లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను సీబీఐ శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. ఉన్నావ్‌లో 16 ఏళ్ల యువతిపై లైంగిక దాడి కేసులో ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సెంగార్‌పై కిడ్నాపింగ్, లైంగికదాడి, నేరపూరిత కుట్ర, పోస్కో చట్టాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు సెంగార్‌ను అరెస్ట్ చేయకపోవడంపై అలహాబాద్ హైకోర్టు సైతం యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.