: షిర్డీ ఎక్స్ప్రెస్ రైలుకు విజయవాడలో శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. రైలు అజిత్సింగ్ నగర్లో ఉండగా ఇంజన్ నుంచి బోగీలు ఒక్కసారిగా వేరైపోయాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు గాభరా పడ్డారు. ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.