వైఎస్సార్‌ సీపీ మహా సైన్యం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ మహా సైన్యం

Published Mon, May 6 2024 8:05 AM

వైఎస్సార్‌ సీపీ మహా సైన్యం

కార్యకర్తలే..

పట్నంబజారు: ఎగిసి పడుతున్న సముద్రపు అలలకు సైతం ఎదురొడ్డి పోరాడగల సత్తా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సొంతమని.. పార్టీకి కార్యకర్తలే మహా సైన్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని పేర్కొన్నారు. స్థానిక చంద్రమౌళి నగర్‌లోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పోరాటాలతో పుట్టిన వైఎస్సార్‌ సీపీకి పోరు కొత్తేమి కాదని స్పష్టం చేశారు. అచంచల విశ్వాసంతో.. అలుపెరుగని దీక్షతో ముందుకు సాగే ప్రతి కార్యకర్తకు, నేతకు అండగా ఉంటామని హామినిచ్చారు. పశ్చిమ తలరాతను నిర్ణయించే సమయం వచ్చేసిందని, ఈ వారం రోజులే అత్యంత కీలకమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అప్రమత్తం చేశారు. డివిజన్‌లో ఇప్పటికే క్షేత్రస్థాయికి వెళ్లి నాయకులంతా కష్టపడి పనిచేస్తున్నారని, ఇలానే ముందుకు సాగితే ఊహించిన దానికంటే గొప్ప ఫలితాన్ని సాధించవచ్చాన్నారు.

ఐక్యంగా పనిచేద్దాం..

పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుదామని శాసనమండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు జగనన్న అందించిన సంక్షేమ పథకాలే రేపటి విజయానికి నాంది పలుకుతాయని స్పష్టం చేశారు. పార్టీ జెండాను భుజాన పెట్టుకుని కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే, పార్టీ నగర అధ్యక్షుడు మద్దాళి గిరిధర్‌ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. డివిజన్‌ పరిధిలో ఏమైనా సమస్యలు తలెత్తితే.. తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పశ్చిమలో వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడటమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.

పశ్చిమ తలరాతను నిర్ణయించే సమయం వచ్చేసింది ఈ వారం.. ప్రతి క్షణం అప్రమమత్తం అవసరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పశ్చిమలోని కార్పొరేటర్లు, నాయకులతో ప్రత్యేక సమావేశం హాజరైన మండలి విప్‌ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మదాళి గిరి

Advertisement
Advertisement