Top Stories
ప్రధాన వార్తలు

పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఆక్వా రైతుల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మండిపడ్డారు. ‘‘చంద్రబాబూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు, మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనది. గతంలో ఈ ఫీడ్‌పై 15 శాతం సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకు రూ.6.50లు చొప్పున పెంచారు. ఫీడ్ తయారు చేసే ముడిసరుకులపై ఇప్పుడు సుంకం 15 శాతం నుంచి 5 శాతంకి తగ్గింది. అలాగే సోయాబీన్ రేటు కిలోకు గతంలో రూ.105లు ఉంటే ఇప్పుడు రూ.25లకు పడిపోయింది. మరి ముడిసరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్ రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడంలేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలన్నీకూడా 50 కౌంట్ లోపువే. అమెరికాకూడా మన దేశంపై విధించిన టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా? ఎందుకు పెరగడంలేదు? టారిఫ్ సమస్యతో సంబంధం లేని యూరప్ దేశాలకు 100 కౌంట్ రొయ్యలు ఎగుమతి అవుతాయి. వీటి రేటుకూడా పెరగడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.220ల రేటు కూడా రైతులకు రావడంలేదు. 100 కౌంట్ రొయ్యలకు రూ.270ల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..మా ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఎంపెవరింగ్ కమిటీ ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలను ఇప్పుడు అచేతనంగా మార్చేశారు. వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. 1. @ncbn గారూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు,…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2025

చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్ విధింపు
వాషింగ్టన్: అమెరికా,చైనా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా చైనాపై మరోసారి అమెరికా సుంకం విధించినట్లు సమాచారం. చైనాపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకం విధించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్ మొత్తం 145 శాతానికి చేరుకుందని వైట్‌హౌస్ అధికారి అమెరికన్ మీడియా సంస్థ సీఎన్బీసీకి ధృవీకరించారు.

Tahawwur Rana: తహవూర్ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక
ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసు ప్రధాన నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణాను (Tahawwur Rana) భారత్‌కు తరలించారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే రాణాను ఎన్ఏఐ(National Investigation Agency) అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా తహవూర్ రాణా గురించి ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేసింది.ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవర్ రాణాను భారత్‌కు తీసుకురావడంలో ఎన్ఐఏ విజయవంతమైంది. ముంబై దాడులకు పడిన పాల్పడిన కుట్ర దారున్ని న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నాం. అమెరికాలో రాణాకు అన్ని న్యాయపరమైన దారులు మూసుకు పోయాయి. 2023 మే 16న భారత్‌కు అప్పగించేందుకు అమెరికా స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. pic.twitter.com/nS7dA58W55— NIA India (@NIA_India) April 10, 2025 రాణా ఫైల్ చేసిన అన్ని పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమెరికా భారత్‌లోని కీలక సంస్థల సమన్వయంతో రాణాను భారత్‌కు తీసుకు రాగలిగాం. ముంబై ఉగ్రదాడుల కుట్ర దారు రాణా. డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నాడు. లష్కర్ ఈ తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ కుట్ర దారులు ఇందులో భాగస్వాములు. ముంబై ఉగ్రదాడులో 166 మంది చనిపోయారు 238 మంది గాయపడ్డారు’అంటూ అధికారిక నోట్‌ను విడుదల చేసింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో భారీ గాలులు మొదలయ్యాయి. పలు చోట్ల వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు గంటల పాటు హైదరాబాద్ నగరంలో గాలి దుమారంతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తెలంగాణలో పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ భద్రాద్రి ములగు భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.హైదరాబాద్‌లో హైడ్రా డిజాస్టర్ టీం అప్రమత్తమైంది. మొదలైన భారీ గాలులు వీస్తుండటంతో చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదాలు అధికంగా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ ప్రజలను అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి సర్దార్ నగర్, రావిరాల,తుక్కుగూడ, శ్రీనగర్, ఇమామ్ గూడా, హర్షగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గాలిలో తేమ శాతం పెరిగి గాలి దుమారంతో వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్‌లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. వికారాబాద్, సంగారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ రెండు జిల్లాలకు వచ్చే మూడు గంటల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు గంటల పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.

#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
టీమిండియా స్టార్ ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 1,000 ఫోర్లు బాదిన తొలి ప్లేయర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఈ రేర్ ఫీట్‌ను సాధించాడు.కోహ్లి ఇప్పటివరకు ఐపీఎల్లో 249 మ్యాచ్‌లు ఆడి 1001 బౌండరీలు బాదాడు. కోహ్లి తర్వాతి స్ధానంలో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(920) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి ఫర్వాలేదన్పించాడు. 14 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేశాడు.అదే విధంగా ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు కోహ్లి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 249 ఇన్నింగ్స్‌ల్లో 280 సిక్సర్ల బాదాడు. మరో మూడు సిక్సర్లు కొడితే భారత కెప్టెన్ రోహిత్ శర్మను కోహ్లి అధిగమిస్తాడు. రోహిత్ ఐపీఎల్లో 256 ఇన్నింగ్స్‌ల్లో 282 సిక్సర్లు బాదాడు.ఐపీఎల్లో అత్యధిక బౌండరీలు బాదిన టాప్-5 ఆటగాళ్లు..1001* – విరాట్ కోహ్లీ920 – శిఖర్ ధావన్899 – డేవిడ్ వార్నర్885 – రోహిత్ శర్మ761 – క్రిస్ గేల్ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు..క్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 282విరాట్ కోహ్లి- 278ఎంఎస్ ధోని- 259ఏబీ డివిలియర్స్- 251చదవండి: సంచలనం.. 64 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం

అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
టైటిల్: గుడ్ బ్యాడ్ అగ్లీనటీనటులు: అజిత్ కుమార్, త్రిష, సునీల్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్ తదితరులుదర్శకత్వం: అధిక్ రవిచంద్రన్నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్ఎడిటర్: విజయ్ వేల్‌కుట్టిసినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజంసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025విదాముయార్చి తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. విదాముయార్చి ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తాజా యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ హీరోగా పేరున్న అజిత్.. ఈ సినిమాతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులతో గుడ్ అనిపించాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.గుడ్ బ్యాడ్ అగ్లీ కథేంటంటే..ముంబయిలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ ఏకే(అజిత్ కుమార్) అలియాస్ రెడ్ డ్రాగన్. అతనంటే విదేశాల్లో ఉండే గ్యాంగస్టర్లకు సైతం హడల్. అలా వరల్డ్ ఫేమస్ గ్యాంగ్‌స్టర్ అయిన ఏకే.. తన భార్య రమ్య(త్రిష) కోసం తన వృత్తిని వదిలేసేందుకు సిద్ధమవుతాడు. భార్యకు, తన కుమారుడు విహాన్‌కి (కార్తీక్ దేవ్) ఇచ్చిన మాట కోసం.. జైలుకు వెళ్తాడు. అలా జైలుకెళ్లిన ఏకే దాదాపు 17 ఏళ్ల తర్వాత విడుదలై.. 18వ పుట్టినరోజు నాడు తన కుమారుడిని చూసేందుకు వచ్చిన ఏకేకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి? తండ్రి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విహాన్.. ఒక అమ్మాయి ప్రేమ కారణంగా.. అనూహ్యంగా ఓ కేసులో జైలుకు వెళ్తాడు. అసలు కుమారుడిని చూసేందుకు వస్తున్న అజిత్‌ను టార్గెట్ చేసింది ఎవరు? తండ్రి వల్లే తన కుమారుడు జైలుకు వెళ్లాడని భావిస్తున్న రమ్య(త్రిష) ఆ తర్వాత ఏం చేసింది? అజిత్‌కు.. విహాన్ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? లేదంటే త్రిష వల్లే విహాన్ కేసులో చిక్కుకున్నాడా? చివరికీ ఈ కేసు నుంచి తన కుమారుడిని అజిత్ బయట పడేశాడా? కుమారుడిని విడిపించుకునేందుకు త్రిష ఏం చేసింది? విహాన్ ప్రేమించిన అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే గుడ్ బ్యాడ్ అగ్లీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..గుడ్ బ్యాడ్ అగ్లీ..టైటిల్ వినగానే అందరికీ కాస్తా కొత్తగానే అనిపిస్తూ ఉండొచ్చు. ఇది చూసి సగటు ప్రేక్షకునికి అంతా ఫుల్ యాక్షన్, వయోలెన్స్ ఉంటుందేమో అనిపించి ఉంటుంది. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన ఈ కథ.. స్పెయిన్‌లో ముగించేలా ప్లాన్ చేశాడు డైరెక్టర్. యాక్షన్ హీరోగా పేరున్న అజిత్‌ను ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే డైరెక్టర్ చూపించాడు. ఫస్ట్ హాఫ్‌లో అజిత్ జైలు జీవితం, భార్య త్రిషతో ఉన్న అనుబంధం చుట్టూ తిరుగుతుంది. జైలులో అజిత్ ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు మాత్రం హై ఫీస్ట్‌లా అనిపిస్తుంది. యాక్షన్ సినిమా అంటే అంతా రక్తపాతంలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.. కానీ అధిక్ మాత్రం ఫైట్స్‌ను తనదైన డిఫరెంట్ స్టైల్లో చూపించారు. టాలీవుడ్ నటుడు సునీల్ స్టైల్ మాత్రం తెలుగు అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది.జైలు నుంచి రిలీజ్‌కు ఇంకా మూడు నెలలు ఉండగా.. ముందుగానే అజిత్ బయటికి రావడం..ఆ తర్వాత జరిగే పరిణామాలు సగటు ప్రేక్షకునికి రోటీన్‌గానే అనిపిస్తాయి. కానీ ఏకే బయటికి వచ్చాకే అసలు కథ మొదలవుతుంది. అలా ఇంటర్వెల్‌కు ముందు ఓ బిగ్ ఫైట్ సీన్‌తో బ్యాంగ్ పడేశాడు. ఇక్కడే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందన్న టైమ్‌లోనే ఇంటర్వెల్‌కు ముందు ప్రధాన ప్రతినాయకుడు అర్జున్ దాస్(జానీ)కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ కావడంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ మిస్సవుతుంది. ట్విస్ట్‌లు కాస్తా రివీల్ చేయడంతో సెకండాఫ్ ఆడియన్స్ ఉహకందేలా చేశాడు దర్శకుడు. అయితే ఫైట్ సీక్వెన్స్‌లో జీవీ ప్రకాశ్ బీజీఎం మాత్రం అదిరిపోయింది. అలాగే సాంగ్స్ కూడా ఫర్వాలేదనిపిస్తాయి.ఇక ద్వితీయార్థం వచ్చేసరికి ముంబయితో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్యాంగస్టర్లకు సైతం చెమటలు పట్టించే రెడ్ డ్రాగన్‌గా ఏకే ఎలా మారాడు? అతని ప్రస్థానం ఎలా మొదలైంది? అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ టీమ్ చేసే ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నా.. కొత్తదనం లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తాయి. కానీ యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. కుమారుడి(విహాన్) కోసం ఏకే చేసే పోరాట సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే సెకండాఫ్‌లో సిమ్రాన్(సుల్తానా) ఎంట్రీతో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగుతున్న కథలో కామెడీ పండించాడు. సాంగ్స్‌లో ఎక్కువగా తమిళం స్లాంగ్ రావడంతో తెలుగు ఆడియన్స్‌కు అంతా ఆసక్తిగా అనిపించదు. క్లైమాక్స్ సీన్ వచ్చేసరికి.. అర్జున్ దాస్‌తో ఫైట్స్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్‌లోనూ కామెడీ పండించడం అధిక్ రవిచంద్రన్‌కే సాధ్యమైంది. చివర్లో కేజీఎఫ్, యానిమల్ మూవీ స్టైల్లో క్లైమాక్స్ ఉండడంతో కొత్తగా అనిపించదు. చివరికీ మనం బ్యాడ్ నుంచి గుడ్‌గా మారినా.. మనల్ని మళ్లీ బ్యాడ్ వైపే తీసుకెళ్తే ఎలా ఉంటుందనేది గుడ్ బ్యాడ్ అగ్లీతో సందేశమిచ్చాడు డైరెక్టర్. యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం ఫుల్ మీల్స్.. అలా కాకుండా ఏదైనా కొత్తదనం ఉంటుందన్న ఆశతో వెళ్తే మాత్రం బ్రేక్ ఫాస్ట్ చేసిన ఫీలింగ్‌తో బయటికొస్తారు.ఎవరెలా చేశారంటే..యాక్షన్ హీరోగా పేరున్న అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఏకే స్టైల్లో మరోసారి అదరగొట్టారు. త్రిష తన పాత్రలో జీవించేసింది. సీనియర్ హీరోయిన్గా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ నటుడు సునీల్, కోలీవుడ్ కమెడియన్ కింగ్స్లే, సిమ్రాన్, ప్రకాశ్ దేవ్, ప్రభు, ప్రసన్న, టినూ ఆనంద్, జాకీ ష్రాఫ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి నాయకుడిగా అర్జున్ దాస్ డిఫరెంట్ స్టైల్లో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాశ్ బీజీఎం ఈ సినిమాకు అదనపు బలం. అలాగే నేపథ్య సంగీతం కూడా ఫర్వాలేదు. ఎడిటర్ విజయ్ వేల్‌కుట్టి కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!
వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రావంటూ వివాదాస్పద తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్).. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ అత్యాచార కేసులో బాధితురాలిది కూడా తప్పు ఉందని పేర్కొంటూ నిందితుడికి ఏకంగా బెయిల్ మంజూరు చేసింది.లక్నో: ఢిల్లీలో ఉంటూ పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని తన క్లాస్మేట్ అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. .. మద్యం మత్తులో ఉన్న తనను అతని బంధువుల ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే సాక్ష్యాలు పరిశీలనలో అది అబద్ధమని, పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిశారని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ధర్మాసనం కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటన కిందటి ఏడాది సెప్టెంబర్‌లో జరిగింది. పీజీ చదువుతున్న బాధితురాలిని ఆమె స్నేహితులు హౌజ్ ఖాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఆహ్వానించారు. అయితే అర్ధరాత్రి 3గం.దాకా ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె చిత్తుగా తాగింది. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఆమె తన గదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓ స్నేహితుడిని అతని ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరింది. అయితే.. బాగా మత్తులో ఉన్న ఆమెను నిందితుడు తన బంధవులు ప్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నది ఆమె ఆరోపణ. ఈ కేసులో కిందటి ఏడాది డిసెంబర్ నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. ఇక.. ఈ కేసులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరీ నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెంచ్ బెయిల్ మంజూరు చేసింది మార్చి 11వ తేదీనే. కానీ, పలు ఆంగ్ల మీడియా వరుస కథనాలతో ఇప్పుడు హైలైట్ అవుతోంది. అంటే..ఇదే కోర్టుకు చెందిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన వివాదాస్పద తీర్పు కంటే ముందు ఈ కేసు విచారణ జరిగిందన్నమాట!. మార్చి 17వ తేదీన ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది కూడా.

పళ్లు రాలగొడతా రాస్కెల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా తిట్ల పురాణం
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రవిపై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్లు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లు లంకించుకున్నారు. గాడిదలను కాస్తున్నారా? కళ్లు కనిపించడం లేదా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. గురువారం ఆయన ఎండాడలో పర్యటించారు. తాగేందుకు నీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక వైపు.. సంక్షేమ పథకాలను అందించడం లేదు. మరో వైపు.. అభివృద్ధి కూడా జరగడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక.. ఆ అధికారిపై గంటా నోరు పారేసుకున్నారు. గంటా తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మంగళవారం.. మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్– 4లోని ఆయన ఇంటికి వెళ్లారు.ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు.

TCS Q4 results: టీసీఎస్ తడబాటు.. లాభం, ఆదాయాలు ఇలా..
దేశ ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి (Q4FY25) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభంలో స్వల్ప క్షీణతను నివేదించింది. అయినప్పటికీ బలమైన ఒప్పంద విజయాలు, స్థిరమైన ఆదాయ వృద్ధి పథాన్ని ప్రదర్శించింది.టీసీఎస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.12,434 కోట్ల నుంచి 1.69 శాతం తగ్గి రూ.12,224 కోట్లుగా నమోదైంది. ఈ స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ, త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.3% పెరిగి రూ .64,479 కోట్లకు చేరుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దాని స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోంది. ఇక వాటాదారుల ఆమోదానికి లోబడి, టీసీఎస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ .30 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.పూర్తి సంవత్సరానికి పనితీరును పరిశీలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం రూ.45,908 కోట్లతో పోలిస్తే 5.76 శాతం పెరిగి రూ.48,553 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ.2,59,286 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,45,315 కోట్లతో పోలిస్తే 5.69 శాతం పెరిగింది.ఈ నివేదికలోని ముఖ్యమైన గణాంకాల్లో ఒకటి టీసీఎస్ డీల్ పైప్ లైన్. క్యూ3లో 10.2 బిలియన్ డాలర్ల నుంచి గణనీయంగా పెరిగి 12.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను కంపెనీ పొందింది. ఇది దాని డిజిటల్ పరివర్తన సేవలు, క్లౌడ్ పరిష్కారాలకు బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.లాభాల తగ్గుదల కొన్ని ఆందోళనలను లేవనెత్తినప్పటికీ, టీసీఎస్ స్థిరమైన డీల్ వేగం, బలమైన ఆర్డర్ బుక్ 2026 ఆర్థిక సంవత్సరంలో ఆశాజనక దృక్పథాన్ని సూచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై కంపెనీ దృష్టి పెట్టడం వృద్ధిని కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
నా కూతురు ఎవడితోనో వెళ్లిపోయింది. ఎవడో చెబితే తిరిగొచ్చింది. మళ్లీ ఎవడి కోసమో ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా గురించి ఆలోచించని కూతురి గురించి మేమెందుకు ఆలోచించాలి.. అంటూ పోలీసుల ఎదుట భావోద్వేగంతో ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రాణంగా పెంచుకున్న కూతురిని పరువు పేరిట పొట్టన పెట్టుకుంటాడని కన్నతల్లి సహా ఎవరూ ఊహించలేకపోయారు.బీహార్ సమస్తిపూర్(Samastipur)లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. తక్కువ కులం వాడితో తన కూతురు వెళ్లిపోయి.. తిరిగొచ్చిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్నీరు పెట్టసాగాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంట్లోని బాత్రూం నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి(20) అనే యువతి కాలేజీ చదివే ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఉండేది కూడా ఆమె ఉండే కాలనీలోనే. ఆమె తండ్రి ముకేష్ కుమార్ సింగ్(Mukesh Singh Kumar) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతనిది పరాయి కులమంటూ ఆ ప్రేమను ఆ తండ్రి అంగీకరించలేదు. దీంతో.. మార్చి 4వ తేదీన ఆమె ఆ యువకుడితో ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయసాగింది. ఈలోపు యువకుడి బంధువు ఒకరు వాళ్లను ఒప్పించి వెనక్కి పంపించారు. వారం కిందట ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. సాక్షి తిరిగి రావడంతో ఈ కథ సుఖాంతమైందని బంధువులంతా అనుకున్నారు. కానీ, ఇంట్లోంచి వెళ్లిపోవడమే కాకుండా.. నలుగురికి తెలిసేలా కూతురు చేసిన రీల్స్‌పై ఆ తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.అయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి సాక్షి(Sakshi) మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి కంగారుపడిపోయింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందటూ తండ్రి ముకేష్ సింగ్ భార్య సహా అందరినీ నమ్మించే ప్రయత్నిం చేశాడు. ఈ క్రమంలో సాక్షి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేష్‌ను పోలీసులు విచారించగా.. ఎమోషనల్ డ్రామాలు ఆడాడు. ఈలోపు.. ముకేష్ బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులతో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తానే కూతురిని కడతేర్చినట్లు అంగీకరించాడు. కూతురిని చంపాక.. ఆ యువకుడిని కూడా చంపేందుకు ముకేష్ ప్రయత్నించాడని, కానీ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే అదనపు కట్నం కోసం..
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్ విధింపు
‘జగన్‌కి భద్రత కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలం’
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్‌లోకి..
సంచలనం.. 64 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
Tahawwur Rana: తహవూర్ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక
'ఆ దేవుడే రక్షించాడు'.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..
TCS Q4 results: టీసీఎస్ తడబాటు.. లాభం, ఆదాయాలు ఇలా..
క్యాలెండర్ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్ ట్వీట్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్ జగన్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
మేం ఉద్యోగం చేయలేం
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్‌పై ఫ్యాన్స్ ఫైర్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని..
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
WTC Final: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్ సర్ప్రైజ్
Jack Movie Review: ‘జాక్’ మూవీ హిట్టా? ఫట్టా?
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
IPL 2025: ముదురుతున్న 'ఈడెన్' పిచ్ వివాదం
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్ జగన్ ట్వీట్
కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
మావోల సంచలన లేఖ.. ములుగు ఎస్పీ రియాక్షన్
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
పళ్లు రాలగొడతా రాస్కెల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా తిట్ల పురాణం
RCB VS DC: మరో సెంచరీకి అడుగు దూరంలో ఉన్న విరాట్
పైన మావోయిస్టులు... కిందన జవాన్లు
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
పాక్ జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడెమో ఏకంగా వైస్ కెప్టెన్
సంచలనం.. 64 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
పాపికొండల్లో అలుగుల సందడి
RCB VS DC: హిట్‌మ్యాన్ సిక్సర్ల రికార్డుకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లి
అమెరికాకు 600 టన్నుల ఐఫోన్లు.. అదీ చార్టెడ్ ఫ్లైట్లలో..!
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
'ఆ పిల్ల నీకు వదిన అవుద్దిరా'.. ఆసక్తిగా సంపూర్ణేశ్ బాబు సోదరా ట్రైలర్
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!
TCS Q4 results: టీసీఎస్ తడబాటు.. లాభం, ఆదాయాలు ఇలా..
470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
'ఆ దేవుడే రక్షించాడు'.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
తహవూర్ రాణా అరెస్ట్.. తీహార్ జైలుకు తరలించిన ఎన్ఐఏ
ఓటీటీలో అసురుడిని ఎదురించిన ధీరుడి కథ సడెన్ ఎంట్రీ
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విటర్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
AP: రియల్.. ఢమాల్
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
‘ఉప్పల్’లో మరింత ఫాస్ట్‌గా జియో నెట్వర్క్
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రూ. 500 కోట్ల సమీకరణ
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు చోట్ల వాన
రూ. 1,000 కోట్ల ల్యాప్‌టాప్ ప్లాంటు.. 5,000 ఉద్యోగాలు
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
స్నాక్స్ ఆరగించిన రాశీ.. తమన్నాలా మారిపోయిన స్రవంతి
ఏప్రిల్ వేతనాలేవీ?
వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ ట్విన్స్ ప్రయోగంలో ఏ డైట్ మంచిదంటే..?
ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్‌కు మద్దతు
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
భద్రతలో డొల్లతనం బట్టబయలు
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
లక్షలు పెట్టి టికెట్ తీసుకుంటే సెల్ఫీ కూడా లేదు.. హృతిక్‌పై అభిమానుల ఫైర్
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
అనుకున్నది ఒకటి.. మా వాళ్లు చేసింది మరొకటి: సంజూ ఆగ్రహం!
హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రాకు రూ. 424 కోట్ల డీల్
సందీప్ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్
‘కేకేఆర్‌ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్ విధింపు
‘జగన్‌కి భద్రత కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలం’
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్‌లోకి..
సంచలనం.. 64 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
Tahawwur Rana: తహవూర్ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక
'ఆ దేవుడే రక్షించాడు'.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..
TCS Q4 results: టీసీఎస్ తడబాటు.. లాభం, ఆదాయాలు ఇలా..
క్యాలెండర్ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్ ట్వీట్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్ జగన్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
మేం ఉద్యోగం చేయలేం
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్‌పై ఫ్యాన్స్ ఫైర్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని..
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
WTC Final: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్ సర్ప్రైజ్
Jack Movie Review: ‘జాక్’ మూవీ హిట్టా? ఫట్టా?
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
IPL 2025: ముదురుతున్న 'ఈడెన్' పిచ్ వివాదం
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్ జగన్ ట్వీట్
కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
మావోల సంచలన లేఖ.. ములుగు ఎస్పీ రియాక్షన్
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
పళ్లు రాలగొడతా రాస్కెల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా తిట్ల పురాణం
RCB VS DC: మరో సెంచరీకి అడుగు దూరంలో ఉన్న విరాట్
పైన మావోయిస్టులు... కిందన జవాన్లు
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
పాక్ జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడెమో ఏకంగా వైస్ కెప్టెన్
సంచలనం.. 64 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
పాపికొండల్లో అలుగుల సందడి
RCB VS DC: హిట్‌మ్యాన్ సిక్సర్ల రికార్డుకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లి
అమెరికాకు 600 టన్నుల ఐఫోన్లు.. అదీ చార్టెడ్ ఫ్లైట్లలో..!
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
'ఆ పిల్ల నీకు వదిన అవుద్దిరా'.. ఆసక్తిగా సంపూర్ణేశ్ బాబు సోదరా ట్రైలర్
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!
TCS Q4 results: టీసీఎస్ తడబాటు.. లాభం, ఆదాయాలు ఇలా..
470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
'ఆ దేవుడే రక్షించాడు'.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
తహవూర్ రాణా అరెస్ట్.. తీహార్ జైలుకు తరలించిన ఎన్ఐఏ
ఓటీటీలో అసురుడిని ఎదురించిన ధీరుడి కథ సడెన్ ఎంట్రీ
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విటర్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
AP: రియల్.. ఢమాల్
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
‘ఉప్పల్’లో మరింత ఫాస్ట్‌గా జియో నెట్వర్క్
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రూ. 500 కోట్ల సమీకరణ
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు చోట్ల వాన
రూ. 1,000 కోట్ల ల్యాప్‌టాప్ ప్లాంటు.. 5,000 ఉద్యోగాలు
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
స్నాక్స్ ఆరగించిన రాశీ.. తమన్నాలా మారిపోయిన స్రవంతి
ఏప్రిల్ వేతనాలేవీ?
వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ ట్విన్స్ ప్రయోగంలో ఏ డైట్ మంచిదంటే..?
ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్‌కు మద్దతు
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
భద్రతలో డొల్లతనం బట్టబయలు
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
లక్షలు పెట్టి టికెట్ తీసుకుంటే సెల్ఫీ కూడా లేదు.. హృతిక్‌పై అభిమానుల ఫైర్
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
అనుకున్నది ఒకటి.. మా వాళ్లు చేసింది మరొకటి: సంజూ ఆగ్రహం!
హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రాకు రూ. 424 కోట్ల డీల్
సందీప్ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్
‘కేకేఆర్‌ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
సినిమా

విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా (Prabhu Deva) జీవితంలో ఇద్దరు మహిళలు భార్య స్థానాన్ని పొందారు. గతంలో ఈయన రామలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కాదా అందులో ఓ అబ్బాయి టీనేజ్‌లో మరణించాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. అవి విడాకుల వరకూ వెళ్లాయి. నయనతార వల్లే విడిపోయామని ఆమధ్య రమాలత్ మీడియా ముందే తేల్చేసింది.పిల్లలంటే ప్రాణంఅనంతరం ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌ను వివాహం చేసుకోగా వీరికి ఓ పాప కూడా పుట్టింది. తాజాగా ప్రభుదేవా మాజీ భార్య రమాలత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రభుదేవాకు మా పిల్లలంటే ప్రాణం. వారిని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. నా ఇద్దరు కొడుకులకు కూడా తండ్రితో మంచి అనుబంధం ఉంది. వారు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు నాతో పాటు ప్రభుదేవా అనుమతి అడుగుతారు.అదే రక్తం..ప్రభుదేవా సంగీత కచేరిలో నా పెద్ద కొడుకు రిషి డ్యాన్స్ అద్భుతంగా చేశాడు. తండ్రి రక్తమే తనలోనూ ప్రవహిస్తోంది. అందరూ వాడి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. అలా ఎలా చేయగలిగాడు? అని అడుగుతున్నారు. అతడు కేవలం రెండేళ్ల నుంచే డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు. హీరోగానూ అవకాశాలు వస్తున్నాయి. చిన్నవాడికి మాత్రం సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేదు. తను డాక్టర్ అవుతానంటున్నాడు. విదేశాలకు పంపించి బాగా చదివించాలనుకుంటున్నాం.అతడే సపోర్ట్..ప్రభుదేవాకు, నాకు విడాకులయ్యాయి. అంతమాత్రాన మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైగా నాకు, నా పిల్లలకు అతడే సపోర్ట్‌గా నిలబడ్డాడు. ఎన్నడూ నా గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడలేదు. అందుకే ఆయన్ని ఎప్పటికీ వదులుకోలేను. అయితే ఒంటరిగా పిల్లల్ని పెంచడం అనేది కష్టమే! ఆ కష్టాల్ని నేను అధిగమించాను. మంచి తండ్రిగా ప్రభుదేవా నా పిల్లల కోసం ఎప్పుడూ నిలబడ్డాడు అని లత చెప్పుకొచ్చింది.చదవండి: కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్

అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
టైటిల్: గుడ్ బ్యాడ్ అగ్లీనటీనటులు: అజిత్ కుమార్, త్రిష, సునీల్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్ తదితరులుదర్శకత్వం: అధిక్ రవిచంద్రన్నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్ఎడిటర్: విజయ్ వేల్‌కుట్టిసినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజంసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025విదాముయార్చి తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. విదాముయార్చి ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తాజా యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ హీరోగా పేరున్న అజిత్.. ఈ సినిమాతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులతో గుడ్ అనిపించాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.గుడ్ బ్యాడ్ అగ్లీ కథేంటంటే..ముంబయిలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ ఏకే(అజిత్ కుమార్) అలియాస్ రెడ్ డ్రాగన్. అతనంటే విదేశాల్లో ఉండే గ్యాంగస్టర్లకు సైతం హడల్. అలా వరల్డ్ ఫేమస్ గ్యాంగ్‌స్టర్ అయిన ఏకే.. తన భార్య రమ్య(త్రిష) కోసం తన వృత్తిని వదిలేసేందుకు సిద్ధమవుతాడు. భార్యకు, తన కుమారుడు విహాన్‌కి (కార్తీక్ దేవ్) ఇచ్చిన మాట కోసం.. జైలుకు వెళ్తాడు. అలా జైలుకెళ్లిన ఏకే దాదాపు 17 ఏళ్ల తర్వాత విడుదలై.. 18వ పుట్టినరోజు నాడు తన కుమారుడిని చూసేందుకు వచ్చిన ఏకేకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి? తండ్రి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విహాన్.. ఒక అమ్మాయి ప్రేమ కారణంగా.. అనూహ్యంగా ఓ కేసులో జైలుకు వెళ్తాడు. అసలు కుమారుడిని చూసేందుకు వస్తున్న అజిత్‌ను టార్గెట్ చేసింది ఎవరు? తండ్రి వల్లే తన కుమారుడు జైలుకు వెళ్లాడని భావిస్తున్న రమ్య(త్రిష) ఆ తర్వాత ఏం చేసింది? అజిత్‌కు.. విహాన్ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? లేదంటే త్రిష వల్లే విహాన్ కేసులో చిక్కుకున్నాడా? చివరికీ ఈ కేసు నుంచి తన కుమారుడిని అజిత్ బయట పడేశాడా? కుమారుడిని విడిపించుకునేందుకు త్రిష ఏం చేసింది? విహాన్ ప్రేమించిన అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే గుడ్ బ్యాడ్ అగ్లీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..గుడ్ బ్యాడ్ అగ్లీ..టైటిల్ వినగానే అందరికీ కాస్తా కొత్తగానే అనిపిస్తూ ఉండొచ్చు. ఇది చూసి సగటు ప్రేక్షకునికి అంతా ఫుల్ యాక్షన్, వయోలెన్స్ ఉంటుందేమో అనిపించి ఉంటుంది. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన ఈ కథ.. స్పెయిన్‌లో ముగించేలా ప్లాన్ చేశాడు డైరెక్టర్. యాక్షన్ హీరోగా పేరున్న అజిత్‌ను ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే డైరెక్టర్ చూపించాడు. ఫస్ట్ హాఫ్‌లో అజిత్ జైలు జీవితం, భార్య త్రిషతో ఉన్న అనుబంధం చుట్టూ తిరుగుతుంది. జైలులో అజిత్ ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు మాత్రం హై ఫీస్ట్‌లా అనిపిస్తుంది. యాక్షన్ సినిమా అంటే అంతా రక్తపాతంలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.. కానీ అధిక్ మాత్రం ఫైట్స్‌ను తనదైన డిఫరెంట్ స్టైల్లో చూపించారు. టాలీవుడ్ నటుడు సునీల్ స్టైల్ మాత్రం తెలుగు అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది.జైలు నుంచి రిలీజ్‌కు ఇంకా మూడు నెలలు ఉండగా.. ముందుగానే అజిత్ బయటికి రావడం..ఆ తర్వాత జరిగే పరిణామాలు సగటు ప్రేక్షకునికి రోటీన్‌గానే అనిపిస్తాయి. కానీ ఏకే బయటికి వచ్చాకే అసలు కథ మొదలవుతుంది. అలా ఇంటర్వెల్‌కు ముందు ఓ బిగ్ ఫైట్ సీన్‌తో బ్యాంగ్ పడేశాడు. ఇక్కడే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందన్న టైమ్‌లోనే ఇంటర్వెల్‌కు ముందు ప్రధాన ప్రతినాయకుడు అర్జున్ దాస్(జానీ)కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ కావడంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ మిస్సవుతుంది. ట్విస్ట్‌లు కాస్తా రివీల్ చేయడంతో సెకండాఫ్ ఆడియన్స్ ఉహకందేలా చేశాడు దర్శకుడు. అయితే ఫైట్ సీక్వెన్స్‌లో జీవీ ప్రకాశ్ బీజీఎం మాత్రం అదిరిపోయింది. అలాగే సాంగ్స్ కూడా ఫర్వాలేదనిపిస్తాయి.ఇక ద్వితీయార్థం వచ్చేసరికి ముంబయితో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్యాంగస్టర్లకు సైతం చెమటలు పట్టించే రెడ్ డ్రాగన్‌గా ఏకే ఎలా మారాడు? అతని ప్రస్థానం ఎలా మొదలైంది? అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ టీమ్ చేసే ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నా.. కొత్తదనం లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తాయి. కానీ యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. కుమారుడి(విహాన్) కోసం ఏకే చేసే పోరాట సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే సెకండాఫ్‌లో సిమ్రాన్(సుల్తానా) ఎంట్రీతో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగుతున్న కథలో కామెడీ పండించాడు. సాంగ్స్‌లో ఎక్కువగా తమిళం స్లాంగ్ రావడంతో తెలుగు ఆడియన్స్‌కు అంతా ఆసక్తిగా అనిపించదు. క్లైమాక్స్ సీన్ వచ్చేసరికి.. అర్జున్ దాస్‌తో ఫైట్స్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్‌లోనూ కామెడీ పండించడం అధిక్ రవిచంద్రన్‌కే సాధ్యమైంది. చివర్లో కేజీఎఫ్, యానిమల్ మూవీ స్టైల్లో క్లైమాక్స్ ఉండడంతో కొత్తగా అనిపించదు. చివరికీ మనం బ్యాడ్ నుంచి గుడ్‌గా మారినా.. మనల్ని మళ్లీ బ్యాడ్ వైపే తీసుకెళ్తే ఎలా ఉంటుందనేది గుడ్ బ్యాడ్ అగ్లీతో సందేశమిచ్చాడు డైరెక్టర్. యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం ఫుల్ మీల్స్.. అలా కాకుండా ఏదైనా కొత్తదనం ఉంటుందన్న ఆశతో వెళ్తే మాత్రం బ్రేక్ ఫాస్ట్ చేసిన ఫీలింగ్‌తో బయటికొస్తారు.ఎవరెలా చేశారంటే..యాక్షన్ హీరోగా పేరున్న అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఏకే స్టైల్లో మరోసారి అదరగొట్టారు. త్రిష తన పాత్రలో జీవించేసింది. సీనియర్ హీరోయిన్గా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ నటుడు సునీల్, కోలీవుడ్ కమెడియన్ కింగ్స్లే, సిమ్రాన్, ప్రకాశ్ దేవ్, ప్రభు, ప్రసన్న, టినూ ఆనంద్, జాకీ ష్రాఫ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి నాయకుడిగా అర్జున్ దాస్ డిఫరెంట్ స్టైల్లో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాశ్ బీజీఎం ఈ సినిమాకు అదనపు బలం. అలాగే నేపథ్య సంగీతం కూడా ఫర్వాలేదు. ఎడిటర్ విజయ్ వేల్‌కుట్టి కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్
బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈసారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ (Akkada Ammayi Ikkada Abbayi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడు పెంచింది. తాజాగా ఈ మూవీకి సపోర్ట్ చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ముందుకు వచ్చాడు.గ్లోబల్ స్టార్‌కు ఫస్ట్ టికెట్ఇందుకు సంబంధించిన ఓ సరదా వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. అందులో ప్రదీప్.. ఫస్ట్ డే మార్నింగ్ షో.. ఫస్ట్ టిక్కెట్టు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan)కు ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అది విన్న సత్య.. రామ్‌చరణ్ తనకు చాలా క్లోజ్.. నేను ఏది చెప్తే అంత అంటూ బిల్డప్ కొట్టాడు.చివర్లో మాత్రం..చివరకు చరణ్ ఎంట్రీ ఇచ్చి సత్యను చూసి ఎవరీ అబ్బాయి అనడంతో అతడి పరువు పోయినట్లయింది. చివర్లో మాత్రం సత్యను గుర్తుపట్టి పెద్ది షూటింగ్‌కు సమయానికి వచ్చేయ్ అన్నాడు. అనంతరం సత్య.. చెర్రీ కాళ్లు మొక్కగా అతడు కూడా తిరిగి పాదాలకు నమస్కరించడం విశేషం. తర్వాత చరణ్.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఇది చూసిన అభిమానులు అంత పెద్ద స్టార్ అయ్యుండి ఇంత సింపుల్‌గా ఉండటం చాలా గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సందీప్ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్

సందీప్ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్
అర్జున్ రెడ్డి సినిమా (Arjun Reddy)కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హర్షవర్దన్ రామేశ్వర్ ఇస్తే పాటలకు రధన్ సంగీతం అందించాడు. అతడు అందించిన పాటలు బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. అయితే సరైన సమయానికి పాటలు ఇవ్వకుండా నా టైం మొత్తం వృధా చేశాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రధన్‌పై విమర్శలు గుప్పించాడు. సిద్దార్థ్ రాయ్ సినిమా దర్శకుడు కూడా రధన్ చెప్పిన సమయానికి పాటలు ఇవ్వకపోగా ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన తండ్రిలాంటి వారుఇలా రధన్ వల్ల సినిమా లేటైందని దర్శకులు తిట్టుకున్నారు. తాజాగా ఈ వివాదంపై రధన్ స్పందించాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా (Akkada Ammayi Ikkada Abbayi Movie) ఈవెంట్లో అతడు మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నాకు తండ్రిలాంటివారు. తండ్రి తిడితే ఆయన తిట్టారని ప్రచారం చేసుకోలేం. నాన్న మనల్ని కాకపోతే ఎవర్ని తిడతారు? దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన తండ్రిలాంటివారు కాబట్టి!అనుదీప్ తల్లిలా..ఆయన నన్ను తిట్టిన తర్వాత కూడా అనుదీప్ (జాతిరత్నాలు), ప్రదీప్ మాచిరాజు (అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి) నాపై నమ్మకంతో సినిమా ఆఫర్ ఇచ్చారు. అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు కొన్ని పట్టించుకోవాలి, కొన్నింటిని పట్టించుకోకూడదు. సందీప్ ఎప్పుడూ అలాగే ఉంటారు. ఒక తండ్రిగా తిట్టారు, తిడతారు. నేనైతే అవేవీ మనసుకు ఎక్కించుకోలేదు. నాన్న తిట్టాడని ఫీలయ్యానంతే! అర్జున్ రెడ్డిలో నేను చెత్త మ్యూజిక్ అయితే ఇవ్వలేదు కదా.. మంచి సంగీతం ఇచ్చానన్న తృప్తి ఉంది. అనుదీప్ నాకు తల్లిగా అనిపించారు. కొందరు తిడతారు, మరికొందరు దగ్గరకు తీసుకుంటారు. అందరూ ఒకేలా ఉండరు అని రధన్ వివరణ ఇచ్చాడు.చదవండి: లక్షలు పెట్టి టికెట్ తీసుకుంటే సెల్ఫీ కూడా లేదు.. హృతిక్‌పై అభిమానుల ఆగ్రహం
న్యూస్ పాడ్‌కాస్ట్

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

పాక్ జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడెమో ఏకంగా వైస్ కెప్టెన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం(ఏప్రిల్ 11) లహోర్ వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్, లహోర్ ఖలందర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. ఈ క్రమంలో కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది.తమ జట్టు వైస్ కెప్టెన్‌గా పాక్ స్పీడ్ స్టార్ హసన్ అలీని కరాచీ కింగ్స్ ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కరాచీ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. "కరాచీ కింగ్స్ జట్టు వైస్ కెప్టెన్‌గా హసన్ అలీ బాధ్యతలు స్వీకరించాడు. రాబోయే సీజన్ కోసం సిద్దంగా ఉండండి" అంటూ కరాచీ యాజమాన్యం ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఈ క్రమంలో గురువారం జరిగిన పీఎస్ఎల్ కెప్టెన్ల మీట్‌కు డేవిడ్ వార్నర్ స్ధానంలో హసన్ అలీ హాజరయ్యాడు. కాగా ఇటీవలే కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంపికైన సంగతి తెలిసిందే. కరాచీ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన హసన్ అలీ పాక్ జట్టుకు మాత్రం దూరంగా ఉంటున్నాడు. అలీ చివరగా పాక్ జట్టు తరపున గతేడాది మేలో ఐర్లాండ్‌పై ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కాగా కరాచీ జట్టులో కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్నే, జేమ్స్ విన్స్ వంటి విదేశీ స్టార్లు ఉన్నారు.కరాచీ కింగ్స్ జట్టుఅబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, డేవిడ్ వార్నర్, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, టిమ్ సీఫెర్ట్, జాహిద్ మహమూద్, లిట్టన్ దాస్, మీర్ హమ్జా, కేన్ విలియమ్సన్, ఇమ్మాద్ మమ్జామ్, ఎమ్బియామ్సన్ యూసుఫ్, ఫవాద్ అలీ, రియాజుల్లా.

నేను ఎప్పటికీ ధోనీ ఫ్యాన్నే.. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు: రాయుడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన వివాదస్పద వ్యాఖ్యలతో ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రాయుడు.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనిని అతిగా ప్రశంసిస్తున్నందుకు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవతున్నాడు.గతంలో సీఎస్కే ఆడిన రాయుడు.. ప్రస్తుత సీజన్లో ధోని క్రీజులోకి వస్తే చాలు పోగడ్తలతో ముంచెత్తున్నాడు. జట్టుతో, మ్యాచ్‌తో సంబంధం లేకుండా ధోనీ నామస్మరణలోనే అతడు మునిగిపోతున్నాడు. అతడి అతి కామెంట్రీ చాలా మందికి విసుగు తెప్పిస్తుంది. ఏప్రిల్ 8న ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని క్రీజులోకి వస్తున్నప్పుడు అతడిని కత్తి పట్టుకున్న యోధుడితో రాయుడు పోల్చాడు. ధోనీ ఖడ్గాన్ని పట్టుకుని వస్తున్నట్లు ఉంది. ఆ ఖడ్గం కచ్చితంగా ఫలితం సాధిస్తుంది అని రాయుడు వ్యాఖ్యనించాడు. ఆ తర్వాత అతడి వ్యాఖ్యలకు సహచర హిందీ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కౌంటరిచ్చాడు. ధోనీ క్రికెట్ ఆడటానికి వచ్చాడు. యుద్ధంలో పాల్గొనడానికి కాదు సిద్దూ తన ఎక్స్‌లో రాసుకొచ్చాడు. అదేవిధంగా అభిమానులు కూడా రాయుడు టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు.నేనెప్పటికీ తలా ఫ్యాన్నేతనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్‌పై రాయుడు స్పందించాడు. ట్రోల్స్ చేస్తున్న వారికి రాయుడు ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తను ఎప్పుడూ ధోని ఫ్యాన్నే అని, ఎవరేమనుకున్నా పర్వాలేదు అని అంబటి అన్నాడు"నేనెప్పటికీ తలా అభిమానినే. ఎవ్వరేం అనుకున్నా, ఎవ్వరేం చేసినా సరే ఈ విషయంలో ఒక్క శాతం కూడా మార్పు రాదు. కాబట్టి పెయిడ్ పీఆర్ కోసం డబ్బులు ఖర్చు చేయడం ఆపేయండి. ఆ డబ్బులను ఏదైనా ఛారిటీకి ఇవ్వండి. అలా చేస్తే ఎంతోమంది పేదలకు సాయం చేసిన వారు అవుతారని" ఎక్స్‌లో రాయుడు రాసుకొచ్చాడు.కాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. అయితే ఈమ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది.I was a Thala’s fan I am a Thala’s fan I will always be a Thala’s fan.No matter what anyone thinks or does. It will not make a one percent difference.So please stop spending money on paid pr and donate that to charity. Lot of underprivileged people can benefit.— ATR (@RayuduAmbati) April 10, 2025I was a Thala’s fan I am a Thala’s fan I will always be a Thala’s fan.No matter what anyone thinks or does. It will not make a one percent difference.So please stop spending money on paid pr and donate that to charity. Lot of underprivileged people can benefit.— ATR (@RayuduAmbati) April 10, 2025

బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 10) బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ తలపడ్డాయి. లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ థాయ్‌ను 178 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (80 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. షర్మిన్ అక్తర్ (126 బంతుల్లో 94 నాటౌట్; 11 ఫోర్లు) సెంచరీకి చేరువై అజేయంగా నిలిచింది. ఓపెనర్ ఫర్జానా హాక్ (53) అర్ద సెంచరీతో రాణించింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పసికూన థాయ్‌లాండ్.. బంగ్లా స్పిన్నర్లు ఫహిమ ఖాతూన్ (8.5-1-21-5), జన్నతుల్ ఫిర్దౌస్ (5-3-7-5) చెలరేగడంతో 23.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. థాయ్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. చనిద (22) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బోణీ కొట్టింది.కాగా, ఈసారి మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ పోటీలకు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్ వరల్డ్‌కప్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి.ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.

WTC Final: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!
గతేడాది టెస్టుల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా తెంబా బవుమా (Temba Bavuma) రాణించడంతో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్-2025కి చేరుకుంది.డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో పన్నెండు మ్యాచ్‌లకు గానూ ఎనిమిది గెలిచిన బవుమా బృందం.. మూడింట ఓడి.. ఒకటి డ్రా చేసుకుంది, ఫలితంగా 100 పాయింట్లు సాధించిన సౌతాఫ్రికా.. విజయాల శాతం (69.440) పరంగా మాత్రం అన్ని జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచి అగ్రస్థానాన్ని సంపాదించింది.ఆస్ట్రేలియాతో మ్యాచ్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా జూన్ 11న మొదలయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (SA vs AUS)తో తలపడనుంది. అయితే, ఈ మెగా మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ సౌతాఫ్రికా ఫోర్-డే సిరీస్ మ్యాచ్ సందర్భంగా తెంబా బవుమా గాయపడ్డాడు.దేశీ రెడ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న బవుమా గాయపడ్డాడు. అతడి ఎడమ మోచేతికి గాయం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. కాగా లయన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరుకుని.. టైటాన్స్ జట్టుతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.ఇక గురువారం నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుండగా.. బవుమా గాయపడిన విషయం ఆఖరి నిమిషంలో లయన్స్ వర్గాలకు తెలిసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తెలిపింది. లయన్స్ కెప్టెన్ డొమినిక్ హెండ్రిక్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. అయితే, గాయం తీవ్రతపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.2022లో మూడు నెలలపాటుకాగా 2022లో బవుమా ఎడమ మోచేయి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అదే రీతిలో గతేడాది ఐర్లాండ్‌తో వన్డే సందర్భంగా గాయపడ్డాడు. దీంతో బంగ్లాదేశ్‌తో టెస్టులకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఎడమ మోచేయికి గాయం కావడం సౌతాఫ్రికా బోర్డులో ఆందోళన రేకెత్తిస్తోంది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. అయితే, బవుమా గనుక అప్పటికి కోలుకోలేకపోతే.. జట్టుకు ఎదురుదెబ్బ తప్పదు. ఏదేమైనా బవుమా గాయంతో.. తొలిసారి ఫైనల్ చేరడమే కాకుండా టైటిల్ గెలవాలన్న సౌతాఫ్రికాకు నిరాశ ఎదురయ్యే పరిస్థితులు తలెత్తాయి.శతకాలతో అలరించికాగా బవుమా చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికాను సెమీ ఫైనల్‌కు చేర్చాడు. ఎడమ మోచేయికి కట్టుతోనే అతడు ఈ మెగా వన్డే టోర్నమెంట్లో బ్యాటింగ్ చేశాడు. ఇక టెస్టు ఫార్మాట్ విషయానికొస్తే... గతేడాది బవుమా ఐదు మ్యాచ్‌లు ఆడి 503 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకంతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఆడిన ఒకే ఒక్క టెస్టులోనూ శతక్కొట్టాడు.ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీని 2019లో ప్రవేశపెట్టగా.. తొలి సీజన్లో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ ఈ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక 2021-23 సీజన్లోనూ భారత్ ఫైనల్‌కు చేరింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక తాజాగా 2023-25 ఎడిషన్‌లో మరోసారి ఫైనల్ చేరాలన్న టీమిండియా ఆశలపై ఆసీస్ నీళ్లు చల్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రోహిత్ సేనను 3-1తో ఓడించి మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. చదవండి: పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
బిజినెస్

తొందరపాటు లేదు.. అమెరికాతో ఒప్పందంపై పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతులు 820 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగినట్లు తెలిపింది. 2023 - 24లో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం.. 2024–25 ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్య కాలంలో ఉత్పత్తుల ఎగుమతులు 395.38 బిలియన్ డాలర్ల నుంచి 395.63 బిలియన్ డాలర్లుకు చేరాయి. అలాగే సర్వీసుల ఎగుమతులు 311.05 బిలియన్ డాలర్ల నుంచి 354.90 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను వాణిజ్య శాఖ ఏప్రిల్ 15న విడుదల చేయనుంది.పరిశ్రమకు మంత్రి గోయల్ భరోసా..అమెరికా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమ వర్గాలతో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితుల్లో ఇటీవల తలెత్తిన సవాళ్లను అధిగమించడంలో ఎగుమతి సంస్థలకు తోడ్పాటు అందించేందుకు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి భరోసా ఇచ్చినట్లు వాణిజ్య శాఖ తెలిపింది.ఎర్ర సముద్రం సంక్షోభం, ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, కొన్ని సంపన్న ఎకానమీల్లో వృద్ధి నెమ్మదించడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ ఎగుమతులు వృద్ధి చెందడం సానుకూలాంశమని ఎగుమతిదారులు, పరిశ్రమను మంత్రి అభినందించారు. వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహించే ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు, అంచనాలను తెలిపాయి. కష్టకాలంలో ఎగుమతి సంస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వం క్రియాశీలక చర్యలు తీసుకోవాలని కోరాయి.అమెరికాతో ఒప్పందంపై కసరత్తు..అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం విషయంలో సమతుల్యత సాధించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. దేశానికి ప్రయోజనం కలిగే విధంగా సరైన ఫలితాలను రాబట్టేందుకు ప్రభుత్వం ’వేగంగా’ పనిచేస్తోందని, ’అనవసర తొందరపాటు’ చర్యలు తీసుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు. టారిఫ్‌లపై ఇతర దేశాలు వివిధ రకాలుగా స్పందిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘విశ్వసనీయమైన భాగస్వామిగా భారత్ ఎదిగింది.ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో భారత్ పెద్ద సంస్థలను ఆకర్షించే స్థితిలో ఉంది. కాబట్టి తయారీని పెంచుకునేందుకు, మరిన్ని ఉద్యోగాలను కల్పించేందుకు మనకు అవకాశాలు ఉన్నాయి‘ అని మంత్రి వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారత్, అమెరికా నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చల తొలి దశ ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 191 బిలియన్ డాలర్లుగా ఉంది.

టారిఫ్‌లపై ఊరట: పుంజుకున్న ఆసియా మార్కెట్లు
చైనా మినహా మిగతా దేశాలపై విధించిన అధిక సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రకటించిన తర్వాత.. ఆసియా మార్కెట్లు లాభాలబాట పట్టాయి. జపాన్ నిక్కీ 8.35% పెరిగింది. దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్ 5.38 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ కోస్డాక్ 5.09 శాతం లాభపడింది.చైనా.. అమెరికన్ వస్తువులపై 84 శాతం సుంకాలను ప్రకటించిన తరువాత.. అమెరికా సుంకాలను 104 శాతం నుంచి 125 శాతానికి పెంచడంతో.. పెట్టుబడిదారులు చైనా స్టాక్‌లపై ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా భారతదేశంలో మార్కెట్లు సెలవు.ప్రతీకార సుంకాల వార్మొత్తం 75 దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించిన తరువాత.. అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది.

ఒకేసారి రూ.2940 పెరిగిన గోల్డ్ రేటు: నేటి కొత్త ధరలు ఇవే..
వరుస తగ్గుదల తరువాత.. కొంచెం పెరిగిన బంగారం ధర ఈ రోజు (ఏప్రిల్ 10) ఊహకందని రీతిలో పెరిగింది. ధరల పెరుగుదలలో బహుశా ఇదే అల్‌టైమ్ రికార్డ్ అనే తెలుస్తోంది. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2940 పెరిగి.. పసిడి ప్రియులకు షాకిచ్చింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,380 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఈ రోజు రూ. 2700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 2940 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,380 వద్ద ఉంది.ఇదీ చదవండి: రూ.4 కోట్ల కారు.. ₹46 లక్షల నెంబర్ ప్లేట్దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 85,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 93,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 10) కేజీ సిల్వర్ రేటు రూ. 1,04,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 95,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

రూ.4 కోట్ల కారు.. ₹46 లక్షల నెంబర్ ప్లేట్
భారతదేశంలో ఖరీదైన లంబోర్ఘిని కార్లను ఉపయోగించే వారి సంఖ్య నానాటికి ఎక్కువవుతోంది. ఇటీవల కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త సరికొత్త ఉరుస్ పెర్ఫార్మాంటే కొనుగోలు చేశారు. కాగా ఈ కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేశారు.లంబోర్గిని ఉరుస్ కొనుగోలు చేసిన వేణు గోపాలకృష్ణన్.. మోటారు వాహనాల శాఖ (MVD) నిర్వహించిన ఆన్లైన్ వేలంలో KL07 DG 0007 అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం 45.99 లక్షల రూపాయలు వెచ్చించారు. కేరళలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నోటిఫైడ్ ఫ్యాన్సీ వెహికల్ నెంబర్‌గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది.వేణు గోపాలకృష్ణన్ కొనుగోలు చేసిన లంబోర్గిని ఉరుస్ ధర రూ. 4 కోట్లు. దీనిని ఆయన బెంగళూరులోని లంబోర్గిని డీలర్షిప్ నుంచి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: Delhi EV Policy 2.0: పెట్రోల్ బైకులు, సీఎన్జీ ఆటోలు బ్యాన్!ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని భారతదేశంలోని పరిమిత నగరాల్లో మాత్రమే డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. అతను బహుశా SUVని బుక్ చేసుకుని, ముందుగానే అన్ని కస్టమైజేషన్లను చేసి ఉండవచ్చు. ఈ వీడియోలో యజమాని, అతని కుటుంబం డెలివరీ తీసుకోవడానికి డీలర్‌షిప్‌ను సందర్శించారు.లంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మాంటే 4.0 లీటర్, ట్విన్ టర్బో వీ8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 666 పీఎస్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు.. మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తుంటారు. View this post on Instagram A post shared by Flywheel Official (@flywheel_official)
ఫ్యామిలీ

'ట్విన్‌టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకేలా చదవడం అత్యంత అరుదు. ఎక్కడోగానీ అలా జరగదు. ఒకవేళ్ల ఇద్దరూ మంచి ప్రతిభావంతులైనా కూడా ఒకేలా మార్కులు సాధించడం అనేది అత్యంత అరుదు అనే చెప్పాలి. కానీ ఈ ట్విన్స్ ఇద్దరూ ఒకేలా మార్కులు సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. తమ పుట్టుకే కాదు..ప్రతిభలో కూడా ఒకేలా సత్తాచాటుతామని అంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అంతేకాదండోయ్ పది నుంచి ఎంబీబీఎస్ వరకు దాదాపు ఒకేలా మార్కులు సాధించడం విశేషం.ఆ కవలలే రహిన్, రిబాలు. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగారు ఇద్దరు. తమ కుటుంబంలోని తొలి వైద్యులు కూడా వీరే. తమ మామ ఈ రంగంలోకి రావడానికి ఆదర్శం అని చెబుతున్నారు ఇద్దరు. వీరిద్దరూ వడోదరలోని GMERS మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇద్దరూ ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఒకేలా 66.8% స్కోర్ సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. ఆ కాలేజ్ హాస్టల్ గదిలో ఒకే రూమ్‌లో కలిసి చదువుకున్నారు. తామిద్దరికి ఎంబీబీఎస్ సీటు వేర్వేరు కాలేజీల్లో వచ్చినా..2019లో గోత్రిలోని వైద్య కళాశాలలోనే ఇద్దరం జాయిన్ అయ్యాం అని చెబుతున్నారు ఇద్దరూ. తమ ఇంటికి చేరువలోనే ఆ కాలేజ్ ఉంటుందన్నారు. అలాగే నగరానికి వచ్చి ఒంటరిగా చదవడం కూడా ఇదే మొదటిసారని కూడా చెప్పారు. తమ తల్లి, తాతా, మామల ప్రోద్భలంతో ఈ ఘన విజయాన్ని సాధించామని చెబుతున్నారు. ఇక రిబా, రహిన్లు తమ అమ్మ కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక వారిద్దరి విద్యా నేపథ్యం చూసినా..చాలా ఆశ్యర్యం కలిగిస్తుంది. పదిలో రిబా 99%, రహిన్ 98.5%తో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్లో ఒకరు 98.2%, మరొకరు 97.3% కాగా, NEET-UGలో ఇరువురు 97%, 97.7% మార్కులు సాధించారు. ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఇతర మెరిట్ ఆధారిత ఆర్థిక సహాయం ద్వారా ఎలాంటి టెన్షన్ పడకుండా హాయిగా చదువుకున్నారు ఇద్దరు.ఇక రహిన్ ప్రసూతి అండ్ గైనకాలజీ వంటి సర్జికల్ బ్రాంచ్‌లో, రిబా ఇంటర్నల్ మెడిసిన్‌లోనూ కొనసాగాలనుకుంటున్నారు. అంతేగాదు ఇద్దరు అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి అడ్మిషన్ పొందాలనుకుంటున్నారు. తామిద్దరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ రంగంలోకి వచ్చామని చెబుతున్నారు. తమ కెరీర్ జర్నీ చాలా అద్భుతంగా సాగింది..అదే సక్సెస్‌ని ప్రతి విషయంలోనూ కొనసాగిస్తామంటున్నారు ఈ ట్విన్ సిస్టర్స్.(చదవండి: మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..)

వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
తమన్నా తన రాబోయే చిత్రం ఓదెల- 2 ను ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ప్రమోషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరీ ముఖ్యంగా ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షింస్తోంది. తమన్నా సెక్యూరిటీ పోలీసు అధికారిణి అద్భుతమైన భద్రతా నైపుణ్యాలు విశేషంగా నిలుస్తోంది.తమన్నా ప్రమోషన్ ఈవెంట్‌కు హాజరవ్వడం కోసం ముంబైలోని తన నివాసం నుంచి బయటకు వచ్చింది. రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతూ ఉన్న తమన్నాకు మించి ఆమెకు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు ఆఫీసర్ అందర్నీ ఆకర్షించింది. తమన్నాకు రక్షణ కల్పిస్తూ...రద్దీ రోడ్లో ఆమెకు మార్గాన్ని క్లియర్ చేసింది. అక్కడున్న వారిని తప్పుకోమని కోరుతూ.. సైడ్ సైడ్ అంటూ తమన్నాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ‘సైడ్ సైడ్’ అంటూ అక్కడున్న వారిని నియంత్రిస్తున్న ఆమె వీడియో వైరల్‌గా మారింది.ఆమె పని తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. డ్యూటీలో ఆమె అంకితభావానికి, నైపుణ్యానికి ముగ్ధులయ్యారు, వాటే పోలీస్ ఆఫీసర్ అని ఒకరు, "మహారాష్ట్ర లేడీ పోలీస్ ఆఫీసర్" మరో యూజర్ కమెంట్ చేశారు. దీంతో హీరోయిన్ తమన్నాకు మించి క్రేజ్ సంపాదించుకుంది ఈ మహిళా పోలీసు అధికారి. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap)

పెళ్లి సంబంధాలు : శాలరీ స్లిప్ అడగాలా వద్దా? అడిగితే తప్పేంటి?
‘వేయి అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చెయ్యమన్నారు’ అనేది సామెత. ఈ సామెత ఎలా పాపులర్ అయిందనేది పక్కన బెడితే, ఈ మధ్య కాలంల పెళ్లిళ్లలో మోసాలు ఆందోళనకరంగా మారింది. అధిక కట్నం కోసం ఫేక్ సర్టిఫికెట్లతో వధువు, వారి కుటుంబాన్ని మెప్పించేందుకు నానా తంటాలు పండతారు. తీరా అసలు విషయం తెలిశాక గొడవలు, విడాకులు తెలిసిన సంగతే.. ఈనేపథ్యంలోనే ఒక స్టోరీ నెట్టింట్ తెగ సందడి చేస్తోంది.వివాహ సంబంధాల్లో మోసాలు, విడాకులు కేసులు, నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు పెళ్లి సంబంధాలు చూడటం, పెళ్ళిళ్లు చేయడం పెద్ద సవాల్‌గా మారింది. తన మనసుకు నచ్చిన భాగస్వామిని తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అందులోనూ మాట్రిమమోనియల్ వెబ్సైట్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న తరుణంలో అప్రమత్తత చాలా అవసరం.కొందరు తమ సంబంధాల గురించి అబద్ధం చెబుతుండగా, మరికొందరు తమ విద్యార్హతలు, వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక స్థితి గురించి అబద్ధం చెబుతారు. దీంతో ఆ జంట, వారి కుటుంబాల మధ్య సమస్యలకు దారితీస్తుంది. దీనిమీదే ఎక్స్(ట్విటర్)లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాలరీ స్లిప్పులు అడగడం, అవునో కాదో ధృవీకరించు కోవాలా వద్దా? అనే ప్రశ్నపై చర్చ మొదలైంది. ప్రొఫైల్స్ వెరిఫికేషన్ పై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ పోస్ట్ పై నెటిజనుల స్పందనప్రపంచంలో పుష్కలంగా మంచితనం ఉందని నమ్మినా, వివాహం లాంటి కీలక అడుగు వేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలపై స్పస్టత తెచ్చుకోవాలి. "జాతకానికి బదులుగా ITRని చెక్ చేయడం మంచిది. సీరియస్‌గా చెప్పాలంటే, ఇద్దరి మధ్యా ప్రముఖ ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్య పరీక్ష నివేదిక , ITR తనిఖీ కనీసం జరగాలని ఒకరన్నారు. మరొకరు ఇలా రాశారు, "అవును, కొంతమంది పురుషులు జీతం గురించి అబద్ధం చెబుతారు. డిఫాల్టర్ కాకపోతే, స్థానిక పోలీస్ స్టేషన్ నుండి క్యారెక్టర్ సర్టిఫికేట్ అడగాలి, అతి ముఖ్యమైనది మెడికల్ సర్టిఫికేట్! అన్నాడు. మరొకాయన తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. తెలుసుకోవాలి. ఎందుకంటే బాగా సంపాదిస్తున్నామని చెప్పి లెక్కలేనన్ని పెళ్లి కొడుకు కుటుంబాలు, అమ్మాయిల కుటుంబాలను మోసం చేశాయి. అదృష్టవశాత్తూ, ఇప్పుడు సాలరీ స్లిప్‌లు ఉన్నాయి. పాత కాలంలో, ఇలాంటివేమీ లేవు కదా. అప్పట్లో లెక్చరర్‌గా ఉన్న నా సొంత మౌసి (ఇప్పుడు మరణించింది), తాను పోలీసు అధికారినని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తీరా అతను మామూలు సేవకుడు, పైగా అతనికి అప్పటికే పెళ్లి అయింది. ఒక బిడ్డకూడా ఉన్నాడు. అంతే ఈ విషయం తెలిసి ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసింది. మళ్లీ అతని గుమ్మం తొక్కలేదు. తన జీవితాన్ని విద్యకు అంకితం చేసింది, 2 పీహెచ్‌డీలు చేసింది, బోధనా వృత్తిలో ఉంది. మనస్తత్వశాస్త్ర పుస్తకాలు రాసింది. అని చెప్పాడు.ఒక యూజర్ ఇలా వ్రాశాడు, "నా స్నేహితుల్లో ఒకరు నియామక ప్రొఫైల్ ఉద్యోగంలో పనిచేశారు.. ఆమె కొన్నిసార్లు మ్యాట్రిమోనియల్ సైట్లలో పేర్కొన్న ప్యాకేజీలను క్రాస్ చెక్ చేసేది. దాదాపు అన్నీ కల్పిత సమాచారంతో నిండిఉన్నాయనీ, ప్యాకేజీలు చాలావరకు అబద్ధం మని గుర్తించింది. "వెరిఫైడ్ జీతం స్లిప్పులు అడిగితే అబ్బాయి పారిపోవాలి" అని ఒక యూజర్ అన్నారు. ఆ మాత్రం నమ్మకంలేకపోతే ఎలా?మరో కామెంట్ ఏంటంటే.. నన్ను ఒకమ్మాయి ఇలానే అడిగింది. పంపాను కానీ పెద్దలు కుదిర్చిన వివాహానికి నో చెప్పాను. నేను పొందుతున్న జీతం మీద కూడా వాళ్ళు నమ్మకం లేకపోతే, భవిష్యత్తులో దేన్ని నమ్ముతారు?"దీనిపై మీరేమనుకుంటున్నారు. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్‌గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో.. అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ కలుగుతుంది. కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్‌కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్ సెంటర్‌ని నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్ చెఫ్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్ రణవీర్బ్రార్ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె. వ్యాపారం ప్రారంభించడానికి కారణం..2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపం కారణంగా ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు. అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకల్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్ సెంటర్‌ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్ సెంటర్‌గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్ టెడ్ఎక్స్ స్పీకర్‌గా మారి తప కథని వినిపించిది. అక్కడున్న వారందర్నీ ఆమె గాథ కదిలించింది. చాలా కష్టాలు చూశారామె..మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్ ట్యూమర్‌తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు. ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్‌లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మంచి సక్సెస్‌ని అందుకున్నారామె. త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తరుముతున్న కష్టాలని చూసి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. ఉక్కు సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?)
ఫొటోలు


రిచెస్ట్ ప్లేయర్‌గా పీవీ సింధు.. ఏడాది సంపాదన ఇన్ని కోట్లా?( ఫోటోలు)


స్నేహితురాలితో సాయిపల్లవి హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)


అంబానీ ఇల్లు ‘అంటిలియా’.. అబ్బురపరిచే లోపలి ఫొటోలు


అందంతో అభిమానుల మనసు కొల్లగొట్టేస్తున్న దివ్యభారతి (ఫోటోలు)


Arjun S/O Vyjayanthi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయశాంతి, హీరో కళ్యాణ్ రామ్ (ఫొటోలు)


హనుమాన్ పూజలో కేటీఆర్.. స్వాములతో కలిసి భోజనం (ఫొటోలు)


చీరలో స్టన్నింగ్ లుక్స్‌తో కవ్విస్తోన్న హెబ్బా పటేల్ (ఫోటోలు)


‘జాక్’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)


‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)


రామ్ చరణ్ తో పెళ్లి బంధం సీక్రెట్ రివీల్ చేసిన ఉపాసన.. వారంలో ఒక రోజు తప్పనిసరి! (ఫోటోలు)
అంతర్జాతీయం

సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
సుంకాల విదింపుపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump) విదిస్తున్న సుంకాలపై ప్రపంచ దేశాలకు ఊరట లభించింది. చైనా మినహా మిగతా దేశాలకు అమెరికా సుంకాల నుంచి ఊరటనిచ్చింది.కానీ చైనాకు మాత్రం 125 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా. మొత్తంగా 75 దేశాలపై విదించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది.ఇదిలా ఉంటే అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది.

అమెరికాకు షాకిచ్చిన చైనా
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.

సానుకూల దిశగా చైనా-భారత్ సంబంధాలు
న్యూఢిల్లీ, బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో.. భారత్-చైనా సంబంధాలు(India-China Relations) బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం. తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.2020లో తూర్పు లడ్డాఖ్‌లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.మరోవైపు.. ట్రంప్ టారిఫ్‌ల(Trump Tariffs) నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ అభిప్రాయపడ్డారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనతో సంప్రదింపులు జరిపేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. ఈ క్రమంలో ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన.నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెసెషనల్ కమిటీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఏరకంగా చూసుకున్నా పార్లమెంట్(Congress) కంటే నేనే మెరుగైన మధ్యవర్తిని. అందుకే ఆయా దేశాలు నాకే ఫోన్లు చేస్తున్నాయి. సుంకాల విషయంలో ఊరట కోసం బతిమాలుకుంటున్నాయి.(ఈ క్రమంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు). ప్లీజ్ సర్.. మాతో ఒప్పందం చేసుకోండి అంటూ వేడుకుంటున్నాయి. ఏమైనా చేస్తామంటూ దిగజారిపోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అలాగే..సుంకాల దేశాలతో ఒప్పందం కోసం పార్లమెంట్‌ను అనుమతించాలని కొందరు రిపబ్లికన్ పార్టీలో కొందరు రెబల్ నేతలు కోరుతున్నారు. అదే జరిగి ఉంటే.. చైనా మీద ఇవాళ 104 శాతం సుంకాలు విధించాల్సి వచ్చేది కాదు. చైనా ఎంతో సంతోషంగా ఉండి ఉండేది. పైగా అమెరికానే సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. పైగా మన దేశాన్ని అమ్ముకోవాల్సి వచ్చేది. కాబట్టి మధ్యవర్తిత్వంలో చట్టసభ సమర్థవంతంగా పని చేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఒక విషయం చెప్పదల్చుకున్నా.. నాలా మీరెవరూ మధ్యవర్తిత్వం వహించలేరు’’ అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఫార్మా రంగం.. భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్
జాతీయం

రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్ రాణా(Tahawwur Rana) భారత్‌కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.తహవూర్ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్‌పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్‌లో చికాగో ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్‌కు అప్పగించకుండా ఉండిపోయింది. దావూద్ సయ్యద్ గిలానీ(డేవిడ్ కోల్మన్ హెడ్లీ) 1960లో వాషింగ్టన్లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్ సలీం గిలానీ పాక్ దౌత్య వేత్త. తల్లి అలైస్ సెర్రిల్ హెడ్లీ వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్‌లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. 2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్‌మైండ్ డేవిడ్ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా ఉన్నాడు. హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్‌కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు.

నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
తమిళనాడు: కెంగవల్లి సమీపంలో తల్లి దండ్రులపై దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన ఆడిటర్ పెళ్లి కోలంలో పోలీసులను ఆశ్రయించాడు. సేలం జిల్లా కెంగవల్లి సమీపంలోని క్రిష్ణపురం పంచాయతీకి చెందిన మణికంఠన్(43). ఆడిటర్‌గా ఉంటూ సేలం అంగమ్మాళ్ కాలనీలో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్లయ్యాక భార్యతో మనస్పర్థలు రావడంతో పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. మణికంఠన్ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న కొడుకు, 5వ తరగతి చదువుతున్న కుమార్తెతో నివసిస్తున్నాడు.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె విద్యాశ్రీ(21) ప్లస్ 2 పూర్తి చేసి ఇంట్లో ఉంటు వచ్చిన స్థితిలో, గత కొన్ని నెలలుగా ఆడిటర్ మణికంఠన్ ఆఫీసులో పనికి వెళ్లింది. ఇద్దరికీ పరిచయం ఏర్పడడంతో విద్యాశ్రీతో వివాహం జరిపించాలని మణికంఠన్ ఆమె తల్లిదండ్రులను కోరాడు. అయితే అతని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కాగా, మణికంఠన్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో విద్యాశ్రీ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె తల్లిదండ్రులు రాజేంద్రన్, వనిత పై దాడి చేసి విద్యాశ్రీ ని కారులో కిడ్నాప్ చేశారు. గాయపడిన రాజేంద్రన్ వనితను స్థానికులు రక్షించి కెంగవల్లి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు దర్యాప్తులో 43 ఏళ్ల ఆడిటర్ మణికంఠన్, 21 ఏళ్ల యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారిని వదిలి వేసినట్లు తెలిసింది.

Delhi Metro: మరో వీడియో వైరల్.. ఈసారి మద్యం వంతు..
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో(Delhi Metro)కు చెందిన మరో వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో మెట్రోలో కూర్చున్న ఒక ప్రయాణికులు ఒక చేతితో మద్యం గ్లాసు పట్టుకుని తాగుతూ, మరో చేతితో ఉడికించిన గుడ్డును తింటున్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారా అని అటునిటు చూస్తూ మద్యం సిప్ చేస్తున్నాడు. దీనిని గమించిన ఒక ప్రయాణికుడు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు.Eggs & "Alcohol" in the Metro? That’s not breakfast - that’s a Breach !!Break the rules, Face the consequences, Rules aren’t suggestions: They’re the law.#DPUpdates pic.twitter.com/CP2P5fDFiW— Delhi Police (@DelhiPolice) April 9, 2025ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియా(Social media) ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేస్తూ ‘మెట్రోలో గుడ్లు, మద్యం తీసుకోవడం అనేది అల్పాహారమేమీ కాదు. ఇది నియమాల ఉల్లంఘన. ఇలా చేసినందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. అయితే మెట్రోలో కనిపించిన ఆ వ్యక్తి పోలీసులకు క్షమాపణలు చెబుతూ ‘ఆ వీడియోలో నేను గుడ్డు తింటూ, మద్యం తాగుతున్నట్లు కనిపించాను. కానీ అది మద్యం కాదు, అప్పీ ఫిజ్ (Appy Fizz)’ అని వివరణ ఇచ్చాడు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)ఈ ఘటనపై స్పందిస్తూ మెట్రోలో మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధమని, ప్రయాణికులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించింది. డీఎంఆర్సీ(DMRC) ఒక అధికారిక ప్రకటనలో ‘ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. మద్యం సేవించడం లాంటి వ్యవహారాలు మెట్రో నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది’ అని పేర్కొంది. అలాంటి ఘటనలను ఎవరైనా చూస్తే, వెంటనే మెట్రో సిబ్బందికి లేదా సీఐఎస్ఎఫ్ అధికారులకు తెలియజేయాలని కోరింది. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు ఆ వ్యక్తి చర్యను తప్పుపట్టగా, మరికొందరు అతని వివరణ హాస్యాస్పదమని కామెంట్ చేశారు.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఆగ్రహం

ఆమెకు 30.. అతడికి 18.. ముగ్గురు పిల్లులున్నా భర్తను కాదని..
లక్నో: ఆమె వయసు 30ఏళ్లు.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా రెండో భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం, మతం మార్చుకుని 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మూడో పెళ్లి చేసుకుంది. అయితే, వీరి వివాహానికి యువకుడి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడం విశేషం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోకి చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలోని అమ్రోహా జిల్లాలోని సైదాన్వాలిలో నివసిస్తున్న షబ్నమ్‌కు తల్లిదండ్రులు లేరు. ఆమెకు మొదట మీరట్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం, కొన్ని కుటుంబ కారణాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. తర్వాత ఆ గ్రామానికి చెందిన తౌఫిక్‌తో ఆమెకు రెండో వివాహమైంది. అయితే 2011లో రోడ్డు ప్రమాదం వల్ల అతడు వికలాంగుడయ్యాడు. దీంతో, తాజాగా 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి శివతో ప్రేమలో పడింది. దీంతో, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న వికలాంగుడైన భర్త తౌఫిక్‌కు ఆమె విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత హిందూ మతంలోకి మారింది. షబ్నమ్ పేరును కాస్తా.. శివానీగా మార్చుకున్నది. ఈ క్రమంలో స్థానిక గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం విద్యార్థి శివను పెళ్లాడింది. మరోవైపు శివానీతో తన కుమారుడి పెళ్లిని శివ తండ్రి దాతారామ్ సింగ్ స్వాగతించాడు. తన కొడుకు నిర్ణయానికి తాను మద్దతు ఇస్తున్నానని తెలిపాడు. ఆ జంట సంతోషంగా ఉంటే తమ కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పాడు.ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి నిషేధిత చట్టం అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. #Amroha : Shivani became Shabnam in love... Divorcing her first husband & Married with Shiva Shivani left Muslim religion and converted to Hinduism and got married The case of a village of Thana Said Nangli #UttarPradesh pic.twitter.com/QnJyKzl1PZ— Indian Observer (@ag_Journalist) April 9, 2025
ఎన్ఆర్ఐ

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్‌కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్‌లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్‌లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్‌కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్‌గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్‌లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
క్రైమ్

నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
తమిళనాడు: కెంగవల్లి సమీపంలో తల్లి దండ్రులపై దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన ఆడిటర్ పెళ్లి కోలంలో పోలీసులను ఆశ్రయించాడు. సేలం జిల్లా కెంగవల్లి సమీపంలోని క్రిష్ణపురం పంచాయతీకి చెందిన మణికంఠన్(43). ఆడిటర్‌గా ఉంటూ సేలం అంగమ్మాళ్ కాలనీలో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్లయ్యాక భార్యతో మనస్పర్థలు రావడంతో పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. మణికంఠన్ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న కొడుకు, 5వ తరగతి చదువుతున్న కుమార్తెతో నివసిస్తున్నాడు.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె విద్యాశ్రీ(21) ప్లస్ 2 పూర్తి చేసి ఇంట్లో ఉంటు వచ్చిన స్థితిలో, గత కొన్ని నెలలుగా ఆడిటర్ మణికంఠన్ ఆఫీసులో పనికి వెళ్లింది. ఇద్దరికీ పరిచయం ఏర్పడడంతో విద్యాశ్రీతో వివాహం జరిపించాలని మణికంఠన్ ఆమె తల్లిదండ్రులను కోరాడు. అయితే అతని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కాగా, మణికంఠన్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో విద్యాశ్రీ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె తల్లిదండ్రులు రాజేంద్రన్, వనిత పై దాడి చేసి విద్యాశ్రీ ని కారులో కిడ్నాప్ చేశారు. గాయపడిన రాజేంద్రన్ వనితను స్థానికులు రక్షించి కెంగవల్లి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు దర్యాప్తులో 43 ఏళ్ల ఆడిటర్ మణికంఠన్, 21 ఏళ్ల యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారిని వదిలి వేసినట్లు తెలిసింది.

కూతురిని చంపి.. తల్లి ఉరేసుకుని..
పెద్దపల్లి రూరల్: ఉన్నత చదువులు చదివింది.. కన్నబిడ్డకు విద్యాబుద్ధులు ప్రాప్తించేలా చూడాలంటూ రెండ్రోజుల క్రితమే బాసరలోని సరస్వతీదేవి అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించింది.. ఇంతలో ఏమైందో ఏమో.. క్షణికావేశంలో కన్న కూతురినే కడతేర్చింది.. ఆపై తానూ ఉరివేసుకుంది. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న లోక వేణుగోపాల్‌రెడ్డికి సాహితి (29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రితన్య (2) ఉంది. టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో.. సాహితి కూతురు రితన్యకు ఉరివేసి చంపి, తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాహితికి రాత్రి తల్లిదండ్రులు ఫోన్‌చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి సమాచారం తెలుసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి ఎక్కువగా ఆలోచిస్తుండేదని, సన్నగా ఉన్నాననే వేదనతో ఉండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ బాధ తాలూకు క్షణికావేశంలోనే సాహితి.. కూతురిని చంపి, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అక్షరాభ్యాసం చేయించి.. రెండు రోజుల క్రితమే బాసరలో చిన్నారి రితన్యతో తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. వచ్చే విద్యాసంవత్సరంలో కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. సాహితి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. భర్త వేణుగోపాల్‌రెడ్డి మంచివాడేనని స్పష్టం చేసింది. తన చావుకు ఎవరూ బాధపడొద్దని, తాను లేకుండా బిడ్డ ఎలా ఉంటుందోననే వేదనతోనే.. వెంట తీసుకెళ్తున్నానని లేఖలో పేర్కొంది.

16 రోజుల్లో.. ఉగ్ర విధ్వంసం
సాక్షి, హైదరాబాద్: ఒక సూత్రధారి.. మరో సహాయకుడు.. నలుగురు పాత్రధారులు.. 16 రోజుల ఆపరేషన్.. 25 కేజీల పేలుడు పదార్థం... వెరసీ.. 18 ప్రాణాలు. 2023 ఫిబ్రవరిలో జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నేపథ్యమిదీ. ఈ కేసులోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు విధించిన ఉరి శిక్షను మంగళవారం హైకోర్టు సమర్థించిన విషయం విదితమే. పాక్ నుంచి కథ నడిపిన రియాజ్... పాకిస్థాన్‌లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యాసీన్ భత్కల్‌కు ఈ–మెయిల్ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు. ఇతడు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, వఖాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్‌లను రంగంలోకి దింపాడు. అప్పటి వరకు వీరంతా మంగుళూరులోనే ఉన్నారు. పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి షెల్టర్ వెతకడం కోసం 16 రోజుల ముందు (2013 ఫిబ్రవరి 5న) నగరానికి చేరుకున్న మోను అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. హడ్డీ అదే నెల 10న హైదరాబాద్ చేరుకున్నాడు. గదితో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి సంతృప్తి చెందిన హడ్డీ తిరిగి మంగుళూరు వెళ్లాడు. భత్కల్స్ ఆదేశాల మేరకు మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి 25 కేజీల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం, 30 డిటొనేటర్లు ఉన్న బంగారం రంగు బ్యాగ్ ఇతడికి అందింది. సైకిళ్లు, కుక్కర్లు ఇక్కడే కొనుగోలు.. ముందు హడ్డీతో పాటు వఖాస్ సైతం పేలుడు పదార్థాలతో సిటీకి వచ్చారు. మలక్‌పేట, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో రెక్కీ చేసినా.. దిల్‌సుఖ్‌నగర్‌నే టార్గెట్ చేశారు. 2013 ఫిబ్రవరి 19న చిన్న బాంబు తయారు చేసిన హడ్డీ అబ్దుల్లాపూర్‌మెట్ కొండల్లో టెస్ట్ బ్లాస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజు (2013 ఫిబ్రవరి 20) హడ్డీ, వఖాస్, మోను ముగ్గురూ కలిసి మలక్‌పేట వెళ్లి... యశోదా ఆస్పత్రి నుంచి టీవీ టవర్ వైపునకు వచ్చే మార్గంలో ఉన్న ఓ సైకిల్ రిపేరింగ్ దుకాణం నుంచి పాత సైకిల్ కొన్నారు. మరొకటి కావాలనగా దాని యజమాని పాత బస్తీలోని జుమ్మేరాత్ బజార్ వెళ్లాలని సూచించాడు. మలక్‌పేట రైల్వేస్టేషన్లో పార్క్ చేసి.. ఆ సైకిల్‌ను మలక్‌పేట రైల్వేస్టేషన్లో పార్కింగ్ చేసి.. ముగ్గురూ ఆటోలో లక్డీకాపూల్ వెళ్లి మంగుళూరు వెళ్లేందుకు టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు తిరిగి వస్తూ బాంబుల తయారీకి ఎల్బీ నగర్లో రెండు ప్రెషర్ కుక్కర్లు, ఆ సమీపంలోని పండ్ల వ్యాపారుల నుంచి కొన్ని ఖాళీ చిన్న సైజు అట్ట పెట్టెలు కొనుగోలు చేశారు. బి–డే (బ్లాస్ట్ డే) అయిన 2013 ఫిబ్రవరి 21 ఉదయం వఖాస్‌కు బాంబుల తయారీ బాధ్యతల్ని అప్పగించిన హడ్డీ, మోను 11 గంటల ప్రాంతంలో పాతబస్తీలోని జుమ్మేరాత్‌బజార్‌కు చేరుకున్నారు. అక్కడ మరో పాత సైకిల్ కొనుగోలు చేసి దాన్ని కూడా తీసుకుని మలక్‌పేట రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో మొదటి సైకిల్ పెట్టిన చోటే పెట్టి ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు బాంబుల తయారీ పూర్తయింది. విధ్వంసానికి ముందే గది ఖాళీ.. రెక్కీ ప్రకారం ఏ–1 మిర్చ్ సెంటర్, దాని వెనుక రోడ్డులో అనునిత్యం రద్దీగా ఉండే మద్యం దుకాణం వద్ద బాంబులు పెట్టాలి. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ త్రయం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని గదిని ఖాళీ చేసింది. రెండు కుక్కర్ బాంబుల్ని పట్టుకున్న ముగ్గురూ షేర్ ఆటోలో ఎల్బీనగర్కు, అక్కడ నుంచి ప్రత్యేక ఆటోలో మలక్‌పేట వచ్చారు. రైల్వేస్టేషన్ పార్కింగ్ నుంచి సైకిళ్లను తీసుకున్నారు. ప్యాక్ చేసిన బాంబుల్ని వాటిపై పెట్టుకున్న ముగ్గురూ దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చారు. మొదటి సైకిల్ తీసుకుని మోను, రెండో సైకిల్‌తో వఖాస్ వెళ్లగా... హడ్డీ గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద ఎదురు చూశాడు. మోను నేరుగా వెళ్లి ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్ పెట్టాడు. మద్యం దుకాణం వరకు చేరే సమయం లేదని నిర్థారించుకున్న వఖాస్ 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెళ్లిపోయాడు. పేలుళ్లు జరిగిన అనంతరం హడ్డీ, మోను గడ్డిఅన్నారం చౌరస్తా నుంచి ఆటోలో లక్డీకాపూల్‌లోని ట్రావెల్స్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి ట్రావెల్స్‌కు చెందిన షటిల్ సరీ్వస్ వ్యానులో రేతి»ౌలి చౌరస్తా చేరుకుని అక్కడ నుంచి ట్రావెల్స్ బస్సులో మంగుళూరు వెళ్లిపోయారు. సైకిల్ పెట్టిన తరవాత వేరే మార్గంలో మోను నగరాన్ని దాటి వెళ్లిపోయాడు.

Hyderabad: క్షణికావేశం..పెను విషాదం!
హయత్‌నగర్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఇరువురి ఉసురు తీసింది. 11 నెలల బాలుడిని అనాథను చేసింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు పోలీసులు తెల్పిన మేరకు ఇలా ఉన్నాయి. సంపంగి నగేష్ (25), శిరీష(20) భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 నెలల కుమారుడు ఉన్నాడు. హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో నివసిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులుగా పని చేస్తున్నారు. మంగళవారం భార్యా భర్తల మధ్య చిన్న వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష క్షణికావేశంలో..ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పూచీకత్తుతో రాత్రి 9 గంటలకు వదిలి పెట్టారు. ఆవేదనతో భర్త ఆత్మహత్య... భార్య మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన నగేష్ బుధవారం తెల్లవారుజామన హయత్‌నగర్‌లోని రిలయన్స్ డిజిటల్ షోరూం భవనం పైకి ఎక్కి కిందకు దూకాడు. రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు..నగేష్ ఒక్కడే భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పాపం పసికందు... భార్యా భర్తలిద్దరూ ఒక రోజు తేడాలో ఆత్మహత్యకు పాల్పడడంతో ముదిరాజ్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన 11 నెలల బాలుడిని చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
వీడియోలు


పోసాని కృష్ణమురళీకి హైకోర్టులో ఊరట


ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ


క్రిష్ 4లో హృతిక్ ట్రిపుల్ రోల్


యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్: సీఎం రేవంత్ రెడ్డి


BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్


పరిటాల సునీతే నీ చొక్కా ఊడదీసి రోడ్డుపై నిలబెడుతుంది చూసుకో..


మరికొన్ని గంటల్లో భారత్ కు తహవూర్ రాణా


అనితకు రిపోర్టర్ల షాక్.. మధ్యలోనే ఎస్కేప్


వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి వేడుకలు


మార్వెల్ రేంజ్ మూవీ తీస్తున్న బన్నీ, అట్లీ