గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేక హోదాను చేర్చడం సంతోషకరమని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు చంద్రబాబు తమ దారిలోకి వచ్చినందుకు అభినందనలు అని అన్నారు. హోదా కంటే ప్యాకేజీనే ముద్దని ఇన్నాళ్లు ప్రజలను మభ్యపెట్టినందుకు ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ధర్మాన డిమాండ్ చేశారు.