దేశవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల సీఎస్‌ఐ చర్చీలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, జార్జిరెడ్డి, ఈసీ గంగిరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ కుటుంబం తరఫున ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.