ఎంపీ నందిగం సురేష్‌పై పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ దాడి చేయించిందని.. దాడికి చంద్రబాబునాయుడు, లోకేష్ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తుంటే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.