భారత్, అమెరికా సరైన దిశగా పయనిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సరైన దిశగా పయనిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో ఒబామా ప్రసంగించారు. ఈ సదస్సులో ఒబామాతో పాటు భారత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత గణతంత్ర వేడుకులు తనను అబ్బురపరిచాయని ఒబామా ప్రశంసించారు.
భారత్, అమెరికా సాధించాల్సింది చాలా ఉందని ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య దిగుమతులు పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అమెరికా దిగుమతుల్లో కేవలం 2 శాతమే భారత్ నుంచి వస్తుండగా, భారత్ దిగుమతుల్లో 1 శాతం మాత్రమే అమెరికా వాటా ఉందని చెప్పారు. అమెరికా తయారీ విమానాలు భారత్ విమానాశ్రాయాల్లో నిరంతరం కనబడాలని ఒబామా అన్నారు. అంతకుముందు మోదీ ప్రసంగించారు.