వైజాగ్‌ను మెట్రో సిటీ, బొటానికల్ సిటీ చేస్తానని గొప్పలు చెప్పిన బాబు.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టేశారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కంచరపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 24వేల మంది ఉద్యోగులు ఉంటే.. ప్రస్తుతం నాలుగు వేల మందే ఉన్నారని తెలిపారు. కొత్త ఉద్యోగాలు వస్తాయనకుంటే.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు. విశాఖలో భూములను చంద్రబాబు తన బినామీలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. భాగస్వామ్య సదస్సుతో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు కనీసం ఒక్కటి కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తీర ప్రాంత రహదారి ఏర్పాటు చేస్తానన్నారు అది కూడా చేయలేకపోయారని దుయ్యబట్టారు. పూర్తి ప్రసంగం షర్మిల మాటల్లోనే..