
సాక్షి, శ్రీకాకుళం: నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 316వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.
జననేత శనివారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జననేత కుశాలపురం, బై పాస్ జంక్షన్ మీదుగా గవర్నమెంట్ పాల్‌టెక్నిక్ కాలేజ్ సెంటర్ చేరుకుంటారు. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. ఆ తర్వాత జననేత పాదయాత్ర శ్రీకాకుళం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గుజరాతి పేట మీదుగా శ్రీకాకుళం 7 రోడ్స్ జంక్షన్ వరకు పాదయాత్ర సాగుతుంది. శ్రీకాకుళం 7 రోడ్స్ జంక్షన్ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.