
'అందం చూడవయ్యా ఆనందించనయ్యా' అన్నాడో కవి. అలా అందానికి వశమవ్వని, అస్వాదించని మగాడు ఉండడి భూమ్మీద అనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు అలాంటి అందాన్ని మెరుగులు దిద్దుకునే సంస్కృతి పెరుగుతోంది. సినీ తారల విషయానికి వస్తే అదే వారి పెద్ద పెట్టుబడిగా మారిపోయింది. హీరోయిన్ అందంగా ఉంటేనే అవకాశాలు తలుపు తడతాయి. దీంతో పెళ్లి తర్వాత కూడా సొగసులు, మెరుపులు చూపిస్తున్నారు.
(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?)
హన్సిక కెరీర్ ప్రారంభం నుంచి కూడా అందాన్నే నమ్ముకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 'దేశముదురు' మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో కథానాయకిగా నటించింది. ఇక తమిళంలో స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. ఇక శింబుతో ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు తెగ వచ్చాయి. 2022లో హన్సిక పెళ్లి చేసుకున్నప్పటికీ.. నటనకు దూరం కాలేదు.
ఇటీవలే 'పార్టనర్' అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం రౌడీ బేబీ, గాంధారి, మెన్ చిత్రాల్లో నటిస్తోంది. మరిన్ని అవకాశాల కోసం హన్సిక తన అందాలకు మెరుగుపెట్టి మరీ స్పెషల్ ఫొటో సెషన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనలో ఇంకా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని హింట్ ఇస్తోంది.
(ఇదీ చదవండి: Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment