కర్నూలులో ఓ బేకరీ వ్యాపారిని తుపాకీతో బెదిరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూలు : కర్నూలులో ఓ బేకరీ వ్యాపారిని తుపాకీతో బెదిరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు పట్టణానికి చెందిన బేకరీ వ్యాపారి వెంకటేశ్వరెడ్డికి షేక్ మహమ్మద్ ఇషాక్ పటేల్ బిస్కెట్లను సరఫరా చేస్తుంటాడు.
కాగా ఇదే విషయమై వారిద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో ఇషాక్ పటేల్, మహమ్మద్ కరీంతో కలసి వారం క్రితం వెంకటేశ్వరెడ్డిని తుపాకీతో బెదిరించాడు. ఈ కేసులో శుక్రవారం ఇషాక్ పటేల్, కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ రివాల్వర్, ఎయిర్‌గన్లను స్వాధీనం చేసుకున్నారు.