Top Stories
ప్రధాన వార్తలు

కశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి
శ్రీనగర్/విశాఖపట్నం: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీప బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో విశాఖ వాసి చంద్రమౌళిని ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. ఉగ్రవాదులు.. చంద్రమౌళిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖ వాసి ఉన్నారు. విశాఖ వాసి చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా.. మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఇక, చంద్రమౌళి.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని తెలిసింది. చంద్రమౌళి బంధువు DSP నాగేశ్వర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 18న చంద్రమౌళి కశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆరుగురు కలిసి విహారయాత్రకి వెళ్లారు. ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య గ్రాండ్‌గా చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు జరిపాం. ఇప్పటికీ మా వదినకి ఆయన చనిపోయిన విషయం తెలియదు. నెల్లూరు వాసి మృతి..కశ్మీర్‌లోని పహాల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతిచెందాడు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్‌ని కాల్చి చంపిన ఉగ్రవాదులు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న మధుసూదన్. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదకర ఘటన నెలకొంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదనన్‌కు భార్య ఇద్దరు పిల్లలు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలింపు.. సాయంత్రానికి కావలికి చేరుకోనున్న మధుసూదన్ మృతదేహాం. అతడి తల్లిదండ్రులు హార్ట్ పేషంట్స్ కావడంతో విషయం గోప్యంగా ఉంచిన బంధువులు.

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి ఫలితాలను www.sakshieducation.comతో విద్యార్థులు తెలుసుకోవచ్చు.AP 10th Class Results 2025 Direct Links..Server-1https://results2.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/SSC/ap-ssc-10th-class-results-2025.html Server-2https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2025-Direct-Link.html Server-3http://results1.sakshieducation.com/results/SSC/ap-ssc-10th-class-results-2025.htmlఅలాగే, https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడవచ్చు. అలాగే, వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యాసేవల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను పొందవచ్చు.

సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ నివేదిక సాక్షిగా రెడ్‌బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...డిస్టిలరీలూ బాబు దందానే బట్టబయలు చేసిన సిట్ నివేదికవైఎస్సార్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఓ రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం. నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్ రిమాండ్ నివేదికచంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్ తన రిమాండ్ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదికసిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్ పేర్కొంది. కారు కూతలు... కాకి లెక్కలులేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్రటీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం.మద్యం మాఫియా దోపిడీదారు బాబే సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.

ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టులోనే ధోవల్‌తో సమీక్ష!
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ చేరుకున్నారు. కాశ్మీర్లో ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ.. సౌదీ అరేబియా పర్యటన అర్థాంతరంగా ముగించుకుని భారత్‌కు పయనమయ్యారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీని కలిసి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రస్తుత పరిస్థితి వివరించారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించనున్నారు. ఇక, ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టులోనే కశ్మీర్ ఉగ్రదాడిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేడు పహల్గాంకు అమిత్ షాఘటనాస్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా ఉన్నారు. బుధవారం అమిత్ షా పహల్గాంకు వెళ్లనున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ. వాన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Prime Minister Narendra Modi arrives in Delhi after cutting short his Saudi Arabia visit in view of the #PahalgamTerroristAttack in Kashmir.NSA Ajit Doval accompanies him. (Source - ANI/DD) pic.twitter.com/PeA7CWRAes— ANI (@ANI) April 23, 2025

LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్‌ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్‌కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్ఎస్జీలో రాహుల్ ప్రస్తానంలక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే గత సీజన్లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గత సీజన్లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి
బాబూ. గణేష్ .. పెళ్లి కుదిరిందట కదా.. మరి ముహుర్తాలు తీసారా.. ఎప్పుడట మరి.. అడిగారు ఊరి జనం.. ఏమో నాకూ తెలీదు.. చెప్పాడు గణేష్.. అదేందిరా అట్లా చెబుతావ్.. ఈనెల.. వచ్చేనెల.. ఆపై వచ్చేనెల ఏదో ఒక రోజు ఉంటుంది కదా.. అది చెప్పు .. రెట్టించి అడిగారు పెద్దలు.. ఏమో.. నాకేం తెలుసు.. ఆయనకు ఎప్పుడు ఖాళీదొరికితే అప్పుడే నా పెళ్లి.. ఓహో.. పురోహితుడు డేట్స్ కుదరలేదా.. అవునులే.. అసలే ఇప్పుడు పంతుళ్ళకు బిజీ ఉంది.. అయన తీరిక దొరికాక ఏదో డేట్ చెబుతాడు.. చేసుకుందువులే.. .. పురోహితుడు కాదు.. వేరే అయన డేట్స్ కుదరాలి.. ఓహో.. అర్థమైందిరా పిల్ల అన్నయ్య అమెరికాలో ఉన్నాడు ఆయనకు సెలవులు.. డేట్స్ దొరకలేదు.. అయన వస్తేగానీ పెళ్లి వద్దన్నారు ఆడపిల్లవాళ్ళు.. అయన వచ్చాకే చేసుకుందువులే.. అన్నారు పెద్దలు.. అది కాదు.. అన్నాడు గణేష్.. మరింకేందిరా.. ఇంకెవరి డేట్స్ కుదరాలి.. రేవంత్ రెడ్డి డేట్స్ కుదరాలి.. చెప్పాడు గణేష్.. వార్నీ.. అదేందిరా అన్నారు పెద్దలు.. అదంతే.. రేవంత్ రెడ్డి వస్తేనే నా పెళ్లి.. లేదంటే లేదు అంటుకుంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు కుర్రాడు.. పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లను ఎవరైనా ఒరేయ్ అబ్బాయ్ నీ పెళ్లి ఎప్పుడురా అంటే ఇదిగో జాబ్ రాగానే చేసుకుంటాను.. ఇదిగో మా మరదలు ఒకే అనడమే లేటు.. అయ్యో.. ఇల్లు పని మధ్యలో ఉంది.. అది పూర్తయ్యాక బ్యాండ్ వాయించడమే.. జీతం తక్కువ ఉంది పెద్దయ్యా.. వచ్చే ఏడాది జీతం పెరగ్గానే చేస్కుంటా.. నువ్వే పిల్లను చూడు... నేనా అమెరికా వెళ్తున్న రెండేళ్లు అక్కడ ఉండి వస్తాను.. రాగానే చేసేసుకుంటా... లేదు బాబాయ్.. పిల్లలు దొరకడం లేదు.. పోనీ నువ్వైనా చూడు.. చేస్కుంటా.. అంటూ సమాధానాలు వస్తాయి.. కానీ ఈ కుర్రాడు మాత్రం.. నీ పెళ్లి ఎప్పుడురా అంటే షాకిచ్చే సమాధానం ఇచ్చాడు.. ఎవరైనా ఎమ్మెల్యేను కలిసి సార్ నాకు ఉద్యోగం చూడండి.. లేదా మంత్రికి చెప్పి ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పించండి.. ఇంకా పెద్దాయనకు చెప్పి నాకు మెడిసిన్ సీట్ ఇప్పించండి అని కోరుకుంటారు.. సదరు నాయకుడు కూడా తన కార్యకర్త మాటను గౌరవించి మున్ముందు తనకు ఉపయోగపడే తీరునుబట్టి రికమెండేషన్ చేస్తారు. కానీ ఇదిగో తెలంగాణలోని వైరా నియోజకవర్గానికి చెందిన భూక్యా గణేష్ అనే యూత్ నాయకుడు మాత్రం విచిత్రమైన కోరిక కోరాడు. తన పెళ్ళికి సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిందే అని పట్టుబట్టాడు.. అయన ఎప్పుడు వస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని.. అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటాను అని ఫిక్షయ్యాడు. దీంతో ఏకంగా ఎమ్మెల్యే రామ్ దాస్ మాలోత్ కు ఒక లెటర్ రాసాడు.. ఇదిగో అన్నా.. నేను మీ నియోజకవర్గంలో నాయకుణ్ణి పెళ్ళికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చే బాధ్యత నీదే అంటూ.. ఒక విజ్ఞాపన అందించాడు.. దాన్ని సదరు ఎమ్మెల్యే సీఎం కు ఫార్వార్డ్ చేసాడు.. మా ఊరి కుర్రాడికి పెళ్లి కుదిరింది.. మీరైతే రావాల్సిందే.. రాకుంటే నాకు ఇజ్జత్ పోయేలా ఉంది.. ఏదైనా చేసి రండి సారూ అంటూ ఆ ఎమ్మెల్యే కూడా సీఎం కు ఆ లెటర్ పంపాడు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు డేట్స్ కుదురుతాయో.. భూక్యా గణేష్ పెళ్ళికి.. ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న

రియల్ ఎస్టేట్‌లోకి ఏఐఎఫ్ పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు) పెట్టుబడులు 2024 డిసెంబర్ నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’ ఏఐఎఫ్‌లకు సంబంధించి డేటాను విశ్లేషించి ఒక నివేదిక విడుదల చేసింది. గత డిసెంబర్ నాటికి ఏఐఎఫ్‌లు అన్ని రంగాల్లోనూ కలిపి రూ.5,06,196 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపింది. ఇందులో 15 శాతం మేర (రూ.73,903 కోట్లు) రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాయని.. రంగాల వారీగా అత్యధిక పెట్టుబడులు రియల్టీకే దక్కినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘ఏఐఎఫ్‌లతో దేశ రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ (రుణ సదుపాయం) గణీయమైన మార్పునకు గురైంది. నిధుల్లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్టులకు ఏఐఎఫ్ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయి. డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి’’అని అనరాక్ తెలిపింది. ఏ రంగంలోకి ఎంత మేర.. రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధికంగా ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.26,807 కోట్లు, ఎన్బీఎఫ్సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్ రూ.11550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్ పెట్టుబడులను 2024 డిసెంబర్ నాటికి ఆకర్షించినట్టు అనరాక్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్ రూపంలో పరిష్కారం లభించినట్టు అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు. సంప్రదాయ నిధుల సమీకరణ మార్గాల్లో ఇబ్బందులకు ఈ రూపంలో పరిష్కారం లభించినట్టు చెప్పారు. ఏఐఎఫ్‌లు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి ఇన్వెస్టర్లకు అధిక రిస్క్‌తో కూడిన రాబడులను ఆఫర్ చేస్తుంటాయి. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి, తమ ప్రణాళికలకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన దశాబ్ద కాలంలో సెబీ వద్ద నమోదైన ఏఐఎఫ్‌లు 36 రెట్లు పెరిగాయి. 2013 మార్చి నాటికి 42గా ఉన్నవి 2025 మార్చి 5 నాటికి 1,524కు పెరిగినట్టు డేటా తెలియజేస్తోంది.

'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) గురించి గాయని ప్రవస్తి (Pravasthi) చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ (Praveena Kadiyala) క్లారిటీ ఇచ్చారు. రెండురోజుల క్రితం ప్రవస్తి ఒక వీడియో ద్వారా కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్‌ల గురించి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆపై తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆమె ఆరోపించారు. ప్రోగ్రాం నిర్వాహకులు కూడా తమకు చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్ చేయాలి అన్నట్లుగా చెప్పేవారని ప్రవస్తి చెప్పుకొచ్చింది. అయితే, ఆ ప్రోగ్రాం నిర్మాత ప్రవీణ తాజాగా క్లారిటీ ఇచ్చారు.వారు ఎంచుకున్న పాటకు తగ్గట్టే కంటెస్టెంట్లకు తాను దుస్తులు డిజైన్ చేయిస్తానని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ క్లారిటీ ఇచ్చారు. తమ షోలో ఎక్కడా కూడా బాడీ షేమింగ్‌పై వ్యాఖ్యలు చేయమని చెప్పారు. ప్రవస్తి చెబుతున్నట్లుగా ఫేవరెట్ కంటెస్టెంట్లకు సులభమైన పాటలు ఇచ్చి.. ఆమెకు మాత్రమే కష్టమైన పాటలు ఇస్తామని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పారు. పాటల ఎంపిక కోసం ప్రతి షెడ్యూల్లో ఓ క్రియేటివిటీ టీమ్ నాలుగు రకాల పాటలను ఎంపిక చేస్తుంటుందని నిర్మాత ప్రవీణ అన్నారు. తమ ప్రోగ్రామ్ టెలీకాస్ట్ అయ్యే ఛానల్‌కు ఏ పాటల రైట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని మాత్రం చెబుతామని తెలిపారు. అలా ప్రతి కంటెస్టెంట్ ఆరు పాటలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వాటిపై రిహార్సల్స్ పూర్తి చేసుకుని, వారు రెడీ అని చెప్పాకే తాము షూటింగ్ ప్రారంభిస్తామని ఆమె అన్నారు.అలా అనడం తప్పే: సునీత‘మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు’ అని కాస్ట్యూమర్ అన్నారంటూ ప్రవస్తి చేసిన ఆరపణలకు సింగర్ సునీత ఇలా సమాధానం ఇచ్చారు. 'కంటెస్టెంట్స్ ఎంపిక చేసుకున్న పాటకు తగిన విధంగానే కాస్ట్యూమ్స్‌ని నేను డిజైన్ చేయిస్తుంటా. ఇక్కడ పాటది మాత్రమే ఛాయిస్ ఉంటుంది. ప్రవస్తితో ఆ కాస్ట్యూమర్ అలా ప్రవర్తించి ఉంటే అది ముమ్మాటికే తప్పే. కానీ, జరిగిన విషయం అదే సమయంలో నాతో గానీ, డైరెక్టర్‌తో గానీ చెప్పాల్సింది. డ్రెస్సు విషయంలో అలా వేసుకో, ఇలా వేసుకో అని నేనెప్పుడూ చెప్పలేదు.' అని అన్నారు.Gnapika entertainment producer praveena kadiyala about singer #Pravasthi issue.#ETV #paduthatheeyaga pic.twitter.com/OlhBtBiaNe— Vamsi Kaka (@vamsikaka) April 22, 2025

ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు.. పెళ్లైన 15 రోజులకే..
లక్నో: ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో రకరకాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు ఎక్కువగా సంఖ్యలో బయటకు వస్తున్నాయి. భర్త, భార్యలను హత్య చేసిన ఘటనలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి.తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి జరిగిన రెండు వారాలకే సదరు వ్యక్తి.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి ముగ్గురు పిల్లలు ఉండటం, ఆమె కానిస్టేబుల్ కావడం. ఈ నేపథ్యంలో మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. యూపీలోని రసూల్పూర్ గ్రామానికి చెందిన నేహాకు గజల్‌పుర్ వాసి నవీన్‌తో ఫిబ్రవరి 16న వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్ కానిస్టేబుల్ నిర్మలతో నవీన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్యకు తెలిసింది. నిర్మలతో కలిసి ఉండాలని నవీన్ భార్యపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. దీంతో, చేసేదేమీ లేక.. అనంతరం మార్చి ఒకటో తేదీన నిర్మలతో నవీన్ రెండోపెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న రాత్రి మొహల్లా సాకేత్ కాలనీలోని నవీన్-నిర్మల ఏకాంతంగా ఉన్న సమయంలో వీరిద్దరినీ పట్టుకుంది నేహా. ఈ క్రమంలో నేహా వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. తర్వాత.. ఏప్రిల్ 17న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలను హఫీజ్‌పుర్ పోలీస్‌స్టేషనుకు అటాచ్ చేశారు. ప్రస్తుతం నవీన్, నిర్మల పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరి ఫొటోలు వైరల్‌గా మారాయి.

కశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. నవవధువు ఆవేదన
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్ర ఉన్మాదం మరోసారి ఒళ్లువిరుచుకుంది. పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) కూడా మరణించారు. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు.మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బీహార్, హర్యానాకు తదితర రాష్ట్రాలకు చెందినవారు.భర్తను కోల్పోయిన నవవధువుపెళ్లయి కాళ్లకు పారాణి ఆరకముందే ఆ నవవధువు జీవితం తలకిందులైంది. భర్తను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఈ మారణకాండలో బలైపోయిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)గా గుర్తించారు. హర్యానాకు చెందిన వినయ్, కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న ఆయన, హనీమూన్ కోసమో, లేదా సెలవును ఎంజాయ్ చేసేందుకో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే, ఆనందంగా గడపాల్సిన సెలవు ఆయన జీవితంలో చివరిది కావడంతో కుటుంబంలోనే కాదు, దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు. ఈ క్రమంలో నవ వధువు రోదిస్తూ..‘మాకు పెళ్లయి కేవలం ఆరు రోజులే అవుతోంది. ఘటన జరిగినప్పుడు మేమిద్దరం పానీపూరీని ఆస్వాదిస్తున్నాం. హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అన్నాడు. వెంటనే ఆయన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడండి’ అంటూ ఏడుస్తున్న హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🚨Vinay Narwal, a 26-year-old Indian Navy officer from #Karnal, #Haryana📅 16 April – Lieutenant Vinay got married.📅 19 April – The couple traveled to Kashmir for the their honeymoon📅 22 April – Lieutenant Vinay was tragically killed in a terrorist attack in #Pahalgam https://t.co/n8ElIenhaE pic.twitter.com/6w0qprTnm8— Haryana Development Index (@InfrageoHaryana) April 23, 2025
పండ్లు వృథాగా పోకుండా.. ఆస్మోటిక్ డీ హైడ్రేషన్ బెస్ట్
ఐదో ప్రయత్నంలో ఐఏఎస్..
తొలి ఐపీవో వచ్చేస్తోంది..
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్ వస్తుందా? రాదా?
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే!
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. జోరు మీద ఐటీ షేర్లు
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
Pahalgam: నెత్తురోడిన కశ్మీరం.. ఉగ్రదాడిలో 26 మంది బలి
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
చెలరేగిన కేఎల్ రాహుల్.. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్‌పై విమర్శలు
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
పహెల్ గామ్ దుర్ఘటన పై స్పందించిన రామ్ చరణ్
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
గన్నవరం విమానాశ్రయం రికార్డు
అతడొక అద్బుతం.. చాలా క్లాస్‌గా ఆడుతున్నాడు: రాయుడు
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
CCTV: నిను వీడని నీడను నేనే..!
నాకు నువ్వు వద్దు!
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టులోనే ధోవల్‌తో సమీక్ష!
Pahalgam: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది టూరిస్టులు మృతి
ఎంత తవ్వినా ఆ కంపెనీ ఆనవాళ్లు కనపడడం లేద్సార్!!
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు ఫిర్యాదు
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
కశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. నవవధువు ఆవేదన
ఇది క్షమించరాని చర్య.. మా గుండె పగిలిపోయింది: చిరంజీవి, ఎన్టీఆర్
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ
నిస్సహాయులను చుట్టుముట్టి కాల్చేశారు!
కశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి
తిరుమలలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన భక్తులు
కూకట్‌పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
వ్యవస్థల విధ్వంసం: వైఎస్ జగన్
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు: నాని
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
రూ .లక్ష దాటిన పసిడి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!
ఏలూరు సాక్షి కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం
చైనాలో 10జీ నెట్వర్క్..!
ఢిల్లీ మళ్లీ...
ఊరిస్తున్న వాన్స్ టూర్
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
పరాకాష్టకు రెడ్‌బుక్ కుట్ర .. పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
అద్భుతం.. డిచ్పల్లి ఖిల్లా రామాలయం
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరోపణలు
భూగర్భ నీరు @ కందకంతో చేరు!
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
అంతా చేసి..భర్త కన్పించలేదంటూ ఫిర్యాదు
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
ఇంటి కలహం.. అంతు చూసింది
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
కొందరు హీరోయిన్లు నా ట్యాగ్ తీసుకున్నారు: విజయశాంతి
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ..
5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్
విశ్వసనీయ మిత్రదేశం
PSL 2025: దినదినాభివృద్ధి చెందుతున్న బాబర్ ఆజమ్.. భారీ ట్రోలింగ్
మొక్కజొన్న సాగుపై ఆరా
అందుకే రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్‌లో ఉన్నారు..!
తిరగబడ్డ విద్యార్థి లోకం
నాకెందుకో బైడెన్ కూడా వలసదారుడేమోనని అనిపిస్తోంది సార్!
సొంతూరికి రామ్ చరణ్ డైరెక్టర్.. గ్రామస్తులతో కలిసి భోజనం
బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు
కొనుడే ‘బంగార’మాయే!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
ఉప్పల్‌లో సన్‘రైజ్’ అయ్యేనా?
కదిరిలో బయటపడ్డ టీడీపీ కుట్ర రాజకీయాలు
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
ఈ రాశి వారికి అనుకోని ధనలాభం.. వ్యాపార వృద్ధి
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
హృతిక్‌తో ఎన్టీయార్, హృతిక్ మాజీ భార్యతో రామ్‌చరణ్...
పండ్లు వృథాగా పోకుండా.. ఆస్మోటిక్ డీ హైడ్రేషన్ బెస్ట్
ఐదో ప్రయత్నంలో ఐఏఎస్..
తొలి ఐపీవో వచ్చేస్తోంది..
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్ వస్తుందా? రాదా?
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే!
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. జోరు మీద ఐటీ షేర్లు
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
Pahalgam: నెత్తురోడిన కశ్మీరం.. ఉగ్రదాడిలో 26 మంది బలి
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
చెలరేగిన కేఎల్ రాహుల్.. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్‌పై విమర్శలు
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
పహెల్ గామ్ దుర్ఘటన పై స్పందించిన రామ్ చరణ్
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
గన్నవరం విమానాశ్రయం రికార్డు
అతడొక అద్బుతం.. చాలా క్లాస్‌గా ఆడుతున్నాడు: రాయుడు
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
CCTV: నిను వీడని నీడను నేనే..!
నాకు నువ్వు వద్దు!
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టులోనే ధోవల్‌తో సమీక్ష!
Pahalgam: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది టూరిస్టులు మృతి
ఎంత తవ్వినా ఆ కంపెనీ ఆనవాళ్లు కనపడడం లేద్సార్!!
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు ఫిర్యాదు
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
కశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. నవవధువు ఆవేదన
ఇది క్షమించరాని చర్య.. మా గుండె పగిలిపోయింది: చిరంజీవి, ఎన్టీఆర్
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ
నిస్సహాయులను చుట్టుముట్టి కాల్చేశారు!
కశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి
తిరుమలలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన భక్తులు
కూకట్‌పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
వ్యవస్థల విధ్వంసం: వైఎస్ జగన్
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు: నాని
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
రూ .లక్ష దాటిన పసిడి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!
ఏలూరు సాక్షి కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం
చైనాలో 10జీ నెట్వర్క్..!
ఢిల్లీ మళ్లీ...
ఊరిస్తున్న వాన్స్ టూర్
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
పరాకాష్టకు రెడ్‌బుక్ కుట్ర .. పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
అద్భుతం.. డిచ్పల్లి ఖిల్లా రామాలయం
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరోపణలు
భూగర్భ నీరు @ కందకంతో చేరు!
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
అంతా చేసి..భర్త కన్పించలేదంటూ ఫిర్యాదు
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
ఇంటి కలహం.. అంతు చూసింది
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
కొందరు హీరోయిన్లు నా ట్యాగ్ తీసుకున్నారు: విజయశాంతి
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ..
5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్
విశ్వసనీయ మిత్రదేశం
PSL 2025: దినదినాభివృద్ధి చెందుతున్న బాబర్ ఆజమ్.. భారీ ట్రోలింగ్
మొక్కజొన్న సాగుపై ఆరా
అందుకే రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్‌లో ఉన్నారు..!
తిరగబడ్డ విద్యార్థి లోకం
నాకెందుకో బైడెన్ కూడా వలసదారుడేమోనని అనిపిస్తోంది సార్!
సొంతూరికి రామ్ చరణ్ డైరెక్టర్.. గ్రామస్తులతో కలిసి భోజనం
బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు
కొనుడే ‘బంగార’మాయే!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
ఉప్పల్‌లో సన్‘రైజ్’ అయ్యేనా?
కదిరిలో బయటపడ్డ టీడీపీ కుట్ర రాజకీయాలు
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
ఈ రాశి వారికి అనుకోని ధనలాభం.. వ్యాపార వృద్ధి
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
హృతిక్‌తో ఎన్టీయార్, హృతిక్ మాజీ భార్యతో రామ్‌చరణ్...
సినిమా

అస్సలు యాక్టర్ కాలేవన్నారు: ప్రియదర్శి
‘‘సారంగపాణి జాతకం’లో నేను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను. నేను నటించిన ‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’ సినిమాల తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే ‘సారంగపాణి జాతకం’’ అన్నారు ప్రియదర్శి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రియదర్శి పంచుకున్న విశేషాలు. ⇒ ఇంద్రగంటిగారితో ఒక ఫొటో దిగితే చాలనుకునేవాణ్ణి. అలాంటిది ఆయనే నన్ను పిలిచి, ‘సారంగపాణి జాతకం’ కథ చెప్పారు. ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రం కోసం ఇంద్రగంటిగారే ఎక్కువగా కష్టపడ్డారు. నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశానంతే. ఇంతవరకు నేనెక్కువగా తెలంగాణ మాండలికం మాట్లాడాను. కానీ, ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడాను. ⇒ జాతకాలని నమ్మాలని కానీ, నమ్మకూడదని కానీ మా సినిమాలో చెప్పడం లేదు. ఒకరి నమ్మకాల్ని ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తున్నాం. ఇండస్ట్రీలోకి రాకముందు నా జాతకాలు చూపిస్తే.. ‘అస్సలు యాక్టర్ కాలేవు’ అని చెప్పారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. నా పైన, చేసే పని మీద నమ్మకం పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చాను. ⇒ శివలెంక కృష్ణ ప్రసాద్‌గారు గొప్ప నిర్మాత. అప్పట్లోనే ‘ఆదిత్య 369’ లాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించారాయన. ఇప్పటికీ నాలాంటి కొత్త యాక్టర్లని కూడా సార్ అని పిలుస్తుంటారు. ఆయన బ్యానర్లో పని చేసే చాన్స్ రావడం నా అదృష్టం. ప్రస్తుతం ఆడియన్స్ ఏ సినిమా చూడాలో... చూడకూడదో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. సినిమాలో విషయం ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. కామన్ మేన్ పాత్రల్ని పోషిస్తే ఎక్కువమందికి రీచ్ అవుతుందని నా నమ్మకం. ప్రస్తుతం ‘ప్రేమంటే, మిత్ర మండలి’ సినిమాలు చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను.

సెలబ్రిటీ రైటర్స్
మూవీ సెలబ్రిటీల ఆట, మాట, పాట మనకు తెలుసు. మరి అక్షరం? ... ఈ పుస్తకాలే సాక్ష్యం. మూవీ సెలబ్రిటీలు రాసిన ఈ పుస్తకాల్లో మచ్చుకు కూడా కాలక్షేప కథనాలు లేవు. స్త్రీ సాధికారత నుంచి మానసిక ఆరోగ్యం వరకు విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి.ప్రయాణంలో ప్రతి అడుగు పాఠమే: ప్రియాంక చోప్రా‘అన్ఫినిష్డ్: ఏ మెమోయిర్’ పుస్తకంతో రచయిత్రిగా ఆరంగేట్రం చేసింది ప్రియాంకచోప్రా. ఈ పుస్తకం తన జ్ఞాపకాల సమాహారం. తాను నడిచొచ్చిన దారి.‘నేను ఎప్పటినుంచో పుస్తకం రాయాలనుకుంటున్నాను. అయితే ఎప్పుడు రాయాలనేదే సమస్య. నా జీవితం గురించి రాయడానికి ఇది సరిౖయెన సమయం కాదు.ఇంకా ప్రయాణం పూర్తి కాలేదు అనుకుంటాం. అయితే జీవితంలో గొప్ప పాఠాలు ప్రయాణంలోనే బోధించడతాయి. వాటి గురించి పంచుకోవడం అవసరం. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అందుకే కలం పట్టుకున్నాను. నా జ్ఞాపకాలను అన్ఫినిష్డ్ ద్వారా పాఠకులతో పంచుకున్నాను’ అంటుంది ప్రియాంక చోప్రా.డిజిటల్ యుగంలో పిల్లల పెంపకం: సోనాలి బింద్రే‘బంగారు కళ్ల బుచ్చమ్మ’గా ‘మురారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సోనాలి బింద్రే ‘బర్డ్స్ అండ్ బీస్ట్స్: ఎన్చాంటింగ్ టేల్స్ ఆఫ్ ఇండియా’ ‘ది మోడ్రన్ గురుకుల్’ పుస్తకాలు రాసింది. ఆమె తాజా పుస్తకం ‘ఏ బుక్ ఆఫ్ బుక్స్’ నేడు విడుదల అవుతోంది. ‘బర్డ్స్ అండ్ బీస్ట్స్’ పుస్తకంలో భారతీయ జానపద కథలను తనదైన శైలిలో తిరిగి చెప్పింది సోనాలి. లడఖ్, అస్సాం, తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాఖండ్‌లలో తాను విన్న మౌఖిక జానపద కథలకు అక్షర రూపం ఇచ్చింది. పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే పుస్తకం ఇది.ఒకప్పుడు సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాలే కనిపిస్తున్నాయి. ‘ఈ డిజిటల్ యుగంలో పిల్లలను ఎలా పెంచాలి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘ది మోడ్రన్ గురుకుల్’ పుస్తకం రాసింది సోనాలీ. పిల్లల పెంపకానికి సంబంధించి మన మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ఇక తాజా పుస్తకం ‘ఏ బుక్ ఆఫ్ బుక్స్’ పుస్తకాలకు సంబంధించి సమస్త విషయాల గురించి మాట్లాడుతుంది. పుస్తకాలు ఎందుకు చదవాలి? ఉపయోగం ఏమిటి? ఎలాంటి పుస్తకాలు చదవాలి?... మొదలైన విషయాలతో ‘జీవితాంతం రీడర్‌గా ఉండాలి’ అని చెబుతుంది ఏ బుక్ ఆఫ్ బుక్స్.తరాల మధ్య అంతరం: ట్వింకిల్ ఖన్నా‘మిసెస్ ఫన్నీ బోన్స్’ ‘పైజామాస్ ఆర్ ఫర్ గీవింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మిప్రసాద్’ ‘వెల్కమ్ పారడైజ్’ పుస్తకాలతో రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకుంది ట్వింకిల్ ఖన్నా. ‘పాఠకులకు హితబోధ చేయడం నా ఉద్దేశం కాదు. ఇలా జరిగింది తెలుసా? అంటూ నాకు తెలిసిన విషయాలను పాఠకులతో పంచుకుంటాను’ అంటున్న ట్వింకిల్ దయాదక్షిణ్యాలు, ఒంటరితనం, తరాల మధ్య అంతరాలు వంటి ఇతివృత్తాలతో రచనలు చేసింది.‘నేను రాయడానికి కూర్చున్నప్పుడు ఇతివృత్తం గురించి ఆలోచించను. నా కథలు హితబోధ చేస్తున్నట్లు ఉండకుండా జాగ్రత్త పడతాను. ఐడియా మదిలో మెరవగానే కథ పూర్తికాదు. కథ ఎక్కడ మొదలవుతుందో చెప్పలేము. అది మైండ్‌లో తనకు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటుంది. కొన్నిసార్లు మనల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళుతుంది’ అంటుంది ట్వింకిల్, ‘జెల్లీ స్వీట్స్’ అనే కథ రాయడానికి ఆమెకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది!తల్లులు, కాబోయే తల్లుల కోసం...: కరీనా కపూర్ప్రెగ్నెన్సీ సమయంలో తన శారీరక, భావోద్వేగ అనుభవాలకు ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకంతో అక్షర రూపం ఇచ్చింది కరీనా కపూర్. ఐవీఎఫ్ మదర్స్, ప్రెగ్నెన్సీ డిప్రెషన్, వికారం, మార్నింగ్ సిక్నెస్, పిల్లలకు పాలు ఇవ్వడం... ఇలా ఎన్నో విషయాల గురించి తన పుస్తకంలో రాసింది. ఈ పుస్తకం తన వ్యక్తిగత జ్ఞాపకాలు మాత్రమే అనలేము. ఎక్స్‌పెక్టింగ్ మదర్స్‌కు ఎంతో ఉపయోగపడే పుస్తకం. ‘ఈ పుస్తకం నా మూడవ సంతానం’ అని నవ్వుతూ అంటుంది కరీనా.రోషెల్ పింటోతో కలిసి ‘ది స్టైల్ డైరీ ఆఫ్ ఎ బాలీవుడ్ దివా’ అనే పుస్తకం కూడా రాసింది కరీనా కపూర్.‘ఆటోబయోగ్రఫీ రాయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కాదు’ అని పుస్తక ఆవిష్కరణ సభలో చెప్పింది. ఆటోబయోగ్రఫీకి ముందు ఆమె నుంచి మరిన్ని పుస్తకాలను ఆశించవచ్చు.జెండర్ ఈక్వాలిటీ... దయా గుణం... పర్యావరణం: అలియా భట్‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్’ పుస్తకంతో రచయిత్రిగా మంచి మార్కులు తెచ్చుకుంది అలియా భట్. పిల్లల కోసం రాసిన పుస్తకం ఇది. పర్యావరణం, దయాగుణం, లింగ సమానత్వం... ఇలాంటి ఎన్నో విషయాల గురించి పుస్తకంలో రాసింది. బాల పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని రాసింది.‘పిల్లలకు ప్రకృతిపై ప్రేమ కలిగేలా చేయడానికి, పర్యావరణ పరిరక్షణ బాధ్యత గురించి తెలియజెప్పడానికి ఈ పుస్తకం రాశాను. ఇంట్లో కంటే ఆరుబయట ఎక్కువ సమయం గడపడానికి, సహజ ప్రపంచంలోని అద్భుతాలను అన్వేషించడానికి పిల్లలను ్రపోత్సహించడానికి మొదటి అడుగుగా ఈ పుస్తకం రాశాను’ అంటుంది అలియా భట్.పింపుల్స్ నుండి పీరియడ్స్ వరకు...: టిస్కా చోప్రాయాక్టర్, డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న టిస్కా చోప్రా రైటర్ కూడా. తమ శరీరంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడాని 9 నుంచి 13 ఏళ్ల బాలికల కోసం ‘వాట్స్ అప్ విత్ మీ?’ పుస్తకం రాసింది. యుక్త వయస్సు సమస్యలు, పీరియడ్స్, మొటిమలు... ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. యుక్తవయసులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి యువతకు సహాయపడే పుస్తకం ఇది. ‘తొమ్మిదేళ్ల నుంచి 13, 14 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని వాట్స్ అప్ విత్ మీ రాశాను. తల్లులే కాదు తండ్రులు కూడా నా పుసక్తంలో భాగం కావాలని కోరుకున్నాను. మార్కెట్లో లభించే ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్ల గురించి తెలియజేశాం. పాఠం చెబుతున్నట్లుగా కాకుండా వినోదాత్మకంగా ఉండేలా పుస్తకం రాశాను’ అంటుంది టిస్కా చోప్రా.

మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
'బుట్టబొమ్మ' పాట గుర్తుందా? దీన్ని పాడిన సింగర్ అర్మాన్ మాలిక్.. చాలా చిన్న వయసులోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో పాడుతూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఇతడు.. ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకున్నాడు. అసలేంటి విషయం?ఉత్తరాదికి చెందిన అర్మాన్ మాలిక్.. 2023 ఆగస్టులో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ప్రకటించాడు. యూట్యూబర్ ఆష్నా ష్రాఫ్ తోనే తాను ఒక్కటి కాబోతున్న విషయాన్ని బయటపెట్టాడు. గతేడాది డిసెంబరు చివరలో పెళ్లి జరగ్గా.. ఈ జనవరిలో పెళ్లి ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దీంతో అందరూ శుభాకాంక్షలు చెప్పారు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)కట్ చేస్తే ఇప్పుడు మరోసారి తన ఇంటిలో పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ఈసారి తన పెళ్లిని రిజిస్టర్ చేయించాడు. ఈ సందర్భంగా మరోసారి ఇంటిలోనే దండలు మార్చుకుని చిన్నపాటి వేడుకలా చేసుకున్నాడు. ఇందులో అర్మాన్ తల్లిదండ్రులతో పాటు సోదరుడు అమాల్ మాలిక్ కూడా కనిపించాడు.కొన్నిరోజుల క్రితం తాను తన కుటుంబం నుంచి విడిపోయానని అర్మాన్ సోదరుడు అమాల్ మాలిక్ పోస్ట్ పెట్టాడు. కానీ ఇప్పుడు కుటుంబంతో కలిసి అమాల్ కనిపించాడు. గతంలో పెట్టిన పోస్ట్ కూడా డిలీట్ చేశాడు. ఇప్పుడు అర్మాన్ తన లేటెస్ట్ పెళ్లి ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేయడం విశేషం.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్)

గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు: నాని
హీరో నాని నుంచి కొత్త సినిమా రాబోతుంది. అదే 'హిట్ 3'. గతంలో వచ్చిన రెండు చిత్రాలకు కొనసాగింపుగా దీన్ని తీశారు. మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తున్న నాని.. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మిగతా వాటి సంగతేమో గానీ దర్శకుడికి ఓసారి క్లాస్ పీకిన సందర్భం గురించి బయటపెట్టాడు.'శైలేష్ ఫస్ట్ షెడ్యూల్ లో మొహమాట పడేవాడు. అన్నింటికీ నన్ను మెంటార్ లా చూసి అన్నీ నన్ను అడిగేవాడు. నన్నేం అడగకు అని ఒక్కసారి గట్టిగా క్లాస్ పీకాను. నీకు మంచి సినిమా సెన్స్ ఉందని చెప్పా. అప్పటి నుంచి రెచ్చిపోయాడు' అని నాని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్)నాని ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. దీనికి తోడు ఈ మూవీతో హిట్ కొడతానని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే నాని నమ్మకం నిజమయ్యేలా కనిపిస్తుంది.హిట్ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలు ఇన్వెస్టిగేషన్ తరహాలో తీస్తే ఇప్పుడు రాబోతున్న హిట్ 3 మాత్రం యాక్షన్, రక్తపాతం అనేలా తీశారు. ఇప్పటికే పిల్లలు, సున్నిత మసస్కులు తన సినిమా చూసేందుకు రావొద్దని నాని క్లారిటీ ఇచ్చేశాడు కూడా.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
న్యూస్ పాడ్‌కాస్ట్

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం
క్రీడలు

స్లేటర్‌కు నాలుగేళ్ల జైలు
సిడ్నీ: గృహ హింస తదితర కేసుల్లో ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే అతను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జడ్జి తీర్పునిచ్చారు. గతంలో ఈ కేసులో స్లేటర్ ఏడాది పాటు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నాడు. తాజా తీర్పు ప్రకారం అతని మిగిలిన మూడేళ్ల శిక్షను కూడా రద్దు చేశారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఒక మహిళను వెంటపడి వేధించడంతో పాటు స్లేటర్ అసభ్యకర సందేశాలు కూడా పంపించాడు. పోలీసు విచారణలో ఇవన్నీ వాస్తవమని తేలడంతో అతడిని జైలుకు పంపించారు. అయితే స్లేటర్ సుదీర్ఘ కాలం పాటు మద్యానికి బానిసై మానసిక సమస్యలతో బాధపడ్డాడని, ఇదే కారణంగా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడ్డాడని అతని లాయర్లు వాదించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి కూడా అతనిపై వేర్వేరు కేసులు ఉన్నాయి. జైలులో ఉన్న 375 రోజుల పాటు అతను సత్ప్రవర్తనతో మెలిగాడని వారు వివరించారు. దాంతో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటూ న్యాయమూర్తి 55 ఏళ్ల స్లేటర్ శిక్షను కుదించారు. అయితే స్లేటర్ వచ్చే ఐదేళ్లపాటు ‘సస్పెండెడ్ పీరియడ్’లో ఉంటాడు. ఈ సమయంలో మళ్లీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం తీవ్ర శిక్షకు గురవుతాడు. స్లేటర్ 1993–2001 మధ్య కాలంలో ఆ్రస్టేలియాకు 74 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 42.83 సగటుతో 5312 పరుగులు సాధించాడు. 14 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలతో అతను ఆసీస్ అప్రతిహత విజయాల్లో ఓపెనర్‌గా కీలకపాత్ర పోషించాడు. 42 వన్డేలు కూడా ఆడిన స్లేటర్ ప్రస్తుతం కామెంటేటర్‌గా స్థిరపడ్డాడు.

ఢిల్లీ మళ్లీ...
దాదాపు నెల రోజుల క్రితం... వైజాగ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది... ఇప్పుడు ప్రత్యర్థి వేదికపై సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ మళ్లీ ఆధిక్యం ప్రదర్శిస్తూ లక్నోపై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. క్యాపిటల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా క్యాపిటల్స్ అలవోకగా మరో 13 బంతుల ముందే విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ఆడని రాహుల్... ఈసారి హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌కు ఇరుసుగా నిలిచాడు. తనను గత ఏడాది అవమానించిన పాత జట్టు లక్నో వేదికపై సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించి సంతృప్తిగా నిలబడ్డాడు. లక్నో: తొలి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్క్రమ్ (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మిచెల్ మార్ష్(36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆయుష్ బదోని (21 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముకేశ్ కుమార్ (4/33) లక్నోను పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్ పొరేల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ల శుభారంభం... తొలి వికెట్‌కు 59 బంతుల్లో 87 పరుగులు భాగస్వామ్యం... ఈ సమయంలో లక్నో స్థితి చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. అయితే ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ఇచ్చిన ఈ ఘనారంభాన్ని ఆ తర్వాత జట్టు వృథా చేసుకుంది. పవర్‌ప్లేలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఓపెనర్లు 6 ఓవర్లు ముగిసేసరికి 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో స్కోరును 51 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత చమీరా ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, స్టార్క్ చక్కటి బంతితో పూరన్ (9)ను బౌల్డ్ చేశాడు. అనంతరం ముకేశ్ ఒకే ఓవర్లో సమద్ (2), మార్ష్ లను అవుట్ చేయడంతో లక్నో కష్టాలు పెరిగాయి. 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయాక పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. అయితే ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన బదోని కాస్త ప్రభావం చూపించాడు. ముకేశ్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. వరుసగా వికెట్లు పడుతున్నా... సమద్, మిల్లర్ (14 నాటౌట్), బదోని తర్వాత ఇన్నింగ్స్‌లో మరో రెండు బంతులు ఉండగా ఏడో స్థానంలో రిషభ్ పంత్ (0) బ్యాటింగ్‌కు రావడం ఆశ్చర్యం కలిగించింది. టాస్ సమయంలో కుడి చేతికి కట్టుతో కనిపించిన పంత్ సమస్యేమీ లేదని చెప్పాడు. కీలక భాగస్వామ్యం... శార్దుల్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ ఛేదన మొదలైంది. కరుణ్ నాయర్ (15) తొందరగానే అవుటైనా... పొరేల్, రాహుల్ కలిసి చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు సాధించింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 సిక్స్‌లతో 16 పరుగులు రాబట్టి ఢిల్లీ ధాటిని పెంచింది.33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పొరేల్ వెనుదిరిగాడు. పొరేల్, రాహుల్ రెండో వికెట్‌కు 49 బంతుల్లో 69 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత రాహుల్, అక్షర్ కలిసి సునాయాసంగా జట్టును గెలుపు దిశగా నడిపించారు. రాహుల్, అక్షర్ మూడో వికెట్‌కు 36 బంతుల్లో అభేద్యంగా 56 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) స్టబ్స్ (బి) చమీరా 52; మార్ష్(బి) ముకేశ్ 45; పూరన్ (బి) స్టార్క్ 9; సమద్ (సి) అండ్ (బి) ముకేశ్ 2; మిల్లర్ (నాటౌట్) 14; బదోని (బి) ముకేశ్ 36; పంత్ (బి) ముకేశ్ 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–87, 2–99, 3–107, 4–110, 5–159, 6–159. బౌలింగ్: అక్షర్ 4–0–29–0, స్టార్క్ 4–0–25–1, ముకేశ్ 4–0–33–4, చమీరా 3–0–25–1, విప్రాజ్ 1–0–14–0, కుల్దీప్ 4–0–33–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) మిల్లర్ (బి) మార్క్రమ్ 51; కరుణ్ నాయర్ (బి) మార్క్రమ్ 15; రాహుల్ (నాటౌట్) 57; అక్షర్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–36, 2–105. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 2–0–28–0, దిగ్వేశ్ రాఠీ 4–0–24–0, ప్రిన్స్ 2.5–0–23–0, మార్క్రమ్ 3–0–30–2, అవేశ్ ఖాన్ 3–0–19–0, రవి బిష్ణోయ్ 3–0–36–0. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ xముంబై వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. కేవలం 130 ఇన్నింగ్స్‌లలోనే కేఎల్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(135) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఐదు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఐదో క్రికెటర్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్‌కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది.

చెలరేగిన కేఎల్ రాహుల్.. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మార్క్రమ్ హాఫ్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందించినప్పటికి, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమకావడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు.
బిజినెస్

భారత్ వృద్ధి అంచనాలు డౌన్
న్యూయార్క్: అంతర్జాతీయంగా అనిశి్చతి, వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతం నుంచి 6.2 శాతానికి కుదించింది. ప్రైవేట్ వినియోగం దన్నుతో భారత వృద్ధి అంచనాలు కాస్త స్థిరంగా ఉండగలవని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో)లో పేర్కొంది. 2025లో గ్లోబల్ వృద్ధి గత అంచనాల కన్నా 0.5 పర్సంటేజీ పాయింట్లు తక్కువగా 2.8 శాతంగా ఉండనుంది.2026లో ఇది 3 శాతంగా ఉండొచ్చు. కెనడా, జపాన్, బ్రిటన్, అమెరికా అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. అమెరికా వృద్ధి గతంలో ఊహించిన దానికన్నా 2.7 శాతం కన్నా చాలా తక్కువగా 1.8% స్థాయిలో ఉంటుందని పేర్కొంది. విధానాలపరమైన అనిశ్చితి, వాణిజ్య ఉద్రిక్తతలు, బలహీన డిమాండ్, ఊహించిన దానికన్నా వినియోగ వృద్ధి నెమ్మదిగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపింది.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి
శాన్ఫ్రాన్సిస్కో: భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని ఐటీ దిగ్గజాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాంకేతిక సహకారం, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ట్యూరింగ్ సీఈవో జొనాథన్ సిద్ధార్్థ, డేటా రోబో సీఈవో దేబాంజన్ సాహా తదితరులతో మంత్రి సమావేశమయ్యారు. మేకిన్ ఇండియా నినాదం కింద భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ టెక్నాలజీని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని థామస్ కురియన్ బృందాన్ని ఆమె కోరారు.భారత ఏఐ మిషన్‌ను ఈ సందర్భంగా కురియన్ ప్రశంసించారు. మరోవైపు, సిద్ధార్్థతో సమావేశంలో కృత్రిమ మేథకు సంబంధించి భారత్ పాలసీలను మంత్రి వివరించారు. ఏఐ విభాగంలో భారతీయ సంస్థలతో కలిసి పనిచేయడంపై సిద్ధార్థ్ ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎక్స్‌లో ఆర్థిక శాఖ పోస్ట్ చేసింది. కృత్రిమ మేథలో సూపర్‌పవర్‌గా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో తాము కూడా భాగం కావాలని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌కి దేబాంజన్ సాహా తెలిపారు. అటు వివిధ పెన్షన్ ఫండ్ మేనేజర్లు, ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లతో రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. ఇంధన రంగం, పర్యావరణహిత ప్రాజెక్టులు, గిఫ్ట్–ఐఎఫ్ఎస్సీ మొదలైన వాటిల్లో పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలను ఆమె వివరించారు. సంస్కరణల దన్ను.. వచ్చే రెండు దశాబ్దాల పాటు నిలకడగా వృద్ధి సాధించడమనేది సాహసోపేత సంస్కరణలతో పాటు దేశీయంగా సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులను దీటుగా ఎదుర్కొనే విధంగా సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు ఉండటం కూడా కీలకమని హూవర్ ఇనిస్టిట్యూషన్‌లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు.గత దశాబ్దకాలంగా ప్రభుత్వం పలు నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని, 20,000 పైగా నిబంధనలను సరళీకరించడంతో పాటు వ్యాపార చట్టాల్లో క్రిమినల్ సెక్షన్లను తగ్గించిందని, ప్రభుత్వ సర్విసులను డిజిటలీకరించిందని మంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయడంతో పాటు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా తయారీ రంగ ఆధారిత వృద్ధికి బాటలు వేసినట్లు వివరించారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయ్యే 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలని భారత్ నిర్దేశించుకుందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను విస్మరించకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

Stocks Market: లాభాల ‘సిక్సర్’
ముంబై: బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల ర్యాలీ ఆరో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 79,596 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 24,167 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 416 పాయింట్లు ఎగసి 79,824 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు దూసుకెళ్లి 24,243 వద్ద గరిష్టాన్ని అందుకున్నాయి.అయితే అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో సగానికి పైగా లాభాలు హరించుకుపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గించడంలో చైర్మన్ పావెల్ విఫలమయ్యాడంటూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ విమర్శలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ.33.55 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.427.37 లక్షల కోట్ల(5.02 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. ఈ ఏప్రిల్ 9 నుంచి(6 రోజుల్లో) సెన్సెక్స్ 5,748 పాయింట్లు, నిఫ్టీ 1,768 పాయింట్లు ఎగిశాయి.⇒ బీఎస్ఈ సూచీల్లో రియల్టీ 2.50%, ఎఫ్ఎంసీజీ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.5% లాభప డ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లు 1% రాణించాయి. ⇒ షేరు వరుస ర్యాలీతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.15 లక్షల కోట్లకు చేరింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశీయ సంస్థగా అవతరించింది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు షేరు బీఎస్ఈలో 2% పెరిగి రూ.1,962 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.1,971 రికార్డు గరిష్టాన్ని తాకింది. ⇒ మైక్రోఫైనాన్స్ విభాగంలో రూ.600 కోట్ల వ్యత్యాసంపై ఫోర్సెనిక్ అడిట్ కోసం ఎర్నెస్ట్–యంగ్ నియమించుకుందనే వార్తలతో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 5% నష్టపోయి రూ.788 వద్ద ముగిసింది.⇒ దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటడంతో బంగారం ఆభరణాల షేర్లు మెరిశాయి. త్రిభువన్ దాస్ భీంజీ ఝవేరీ(టీజీజెడ్) 6%, స్కై గోల్డ్ 5%, సెన్కో గోల్డ్ 3 శాతం లాభపడ్డాయి.

పసిడి లక్ష కాంతులు!
న్యూఢిల్లీ: బంగారం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టం నమోదైంది. అక్షయ తృతీయకు వారం రోజుల ముందే కీలకమైన రూ.లక్ష మార్క్‌ను పసిడి దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ మొదటిసారి 3,500 డాలర్లను అధిగమించింది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే కలిసొస్తుందన్నది హిందువుల విశ్వాసం. అందుకే ఏటా ఆ రోజున (ఈ నెల 30) కొనుగోళ్లు అధికంగా నమోదవుతుంటాయి.దీనికితోడు మే చివరి వరకు కొనసాగే పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. స్టాకిస్టులు, ఆభరణాల వర్తకులు బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం ధరలు ఎగిసేలా చేసినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 99.9 శాతం స్వచ్ఛత బంగారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,800 పెరిగి రూ.1,01,600 ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం రూ.2,800 ఎగసి రూ.1,02,100కు చేరుకోవడం విశేషం. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలోకి రూ.98,500వద్దే ఉంది. తాజా పరిణామాలు.. వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన సైతం తాజా పసిడి ధరల ఆజ్యానికి కారణమన్నది కామా జ్యుయలరీ ఎండీ కొలిన్‌షా అభిప్రాయంగా ఉంది. డాలర్ బలహీనత కొనసాగితే అప్పుడు ఇతర కరెన్సీల్లో బంగారం ధరలు దిగిరావచ్చన్నారు. బంగారాన్ని డాలర్ మారకంలోనే మనం కొనుగోలు చేస్తుంటామన్నది తెలిసిందే. మరోవైపు చైనా ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకునే దేశాలపై ప్రతిచర్యలు ఉంటాయన్న చైనా హెచ్చరిక సైతం సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్‌ను పెంచినట్టు కోటక్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్) కేనత్ చెయిన్వాలా తెలిపారు.స్వర్ణ యుగంబంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరగడం చూస్తున్నాం. ఇది స్వర్ణయుగం. బంగారానికి ఈ ఏడాది ఎంతో ముఖ్యమైనది. జనవరి నుంచి చూస్తే అంతర్జాతీయంగా బంగారం ధరలు 25% పెరిగి ఔన్స్‌కు 3,500 డాలర్లకు చేరాయి. భారత్‌లోనూ చారిత్రక గరిష్టం రూ.లక్ష మార్క్‌నకు (10 గ్రాములు) చేరడం ద్వారా పసిడిపై ఉన్న నమ్మకాన్ని బలోపేతం చేసింది. సురక్షిత సాధనంగా బంగారానికి ఉన్న గుర్తింపు సైతం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. ధరల్లో ఆటుపోట్లతో సంబంధం లేకుండా ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా భారత్‌లో బంగారం కొనుగోళ్లు కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం. – సచిన్ జైన్, ప్రపంచ స్వర్ణ మండలి భారత్ సీఈవో100 రోజుల్లోనే... 28 శాతం ర్యాలీ ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే బంగారం ధర 28 శాతం ర్యాలీ చేసింది. జవవరి 1న రూ.79,390గా ఉండగా, అక్కడి నుంచి చూస్తే 10 గ్రాములకు రూ.22,210 లాభపడడం గమనార్హం. పసిడి గమనం విశ్లేషకుల అంచనాలకూ అంతుచిక్కడం లేదు. ఈ ఏడాది చివరికి బంగారం ఔన్స్‌కు 3,500 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ 10 రోజుల క్రితమే (11న) అంచనా వేసింది. అంత కాలం పాటు నేను ఆగుతానా? అన్నట్టు మంగళవారమే పసిడి అంతర్జాతీయ మార్కెట్లో 3,509 డాలర్ల రికార్డు స్థాయిని నమోదు చేసింది.ఈ ఏడాది బంగారం 3,700 డాలర్లకు చేరుకోవచ్చన్నది మరో అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అంచనా. ప్రస్తుత వేగాన్ని చూస్తుంటే ఈ రికార్డు కూడా త్వరలోనే నమోదవుతుందేమో? చూడాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం కొనసాగినంత కాలం బంగారం ధరలు శాంతించకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లేదంటే డాలర్ అయినా ప్రస్తుత స్థాయి నుంచి మరింత బలహీనడాల్సి ఉంటుంది. అలా జరిగినా పసిడి ధరలు దిగివచ్చే అవకాశాలు ఉంటాయి.
ఫ్యామిలీ

V I Lenin Birth Anniversary లెనిన్ ప్రాసంగికత
మార్క్స్ – ఏంగెల్స్‌ల రచనలను అధ్యయనం చేసి, వెనుకబడ్డ రష్యాలో సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేసి ‘శాస్త్రీయ సోషలిస్టు సమాజా’న్ని ఈ భూమిపై మొదట నిర్మించినవాడు లెనిన్ మహాశయుడు. 1870 ఏప్రిల్ 22న రష్యాలోని ‘సింబర్క్స్’ పట్టణంలో జన్మించిన ఆయన అసలు పేరు వ్లదిమీర్ ఇల్యీచ్ ఉల్యానోవ్ . లెనిన్ అనేది ఆయన కలం పేరు. తన రచ నల ద్వారా అతివాద, మితవాద అరాచక వాదాన్ని ఎదుర్కొంటూ సోషలిస్టు విప్లవానికి కార్యక్రమ పంథా రూపొందించారు. లెనిన్ తన జీవితకాలంలో 10 సంవత్సరాలకు పైగా ప్రవాస జీవితం గడి పారు. ప్రవాసంలో ఉండగా ఆయన 30కి పైగా రచనలు చేశారు. 1916లో రాసిన ‘సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యు న్నత దశ‘ అందులో ఒకటి. 1917లో రష్యాలో సోషలిస్టు విప్లవం విజయవంతమైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా ప్రముఖ పాత్ర వహించింది. ప్రపంచంలో సోషలిస్టు శిబిరం ఏర్పడింది. లెనిన్ నాయకత్వాన ఉన్న రష్యా కమ్యూనిస్టు పార్టీ వెనుకబడ్డ దేశాల్లో సామాజిక విముక్తి కొరకు, దోపిడీ రహిత సమాజం ఏర్పాటు కొరకు, వివిధ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు కొరకు సహకరించింది.సామ్రాజ్య వాదం కింద ప్రపంచ విప్లవం రెండు ప్రవాహాలుగా ఉంటుందన్నారు లెనిన్. సామ్రాజ్యవాద దేశాలలో సోషలిస్టు విప్లవంగానూ; ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికన్ దేశా లలో లేక అణచబడిన దేశాలలో ‘జనతా ప్రజాతంత్ర విప్లవాలుగా’నూ ఉంటుందని సూత్రీక రించారు. భారతదేశంలోని కమ్యూనిస్టులు మారిన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్లో లెనిన్ చేసిన ఈ సూత్రీకరణను దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం, అధ్యయనం చేసి ఐక్యం కావ లసిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం నేడు నయా వలస, నయా పెట్టుబడిదారీ దశలో ఉన్నది. అలాగే నయా ఫాసిజం హిందూ మతోన్మాద రూపంలో అమెరికన్ సామ్రాజ్యవాదా నికి జూనియర్ భాగస్వామిగా ఉంది. ఈ పరిస్థితుల్లో అన్ని కమ్యూనిస్టు పార్టీలు, దళిత, బహుజన పార్టీలు, ప్రజాతంత్ర సంస్థలు ఐక్యమై కాషాయ ఫాసిస్టు వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు కావాలి. ఇది లెనిన్ సూత్రీకరణకు అనుగుణంగా ఉంటుంది.– మన్నవ హరిప్రసాద్సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పొలిట్ బ్యూరో సభ్యుడు(నేడు లెనిన్ 155వ జయంతి)

భూగర్భ నీరు @ కందకంతో చేరు!
నీరు మనకైనా పంటకైనా ప్రాణాధారం. భూగర్భంలో నీరంటూ ఉంటే బావి ద్వారానో, బోరు బావి ద్వారానో తోడుకొని పంటలు పండించుకోవచ్చు. అసలు భూగర్భంలోనే నీరు ఏటేటా అడుగుకు దిగిపోతుంటే అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. పంటల కోసం, పశువుల కోసం రోజూ తోడుకోవటానికి భూగర్భంలో నీరు పుష్కలంగా ఉండాలంటే.. వృథాగా చేను దాటి పోయే వర్షపు నీటి పరుగును ఆపి, భూమి లోపలికి చప్పున ఇంకింపజేసుకోవటం ఒక్కటే అత్యుత్తమ మార్గం. అందుకు కందకాలే సోపానాలంటున్నారు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు, వాన నీటి సంరక్షణ ఉద్యమకారులు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాం ప్రసాదరెడ్డి. తెలుగునాట రైతులు తమ భూముల్లో కందకాలు తవ్వుకోవటానికి పదేళ్లుగా మాట సాయం చేస్తున్నారు. వారి సూచనలు వారి మాటల్లోనే..ఎకరానికి రూ. 5 వేల ఖర్చు మన చేలో కురిసిన ప్రతి వాన బొట్టును పొలంలోనే ఇంకించుకోవాలి. మన చేను కిందే భూగర్భ జలాశయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైనప్పుడు కావలసినంత నీటిని బోర్ల ద్వారా, బావుల ద్వారా తోడుకొని సమృద్ధిగా పంటలు పండించుకోవాలంటే.. ముందు మనం ‘చేను కిందే చెరువు’ను సృష్టించుకోవాలి. అందుకు ఇదే సరైన సమయం. వానా కాలానికి ముందే పొలంలో కందకాలు తవ్వుకోవాలి. అకాల వేసవి వర్షాలను సైతం భూగర్భంలోకి ఇంకింపజేసుకోవటం తెలివైన పని. వర్షాధార, ఆరుతడి పంటలు సాగు చేసే భూముల్లో.. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకుంటే.. ఆ పొలానికి అడుగునే చెరువును నిర్మించుకున్నట్లే నీటి భద్రత నిక్కచ్చిగా దొరుకుతుంది. దీనికి ఖర్చు ఎకరానికి సగటున రూ. 5 వేలకు మించి కాదు. కందకాలకు ఎకారానికి 2 సెంట్ల భూమి అవసరం అవుతుంది. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఈ పెట్టుబడి ఎక్కువేమీ కాదని రైతులు గ్రహించాలి.ఏ యే పొలాల్లో ఎలా తవ్వాలి?పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. మీటరు లోతు, మీటరు వెడల్పున సమతల కందకాలను తవ్వుకోవాలి. నేలను బట్టి, వాలు ఎక్కువ తక్కువలను బట్టి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. పొలం ఆ చివరి నుంచి ఈ చివరికి ఒకే కందకం తవ్వకూడదు. కందకం పొడవు 25 మీటర్లుండాలి. ఆ తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో వాలుకు అడ్డంగా మరో 25 మీటర్ల కందకం తవ్వాలి. కందకం తవ్విన మట్టిని పొడవుగా ఒకే కట్టగా కందకం లోతట్టు వైపున గట్టు మాదిరిగా పోయాలి. ఇలా చేస్తే కందకంలోకి వచ్చిన వదర నీరు సైతం పొర్లిపోకుండా ఉంటుంది. నీటి సంరక్షణతో పాటు పొలంలోని విలువైన పైపొర మట్టి కొట్టుకుపోకుండా కూడా కాపాడుకోవచ్చు.ఎర్ర నేలల్లో ఎలా?ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కా నేలల్లో నీరు తొందరగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇటువంటి పొలాలు వాలు 2% ఉంటే.. పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. వాలు ఇంకా ఎక్కువగా ఉంటే 40 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వుకోవాలి. ఒక వేళ భూమి వాలు లేకుండా సమతలంగా ఉంటే.. కందకాలకు బదులు మడులు ఏర్పాటు చేసుకోవాలి. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి.నల్లరేగడి నేలల్లో ఎలా? నల్లరేగడి నేలల్లో నీరు త్వరగా ఇంకదు. కాబట్టి, ఈ నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన (బావి లేదా బోరు కింది భాగంలో) నీటి కుంట లేదా ఫామ్ పాండ్‌ను తవ్వుకోవాలి. పొలాల్లో తవ్వే వాన నీటి సంరక్షణ కందకాల విషయంలో సందేహాలుంటే తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సంప్రదించవచ్చు: సంగెం చంద్రమౌళి (విశ్రాంత ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్): 98495 66009, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (విశ్రాంత ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) 99638 19074.3 రోజుల్లో నా జీవితం మారిపోయింది!‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’లో కందకాల గురించి కథనం చదివి మా 135 ఎకరాల్లో ఐదేళ్ల క్రితం మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు కందకాలు వేసవిలోనే తవ్వించాను. నీటి కరువు శాశ్వతంగా తీరింది. అంతకుముందు వందలాది బోర్లు తవ్వినా ప్రయోజనం లేకపోయింది. కందకాలు తవ్విన 3 రోజుల్లోనే పెద్ద వర్షం కురవటంతో బోర్లు రీచార్జ్ అయ్యి నా జీవితం నాటకీయంగా మారిపోయింది. ఆఫ్ ఇంచ్ నీరు పోసే బోర్లు 3 రోజుల్లోనే 3 ఇంచులు నీరు పోయటం మొదలైంది. అంతకుముందు బావిలో నీరు వేసవిలో 60–80 అడుగుల లోతుకు వెళ్లేవి. ఇప్పుడు 18 అడుగుల్లోనే ఉన్నాయి. బోర్లలో అయితే 12–16 అడుగుల్లోనే ఉన్నాయి. 95 ఎకరాల్లో కుంకుడు, బత్తాయి, ఉసిరి, జామ, సీతాఫలం, శ్రీగంధం తోటలకు 3 బోర్లతోనే నీరు పెడుతున్నాం. గతంలో ఈ 95 ఎకరాల్లోనే 247 బోర్లు వేసినా దొరకని నీటి భద్రత కందకాలతో ఒక్క పెద్ద వర్షంతో దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి ఎద్దడి లేనే లేదు. కుంకుడు తోట ఎండిపోయే దశలో తవ్విన కందకాల వల్ల శాశ్వతంగా గొప్ప మేలు జరిగింది. నా తోటను ఇప్పటికి అనేక రాష్ట్రాల నుంచి 6 లక్షల మంది వచ్చి చూసెళ్లారు. ఈ పుణ్యం అంతా ‘సాక్షి’ ద్వారా తెలుసుకొని, తవ్వుకున్న కందకాలదే! కందకాల్లోనే 740 కొబ్బరి చెట్లు నాటా. చక్కగా పెరుగుతున్నాయి.– లోకసాని పద్మారెడ్డి (99481 11931), పోలేపల్లి, చందంపేట మం‘‘, నల్లగొండ జిల్లా మాతో పాటు ఊరందరికీ మేలు!9 ఏళ్ల క్రితం ‘సాక్షి’ సాగుబడిలో చదివి మా వందెకరాల పొలంలో కందకాలు తవ్వుతుంటే ఊళ్లో రైతులందరూ ‘వీడేందిరా చేనంత గుంతలు కొడుతున్నాడు..’ అంటూ నన్ను పిచ్చోడి లెక్క చూశారు. అయితే, మా పొలంతో పాటు దిగువున ఉన్న రైతుల పొలాల్లో (30 వరకు) బోర్లన్నీ బాగా పారుతున్నాయి. పొలంలో 50 అడుగులకు ఒక వరుస చొప్పున కందకాలు తవ్వటంతో పాటు చెరువులు కూడా తవ్వించాను. దీంతో భూగర్భంలోకి నీరు బాగా ఇంకి, నీటి సమస్య తీరింది. 40 ఎకరాల్లో కుంకుడు తోట నాటా. 5 వేల టేకు చెట్లు నాటా. మామిడి, నేరేడు తదితర వినూత్న రకాలు సాగు చేస్తున్నా.– సాదినేని శ్రీనివాసరావు (99490 99055), శివలింగాపురం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా

భూమాత భద్రంగా..
ఈరోజు వరల్డ్ ఎర్త్ డే. మదర్ ఎర్త్‌ను పరిరక్షించాలని అందరికీ ఉంటుంది. అయితే వ్యక్తులుగా మనం ఏం చేయాలనే సందేహానికి సమాధానం ఉండదు. ఆ సందేహానికి సమాధానాలు వీళ్లంతా. లీలాలక్ష్మారెడ్డి రీ ఫారెస్టేషన్ ద్వారా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎదురైన గ్రీన్హౌస్ గ్యాసెస్ విడుదలను నియంత్రిస్తున్నారు. అంకారావు గ్లోబల్ క్లీనప్ కాన్సెప్ట్‌లో అడవులను కాపాడుతూ ప్లాస్టిక్ కారణంగా ఎదురయ్యే అనారోగ్యాల నుంచి వన్య్రపాణులను రక్షిస్తున్నారు. స్పందన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ పవర్ వినియోగాన్ని తగ్గించడం, సస్టెయినబుల్ ఫ్యాషన్‌లో భాగంగా రీ యూజ్‌ని ప్రోత్సహిస్తూ కెరీర్‌ని పర్యావరణహితంగా మలుచుకున్నారు. చిన్నారి ఆరాధన సముద్రాల నుంచి ప్లాస్టిక్‌ని ఏరివేస్తూ సముద్రజీవుల సంరక్షణ కోసం పని చేస్తోంది. వీరంతా మన బతుకులు ఛిద్రం కాకుండా ఉండాలంటే భూమి భద్రంగా ఉండాలని చెబుతున్నారు భావి తరాలకు పరిశుభ్రమైన భూమిని అందించాలనే ప్రపంచ ఎర్త్‌డే లక్ష్యానికి మార్గదర్శనం చేస్తున్నారు.భూగోళాన్ని కాపాడుదాం!గ్లోబల్ ఎర్త్ డే 2025... ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ థీమ్‌తో మన ముందుకు వచ్చింది. ‘మనకు రకరకాల శక్తి వనరులున్నాయి. భూమికి హాని కలిగించకుండా భవిష్యత్తును నడిపించే ఇంధనం పునరుత్పాదక శక్తి మాత్రమే’ అనే అంశాన్ని ప్రతిబింబించే పోస్టర్ తయారైంది. నిజానికి ఎర్త్ డే అంటే ఎర్త్ యాక్షన్ డే. భూమిని పరిరక్షించుకోవడానికి మనుషులుగా మనమంతా కార్యాచరణ చేపట్టాల్సిన రోజు. ఏటా ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్‌డేని జరుపుకుంటున్నాం. 55 ఐదేళ్ల కిందట 1970లో యూఎస్‌లో మొదలైన ఈ ఎర్త్ డే నిర్వహణ క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం 193 దేశాలు భూమిని పరిరక్షించే బాధ్యతలో పాలు పంచుకుంటున్నాయి. ప్రతి రోజూ ఎర్త్ డే!సీజీఆర్ (కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్) ను పదిహేనేళ్ల కిందట ఎర్త్ డే రోజునేప్రారంభించాం. అప్పటి నుంచి 13 లక్షల మంది ఎర్త్ లీడర్స్‌ను తయారు చేశాం. యంగ్ ఎర్త్ లీడర్స్ప్రోగ్రామ్ నిర్వహించడంలో మా ఉద్దేశం... కొత్త తరాలకు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవరచడమే. అలాగే ఈస్టర్న్ ఘాట్స్ కన్వర్జేషన్‌ను చేపట్టాం. ఎర్త్ డే అంటే ఏడాదికి ఒక రోజు మాట్లాడుకుని మరిచి పోవడం కాదు. ప్రతి రోజూ ఎర్త్ డేనే. పిల్లల పుట్టిన రోజు ఏడాదికి ఒక రోజు చేస్తాం. మిగిలిన రోజుల్లో కూడా వాళ్లకు పోషకాహారం, అనారోగ్యం వస్తే వైద్యం చేయించడంతోపాటు వారి బాగోగులన్నీ చూసినట్లే ఇది కూడా. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాలను అంకితం చేసే పేరెంట్స్‌కి కూడా వారి కోసం మంచి ఎన్విరాన్మెంట్ని అందించాలనే ధ్యాస ఉండడం లేదు. భూమిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఎవరికి వారు ఇది తమ ఒక్కరి బాధ్యత కాదన్నట్లు ఉంటున్నారు. మనకున్నది ఒక భూమి– ఒక కుటుంబం– ఒక భవిష్యత్. ఇవి బాగుండాలంటే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన మదర్ ఎర్త్‌ని ఇవ్వగలుగుతాం.– కోరుపోల్ లీలా లక్ష్మారెడ్డి, ప్రెసిడెంట్, సీజీఆర్తొలకరి... మొక్కల పండగ!ప్రకృతికి మనం ఏమిస్తే అది మనకు తిరిగి దానినే ఇస్తుంది. మంచి చేస్తే మంచినందుకుంటాం. చెడు చేస్తే ఆ పర్యవసానాలను చవి చూస్తాం. వందల ఏళ్ల వెనక్కు వెళ్తే మన గ్రామాల్లో పండుగకో చెట్టు నాటే అలవాటుండేది. మొక్కను ప్రేమించడం, పూజించడం మన సంస్కృతి. ఆ కల్చర్‌ని విసిరిపారేశాం, తిరిగి అదే డైలీ రొటీన్‌ని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే కోటి విత్తన బంతుల ఉద్యమం చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాను. తొలకరి చినుకులు పడగానే మొక్క నాటడాన్ని అలవాటు చేసుకోవాలి. తొలకరిని మొక్కల వసంతంగా వేడుక చేసుకోవాలి.– అంకారావు (జాజి) కొమ్మెర, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాఎకో వారియర్సేవ్ ఓషన్ ఇనిషియేటివ్‌లో భాగంగా పదేళ్ల తారాగై ఆరాధన 11.30 గంటలు నీటి లోపల ఉండి 1200 కిలోల ప్లాస్టిక్‌ని ఒడ్డుకు చేర్చింది. చెన్నైకి చెందిన ఆరాధన ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్’ సర్టిఫికేట్ పొందిన స్కూబా డైవర్. ఐదేళ్ల వయసులో డైవింగ్ మొదలు పెట్టిన ఆరాధన ఇప్పటి వరకు 30 వేల కిలోల ప్లాస్టిక్‌ని వెలికి తీసి సముద్రానికి ఊపిరిపోసింది. భూమండలంలోని అన్ని సముద్రాల్లో కలిపి యాభై ట్రిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయని అంచనా. ఇది ఇలాగే కొనసాగితే తీరం కోతకు గురవడంతోపాటు సముద్రాలు విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు, 700 రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది కూడా. ‘ప్లాస్టిక్ బ్యాగ్ ఇస్తున్న ప్రతి చోటా క్లాత్ బ్యాగ్ కావాలని అడగండి. మొదట మీ ఇంటిని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చుకోండి. ఆ తర్వాత మీరు నివసిస్తున్న వీథిని మార్చండి. ఆ తర్వాత సముద్రాన్ని ప్రక్షాళన చేయండి’ అని ఆరాధన ప్రతి ఒక్కరినీ వేడుకుంటోంది.జెన్ జెడ్ ఎంటర్ప్రెన్యూర్మేము మోడరన్ ఎనర్జీ మినిమమ్ థీమ్‌లో భాగమయ్యాం. పవర్ వినియోగాన్ని తగ్గించడానికి స్టోర్ కోసం గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించే భవనాన్ని ఎంచుకున్నాం. పగలు లైట్, ఫ్యాన్ వేయాల్సిన అవసరమే ఉండదు. ప్లాస్టిక్ రహితంగా కూడా డిజైన్ చేశాం. క్యారీ బ్యాగ్‌ల విషయానికి వస్తే పేపర్ బ్యాగ్‌లు రీ యూజ్‌కి ఉపయోగపడడం లేదు. దాంతో నాన్ఓవన్ బ్యాగ్‌లు వాడుతున్నాం. సొసైటీలో ఎంత అవేర్నెస్ వచ్చిందంటే... మా కస్టమర్లు మా స్టోర్ వైపు నుంచే వెళ్లేటప్పుడు ఆ బ్యాగ్‌లను రీ యూజ్ కోసం తెచ్చిస్తున్నారు. ప్రైస్ ట్యాగ్‌కి దారం, నూలు, పేపర్లనే వాడుతాం. మంచినీటికి మాత్రం కొందరు కస్టమర్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లనే అడుగుతున్నారు. ఇక మా దగ్గరకు వచ్చే క్లాత్ వేస్ట్‌ని రీ యూజ్ చేయడానికి రకరకాలుగా ఆలోచిస్తున్నాం, ఇంకా స్పష్టమైన రూపం రాలేదు. మా పార్టనర్స్ అనూష, అమృతలు కూడా ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టయిల్ని గౌరవిస్తారు. కాబట్టి మా స్టోర్‌ని ఇలా యూనిక్‌గా తీసుకురాగలిగాం. ఒక మోడల్ని ఎవరో ఒకరు మొదలుపెడితే మిగిలిన వాళ్లు అందుకుంటారు. ఆ మొదటి అడుగు వేశాం.– వి. స్పందన, కో ఫౌండర్, లావెండర్ లేన్ – హౌస్ ఆఫ్ ఫ్యాషన్నేడు ఎర్త్ డే ఉమెన్స్ సమ్మిట్‘ఎర్త్ డే ఉమెన్స్ సమ్మిట్–2025’ ఈరోజు అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతుంది. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి మహిళల ఆలోచనలు, సృజనాత్మక పరిష్కారాలకు ఈ సమ్మిట్ వేదిక కానుంది. ‘నాయకత్వ స్థాయిలో మహిళలు ఉండడం వల్ల సమాజం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి’ అంటున్నారు గ్లోబల్ గ్రీన్ సిఇవో విలియం బ్రిడ్జ్. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వ, వ్యాపార, పౌర సమాజ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
బిహార్ గయా జిల్లాలో పట్వాటోలి గ్రామాన్ని ‘ఐ.ఐ.టి. విలేజ్’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఐ.ఐ.టి ర్యాంకులు సాధించివారు విపరీతంగా ఉంటారు. ఐ.ఐ.టి 2025 రిజల్ట్స్‌లో ఏకంగా 40 మంది స్టూడెంట్స్ ర్యాంకులు తెస్తే వీరిలో అమ్మాయిలే అధికం. నేతవాళ్లు ఎక్కువగా ఉండే ఈ ఊరి నుంచి ఇంటికొక ఇంజనీర్ ఉండటం విశేషం. ఇదెలా జరిగింది?ఎవరో ఒకరిద్దరు తలుచుకుంటే ఏ మార్పూ రాదని కొందరు అనుకుంటారు. కాని ఒక మనిషి తలుచుకున్నా మార్పు వస్తుంది. వచ్చింది.1991.బిహార్‌లోని గయ జిల్లాలోని పట్వాటోలి అనే చిన్న గ్రామంలో జితేంద్ర పట్వా అనే అబ్బాయికి ఐ.ఐ.టి.లో ర్యాంక్ వచ్చింది. ఆ ఊరి నుంచి ఎవరికైనా అలాంటి ర్యాంక్ రావడం ఇదే ప్రథమం. ఊరంతా సంతోషించింది. ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు. స్థిరపడ్డాడు. కాని ఊరికే ఉండలేదు. ఊరికి ఏదైనా చేయాలనుకున్నాడు.దేనికంటే ఆ ఊరు అప్పటికే తన ప్రాభవం కోల్పోయింది.పట్వాటోలిని ఒకప్పుడు అందరూ ‘మాంచెస్టర్ ఆఫ్ బిహార్’ అని పిలిచేవారు. ఆ ఊర్లో అందరూ నేతపని వారే. నేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉన్న రోజుల్లో ఆ ఊరు ఒక వెలుగు వెలిగింది. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పులు వారిని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంచేశాయి. ఈ నేపథ్యంలో పిల్లలను మంచి చదువులవైపు మళ్లిస్తే ఊరి భవిష్యత్తు మారుతుందని భావించాడు జితేంద్ర పట్వా.2013లో అతడు ఊరికి వచ్చి ‘వృక్ష సంస్థాన్’ పేరుతో ఒక ఎన్.జి.ఓ మొదలెట్టాడు. పేద నేతగాళ్ల పిల్లలకు, దిగువ మధ్యతరగతి ఇతర వర్గాల పిల్లలకు ఉచితంగా ఐ.ఐ.టి కోచింగ్ ఇవ్వడమే ఆ సంస్థ లక్ష్యం. ఒకప్పుడు ఆ ఊరిలో టెన్త్ తర్వాత చదువు మానేసేవారు. ఇప్పుడు టెన్త్ సమయం నుంచే ఐ.ఐ.టి. కోచింగ్ మొదలెడుతున్నారు.అయితే ఇది ఆషామాషీగా జరగడం లేదు. విద్యార్థుల కోసం ఈ ఊరితో పాటు చుట్టుపక్కల కొన్ని లైబ్రరీలు స్థాపించారు. అవన్నీ ఐ.ఐ.టి. చదవడానికి అవసరమయ్యే పుస్తకాలతో నిండి ఉంటాయి. వాటిని ఏ పద్ధతిలో చదువుకుంటూ వెళ్లాలో గైడ్ చేస్తారు. అలాగే ఐ.ఐ.టి. చదివి ముంబై, ఢిల్లీలో స్థిరపడ్డ జితేంద్ర మిత్రులు ఇక్కడికొచ్చి క్లాసులు చెబుతారు. కొత్తల్లో వీరు క్లాసులు చెప్పినా ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ.ఐ.టి.కి వెళ్లినవాళ్లు క్లాసులు చెబుతున్నారు.అంటే ఈ ఫ్రీ కోచింగ్ ఎన్నాళ్లైనా కొనసాగే విధంగా ఇక్కడి విద్యార్థులే నిష్ణాతులయ్యారన్న మాట. వస్త్రాలు నేసి రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్న ఈ ఊరిలో జె.ఇ.ఇ.– 2025 రిజల్ట్స్‌లో 40 మంది ర్యాంకులు సాధించారు. వీరిలో శరణ్య అనే అమ్మాయి టాపర్‌గా నిలిచి 99.64 పర్సంటేజ్ సాధించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని పల్లెల నుంచి కూడా ఎందరో ఐ.ఐ.టి. సాధించారు. వారు ఇలాంటి అడుగు వేస్తే ప్రతి పల్లెటూరి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు గొప్ప చదువులకు వెళతారు. గ్రామాల దశను మారుస్తారు.
ఫొటోలు


'సోదరా' మూవీ హీరోయిన్ ఆరతి గుప్తా (ఫొటోలు)


ప్రేమలు హీరో 'జింఖానా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


ఉప్పల్ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్.. విజయం ఎవరిదో (ఫొటోలు)


హీరోయిన్ ప్రణీత కొడుకు బారసాల వేడుక (ఫొటోలు)


ఓ ఈవెంట్లో సందడి చేసిన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)


'మన్మథుడు' అన్షు ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)


భర్త వెంకట దత్తసాయితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పీవీ సింధు (ఫోటోలు)


బోనమెత్తిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)


జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం (ఫొటోలు)


'రచ్చ' మూవీలో నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో చూశారా (ఫోటోలు)
అంతర్జాతీయం

Talking Tree: చెట్టుకే మాటలొస్తే.. వినాలని ఉందా?
దాదాపు వందేళ్లక్రితం జగదీశ్ చంద్రబోస్ అనే వృక్షశాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించారు. అవి ఎండనుంచి శక్తిని. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సయిడ్ ను తీసుకుని ఆకులతో శ్వాసించి మనకు ప్రాణాలు నిలిపే ఆమ్లజనిని విడుదల చేస్తాయని నిరూపించారు. అంతేకాకుండా మొక్కలు తమకు హానికారక రసాయనాలను చూసి ఎలర్జీ ఫీలవుతాయని.. వాటిలోనూ మనుషులకు ఉన్నట్లే నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. ఆ తరువాత కొంతమంది శాస్త్రవేత్తలు మొక్కలు తమలోతాము సంభాషించుకుంటాయని.. భావాలు కూడా షేర్ చేసుకుంటాయని పరిశోధించి వివరించారు.. అంటే కొంపదీసి మొక్కలు కూడా మనలా మాట్లాడతాయా ఏందీ అంటూ కొంతమంది అత్యుత్సాహకులు ఆనాడే కామెంట్లు చేసారు.. అయితే అవును మొక్కాలు మాట్లాడతాయి.. ఇదిగో కావాలంటే వినండి అంటూ డబ్లిన్(Dublin)లోని శాస్త్రవేత్తలు మనకు వినిపిస్తున్నారు.మాట్లాడే చెట్టు (టాకింగ్ ట్రీ ) అంటూ ట్రినిటీ కాలేజీలో రూపొందించిన ఈ సరికొత్త ప్రయోగం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అసలు చెట్లు.. వృక్షాలు మొక్కలు తీగలు మనతో మాట్లాడితే బావుణ్ణు.. అసలివి మనతో ఏం మాట్లాడతాయి అంటారు.. ఏమో.. అసలు మనతో మాట్లాడితే కదా... ఇలాంటి ఉత్సుకత మనలో చాలామందిలో ఉంటుంది. మన ఉత్సాహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ కాలేజీ ప్రాంగణంలోని ఓ చెట్టుతో సంభాషించే అవకాశాన్ని.. కలిగించారు.. దీనికి అధునాతన సాంకేతికతను జోడించారు.కాలేజీలోని ఇరవయ్యేళ్ళ వయసున్న లండన్ ప్లేన్ చెట్టుతో ముఖాముఖి సంభాషించే అవకాశం కలిగించారు. డ్రోగా5 టెక్నాలజీ సంస్థ మరియు బ్రిటన్‌లోని ఏజెన్సీ ఫర్ నేచర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును రూపొందించాయి. శాస్త్రవేత్తలు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ... కృత్రిమ మేధస్సు ఇంకా సెన్సర్లను చెట్టుకు అనుసంధానించి చెట్టుకు గొంతును ఇచ్చారు. ఈ సెన్సార్లు చెట్టు అడుగున ఉన్న మట్టి .. దానిలోని తేమ, వాతావరణ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి లోని తీవ్రత.. గాలి స్వచ్ఛత వంటివి అంచనావేసి ఆర్టిఫీషియల్ భాషా నమూనాకు అనుసంధానిస్తారు. అవి చెట్టుకు లింక్ చేస్తారు.. అప్పుడు చెట్టు ఎలా ఫీలవుతుందన్నది అట్నుంచి మళ్ళీ మాటల రూపంలో మనకు వినిపిస్తారు. అంటే చెట్టుకు నీళ్లు లేకపోతె.. వేళ్ళు దాహంతో అల్లాడే పరిస్థితి ఉంటే బహుశా.. దాహం.. దాహం.. కాసిన్ని నీళ్లు పోయండర్రా అంటుందేమో చెట్టు! ఆకలేస్తోంది.. ఎవరైనా ఓ గంపెడు ఎరువు తెచ్చి వేసి పుణ్యం కట్టుకోండర్రా అని చెట్టు మ్రాన్పడిపోతుందేమో!.అంతేకాకుండా చెట్లకు కాలజ్ఞానం ఉంటుందని విశ్వసిస్తున్న శాస్త్రవేత్తలు.. అడవుల్లో ప్రజ్వరిల్లే కార్చిచ్చు వంటివాటిని ముందుగానే మనకు తెలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెట్టుతో సంభాషన అనంతరం కొందమంది విద్యార్థులు మాట్లాడుతూ.. మనం సహచరులతో మాట్లాడడం సహజం.. కానీ ఇలా ప్రకృతితో సంభాషణ అనేది వింతగా ఉంది.. చెట్టు చెబుతున్న భావాలు వింటుంటే అద్భుతంగా ఉందని అబ్బురపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న

ట్రంప్ ఎఫెక్ట్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా తాజాగా.. తన మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ఆయా దేశాలపై ప్రతీకార చర్యలు కఠినంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా..‘బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు. రాజీ పడితే గౌరవం లభించదు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదు. స్వల్పకాలిక లాభాల కోసం వెళితే.. అది ఎప్పటికైనా మనకే హాని చేస్తుందన్న విషయాన్ని దేశాలు గుర్తుంచుకోవాలి. చైనా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యపరంగా, ఆర్థికంగా ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని ఎన్నటికీ అంగీకరించబోం. మా నుంచి ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి తాత్కాలికంగా, స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం.. పులి చర్మం కోసం దాంతోనే డీల్ చేసుకోవడం లాంటిది’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చింది.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే చైనా సహా పలు దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేశారు. అయితే, చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేదని ప్రకటించారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. ఈ మేరకు ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. BREAKING: China warns it will hit back at any country that sides with the US in ways that hurt its interests."Deals at China's expense won't be accepted. Expect countermeasures" says Min of Commerce.During Trump’s #Tariffwar - China didn’t stay silent then, won’t now either. https://t.co/3U3Vv4KTAP pic.twitter.com/jz1WrTDOGh— Amit Bhawani 🇮🇳 (@amitbhawani) April 21, 2025

‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తన భార్య, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత లాయర్‌తోనూ పంచుకున్నట్లు బయటపడింది. సమాచారం లీక్ విషయంలో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్: సమాచారం లీక్ అవ్వడానికి కారణమైన ‘సిగ్నల్’ గ్రూప్‌ను తానే క్రియేట్ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ (Mike Waltz) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గ్రూప్‌లో సమాచారం ఎలా లీక్ అయ్యిందో అర్థం కావడం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ఈలోపు.. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth) తన కుటుంబ సభ్యులతోనూ ఆ కీలక సమాచారం పంచుకున్నారనే విషయం వెలుగు చూసింది.యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన F/A-18 హార్నెట్ దాడుల షెడ్యూల్ల వివరాలను ఆయన మరో ఛాట్‌లో భార్య, తన సోదరుడు, స్నేహితులతోనూ పంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హెగ్సెత్ భార్య, ఫాక్స్ న్యూస్ ప్రొడ్యూసర్ అయిన జెన్నిఫర్.. సైన్యానికి సంబంధించిన కీలక సమావేశాలకూ హాజరయ్యారని వాల్ స్ట్రీట్ జనరల్ విడిగా మరో కథనం ఇచ్చింది.ఈ కథనాలపై ఇటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్.. అటు వైట్‌హౌజ్ వర్గాలు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ పేషీ ‘‘సిగ్నల్’’ లాంటి యాప్‌ను వాడడంపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది.అమెరికా బలగాలు కిందటి నెలలో యెమెన్(Yemen Attacks Plan Leak)పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి తెలియడం అమెరికాలో కలకలం రేపింది. సిగ్నల్‌లో గ్రూప్‌చాట్ కోసం తనను రెండు రోజుల ముందే యాడ్ చేశారని ‘అట్లాంటిక్ మ్యాగజైన్’ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ ప్రకటించారు. లక్ష్యాలు, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై గ్రూపులో చర్చించారని, ఆ ప్రకారమే దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే తన వద్ద ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి కథనాలు ఇవ్వలేదంటూ చెప్పారాయన.అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు యెమెన్‌పై చర్చించిన సిగ్నల్ యాప్ గ్రూప్చాట్లో ఈ జర్నలిస్టును యాడ్ చేశారు. దాడుల విషయాలు ఆ పాత్రికేయునికి తెలుసని శ్వేతసౌధం ధ్రువీకరించింది.మరోవైపు.. ఈ ప్రణాళిక లీకైన అంశంపై తనకెలాంటి సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్ సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ.. డెమోక్రట్లు తీవ్రంగా ఖండించారు. నూతన పాలకవర్గం అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.ఇక.. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి నిఘా అధికారులను అమెరికా సెనెట్ విచారిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌లు సెనెట్ నిఘా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే గ్రూప్‌ను తానే క్రియేట్ చేసినప్పటికీ సదరు జర్నలిస్టు ఫోన్ నెంబర్ తన వద్ద లేదని అన్నారు. ఫోన్లో లేని నెంబర్ ఎలా గ్రూప్‌లోకి వచ్చిందో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని .. విషయంలో తాము ఇలాన్ మస్క్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ వెల్లడించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై తమ దళాలు భీకర దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడ్డారు.

పుట్టి.. మళ్లీ కడుపులోకి వెళ్లి.. మళ్లీ పుట్టి
బ్రిటన్‌లో రాఫర్టీ ఇసాక్ అనే పిల్లాడు రెండు సార్లు పుట్టాడు. ఒకసారి జన్మించిన పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాక ముదిమి వయసులో చనిపోతే తర్వాత జన్మలో కదా పుట్టేది అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ పిల్లాడు ‘సాంకేతికంగా’రెండుసార్లు జన్మించాడు. తల్లికి క్యాన్సర్ కణుతులు పెరిగి క్యాన్సర్ రెండో స్టేజీకి చేరుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికి పిల్లాడు ఇంకా 20 వారాల వయసులో గర్భస్త పిండంగా గర్భాశయంలోనే ఉన్నాడు. ఆలస్యం చేస్తే పిల్లాడు బతుకుతాడేమోగాని క్యాన్సర్ ముదిరి తల్లి ప్రాణాలు వదలడం ఖాయం. ఈ పరిస్థితుల్లో అత్యంత నిష్ణాతుడైన డాక్టర్ సాల్మనీ మజిద్ తన 15 మంది వైద్య బృందంతో కలసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి అటు తల్లిని, ఇటు గర్భస్థ శిశువును సంరక్షించాడు. అరుదైన ఆపరేషన్ బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్ట్ ప్రాంతానికి చెందిన లూసీ ఇసాక్ వృత్తిరీత్యా టీచర్. 32 ఏళ్ల లూసీ గత ఏడాది గర్భందాల్చింది. గర్భిణి కావడంతో సాధారణ అ్రల్టాసౌండ్ పరీక్ష చేయించడంతో అనూహ్యంగా ఓవరీ క్యాన్సర్ బారిన పడ్డట్లు తేలింది. గర్భంతో ఉన్న కారణంగా కీహోల్ తరహాలో శస్త్రచికత్స చేయడం కుదరలేదు. అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి. దాంతో పిండాన్ని ప్రసవం తరహాలో అలాగే బయటకు తీసుకొచ్చి బయట క్షేమంగా పక్కనే పెట్టి తల్లిని శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జాన్ రాడ్‌క్లిఫ్ ఆస్పత్రిలో వైద్యుల బృందం రంగంలోకి దిగి గర్భస్త పిండాన్ని బయటకు తీశారు. తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు, కణజాలం జోలికి వెళ్లలేదు. వెచ్చగా పొత్తికడుపులో ఉండాల్సిన పిండం బయటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం. అందుకే వెచ్చని ‘సలీన్’బ్యాగ్‌లో పెట్టారు. దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి తల్లి ఓవరీ క్యాన్సర్ కణాలను వైద్యులు తొలగించారు. బ్యాగులో పిండం ఆరోగ్యపరిస్థితిని ఇద్దరు వైద్యుల బృందం అనుక్షణం గమనించింది. ప్రతి 20 నిమిషాలకొకసారి బ్యాగును మార్చారు. ఈలోపు ఆపరేషన్‌ను పూర్తిచేసి గర్భాశయాన్ని మళ్లీ తల్లి పొత్తికడుపులో పెట్టి కుట్లేశారు. ఇలా ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఈ ఏడాది జనవరిలో నిండు గర్భిణిగా మళ్లీ ఆస్పత్రికి వచ్చిన లూసీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడు పుట్టినప్పుడు 2.86 కేజీల బరువున్నాడు. ఇలా రెండు సార్లు పుట్టిన పిల్లాడిగా రాఫర్టీ అరుదైన ఘనత సాధించాడు. ఆపరేషన్ చేసిన వైద్యుడు సాల్మనీ మజిద్‌ను పిల్లాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ‘‘మూడేళ్ల క్రితం నాకు మూత్రపిండ మారి్పడి శస్త్రచికిత్స జరిగింది. అలా నాకు అది పునర్జన్మ. క్యాన్సర్ బారిన పడి కూడా కోలుకుని నా భార్య లూసీ పునర్జన్మ ఎత్తింది. ప్రసవానికి ముందే పుట్టి మళ్లీ తల్లికడుపులోకి వెళ్లి మరోసారి పుట్టి నా కుమారుడు కూడా పునర్జన్మ ఎత్తాడు’’అని పిల్లాడి తండ్రి ఆడమ్ ఆనందంగా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ వ్యాఖ్యలకు కపిల్ సిబాల్ కౌంటర్!
న్యూఢిల్లీ: పార్లమెంటే సుప్రీం అంటూ ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎంపీ కపిల్ సిబాల్ పరోక్షంగా కౌంటరిచ్చారు. ఇక్కడ పార్లమెంట్ సుప్రిమా.. లేక కార్యనిర్వాహక శాఖ సుప్రిమా అనేది ప్రశ్నే కాదని, కేవలం రాజ్యాంగం మాత్రమే ఇక్కడ సుప్రీం అంటూ సిబాల్ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కపిల్ సిబాల్ స్పందించారు. భారతదేశంలో చట్టాన్ని ఎలా అర్ధం చేసుకుంటందనే దానికి కపిల్ సిబాల్ వివరణ ఇచ్చారు. ‘ పార్లమెంట్, కార్యనిర్వహాక శాఖ సుప్రీం కాదు.. రాజ్యాంగమే మన దేశంలో సుప్రీం. ఇప్పటివరకూ దేశం చట్టాన్ని ఇలానే అర్ధం చేసుకుంది’ అని స్సష్టం చేశారు.The law :Neither Parliament Nor the Executive is supreme The Constitution is supreme The provisions of the Constitution are interpreted by the Supreme CourtThat’s how this country has understood the law so far !— Kapil Sibal (@KapilSibal) April 22, 2025కాగా, రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. . రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన ధన్ ఖడ్.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం అని పేర్కొన్నారు.

‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
కోల్ కతా: పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఈనెల తొలి వారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వేల మంది రోడ్డున పడ్డారు. ఈ తీర్పును ఇప్పటికే ఖండించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మరోసారి ఉద్యోగాలు కోల్పోయిన వారికి భరోసా ఇచ్చారు. ‘ మీ ఉద్యోగాలకు, మీ జీతాలకు నేను గ్యారంటీ’ అంటూ మద్దతుగా నిలిచారు. నిరసన చేపట్టిన టీచర్లను బుజ్జగించే యత్నం చేశారు. మిడ్నాపోర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘ ఎవరు నిజాయితీ పరులు, ఎవరు కాదు అనే విషయంలో మీకు ఆందోళన వద్దు. ఉద్యోగం ఉందా.. జీతాలు సరైన సమయానికి పడుతున్నాయా లేదా అనే విషయం గురించే ఆలోచించండి. టీచర్లు నియామాకాల్లో పారదర్శకత సంబంధించి జాబితాను ప్రభుత్వం. కోర్టులు పరిశీలిస్తాయి,. మీ ఉద్యోగాలకు నేను గ్యారంటీ. తిరిగి స్కూళ్లకు వెళ్లి మీ విధులు నిర్వర్తించండి. ఈ విషయం గురించి గత రాత్రి నుంచి చాలాసార్లే మాట్లాడాను. నేను మీతో ఉన్నా’ అని మమతా బెనర్జీ తెలిపారు. ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారి తరఫున రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని, అప్పటివరకూ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని మమత విజ్ఞప్తి చేశారు. కాగా, వెస్ట్ బెంగాల్లో 2016కు సంబంధించి ఉపాధ్యాయ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం ఆదేశించింది.నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న

UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ -2024 ఫలితాలు విడుదల
ఢిల్లీ: యూపీఏఎస్సీ-2024 సివిల్స్ ఫలితాలు (UPSC CSE Final Result 2024) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 1009మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్‌లో శక్తి దుబేకు మొదటి ర్యాంకు రాగా సాయి శివానీ 11వ ర్యాంక్, బన్నా వెంకటేష్‌కు 15వ ర్యాంక్, శ్రావణ్ కుమార్ రెడ్డిలు 63వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల స్థానం కోసం రాసే యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) పరీక్ష ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఏఎస్సీ అధికార వెబ్సైట్లో నేరుగో చూసుకోవచ్చు.👉యూపీఏఎస్సీ-2024 సివిల్స్ ఫలితాల పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండిఇక ఈ పరీక్షను మొత్తం 1,056 ఖాళీలను భర్తీ చేసేందుకు యూపీఏస్సీ గతేడాది నోటిఫికేషన్ విడదల చేసింది. ఫిబ్రవరి 14, 2024న విడుదల చేయగా, జూన్ 16, 2024న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది.తరువాత, సెప్టెంబర్‌లో 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షను నిర్వహించగా, ఇంటర్వ్యూలను ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు నిర్వహించిన యూపీఏఎస్సీ ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది.యూపీఏఎస్సీ-2024 సివిల్స్ ఫలితాల వివరాలుసివిల్స్కు ఎంపికైన అభ్యర్థులు- 1009జనరల్ కోటలో ఎంపికైన అభ్యర్థులు -335ఈడబ్ల్యూఎస్ కోటలో సివిల్స్ ఎంపికైన అభ్యర్థులు- 109సివిల్స్ ఎంపికైన ఓబిసి అభ్యర్థులు- 318ఎస్సీలు -160, ఎస్టీలు- 87
No Authority Above Parliament Says Jagdeep Dhankhar
న్యూఢిల్లీ: దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మరోసారి న్యాయ వ్యవస్థను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలను మంచి మరేయితర వ్యవస్థ సుప్రీం కాబోదంటూ ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో చెప్పారాయన. ఈ క్రమంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు విమర్శలు రావడంపైనా ఆయన స్పందించారు.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

నీళ్లు తెమ్మంటే తీసుకురావా రా..
హన్మకొండ చౌరస్తా : ‘నీళ్లు తెమ్మంటే తీసుకురావా రా.. నాకే ఎదురు సమాధానం చెబుతావా’ అంటూ జూనియర్ పై ఓ సీనియర్ విద్యార్థి దాడికి పాల్ప డ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి హనుమకొండలోని ఇందిరానగర్ ఎస్సీ హాస్టల్లో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన రాజబాబు, పవన్‌కల్యాణ్, రణధీర్, మధుకర్ హనుమకొండ 8వ డివిజన్లోని ఇందిరానగర్‌లో గల ఎస్సీ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. సుమారు పదిహేను రోజుల క్రితం ఇదే హాస్టల్లో ఉంటూ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న రంజిత్ వాటర్ బాటిల్లోని నీరును రాజబాబు తాగాడు. విషయం తెలుసుకున్న రంజిత్ ‘నా వాటర్ బాటిల్లోని నీరు తాగి మళ్లీ తీసుకురాకుండా వెళ్తావా’ అంటూ గద్దించాడు. దీంతో భయపడిన జూనియర్ విద్యార్థి రాజబాబు అన్న రూమ్‌లో ఉంటే తాగి వెళ్లిపోయానన్న నీ బాటిల్ అని తెలియదని సమాధానం ఇచ్చాడు. నీళ్లు తీసుకురాకుండా నాకే ఎదురు సమాధానం చెబుతావా, నీ సంగతి చెబుతా అంటూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి హాస్టల్లో రాజబాబు ఎదురుపడినా ప్రతీసారి దూషణకు దిగేవాడు. రాజబాబు అతడి మిత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయినా రెచ్చగొట్టేలా వ్యవహరించేవాడు. ఆదివారం రాత్రి రంజిత్ హాస్టల్‌కు సంబంధం లేని కొందరి వ్యక్తులను తీసుకొచ్చి రాజబాబుపై దాడికి దిగాడు. అడ్డుకున్న అతడి మిత్రులు పవన్‌కల్యాన్, రణధీర్, మధుకర్‌ను సైతం చితకబాదారు. ఈ ఘటనలో రాజబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత విద్యార్థులు తెలిపారు. ఈ విషయం పై హాస్టల్ వార్డెన్ మోతీలాల్‌ను వివరణ కోరగా గాయపడిన విద్యార్థికి చికిత్స చేయించామని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.

ఐదేళ్లుగా అదే పని.. మహిళలు స్నానం చేస్తుండగా..
వెంగళరావునగర్(హైదరాబాద్): మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని మధురానగర్ అసోసియేషన్ నేతలు పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్‌కాలనీ కమ్యూనిటీహాల్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వారి కుమార్తె సమీపంలోని చీరల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లడానికి స్నానం చేస్తూ సబ్బు కోసం వెతికింది. అయితే ఆమెకు అక్కడ మొబైల్ ఫోన్ చేతిని తాకింది. భయపడి దుస్తులు ధరించి బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్లో ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వర్తించే వై.మరియాలి కుమార్ స్నానం గది కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయగా అతడు వచ్చి మరియాలి కుమార్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఫోన్‌తో సహా అతను పారిపోయాడు. విషయాన్ని బాధితురాలు సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి తదితరులకు తెలియజేసింది. సంఘం నేతలు పోలీసులకు ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్‌ను పట్టుకుని విషయాన్ని సేకరించారు. ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా అంగీకరించాడు. తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా తెలియజేశాడు. అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కేసు నమోదు చేయడం లేదు
కర్నూలు(సెంట్రల్): తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నాలుగు నెలలుగా తిరుగుతున్నా కర్నూలు రూరల్ సీఐ, ఎస్ఐలు పట్టించుకోవడం లేదని ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబం సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగింది. తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డీఐజీ, ఎస్పీలను కోరినా స్పందించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆందోళనకు దిగినట్లు ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఏ.శ్యామ్ విద్యాసాగర్ కోడలు సి.ఉమాదేవి, భర్త అడ్డాకుల మహేష్ వాపోయారు. తమకు న్యాయం చేకపోతే ఆత్మహత్యే గతి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కర్నూలు నగరంలోని రాజ్ ఫంక్షన్ హాలు సమీపంలో శ్రీరామ రెసిడెన్షీలో మామ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఏ.శ్యామ్ విద్యాసాగర్‌తో కలిసి ఉంటున్నామన్నారు. గత జనవరి 22న సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు(వాసు), ఎస్పీఎఫ్ పోలీసు మల్లికార్జున, ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మన్న ఇంటి వద్దకు వచ్చి తన మామను తీసుకెళ్లి మరో పదిమందితో కలిసి దాడి చేశారన్నారు. విషయం తెలిసి తాము అక్కడికి వెళ్లగా తమపై కూడా దాడి చేశారన్నారు. కత్తి మొన తనకు కుచ్చుకొని తీవ్ర రక్తగాయం కాగా తప్పించుకొని ఇంటికి వచ్చేశానన్నారు. అయినా వదలకుండా వారు తమ ఇంటికి వచ్చి తనతోపాటు తన భర్త అడ్డాకుల మహేస్, తన బావలు హరీష్, గిరీష్‌లపై దాడి చేసి గాయపరిచారన్నారు. తామంతా పెద్దాసుపత్రిలో చికిత్స చేయించుకుంటుండగా కర్నూలు రూరల్ స్టేషన్ నుంచి సీఐ, ఎస్ఐ పిలుపుస్తున్నారంటూ కానిస్టేబుల్ చంద్ర ఫోన్ చేయగా అక్కడికి వెళ్లామన్నారు. స్టేషన్లో సీఐ, ఎస్ఐ సమక్షంలోనే మరోసారి తమపై పోలీసులు దాడి చేశారన్నారు. ఫిర్యాదు తీసుకోకుండా సీఐ చింపివేసి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలని పంపించేశారన్నారు. ఇదే విషయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ, ఎస్పీకి విన్నవించినా పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగినట్లు ఆమె వివరించారు.

ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు(Om Prakash Case) దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. గూగుల్‌లో వెతికి మరీ భర్త ఓం ప్రకాశ్‌ను పల్లవి(Wife Pallavi) హతమార్చినట్లు వెల్లడైంది. అంతేకాదు తన భర్త తనపై విష ప్రయోగం చేశాడని.. ఆయన పెట్టే హింస భరించలేకే హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తున్నాయి. హత్యకు ఐదు రోజుల ముందు నుంచి పల్లవి గూగుల్‌లో విపరీతంగా వెతుకుతూ వస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడోనని వెతికిందామె. చివరకు మెడ దగ్గరి నరాలను దెబ్బ తీస్తే చనిపోతారని నిర్ధారించుకుని హత్య చేసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భర్త, కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను పల్లవి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే..ఓం ప్రకాశ్ కొడుకు కార్తీక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె.. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకుంటూ వస్తోంది. ఈలోపు ఆస్తి తగదాలు కూడా మొదలు కాగా.. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్ గ్రూపుల్లో కొన్నిరోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం ఓం ప్రకాశ్ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం కొట్టింది. ఆపై కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా పొడిచి హత్య చేసింది. భర్త ప్రాణం పోతుండగానే పోలీసులకు ఆమె సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూసే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా.. ఆమె రిలాక్స్‌గా ఓ కుర్చీలో కూర్చుని ఉంది. హత్య అనంతరం.. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్‌లో సందేశం ఉంచిన ఆమె.. ఓ మాజీ అధికారికి తానొక మృగాన్ని చంపినట్లు సందేశం కూడా పంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ హత్య తన సోదరి కృతి పాత్ర కూడా ఉండొచ్చని ఓం ప్రకాశ్ తనయుడు కార్తీక్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో పల్లవిని ప్రాథమిక నిందితురాలిగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.
వీడియోలు


ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో


వరద రాజులు రెడ్డి సహాయం చేయడమంటే పాముకు పాలు పోసినట్లే


శోకసంద్రంలో జమ్మూ.. సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై కాల్పులు


'ఛీ'ఎం చంద్రబాబు.. నికృష్ట పాలన


రాజ్ కేసిరెడ్డికి 14రోజుల రిమాండ్


సౌదీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ


ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు


మచిలీపట్నంలో మంత్రి కనుసన్నల్లో మట్టి దందా.. ఏకిపారేసిన పేర్ని నాని


జమ్మూకశ్మీర్ లో తరచూ ఉగ్రదాడులు


సూపర్ సిక్స్ హామీలు గాలికి.. అవినీతిలో పైపైకి