నల్లగొండ : జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని కలెక్టర్ దాసరి హరిచందన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలతో ముఖాముఖి మాట్లాడి బాలసదనంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని, ఎలా చదువుతున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలసదనం మొత్తం పరిశీలించిన కలెక్టర్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై హోం సూపరింటెండెంట్ జయకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. బాలసదనం నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మ్యాట్రిన్ సామ్రాజ్యాన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బాలసదనంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పనితీరు కూడా సరిగాల లేదని.. వారిని వెంటనే సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేయాలని ఆదేశించారు. మూడు రోజుల్లో బాల సదనం పరిశుభ్రంగా ఉంచాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని సంబంధిత సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు.