద్యోగస్తుల పరిస్థితి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. 2016 టీచర్ల నియమాకాల రద్దు టాపిక్.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఎంతో హాయిగా తమ జీవితాల్లోకి వెలుగొచ్చిందని అనుకుంటుండగానే వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. టీచర్లగా ఉద్యోగాలు చేస్తూ సంఘంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న వారి జీవితాలను కారు మబ్బు అలుముకుంది. తమ నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీచర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇలా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టీచర్ల కుటుంబాల్లో కన్నీటి వరదలే తారసపడుతున్నాయి.పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు ఇవ్వడంపై ఆ టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమాకాలు కలిపి 25 వేల 753 పోస్టులను చెల్లవంటూ సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన నేపథ్యంలో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ జీవితాలు ఇంతేనా.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎందుకిలా జరిగింది.. మాకే ఎందుకు ఇలా జరిగింది అంటూ మౌనంగా రోదిస్తున్నారు.2016లో టీచర్ గా నియమించబడ్డ రజత్ హల్దార్ మాట్లాడుతూ.. ‘ మాకు మాటలు రావడం లేదు. మేము అర్హత సాధించిన టీచర్లం. మాకు ఎటువంటి ఆరోపణలు లేవు. సుమారు 19 వేల మంది టీచింగ్ స్టాఫ్ పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ మమ్మల్ని వారు అనర్హులు అంటూ సుప్రీంకోర్టు ప్రకటించడంతో మాకు ఏమీ చెప్పుకోవాలో.. ఎవరి చెప్పుకోవాలో తెలయని స్థితిలో ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుతో మాకు అన్యాయం జరిగింది. ఇది న్యాయబద్ధమైన తీర్పు కాదు. ఏ దర్యాప్తు సంస్థలు కూడా మా నియామకం చట్టబద్ధతలో జరగలేదని చెప్పలేదు. మేము ఎటువంటి తప్పు చేయలేదు’ అంటూ గద్గద స్వరంతో చెప్పుకొచ్చాడు.కాగా, వెస్ట్ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం మమతా సర్కారు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్ఆర్ఐ

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

సెలవు చావుకొచ్చింది!
ఆదిలాబాద్‌రూరల్: సెలవు ఆ విద్యార్థుల చావుకొ చ్చింది. ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని వైజాగ్‌కు చెందిన కాంబ్డే దుర్గాప్రసాద్, సత్యభామ దంపతులు ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ఆదిలాబాద్‌కు వచ్చారు. మావల మండల కేంద్రంలోని 170 కాలనీలో గుడిసెలు వే సుకుని నివాసం ఉంటున్నారు. వారికి రాహుల్ (9) (నాలుగో తరగతి), విశాల్ ఇద్దరు కుమారులు. ఇద్దర్నీ మావల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్2లో చదివిస్తున్నారు. శనివారం పాఠశాలకు సెలవు ఉండడంతో రాహుల్, విశాల్, స్నేహితుడు చిప్పకుర్తి సంజీవ్ (10)తో కలిసి ఈత కొట్టేందుకు మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న ఎర్రకుంట చెరువు వద్దకు వెళ్లారు. రాహుల్, సంజీవ్ స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. విశాల్ చెరువు చుట్టుపక్కల ఆడుకుంటూ ఉన్నాడు. కొంత సేపటికి రాహుల్, సంజీవ్ నీటిలో మునిగిపోవడంతో గమనించిన విశాల్ విషయాన్ని స్థానికులతో పాటు కుటుంబ సభ్యులకు స మాచారం అందించాడు. మావల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ మార్చురీకి తరలించారు.రెండు రోజుల్లో పుట్టిన రోజు..గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన చిప్పకుర్తి రాజ్‌కుమార్ కుమారుడు సంజీవ్ నానమ్మ తారా బాయి వద్ద ఉండి మావల పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. మరో రెండు రోజుల్లో అతని పుట్టినరోజు ఉంది. ఇందుకోసం తారాబాయి తన పింఛన్ డబ్బులతో కొత్త బట్టలు కొనిచ్చేందుకు తీసుకెళ్దామని అనుకుంది. అంతలోనే స్నేహితులు రావడంతో వారితో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికే ఈ విషాదకర వార్త తెలియడంతో తారాబాయి అక్కడికి చేరుకుని నా కోరిక తీరక ముందే వెళ్లిపోయావా.. అంటూ గుండెలు బాదుకుంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు.

Hyderabad : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల్లంతైన ఆరుగురు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారి ఆచూకీ కనిపెట్టేందుకు బోయిన్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని విజయవాడ పంపించారు. ఆరుగురిలో ఒక్కరి వద్దే సెల్‌ఫోన్ ఉండగా అది కూడా స్విచ్చాఫ్ కావడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కొంత కష్టంగా మారినట్లు తెలుస్తోంది.బోయిన్‌పల్లికి చెందిన మహేశ్ తన భార్య ఉమ, ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్, మరదలు సంధ్యతో కలిసి ఈ నెల 1న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. రెండు రోజుల అనంతరం మహేశ్ బావమరిది బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు. మహేశ్ కుటుంబం 1వ తేదీన బోయిన్పల్లి నుంచి నేరుగా, ఇమ్లీబన్‌కు చేరుకుని అక్కడ విజయవాడకు వెళ్లే గరుడ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం విజయవాడలో దిగినట్లు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి పంప్‌హౌజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్, తోటి ఉద్యోగులతో ముభావంగానే ఉండేవాడని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తీర్థయాత్రలకు వెళ్లి ఉండచ్చొని మహేశ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీరి గల్లంతుకు గల ఇతరత్రా కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలిశాకే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Banjara Hills: అడిగిన పాట వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా..
హైదరాబాద్ : తాను కోరిన పాటను ప్రసారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ యువతి బెదిరించడంతో ఛానల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఓ టీవీ ఛానెల్ రోజూ మ్యూజిక్ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తుంది. ఓ యువతి ఈ కార్యక్రమానికి ప్రతిరోజూ ఫోన్ చేస్తూ ఒకే పాటను కోరుకుంటుంది.ఒకసారి ప్రసారం చేసిన తర్వాత కూడా మళ్లీ ఫోన్ చేసి అదే పాట కావాలంటూ పట్టుబడుతూ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫోన్లో అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే బాగుండదంటూ హెచ్చరించేది. తాజాగా శనివారం ఫోన్ చేసిన ఆమె నేను కోరిన పాటను వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన టీవీ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పట్టపగలు యువతికి కత్తిపోట్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టపగలు ఇంటికెళ్లి యువతిపై ఒక దుండగుడు దాడిచేసి కత్తితో పొడిచిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. గరివిడి మండలంలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, 18 ఏళ్ల యువతికి నానమ్మ, తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటోంది. ఉదయం 9:30 గంటల సమయంలో ఇంటి వద్ద వంట పాత్రలు శుభ్రం చేస్తున్న యువతిపై ఓ యువకుడు ముసుగు (మంకీ క్యాప్) ధరించి వచ్చి దాడి చేశాడు. కత్తితో కడుపు పక్క భాగంలో రెండుచోట్ల పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు. ఇంటికి ఎదురుగానే ఉంటున్న బూర్లె ఆదినారాయణ అనే యువకుడే ఈ దాడికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఇందుకు కారణం. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్న నలుగురు యువకుల్లో ఆదినారాయణ కూడాఉన్నట్లు తెలిసింది. దెబ్బతిన్న కాలేయం, ఊపిరితిత్తులు తీవ్ర రక్తస్రావంతో ఘటన జరిగిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు 108 వాహనంలో తొలుత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దాడిలో కాలేయం భాగం దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లోనూ రక్తస్రావం కావడంతో ఊపిరి తీసుకోవడానికి యువతి ఇబ్బందిపడుతోంది.బాధితురాలికి వైఎస్సార్సీపీ అండబాధితురాలికి అండగా ఉండాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్యలత ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ తరఫున యువతి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అండగా ఉంటామని చెప్పారు.
వీడియోలు


చంద్రబాబుకు షాక్.. ఇంగ్లీష్ లో అదరగొట్టిన గురుకుల విద్యార్థులు


పాదయాత్రలో అనంత్ ను కలిసిన తల్లి నీత, భార్య రాధిక


సీతమ్మకు బంగారు చీర


సల్మాన్ పై సికిందర్ ఎఫెక్ట్


మళ్లీ విదేశాలకు మహేష్ బాబు.. జక్కన్న పర్మిషన్ ఏలా ఇచ్చాడో ?


రాములోరి కల్యాణానికి పోటెత్తిన భక్త జనం


సీతారాములు అరణ్యవాసంలో పర్ణశాల గురించి తెలుసుకుందామా?


Ding Dong 2.O: ఇదేందయ్యా ఇది


జగన్ చుట్టూ తిరుగుతున్న కూటమి నేతలు


రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు