అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించాలని కోరుతూ నల్లగొండ జిల్లా వేములపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్‌కార్డు దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు.
వేములపల్లి: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించాలని కోరుతూ నల్లగొండ జిల్లా వేములపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్‌కార్డు దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు. స్థానిక సర్పంచ్ రాములు యాదవ్ ఆధ్వర్యంలో 100 మంది దరఖాస్తుదారులు ధర్నాకు దిగారు. నెల రోజుల్లో సమస్య పరిష్కారిస్తానని వేములపల్లి ఎమ్మార్వో సరస్వతి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.