Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pm Modi Inaugurates India First Vertical Lift Sea Bridge In Tamil Nadu1
దేశంలో తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సముద్ర వంతెన.. ప్రారంభించిన మోదీ

సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్‌ రైల్వేసీ బ్రిడ్జిని ప్రారంభించారు. సముద్రంలో బ్రిడ్జి కింద నౌకలు రాకపోకలు సాగేలా ఈ వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే బ్రిడ్జీ నిర్మాణం జరిగింది. సముద్రమట్టానికి 22 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జీ పొడవు 2.2 కిలోమీటర్లు. దీని వ్యయం రూ. 535 కోట్లు. 2020లో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది.‌Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge - India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy— ANI (@ANI) April 6, 2025దేశంలో మరో ఇంజనీరింగ్‌ అద్భుతం ప్రారంభమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వ ర్టీకల్‌ లిఫ్ట్‌(Vertical Lift) (నిలువునా పైకి లేచే) వంతెనను అందుబాటులోకి వచ్చింది.శ్రీరామనవమి పర్వదినాన ప్రధాని మోదీ తొలి వర్టీకల్‌ లిఫ్ట్‌ను ప్రారంభించారు.భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు.. 1914లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం తమిళనాడులోని మండపం (సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం) నుంచి పంబన్‌ (రామేశ్వరం దీవి ప్రారంభ చోటు) వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్‌లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్‌ క్రాసింగ్‌ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి.దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్‌ లిఫ్ట్‌కు బదులుగా వ ర్టీకల్‌ లిఫ్ట్‌తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్‌ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మనదేశ చిట్టచివరి భూభాగం ధనుషో్కడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 150 కి.మీ. అదనపు దూరాభారం అవుతుంది. వంతెన ప్రత్యేకతలు..వంతెన నిర్మాణ వ్యయం రూ.540 కోట్లు. పొడవు 2.10 కి.మీ.పిల్లర్లతో కూడిన పైల్స్‌ సంఖ్య 333సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు. వీటికోసం వాడిన స్టెయిన్‌లెస్‌ స్టీలు 5,772 మెట్రిక్‌ టన్నులు (రీయిన్‌ఫోర్స్‌మెంట్‌), స్ట్రక్చరల్‌ స్టీల్‌ 4,500 మెట్రిక్‌ టన్నులు.సిమెంటు వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్‌ టన్నులు. స్పెయిన్‌ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్స సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్‌ చేయించారు. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ దీనిని నిర్మించింది. ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్‌ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్‌తో కూడిన రంగు డబుల్‌ కోట్‌ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తప్పు పట్టదు.పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కాల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది. కానీ, రైల్వే సేఫ్టీ కమిషనర్‌ 74 కి.మీ. వేగానికి అనుమతించారు. పాత వంతెనపై గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే. నిర్మాణ పనులు 2019లో మొదలయ్యా­యి. కొవిడ్‌ వల్ల కొంతకాలం ఆలస్యమైనా, మొత్తంగా 2 సంవత్సరాల్లోనే పూర్తిచేశారు. 2022 డిసెంబర్‌లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లిఫ్టు టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్‌ దిమ్మెలు రెండు వైపులా కౌంటర్‌ వెయిట్స్‌గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలుకాగానే కౌంటర్‌ వెయిట్స్‌ మరోవైపు దిగువకు జారటం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5 శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది. లిఫ్ట్‌ టవర్‌ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌) సెంటర్‌ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్‌లో లోపాలను చూపుతుంది. రైల్వేలో సీనియర్‌ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన నడుకూరు వెంకట చక్రధర్‌ ఈ వంతెన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్‌చార్జిగా ఉన్నారు. 1964 డిసెంబర్‌ 22న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు, బలమైన గాలులతో పంబన్‌ వంతెన ధ్వంస­మైంది. రాత్రి 11.50 సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్‌ రైలు కొట్టుకుపోయి అందులోని 190 మంది ప్రయాణికులు మృతి చెందారు. కానీ, వంతెనలోని షెర్జర్‌ రోలింగ్‌ లిఫ్ట్‌ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్‌గా పిలుచుకుంటున్న ఈ. శ్రీధరన్‌ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరించారు.Delighted to be in Rameswaram on the very special day of Ram Navami. Speaking at the launch of development works aimed at strengthening connectivity and improving 'Ease of Living' for the people of Tamil Nadu. https://t.co/pWgStNEhYD— Narendra Modi (@narendramodi) April 6, 2025

Ex DYCM Amjad Basha Brother Ahmed Basha Arrest2
కూటమి కుట్ర.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్‌

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌ చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసిన చంద్రబాబు సర్కార్‌.. అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అరెస్ట్‌కు ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్‌ చేసింది. అహ్మద్‌ బాషా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అయితే, అహ్మద్‌ బాషా గతంలో రాజీ పడిన ఓ కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇక, సదరు కేసులో ఇరు వర్గాలు ఇప్పటికే రాజీపడటం గమనార్హం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా అహ్మద్‌ను ఇప్పుడు అరెస్ట్‌ చేసింది.

Hcu Land Row: Ktr Open Letter To The People Of Telangana3
హెచ్‌సీయూ వివాదం.. కేటీఆర్‌ బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ రక్షణకు చేతులు కలపాలంటూ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. హెచ్‌సీయూ భూముల వివాదం నేపథ్యంలో రేవంత్‌ సర్కార్‌ తీరును లేఖలో ఎండగట్టారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడింది. 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం అంటూ కేటీఆర్‌ పిలుపునిచ్చారు.‘‘ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం పర్యావరణం నాశనం చేసే ప్రణాళికలు కొనసాగిస్తోంది. విద్యార్థుల నిరసనకు సలాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారు. విద్యార్థులపై అపవాదులు, యూనివర్సిటీని తరలించే బెదిరింపులు ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనం’’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసం. అడవిని కాపాడే బదులు భూమి ఆక్రమణకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నిరసనలు కొనసాగితే హెచ్‌సీయూని "ఫోర్త్ సిటీ"కి తరలిస్తామని హెచ్చరిక తప్పు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు మద్దతుగా నిలవాలి. కంచ గచ్చిబౌలి, యూనివర్సిటీని కాపాడుతామని పార్టీ నుంచి హామీ హామీ ఇస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి, భూమి విక్రయాన్ని రద్దు చేయాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Kuno Park Cheetah Responds Drinks Water Offered4
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్‌!

గాంధీనగర్‌: ఎండా కాలంలో దాహంతో ఉన్న చీతాలకు నీరు అందించిన కారణంగా ఓ డ్రైవర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. అదేంటీ.. నీరు పోసినందుకు ఎందుకు ఉద్యోగం పోయిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్‌ అక్కడే ఉంది.వివరాల ప్రకారం.. కూనో పార్కులో చీతా జ్వాల దాని పిల్లలు ఇటీవల ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల (చిరుత) దాని నాలుగు పిల్లలను గమనించిన అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్.. వాటికి నీరు అందించాడు. ఓ క్యానులో నీటిని తీసుకొచ్చి.. పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటు పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.A heartwarming video from Madhya Pradesh's Kuno National Park shows a female cheetah and her four cubs being offered water by a member of the monitoring team. pic.twitter.com/SN9Q4e8vxq— NDTV (@ndtv) April 6, 2025ఈ వీడియో అటవీ శాఖ అధికారులు దృష్టికి చేరింది. ఆ డ్రైవర్‌పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో..‘చీతాలకు నీరు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని తెలుసుకుంటున్నారు. కానీ, ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని వారంతా గ్రహించారు. అందుకే, వన్యప్రాణులతో (చీతాలతో) స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. ఇలాంటి చర్యలు వాటి మనుగడకే ప్రమాదం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.Historic moment in Kuno National Park! ✨ Cheetah Jwala and her 4 cubs spotted thriving in the wild for the first time! A true milestone for India’s cheetah conservation efforts. Witness the legacy of speed and survival unfold in Kuno!#Cheetah #KunoCheetahSafari #FlyingCatSafari pic.twitter.com/Bs5ThPnqhI— Flying Cat Safari (@KunoSafari) February 28, 2025మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు డ్రైవర్‌ చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని.. మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్స్‌ చేశారు. @KunoNationalPrk female #cheetah #Jwala along with her cubs hunted 6 goats in Umrikalan village in Agra area of Vijaypur - villagers made a video, tracking team of Kuno National Park was also on the spot.. @Ajaydubey9#cheetah #kuno #wildlifephotography #viralvideo pic.twitter.com/RgJHqJFXgS— UTTAM SINGH (@R_UTTAMSINGH) April 4, 2025

IPL 2025: SRH To Take On GT In Home Ground Today5
SRH Vs GT: ప్రతి బంతికి సిక్సర్‌ కొట్టాలంటే కాదు.. బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలి..!

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (ఏప్రిల్‌ 6) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఈ ​మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ హోం గ్రౌండ్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీకి సిద్దమయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఓడి ఆతర్వాత వరుసగా రెండు విజయాలు సాధించిన గుజరాత్‌ మాంచి జోష్‌లో ఉండగా.. తొలి మ్యాచ్‌లో మాత్రమే గెలిచి ఆ తర్వాత హ్యాట్రిక్‌ పరాజయాలు మూటగట్టుకున్న సన్‌రైజర్స్‌ ఢీలాగా కనిపిస్తుంది.ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ వై నాట్‌ 300 అన్న విషయాన్ని పక్కన పెట్టి గెలుపు కోసం ఆడాలి. కేవలం బ్యాటింగ్‌నే నమ్ముకోకుండా బౌలర్లను కూడా సరిగ్గా వినియోగించుకోవాలి. జట్టులో షమీ, కమిన్స్‌ లాంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లు ఉన్నా సన్‌రైజర్స్‌ ఎందుకో బౌలింగ్‌పై పెద్దగా ఫోకస్‌ పెట్టడం లేదు. ప్రతి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ మెరుపులే ఉండాలంటే అది సాధ్యపడదు. సన్‌రైజర్స్‌ ఇకనైనా కాస్త తగ్గి తక్కువ స్కోర్లు చేసినా డిఫెండ్‌ చేసుకునేందుకు ప్రయత్నించాలి.విధ్వంసకర వీరులుగా చెప్పుకునే ట్రవిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ ప్రతి బంతినీ సిక్సర్‌ కొట్టాలన్న ఆలోచనలు మానుకొని బేసిక్స్‌మై దృష్టి పెట్టాలి. ఈ ముగ్గురు భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో తొందరగా ఔటవుతుండటంతో ఆతర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో మిడిలార్డర్‌ బ్యాటర్లు ఎంత జాగ్రత్తగా ఆడినా సత్ఫలితాలు రావడం లేదు. నితీశ్‌ రెడ్డి కూడా ప్రతి బంతిని సిక్సర్‌గా మలచాలన్న దృక్పథాన్ని మానుకోవాలి.క్లాసెన్‌ లేటుగా బరిలోకి దిగుతుండటంతో ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అనికేత్‌ వర్మ మిడిలార్డర్‌లో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. కమిందు మెండిస్‌ బౌలర్‌గా పనికొచ్చినా అతన్ని నిఖార్సైన టీ20 ఆల్‌రౌండర్‌ అనలేము. కమిన్స్‌ బౌలర్‌గా ప్రతి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. షమీ గత మ్యాచ్‌లో (కేకేఆర్‌) పర్వాలేదనిపించినా ఆ ముందు మ్యాచ్‌ల్లో ప్రభావం​ చూపలేకపోయాడు. హర్షల్‌ పటేల్‌, సిమర్‌జీత్‌ సింగ్‌ అంతంతమాత్రంగా ఉన్నారు. టీ20 స్పెషలిస్ట్‌ ఆడమ్‌ జంపా తొలి రెండు మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పక్కన పెట్టారు.ఆల్‌రౌండర్ల ట్యాగ్‌తో ఉండే ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ రెడ్డి, అభిషేక్‌ శర్మకు అస్సలు బౌలింగే ఇవ్వడం లేదు. లెగ్‌ స్పిన్నర్‌ జీషన్‌ అన్సారీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన వియాన్‌ ముల్దర్‌ అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నేటి మ్యాచ్‌లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోతే సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు. బ్యాటింగ్‌ శైలిని మార్చుకోవాలని టాప్‌-3 బ్యాటర్లకు చెప్పాలి. ప్రతిసారి బ్యాటర్లతోనే నెట్టుకురావాలంటే కష్టమని బౌలర్లకు గట్టి మెసేజ్‌ పంపాలి. మొత్తంగా వై నాట్‌ 300 అనే అలోచనను తీసి వేయాలి.

Jr Ntr Lean Look Latest And Reason Behind This6
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా

చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ (Ntr) ఓ సినిమా ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన మ్యాడ్ స్క‍్వేర్ (Mad Square) సక్సెస్ మీట్ కి హాజరయ్యాడు. చాలా హుషారుగా కనిపించాడు. తన కొత్త సినిమా సంగతుల్ని కూడా బయటపెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ బక్కగా మారిపోవడం మాత్రం అభిమానులకు షాకిచ్చింది. ఇంతకీ ఏంటీ కారణం?'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్న తారక్.. 'దేవర'తో (Devara Movie) బ్లాక్ బస్టర్ కొట్టాలనుకున్నాడు. కానీ ఓ మాదిరి వసూళ్లే వచ్చాయి. మొన్నీమధ్య జపాన్ లోనూ ఈ మూవీ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)ఈ మూవీ షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కాకపోతే ఎన్టీఆర్ ఇంకా జాయిన్ కాలేదు. త్వరలో సెట్ లోకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాలో పావుగంట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని, దీనికోసమే సన్నగా మారిపోయాడని తెలుస్తోంది. దాని షూటింగ్ పూర్తయిన తర్వాత యధావిధిగా తన పాత లుక్ లోకి వచ్చేస్తాడని అంటున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. తారక్ సినిమాతో ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అనుకుంటున్నారు. మరి చెప్పిన టైంకి రిలీజ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇది పూర్తయిన తర్వాత తారక్.. దేవర 2 చేస్తాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' గ్లింప్స్‌ వచ్చేసింది.. సిక్సర్‌ కొట్టిన రామ్‌ చరణ్‌)

Sakshi Editorial On TDP Chandrababu Govt By Vardhelli Murali7
వారి దయ, జనం ప్రాప్తం... అదే పీ–ఫోర్‌!

‘ఏరు దాటకముందు ఓడ మల్లయ్య... దాటిన తర్వాత బోడి మల్లయ్య!’ – ఇది పాత సామెత. ఎన్నికలకు ముందు ‘సూపర్‌ సిక్స్‌’... ఎన్నికలయ్యాక ‘పీ–ఫోర్‌’ – ఇది కొత్త సామెత. ఎన్ని కల్లో గెలవడానికి చంద్రబాబు ఎంత అలవికాని హామీలిస్తారో గెలిచిన తర్వాత వాటిని ఎలా అటకెక్కిస్తారో తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ బోడి మల్లయ్య వైఖరిపై వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, రోశయ్య వంటి పెద్దలు వేసిన సెటైర్ల వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఐదొందలకు పైగా వాగ్దానాలు చేశారు. అన్నిట్లోకి ప్రధానమైన హామీ... రైతులకు సంపూర్ణ రుణ మాఫీ. ఎన్నికల నాటికే 87 వేల కోట్లకు పైగా ఉన్న రైతు రుణాల సంపూర్ణ మాఫీ రాష్ట్ర వనరులతో సాధ్యం కాదని, ఆ హామీని ఇవ్వడానికి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరించారు. కానీ, ఏరు దాటడమే ముఖ్య మని భావించే చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆ హామీని అమలు చేస్తానని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేశారన్నది రాష్ట్ర రైతాంగానికి తెలుసు.ఇప్పుడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాల సాక్షిగా దేశ ప్రజలందరికీ చంద్రబాబు రైతు రుణమాఫీ బండారం బట్టబయలైంది. సరిగ్గా వారం రోజుల కిందనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సమర్పించింది. 2018 జూలై నుంచి 2019 జూన్‌ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ రైతుల సగటు రుణభారం రూ.2,45,554గా ఉన్నట్టు ఈ సమాధానం వెల్లడించింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) రూపొందించిన జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రైతుల రుణభారం అధికంగా ఉన్నది. ఇది చంద్రబాబు గద్దె దిగేనాటికి రైతాంగ పరిస్థితి. సంపూర్ణ రుణమాఫీ వాగ్దానం ఒక ప్రహసనం అని చెప్పేందుకు ఇంతకంటే పెద్ద రుజువు ఏముంటుంది?జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత, అంటే 2021 జూలై – 2022 జూన్‌ మధ్యకాలంలోని ఏపీ రైతుల సగటు రుణభారం 66,205 రూపాయలకు తగ్గిపోయింది. ఇది కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తయారుచేసిన లెక్కే. రాజ్యసభలో కేంద్రం వెల్లడించినదే. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయడంతోపాటు, క్రమం తప్పకుండా బాకీ తీర్చే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయడం వల్ల కలిగిన సత్ఫలితమిది. చంద్రబాబు బూటకపు హామీల అమలు తీరుకూ, జగన్‌ సంక్షేమ పథకాల అమలు తీరుకూ మధ్యన ఉండే తేడాను చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కూటమి చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనది ‘సూపర్‌ సిక్స్‌’. పది నెలల తర్వాత కూడా ఈ ఆరు పథకాల ప్రారంభం ఆచరణకు నోచుకోలేదు. ఒక్క దీపం పథకంలో భాగంగా ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు బదులు ఒక సిలిండర్‌ను అందజేసి మమ అనిపించుకున్నారు. ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేయాలంటే ఈ సంవత్సరానికి అవసరమైన 70 వేల కోట్ల రూపాయలకు బదులు బడ్జెట్‌లో 17 వేల కోట్లే కేటాయించడాన్ని బట్టి రెండో సంవత్సరం కూడా ప్రధాన హామీ అమలు లేనట్టేనని భావించవలసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మరిపించడానికి ‘పీ–ఫోర్‌’ అనే దానధర్మాల కార్యక్ర మాన్ని చంద్రబాబు ముందుకు తోస్తున్నారు. ఇక ‘సూపర్‌ సిక్స్‌’ జోలికి వెళ్లరని చెప్పడానికి ఇటీవల చంద్రబాబు చేసిన వింత వ్యాఖ్యానం కూడా ఒక రుజువని చెప్పవచ్చు. జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ కార్య క్రమాలన్నీ ఒక ఎత్తు – తాను పెంచి అమలుచేస్తున్న పెన్షన్‌ కార్యక్రమం ఒక ఎత్తని ఒక విచిత్రమైన పోలికను ఆయన తీసుకొచ్చారు. ఈ రెండూ సమానమే కనుక ఇక అదనంగా చేసేదేమీ లేదనేది ఆయన మనోగతం కావచ్చు. కానీ ఈ పోలిక నిజమేనా? ‘సూపర్‌ సిక్స్‌’తో సహా మేనిఫెస్టోలోని మొత్తం హామీల్లో వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంపు ఒక్కదాన్నే చంద్ర బాబు ప్రభుత్వం అమలు చేస్తున్నది. అది కూడా సంపూర్ణంగా కాదు! ఎస్సీ, బీసీలకు యాభయ్యేళ్ల నుంచే వృద్ధాప్య పెన్షన్‌ను అమలు చేస్తానని కూటమి మేనిఫెస్టో చేసిన హామీని విస్మరించారు. ఆ రకంగా ఈ పది నెలల్లో ఎగవేసిన సొమ్మెంతో అంచనా వేయవలసి ఉన్నది.ఐదేళ్ళ పదవీకాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 2,73,756 కోట్ల రూపా యలను జనం ఖాతాల్లో వేసింది. ఇతర పథకాల (నాన్‌–డీబీటీ) ద్వారా 1,84,604 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. మొత్తం ప్రజా సంక్షేమ పథకాల కోసం ఐదేళ్ళలో వెచ్చించిన సొమ్ము 4,58,360 కోట్లు. అంటే ఏడాదికి రమారమి 92 వేల కోట్లు. ఈ కాలంలో వరసగా రెండేళ్లు కోవిడ్‌ దాడులు జరిగిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్‌ సర్కార్‌ 66 లక్షల పైచిలుకు మందికి మూడు వేల రూపాయల చొప్పున నెలకు సుమారుగా రెండు వేల కోట్ల మేర పెన్షన్లు అందజేసింది. పెన్షనర్లలో మూడు లక్షలమందికి కత్తెర వేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయల చొప్పున పెంచి నెలకు 2,700 కోట్లు పంపిణీ చేస్తున్నది. ఈ పెరుగుదల నెలకు ఏడు వందల కోట్ల చొప్పున సంవత్సరానికి 8,400 కోట్లు. ఇది జగన్‌ సర్కార్‌ ఏడాదికి సంక్షేమం కింద ఖర్చుపెట్టిన 92 వేల కోట్లకు సమానమేనని చంద్రబాబు వాదిస్తున్నారు. ఎట్లా సమానమవుతుందని ఎవ రైనా ప్రశ్నిస్తే ‘ఎర్ర బుక్కు’లో పేరు రాసుకుంటారట!‘సూపర్‌ సిక్స్‌’ హామీల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు ఒక కొత్త నామవాచకాన్ని రంగంలోకి దించారు. అదే ‘పీ–ఫోర్‌’ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌). దీని ప్రకారం సమాజంలోని అగ్రశ్రేణి పది శాతం సంపన్నులు సామాజిక బాధ్యత తీసుకుని అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను ఉద్ధరించాలట! సంపన్నులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ పేదలను ఆదుకోవాలనే సిద్ధాంతాలు ఇప్పటివి కావు. పేద, ధనిక తేడాలు సమాజంలో ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నాయి. చంద్రబాబు దానికి కొత్త పేరు పెట్టుకున్నారు. అంతే తేడా! కానీ ఈ సిద్ధాంతంతో అంతరాలు తొలగిపోయిన సమాజం చరిత్రలో మనకెక్కడా కనిపించదు. ఏపీలో ఆదాయం పన్ను చెల్లిస్తున్న అధికాదాయ వర్గాలవారు ఎనిమిది లక్షల మందేనట! మరోపక్క పేదరికం కారణంగా తెల్ల రేషన్‌కార్డు లున్న కుటుంబాలు కోటీ నలభై ఎనిమిది లక్షలు. చంద్రబాబు ‘పీ–ఫోర్‌’ సిద్ధాంతపు డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ గణాంకాలను ఉటంకించారు.ఆదాయం పన్ను చెల్లించేవారి సంఖ్య ఈ లెక్కన రెండు శాతం కూడా లేదు. అందులోనూ వేతన జీవుల సంఖ్యే ఎక్కువ. వీళ్లకు సేవా కార్యక్రమాలు చేసేంత స్థోమత ఉండదు. ఈ లెక్కన కాస్త అటూఇటుగా ఒక్కశాతం మందే పేదల బాధ్యత తీసు కోవాలి. తెల్లకార్డుల సాక్షిగా పేదలు 90 శాతం మంది. ఇందు లోంచి 70 శాతాన్ని తొలగిస్తూ 20 శాతం మంది పేదలను మాత్రమే ‘పీ–ఫోర్‌’ స్కీములోకి చేర్చుకున్నారు. ఈ పేదల మీద తనకు ఏ రకమైన అభిప్రాయాలున్నాయో మొన్నటి ఉగాది నాడు జరిగిన సభలో స్వయంగా చంద్రబాబు వెల్లడించారు. ‘ఈ బీసీల ఆలోచనంతా ఆ పూట వరకే! సభకొచ్చారు. మధ్య లోనే లేచి వెళ్లారు. మార్గదర్శులు (సంపన్నులు) మాత్రం కూర్చునే ఉన్నార’ని పేదలను ఈసడిస్తూ సంపన్నులను మెచ్చు కున్నారు. పేదవాళ్లకు క్రమశిక్షణ ఉండదనీ, ముందుచూపు ఉండదనీ, డబ్బున్నవాళ్లే పద్ధతైనవాళ్లనే అభిప్రాయంలోంచి మాత్రమే అటువంటి మాటలు వస్తాయి. పేదల పట్ల చంద్ర బాబు ఈసడింపు ధోరణికి ఇదొక్కటే ఉదాహరణ కాదు. చాలా ఉదంతాలున్నాయి. ఎస్‌.సీల గురించి, బీసీల గురించి గత పదవీ కాలంలో చేసిన కామెంట్లు ప్రజలకు ఎల్లకాలం గుర్తుంటాయి.2013లో చేసిన కంపెనీల చట్టం సెక్షన్‌ 135 ప్రకారం కార్పొరేట్‌ కంపెనీలన్నీ వాటి లాభాల్లో రెండు శాతానికి తగ్గకుండా సామాజిక సేవా రంగాలపై ఖర్చు చేయాలి. అది చట్ట బద్ధమైన బాధ్యత. దయాదాక్షిణ్యం కాదు. సగటున దేశ వ్యాప్తంగా సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) కింద 15 వేల కోట్ల రూపాయలను ఇప్పటికే ఖర్చు చేస్తున్నారు. దీన్ని ఏపీ భాగం కింద విడదీస్తే వెయ్యి కోట్ల లోపే ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పనిచేస్తే రెండు వేల కోట్లో, మూడు వేల కోట్లో రావచ్చు. ఈ సొమ్ముతో ఇరవై శాతం మంది జీవితాల్లో వెలుగులు పూయించాలని ఆయన ఆలో చిస్తున్నారు.ప్రతి పౌరునికీ జీవించే హక్కును మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. 21వ అధికరణం ప్రకారం గౌరవప్రదమైన జీవనం ప్రతి వ్యక్తికీ ప్రాథమిక హక్కు. ఈ హక్కును ప్రభుత్వం సంరక్షించాలి. అందుకు విరుద్ధంగా నలుగురు డబ్బున్న వాళ్లను పోగేసి వేదికపై కూర్చోబెట్టి, వేదిక ముందు పేదల్ని చేతులు జోడించి కూర్చు నేలా చేసి, ‘ఒక అయ్యగారి సాయం పదివేలు, ఒక దొరగారి సాయం ఇరవై వేలం’టూ వేలం పాటలు పాడటం రాజ్యాంగ విరుద్ధం. అందుకే సీఎం సభ నుంచి పేద ప్రజలు మధ్యలోనే నిష్క్రమించి ఉంటారు. ముందుచూపు లేక కాదు, మోకరిల్లడం ఇష్టం లేక వెళ్లిపోయుంటారు. అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడం, అందరికీ మేలైన వైద్య సదుపాయాలు లభించేలా చేయడం, అందరూ సమాన స్థాయిలో పోటీపడగలిగే లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ను తయారు చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. రాజ్యాంగ ఆదేశాన్ని మన్నించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వపు ప్రాథమిక విధి. దిద్దుబాటా... ఇంకో పొరపాటా?ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల పుట్టినిల్లుగా పేరుండేది. ఉద్యమాల పర్యవసానంగా పుట్టిన యూనివర్సిటీ హైదరా బాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఒక భావోద్వేగ పూరితమైన నేపథ్యం హెచ్‌సీయూ ఆవిర్భావానికి కారణమైంది. 1969, 1972 సంవత్సరాల్లో రెండు ఉధృతమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలను తెలుగు నేల చూడవలసి వచ్చింది. ఆ ఉద్యమాలను చల్లార్చి ఉమ్మడి రాష్ట్రాన్ని కొనసాగించడం కోసం ఒక రాజీ ఫార్ములాగా ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. అందులో ఒక అంశం హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు! విద్యారంగంలో వెనుకబాటుతనా నికి గురైన ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటు, రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభించే విధంగా దాన్ని కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఉభయతారకంగా ఉంటుందని భావించారు.ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమైంది. 32వ సవరణ ద్వారా 371వ అధికరణానికి ‘ఈ’ అనే సబ్‌క్లాజ్‌ను జోడించారు. పార్లమెంట్‌ ఒక చట్టం ద్వారా హైదరాబాద్‌లో ఒక ‘సెంట్రల్‌’ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఈ క్లాజ్‌ అవకాశం కల్పించింది. ఆ మేరకు హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ చట్టం 1974ను పార్లమెంట్‌ ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో గెజెట్‌లో ఈ చట్టాన్ని ప్రచురించారు. భారత రాజ్యాంగంలో 371వ అధికరణం కింద ప్రస్తావించిన ఏకైక విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ మాత్రమే! అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుమారుగా 2,300 ఎకరాల భూమిని హైదరాబాద్‌ నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో కేటాయించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడమో, లేక ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించడమో చేయలేదు.పూర్వపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో వాటిని ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న భూములన్నీ నవాబ్‌ సొంత భూములుగా (‘సర్ఫెఖాస్‌’గా) పరిగణించేవారు. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత ‘హైదరాబాద్‌ స్టేట్‌’ ఇండియన్‌ యూని యన్‌లో విలీనమైంది. నైజాం... భూములన్నీ హైదరాబాద్‌ స్టేట్‌కు వారసత్వంగా లభించాయి. ఇందుకోసం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ జీవించి ఉన్నంతకాలం పెద్దమొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రాజభరణం చెల్లించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ నగరంలో డజన్లకొద్ది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు ఈ భూముల లభ్యతే కారణం.హెచ్‌సీయూను ఒక ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా మలచాలని కేంద్రం భావించినందు వల్ల అప్పటికి ప్రపంచ స్థాయిలో పేరున్న యూనివర్సిటీలను దృష్టిలో పెట్టుకొని వాటి స్థాయిలోనే భూములను కేటాయించాలని భావించారు. ఈ భూములను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. కాకపోతే భూముల రిజిస్ట్రేషన్‌ జరగలేదు. అటువంటిది అవసరమని కూడా నాటి యూని వర్సిటీ పాలకవర్గాలు భావించలేదు. హెచ్‌సీయూకు చీఫ్‌ రెక్టార్‌గా ఒక గౌరవ హోదా కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పార్లమెంట్‌ చట్టపరంగానే కట్టబెట్టింది. కంచే చేను మేస్తుందని ఎవరు భావిస్తారు! అందువల్ల టెక్నికల్‌గా ఆస్తుల బదలాయింపు జరగలేదు.కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్‌సీయూ ప్రతి ష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్ర మించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగిపోయింది.మిగిలిన దాంట్లో 400 ఎకరాల భూమిని తాడూ బొంగరం లేని క్రీడా నిపుణుల పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టారు. అదీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కేబినెట్‌ అనుమతి కూడా లేకుండానే ఈ కేటాయింపులు జరిగాయి. ఈ నాలుగొందల ఎకరాలు చాలవని ఎయిర్‌పోర్టు సమీపంలో మరో నాలుగొందల యాభై ఎకరాలను కూడా కట్టబెట్టారు. ఆనాటికి దేశంలోని అతిపెద్ద స్కాముల్లో ఈ బిల్లీరావు భూబాగోతం కూడా ఒకటి. వెంటనే ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం, తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ కేటాయింపును రద్దు చేయడం తెలిసిన విషయాలే!రద్దును సవాల్‌ చేస్తూ బిల్లీరావు కోర్టుల్ని ఆశ్రయించి ఇరవయ్యేళ్లపాటు వ్యాజ్యాన్ని నడిపాడు. రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే నిలవడంతో ఇరవయ్యేళ్ల తర్వాత గత సంవత్సరమే సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ఈ 400 ఎకరాలు ప్రభు త్వానివేనని తేల్చేసింది. కేవలం టెక్నికల్‌గానే ప్రభుత్వ భూములు అనుకోవాలి. యూనివర్సిటీకి ఈ భూములను కేటాయించినట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ అధికా రులకు 1975లోనే ఫిబ్రవరి 21న డీఓ లెటర్‌ ద్వారా కమ్యూ నికేట్‌ చేశారు. 2,300 ఎకరాలు కేటాయించినట్టు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు గానీ, ఆ రోజుల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి కాంపౌండ్‌వాల్‌ కట్టించింది.ఇక్కడ తలెత్తుతున్న కీలకమైన ప్రశ్న ఏమిటంటే, రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన యూనివర్సిటీ ఇది. పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చట్టాన్ని చేసి ఏర్పాటుచేశారు. రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భూముల్ని కేటాయించింది. ఈ భూముల్ని అకడమిక్‌ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే షరతు కూడా విధించింది. ఆ షరతును ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధపడటం, అమ్ముకోవడానికి కూడా తెగించడం చెల్లుబాటయ్యే విషయాలేనా? నైతికంగానే కాదు, న్యాయపరంగా కూడా! విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్ప స్టేక్‌ హోల్డర్లు ఇంకెవరూ లేరా?కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకున్నదట! ఇప్పుడు వేలానికి సిద్ధపడింది. ఈ 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదన్న వార్తలు వ్యాపించడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇది జాతీయ సమస్యగా మారింది. ఈ నాలుగొందల ఎకరాల పరిధిలోని దట్టమైన పొదలు స్క్రబ్‌ అడవిగా అల్లుకున్నాయి. మంజీరా బేసిన్‌లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి కుంటల్లో చేరిన నీరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలకు ఊపిరిపోస్తున్నాయని చెబుతున్నారు. హెచ్‌సీయూ వెబ్‌సైట్‌ లోనే ఇక్కడున్న బయో డైవర్సిటీ గురించి అధికారికంగా పొందుపరిచారు.వంద ఎకరాల్లో బయో డైవర్సిటీని ధ్వంసం చేశారన్న వార్తలను అధికారికంగా రూఢి చేసుకున్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ఏప్రిల్‌ 16వ తేదీ లోగా నివేదికను ఇవ్వాలని రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించింది. న్యాయ స్థానం జోక్యంతో ప్రస్తుతం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా,ఎంపిక చేసుకున్న పత్రికల్లో వస్తున్న లీకు వార్తలు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి. 400 ఎకరాలే కాదు, మొత్తం రెండువేల ఎకరాల్లో ‘ఎకో పార్క్‌’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదనీ, ఇందుకోసం సెంట్రల్‌ వర్సిటీకి ఫ్యూచర్‌ సిటీలో వంద ఎకరాలు కేటాయించి, అక్కడికి తర లిస్తారనీ ముందుగా ఒక తెలుగు పత్రిక రాసింది. దానికి ప్రభుత్వ అనుకూల పత్రికగా పేరున్నది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. రెండోరోజు ఒక జాతీయస్థాయి ఇంగ్లిషు పత్రికలో మరింత ప్రముఖంగా, సమగ్రంగా అదే వార్త వచ్చింది. ఎవరూ ఖండించలేదు. అధికారికంగా ప్రకటించనూ లేదు. ఇటువంటి వార్తల్నే జనం పల్స్‌ తెలుసుకోవానికి ప్రయోగించే ‘లీకు వార్త’లంటారు. నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నదా? వేలానికి అడ్డుపడ్డ సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థులపై కోపమా? వాళ్ల మీద కోపంతో యూనివర్సిటీ స్థాయిని తగ్గించాలనుకుంటున్నారా? వాళ్లదేముంది. రెండు మూడేళ్లు చదువుకొని వెళ్లిపోతారు. నిజంగానే సెంట్రల్‌ వర్సిటీని వంద ఎకరాల్లోకి పంపించే ఉద్దేశం ఉంటే మాత్రం దాని స్థాపిత లక్ష్యాలను అవహేళన చేసినట్టే అవుతుంది. ఒక తప్పును దిద్దుకోవడానికి మరో తప్పు చేసినట్టవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంతో ఫుట్‌బాల్‌ ఆడుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా అనే సంగతి కూడా తేలవలసి ఉన్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Bollywoods only billionaire began as toothbrush seller now richer than SRK Salman Aamir combined8
ముగ్గురు ఖాన్‌లనూ మించిన కుబేరుడు!

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 ఎడిషన్‌ ఇటీవల విడుదలైంది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన బిలియనీర్లు 205 మంది ఉన్నారు. వీరిలో వినోదం, మీడియా ప్రపంచానికి చెందినవారు కొంతమంది ఉండగా ఇందులో బాలీవుడ్ నుంచి ఉన్న ఏకైక బిలియనీర్ రోనీ స్క్రూవాలా (Ronnie Screwvala). ఒకప్పుడు టూత్ బ్రష్‌లు అమ్మిన ఆయన ఇప్పుడు పరిశ్రమలోని అతిపెద్ద సూపర్ స్టార్ల కంటే ధనవంతుడైన పారిశ్రామికవేత్త.బాలీవుడ్‌ అపర కుబేరుడుఫోర్బ్స్ ప్రకారం.. హిందీ చిత్ర పరిశ్రమ నుండి ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ఏకైక వ్యక్తి మూవీ మాగ్నెట్, పారిశ్రామికవేత్త రోనీ స్క్రూవాలా. ఫోర్బ్స్ కొత్త జాబితా ప్రకారం ఈ మీడియా మొఘల్ నికర విలువ 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌లుగా ఉన్న ఖాన్‌ త్రయం కంటే ధనవంతుడు. ఎలాగంటే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) (770 మిలియన్ డాలర్లు), సల్మాన్ ఖాన్ (Salman Khan) (390 మిలియన్ డాలర్లు), అమీర్ ఖాన్ (Aamir Khan) (220 మిలియన్ డాలర్లు) మొత్తం నెట్‌వర్త్‌ 1.38 బిలియన్ డాలర్లు కాగా ఆ ముగ్గురి సంపద కంటే రోనీ స్క్రూవాలా సంపద అధికం. రోనీ వ్యాపార ప్రస్థానం1956లో బొంబాయిలో జన్మించిన స్క్రూవాలా 70వ దశకం చివర్లో టూత్ బ్రష్ ల తయారీ ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. 80వ దశకం ప్రారంభంలో ఆసియా క్రీడల పుణ్యమా అని కలర్ టీవీ దేశంలోకి ప్రవేశించినప్పుడు అ బూమ్‌ను స్క్రూవాలా అందిపుచ్చుకున్నారు. అలా ఎంటర్‌టైన్ మెంట్ రంగంలోకి ప్రవేశించి 1990లో యూటీవీని స్థాపించారు. అదే తరువాత యూటీవీ మోషన్ పిక్చర్స్‌గా మారింది. తరువాతి రెండు దశాబ్దాలలో ఈ నిర్మాణ సంస్థలు స్వదేశ్, రంగ్ దే బసంతి, ఖోస్లా కా ఘోస్లా, జోధా అక్బర్, ఫ్యాషన్, ఢిల్లీ బెల్లీ, బర్ఫీమ్ వంటి ఐకానిక్ చిత్రాలను అందించాయి. అలాగే శాంతి, హిప్ హిప్ హుర్రే, షకా లకా బూమ్ బూమ్, కిచిడి, షరారత్ వంటి టీవీ షోలను అందించాయి.తర్వాత రోనీ స్క్రూవాలా 2012లో యూటీవీని డిస్నీకి బిలియన్ డాలర్ల ఒప్పందంలో అమ్మేశారు. అనంతరం ఐదు సంవత్సరాలకు ఆర్ఎస్‌వీపీ మూవీస్‌ సంస్థను స్థాపించారు. అలా ఎంటర్‌టైన్మెంట్ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన కేదార్‌నాథ్, ఉరీ, ది స్కై ఈజ్ పింక్, సామ్ బహదూర్ చిత్రాలను నిర్మించారు. 2024లో స్క్రూవాలా షార్క్ ట్యాంక్ ఇండియాలో షార్క్‌లలో ఒకరిగా వెండితెర అరంగేట్రం చేశారు. రోనీ స్క్రూవాలాకు సినిమాలే ఏకైక ఆదాయ వనరు కాదు. అప్ గ్రాడ్, యూనిలాజర్, యూఎస్ స్పోర్ట్స్ వంటి పలు స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా కొన్నింటిని స్థాపించారు. ఈ సంస్థల విజయం, తన సినిమా వ్యాపారం ఆయన భారీ సంపదను పోగుచేసుకోవడానికి దోహదపడ్డాయి.

Is Beetroot Helpful In Fighting Against Cancer9
కేన్సర్‌తో పోరాడటంలో బీట్‌రూట్‌ హెల్ప్‌ అవుతుందా..?

బీట్‌రూట్‌కు ఎరుపు రంగును ఇచ్చే బిటాలెయిన్స్‌ అనే పోషకం చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే విటమిన్‌–సీ కూడా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ కావడంతో ఇది కూడా కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అంతేకాదు... కొలాజెన్‌ ఉత్పాదన కూడా ఎక్కువగా జరుగుతుండటంతో చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండటానికి ఆ కొలాజెన్‌ సహాయపడుతుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకునేవారికి అలసిపోకుండా చాలాసేపు పనిచేయగల స్టామినా పెరుగుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే... వ్యాయామం చేస్తూ బీట్‌రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకునేవారు అనేక రకాల కేన్సర్ల నుంచి రక్షణ పొందుతారు. అలాగే బీట్‌రూట్ బీటాలైన్ పిగ్మెంట్‌ల కారణంగా కణితి కణాలను తగ్గించగలదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్‌ కేన్సర్ కణాలను తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్‌రూట్ రసంలోని నైట్రేట్‌లు గుండెపనితీరుని మెరుగ్గా ఉంచుతుంది(చదవండి: జుట్టుని మింగేసే మందులివే..)

US Shopping Spree what Americans are Buying Bow Because of Tariff Fears10
ట్రంప్‌ టారిఫ్‌ దడ.. షాపింగ్‌ మాల్స్‌ ముందు లాక్‌డౌన్‌ దృశ్యాలు

వాషింగ్టన్‌: అమెరికాలోని సూపర్ మార్కెట్లన్నీ వినియోగదారుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన జనమంతా తమకు అందిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసి, తమ ట్రాలీలలో నింపేసుకుని, బయటకు వస్తూ కనిపిస్తున్నారు. దీనిని చూసినవారికి త్వరలో లాక్‌డౌన్‌(Lockdown) వస్తుందనే విధంగా అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ‘ఇప్పుడే షాపింగ్‌ చేయండి.. లేదంటే పశ్చాత్తాప పడతారు’ అనే ట్రెండ్‌ నడుస్తోంది.అమెరికాలోని వినియోగదారులు షాపింగ్‌ మాల్స్‌కు పరుగులు తీయడం వెనుక ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీ(Donald Trump's new tariff policy). ఏప్రిల్ 2న డోనాల్డ్ ట్రంప్ భారత్‌, చైనాతో సహా పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలను విధించారు. దీనిపై అమెరికన్లు కలత చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పలు వస్తువులు చాలా ఖరీదైనవిగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే వారంతా ఉప్పు మొదలుకొని టీవీలు, ఫ్రిజ్‌లు.. ఇలా అన్నింటికీ కొనుగోలు చేస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ప్రభుత్వ సుంకాల విధానం దిగుమతులపై(imports) ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. ఇది కంపెనీల ఖర్చును పెంచుతుంది. ఫలితంగా ఆ భారం కస్టమర్‌పై పడుతుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఈ సుంకాలు మేలు చేస్తాయని చెబుతున్నారు. అమెరికన్లు ప్రస్తుతం చేస్తున్న షాపింగ్‌ తీరు చూస్తుంటే.. వారెవరికీ ట్రంప్ హామీలపై పెద్దగా నమ్మకం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మైక్రోవేవ్‌లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, విడిభాగాలు చైనా తదితర దేశాల నుండి దిగుమతి అవుతాయి. సుంకాల పెరుగుదల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. సుంకాలు విధించాక ధరలలో 15-20శాతం మేరకు పెరుగుదల తప్పకుండా ఉంటుందని డీలర్లు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే అమెరికన్లు వివిధ రకాల షోరూంలకు క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్, క్యాజువల్ షూలను కూడా ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కాఫీ, స్నాక్స్, సాస్‌లు, అంతర్జాతీయ కిరాణా వస్తువులు కూడా జోరుగా విక్రయమవుతున్నాయి. బ్లెండర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, మసాజ్ కుర్చీలు, ట్రెడ్‌మిల్స్ కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్‌ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement