Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu coalition govt Land Grabbing For Amaravati Capital Expansion1
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్‌’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ లేదా నెగోíÙయేటెడ్‌ సెటిల్‌మెంట్స్‌ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్‌ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు.

Mehul Choksi Arrested In Belgium Police2
వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు

బ్రస్సెల్స్‌: ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఇక, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ (Mehul Choksi) విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతకుముందు.. పీఎన్‌బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్‌లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. Fugitive diamond trader Mehul Choksi, who is wanted in connection with the Rs 13,500-crore Punjab National Bank (PNB) loan fraud case, has been arrested by the police in Belgium, according to a report. The 65-year-old was taken into custody on Saturday (April 12) at the request… pic.twitter.com/xQlq2T3E0C— News9 (@News9Tweets) April 14, 2025

Rasi Phalalu: Daily Horoscope On 14-04-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు,చైత్ర మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.6.24 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: స్వాతి రా.10.17 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: తె.4.30 నుండి 6.14 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ప.12.32 నుండి 2.20 వరకుసూర్యోదయం : 5.49సూర్యాస్తమయం : 6.10రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.... కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. సన్మానాలు. విద్యావకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.వృషభం... నూతన ఉద్యోగలాభం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.మిథునం... ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.కర్కాటకం.. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.సింహం... చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆస్తివివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.కన్య... మిత్రులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. పనులలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.తుల.... పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో ఆదరణ. సోదరులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.వృశ్చికం.... సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.ధనుస్సు... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.మకరం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సోదరులతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.కుంభం.. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.... కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

IPL 2025: Delhi Lost First Match Of The Season4
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ.. కరుణ్‌ పోరాటం వృధా.. సీజన్‌లో తొలి ఓటమి

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ నాలుగు వరుస విజయాల తర్వాత తొలి ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ గెలవాల్సి ఉండింది. అయితే 19వ ఓవర్‌ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుంది. సిం‍గిల్స్‌ తీసినా గెలిచే మ్యాచ్‌లో ఢిల్లీ చివరి వరుస బ్యాటర్లు డబుల్స్‌ కోసం ప్రయత్నించి రనౌటయ్యారు. 19వ ఓవర్‌లో హై డ్రామా నడిచింది. నాలుగో బంతికి రనౌట్‌ కాకముందు అశుతోష్‌ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించాడు. అయితే అతను లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. ఆతర్వాతి బంతికి కుల్దీప్‌ కూడా అనవసరమైన రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. చివరి బంతికి మోహిత్‌ సింగిల్‌ తీసే ప్రయత్నం చేయగా.. సాంట్నర్‌ డైరెక్ట్‌ హిట్‌తో అతన్ని కూడా రనౌట్‌ చేశాడు. దీంతో ఢిల్లీ మరో ఓవర్‌ మిగిలుండగానే పరాజయంపాలైంది. ముంబై నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీ విజయానికి పటిష్ట పునాది వేశాడు. ఓ దశలో (11.3 ఓవర్లలో 135/2) ఢిల్లీ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.అయితే కరుణ్‌ ఔట్‌ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్‌ శర్మ (4-0-36-3), మిచెల్‌ సాంట్నర్‌ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్‌ ఫ్రేజర్‌ (0) వికెట్‌ కోల్పోయినా.. అభిషేక్‌ పోరెల్‌ (33), కరుణ్‌ నాయర్‌ రెండో వికెట్‌కు 10.1 ఓవర్లలో 119 పరుగులు జోడించారు. 119 పరుగుల వద్ద పోరెల్‌, 135 పరుగుల వద్ద (11.4వ ఓవర్‌) కరుణ్‌ నాయర్‌ వికెట్‌ వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పతనం మొదలైంది. కేఎల్‌ రాహుల్‌ను (15) కర్ణ్‌ శర్మ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు (క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌). ఆ తర్వాత అక్షర్‌ పటేల్‌ను (9) బుమ్రా, ట్రిస్టన్‌ స్టబ్స్‌ను (1) కర్ణ్‌ శర్మ ఔట్‌ చేశారు. తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్‌లో) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన అశుతోష్‌ శర్మ (17), కుల్దీప్‌ (1), మోహిత్‌ శర్మ (0) రనౌట్‌ కాగా.. మరో హిట్టర్‌ విప్రాజ్‌ నిగమ్‌ను (14) సాంట్నర్‌ స్టంపౌట్‌ చేశాడు. అంతకుముందు ముంబై టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (59), రికెల్టన్‌ (41), సూర్యకుమార్‌యాదవ్‌ (40), నమన్‌ ధీర్‌ (38) రాణించగా.. రోహిత్‌ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, విప్రాజ్‌ నిగమ్‌ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్‌ కుమార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్‌లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్‌ ప్లేస్‌ నుండి రెండో స్థానానికి పడిపోయింది.మ్యాచ్‌ అనంతరం ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ ఓటమి పట్ల విచారం వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని బాధ పడ్డాడు. మిడిలార్డర్‌లో కొన్ని చెత్త షాట్లు కొంపముంచాయని అన్నాడు. మంచు కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపాడు. కుల్దీప్‌, కరుణ్‌ నాయర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

Puthandu 2025 History and Significance know all about Tamil New year5
నేడు తమిళుల ఉగాది.. ‘పుతండు’ ప్రత్యేకతలివే..

ఈరోజు (ఫిబ్రవరి 14) తమిళుల నూతన సంవత్సరం.. తెలుగువారంతా ఉగాది జరుపుకున్న మాదిరిగానే తమిళులు నేడు వారి నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. దీనిని వారు ‘పుతండు’(Puthandu)గా పిలుస్తుంటారు. నేడు తమిళ క్యాలెండర్‌లోని చిత్తిరై నెలలోని మొదటి రోజు. ‘పుతండు’ రోజున తమిళనాడులో కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సవం చేసుకుంటారు. అలాగే రాష్ట్రంలోని వ్యాపారులు ఈ రోజున తమ నూతన ఆర్ధిక సంవత్సర లావాదేవీలను ప్రారంభిస్తారు. దీనిని "కై-విశేషం" అని పిలుస్తారు. పురాణాల ప్రకారం పుతండు రోజున బ్రహ్మదేవుడు(Lord Brahma) విశ్వ సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అలాగే ఈ రోజునే ఇంద్రుడు భూమిపైకి శాంతి, ఆశ, ఆనందాన్ని తీసుకువచ్చాడని భక్తులు విశ్వసిస్తారు. తమిళ సంస్కృతిలో ఈ రోజున కొత్త పనులు తలపెడితే శ్రేయస్సు, సంతోషం కలుగుతుందని చెబుతారు. పుతండును సంగమ యుగం నుంచి జరుపుకుంటున్నారని, ఇది వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉందని చరిత్ర చెబుతోంది. పుతండు రోజున తమిళులు తమ ఇళ్లను కోలం (రంగోలీ)తో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి వేడుకలు చేసుకుంటారు. ‘మంగాయ్ పచ్చడి’ని తింటారు. దీనిని బెల్లం, మామిడి, వేప ఆకులు, ఎర్ర మిరపకాయలతో తయారుచేస్తారు. ఇది జీవితంలోని వివిధ రుచులను సూచిస్తుంది. ఈ రోజున ఆలయాలను సందర్శించడం, కొత్త బట్టలు ధరించడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం చేస్తారు.పుతండు ఉత్సవం తమిళులకు కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే సమయంగా భావిస్తారు. పుతండు వేడుకలు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు, కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. ఈ ఉత్సవాన్ని శ్రీలంక, మలేషియా, సింగపూర్ తదితర తమిళ జనాభా అధికంగా కలిగిన దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు: దళిత రైతు దారుణ హత్య.. ఏడుగురు అరెస్ట్

Aqua farmers worry with Companies cut prices under pretext of US tariffs6
‘కౌంట్‌’ డౌన్‌.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!

గతంలో బస్తా ఫీడ్‌ రూ.900 ఉండగా ఇప్పుడు రూ.2,700 అయి­పోయింది. మేత ధర మూడు రెట్లు పెరగగా రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్‌ రూ.600 ఉండగా ఇప్పుడు రూ.300కి పడిపోయింది. 30 కౌంట్‌కు రూ.వంద, మిగిలిన కౌంట్‌లకు సగటున రూ.60 చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం వంద కౌంట్‌ రూ.220 చొప్పున కొనాలని చెబుతున్నా రూ.180కి మించి చెల్లించడం లేదు. వెంటనే స్పందించి ఆదుకోవాలి. – మద్దాల గోపాలకృష్ణ, మేడపాడు, పశ్చిమగోదావరి జిల్లా ⇒ ‘30 ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నా. ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్కెట్‌ను ఎక్స్‌పోర్టర్స్, ప్రాసెసింగ్‌ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్టుగా తగ్గించేస్తున్నారు. ఫీడ్‌ ధరలు మాత్రం పెంచేశారు. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. నెలకు రూ.1.20 లక్షలు అదనంగా విద్యుత్‌ బిల్లులు కడుతున్నా. ప్రభుత్వం నిర్దేశించిన రూ.220 ఏమాత్రం గిట్టుబాటు కాదు’ – గుండు నరసింహం, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ⇒ ‘ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లీజులకే పోతోంది. ఆక్వా సాగుకు ఎకరాకు రూ. 4.5 లక్షలకుౖపైగా ఖర్చవుతోంది. గతంతో పోలిస్తే ఫీడ్‌ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి. మాది నాన్‌ ఆక్వా జోన్‌ ప్రాంతం. యూనిట్‌ రూ.4 చొప్పున కరెంట్‌ చార్జీలు చెల్లిస్తున్నా. నాన్‌ ఆక్వా జోన్‌ పరిధిలో యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో ఆశపడ్డాం. ఆర్నెల్లకు ఒకసారి ట్రూఅప్, లోడింగ్‌ చార్జీల పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేలు భారం వేస్తున్నారు. అదనపు వినియోగ సుంకం (ఏసీడీ) పేరిట మరో రూ.30వేల నుంచి రూ.40 వేలు బాదేస్తున్నారు. ట్రంప్‌ సుంకం వాయిదా పడినా కంపెనీలు కౌంట్‌ రేట్లను మాత్రం పెంచలేదు. సీఎం ప్రకటించిన 100 కౌంట్‌ రూ.220 కూడా అమలు కావడం లేదు. మొత్తంగా రూ.5–10 లక్షల మేర నష్టపోతున్నాం. – మల్లిడి సందీప్‌రెడ్డి, గంటి, కొత్తపేట మండలం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ⇒ జాతీయ స్థాయిలో 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి కాగా, దాంట్లో 35 శాతం (దాదాపు రూ. 20వేల కోట్లు) అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు 20–50 కౌంట్‌ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అయినా సరే ఇప్పుడు 60–100 కౌంట్‌ ధరలను తగ్గించేశారు. సాక్షి, అమరావతి: రొయ్య రైతులను కూటమి సర్కారు రోడ్డున పడేసింది! ఆక్వా సాగుదారులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం.. కాల్చుకు తింటున్న కరెంట్‌ చార్జీలు.. పతనమవుతున్న ధరలు.. ప్రభుత్వ భరోసా కరువవడంతో రైతులు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫీడ్‌ ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ మేరకు కిలోకు రూ.20–25 మేర అన్ని రకాల ఫీడ్‌ ధరలు తగ్గించాల్సి ఉంది. ఫీడ్‌ రేట్లు తగ్గకపోగా మూడు రెట్లు పెరిగాయి. దీనిపై ఆక్వా రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు గత పది నెలల్లో ట్రూ అప్‌ చార్జీలు, లోడింగ్, అదనపు వినియోగ సుంకం పేరిట విద్యుత్‌ చార్జీల బాదుడు మొదలైంది. ఆక్వా జోన్, నాన్‌ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగుదారులందరికీ యూనిట్‌ రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తామన్న హామీని టీడీపీ సర్కారు నెరవేర్చకపోవడంతో మోసపోయిన రైతులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విద్యుత్‌ చార్జీలు చెల్లిస్తున్నారు. తాజాగా ట్రంప్‌ టారిఫ్‌ల సాకుతో కౌంట్‌కు రూ.30–80 మేర తగ్గించిన కంపెనీలు, అమెరికా విధించిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కౌంట్‌ ధర ఆ మేరకు పెంచలేదు.ఫీడ్‌ రేట్లు తగ్గించకుండా పది నెలల పాటు ఆక్వా రైతును దోపిడీ చేసిన కంపెనీలు కంటితుడుపు చర్యగా రూ.4 చొప్పున తగ్గించి చేతులు దులుపుకొన్నాయి. కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరించటాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్‌ హాలిడేకు సిద్ధం కావడం, మిగిలిన జిల్లాల్లోనూ ఇదే బాట పడుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు.. రూ.1.50కే విద్యుత్‌ హామీ గాలికి.. ఆక్వా జోన్, నాన్‌ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్‌ రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణం.. ఇలా మెరెన్నో∙హామీలిచ్చారు. అయితే వీటి అమలు కోసం రూ.1,099 కోట్లతో అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను కూటమి సర్కారు పక్కన పెట్టేసింది. గతంలో 15 రోజులకోసారి రైతులు, ప్రాసెసింగ్‌ ఆపరేటర్లు, ఎక్స్‌ పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను స్థిరీకరిస్తూ మద్దతు ధర తగ్గకుండా పర్యవేక్షించగా గత 10 నెలలుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు. కమిటీలో రైతులకు చోటే లేదు.. అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించాల్సిన కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్వా కంపెనీలు కౌంట్‌ రేట్లను దారుణంగా తగ్గించాయి. ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతుల గోడు పెడచెవిన పెట్టారు. తాజా సంక్షోభంపై ఆక్వారంగ భాగస్వామ్య సంస్థలతో ఏర్పాటు చేసిన కమిటీలో రైతులకు చోటు లేకుండా చేశారు. వంద కౌంట్‌ రూ.220గా నిర్ణయించారు. ఇదే అదునుగా కంపెనీలు మిగిలిన కౌంట్‌ ధరలను రూ.20–60 వరకు తగ్గించేశాయి. 100 కౌంట్‌ను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కూడా కొనడం లేదు. కొందరు ట్రేడర్లు రూ.180కి మించి ఇవ్వడం లేదు. ట్రంప్‌ టారిఫ్‌ల వర్తింపు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కూడా కౌంట్‌పై రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి కరువైంది. మెజార్టీ కంపెనీలు 20–50 కౌంట్‌ రొయ్యలను కొనడమే నిలిపివేశాయి. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఫీసుల (రొయ్య) మాదిరిగా ధరలు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. సోయా ధర కిలో రూ.85 ఉన్నప్పుడు మేత ధర టన్ను రూ.15 వేలు ఉండేది. నేడు సోయా ధర కిలో రూ.23 కు తగ్గింది. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్‌ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాల్సి ఉన్నా కంటి తుడుపు చర్యగా కేవలం రూ.4 తగ్గించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. ఆక్వాలో నంబర్‌ వన్‌ ఏపీ రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో 1.69 లక్షల మంది ఆక్వా సాగు చేస్తున్నారు. మంచినీటి రొయ్యలు 9.56 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యలు 7.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుదారులున్నారు. రాష్ట్రంలో 111 కోల్డ్‌ స్టోరేజ్‌లు, 1,104 ఆక్వా షాపులు, 106 ప్రాసెసింగ్‌ ప్లాంట్స్, 241 ఆక్వా ల్యాబ్స్‌ ఉన్నాయి. 2023–24లో 51.58 లక్షల టన్నుల దిగుబడులతో ఆక్వాలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌గా నిలవగా జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.09 శాతం ఏపీ నుంచే జరిగాయి. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. అలాంటి ఆక్వా రంగం నేడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా సంక్షోభంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆక్వాకు అండగా వైఎస్‌ జగన్‌వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ తమకు అండగా నిలిచిందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన ఫీడ్, సీడ్‌ సరఫరా కోసం ఏపీ ఫిష్‌ ఫీడ్, సీడ్‌ యాక్టులను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తెచ్చింది. నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాల్యాబ్స్‌ ఏర్పాటుతో ఇన్‌పుట్‌ టెస్టింగ్, వ్యాధి నిర్థారణ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. కరోనా వేళ 100 కౌంట్‌ రూ.150–180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. ఈక్వెడార్‌ సంక్షోభ సమయంలో సీనియర్‌ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సమీక్షించి 100 కౌంట్‌ రూ.245 కంటే తగ్గకుండా చర్యలు తీసుకుంది. 30 కౌంట్‌ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. అంతేకాకుండా పెంచిన ఫీడ్‌ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860కి మించి పడకుండా అడ్డుకుందని గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా జోన్‌ పరిధిలో పదెకరాల లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ను అందించింది. 2014–19 మధ్య నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల విద్యుత్తు సబ్సిడీ బకాయిలు చెల్లించడంతోపాటు ఐదేళ్లలో ఏకంగా రూ.3,394 కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంది.పంట విరామం మినహా మార్గం లేదు... ట్రంప్‌ ట్యాక్స్‌ను సాకుగా చూపించి కౌంట్‌ ధరలు దారుణంగా తగ్గించేశారు. సుంకాల పెంపు అమలు 90 రోజులు పాటు వాయిదా వేసినా 100 కౌంట్‌ రూ.200–220కు మించి కొనడం లేదు. కిలోకి రూ.30 నష్టపోతున్నాం. మేత ధర కనీసం రూ.20 తగ్గించాలి. రొయ్యల పెంపకంలో 20% మందులకే ఖర్చవుతుంది. వాటి ధరలు కూడా తగ్గించాలి. ఆక్వా సాగులో 80 %రైతులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట విరామం మినహా మరో మార్గం లేదు. – భూపతిరాజు సుబ్రహ్మణ్యం రాజు (బుల్లిరాజు), ఎదుర్లంక, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాసబ్సిడీ విద్యుత్తు హామీని నెరవేర్చాలి.. 12 ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నా. యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే అని ఇచ్చిన హామీని కూటమి పార్టీలు నెరవేర్చాలి. రూ.3.50 నుంచి రూ.4 వరకు యూనిట్‌పై భారం పడుతోంది. ఎగుమతి దారులు, ఫీడ్‌ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా మారటంతో చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 100 కౌంట్‌ రూ.260 నుంచి రూ.270 పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – బొల్లెంపల్లి శ్రీనివాస్, అండలూరు, పశ్చిమగోదావరి జిల్లాపెట్టుబడి ఖర్చులు పెరిగాయి గతంతో పోలిస్తే ఆక్వా సాగు పెట్టుబడి ఏకంగా 50 శాతం పెరిగింది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. – బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లరేవు, కాకినాడ జిల్లాఅన్యాయమైపోతున్నాం.. గతేడాది కేంద్ర బడ్జెట్‌లో ముడి సరుకులపై కస్టమ్స్‌ డ్యూటీ ఎత్తివేయడంతో ఇంపోర్టెడ్‌ మేతపై పన్నులు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గినప్పటికీ కంపెనీలు మేత ధర ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇప్పుడు అమెరికాలో దిగుమతి సుంకం పెంచారనే సాకుతో ఆగమేఘాల మీద కౌంట్‌ రేట్లు తగ్గించడం దుర్మార్గం. ట్యాక్స్‌ పెంపు వాయిదా పడ్డా కౌంట్‌ ధర ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం. –టి.నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్‌ సలహాదారుడు

Jaat Movie Against To LTTE Boycott Called In Tamil Nadu7
'జాట్'‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయండి.. ఫైర్‌ అవుతున్న తమిళులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సన్నీ డియోల్‌ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం జాట్‌. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలని #BoycottJaatMovie పేరుతో ఒక హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అవుతుంది. శ్రీలంకలో (Sri Lanka) తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈని ఒక ఉగ్రవాద సంస్థగా ఈ చిత్రంలో చూపించారంటూ కొందరు తమిళియన్స్‌ విరుచుకుపడుతున్నారు. తమ కోసం ప్రాణాలకు తెగించిన వారిని ఇలా చూపించడం ఎంతమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ తమ ఎక్స్‌ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. తమిళనాడులో దర్శకుడు గోపీచంద్‌ మలినేని అడుగుపెడితే తగిన బుద్ధి చెబుతాం అంటూ భగ్గుమంటున్నారు.సినిమా కథలో భాగంగా శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన పాత్రలో నటుడు రణతుంగ కనిపిస్తాడు. జాట్‌లో అతనే విలన్‌ కూడా.. డిప్యూటీ కమాండర్‌ ఆఫ్‌ జాఫ్నా టైగర్‌ ఫోర్స్‌ (JTF) పేరుతో పోలీసుల హిట్‌లిస్ట్‌లో రణతుంగ పేరు ఉంటుంది. ఇక్కడ జాఫ్నా అనేది శ్రీలంకలోని ద్వీపకల్పం. అక్కడే ఎల్‌టీటీఈని స్థాపించిన ప్రభాకరన్‌ జన్మించారు. ఇందులో విలన్‌తో నడిచే గ్యాంగ్‌ను చూపించిన తీరు అంతా కూడా ఎల్‌టీటీఈకు దగ్గరి పోలీకలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ సినిమాలో ఎల్‌టీటీఈ పేరు చెప్పనప్పటికీ ఆ మార్క్ చూపుతూ సినిమా తీశారని చెబుతున్నారు. ఎల్‌టీటీఈని ఒక ఉగ్రవాద సంస్థగా ఎందుకు చూపారంటూ కామెంట్లు చేస్తున్నారు. తమిళులు ఈ చిత్రాన్ని చూడొద్దంటూ వైరల్‌ చేస్తున్నారు. శ్రీలంకలోని తమిళుల కోసం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల హక్కుల కోసం పోరాడిన వారి గురించి ఇలా చూపిస్తారా అంటూ దర్శకుడు గోపీచంద్‌ మలినేనిపై విరుచుకుపడుతున్నారు. కొందరు తెలుగువారు తమిళుల పట్ల ఇంతలా ద్వేషం చూపుతున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఈ తెలుగు దర్శకుడు తమిళ స్వాతంత్ర్య సమరయోధులు LTTEపై అంత ద్వేషం కక్కడానికి కారణం ఏమిటి..? LTTEపై ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తమ కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని ఉగ్రవాదులుగా ఎందుకు చూపుతున్నారు అంటూ ఫైర్‌ అవుతున్నారు.తమిళుల హక్కుల కోసం ఎల్‌టీటీఈ.. దాని గురించి తెలుసా..?అణచివేతకు గురైన తమిళులకు స్వేచ్ఛ పేరిట ఉత్తర శ్రీలంకలోని వన్నీ అటవీ ప్రాంతం నుంచి ఎల్‌టీటీఈ సాయుధ పోరాటం కొనసాగించింది. శ్రీలంకలో ఉన్న తమిళుల హక్కుల కోసం తమిళ్‌ న్యూటైగర్స్‌(TNT) పేరుతో 1972లో ఈ సంస్థను ప్రభాకరణ్‌ ప్రారంభించాడు. అయితే, 1975లో జాఫ్నా మేయర్‌ను అతి సమీపం నుంచి ప్రభాకరణ్‌ కాల్చి చంపాడు. ఆపై 1976లో టీఎన్‌టీ పేరును లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం(LTTE)గా మార్చాడు. దానికి తనే లీడర్‌గా ఉంటూ తమ ప్రత్యర్థుల్ని నిర్ధాక్షిణ్యంగా హత్య చేయడం ప్రారంభించారు. ప్రభాకరణ్‌ నాయకత్వంలో ఎల్‌టీటీఈ మరింత పవర్‌ఫుల్‌ అయింది. ఏకంగా గెరిల్లా దళంగా ఎదిగింది. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో మొత్తం 60వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.శ్రీలంకలోని తమిళ ప్రజల దీనస్థితి తనను ఆయుధం పట్టేలా చేసిందని ప్రభాకరన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్లాన్‌ ప్రకారమే తమపై నరమేధం సాగుతోందని ఆయన చెప్పాడు. తమ జాతిని కాపాడుకునేందుకు ఈ నిరంకుశ రాజ్యం నుంచి ప్రజలను రక్షించేందుకే సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నాని ఆయన మరణానికి ముందు చెప్పాడు. 2009లో శ్రీలంక సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రభాకరణ్‌ హతమయ్యాడు.As a Tamilian, I strongly oppose the misrepresentation of the LTTE as terrorists in the movie Jaat. The LTTE was born out of systemic oppression and genocide against Tamils in Sri Lanka. Stop rewriting our history to suit your narrative.#BoycottJaatMovie #LTTEFreedomFighters pic.twitter.com/OaOISdJ5QZ— Senthilvelu V C (@Senthilveluvc) April 13, 2025LTTE was not a terrorist group.It was a resistance force born out of oppression, fighting for Tamil rights & justice.‘Jaat’ shamelessly demonizes a freedom struggle.Tamils won’t stay silent when history is twisted.#BoycottJaatMovie #LTTEFreedomFighters@Seeman4TN @SaalanPaari pic.twitter.com/Qq4sEb9pFV— Asif Ahammed (@asifahamadu) April 13, 2025#BoycottJaatMovie #LTTEFreedomFighters 😠 Why is there so much hatred towards the Tamil liberation movement? #Jaat 🛑#SaveTamilTrue Freedom Rules 💯1.Respect women and give equal rights.2. Never ever use alcohol.3.They never disrespect other's language. pic.twitter.com/0wGibMSRIy— Tamil Pillaigal 🐬 (@TamilPillaigal) April 13, 2025

Indian Overseas Bank reduces Repo Linked Lending Rate by 25 basis points8
అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్‌

చెన్నై: రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రెపో రేటు పావుశాతం తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులూ ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐవోబీ) రెపో ఆధారిత రుణాలపై వడ్డీరేటు 25 బేసిస్‌ పాయింట్లు (0.25%) తగ్గించినట్లు ప్రకటించింది.ఈ ఏప్రిల్‌ 12 (శనివారం) నుంచి రెపో ఆధారిత రుణాలపై రేటును 9.10% నుంచి 8.85 శాతానికి కుదించినట్లు బ్యాంకు తెలిపింది. ప్రతీకార సుంకాల్లో భాగంగా ట్రంప్‌ భారత్‌పై 26% టారిఫ్‌ వడ్డనతో తలెత్తిన ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో వృద్ధికి దన్నుగా నిలిచేందుకు ఆర్‌బీఐ రెపో రేటును 6.25% నుంచి 6 శాతానికి తగ్గించింది.

China Aims To Operate World First Hybrid Fusion-Fission Nuclear Plant By 20309
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం! 

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారుచౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్వహించాలంటే కనీసం 40 లక్షల విద్యుత్‌ వాహనాలను చార్జ్‌ చేయడానికి సమానమైన విద్యుత్‌ కావాలని అంచనా. ఆన్‌లైన్‌ డేటాను రెప్పపాటులో ప్రాసెస్‌ చేసే కృత్రిమ మేధ డేటా సెంటర్లకు ప్రాణమైన గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (జీపీయూ)లకు కూడా నిరంతరం నిరాటంకమైన విద్యుత్‌ సరఫరా తప్పనిసరి. ప్రపంచమే డేటామయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా, ఆన్‌లైన్‌లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుచ్ఛక్తి కావాల్సిందే. అణు విద్యుత్‌ రంగంలో ఇప్పటికే నంబర్‌వన్‌గా ఉన్న చైనా దీన్ని ముందే పసిగట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కేంద్రక సంలీన, విచ్చిత్తి’ సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్‌ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్‌ నిరంతరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి... ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుందని చైనాకు పేరుంది. ఇమిటేషన్‌ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాటికి అత్యధిక నిధులు కేటాయించిన దేశాల్లో చైనాది రెండో స్థానం విశేషం. హువాయీ, టెన్‌సెంట్, అలీబాబా, గ్జియోమీ, డీజేఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌కు సంబంధించి బీవైడీ తదితరాలు చైనాను టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలిపాయి. 5జీ టెక్నాలజీలో హువాయీ, డ్రోన్‌ టెక్నాలజీలో బీవైడీ టాప్‌ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ఐదు నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 400 కిలోమీటర్ల వెళ్లగల బ్యాటరీ, చార్జింగ్‌ వ్యవస్థలను బీవైడీ అభివృద్ధి చేసింది. విద్యుత్‌ వాహనాల అమ్మకాలు, ఆదాయంలో అది ‘టెస్లా’ను దాటేసిందని బీబీసీ ఇటీవలే పేర్కొంది. విద్యుత్‌ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్‌ అవసరం. ఆ అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన, విచ్ఛిత్తి రియాక్టర్‌ పనిలో పడింది.ఇలా పని చేస్తుంది జియాన్‌గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్‌ ద్వీపంలో ఝింగ్‌హువో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్కేంద్రాన్ని కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. చైనా భాషలో ఝింగ్‌హువో అంటే మెరుపు. కేంద్రక విచ్చిత్తిలో యురేనియం వంటి బరువైన అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది. అణుబాంబు తయారీలో ఉండేది ఈ సూత్రమే. అణు రియాక్టర్లలో నూ దీన్నే వాడతారు. అదే కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. విచ్చిత్తితో పోలిస్తే సంలీన చర్యతోనే అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యం. ఝింగ్‌హువో రియాక్టర్‌లో తొలుత సంలీన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారయుత కేంద్రకాల సాయంతో విచ్ఛిత్తి జరుపుతారు. తద్వారా మరింత ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్తవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.అత్యధిక ‘క్యూ వాల్యూ’ అత్యధిక అణు విద్యుదుత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్‌ విద్యుత్‌ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాన్నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని ‘నికర శక్తి లాభం’గా పిలుస్తారు. దాన్నే ‘క్యూ వాల్యూ’గా చెప్తారు. సంలీన ప్రక్రియలో అత్యధికంగా ఏకంగా 30 క్యూ వాల్యూను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సౌత్‌ చైనా మారి్నంగ్‌ పోస్ట్‌ కథనం పేర్కొంది. మూడేళ్ల క్రితం అమెరికాలో కాలిఫోరి్నయాలోని నేషనల్‌ ఇగ్నిషన్‌ ఫెసిలిటీ కేంద్రం 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్‌ థర్మో న్యూక్లియర్‌ ఎక్స్‌పరమెంటల్‌ రియాక్టర్‌ (ఐటీఈఆర్‌) 10 క్యూ వాల్యూను సాధించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్‌ ఇప్పటికే కేంద్రక సంలీనం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి. చైనా తాజా యత్నాలు ఫలిస్తే అది ఏకంగా 20 ఏళ్లు ముందుకు దూసుకెళ్లగలదని ఆంట్రప్రెన్యూర్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆర్నాడ్‌ బేర్‌ట్రెండ్‌ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Indian Families Are Impacting Law and Society says Justice Nagarathna10
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు 

బెంగళూరు: భారత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న అన్నారు. విడాకుల సంఖ్య కొంతకాలంగా క్రమంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘రెండు దశాబ్దాలుగా 25–29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో అవివాహితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా అమ్మాయిల్లో సగటు వివాహ వయసు కూడా పెరుగుతోంది’’ అని నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ సమాచారాన్ని ఉటంకించారు. సుప్రీంకోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి చైర్‌పర్సన్‌ అయిన ఆమె ‘కుటుంబం: భారతీయ సమాజానికి పునాది’ పేరిట బెంగళూరులో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో మాట్లాడారు. ‘పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ విద్య అందుబాటులో రావడం వంటి కారణాలతో కుటుంబాల్లో మార్పులొస్తున్నాయి. విద్య, సాధికారతతో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతం్రత్యాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి. వారు తమ కుటుంబానికి గాక దేశానికీ ఎనలేని సేవ చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు. 40 శాతం పెళ్లిళ్లు విచ్చిన్నం కుటుంబ తగాదాల కేసులు పెరిగిపోతుండటం పట్ల జస్టిస్‌ నాగరత్న ఆవేనద వెలిబుచ్చారు. అందుకు మహిళలే కారణమన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. సమాజ ధోరణి మారకపోవడం వంటివే అందుకు ప్రధానంగా కారణమని అభిప్రాయపడ్డారు. ‘‘సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు మారనప్పుడే వైవాహిక వివాదాలు తలెత్తుతాయి. గత పదేళ్లుగా జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం దాకా విచ్చిన్నమయ్యాయి. ఇంతగా కుటుంబ కలహాల కేసులు వచ్చిపడుతుండటం ఫ్యామిలీ కోర్టులకు తలకు మించిన భారం అవుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ సరిగా చేయలేదనో, ఫంక్షన్‌కు త్వరగా ముస్తాబు కాలేదనో కూడా కోర్టు దాకా వస్తున్నారు.ఇలాంటి గొడవల వల్ల అంతిమంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. కుటుంబ వివాదాలకు ఫ్యామిలీ కోర్టుల కంటే కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం ఉత్తమం. ఇరుపక్షాలూ సంయమనంతో ప్రయత్నిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ముందు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. సమస్యను అవతలి వ్యక్తి దృక్కోణం నుంచి చూడాలి. ‘‘భార్య ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది పనులూ ఒంటిచేత్తో చక్కబెడుతుందని భర్త గుర్తుంచుకోవాలి. ఆమెకు తగిన విలువ ఇస్తే పిల్లలూ మంచి వాతావరణంలో పెరుగుతారు’’ అంటూ హితవు పలికారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement