ఫేక్‌ పేస్‌బుక్‌ అకౌంట్‌తో వేధింపులు | fake postings in facebook | Sakshi
Sakshi News home page

ఫేక్‌ పేస్‌బుక్‌ అకౌంట్‌తో వేధింపులు

Published Wed, Dec 13 2017 10:56 AM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

సాక్షి, విజయవాడ : తన పేరుతో ఫేక్‌ పేస్‌బుక్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేసి తనను వేధిస్తున్నాడని ఓ యువతి  అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని  సింగ్‌నగర్‌కు చెందిన ఓ యువతి డిగ్రీ చదువుతోంది. ఆమెకు కర్నూలుకు చెందిన చంద్రశేఖర్‌తో ఆగస్టులో నిశ్చితార‍్థం అయ్యింది. సెప్టెంబరులో పుట్టినరోజుకు చంద్రశేఖర్‌ ఫోన్‌ కొని ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇటీవల ఆమెకు వేరే అబ్బాయితో లవ్‌ ఎఫైర్‌ ఉందని చంద్రశేఖర్‌కు  తెలిసింది. అ

ప్పటి నుంచి చంద్రశేఖర్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో తను కొనిచ్చిన ఫోన్‌ ఇచ్చేయాలని కోరగా ఆమె ఫోన్‌ ఇచ్చేసింది. ఆ ఫోన్‌లోని ఫొటోలతో పేస్‌బుక్‌లో ఫేక్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేసి అభ్యంతరకరంగా పోస్టింగ్‌లు పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలు చేసిన ఫిర్యాదుమేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement