‘మహాబలిపురం బీచ్‌లో అరగంట పాటు తిరిగాను. అక్కడ నేను సేకరించిన నా కలెక్షన్‌ను హోటల్ సిబ్బందిలో భాగమైన జయరాజ్‌కు అప్పగించాను. మన బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కు లక్షల్లో లైకులు వస్తున్నాయి. మీరు గ్రేట్ సార్.. కేవలం మాటలకే పరిమితం కారు.. చేతల్లో చూపిస్తారు అంటూ.. నెటిజన్లు ఆయనను ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు.