Top Stories
ప్రధాన వార్తలు

బాబు కోసం సరే.. రేవంత్ సంగతేంటీ.. పచ్చ పైత్యంతో పిచ్చి రాతలు!
‘వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం.. మొదటి స్థానంలో తమిళనాడు! తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైపైకి..’ ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో పతాక శీర్షికన వచ్చిన కథనం. ఈ కథనాల ప్రకారం వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది! అంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉన్నట్లే కదా? ఆ వెనుకబాటు గురించి తెలంగాణలోనూ ప్రచురించాలి కదా? వారి టీవీలలో ప్రసారం చేయాలి కదా!.కానీ, తెలంగాణ ఎడిషన్లలో ఈనాడు, తదితర ఎల్లో మీడియా పత్రికలు అసలు ఆ కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదని? లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలన్నీ కాకి లెక్కలని తెలుసు కనుకనా?. ఏపీలో తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలనా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఏపీలో బాగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ,ఇతర వ్యాపారాలను హైప్ చేయడానికి కూడా ఇది ఒక మార్గం కావచ్చు.జగన్ టైమ్‌లో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంకు ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం బ్యానర్ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేస్తోంది. వాస్తవంగా వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు ఇచ్చినా జనం నమ్ముతారా? ఈ కథనాలు రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది జరిగిపోతోందని సంబరపడిపోవడం చూడడానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవే. కేవలం ముందస్తు అంచనాలు. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదు. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు ఇంకా కేంద్రానికి పంపలేదు కూడా. నిజంగా ఎల్లో మీడియా వార్తలు చదివితే ఈ పది నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా? అన్న డౌటు రావచ్చు.తలసరి ఆదాయం పెరిగిపోతే ప్రజలు తమకు స్కీములు ఏవీ ఇవ్వక పోవడంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?. దానికి వీరెవ్వరూ సమాధానం ఇవ్వరు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ డబ్బులు ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అసత్యాలు చెబుతున్నారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తనకు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోనని, సంపద సృష్టిస్తానని ఊదరగొట్టిన బాబు ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. ఒక ఏడాదిలో అమరావతి అప్పులతో సహా సుమారు రూ.1.5 లక్షల కోట్లు చేస్తుండడం దేశంలో మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధిరేటు అధికంగా ఉందంటే ఎలా నమ్మాలి?.ఇక్కడ మరో కోణం చూద్దాం. మొదటి పది నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33 శాతం తగ్గుదల ఉంది. మూలధన వ్యయంలో 48 శాతం తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధిరేటు మాత్రం 2023-24లో 6.19 శాతం ఉంటే, 2024-25లో 8.21 శాతంగా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలోనూ పైపైకి వెళ్లిందని రాశారు. అయితే ఏ రకంగా, ఏ కారణం వల్ల ప్రజల ఆదాయం పెరిగిందన్న వివరణ మాత్రం వీరివ్వరు. ఆదాయం నిజంగా పెరిగి ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లు, ఆస్తుల లావాదేవీలపై ఖర్చు చేస్తారు. చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంలో పోల్చితే రూ.800 కోట్లు తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు కూడా ఆశించిన రీతిలో వసూలు కావడం లేదు. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తుండ వచ్చు. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏమీ చెప్పలేం. కానీ, వృద్ధి రేటు ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపడాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలు అయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ మోతాదు వెయ్యి రూపాయలు పెంచడం మినహా సూపర్ సిక్స్, ఇతర హమీలేవీ అమలు చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందటున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలు ఇస్తున్నారు. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు. కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు.కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం మొదలైన పట్టణాలలో ధరలు సగానికి సగం పడిపోయాయి. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందా అంటే చెప్పుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా ఇతర నగరాలలో పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాట ధరలు లేక అల్లాడుతున్నారు. అక్వా రైతులకు ట్రంప్ దెబ్బ తగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జీఎస్డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇచ్చిన లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా?. వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్ ప్లాన్‌తో టెన్షన్లో ట్రంప్!
వాషింగ్టన్: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదంటూ చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చైనా గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నిర్ణయంపై వైట్‌హౌస్ స్పందించారు.తాజాగా ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్ హసెట్ మాట్లాడుతూ..‘చైనా అరుదైన ఖనిజాల నిలిపివేత ఆందోళనకరం. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఖనిజాలు లేకపోవడం అమెరికాకు నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ అంశంపై పలు మార్గాలను అన్వేషిస్తున్నామని’ అన్నారు. ఇదే సమయంలో ట్రంప్ తన టారిఫ్ ప్రణాళికలతో ప్రపంచ వాణిజ్యానికి ఆర్థిక మాంద్యం తెచ్చే పరిస్థితులు వందకు వంద శాతం లేవని క్లారిటీ ఇచ్చారు.The chart shows how much the US relies on imports for rare earth metals, what they are used for, and how much of the imports come from China. A good one from JPM-AM. pic.twitter.com/xQalD5ZyH7— Ayesha Tariq, CFA (@AyeshaTariq) April 14, 2025మరోవైపు.. ఇదే అంశంపై యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా.. పరస్పర సుంకాలపై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీనిపై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదన్నారు. అలాగే, చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా ఈ ఖనిజాలను 90 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది. అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది. అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ ఖనిజాలపైనే కాకుండా అయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్ నిలిపివేసింది. దీంతో, ట్రంప్ సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది.BREAKING: Trump Administration’s Kevin Hassett says he’s “100 percent not expecting a recession.”He claims that job numbers are through the roof as the reason why.Does he not realize that Job numbers are from the month of March and Tariffs started in the beginning of April?… pic.twitter.com/DjXuC1vfT9— Ed Krassenstein (@EdKrassen) April 14, 2025ఇక.. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం సుంకం విధించగా.. చైనా కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక, ఈ టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చి చెప్పేశారు. ఆ దేశం తమతో దారుణంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్
ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానాలోని శిఖోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన (Haryana land deal case) మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు వాద్రాకు మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈడీ నోటీసులపై..‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పగానే మళ్లీ ఈడీ నోటీసులు పంపించారు. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే. నేను ప్రజల తరపున మాట్లాడి, వారి వాదనలు వినిపించినప్పుడల్లా, వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కేసులో ఏమీ లేదు. ఇప్పటికే నాకు 15 సార్లు సమన్లు పంపారు. ప్రతీసారీ 10 గంటలకు పైగా విచారించారు. నేను 23,000 పత్రాలను సమర్పించాను. ఈ కేసులో అన్ని వివరాలు అందించాను. అలాగే, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Businessman Robert Vadra marches from his residence to the ED office after being summoned in connection with a Gurugram land case, alleges 'political vendetta'.He says, "Whenever I will speak up for people and make them heard, they will try to suppress me... I… pic.twitter.com/mRrRZedq6l— ANI (@ANI) April 15, 2025ఇదిలా ఉండగా.. రాబర్ట్ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అనంతరం ఈ భూమిని సదరు వాద్రా కంపెనీ.. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్కి రూ.58 కోట్లకు విక్రయించింది. దీంతో, వాద్రా కంపెనీ ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రాను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఏప్రిల్ ఎనిమిదో తేదీన మొదటిసారి జారీ చేసిన సమన్లకు వాద్రా స్పందించలేదు. విచారణకు కూడా వెళ్లలేదు. దీంతో, తాజాగా రెండోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.

ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 డిస్మిసల్స్‌ను (క్యాచ్‌లు లేదా స్టంపింగ్స్) పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా (ఫీల్డర్ లేదా వికెట్ కీపర్) చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 14) లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్ బదోనిని స్టంపౌట్ (రవీంద్ర జడేజా బౌలింగ్‌లో) చేయడంతో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ధోని మరో ఇద్దరిని ఔట్ చేయడంలో కూడా భాగమయ్యాడు. పతిరణ బౌలింగ్‌లో వైడ్‌బాల్‌ను కలెక్ట్ చేసుకుని అద్భుతమైన డైరెక్ట్ త్రోతో (నాన్ స్ట్రయికర్ ఎండ్) అబ్దుల్ సమద్‌ను రనౌట్ చేసి.. ఆ మరుసటి బంతికే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. పంత్ క్యాచ్‌తో ఐపీఎల్లో ధోని డిస్మిసల్స్ సంఖ్య 201కి చేరింది. ధోని తన 270వ ఇన్నింగ్స్‌లో డిస్మిసల్స్ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన ఆటగాళ్లు (ఫీల్డర్ లేదా వికెట్ కీపర్)201* - ఎంఎస్ ధోని182 - దినేష్ కార్తీక్126 - ఏబీ డివిలియర్స్124 - రాబిన్ ఉతప్ప118 - వృద్ధిమాన్ సాహా116 - విరాట్ కోహ్లీలక్నో మ్యాచ్‌లో తొలుత అద్భుతమైన వికెట్‌కీపింగ్‌తో అదరగొట్టిన ధోని ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. 11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేసి సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్ అహ్మద్ (4-0-13-0), ఖలీల్ అహ్మద్ (4-0-38-1), అన్షుల్ కంబోజ్ (3-0-20-1) రాణించడంతో నామమాత్రపు స్కోర్‌కే (166/7) పరిమితమైంది.లక్నో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్ (8), మార్క్రమ్ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. తొలి 15 ఓవర్ల వరకు (115/5) పరాజయం దిశగా సాగింది. ధోని రాకతో సీఎస్కేలో గెలుపు జోష్ వచ్చింది. ధోని వచ్చీ రాగానే ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అప్పటివరకు నిదానంగా ఆడిన శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధోని అండతో గేర్ మార్చాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 3 బంతులు మిగిలుండగానే సీఎస్కేను విజయతీరాలకు చేర్చారు.సీఎస్కే ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7), విజయ్ శంకర్ (9) నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్ (3-0-18-2), మార్క్రమ్ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?
సాక్షి, దుబ్బాక: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగుచెంది.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు అంటూ బాంబు పేల్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. ఆ ఖర్చును తాము భరిస్తామని అనుకుంటున్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేను కొంటారో కొనండి.. అందుకే అయ్యే ఖర్చును తామే భరిస్తామని అడుగుతున్నారు.మరోవైపు.. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమాతో రికార్డ్
చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) జీవితం నేటి యువతరానికి రోల్ మోడల్ అని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మారుమూల గ్రామమైన సమర్పూర్‌లో జన్మించిన ఆయన సినిమా మీద ఆసక్తితో ముంబై చేరుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఫైనల్‌గా స్టార్ డైరెక్టర్‌గా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది హీరోలు ఆశిస్తున్నారు.'ఛావా'(Chhaava) సినిమాతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ముందు ఆయన కష్టాలు చాలానే ఉన్నాయి. సినిమా మీద ఆసక్తితో తన గ్రామం నుంచి ముంబైకి వచ్చిన లక్ష్మణ్‌కు మొదట ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ఏలాగైనా విజయం సాధించిన తర్వాతే తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన ఖర్చుల కోసం వడాపావ్ అమ్మె షాపులో పనిచేశాడు. ఆపై కొద్దిరోజుల్లోనే ఒక సినిమా స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్ చేసే పనికి కుదిరాడు. అక్కడ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాడు. ఇలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్న ఆయనకు 2007లో ఖన్నా & అయ్యర్ సినిమాతో ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా ఛాన్స్ వచ్చింది. అలా ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పనిచేయడంతో పాటు కొన్ని యాడ్స్ కోసం కూడా వర్క్‌చేశాడు. ఆ తర్వాత మరాఠీ భాషలో కొన్ని సినిమాలు తెరకెక్కించినా ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 2019లో హిందీ సినిమా 'లూకా చుప్పి'తో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మిమి( కృతి సనన్), జరా హట్కే జరా బచ్కే(విక్కీ కౌశల్) చిత్రాలతో దర్శకుడిగా బాలీవుడ్లో మరింత పాపులర్ అయ్యాడు. అయితే, రీసెంట్గా ఛావా సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 805 కోట్లతో రాబట్టి తన సత్తా ఏంటో ఈ ప్రపంచానికి లక్ష్మణ్ ఉటేకర్ చాటాడు. అలా వడాపావ్ బండి నుంచి బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎంతోమంది యువకులకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 50 కోట్లు పైమాటే అని సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'మిమి' చిత్రం రెండు జాతీయ అవార్డులను(National Film Awards) దక్కించుకుంది. ఉత్తమ నటి (కృతి సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి) అవార్డ్స్ అందుకున్నారు. ఆపై ఈ చిత్రం 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది.

ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్
వాషింగ్టన్ డీసీ: ట్రంప్ సర్కారు హార్వాడ్ విశ్వవిద్యాలయం(Harwad University)పై వేటు వేసింది. యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు ట్రంప్ సర్కారు జారీచేసిన విస్తృత డిమాండ్ల జాబితాను తిరస్కరించిన నేపధ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ల నిధులను(సుమారు రూ. 18,300 కోట్లు) స్తంభింపజేసింది. గతంలో వైట్ హౌస్ పరిపాలన అధికారులు హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.దీనికి స్పందించిన హార్వర్డ్ వర్శిటీ హెడ్ అలాన్ గార్బర్ తమ విద్యాసంస్థ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు. అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ గతంలో పేర్కొంది. గత ఏడాది హార్వార్డ్ పరిధిలోని కళాశాల ప్రాంగణాలలో విద్యార్థులు ఇజ్రాయెల్ యుద్ధాని(Israel's war)కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తదనంతరం అమెరికాలోని విద్యా శాఖ 60 కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూదు వ్యతిరేక వేధింపులు, వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ(Immigration Policy)లతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్ సర్కారు పేర్కొంది. ఈ నిధులను రక్షణ, వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటారు. ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు, పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాగా ట్రంప్ సర్కారు చర్యపై హార్వర్డ్ వర్శిటీ ఇంకా అధికారికంగా ప్రతిస్పందించలేదు.ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు

నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
అసలు కంటే నకిలీ ముద్దు ఇదీ ఇవాల్టీ ట్రెండ్. మార్కెట్లో ‘రెప్లికా’ ట్రెండ్ సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఆభరణాలకు, వస్త్రాలకు ఇబ్బడిముబ్బడిగా నకిలీలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి. డిజైనర్ సారీ అయినా, కోట్ల విలువ చేసే డిజైనర్ డైమండ్ నెక్లెస్ అయినా ఒరిజినల్ని మరిపించేలా రెప్లికాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కథనం చదివితే.. ఔరా రెప్లికా అనిపించక మానదు. ఇక కోట్ల విలువ చేసే డైమండ్ నగలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అంబానీ కుటుంబానికి చెందిన ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ పేరే. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ సందర్బంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ పచ్చలు పొదిగిన ఓ డైమండ్ నక్లెస్ ధరించారు. దాని ఖరీదు రూ.500 కోట్లు . దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట మళ్లీ సందడి చేస్తోంది.విశేషమేమిటంటే ఈ నెక్లెస్ కి రెప్లికా మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.500కోట్ల విలువచేసే నెక్లెస్, రెప్లికా అంటే కనీసం ఏ లక్షల్లోనో, వేలల్లోనే ఉంటుంది అనుకుంటున్నారా? కానే కాదు, కేవలం రూ.178 కి జైపూర్‌లో అన్లైన్ అమ్ముతుండటం విశేషం. దీనిని సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.జైపూర్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారి 'నీతా అంబానీజీ నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది’’ అంటూ మార్కెటింగ్ చేయడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోను ముఖ వ్యాపారవేత్త, RPG ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ హర్ష్ వర్ధన్ గోయెంకా (2024లో) ట్వీట్ చేశారు. "అబ్ క్యా బోలూం! #మార్కెటింగ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెటిజన్లను ఇది బాగా ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేశారు. తక్కువ ధరలకు లగ్జరీ వస్తువులను రూపొందించడంలో భారతీయుల నైపుణ్యాన్ని హైలైట్ చేస్తూ 'కాపీ చేయడంలో ఇండియా అత్యుత్తమం' అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా, 'ఇందులో తప్పేముంది భయ్యా.. అందరై తమకిష్టమైన ఫ్యాషన్‌ను ధరించడానికి అర్హులు. అందుకు డబ్బు అడ్డు రాకూడదు కదా ' అని, కమెంట్ చేశారు. 'ధన్యవాదాలు, నేను నా భార్య పుట్టినరోజుకు తక్కువ ఖర్చుతో ఖరీదైన బహుమతిని ఇస్తాను' అని కామెంట్ చేయడం విశేషం. అంతేకాదు నీతా అంబానీ లాగా ఆభరణాలు ధరించాలనే చాలా మంది మహిళల కలలను నెరవేర్చినందుకు ఆ ఆభరణాల వ్యాపారిని ప్రశంసించారు.

అంతరిక్షంలోకి మహిళల టీమ్.. సింగర్ కేటీ పెర్రీ ఏం చేసిందంటే..
అంతరిక్ష పర్యాటకానికి ఊపు తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 11 నిమిషాల బుల్లి రోదసి యాత్రను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్‌తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్ కింగ్, సినీ నిర్మాత కెరియన్ ఫ్లిన్, సైంటిస్టు అమందా గుయెన్, నాసా మాజీ ఇంజనీర్ ఆయేషా బోవ్ ఇందులో భాగస్వాములయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ ఫెపర్డ్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్ 14న సోమవారం పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్ రేఖను కూడా దాటగా, మహిళా ప్రముఖులు అంతా అక్కడ భార రహితస్థితిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాలు పాటు సాగిన ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. బ్లూ ఆరిజిన్‌కు ఇది 11వ మానవసహిత అంతరిక్ష యాత్ర. ✨ Weightless and limitless. pic.twitter.com/GQgHd0aw7i— Blue Origin (@blueorigin) April 14, 2025అయితే, ఈ అంతరిక్ష యాత్ర సందర్బంగా వ్యోమనౌకలో ఉన్న మహిళలు ఎంజాయ్ చేశారు. వారంతా భార రహిత స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఇక, రోదసి నుంచి కిందకు దిగిన తర్వాత అమెరికా గాయని కేటీ పెర్రీ ఆనందంతో భూమిని ముద్దాడారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.A smooth landing in West Texas. Book your flight on New Shepard: https://t.co/RP3Lixyr4Y pic.twitter.com/xPiu9LMtlH— Blue Origin (@blueorigin) April 14, 2025 ఇదిలా ఉండగా.. బ్లూ ఆరిజిన్ సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతో రోదసి యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థ రోదసి యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మిషన్లు చేపట్టగా, 52 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7— Blue Origin (@blueorigin) April 14, 2025 ‘YOUR KISS IS COSMIC 🎶’US pop star Katy Perry kissed the ground after returning to Earth following a flight aboard Blue Origin’s New Shepard NS-31. The rocket soared past the Kármán line—the internationally recognized boundary of space—before landing safely in Van Horn, West… pic.twitter.com/1PjjDWD2v4— Philstar.com (@PhilstarNews) April 15, 2025

హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇందుకు తగ్గట్టుగానే క్రికెటర్ల బ్రాండింగ్ మార్కెట్ అధికంగా ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని వారి వ్యక్తిగత సంపాదన కూడా పెరుగుతోంది. దానికితోడు కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల బ్రాండ్ ప్రమోషన్ల కోసం భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు. దాంతో చాలామంది క్రికెటర్లు దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే చందంతో వయసురీత్యా ఎక్కువ రోజులు క్రికెట్లో కొనసాగకపోవచ్చనే భావన, భవిష్యత్తులో భరోసాను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్ లక్నో సుపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలతోపాటు తాను ఎండార్స్ చేస్తున్న బ్రాండ్ల సంగతుల గురించి తెలుసుకుందాం.భారత మోస్ట్ స్టైలిష్, నిలకడైన క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా ఆకట్టుకునే ఆర్థిక పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. 2025 నాటికి ఆయన సందప నికర విలువ రూ.100 కోట్లు (సుమారు 12 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ వేతనాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యక్తిగత పెట్టుబడులు సహా పలు వనరుల నుంచి ఆయనకు సంపద సమకూరుతుంది.రాహుల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గ్రేడ్-ఏ ఒప్పందంలో భాగంగా సంవత్సరానికి రూ.5 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు.గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ ప్రతి సీజన్‌కు సరాసరి రూ.16 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తరఫున ఆడుతున్నారు.పూమా, రెడ్ బుల్, భారత్ పే, బోట్, టాటా నెక్సాన్, బియర్డో, క్యూర్.ఫిట్, నుమి.. వంటి ప్రధాన బ్రాండ్లను రాహుల్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇది అతని ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తుంది.మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ మోడళ్లతో సహా హై-ఎండ్ కార్ల సేకరణతో పాటు బెంగళూరులో ఆయనకు లగ్జరీ ప్రాపర్టీలు ఉన్నాయి.ముంబైలోని కార్టర్ రోడ్లో సుమారు రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. రాహుల్-అతియా శెట్టి దంపతులకు బెంగళూరులో విలాసవంతమైన నివాసం కూడా ఉంది.ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..మెటామాన్ అనే పెర్ఫ్యూమ్స్, జువెలరీ బ్రాండ్‌కు రాహుల్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు. అందులో తాను పెట్టుబడి కూడా పెట్టారు.అర్బన్ ఫ్యాషన్ బ్రాండ్ గల్లీ లైవ్ ఫాస్ట్‌కు రాహుల్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.బోల్డ్ ఫిట్ అనే అథ్లెట్ దుస్తుల తయారీ కంపెనీలో రాహుల్ ఇన్వెస్ట్ చేశారు.రాహుల్ నిలకడైన గేమింగ్ ప్రదర్శన, నాయకత్వ బాధ్యతలు, బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల తన నికర విలువ క్రమంగా అధికమవుతోంది. భారత్‌లో క్రికెట్‌కు కమర్షియల్ అప్పీల్ పెరగడంతో రాబోయే కాలంలో తన సంపాదన మరింత పెరుగుతుందని తెలుస్తుంది.
ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
‘కొత్త’ వ్యాఖ్యలతో ప్రకంపనలు.. కాంగ్రెస్ రియాక్షన్
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
ఏఐ థెరపిస్టు!
వెకేషన్ నుంచి తిరిగొచ్చిన మహేశ్‌బాబు.. వీడియో వైరల్
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్
ఇదేం ఫిట్నెస్ స్టంట్..? తిట్టిపోస్తున్న నెటిజన్లు
‘ఇంగ్లీష్ పుస్తకాలకు హిందీ పేర్లేంటి?’: కేరళ మంత్రి ఫైర్
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
సొరంగం జిందాబాద్..!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
ఎండలో నిలబెడతానంటే వెంటనే తప్పు ఒప్పుకున్నాడ్సార్..!
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్...
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త: తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీ రేటు
పెద్ది ఫైట్
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజులైనా ఆ మార్క్ దాటలేదు!
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్
పళ్ల సెట్‌కి గుడ్‌బై చెప్పేయండి..! హాయిగా యథావిధిగా వచ్చేస్తాయట..!
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
డబ్బులెక్కడ సార్?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్‌కు బ్రేక్!
ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి ఆర్ఎల్జేపీ తెగదెంపులు
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
నీట్ రూల్స్ వెరీ టఫ్
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
HYD: అర్ధరాత్రి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్.. 17 మంది యువతులతో కస్టమర్స్..
తిరుమలలో మరో అపచారం
ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్
చక్రి 'ఏఐ' వాయిస్ తో కొత్త పాట.. వింటేజ్ స్టెప్పులు
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?
‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
అంతరిక్షం నుంచి అందాల భారతం
సుందర్ సీ సినిమాలో గ్లామర్‌తో దుమ్మురేపిన 'కేథరిన్ థ్రెసా'
‘తల్లి కావాల్సిన క్షణంలో’.. విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
వన్ వే రూటు
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
తమిళ పొన్నులా జాన్వీ కపూర్.. వజ్రాల హారంతో అనసూయ
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
పెగాసస్ నిఘా నిజమే!
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
ఎమర్జెన్సీ.. ప్రాణం కాపాడిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!
కల్లు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్?
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
పాతబస్తీలో శరవేగంగా మెట్రో విస్తరణ పనులు
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
Beat the heat : తాటి ముంజెల్ని ఇలా ఎపుడైనా తిన్నారా?
విడుదలకు సిద్ధమైన హారర్ మూవీ 'త్రిగుణి'
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
యువతిని వేధించి.. ఆపై పోలీస్ స్టేషన్లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్ అవార్డ్ పక్కా’
ఖనిజాలు బంద్
IPL 2025: అక్షర్ పటేల్‌కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు
మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
కమల్ హాసన్‌కు పదవి ఇవ్వనున్న స్టాలిన్..?
షిర్డీని దర్శించుకున్న నీతా అంబానీ : సింపుల్‌గా, సాంప్రదాయంగా
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో వివాదం
ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?
మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. యువతి అనుమానాస్పద మృతి!
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్‌లోనూ..
ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
‘కొత్త’ వ్యాఖ్యలతో ప్రకంపనలు.. కాంగ్రెస్ రియాక్షన్
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
ఏఐ థెరపిస్టు!
వెకేషన్ నుంచి తిరిగొచ్చిన మహేశ్‌బాబు.. వీడియో వైరల్
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్
ఇదేం ఫిట్నెస్ స్టంట్..? తిట్టిపోస్తున్న నెటిజన్లు
‘ఇంగ్లీష్ పుస్తకాలకు హిందీ పేర్లేంటి?’: కేరళ మంత్రి ఫైర్
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
సొరంగం జిందాబాద్..!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
ఎండలో నిలబెడతానంటే వెంటనే తప్పు ఒప్పుకున్నాడ్సార్..!
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్...
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త: తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీ రేటు
పెద్ది ఫైట్
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజులైనా ఆ మార్క్ దాటలేదు!
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్
పళ్ల సెట్‌కి గుడ్‌బై చెప్పేయండి..! హాయిగా యథావిధిగా వచ్చేస్తాయట..!
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
డబ్బులెక్కడ సార్?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్‌కు బ్రేక్!
ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి ఆర్ఎల్జేపీ తెగదెంపులు
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
నీట్ రూల్స్ వెరీ టఫ్
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
HYD: అర్ధరాత్రి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్.. 17 మంది యువతులతో కస్టమర్స్..
తిరుమలలో మరో అపచారం
ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్
చక్రి 'ఏఐ' వాయిస్ తో కొత్త పాట.. వింటేజ్ స్టెప్పులు
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?
‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
అంతరిక్షం నుంచి అందాల భారతం
సుందర్ సీ సినిమాలో గ్లామర్‌తో దుమ్మురేపిన 'కేథరిన్ థ్రెసా'
‘తల్లి కావాల్సిన క్షణంలో’.. విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
వన్ వే రూటు
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
తమిళ పొన్నులా జాన్వీ కపూర్.. వజ్రాల హారంతో అనసూయ
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
పెగాసస్ నిఘా నిజమే!
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
ఎమర్జెన్సీ.. ప్రాణం కాపాడిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!
కల్లు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్?
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
పాతబస్తీలో శరవేగంగా మెట్రో విస్తరణ పనులు
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
Beat the heat : తాటి ముంజెల్ని ఇలా ఎపుడైనా తిన్నారా?
విడుదలకు సిద్ధమైన హారర్ మూవీ 'త్రిగుణి'
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
యువతిని వేధించి.. ఆపై పోలీస్ స్టేషన్లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్ అవార్డ్ పక్కా’
ఖనిజాలు బంద్
IPL 2025: అక్షర్ పటేల్‌కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు
మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
కమల్ హాసన్‌కు పదవి ఇవ్వనున్న స్టాలిన్..?
షిర్డీని దర్శించుకున్న నీతా అంబానీ : సింపుల్‌గా, సాంప్రదాయంగా
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో వివాదం
ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?
మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. యువతి అనుమానాస్పద మృతి!
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్‌లోనూ..
సినిమా

భావోద్వేగాలే నా బలం: ప్రదీప్ చిలుకూరి
‘‘చిన్నతనంలో మన బర్త్ డేని తల్లిదండ్రులు ఓ ఎమోషనల్‌లా ఫీలై సెలబ్రేట్ చేస్తారు. తల్లిదండ్రుల బర్త్ డేలను పిల్లలు గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేయడం కూడా ఓ మంచి ఎమోషన్స్ . ఇదే ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ కథాంశం’’ అని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి అన్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా, విజయశాంతి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’(2016) సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఇద్దరు పెద్ద హీరోల కోసం రెండు కథలు సిద్ధం చేశాను. కానీ, ఆ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లలేదు. అలా దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చింది. కల్యాణ్‌రామ్‌గారితో మాట్లాడినప్పుడు ఓ మాస్ ఫిల్మ్ చేద్దామన్నారు. ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’లోని తల్లి పాత్రని విజయశాంతిగారు చేస్తేనే చేద్దామని ఆయన స్పష్టంగా చెప్పారు. విజయశాంతిగారికి కథ చెప్పగా కొన్ని మార్పులు సూచించారు.యూపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే కొడుకు అర్జున్స్ పాత్రలో కల్యాణ్‌రామ్, ఐపీఎస్ వైజయంతి పాత్రలో విజయశాంతి నటించారు. ఈ మూవీలో ఆమె యాక్షన్స్ సీక్వెన్స్ లు అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్‌గారు సినిమా చూసి, బాగుందని చెప్పడం సంతోషం. అజనీష్ లోకనాథ్ అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చారు. ఓ దర్శకుడిగా భావోద్వేగాలను ప్రజెంట్ చేయడమే నా బలం’’ అని తెలిపారు.

ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం: సంపత్ నంది
‘‘రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద’.. ఈ తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నేను ‘ఓదెల 2’లాంటి కథ రాస్తాననుకోలేదు. నా భార్య మా ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి ఎనిమిదేళ్లుగా పూజలు చేస్తోంది. మా నానమ్మ శివశక్తిగా ఉండేవారు. అప్పట్లో నేను కొన్ని సంఘటలను మా ఊర్లో గమనించాను. నా మనసులో ఉన్న అవన్నీ ‘ఓదెల 2’ రూపంలో బయటకు వచ్చాయి’’ అని దర్శక– నిర్మాత, రచయిత సంపత్ నంది అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ–‘‘అశోక్ తేజని డైరెక్టర్ చేయాలని ‘ఓదెల రైల్వేస్టేషన్స్ ’ మూవీ తీశాం. ఆహా ఓటీటీలో విడుదలైన ఆ మూవీ చాలా సక్సెస్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ చేస్తే బాగుంటుందన్నట్లుగా అశోక్ తేజ చెప్పాడు. ఓ సారి భీమ్స్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నప్పుడు సీక్వెల్ క్రియేట్ చేయవచ్చనిఅనిపించింది. తొలిపార్టులో రాధ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. సీక్వెల్లో మరో ఫీమేల్ క్యారెక్టర్ అయితే బలంగా ఉంటుందని శివశక్తి పాత్రకు తమన్నాగారిని తీసుకున్నాం. ఆత్మకు, పరమాత్మకు మధ్య జరిగే యుద్ధమే ‘ఓదెల 2’.ఓ పంచాక్షరి మంత్రంతో నాగసాధువు శివశక్తి.. ఓ ప్రేతాత్మను ఎలా కంట్రోల్ చేసింది? అన్నదే కథాంశం. ‘అరుంధతి’ సినిమాతో మా చిత్రానికి పోలిక లేదు. నిర్మాత రాధామోహన్స్ గారికి ‘ఓదెల 2’ కథ చెప్పాను. ఆ సమయంలో ఆయన హిందీ మూవీతో బిజీగా ఉండటంతో డి.మధుగారు నిర్మించారు. సాంకేతిక నిపుణులకు డబ్బు ముఖ్యం కాదు.. ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం. ‘ఓదెల 3’ కి అవకాశం ఉంది. నా దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ పీరియాడికల్ ఫిల్మ్ రానుంది. దర్శకుడిగా నాకు కొంత గ్యాప్ వచ్చింది. కానీ.. మరో ముప్పై ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేలా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.

మదరాసి డేట్ ఫిక్స్
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్స్ . శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో శివ కార్తికేయన్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.‘‘హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మదరాసి’. ఈ మూవీలో సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నారు మురుగదాస్’’ అని యూనిట్ పేర్కొంది. విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమేరా: సుదీప్ ఎలామోన్.

అది మనం క్రియేట్ చేసుకున్నదే.. వదిలేస్తే బాగుంటుంది: హీరో నాని
నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం హిట్-3. టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ వయొలెంట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా చాగంటి ప్రవచనాలు ట్రైలర్లో ఉండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు.మూవీ రిలీజ్ తేదీ ఇంకా రెండు వారాలు పైగా సమయం ఉండగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నాని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీరు రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన హీరో.. ఇక టైర్- 1 జాబితాలో చేరినట్టేనా? అని ఒకరు ప్రశ్నించగా.. దానిపై నాని స్పందించారు.నాని మాట్లాడుతూ.. 'అది మన డిక్షనరీలో ఉన్నది కాదు. కేవలం మనం క్రియేట్ చేసుకున్న పదమే. నటుడికి తగినట్లుగానే సినిమాలు తెరకెక్కిస్తారు. వారిని ఆ పేర్లతో ఎందుకు డివైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది చాలా స్టుపిడ్ కాన్సెప్ట్. ఎవరు మొదలుపెట్టారోగానీ.. మనమంతా దానినే పెంచి పోషిస్తున్నాం. ఇకపై ఆ వేరియేషన్ ఆపితే మన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిది. అది బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం' అని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించింది.
న్యూస్ పాడ్‌కాస్ట్

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.
క్రీడలు

LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై గెలిచిన తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో ధోని ముగ్గురిని ఔట్ చేయడంలో భాగం కావడంతో పాటు ఛేదనలో అతి మూల్యమైన ఇన్నింగ్స్ (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) ఆడాడు. ఫలితంగా సీఎస్కే లక్నోను వారి సొంత ఇలాకాలో (అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్టేడియం) చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనకు గానూ ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకునే సమయానికి ధోని వయసు 43 ఏళ్ల 282 రోజులు. ధోనికి ముందు ఈ రికార్డు మాజీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ప్రవీణ్ తాంబే పేరిట ఉండేది. ప్రవీణ్ 42 ఏళ్ల 200 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2014 సీజన్లో అబుదాబీలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ప్రవీణ్ ఈ ఘనత సాధించాడు.ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న అతి పెద్ద వయస్కులుఎంఎస్ ధోని- 43 ఏళ్ల 282 రోజులుప్రవీణ్ తాంబే- 42 ఏళ్ల 200 రోజులుషేన్ వార్న్- 41 ఏళ్ల 211 రోజులుఆడమ్ గిల్‌క్రిస్ట్- 41 ఏళ్ల 181 రోజులుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్ అహ్మద్ (4-0-13-0), ఖలీల్ అహ్మద్ (4-0-38-1), అన్షుల్ కంబోజ్ (3-0-20-1) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్ (8), మార్క్రమ్ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. ఓ దశలో కష్టాలు ఎదుర్కొన్నటికీ శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని సత్తా చాటడంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సీఎస్కే ఇన్నింగ్స్‌కు తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) గట్టి పునాది వేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. రాహుల్ త్రిపాఠి (9) వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. రవీంద్ర జడేజా (7), విజయ్ శంకర్ (9) కూడా నిరాశపరిచారు. ధోని, దూబే ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి సీఎస్కేను గెలిపించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్ (3-0-18-2), మర్క్రమ్ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సీఎస్కే విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరమైనప్పుడు.. దూబే, ధోని జోడీ శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి దూబే బౌండరీ బాది సీఎస్కేను విజయతీరాలు దాటించాడు.

ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2025 (IPL 2025)లో గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs CSK)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేసింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసింది.రిషభ్ పంత్ తొలిసారిలక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు రాణించడంతో లక్నోను 166 పరుగులకు కట్టడి చేయగలిగింది. లక్నో ఆటగాళ్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్లో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. 49 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. ఇక సీఎస్కే బౌలర్లలో మతీశ పతిరణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.పొదుపుగా బౌలింగ్ చేసిన నూర్మిగతా వాళ్లలో నూర్ అహ్మద్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. ఇక లక్నో విధించిన లక్ష్యాన్ని ధోని సేన 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. శివం దూబే (37 బంతుల్లో 43 నాటౌట్) నిలకడగా ఆడాడు. ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి దూబేతో కలిసి జట్టు గెలుపును ఖరారు చేశాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల మేము ఆరంభ మ్యాచ్‌లలో విఫలమయ్యాం. సొంత మైదానం చెపాక్‌లో ఓటములు చవిచూశాం.ఘనమైన భవిష్యత్తుఇలాంటి సమయంలో ఇతర వేదికపై గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. జట్టులో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపిన విజయం ఇది. పవర్ ప్లేలో మేము ఈసారి కూడా ఇబ్బందిపడ్డాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాం. ఈరోజు మా బౌలర్లు, బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. షేక్ రషీద్ మాతో చాన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్‌లో స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు అతడు మ్యాచ్ ఆడాడు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో గొప్పగా రాణించగల సత్తా అతడికి ఉంది.ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సిందిఇక ఈరోజైతే నాకు.. ‘నాకు ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు?’ అని అనిపించింది. నిజానికి నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కదా!’’ అని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను నూర్ అహ్మద్‌కు ఇచ్చి ఉంటే బాగుండేదని ధోని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. తాజాగా లక్నోపై గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివర్లోనే కొనసాగుతోంది.ఐపీఎల్ 2025: లక్నో వర్సెస్ చెన్నై👉లక్నో స్కోరు: 166/7 (20)👉చెన్నై స్కోరు: 168/5 (19.3)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహేంద్ర సింగ్ ధోని.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు.. The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025

‘అతి’ వల్ల అనర్థాలు తప్పవు!.. చాలా బాధగా ఉంది..
యడ్లపల్లి ప్రాంజల... హైదరాబాద్‌కు చెందిన యువ టెన్నిస్ ప్లేయర్. కొన్నేళ్ల క్రితం వరకు చక్కటి ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ సానియా మీర్జా తర్వాత ఆ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్న అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? మే, 2019లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ఆమె అత్యుత్తమంగా 265కు చేరుకుంది.మరింత మెరుగైన ప్రదర్శనతో పైకి దూసుకు పోతూ మెరుగైన భవిష్యత్తుపై ప్రాంజల ఆట నమ్మకం కలిగించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. 20 ఏళ్ల వయసులో ఆమె మళ్లీ మళ్లీ గాయాలపాలైంది. ఒక గాయం నుంచి కోలుకోగానే మరొకటి ఆమెను వెంటాడింది.15 ఏళ్ల వయసులోనే ఐటీఎఫ్ స్థాయిలో వరుసగా టైటిల్స్ గెలిచిన ఆ అమ్మాయికి అసలు సమయంలో గాయాల విషయంలో సరైన మార్గనిర్దేశనం లేకుండా పోయింది. దాంతో కెరీర్లో ఎదుగుతున్న సమయంలో ఆమె ఆటకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ప్రాంజల 1409వ స్థానానికి పడిపోయింది! అంటే కెరీర్లో ఎదుగుతున్న కీలకమైన 20–25 మధ్య ఐదేళ్ల కెరీర్‌ను ఆమె దాదాపు పూర్తిగా నష్టపోయింది.‘నాకు ఇప్పటికీ టెన్నిస్ అంటే చాలా ఇష్టం. పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాను. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బాధ వేస్తుంది. గాయాలతో పాటు టోర్నమెంట్ షెడ్యూల్, ఫిట్నెస్వంటివాటిపై సరైన రీతిలో మార్గనిర్దేశనం లభించి ఉంటే పరిస్థితి ఎంత మెరుగ్గా ఉండేదో అనిపిస్తుంది’ ఆమె ప్రాంజల వ్యాఖ్యానించింది.జిమ్ ఎక్సర్సైజ్లే సమస్యగా... ప్రాంజల మాత్రమే కాదు భారత టెన్నిస్‌లో ఎంతో మంది అమ్మాయిలు ప్రస్తుతం ఈ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి కారణం భారత టెన్నిస్‌లో ముఖ్యంగా మహిళల టెన్నిస్‌లో ఇలాంటివి చూసేందుకు ఒక సరైన వ్యవస్థనే లేదు. అసలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజ్లు కూడా ఎంత వరకు చేయాలి, అవి పరిమితి దాటితో ఎలాంటి నష్టం కలిగిస్తాయో కూడా ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వద్ద కూడా దీనికి సరైన సమాధానం లేదు. ఆటలో దూసుకుపోతున్న సమయంలో ‘అతి’గా ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు చేయడం కూడా ప్రాంజలను నష్టపర్చింది. ఒక మ్యాచ్‌లో 6–3, 5–2, 30–30తో విజయానికి బాగా చేరువైన సమయంలో కూడా అనారోగ్యంతో తప్పుకోవాల్సి రావడం ఆమె పరిస్థితిని చూపించింది. ‘నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ట్రైనింగ్ చేసేదానిని. జిమ్‌లో కూడా చాలా ఎక్కువగా బరువును ఎత్తేదానిని. దాని వల్ల ఏమైనా అయితే ఎలా కోలుకోవాలనే విషయంపై కనీస సమాచారం కూడా లేదు.వెన్నునొప్పి, తుంటి నొప్పి, మోకాలు, మడమ... ఇలా ఒకదాని తర్వాత మరో గాయం వెంటాడింది. జిమ్‌లో బరువుల ప్రభావంతో కండరాలు బాగా బిగుసుకుపోయాయి. దాంతో శరీరంలో సమతుల్యత లభించింది. రెండు నెలలో తగ్గే గాయాలకు కూడా ఆరు నెలలు పట్టింది. నేను చేసిన ఎక్సర్సైజ్లతోనే నాకు బాగా నష్టం జరిగిందనే విషయం కూడా నాకు ఇటీవల అర్థమైంది. అంతకుముందు ఏమీ తెలీదు. తెలిస్తే జాగ్రత్త పడేదాన్ని’ అని ప్రాంజల తన ఆవేదనను ప్రదర్శించింది. ఏఐటీఏ చొరవ చూపిస్తేనే... కొన్నేళ్ల క్రితం చైనా మహిళా టెన్నిస్ ప్లేయర్ల కోసమే ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను మొదలు పెట్టింది. ముఖ్యంగా తమ అగ్రశ్రేణి క్రీడాకారిణులకు అమిత ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు భారత్‌లో 16–24 వయసు మధ్య టెన్నిస్ ఆడుతున్న అమ్మాయిలకు కూడా అలాంటిది అవసరం ఉంది. దీనిపై ఇప్పుడిప్పుడే డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘భారత మహిళా ప్లేయర్లు విడివిడిగా కాకుండా ఒక బృందంగా టోర్నీలకు వెళ్లటం మేలు చేస్తుంది. అప్పుడు ఏఐటీఏ వారి కోసమే ఒక కోచ్‌ను, ఫిజియోను పంపే అవకాశం ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే అమ్మాయిలకు 360 డిగ్రీ పర్యవేక్షణ అవసరం. న్యూట్రిషన్, మానసిక దృఢత్వం, మ్యాచ్‌ల విశ్లేషణ, సరైన షెడ్యూలింగ్, ప్రాక్టీస్‌కు స్పేర్ పార్ట్నర్లు...ఇలా అన్నింటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో భారత్‌లో పెద్ద సంఖ్యలో టోర్నీలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 3–4 ఏళ్ల పాటు ప్రస్తుత ప్లేయర్లకు అండగా నిలవాల్సి ఉంది. లేదంటే ఈ ప్రతిభ వృథా అవుతుంది’ అని ప్రముఖ టెన్నిస్ అడ్మినిస్ట్రేటర్ సుందర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా ఏఐటీఏ మేల్కొనకపోతే ప్రాంజల కెరీర్‌ను దెబ్బ తీసిన అనుభవాలు మున్ముందూ ఎదురు కావచ్చు. -సాక్షి క్రీడా విభాగం

హంపి గేమ్ ‘డ్రా’... హారిక పరాజయం
పుణే: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో తొలి రోజు నలుగురు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి రమేశ్‌బాబు తమ తొలి గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ద్రోణవల్లి హారిక పరాజయం చవిచూసింది. ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ గేముల్లో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలితో నల్లపావులతో ఆడిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ హంపి 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్ 53 ఎత్తుల్లో హారికపై గెలుపొందింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో పోటీపడ్డ దివ్య దేశ్‌ముఖ్ 53 ఎత్తుల్లో నెగ్గడం విశేషం. భారత ప్లేయర్ల గేమ్‌లన్నీ 53 ఎత్తుల్లోనే ముగియడం గమనార్హం. ఇతర తొలి రౌండ్ గేముల్లో బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ 85 ఎత్తుల్లో మెలియా సలోమీ (జార్జియా)పై, పొలీనా షువలోవా (రష్యా) 57 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. మొత్తం 10 మంది ప్లేయర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరగనుంది.
బిజినెస్

ఎస్బీఐ వడ్డీ రేట్లూ తగ్గాయ్
న్యూఢిల్లీ: ఎస్బీఐ డిపాజిట్లు, రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో డిపాజిట్లపై రాబడి తగ్గనుండగా.. రుణ గ్రహీతలకు వెసులుబాటు లభించనుంది. రెపో అనుసంధానిత లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.25 శాతానికి దిగొచ్చింది. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారత రుణ రేటు (ఈబీఎల్ఆర్)ను సైతం 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.65 శాతం చేసింది. ఏప్రిల్ 15 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ గత వారం రెపో రేటును పావు శాతం తగ్గించడం తెలిసిందే. దీంతో ఈ మేరకు ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు ఎస్బీఐ బదిలీ చేయడం గమనార్హం. అదే సమయంలో వివిధ కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపైనా 10–25 బేసిస్ పాయింట్లు (0.1–0.25 శాతం) మేర వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించింది. ఇవి కూడా ఈ నెల 15 నుంచే అమల్లోకి రానున్నాయి. → రూ.3 కోట్ల వరకు ఎఫ్డీలపై 1–2 ఏళ్ల కాల వ్యవధికి ఇక మీదట వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంటుంది. 10 బేసిస్ పాయింట్లు తగ్గింది. → 2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు డిపాజిట్లపై 7 శాతం రేటు కాస్తా 6.90 శాతానికి దిగొచ్చింది. → రూ.3 కోట్లకు మించిన 180–210 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు తగ్గి 6.40 శాతానికి పరిమితం అయింది. అదే 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 25 బేసి స్ పాయింట్లు తగ్గడంతో 6.50 శాతంగా ఉంది. → ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్లపైనా 10 బేసిస్ పాయింట్ల వరకు రేటు తగ్గింది. → 444 రోజుల డిపాజిట్‌పై 7.05 శాతం రేటు అమలు కానుంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం సేవింగ్స్ డిపాజిట్ల రేటును 0.25 శాతం తగ్గించి 2.75 శాతం చేయడం గమనార్హం. రూ.50 లక్షలకు మించిన మొత్తంపై రేటు 3.5 శాతం నుంచి 3.25 శాతానికి దిగొచ్చింది.

దేశీ స్టాక్ ఇండెక్సులకు బూస్ట్
నేడు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే వీలుంది. ఆసియా, యూరప్, యూఎస్ మార్కెట్లు బలపడటంతో సెంటిమెంటు మెరుగుపడింది. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లను 90 రోజుల వరకూ నిలిపివేయడంతోపాటు.. ఎల్రక్టానిక్స్‌కు మినహాయింపు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో హుషారు నెలకొంది. ముంబై: అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం దేశీ స్టాక్‌మార్కెట్లు పనిచేయనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో ఆసియా మార్కెట్లు 0.5–1.5% బలపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు మరింత అధికంగా 1.5–2.5% ఎగశాయి. యూఎస్ మార్కెట్లు సైతం 1% పైగా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు (మంగళవారం) దేశీ మార్కెట్లు సానుకూలంగా కదిలే వీలున్నట్లు నిపుణులు తెలిపారు. ఇప్పటికే యూఎస్ టారిఫ్‌ల అమలు 3 నెలలపాటు నిలిచిపోగా.. తాజాగా ఎల్రక్టానిక్స్‌కు మినహాయింపు లభించింది. కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌సహా పలు ప్రొడక్టులపై కొత్త టారిఫ్‌లను ఎత్తివేశారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సానుకూలంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే టారిఫ్‌ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలుకావచ్చన్న ఆందోళనలు అటు ముడిచమురు ధరలను.. ఇటు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరును దెబ్బతీస్తున్నట్లు వివరించారు. టోక్యో ఎల్రక్టాన్, శామ్సంగ్ ఎల్రక్టానిక్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. మార్చిలో చైనా ఎగుమతులు 12 శాతంపైగా పుంజుకున్నట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. బాండ్లు, కరెన్సీపై.. తాజాగా 10ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్ 4.47 శాతానికి బలపడింది. ఒక దశలో 4.58 శాతానికి ఎగసింది. వారంక్రితం 4.01 శాతంగా నమోదైంది. వెరసి ట్రేడ్ వార్ కారణంగా యూఎస్ వెలుపలి ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్లను విక్రయిస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర నష్టాలను కవర్ చేసుకునే బాటలో హెడ్జ్ ఫండ్స్ సైతం బాండ్లను విక్రయిస్తున్నట్లు తెలియజేశాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై అటూఇటుగా వ్యవహరిస్తుండటంతో ప్రపంచ దేశాలలో రక్షణాత్మకంగా భావించే యూఎస్‌పై విశ్వాసం తగ్గే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఇది మరోవైపు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో న్యూ యార్క్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం తాజాగా 3,261 డాలర్లను తాకింది. ద్రవ్యోల్బణం.. ట్రంప్ టారిఫ్ ప్రణాళికలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. మార్చి గణాంకాలు అంచనాలకంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభా వాన్ని చూపనున్నట్లు భావిస్తున్నారు. ఫలితంగా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పరపతి విధానాల్లో స్వేచ్చగా వ్యవహరించలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు.శుక్రవారం సెలవు గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(18న) స్టాక్ మార్కెట్లతోపాటు కమోడిటీ మార్కెట్లు సైతం పనిచేయవు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లు పని చేయలేదు. దీంతో ఈ వారం ట్రేడింగ్ 3 రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఈ వారం పలు దిగ్గజాలు జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలు ప్రకటించనున్నాయి. 15న ఇరెడా, ఐసీఐసీఐ ప్రు, 16న స్వరాజ్ ఇంజిన్స్, విప్రో, 17న హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏఎంసీ, ఇన్ఫోసిస్, టాటాఎలక్సీ, 18న మాస్టెక్, 19న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంకుల పనితీరు వెల్లడికానుంది.

ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త: తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీ రేటు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రేపో రేటును తగ్గించిన తరువాత.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా తన గృహ రుణ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం (రేపో రేటు తగ్గింపు) వల్ల.. మంచి సిబిల్ స్కోర్ ఆధారంగా 8.10 శాతం నుంచి సంవత్సరానికి 7.90 శాతానికి తగ్గింది. ఈ కొత్త రేట్లు 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది.బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును తగ్గించడంతో, హోమ్ లోన్స్ మాత్రమే కాకుండా.. వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ వంటి వాటిమీద వడ్డీ రేటు తగ్గుతుంది. దీంతో ఈఎంఐలలో మార్పు జరుగుతుంది. ఆర్బీఐ రేపో రేటును తగ్గించిన తరువాత.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.ఇదీ చదవండి: ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!

ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!
ఓ వైపు అమెరికా.. మరోవైపు చైనా.. నువ్వా నేనా అన్నట్లుగా సుంకాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ విషయం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు, రెండు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో.. చైనా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను 125 శాతానికి పెంచింది.అమెరికా విధిస్తున్న సుంకాల భారీ నుంచి తప్పించుకోవడం ఎలా అని చాలామంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి ఓ మార్గం కూడా ఉంది. సుంకాల భారీ నుంచి తప్పించుకోవాలంటే.. ఇక స్మగ్లింగ్ చేయాలేమో అనే మీకు రావొచ్చు. అలాంటి సాహసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎలా తప్పించుకోవాలో క్లారిటీగా వెల్లడించే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.చైనా వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తే 145 శాతం సుంకాలను కట్టాల్సి ఉంటుంది. ఎగుమతి అంటేనే భారీ మొత్తం. కానీ చైనాలో వస్తువు కొని మనవెంట అమెరికాకు తెచ్చుకుంటే.. దానికి ప్రత్యేకంగా టారిఫ్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్ఉదాహరణకు ఒక అమెరికన్.. చైనాలో పర్యటించేటప్పుడు తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వాటిని తనతో పాటు అతని దేశానికి కూడా తీసుకెళ్లవచ్చు. ఇది పూర్తిగా లీగల్.. పర్సనల్ షాపింగ్ సర్వీస్ కిందికి వస్తుంది. అయితే ఎన్ని వస్తువులు కొనాలి?, ఎన్ని వస్తువులను తనతో పాటు తీసుకెళ్లవచ్చు అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటిస్తే.. మీపై టారిఫ్స్ ప్రభావం ఉండదు. ఇది ఒక్క అమెరికన్ ప్రజలకు మాత్రమే కాదు.. ఈ ఫార్ములాతో మీరు ఏ దేశీయులైన.. ఇతర దేశాల్లో వస్తువులను సుంకాలతో పనిలేకుండా హ్యాపీగా కొనేయొచ్చు.China is now providing tariff advice. 🤣 pic.twitter.com/esNxGshMe6— James Wood 武杰士 (@commiepommie) April 13, 2025
ఫ్యామిలీ

అమర్నాథ్ యాత్రకు ప్లాన్ చేస్తున్నారా? వీటిని అస్సలు తీసుకెళ్లకూడదు!
Amarnath Yatra 2025 ప్రముఖ ఆధ్మాత్మిక యాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది అమర్నాథ్యాత్ర. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ యాత్ర ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని రోజుల మాత్రమే పరిమితం. బాబా బర్ఫానీ యాత్రగా చెప్పుకునే ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 25 నుండి ఆగస్టు 19 వరకు వరకు సాగనుంది. శివుడి ప్రతిరూపమైన మంచు లింగాన్ని చూడటానికి ప్రతిరోజూ 15వేల మంది యాత్రికులు ఇక్కడికి తరలివస్తారు. ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. 2025 ప్రయాణానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 14 నుంచి మొదలైనట్టు బోర్డు ప్రకటించింది.జమ్మూ కాశ్మీర్‌లోని అమర్నాథ్ గుహకు సాగే అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ల కంటే తక్కువ 75 ఏళ్లు పైబడిన వృద్ధులు అనర్హులు. అంతేకాదు అమర్నాథ్కు వెళ్లే ముందు వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒక్క పర్మిట్‌కు ఒక్క భక్తుడు మాత్రమే అర్హులు ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండదు అని గమనించాలి. అమర్ నాథ్ యాత్ర 40-60 రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి నిర్వహిస్తారు. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 14 తేదీ నుంచే ప్రారంభం అయింది. ఈ యాత్ర ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్లలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో యాత్రబోర్డు భక్తులకు భద్రత, ఆహార సౌకర్యాలు కూడా కల్పిస్తుంది.ఈ కష్టతరమైన ప్రయాణానికి జాగ్రత్తలు, తీసుకెళ్లకూడని ఆహారపదార్థాలు, తీసుకెళ్ల కూడని వస్తువుల జాబితాను కూడా ప్రకటించారు. ఈ యాత్ర సమయంలో జంక్ ఫుడ్ యాత్రికులకు పెద్ద అడ్డంకిగా మారింది. చాలా మంది భక్తులు లంగర్ సేవలను ఎంచుకుంటారు. ఇక్కడ స్వచ్ఛంద సేవకులు, సంస్థలు మార్గంలో కమ్యూనిటీ కిచెన్లను నిర్వహిస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఉచిత భోజనం, పానీయాలను అందిస్తాయి. వీటికితోడు స్థానిక వ్యాపారులు నడిపే స్థానిక తినుబండారాలు, రెస్టారెంట్లు , టీ స్టాళ్లు కూడా యాత్రికులకు ప్రాంతీయ వంటకాలు , రిఫ్రెష్మెంట్లు ఉండనే ఉంటాయి.నిషేధిత ఆహార పదార్థాలుమాంసాహార ఆహారాలు: అన్ని రకాల మాంసం ఉత్పత్తులుమత్తు పదార్థాలు: ఆల్కహాల్, పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు మరియు ఇతర మత్తు పదార్థాలువేయించిన ఆహారాలు: పూరీ, బతురా, పిజ్జా, బర్గర్, స్టఫ్డ్ పారంతా, దోస, వేయించిన రోటీ, వెన్నతో బ్రెడ్క్రీమ్ ఆధారిత వంటకాలు: భారీ క్రీమ్‌తో తయారుచేసిన ఏదైనా ఆహారంసంభారాలు: ఊరగాయ, చట్నీ, వేయించిన పాపడ్ఫాస్ట్ ఫుడ్స్: చౌమీన్ , ఇతర సారూప్య తయారీలు, శీతల పానీయాలుతీపి మిఠాయిలు: కర్రా హల్వా, జలేబీ, గులాబ్ జామున్, లడ్డు, ఖోయా బర్ఫీ, రసగుల్లా తదితర స్వీట్లుకొవ్వు ,ఉప్పు అధికంగా ఉండే స్నాక్స్: చిప్స్, కుర్కురే, మత్తి, నమ్కీన్ మిశ్రమం, పకోరా, సమోసా, వేయించిన డ్రై ఫ్రూట్స్అనుమతి ఉన్న ఆహార పదార్థాలుస్టేపుల్స్: తృణధాన్యాలు, పప్పులు, బియ్యంతాజా ఉత్పత్తులు: ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చ సలాడ్, పండ్లు, మొలకలుసహజ తీపి పదార్థాలు: బెల్లం లాంటివి,దక్షిణ భారత వంటకాలు, సాంబార్, ఇడ్లీ, ఉత్తపం, పోహాపానీయాలు: హెర్బల్ టీ, కాఫీ, తక్కువ కొవ్వు పెరుగు, షర్బత్, నిమ్మకాయ గుజ్జు/నీరుఎండిన పండ్లు: అంజీర్, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు మరియు ఇతర వేయించని రకాలుడెజర్ట్లు- స్వీట్లు: ఖీర్ (బియ్యం/సాబుదానా), తెల్ల ఓట్స్ (దలియా), తక్కువ కొవ్వు పాలు సావైన్, తేనె, ఉడికించిన స్వీట్లు (క్యాండీ)తేలికపాటి స్నాక్స్: వేయించిన పాపడ్, ఖాక్రా, నువ్వుల లడ్డు, ధోక్లా, చిక్కీ (గుచక్), రేవేరిఫులియన్ మఖానే, ముర్మారా, డ్రై పెథా, ఆమ్లా మురబా, ఫ్రూట్ మురబా, పచ్చి కొబ్బరి లాంటివి తీసుకెళ్ళొచ్చు.

షిర్డీని దర్శించుకున్న నీతా అంబానీ : సింపుల్‌గా, సాంప్రదాయంగా
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, మానవతావాదిగా మాత్రమే కాదు ఆధ్యాత్మికవాదిగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. ఇటీవల నీతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించింది. సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పటి లాగానే ఈ సారి కూడా ఆమె సాంప్రదాయదుస్తుల్లో దుస్తుల్లో తన స్టైల్‌ని చాటుకున్నారు. తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్‌తో కలిసి నీతా అంబానీ ఇక్కడికి రావడం విశేషంగా నిలిచింది.నీతా అంబానీ వీడియోను అంబానీ అప్డేట్ పేజ్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. తల్లి పూర్ణిమ దలాల్ ,సోదరి మమతా దలాల్‌తో కలిసి షిర్డీ ఆలయంలో బాబాను దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్దలతో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా పాదాలకు మొక్కొ ఆశీర్వాదం తీసుకున్నారు. నీతా అంబానీ పువ్వులు సమర్పించడం, దీపాలు వెలిగించడం ,ఆలయంలో సమయం గడపడం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే ఆలయం తరుపున ఆమెకు షిర్డీ సాయిబాబా జ్ఞాపికను కూడా బహుకరించారు.ముఖ్యంగా సింపుల్ గులాబీ రంగు బాంధానీ కుర్తాలో చాలా హుందాగా కనిపించారు. దీనికి జోడీగా పింక్ కలర్ మ్యాచింగ్ దుపట్టాతో సింపుల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. అలాగే డైమండ్ స్టడ్లు, రత్నాలు పొదిగిన గాజులు , ఉంగరాలతో చాలా సరళంగా కనిపించారు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా ఇటీవల నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ 30వ పుట్టిన రోజు సందర్భంగా అనంత్, కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి రామ నవమి వేడుకల కోసం ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.

New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
న్యూయార్క్ (New York)లో శనివారం కుప్పకూలిన విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వారాంతపు సెలవుల్లో, పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు వెళుతున్న న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ (MU-2B)విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సిబిషి ఎమ్‌యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. వాతారవణ అననుకూల పరిస్థితుల కారణంగా కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు, పైలట్ కొలంబియా కౌంటీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను రేడియో ద్వారా తాను ప్రమాదంలో ఉన్నట్టు, కొత్త విధానాన్ని అభ్యర్థించారని కూడా జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం జరిగిన బ్రీఫింగ్లో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితులు వివరాలుభారతదేశానికి చెందిన యూరోజినెకాలజిస్ట్ డాక్టర్ జాయ్ సైని, ఆమె భర్త, కొడుకు, కోడలు, కుమార్తె అల్లుడు ఉన్నారు. సైనీ భర్త న్యూరో సైంటిస్ట్, డాక్టర్ మైఖేల్ గ్రాఫ్, కుమార్తె, 2022లో NCAA ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన మాజీ MIT సాకర్ క్రీడాకారిణి కరెన్నా గ్రాఫ్ ఆమె భర్త, ఇంకా సైనీ కుమారుడు జారెడ్ గ్రాఫ్, పారాలీగల్గా పనిచేసిన ,జారెడ్ గ్రాఫ్ భాగస్వామి అలెక్సియా కౌయుటాస్ డువార్టే ఉన్నారు.డా. జాయ్ సైని ఎవరంటే..!మిడ్ హడ్సన్ న్యూస్ ప్రకారం డాక్టర్ జాయ్ సైని భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కుల్జిత్ , గుర్దేవ్ సింగ్‌లతో అమెరికాకు వలస వెళ్లారు. డా. సైనీ నిష్ణాతులైన పెల్విక్ సర్జన్‌గా పేరొందారు. అలాగే బోస్టన్ పెల్విక్ హెల్త్ అండ్ వెల్నెస్ వ్యవస్థాపకురాలు కూడా.పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతుండగా, మైఖేల్ గ్రాఫ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మైఖేల్ ప్రముఖ న్యూరో సర్జన్, అనుభవజ్ఞుడైన పైలట్ కూడా. ఈ దుర్వార్తతో సైనీ మరో కుమార్తె అనికా గ్రాఫ్, మైఖేల్ తల్లిదండ్రులు స్టీఫెన్, గెబెనా గ్రాఫ్; జాయ్ తల్లి కుల్జిత్;,తోబుట్టువులు రిన్నే గ్రాఫ్, య్రామ్ గ్రాఫ్, , ప్రశాంత్ సైని తీరని విషాదంలో మునిగిపోయారు.

Vishu 2025 విషు అంటే ఏంటి? విషుకణి గురించి తెలుసా?
మలయాళీలు సంవత్సరాదిని విషుగా వ్యవహరిస్తారు. కేరళ, కర్ణాటకలోని తుళునాడు ప్రాంతం, పుదుచ్చేరిలోని మాహే జిల్లా, తమిళనాడులోని అనేక జిల్లాల్లో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీ లు జరుపుకునే ఉగాది పండుగ విషు. విషును మలయాళ నెల మేడం మొదటి రోజున జరుపుకుంటారు, ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్లో ఏప్రిల్ 14 లేదా 15న వస్తుంది. అధికారిక మలయాళ క్యాలెండర్ (కొల్లం ఎరా) చింగం నెలతో ప్రారంభమైనప్పటికీ, ఇది కేరళలో సాంప్రదాయ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది.సూర్యుడు మేడం రాశి (మేష రాశి)లోకి మారడాన్ని విషు సూచిస్తుంది. సంస్కృతంలో విషు అంటే సమానం, అంటే పగలు మరియు రాత్రి సమాన సంఖ్యలో ఉండే రోజు లేదా విషువత్తు అని అర్థం. ఇది విష్ణువుకు అంకితమైన కాలమని, భావిస్తారు, అందుకే విష్ణువు ,శ్రీకృష్ణుడిని పూజిస్తారు.ఈ పండుగకు విష్ణు దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తులకు 'విషు కంజి' లేదా గంజిని ప్రసాదంగా అందిస్తారు. ఇందులో పాపడ్, ఊరగాయ, యాలుక, పచ్చి అరటి,బూడిద గుమ్మడికాయతో చేసిన 'అస్త్రం' అనేది ఉంటుంది. ఇంకా విషు ప్రసాదాల్లో 'కైనీట్టం' ముఖ్యం.విషు అంటే పునరుద్ధరణ, ఆశకు చిహ్నం కూడా. పండుగ ముందురోజు రాత్రి ఇంట్లోని మహిళల్లో పెద్దవయస్కురాలు పచ్చి బియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు వన్నెలో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దం వీటన్నిటినీ ‘విషుకణి’ అనే ప్రత్యేక పాత్రలో ఉంచి దైవపూజ నిర్వహిస్తుంది. మర్నాడు ఆమె ముందుగాలేచి వయసుల వారీగా ఇంట్లో అందరినీ నిద్రలేపి, వారి కళ్లు మూసి విష్ణువు ఫోటోలు పువ్వులు, పండ్లు , కూరగాయలు, బట్టలు, బంగారు నాణేలు, దీపంతో నిండిన పాత్ర దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు కళ్లు తెరవమంటుంది. ఉదయాన్నే లేవగానే మంగళకరమైన విషుకణిని చూస్తే అంతా శుభమే జరుగుతుందని వారి నమ్మకం. ఈ విష్ణుకణిని శ్రేయస్సు , అదృష్టానికి ప్రతీకగా విశ్వసిస్తారు.సాద్య ప్రత్యేకతే వేరేవిషు కైనెట్టం : పెద్దలు చిన్న కుటుంబ సభ్యులకు సౌభాగ్యం, సౌభాగ్యం కోసం ఆశీర్వచనాలుగా డబ్బు ఇస్తారు.విషు సాద్య : సాద్య అంటే అవియల్, తోరన్, రసం, పాయసం వంటి 20–30 వంటకాలను వడ్డించే గొప్ప శాఖాహార విందు. అరటి ఆకులపై వీటిని వడ్డించే శాఖాహార విందే ఈ పండుగ ప్రత్యేకత. ఇందులో మాంబళ పులిసేరి (మామిడి కూర) వంటి వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.బాణాసంచా: బాణసంచా కాల్చడం ఒక ప్రసిద్ధ సంప్రదాయం, ఇది వేడుకలకు ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని జోడిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉట్టికొట్టే సంప్రదాయం కూడా ఉంది. సంప్రదాయ వస్త్రధారణ: ప్రజలు కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. మళయాళీల చీరకట్టు, పువ్వులకు వారిచ్చే ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంటుంది. ప్రేమానుబంధం: తెలుగువారు ఉగాదిని ఎలా జరుపుకుంటారో అలాగే మళయాళీలు విషును బంధుమిత్ర సపరివార సమేతంగా జరుపుకుంటారు.చిన్నవారికి కానుకలిచ్చి సంబరపడతారు.సాంస్కృతిక వైవిధ్యం: పంజాబ్ లో బైసాఖి, తమిళనాడులో పుత్తాండు వంటి పండుగలను ఒకే సమయంలో జరుపుకుంటారు.
ఫొటోలు


హైదరాబాద్ : జలవిహార్ లో జనం సందడి (ఫొటోలు)


గరుడ పక్షి రాకతో వైభవోపేతంగా రఘునాయకుని కల్యాణోత్సవం (ఫొటోలు)


నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)


తమన్నా ‘ఓదెల 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


'టీచ్ ఫర్ ఛేంజ్' సెలబ్రిటీ ఫ్యాషన్ షోలో మెరిసిన తారలు (ఫోటోలు)


రెండో తరగతిలోనే ప్రధానికి లేఖ.. ఆ స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా? (ఫోటోలు)


గైక్వాడ్ రాజు దగ్గర విజయ్ మాల్యా కారు - ఫోటోలు


మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' చిత్రం నుంచి మొదటి గీతం 'తు మేరా లవర్' విడుదల


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ (ఫోటోలు)


సింహాచలం : దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా? (ఫొటోలు)
అంతర్జాతీయం

Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్‌ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్‌పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్‌ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..

వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు
బ్రస్సెల్స్: ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతకుముందు.. పీఎన్బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. Fugitive diamond trader Mehul Choksi, who is wanted in connection with the Rs 13,500-crore Punjab National Bank (PNB) loan fraud case, has been arrested by the police in Belgium, according to a report. The 65-year-old was taken into custody on Saturday (April 12) at the request… pic.twitter.com/xQlq2T3E0C— News9 (@News9Tweets) April 14, 2025

చిందేసిన ట్రంప్..!
మియామి: వలసదారుల బహిష్కరణలు, సుంకాలతో హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కాస్త రిలాక్సయ్యారు. తన బృందంలో కీలక సభ్యులైన ఎలాన్ మస్క్, తులసీ గబార్డ్ తదితరులతో కలిసి ఫ్లోరిడాలోని మియామిలో అలి్టమేట్ ఫైటింగ్ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని తిలకించారు. అభిమానులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేసి, పిడికిలి బిగించి ఉత్సాహపరిచారు. పూర్తిగా ఫిట్ 78 ఏళ్ల ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. అమెరికా సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసే సామర్ధ్యం ఆయనకుందని పేర్కొన్నారు. శుక్రవారం ట్రంప్‌కు జరిపిన సాధారణ వైద్య పరీక్షల ఫలితాలను వైట్‌హౌస్ విడుదల చేసింది. ‘2020లో అధ్యక్షుడిగా ఉండగా చివరిసారిగా జరిపిన పరీక్షల్లో ట్రంప్ 110.677 కిలోలుండగా ఇప్పుడు 9 కిలోలు తగ్గారు. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు తగ్గాయి. అధ్యక్షుడిగా రోజూ సమావేశాలు, సభల్లో భేటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ గోల్ఫ్ పోటీలో విజేతగా నిలిచారు కూడా. ఆరోగ్యవంతుల్లో కొలెస్టరాల్ స్థాయి 200కు మించరాదు. బీపీ మాత్రం కాస్త ఎక్కువ (128/74)గా ఉంది. హృదయ స్పందన రేటు గతంలో మాదిరిగా 62గానే ఉంది. గుండెపోటు రిస్‌్కను నివారించేందుకు ట్రంప్ నిత్యం ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు’’ అని పేర్కొంది. Trump Dance at UFC 314 🇺🇸 pic.twitter.com/Ud01BkHp8M— Margo Martin (@MargoMartin47) April 13, 2025

హసీనాకు మరో అరెస్ట్ వారెంట్
ఢాకా: అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఆదివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమె సోదరి షేక్ రెహానా, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా మరో 50 మంది పేర్లు పొందుపరిచింది. అధికార దుర్వినియోగంతో పుర్బాచల్ న్యూటౌన్ ప్రాజెక్టులో 10 అంతస్తుల స్థలాన్ని కొనుగోలు చేశారంటూ జనవరి 13న రెహానాపై ఏసీసీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హసీనా, రెహానా కుమార్తె బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా 15 మందిని నిందితులుగా చేర్చారు. మరో 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీసీ మార్చి 10న సమర్పించిన తుది చార్జిషీట్లోలో మరో 18 మంది పేర్లు చేర్చింది. మూడు వేర్వేరు ఛార్జిషీట్లను పరిశీలించిన అనంతరం ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి జాకీర్ హుస్సేన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అరెస్టు ఉత్తర్వుల అమలుపై నివేదికలను సమీక్షించడానికి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు. రజుక్ ప్లాట్ల కేటాయింపులకు సంబంధించిన మరో అవినీతి కేసులో హసీనా, ఆమె కుమార్తె సైమా వజీద్ పుతుల్, మరో 17 మందిపై ఏప్రిల్ 10న ఇదే కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పుతుల్ 2023 నవంబర్ 1 నుంచి న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హసీనాపై సామూహిక హత్యలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, బలవంతపు అదృశ్యాలు వంటి అనేక అభియోగాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆగస్టు 5న తిరుగుబాటు అనంతరం తన ప్రభుత్వం కూలిపోవడంతో, 77 ఏళ్ల హసీనా అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు.
జాతీయం

రాజ్యాంగ విధ్వంసకారి కాంగ్రెస్: ప్రధాని మోదీ
హిసార్: కాంగ్రెస్ పార్టిపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. రాజ్యాంగ విధ్వంసకారిగా కాంగ్రెస్ మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా మార్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్ల సాధారణ ముస్లింలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. సోమవారం హరియాణా రాష్ట్రం హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం హిసార్–అయోధ్య మధ్య తొలి కమర్షియల్ విమానాన్ని ప్రారంభించారు. అలాగే యమునానగర్ జిల్లాలోని దీనబందు చోటూ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల అల్ట్రా–క్రిటికల్ మోడ్రన్ థర్మన్ పవర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. రెండుచోట్లా సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రమాదంలో పడ్డప్పుడల్లా రాజ్యాంగాన్ని అణచివేశారని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విస్మరించిన కాంగ్రెస్ ‘‘దేశంలో నేడు దురదృష్టం ఏమిటో చూడండి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వ్యక్తులే నేడు అదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని రాజ్యాంగం చెబుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయి. సమాజంలో సమానత్వం రావాలని అంబేడ్కర్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అనే వైరస్‌ను వ్యాప్తి చేసింది. పవిత్రమైన రాజ్యాంగాన్ని కేవలం అధికారం కోసం ఆయుధంగా వాడుకుంది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మంచినీరు ఆ పార్టీ నాయకుల స్విమ్మింగ్ పూల్స్‌కు చేరింది కానీ గ్రామాలకు చేరుకోలేదు. స్వాతంత్య్రం వచ్చి70 ఏళ్లు గడిచినా గ్రామాల్లో 16% ఇళ్లకు కూడా కుళాయి నీరు రాలేదు. కాంగ్రెస్ విధానాల వల్ల నష్టపోయింది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కాదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు తాగునీరు అందించడంపై దృష్టి పెట్టాం. గత ఏడేళ్లలో 12 కోట్ల కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. దేశంలో ప్రస్తుతం 80% ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. మిగతా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం తథ్యం. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహరి్నశలూ శ్రమిస్తున్నాం. హవాయి చెప్పులు ధరించేవారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేయాలన్నదే మా లక్ష్యం. అది ఇప్పుడిప్పుడే సాకారం అవుతోంది. గత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు తొలిసారిగా విమాన ప్రయాణం చేశారు. గతంలో సరైన రైల్వేస్టేషన్లు లేనిచోట కూడా ఇప్పుడు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరింది. మన ఎయిర్‌లైన్ సంస్థలు 2,000 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చాయి. కొత్త విమానాలతో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. పరుగు ఆపని అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి.. ఇదే బీజేపీ ప్రభుత్వాల మంత్రం. పేదలు, గిరిజనులు, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నదే మా ధ్యేయం. మా ప్రతి నిర్ణయం, ప్రతి విధానం అంబేడ్కర్‌కే అంకితం. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పెద్దపెద్ద మాటలు చెబుతోంది. కానీ, అంబేడ్కర్‌కు, చౌదరి చరణ్‌సింగ్‌కు కాంగ్రెస్ భారతరత్న పురస్కారాలు ఇవ్వలేదన్న సంగతి మనం మర్చిపోవద్దు. అంబేడ్కర్‌కు మరణానంతరం భారతరత్న దక్కిందంటే అందుకు కారణం బీజేపీ. చౌదరి చరణ్‌సింగ్‌కు బీజేపీ ప్రభుత్వమే భారతరత్న ఇచ్చింది. అంబేడ్కర్ జయంతి చాలా ముఖ్యమైన రోజు. ఇది మనందరికీ రెండో దీపావళి. మతం ఆధారంగా రిజర్వేషన్లా? 2013 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి హడావుడిగా సవరణలు తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఓట్ల కోసమే కుతంత్రాలకు పాల్పడింది. రాజ్యాంగాన్ని ధిక్కరించి మరీ వక్ఫ్ చట్టంలో సవరణలు చేశారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించడం కాదా? ఓటు బ్యాంకు కోసం ఆరాటపడింది ఎవరు? ముస్లింలపై కాంగ్రెస్‌కు నిజంగా అభిమానం ఉంటే ఆ పార్టీ అధినేతగా ముస్లింను నియమించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 50 శాతం టికెట్లు ముస్లింలకే ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ఆ పని చేయదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేడ్కర్ చెప్పారు. రాజ్యాంగం సైతం ఇలాంటి రిజర్వేషన్లపై నిషేధం విధించింది. కానీ, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ టెండర్లలో మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొడుతున్నారు. లూటీని ఆపడానికే వక్ఫ్చట్టం దేశంలో వక్ఫ్ బోర్డులకు లక్షల ఎకరాల భూములున్నాయి. అవి పేద ముస్లింలకు, మహిళలకు, చిన్నారుల అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఆ భూములను సక్రమంగా ఉపయోగించుకొని ఉంటే నేడు ముస్లిం యువత టైర్ల పంక్చర్ దుకాణాల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. వక్ఫ్ భూములు కేవలం భూమాఫియాకే ఉపయోగపడుతున్నాయి. పేద ముస్లింలకు ఒరిగిందేమీ లేదు. దళితులు, వెనుకబడివర్గాలు, ఆదివాసీలు, వితంతువులను భూ మాఫియా లూటీ చేసింది. ఈ లూటీని ఆపడానికే వక్ఫ్(సవరణ) చట్టం తీసుకొచ్చాం. ఆదివాసీల భూములు, ఆస్తులను ఇకపై వక్ఫ్ బోర్డు తాకను కూడా తాకలేదు. వక్ఫ్ స్ఫూర్తిని మేము గౌరవిస్తున్నాం. ముస్లిం మహిళలు, పేదలు, చిన్నారుల హక్కులకు ఎప్ప టికీ రక్షణ లభించే ఏర్పాటు చేశాం. ఇదే అసలైన సామాజిక న్యాయం’’’ అని మోదీ ఉద్ఘాటించారు.

యువతిని వేధించి.. ఆపై పోలీస్ స్టేషన్లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్ అవార్డ్ పక్కా’
లక్నో: యువతి,యువకుడిపై అల్లరి మూకలు తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో నిందితులు తాము అనారోగ్యంతో ఉన్నామంటూ పోలీసులకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగింది?ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో అల్లరి మూకలు వీరంగం సృష్టించారు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడి అనంతరం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అదిగో అప్పుడే నిందితులు తమలోని నటులను బయటపెట్టారు. ఫిర్యాదు దారులే తమపై దాడి చేశారంటూ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. బలహీన స్థితిలో ఉన్నామంటూ నటించేందుకు ప్రయత్నించారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తూ, యాక్టింగ్ చేస్తున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వచ్చేస్తుంది కావాలంటే ట్రై చేయండి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆస్కార్ అవార్డ్ రేంజ్ యాక్టింగ్‌తో పోలీస్ స్టేషన్లో అల్లరిమూకలు చేసిన స్టంట్ మీరూ చూసేయండి. These men from UP's Muzaffarnagar misbehaved with a woman. They were caught by @Uppolice and took them to their acting class and were asked to perform in front of cameras.@Uppolice, you've become a joke! pic.twitter.com/vKLV3oxOM7— Congress Kerala (@INCKerala) April 14, 2025

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు
ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల వివాదంపై 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో ముందుగానే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని తెలంగాణ సర్కార్ అంటోంది. దీనిని అనుసరించే కౌంటర్ దాఖలు చేసింది. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల అక్కడ పొదలు పెరిగాయని, అటవీ రెవెన్యూ రికార్డుల్లో వాటిని అటవీ భూములుగా పేర్కొనలేదనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఆ భూములకు ఎలాంటి కంచలేదని, కంచె ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నం చేశామని, ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవని కౌంటర్ లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎల్లుండి(బుధవారం, ఏప్రిల్ 16వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణకు లోపే కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండటంతో న్యాయనిపుణులతో సుదీర్ఘ చర్చల తర్వాత ఓ క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ భూముల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణ సర్కారుకు గట్టిగానే మొట్టికాయలు వేసింది. గత విచారణ సందర్భంగా భూముల్ని తదుపరి విచారణ వరకూ కొట్టివేయొద్దని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చెట్లు నరికివేతపై తీవ్రంగా స్పందించింది. కంచ గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాను హడావుడి చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధృవీకరణ నివేదిక తీసుకుందా, దీనికి సంబంధించి అవసరమైన అనుమతులు పొందారా, స్థానిక చట్టాలను అమలు చేశారా అంటూ పలు ప్రశ్నలను సంధించింది.

కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
హర్యానా: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు135వ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ హర్యానా రాష్ట్రం, యమునా నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పాలనని ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది. బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి నష్టం, జంతువులకు ప్రమాదం జరుగుతుంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతుంది.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజల ఆందోళనతో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు, బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. వికసిత్ భారత్ కోసం బీజేపీ పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదంప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చింది. ఈ తరుణంలో కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ స్పందించారు.
ఎన్ఆర్ఐ

నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్‌తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.

గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్‌లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అబుదాబిలో ఘనంగా ఉగాది వేడుకలు..
సనాతనం, సత్సంబంధం, సంఘటితం, సహకారం, సత్సంగం వంటి పంచ ప్రామాణికాలతో ప్రారంభించబడిన యు.ఏ.ఈ లోని అతిపెద్ద బ్రాహ్మణ సమూహం గాయత్రీ కుటుంబం ఆధ్వ్యర్యంలో శ్రీ విశ్వావసు ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 300 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నారుప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ష సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఆద్యంతం చక్కటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాజధాని అబుదాబిలో కన్నుల పండుగగా జరిగింది. దీపారాధన, విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య విశారద బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ గారిచే పంచాంగ పఠనం, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రీతి తాతంభొట్ల, సంగీత గురువులు రాగ మయూరి, ఇందిరా కొప్పర్తి గార్లు తమ శిష్య బృందంతో సంగీత, నృత్య ప్రదర్శనలు, శ్రీనివాస మూర్తి గారు లాస్య వల్లరి, శివ తాండవ స్తోత్రం, ప్రముఖ తెలుగు కవులు ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి ఆర్ధ్వర్యంలో, శ్రీలక్ష్మి చావలి, వెంపటి సతీష్‌ల కవి సమ్మేళనం, భగవద్గీత, అన్నమాచర్య, రామదాసు కీర్తనలు, సుభాషితాలు, సాహిత్య కార్యక్రమాలతో గాయత్రీ కుటుంబానికి సంబంధించిన చిన్నారులు, పెద్దలు తమ అద్భుతమైన ప్రతిభతో పూర్తి తెలుగింటి సంప్రదాయాన్ని కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ రసజ్ఞులను సమ్మోహితులను చేశారు .ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి ఉషా బాల కౌతా గారు అందర్నీ ఆకట్టుకున్నారు. ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గాయత్రీ కుటుంబం ప్రధాన ఉద్దేశ్యాల గురించి వివరిస్తూ.. స్వదేశంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు గాయత్రి కుటుంబం అండదండగా నిలుస్తోంది. వారికి విద్య, వైద్య , వివాహం వంటి కార్యక్రమాలకు ఇప్పటి వరకూ గాయత్రి కుటుంబ సభ్యులు సుమారు కోటిన్నర రూపాయల వరకు సహాయం అందించారని, భవిష్యత్తులో బ్రాహ్మణ సంక్షేమానికి మరింత సహకారం అందిస్తామని వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు గాయత్రీ కుటుంబం సమైక్యతను అభినందిస్తూ..ఈ సమూహం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే "ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ దేశ సంస్కృతిని గౌరవిస్తూనే బ్రాహ్మణులు స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. బ్రాహ్మణులు ధర్మ జీవనం, ధర్మ పరిరక్షణ వదిలిపెట్టవద్దని, ఎల్లప్పుడూ జ్ఞానార్జన చేస్తూ.. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నారు. పట్టుదల, దీక్ష, తపస్సు, సహనం, నియమ నిష్ఠలతో నిత్యం గాయత్రీదేవిని ఆరాధించి, బ్రాహ్మణత్వాన్ని పొందాలి అని పిలుపునిచ్చారుఈ మొత్తం కార్యక్రమానికి సంపంగి గ్రూపు పూర్తి సహకారాన్ని అందించినందుకు నిర్వాహకులు ఆ గ్రూపు పెద్దలను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి, తిరుమల శ్రీవారి తీర్ధ ప్రసాదాలతో పాటు, అచ్చమైన బ్రాహ్మణ భోజనాన్ని అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని గాయత్రీ కార్యకారిణీ బృందం రాయసం శ్రీనివాసరావు, మోహన్ ముసునూరి, గడియారం శ్రీనివాస్, సుబ్రహ్మణ్య శర్మ, వంశీ చాళ్లురి, రమేష్ సమర్ధవంతంగా నిర్వహించింది. (చదవండి: Ugadi 2025: సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు..)

Ugadi 2025 సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్‌సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్‌లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్

స్నేహితుడుమోసం చేశాడని.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అమీర్‌పేట: స్నేహితుడు డబ్బులు తీసుకుని మోసం చేయడంతో మనస్తాపానికి లోనైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగపూర్‌కు చెందిన శివాని, రుడాల్ప్ ఆంటోని (30) దంపతులు అమీర్‌పేట ధరమ్‌కరం రోడ్డులో నివాసముంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో భార్య కూడా ఉద్యోగం చేయాలని ఆంటోని భావించాడు. ఈ నేపథ్యంలో అతడి స్నేహితుడు విశాల్ శివానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతడికి రూ.4.50 లక్షలు ఇచ్చాడు. అయితే అతను ఉద్యోగంఇప్పించకపోవడంతో ఆదివారం రాత్రి అల్వాల్‌లోని విశాల్ ఇంటికరి వెళ్లి గొడవ పడ్డాడు. రాత్రి ఇంటికి తిరిగి వచి్చన ఆంటోని కష్టపడి కూడబెట్టిన డబ్బు స్నేహితుడే కాజేశాడని భార్యకు చెప్పి బాధపడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శివాని స్నేహితుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆంటోనీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
విశాఖపట్నం: బెట్టింగులకు అలవాటు పడి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగిని పోలీసులు కాపాడిన సంఘటన భీమిలి బీచ్‌రోడ్డులో చోటు చేసుకుంది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక ప్రాంతానికి చెందిన కొండా సుందర్ (30), భార్య, కుమార్తెతో కలిసి పీఎంపాలెంలో నివాసం ఉంటున్నారు. రెండున్నరేళ్లుగా రుషికొండ ఐటీ సెజ్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో బెట్టింగులకు పాల్పడుతూ, అది కాస్తా వ్యసనంగా మారింది. బెట్టింగ్‌ల కారణంగా సుమారు రూ. 21 లక్షల అప్పు చేశాడు. స్నేహితుల ఖాతాలో బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చాల్సిందిగా.. ఒత్తిడి పెరిగింది. దీంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాదు. కాసేపటి తర్వాత ‘నాన్నా నన్ను క్షమించు, నీకు ముఖం చూపించలేకపోతున్నా రూ. 21 లక్షలు అప్పు చేశాను. నేను ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేని పరిస్థితి. నాభార్య, కుమార్తెను బాగా చూసుకోండి.. నేను చచ్చిపోతానంటూ..’ఓ సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించాడు. అది చూసిన తండ్రి వెంటనే 112కు కాల్ చేసి విషయం చెప్పి, ఆ వీడియోను పోలీసులకు పంపించారు. అతను పంపిన వీడియోలో.. తన కోసం వెతికితే బీచ్ రోడ్డులో ఫోన్ దొరుకుతుందని చెప్పడంతో.. ఆయన పంపిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి భీమిలి బీచ్ రోడ్డు రామానాయుడు ఫిల్మ్సూ్టడియో సమీపంలో ఉన్న బీచ్‌కు చేరుకున్నారు. సుందర్ ఓ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. పీఎంపాలెం బీచ్ మొబైల్ పోలీసులు ఆయనను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పోలీసులు తెలుసుకుని సుందర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అతి తక్కువ సమయంలో సుందర్‌ను గుర్తించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సీఐ బాలకృష్ణ అభినందించారు.

ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
నిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్‌లోనే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హాస్టల్లో ఉంటూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. జాన్‌రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్లో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు.

9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
మధురవాడ(భీమిలి): కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి నిండు చూలాలైన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన విశాఖపట్నం మధురవాడ ఆర్టీసీ డిపో సమీపంలో చోటు చేసుకుంది. విశాఖ నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు, మృతురాలి బంధువుల వివరాల ప్రకారం... కూర్మన్నపాలెం సెక్టార్–2, దువ్వాడకు చెందిన గెద్డాడ జ్ఞానేశ్వర్(28), అనకాపల్లి జిల్లా నర్సీపటా్ననికి చెందిన కేదారిశెట్టి అనూష (27)తో 2023లో వివాహమైంది. జ్ఞానేశ్వర్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో పనిచేస్తూ స్కూళ్లలో ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఏడాది క్రితం వీరిద్దరూ మిథిలాపురి వుడాకాలనీకి వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా... అప్పుడప్పులు గొడవలు పడుతుండేవారు. ఏడాది కాలంగా జ్ఞానేశ్వర్ ఆమె అడ్డు తొలగించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నూషకు తొమ్మిది నెలలు నిండగా సోమవారం కాన్పు నిమిత్తం ఆస్పత్రిలో చేరాల్సి ఉంది. ఇందుకోసం ఆమె అమ్మమ్మ అన్నవరం వచి్చంది. ఈక్రమంలో సోమవారం ఉదయం జ్ఞానేశ్వర్ భార్య అనూషను హత్యచేసి ఏమీ తెలియనట్టు బెడ్రూంలో కూర్చున్నాడు. అనూషను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం అవుతుండటంతో అమ్మమ్మ అన్నవరం ఆమెను పిలిచింది. స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తట్టి లేపింది. అయినా కదలకపోవడంతో జ్ఞానేశ్వర్‌కు చెప్పింది. ఏమీ తెలియనట్టు వెంటనే జ్ఞానేశ్వర్ స్థానికుల సాయంతో అనూషను ఆరిలోవ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న సీఐ బాలకృష్ణ విచారణ చేపట్టారు. ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో తనను అనూష అనుమానించి మానసికంగా హింసించిందని, విసుగు చెంది గొంతు నులిమి హత్యచేసినట్టు నిందితుడు జ్ఞానేశ్వర్ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
వీడియోలు


రోదసిలోకి మహిళా సెలబ్రిటీలు


Stock Market Today: దుమ్మురేపుతున్న స్టాక్ మార్కెట్


మహేష్ కోసం మల్టీ డైరెక్టర్స్.. రంగంలోకి దేవా కట్టా


Boycott: తెలుగు డైరెక్టర్‌కు వార్నింగ్..!


కూకటి వేళ్ళతో సహా పెకలిస్తాం.. బాబుకు నూర్ బాషా సంఘం మాస్ వార్నింగ్


హైదరాబాద్ చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్ నిర్వాకం


లేగదూడలు వృద్ధాప్యంతో చనిపోయాయా.. TTD చైర్మన్ కామెంట్స్ పై రామ్ నాథ్ ఫైర్


బాబు పాలనపై టీడీపీ నేతల్లో క్లారిటీ.. నెక్స్ట్ కష్టమే


విశాఖ టీడీపీ నేత అల్సి అప్పలనారాయణ సంచలన ఆడియో


ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల వీరంగం