Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Trumps tariffs First fallout Stellantis to shut down Canada's Windsor plant for two weeks1
ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాల దెబ్బకు కెనడాలో తొలి పతనం చోటుచేసుకుంది. వాహన విడిభాగాలపై విధించిన సుంకాల కారణంగా కార్ల తయారీ సంస్థ స్టెలాంటిస్ ఎన్‌వీ తన విండ్సర్ ఫ్యాక్టరీని రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.కెనడాలోని విండ్సర్‌లో ఉన్న స్టెలాంటిస్ ప్లాంట్‌లో సుమారు 3,600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ మినీవ్యాన్లు, డాడ్జ్ ఛార్జర్ వాహనాలు తయారు చేస్తున్నారు. ఈ కర్మాగారంలో ఏప్రిల్ 7 నుంచి ఉత్పత్తిని కంపెనీ నిలిపివేస్తోంది. దీంతో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతోంది.ఇదీ చదవండి: ట్రంప్‌ టారిఫ్‌లు.. ‘ఇండియన్‌ ఐటీ’కి గట్టి దెబ్బే..ఆటోమోటివ్ దిగ్గజం స్టెలాంటిస్ నిర్ణయం యూఎస్‌ ప్రభుత్వం విధించే 25% సుంకాల వల్ల ఆటోమోటివ్ పరిశ్రమపై పెరుగుతున్న ఒత్తిడిని నొక్కిచెబుతుంది. ఇది యూఎస్ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చర్య అయినప్పటికీ ఉత్తర అమెరికా ఉత్పత్తి గొలుసులకు అనాలోచిత పరిణామాలకు దారితీస్తుంది.టారిఫ్‌ల ప్రభావంటారిఫ్‌లు వాహన తయారీదారులకు ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా పెంచనున్నాయి. దీంతో పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టించాయి. విండ్సర్ ప్లాంట్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని స్టెలాంటిస్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ విడిభాగాలు, కార్మికులు, మార్కెట్ల నెట్‌వర్క్‌పై ఆధారపడే తయారీదారులపై ఆర్థిక ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. ఇటువంటి అంతరాయాలు వాహన డెలివరీలో జాప్యానికి దారితీస్తాయని, సరఫరాదారుల సంబంధాలు దెబ్బతింటాయని, వినియోగదారులకు సంభావ్య ధరల పెరుగుదలకు కూడా దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

PM Modi Message To Bangladesh Leader After Northeast Remark2
ఆ మాటలు వద్దు: బంగ్లాకు ప్రధాని మోదీ క్లియర్ కట్‌ వార్నింగ్‌

బ్యాంకాక్: భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లియర్ కట్ వార్నింగ్‌ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్‌ యూనస్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనస్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ.. ఆ తరహా వ్యాఖ్యలు మంచిది కాదంటూ సుతిమెత్తగా మందలించారు.‘భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆ తరహా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాకు తెలిపారు.‘ ప్రజాస్వామ్యయుత, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్ కు భారతదేశం మద్దతు ఇస్తుంది. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సహకారంతో ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు అందించిందని ప్రధాని మోదీ చెప్పినట్లు విక్రమ్ మిస్రి పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో ఇరు దేశాలు ముందుకు సాగాలని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఇటువంటి తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు అనవరసమని మోదీ సూచించారన్నారు. అక్రమంగా బోర్డర్లు దాటడం వంటి ఘటనలకు కఠినంగా శిక్షలు అమలు చేయాలని, ప్రత్యేకంగా రాత్రి పూట బోర్డర్ల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉందని మహ్మద్ యూనస్ కు విజ్ఞప్తి చేశారు మోదీ. బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని బంగ్లా చీప్ అడ్వైజర్ ను అడిగినట్లు మిస్రి పేర్కొన్నారు. ప్రధానంగా బంగ్లాలో ఉన్న మైనార్టీల రక్షణ గురించి, వారి హక్కుల గురించి ప్రధాని ఆరా తీశారన్నారు.భారత్ గురించి బంగ్లా చీఫ్ అడ్వైజర్ ఏమన్నారంటే.. చైనా పర్యటన సందర్భంగా యూనస్‌ చేసిన వ్యాఖ్యలు భారత్‌ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సెవన్‌ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌ సాగర రక్షకుడిగా ఉందంటూ వ్యాఖ్యానించారు. చైనాకు ఇది ఒక సువర్ణావకమన్నారు. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత్‌ లో పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకోగా, దీనికి తాజాగా ప్రధాని మోదీ కౌంటర్ తో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.

IPL 2025: Lucknow Super Giants vs Mumbai Indians Live Updates3
ముంబై ఇండియ‌న్స్‌పై ల‌క్నో విజ‌యం..

LSG vs MI Live Updates: ఐపీఎల్‌-2025లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి.ముంబై ఇండియ‌న్స్‌పై ల‌క్నో విజ‌యం..ఏక్నా స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించింది. 204 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో అవేష్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(67) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. న‌మాన్ ధీర్‌(46) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌న్పించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28) ఆఖ‌రిలో పోరాడిన‌ప్ప‌టికి త‌న జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాష్ దీప్‌, దిగ్వేష్‌, శార్ధూల్ ఠాకూర్‌, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.17 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోర్‌:164/4సూర్య‌కుమార్ యాద‌వ్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ముంబై విజ‌యానికి 21 బంతుల్లో 46 ప‌రుగులు కావాలి. క్రీజులో ప్ర‌స్తుతం తిల‌క్ వ‌ర్మ‌(18), హార్దిక్‌(5) ప‌రుగుల‌తో ఉన్నారు. 13 ఓవ‌ర్ల‌కు ముంబై ఇండియ‌న్స్ స్కోర్‌: 125/313 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ మూడు వికెట్ల న‌ష్టానికి 125 ప‌రుగులు చేసింది. క్రీజులో సూర్య‌కుమార్ యాద‌వ్‌(46), తిల‌క్ వ‌ర్మ‌(12) ఉన్నారు. ముంబై మూడో వికెట్ డౌన్..నమన్ ధీర్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 46 ప‌రుగులు చేసిన ధీర్‌.. దిగ్వేష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.దూకుడుగా ఆడుతున్న ధిర్‌, సూర్య‌ఆదిలోనే ఓపెన‌ర్ల వికెట్ల‌ను కోల్పోయిన ముంబై ఇండియ‌న్స్ తిరిగి పుంజుకుంది. న‌మాన్ ధిర్‌(46), సూర్య‌కుమార్ యాద‌వ్‌(21) దూకుడుగా ఆడుతున్నారు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై రెండు వికెట్ల న‌ష్టానికి 86 ప‌రుగులు చేసింది.ముంబైకి ఆదిలోనే భారీ షాక్‌..204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్‌లో ఆకాష్ దీప్ బౌలింగ్‌లో విల్ జాక్స్‌(5) తొలి వికెట్ కోల్పోవగా.. తర్వాత శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ర్యాన్ రికెల్టన్‌(10) ఔటయ్యారు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై రెండు వికెట్ల న‌ష్టానికి 25 ప‌రుగులు చేసింది.చెల‌రేగిన ల‌క్నో బ్యాట‌ర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్‌ల‌క్నో వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో 8 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 60), మార్‌క్ర‌మ్‌(53) హాఫ్ సెంచ‌రీల‌తో మెర‌వ‌గా.. డేవిడ్ మిల్ల‌ర్‌(27), బ‌దోని(27) రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో హార్ధిక్ పాండ్యా ఐదు వికెట్ల‌తో చెల‌రేగ‌గా.. పుత్తార్‌, బౌల్ట్‌, అశ్వినీ కుమార్ త‌లా వికెట్ సాధించారు.ల‌క్నో నాలుగో వికెట్ డౌన్‌..ఆయూష్ బ‌దోని రూపంలో ల‌క్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 30 ప‌రుగులు చేసిన బ‌దోని.. అశ్వినీ కుమార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులో మార్‌క్ర‌మ్‌(49), డేవిడ్ మిల్ల‌ర్‌(1) ఉన్నారు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో నాలుగు వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది.పంత్ మ‌రోసారి ఫెయిల్‌..రిష‌బ్ పంత్ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. ముంబైతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి పంత్ ఔట‌య్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి త‌న వికెట్‌ను కోల్పోయాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో మూడు వికెట్ల న‌ష్టానికి 116 ప‌రుగులు చేసింది.ల‌క్నో రెండో వికెట్ డౌన్‌..నికోల‌స్ పూర‌న్(12) రూపంలో ల‌క్నో రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దీప‌క్ చాహ‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో రెండు వికెట్లు కోల్పోయి 100 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్క్‌రామ్‌(23) ఉన్నాడు.ల‌క్నో తొలి వికెట్ డౌన్‌..మిచెల్ మార్ష్ రూపంలో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 60 ప‌రుగులు చేసిన మార్ష్‌.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి నికోల‌స్ పూర‌న్ వ‌చ్చాడు. 7 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోర్‌దుమ్ములేపుతున్న మార్ష్‌..మిచెల్ మార్ష్ దుమ్ములేపుతున్నాడు. కేవ‌లం 27 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 60 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో 69 ప‌రుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ల‌క్నో..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్ట‌పోకుండా 32 ప‌రుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్‌(26), మార్‌క్ర‌మ్‌(5) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శ‌ర్మ దూర‌మ‌య్యాడు. ప్రాక్టీస్ సెష‌న్‌లో మోకాలికి గాయ‌మైంది. అత‌డి స్ధానంలో రాజ్ అంగ‌ద్ తుది జ‌ట్టులోకి బావా వ‌చ్చాడు.తుది జ‌ట్లు లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్

Ysrcp Ambati Rambabu Fires On Chandrababu And Sharmila4
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్‌ పాలిటిక్స్‌: అంబటి

సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీకి అన్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ప్రత్యేక హోదా ఎగిరిపోయింది. ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.‘‘పోలవరం ప్రాజెక్టు 47.72ను ఎత్తు నుంచి 41.15 ఎత్తుకు తగ్గించారు. చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. కేంద్ర జల శక్తి వార్షిక నివేదికలో కూడా ఇదే పేర్కొంది. పోలవరాన్ని41.15 తగ్గించి కేంద్రం 25 వేల నుంచి 30 వేల కోట్లు ఎగ్గొడుతుంది. లోకేష్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. ఇది దారుణమైన అంశం. వైఎస్సార్‌సీపీపై విరుచుకుపడి కథనాలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ కథనాన్ని ఎందుకు రాయరు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘పోలవరం ఎత్తును తగ్గించారని నేను చెబుతున్న మాటలు తప్పయితే కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర మంత్రులు చెప్పాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తే మంత్రులు ఎందుకు మాట్లాడలేదు. షర్మిల చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో షర్మిల సింహభాగం పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు కలిసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి, చంద్రబాబుతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘ఆస్తి తగాదాలుంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి. చంద్రబాబుకి చెల్లెలు ఉన్నారు. వాళ్లకి హెరిటేజ్‌లో భాగం ఇవ్వమంటే ఇస్తాడా?. వైఎస్‌ జగన్‌ను దెబ్బతీయడానికి షర్మిలతో మాట్లాడిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Young Tiger Jr Ntr Comments In Mad Square success Event5
అతను లేకపోతే మ్యాడ్‌ స్క్వేర్‌ హిట్‌ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్‌

మ్యాడ్‌ స్క్వేర్‌ మూవీతో మరో సూపర్ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ కల్యాణ్ శంకర్. గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌ నిర్వహించింది. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య ‍అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాట్ టీమ్‌ను ఉద్దేశించిన ఎన్టీఆర్ మాట్లాడారు. మ్యాడ్‌ స్క్వేర్‌ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు .జూనియర్ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ..' నవ్వించడం అనేది ఒక పెద్ద వరం. అలా మనల్ని ఎప్పుడు నవ్వించడానికి మనకు కల్యాణ్ శంకర్ దొరికాడు. దర్శకుడికి నచ్చినట్లుగా మీరు చేయడం కూడా గొప్ప వరం. ఈ సినిమాలో లడ్డు(విష్ణు) లేకపోతే హిట్‌ అయ్యేది కాదేమో. అతను ఇన్నోసెంట్‌ అని నేను అనుకోవట్లేదు. కానీ సినిమాలో అలా చేశాడు. సంగీత్‌ శోభన్‌ను చూసి ఆయన కుటుంబం అంతా గర్వపడుతున్నారు. రామ్ నితిన్‌.. నేను ఎలా ఉండేవాన్నో అలానే ఉన్నారు. కెమెరా ముందు నిలబడటం అంతా ఈజీ కాదు. కామెడీని పండించడం చాలా కష్టమైన పని. రామ్ నితిన్ నీకు మంచి భవిష్యత్తు ఉంది' అని అన్నారు.బామర్ది నార్నే నితిన్ గురించి మాట్లాడుతూ..'2011లో నాకు పెళ్లైంది. అప్పుడు నార్నే నితిన్ చిన్న పిల్లవాడు. మొదట నాతో మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసి మొట్టమొదటిసారి చెప్పిన మాట బావ నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నీ సావు నువ్వు చావు.. నా సపోర్ట్ అయితే నీకు ఉండదు అని చెప్పా. ఆ తర్వాత అతని కెరీర్‌పై నాకు భయం ఉండేది. నాకు ఏమి చెప్పొద్దు అనేవాడిని. ఏరోజు నన్ను ఏది అడగలేదు. ఈ రోజు తనను చూసి చాలా గర్వంగా ఉంది. మంచి దర్శకులు, నిర్మాతలతో పనిచేశాడు. కచ్చితంగా వారిని గుర్తు పెట్టుకో. నిన్ను నువ్వు నమ్ముకో. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంటికెళ్లాక మరోసారి నీతో మాట్లాడతా.' అంటూ సరదాగా మాట్లాడారు.

After Waqf Bill Clears Huge Protests In Kolkata, Chennai6
వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర పడిన కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నిరసన గళం వినిపిస్తూ నిరసనకు దిగాయి ముస్లిం సంఘాలు. .‘వక్ఫ్ సవరణ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం’ అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా, తమినాడులోని చెన్నై, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళలన్నీ జాయింట్ ఫారమ్ ఆఫ్ వక్ఫ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలోని జరిగినట్లు జాతీయ న్యూస్ ఏజెన్నీ ఏఎన్ఐ తెలిపింది.Bengal: Muslim outfits protest against Waqf Amendment Bill in KolkataRead @ANI Story | https://t.co/JTMcg1k79U#WaqfAmendmentBill #Kolkata pic.twitter.com/iCkDlnuYFp— ANI Digital (@ani_digital) April 4, 2025 అహ్మదాబాద్‌లో తీవ్రరూపం#WATCH | Ahmedabad: Various Muslim organisations hold protests against the Waqf Amendment Bill. pic.twitter.com/viavsuqf3D— ANI (@ANI) April 4, 2025వక్ఫ్ బిల్లుపై నిరసన కార్యక్రమం అహ్మదాబాద్ లో తీవ్రరూపం దాల్చింది. రోడ్లపై కూర్చొని పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారిని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.తమినాడు వ్యాప్తంగా విజయ్ తమిళగ వెట్రి కజగం నిరసనచెన్నైలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి, అక్కడ ఇటీవలే పార్టీ స్థాపించిన నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ రాష్ట్రవ్యాప్త నిరసనను ప్రకటించింది. చెన్నై కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లో టీవీకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. చేతిలో ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ముస్లింల హక్కులను హరించవద్దు అంటూ నిరసన వ్యక్తమైంది.కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్‌ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోద ముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్‌ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.#WATCH | West Bengal: Members of the Muslim community take to the streets in Kolkata to protest against the Waqf Amendment Bill. pic.twitter.com/pKZrIVAYlz— ANI (@ANI) April 4, 2025 దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్‌ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్‌ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే

Key Points In The Remand Report In Rajahmundry Naganjali Case7
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాగాంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దీపక్ లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో విషయం బయటకు చెప్పకుండా బాధితురాలిని కట్టడి చేశాడు. దీపక్ మాటలను అమాయకంగా నమ్మిన బాధితురాలు.. వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమెను దీపక్‌ రెండు,మూడు సార్లు కొట్టాడు. దీపక్ అకృత్యాలను తండ్రికి, రూమ్మేట్లకు సైతం నాగాంజలి తెలియనివ్వలేదు.ఈ నెల 23న దీపక్‌కు కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. చనిపోవాలంటే చనిపోవచ్చని.. తనకు ఇబ్బందిగా ఉందంటూ దీపక్ కర్కశంగా వ్యవహరించాడు. తాను మోసపోయినట్టు గుర్తించిన నాగాంజలి.. తీవ్ర మానసిక వేదన అనుభవించింది.కాగా, దీపక్‌కు పెళ్లయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2010లో బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో దీపక్ చేరాడు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడు.రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం.

Annamalai Backs Out Of Tamil Nadu Party Chief Race8
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన

కోయంబత్తూర్‌: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అన్నామలై ప్రకటన సంచలనంగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన అన్నామలై.. పార్టీకి జోష్‌ తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందనే వాదన కూడా ఉంది. ఆయనకు అన్నాడీఎంకేతో వైర్యం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ పార్టీకి, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న కారణంగా, ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.రాజీనామా చేసే ముందు శుక్రవారం ఆయన కోయంబత్తూర్‌లో మాట్లాడుతూ.. మంచి వ్యక్తులు ఉండే పార్టీ బీజేపీ.. ఈ పార్టీ బాగుండాలి. బీజేపీ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తినంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో, నాయకులు పార్టీ నాయకత్వ పదవికి పోటీ చేయరు. మనమందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాము. నేను ఆ పదవి రేసులో లేను’’ అంటూ అన్నామలై స్పష్టం చేశారు.‘‘పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు స్పందించబోవడం లేదు. నేను ఏ రేసులో లేను’’ అని అన్నామలై పేర్కొన్నారు.Coimbatore, Tamil Nadu: State BJP chief K Annamalai says, "There is no contest in Tamil Nadu BJP, we will select a leader unanimously. But I am not in the race. I am not in the BJP state leadership race." pic.twitter.com/7OjdbOoTWR— ANI (@ANI) April 4, 2025

YSRCP MP YV Subba Reddy Challenges TDP On Waqf Bill9
ఆ దమ్ము మీకుందా..? టీడీపీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్‌

తాడేపల్లి : వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ లో తాము(వైఎస్సార్సీపీ) వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా అంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేయాలని తమ పార్టీ విప్ జారీ చేసిన సంగతిని వైవీ సుబ్బారెడ్డి మరోసారి గుర్తు చేశారు. వక్ఫ్ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించలేదని టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఈ మేరకు ‘ ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘మేం వ్యతిరేకించామనడానికి లోక్ సభ, రాజ్యసభల్లో రికార్డయిని ఉభయసభల కార్యాకలాపాలే సాక్ష్యం. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై నేను చేసిన ప్రసంగం మరొక ప్రత్యక్ష సాక్ష్యం. బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించలేదని అని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా?, నిరూపించమని సవాల్ విసురుతున్నా. ఫేక్ న్యూస్ ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలాగూ ఉంది’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారువక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్‌సీపీ@JaiTDP బిల్లును మేం వ్యతిరేకించలేదు అని నిరూపించే దమ్ము మీకు ఉందా? నిరూపించమని సవాల్‌ విసురుతున్నాం. ఫేక్‌ న్యూస్‌ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలాగూ ఉంది.— Y V Subba Reddy (@yvsubbareddymp) April 4, 2025.

A Father Threw That Girl Plays National Anthem On 15 Instruments10
నాడు కన్నతండ్రే వద్దనుకుని విసిరేశాడు.. కట్‌చేస్తే ఆ చిన్నారే నేడు ఇలా..!

నేటికి కూతురు అనంగానే భారంగానే భావిస్తున్నారు పలువురు. విద్యావంతులైన వాళ్లు సైతం ఇదేతీరులో ప్రవర్తించడం బాధకరం. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతున్న 'ఆడపిల్ల' అనే వివక్ష విషయంలో మాత్రం మార్పు అంతంత మాత్రమే అనేది పలువురు సామజికవేత్తల వాదన. ఇలాంటి భావంతోనే ఓ తండ్రి నెలల పసికందు అని చూడకుండా కిటికిలోంచి విసిరేశాడు. సమయానికి పొరుగింటివాళ్లు స్పందించి కాపాడిన ఆ ప్రాణం..నేడు కనివినీ ఊహించని రీతిలో సంగీత విద్వాంసురాలిగా రాణించడమే కాదు రికార్డులు సృష్టిస్తోంది. ఆ అమ్మాయే నియాతి చెట్రాన్ష్. ఆమెకు కేవలం నెలల వయసులో ఆమె తండ్రి కర్కశంగా కూతురు కుటుంబానికి భారమని కిటికీలోంచి విసిరేశాడు. ఆ దుశ్చర్యకు ఆ చిన్నారి తల్లిప్రాణం తట్టుకోలేకపోయింది. తక్షణమే ఆ తల్లి కట్టుకున్న భర్తను వద్దనుకుని అన్నీతానై పెంచాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యింది. తాను ఈ ప్రపంచం తీరు మార్చలేకపోవచ్చు కానీ తన కుమార్తెను మాత్రం కాపాడుకోగలను అనుకుంది. ఇక అలా ఆమె తన కూతురు నియాతికి అన్నీతానై ప్రేమగా పెంచుకుంటోంది. ఇక నియాతికి పెరిగేకొద్దీ సంగీతం పట్ల మక్కువ ఏర్పడటం మొదలైంది. ఆ ఇష్టమే ఆమెను జస్ట్‌ 12 ఏళ్లకే 42 వాయిద్యాలను వాయించే రేంజ్‌కి తీసుకొచ్చింది. ఆ ప్రతిభ ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా అనతి కాలంలోనే ఆమె పేరు, టాలెంట్‌ అందరికి తెలియడం మొదలైంది. దాంతో ఆ చిన్నారి తల్లి ఉద్యోగాన్ని వదిలి.. ఫ్రీలాన్స్‌ర్‌గా పనిచేస్తూ.. కుమార్తె అభిరుచిని కొనసాగించడంలో సహాయపడింది. ఆమె తల్లి ప్రోత్సహాంతో నియాతి జాతీయ అంతర్జాతీ సవేదికలపై ప్రదర్శనలు ఇస్తూ..రికార్డుల సృష్టించడం మొదలుపెట్టింది. అంతేగాదు కేవలం 65 సెకన్లలో 15 వాయిద్యాలపై మన జాతీయ గీతాన్ని వాయించి, ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం సంపాదించింది. ఇవేగాక 13 నిమిషాలకు పైగా కళ్ళకు గంతలు కట్టుకుని శివ తాండవమ్‌ను కూడా ప్రదర్శించింది.ఎలా ఈ రంగాన్ని ఎంచుకుందంటే..నియాతి ఆరునెలల వయసులో తల్లి ఇచ్చిన బొమ్మ కీబోర్డ్‌ను చాలా ఆసక్తికరంగా వాయించే ప్రయత్నం చేసేది. అంతేగాదు వంటగదిలోని పాత్రలను ఒక లయబద్ధంగా కొట్టేది. అలా ఐదేళ్లు వచ్చేసరికి లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో గ్రేడెడ్ పియానో ​​పరీక్షలు రాసింది. ఉకులేలే, ఫ్లూట్, తబలా వంటి 16 విభిన్న వాయిద్యాలను వాయించడం నేర్చుకుంది. పైగా నియాతి తన తల్లే తనకు గొప్ప రోల్‌మోడల్‌ అని ఆమె అందించిన ప్రోత్సాహంతో పేరుప్రఖ్యాతలు తీసుకురావడం తన కర్తవ్యమని సగర్వంగా చెబుతోంది. నిశబ్దంగా ఉసురు తీయాలనుకున్న వారికి మనసుకు హత్తకునే మ్యూజిక్‌తో సమాధానమిస్తానంటోంది. (చదవండి: View this post on Instagram A post shared by The Better India (@thebetterindia)(చదవండి: రూ. 8 లక్షలు విలువ చేసే స్నాక్‌బ్రాండ్‌! ఏకంగా టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement