Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

No Varma Nagababu Now Officially Became Pithapuram Zamindar1
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!

పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!. అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది. ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్‌ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న

Indian Judiciary Helpless To Prohibit Social Media Use By Children Below 13 Yrs2
మా చేతుల్లో ఏం లేదు.. పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్‌పై సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో చిన్నారులు సోషల్‌ మీడియా(Social Media) వాడకుండా నిషేధించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికార యంత్రాగాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.సోషల్‌ మీడియా వాడకం వల్ల చిన్నారులపై శారీరకంగా, మానసికంగా, ప్రభావం పడుతోందని, కాబట్టి 13 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని ఓ పిల్‌(PIL) దాఖలైంది. అంతేకాదు 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్‌ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని జెప్‌ ఫౌండేషన్‌ ఈ పిల్‌లో కోరింది. దీనిని పరిశీలించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. అది తమ పరిధిలోని అంశం కాదని, విధానపరమైన నిర్ణయమని చెబుతూ పిల్‌ను తిరస్కరించింది.పిల్‌లో ఏముందంటే.. 13 ఏళ్లలోపు వయసున్నవాళ్లు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడకూడదంటూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నామమాత్రంగా నిబంధనను పెట్టాయి. కేవలం యూజర్లు రిపోర్ట్‌ చేసినప్పుడు మాత్రమే అలాంటి అకౌంట్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఇదీ ఆందోళన కలిగించే అంశమే.మైనర్ల సోషల్‌ మీడియా అకౌంట్లకు కూడా అనియంత్రిత యాక్సెస్unrestricted access ఉంటోంది. దీని మూలంగా వాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.మైనర్లు సోషల్‌ మీడియా వాడకుండా నియంత్రించని ఈ వ్యవహారం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి, కఠిన జరిమానాలు, ఇతర చర్యల ద్వారా పిల్లల చేతికి సోషల్‌ మీడియా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.భారత్‌లో యువత సగటున ప్రతీరోజు ఐదు గంటలపాటు సోషల్‌ మీడియాలో గడుపుతున్నారు. ఈ సమయం గణనీయంగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగించే అంశం. అందుకు తగ్గట్లే దేశంలో సైబర్‌ నేరాలు.. మైనర్లకు సైబర్‌ వేధింపులు పెరిగిపోతున్నాయి.ఉదాహరణకు.. మహారాష్ట్రలో 9-17 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం ఆరు గంటలకు పైగా సోషల్‌ మీడియా, గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నారు. ఇది వాళ్ల చదువులపై, జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో పలు రాష్ట్రాలు మైనర్లు సోషల్‌ మీడియా ఉపయోగించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.భారతదేశ జనాభాలో దాదాపు 30% మంది 4-18 సంవత్సరాల వయస్సు మధ్యే ఉంది. కాబట్టి 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధాన్ని అమలు చేయడం అత్యవసరం.అయితే పైన పేర్కొన్న దేశాలు మైనర్లకు సోషల్‌ మీడియా కట్టడిని కేవలం ప్రత్యేక చట్టాల ద్వారా మాత్రమే చేయగలిగాయి. ఏ సందర్భంలోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు. కాబట్టి భారత్‌లోనూ చట్ట ప్రక్రియ ద్వారా మాత్రమే కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుందనేది నిపుణుల మాట.

YSRCP Leaders Comments On Naganjali Death Case Issue3
‘మిస్టర్‌ పవన్‌.. దీపక్‌ తాట ఎందుకు తీయలేదు?’

సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్‌సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ..‘నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్‌లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్‌లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదు.పవన్‌.. కేవలం మాటలేనా?ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు. నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్?. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా పవన్. మీ మాటలు చేతలకు పనిచేయవా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే.. వారిని కనీసం పరామర్శించారా?. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలైనా ఇచ్చారా?.ఆడబిడ్డలకు రక్షణ కరువు..ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా?. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్‌ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా?. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు. ఆడ పిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరితెగించి రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరందిశ యాప్‌ కాపీనే శక్తి..గతంలో వైఎస్‌ జగన్‌ దిశా యాప్ తెచ్చారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశా చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారు?. దిశ యాప్‌పై ఇప్పటి హోం మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైపోయిందో హోమ్ మంత్రి సమాధానం చెప్పాలి. శక్తి టీమ్‌లు ఎక్కడికి పోయాయి?. శక్తి యాప్ సరిగా పనిచేసుంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?. అనిత మాటలు చేతల్లో కనిపించవా?. నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పటికైనా మంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.బాధితురాలికి న్యాయం జరగాలి..నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ స్పందిస్తూ..‘నాగాంజలి మరణం బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్‌లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలి. నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరం.

Penguin Memes Fill Internet After Trump Tariffs An Uninhabited Island4
జనాలే లేని ద్వీపంపై పన్నులా? ట్రంప్‌ సుంకాలపై పెంగ్విన్స్‌ సెటైర్లు

అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ పరస్పరం (రెసిప్రోకల్ టారిఫ్స్) పన్నులు విధించడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అనేక దేశాధినేతలు తమ స్పందన వెల్లడించారు కూడా. దీనిపై సోషల్‌ మీడియాలో వ్యంగ్యబాణాలు వెల్లువెత్తాయి కూడా. మరీ ముఖ్యంగా అయితే జనావాసాలు లేని ఒక ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించిన తీరు మరింత విస్మయ పర్చింది. దీనిపై పెంగ్విన్ మీమ్స్(penguin memes) ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవుల (Heard and McDonald Islands) పై ఎందుకు పన్నులు విధించారు అనేదే పెద్ద ప్రశ్న. మానవ జనాభా లేని బంజరు సబ్-అంటార్కిటిక్ ఆస్ట్రేలియన్ ప్రాంతమైన హర్డ్ , మెక్‌డొనాల్డ్ దీవుల నుండి వచ్చే అన్ని ఎగుమతులపై ట్రంప్ 10శాతం సుంకాలను విధించారు. అయితే ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారు.వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. దాదాపు 80 శాతం మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు, వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించటం లేదు. దాదాపు దశాబ్ధకాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతం పెంగ్విన్లు, సీల్స్‌కు ఆవాస ప్రాంతంగా ఉంది. The penguin wore a suit. But didn’t escape the Trump tarifs on the Heard og McDonald Islands. Maybe it didn’t say thank you? pic.twitter.com/aaPr1ufCr0— Christopher Arzrouni (@CArzrouni) April 3, 2025 ఓవల్‌ ఆఫీసులో ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్థానంలో పెంగ్విన్‌ను అమెరికా అధ్యక్షుడు ,ఉపాధ్యక్షుడు వాన్స్‌తో ఇటీవల జరిగిన వివాదాస్పద సమావేశానికి ఉటింకిస్తూ ఒక మీమ్‌ ఉంది. జెలెన్‌స్కీ ప్లేస్‌లో పెంగ్విన్‌ను ఉంచారు. మరొక మీమ్ యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో స్థానంలో చక్రవర్తి పెంగ్విన్‌ను చూస్తున్నట్లు ఉంది. "పెంగ్విన్‌లు సంవత్సరాలుగా మనల్ని చీల్చి చెండాడుతున్నాయి" అని మొదిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్‌గా 11 రోజులు పనిచేసిన ఆంథోనీ స్కారాముచ్చి వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. చమత్కరించారు. ఈ సుంకాల జాబితాలో రష్యా లేదనే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ. "ట్రంప్ పుతిన్‌పై కాదు పెంగ్విన్‌లపై సుంకాలను విధించారు" అంటూ అమెరికా సెనేట్ డెమోక్రటిక్ నాయకుడు చక్ షుమర్ పోస్ట్ చేశారు,Outstanding memes capturing the absurdity of Trump’s tariff on penguin inhabited Heard & McDonald Islands #owngoal #PowerToThePenguins pic.twitter.com/AETymaLFdC— Eddie Lloyd (@worldzonfire) April 4, 2025 ; చదవండి: ట్రంప్ సుంకాల మోత, సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హోరు మాములుగా లేదు!మరోవైపు ట్రంప్‌ సుంకాల దెబ్బతో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత మళ్లీ ఇపుడు స్టాక్స్‌ తీవ్రంగా నష్టపోతున్నాయి.

NEET Row: CM Stalin Reacts On Setback5
Neet Row: డీఎంకే సర్కార్‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ/చెన్నై, సాక్షి: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్ష విషయంలో డీఎంకే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. నీట్‌ పరీక్ష(NEET Exam) నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నీట్‌ను ఉప సంహరించుకోలేదన్న ఆయన.. ఈ వ్యవహారంలో తమిళనాడు చేస్తున్న పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ నెల 9వ తేదీన పార్టీలకతీతంగా ఎమ్మెల్యేందరితోనూ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. నీట్‌ పరీక్ష పత్రాల లీకేజీ, పరీక్షను క్లియర్‌ చేయలేని స్థితిలో పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడడంతో ఇదొక తీవ్ర అంశంగా మారిందక్కడ. కోచింగ్‌లకు వెళ్లే స్తోమత లేని విద్యార్థుల పాలిట ఇదొక శాపంగా మారిందనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. సామాజిక న్యాయం దక్కాలంటే నీట్‌ వద్దనే నినాదంతో పోరాడుతూ వస్తోంది. అందుకే నీట్‌ బదులు 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి తమిళనాడును అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం ఒక బిల్లును రూపొందించింది. అయితే.. 2021-22 నుంచే అది పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో.. కిందటి ఏడాది జూన్‌లో తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవంగా నీట్‌ను రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూడా. అయినప్పటికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజా ఎదురు దెబ్బపై స్టాలిన్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. దక్షిణ రాష్ట్రం మరోసారి అవమానానికి గురైందని అన్నారు. ‘‘కేంద్రం తమిళనాడు అభ్యర్థనను తిరస్కరించవచ్చు. కానీ, మన పోరాటం మాత్రం ఆగదు. న్యాయ నిపుణులపై చర్చించి ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేసే అంశం పరిశీలిస్తాం అని స్టాలిన్‌ ప్రకటించారు. మరోవైపు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్‌ కూడా నీట్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోవైపు.. కాంగ్రెస్‌, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా నీట్‌ను మొదటి నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

Im Highest Paid Player But Rs 20 Cr Doesnt Matter Once: Venkatesh Iyer6
రూ. 20 కోట్లు లెక్కకాదు!.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?

ఐపీఎల్‌ మెగా వేలం-2025లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లలో వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer)మూడోవాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) కోసం రూ. 27 కోట్లు ఖర్చు చేస్తే.. పంజాబ్‌ కింగ్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ను ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.రూ. 23.75 కోట్లుఅయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌ అనూహ్య రీతిలో వెంకటేశ్‌ అయ్యర్‌ను దక్కించుకునేందుకు రూ. 23.75 కోట్లు కుమ్మరించింది. నిజానికి గతేడాది అతడు అంత గొప్పగా ఏమీ ఆడలేదు. పదిహేను మ్యాచ్‌లలో కలిపి 370 పరుగులు సాధించాడు.అయితే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కీలకమైన ఫైనల్లో మాత్రం వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాట్‌ ఝులిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ అతడిని భారీ ధరకు దక్కించుకోవడం గమనార్హం.ఆరంభ మ్యాచ్‌లో ఆరు.. ముంబైపై మూడుఅయితే, ఐపీఎల్‌-2025 ఆరంభ మ్యాచ్‌లలో మాత్రం వెంకటేశ్‌ అయ్యర్‌ తేలిపోయాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో కేవలం ఆరు పరుగులే చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులకే పెవిలియన్‌ చేరాడు.మెరుపు బ్యాటింగ్‌ఈ క్రమంలో వెంకటేశ్‌కు కేకేఆర్‌ భారీ మొత్తం చెల్లించడం వృథా అయిందని పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వచ్చాయి. అయితే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం నాటి మ్యాచ్‌ సందర్భంగా విమర్శకులందరికీ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు వెంకటేశ్‌. ఇన్నింగ్స్‌ ఆరంభంలో టెస్టు మ్యాచ్‌ మాదిరి ఆడిన అతడు ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.Lighting up Eden Gardens with some fireworks 💥 Sit back and enjoy Rinku Singh and Venkatesh Iyer's super striking 🍿👏5⃣0⃣ up for Iyer in the process!Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/AAAqnOsRy8— IndianPremierLeague (@IPL) April 3, 2025 కేవలం 29 బంతుల్లోనే వెంకటేశ్‌ అయ్యర్‌ 60 పరుగులు చేసి కేకేఆర్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. రైజర్స్‌పై కేకేఆర్‌ 80 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం వెంకటేశ్‌ అయ్యర్‌ తన ‘ప్రైస్‌ ట్యాగ్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే‘‘ఒక్కసారి ఐపీఎల్‌ మొదలైందంటే.. ఓ ఆటగాడు రూ. 20 లక్షలకు అమ్ముడుపోయాడా? లేదంటే రూ. 20 కోట్లకు అమ్ముడుపోయాడా? అన్న విషయంతో సంబంధం ఉండదు. మనం ఎలా ఆడతామన్నది డబ్బు నిర్ణయించదు. మా జట్టులో అంగ్‌క్రిష్‌ రఘువన్షీ అనే కుర్రాడు ఉన్నాడు.అతడు ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఆటగాడి ధరకు అనుగుణంగానే అంచనాలూ ఉంటాయని నాకు తెలుసు. కానీ జట్టు విజయానికి ఒక ఆటగాడు ఎంత మేర తోడ్పడుతున్నాడన్నదే ముఖ్యం. పరిస్థితులకు అనుగుణంగా నేను ఈరోజు బ్యాటింగ్‌ చేశాను.ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?అంతేగానీ.. నేను అత్యధిక ధర పలికిన ఆటగాడిని గనుక ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలనే నిబంధన ఏమీ లేదు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావం చూపానా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రైస్‌ ట్యాగ్‌ వల్ల ఒత్తిడి ఉంటుందన్న మాట నిజం.ఈ విషయంలో నాకు అబద్ధం ఆడాల్సిన పనిలేదు. అయితే, ఆ ఒత్తిడి డబ్బు గురించి కాదు.. జట్టుకు నేను ఉపయోగపడుతున్నానా? లేదా? అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది’’ అని వెంకటేశ్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది సత్తా చాటిన అంగ్‌క్రిష్‌ను కేకేఆర్‌ తిరిగి రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటికే అతడు ఈ సీజన్‌లో ఓ హాఫ్‌ సెంచరీ బాదేశాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి 128 రన్స్‌ చేశాడు.ఐపీఎల్‌-2025: కోల్‌కతా వర్సెస్‌ హైదరాబాద్‌👉కోల్‌కతా స్కోరు: 200/6 (20)👉హైదరాబాద్‌ స్కోరు: 120 (16.4)👉ఫలితం: 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌ విజయం.చదవండి: జట్టు మారనున్న తిలక్‌ వర్మ?.. HCA స్పందన ఇదే

Lion Enters House Through Roof in gujarat Kovaya Village7
వైరల్‌.. మృగరాజుకి ఆకలేసి కిచెన్‌లో దూరింది!

గాంధీనగర్‌ : అడవికి రాజు అయిన సింహం జనావాసాల్లోకి వస్తే ఏమవుతుంది. అ‍మ్మో.. ఊహించుకోవడానికే భయంగా ఉందంటారా? అలాంటిది. ఇంట్లో అందరూ గాఢనిద్రలో ఉండగా.. ఆ సింహం ఇంటి పై కప్పు నుంచి సైలెంట్‌గా కిచెన్‌లో అడుగుపెడితే . సుమారు రెండు గంటల పాటు అక్కడే తిష్ట వేస్తే.. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో ఒక కుటుంబానికి ఓ చిరుత షాకిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో బుధవారం రాత్రి ములుభాయ్ రాంభాయ్ లఖన్నోత్రా కుటుంబం బుధవారం రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ సింహం వారి కిచెన్‌లోని గోడపై కూర్చొంది. సుమారు రెండుగంటల పాటు తిష్టేసింది.#Amreli: #Gujarat Family Finds Lion Sitting In Their Kitchen pic.twitter.com/dMkfqcILI0— Timeline. (@timelinelatest) April 4, 2025అయితే అర్ధరాత్రి తర్వాత ఇంట్లో చప్పుడు కావడంతో ములుభాయ్‌ కుటుంబసభ్యులు ఉలిక్కపడి లేచారు. ‍కళ్లార్పకుండా వంటగది గోడమీద ఉన్న సింహం వారినే చూస్తుండడంతో ఒక్కసారిగా హతాశులయ్యారు. బతుకు జీవుడా అనుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ భయటకు పరుగులు తీశారు. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ములుభాయ్‌ కుటుంబసభ్యులకు ఏమైందోనని వచ్చి చూడగా.. వంటగదిలో ఉన్న సింహాన్నిచూసి జడుసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింహం వంటగది గోడపై కూర్చొని ఉండడాన్ని గమనించొచ్చు. చికట్లో కూడా మిరుమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతున్న సింహం కళ్లను గ్రామస్తులు తమ సెల్‌ఫోన్‌లలో బంధించడం మనం చూడొచ్చు. సుమారు రెండు గంటల తర్వాత గ్రామస్తుల సహాయంతో సింహాన్ని తరిమికొట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఇంట్లో సింహం చొరబడిందనే సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సింహం ఎక్కడ నుంచి వచ్చిందో ఆరా తీశారు.

Enforce Directorate Search On L2 Empuraan movie Producer Office8
'లూసిఫర్‌2' నిర్మాత ఆఫీస్‌లపై ఈడీ దాడులు.. రూ. 1000 కోట్ల కేసులో

మోహన్‌లాల్‌ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన ‘ఎల్‌2: ఎంపురాన్‌’ (L2:Empuraan) చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత ఆఫీస్‌లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లను తప్పుగా ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించారని విమర్శలు వచ్చాయి. ఆపై విలన్‌ పేరును భజరంగిగా పెట్టడం కూడా తప్పుబట్టారు. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ కూడా రాజ్యసభలో ఈ మూవీపై మాట్లాడారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో నిర్మాతపై ఈడీ దాడులు చేయడం చర్చనియాంశంగా మారింది.లూసిఫర్‌2 సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన తమిళనాడు, కేరళ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కోడంబాక్కంలోని గోకుల్ చిట్ ఫండ్స్ కార్యాలయంతో సహా అనేక ప్రదేశాలలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి.పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్‌2: ఎంపురాన్‌’ (L2:Empuraan) బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటి వరకు సుమారు రూ. 240 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. సినిమాపై వివాదం రావడంతో సుమారు 17 సెన్సార్‌ కట్స్‌ చేశారు. దీంతో సినిమా నిడివి సుమారు 5నిమిషాలు తగ్గింది.

Ed Raids In Various States Over Fraud In The Ayushman Bharat Scheme9
ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో అవకతవకలు.. ఈడీ దాడులు

ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ (pmjay) పథకంలో అవకతవకులు జరిగాయి. కాగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడీ ఏక కాలంలో దాడులకు దిగింది. 2023లో పార్లమెంటులో కాగ్‌ నివేదికను ప్రవేశ పెట్టింది. జార్ఖండ్‌లో ఆయుష్మాన్ పథకం పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగిందనేది ఆ నివేదిక సారాశం. రోగులను చేర్చుకోకుండా, బీమా మొత్తాన్ని మోసపూరితంగా క్లయిమ్‌ చేస్తున్నారని అందులో పేర్కొంది. కాగ్‌ తన రిపోర్ట్‌లో దేశంలోని 212 ఆస్పత్రులలో పీఎంజేఏవైలో ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. చికిత్స అందించకుండాఈ నేపథ్యంలో శుక్రవారం ఆయుష్మాన్ భారత్ పథకం కింద మోసపూరిత కార్యకలాపాలు, ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించి జార్ఖండ్‌లోని రాంచీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పీఎంజేఏవైలోని నెట్‌ వర్క్‌ ఆస్పత్రులలో ఎటువంటి వైద్య చికిత్స లేకుండా, ఏ రోగిని చేర్చకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ దాడులకు దిగింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పీఎంజేఏవై పథకం కిందపీఎంజేఏవై పథకం కింద కేంద్రం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తుంది. ఈ పథకంలో రూ.5లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ప్రస్తుతం దాదాపు 12.3 కోట్ల కుటుంబాలకు అందుబాటులో ఉంది. తాజాగా కేంద్రం ఈ పథకాన్ని 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వర్తించేలా మార్పులకు శ్రీకారం చుట్టింది.

tariffs imposed Trump on Chinese imports effect of iPhone rates hike10
యాపిల్‌కు టారిఫ్‌ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశం

విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్‌ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్‌ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు.యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త ఫీచర్లకు ఆదరణ అంతంతమాత్రంగా ఉండటంతో ఇప్పటికే ప్రధాన మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అధిక ధరలు డిమాండ్‌ను మరింత తగ్గిస్తాయి. ఇది చైనా వెలుపల ఎక్కువ ఫోన్లను తయారు చేసే, టారిఫ్‌ల వల్ల తక్కువ ప్రభావితమయ్యే శామ్‌సంగ్ వంటి ప్రత్యామ్నాయ కంపెనీ ఉత్పత్తుల వైపు వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రూ.44 కోట్ల విలువైన గోల్డ్‌ కార్డు ‍ప్రదర్శించిన ట్రంప్‌అమెరికా ప్రభుత్వం నుంచి యాపిల్ గతంలో టారిఫ్‌ల నుంచి మినహాయింపులను పొందగలిగినప్పటికీ, ఈసారి అటువంటి సౌలభ్యం లేదని ఇప్పటికే అధికార వర్గాలు స్పష్టతనిచ్చాయి. వియత్నాం, ఇండియాలోనూ యాపిల్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది. అయితే వియత్నాంపై 46 శాతం సుంకాన్ని, భారతదేశంపై 26 శాతం సుంకాన్ని విధించారు. ఇవి చైనా సుంకాల కంటే తక్కువగానే ఉన్నాయి. అయితే కంపెనీ ఇండియా వంటి దేశాల్లో ఉత్పత్తిని పెంచుతుందా లేదా అనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement