సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు ఐఎఫ్‌ఎస్, అటవీశాఖకు చెందిన 50 మంది అధికారులు బుధవారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం వందలాది ఎకరాల అటవీ భూమి బదలాయించాల్సిన అవసరం ఏర్పడింది.
అలాగే ప్రత్యామ్నాయ భూముల్లో అడవుల పెంపకంపై క్షేత్ర స్థాయిలో పర్యటన జరిపేందుకు ఐఎఫ్‌ఎస్, అటవీశాఖ అధికారులు వెళ్లారు. ఈ సందర్బంగా భూపాలపల్లి, కన్నెపల్లి, అన్నారం బ్యారేజీ, ధర్మారం టన్నెల్ పనులను అధికారుల బృందం పరిశీలించనుంది.