Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Bhumana Raised Tirumala Cow Issues Satires On Pawanananda Swami1
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన

తిరుపతి, సాక్షి: తిరుమల ప్రతిష్టతను దెబ్బ తీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్న ఆయన.. గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ సంగతిని బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది. కానీ, ఇవాళ జరుగుతోంది ఏంటి?. టీటీడీ గోశాల(TTD Goshala)లో అమ్మకంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తారు. కానీ, తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి. మూగజీవాలు దిక్కుమొక్కు లేకుండా మరణిస్తున్నాయి. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదు... మా పాలనలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించాం. గతంలో వందే గో మాతరం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో చేపట్టాం. అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై విషం చిమ్మారు. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోవుల పట్ల కూటమి సర్కార్‌ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. లేగదూడలను పట్టించుకునేవాడు లేడు. చెత్తకు వేసినట్లుగా ఆవులకు గ్రాసం వేస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి గోశాలకు ఓ డైరెక్టర్‌ అంటూ లేడు. డీఎఫ్‌వో స్థాయి అధికారిని గోశాలకు ఇన్చార్జిగా నియమించారు. సాహివాల్ ఆవు గోశాలనుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని చెప్పేందుకు చెవులు కట్ చేశారు. గోశాల.. గోవధశాలగా మారింది.. భగవంతుడితో సమానమైన గోవులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈ మహా పాపం కూటమి సర్కార్‌, టీటీడీ అధికారులదే. ఇంత జరుగుతున్నా.. పవనానంద స్వామి(Pawan Kalyan) ఎక్కడ? ఏం చేస్తున్నారు?. గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందన్న భూమన.. గోవుల మృతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలని కోరారాయన.

This Is How USA Reacts To Tahawwur Rana Extradition To India2
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా

26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్‌ హుసేన్‌ రాణా.. సుమారు దశాబ్దంన్నర తర్వాత విచారణ ఎదుర్కొనబోతున్నాడు. పాక్‌ మూలాలు ఉన్న లష్కరే ఉగ్రవాది అయిన రాణాను అమెరికా మార్షల్స్‌ బుధవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులకు అప్పగించడంతో అధికారిక ప్రక్రియ ముగిసింది. అయితే ఈ పరిణామంపై అమెరికా స్పందించింది. భారత్‌కు అతన్ని అప్పగించడం గర్వకారణంగా ఉందంటూ ప్రకటించింది.‘‘2008 ముంబై ఉగ్రదాడులకు రూపకర్తగా తహవూర్‌ రాణా(tahawwur rana)పై అభియోగాలు ఉన్నాయి. ఇందుకుగానూ న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని అమెరికా నుంచి భారత్‌కు తరలించాం’’ అని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్‌ మీడియాకు వెల్లడించారు.. ముంబైలో నాడు జరిగిన ఉగ్రదాడి యావత్‌ ప్రపంచాన్ని దిగ్‌భ్రాంతికి చేసింది. కొంతమందికి గుర్తు లేకపోవచ్చు. కానీ, ఒకసారి పరిశీలిస్తే అది ఎంత భయంకరమైందో.. ఈనాటికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుస్తుంది. ఈ దాడులకు బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదం అనే ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనడానికి భారత్‌, అమెరికా కలిసి కట్టుగా పని చేస్తుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన తన నిబద్ధతను కనబరిచారు. అందుకు మేం గర్వపడుతున్నాం’’ అని టామీ బ్రూస్‌ ప్రకటించారు.2009 అక్టోబర్‌లో ముంబై ఉగ్రదాడులు సహా పలు కేసులు ఉన్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీని అమెరికాలో అరెస్ట్ చేశారు. హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఇల్లినాయిస్‌ చికాగోలో ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న తహవూర్‌ రాణాను అక్టోబర్‌ 18వ తేదీన ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది. ఆపై అభియోగాలు రుజువు కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ముంబై ఉగ్రదాడి కేసులో విచారణ ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించకుండా నిలువరించాలంటూ ఇన్నేళ్లపాటు దాదాపు అక్కడి అన్ని కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చాడు రాణా. అయితే ఊరట మాత్రం దక్కలేదు.ఈలోపు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో రాణాను భారత్‌కు అప్పగించే విషయంపై ట్రంప్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌ (India)కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన ప్రకటించారు. అందుకు తగ్గట్లే పరిణామాలు చకచకా జరిగి రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది.ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ 10వ తేదీన భారత్‌లో దిగగానే తహవూర్‌ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్ట్ చేసింది. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో అతన్ని తీహార్‌ జైలుకు తరలించారు. 2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించి మొత్తం 10 క్రిమినల్‌ అభియోగాలను రాణా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

BRS KTR Sensational Comments On HCU Gachibowli Lands3
గచ్చిబౌలి భూముల్లో గోల్‌మాల్‌.. పదివేల కోట్ల కుంభకోణం: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. దాదాపు రూ.10వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరతీసిందన్నారు. అటవీ భూమిని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తాజాగా తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్థిక నేరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ జరిగింది. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ స్కాం చేస్తున్నారు. వాల్టా, ఫారెస్ట్‌ యాక్ట్‌లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉల్లంఘించింది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కొత్త గోల్‌మాల్‌కు తెర తీసింది.15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 3D మంత్రాను పెట్టుకున్నారు. HCUలో పర్యావరణ విధ్వంసం, హననం జరుగుతోంది. ఐఎంజీ కుంభకోణంపై ఆనాడు 2014 వరకు ప్రభుత్వం, తర్వాత బీఆర్‌ఎస్‌ కొట్లాడింది. ఈ భూముల వెనుక రూ.10వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. HCU చుట్టూ ఉన్న 400 ఎకరాలు అటవీ భూమి ఉంది. అది అటవీ భూమి అని సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు.. అన్ని రాష్ట్రాల హై కోర్టులకు ఇచ్చింది. 1980 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అటవీ భూమి తాకట్టు పెట్టడానికి అమ్మేందుకు ప్రభుత్వానికి హక్కు ఉండదు.పోడు యాక్ట్ ప్రకారం ఆది అటవీ భూమి అని రేవంత్ రెడ్డికి ముందే తెలుసు. భూమిని అమ్మడానికి ముఖ్యమంత్రి దగ్గరికి బీజేపీ ఎంపీ ఒక ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ బ్రోకర్‌ను తెచ్చారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్త ద్వారా చట్టాలను, ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కారు. మ్యుటేషన్ కాలేదని ప్రభుత్వమే అంటుంది. TGIIC 400 ఎకరాలకు యజమాని కాదు. కేవలం ఒక GO ఆధారంగా TGIIC యజమాని అని ప్రభుత్వం చెబుతోంది. తనది కానీ భూమిని TGIIC తాకట్టు పెట్టే కుట్ర చేసింది.బ్రోకర్‌ ద్వారా కుమ్మకై లోన్‌..400 ఎకరాలకు యాజమాన్య పత్రాలు లేవు.. రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు. 26.6.2024 GO-54 ఒక్కటే ఉంది.. తప్ప ఏమీలేదు. 400 ఎకరాలకు కమిషన్ టైటిల్ కూడా లేదు. కంచెలో గజం విలువ 26900 వందలు ఉంది.. 400 ఎకరాలకు 5239 కోట్ల విలువ మాత్రమే. అక్కడ ఎకరాకు 75 కోట్లకు అమ్మడానికి రెవెన్యూ శాఖ GO విడుదల చేసింది. రూ.5239 కోట్ల విలువైన భూమిని 30,000 వేల కోట్లుగా చిత్రీకరించారు. ప్రభుత్వం.. బ్రోకర్ ద్వారా కుమ్మకై బ్యాంకులో లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.75 కోట్లు అని బ్యాంకుల దగ్గరకు పోయి.. 15కోట్లకు అమ్మే కుట్ర చేశారు. రూ.169 కోట్లు బ్రోకర్‌కు కమీషన్ ఇచ్చారు. కోకాపేటలో భూములను చూపించి 75 కోట్లు ఎకరా అని ప్రభుత్వమే ధర చూపించారు. ఐదు నెలల్లో వ్యాల్యువేషన్ రివైజ్ చేసి 52 కోట్లకు తగ్గించారు. మళ్ళీ మూడోసారి 42 కోట్లకు కుదించారు. రూ.30వేల కోట్లు అని మొదట చెప్పి 16వేల కోట్లకు తగ్గించారు. ఢిల్లీ బ్రోకర్‌కు తనకా పెట్టే ప్రయత్నం చేశారు’ అని విమర్శలు చేశారు.బీకర్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థను ఏ బేసిస్ ప్రకారం ఎంపిక చేశారు?. బీజేపీ ఎంపీ చెప్పారని వడ్డీకి పావుచెరుగా అమ్మే కుట్ర చేశారు. నేను ఉరికే ఆరోపణలు చెయ్యడం లేదు.. దీన్ని వదిలిపెట్టను. RBI గవర్నర్, సెబీ, SFIO, సెంట్రల్ విజిలెన్స్, CBI, మా పార్టీ తరపున ఫిర్యాదు చేయబోతున్నాం. బీజేపీ ఎంపీ పేరు తర్వాత ఎపిసోడ్‌లో బయటపెడతాం. 10 వేల కోట్లకు ప్రభుత్వానిది కానీ భూమిపై ICICI బ్యాంకు లోన్ ఇచ్చారు.కేంద్రం స్పందించాలి..భూమిని ఫీల్డ్ పై చూడకుండా ICICI బ్యాంక్‌ ఇచ్చింది. 10వేల కోట్లు ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియదు. రైతుభరోసా అన్నారు అది ఇవ్వలేదు. నేను రాసిన లేఖలపై కేంద్రం స్పందించకపోతే ఊరుకోం. ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా జరిగింది అనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే విచారణ మొదలు పెట్టాలి. సెబీ, సెంట్రల్ విజిలెన్స్, CBI విచారణ మొదలు పెట్టాలి. భూమిని చూడకుండా 10వేల కోట్లు లోన్ బ్యాంకు ఎలా ఇస్తుంది. HMDA భూములు 60వేల కోట్లు అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం. అవసరం అయితే ప్రధాని కలుస్తాం.. లోక్ సభలో లేవనెత్తుతాం’ అని కామెంట్స్‌ చేశారు.

This Is My Ground: KL Rahul Aggressive Celebration After DC Win On RCB Viral4
ఇది నా హోం గ్రౌండ్‌: కేఎల్‌ రాహుల్‌ సెలబ్రేషన్స్‌ వైరల్‌.. పాపం కోహ్లి!

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. సీజన్‌ ఆరంభం నుంచి ఓటమన్నదే లేకుండా ముందుకు సాగుతున్న అక్షర్‌ సేన.. తాజాగా మరో విజయం సాధించింది. పటిష్ట రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును వారి సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలోనే ఓడించింది.ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul). ఆర్సీబీ విధించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే అక్షర్‌ సేన వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫాఫ్‌ డుప్లెసిస్‌ (2), జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌ (7) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ పోరెల్‌ (7) కూడా చేతులెత్తేశాడు. దీంతో పవర్‌ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ విలవిల్లాడింది.ఆఖరి పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పాఇలాంటి తరుణంలో నేనున్నాంటూ కేఎల్‌ రాహుల్‌ అభయమిచ్చాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా.. మధ్య ఓవర్లలో మాత్రం దూకుడు పెంచి ఆర్సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23 బంతుల్లో 38 నాటౌట్‌)తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు.రాహుల్‌ మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా సిక్సర్‌తో ఢిల్లీ విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో ఢిల్లీ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటగా.. రాహుల్‌ తన విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్న తీరు వైరల్‌గా మారింది."𝙏𝙝𝙞𝙨 𝙞𝙨 𝙢𝙮 𝙜𝙧𝙤𝙪𝙣𝙙" 🔥pic.twitter.com/gKtmfoFvlN— Delhi Capitals (@DelhiCapitals) April 10, 2025 ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా!బ్యాట్‌తో గ్రౌండ్‌లో గీత గీసిన రాహుల్‌.. ఆ తర్వాత జెండా పాతుతున్నట్లుగా బ్యాట్‌తో మైదానంపై కొట్టి.. ‘‘ఇది నా హోం గ్రౌండ్‌’’ అంటూ సైగ చేశాడు. నిజానికి రాహుల్‌ వికెట్‌ తీసేందుకు ఆర్సీబీ ప్రయత్నించి విఫలమైన వేళ.. ఇతర బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన సమయంలో మాత్రం కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు.Kohli is seen celebrating the wicket, glancing at KL Rahul.After the win Rahul stared at Kohli and said "This Is My Home Ground" 🔥Look at Kohli's Reaction 😭😭 pic.twitter.com/uJmO74Jck5— Radha (@Radha4565) April 11, 2025 పాపం కోహ్లి!ఇందుకు కౌంటర్‌గానే రాహుల్‌ తన క్లాసీ ఇన్నింగ్స్‌ తర్వాత కోహ్లికి, ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి ఈ రకంగా రియాక్షన్‌ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆర్సీబీపై ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్‌ రాహుల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.ఈ సందర్భంగా.. ‘‘ఇది నా సొంత మైదానం.. నా ఇల్లు.. నాకంటే ఈ పిచ్‌ గురించి ఇంకెవరికి బాగా తెలుసు?.. నేను ఎప్పుడు ఇక్కడ ఆడినా.. బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తాను’’ అని రాహుల్‌ పేర్కొన్నాడు. కాగా బెంగళూరుకు చెందిన రాహుల్‌ ఆరంభంలో ఆర్సీబీకి ఆడాడు. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను.. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2025లో ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఇప్పటికి ఐదింట మూడు గెలిచింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి అక్షర్‌ పటేల్‌.. బెంగళూరు జట్టుకు రజత్‌ పాటిదార్‌ నాయకత్వం వహిస్తున్నారు.ఐపీఎల్‌-2025: ఆర్సీబీ వర్సెస్‌ ఢిల్లీ👉టాస్‌: ఢిల్లీ.. తొలుత బౌలింగ్‌👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఢిల్లీ విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: కేఎల్‌ రాహుల్‌ (53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 రన్స్‌ నాటౌట్‌).చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్‌?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU— IndianPremierLeague (@IPL) April 10, 2025

KSR Comments On TDP And Janasena Politics5
టీడీపీ, జనసేన మధ్య ఏం నడుస్తోంది?

ఆంధ్రప్రదేశ్‌ కూటమి భాగస్వాములు టీడీపీ, జనసేనల మధ్య అంతా బాగానే ఉందా? లేక ఎవరికి వారు తమదైన రాజకీయ క్రీడలు ఆడేస్తున్నారా? ఈ అనుమానం ఎందుకొస్తోందంటే.. ఒకపక్క సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్‌.. పవన్‌ కళ్యాణ్‌ను అతిగా పొగిడేస్తూంటే.. ఇంకోపక్క పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూండటం!. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్‌ కళ్యాణ్‌ నాకు మంచి మిత్రుడంటూ పలు కార్యక్రమాల్లో ప్రశంసిస్తూండటం.. ఏదో తేడా కొడుతున్నట్టుగానే ఉంది రాజకీయ విశ్లేషకులకు! ఇప్పటికిప్పుడు ఇరు పార్టీల్లో పెద్ద విభేదాలేవీ స్పష్టం కాకపోయినప్పటికీ పిఠాపురం వ్యవహారం మాత్రం వివాదాల్లోనే ఉంటోంది.జనసేన గెలిచిన ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్థానిక నేతలు తాము చెప్పిన వారికే పనులు చేయాలని ఏకంగా లేఖలు రాస్తుండటం కూడా ఇరు పార్టీల మధ్య సయోధ్యపై ప్రశ్నలు విసురుతోంది!. అక్కడ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పవన్ టీడీపీపై ఒత్తిడి చేయగలిగారని అంటారు. అంతేకాక తన బదులు నాగబాబును నియోజకవర్గంలో తిప్పుతూ ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మకు అసలు విలువ ఇవ్వడం లేదు. దాంతో రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. నాగబాబుకు అసాధారణ స్థాయిలో పోలీసులు భద్రత కల్పించడం కూడా ఆసక్తికరమైన విషయమే. రెండు వర్గాల మధ్య ఏదైనా గొడవ చెలరేగితే వచ్చే ఇబ్బందుల రీత్యా ఇలా చేసి ఉండవచ్చు.నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేత తాము చెప్పినవారికే పనులు చేయాలని అధికారులకు ఉత్తరం రాయడం విశేషం. ఇక్కడే కాదు. ఆయా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా, పెత్తనం టీడీపీ వారే చేస్తున్నారన్నది జనసేన కేడర్‌లో బాధగా ఉంది. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే, సమస్య ఏమిటో తెలుసుకోకుండా జనసేన అధిష్టానం తన పార్టీ నేతనే మందలించిందన్న వార్తలు వచ్చాయి. రాజకీయాలలో ఇవన్ని సాధారణంగా జరిగేవే. అయినా ఒక్కొక్కటిగా గొడవలు పెరుగుతూ, ఆ తర్వాత రోజులలో అవే పెద్దవిగా మారుతుంటాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత పవన్ కళ్యాణ్, లోకేశ్‌ల మధ్య స్నేహం పెరిగిన మాట నిజమైనా.. ఎన్నికల తరువాత మాత్రం వీరిద్దరూ అంటీ అంటనట్టుగానే ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత లోకేశ్‌ ఒకరకంగా పవన్ కళ్యాణ్‌ను అవమానించేలా వ్యాఖ్యానించారు కూడా. టీటీడీ అధికారులు, ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే, అది ఆయన పార్టీ అభిప్రాయం అని లోకేశ్‌ తీసిపారేశారు. చైర్మన్‌తో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పించారు తప్పితే పవన్ కోరినట్లు అధికారులపై ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు. క్షమాపణలు కూడా చెప్పించ లేదు. పవన్ కళ్యాణ్ వద్ద పనిచేసే అధికారుల నియామకం విషయంలో కూడా లోకేశ్‌ జోక్యం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దానిపై పవన్ ఢిల్లీలో కూడా నిరసన చెప్పారని కథనాలు వ్యాపించాయి.అటవీ శాఖకు చెందిన భూమిలో ఉందన్న సాకుతో కాశీనాయన ఆశ్రమంలో భవనాలు కూల్చిన ఘటనపై పవన్ మాట్లాడ లేదు కానీ, లోకేశ్‌ క్షమాపణ చెప్పడం విశేషం. నిజానికి లోకేశ్‌కు జనసేనతో పొత్తు అంత ఇష్టం లేదని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. దానికి తగినట్లే పవన్‌కు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండదని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పాలిట్‌బ్యూరో నిర్ణయమని లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయినా పవన్ సర్దుకుపోయారు. బీజేపీ వారు ఏభై సీట్లు డిమాండ్ చేయమని సూచించినా, పవన్ పట్టుబట్టలేదు. పైగా టీడీపీకి చెందిన వారికే కొందరికి తన పార్టీ టిక్కెట్లు ఇచ్చి చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు.2017 ప్రాంతంలో లోకేశ్‌పై పవన్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసినా 2020 నాటికి రాజీపడిపోయి చంద్రబాబుతో చేతులు కలిపారు. 2024లో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్‌ల కన్నా లోకేశ్‌ పవర్‌ఫుల్‌ అయ్యారన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. తాను కూడా అలాగే ఇతర శాఖలలో జోక్యం చేసుకోవాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, పౌర సరఫరాల శాఖలో వేలు పెట్టి ‘సీజ్ ద షిప్’ అని అధికారులను ఆదేశించి పవన్ నవ్వులపాలయ్యారు. చంద్రబాబు, పవన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ఇంతవరకు కనిపించలేదు కానీ.. లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అంశంలో పవన్ అభ్యంతరం చెప్పారని రెండు పార్టీలలో గుసగుసలు వినిపించాయి. అందువల్లే లోకేశ్‌ కోరిక తీరలేదని అంటారు. ఇప్పటికే లోకేశ్‌ను సీఎంను చేయాలని చంద్రబాబుపై కుటుంబపరంగా ఒత్తిడి ఉందని చెబుతారు. అయినా పవన్ కళ్యాణ్ నుంచి సమస్య వస్తుందని చంద్రబాబు సర్ది చెబుతుండవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ఇక, ఇది నిజమా? కాదా? అన్నది చెప్పలేం కానీ.. పవన్ కళ్యాణ్ ఆయా సభలలో చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని, ఆయన సమర్థుడని, అనుభవజ్ఞుడని పనికట్టుకుని పొగుడుతున్న తీరు లోకేశ్‌ అనుచరులకు మింగుడుపడటం లేదనిపిస్తుంది. కేవలం లోకేశ్‌ను సీఎం కానివ్వకుండా, లేదా డిప్యూటీ సీఎం ప్రమోషన్ రానివ్వకుండా చూడడానికి పవన్ ప్రకటనలు ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్‌ వ్యూహం మార్చి తన ప్రమోషన్‌కు పవన్ కళ్యాణ్ నుంచి ఆటంకం లేకుండా ఉండడానికి ప్రయత్నాలు ఆరంభించారా అన్న సందేహం కలుగుతుంది. కొన్నాళ్లుగా లోకేశ్‌ తనకు సంబంధం లేని శాఖలలో కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. ఆ సభలలో ఒకటికి రెండుసార్లు 'పవనన్న, పవనన్న’ అని ప్రస్తావిస్తూండటం.. ‘పవనన్న పట్టుబడితే సాధించి తీరుతారని, కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తున్నారని’ పొగడ్తలు కురిపిస్తున్నారు.గతంలో ఇలాంటి ప్రోగ్రాంలను చంద్రబాబు వదలి పెట్టేవారు కారు. ఇప్పుడు తన కుమారుడి ఆధిపత్యానికి ఆయన అడ్డు చెప్పడం లేదు. దాంతో టీడీపీ మంత్రులు లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రకాశం, అనకాపల్లి జిల్లాలలో లోకేశ్‌ పర్యటనలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు తర్వాత పెత్తనం ఎటూ లోకేశ్‌దే కనుక ఇందులో పెద్దగా ఆక్షేపించవలసింది ఉండకపోవచ్చు. పార్టీ పరంగా అయితే ఏమైనా చేసుకోవచ్చు కాని, ప్రభుత్వ పరంగా లోకేశ్‌ ఇలా పెత్తనం చెలాయించడం కరెక్టేనా అన్న చర్చ వస్తుంది.మరోవైపు, పవన్ కళ్యాణ్ మాత్రం సభలలో చంద్రబాబునే పొగుడుతూ, లోకేశ్‌ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అయినప్పటికీ లోకేశ్‌ బుజ్జగించి పవన్‌ను తన దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చన్నది పలువురి భావన. పదిహేనేళ్లు కలిసి ఉండాలని అనుకుంటున్నప్పుడు మరీ తేడా ఏదైనా వస్తే తప్ప భవిష్యత్తులో లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించక తప్పని స్థితి పవన్‌కు వస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు ఇప్పటికే 74 ఏళ్లు వచ్చినందున భవిష్యత్తులో ఆ పరిణామం జరగవచ్చు. లోకేశ్‌ మరో మాట కూడా చెబుతున్నారు.టీడీపీ, జనసేనల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కూర్చుని పరిష్కరించుకుంటాము తప్ప వేరు పడబోమని అన్నారు. ఇది కూడా గమనించవలసిన అంశమే. రాజకీయాలలో పైకి ఒకటి చెబుతారు. లోపల జరిగేవి వేరుగా ఉంటుంటాయి. అలాగే పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతూ, కలిసి ఉన్నట్లు కనిపిస్తూనే ఎవరికి వారు పైచేయి తెచ్చుకునేందుకు యత్నించినా ఆశ్చర్యం ఉండదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Indian Railways Railway Tatkal Train Tickets changes for April 156
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్‌ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు

ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది.. కొత్త రూల్స్ 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. బుకింగ్ టైమ్స్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయి. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా IRCTC ఈ రూల్స్ తీసుకొచ్చింది.తత్కాల్ అనేది ప్రయాణీకులకు.. తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టిక్కెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక విధానం. ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందినప్పటికీ.. తత్కాల్ సిస్టం ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్-సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.కొత్త టైమింగ్ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పులలో ఒకటి 'సమయం' అనే చెప్పాలి. క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది. తత్కాల్ టికెట్స్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త టైమింగ్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 11:00 గంటలకు, నాన్ ఏసీ / స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12:00 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే.. ఈ రోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.IRCTC వెబ్‌సైట్ & మొబైల్ యాప్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్‌గ్రేడ్ చేశారు. కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు ఈ కింద గమనించవచ్చు..➤ IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి➤ ట్రైన్, క్లాస్ ఎంచుకోండి (ఏసీ/నాన్ ఏసీ)➤ డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలక్ట్ చేసుకోండి➤ ప్రయాణీకుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నెంబర్‌ను ఎంటర్ చేయండి➤ చెల్లింపు పేజీకి వెళ్లి బుకింగ్ పూర్తి చేయండికొత్త మార్పులు➤ సమయం ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్ వినియోగదారుల కోసం ప్రయాణీకుల వివరాలను స్వయంచాలకంగా నింపడం.➤ చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది.➤ బుకింగ్ లోపాలను తగ్గించడానికి కాప్చా ధృవీకరణ సరళీకృతం చేసారు.➤ యాప్ లేదా వెబ్‌సైట్ రెండింటికీ ఒకేవిధమైన లాగిన్ సిస్టమ్➤ ఒక తత్కాల్ PNR కింద గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.➤ తత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ వర్తించదు.➤ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి.ఇదీ చదవండి: రూ. లక్షకు చేరువలో బంగారం: ఇక గోల్డ్ కొనడం కష్టమే?

Sai Rajesh Gets Emotional Over Sampoornesh Babu Financial Help7
సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్‌ ఆన్సరిదే!

సంపూర్ణేశ్‌బాబును హీరో చేసిన డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ (Sai Rajesh). హృదయ కాలేయం చిత్రంతో సంపూ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ విజయం సాధించడంతో అతడు వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ఇతడు సోదరా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ ఏప్రిల్‌ 25న విడుదల కానుంది.ఏ హీరో ఒప్పుకోలేదుగురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు సాయి రాజేశ్‌ అతిథిగా విచ్చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను, సంపూర్ణేశ్‌ (Sampoornesh Babu) ఒక షార్ట్‌ ఫిలిం చూడటానికి ఇదే ప్రసాద్‌ ల్యాబ్‌కు వచ్చాం. ఆ సమయంలో నేను బాధలో ఉన్నాను. 'యార్క్‌ యార్‌' అనే తమిళ సినిమా చూసి ఓ పిచ్చి మూవీ తీయాలనుకున్నాను. దానిచుట్టూ కామెడీ క్రియేట్‌ చేయాలనుకున్నాను. ఈ కాన్సెప్ట్‌ను అప్పుడే ఎదుగుతున్న పలువురు హీరోలకు చెప్పాను. ఎవరూ ఒప్పుకోలేదు. నా బతుకు అయిపోయిందనుకున్నాను. హీరో దొరికేశాడుఈ ప్రసాద్‌ ల్యాబ్‌లో షార్ట్‌ ఫిలిం చూసి బయట చెట్టు కింద నిల్చున్నప్పుడు సంపూ రంగురంగుల చొక్కాతో కనిపించాడు. అతడిని చూసి నాకు హీరో దొరికేశాడు అనుకున్నాను. ఇది జరిగి 13 ఏళ్లవుతోంది. ఇదంతా కలలా ఉంది. అప్పుడు నాకు రూ.60 వేలదాకా అప్పు ఉంది. కథ డిస్కషన్‌ కోసం సంపూ సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చేవాడు. ఏదో ఒక పార్క్‌లో కూర్చుని కథ గురించి మాట్లాడుకుని సాయంత్రానికి బస్‌స్టాప్‌లో దింపేసేవాడిని. ఇంటికి తిరిగెళ్లడానికి నీ దగ్గర డబ్బులున్నాయా? అని అడిగితే లేవన్నాడు.గిల్టీగా ఫీలయ్యాదాంతో నా దగ్గరున్న రూ.500లలో రెండు వందలు అతడికి ఇచ్చేవాడిని. ఒకసారి ఏమైందంటే నేనేదో పనిలో పడిపోయి అతడి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత ఆ విషయమే మర్చిపోయాను. అప్పుడు సంపూ కృష్ణానగర్‌లో మడత మంచం అద్దెకు తీసుకుని రోజంతా అక్కడే ఉన్నాడు. నాకు మళ్లీ ఫోన్‌ చేసి.. అన్నా, నేను వచ్చేశాను అని చెప్పాడు. నాకు చాలా గిల్టీగా అనిపించింది. సినిమా పిచ్చితో నేను చెడిపోయిందే కాక మరొకరిని చెడగొడుతున్నానా? డబ్బులు లేకుండా సినిమా తీయగలనా? ఇలా రకరకాలుగా అనుకున్నాను.లక్షల్లో రెమ్యునరేషన్‌చివరకు ఎలాగోలా సినిమా తీశాం. తను హీరో అయ్యాడు, నేను డైరెక్టర్‌ అయ్యాను. హృదయకాలేయం (Hrudaya Kaleyam Movie) సూపర్‌ హిట్‌ అయ్యాక సంపూర్ణేశ్‌కు లక్షల్లో రెమ్యునరేషన్‌ ఇచ్చేవారు. నేను సింగిల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్‌ఫామ్‌లో ఉండేవాడిని. సంపూ సిద్దిపేటలో నాలుగంతస్తుల ఇల్లు కట్టేశాడు. నేను ఈఎమ్‌ఐలో నానో కారు కొనుక్కుంటే మనోడు ఫోర్డ్‌ కొన్నాడు. కొబ్బరిమట్ట సినిమా సమయంలో నేను ఆర్థికంగా చితికిపోయానని సంపూ గ్రహించాడు. రూ.6 లక్షలు పెట్టి హోండా కారు కొనిచ్చాడు. ఇల్లు కొనుగోలు..మణికొండలో ఒక అపార్ట్‌మెంట్‌ కోసం రూ.12 లక్షలు కట్టి.. మిగతా రూ.13 లక్షలు నువ్వు ఎలాగైనా కట్టుకో అన్నాడు. ఆ ఇంటి విలువ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగిపోయింది. తను సంపాదించిన డబ్బు.. నాకోసం, తన చుట్టూ ఉండేవాళ్లకోసం, సమాజం కోసం ఖర్చుపెడతాడు. ఓ వ్యక్తి నేను సంపూను రోడ్డు మీద వదిలేశాను అని కామెంట్‌ చేశాడు. రోడ్డు మీద వదిలేయడం ఏంట్రా? ఏ రోజుకైనా సంపూ కోసం నేనుంటా.. నాకోసం సంపూ ఉంటాడంతే! అని సాయి రాజేశ్‌ ఎమోషనలయ్యాడు.చదవండి: సూర్య కొత్త సినిమాలో హీరోయిన్‌ 'అనఘా రవి'కి ఛాన్స్‌

Egg prices continue rise in US8
‘గుడ్లు’ తేలేసేలా.. అమెరికాలో డజను కోడిగుడ్లు రూ.536

వాషింగ్టన్‌: అమెరికాలో కోడి గుడ్లు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నెల నెలా రేటు పెరుగుతూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో డజను కోడి గుడ్లు ధర 5.90 డాలర్లు (భారత కరెన్సీలో రూ.508.76) ఉండగా మార్చి నెలలో 6.23 డాలర్లు (రూ.536) ఫిబ్రవరిలో 5.90 డాలర్లకు చేరింది. అయితే, అమెరికాలో కోడి గుడ్లు ధరలు ఆకాశాన్ని తాకడం వెనుక బర్డ్ ఫ్లూ ఓ కారణం. బర్డ్‌ ఫ్లూని అరికట్టేందుకు అమెరికా గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించింది. ఆ ప్రభావం రిటైల్ మార్కెట్‌లోని గుడ్ల ధరలపై పడింది. ట్రంప్‌ వరుస ప్రకటనలు ఫలితంగా గుడ్లు తేలేసేలా.. కొండెక్కిన కోడిగుడ్ల ధరలతో అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనలపై.. గత కొన్ని వారాలుగా తన పాలనలో గుడ్లు ధరల్ని తగ్గించామంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోల్‌సేల్ గుడ్ల ధరలు 59శాతం నుంచి చివరికి 79 శాతానికి తగ్గాయని చెప్పారు’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీఇదే విషయంపై వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లి సైతం ప్రస్తావించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీని బలోపేతం చేసినట్లు, కొత్త నిబంధనలను సడలించి కోడి గుడ్ల సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూపై మేం తీసుకున్న చర్యలు ఫలితాల్ని ఇస్తున్నాయి’ అని పేర్కొన్నారు. గుడ్ల ధరలపై భిన్నాభిప్రాయాలు అమెరికాలో అమాంతం పెరిగిపోతున్న గుడ్ల ధరలపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఆహార ఆర్థిక నిపుణుడు డేవిడ్ ఓర్టెగా మాట్లాడుతూ.. హోల్‌సేల్ ధరలు తగ్గినా, ఆ ప్రభావం రిటైల్ ధరలపై పడేందుకు కొన్ని వారాలు సమయం పడుతుందన్నారు. పాల్ట్రీ ఫారాల్లో బర్డ్ ఫ్లూ తగ్గడం, సరఫరా పెరగడం వల్ల హోల్‌సేల్ ధరలు తగ్గినప్పటికీ.. రిటైల్ ధరలు ఎంత తగ్గుతాయో అంచనా వేయడం కష్టం’ అని కార్నెల్ యూనివర్శిటీకి ఆర్థిక నిపుణుడు క్రిస్టఫర్ బి. బారెట్ చెప్పారు.

Coconut Water: Why Should Avoid Drinking Too Much 9
ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్‌ వద్దు!

ఎండ వేడిని తట్టుకోవడానికి, ఎండా కాలంలో సత్తువతో ఉండడానికి కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంతమంచిది అనుకుంటారు చాలామంది. అయితే ఇది సరిౖయెనది కాదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే...కొబ్బరి నీళ్లలో ΄పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయులు పెరుగుతాయి. శరీరంలో లవణాల సమతూకం దెబ్బతింటుంది. కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది.కొబ్బరినీళ్లలో అధిక పొటాషియం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లలో అధిక చక్కెర కంటెంట్‌ వల్ల బరువు పెరగడానికి దారి తీయవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు, దంత క్షయ ప్రమాదం పెరగవచ్చు.కొబ్బరితో అలర్జీలు అసాధారణమేమీ కాదు. కొంతమందికి కొబ్బరి నీటి వల్ల అలెర్జీలు రావచ్చు. దద్దుర్లు, వాపుతోబాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు.హైబీపి ఉన్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, పేగు పూత వ్యాధి ఉన్న వాళ్లు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండటమే మంచిది. (చదవండి: వేగాన్‌ వర్సెస్‌ నాన్‌వెజ్‌ డైట్‌: ఈ కవల సోదరుల ప్రయోగంలో వేటిలో విటమిన్లు ఎక్కువంటే..?)

Donlad Trump Govt Full Focus On Inidan Students In USA10
భారత విద్యార్థులపై ట్రంప్‌ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడి వెళ్లినా, ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలేమైనా చేస్తున్నారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? సరైన పత్రాలతోనే వచ్చారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. హెచ్‌–1బీ వీసా పొందిన వారిపైనా నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన వర్సిటీలపై దృష్టిఅమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతోంది. 2022–23లో 2,68,923 మంది వెళ్తే, 2023–24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్‌ వర్సిటీ, నార్త్‌ ఈస్టర్న్‌ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలోనే లక్షకుపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలామంది క్యాంపస్‌ల బయట పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్‌ ఏంజెల్స్‌ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. తలనొప్పిగా ఓపీటీ అమెరికాలో ఎంఎస్‌ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు (ఇవి కూడా స్కిల్డ్‌ మాత్రమే) ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ఇస్తారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్‌ సర్కార్‌ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్‌ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్‌ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున రూ.35 లక్షల నుంచి రూ.49 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉత్త చేతులతో ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితిని తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ఏఐతో పటిష్టమైన డేటా ప్రతి విదేశీ విద్యార్థిపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్‌ ఎంత? అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఏయే ఉద్యోగాలు చేశాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏయే లొకేషన్స్‌లో ఉన్నాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్‌ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు? ఇందులో విద్యార్థులుగా ఉన్నవారికి ఎంత? ఎందుకు? అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు. కన్సల్టెన్సీలపై నిఘా అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయభార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్య కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటివరకు 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది. పత్రాలన్నీ చూస్తున్నారు ఇండియా నుంచి విచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. – విక్రమ్‌ శశాంక్, ప్రవాస భారతీయుడు. ఓపీటీ తీసేస్తే పరిస్థితి ఏమిటి? రూ.45 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్‌ టైం జాబ్‌ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తే తిరిగి ఇండియా వెళ్లిపోవాలి. అక్కడ ఉద్యోగం వస్తుందో రాదో చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు. – అఖిలేష్‌ పూనాటి, అమెరికాలో ఎంఎస్‌ పూర్తిచేసిన విద్యార్థి. హెచ్‌–1బీకీ తిప్పలే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడివాళ్లకే (అమెరికన్లకు) అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియాతోపాటు ఇతర దేశాలవారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్‌ వెళ్తున్నారు. భవిష్యత్‌లో హెచ్‌–1బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే. – మంజులా రాయ్, హెచ్‌–1బీ వీసాపై అమెరికా వెళ్లిన ఎంఎన్‌సీ ఉద్యోగిని. అమెరికాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులున్న వర్సిటీలు యూనివర్సిటీ ప్రాంతం విద్యార్థుల సంఖ్య న్యూయార్క్‌ వర్సిటీ న్యూయార్క్‌ 27,247 నార్త్‌ ఈస్ట్రన్‌ వర్సిటీ బోస్టన్‌ 21,023 కొలంబియా వర్సిటీ న్యూయార్క్‌ 20,321 అరిజోనా స్టేట్‌ వర్సిటీ టెంపే 18,430 యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా లాస్‌ ఏంజెల్స్‌ 17,469.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement