సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దాడిని కొనసాగిస్తునే ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై తనదైన స్టైల్‌లో ఎదురుదాడి చేస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించి పాటలతో వివాదాలకు తెర తీసిన వర్మ సోషల్ మీడియా పోస్ట్‌లతో మరింత వేడి పెంచుతున్నాడు.