ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో ఈ రెండు సినిమాలు విడుదల చేయవద్దు అంటూ సత్యనారాయణ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు.