Forest Department
-
వైరల్.. మృగరాజుకి ఆకలేసి కిచెన్‌లో దూరింది!
గాంధీనగర్ : అడవికి రాజు అయిన సింహం జనావాసాల్లోకి వస్తే ఏమవుతుంది. అమ్మో.. ఊహించుకోవడానికే భయంగా ఉందంటారా? అలాంటిది. ఇంట్లో అందరూ గాఢనిద్రలో ఉండగా.. ఆ సింహం ఇంటి పై కప్పు నుంచి సైలెంట్‌గా కిచెన్‌లో అడుగుపెడితే . సుమారు రెండు గంటల పాటు అక్కడే తిష్ట వేస్తే.. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో ఒక కుటుంబానికి ఓ చిరుత షాకిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో బుధవారం రాత్రి ములుభాయ్ రాంభాయ్ లఖన్నోత్రా కుటుంబం బుధవారం రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ సింహం వారి కిచెన్‌లోని గోడపై కూర్చొంది. సుమారు రెండుగంటల పాటు తిష్టేసింది.#Amreli: #Gujarat Family Finds Lion Sitting In Their Kitchen pic.twitter.com/dMkfqcILI0— Timeline. (@timelinelatest) April 4, 2025అయితే అర్ధరాత్రి తర్వాత ఇంట్లో చప్పుడు కావడంతో ములుభాయ్ కుటుంబసభ్యులు ఉలిక్కపడి లేచారు. కళ్లార్పకుండా వంటగది గోడమీద ఉన్న సింహం వారినే చూస్తుండడంతో ఒక్కసారిగా హతాశులయ్యారు. బతుకు జీవుడా అనుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ భయటకు పరుగులు తీశారు. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ములుభాయ్ కుటుంబసభ్యులకు ఏమైందోనని వచ్చి చూడగా.. వంటగదిలో ఉన్న సింహాన్నిచూసి జడుసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింహం వంటగది గోడపై కూర్చొని ఉండడాన్ని గమనించొచ్చు. చికట్లో కూడా మిరుమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతున్న సింహం కళ్లను గ్రామస్తులు తమ సెల్ఫోన్లలో బంధించడం మనం చూడొచ్చు. సుమారు రెండు గంటల తర్వాత గ్రామస్తుల సహాయంతో సింహాన్ని తరిమికొట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఇంట్లో సింహం చొరబడిందనే సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సింహం ఎక్కడ నుంచి వచ్చిందో ఆరా తీశారు. -
శిఖరాన్ని వంచింది
ప్రకృతి పాఠశాల అంటే భరణికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేలా చేసింది. కొండలు, కోనలు భరణి నేస్తాలు. ఆ స్నేహమే ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించేలా చేస్తోంది. లద్ఖాఖ్‌లోని కాంగ్ యాప్సే నుంచి రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతం వరకు ఎన్నో పర్వతాలను అధిరోహించిన చిత్తూరు జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) భరణి గురించి...స్ఫూర్తినిచ్చే సాహసికుల గురించి వినడం, చదవడం భరణికి ఎంతో ఇష్టమైన పని. అలా విన్నప్పుడు, చదివినప్పుడు తాను కూడా ఆ పర్వతాలను అధిరోహించినట్లు కల కనేవారు. ఆ కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. ఐపీఎస్ అధికారి అతుల్ కరవాల్ 50 ఏళ్ల వయసులో ఎవరెస్టు అధిరోహించడం భరణిని ప్రభావితం చేసింది. అతుల్ కరవాల్ ఎవరెస్ట్ అధిరోహించినట్లే తానూ ప్రపంచంలో మేటి శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. 30 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు భరణి.శిక్షణ తరువాత... ఎన్నో శిఖరాలురంపచోడవరంలో ఉప అటవీశాఖ అధికారిణిగా పనిచేస్తూనే డార్జిలింగ్‌లో కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న హిమాలయన్ మౌంటెనరీ ఇన్ స్టిట్యూట్లో కోర్సు పూర్తి చేశారు. తొలి ప్రయత్నం గా లద్దాఖ్‌లోని కాంగ్ యాప్సే పర్వతాన్ని అధిరోహించారు.తొలి ప్రయత్నం... తొలి విజయం.తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చింది. మరింత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత...ఉత్తరాఖండ్‌లోని 4,200 మీటర్ల మల్లార్ లేక్ శిఖరాన్ని, రష్యాలో 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు.కిలిమంజారో పిలిచిందిఎన్నోసార్లు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం గురించి ఆసక్తిగా విన్న భరణి ఆ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నారు. కిలిమంజారో ఎత్తు 5,895 మీటర్లు. వీపుపై 28 కిలోల బరువును మోస్తూ ఏటవాలుగా ఉన్న కొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే కంటిముందు లక్ష్యం మాత్రమే కనిపించిందని భరణి చెబుతారు. 26 గంటలపాటు సుదీర్ఘంగా కిలిమంజారో అధిరోహణ సాగిందని, పర్వత శిఖరాగ్రంపై పాదం మోపిన వెంటనే కష్టాలన్నీ క్షణంలో మరచిపోయానని అంటారు భరణి.ప్రకృతి పాఠశాలలో...తమిళనాడులోని కోయంబత్తూరు భరణి జన్మస్థలం. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ ఆఫీసర్. తల్లి పద్మ టీచర్. నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆమె చదువు కొనసాగింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్‌కు విహారానికి వెళ్లినప్పుడు ఆ దట్టమైన అటవీప్రాంతం, సరస్సులు, కొండల నడుమ జాలువారే జలపాతాలు భరణి మనసును కట్టిపడేశాయి. పర్వత్రపాంతాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహణకి సంబంధించి మెలకువలు నేర్చుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనేది భరణి కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.ప్రతి సాహసం ఒక పాఠమేప్రతి ప్రయాణం, ప్రతి సాహసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రిస్క్?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే రిస్క్ లేనిది ఎక్కడా! సాహసం చేస్తేనే దానిలో ఉన్న మజా ఏమిటో తెలుస్తుంది. ఒక సాహసం మరొక సాహసానికి స్ఫూర్తినిస్తుంది. పర్వతారోహణ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే సాహసం. భవిష్యత్‌లో మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను.– భరణి– నామా హరీశ్, సాక్షి. చిత్తూరు -
ట్రిపుల్ ఆర్ పరిహారం పంపిణీ షురూ
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం అలైన్మెంటులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమమైంది. ఉత్తర భాగానికి తాజా గా కేంద్ర అటవీ శాఖ పర్యావరణ అనుమతులు జారీ చేయటంతో గ్రామాల వారీగా అవార్డులు పాస్చేయటం ప్రారంభించారు. త్వరలో పరిహారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసేందుకు ఎన్హెచ్ఏఐ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భాగంలో 1,950 హెక్టార్ల మేర భూమిని సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి నిర్వాసితులకు రూ.5,100 కోట్లను పరిహారంగా అందించాల్సి ఉంది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2,550 కోట్లు భరించాల్సి ఉండగా, ఇటీవలి బడ్జెట్లో ట్రిపుల్ ఆర్కు రూ.1,250 కోట్లు ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని పరిహారం కోసమే వినియోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం వాటాకు సంబంధించిన నిధులు ఎన్హెచ్ఏఐ ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు భూసేకరణ ప్రాధికార సంస్థ (కాలా)ల వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా డబ్బులు ఉమ్మడి ఖాతాలోకి విడుదల కానున్నాయి. అక్కడి నుంచి రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. రోడ్ నంబర్ నిబంధన నుంచి మినహాయింపు కొత్తగా నిర్మించబోయే జాతీయ రహదారులకు రోడ్ నంబర్‌ను కేటాయించిన తర్వాతనే పర్యావరణ అనుమతులు వస్తాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచి్చంది. దీంతో ట్రిపుల్ ఆర్కు ఎక్స్‌ప్రెస్ వే నంబర్ కేటాయించటానికి ముందు పర్యావరణ అనుమతులు జారీ చేసేందుకు వీలు కలిగింది. ట్రిపుల్ ఆర్ బడ్జెట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే దానికి నంబర్ కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తవటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరభాగం 162 కి.మీ. నిడివి రోడ్ నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. రెండు పర్యాయాలు గడువు కూడా పొడిగించింది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్లను తెరిచేందుకు వీలుండదు. ఫలితంగా టెండర్ల గడువు పొడిగిస్తూ వెళ్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే పర్యావరణ అనుమతుల జారీకి కేంద్రం ఓకే చెప్పింది. 80% మ్యుటేషన్ అయ్యాకే పనులు..: రోడ్ నిర్మించే సంస్థను ఎంపిక చేసేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. అక్కడి సాంకేతిక సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత వాటిని ఓపెన్ చేసి నిర్మాణ సంస్థను ఖరారు చేస్తారు. అప్పటికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే, మొత్తం అలైన్మెంట్ నిడివిలో 80 శాతం భూమికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. వీలైనంత వేగంగా, ఎలాంటి సాంకేతిక, న్యాయ సంబంధిత చిక్కులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.త్వరలో మ్యుటేషన్..భూపరిహారం జారీకి వీలుగా కాలా (భూసేకరణ ప్రాధికార సంస్థ)ల వారీగా అవార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కాలాల పరిధిలోని గ్రామాలవారీగా రైతులు, వారి అ«దీనంలో ఉన్న భూముల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా రైతులను కాలా కార్యాలయానికి పిలిపించి అవార్డులపై సంతకాలు తీసుకుంటున్నారు. రైతు భూమి విస్తీర్ణం, ఆ భూముల్లోని నిర్మాణాలు, విలువైన తోటలు, చెట్లు, ఇతర నిర్మాణాలు, కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం వాటికి చెల్లించే మొత్తం.. తదితర వివరాలను తెలుపుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే వారి ఖాతాల్లో పరిహారం నగదు జమ చేయనున్నారు. మరో నెలన్నరలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా భూ యజమానులు ఈ పరిహారం మొత్తాన్ని తీసుకునేందుకు ససేమిరా అంటే ఆర్బిట్రేషన్ ప్రకారం మరోసారి పరిశీలించి తుది మొత్తాన్ని ఖరారు చేస్తారు. అప్పటికి కూడా ఆ మొత్తం తక్కువగా ఉందన్న కారణంతో తీసుకునేందుకు నిరాకరించే పక్షంలో కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఖాతాలో జమ చేస్తారు. ఖాతాల్లో జమ చేసిన తర్వాత భూముల దస్తావేజులను అధికారులు సేకరించి భూమి మ్యుటేషన్ చేయిస్తారు. దీంతో ఆ భూములు ఎన్హెచ్ఏఐ అధీనంలోకి వెళ్తాయి. -
గడ్డిభూముల్లో హాయ్.. హాయ్
సఫారీ.. ఈ మాట వింటే ఠక్కున గుర్తొచ్చేది దక్షిణాఫ్రికా. సవన్నాలుగా పిలిచే విశాలమైన పచ్చిక భూముల ప్రాంతం క్రూర మృగాలు, వన్యప్రాణుల ఆవాసం. కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో విహరిస్తుంటే ఆ ఆనందమే వేరు. అందుకే ఆ దేశం పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఈ విషయంలో భారత్ సైతం ఇప్పుడిప్పుడే చొరవ కనబరుస్తోంది. గడ్డిభూములున్న ప్రాంతాలను గుర్తించి పర్యావరణ, పర్యాటకాన్ని ద్విగుణీ కృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకీ ఆ గడ్డిభూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అక్కడి విశేషాలేంటి?మహారాష్ట్ర మొదటగా..పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పుణే(మహారాష్ట్ర) లోని అటవీ శాఖ షోలాపూర్‌లో గ్రాస్ ల్యాండ్ సఫారీ (గడ్డి భూముల్లో విహారయాత్ర)కి శ్రీకారం చుట్టింది. ఇక్కడి బోరామణి గ్రామ గడ్డి భూముల్లో తాజాగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ భూములు కృష్ణ జింకలు, తోడేళ్ళు, బెంగాల్ నక్కలు, అడవి పందులు, రంగురంగుల సీతాకోకచిలుక జాతులకు ఆవాసాలు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) ఉనికి ఇక్కడ కనిపిస్తుంది. వాటి సహజ ఆవాసాలను వాహనాల్లో సంచరిస్తూ వీక్షించే అవకాశాన్ని అటవీశాఖ కల్పిస్తోంది.రోజుకు రెండు సార్లు మాత్రమే..ఈ గ్రాస్‌ల్యాండ్ సఫారీ రెండు విడతల్లో ఉంటుంది. ఉదయం 6:30 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి 6:30 గంటల మధ్యలో విహరించేందుకు అనుమతిస్తున్నారు. వన్య ప్రాణులు, పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగించకుండా పరిమిత సంఖ్యలో వాహనాల్లో సంచరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని పంచడానికి అటవీ శాఖ రాత్రి పూట బసలను అందుబాటులో ఉంచింది. ఈ గడ్డిభూముల్లో సందర్శకులు సొంత వాహనాల్లో, అద్దెవాహనాల్లో విహరిస్తూ ఆస్వాదించే సౌకర్యం కల్పించింది.కర్బన శోషకాలు.. గడ్డిభూములు కర్బన ఉద్గారాలతో పాటు ఉదజని (కార్బన్ డయాక్సైడ్)ని శోషించి వాతావరణాన్ని నియంత్రించడంలో గడ్డిభూములది కీలక పాత్ర. కృష్ణ జింకలు, జింకల్లాంటి శాకాహారులు, తోడేళ్లు, నక్కల్లాంటి మాంసాహారులు పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషిస్తాయి. గడ్డిభూముల సంరక్షణ విషయానికి వస్తే..అడవులతో పోల్చి చూస్తే తక్కువే అని చెప్పొచ్చు. పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడటంలో ఇవి ఎంతో ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు, పరిశోధకులకు స్వేచ్ఛగా గడ్డిభూముల్లో విహరించే వీలు కల్పించడం ద్వారా వీటి సంరక్షణపై అవగాహన తీసుకురావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. 2024 జనవరిలో ప్రారంభంగడ్డిభూముల్లో సఫారీకి 2024 జనవరిలో పుణే, షోలాపూర్ ప్రాంతాల్లో తొలిసారిగా శ్రీకారం చుట్టారు. ఇక్కడ అటవీ రేంజ్ లోని గడిఖేల్, శిర్షుపాల్, సబ్లెవాడీ, పర్వాడీ పరిధిలో విశాలమైన పచ్చిక బయళ్లలో సఫారీ ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో గడ్డిభూములున్న ప్రాంతాల్లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. దీంతో స్థానికులకు ప్రత్యక్ష,ంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. శిక్షణ పొందిన స్థానిక గైడ్లకు రూ. వేలల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. -
మీ ఊరు కాదంటున్నారు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆ ఊరికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. నాలుగు తరాలుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఇళ్లు.. ప్రభుత్వ పాఠశాల.. చెరువు.. ఆయకట్టు కింద పొలాలూ ఉన్నాయి. అయినా, సరే ఇప్పుడిది మీ ఊరు కాదంటున్నారు అటవీ శాఖ అధికారులు. చెట్టు.. పుట్ట, ఇళ్లు, పొలాలన్నీ మీవి కావు. దీనిమీద మీకు హక్కులు లేవు. ఇది అటవీ శాఖకు చెందిన సంపద అని అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంతో కోల్పోయిన భూములకు వచ్చిన నష్ట పరిహారాన్ని కూడా వారి ఖాతాలో వేసుకున్నారు. అడుగు తీసి అడుగేయాలన్నా అనుమతి తీసుకోవాలంటున్నారు. ఇలా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నరజాముల తండా వాసులపై కొంతకాలంగా జులుం ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెంకు 20 కిలోమీటర్ల దూరంలో.. జాతీయ రహదారి పక్కనే ఉండడం ఈ తండాకు తంటాలు తెచ్చిపెడుతోంది. మారుమూల అటవీ ప్రాంతంలోని నరజాముల తండాలో 290 కుటుంబాలకు పైగా జీవిస్తున్నాయి. అందరూ సుగాలీలే. పశువులను మేపుతూ, కట్టెలు కొడుతూ యర్రగొండపాలెంలో అమ్ముతూ పొట్ట పోసుకుంటుంటారు. కొందరు ఉద్యోగాలు కూడా సాధించారు. అయితే, ఆదివాసీలకు జరిగే అన్యాయాన్ని సరిచేసే పేరుతో తెచ్చిన అటవీ హక్కుల చట్టం–2006 ఇప్పుడు వీరి నెత్తిన కత్తిలా వేలాడుతోంది. వేసవిలో మంచినీటి బోర్లు వేసుకోవడానికి లేదు.. పొలాలకు వెళ్లనీయరు.. జీవాలను మేపుకొనేందుకు అడవిలోకి వెళ్తే కేసులు పెడుతున్నారు.. పాములు, క్రూర జంతువుల నుంచి ఆత్మరక్షణకు గొడ్డలి తీసుకెళ్తే లాక్కుంటున్నారు. ఆఖరికి పశువులనూ స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు గ్రామంలోని మౌలిక సమస్యలను ఉద్దేశపూర్వకంగానే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రెండెకరాల పరిహారం అటవీ శాఖ ఖాతాలోకి.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో రెండు ఎకరాలు హైవే నిర్మాణంలో పోయింది. పరిహారం కోరితే అటవీ శాఖ భూమి అని అంటున్నారు. మా భూమికి వారు డబ్బులు తీసుకోవడం ఏం న్యాయం? – నరసింహనాయక్, నరజాములతండా గిరిజనులపై ఆంక్షలు పెరిగిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లమల అడవుల్లో జీవించే గిరిజనులపై ఆంక్షలు, దాడులు పెరిగిపోయాయి. వారిపై అక్రమ కేసులు బనాయించడం, ఇళ్ల నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం చేస్తున్నారు. కాయ కష్టంతో పండించిన పంటను అమ్ముకోనీయకుండా కూటమి ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతోంది. గిరిజనుల బాధలను గుర్తించిన వైఎస్ అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదుకున్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ పక్కా ఇళ్లు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజనులపై అటవీ అధికారులను ఉసిగొల్పుతోంది. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఈ దారుణాలు కనిపించడం లేదు. మొద్దు నిద్ర వీడి గిరిజన ప్రాంతాలను సందర్శించి స్థానికుల బాధలు తెలుసుకుని పరిష్కరించాలి. – తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, యర్రగొండపాలెంహైవేతో పెరిగిన సమస్యలు నాలుగేళ్ల క్రితం యర్రగొండపాలెం–హైదరాబాద్ రహదారి నేషనల్ హైవే 565 అయింది. మల్లాపాలం దాటాక 5 కిలోమీటర్ల నుంచి దావపల్లి వరకు 20.09 కిలోమీటర్ల మేర దండకారణ్యం ఉంది. అటవీ ప్రాంతానికి అవతల వరకు హైవే నిర్మాణమైంది. అనుమతులు రావడంతో ఇటీవల అడవిలోనూ పనులు మొదలుపెట్టారు. నరజాముల తండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు, పొలాలు హైవేలో పోయాయి. స్థానికులతో చర్చించకుండా, చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తండాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా అటవీ శాఖ కొట్టుకుని తీసుకుపోయింది. ఈ మేరకు నష్ట పరిహారం చెల్లించాలని గిరిజనులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఏమయ్యారు?నరజాముల తండాలో 400 ఎకరాల రెవెన్యూ స్థలం ఉంది. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 47 సెంట్ల నుంచి 10 ఎకరాల వరకు పొలాలకు పట్టాలు ఇచ్చారు. పాస్ పుస్తకాల ద్వారా గిరిజనులు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. 1972లో 250 ఎకరాలలో చెరువు నిర్మించగా ఆయకట్టు కింద 800 ఎకరాలు సాగవుతున్నాయి. 50 ఏళ్ల కిందటే ప్రభుత్వ పాఠశాల, అనుబంధంగా హాస్టల్ కూడా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయం నిరి్మంచారు. ఇలా అన్ని సౌకర్యాలను కల్పిoచినపుడు అటవీ అధికారులు ఎక్కడకు పోయారని గిరిపుత్రులు నిలదీస్తున్నారు. ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు కన్నతల్లిలాంటి ఊరిని కాపాడుకునేందుకు సుగాలీలు సిద్ధమవుతున్నారు. గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. వదిలి వెళ్లేది లేదని తెగేసి చెబుతూ.. ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. తమ ఇళ్లు, పొలాలను రెవెన్యూ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. -
సుపరిపాలనకు దోవ
‘సివిల్ సర్వీసు అధికారికి ఎంత తెలుసనేది కాదు... ఆ అధికారి ఎంత జాగ్రత్తగా విధి నిర్వహణ చేస్తారన్నదే అసలైన పరీక్ష’ అన్నారు ప్రథమ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ సైతం ఈ అధికారుల గురించి చెప్పిన మాటలు వారి బాధ్యతను గుర్తుచేస్తాయి. సివిల్ సర్వీసులకు ఎంపికైనవారు స్వతంత్రంగా, నిజా యితీగా, నిర్భీతితో వ్యవహరించగలిగితేనే పటిష్టమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిలషించారు. కానీ ఇప్పటికీ ఆచరణలో సమస్యలు తప్పడం లేదు.ఈమధ్య తమ ముందు కొచ్చిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఐఏఎస్‌ల తీరుపై కటువుగా వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌లు తరచు తాము ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకన్నా అధికులమని భావిస్తారనీ, అది సరికాదనీ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిలతో కూడిన ధర్మా సనం తెలిపింది. సివిల్ సర్వీసుల రూపకర్తలు ఇలాంటి అంతరాలను చూడలేదు. విధి నిర్వహణకు సంబంధించినంత వరకూ ఈ సర్వీసుల్లోని వారు దేశాభివృద్ధినీ, భద్రతనూ కాంక్షించి అందుకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ తమ విధులు నిర్వర్తించాలని కోరుకుంది. స్వభావరీత్యా విధి నిర్వహణ భిన్నంగా ఉండొచ్చు. ఇందులో ఎక్కువ, తక్కువ అనే సమస్యే రాకూడదు. సాధారణంగా సివిల్ సర్వీస్ వైపు వచ్చే యువతీయువకులకు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా ఆగ్రహం ఉంటుంది. వాటి పరిష్కారం తమవల్ల సాధ్యమేనన్న విశ్వాసం ఉంటుంది. సంపాదనే ప్రధానమనుకుంటే ఏ బహుళజాతిసంస్థకో మేనేజర్‌గా లేదా సీఈవోగా వెళ్లవచ్చు. సివిల్ సర్వీసుల్లోకన్నా అత్యధిక జీతం, ఇతర సదు పాయాలూ, ఆస్తుల సంపాదన ఉంటాయి. పైగా అక్కడ అధిక శ్రమ, పని ఒత్తిడి ఉండవు. కానీ సివిల్ సర్వీస్‌లు అలా కాదు. ప్రభుత్వంలో ఎక్కడో కిందిస్థాయి అధికారి తీసుకునే పొరపాటు నిర్ణయం ఆ ప్రాంతంలోనో, ఆ జిల్లాలోనో, కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలోనో కల్లోలానికి దారి తీయొచ్చు. ప్రభుత్వ పథకాల అమలులో చోటుచేసుకునే చిన్న లోపం కూడా సాధారణ పౌరులను కలవరపరిచి వారు ప్రాణం తీసుకునే ప్రమాదం కూడా ఉండొచ్చు. లేదా అధికారిపై దౌర్జన్యానికి దిగొచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం, అనుకోని సమస్య ఎదురైతే సమయస్ఫూర్తితో వ్యవహరించటం తప్పనిసరి. అలాగని ఈ అంతరాలు లేవని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఐఏఎస్‌లు మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత ఐపీఎస్‌లు వస్తారు. ఇది పాలనా సౌలభ్యం కోసం చేసిన ఏర్పాటు. స్వల్ప వ్యత్యాసంతో ఇద్దరి ప్రారంభ వేతనాలూ... ఆరోగ్యం, ఆవాసం, సెలవులు, ఇతర సదుపాయాలూ ఒకేలావుంటాయి. మొదటి మూడు నాలుగు నెలలు ఉమ్మడిగా శిక్షణనిచ్చినా బాధ్యతలరీత్యా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు వేర్వేరుచోట్ల ప్రత్యేక శిక్షణనిస్తారు. ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో బాధ్యత వహించే ఐఏఎస్ అధికారి అక్కడి పాలనా వ్యవస్థను పటిష్టపరచటానికి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. ఎవరిని ఏ స్థానంలో పనిచేయించాలో, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా అక్కడి ప్రజల అభ్యున్నతికి ఏమేం చేయవచ్చునో అధ్యయనం చేయటం, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం కూడా ఐఏఎస్ అధికారుల బాధ్యత. ఐఏఎస్‌లకు భిన్న శాఖల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఐపీఎస్లకుశాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. దానికి అనుగుణంగా వారికి ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. అలాగే ఐఎఫ్ఎస్లు అడవుల పరిరక్షణలో, భద్రతలో, వాటి నిర్వహణలో అవగాహన పెంచుకుంటారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, సహజ వనరుల సంరక్షణ వారి ప్రధానాంశాలు. అందరి అంతిమ ధ్యేయమూ మెరుగైన పాలనా వ్యవస్థను ప్రజల అందుబాటులోకి తీసుకు రావటమే అయినప్పుడు ఎవరికీ ఆధిక్యతా భావన ఉండకూడదు. అటువంటి మనస్తత్వం పాలనపై దుష్ప్రభావం కలిగిస్తుంది. ప్రభుత్వ తీరుతెన్నులపై విమర్శలకు తావిస్తుంది. కానీ దురదృష్టమేమంటే, ధర్మాసనం చెప్పినట్టు చాలాచోట్ల ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్ బాధ్యతల్లోవున్న ఇద్దరు మహిళా అధికారులు సామాజిక మాధ్యమాల్లో ఎలా దూషించుకున్నారో ఎవరూ మరిచిపోరు. అప్పట్లో ప్రధాని కార్యాలయం ఆనాటి ముఖ్యమంత్రిని వివరణ కోరింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్‌లో అడవుల సంరక్షణ, అభివృద్ధి అవసరాలు సమతౌల్యం చేయటానికి ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం కావటానికి సంబంధించి దాఖలైన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులిద్దరి మధ్య తలెత్తిన వివాదం ప్రస్తావనకొచ్చినప్పుడు న్యాయమూర్తులు ఐఏఎస్‌ల తీరును నిశితంగా విమర్శించారు. ఒకచోట పనిచేయాల్సి వచ్చినప్పుడు వివాదాలు తలెత్తటం అసాధారణమేమీ కాదు. కానీ వ్యక్తిగత స్థాయికి వివాదాల్ని దిగజార్చటంవల్ల వ్యవస్థ దెబ్బతింటుంది.చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలుంటున్నాయి. వీటికి ఎక్కడో ఒకచోట బ్రేక్ పడాలి. తాత్కాలిక సర్దుబాట్లుకాక మరోసారి సమస్య తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పరిచిన అధి కార యంత్రాంగం కాస్తా అంతర్గత కలహాల్లో మునిగితే వ్యవస్థ నష్టపోతుంది. అంకితభావంతో, కర్తవ్యనిష్టతో పనిచేసిన ఎస్.ఆర్. శంకరన్, బి.డి. శర్మవంటివారు ఇవాళ్టికీ చిరస్మరణీయులు. అధికారులకు వారు ఆదర్శం కావాలి. అప్పుడు అహంభావానికి తావుండదు. -
నల్లమల.. వన్యప్రాణుల ఖిల్లా
ప్రకృతి అందాలకు నల్లమల అటవీ ప్రాంతం ఆలవాలమైంది. ఎటు చూసినా ఆకాశాన్నంటే చెట్లు, బెబ్బులి గర్జనలు, నెమళ్ల నాట్యాలు, అరుదైన పక్షుల కిలకిలా రావాలు, అటు నుంచి ఇటు పరిగెత్తే జింకలు, సెలయేళ్లు, పర్యాటక ప్రదేశాలకు నల్లమల అటవీ ప్రాంతం నెలవుగా మారింది. ప్రతి ఏడాది మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రజలకు వణ్యప్రాణుల సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు.మార్కాపురం:నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో 87కు పైగా రాయల్ బెంగాల్ టైగర్లు, సుమారు 400 కు పైగా చిరుతలు తిరుగుతున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో దుప్పులు, జింకలు, నీల్గాయ్లు, ఎలుగుబంట్లు ఉన్నాయి.వీటితోపాటు ఆకాశంలో 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ క్షణాల్లో భూమిమీద తిరిగే వన్యప్రాణులను తినే అరుదైన క్రస్టడ్ హక్ ఈగల్ (నల్లపాముల గద్ద), షార్టు టోడోస్ స్నేక్ఈగల్, హనీబజర్, క్రస్టడ్ సర్పెంట్ ఈగల్‌లు సంచరిస్తున్నాయి. ఇక రష్యా నుంచి 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి నల్లమలకు వచ్చే మాన్టెగ్యూష్ హారియర్, పాలిడ్ హ్యారియర్ తదితర పక్షులకు కూడా నల్లమల ప్రాంతం నివాసంగా మారింది. మార్కాపురానికి చుట్టుపక్కల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దదోర్నాల, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు తదితర మండలాల్లో అటవీ సమీప గ్రామాలున్నాయి. పెద్దదోర్నాల మండలంలోని నల్లగుంట్ల, వై చర్లోపల్లి, తుమ్మలబైలు, శ్రీశైల శిఖరం, బొమ్మలాపురం, ఘాట్‌రోడ్డు, అర్ధవీడు మండలంలోని వెలగలపాయ, మాగుటూరు తాండ, గన్నెపల్లి, లక్ష్మీపురం, దొనకొండ, మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల తదితర గ్రామాల సమీపాల్లోకి వన్యప్రాణులు తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు సంచరిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్పిట్లు ఏర్పాటుచేసి అధికారులు నీటి సమస్య తీర్చారు. నల్లమల పరిధి పెరిగిపోతోంది. గతంలో ఏపీలోని ప్రకాశం, గుంటూరు, కర్నూల్, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ తదితర జిల్లాలతో అనుసంధానంగా ఉండగా ఇప్పుడు శేషాచలం అడవులను కలుపుతూ ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు), శేషాచలం అడవులను కలిపి టైగర్ కారిడార్ ఏర్పాటైంది. నల్లమల అడవిలోని పెద్దపులులు కడప మీదుగా వనిపెంట, ఒంటిమిట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న శేషచలం అడవుల్లో కూడా సంచరిస్తున్నాయి. దీంతో నల్లమల పరిధి 8 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 16 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 1000 మంది సిబ్బందిని, 85 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణకు తీసుకునే చర్యల వలన పులుల సంఖ్య పెరగడం విశేషం. ఆకట్టుకుంటున్న జంగిల్ సఫారీ..దోర్నాల నుంచి శ్రీశైలం మధ్య అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జంగిల్ సఫారీని చూడొచ్చు. అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 25 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. జింకలు, నెమళ్లు, పలురకాల పక్షిజాతులు కనిపిస్తాయి. ఇందులో పులికుంట వద్ద వ్యూ పాయింట్ వద్ద కాసేపు వాహనాన్ని ఆపుతారు. పెద్దపులులు, చిరుతలు ఇక్కడికి తరచుగా వచ్చి నీళ్లు తాగుతాయి. ఇక కొండ చిలువలు, పెద్ద పెద్ద చెట్లకు చుట్టుకుని కనిపిస్తాయి. జంగిల్ సఫారీ అద్భుతంనల్లమల అటవీ ప్రాంతంలో దోర్నాల నుంచి శ్రీశైలం మధ్యలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ చాలా అద్భుతం. విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరూ సెలవు రోజుల్లో పిల్లలను తీసుకుని జంగిల్ సఫారీకి వెళితే అన్నీ రకాల వన్యప్రాణులను మనం చూడవచ్చు. – జీఎల్ రమేష్ బాబు, టీచర్ మార్కాపురం -
ఆలివ్ రిడ్లే..బతకాలిలే..
సాగర గర్భంలో తల్లులు, ఎక్కడో దూరంగా తీరంలో పిల్లలు.. ఆ తల్లీపిల్లలు కలుసుకోవడానికి సవాలక్ష ఆటంకాలు. ప్రకృతి వైపరీత్యాలు, జంతువుల దాడులు, ఆకతాయిల వికృత చేష్టలు అన్నీ తట్టుకుని నిలబడితేనే ఆ పిల్లలు కడలి గర్భంలోకి వెళ్లగలవు. లేదంటే అండంలో ఉన్నప్పుడే ఆయుష్షు తీరిపోతుంది. ఇలాంటి ఆపత్కాలంలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లల ఆయుష్షుకు అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు అండగా నిలబడుతున్నారు. తీరంలో గుడ్లను సంరక్షించి అవి పొదిగి పిల్లలు బయటకు వచ్చే వరకు జాగ్రత్తగా చూసి.. బుల్లి బుల్లి తాబేలు పిల్లలు ఆనందంగా సముద్రంలోకి వెళ్లడాన్ని మురిపెంగా చూస్తున్నారు. సోంపేట: సముద్రంలో లక్షలాది జీవులు నివాసం ఉంటాయి. అందులో సముద్రానికి మేలు చేసే జాతుల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఒక జాతి. ఆ రకం తాబేళ్లు గుడ్లు పెట్టుకునేందుకు మన తీరాలను అనువుగా ఎంచుకున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సముద్ర తీరానికి వచ్చి తీరంలో గొయ్యి తవ్వి గుడ్లు పెడతాయి.అనంతరం వాటిని కప్పేసి సముద్రంలోకి వెళ్లిపోతాయి. తీరంలో గుడ్లు పెట్టడానికి అనువైన స్థలం చూసుకుని గుడ్లు పెడుతుంటాయి. అలా వచ్చినప్పుడు బోట్లు తగిలి కొన్ని తాబేళ్లు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అంతరించి పోయే ప్రమాదంలో ఉండడంతో అటవీశాఖ పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. 50 నుంచి 150 గుడ్లు సాధారణంగా ఈ జాతి తాబేళ్లు 50 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంటాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు తీరానికి చేరుకుని ఇసుకలో గోతులు తవ్వి వాటిలో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు సముద్రంలోకి వెళ్లిపోతాయి. ప్రత్యేక జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు చాలా ప్రత్యేకమైనవి. వీటికి స్థిర నివాసం ఉండదు. రెండు అడుగుల పొడవు, సుమారు 150 కిలోలు పైన బరువు ఉండే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డిసెంబర్ నుంచి మార్చి రెండో వారం వరకు ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయి. గుడ్లకు సంరక్షణ.. తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిపోయాక శ్రీకాకుళం జిల్లాలో అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ సౌజన్యంతో గుడ్లను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం మూడు డివిజన్ల పరిధిలో 16 సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలోని సోంపేట మండలం బట్టిగళ్లూరు, బారువ పేట, ఇస్కలపాలేం, కవిటి మండలం కళింగపట్నం, బట్టివాని పాలేం, సీహెచ్ కపాçసుకుద్ది, ఇచ్ఛాపురం మండలం డొంకూరులో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం జిల్లాలో 1,59,403 గుడ్లు సేకరించి 1,44,981 పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువ పిల్లలను తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ డివిజన్ల పరిధిలో 452 నెట్లు ఏర్పాటు చేసి 53,400 గుడ్లు సేకరించారు. సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయంలో ఉంచి గుడ్లు పిల్లలుగా మారిన తర్వాత వాటిని సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెడతారు. మత్స్యకారులు సహకరించాలి తాబేలు గుడ్లను సంరక్షించడానికి అటవీ శాఖా ధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులకు మత్స్యకారులు సహకరించాలి. అంతరించే స్థితి లో ఉన్న ఆలివ్‌రిడ్లే తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గుడ్లను సంరక్షించే బాధ్యత అటవీ శాఖ తీసుకుంటుంది. గత ఏడాది సుమారు లక్షా యాభై వేల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టాం. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. – నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి గుడ్లను సంరక్షించడం ఆనందం గత కొన్నేళ్లుగా అటవీ శాఖాధికారుల సౌజన్యంతో ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లు సేకరించి, వాటిని పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడం ఆనందంగా ఉంది. జిల్లాలో మత్స్యకారులు సహాయ సహకారాలు అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. – కె.సోమేశ్వరరావు, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ -
ఇలాగేనా రెస్క్యూ?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ఓ అడవిదున్న తప్పిపోయి వచ్చింది. అయితే దాన్ని సజీవంగా పట్టుకునేందుకు చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. పది రోజులపాటు ఈ దున్న కదలికలను ఆ జిల్లా పరిసరాల్లో అటవీశాఖ అధికారులు గుర్తించినా, జీవించి ఉండగా పట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే జాతికి చెందిన ఆ అడవిదున్న (ఇండియన్ బైసన్) మృతి చెందడం పట్ల పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేశారు. అరుదైన జంతువులు, వన్య›ప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ సన్నద్ధత, సంసిద్ధత, పరిమితులను ఈ ఘటన స్పష్టం చేస్తోందంటున్నారు. గతంలోనూ ఓ చిరుత, కొన్ని జంతువుల రెస్క్యూలో అటవీ అధికారులు, సిబ్బంది విఫలమైన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రెస్క్యూలో అటవీశాఖకు ఓ స్పష్టమైన విధానం, కార్యాచరణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆపదలో ఉన్న జంతువులు, వన్యప్రాణులను కాపాడేందుకు, వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ) ఏర్పాటు చేస్తున్నామంటూ గతంలో చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అసలేం జరిగిందంటే..మేత, నీటికోసం వెతుక్కుంటూ దారితప్పిన దున్న చౌటుప్పల్ మండలం చిన్నకోడూరు గ్రామ సరిహద్దుల్లో కొందరికి కనిపించింది. ఎక్కడ జనవాసాల్లోకి వస్తుందోననే భయంతో దాన్ని బైక్‌లు, ఇతర వాహనాలపై నాలుగు గంటలపాటు వెంబడించారు. అప్పటికే ఆకలి, దప్పికతో ఉన్న దున్న పరిగెడుతూ డీ హైడ్రేషన్‌కు గురైంది. నోటి నుంచి నురగలు కక్కుతూ దయనీయస్థితికి చేరింది. దాన్ని రక్షించి, వైద్యం అందించి సురక్షిత ప్రాంతానికి తరలించే రెస్క్యూ టీమ్ అక్కడికి ఆలస్యంగా చేరుకుంది. వరంగల్ జూ నుంచి రెస్క్యూ టీమ్, నెహ్రూ జూపార్కు నుంచి వచ్చిన వెటరేరియన్ మత్తుమందు ఇచ్చి దున్నను నిలువరించే ప్రయత్నం చేశారు. వాహనంలోకి ఎక్కించి దానిని చికిత్స కోసం తరలిస్తున్న క్రమంలో అది అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు.ఉన్నవి రెండు బృందాలే..రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌లోని నె హ్రూ జూపార్క్, వరంగల్‌లోని కాకతీయ జూపార్క్‌లో తాత్కాలిక ఏర్పాట్లతో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. వీటికి రెస్క్యూ వెహికిల్స్, వెటరేరియన్లు ఉన్నా రు. రాష్ట్రంలో ఎక్కడ వన్యప్రాణులు, అటవీ జంతువులను కాపాడాల్సి వచ్చి నా.. ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే అక్కడి నుంచి వాహనం, సిబ్బందిని పంపిస్తున్నారు. అయితే ఈ బృందాలు పాత బడిన వాహనాలు, పరికరాలు, సామగ్రి తోపాటు ఏవో తాత్కాలిక పద్ధతులతో నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడేం చేయాలి?» రాష్ట్రంలో వన్యప్రాణులు, జంతువు లకు సంబంధించి ఎక్కడైనా అనుకో ని సంఘటన లేదా ఆపద ఎదురైనా, అడవుల్లో అగ్నిప్రమాదాల వంటి ఘ టనలు జరిగినా త్వరితంగా స్పందించేలా బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలి. » పాతబడిన వాహనాలను తొలగించి, కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలి. ట్రాంకిలైజర్ గన్స్, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలి. » రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలి. » జంతువుల తీరుపై వెటర్నరీ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించాలి. -
లంచం ఇస్తేనే ఆక్వా సాగు.. అటవీ అధికారుల వీడియో వైరల్
-
రాయల నాటి రాజసానికి చిహ్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చట్టూరా ప్రకృతి సోయగాలు.. కనువిందు చేసే జలపాతాలు, ప్రాచీన పుణ్యక్షేత్రాలు, కళ్లు తిప్పుకోనివ్వని శిల్పాలతో నిర్మాణాలు, తిరుమల గిరులను పోలిన ఎత్తయిన పర్వత శ్రేణులు.. అడుగడుగున కనిపించే అలనాటి రాచ మందిరాలు.. ఒకటేమిటి ఎన్నో విశిష్టతలతో నిండిన ఉదయగిరి ప్రాంతం పర్యాటక శోభకోసం ఎదురుచూస్తోంది. గత ప్రభుత్వంలో సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను అటవీశాఖ ఎకో టూరిజం స్పాట్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపింది .. ఈ లోపే ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి దుర్గానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కోండ నవాబులు ఏలిన ఈ ప్రాంతం ఒకప్పుడు వైభవోపేతంగా విలసిల్లింది. కాలక్రమేణా తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రస్తుతం అలనాటి రాచరిక పాలనకు గుర్తులుగా కనిపించే మొండి గోడలు, శిథిల రాజభవనాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి వందకిలోమీటర్ల దూరంలో, నీటి వసతిలేని మెట్ట ప్రాంతంగా ఉదయగిరి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. తొలి సూర్యకిరణాల పడే గిరి.. ఉదయగిరి కోట సముద్ర మట్టానికి 755 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత గరిష్టంగా 20 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఉదయగిరి కోట 5 కి.మీ వ్యాసార్ధంతో తిరుమల కొండను పోలి ఉంది. పచ్చని పచ్చిక బయళ్లతో, వన్యప్రాణులతో ఇక్కడ ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ ఉంటుంది. ఉదయ సూర్యుని తొలికిరణాలు ఈ కొండపైనే ముందుగా పడుతుండటంతో దీన్ని ఉదయగిరిగా విజయనగరం రాజలు పేరుపెట్టారు. ఈ ఉదయగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు 18 నెలలు ఉండి పాలన సాగించారు.చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి విజయనగర రాజులు ఉదయగిరి ప్రాంతంలో దేవాలయాలు, కోనేరులు నిరి్మంచారు. శ్రీకృష్ణ దేవరాయలు నిరి్మంచిన ఆలయాలు, నవాబులు నిర్మించిన మసీదులు, రాణీ మందిరాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఫిరంగి కోటలు, కోనేరులు, సొరంగ మార్గం నేటికీ ఉన్నాయి. ఉదయగిరి దుర్గం కింద పట్టణంలో తల్పగిరి రంగనాయకులస్వామి దేవాలయం, కృష్ణాలయం, కల్యాణమండపం నేటికీ చూపరులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరులో ఉన్న రంగనాయకుల స్వామి విగ్రహం ఉదయగిరి నుంచి తరలించిందే కావటం విశేషం. శ్రీకృష్ణ దేవరాయల పాలనకు గుర్తుగా ఉదయగిరి ట్యాంక్‌బండ్ సమీపంలో కల్యాణ మండపం, కోనేరు అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటిచెబుతాయి. ఉదయగిరి నుంచి బండకిందపల్లికి వెళ్లే ఘాట్‌రోడ్డులో పాదచారుల కోసం రాతిలో తవ్విన బావి నేటికీ తానాబావిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం బ్రిటిష్ పాలనలో స్టేట్ దొర నిరి్మంచిన ప్రార్థనా మందిరం, తహసీల్దారు కార్యాలయ భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు ఉదయగిరికి 33 కి.మీ దూరంలో అత్యంత ప్రాచీనమైన, అతి శక్తివంతమైన ఘటిక సిద్ధేశ్వరం శైవక్షేత్రం ఉంది. అగస్త్య మహాముని తపోపీఠమైన ఈ క్షేత్రం శ్రీకృష్ణ దేవరాయలకు యుద్ధకాలంలో దుర్గంకు దారి చూపించింది. సిద్ధేశ్వరానికి అతి సమీపంలో ఉన్న బూసానాయుడు కోటను అభివృద్ధి చేయవచ్చు. సిద్ధేశ్వరం నుంచి మరో 30 కి.మీ దూరంలో ప్రకృతి సోయగాల నడుమ పయనిస్తూ ముందుకు వెళితే 7, 8 శతాబ్దాల్లో పల్లవుల కాలంలో అద్భుతమైన శిల్పాకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఒకే రాతిపై దేవాలయం, ద్వారపాలకులు, శివలింగాలు, నందీశ్వరుడు కొలువైన భైరవకోన ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా జాలువారే జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.. అక్కడి నుంచి మరో 24. కి.మీ ముందుకు వెళితే నారాయణస్వామి ఆలయం ఉంది. అక్కడి నుంచి మరో పది కి.మీ దూరంలో హనుముని కొండ ఉంది. అక్కడి నుంచి మరో 25 కి.మీ ముందుకు వెళితే వెంగమాంబ దేవాలయాన్ని సందర్శించవచ్చు. అభివృద్ధిని మరచిన పాలకులు ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. గత ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు ఆచరణలో విఫలమయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆనాటి కేంద్ర మంత్రులు అనంతకుమార్, సుష్మాస్వరాజ్‌ను ఉదయగిరి పిలిపించి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అప్పట్లో ఉదయగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో ఆ హామీలు నెరవేరలేదు.ప్రతిపాదనలు చేసి.. తిరుమల కొండలను మరిపించే పర్వతశ్రేణులు, పచ్చని ప్రకృతి రమణీయతను పుణికి పుచ్చుకున్న సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం అటవీశాఖ ద్వారా ప్రణాళిక సిద్ధం చేయించింది. చిన్నపిల్లల ఆటలకు అనువుగా పార్కులు, తాగునీటి వసతి, సేదతీరేందుకు గదులు, గార్డెన్స్, జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, ప్రకృతి అందాలు వీక్షించేందుకు వాచ్ టవర్లు, సోలార్ షెడ్స్, లైట్లు ఇలా ఒక్కో ప్రాంతంలో 45 రకాల పనులకు రూ.2.78 కోట్ల చొప్పున అంచనాలతో గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు పంపించారు. ఆసమయంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మనసుపెట్టి పనులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.వెయ్యేళ్ల చరిత్ర ఉదయగిరి దుర్గానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలు కాగితాలకేపరిమితమవుతున్నాయి. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్దిచేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్దిచెందుతుంది.– ఎస్కె.ఎండి.ఖాజా, చరిత్ర కారుడు, ఉదయగిరి -
ఆపరేషన్.. పెరంబులేషన్
తిరుపతి సిటీ: చిరుత జాడ కోసం పెరంబులేషన్ పేరుతో తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, వర్సిటీ సెక్యూరిటీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వీయూలో రెండు నెలలుగా చిరుత సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు వర్సిటీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు అమర్చి చేయి దులుపుకున్నారు. అయితే మంగళవారం సాయంత్రం వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో చిరుత విద్యార్థుల కంట పడింది. వెంటనే వారు అటవీ, వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. ఉలిక్కిపడిన అధికారులు చిరుతకు పిల్లలు ఉంటేనే తరచూ వర్సిటీలో సంచరిస్తోందన్న అనుమానంతో బుధవారం వంద మందితో నాలుగు బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయినా చిరుత పిల్లల ఆచూకీ లభించలేదు. జిల్లా ఉప అటవీశాఖ అధికారి నాగభూషణం వర్సిటీలో మీడియాతో మాట్లాడుతూ చిరుతను బంధించేందుకు నాలుగు రోజుల ముందు బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదన్నారు. వర్సీటీ రిజిస్ట్రార్ భూపతినాయుడు, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ హరిక్రిష్ణ, అటవీశాఖాధికారులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని చిరుత మృతి
చిన్నశంకరంపేట(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత పులి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. గురువారం రాత్రి నార్సింగి–వల్లూర్ మధ్యన నర్సరీ సమీపంలో రహదారిపై తీవ్రగాయాలతో పడి ఉన్న చిరుతను వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యం కోసం చిరుతను తరలించేందుకుప్రయత్నిస్తున్నా క్రమంలో మృత్యువాత పడింది. మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి జోజీ, రామాయంపేట రేంజీ ఆఫీసర్ అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ముందు ఒక వాహనం ఢీకొన్న అనంతరం చిరుత పరుగెత్తేందుకు ప్రయతి్నంచిన క్రమంలో మరో వాహనం ఢీకొని ఉండవచ్చని, నడుముకు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో అది మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని నడిరోడ్డుపై చిరుత మృతిమెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో NH-44పై రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనంనడుము విరిగి పలు చోట్ల గాయాలు కావడంతో నడిరోడ్డు పైనే చిరుత మృతి pic.twitter.com/KpHzjenKCw— Telugu Scribe (@TeluguScribe) January 31, 2025 -
జగిత్యాలలో పులి సంచారం..భయాందోళనల్లో ప్రజలు
సాక్షి,జగిత్యాలజిల్లా:జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పులి తిరుగుతోందన్న ప్రచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులి జనవరి 23న గుండు బాబు అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసింది. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.ఎంత గాలించినా పెద్దపులి ఆచూకీ దొరకలేదు. తాజాగా పులి అడుగులు కనిపించడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. అధికారుల పరిశీలనలో అవి పులి అడుగులుగానే గుర్తించారు. పులి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి అడవుల వైపు వెళ్లినట్టుగా అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండ: ఆ సినిమా చూసి..మృతదేహం మాయం చేశాడు -
446 కిలోల ఎర్రచందనం స్వాధీనం
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): అక్రమంగా తరలిస్తున్న 446 కిలోల ఎర్రచందనాన్ని ఆదివారం తెల్లవారుజామున తిరుపతి జిల్లాలో అటవీ శాఖ సిబ్బంది స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారంటూ తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో తిరుపతి అటవీ క్షేత్ర అధికారి, సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున రేణిగుంట మండలం మాముండూరు సౌత్ బీటు వద్ద తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో టయోటా క్వాలిస్ వాహనం అతివేగంగా రావడాన్ని గమనించిన సిబ్బంది.. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ అందులోని దుండగులు వాహనాన్ని వదిలేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వాహనంలో 446 కిలోల బరువున్న 15 ఎర్రచందనం దుంగలను అధికారులు గుర్తించారు.వెంటనే ఎర్రచందనంతో పాటు వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో అటవీ క్షేత్ర అధికారి సుదర్శన్‌రెడ్డి, గౌస్ఖరిమ్, శరవన్ కుమార్, సుబ్రమణ్యం, జాన్ శామ్యూల్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
మత్స్యకారుల వలలు తగులబెట్టిన ఫారెస్ట్ అధికారులు
నాగార్జునసాగర్: అనుమతి లేకుండా కృష్ణానది తీరంలో నివాసం ఉండొద్దని అటవీశాఖ అధికారులు మత్స్యకారులను హెచ్చరించి, వారు వేసుకున్న గుడిసెలను తొలగించి వలలను తగులబెట్టారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది తీరం వెంట పుట్టీలనే గృహాలుగా మార్చుకొని గత 50 ఏళ్లుగా 2 తరాల వారు 10 వేల మత్స్యకారుల కుటుంబాలు చేపలు పట్టుకొని జీవనోపాధి పొందుతున్నాయి. అయితే ఎలాంటి హెచ్చరికలు చేయకుండా అటవీ అధికారులు తమ గుడిసెలు తొలగించి వలలు తగలబెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సుమారుగా రూ.8 లక్షల మేర నష్టపోయినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. -
ఆకలితోనే.. జనావాసాల్లోకి చిరుతలు
నల్లమల అటవీ అంతర్భాగంలో ఉన్న ప్రధాన శైవాలయ పట్టణాలైన శ్రీశైలం, మహానందిలో తరచూ చిరుత పులులు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా శ్రీశైలం పాతాళగంగ మార్గంలో ఒక అర్చకుడి ఇంట్లో రాత్రి పూట చిరుత తిరుగాడటం ఆందోళన రేకెత్తించింది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. చిరుతలు అడవులలో అత్యంత ఇష్టపడే ఆహార జంతువు అడవి పంది, దాని పిల్లలు. ఒక ఈతకు పదికి పైగా పిల్లలను ఈనే అడవి పందుల సంఖ్య నియంత్రణలో ఉంచడానికి ప్రకృతి చేసిన ఏర్పాటే చిరుత ఆహారపు అలవాటు. శ్రీశైలం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇవి పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటి సంఖ్య హఠాత్తుగా తగ్గిపోయింది. దీంతో తరువాతి ఆహార ప్రాధాన్యత అయిన ఊరకుక్కల కోసం చిరుతలు శ్రీశైలం, సున్నిపెంటల వైపు రాసాగాయి. మరోపక్క శ్రీశైలం ఆలయ పట్టణంలో కుక్కల సంఖ్య పెరగడంతో ఆలయం అధికారులు వాటిని పట్టి, దూరంగా వదలి పెట్టారు. కుక్కలూ లభించకపోవడంతో చిరుత పులులు పెంపుడు కుక్కల కోసం ఇళ్లలోకి వస్తున్నాయి. – ఆత్మకూరు రూరల్అడవి పందులకేమైంది? నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో అడవి పందులు హఠాత్తుగా చనిపోవడం మొదలైంది. అడవిలో పందుల మృత కళేబరాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండడంతో ఎన్ఎస్టీఆర్ వన్యప్రాణి వైద్య నిపుణులు వాటికి పోస్ట్‌మార్టం చేశారు. కొన్ని శాంపిళ్లు ల్యాబ్‌లో పరిశీలించగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ (ఏఎస్ఎఫ్వీ) కారణమని తేలింది. శ్రీశైలం ఆలయ పట్టణానికి ఆనుకుని ఉండే సున్నిపెంట గ్రామంలో ఉన్న పెంపుడు పందుల ఫారాల నుంచి ఈ వైరస్ అడవి పందులకు సోకినట్లు తేలింది. బెంగళూరు వంటి నగరాల నుంచి పెంపకానికి తెచి్చన సీమ పందులలో ఉన్న ఏఎస్ఎఫ్ వైరస్ తొలుత వారి ఫారాలు, సమీపంలో ఉన్న ఊర పందులకు సోకింది. అవి అడవిలో ఆహారానికి వెళ్లినప్పుడు అడవి పందులకు సోకినట్లు చెబుతున్నారు.ఏమిటీ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ఏఎఫ్ఎస్వీ అన్నది ఆస్ఫరి్వరిడే కుటుంబానికి చెందిన ఒక పెద్ద డబుల్ స్టాండర్డ్ డీఎన్ఏ వైరస్. ఉప సహారా ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ఈ వైరస్ పేలు, పందులు, బుష్పిగ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకిన పందులు అంతర్గత రక్తస్రావంతో (ఇంటర్నల్ బ్లీడింగ్) కూడిన జ్వరంతో మరణిస్తాయి. ఇది మానవులకు సోకదు.వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట 2003 డిసెంబర్ చివర్లో ఇది బయటపడింది. వెంటనే పశు సంవర్ధకశాఖ రంగంలోకి దిగింది. ప్రభుత్వం శ్రీశైలానికి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో మెడికల్ ఎమర్జెన్సీ విధించింది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (యానిమల్ హజ్బెండరీ) దృష్టికి కూడా వెళ్లింది. దీంతో శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు, చిన్నారుట్ల, నెక్కంటి, పాలుట్ల, పెచ్చెర్వు, తుమ్మలబయలు వంటి గిరిజన ప్రాంతాలను వైరస్ ఇన్ఫెక్టెడ్ ఏరియాగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న పందుల ఫారాలను తొలగించారు. ఊర పందులను దూరప్రాంతాలకు తరలించారు. చనిపోయిన అడవి పందుల కళేబరాలను తగలబెట్టడం ద్వారా వైరస్ విస్తరించకుండా చేయగలిగారు. దీంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. సంవత్సర కాలంగా చిరుత పులులు ఎక్కువగా జనవాసాల్లోకి వస్తుండటంతో ఇప్పుడు ఈ వైరస్ విషయం బయటకు వచి్చంది.ఆహారం కోసమే చిరుతలు ఊర్లోకి.. చిరుతలు అడవి పంది పిల్లలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్‌తో అవి ఎక్కువగా చనిపోవడంతో రెండో ప్రాధాన్యత అయిన కుక్కల కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ క్రమంలోని శ్రీశైలం, సున్నిపెంటలోకి తరచూ వస్తున్నాయి. – వి.సాయిబాబా, డిప్యూటి డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరు వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగాం అడవి పందులు పెద్ద సంఖ్యలో చనిపోవడానికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ కారణమని ఉన్నతాధికారులతో కలిసి చేసిన పరిశోధనలలో తేలింది. జనావాసాల్లో ఉన్న పందులలో కూడా మరణాలు కనిపించడంతో ఇది పూర్తిగా వాటివల్లే విస్తరించిందని స్పష్టమైంది. అన్నిరకాల చర్యలు తీసుకుని వైరస్ వ్యాప్తిని నియంత్రించ గలిగాం. ఈ వైరస్ గాలిలో మూడు సంవత్సరాల వరకు జీవించ గలుగుతుంది. ఆ తర్వాత వాతావరణంలో వేడికి చనిపోతుంది. – డాక్టర్ జుబేర్, వన్యప్రాణి వైద్య నిపుణులు, ఆత్మకూరు -
శ్రీశైలం టు శేషాచలం
రాజంపేట: నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్ విస్తరిస్తోంది. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు పులుల సంచారం ఉన్నట్లు అటవీశాఖ గుర్తించిన సంగతి విధితమే. గతంలో పులులు తిరిగే ప్రాంతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో మాత్రమే ఉండేది. ఆ మూడు జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో పులులు సంచరించేవి. కొన్నేళ్లుగా ఇవి తిరిగే కారిడార్ నల్లమల్ల నుంచి వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో శేషాచలం అడవుల వరకు విస్తరించి ఉంది. తరుచూ నిర్వహిస్తున్న పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్)వారి ఆధ్వర్యంలో పులులు గణన చేపడుతున్నారు. పులులు గణన రెండు బ్లాకులో జరుగుతోంది. నాలుగేళ్లకొకసారి చేసే గణన బ్లాక్–3లోకి వస్తుండగా , ప్రతి ఏడాది జరిపే గణన బ్లాక్–4 కిందికి వస్తుంది. ఇటీవల బ్లాక్–4లోని వార్షిక గణనలో టైగర్ కారిడార్ ప్రాంతంలో గత యేడాదిలో ఫిబ్రవరి 20 నుంచి అటవీశాఖాధికారులు గణన ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎక్కడెక్కడా.. టైగర్ కారిడార్ నంద్యాల, గిద్దలూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి డివిజన్లలో నిర్వహించారు. నంద్యాల డివిజన్లోని చలమరుద్రవరం (రేంజ్), గిద్దలూరులో గుండ్లకమ్మ, వైఎస్సార్ జిల్లాలో ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామిళ్ల, బద్వేలు, సిద్దవటం, ఒంటిమిట్ట, ముద్దనూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలు, రాయచోటి , బాలపల్లె తిరుపతి జిల్లాలో భాకరాపేట, తిరుపతి రేంజిలోని అటవీ ప్రాంతాల్లోని సాంకేతిక డిజిటల్ కెమెరాలు అమర్చిసర్వే చేశారు. ప్రతి రెండు చదరుపు అడుగులకు రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా రేంజిలలో గత యేడాది 188 లోకేషన్లకు మొత్తం 376 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 127 కెమెరాలు అమర్చారు. 40రోజుల పాటు జరిగిన గణనలో 20 రోజులకొక సారి కెమెరాలు తీసి వాటిలోని చిత్రాలను సేకరించారు. అదే ప్రదేశాలలో మళ్లీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు అటవీవర్గాల సమాచారం. కెమెరాల్లోని డేటాను ఆయా అటవీశాఖాధికారులు శ్రీశ్రైలంలోని టైగర్ బయోల్యాబ్‌కు పంపనున్నారు. వాటిలోని చిత్రాలను బయోల్యాబ్ ప్రతినిధులు క్షుణ్ణంగా విశ్లేషించనున్నారు. గత ఏడాది పోరుమామిళ్ల, వనిపెంట అడవుల్లో ఆరు పలులు కెమెరాలకు చిక్కినట్లుగా అటవీ అధికారుల నుంచి అందని ప్రాథమిక సమాచారం. పెరుగుతున్న పులులు సంఖ్య2021లో ఆరుపులులు ఉండగా, 2022లో వాటి సంఖ్య తొమ్మిదికి చేరినట్లు అటవీ వర్గాల సమాచారం. 2019లో బద్వేలు, సిద్ధవటం అటవీ ప్రాంతాల్లో కూడా పులులు ఉండేవని అప్పటి సమాచారం. ఈ సారి గణనలో అవి కెమెరాలకు చిక్కలేదు. అయితే పెనుశిల అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతాల వైపు వెళ్లినట్లు అటవీవర్గాలు భావిస్తున్నాయి. చిరుతలు మాత్రం కెమెరాకు చిక్కుతున్నాయి. పెనుశిల అభయారణ్యానికి సోమశిల వెనుకజలాలు అడ్డుగా ఉండటం వల్ల రాలేకున్నాయి. అభయారణ్యాలుశేషాచలం (బయోస్పియర్) లంకామల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం పెనుశిల లక్ష్మీనరసింహా అభయారణ్యం8ప్రాథమికంగా 8 నుంచి 10 పులులు సంచారంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని టైగర్ కారిడార్ చేపట్టిన పులుల గణనలో ప్రాథమికంగా 8 నుంచి 10 లోపు పులులను అధికారులు గతంలో గుర్తించారు. వాటి సంఖ్య ఈ ఏడాది పెరిగి ఉంటుందని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడవుల్లో అమర్చిన విదేశీ సాంకేతిక డిజిటల్ కెమెరాల ద్వారా వాటి సంఖ్యను కొనుగొన్నారు. శ్రీశైలంలోని టైగర్ బయోట్యాబ్లో శాస్త్రవేత్తలు కెమెరాల్లో లభ్యమైన చిత్రాలపై విశ్లేషణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.అడవిలో చెట్లకు కెమెరాలు అమర్చాం శేషాచలం అటవీ ప్రాంతంలో చెట్ల కెమెరాలు అమర్చాము. పులి, చిరుత కెమెరాలో పడితే వివరాలు వెల్లడిస్తాము. సర్వే జ రుగుతోంది. టైగర్ కారిడార్ పరిధిలో పులల గణన జరుగుతుంది. –జగన్నాథ్‌సింగ్, జిల్లా అటవీశాఖాధికారి, రాజంపేట -
పెద్దపులి కనిపిం‘చేను’!
నల్లబెల్లి/మన్ననూర్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్, మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం, కొండాయిల్‌పల్లి గ్రామాల శివారులో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతాలను వదిలి గ్రామాల సమీపంలోని పంటచేలల్లో పెద్దపులి సంచరించడంతో.. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. కొండాపూర్ అటవీ ప్రాంతం నుంచి ఆడపులి, పిల్ల పులి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కోనాపురం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కొండాపూర్ అటవీ ప్రాంతం నుంచి మగ పెద్దపులి మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి గ్రామాల మీదుగా రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామాల మధ్యలోని పలుగుఏనె (గుబురు చెట్లతో కూడుకున్న అటవీ ప్రాంతం) వరకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం గ్రామాల్లో శనివారం తిరుగు ప్రయాణంలో పెద్దపులి సంచరించినట్లు పలువురు చెబుతున్నారు. కాగా పోలీసులు, అటవీ శాఖ, స్ట్రైక్‌ఫోర్స్ అధికారులు పంట చేలలో పులి కదలికలను పరిశీలించి పాదముద్రలను సేకరించారు. మొక్కజొన్న చేనులో సేదదీరిన ప్రాంతాన్ని గుర్తించారు. అవన్నీ పెద్దపులి పాదముద్రలేనని, తిరిగి వెళ్లలేదని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సఫారీలో పెద్దపులి సందడి అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం సఫారీ వాహన సందర్శకులకు శనివారం ఉదయం పెద్ద పులి కనిపించింది. ఫర్హాబాద్ సఫారీ పాయింట్ నుంచి వ్యూ పాయింట్‌కు సందర్శకులు వాహనంలో వెళ్తుండగా.. మార్గమధ్యలో పెద్దపులి అటవీశాఖ ఇంటర్నల్ రోడ్డు దాటుతూ కనిపించింది. అకస్మాత్తుగా చెట్ల మధ్యనుంచి వాహనం సమీపంలోకి పెద్దపులి రావడంతో సందర్శకులు కొంత భయపడినా.. దగ్గరి నుంచి చూశామని సంతోషపడ్డారు. -
పులి కోటలో ఓ రాత్రి!
ప్రకృతి రమణీయతకు మారుపేరు నల్లమల అభయారణ్యం (Nallamala Forest). విశేషమైన వృక్ష సంపద... లెక్కలేనన్ని వన్యప్రాణులు... పక్షులు... క్రూరమృగాలు... ఔషధ మొక్కలు ఈ అడవి సొంతం. పులులకు పెట్టని కోటగా పేరొందిన నల్లమలలో జాలీగా జంగిల్ సఫారీ (jungle safari) చేస్తూ వన్యప్రాణులను ప్రత్యక్షంగా తిలకించేందుకు అటవీశాఖ అవకాశం కల్పిస్తోంది. నంద్యాల జిల్లా పరిధిలోని పచ్చర్ల, బైర్లూటిలలో ఏర్పాటుచేసిన ఎకో టూరిజం ప్రాజెక్టుల నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించేందుకు నల్లమలలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్టీఆర్) స్వాగతిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... నిర్భయంగా పులి కోటలో ఓ రాత్రి గడిపేద్దాం పదండి.ఆళ్లగడ్డ: రోజువారీ ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో అలసిన మనసులను ఆహ్లాదపరిచేందుకు... ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని పంచేందుకు.. నల్లమలలోని పచ్చర్ల, బైర్లూటి ఎకో టూరిజం (Eco Tourisam) కేంద్రాలు స్వాగతం పలుకుతున్నాయి. అహోబిలం, యాగంటి, మద్దిలేటయ్య, మహానంది, శ్రీశైల మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతోపాటు ఆసక్తిగల ప్రజలకు జంగిల్ సఫారీకి అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వారాంతాలు, సెలవు రోజుల్లో కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో జంగిల్ సఫారీకి విచ్చేస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇక్కడి సౌందర్యాన్ని చూడటానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుండటం విశేషం. ముఖ్యంగా ఫొటోషూట్ల కోసం కొత్త జంటలు క్యూ కడుతున్నాయి. వన నివాసం ఇలా... » పచ్చర్ల, బైర్లూటీ ఎకో టూరిజం క్యాంప్‌ల నుంచి ఓపెన్ టాప్ సఫారీ (జీపు)లు పర్యాటకుల కోసం అందుబాటులో ఉంటాయి. » ఒక్కో వాహనంలో 10 మంది కూర్చోవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.300 చొప్పున కనీసం ఐదుగురు ఉండాలి. లేదా రూ.1,500 చెల్లించి ఒకరు, ఇద్దరు అయినా వెళ్లవచ్చు.» ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అడవిలో పర్యటించి క్యాంపునకు చేరుకోవాల్సి ఉంటుంది. » పర్యాటకులను కనువిందు చేసేందుకు ఎకోవాక్, హెరిటేజ్‌వాక్, జంగిల్ సఫారీ, ట్రెక్కింగ్, కయా కింగ్, బర్డ్స్ బట్టర్ ఫ్లై గార్డెన్ వంటివి ఏర్పాటు చేశారు.» సాయంత్రం ఐదు గంటల వరకు అటవీ ప్రాంతంలో తిరిగి వచ్చినవారికి జంగిల్ క్యాంప్‌లో రాత్రి బస చేసేందుకు సాధారణ కాటేజీలు, మిలట్రీ టెంట్ హౌజ్, ఉడెన్ కాటేజీలతోపాటు వన కుటీర్ (మట్ కాటేజీ)లు అందుబాటులో ఉన్నాయి.» కాటేజీ ఒక రోజు అద్దె రూ.6 వేల నుంచి రూ.9వేల వరకు ఉంటుంది. ఇద్దరు బస చేయవచ్చు. అంతకుమించి ఉంటే ఒక్కో వ్యక్తికి అదనంగా రూ.1,500 చెల్లించాలి. » కాటేజీ బుక్ చేసుకున్నవారికి జంగిల్ సఫారీ, భోజనం, టీ, టిఫిన్ వంటివి ఉచితం. చిన్నపిల్లలు ఆడుకునేందుకు రకరకాల ఆటవస్తువులు అంటుబాటులో ఉన్నాయి. » కాటేజీ బుక్ చేసుకోకపోయినా ఉదయం వచ్చి ఐదుగురితో కలిసి రూ.1,500 చెల్లించి జంగిల్ సఫారీ చేయడంతోపాటు సాయంత్రం వరకు ఎకో టూరిజం క్యాంపులో గడపవచ్చు.ఇలా వెళ్లాలి... » నంద్యాల–గిద్దలూరు మార్గంలో నంద్యాలకు 25 కిలో మీటర్లు, గిద్దలూరుకు 35 కిలో మీటర్ల దూరంలో పచ్చర్ల ఎకో టూరిజం క్యాంప్ ఉంది.» ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో 14 కిలో మీటర్ల దూరంలో బైర్లూటీ ఎకో టూరిజం క్యాంపు ఉంది.» ఈ క్యాంపుల వద్దకు పర్యాటకులు రోడ్డు మార్గాన ఆర్టీసీ బస్సులు లేదా సొంత వాహనాల్లో చేరుకోవాలి. పర్యాటకుల ఆసక్తి మేరకు ఎకో టూరిజం క్యాంపుల్లో విడిది కల్పిస్తారు.» అక్కడి నుంచి సఫారీలో నల్లమల అందాలు తిలకించేలా అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.జంగిల్ సఫారీ సాగేదిలా.. » క్యాంపుల నుంచి సుమారు 25 నుంచి 30 కిలో మీటర్లు నల్లమలలోని టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీ సాగుతుంది. » ఆహ్లాదకరమైన వాతావరణంలో నెమళ్లు, వివిధ రకాల పక్షులు, జింకలు, దుప్పులు, అడవి పందులు, కొండ గొర్రెలు, భయపెట్టే కొండ చిలువలు, తాచు పాములు వంటివాటి మధ్య ఈ పర్యటన ఆద్యంతం కొనసాగుతుంది. » మధ్యలో రెండు చోట్ల వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. సందర్శకులు వీటిని ఎక్కితే నల్లమల అంతా చూడవచ్చు. » ప్రస్తుతం నల్లమలలో దాదాపు 50 చిరుత పులులు, 70 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా. అప్పుడప్పుడు చిరుత, పెద్ద పులులు కూడా జంగిల్ సఫారీలో కనిపిస్తున్నాయి.» అడవిలోకి వెళ్లే పర్యాటకులు అటవీ సిబ్బంది ఆపిన చోట మాత్రమే కిందకు దిగాలి. అడవి మధ్యలో దిగడం, ఫొటోలు తీసుకోవడం పూర్తిగా నిషేధం.» జంగిల్ సఫారీకి నల్లమలలో స్థానికంగా నివసించే చెంచులే గైడ్లుగా ఉంటూ చూపిస్తారు. పక్షులు, వన్యప్రాణుల విశిష్టతలను వివరిస్తారు. ఆహ్లాదకరంగా ఉంది: చందన, సాఫ్ట్వేర్ ఉద్యోగి, చెన్నైస్నేహితుడి పెళ్లి తర్వాత ఆల్బమ్ కోసం ఫొటో షూట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ముందుగా ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని అనుకోలేదు. ఇప్పుడు మళ్లీమళ్లీ రావాలనిపిస్తోంది. చాలా బాగుంది.మళ్లీ రావాలని అనుకుంటున్నాం: చందన, కర్నూలుకుటుంబ సభ్యులతో కలిసి మొదటిసారి ఇక్కడికి వచ్చాం. పచ్చర్ల జంగిల్ సఫారీ చాలా బాగుంది. మరోసారి బంధువులు అందరితో కలిసి రావాలని అనుకుంటున్నాను. అడవి వాతావరణంలో విహరించడం అద్భుతంగా ఉంది. -
తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన పులులు
తెలంగాణలో పెద్ద పులుల గాండ్రింపులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాలైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లలోనే కాకుండా కొత్త ప్రదేశాల్లోనూ పులులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల 30, 40 ఏళ్ల తర్వాత వాటి కదలికలు రికార్డవుతున్నాయి. టైగర్ రిజర్వ్‌లలో పులుల సంఖ్య పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఉండటంతోపాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాల్లోంచి రాష్ట్రంలోకి పులుల వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే.. తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగిన సంఖ్యలో జంతువులు, నీటివనరులు, గడ్డి భూములు ఉన్నాయి. దీంతో పులులు ఇక్కడకు తరలి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 13కుపైగా జిల్లాల్లో పులుల కదలికలను అధికారులు ఇటీవల గుర్తించారు. –సాక్షి, హైదరాబాద్100 పులుల ఆవాసానికి అనుకూలం...ఒక పులి (Tiger) స్వేచ్ఛగా తిరుగుతూ తన జీవనాన్ని సాగించేందుకు 50 చ.కి.మీ. అడవి అవసరమవుతుంది. దీన్నిబట్టి తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లతో కలుపుకుంటే దాదాపు 5 వేల చ.కి.మీ. అటవీ ప్రాంతం అందుబాటులో ఉంది. ఇది సుమారు 100 పులులు జీవించేందుకు, స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అమ్రాబాద్ (Amrabad Tiger Reserve) టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా 33 పులులు ఉన్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక కవ్వాల్‌లో కోర్ ఏరియాలో కొంతకాలంగా ఒక్క పులి కూడా స్థిరనివాసం ఏర్పరచుకోలేదు. అయితే మహారాష్ట్ర–తెలంగాణ (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా) టైగర్ కారిడార్, సరిహద్దు ప్రాంతాల్లో ఐదారు పెద్ద పులులు సంచరిస్తున్నట్లు తాజా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే (Adilabad district) మనుషులపై పులుల దాడులు, ఒకరి మృతి, మరొకరు తీవ్రంగా గాయపడటం, పలుచోట్ల పశువుల సంహారం వంటివి చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు 10–15 ఏళ్ల కిందట ‘టైగర్ టెరిటరీ’గా ఉన్న అడవులు కొన్నిచోట్ల ఆక్రమణలతో పొలాలు, పత్తి చేన్లుగా మారిపోయాయి.మళ్లీ పులులు అక్కడకు చేరుకొనేటప్పటికి పత్తిచేన్లు మూడున్నర, నాలుగు అడుగుల మేర ఏపుగా పెరగడం, కిందకు వంగి పత్తి ఏరే కూలీలను వెనక నుంచి చూసి పులులు ఎరగా పొరబడి దాడులకు పాల్పడుతున్నాయని ఓ అటవీ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. మహారాష్ట్రలో (Maharashtra) సంతానానికి జన్మనిచ్చాక పెద్ద పులులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో సరైన ఆవాసం దొరకకపోవడంతోపాటు ఆహారాన్వేషణలో దాడులు జరుగుతున్నాయని చెప్పారు. పులులు ఒకే మార్గంలో కాకుండా 3, 4 దిశల నుంచి వస్తుండటం వల్ల వాటి కదలికలను అంచనా వేయడం కష్టంగా మారుతోందన్నారు.కొత్త ప్రాంతాల్లో ఆనవాళ్లు... కొన్నేళ్లుగా పెద్ద పులులు కనిపించని భూపాలపల్లి, ఏటూరునాగారం, కిన్నెరసాని, పాకాల, మంచిర్యాల, ఇచ్చోడ, బోథ్, పెద్దపల్లి వంటి చోట్ల ఇటీవల కాలంలో పులుల కదలికలు నమోదయ్యాయి. రాష్ట్ర పర్యావరణానికి సంబంధించి దీన్ని ముఖ్యమైన పరిణామంగా పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 54 పులుల అభయారణ్యాలు ఉండగా వాటిలో 2 వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న కొన్నింటిలో ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) 3,728 చ.కి.మీ.లలో., తెలంగాణలోని అమ్రాబాద్ 2,611 చ.కి.మీ.లలో, కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,016 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.కొత్త ప్రాంతాల్లో ఆనవాళ్లు... కొన్నేళ్లుగా పెద్ద పులులు కనిపించని భూపాలపల్లి, ఏటూరునాగారం, కిన్నెరసాని, పాకాల, మంచిర్యాల, ఇచ్చోడ, బోథ్, పెద్దపల్లి వంటి చోట్ల ఇటీవల కాలంలో పులుల కదలికలు నమోదయ్యాయి. రాష్ట్ర పర్యావరణానికి సంబంధించి దీన్ని ముఖ్యమైన పరిణామంగా పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 54 పులుల అభయారణ్యాలు ఉండగా వాటిలో 2 వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న కొన్నింటిలో ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) 3,728 చ.కి.మీ.లలో., తెలంగాణలోని అమ్రాబాద్ 2,611 చ.కి.మీ.లలో, కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,016 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం పులితోనే ముడిపడి ఉందిపులికి హాని జరగకుండా సంరక్షించుకుంటే దాని ద్వారా ఇతర జంతువులకూ రక్షణ లభిస్తుంది. టైగర్‌ను ఫ్లాగ్íÙప్ ఫర్ ఎకోసిస్టమ్‌గా, అంబ్రెల్లా స్పీషిస్గా పరిగణిస్తాం. గొడుగు ఎలా అయితే తన నీడలో లేదా కింద ఉన్న వాటిని తడవకుండా రక్షిస్తుందో పులి కూడా అంతే. పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం కూడా పులితోనే ముడిపడి ఉంది. అడవులు, ముఖ్యంగా పులుల అభయాణ్యాల నుంచే వర్షపునీరు కిందకు ప్రవహించి నదుల్లోకి చేరుతోంది. వాననీటితోపాటు బురద, ఇసుక వంటివి నదుల్లోకి సిల్ట్ రూపంలో చేరకుండా అడవులు అడ్డుకుంటాయి. పండ్లు, ఫలాలతోపాటు అడవుల్లోని ఔషధ మొక్కల ద్వారా మనకు మందులు లభిస్తున్నాయి. – ఫరీదా తంపాల్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–నేచర్ స్టేట్ డైరెక్టర్ (హైదరాబాద్ సెంటర్)పులులను పరిరక్షించుకోవాల్సిన అవసరముందితెలుగు రాష్ట్రాల్లోని 3 టైగర్ రిజర్వ్‌లు నదుల ఒడ్డునే ఉండటంతోపాటు ఈ అడవుల్లోంచే అత్యధిక వాటా నీరు నదుల్లోకి చేరుతోంది. అందువల్ల తెలంగాణ, ఏపీ భవిష్యత్ పర్యావరణపరంగా సురక్షితంగా ఉండాలంటే ఈ అభయారణ్యాల్లోని పులులను పరిరక్షించుకోవాల్సిన అవసరముంది. పులుల ఆవాసాల ద్వారా పర్యావరణపరంగా అందుబాటులోకి వచ్చే సేవలను (ఎకోలాజికల్ సర్వీసెస్ ద్వారా) డబ్బు విలువ పరంగా లెక్కిస్తే ఒక్కో పులి రూ. 250 కోట్ల విలువ చేస్తుంది. కోవిడ్ సంక్షోభం మనందరికీ ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులను గౌరవించాలని, కాపాడుకోవాలని నొక్కి చెబుతోంది. – ఇమ్రాన్ సిద్దిఖీ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ డైరెక్టర్ -
ఘోరం.. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి
ముంబై : పూణే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతిని జిల్లా అటవీ శాఖ అధికారులు అధికారంగా ధ్రువీకరించారుపూణేలోని షిరూర్ తాలూకా పింపల్సుతి గ్రామానికి చెందిన రక్ష నిఖమ్ (4) ఇంట్లో ఆడుకుంటుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత చిన్నారిని నోట కరుచుకుని స్థానిక చెరుకు తోటల్లోకి తీసుకెళ్లింది. చిరుత పులి రాకను గమనించిన తల్లి కాపాడండి అంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రక్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.రెండు గంటల పాటు గాలింపు చర్యల అనంతరం చెరుకు తోటలో చిన్నారి జాడ దొరికింది. చిన్నారిపై చిరుత తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడితో బాలిక తల,మొండెం వేర్వేరుగా కనిపించాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జున్నార్ ఫారెస్ట్ డివిజన్ అధికారి మితా రాజ్‌హన్స్ మాట్లాడుతూ బాలికపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. -
మళ్లీ కనిపించిన పులి
మంచిర్యాలరూరల్ (హాజీపూర్): మంచిర్యాల జిల్లా ముల్కల్ల, పాతమంచిర్యాల అటవీ సెక్షన్ పరిధిలోని గఢ్‌పూర్‌లో పులులు కెమెరాకు చిక్కాయి. గఢ్‌పూర్ సఫారీ మార్గంలోని ఓ చెట్టుకు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాకు రెండుసార్లు వేర్వేరు పులులు చిక్కడం గమనార్హం. గత నెల 12న ఇదే కెమెరా మగపులి వెళుతున్న ఫొటోను తీయగా, తాజాగా బుధవారం ఉదయం ఇదే దారి వెంట వెళుతున్న ఆడపులి ఫొటోను తీసింది. అటవీ అధికారులు అడుగులను పరిశీలించి పులిగా నిర్ధారించారు. మిరప చేనులో పెద్దపులి కౌటాల: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ మిరప చేనులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన జాడే నవీన్ మిరప చేనుకు గురువారం ఉదయం నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. చేనులో పడుకుని ఉన్న పులిని చూసి భయపడి గ్రామానికి పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో వినయ్‌కుమార్ సాహూ, అధికారులు పాదముద్రలు పరిశీలించి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. మహారాష్ట్ర నుంచి వార్దానది దాటి వచ్చినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. -
పెద్దపులి ఎక్కడ?
మంగపేట: ములుగు జిల్లా వెంకటాపురం (కె), మంగపేట మండలాల పరిధి చుంచుపల్లి అటవీప్రాంతానికి వచ్చిన పెద్దపులి ఎటువైపు వెళ్లిందోనని అటవీ శాఖ అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సుమారు 15 మంది అధికారులు బుధవారం గోదావరి తీర ప్రాంతం వెంట పులి ఆనవాళ్లను పరిశీలించారు. నిమ్మగూడెం పంచాయతీ పరిధి తిమ్మాపురం ముసలమ్మవాగు సమీపంలోని చౌడొర్రె ప్రాంతంలోని వరి పొలం వద్దకు వెళ్లిన రామచంద్రునిపేట గ్రామానికి చెందిన పగిళ్ల రంగయ్య, వెంకటేశ్వర్లుకు కొంతదూరంలో పెద్దపులి కనిపించింది.దీంతో భయపడిన రైతులు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా, సుమారు 30 మంది కలిసి పులి కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడినుంచి పెద్దపులి సమీపంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలోని మల్లూరు వాగు మధ్యతరహా ప్రాజెక్టువైపు ఉన్న రాళ్లవాగువైపు వెళ్లినట్లు అడుగులు కనిపించడంతో విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. మంగపేట అటవీశాఖ ఇన్చార్జ్ రేంజ్ అధికారి అశోక్ మరో 20 మంది సెక్షన్, బీట్ ఆఫీసర్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు అక్కడినుంచి సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముసలమ్మగుట్ట, కొప్పుగుట్ట అటవీప్రాంతంనుంచి అవతలి వైపు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కొత్తగూడెం, గోళ్లగూడెం మీదుగా కిన్నెరసాని అభయారణ్యంలోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నా ఎలాంటిì ప్రాణనష్టం జరగకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లయింది. -
అడవి ఒడిలో...
‘నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఉద్యోగం వచ్చింది’ అని మార్గరెట్ బారు తన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అభినందనలు తెలియజేసిన వారికంటే ఆశ్చర్యపోయిన వారే ఎక్కువ.‘డ్రైవర్ ఉద్యోగం... అది కూడా అడవిలో... నువ్వు ఆడపిల్ల అనే విషయం మరిచావా’ అన్నవారు కూడా ఉన్నారు. అయితే వారి ఆశ్చర్యాలు, అభ్యంతరాలేవీ మార్గరెట్ దారికి అడ్డుకాలేకపోయాయి.ఒడిషాలోని దిబ్రుఘర్ అభయారణ్యంలోని తొలి మహిళా సఫారి డ్రైవర్‌గా ఎంతోమంది యువతులకు స్ఫూర్తిని ఇస్తోంది మార్గరెట్ బారు.దిబ్రుఘర్ అభయారణ్యానికి సమీపంలోని క్రిస్టియన్పడా మార్గరెట్ బారు స్వగ్రామం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెట్రిక్యులేషన్ పాసైన తరువాత చదువు మానేయాల్సి వచ్చింది. అభయారణ్యంలో వివిధ ఉద్యోగాలలో మహిళల నియామకానికి అటవీశాఖ ప్రకటన మార్గరెట్‌కు ఆశాకిరణంలా తోచింది.తన కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా చేయాలనుకున్న మార్గరెట్ డ్రైవర్ ఉద్యోగానికి ఎంపికైంది.అయితే సఫారీ డ్రైవర్ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు ఇతరుల నుంచే కాదు కుటుంబసభ్యుల నుంచి కూడా అభ్యంతరాలు, సందేహాలు ఎదురయ్యాయి.అయినప్పటికీ మార్గరెట్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. డ్రైవింగ్, వెహికిల్ మెయింటెనెన్స్, జంగిల్ రోడ్లను నావిగేట్ చేయడంలో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆరునెలల కఠినమైన శిక్షణ తరువాత ఉద్యోగంలో చేరింది.దిబ్రుఘర్ అభయారణ్యంలోని 13మంది సఫారీ డ్రైవర్లలో ఏకైక మహిళ మార్గరెట్. అయితే ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదు. అభద్రతకు గురి కాలేదు.రోజు ఉదయం ఆరు నుంచి మార్గరెట్ ఉద్యోగ జీవితం మొదలవుతుంది.‘అడవిలో రోడ్లు నాకు సహనాన్ని, ధైర్యాన్ని నేర్పాయి. ప్రతిరోజూ ఒక కొత్త సాహసం చేసినట్లుగా భావిస్తాను. ఈ ఉద్యోగం ద్వారా నా కుటుంబానికి అండగా ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటుంది మార్గరెట్.డ్రైవర్ ఉద్యోగం వల్ల మార్గరెట్ ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం ఒక కోణం అయితే, సంప్రదాయ ఉద్యోగాలకు అతీతం గా కొత్తదారిలో పయనించాలని కలలు కనే అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలవడం మరో కోణం.మార్గరెట్లాగే మూసధోరణులకు భిన్నంగా ప్రయాణిస్తోంది సంగీత. ఒకప్పుడు ఆమె మార్గరెట్ రూమ్మేట్. 24 సంవత్సరాల సంగీత సీక్రా దిబ్రూఘర్‌లో మొదటి మహిళా ఎకో గైడ్.‘అడవిలో మీకు భయం వేయదా? ఇది రిస్క్ జాబ్... సిటీలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా... ఇలాంటి మాటలు ఎన్నో వింటుంటాను. అయితే అడవి అనేది అమ్మలాంటిది. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు భయం ఎందుకు! నేను, నా స్నేహితురాలు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తి ఇవ్వడం సంతోషంగా ఉంది’ అంటుంది సంగీత సీక్రా. -
కామారెడ్డి: హైవేపై చిరుత.. హడలిపోయిన ప్రయాణికులు
కామారెడ్డి : చిరుత పులి మరోసారి కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ అటవీ ప్రాంతంలో నేషనల్ హైవేపై చిరుత సంచరించింది.పులి సంచారంతో ఆందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ప్రత్యక్ష సాక్షి నుంచి వివరాలు సేకరించారు. పాదముద్రలు పరిశీలించారు. అనంతరం, పులి సంచారంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా తిరుగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. -
పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్
సాక్షి,కొమురంభీంజిల్లా: ఆసిఫాబాద్‌లో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతోంది. కాగజ్‌నగర్ కారిడార్‌లో అటవీ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ఇక్కడ మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం సెర్చ్ ఆపరేషన్‌ను ఫారెస్ట్ అధికారులు నిర్వహిస్తున్నారు.పులి భయం నెలకొన్ని ఈ 15 గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.గగ్రామాల్లోని వారంతా పులి భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.పులి ఆచూకీ కనుగొనేందుకు ఫారెస్ట్ అధికారులు డ్రోన్ సహాయంతో వేట కొనసాగిస్తున్నారు. తాజాగా పులి దాడిలో ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: పులి పంజాకు మహిళ బలి -
ఆదిలాబాద్‌లో పెద్దపులి హల్చల్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో గత నాలుగు రోజులుగా పెద్దపులి హల్చల్ చేస్తోంది. గత రెండ్రోజులుగా నార్నూర్ మండలం చోర్గావ్ గ్రామంలో తిష్టవేసి ఆవును తింటున్న దృశ్యం అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. దీంతో చోర్గావ్, సుంగాపూర్, బాబేఝరి, మంజ్రి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం గాదిగూడ మండలం ఖడ్కి గ్రామం మీదుగా బుడుకుంగూడ, సావురి గ్రామం మీదుగా రాంపూర్ చేరుకుంది. వేకువజామున గిరిజన రైతు ప్రకాశ్‌కు చెందిన ఆవుపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై చప్పుడు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదేరోజు మధ్యాహ్నం నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ శివారులో పత్తి ఏరుతున్న మహిళలకు పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. అక్కడి నుంచి గంగాపూర్, మాన్కాపూర్ వైపు పులి వెళ్లిందని ప్రచారం జరగడంతో మాన్కాపూర్, రాజులగూడ, నార్నూర్, మహగావ్, నాగల్కొండ, భీంపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారంతా మధ్యాహ్నం ఇంటిబాట పట్టారు. ఎఫ్ఎస్వో సుదర్శన్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు బృందాలుగా విడిపోయి పులి జాడకోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
యష్ 'టాక్సిక్' మూవీ టీమ్‌పై పోలీస్ కేసు
'కేజీఎఫ్' ఫేమ్ యష్ ప్రస్తుతం 'టాక్సిక్' సినిమా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ఊహించని వివాదంలో ఈ చిత్రబృందం చిక్కుకుంది. అన్యాయంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమే అనేలా కర్ణాటక అటవీ శాఖ మూవీ టీమ్‌పై పోలీస్ కేసు పెట్టింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?బెంగళూరులోని పీణ్య-జలహళ్లి దగ్గరలో యష్ 'టాక్సిక్' మూవీ షూటింగ్ చేస్తున్నారు. అయితే చిత్రీకరణ జరుగుతున్న భూమికి సంబంధించి కర్ణాటక అటవీశాఖ, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ మధ్య వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములని గెజిట్‌లో ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండానే హెచ్‌ఎంటీకి ఇచ్చారు. భూమి యాజమాన్య హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా నడుస్తోంది.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడి పర్స్ కొట్టేశారు)కానీ వ్యాపార అవసరాల కోసం హెచ్ఎంటీ భూమిని అద్దెకు ఇస్తోంది. ఈ క్రమంలోనే 'టాక్సిక్' చిత్రబృందం కొన్నిరోజుల కోసమా అని లీజుకు తీసుకుంది. కానీ సెట్స్ వేసేందుకు వందలాది ఎకరాల అటవీ భూమిలోని చెట్లను నరికివేశారని విమర్శలొచ్చాయి. స్వయంగా అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. ఆ ప్రాంతాన్ని సందర్శించి మరీ శాటిలైట్ ఫొటోలు తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. అనుమతి లేకుండా చెట్లను నరికడం, అటవీ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, శిక్షార్హమైన నేరమని మంత్రి పేర్కొన్నారు.ఇది జరిగి కొన్నిరోజులు అవుతుండగా కర్ణాటక అటవీశాఖ ఇప్పుడు సీరియస్ అయింది. టాక్సిక్ మూవీ నిర్మాతలపై కేసు పెట్టింది. అలాగే కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్‌పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడీ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా) -
సరస్వతి భూములపై ఆగని విషప్రచారం
సాక్షి, నరసరావుపేట: సరస్వతి పవర్ భూముల సేకరణలో ఎటువంటి ఆక్రమణలు, అటవీ భూములు లేవని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెబుతున్నా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం ఏదో జరిగిపోయినట్లు ఊగిపోతున్నారు. దీనిపై విచారణ చేసి నిగ్గు తేల్చాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి తన అక్కసును మరోమారు బైటపెట్టుకున్నారు. ఎలాంటి అక్రమాలూ జరగలేదని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెప్పినా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ అసత్య ప్రచారానికి దిగడంపై ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. పవన్ ఆకస్మిక పర్యటన.. అసంబద్ధ ఆరోపణలు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరి«ధిలోని సరస్వతి పవర్స్ భూముల పరిశీలన కోసమని మంగళవారం ఆకస్మిక పర్యటన చేసిన పవన్‌కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం తనకు అలవాటైన అసంబద్ధ, పొంతనలేని మాటలతో సాగింది. ఏకంగా 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేశారన్నారని ఆరోపించారు. కానీ.. అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. స్థానిక రైతులంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సరస్వతి పవర్స్ కంపెనీ తీసుకున్న భూముల్లో 24 ఎకరాలు ఎస్సీ కుటుంబాలకు చెందిన అసై¯న్డ్ భూములు ఉన్నట్లు తేలిందని మరో వాదన వినిపించారు. దీనిపై మరోసారి సమగ్ర విచారణ చేసి నిగ్గు తేల్చాలని పల్నాడు కలెక్టర్‌కు ఆదేశాలిచ్చానని పవన్ తెలిపారు. సరస్వతి పవర్స్ కంపెనీ కోసం భూములు తీసుకోవడం దగ్గర నుంచి నీటి కేటాయింపులు, లీజుల పునరుద్ధరణ వరకు ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామన్నారు. పోలీసులు ఎందుకో మెత్తబడిపోయారు, భయపడుతున్నారని పవన్‌కళ్యాణ్ అన్నారు. 2014–19 మధ్య ఏం తేల్చారు? సరస్వతి భూముల సేకరణలో అక్రమాలు ఉన్నాయంటూ 2014–19 మధ్య టీడీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విషప్రచారం చేశారు. అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ భూములపై పదేపదే ఆరోపణలు చేస్తూ అక్రమాల నిగ్గు తేలుస్తామని ప్రగల్బాలు పలికారు. ఐదేళ్ల కాలం ముగిసినా ఒక చిన్న తప్పును సైతం గుర్తించలేకపోయారు. ఈసారి కూటమి అధికారంలోకి రావడంతో మరోసారి పవన్ కళ్యాణ్‌ను ముందుపెట్టి అసత్య ప్రచారాలకు తెరలేపారు. కూటమి నేతల కుట్రల వల్ల పల్నాడు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతమైన పల్నాడులో ఫ్యాక్టరీలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు అగిపోయి ఇక్కడి ప్రజలు ఆర్థి కంగా బలపడతారు. కానీ.. కూటమి నేతల విషప్రచారాలు, కుట్రలతో పారిశ్రామిక వేత్తలు భయపడి వెనుకడుగు వేస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన పవన్ ఈప్రాంత అభివృద్ధి గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా కేవలం విద్వేష ప్రసంగాలు చేయడాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పల్నాడు జిల్లాకు కీలకమైన వరికపూడిసెల, పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదలుపెట్టింది, వాటిని పూర్తి చేస్తామని ఒక్క మాట కూడా అనకపోవడం ఏమిటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అవన్నీ పట్టా భూములే: తహశీల్దార్ సరస్వతి పవర్స్ సంస్థ భూములన్నీ పట్టా భూములేనని మాచవరం తహశీల్దార్ క్షమారాణి గతనెల 26న మీడియాకు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో సరస్వతి భూముల్లో తనిఖీ చేస్తున్నామని ఆమె వివరించారు. ఈ భూముల్లో చెరువులు, కుంటలు, వాగులు, నీటి వసతులేవీ లేవని చెప్పారు. అటవీ భూములేవీ ఆక్రమణకు గురికాలేదు : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డిప్యూటీ సీఎం ఆదేశాలతో అక్టోబర్ 26న మాచవరం మండలంలోని చెన్నాయపాలెం, దాచేపల్లి మండలంలోని తంగెడ అటవీ భూములను సిబ్బందితో కలిసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. అటవీ భూములేవి అక్రమణకు గురి కాలేదన్నారు. అటవీ భూములకు సుమారు 8 మీటర్ల దూరంలో సరస్వతి భూములున్నట్టు గుర్తించామన్నారు. -
రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/కొయ్యూరు: రాష్ట్రంలో చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్పియర్ పార్కు (జీవావరణ పార్క్) ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో 40 రోజుల్లో యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లోనే యునెస్కో జీవావరణ పార్కుగా గుర్తించింది. 4,756 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన శేషాచలం పార్కు రాష్ట్రంలో మొదటిది కాగా తాజాగా 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రెండో పార్కును ప్రతిపాదిస్తున్నారు. ప్రధానంగా అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు వివిధ జీవరాశులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బయోస్పియర్ పార్కును అటవీశాఖ ప్రతిపాదిస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధనలు, శిక్షణ కార్యకలాపాలకు యునెస్కో సహాయం అందించనుంది. బయోస్పియర్ రిజర్వ్‌గా మర్రిపాకల అటవీ ప్రాంతం మర్రిపాకల అటవీప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్‌గా ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చింతపల్లి డీఎఫ్‌వో వైవీ నర్సింగరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు డిపోలో కలప వేలం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చింతూరు, రంపచోడవరం డీఎఫ్‌వోలను సంప్రదించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. దట్టమైన అడవి ఉన్న మర్రిపాకల ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కొందరు విద్యుత్ తీగలు అమర్చి జంతువులను వేటాడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవావరణ పార్కులో 3 జోన్లు ఉంటాయి కోర్ జోన్: ఈ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలను అనుమతించరు. బఫర్ జోన్: పరిమితంగా స్థానిక ప్రజలను మాత్రమే అవసరమైన వనరుల సమీకరణకు అనుమతిస్తారు. ఫ్రీ జోన్: ఇది పార్కు వెలుపలి ప్రాంతం. ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేకుండా సాధారణ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 18 పార్కులు..జీవావరణ పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని 1971లో యునెస్కో చేపట్టింది. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో 18 జీవావరణ పార్కులు ఏర్పాటయ్యాయి. -
అధికారులు ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు అటవీ అనుమతులివ్వడంలో నిర్లక్ష్యానికి తావు లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయా ప్రాజెక్ట్‌లకు అటవీ అనుమతుల సాధనలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని అన్నారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాలు, అటవీ శాఖల అధికారులతో ఇద్దరు మంత్రులు నిర్వహించిన సమీక్షలో పలు రహదారుల పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా 7 రోడ్డు ప్రాజెక్టుల పనులు, నాలుగేళ్లుగా ఒక ప్రాజెక్టు, మూడేళ్లుగా 20 ప్రాజెక్టులు, ఏడాది కాలంగా 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గత ఐదేళ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్ లో ఉంటే రెండు శాఖల అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం నుంచి అనేక రహదారులకు అనుమతులు సాధించినా ఒక్కడ అనుమతులు లేక కొత్త రోడ్ల మంజూరీ గురించి కేంద్రాన్ని అడగడం ఇబ్బందిగా మారిందన్నారు. అటవీ అనుమతుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ఈ సందర్భంగా అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్లను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.డీఎఫ్ఓల స్థాయిలో 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను ఆమె ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఫైళ్ల పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డికి హామీనిచ్చారు. కాగా, అటవీ అనుమతుల సాధన పర్యవేక్షణకు ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఎస్ఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రీజనల్ ఆఫీసర్ తీరు సరికాదు..రాష్ట్ర రోడ్డు ప్రాజెక్టుల అటవీ అనుమతులను పర్యవేక్షించే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రీజనల్ ఆఫీసర్ త్రినాథరావు చిన్న చిన్న అంశాలపై వివరణలతో కాలయాపన చేయడంపై ఇద్దరు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అండగా నిలబడాల్సిందిపోయి.. సాంకేతిక కారణాలతో ఫైళ్లను జాప్యం చేయడం తగదన్నారు. -
ఏలూరు జిల్లాలో చిరుత కలకలం
ఏలూరు జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లి శివారులో రెండ్రోజుల చిరుత పులి సంచరించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను గుర్తించేందుకు స్థానికంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.అయితే సోమవారం ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు గుర్తించారు. ఆ ప్రాంతం పాదముద్రలు సేకరించి రాజమండ్రి ల్యాబ్‌కు పంపించారు. అదే సమయంలో చితరు సంచరిస్తుందని, పరిసర ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. -
కొండెక్కిన కొల్లేరు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల కేరింతలకు కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచిన కొల్లేరు టూరిజంపై కొత్త ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా కొల్లేరు టెంపుల్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ తూర్పు గోదావరికి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొల్లేరు పర్యాటకాభివృద్ధికి రూ.187 కోట్లతో డీపీఆర్‌లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కొద్ది రోజుల క్రితం కొత్త రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం, సూర్యలంక, రాజమహేంద్రవరం–అఖండ గోదావరి, సంగమేశ్వరం వంటి నాలుగు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి ప్రాంతమైన కొల్లేరు టూరిజానికి ఇందులో చోటు దక్కకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 నియోజకవర్గాల పరిధిలో కొల్లేరు సరస్సు వ్యాపించి ఉంది. దక్షిణ కశ్మీరంగా దీనికి పేరు. జీవో నంబరు 120 ప్రకారం కొల్లేరు కాంటూరు–5 వరకు 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 9 మండలాల్లో కొల్లేరు పరీవాహక గ్రామాలుగా 122 ఉన్నాయి. మొత్తం జనాభా 3.2 లక్షల మంది ఉండగా, 1,70,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన వృత్తి చేపల సాగు. కొల్లేరు కాంటూరును 5 నుంచి 3కు కుదిస్తామని ప్రతి ఎన్నికల్లో టీడీపీ నాయకులు చెబుతున్నా అమలు కావడం లేదు. అటకెక్కిన టెంపుల్ టూరిజం ప్రతిపాదనలుకొల్లేరు విస్తరించిన ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికం భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమామహేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వస్వామి ఆలయాలు, భీమవరం మావుళ్లమ్మ దేవస్థానాలు ఉన్నాయి. కొల్లేరు ప్రాంతమైన కైకలూరులో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొల్లేరు టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.వైఎస్ జగన్ పాలనలో రూ.187 కోట్ల ప్రణాళికజిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజానికి రూ.187 కోట్ల ప్రణాళికతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయాలని భావించారు. పర్యాటక శాఖ అధికారులు కొల్లేరులో 10 ప్రాంతాలను టూరిజానికి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పటికే కేంద్రం వద్ద డీపీఆర్‌లు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. పక్షులపై కానరాని ప్రేమకొల్లేరు సరస్సుపై ఇటీవల జరిగిన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్‌లో మొత్తం 105 రకాల పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులను గుర్తించారు. ప్రధానంగా రాష్ట్రంలో పక్షి ప్రేమికుల స్వర్గధామంగా ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల కేంద్రం వాసికెక్కింది. ఇక్కడ అరుదైన పెలికాన్ పక్షులు రావడంతో పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. అటవీ శాఖ 283 ఎకరాల్లో పక్షుల విహారానికి చెరువును ఏర్పాటు చేసింది. పక్షి నమూనా మ్యూజియం ఆకట్టుకుంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేంద్రానికి నిధుల కొరత వేధిస్తోంది. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి పరిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. వలస పక్షుల సందడి షురూకొల్లేరు ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల అందాలను తిలకించడానికి ప్రతి ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు అనువైన కాలం. కొల్లేరు అభయారణ్యంలో 190 రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సంచరిస్తుంటాయి. ప్రధానంగా కొల్లేరులో పెలికాన్ పక్షి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. కొల్లేరు ఇటీవల వరదలు, వర్షాలకు నిండుకుండలా మారింది. ప్రతి ఏటా విదేశీ పక్షులు వలస వచ్చి సంతానోత్పత్తితో తిరిగి స్వస్థలాలకు వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. -
ఫారెస్ట్ ఆఫీస్‌లో లిక్కర్ పార్టీ.. ముగ్గురు అధికారులపై వేటు
సాక్షి, జగిత్యాల జిల్లా: దసరా వేడుకలకు అటవీశాఖ కార్యాలయాలన్నే బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేసిన అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దసరాకు ఒక రోజు ముందు నుంచే కార్యాలయంలో మందు పార్టీతో పాటు, అడవి జంతువుల మాంసంతో అధికారులు విందు చేసుకున్నారు. చిత్రీకరిస్తున్న మీడియాపైనా అధికారులు చిందులు తొక్కారు మీడియా కథనాలతో అటవీ శాఖ అధికారులు స్పందించారు.విచారణ చేపట్టిన అటవీశాఖ.. జగిత్యాల డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్‌తో పాటు, ముత్యంపేట బీట్ ఆఫీసర్ సాయిరాంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వాచర్ లక్ష్మణ్‌ను విధుల నుంచి తొలగించింది.ఇదీ చదవండి: TG: బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ -
అటవీశాఖ కార్యాలయంలో దావత్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఉద్యోగులు దావత్ ఏర్పాటు చేసుకున్నారు. మీడియా అక్కడికి చేరుకోవడంతో కొంత మంది ఉద్యోగులు అక్కడి నుంచి జారుకోగా మరికొంత మంది అక్కడే ఉంటూ నానా హంగామా సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులే మందుతాగుతూ విందు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ను వివరణ కోరగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. dinner -
‘సీతాకోక’..సర్వే
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సీతాకోకచిలుక ఏ చెట్టుపై వాలుతుంది.. ఏ పువ్వులోని మకరందాన్ని స్వీకరిస్తుంది ? గతంలో ఉన్న సీతాకోక చిలుకలు.. ప్రస్తుతం ఉన్నాయా? వాటి ఆవాసం..అనుకూలత మెరుగుపడాలంటే ఏం చేయాలి? తదితర విషయాలు తెలుసుకుంటూ వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారులు.మూడు నెలలుగా కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో బటర్ ఫ్లై జాతుల గుర్తింపునకు సర్వే జరుగుతోంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్(వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్), మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ రాంజన్ విరాని, పక్షుల నిపుణులతో ముందుగా 30 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులు ప్రతీరోజు సర్వే చేస్తున్నారు. రంగు, ఆకారం తదితర గుణాల ఆధారంగా సీతాకోక చిలుకలను గుర్తించి రికార్డు చేస్తున్నారు.100 నుంచి 150జాతులు ఉన్నట్టు అంచనాకవ్వాల్ పరిధిలోని కోర్, బఫర్ ప్రాంతాల్లో 100 నుంచి 150 సీతాకోక చిలుకల జాతులు ఉంటాయని అంచనా. కడెం, గోదావరి, ప్రాణహితతోపాటు వాగులు, వంకలు, రిజర్వు ఫారెస్టు, మైదాన ప్రాంతాల్లోనూ సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు 60 రకాల వరకు సీతాకోక చిలుకలను గుర్తించారు. వాటి ఫొటోలతోపాటు ఆవాసం, జీవన విధానం, ప్రత్యేకత తదితర వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. టైగర్ సఫారీకి వచ్చే పర్యాటకులకు బటర్‌ఫ్లై పార్కులు చూపిస్తూ ఓ ప్రత్యేక అనుభూతి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. జన్నారం పరిధిలో ఓ బటర్‌ఫ్లై పార్కును అభివృద్ధి చేశారు. ఇదే తరహాలో మంచిర్యాల పట్టణానికి సమీపంలో గాంధారి ఖిల్లా, చెన్నూరు అర్బన్ పార్కు, బెల్లంపల్లి డివిజన్లలోనూ సిద్ధం చేస్తున్నారు. వనదర్శినిలో భాగంగా స్థానికులు, పర్యాటకులకు అడవులు, వన్యప్రాణులపై అవగాహనతోపాటు ఇకపై సీతాకోక చిలుక జీవన విధానం, వాటి పరిరక్షణ చర్యలను ప్రత్యేకంగా వివరించనున్నారు. జీవ వైవిధ్యానికి గుర్తు ప్రకృతిలో జీవ వైవి«ధ్యానికి గుర్తుగా సీతాకోక చిలుకను చెబుతారు. వీటి మనుగడే అక్కడి పర్యావరణ అనుకూలత, ప్రతికూలతను తెలియజేస్తుందని నిపు ణులు పేర్కొంటున్నారు. భూమిపై మొలిచే మొక్కలు, చెట్లు, గాలిలో ఎగిరే పక్షులు, ఇతర క్రిమికీటకాలు, జంతుజాలంతో ప్రత్యక్ష సంబంధముండే సీతాకోక చిలుకలు ఆ ప్రాంతం పర్యావరణ వ్యవస్థ, ఆహారపు గొలుసు లో కీలకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పుష్పాల పుప్పొడి, మకరందం, ఆవాసాలు, విత్తన వ్యాప్తి, పక్షుల మనుగడ, క్రిమికీటకాలను సమతుల్యం చేయడం వంటివి సీతాకోకచిలుకకు ప్రధాన క్రియలుగా ఉంటాయి. ప్రత్యేకంగా పార్కులు కవ్వాల్‌లో కేవలం పులులే కాకుండా, అన్ని జీవులను సంరక్షించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎన్నో రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. వాటిని సంరక్షిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది. పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా బటర్‌ఫ్లై పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. - శివ్‌ఆశిష్ సింగ్, జిల్లా అటవీ అధికారి, మంచిర్యాల -
తుది దశకు ‘ఎకో టూరిజం’
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యంతో అలరారుతున్న తెలంగాణను ‘ఎకో టూరిజం సెంటర్’గా మలిచేలా కార్యాచరణ ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి. పర్యావరణ హితంగా, ప్రకృతి, సహజ సంపదకు హాని కలగకుండా చూస్తూనే, ప్రజలు, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాలు తెగిపోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. పలు గ్రామాలను ‘ఎకో విలేజ్ లుగా’తీర్చిదిద్దడంతోపాటు వారసత్వ, సాంస్కృతిక పరమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎక్కడికక్కడ ఆయా ఎకో టూరిజం సెంటర్లలో స్థానిక గిరిజనులు, ఇతర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వంటకాలు, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను భాగం చేస్తూ ప్రకృతి పర్యాటకానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎకో టూరిజం స్పాట్లను గుర్తించి, వాటి ప్రాధాన్యం, ప్రత్యేకతలను అర్థవంతంగా చెప్పడంతోపాటు ఆన్లైన్లో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా వెబ్సైట్లు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తంగా తెలంగాణ ఎకో టూరిజానికి ఓ బ్రాండ్‌గా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, ఇతర ప్రదేశాల్లోనూ ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఎకో టూరిజం ప్రదేశాలను స్టడీ టూర్ కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతోపాటు ఉద్యాన వనాలు, పాల ఉత్పత్తులు వంటి వాటిపై ఆధారపడి జీవించే వారికి వీటిని ఉపాధి కేంద్రాలుగా మలిచే దిశగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎకో టూరిజం ప్రాజెక్టులపై అటవీశాఖాపరంగా ముసాయిదా విధానం సిద్ధం కాగా, సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలన తర్వాత ప్రభుత్వపరంగా ఈ ప్రణాళికకు తుదిరూపు ఇస్తారు. ఈ మేరకు ఇటీవల ఎకో టూరిజం కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ హోదాలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఫైనల్ డ్రాఫ్ట్‌నకు ఆమోదం తెలిపారు. తుది అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషనే నోడల్ ఏజెన్సీ ఎకో టూరిజం పాలసీ అమలుకు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ కార్పొరేషన్ ద్వారానే ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేస్తారు. ఎకో టూరిజం ప్రాజెక్టుల ఆమోదానికి ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎకో టూరిజం కేంద్రాల అభివృద్ధికి ఇతర నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్), ఇతర నిధులను సమీకరించాలని అటవీశాఖ భావిస్తోంది. మొత్తంగా ఎకో టూరిజం కేంద్రాల నిర్వహణ అనేది పూర్తిస్థాయిలో ప్రభుత్వపరంగా అటవీశాఖ ద్వారానే నిర్వహించకుండా, ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీలకు ఇస్తే మరింత పకడ్బందీగా అమలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా అటవీశాఖ పరంగా ఆయా అంశాలను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రకృతి సమతుల్యతకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపట్టడమనేది కొంత కత్తిమీద సాము లాంటిదేనని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఎకో టూరిజం పేరుతో అటవీ ప్రాంతాల్లోని జీవజాలం, వైవిధ్యానికి ఇబ్బందికరంగా మారకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. -
రాజమండ్రి నుంచి మకాం మార్చిన చిరుత
-
ఇది ప్రకృతి వైపరీత్యం
సాక్షి, హైదరాబాద్ : వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల చేర్పులతోపాటు అరుదైన ప్రకృతి వైపరీత్యం కారణంగా ములుగు అడవుల్లో చెట్లకు భారీగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదిక సమర్పించింది. దీనిని ‘ఎకోలాజికల్ డిజాస్టర్’గానే పరిగణించాల్సి ఉంటుందని ఇందులో సూచించినట్టు సమాచారం. మొత్తంగా 204 హెక్టార్లలో (500 నుంచి 600 ఎకరాల్లో) దాదాపు 70 వేల దాకా వివిధ జాతుల చెట్లకు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. అటవీ పునరుద్ధరణతోపాటు, భూసార పరిరక్షణ చర్యలు, గ్యాప్ ఏర్పడిన చోట్ల వాటిని నింపేలా పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, వంటివి చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఇంకా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతోపాటు, కొండ ప్రాంతాలు వంటివి ఉండడంతో జరిగిన నష్టం, కూలిన చెట్ల వివరాల సేకరణ అంత వేగంగా సాగడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.వివిధ రూపాల్లో వాటిల్లిన నష్టంపై వారంరోజుల్లో క్షేత్రస్థాయి నుంచి ఒక స్పష్టమైన అంచనాకు వచ్చాక పర్యావరణం, అడవులతో సంబంధమున్న నిపుణులతో అధ్యయనం జరిపించాలని అటవీశాఖ నిర్ణయించింది. దేశంలోనే అత్యంత అరుదైన రీతిలో ములుగు అటవీప్రాంతంలో చెట్లకు నష్టం జరిగినందున, పూర్తి సమాచారం అందిన తర్వాతే అటవీ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన నివేదిక అందజేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ములు గులో సుడిగాలుల బీభత్సం సమయంలోనే ఆదిలా బాద్ జిల్లా ఉట్నూరులో, ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోనూ స్వల్పస్థాయిలో చెట్లకు నష్టం జరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు వస్తేనే...హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రాలను సేకరించడం ద్వారా ములుగు అటవీ విధ్వంసం కారణాలు వెల్లడి కాగలవని అటవీశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అవసరమైన డేటాను ఉపగ్రహం నుంచి సేకరిస్తున్నామని, రెండురోజుల్లో దీనిపై వివరాలు అందజేస్తామని ఎన్ఆర్ఎస్సీ అధికారులు చెప్పారు. ఈ సమాచారాన్ని తమ ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్ ఏరియా డివిజన్ క్రోడీకరించి అందజేస్తామని అటవీ అధికారులకు చెప్పారు. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎండీ)పై అటవీ అధికారులు పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరలేదు.ములుగు పరిసర ప్రాంతాల్లో తమ అబ్జర్వేటరీ లేనందువల్ల, ఈ బీభత్సం చోటుచేసుకున్న రోజునాటి వివరాలు ఇవ్వలేకపోతున్నామని అధికారులకు ఐఎండీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఐఎండీనే చేతులెత్తేస్తే ఇంకా తమకు ఎవరు వాతావరణ సాంకేతిక విషయాలు అందించగలరని అటవీ అధికారులు విస్తుపో తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తయి, ఎన్ఆర్ఎస్సీ నుంచి సాంకేతిక సమాచారం అందాక 2,3 రోజుల్లో ములుగు జిల్లా అటవీ అధికారులు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి. -
ఏ చెట్లు.. ఎన్ని కూలాయి?
సాక్షి, హైదరాబాద్/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడంపై అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా.. రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (204కుపైగా హెక్టార్లు)లో దాదాపు 70వేల చెట్లకు నష్టం జరిగినట్టుగా ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇందులో నల్లమద్ది, ఏరుమద్ది, తెల్లమద్ది, గుప్పెన, తునికి, టేకు, ఎగిశా, నేరేడు, మారేడు. గుంపెన, బొజ్జ, బూరుగ తదితర 50, 60 రకాల చెట్లు ఉన్నట్టుగా వెల్లడించినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో అంచనా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నట్టు తెలిసింది. కూలిపోయిన వాటిలో 50 నుంచి 70 ఏళ్లపైబడినవి భారీ వృక్షాల నుంచి ఐదు, పదేళ్ల వయసున్న చిన్న చెట్ల దాకా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో చెట్ల లెక్కలు తీస్తూ.. ములుగు జిల్లా మేడారం అడవుల్లో కూలిన చెట్ల లెక్కింపులో అధికారులు నిమగ్నమయ్యారు. 30 హెక్టార్లకు ఒక బృందం చొప్పున పది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 20 మంది సిబ్బంది ఉన్నారు. వారు పూర్తిగా నేలకూలిన, సగానికి విరిగిన, కొమ్మలు విరిగిన చెట్లతోపాటు బాగున్నవాటిని కూడా గుర్తించి.. వాటి కొలతలు నమోదు చేస్తున్నారు. ఏయే రకాల చెట్లు ఎన్ని ఉన్నాయి, కూలినవి ఎన్ని అనేదీ లెక్కతీస్తున్నారు. రెండు రోజుల్లో సవివర నివేదికను సిద్ధం చేసి అటవీశాఖకు అందించనున్నట్టు తెలిసింది. కారణమేమిటనే దానిపై ఆరా.. కేవలం గంట, అరగంటలోనే అంత పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడానికి కారణాలపై.. వాతావరణశాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ)లను అటవీశాఖ సంప్రదించింది. మెట్రోలాజికల్, శాటిలైట్ డేటాలను విశ్లేషించి.. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది గుర్తించేందుకు ప్రయత్నించనున్నారు. మరోవైపు గురువారం అరణ్యభవన్ నుంచి జిల్లా అటవీ అధికారులతో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు తరహాలో రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ఎక్కడైనా చెట్లకు నష్టం జరిగిందా అన్నది పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేస్తున్నాం..సుడిగాలుల కారణంగా అటవీ ప్రాంతానికి, చెట్లకు జరిగిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. దెబ్బతిన్న చోట అటవీ పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. ములుగులో అంత బీభత్సం జరగడానికి కారణాలు, ఇతర అంశాలపై లోతైన అధ్యయనం నిర్వహిస్తాం. – ఏలూసింగ్ మేరూ, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) -
నల్లమల ‘మన్ కీ బాత్’.. చెంచులే చేయూత!
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమలలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక చెంచులు రక్షణగా ఉంటున్నారు. అడవినే నమ్ముకొని బతుకుతున్న వారు ఇక్కడి చెట్లు, వన్యప్రాణులు, సహజ సిద్ధమైన జలధారల పట్ల ఎంతో మమకారంగా ఉంటారు. వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ సిబ్బందిలోనూ చెంచులు క్షేత్రస్థాయిలో పాలు పంచుకుంటూ అడవికి పహారాగా నిలుస్తున్నారు. నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దట్టమైన కోర్ ఏరియాలో 20 వరకు చెంచుపెంటలు, చెంచుల ఆవాసాలు ఉండగా, వీరి సంపూర్ణ తోడ్పాటుతో పులుల సంతతి క్రమంగా పెరుగుతోంది.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 2018లో 12 పులులు ఉండగా, ప్రస్తుతం పులుల సంఖ్య 32కు చేరినట్టు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు 187 వరకు చిరుతలు, వందల సంఖ్యలో వన్యప్రాణులు, మిశ్రమ జంతుజాతులకు నల్లమల నిలయమైంది. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నల్లమలలోని చెంచుల కృషిని ప్రస్తావించారు. ప్రకృతితో మమేకమవుతూ జీవిస్తున్న చెంచులు నల్లమలలో టైగర్ ట్రాకర్లుగా గొప్ప సేవలందిస్తున్నారని కొనియాడారు. ఇక్కడ సంఘర్షణకు తావులేదు.. దేశంలో చాలాచోట్ల పులుల అభయారణ్యాల్లో మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణ తలెత్తుతోంది. మనుషులపై పులుల దాడులు చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. అయితే నల్లమలలోని అమ్రాబాద్ కోర్ ఏరియాలోని దట్టమైన అరణ్యంలో చెంచులు నివసిస్తుండగా.. చెంచులు, పులులకు మధ్య ఇప్పటివరకు ఎలాంటి సంఘర్షణ తలెత్తలేదు. అడవిలో పులులు, వన్యప్రాణులకు ఆటంకం కలగకుండా జీవనం సాగిస్తున్నారు. అడవిలో ఎప్పుడైనా పులితోపాటు ఇతర వన్యప్రాణులు ఎదురైన సందర్భంలో దూరం నుంచే గమనించి వాటి స్వేచ్ఛా విహారానికి భంగం కలిగించకుండా మసులుకుంటారు. క్షేత్రస్థాయిలో వాచర్లుగా చెంచులు.. అటవీ, వన్యప్రాణుల సంరక్షణతోపాటు పులుల అడుగుజాడలను గుర్తించడం, క్షేత్రస్థాయి విధుల్లో అటవీశాఖ ఇక్కడి స్థానిక చెంచులనే భాగస్వాములను చేస్తోంది. పులుల జాడ తెలుసుకునేందుకు, పాదముద్రలు, విసర్జితాల సేకరణ, పులులు తిరగాడిన ప్రాంతాలకు వెళ్లేందుకు సుమారు 130 మంది చెంచు సిబ్బందిని అటవీశాఖ నియమించుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మొత్తం 27 బేస్‌క్యాంపులకు గానూ 24 క్యాంపుల్లో చెంచులే పనిచేస్తున్నారు.టైగర్ ట్రాకర్లు, ఎనిమల్ ట్రాకర్లు, ఫారెస్ట్ వాచర్లుగా చెంచులే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. నల్లమలలో చెంచులు, సమీప ఆవాసాల ప్రజల సహకారంతోనే పులుల సంతతి పెరిగిందని నాగర్‌కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ తెలిపారు. అడవిలో క్షేత్రస్థాయి విధుల్లో ఎక్కువగా చెంచులే సేవలందిస్తున్నారని, భవిష్యత్‌లోనూ వీరి సంఖ్యను మరింత పెంచనున్నట్టు వివరించారు.పులి కనిపిస్తే ఆగిపోతాం.. అడవిలో పోతున్నప్పుడు పులి ఎదురైతే దూరం నుంచే చూసి అక్కడే ఆగిపోతాం. చప్పుడు చేయకుండా ఉండి పులి అక్కడి నుంచి వెళ్లే దాకా వేచిచూస్తాం. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మమ్మల్ని ఏమీ చేయవు. పులులు, వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా పనులు చేసుకుంటాం. – గురువయ్య, మేడిమల్కల చెంచుపెంట, నాగర్‌కర్నూల్ జిల్లా -
ఐదేళ్లలో పంచాయతీలకు రూ.7,587.64 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం 8,283.92 కోట్లు పంచాయతీలకు విడుదల చేయగా, అందులో రూ.7,587.64 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి జమ చేసిందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసన సభలో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 2019–20లో 2,336.56 కోట్లు, 2020–21లో రూ.1,837.50 కోట్లు, 2021–22లో రూ.1,338.52 కోట్లు, 2022–23లో రూ.1,378.65 కోట్లు, 2023–24లో రూ.1,392.69 కోట్లు విడుదలైందన్నారు. అయితే ఒక్క 2023–24 సంవత్సరంలో 696.41 కోట్లు పంచాయతీలకు చేరిందని, ఆ ఏడాది వచి్చన నిధుల్లో మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందని తెలిపారు. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిందన్నారు. ఇప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు రూ.103 కోట్లు బకాయిలు ఉన్నట్టు చెప్పారు. పంచాయతీల అనుమతి లేకుండా డిస్కంకు కరెంట్ బిల్లుల కింద రూ.2,285 కోట్లు మళ్లించిందన్నారు. 2018లో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలను రెండేళ్లు ఆలస్యం చేయడం వల్ల సమస్యలు తిష్టవేసినట్టు తన సమీక్షల్లో తేలిందన్నారు. పంచాయతీ ఖాతాల్లోకి లావాదేవీలు జరిగినప్పటికీ, ఇప్పుడు బ్లీచింగ్ కొనడానికి కూడా డబ్బులు లేవన్నారు. పంచాయతీల్లో నిధుల వినియోగం, మళ్లింపుపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మడ అడవులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలుమడ అడవులను విధ్వంసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయం అరణ్య భవన్లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కుంకీ ఏనుగుల గురించి తాను స్వయంగా చర్చిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ ఎ.కె.నాయక్, అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శరవణన్ తదితరులు పాల్గొన్నారు.ఐదేళ్లలో ఒక్క బ్రూవరేజ్కు అనుమతివ్వలేదు గత ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క బ్రూవరేజ్కు కూడా అనుమతి ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే బొండా ఉమా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మైక్రో బ్రూవరేజ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారన్నారు. లైసెన్సుల జారీ, మార్గదర్శకాల అమల్లో ఎటువంటి ఉల్లంఘనలు గుర్తించలేదని చెప్పారు. -
ఆర్టీఐని బతకనివ్వరా?!
విధాన నిర్ణయాలపై అనవసర గోప్యత పాటించటం, నిజాలు రాబట్టే ప్రయత్నాలకు పాతరేయటం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పుట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడిచింది. లోటుపాట్లు సరిదిద్దుకుంటూ మరింత పదునెక్కాల్సిన ఆ చట్టం కాస్తా ప్రభుత్వాల పుణ్యమా అని నానాటికీ నీరుగారుతోంది. తాజాగా ఆ చట్టం తమకు వర్తించదంటూ జవాబిచ్చి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ జాబితాలో చేరింది. షోపూర్ జిల్లా కునోలో ఉన్న వన్యప్రాణి సంరక్షణకేంద్రం, మాందసార్ జిల్లాలో నెలకొల్పబోయే మరో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి, ముఖ్యంగా చిరుతల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి సమాచారం కావాలంటూ అడిగిన సమాచార హక్కు కార్యకర్త అజయ్ దూబేకు కళ్లు తిరిగి కింద పడేలా ప్రభుత్వ అటవీ విభాగం సమాధానమిచ్చింది.అలాంటి సమాచారం వెల్లడిస్తే దేశ భద్రతకూ, సార్వభౌమత్వానికీ ముప్పు ఏర్పడుతుందట. దేశ సమగ్రత, వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయట. వేరే దేశంతో సంబంధాలు కూడా దెబ్బతినవచ్చట. కాబట్టి చట్టంలోని సెక్షన్ 8(1)(ఏ) ప్రకారం ఇవ్వడం కుదర దట. ఒక చిరుత కూన కాలికి కట్టు కట్టినట్టున్న ఫొటో చూసి మొన్న ఫిబ్రవరిలో పులుల జాతీయ సంరక్షణ ప్రాధికార సంస్థకు దూబే ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు అటవీశాఖ స్పందించింది. కానీ ఆ సమాచారం వెల్లడిస్తే మిన్ను విరిగి మీదపడుతుందన్న స్థాయిలో సమాధానమిచ్చింది. ప్రభుత్వాల పనితీరుపై అవధుల్లేని సమాచారం పౌరులకు లభ్యమైనప్పుడే ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే స్వేచ్ఛ, సమానత్వాలు సాధించుకోవటం, వాటిని కాపాడుకోవటం సాధ్యమవు తుందని జగజ్జేత అలెగ్జాండర్‌కు గురువైన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెబుతాడు. అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దినాటివాడు. సమాచారం ఇవ్వటానికి ససేమిరా అంటున్న మన ప్రభుత్వాలు మానసికంగా తాము ఏకాలంలో ఉండిపోయామో తెలుసుకోవటం ఉత్తమం. ఇప్పుడే కాదు... 2005లో ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే దేశభద్రత పేరు చెప్పి 22 సంస్థలకు మినహాయింపు ఇచ్చి దాని స్ఫూర్తిని దెబ్బతీశారు. తర్వాత కాలంలో ఆ జాబితా పెరుగుతూ పోయింది. ఆర్టీఐ పరిధి లోకి రాబోమని వాదించే వ్యవస్థలు, విభాగాలు ఎక్కువవుతున్నాయి. రాజకీయ పార్టీలు మొదలు కొని న్యాయవ్యవస్థ వరకూ ఇందులో ఎవరూ తక్కువ తినలేదు. పారదర్శకత తమవల్ల కాదని అందరికందరూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. అసలు ఏ సమాచారమైనా కోరితే 30 రోజుల్లో దాన్ని అందజేయాలని ఆర్టీఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అది ఎక్కడా అమలవుతున్న దాఖలా లేదు. అప్పీల్ కోసం వెళ్తే అక్కడ మరో కథ. చాలా రాష్ట్రాల్లో సమాచార కమిషనర్లు, ఇతర సిబ్బంది తగినంతమంది ఉండటం లేదు. కొన్నిచోట్ల ప్రధాన కమిషనర్ల జాడలేదు. అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ల, కమిషనర్ల పదవీకాలం, వారి జీతభత్యాలు, సర్వీసు నిబంధనలు రూపొందించే నిర్ణయాధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆర్టీఐకి సవర ణలు తెచ్చింది. ఈ సవరణలు సహజంగానే సమాచార కమిషన్ వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బ తీశాయి. పార్లమెంటులో తగిన సంఖ్యాబలం ఉన్నది కనుక చట్ట సవరణలకు సులభంగానే ఆమోదం లభించింది. కానీ సంబంధిత వర్గాలతో మాట్లాడాకే ఆ సవరణలు తీసుకురావాలన్న కనీస సంప్రదాయాన్ని పాలకులు విస్మరించారు. పౌరులు ప్రధానంగా ప్రభుత్వాల నుంచే సమాచారం రాబట్టాలని కోరుకుంటారు. ఆ ప్రభుత్వమే రకరకాల ప్రయత్నాలతో దానికి అడ్డుపుల్లలు వేయ దల్చుకుంటే ఇక ఆ చట్టం ఉండి ప్రయోజనమేమిటి? ఆర్టీఐ తీసుకొచ్చిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగే తర్వాత కాలంలో దాన్ని ‘మితిమీరి’ వినియోగిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా పాలకులందరిదీ ఇదే బాణీ. పాలనలో పారదర్శకత కోసం, ప్రభుత్వాలకు జవాబుదారీతనం పెంచటం కోసం వచ్చిన చట్టం హద్దులు దాటుతున్నదని పాలకులతోపాటు ఉన్నతాధికార గణం కూడా విశ్వసిస్తోంది. ఆర్టీఐని వమ్ము చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కనుకనే సమాచారం కోరినవారి ఆనుపానులు క్షణాల్లో అవతలివారికి వెళ్తున్నాయి. సమాచార హక్కు ఉద్యమకారుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఇప్పటివరకూ వందమందికి పైగా కార్యకర్తలను దుండగులు హత్యచేశారు. ఈ ఏడాది మొదట్లో ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పౌరుల సమాచార హక్కు ప్రాధాన్యతనూ, ప్రజాస్వామ్యంలో అది పోషించే కీలకపాత్రనూ తెలియజెప్పింది. రాజ్యాంగదత్తమైన ప్రాథమిక హక్కుల్లో దాన్నొకటిగా గుర్తించింది. ఏదైనా చట్టం వచ్చిన ప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే వారున్నట్టే దుర్వినియోగం చేద్దామనీ, స్వప్రయోజనాలు సాధించు కుందామనీ ప్రయత్నించేవారు ఉంటారు. అంతమాత్రంచేత ఆ చట్టాన్ని నీరుగార్చ కూడదు. కార్గిల్ అమర జవాన్ల కుటుంబాలకు ఉద్దేశించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలోకి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చొరబడి ఫ్లాట్లు కొట్టేసిన వైనం ఆర్టీఐ చట్టం లేకపోయివుంటే బయటి కొచ్చేదే కాదు. అలాగే మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం, పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్ మెంట్ల అక్రమాలు ఎప్పటికీ వెలుగుచూసేవి కాదు. వ్యక్తులుగా ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే శిక్షించే విధంగా నిబంధనలు తెస్తే తప్పులేదు. కానీ ఆ సాకుతో మొత్తం చట్టాన్నే నీరుగార్చాలని చూడటం, దేశ భద్రత పేరు చెప్పి అందరినీ బెదరగొట్టడం ప్రమాదకరమైన పోకడ. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్నీ, జవాబుదారీతనాన్నీ దెబ్బతీస్తాయి. నిరంకుశత్వానికి బాటలు పరుస్తాయి. -
మహానందిలో మరోసారి చిరుత సంచారం
మహానంది: నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది. శనివారం తెల్లవారు జామున 1.20 గంటల ప్రాంతంలో మూడోసారి గోశాల ప్రాంగణంలో సంచరించింది. ఉదయం విధులకు హాజరైన ఏఈవో ఓంకారం వేంకటేశ్వరుడు సీసీ కెమెరాలు పరిశీలించగా గోశాల ముందు నుంచి కృష్ణనంది మార్గం వైపు చిరుతపులి వెళ్లిన దృశ్యం కనిపించింది. దీంతో ఆయన ఈ విషయాన్ని ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన డీఆర్వో హైమావతి, ఎఫ్‌బీవో ప్రతాప్‌లకు సమాచారం ఇచ్చారు. చిరుత భయంతో వణికిపోతున్న స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఆ చిరుతను బంధించాలని కోరుతున్నారు. -
ప్రకాశం: గుంతలో చిరుత.. అధికారుల పరుగులు
ప్రకాశం, సాక్షి: ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత పులి కలకలం రేపింది. గుంతలో చిక్కుకొని ఉన్న చిరుత పులిని గ్రామస్తులు గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించడానికి వలలు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించారు. బుధవారం రాత్రి చీకటి కావడంతో రెస్క్యూకి చర్యలకు అంతరాయం కలిగింది. ఇవాళ తిరుపతి నుంచి వచ్చిన టైగర్ రెస్కూ టీమ్.. చిరుత పులిని బంధించి అడవిలో వదలనున్నారు.ఇదిలా ఉంటే.. నంద్యాల మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం భక్తులు, స్థానికుల్లో భయాందోళనకు కారణమైంది. గోశాల, అన్నదాన సత్రం దగ్గర చిరుత సంచరించిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. -
మహానందిలో మరోసారి చిరుత కలకలం
మహానంది: మహానంది గోశాల వద్ద బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చిరుతపులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ ఏఈఓ ఓంకారం వెంకటేశ్వరుడు, సిబ్బంది వెంటనే నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దినేష్‌కుమార్‌రెడ్డి, డీఆర్ఓ హైమావతి, ఎఫ్బీఓ ప్రతాప్‌లకు సమాచారం అందించారు. వారు మహానంది గోశాల వద్దకు చేరుకుని చిరుతపులి సంచరించిన ప్రదేశం, పాదముద్రలను గుర్తించారు. ఇదిలా ఉండగా.. నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని శిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడిలో మంగళవారం ఓ మహిళ మృతి చెందిన విషయాన్ని మరువక ముందే తాజా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఘటనతో పచ్చర్ల వద్ద నల్లమలలో అటవీశాఖ అధికారులు చిరుతపులి కోసం బోను, పది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే అటుగా సంచరించే చిరుతపులి అంతటా తిరుగుతుందని, బోనులోకి మాత్రం రావడం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. గతంలోనూ మహానంది, పచ్చర్ల ప్రాంతాల్లో చిరుతలు సంచరించగా.. ఈ గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయనే విషయాలపై అటవీశాఖ అధికారులు ఇప్పటికీ గోప్యత పాటిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశంలో చిక్కిన చిరుత ఊపిరి పీల్చుకున్న అధికారులు, స్థానికులు ప్రకాశం జిల్లా దేవనగరం సమీపంలో ఘటన గిద్దలూరు రూరల్: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం సమీపంలో ఓ చిరుతపులి స్థానికులకు కంటబడడంతో భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు చిరుతపులిని బంధించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుతపులి దేవనగరం గ్రామ శివారులో మేకలు మేపుకునేవారి కంటపడింది. దీంతో వారు కేకలు వేయడంతో చిరుతపులి అక్కడే ఉన్న ఓ పాడుబడిన బావిలోకి దిగింది.దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ డైరెక్టర్ వై.వి.నరసింహారావు, రేంజి ఆఫీసర్ కుమార్‌రాజ రెస్క్యూ టీమ్ సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకుని బావి చుట్టూ వలచుట్టి చిరుతను బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన చిరుతను బోనులో బంధించి అడవిలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. -
గజరాజులతో గస్తీ
పెద్దదోర్నాల: నల్లమల అడవుల పరిరక్షణకు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమూల్యమైన వృక్షసంపద అక్రమ రవాణాను అరికట్టేందుకు.. అరుదైన వన్యప్రాణులను సంరక్షించి వేసవిలో అగ్నికీలల నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఇప్పటికే బేస్ క్యాంప్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, యాంటీ పోచింగ్ బృందాలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు అభయారణ్యాల్లో ఇకపై గజరాజులతో గస్తీ చేపట్టాలని అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు అభయారణ్యాల పరిధిలో..మన రాష్ట్రంలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న అడవిని కేంద్ర ప్రభుత్వం 1983లో అభయారణ్యంగా ప్రకటించింది. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు రాజీవ్‌గాంధీ అభయారణ్యం.. మార్కాపురం, గిద్దలూరు, ఆత్మకూరు, నంద్యాల డివిజన్ల పరిధిలో గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం విస్తరించి ఉన్నాయి. వీటిలో పులులతోపాటు చిరుత, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, హైనా, నెమళ్లతోపాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఎన్నోరకాల వృక్షాలు, ఔషధ మొక్కలు నల్లమల అభయారణ్యంలో ఉన్నాయి. ఇవన్నీ మారుమూల లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను సందర్శించి వాటిని సంరక్షించే బాధ్యత కత్తిమీద సాములా మారింది.మూలమూలల్నీ జల్లెడ పట్టేలా..మారుమూల ప్రాంతాల్లో సైతం వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షించేందుకు వీలుగా అటవీ శాఖ ఉన్నతాధికారులు సుశిక్షితులైన సిబ్బంది నేతృత్వంలో ఏనుగులతో గస్తీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు తమకు శిక్షణ పొందిన 9 ఏనుగులు అవసరమవుతాయని గుర్తించారు. తమకు అవసరమైన 9 ఏనుగులను ఇవ్వాల్సిందిగా ఏపీ అటవీ శాఖ అధికారులు కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాశారు.దీనిపై స్పందించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు శిక్షణ పొందిన ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఏనుగులను కట్టడి చేసేందుకు మావటిలను తయారు చేసేందుకు అటవీశాఖ తమ సిబ్బందిని కర్ణాటక రాష్ట్రానికి పంపనుంది. రాష్ట్రానికి చెందిన సిబ్బంది అక్కడికి వెళ్లి గజరాజుల ఆహారపు అలవాట్లు, వాటి కదలికలు, వాటి ఇతర అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ పొందనున్నారు.6 ఏనుగులను రాజీవ్‌గాంధీ వన్యప్రాణుల అభయారణ్యానికి, మరో మూడు ఏనుగులను గుండ్లబ్రహ్మేశ్వరం అడవులకు పంపేలా చర్యలు చేపట్టన్నారు. ఏనుగుల్ని తీసుకొస్తే పెద్ద పులులు ఎక్కువగా సంచరించే లోతట్టు ప్రాంతాలైన నెక్కంటి, రేగుమానుపెంట, తూము గుండాలు, ఆలాటం తదితర ప్రాంతాల్లో సైతం ధైర్యంగా పెట్రోలింగ్ చేపట్టవచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఏనుగులతో గస్తీ నిర్వహించేలా చర్యలు అభయారణ్యంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. నడక మార్గంలో సిబ్బంది కొంతమేర వరకు మాత్రమే వెళ్లగలరు. అదే ఏనుగులతో అయితే సుదూర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించవచ్చు. పులులు సంచరించే ప్రదేశాల్లో సైతం భయం లేకుండా పెట్రోలింగ్ నిర్వహించవచ్చు. మనం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక అటవీ శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఏనుగుల్ని నల్లమలకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్ రేంజి అధికారి, పెద్దదోర్నాల -
కౌండిన్య.. గజరాజ్యం
ఎటుచూసినా ఆకాశాన్నంటే పచ్చదనం.. జలజలపారే సెలయేళ్లు.. అడుగడుగునా నీటిగుంటలు.. జీవాలకు సమృద్ధిగా ఆహారం.. ఇది కౌండిన్య. 353 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన దట్టమైన అడవి. అపారమైన జంతుసంపదకు ఆవాస కేంద్రం. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు సమీపంలోని కుప్పం మల్లప్పకొండ దగ్గర నుంచి పలమనేరులో కర్ణాటక సరిహద్దుల వరకు ఉన్న ఈ కౌండిన్య అటవీ ప్రాంతం గజరాజుల సామ్రాజ్యం.సాక్షి, చిత్తూరు: కౌండిన్య అటవీప్రాంతం వివిధ రకాల జంతుసంపదకు నిలయం. ఈ అడవిలో చిరుతపులి, తోడేలు, నక్క, అడవి రేసుకుక్క, దేవాంగపిల్లి, నక్షత్ర తాబేలు, అడవిపిల్లి, ఎలుగుబంటి, హైనా, జింక, దుప్పి, తోడేలు, ఎద్దు, కుందేళ్లు ఎక్కువగా ఉన్నాయి. పక్షి జాతుల్లో కోకిల, రామచిలుక, నెమలి, పావురాలు, పిచ్చుకలు, కొంగలు ఉన్నాయి. సర్పాల్లో కొండచిలువ, కట్లపాము, నల్లత్రాచు, రక్తపింజరిలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటవీశాఖ లెక్కల ప్రకారం ఏనుగుల సంఖ్య ఎక్కువ. దట్టమైన ఈ అడవిలో ఏనుగుల సంతతి ఏటేటా వృద్ధిచెందుతోంది. గుంపులుగుంపులుగా అడవిలో సంచరించే ఇవి అడపాదడపా గ్రామాల్లోను స్వైరవిహారం చేస్తున్నాయి. మూడురోజులు ఏనుగుల గణనఏటా మాదిరే ఈ సంవత్సరం మే నెలలో కూడా దక్షిణ భారతదేశంలో ఏనుగులను లెక్కించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకేసారి మూడురోజులు ఈ గణన నిర్వహించారు. మన రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల్ని లెక్కించారు. జిల్లా అటవీప్రాంతంలోని 66 బీట్లలో ఏనుగుల్ని అటవీ సిబ్బంది లెక్కపెట్టారు. తొలిరోజు 15 కిలోమీటర్ల పరిధిలో జిగ్‌జాగ్ విధానంలో లెక్కించారు.రెండోరోజు కూడా అదే పద్ధతి కొనసాగించారు. చివరిరోజున నీటికుంటలు, చెరువుల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిఘా వేసి ఏనుగుల్ని లెక్కపెట్టారు. అడుగుజాడలు, మలమూత్ర విసర్జన, చెట్లను తోసివేయడం, సమూహం, పరిణామం ఆధారంగా వాటిసంఖ్యను లెక్కించారు. కనిపించిన ఏనుగుల ఫొటోలు తీసి, లింగనిర్ధారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 వరకు ఏనుగులు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు.అందులో కౌండిన్య అటవీప్రాంతంలోనే 100 నుంచి 110 వరకు ఉంటాయని అంచనా. జిల్లాలో చిత్తూరు ఈస్ట్, వెస్ట్, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో సర్వే జరుగుతోంది. గత సంవత్సరం కంటే 10 నుంచి 20 వరకు ఏనుగులు పెరిగి ఉంటాయని భావిస్తున్నారు. కౌండిన్యలో 15 వరకు పిల్ల ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. పిల్ల ఏనుగులు ఉన్నాయంటే వాటి సంతతి బాగా పెరుగుతోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు ఈ లెక్కల వివరాలను కేంద్ర అటవీశాఖకు నివేదిస్తారు. కేంద్ర అటవీశాఖ ఏనుగుల సంఖ్యను ప్రకటిస్తుంది.ఏనుగుల సంచారం ఎక్కువ ఏటా ఏనుగుల సంఖ్యపై సర్వే చేస్తున్నాం. ఈ ఏడాది టెక్నికల్‌గా సర్వే నిర్వహించాం. ఫ్లగ్ మార్క్స్ ఆధారంగా బ్లాగ్ సర్వే చేశాం. వివరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేశారు. తుది నివేదికను కేంద్ర అటవీశాఖకు అందజేశాం. కుప్పం, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. – చైతన్యకుమార్‌రెడ్డి, డీఎఫ్‌వో -
దేవస్థానం, అటవీ శాఖ మధ్య సరిహద్దు చిచ్చు!
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం, అటవీ శాఖ మధ్య సరిహద్దు చిచ్చు రేగింది. గతేడాది దేవస్థానం వారు ఎక్కడ ఏ పనులు చేపట్టినా అటవీ శాఖ వారు తమ పరిధి అని గొడవ పడుతుండటంతో ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టడానికి ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. అప్పుడు విజయవాడలో జరిగిన సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ, దేవదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ, అటవీ శాఖ సీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి తదితరులు సరిహద్దులను నిర్ణయిస్తూ ప్లాన్ రూపొందించారు. అందులో అధికారులందరూ సంతకాలు చేశారు. శ్రీశైలానికి సంబంధించి 4,900 ఎకరాలు స్థలం ఉందని, అందులో 900 ఎకరాల డ్యామ్ నిర్మాణ సమయంలో మునిగిపోయి ఉందని గుర్తించారు. దీనితో పాటు ఎవరి హద్దులో వారు ఉండాలని, గొడవలకు పోవొద్దని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే అటవీ శాఖలో ఉన్న అధికారులు మరో ప్రాంతానికి బదిలీ కావడంతో కొత్తగా శ్రీశైలానికి బదిలీపై వచ్చిన ఎఫ్డీ, డీఎఫ్‌వో స్థానిక రేంజ్ ఆఫీసర్ ఉన్నత అధికారులను తప్పుదారి పట్టించారని ఆరోపణలున్నాయి. దీంతో కొత్తగా వచ్చిన ఎఫ్డీ, డీఎఫ్‌వోలు దేవస్థానానికి 100 ఎకరాలు మాత్రమే ఉందన్న కొత్త వాదన తెరపైకి తెచ్చారు. దీంతో దేవస్థానం–అటవీ శాఖ మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా దేవస్థానం పరిధిలో 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న టోల్గేట్ అటవీ శాఖ పరిధిలో ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు మధ్యలో గుంతలు తవ్వడం ప్రారంభించారు. అలాగే దేవస్థానం నిర్వహిస్తున్న డార్మెటరీ కూడా అటవీ శాఖ కిందికే వస్తుందని, అక్కడా తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఈవో పెద్దిరాజు, రెవెన్యూ ఏఈవో మల్లికార్జునరెడ్డి, పర్యవేక్షకులు శివప్రసాద్, దేవస్థానం సీఎస్‌వో అయ్యన్న, సంబంధిత సిబ్బందిని పంపించి ఎఫ్ఆర్వో నరసింహులు చేస్తున్న పనిని తాత్కాలికంగా నిలుపుదల చేయించారు. శనివారం మధ్యాహ్నం తిరిగి టోల్గేట్ దాటాక పిల్లర్ల నిర్మాణానికి అటవీ శాఖ వారు గుంతలు తవ్వుతున్నారు.. అని తెలుసుకుని రెవెన్యూ అధికారులు, సీఎస్‌వో సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులకు ఇబ్బంది కలిగించేలా దేవస్థానం ఆస్తులను ధ్వంసం చేస్తూ గుంతలు తవ్వడంపై అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ నరసింహులును ప్రర్మింస్తూ, స్థానిక సీఐకి సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. ప్రస్తుతం క్షేత్ర పరిధిలో నిర్మించిన డార్మెటరీ, దేవస్థానం టోల్గేట్ అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని, అందుకే ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు టోల్గేట్, నందీశ్వర డార్మెటరీల వద్ద సరిహద్దు నిర్మాణాల కోసం గుంతలను తవ్వి పిల్లర్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఎఫ్ఆర్వో నరసింహులు అన్నారు. డీఎఫ్‌వో సూచనల మేరకు నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, అనంతరం దేవస్థానంపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తామని చెప్పారు.15 రోజుల్లో నిర్ణయించుకోండి..సరిహద్దుల సమస్య ప్రభుత్వంలోని దేవదాయ–అటవీ శాఖకు సంబంధించి రెండు ప్రభుత్వ విభాగాలకు సంబంధించింది కాబట్టి 15 రోజుల్లోగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఐ ప్రసాదరావు.. దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఏఈవోలకు సూచించారు.దేవస్థానం వారికి నోటీసులు జారీ చేశామని ఎఫ్ఆర్వో చెబుతుండగా, తమకు నోటీసులు అందలేదని దేవస్థానం అధికారులు సీఐకు తెలిపారు. ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అటు దేవస్థానం, ఇటు అటవీ శాఖ సంయమనం పాటించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా ఇరువర్గాలకు సూచించారు. లేకుంటే దేవస్థానం, అటవీ శాఖ నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
ప్రాణాలు తీస్తున్న గజరాజులు
సాక్షి, అమరావతి: దేశంలో గత ఐదేళ్లుగా ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఏనుగులు దాడి కారణంగా ఏకంగా 2,657 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఐదేళ్లలో అంటే 2018–19 నుంచి 2022–23 వరకు దేశంలో అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలో ఏనుగు దాడి కారణంగా 542 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత జార్ఖండ్‌లో 474 మంది మృత్యువాత పడ్డారు. మానవులు– ఏనుగుల సంఘర్షణ ఫలితంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని, ఈ సంఘర్షణను తగ్గించే ప్రయత్నంలో భాగంగా దేశంలోని ఏనుగులు, వాటి అవాసాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రాయోజిత పథకం ప్రాజెక్టు ఎలిఫెంట్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.24 గంటల్లో పరిహారంమానవులు–ఏనుగుల మధ్య సంఘర్షణ నివారణకు ఇప్పటివరకు 14 రాష్ట్రాల్లో 33 ఎలిఫెంట్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏనుగుల కదలికల పర్యవేక్షణకు స్థానిక సంఘాలతో జంతు ట్రాకర్లను ఏర్పాటు చేయడంతో పాటు మానవులకు నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ఏనుగులపై ప్రతీకార హత్యల నివారణకు గాను ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి 24 గంటల్లో పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాల పాలైతే రెండు లక్షలు, చిన్న గాయాల చికిత్సలకు 25 వేలు చెల్లిస్తున్నట్లు వివరించింది. మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతో పాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా çసూచించినట్లు వెల్లడించింది. అడవి జంతువులకు రుచించని పంటలు వేయాల్సిందిగా సూచనలిచి్చంది. çపొలాల్లో ఏనుగులు, వణ్యప్రాణులు ప్రవేశించకుండా ముళ్ల కంచె, బయో ఫెన్సింగ్, భౌతిక అడ్డంకులను ఏర్పాటు చేయాలని సూచించింది. -
చిత్తూరు జిల్లాలో 110 ఏనుగులు!
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలో 90 నుంచి 110 వరకు ఏనుగులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని డీఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఏనుగుల గణన ప్రక్రియ శనివారంతో ముసిగింది. సర్వే వివరాలను డీఎఫ్‌వో సోమవారం మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని 60కి పైగా బీట్ల నందు 150 మంది సిబ్బంది, సహాయకులు కలిసి సర్వే చేశారన్నారు. ప్రత్యక్షంగా 30కి పైగా ఏనుగులను గుర్తించారని, పరోక్షంగా 110 ఏనుగుల ఉన్నట్లు నమోదు చేశారని చెప్పారు. వీటిలో 15 వరకు చిన్న ఏనుగులు ఉన్నట్లు చెప్పారు.దక్షిణ భారతదేశంలో ప్రతి ఏటా మే నెలలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకే సమయంలో సర్వే చేస్తారన్నారు. రాష్ట్రంలో 200 వరకు ఏనుగులు ఉంటే.. ఒక్క చిత్తూరు జిల్లాలో 100కు పైగా ఉన్నాయన్నారు. ప్రాథమిక నివేదికను కేంద్ర అటవీశాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా పలమనేరు, పుంగనూరు, కుప్పం ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ షాక్, వాహనాలు ఢీకొని ప్రతి ఏటా 10 వరకు ఏనుగులు మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. ఏనుగుల దాడిలో ఏడాదికి రూ.కోటి వరకు పంటలకు, ప్రజల ప్రాణాలకు నష్టపరిహారంగా చెల్లిస్తున్నట్లు వివరించారు. గజరాజుల దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
దేవాలయానికి ధ్వజస్తంభం ఎంతో కీలకం. వీలైనంత ఎత్తులో... ఇత్తడి తాపడంతో... చివర్లో చిరుగంటలతో అలరారే ఈ స్తంభాన్ని తాకకుండా... దానికి పూజలు చేయకుండా భక్తులెవ్వరూ లోపలికి వెళ్లరు. ఆలయ మూలవిరాట్టును దర్శించుకోరు. ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. అయితే వీటి తయారీకి వినియోగించే కర్రకూ ఓ ప్రత్యేకత ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే నారేప చెట్టును ఇందుకు వాడుకుంటారు. ఎత్తుగా పెరగడమే గాకుండా... బలంగా ఉండి... ఎన్నో ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బుట్టాయగూడెం: దేవాలయాల ముందు ఏర్పాటు చేసే ధ్వజస్తంభం నిర్మాణానికి ప్రధానంగా పొడవాటి బలమైన కర్ర అవసరమవుతుంది. ఇందుకోసం సోమి చెట్టు, టేకు, నారేప చెట్టుతో పాటు మరికొన్ని రకాల వృక్ష జాతులను వినియోగిస్తారు. వీటిలో ఎక్కువగా సోమిచెట్టు, నారేప చెట్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తారు. పశ్చిమ మన్యంలోని అటవీ ప్రాంతంలో ఈ కర్రలు అధికంగా లభిస్తాయి. అత్యధికంగా నారేప కర్రలతోనే ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం విశేషం.ఆకాశానికి నిచ్చెన వేసేలా ఈ చెట్లు పెరుగుతుంటాయి. ఈ వృక్షం ఎత్తు కనిష్టంగా 30 అడుగులు, గరిష్టంగా 50 అడుగులు ఉంటుంది. చుట్టుకొలత 40 నుంచి 50 అంగుళాలు ఉంటుంది. గోదావరి నదీ పరీవాహక అటవీ ప్రదేశాల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. పాపికొండల అభయారణ్యంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఈ చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచే వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసే ధ్వజస్తంభాల కోసం వీటిని తరలిస్తుంటారు. నారేప చెట్ల ప్రత్యేకత వృక్ష జాతుల్లో అన్నింటి కంటే నారేప వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వృక్షానికి సంబంధించిన కర్ర వానకు తడిసినా, ఎండకు ఎండినా ఏ మాత్రం చెక్కు చెదరకుండా గట్టిగా బలంగా ఉంటుంది. వీటికి చెదలు కూడా పట్టవు. ప్రకృతిపరంగా ఎంతటి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం కలిగి, కొన్ని దశాబ్దాలపాటు చెక్కు చెదరకుండా ఉండటం దీని విశేషమని పూర్వికులు చెబుతున్నారు. మారుతున్న కాలంతో పాటు సోమి, నారేప, టేకు వృక్షాల కలప దొరకకపోవడం... కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ మార్చాల్సి రావడంతో పలుచోట్ల ఏక శిల రాళ్లను కూడా ధ్వజస్తంభాల కోసం వినియోగిస్తున్నారు. అనుమతులు తప్పనిసరి అడవిలో నుంచి వృక్షాలు తరలించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆలయం ఏ ప్రాంతంలో కడుతున్నారో, ధ్వజస్తంభానికి అవసరమైన కలప, తదితర వివరాలతో ఆధారాలను అధికారులకు చూపించాలి. బహిరంగ మార్కెట్లోని కలప విలువ ప్రకారం రుసుం చెల్లించాలి. ఇటీవల అటవీ సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనుమతులు అంత సులభంగా లభించడం లేదు. చెట్లు కూడా సులభంగా దొరికే అవకాశం లేదు. అందుకోసం పశ్చిమ మన్యంలోని అటవీశాఖ అధికారులు నర్సరీలో నారేప మొక్కలను పెంచుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నారేప చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పెంచాలనే ఉద్దేశంతో నర్సరీల ద్వారా పెంచుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నారేప ఎంతో బలమైంది వృక్ష జాతుల్లో ఎన్నో రకాలున్నా వాటన్నింటి కంటే నారేప చెట్టు బలంగా ఉంటుంది. దాని తర్వాత సోమిచెట్టు బలమైంది. నారేప చెట్టు కర్ర ఎండకు ఎండినా, వానకు తడిసినా పాడవ్వదు. చెదలు పట్టవు. ఈ కర్రతో ఏర్పాటుచేసిన ధ్వజస్తంభం బలంగా ఉంటుంది. అందుకే ఆలయాల్లో ఎక్కువగా వీటినే వినియోగిస్తున్నారు. – ఎస్.బాలసుబ్రహ్మణ్యం, శివాలయం పూజారి, బుట్టాయగూడెం -
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్‌పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే.. ప్రైవేట్ వ్యక్తిది కాదన్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ/భూపాలపల్లి: అటవీశాఖకు ఓ వ్యక్తికి మధ్య చోటు చేసుకున్న భూ వివాదానికి 40 ఏళ్ల తర్వాత తెరపడింది. వరంగల్ జిల్లాలోని 106.34 ఎకరాల అటవీ భూమి ప్రైవేట్ భూమి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అత్యంత విలువైన ఆ భూమి అటవీశాఖకు చెందినదేనంటూ గురువారం తీర్పునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరే‹Ù, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీం ధర్మాస నం గురువారం కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తికి చెరో రూ.5 లక్షలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని జాతీయ న్యాయసేవల సంస్థ (నల్సా)కు రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. వరంగల్ జిల్లా కొంపల్లిలోని సర్వే నంబర్ 171/3 నుంచి 171/7 వరకు ఉన్న 106.34 ఎకరాలు తమవేనని అబ్దుల్‌ఖాసీం తదితరులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు 1981లో జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. జాయింట్ కలెక్టర్ నిరాకరించడంతో 1984లో ఆ భూమిని డీ నోటిఫై చేయాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతోపాటు వరంగల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. అక్కడ అనుకూలంగా ఆదేశాలు వచ్చినప్పటికీ ఉమ్మడి హైకోర్టు ఆ ఆదేశాలను కొట్టివేసింది. అనంతరం ఆ వ్యక్తి రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. తెలంగాణ హైకోర్టు ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సుందరేష్ ధర్మాసనం గురువారం ఆదేశాలు వెలువరించింది. భూమి తమదని చెప్పుకోవటానికి ఆ వ్యక్తులకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ సమయంలో తెలంగాణ హైకోర్టు, రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడం.. సుప్రీంకోర్టులోనూ అనుకూలంగా రిజాయిండర్ దాఖలు చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వాద, ప్రతివాదులకు జరిమానా విధిస్తూ అడవుల ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించింది. అడవుల ప్రాధాన్యతను గుర్తించడంలో మనుషులకు ‘మతిమరుపు’ ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అడవులు నిస్వార్థంగా మాతృసేవ అందిస్తున్నప్పటికీ ప్రజలు నాశనం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అడవులను పరిరక్షించడం మనుషుల బాధ్యత అని వాటి క్షీణత వల్ల తామే నష్టపోతామన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించింది. పర్యావరణ కేంద్రీకృత విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలని తెలిపింది. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై చర్యలు: డీఎఫ్ఓ ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు డీఎఫ్ఓ వసంత తెలిపారు. ఈ కేసులో అటవీశాఖ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, ఏఓఆర్ శ్రావణ్‌కుమార్ వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా అటవీశాఖ ఆ భూములు తమ శాఖకే చెందుతాయని వాదించగా, రెవెన్యూ శాఖ మాత్రం ఆ భూమిపై ప్రైవేట్ వ్యక్తికే హక్కులున్నాయని అఫిడవిట్లు దాఖలు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి రెండు ప్రభుత్వ శాఖలు విభిన్న వాదనలు వినిపించగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకే వాదనను దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించినట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్లో సదరు 106.34 ఎకరాలను అటవీ భూమిగా స్పష్టంచేశారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి దాన్ని అటవీ భూమిగా గుర్తిస్తూ తీర్పు వెలువరించినట్లు వసంత తెలిపారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుంది. -
అగ్గి రాజుకుంటోంది
సాక్షి, హైదరాబాద్ : అడవుల్లో ‘అగ్గి’ రాజుకుంటోంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అడవుల్లో అగ్నిప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 1,500లకు పైగా అగ్నిప్రమాదాలు రిపోర్ట్ కాగా నల్లమల, ములుగు, ఇతర ప్రాంతాల్లోని 6 వేల హెక్లార్లలో అటవీభూమికి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మూడోవంతు దాకా అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు /ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో (ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియా) మూడో వంతు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అగ్ని ప్రమాదా లకు సంబంధించి పదిహేను ఏళ్లుగా సేకరించిన సమాచారం, డేటా ఆధారంగా చేసిన విశ్లేషణల్లో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. ♦ తెలంగాణవ్యాప్తంగా మూడువేలకు పైగా ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. ప్రతీ ఫారెస్ట్ బీట్‌లో ఫైర్బ్లోయర్లు, రేక్స్, పారలు, ఫైర్ బీటర్స్, సిబ్బందికి అగ్నినిరోధక దుస్తులు, బూట్లు, హెల్మెట్లు వంటివి అందుబాటులో ఉండాలి. అయితే ప్రస్తుతం 550 ఫైర్బ్లోయర్లు ఉండగా వాటిలో పదిశాతం వరకు మరమ్మతులు చేయాల్సి ఉందని సమచారం. ♦ వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశమున్న రోజులలో (పీక్ సీజన్లో) కేవలం 95 ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నట్టుగా వెల్లడైంది. దీనిని బట్టి అడవుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు సంబంధించి అధికా రులు పూర్తిస్థాయిలో సన్నద్ధమై లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను అటవీశాఖ అధికారులు ఏకీభవించడం లేదు. ♦ ములుగు, అమ్రాబాద్, ఇతర అటవీ ప్రాంతాల్లో కావాలనే అగ్ని ప్రమాదాలకు పాల్పడుతున్న వారిని గురించి వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసులు పెట్టామని, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి వాటికి పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు అత్యధికంగా మానవ తప్పిదాలతోనే ఈ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అయితే ఇవి చిన్న చిన్నవే కావడంతో ఎక్కువ నష్టం జరగకుండా ఆర్పేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ ‘ఫారెస్ట్ఫైర్స్’ చాలా దగ్గరగా పర్యవేక్షిస్తోందని, ఈ మంటల అదుపునకు వెంటనే చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 21,739 కి.మీ పరిధిలో ఫైర్‌లైన్స్ వేయడంతో పాటు, అడవులకు ఆనుకుని 11వేల కి.మీలలో ‘పెరిఫెరల్ ట్రెంచెస్’ తవ్వి మంటల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అరణ్యభవన్‌లో రాష్ట్రస్థాయిలో ఫైర్ మానిటరింగ్, కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షిస్తూ ,ఫైర్ అలర్ట్స్ కోసం టోల్‌ఫ్రీ నంబరు, వాట్సాప్నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అగ్గి ప్రమాదాలకు అవకాశం ఇలా.. ♦ రాష్ట్రంలో మొత్తం 53 అటవీ డివజన్లు ఉండగా, వాటిలో 23 దాకా హై–ఫైర్ ప్రోన్‌గా గుర్తించారు ♦ 1,208 ఫారెస్ట్ రేంజ్‌లకు గాను 45 రేంజ్‌లలో హై–ప్రోన్ రేంజేస్గా ఉన్నాయి ♦ పదివేల ఫారెస్ట్ కంపార్ట్ మెంట్లు (ఒక్కోటి 250 నుంచి 500 హెక్టార్లు కవర్ చేస్తుంది) ఉన్నాయి ♦ వీటిలో 1,120 కంపార్ట్మెంట్ల (హై–ఫైర్ ప్రోన్) దాకా పెద్ద అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 1,700లదాకా మధ్యంతరంగా (మీడియం–ఫైర్ప్రోన్) అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 4,260 దాకా అటవీ సమీప గ్రామాల్లో అగ్నిప్రమాదాలకు అవకాశం ♦ వీటిలో 1,250లకుపైగానివాస ప్రాంతాల్లో అత్యధికంగా ప్రమాదాలు జరిగే చాన్స్. -
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
పెంచికల్పేట్ (సిర్పూర్): మహారాష్ట్ర మీదుగా ప్రాణహిత నది దాటి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టిన ఏనుగు మరో రైతు ను బలితీసుకుంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామ శి వారు మిరప చేనులో పని చేసుకుంటున్న రైతు అల్లూరి శంకర్‌ను బుధవారం పొట్టన పెట్టుకోగా.. గురువారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్న పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వేకువజామున పంటకు నీళ్లు పెట్టేందుకు రైతు పోశన్న పొలానికి వెళ్లగా, రహదారికి సమీపంలోని పొలం వద్ద ఉన్న ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఏనుగు రోడ్డుపైకి రావడంతో అక్కడే వాకింగ్ చేస్తున్న యువకులు గమనించి పరుగులు తీసి ఫోన్ ద్వారా గ్రామస్తులకు విషయం తెలియజేశారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ వేణు, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, అటవీ అధి కారులు పరిశీలించారు. ఏనుగు దాడి నేపథ్యంలో దహెగాం, చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో 144 సెక్షన్ విధించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులతో వాగ్వాదం బుధవారమే ఓ రైతు ఏనుగు దాడిలో మృతిచెందినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందువల్లే గురువారం పోశన్న ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో అటవీ వర్గాలపై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అటవీశాఖలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశమిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. లోడుపల్లి అడవుల్లోకి గజరాజు గురువారం రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటల కు కొండపల్లి టర్నింగ్ వద్ద కనిపించింది. అటు నుంచి లోడుపల్లి అడవుల్లోకి వెళ్లినట్టు గుర్తించారు. పెంచికల్పేట్– సలుగుపల్లి రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ఏనుగుకు హాని తలపెట్టొద్దు.. బెజ్జూర్: కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుకు ప్రజలు ఎలాంటి హానీ తలపెట్టొద్దని రాష్ట్ర వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ పర్గేన్ సూచించారు. బెజ్జూర్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కాగజ్‌నగర్ డివిజన్ ప్రాంతంలో దాని ముఖ్య ఆహారం చెరుకు దొరకకపోవడంతో తిరిగి చత్తీస్‌గఢ్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు. అటవీశాఖ అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: ఏనుగు సంచరిస్తున్న ప్రదేశాలలో అటవీశాఖ అధికారులు.. సమీప గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతీ ఒక్క నివాసాన్ని సందర్శించి వారిని బయటికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. హుల్లా పార్టీ (సంప్రదాయ పద్ధతిలో వెలిగించిన మషాల్, డప్పులు కొట్టడం ద్వారా ఏనుగును తరిమికొట్టడానికి ఉపయోగించే ప్రొఫెషనల్) మహారాష్ట్రలోని సమీప అటవీ ప్రాంతాల నుండి కూడా రప్పించి ఏనుగును జనావాసం నుంచి అటవీ ప్రాంతంలోకి మళ్లించే యత్నం చేస్తున్నారు. -
పోలీసులు X గిరిజనులు
సత్తుపల్లి: గిరిజన వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన సత్తుపల్లి పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. ఘటన పూర్వాపరాలిలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని 400 హెక్టార్లలో కొంతకాలంగా స్థానిక గిరిజనులు, స్థానికేతర గిరిజనుల మధ్య పోడు వివాదం నడుస్తోంది. గిరిజనులకు నేతృత్వం వహిస్తున్న కూరం మహేంద్రను అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు సీఐ టి.కిరణ్ పిలిపించి విచారించి పంపించారు. ఈక్రమంలో చంద్రాయపాలెంకు చెందిన గిరిజనులు ఆదివారం ఉదయం డయల్ 100కు ఫోన్ చేసి స్థానికేతర గిరిజనులు తమ భూముల్లోకి వస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో తొలుత ఎస్సై రాజు, ముగ్గురు పోలీసు సిబ్బంది వెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న సమాచారంతో సీఐ టి.కిరణ్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి చేరుకున్నారు. సీఐ కిరణ్‌పై మెరుపుదాడి.. అదే సమయంలో గిరిజన నేత కూరం మహేంద్ర ఫోన్లో మాట్లాడుతుండగా, ‘నిన్ననే కదా నీతో మాట్లాడి పంపించింది.. మళ్లీ గొడవ ఏమిటి’ అంటూ సీఐ కిరణ్ ఆయన ఫోన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఇంతలో ఒక్కసారిగా గిరిజన మహిళలు కోపోద్రిక్తులై సీఐ కిరణ్‌ను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుళ్లు పి.నర్సింహారావు, ఇమ్రాన్, సత్యనారాయణ, నరేష్ కలిసి సీఐ కిరణ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో చుట్టూ రక్షణ కవచంలా నిలిచి పోలీస్ వ్యాన్ వైపు తీసుకొస్తుండగా గిరిజనులు కర్రలతో వెంబడించి దాడి చేశారు. అతి కష్టంమీద అక్కడి నుంచి సీఐ కిరణ్‌ను పోలీసులు తీసుకొని బయ టపడ్డారు. ఈ ఘటనలో సీఐ కిరణ్ చొక్కా చిరిగిపోయింది. పోలీస్ పికెట్ ఏర్పాటు విషయం తెలుసుకుని కల్లూరు ఏసీపీ రఘు, రూరల్ సీఐ వెంకటేశం, డివిజన్లోని ఎస్సైలు, పెద్ద సంఖ్యలో సిబ్బంది చంద్రాయపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బుగ్గపాడు శివారులో పోలీసులపై దాడి చేసిన గిరిజనులు గుంపులుగా వస్తుండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. గిరిజనులు ప్రతిఘటించటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి కూరం మహేంద్రతో సహా గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
అడవి ఒడికి పులి కూనలు
పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలు అతి త్వరలో నల్లమల అభయారణ్యంలో అడుగిడనున్నాయి. తల్లినుంచి తప్పిపోయి జనారణ్యంలో దొరికిన పులి కూనలకు నల్లమల అభయారణ్యంలోని ఇతర జంతువులను వేటాడటం నేర్పించేందుకు భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుమారు 14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడ పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో ప్రజల కంటపడిన విషయం విదితమే. తల్లి జాడ లేకపోవటంతో పులి పిల్లలను అటవీ శాఖ సిబ్బంది తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల మృతి చెందగా.. మిగిలిన పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. మూడు పిల్లలు పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీ శాఖ నిర్ణయం తీసుకోవటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రయోగం తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులి పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటు చేశారు. తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజసిద్ధంగా వాటి ఆహారాన్ని అవి వేటాడగలిగేలా చేయటంతోపాటు అనాథలైన, తీవ్ర గాయాల పాలైన పెద్దపులులను ఇక్కడి నర్సరీ ఎన్క్లోజర్లలో పెట్టి సంరక్షిస్తారు. పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పులులను సంరక్షించేందుకు ఎల్లవేళలా వెటర్నరీ వైద్యులు ఎన్క్లోజర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో ఉన్న పులి పిల్లలు వేటాడే సహజసిద్ధ గుణాన్ని మరిచిపోయి జూ అధికారులు అందజేసే ఆహారంతోనే జీవిస్తున్నాయి. వాటిని జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి ప్రమాదాల బారినపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని ఎన్క్లోజర్లలో ఉంచుతారు. స్వతహాగా కొన్ని వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా చూస్తారు. పులి పిల్లలు వేట నేర్చుకోవటం కోసం కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ జూ పార్కు నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను నల్లమలకు తరలించి వాటిని ఎన్క్లోజర్లలో సంరక్షిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం వీటిని పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. అవి వ్యక్తిగతంగా 50 వన్యప్రాణులను వేటాడిన తరువాత వాటి శక్తి యుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు. చారల దుప్పుల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్ కాకినాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన చారల దుప్పుల కోసం కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో 20 మీటర్ల పొడవు, వెడల్పుతో ప్రత్యేకంగా ఓ ఎన్క్లోజర్ను ఏర్పాటు చేశారు. వీటికోసం ఎన్‌క్లోజర్ బయట రూ.2.50 లక్షలతో సోలార్ బోరు అమర్చారు. దానినుంచి ఎన్‌క్లోజర్‌లోకి ప్రత్యేకంగా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు. వీటి అవసరాలను తీర్చేందుకు సాసర్పిట్లు, నీటి గుంతలను ఏర్పాటు చేశారు. వేసవిని తట్టుకునేలా ఎన్‌క్లోజర్ చలువ పందిళ్లు వేసి నీటిని వెదజల్లేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆహారం కోసం వినుకొండ, మార్కాపురం ప్రాంతాల నుంచి సుబాబుల్, బుల్ ఫీడ్‌ను రప్పించి ఆహారంగా వేస్తున్నారు. చారల దుప్పులు సంతానోత్పత్తి చేసేలా పెద్దదోర్నాల రేంజి పరిధిలోని తుమ్మలబైలు వద్ద ఒక ఎన్‌క్లోజర్, నెక్కంటి రేంజి పరిధిలో మరో రెండు ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఎన్క్లోజర్ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన టైగర్ ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నాం. కాకినాడ నుంచి ఇక్కడకు రప్పించిన చారల దుప్పుల కోసం కూడా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి సోలార్ బోర్ ద్వారా నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పులి పిల్లలకు వేటాడటంలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్ రేంజి అధికారి, కొర్రప్రోలు -
అడవిలో అమృతధార
బుట్టాయగూడెం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్య ప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన, వాహనాల కింద పడి మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రెండేళ్లుగా వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో అటవీ శాఖ ఈ ఏడాది కూడా వేసవి ప్రణాళిక రూపొందించారు. పాపికొండల్లో 60 నీటికుంటలు పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేవిధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చెలమల్ని తవ్వి వన్య ప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. అవికాకుండా 25 చెక్‌డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తొట్టెల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాటి పక్కన ఉప్పు ముద్దలను పెడుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుని ఉప్పు ముద్ద నాకుతాయని, తద్వారా వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కృషి పాపికొండలు అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటితొట్టెల్ని వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.50 లక్షలు వెచ్చిస్తోంది. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
మొక్కలతో 'భారత్ మాత' అని రాసి గిన్నిస్ రికార్డు!
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో తడోబా ఫెస్టివల్ 2024 సందర్భంగా మహారాష్ట్ర అటవీ శాఖ వేలాది మొక్కలను ఉపయోగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. హిందీలో 'భారత్ మాత' అనే పదాన్ని రాసేందుకు దాదాపు 65,724 మొక్కలను ఉపయోగించి ఈ రికార్డును సొంతం చేసుకుంది అటవీ శాఖ. చంద్రాపూర్‌లో జరగనున్న మూడు రోజులు తడోబా ఉత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వినూత్న ప్రయోగానికి నాంది పలికి తొలి ప్రయత్నంలోనే ప్రపంచ రికార్డును సాధించిందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పరిశీలకుడు స్వప్నిల్ దాంగ్రికర్ తెలిపారు. అలాగే 'భారత్ మాత' అనే దేశభక్తి పదంలో మొక్కల అమరికను ప్రదర్శించిన చిత్రాలను అటవీ శాక మంత్రి తడోబా అంధారి టైగర్ రిజర్వ్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ..తడోభా ఫెస్టివల్ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ 'భారత్ మాత' అనే పదాన్ని సృష్టించింది. సుమారు 26 రకాల జాతులకు చెందిన 65,724 మొక్కలతో గిన్నిస్ రికార్డు నెలకొల్పింది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. The Maharashtra Forest Department, Government of Maharashtra, India has achieved a remarkable feat while paying a tribute to the nation, at Chandrapur.#WWD2024#TadobaFestival#ConnectingPeopleAndPlanet#DigitalInnovation#WildlifeConservation#SaveTigerMission#SaveTheTiger pic.twitter.com/tK2oMY0T78 — Tadoba-Andhari Tiger Reserve (@mytadoba) March 3, 2024 అటవీ శాఖ చేసిన ఈ సాహసాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఎంతగానో ప్రశంసించారు. ఇలాంటి ప్రయత్నాలు సిబ్బందిలో మనోధైర్యాన్ని పెంచుతాయని అన్నారు. అలాగే ఈ మొక్కలు వృక్షాలుగా పెరిగిన తర్వాత, డ్రోన్ సహాయంతో ఏరియల్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు 'భారత్ మాత' అని వ్రాసి ఉన్న మొక్కలను చూడొచ్చని ముంగంటివార్ చెప్పారు. ఇక తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ (TATR) వన్యప్రాణుల సంరక్షణ, స్థిరమైన పర్యాటకం. మహారాష్ట్ర వారసత్వాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఈ తడోబా ఉత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. चंद्रपुरच्या ‘भारतमाता’ शब्दाची गिनेस बुक ऑफ वर्ल्ड रेकॉर्डमध्ये नोंद..!@narendramodi @GWR @mytadoba @MahaForest #TadobaFestival2024 #GuinnessWorldRecord #SMUpdate #Chandrapur #GreenBharatmata pic.twitter.com/6y2koiqeT0 — Sudhir Mungantiwar (@SMungantiwar) March 3, 2024 (చదవండి: కళ్లు చెదిరే అందంతో రంగులీనుతుంది ఆ ఎడారి..అడుగుపెట్టారో అంటే..!) -
ఏపీపీఎస్సీ.. మరో ఐదు
సాక్షి, అమరావతి: నిరుద్యోగ యువతకు శుభవార్త! ఇప్పటికే గ్రూప్– 1, 2 పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏపీపీఎస్సీ త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈమేరకు వివిధ కేటగిరీల్లో 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. ఒకవైపు గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. వీటిలో 37 ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదార్లు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, మరో 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇవి కాకుండా ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌తో పాటు పరీక్షల షెడ్యూల్‌ను కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ఇవే కాకుండా విద్యుత్తు శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, మత్స్యశాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టు, ఏపీ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. గ్రూప్–2 హాల్ టికెట్ల విడుదల గ్రూప్–2 ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్షకు సంబంధించి హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఒక్క రోజులోనే 2 లక్షల మందికిపైగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈనెల 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ 24 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేసింది. గ్రూప్–2లో మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
జనారణ్యంలోకి ఎలుగుబంటి
మానకొండూర్ రూరల్: జనారణ్యంలోకి చొరబడిన ఎలుగుబంటి ఎనిమిది గంటలు హైరానా చేసి ఎట్టకేలకు బోనులో చిక్కింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లోని చెరువుకట్ట సమీపంలో కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూరేందుకు యత్నించింది. కుక్కలు అరవడంతో ఇంటి పక్కనున్న వేపచెట్టు ఎక్కింది. ఇంటి యజమాని ఉదయం ఎలుగుబంటి అరుపులు విని, భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఎలుగుబంటి ఉన్న ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెటర్నరీ వైద్యుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. గ్రామస్తుల సందడితో ఎలుగుబంటి చెట్టుదిగి చెరువు పక్కనున్న పొదల్లోకి దూరింది. పొదల్లో ఎలుగుబంటి కనిపించడంతో టపాసులు పేల్చి బయటకు రప్పించారు. అక్కడి నుంచి అది పంటపొలాల వెంట పరుగెత్తి సమీప ముంజంపల్లి గ్రామం వైపు వెళ్లింది. అటవీ అధికారులు మత్తు ఇంజక్షన్‌ను ఫైర్ చేయడంతో కిలోమీటర్ దూరం పరుగెత్తి పొలాల్లో సొమ్మసిల్లి పడిపోయింది. స్పృహ తప్పిన ఎలుగుబంటిని వలలో బంధించి వ్యాన్‌లో ఎక్కించి వరంగల్‌కు తరలించారు. -
పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ రక్షణ, పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ అని, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హరితహారంపై ఇప్పటివరకు జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఆమె సచివాలయంలో సమీక్షించారు. అటవీ, గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హార్టికల్చర్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటుతున్న మొక్కలు, వాటి ఎదుగుదల, అలాగే చనిపోయిన మొక్కలను మార్చే విధానంపై వివరాలన్నీ వీలైనంత త్వరగా ఆన్లైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఇంటి అవసరాలకు ఉపయోగకరమైన, అలాగే కనీస ఆదాయాన్నిచ్చే మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పూలు, పండ్ల జాతుల మొక్కల పంపిణీతో పాటు, స్వచ్ఛందంగా పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ ఇంటి ఆవరణలో చెట్లు నాటుకున్న వాళ్లకు కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. చింత, సీతాఫల్, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు లాంటి మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. హరితహారం కార్యక్రమం పారదర్శకంగా, పూర్తి జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులను సవరించుకోవాలని మంత్రి అన్నారు. ఫారెస్టు అధికారులపై దాడులు చేస్తే కఠినచర్యలు భద్రాద్రి జిల్లా ఇల్లెందు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్టు అధికారులపై దాడులు చేయడాన్ని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. మంగళవారం జరిగిన దాడిపై విచారణకు ఆదేశించారు. అటవీ ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకున్న ఫారెస్టు అధికారులపై ట్రాక్టర్‌ను ఎక్కించి చంపడానికి దుండగులు చేసిన ప్రయత్నంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా రు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. -
ఒక్క దరఖాస్తు.. అధికారి చొరవ..
నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’వల్ల సుదీర్ఘకాలంగా ఉన్న తమ ఊరి సమస్య పరిష్కారమవుతోందని నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 2,500 జనాభా ఉండగా.. ఈ ఊరికి అటవీ ప్రాంతం నుంచి వచ్చే వాగు ఉంది. ఈ వాగుపై ఎప్పుడో కట్టిన చెక్‌డ్యామ్ 30–40 ఏళ్ల కిందటే కొట్టుకుపోయింది. గతంలో చెక్‌డ్యామ్ నుంచి వచ్చే కాలువతో సమీపంలోని చెరువులు నింపేవారు. అయితే చెక్‌డ్యామ్, కాలువ దెబ్బతినడంతో సాగునీటికి గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉడుంపూర్ కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి అటవీశాఖ అనుమతులివ్వడం లేదు. ఏళ్లుగా గ్రామస్తులు మొర పెట్టుకుంటున్నా.. ఎవరూ పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. కదిలిన అధికారి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 3న ఉడుంపూర్లో నిర్వహించారు. కడెం మండల ఇన్చార్జిగా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) విజయలక్ష్మి ఆరోజు ఉడుంపూర్లో కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ‘ఆరు గ్యారంటీ’ల దరఖాస్తులతోపాటు తమ ఊరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలంటూ గ్రామస్తులు డీఆర్డీవో విజయలక్ష్మికి దరఖాస్తును అందించారు. వెంటనే స్పందించిన ఆమె సభ కాగానే, గ్రామస్తులతో కలసి మోటార్‌బైక్‌పై కొంతదూరం, ఆపై కాలినడకన అటవీ ప్రాంతంలో ఉన్న చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆమె ఉడుంపూర్ నీటి సమస్యను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతో చర్చించారు. వారి సూచనల మేరకు వెంటనే రూ.9 లక్షల అంచనాలతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. అటవీ ప్రాంతంలో చెట్లకు ఇబ్బంది కలగకుండా కాలువ తవ్వకానికి పథకం సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చేతుల మీదుగా శనివారం చెక్ డ్యామ్ ప్రాంతం నుంచి కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. ప్రజాపాలనతో తమ ఊరి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించడంతో ఉడుంపూర్వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుమల నడకదారి భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: తిరుమల నడక దారిలో భక్తుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ, అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎల్‌ఐఐ) అధికారులంతా కలిసి సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే డబ్లుŠఎల్‌ఐఐ సమర్పించిన ప్రణాళికల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీని ఆదేశించింది. భక్తుల రక్షణ కోసం తీసుకునే దీర్ఘకాలిక చర్యలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంచారం భక్తులకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి వెంట ఇనుప కంచె ఏర్పాటు చేసేలా టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన బీజేపీ నేత గుడిపల్లి భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటవీశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఖాసిం సాహెబ్ స్పందిస్తూ నడక మార్గంలో భక్తుల రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై వైల్ట్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నిపుణుల కమిటీ సమర్పించిన ప్రణాళికలను మెమో రూపంలో కోర్టు ముందుంచామన్నారు. ఆ నివేదికను పరిశీలించాలని కోరారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఎక్కెడక్కడ అండర్ పాస్‌లు నిర్మించాలి, భక్తుల కోసం ఎక్కడ ఓవర్ పాస్‌లు నిర్మించాలి, ఎక్కడెక్కడ ఫెన్సింగ్ వేయాలన్న విషయంలో డబ్లుŠఎల్‌ఐఐ నివేదికలో స్పష్టత లేదని తెలిపింది. ప్రణాళికల్లో స్పష్టత లేనప్పుడు వాటిని అమలు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. టీటీడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, డబ్లుŠఎల్‌ఐఐ నివేదిక అమలుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. చిరుత దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి టీటీడీ తరఫున రూ.10 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు అందజేసినట్టు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, తిరుమల నడకదారిలో వన్యప్రాణుల స్వేచ్చా విహారానికి, భక్తుల రాకపోకలకు వీలుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎక్కడెక్కడ వాటిని అమలు చేయాలన్న విషయంపై సంయుక్త సమావేశం నిర్వహించాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది. -
మళ్లీ పులి భయం
పులి భయం మళ్లీ మొదలైంది. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం నందిగూడ అటవీ ప్రాంత శివారులో రెండురోజుల కిందట పశువును చంపేసి.. పశువుల కాపరి గులాబ్‌పై దాడి చేసిన ఘటన దరిమిలా ఆ ప్రాంత సమీప ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ఘటనలో గులాబ్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడగా, చేతికి గాయాలయ్యాయి. ప్రతీ ఏడాది పత్తి తీసే ఇదే సీజన్లోనే పులుల సంచారం పెరుగుతోంది. దీంతో పత్తి చేన్లకు వెళ్లాలన్నా, జీవాలను మేతకు తీసుకెళ్లాలన్నా కాపర్లు జంకుతున్నారు. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల మూడేళ్లుగా మనుషులపై దాడులు గత మూడేళ్లుగా నవంబర్ నుంచి జనవరి మధ్యే పులుల దాడులు అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా 2020 నవంబర్ 11న ఏ2 అనే పులి కుమురంభీం జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్(21) పత్తి చేనుకు వెళ్తుండగా దాడి చేసి చంపేసింది. అదే నెల 29న పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(18)ను పొట్టన పెట్టుకుంది. కేవలం మూడు వారాల వ్యవ«ధిలోనే ఇద్దరి మృతితో స్థానికుల నుంచి నిరసనలు వచ్చాయి. దాంతో అటవీ శాఖ సీరియస్‌గా తీసుకుని ఆ పులిని బంధించే ప్రయత్నం చేసినా.. సాధ్యపడలేదు. ఆ తర్వాత పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ గతేడాది నవంబర్లోనే కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము(69)ను పత్తి చేనులో ఉండగా దాడి చేసి చంపేసింది. తాజాగా పశువుల కాపరిపై దాడి జరిగింది. బఫర్ జోన్లోనే సంచారం ఉమ్మడి ఆదిలాబాద్ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్‌గా ఉంది. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల వరకు పులుల సంచారం ఉంటోంది. పెన్‌గంగా, ప్రాణహిత తీరాలు దాటి తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ పులుల అభయారణ్యాల నుంచి వలస వస్తుంటాయి. ఎనిమిదేళ్ల క్రితం పాల్గుణ అనే ఆడపులి కాగజ్‌నగర్‌లోనే స్థిర నివాసం ఉండటంతో సంతతి పెరిగింది. ఇలా అనేక పులులు ఒక్కొక్కటిగా తెలంగాణ భూభాగంలో ఆవాసం, తోడు వెతుక్కుంటూ అడుగుపెడుతున్నాయి. టైగర్ రిజర్వు పరిధి కోర్ ఏరియా మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కవ్వాల్‌లో మాత్రం ఇప్పటికీ ఒక్క పులి కూడా స్థిరంగా ఉండలేదు. కేవలం బఫర్ ప్రాంతాల్లోనే పులులు సంచరించడంతో సమస్య మొదలవుతోంది. ఆ ప్రాంతాల్లోనే పత్తి చేన్లు, మానవ సంచారం ఉండడంతో ఎదురుపడిన సందర్భంలో దాడి చేస్తున్నాయి. నిత్యం ఆదిలాబాద్ డివిజన్లో తాంసి, భీంపూర్, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో దహెగాం, పెంచికల్‌పేట, బెజ్జూరు, బెల్లంపల్లి, చెన్నూరు డివిజన్ల వరకు పులులు తిరుగుతుంటాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు పిప్పల్‌కోట్, కాగజ్‌నగర్ డివిజన్ అడవుల్లో అనేకసార్లు స్థానికులకు పులులు ఎదురుపడ్డాయి. అడవిలో వన్యప్రాణుల కంటే సులువుగా దొరికే మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెల పైనే దాడి చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అలా పశువులు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అటవీ శాఖ చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు మనుషులపై దాడి చేయడమే ఆందోళన కలిగిస్తోంది. జత కట్టే సమయంలో? పులులు జత కట్టే సమయం నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యే కావడం, తోడు, ఆవాసం కోసం తోటి పులుల మధ్య ఆధిపత్య పోరు, వాగులు, నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న చోట సంచరిస్తూ అనుకోకుండా మనుషులు ఎదురుపడితే దాడులకు ప్ర«ధాన కారణమవుతున్నాయని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్‌కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్‌కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది.. -
అదేపనిగా అసత్యాల ‘ఎత్తిపోతలు’
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది. ఆరు దశాబ్దాలకు పైగా ఆశగానే మిగిలిన వరికపూడిశెల ప్రాజెక్టుకు రూట్ క్లియర్ అయ్యింది. సాగు, తాగు నీటి ఎద్దడి తీరుతుందని ప్రజలంతా సంతోషిస్తున్నారు. కానీ, పెత్తందారుల పైత్యాన్ని ప్రదర్శించే ‘ఈనాడు’కు ఇది మింగుడు పడటంలేదు. అందుకే ‘వరికపూడిశెల’పై అసత్యాల ఎత్తిపోతలు మొదలెట్టింది. ఐదేళ్లూ అధికారం అనుభవించి ప్రాజెక్టును కాగితాలకే పరిమితం చేసిన చంద్రబాబును పల్లెత్తి మాట అనలేదు. ప్రజలకు నీటి కష్టం ఉందని చెప్పేందుకూ మనసు రాలేదు. ఇప్పుడు వరికపూడిశెల కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంటే వక్రీకరణల డైవర్షన్ మొదలెట్టింది. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు! వాస్తవానికి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆ మోసాన్ని గొప్పగా చిత్రీకరించడంలో రామోజీరావు పెన్ను తిరిగిన వ్యక్తి. ఈ దొంగల ద్వయం ఎన్నికల ముందు హడావుడి చేసి ఓట్లు ఎత్తిపోసుకోవాలనే కుట్రతోనే ఆనాడు అంటే.. 2019 ఫిబ్రవరి 6న వరికపూడిశెల ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదం ఇస్తున్నట్టు నాటకం ఆడారు. అసలు వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు రిజర్వ్ ఫారెస్టులో పైప్ లైన్ పనులు చేయాలని అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలీదా? అందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలి కదా! ఇవి లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారన్నది అసలు ప్రశ్న. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి నాయకులకు ఉంటే ఇవన్నీ ఆలోచించేవారు. చంద్రబాబు మాత్రం ఓట్ల కోసమే ప్రజలను దగా చేశారు. గత ఎన్నికల నోటిఫికేషన్‌కు సరిగ్గా నెల ముందు పరిపాలనా ఆమోదం ఇస్తూ టెండర్లు పిలిచినట్టు పెద్ద షో చేశారు. దీని ఆధారంగానే ‘ఈనాడు’ ప్రాజెక్టు అంతా బాబు హయాంలోనే రూపుదిద్దుకున్నట్టు మంగళవారం వక్రభాష్యం పలికింది. వాస్తవానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే వరికపూడిశెల ఎత్తిపోతలకు అంకురార్పణ చేశారు. ప్రాజెక్టు నిర్మించే ప్రాంతం పులుల అభయారణ్యంలో ఉండటంతో కేంద్రం అనుమతులు తప్పనిసరి అయ్యాయి. చిత్తశుద్ధి ఎక్కడ బాబు! రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు అధికారం అనుభవించిన చంద్రబాబు... ఈ ఎత్తిపోతలకు అత్యంత కీలకమైన వన్యప్రాణి, పర్యావరణ అనుమతులు కూడా సాధించకపోవడం ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఇచ్చి న మాట ప్రకారం పల్నాడు వాసుల వరికపూడిశెల కలను సాకారం చేస్తున్నారు. పలు దఫాలు కేంద్రంతో చర్చించి అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి తీసుకునే భూమికి బదులు వేరొక చోట భూమిని సమకూర్చి ప్రాజెక్టుకు ఆటంకం లేకుండా చేశారు. -
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్‌చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్‌లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్‌లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్‌లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
ఉద్దానంలో పెద్దపులి
కంచిలి/కవిటి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పెద్దపులి మంగళవారం రాత్రి పశువులపై పంజా విసిరింది. కవిటి మండలం సహలాల పుట్టుగలో ఓ ఆవుపై దాడిచేసి చంపేసింది. అదే మండలంలోని కొండిపుట్టుగలో ఓ గేదె దూడను హతమార్చింది. గుజ్జుపుట్టుగలో ఓ ఆవు దూడ తలపై దాడిచేసి గాయపరిచింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కవిటి–నెలవంక మార్గంలో శీమూరు–నెలవంక గ్రామాల మధ్య రోడ్డు దాటుతూ బస్సు ప్రయాణికులకు కనిపించింది. ఈ ఘటనలతో ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కంచిలి మండలం మండపల్లిలో ఆవుపై దాడిచేసిన పులి, కవిటి మండలంలో కనిపించిన పులి ఒక్కటేనా.. వేర్వేరా అనే విషయం తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు ఒక పులి మాత్రమే తిరుగుతోందంటున్నారు. పులికి ఒక రోజులో గరిష్టంగా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనపై పలాస ఆర్డీవో భరత్‌నాయక్ మాట్లాడుతూ.. పులి సంచారంపై రెవెన్యూ, పోలీస్, అటవీ, పంచాయతీ అధికారులతో ఇప్పటికే సమీక్షించామన్నారు. పులి సంచరిస్తున్న గ్రామాలతోపాటు సమీప గ్రామాల ప్రజలు రాత్రిపూట బయట తిరగొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తోడు లేకుండా బయటకు రావొద్దన్నారు. ఒడిశా నుంచి రాక! పెద్దపులి ఒడిశాలోని గజపతి జిల్లా గండాహతి అటవీ ప్రాంతం నుంచి అక్టోబర్ 21న శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు వరి పొలాల్లో సంచరించినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తరువాత పలాస మండలం టబ్బుగాం, మందస మండలం కొండలోగాం, పట్టులోగాం గ్రామాల్లో తిరిగిందని తెలిపారు. 27న రాత్రి కంచిలి మండలం మండపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపుట్టుగ వచ్చిన పులిని 28న గ్రామస్తులు గుర్తించారు. అక్కడి నుంచి ఆందోళన మొదలైంది. నవంబర్ 1న కంచిలి మండలం మండపల్లి పరిసరాలు, సోంపేట కొబ్బరితోటల్లో సంచరించిందని స్థానికులు చెప్పడంతో అటవీ అధికారులు పరిశీలించారు. -
‘కొయ్య బొమ్మ’కు ప్రాణం పోసేదెప్పుడు?
తెలంగాణ కళలకు కాణాచి. చేతివృత్తులు, హస్తకళలకు పెట్టింది పేరు. అలాంటి కళల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్ కొయ్యబొమ్మలు ఇప్పటికీ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. దాదాపు 450ఏళ్లుగా నకాషీ కుటుంబాలు ఈ కళను నమ్ముకొని బతుకుతున్నాయి. కాలక్రమంలో పాలకుల పట్టింపు లేక ఈ కళ కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది. కొయ్య బొమ్మ తయారయ్యే ‘పొనికి’ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వెరసి కర్రకు కరువు ఏర్పడడం వల్ల కళాకారులకు పని ఉండడం లేదు. ఈ క్రమంలో చాలావరకు నకాషీ కుటుంబాలు ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇలాగే సాగితే రానున్న తరంలో కళ అంతరించి పోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ కొయ్య బొమ్మల తయారీలో అసలైన ముడిపదార్థం పొనికి కర్ర. మృదువుగా ఉండే పొనిక చెట్టు కర్రతోనే ఈ బొమ్మలను చేయడం ప్రత్యేకత. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పొనికి చెట్లు విపరీతంగా ఉండేవి. కాలక్రమంలో అడవులతోపాటు పొనికి చెట్లు కూడా అంతరించి పోతున్నాయి. బొమ్మల తయారీకి కావాల్సిన కర్రను కళాకారులు అటవీశాఖ కలప డిపోల నుంచి సేకరిస్తున్నారు. ఈ కర్రకు కొరత ఏర్పడడంతో బొమ్మలు చేసేవాళ్లకు పని ఉండడం లేదు. మూడునెలల క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న వరుణ్‌రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకుని పొనికి వనాన్ని ప్రారంభించారు. అందులో మొక్కల పెంపకం చేపట్టారు. కానీ అవి చేతికొచ్చి కొయ్యబొమ్మగా మారేందుకు సమయం పడుతుంది. కనీసం పింఛన్ లేదు.. నిర్మల్ జిల్లా కేంద్రంలో 1955లో కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేశారు. కొయ్య బొమ్మను నమ్ముకొని ఒకప్పుడు రెండు వందల కుటుంబాల ఉండేవి. ఇప్పుడు 50లోపే కుటుంబాలు బొమ్మలను తయారు చేస్తున్నాయి. అందులోనూ నేటితరమంతా వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు చూసుకున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కళాకారులంతా ఎప్పుడో 25–30ఏళ్ల నుంచి చేస్తున్నవారే. వారికి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం, పింఛన్ లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన షెడ్డు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి సాయం అందడంలేదు. ‘మా చేతులతో చేసుకున్న బొమ్మలు పెట్టే అన్నం తప్ప.. ఇప్పటిదాకా ప్రత్యేకంగా రూపాయి అందడం లేదు..’ అని సీనియర్ కళాకారులు వాపోతున్నారు. తమ జీవితాల్లోనే ఎలాంటి ఎదుగుదల లేదని, ఇక అలాంటప్పుడు తమ పిల్లలు ఈ కళను ఎలా కొనసాగిస్తారని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. జీవితమంతా బొమ్మలతోనే.. 35ఏళ్లుగా కొయ్యబొమ్మల తయారీలోనే ఉన్నా. మా పూర్వికుల నుంచి ఇదే ఉపాధి. కానీ పొనికి కర్ర కొరతతో చాలామందికి పనిలేకుండా పోతోంది. సరైన ప్రోత్సాహం లేకపోవడంతో మా పిల్లలు ఇటువైపు రావడం లేదు. –పెంటయ్య, నకాషీ కళాకారుడు -
తీరానికి మరింత రక్షణ
సాక్షి, అమరావతి: మడ అడవుల విస్తీర్ణం రాష్ట్రంలో గణనీయంగా వృద్ధిచెందుతోంది. తీర ప్రాంతానికి రక్షణలో ఈ అడవులు కీలకపాత్ర వహిస్తాయి. తుపానులు వచ్చినప్పుడు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కోతను నివారిస్తాయి. గడచిన ఎనిమిదేళ్లలో 10శాతం మేర మడ అడవుల విస్తీర్ణం పెరిగినట్లు అటవీశాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. 2014నాటికి రాష్ట్రంలో 31,888 హెక్టార్లలో ఇవి విస్తరించగా, ప్రస్తుతం ఈ విస్తీర్ణం 40,500 హెక్టార్లకు పెరిగింది. పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల తర్వాత మన రాష్ట్రంలోనే మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 2,114 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా, గుజరాత్లో 1,175 చదరపు కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లో 616 చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఎక్కువ మడ అడవులు ఉన్నాయి. గోదావరి తీరంలో కాకినాడ, బీఆర్ అంబేద్కర్ జిల్లాలు, కృష్ణా తీరంలో కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఇవి విస్తరించాయి. ఇవి కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ కొద్దిమేర మడ అడవులు ఉన్నాయి. ప్రధానంగా కాకినాడ జిల్లాలోని కోరింగ అభయారణ్యంలో ఉన్న మడ అడవులు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ 187.81 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా, ఆ తర్వాత కృష్ణా అభయారణ్యంలో 137.76 చదరపు కిలోమీటర్లలో ఈ అడవులు వ్యాపించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు తగ్గుతుండటంతో, రాష్ట్రంలో ఈ అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీశాఖ కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటుచేసింది. అక్కడి నుంచి విత్తనాలు తీసుకెళ్లి సముద్ర ముఖద్వారాల్లో చల్లించింది. ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికుల సహకారంతో సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఈ మడ అడవుల ద్వారా తీర ప్రాంత రక్షణతోపాటు, అక్కడ నివసించే లక్షలాదిమంది జీవనోపాధి కూడా పొందుతున్నారు. -
అటవీ అమరవీరుల కుటుంబాలకు అండ
బహదూర్‌ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు. -
నడక మార్గంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు?
సాక్షి, అమరావతి: తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఏపీ హైకోర్టు అటవీ శాఖ, టీటీడీ అధికారులను బుధవారం ఆదేశించింది. అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గం వెంట ఇనుప కంచె ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను కూడా తెలియజేయాలని కోరింది. వన్యప్రాణులు తిరిగే చోట మనమంతా తిరుగుతున్నామని, అందువల్ల వన్యప్రాణుల జీవనం, భక్తుల భద్రత మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే వన్యప్రాణుల రాకపోకలకు వీలుగా తగిన రక్షిత మార్గాలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలంది. ఇటీవల చిరుత పులి దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి చెల్లించిన రూ.15 లక్షల పరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచాలని టీటీడీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్, చిత్తూరు జిల్లా అటవీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంచారం భక్తులకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి వెంట ఇనుప కంచె ఏర్పాటు చేసేలా టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన బీజేపీ నేత గుడిపల్లి భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున యలమంజుల బాలాజీ, అటవీ శాఖ తరఫున ఖాసిం సాహెబ్, టీటీడీ తరఫున అనూప్ వాదనలు వినిపించారు. -
కాకుల కొండ వద్ద చిరుత కళేబరం
మడకశిర రూరల్: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి సమీపంలోని కాకులకొండ వద్ద గురువారం మగ చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ఆడ చిరుత కళేబరం కనిపించిన నేపథ్యంలో ఘటనా స్థలంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గురువారం అటవీశాఖ అధికారులు కొండలోని గుంతలో పరిశీలించగా అక్కడ మగ చిరుత కళేబరాన్ని గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రారెడ్డి, పెనుకొండ అటవీశాఖ డివిజన్ అధికారి ఆనంద్, రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ ఘటనాస్థలికి చేరుకుని గుంతలో ఉన్న చిరుత కళేబరాన్ని పరిశీలించారు. ఆడ చిరుతలాగే తాజాగా లభించిన మగ చిరుత కూడా మృతి చెందిన సమయంలో మల, మూత్ర విసర్జన చేసింది. సమీపంలో ఏదో ద్రవ పదార్థం ఉందన్న అనుమానంతో నమూనాలను సేకరించారు. చిరుత కళేబరాన్ని మడకశిర అటవీశాఖ కార్యాలయానికి తీసుకువచ్చారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ బుధ, గురువారాల్లో లభించిన ఆడ, మగ చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించి కళేబరాలను కాల్చి వేశారు. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..2 చిరుతలూ ఒకే రోజు మృతి చెంది ఉండవచ్చని చెప్పారు. వీటి వయసు రెండేళ్లు ఉంటుందన్నారు. ఈ చిరుతల తల్లి కూడా కొండ ప్రాంతంలో ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన నమూనాలను తిరుపతి, విజయవాడ, బెంగళూరు ల్యాబ్‌లకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ రెండు చిరుతలకు ఎలాంటి గాయాలు లేవని, రెండూ ఒకే కారణంతో మృతి చెంది ఉంటాయని వెటర్నరీ ఏడీ తెలిపారు. విష ప్రయోగమా...? లేదా వ్యాధి సోకి మృతి చెందాయా..? అన్నది ల్యాబ్ రిపోర్టుల ద్వారా తెలుస్తుందన్నారు. -
భక్తుల రక్షణే ప్రధాన ధ్యేయం
తిరుపతి సిటీ: తిరుమల వచ్చే శ్రీవారి భక్తుల ప్రాణరక్షణే తమ ప్రధాన ధ్యేయమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గతంలో కౌషిక్ గాయపడటం, ఇటీవల చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అప్రమత్తమై అటవీ శాఖ అధికారులు, పోలీసులతో కలసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో 12 ఏళ్ల వయసులోపు పిల్లలతో వచ్చే భక్తులకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పెద్దలను మాత్రం రాత్రి 10 వరకు అనుమతిస్తామని తెలిపారు. నడక దారిలో వెళ్లే ప్రతి భక్తునికి సహకారం కోసం ఊత కర్ర అందిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. భక్తులను గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తూ.. ముందు వెనుక అటవీశాఖ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తామన్నారు.. అటవీశాఖ అధికారులు నిపుణులైన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని సూచించామని.. వారి వేతనాలు టీటీడీయే భరిస్తుందన్నారు. జంతువులకు ఆహారం అందించడం నిషేధం నడక దారిలో వెళ్లే భక్తులు సాధు జంతువులకు ఆహారం అందించడం నిషేదించామని, అలా అందించే వారిపై చర్యలు తప్పవని కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నడక దారిలోని దుకాణదారులు, హాటళ్ల యజమానులు వ్యర్థాలను బయట వేయరాదని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి నుంచి తిరుమల వరకు నడకమార్గంలో సుమారు 500 కెమెరాలను అమర్చనున్నామని, అవసరమైతే డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. వైల్డ్‌లైఫ్ అవుట్ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయని, డాక్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దారి పొడవునా సుమారు 30 అడుగుల వరకు వెలుతురు ఉండేలా ఫోకస్ లైట్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద 15వేల దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మధ్యలో వీటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గాన సైతం వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ అధికారులతో చర్చించామని.. కేంద్ర అటవీశాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయం చేసిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. -
చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు తెలియాలి: డీఎఫ్ఓ శ్రీనివాసులు
సాక్షి, తిరుపతి: తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, టీటీడీ ఫారెస్ట్ అధికారులు చిరుతను ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ.. బాలికపై దాడిచేసిన చిరుత ఇదేనా.. కాదా అన్నది పరిశీలిస్తాం. చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్నది తెలుసుకుంటాం. అనంతరం ఫారెస్ట్ అధికారుల నిర్ణయం మేరకు చిరుతను జూలో ఉంచాలా? లేక ఫారెస్ట్‌లో వదలాలా అన్నది నిర్ణయిస్తాం. బోనులో చిక్కిన చిరుత ఆడ చిరుత.. నాలుగేళ్లు ఉంటాయని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే నేడు చిరుత పట్టుబడింది. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పే వరకు నిబంధనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఇది కూడా చదవండి: వీడియో: చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది -
చిరుత కోసం గాలింపు
సాక్షి, తిరుపతి: తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారి లక్షితను ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసిన చిరుతను పట్టుకునేందుకు తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటవీ, టీటీడీ, పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడుతున్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు, 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. వాహనం శబ్దం వినడంతో చిరుత అడవిలోకి పారిపోయినట్టు తెలిసింది. చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. పండ్లు.. కూరగాయల కోసమే! కాలినడక మార్గంలో వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నారు. కొందరు భక్తులు నడిచి వెళ్తున్నప్పుడు తినడానికి పండ్లు వెంట తెచ్చుకుంటున్నారు. ఆ పండ్లు, కూరగాయలను కొందరు భక్తులు నడక మార్గంలో కనిపించే దుప్పి, జింకలకు తినిపిస్తుంటారు. భక్తులు ఇచ్చే వాటి కోసం అవి కాలినడక మార్గానికి చేరుకుంటున్నాయి. దీంతో దుప్పి, జింకల కోసం చిరుతలు ఆ ప్రాంతానికి వస్తున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. అక్కడికి వచ్చే చిరుతలు దుప్పి, జింకలు దొరకని సమయంలో చిన్నారులపై దాడికి పాల్పడుతున్నాయంటున్నారు. కాగా, చిన్నారి లక్షిత బంతితో ఆడుకుంటుండగా.. గాలి వాటానికి ఆ బంతి దూరంగా పడటంతో దానిని తీసుకునేందుకు మెట్లు దాటి అడవిలోకి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరుత అమాంతం లక్షిత గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆపదను తప్పించే ‘ఆలోచన’ తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ భక్తుడు ఆదివారం అందరినీ ఆకట్టుకున్నాడు. నడక మార్గంలో వన్య ప్రాణులు సంచరిస్తోన్న నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ భక్తుడు తన కుమారుడి చేతికి రబ్బర్ ఎలాస్టిక్ తాడు తగిలించి..ఆ తాడును ఆయన చేతికి ఇలా కట్టుకున్నాడు. దీనిపై ఆ భక్తుడిని ప్రశ్నించగా తమ జాగ్రత్త కోసమే తాడు కట్టినట్లు చెప్పాడు. – తిరుమల ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే లక్షిత మరణంపై కారణాలు తెలుస్తాయి. చిరుత కోసం గాలిస్తున్నాం. బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశాం. కాలినడకన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లడం మంచిది. పండ్లు, కాయగూరలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఉంటే బాగుంటుంది. – సతీష్‌రెడ్డి, డీఎఫ్ఓ, తిరుపతి -
అయ్యో.. ఆరేళ్లకే నూరేళ్లు!
తిరుమల/కోవూరు: తిరుమల కొండపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలిపిరి నడకదారిలో శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి నడుస్తుండగా అకస్మాత్తుగా ఓ వన్యమృగం చేసిన దాడిలో మృత్యువాత పడింది. నరసింహస్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం, పోతిరెడ్డిపాళేనికి చెందిన దినేష్ కుమార్, తన భార్య శశికళ, కుమార్తె లక్షిత (6), కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వారంతా అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల కంటే ముందుగానే ఆ చిన్నారి నడుస్తుండడంతో వేరే భక్తుల గుంపులో కలిసి వెళ్లి ఉంటుందని తల్లిదండ్రులు తొలుత భావించి వెతకడం ప్రారంభించారు. ఎంతకూ కనపడకపోవడంతో చివరికి భద్రతా సిబ్బందికి తెలిపారు. రాత్రి 10.30కు తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్మోహన్రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. రాత్రి నుంచి 70 మంది టీటీడీ, అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నరసింహస్వామి ఆలయం సమీపంలోని నడకదారి నుంచి 150 మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పూర్తిగా ముఖాన్ని జంతువు తినడంతోపాటు కాలిని తీవ్రంగా గాయపర్చింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. చిరుత లేదా ఎలుగుబంటి దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీఓ బాలిరెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా కలిచివేసింది: ఈఓ ధర్మారెడ్డి చిన్నారి మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి టీటీడీ నుంచి రూ.5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని చెప్పారు. బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించామన్నారు. బాలిక నరసింహస్వామి ఆలయానికి సమీపంలో నడకదారి నుంచి పక్కకు అటవీ ప్రాంతంలోకి ఆడుకుంటూ వెళ్లినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఎందుకంటే.. బాలిక ఆటవస్తువులు అటవీ ప్రాంతంలోనే దొరికాయని తెలిపారు. ఈ సమయంలో వన్యమృగం దాడిచేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు. భద్రత విషయంలో రాజీలేదు: భూమన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆయన అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యంలేదని చెప్పారు. పోతిరెడ్డిపాళెంలో విషాదఛాయలు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి వన్యమృగం దాడిలో మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న పోతిరెడ్డిపాళెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలిక మృతి వార్త కుటుంబ సభ్యులకు తెలియడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. దినేష్ ఇంటి వద్దకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వెంటనే టీటీడీ బోర్డు చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డికి ఫోన్‌చేసి బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధికారులతో అత్యవసర సమావేశం అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో మరింత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ, అటవీ పోలీస్ అధికారులతో జరిపిన అత్యవసర సమావేశంలో ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటుకు సమగ్ర నివేదిక అందించాలని డీఎఫ్ఓను ఆదేశించామన్నారు. వన్యమృగాన్ని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ 100 మంది భక్తుల గుంపునకు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటుకు అనుమతిస్తామని చెప్పారు. నడకదారుల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్నపిల్లలతో నడకమార్గాల్లో వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఈఓ విజ్ఞప్తి చేశారు. సీసీఎఫ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బోన్ల ద్వారా నడక మార్గాల్లో సంచరించే వన్యమృగాలను బంధిస్తామన్నారు. -
భల్లూకాన్ని చూసి..బెంబేలెత్తిపోయారు..
కొత్తపల్లి (కరీంనగర్): కరీంనగర్ శివారు రేకుర్తి, సీతారాంపూర్, సూర్యనగర్ ప్రాంతాల్లో భల్లూకం హడలెత్తించింది. సుమారు 14 గంటల పాటు స్థానికులను బెంబేలెత్తించిన గుడ్డెలుగు.. ఎట్టకేలకు వరంగల్ నుంచి వచ్చిన రెస్క్యూ టీంకు పట్టుబడింది. సుమారు రెండు గంటల పాటు రెస్క్యూ టీంను ముప్పుతిప్పలు పెట్టింది. శనివారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో కుక్కతో బయటకు వెళ్లిన సూర్యనగర్ వాసికి ఎలుగు కనిపించింది. కుక్క మొరగడంతో వెనక్కి తగ్గిన ఎలుగుబంటి.. అక్కడి నుంచి రేకుర్తి వైపు వెళ్లింది. ఎస్సారెస్పీ కెనాల్ మార్గం గుండా ప్రధాన రహదారిపై సంచరిస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం వరంగల్ నుంచి వచ్చిన ఫారెస్ట్ రెస్క్యూ టీం రేకుర్తి సబ్‌స్టేషన్ ప్రాంతంలోని సమ్మక్క గుట్ట పొదల్లో దాగిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేసింది. ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో టీం సభ్యుడిపైకి దూసుకొచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వలకు చిక్కిన ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మరో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. కొల్లేరు మండలాల్లో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్లు ఖర్చు కాగల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అటవీ, పర్యాటక శాఖల అధికారులు ఇప్పటికే 20 పర్యాటక ప్రాంతాలను కొల్లేరులో గుర్తించారు. రానున్న రోజుల్లో కొల్లేరు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో విశిష్ట స్థానాన్ని దక్కించుకుంటుందని పర్యావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఒబెరాయ్, నోవాటెల్, హయత్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు కావడంతో విదేశీ పర్యాటకులు సైతం కొల్లేరు పర్యటనకు ఇష్టపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం సర్కిల్‌గా కొల్లేరు కొల్లేరు అందాలకు అదనపు ఆకర్షణగా టెంపుల్ టూరిజం మారనుంది. రాష్ట్రంలో అత్యధిక భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమాసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటి పెద్దింట్లమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికే కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అనివేటి మండపం నిర్మిస్తున్నారు. మరోవూపు కైకలూరు మండలం సర్కారు కాలువ వంతెన వద్ద రూ.14.70 కోట్ల నిధులతో వారధి నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ వంతెన ద్వారా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ప్రయాణ దూరం తగ్గుతుంది. నేరుగా ఆర్టీసీ బస్సులు కొల్లేరు గ్రామాలకు రానున్నాయి. పర్యాటకానికి పెద్ద పీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే కొల్లేరులో టూరిస్ట్ పాయింట్లను గుర్తించాం. ఎకో, టెంపుల్ టూరిజాలకు కొల్లేరు చక్కటి ప్రాంతం. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం. – ఎండీహెచ్ మెహరాజ్, పర్యాటక శాఖ అధికారి పక్షుల కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాల్లో యాత్రికుల కోసం అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షుల విహార చెరువు గట్లను పటిష్టపరిచాం. ఎక్కువగా విదేశీ, స్వదేశీ పక్షులు విహరిస్తున్న, పర్యాటకులు చూసే అవకాశం కలిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్థి పనులను చేయిస్తున్నాం. – జె.శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కైకలూరు పర్యాటక రంగానికి ఊతం కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక శాఖకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.198.50 కోట్ల ప్యాకేజీని కేటాయించింది. ఇందులో భాగంగా ఇటీవల రూ.2 కోట్లతో కొరటూరు రిసార్ట్స్, జల్లేరు జలాశయం, జీలకర్రగూడెం గుంటుపల్లి గుహలు, పేరుపాలెం బీచ్, సిద్ధాంతం, పట్టిసీమ వంటి ప్రాంతాల్లో పర్యాటక శాఖ వివిధ అభివృద్థి పనులు చేపట్టింది. టెంపుల్ టూరిజంలో భాగంగా ఇప్పటికే ప్రముఖ దేవాలయాల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో పూర్తిస్థాయి పర్యాటకాభివృద్ధి కోసం సుమారు రూ.800 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసి ప్రతిపాదనల నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు సమర్పించారు -
భూమిపై పెరిగే బంగారం! టేబుల్ రేటు రూ.7కోట్లు.. కుర్చీ రూ.2 కోట్లు!
‘భూ మండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరగుతుండాది. ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు ఎళ్తుండాది. గోల్డ్ రా ఇది. భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్ర చందనం’ పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ప్రపంచమంతా ట్రెండింగ్ అయ్యింది. నిజంగా ఎర్ర చందనానికి ఉండే క్రేజ్ అలాంటిది మరి. చైనాలో అయితే.. ఎర్ర చందనంతో చేసిన కుర్చీ రూ.2 కోట్ల ధర పలుకుతోందట. ఈ మధ్య చైనా వెళ్లిన ఏపీ అటవీ శాఖ అధికారులకు అక్కడ ఎర్ర చందనం ధరలు తెలిసి మతిపోయినంత పనైందట. ఎర్ర చందనానికి చైనాలో ఉన్న మోజు అంతా ఇంతా కాదు. తమ ఇళ్లలో ఆ కలపతో చేసిన ఫర్నిచర్, గృహాలంకరణ వస్తువులు ఉండటం చాలా గొప్పగా భావిస్తారు. అందుకే ధర ఎంతైనా ఎర్ర చందనంతో తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. బీజింగ్‌లోని ఓ ఫర్నిచర్ షాపులో ఎర్ర చందనంతో చేసిన డైనింగ్ టేబుల్ ధర రూ.7 కోట్లు. ఒక సోఫా సెట్ రేటు రూ.5 కోట్లు. కుర్చీ ధర రూ.2 కోట్లు. ఎర్ర చందనం మార్కెట్‌పై అధ్యయనం చేసేందుకు ఇటీవల చైనా వెళ్లిన మన రాష్ట్ర అటవీ శాఖాధి కారులు అక్కడి రేట్లు చూసి నివ్వెరపోయారు. మన రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణా ఎందుకు జరుగుతుందో, దాని కోసం స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి మరీ ఎందుకు రిస్కు తీసుకుంటారో చైనాలోని ఫర్నిచర్ షాపుల్లోని వస్తువుల ధర చూసి అధికారులకు అవగతమైంది. గ్రేడ్లను బట్టి రేటు అంతర్జాతీయ మార్కెట్లో ఎర్ర చెక్క సి గ్రేడ్ అయితే టన్ను రూ.30 లక్షలు ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే రూ.45 లక్షలు పలుకుతుంది. నాణ్యమైన ఏ గ్రేడ్ చెక్క అయితే రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుంది. చైనా వ్యాపారులు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఈ ధరకు ఎర్ర చందనాన్ని కొనుగోలు చేస్తారు. జపాన్, మయన్మార్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో దీనికి డిమాండ్ ఉంది. అందుకే ప్రాణాలకు తెగించి శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఆ చెట్లు నరకడానికి ప్రయత్నాలు చేస్తారు. గత కొన్నేళ్లుగా అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్ చేసిన 8 వేల టన్నుల ఎర్ర చందనం దుంగల్ని గతంలో అటవీ శాఖ వేలం వేసింది. ఇంకా 5,400 టన్నుల కలప ఉండగా రెండు నెలల క్రితం వేలం వేసి 320 టన్నుల్ని వేలం ద్వారా విక్రయించగా రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా 5,100 టన్నుల కలపను త్వరలో వేలం వేయనున్నారు. త్వరలో గ్లోబల్ టెండర్లు పిలుస్తాం చైనాలో ఎర్ర చందనం వస్తువులకు మహా మోజు ఉంది. అక్కడి మార్కెట్ గురించి అధ్యయనం చేశాం. అందుకు అనుగుణంగా అటవీ శాఖ వద్ద ఉన్న కలపను వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలిసారి వేలంలో మంచి రేటు వచ్చింది. వచ్చే నెలలో మిగిలిన 5 వేల టన్నులకుపైగా దుంగల్ని వేలం వేసేందుకు మరోసారి గ్లోబల్ టెండర్లు పిలుస్తాం. ఎంఎస్టీసీ ద్వారా ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ నిర్వహిస్తాం. మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. – మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, పీసీసీఎఫ్ ఎంత ఎర్రగా ఉంటే అంత నాణ్యం ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఆ చెట్లను ఇష్టానుసారం నరికి అక్రమంగా రవాణా చేస్తుండటంతో ఎర్ర చందనం వృక్షాలు అంతరిస్తున్న జాబితాలోకి చేరాయి. అందుకే మన ప్రభుత్వం అడవుల్లో చెట్లను నరకడం చట్ట విరుద్ధంగా పేర్కొంది. అయినా అది సరిహద్దులు దాటిపోతూనే ఉంది. శేషాచలం అడవుల్లో సుమారు 5 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్ర చందనం చెట్లు ఉన్నాయని అంచనా. అవి ఎక్కడపడితే అక్కడ పెరగవు. వాటికి అంతా అనుకూలంగా ఉన్నచోట తొలి మూడేళ్లు వేగంగా పెరుగుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతుంటాయి. కనీసం 30 సంవత్సరాలకు గానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపు రంగులోకి మారదు. అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలి భాగం మరింత ఎర్రగా, వెడల్పుగా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు. శేషాచలం అడవుల నేలలో అమ్ల శాతం, పోషకాలు, నీరు ఈ చెట్లు పెరగడానికి సరిపోతాయి. ఆ నేలలో ఉండే క్వార్ట్జ్ రాయి కూడా ఈ చెట్లు పెరగడానికి దోహదపడుతుంది. ఇక్కడ నేలలో ఉన్న సమ్మేళనం మరెక్కడా ఉండదని, నేలతోపాటు వాతావరణం అవి పెరగడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతి -
ఆ ఎర్రచందనం మాదే.. మాకూ వాటా ఇవ్వండి
సాక్షి, అమరావతి : అక్రమంగా రవాణా అవుతూ ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు ఏపీలోనివే కాబట్టి వాటిలో తమకూ వాటా ఉంటుందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ చేస్తుండగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసినప్పుడు వచ్చిన సొమ్ములో సగం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర అటవీ శాఖ, ఇతర రాష్ట్రాల అటవీ శాఖాధికారులతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరిగే అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టŠస్ (పీసీసీఎఫ్)ల సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్ర చందనం చెట్లు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగే ఈ వృక్షాలు అత్యంత అరుదైనవి. ఇతర ప్రాంతాల్లోనూ ఎర్రచందనం పెరుగుతుంది. కొన్ని చోట్ల తోటల్లో కూడా పెంచుతారు. అయితే, శేషాచలం చెట్లతో పోల్చితే అవి నాసిరకం. వీటిని సి గ్రేడ్‌గా పిలుస్తారు. అత్యంత నాణ్యంగా ఉండే ఎ గ్రేడ్ ఎర్రచందనం శేషాచలంలోనిదే. దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే ఈ చెట్లను అక్రమంగా నరికి విదేశాలకు, ముఖ్యంగా చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. ఈ వేలంలో విదేశీ కంపెనీలు కూడా పాల్గొంటాయి. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఈ ఎర్రచందనం ఏపీలో పెరిగిన అరుదైన వృక్షజాతి కాబట్టి అది దేశంలో ఎక్కడ దొరికినా అందులో సగం ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అవసరమైతే వేలం వేసే దుంగల్ని పరిశీలించి ఎక్కడివో నిర్ధారించాలని సూచించింది. దుంగలను చూడగానే అది ఎక్కడిదో చెప్పవచ్చని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ గ్రేడ్ సరుకు అయితే ఎక్కువ వెడల్పు, ఎక్కువ బరువుతోపాటు లోపల ఎర్ర రంగు ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రం వద్ద 5,376 టన్నుల ఎర్రచందనం దుంగలు ఉండగా, ఇతర రాష్ట్రాలు, సంస్థల వద్ద సుమారు 8 వేల టన్నులు ఉంది. బయట ఉన్న సరుకులో సగం వాటా మనకు వస్తే దాదాపు రూ. 2 వేల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. 50 శాతం వాటా అడుగుతున్నాం ఇతర రాష్ట్రాల్లో సీజ్ చేసిన ఎర్రచందనంలో సగం ఏపీకి ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖను కోరుతున్నాం. త్వరలో జరిగే జాతీయ స్థాయి సమావేశంలో దీనిపై గట్టిగా పట్టుబడతాం. దేశంలో అక్రమంగా రవాణా అవుతూ దొరికిన సరుకంతా ఇక్కడిదే. దాన్ని చూడగానే చెప్పొచ్చు. అందుకే దానిపై మన రాష్ట్రానికి హక్కు ఉంటుంది. – మధుసూదన్ రెడ్డి, అటవీదళాల అధిపతి, పీసీసీఎఫ్ -
భర్తకు బంగారం లాంటి ఉద్యోగం.. సౌమ్యరంజన్ మృతి కేసులో మలుపు
ఒడిశా : గజపతి జిల్లా అటవీ శాఖలో ఏసీఎఫ్‌గా విధులు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా మృతిచెందిన సౌమ్యరంజన్ మహాపాత్రొ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు పర్లాకిమిడి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీజేఎం) కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021 జూలై 11న తన క్వార్టర్స్‌లో కాలిన గాయాలతో ఏసీఎఫ్ మృతిచెందగా, ఆయన భార్య విద్యాభారతి పండా, ఇంటి వంటవాడు మన్మథ కుంభో, అప్పటి డీఎఫ్ఓ సంగ్రాం బెహరా నిందితులుగా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే దర్యాప్తు అనంతరం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం(ఎస్ఐటీ) వీరి ముగ్గురికీ క్లీన్‌చీట్ ఇచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సౌమ్యరంజన్ తండ్రి అభిరాం బెహరా.. కేసును పునః విచారణ చేపట్టాల్సిందిగా పర్లాకిమిడి ఎస్డీజేఎం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం దర్యాప్తులో ముందుగా పేర్కొన్న ప్రధాన నిందితులకు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై ముగ్గురూ స్పందించక పోవడంతో కోర్టులో విచారణకు రావాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే హాజరు సైతం లేకపోవడంతో పలుమార్లు హెచ్చరించిన అనంతరం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరోవైపు సౌమ్యరంజన్ భార్య విద్యాభారతి పశువైద్య శాఖలో లైవ్‌స్టాక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా, జూన్ 27నుంచి సెలవులో ఉన్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏసీఎఫ్ మృతి కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
పెద్దపులికి రూట్ క్లియర్
తిరుమల: నల్లమల అడవుల నుంచి శేషాచల కొండల్లోకి పెద్దపులులు రానున్నాయి. ఆ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అహోబిలం నుంచి తిరుపతి వరకు 4,759 కిలోమీటర్ల మేర విస్తరించి శేషాచల కొండలు అపురూపమైన వృక్ష సంపదకే కాదు, వన్య మృగాలకూ నెలవు. ప్రపంచంలో మరెక్క డా కనిపించని ఎర్రచందనం చెట్లు ఒక్క శేషాచలం అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు అడ్డాగా శేషాచలం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతమైనా.. పెద్ద పులులు నివసించేందుకు అనువైన ప్రదేశమైనా.. ఇప్పటివరకు ఆ సందడి లేదు. కాగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి పెద్ద పులులు వచ్చేలా అటవీశాఖ కారిడార్ ఏర్పాటు చేయనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కు వగా ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. వారిపై దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. 2008లో శ్రీవారి మెట్టు నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేయగా.. రెండేళ్ల కిందట రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. 2008లో మాత్రం బాలికపై దాడికి పాల్పడిన చిరుతను పట్టుకుని తిరిగి వైఎస్సార్ జిల్లా చిట్వేల్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వదిలిపెట్టారు. అనంతరం వారం కిందట బాలుడిని తీసుకెళ్లి 500 మీటర్ల దూరంలో చిరుత వదిలిపెట్టి వెళ్లింది. టీటీడీ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. 24 గంటల వ్యవధిలోనే చిరుతను బంధించి భాకరాపేట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. నల్లమలలో ఎక్కువైన పెద్ద పులులు ప్రస్తుతం నల్లమల అడవుల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో పెద్ద పులులున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం పెరుగుతూ ఉండటంతో వాటిని శేషాచల కొండల వైపు మళ్లించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. నల్లమల నుంచి బద్వేలు మీదుగా సిద్దవటం నుంచి తిరుమలకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తిరుమల నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్న అటవీశాఖ అధికారులు.. శేషాచల కొండలు పెద్ద పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని గుర్తించి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని మూడు వేల హెక్టార్లు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాన్ని రిజర్వుడ్æ ఫారెస్టుగా పేర్కొంటారు. ఇక్కడ మనుషుల కన్నా జంతువులకే ఎక్కు వ ప్రాధాన్యం ఉంటుంది. మనుషులపై దాడిచేసే అలవాటు లేని చిరుతలే అప్పుడప్పుడు అటవీ ప్రాంతాన్ని దాటి వచ్చి తిరుమల నడకదా రులు, ఘాట్ రోడ్లపైకి వచ్చి భక్తులపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత దాడుల వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండే అవకాశం లేకపోవడంతో భక్తులు సురక్షితంగా వాటి నుంచి బయటపడుతున్నారు. కానీ పెద్ద పులుల వ్యవహారం అలా ఉండదు. మరి చిరుతల తరహాలో పెద్ద పులులు అటవీ ప్రాంతాన్ని దాటి వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. బద్వేల్ మీదుగా శేషాచలానికి కారిడార్ పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా బద్వేల్ మీదుగా శేషాచల కొండలకు కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం శేషాచల కొండల్లో పెద్దపులి సంచారం లేదు. తిరుమల నడకమార్గంలో ఇబ్బందుల్లేకుండా చర్యలు. – మధుసూదన్ రెడ్డి, పీసీసీఎఫ్ -
నేడే పోడు పట్టాలు
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు. పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు. కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి హెలికాప్టర్లో ఆసిఫాబాద్‌కు బయలుదేరతారు. పట్టణంలో తొలుత కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సమీపంలోని పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, చివరగా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోడు రైతులకు పట్టా పుస్తకాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు ప్రగతిభవన్ చేరుకోనున్నారు. -
పట్టాలెక్కని హక్కు.. ఏళ్ల తరబడి అసైన్డ్ పట్టాదారుల నిరీక్షణ
హద్దుల సమస్యే అడ్డంకి.. రెవెన్యూ శాఖ ద్వారా అసైన్డ్ పట్టాలు పొందిన రైతులు పలు ప్రాంతాల్లోని ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల అసైన్డ్ భూములు ఫారెస్ట్ పరిధిలోకి వస్తున్నాయని ఆ శాఖ అధికారులు దిమ్మలు ఏర్పాటు చేసి కందకాలు తవ్వారు. దీంతో చాలా చోట్ల రైతులు, అటవీ సిబ్బంది మధ్య గొడవలు చోటుచేసుకోగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో సైతం కేసులు నడుస్తున్నాయి. ఈ విషయాల్లో రెవెన్యూ శాఖ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంది. జిల్లాలో అటవీ, రెవెన్యూ భూమికి సంబంధించి పక్కా హద్దులు లేకపోవడంతోనే సమస్య జఠిలంగా మారినట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దుల్లోని సర్వే నంబర్లలో ఇచ్చిన అసైన్డ్ పట్టా భూములకు సంబంధించి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ఈ సమస్య పరిష్కారానికి ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయని.. ప్రస్తుతం ఆ మాటే మరిచాయని అసైన్డ్ పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యపై దృష్టి సారించి.. తమకు హక్కులు కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 38,770 ఎకరాల్లో అసైన్డ్ భూములు.. జిల్లాలోని 11 మండలాలు 52 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 66,901.05 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 1,630 మంది రైతులు 3,195.68 ఎకరాల్లో ఆక్రమణలో ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు ప్రభుత్వ భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్‌కు కేటాయించిన భూమి పోను.. మిగతా దాంట్లో కొంత మేర పేద రైతులకు అసైన్డ్ కింద పట్టాలు అందజేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 48,320 ఎకరాల భూమిని అసైన్డ్ పట్టా కింద పేదలకు ఇవ్వగా.. ఇందులో అటవీ పరివాహక గ్రామాలున్న 11 మండలాల్లో అసైన్డ్ పట్టా భూములు దాదాపు 38,770 ఎకరాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు.. నాకు చిన్నదర్పల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 16లో మూడు ఎకరాల విస్తీర్ణంలో లావణిపట్టా భూమి ఉంది. సుమారు 50 ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఈ సీజన్లో పంట వేసేందుకు భూమిని చదును చేస్తుంటే అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో హన్వాడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మా భూమిలో పంటలు వేసుకోనివ్వాలని వేడుకున్నా. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఇప్పుడు పంటలు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. – వడ్డె తిరుమలయ్య, చిన్నదర్పల్లి, హన్వాడ -
సర్వే నంబరే మార్చేశారు.. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులోని ఒకే సర్వేనంబరును వేర్వేరు చోట్ల చూపిస్తూ అటు అధికారులను.. ఇటు ప్రజలను బురిడీ కొట్టించారు. తిమ్మాపూర్ బొక్కలగుట్టలో సర్వేనంబరు 31లో అనేక అక్రమాలు జరిగాయి. ఈ సర్వేనంబరులో అటవీశాఖ(మహసుర)కు సంబంధించిన మొత్తం 2,966ఎకరాల భూమి ఉంటే అందులో 1985వ సంవత్సరంలో 40ఎకరాలు రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఈ భూమిలోనే 1986వ సంవత్సరంలో బొక్కలగుట్టకు చెందిన నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు రెండు గుంటల చొప్పున పట్టాలు ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ అటవీ ప్రాంతంగా ఉండడంతో ఎవరూ నివాసం ఏర్పర్చుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని గ్రామంలో ఓ భూసామి సర్వే నంబరు 31 ఉరఫ్ 11 సర్వేనంబరులో ఐదున్నర ఎకరాల చొప్పున రెండు భాగాలుగా ఇద్దరు వ్యక్తులకు 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు. ఆ భూమి 31 సర్వేనంబరు అటవీశాఖకు సంబంధించినది కావడంతో ముందున్న 31 తొలగించి 11 సర్వేనంబరుగా చేర్చుతూ రెవెన్యూ రికార్డులకు ఎక్కించారు. ధరణి ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కొనుగోలు చేసిన వారు సాగులో ఉన్నారు. దీనిపై ఇన్నాళ్లూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఇదంతా వెలుగులోకి రాలేదు. రెండేళ్ల క్రితం నుంచి బొక్కలగుట్ట గ్రామస్తులు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు మళ్లీ తమకే కేటాయించాలని కోరారు. ఆ స్థలం వద్ద నిరసనలు చేపట్టారు. అదే సమయంలో అక్కడ పెద్దయెత్తున అటవీ, సర్కారు భూములు, పట్టాభూముల్లో ఆక్రమణలు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’లో కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు సర్వే చేసి కబ్జాగురైన భూమికి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ సర్వే నంబరులోనే కొందరు దళితులకు పట్టా భూములు సైతం వెలుగులోకి వచ్చాయి. తాజాగా 31/11 సర్వే నంబరులో ఏకంగా వెంచరు వేసి ప్లాట్లు చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా? ఒక గ్రామ కంఠం పరిధిలో ఒకే సర్వేనంబరు రెండు చోట్ల ఉండదు. తిమ్మాపూర్ శివారులో ఒకే సర్వేనంబరు రెండు చోట్లా రికార్డుల్లోకి ఎక్కింది. 31/11సర్వేనంబరు తిమ్మాపూర్ శివారు బొక్కలగుట్ట గ్రామ పరిధిలో ఉంది. 11 సర్వేనంబరు తిమ్మాపూర్ శివారులో భీమా గార్డెన్ వెనకాల 1.23ఎకరాలు ఉంది. 31తీసేసి 11సర్వేనంబరుగా మార్పు చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. 1936 ప్రాంతంలో పహాని ఉన్నట్లు చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేసి ఇద్దరు వ్యక్తులకు అమ్మేసి ఓ డాక్యుమెంట్ రూపొందించారు. ఆ తర్వాతి కాలంలో భూ ప్రక్షాళన సమయంలోనూ ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగానే కొత్త ధరణి పోర్టల్‌లోకి మారారు. ఇదంతా అప్పట్లో బొక్కలగుట్టకు చెందిన భూసామి చేసిన నిర్వాకమేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఖాళీ జాగాను తమ భూమిగా మార్చుకునేందుకు ఏకంగా సర్వేనంబర్లను మార్చేసినట్లు చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించిన పాత రికార్డులు అటూ రెవెన్యూ, ఇటు అటవీ శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. అనుమతులు ఇవ్వని మున్సిపాలిటీ రామక్రిష్ణాపూర్ పట్టణ పరిధిలో విలీన గ్రామంగా ఉన్న బొక్కలగుట్టలోని సాగు భూమి లో ఏర్పాటు చేసిన వెంచరుకు మున్సిపాలిటీ నుంచి అనుమతి ఇవ్వలేదు. రెవెన్యూ నుంచి ‘నాలా’(వ్యవసాయేతర భూమి)గా అనుమతులు తీసుకుని ప్లాటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 11ఎకరాల్లో ప్లాటింగ్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. గాంధారి ఖిల్లా వెళ్లే దారిలోనే ఉండడంతో భవిష్యత్తులో కాలనీలు ఏర్పడే అవకాశం ఉందని అమ్మకాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ భూమిలో వెంచరు ఏర్పాటు చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు వెళ్లాయి. రికార్డుల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. -
రక్షణ విస్మరించి.. అడ్డగించి.. ‘కోట్‌పల్లి’కి పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్న అధికారులు
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరచి.. అక్కడికి ఎవ్వరూ రాకుండా నిషేధం విధించడం విమర్శలకు తావిస్తోంది. జనవరి 16న పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువకులు ఈత కోసం ప్రాజెక్టుకు వచ్చి నీట మునిగి చనిపోయారు. దీన్ని సాకుగా చూపి పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరించి ఇలా నిషేధం విధించడం ఏమిటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో కోట్‌పల్లికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ నీటిలో సరదాగా ఆడుకొని సేద తీరుతారు. యువతీ యువకులు గంటల తరబడి నీటిలో సరదాగా ఈత కొడతారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే తలమానికమైన ఈ ప్రాజెక్టును పర్యాటక రంగానికి దూరం చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. ప్రాజెక్టు వద్ద కాయ కింగ్ బోటింగ్ సైతం నిషేధించారు. 6 నెలల గడిచినా బోటింగ్ సంస్థకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకొని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు పర్యాటకులు, బోటింగ్‌కు అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
‘అటవీ’ దొంగలు? స్మగ్లర్లకు సహకరిస్తున్న కొందరు అటవీశాఖ సిబ్బంది
చుంచుపల్లి: ఒకవైపు హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను విరివిగా నాటుతూ అడవులను పెంచేలా చర్యలు తీసుకుంటుంటే మరోవైపు అడవులను నిరంతరం కాపాడాల్సిన అటవీశాఖ సిబ్బందిలో కొందరు ఇంటిదొంగలుగా మారుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు విలువైన టేకు, జిట్రేగి, వేప, తుమ్మ చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంగా కలప స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే కారణంతో ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం అటవీ డివిజన్ల పరిధిలో పలువురు సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయినా కలప అక్రమంగా తరలిపోతోంది. ఉన్నతాధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని, అందుకే సిబ్బందిలో మార్పు రావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. ● దుమ్ముగూడెం మండలంలో రెండేళ్ల క్రితం ఇద్దరు అటవీశాఖ సిబ్బంది మధ్య కలప రవాణాకు సంబంధించిన పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ● భద్రాచలం డివిజన్ పరిధిలోని ఒక గ్రామంలో అక్రమంగా కలపను తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్థానికులు గుర్తించి ఆపేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ● గతేడాది మార్చిలో చాతకొండ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిస్తూ కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద పట్టుబడిన వాహనాన్ని వదిలేసేందుకు సహకరించారనే కారణంతో ఒక రేంజ్ ఆఫీసర్‌తో పాటు, ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● అదే ఏడాది జూన్‌లో అశ్వాపురం రేంజ్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప విషయంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అధికారుల నివేదిక ఆధారంగా ఇందులో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● ఇల్లెందు రేంజ్ పరిధిలో కలప విక్రయం, నిధుల గోల్మాల్ వంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసిన అటవీశాఖ ఉన్నతాధికారులు గతేడాది జూలైలో ఒక రేంజర్‌తోపాటు ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. ● ఇక తాజాగా అశ్వాపురం రేంజ్ ఇరవెండి పరిధి లో జామాయిల్ కలపను కొట్టి ఐటీసీ కాంట్రాక్టర్ల తో కలిసి విక్రయించారనే ఆరోపణలతో విచారణ చేపట్టి అటవీశాఖ జిల్లా అధికారులు ఒక సెక్షన్ ఆఫీసర్, ఒక బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. ఉపేక్షించేది లేదు అటవీశాఖలో పనిచేస్తూ తప్పుడు మార్గాల్లో స్మగ్లర్లకు సహకరించే అటవీ సిబ్బంది విషయంలో ఉపేక్షించేది లేదు. అలాంటి వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. పద్ధతి మార్చుకోకపోతే శాఖాపరంగా కఠినమైన చర్యలకు సైతం వెనకాడబోం. –లక్ష్మణ్ రంజిత్ నాయక్, డీఎఫ్ఓ -
ఆలివ్ రిడ్లే.. సముద్రంలోకి వెడలె
సాక్షి, అమరావతి: ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ చర్యల్లో భాగంగా ట్రీ ఫౌండేషన్, రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతం వెంబడి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,036 తాబేళ్ల గూళ్లను రక్షించాయి. ఆ గూళ్లలో 3.41 లక్షల గుడ్లను కాపాడగా.. వాటినుంచి 2.39 లక్షల తాబేళ్ల పిల్లలు పుట్టుకొచ్చాయి. వాటన్నిటినీ సముద్రంలోకి వదిలారు. శ్రీకాకుళం, విజయ నగరం, కృష్ణా, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 23న అంతర్జాతీయ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. ట్రీ ఫౌండేషన్ అటవీ శాఖతో కలిసి గత 16 సంవత్సరాలుగా సముద్ర తాబేళ్ల రక్షణ, సముద్ర జీవ సంరక్షణలో పాలుపంచుకుంటోంది. ఈ 16 సంవత్సరాల్లో ఇప్పటివరకు 33.68 లక్షలకు పైగా సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలో వదిలారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతంలోని ఒడిశా, ఆంధ్రా ప్రాంతాలు ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనువైనవి. ఏటా ఈ తీరాల్లో గుడ్లు పెట్టేందుకు వేల తాబేళ్లు సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తీరంలో గుడ్లు పెట్టిన తాబేళ్లు వెళ్లిపోయాక.. ఆ గూళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే చాలా సంవత్సరాలుగా ట్రీ ఫౌండేషన్ వంటి సంస్థలు అటవీ శాఖతో కలిసి వాటి సంరక్షణకు నడుం బిగించాయి. వెయ్యి తాబేళ్లలో ఒకటే.. ప్రతి ఆడ తాబేలు ఒక సీజన్లో (డిసెంబర్ నుంచి మార్చి) రెండుసార్లు గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి తీర ప్రాంతానికి వస్తుంది. గుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి 48 నుంచి 60 రోజులు పడుతుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీలుంటే.. మగ పిల్లలు, 30 నుంచి 35 డిగ్రీలుంటే ఆడ పిల్లలు జన్మిస్తాయి. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లు నక్షత్రాలు, చంద్రుడి వెలుతురు ఆధారంగా సముద్రంలోకి చేరుకుంటాయి. పిల్ల తాబేళ్లకు బొడ్డు దగ్గర యోక్ సాక్ (పచ్చసొనలా) ఉంటుంది. దీని ద్వారానే పిల్ల తాబేళ్లకు 48 గంటల వరకు పోషకాహారం అందుతుంది. అందుకే గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లను వెంటనే సముద్రం తీరంలో విడిచిపెట్టాలి. ఈ పనిని చాలాకాలంగా మేం చేస్తున్నాం. పుట్టిన తాబేళ్లకు వాటి మెదడు కణాల చూట్టూ మేగ్నటైట్ సెల్స్ ఉంటాయి. ఇవి వాటికి జీపీఎస్‌లా ఉపయోగపడతాయి. అందుకే ఆడ తాబేళ్లు 12 నుంచి 15 సంవత్సరాలకు అవి పుట్టిన తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తాయి. వెయ్యి తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళితే గుడ్లు పెట్టే సమయానికి ఒకే ఒక తాబేలు మాత్రమే మిగులుతుంది. మిగిలిన 999 పిల్లలు పెద్ద చేపలకు ఆహారమైపోతాయి. – డాక్టర్ సుప్రజ ధారిని, ఛైర్పర్సన్, ట్రీ ఫౌండేషన్ -
ఉగ్రవాదులపై అటవీ చట్టం!
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఈ నెల 9న హైదరాబాద్‌తో పాటు భోపాల్‌లో అరెస్టు చేసిన ఉగ్రవాదులపై అటవీ శాఖ చట్టం కిందా అభియో గాలు చేయనున్నారు. భోపాల్‌కు చెందిన ఓ పర్యావరణవేత్త ఇచ్చిన సూచన మేరకు ఏటీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంబంధిత కేసుల్లో పోలీసులు సాధారణంగా.. చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం–1967లోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు చేస్తారు. ఆ ఉగ్రవాదుల వ్యవహారశైలి, చేసిన విధ్వంసాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ల కిందా ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్–¿ోపాల్ మాడ్యుల్స్‌పై మాత్రం అటవీ చట్టంలోని సెక్షన్లనూ జోడించాలని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ నిర్ణయించింది. ఈ ఉగ్రవాదులు భోపాల్ శివార్లలోని రైసెన్ అడవుల్లో తుపాకీ కాల్చడాన్ని ప్రాక్టీసు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన సలీం తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. అటవీ చట్టాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడం నేరం. అలా వెళ్లడమే కాకుండా నిషిద్ధ ప్రాంతంలో తుపాకులు వాడినందుకు వీరిపై అటవీ చట్టాల ప్రకారం ఆరోపణలు చేయడమే కాదు, అభియోగాలు సైతం మోపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఏటీఎస్‌కు శుక్రవారం ఓ లేఖ అందింది. భోపాల్‌కు చెందిన ఓ పర్యావరణవేత్త దీన్ని రాశారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న ఏటీఎస్ ఆ చట్టంలోని సెక్షన్లను చేర్చాలని నిర్ణయించింది. 10 మంది పోలీసు కస్టడీ పొడిగింపు హైదరాబాద్, భోపాల్‌లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల పోలీసు కస్టడీ గడువు శుక్రవారంతో ముగియడంతో ఏటీఎస్ అధికారులు వీరిని భోపాల్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ గడువు మరో పది రోజులు పొడిగించాలని కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి రఘువీర్ యాదవ్ 10 మంది కస్టడీని ఈ నెల 24 వరకు పొడిగించారు. ఆరుగురికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కస్టడీ పొడిగించిన వారిలో సలీం, రెహా్మన్, యాసిర్ ఖాన్ తదితరులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వీరిని మరోసారి హైదరాబాద్‌కు తీసుకువస్తారా? సిద్దిపేటలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
మూషిక జింక.. లగెత్తడమే ఇక.. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి
బుట్టాయగూడెం: ఒకప్పుడు మూషిక మొహం.. జింక దేహంతో అలరారిన పురాతన కాలం నాటి అతి చిన్న మూషిక జింకలు (మౌస్ డీర్) పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. అంతరించిన జంతువుల జాబితాలో కలిసిపోయిన ఆ బుల్లి ప్రాణులు ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట. అందుకే వీటిని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. భారత ఉప ఖండంలో మాత్రమే కనిపించే మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలోనూ ఉన్నట్టు వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు. జానెడు పొడవు.. రెండు నుంచి మూడు కిలోల బరువుండే మూషిక జింకల సంరక్షణకు ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శబ్దం వినబడితే ప్రాణం హరీ! మూషిక జింకలను స్థానిక గిరిజనులు వెదురు ఎలుకలని పిలుస్తారు. వీటికి భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు విన్నా.. ఏవైనా జంతువులు దాడి చేసేందుకు వచ్చి నా.. ఎవరైనా వీటిని పట్టుకున్నా భయంతో గుండె పగిలి మరణిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే మూషిక జింకలు రాత్రి వేళల్లో మాత్రమే అడవిలో సంచరిస్తాయని పేర్కొంటున్నారు. ఇవి ఎక్కువగా వెదురు కూపుల్లోనే నివసిస్తుంటాయి. అడవిలో రాలిన పువ్వులు, పండ్లు, ఆకుల్ని తింటాయి. ఉసిరి, మంగ కాయలు, పుట్ట గొడుగులు, పొదల్లోని లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింకల గర్భధారణ కాలం ఆరు నెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. మళ్లీ వెంటనే సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. చిరుతలు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, గద్దలు ఈ మూషిక జింకలను వేటాడుతూ ఉంటాయి. వీటికి తోడు అడవుల నరికివేత, అడవిలో కార్చిచ్చు, వేటగాళ్ల ముప్పు వంటివి మూషిక జింకల ఉనికికి ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. పాపికొండల్లో వీటి సంఖ్య 500 పైనే అరుదైన మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలో ఎక్కువగానే ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన అరణ్యం ఉండటం.. వెదురు కూపులు ఎక్కువగా ఉండటంతో 500కు పైగా మూషిక జింకలు ఇక్కడ నివసిస్తున్నట్టు అంచనా. అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు మూషిక జింకల జాడ చిక్కినట్టు చెప్పారు. సంతతి పెరుగుతోంది అరుదైన మూషిక జింకలు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ఇవి ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయే జీవులుగా ఉన్నా.. వీటి సంతతి ఇక్కడ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ట్రాప్ కెమెరాల్లో కూడా ఈ మూషిక జింకలు చిక్కాయి. ఇవి సంచరించే ప్రాంతాల్లో జన సంచారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీంతో వీటి ఉనికి బాగా పెరుగు తున్నట్టు గుర్తించాం. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా -
అడవి ఒడిలోకి.. పులి పిల్లలు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో రెండునెలల క్రితం తల్లి నుంచి వేరుపడి దొరికిన పులి పిల్లల్ని తిరిగి అడవిలో వదిలేందుకు రాష్ట్ర అటవీ శాఖ భారీ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్క్‌లో ఆ నాలుగు పులి పిల్లల్ని ఉంచి సంరక్షిస్తున్నారు. ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం వాటికి ఆహారం అందించడంతోపాటు శిక్షణ ఇస్తున్నారు. వాటిని ఏడాదిన్నరలోపు తిరిగి అడవిలోకి పంపాల్సి వుంది. దీనికిముందు వాటిని అడవిలో సహజంగా జీవించే పులుల్లా తయారుచేసేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. ఇలా అడవి నుంచి బయటకు వచ్చిన పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపిన అనుభవం ఉన్న మధ్యప్రదేశ్‌లోని కన్హా, బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులను తిరుపతి జూ క్యూరేటర్ సెల్వం, ఎన్ఎస్టీఆర్ (నాగార్జున్‌సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు) ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ మరికొందరు అధికారుల బృందం పరిశీలించి వచ్చింది. కన్హా రిజర్వులో 36 హెక్టార్లు, బాంధవ్‌గఢ్ రిజర్వులో 26 హెక్టార్లలో ఇన్‌సిటు ఎన్క్లోజర్లు ఏర్పాటుచేసి తప్పిపోయి దొరికిన పులి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ఆత్మకూరు ప్రాంతంలోని నల్లమల అడవిలోనే ఇలాంటి ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్‌క్లోజర్ ఎలా వేశారు, ఎలా నిర్వహించారు, ఎంత ఖర్చయింది, అలాంటి ఎన్క్లోజర్ను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఏం చేయాలనే దానిపై ఈ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. దాన్నిబట్టి త్వరలో ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. 50 జంతువుల్ని వేటాడి తింటేనే పూర్తిగా అడవిలోకి.. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వంద హెక్టార్లలో నాలుగు పులి పిల్లల కోసం ఇన్‌సిటు ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. నీటి వసతి బాగా ఉండి, వేటాడేందుకు అనువైన జంతువులున్న చోటును అన్వేషిస్తున్నారు. ఆ చోటును గుర్తించిన తర్వాత అక్కడ ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేసి 2, 3 నెలల్లో వాటిని అందులోకి వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఎన్క్లోజర్ను మూడు భాగాలుగా ఏర్పాటుచేయాలని చూస్తున్నారు. మొదట నర్సరీ ఎన్‌క్లోజర్‌లో ఉంచి చిన్న జంతువుల్ని వేటాడే అవకాశం కల్పించాలని, ఆ తర్వాత దశల్లో చిన్న, పెద్ద ఎన్క్లోజర్లలో కొద్దిగా పెద్ద జంతువుల్ని వేటాడేలా చేయాలనేది ప్రణాళిక. అదే సమయంలో అడవిలో ఎలుగుబంట్లు, ఇతర జంతువుల బారిన అవి పడకుండా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుంది. పులి పిల్లలు ఏడాదిన్నరలో ఈ ఎన్క్లోజర్లలో కనీసం 50 జంతువుల్ని చంపి తింటే వాటికి వేట వచ్చినట్లు నిర్ధారించుకుని అడవిలోకి వదిలేస్తారు. జంతువుల్ని చంపలేకపోతే వాటిని తిరిగి జూకి తరలిస్తారు. సాధారణంగా ఈ వేటను తల్లి పులులు పిల్లలకి నేర్పుతాయి. కానీ, ఆ పనిని ఇప్పుడు అటవీ శాఖ చేస్తోంది. ఈ పనిని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులో విజయవంతంగా చేయడంతో అక్కడికెళ్లి అధ్యయనం చేశారు. అక్కడిలాగే నల్లమలలో ఇన్‌సిటు ఎన్క్లోజర్లు తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అందుకోసం ఓ దాతను ఒప్పించారు. ఈ ఖర్చును భరించేందుకు ఆ దాత ముందుకు రావడంతో త్వరలో ఎస్వీ జూపార్క్‌లో పెరుగుతున్న పులి పిల్లలు నల్లమలలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. జూపార్క్‌లోని నాలుగు ఆడ పులి పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి. మూడు కేజీల బరువు ఉన్నప్పుడు దొరికిన వాటి బరువు ఇప్పుడు 14–15 కేజీలకు పెరిగినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. త్వరలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో పులి పిల్లలు వేటాడితే అడవిలో వదులుతాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతోపాటు మనం ఇంతకుముందు ఎప్పుడూ చేయని పని. అందుకే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూదన్‌రెడ్డి, పీసీసీఎఫ్, ఏపీ అటవీ శాఖ -
ఏనుగుల లెక్క తేలుద్దాం.. ఈ నెల 17వ తేదీ నుంచి...
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ట్రాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 3 రోజులపాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. మన రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో లెక్కింపు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తుండటంతో వాటి కోసం చాలాకాలం క్రితం కౌండిన్య అభయారణ్యాన్ని నెలకొల్పారు. శేషాచలం అడవులు, ఎస్వీ నేషనల్ పార్క్‌లోనూ ఏనుగులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో సుమారు 175 ఏనుగులు ఉన్నట్టు అంచనా వేశారు. తాజా లెక్కింపు పూర్తయితే వాటి సంఖ్య పెరిగిందా.. తగ్గిందా అనేది తేలుతుంది. ఒకేసారి ఎందుకంటే..! ఏనుగులు నీటి లభ్యతను బట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అవి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ప్రవేశించి అటూఇటూ తిరుగుతూ ఉంటాయి. దీంతో రాష్ట్రాల వారీగా లెక్కింపు చేపట్టినప్పుడు రెండుచోట్లా వాటిని లెక్కించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో ఒకేసారి లెక్కింపు జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలోని కొంత ప్రాంతంలో ఒకేసారి ఈ నెల 17, 18, 19 తేదీల్లో లెక్కింపు జరపనున్నారు. లెక్క.. పక్కా..! ఇందుకోసం కర్ణాటక అటవీ శాఖ రూపొందించిన మోడల్‌ను అనుసరిస్తున్నారు. అక్కడ ఏనుగుల సంఖ్య వేలల్లో ఉండటంతో చాలా జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధానంలో మన రాష్ట్రంలో లెక్కింపు నిర్వహించడానికి అటవీ శాఖ సిద్ధమైంది. మొదటి రోజు 17వ తేదీన అటవీ ప్రాంతంలోని బ్లాకుల పరిధిలో బీట్ల వారీగా 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15 కిలోమీటర్లు తిరిగి లెక్కింపు జరపనున్నారు. ఇందుకోసం బీట్ల వారీగా ఇద్దరు, ముగ్గురితో బృందాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు నిర్దేశించిన రెండు కిలోమీటర్ల ప్రాంతంలో తిరిగి ఏనుగుల గుంపులను బట్టి లెక్కింపు జరుపుతారు. మూడవరోజు చెరువులు, మైదానాల్లో నేరుగా ఏనుగుల గుంపుల వద్దకెళ్లి వాటి ఫొటోలు తీసి లెక్కిస్తారు. గుంపులో పెద్దవైన ఆడ, మగ ఏనుగులు.. ఆ తర్వాత పెద్దవైన మగ, ఆడ ఏనుగులు.. పిల్లలు, దంతాలు లేని ఏనుగులు (మఖనా), గుంపు నుంచి వేరుపడిన ఒంటరి ఏనుగులుగా వాటిని వర్గీకరించి లెక్కింపు చేపట్టనున్నారు. ప్రణాళికాబద్ధంగా లెక్కింపు దక్షిణాది రాష్ట్రాలతో కలిసి ఒకేసారి ఏనుగుల లెక్కింపును ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నాం. ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేశాం. మూడు విధాలుగా లెక్కింపు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. – శాంతిప్రియ పాండే, ఏపీ సీసీఎఫ్ (వైల్డ్ లైఫ్), ఏపీ అటవీ శాఖ -
వన్య ప్రాణులకు జీవధార
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందేవి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్ డ్యామ్‌ల ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటి తొట్టెల్లో వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తెచ్చి నింపుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. నీటి తొట్టెల పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు ఆ నీరు తాగి.. ఉప్పు ముద్దను నాకుతాయని.. దీనివల్ల వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలుంటాయని అటవీశాఖ అధికారులంటున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. పాపికొండల అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, జాకర్స్, దున్నలు వంటి అనేక జంతువులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి వేసవిలో దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటి సమస్య తలెత్తకుండా చర్యలు పాపికొండల అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీరు పోసి నింపుతున్నాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – దావీదు రాజునాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
కొత్త టైగర్ రిజర్వ్ .. చాన్సున్నా చర్యల్లేవ్?
రాష్ట్రంలో కొత్త టైగర్ రిజర్వ్‌ల ఏర్పాటుకు అన్ని సానుకూల పరిస్థితులున్నా అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్కటీ కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పడలేదు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు ఉండగా, కొత్తగా కనీసం రెండు పులుల అభయారణ్యాల ఏర్పాటుకు అవకాశం ఉంది. కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు కాగజ్‌నగర్, కిన్నెరసాని, ఏటూరునాగారంలలో సానుకూల వాతావరణం ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులొచ్చే అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వపరంగా ముఖ్యంగా అటవీశాఖ నుంచి గట్టి ప్రయత్నాలు సాగడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, హైదరాబాద్ తగ్గిన పులుల ఆక్యుపెన్సీ తాజాగా విడుదలైన టైగర్ స్టేటస్ రిపోర్ట్–2022లోనూ రాష్ట్రంలో ‘పులుల ఆక్యుపెన్సీ’ తగ్గిందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వివిధ ప్రయోజనాలు చేకూరే అవకాశమున్నా గట్టి ప్రయత్నాలు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. 2014 తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా 8, 9 పులుల అభయారణ్యాలు ఏర్పడినా, రాష్ట్రానికి ఒక్కటి కూడా రాకపోవడానికి ఈ దిశలో కనీసం ప్రతిపాదనలు కూడా కేంద్రానికి చేరలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వీటి ఏర్పాటుకు అటవీశాఖ ప్రతిపాదనలు పంపితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కవ్వాల్‌లో కనిపించని స్థిరనివాస పులులు! ఉమ్మడి ఏపీలో 2012లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఏర్పడింది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర విభజన అనంతరం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌గా (ఏటీఆర్) ప్రకటించారు.ప్రస్తుతం అమ్రాబాద్‌లో పులులు పుష్కలంగా ఉన్నాయని, 2018తో పోలి్చతే వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందనే అంచనాలున్నాయి. కవ్వాల్‌లోని చెన్నూరు డివిజన్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న పులులే కనిపించకపోవడం ఆందోళన రేపుతోంది. ఎన్ని ఆడపులులు సంతానోత్పత్తి చేస్తున్నాయనే అంశం ప్రాతిపదికన ఆ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య వృద్ధికి అవకాశముంది, ప్రస్తుతం ఏటీఆర్‌లో కనీసం ఏడు ‘బ్రీడింగ్ ఫిమేల్ టైగర్స్’ ఉండటంతోపాటు కనీసం నాలుగు ఆడపులులు పిల్లలు పెట్టి వాటిని సంరక్షిస్తున్నాయని ఈ ప్రాంతంతో పరిచయమున్న నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏటీఆర్‌లో 30 దాకా పులులు (నాలుగైదు పులి పిల్లలు కలుపుకొని) ఉండగా, కేటీఆర్‌లో అసలు పులులే కనిపించని పరిస్థితులు ఏర్పడినందున కొత్త టైగర్ రిజర్వ్‌ల ఏర్పాటు అవశ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగజ్‌నగర్‌లో కనిపిస్తున్నాయ్... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకునే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో తెలంగాణలోకి వాటి వలసలు పెరిగాయి. ప్రస్తుతం కొంతకాలంగా పులులు లేని ప్రాంతంగా కవ్వాల్ నిలుస్తోంది. దీని బయట టైగర్ కారిడార్‌లో ముఖ్యంగా కాగజ్‌నగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మూడో టైగర్ రిజర్వ్‌ను కాగజ్‌నగర్ ఏరియాలో ఏర్పాటు చేసి ఉంటే పులుల సంరక్షణకు పెద్దమొత్తంలో కేంద్ర నిధులు రావడంతోపాటు ఉద్యోగుల కేటాయింపు, స్థానికులకు ఉపాధి పెరిగే అవకాశం ఉండేదంటున్నారు. టైగర్ సఫారీ వంటి వాటికీ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారని, దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని చెబుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, అంధారీ ప్రాంతానికి పక్కనే ఈ ప్రాంతం ఉండటంతోపాటు.. అక్కడి నుంచే పులులు ఇక్కడకు వస్తున్నందున మరో టైగర్ రిజర్వ్ ఏర్పాటుచేస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. వైల్డ్‌లైఫ్ శాంక్చురీగా ఉన్న కిన్నెరసాని, ఏటూరు నాగారంలోనూ పులుల సంచారం ఉన్నందున వాటిని కూడా టైగర్ రిజర్వ్‌గా ప్రకటించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిలో కనీసం రెండుచోట్ల టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేసినా అడవులు, పర్యావరణానికి మేలు చేకూరుతుందని అంటున్నారు. రాష్ట్రంలో పులుల అభయారణ్యానికి సానుకూలంగా ఉన్న ప్రాంతాలు 1. కాగజ్‌నగర్ 2. కిన్నెరసాని 3. ఏటూరు నాగారం -
Project Cheetah: చీతాల మరణం ఊహించిందే!
న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్క్‌లో చీతాల మనుగడ సాధ్యమేనా?.. ప్రాజెక్ట్ చీతాను కేంద్రం ప్రారంభించినప్పుడు చాలామంది మేధావులు వ్యక్తం వేసిన ప్రశ్న ఇది. అయితే.. కేంద్రం ఈ ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా దాదాపు వంద కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. సౌతాఫ్రికా, నమీబియా నుంచి భారత్‌కు రప్పించిన 20 చీతాలను నెలల పాటు పర్యవేక్షించి.. కునోలోకి వదిలింది. కానీ, అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. నెల వ్యవధిలోనే రెండు చీతాలు కన్నుమూశాయి. ఆ రెండూ ఇన్ఫెక్షన్లతోనే కన్నుమూశాయన్న అటవీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరిస్థితిపై సౌతాఫ్రికా అటవీ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపైనే కునో అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సౌతాఫ్రికా ఫారెస్ట్, ఫిషరీస్, ఎన్విరాన్మెంట్ విభాగం(DFFE).. మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో సంభవించిన చీతాల మరణంపై స్పందించారు. ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే.. మరణాలను తాము ఊహించామని వారంటున్నారు. అందుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణంగా భావించవచ్చని చెబుతున్నారు. ► ప్రాజెక్ట్ చీతాలో భాగంగా.. నమీబియా, సౌతాఫ్రికా నుంచి భారత్ చీతాలను తెప్పించుకుంది. ఆ రీలొకేటింగ్ టైంలోనే మేం ఈ పరిస్థితిని అంచనా వేశాం. సాధారణంగా వాతావరణ మార్పులను ఒక్కోసారి అవి తట్టుకోలేవు. విపరీతమైన మార్పుల కారణంగానే అవి చనిపోవచ్చు. అలా కునోలో చీతాల మరణాలు మేం ఊహించినవే అని తెలిపారు. అయితే ఏదైనా జబ్బు పడి అవి చనిపోతున్నాయా?, సాధారణ ఇన్ఫెక్షన్లతోనే చనిపోతున్నాయా? అనేద ఇంకా తేలాల్సి ఉంది. ► భారత్ చేపట్టిన ప్రాజెక్ట్ చీతా.. ఒక రిస్కీ ఆపరేషన్. పైగా ప్రస్తుతం అది ఇంకా క్రిటికల్ ఫేజ్‌కు చేరుకుంది. ఎందుకంటే చీతాలు ఇప్పుడు పరిమిత ప్రాంతంలో లేవు. అవి సంచరించే సరిహద్దులు పెరిగిపోయాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్యం గురించి పర్యవేక్షించడం వాటి సంరక్షకులకు కష్టతరంగా మారొచ్చు. అదే విధంగా వాటికి అయ్యే గాయాల్ని కూడా పర్యవేక్షించడం కష్టమే అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ► సౌతాఫ్రికాలో చీతాలను భారీ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. రోజుకు రెండుసార్లు వాటిని పరిశీలిస్తారు. ఒకవేళ అడవిలో ఉంటే.. బృందాలు వాటిని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తుంటాయి. కానీ, కునో ప్రాంతం ఫెన్సింగ్ రక్షిత ప్రాంతం కాదు. అంతేకాదు.. చీతాలకు పోటీగా చిరుతలు, తోడేళ్లు, ఎలుగు బంట్లు, హైనాలు సంచరిస్తుంటాయి. వాటి నుంచి కూడా ముప్పు పొంచి ఉండొచ్చు. ► వివిధ రకాల వాతావరణాల్లో వివిధ రకాల జంతువులను పరిరక్షించడం అతి పెద్ద సవాల్. చీతాల సంరక్షణ మరింత సంక్లిష్టంతో కూడుకున్నది. ఆవాసానికి అలవాటుపడితేనే అవి మనుగడ సాగించగలవని, అప్పటి వరకు వాటిని దగ్గరగా పర్యవేక్షించడమే మంచిదని కునో అధికారులకు సౌతాఫ్రికా అటవీ అధికారులు సూచిస్తున్నారు. ► అయితే ఈ ప్రకటనపై కునో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ► ప్రాజెక్ట్ చీతా చేపట్టిన టైంలోనే.. కునో పార్క్ చీతాల సంచారం, వేటకు సరిపోదని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. చీతాలకు బదులు త్వరగా, ఎక్కువగా అంతరించి పోయే ప్రమాదం ఉన్న జంతువులను పరిరక్షించే ప్రాజెక్టును చేపట్టడం మేలని సూచిస్తున్నారు. గిర్ జాతీయ పార్కు నుంచి కొన్ని సింహాలను.. కునో పార్కులో ప్రవేశపెడితే బాగుంటుందని కొందరు సూచించారు కూడా. ఇదీ చదవండి: భారత్ శాంతి మంత్ర -
అది పులి కాదు.. మరి ఏంటి?
-
ములుగు జాతీయ రహదారి పనుల్లో ఫారెస్ట్ X రెవెన్యూ
ములుగు: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు పొంతన కుదరడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఆరెపల్లి నుంచి ములుగు మండలం గట్టమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు అనుమతులు రావడంతో సంబంధిత శాఖ టెండర్ పిలిచి పనులు చేపట్టింది. ములుగు మండల పరిధిలోని మహ్మద్‌గౌస్ పల్లి నుంచి మల్లంపల్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ వరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాకారం ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 598, 599, 680 పరిధిలోని కెనాల్ నుంచి జాకారం సాంఘీక సంక్షేమ గురుకులం పక్కన ఉన్న నాగిరెడ్డికుంట వరకు, గట్టమ్మ ఆలయం నుంచి పానేస కాల్వ వరకు పనులు నిలిచిపోయాయి. ఈ భూమి మాదంటే మాది అంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు భీష్మించుకుని కూర్చోవడంతో సమస్య ఉత్పన్నం అయ్యింది. వేరే దగ్గర భూమి ఇవ్వాలని.. వాస్తవానికి కెనాల్ నుంచి ఇరువైపులా ఉన్న భూమి అన్యాక్రాంతం కాకుండా కొన్ని సంవత్సరాలుగా అటవీ శాఖ సంరక్షించుకుంటూ వస్తోంది. ఎన్‌హెచ్ రోడ్డు పక్కన విలువైన టేకు, కొడిశ, నల్లమద్ది, ఏరుమద్ది, బిలుగు, సండ్ర, గుల్మోహర్, సిస్సు, నెమలినార, నారేప, చిందుగ వంటి చెట్లను ఇతరులు కొట్టకుండా ఈ ప్రదేశం చుట్టూ ట్రెంచ్ వేసింది. అయితే ఇప్పుడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 53/2, 53/19 భూమి రెవెన్యూకు సంబంధించిన ఆస్తి అని పంచాయతీని మొదటికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారులు తమతమ దగ్గర ఉన్న ఆధారాలతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా విషయం కొలిక్కి రాలేదు. జాతీయ రహదారి పక్కన ఉన్న భూమి మా దేనని, ఒక వేళ విస్తరణకు భూమిని తీసుకుంటే ఇరువైపులా 12.5 మీటర్ల చొప్పున 11.34 ఎకరాల భూమిని మరోచోట అప్పగించాలని అటవీ శాఖ ప్రపోజల్ పెట్టింది. అయితే దీనికి రెవెన్యూ శాఖ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉన్న చెట్లను కొట్టేసే క్రమంలో కాంపన్స్ట్రేషనరీ ఎఫారెస్ట్రేషన్ కింద రూ.16 లక్షలు చెల్లించాలని పెట్టిన ప్రపోజల్స్‌కు సైతం ససేమీరా ఒప్పుకోకపోవడంతో అప్పటి డీఎఫ్ఓ కిష్టాగౌడ్ పలుమార్లు పనులకు అడ్డుతగిలినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో డీఎఫ్‌ఓపై ఫిర్యాదులు అందాయని, ఆయన బదిలీకి ఇది ఒక కారణమని తెలుస్తుంది. గతంలోనూ అంతే.. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ పనుల్లో భాగంగా స్థల సేకరణ సమయంలో రెవెన్యూ–అటవీ అధికారులకు భూమి హద్దుల విషయంలో ఇదే విధంగా జరిగింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టడం అటవీ అధికారులు అడ్డుకోవడం పలుమార్లు జరిగింది. దీంతో అటవీ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై ఎఫ్‌సీ–1980 చట్టం కింద కేసు పెట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఎన్‌హెచ్ అధికారులకు నోటీసులు ఎన్‌హెచ్ విస్తరణ విషయం లోలోపల చిలికిచిలికి గాలివానగా మారుతుందని ఇరుశాఖల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులతో ఇటు పీసీసీఎఫ్, అటు సీఎస్‌కు ఫైల్స్ అందాయని సమాచారం. దీంతో స్పందించిన పీసీసీఎఫ్ నేషనల్ హైవే వరంగల్ డివిజన్ అధికారులకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్(ఎఫ్‌సీ)–1980 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు నేషనల్ హైవే ఇరువైపులా చెట్లకు సంబంధించిన సర్వే చేపట్టకూడదని సిరికల్చర్, హార్టికల్చర్ అధికారులకు ఎఫ్‌సీ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చింది. అయినా అధికారులు చెట్లకు నంబరింగ్ ఇస్తున్నట్లుగా అటవీ అధికారవర్గాలు చెబుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని అటవీ అధికారులు పట్టుపట్టి కూర్చున్నారు. ఈ విషయంలో ఇరుశాఖల రాష్ట్రస్థాయి అధికారులు రాజీకి వస్తే తప్పా కెనాల్ నుంచి నాగిరెడ్డి కుంట వరకు, డీబీఎం–38 కెనాల్(పానేసా కాల్వ) నుంచి గట్టమ్మ మధ్యలో విస్తరణ పనులు జరిగేలా కనిపించడం లేదు. -
గజ గజా.. పులి పంజా
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా పులుల దాడుల్లో 163 మంది మృతి చెందారు. 2021లో 57 మంది మరణించగా 2022లో 105 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర అటవీ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఏనుగుల దాడుల్లో మూడేళ్లలో 1,581 మంది చనిపోయారు. అత్యధికంగా ఒడిశాలో 322 మంది, జార్ఖండ్‌లో 291 మంది, పశ్చిమ బెంగాల్లో 240 మంది గజరాజుల క్రోధాగ్నికి బలయ్యారు. 2018 గణాంకాల ప్రకారం దేశంలో పులులు సంఖ్య 2,967 కాగా 2017 అంచనాల ప్రకారం ఏనుగుల సంఖ్య 29,964 అని కేంద్ర అటవీ శాఖ తెలిపింది. ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షించడంతోపాటు నీటి వనరుల సంరక్షణ, చెట్లు నాటడం, స్థానిక ప్రజలను హెచ్చరించడం లాంటి చర్యలను అటవీశాఖ చేపడుతోంది. ఏనుగుల ఆవాసాలను ‘ఎలిఫెంట్ రిజర్వ్’ ప్రాంతంగా ప్రకటించి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏనుగుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. -
కొల్లేరు పక్షుల లెక్క తేలింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పక్షి ప్రేమికుల స్వర్గధామమైన కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్–2023 ముగిసింది. అటవీశాఖ సిబ్బంది 12 బృందాలుగా ఏర్పడి ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ నెలాఖరు వరకు ఏలూరు జిల్లాలో విస్తరించిన కొల్లేరు సరస్సు పరీవాహక ప్రాంతాల్లో పక్షుల గణన చేశారు. అభయారణ్యం పరిధిలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులను, 81,495 పక్షులను గుర్తించారు. వీటిలో మొదటి స్థానంలో కోయిలలు, రెండోస్థానంలో పెలికాన్ పక్షులు ఉండగా... అరుదైన పిన్‌టయల్ స్నిప్ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్ వాగ్‌టయల్ (పసుపు తల జిట్టంగి) పక్షులు నాలుగు కనిపించాయి. పక్షుల గణన ఎలా చేశారంటే... పొడిసిపెడి ఫారమ్స్ (గ్రేబ్స్, నీటి ప్రయాణ పక్షులు), అన్సెరి ఫారŠమ్స్ (బాతులు), చరాద్రి ఫారమ్స్ (నీటి దగ్గర నివసించే పక్షులు), సికోని ఫారŠమ్స్ (కొంగజాతి పక్షులు), చిత్తడి నేలలపై ఆధారపడే పక్షులు... ఇలా ఐదు కుటుంబ కేటగిరీలుగా తీసుకుని పక్షుల గణన చేశారు. పక్షి నిపుణుడు, రికార్డింగ్ చేసే వ్యక్తి, ఫొటోగ్రాఫర్, గైడ్‌తోపాటు మరో ముగ్గురు కలిసి మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన 12 బృందాలు ఈ సర్వే చేశాయి. 105 కొల్లేరు అభయారణ్యంలో గుర్తించిన పక్షిజాతులు 7,875 అత్యధికంగా గుర్తించిన కోయిలల సంఖ్య 81,495 ప్రస్తుతం ఉన్న మొత్తం పక్షులు 6,869 రెండోస్థానంలో ఉన్న పెలికాన్ పక్షుల సంఖ్య తక్కువగా కనిపించిన పక్షులు ఈ సర్వేలో పిన్‌టయల్ స్నిప్ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్ వాగ్‌టయల్ (పసుపు తల జిట్టంగి) పక్షులు నాలుగు, మరికొన్ని జాతుల పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం కొల్లేరులోని సహజసిద్ధ వాతావరణం పక్షులను ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి ఏటా విడిది కోసం కొల్లేరుకు వేలాదిగా పక్షులు వస్తుంటాయి. వీటి సంరక్షణ కోసం అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన వల్ల రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణకు విధివిధానాలు రూపొందించే అవకాశం ఉంటుంది. – ఎస్వీకే కుమార్, వైల్ట్‌లైఫ్ ఫారెస్ట్ రేంజర్, ఏలూరు -
కొంగను కాపాడిన వ్యక్తిపై కేసు.. మండిపడ్డ మాజీ సీఎం!
లక్నో: గాయపడిన ఓ కొంగను కాపాడిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంద్ఖా గ్రామంలో ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌కు గతంలో ఓ సారస్ కొంగ గాయంతో తన పోలంలో కనిపించింది. వెంటనే చికిత్స చేసి కొన్నాళ్లు పాటు ఆ కొంగను కాపాడుతూ వచ్చాడు ఆరిఫ్. ఆ పక్షి కొలుకున్న తర్వాత తనను కాపాడిన వ్యక్తితోనే ఉండిపోయింది. అయితే ఇటీవల ఈ విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఆ కొంగను స్వాధీనం చేసుకున్నారు. ఈ పక్షి తన సహజ వాతావరణంలో జీవించేందుకు వీలుగా రాయ్‌బరేలీలోని సమస్పూర్ అభయారణ్యంలోకి మార్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌కు నోటీసు జారీ చేసి అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ఏప్రిల్ 4న గౌరీగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. అసిస్టెంట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (గౌరీగంజ్) రణవీర్ సింగ్ జారీ చేసిన నోటీసు ప్రకారం, వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ పక్షిని తీసుకెళ్లిన ఒక రోజు తర్వాత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ చర్యను ఖండించారు. అంతేకాకుండా ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లను తీసుకెళ్లే ధైర్యం ఎవరికైనా ఉందా అని పరోక్షంగా అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఆరీఫ్ ఖాన్ గుర్జార్ మాజీ ముఖ్యమంత్రితో కలిసి వేదికపై కూర్చున్నారు కానీ మాట్లాడలేదు. ఇదిలా ఉండగా.. ఆరిఫ్ సమ్మతితోనే కొంగను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ పక్షులు ఎప్పుడూ జంటగా జీవిస్తాయని, అది ఒంటరిగా నివసిస్తున్న నేపథ్యంలో దాని మేలుకే సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు. -
రోళ్లపాడులో తోడేళ్లు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ‘ఇండియన్ ఊల్ఫ్’గా చెప్పుకునే తోడేళ్ల జనాభా దేశవ్యాప్తంగా మూడు వేల వరకు ఉండొచ్చని అటవీ శాఖ అంచనా. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిదిలోని రోళ్లపాడు పక్షుల అభయారణ్యంలోనూ తోడేళ్లు ఒకప్పుడు గణనీయంగానే ఉండేవి. కొన్నేళ్ల క్రితం వీటి ఉనికి ఇక్కడ పూర్తిగా కనుమరుగైంది. అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో అభయారణ్యంలో ఒక అధికారికి తోడేలు కనిపించగా.. అటవీ శాఖ అధికారులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ తరువాత వాటి ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించగా.. రెండు తోడేళ్ల కుటుంబాలు ఇక్కడి అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తోడేళ్లు సంఘ జీవనానికి పెట్టింది పేరు. ఇవి ప్రత్యేకమైన గుంపులుగా నివసిస్తాయి. ఈ గుంపును ‘ప్యాక్’ అంటారు. ఒక ప్యాక్‌లో 8 వరకు తోడేళ్లు ఉంటాయి. దేశంలో 10 తోడేళ్ల అభయారణ్యాలు అంతరించిపోతున్న తోడేళ్లను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 10 అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లో కైలాదేవి అభయారణ్యం, కుంబాల్ ఘర్ అభయారణ్యం, తోడ్ ఘర్ రోలి అభయారణ్యం, మౌంట్ ఆబు అభయారణ్యం, గుజరాత్‌లోని బ్లాక్ బక్ అభయారణ్యం, కఛ్ బస్టర్డ్ అభయారణ్యం, నారాయణ్ సరోవర్ అభయారణ్యం, శూల్ పాణేశ్వర్ అభయారణ్యం, కర్ణాటకలోని రాణి బెన్నూర్ బ్లాక్ బక్ అభయారణ్యం, మహారాష్ట్రలోని రెహే కురి బ్లాక్ బక్ అభయారణ్యాలలో తోడేళ్లను సంరక్షిస్తున్నారు. బట్టమేక పక్షుల అభయారణ్యంలో.. ఏపీలో తోడేళ్ల సంరక్షణకు ప్రత్యేకించి అభయారణ్యాలు ఏర్పాటు చేయనప్పటికీ బట్టమేక పక్షుల సంరక్షణకు ఏర్పాటు చేసిన రోళ్లపాడు అభయారణ్యంలో కృష్ణజింకలతో కలసి తోడేళ్లు సహవాసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తోడేళ్లు తన సహజ జాతి మాంసాహార జంతువులైన హైనాలు, నక్కల తరహాలో వేరే జంతువులు వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తినే జీవులు కావు. ఇవి తమ ఆహారాన్ని స్వయంగా వేటాడి సంపాదించుకుంటాయి. తమకు అందుబాటులో ఉండే కృష్ణ జింకలు, సమీప గ్రామాల్లో ఉండే మేకలు, గొర్రెలను ఇవి వేటాడుతుంటాయి. తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం రోళ్లపాడు బట్టమేక పక్షుల అభయారణ్యంలో తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం. ఒకప్పుడు ఈ అభయారణ్యం పరిధిలో విస్తారంగా కనిపించిన ఇండియన్ ఊల్ఫ్ తదనంతరం అదృశ్యమైంది. అనూహ్యంగా ఇటీవల మాకు తోడేళ్లు కనిపించడం సంతోషదాయకం. రెండు ప్యాక్‌ల తోడేళ్లు రోళ్లపాడులో ఉండవచ్చని అంచనా. – అలాన్ చోంగ్ టెరాన్, డీడీ, ప్రాజెక్ట్ టైగర్, ఆత్మకూరు -
తిరుపతి జూ పార్క్‌కు తరలిన పులి కూనలు
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయంలో ఉంచిన ఉన్న నాలుగు పులి కూనలను గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జువాలాజికల్ పార్కుకు తరలించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు నాగార్జున సాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలి పారు. తల్లితో పులి కూనలను కలిపేందుకు నాలుగు రోజులపాటు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పులి కూనల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జూ పార్క్‌కు తరలించారు. పులి కూనల ఆరోగ్యం భేష్ తల్లి పులి బతికే ఉందని నిర్ధారణ కావడం, పులి కూనలు కూడా ఆరోగ్యంగా చలాకీగా ఉండటం సంతోషకరమని నాగార్జునసాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జూపార్క్‌కు అనుబంధంగా ఉన్న అడవిలో పులి కూనలను పెంచుతామన్నారు. కొంత వయసు వచ్చాక వేటలో తర్ఫీదునిచ్చి తిరిగి అడవిలో ప్రవేశ పెడతామని చెప్పారు. ఇదిలావుండగా.. పులి పాదముద్రలు కనిపించాయని కొందరు చెప్పగా.. ఆ ప్రదేశానికి గురువారం తెల్లవారుజామున పులి కూనలను తరలించారు. కూనల అరుపులతో కూడిన రికార్డింగ్స్‌ను వినిపిస్తూ.. తెల్లవారే వరకు ఎదురు చూసినా తల్లి పులి జాడ కనిపించలేదు. -
మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలం..
సాక్షి, నంద్యాల: మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలమైంది. బుధవారం రాత్రి తల్లిపులితో కలపడానికి పులి కూనలను అధికారులు ఫారెస్ట్‌కు తరలించారు. ఈ క్రమంలో తల్లి పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. అయితే, తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు రాత్రంతా శ్రమించినా ఫలితం దక్కలేదు. రాత్రంతా వేచి చూసినా తల్లి పులి రాకపోవడంతో పులి కూనలను ఆత్మకూరు క్యాంప్‌కు తరలించారు. కాగా, రాత్రంతా పులి సంచరించిన ప్రాంతాల్లో కూనలను ఉంచి, కృత్రిమ శబ్దాలు చేస్తూ తల్లి పులి జాడ కోసం వెతికారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరా, ప్లగ్ మార్క్ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు -
తల్లి కోసం పులి కూనల కలవరం
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి జాడ రెండు రోజులైనా కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే మీమాంస అధికారుల్లో నెలకొంది. పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్ఫ్రారెడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలుత తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి³ పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్ నుంచి వదులుతారు. ఆ నాలుగూ ఆడ కూనలే పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి. వాటిలో రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. బతికిన వాటిలో సాధారణంగా ఒక్కొక్క ఆడ, మగ కూనలు ఉండవచ్చు. పెద్ద పులుల సంరక్షణ, సంతతి పెరుగుదలలోనూ ఆడ పులులదే ప్రధాన పాత్ర. గుమ్మడాపురంలో ఏకంగా ఒకే ఈతలో నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడంతో అటవీ శాఖ అధికారులకు పెద్ద సంబరమే అయ్యింది. ఒక ఆడపులి తన జీవిత కాలంలో (అడవిలో అయితే 18 ఏళ్లు) 20 పులులను పునరుత్పత్తి చేయగలదు. చేరదీస్తుందో.. లేదో! వన్యప్రాణుల్లో పెద్ద పులి, దొమ్మల గొండి (హైనా) తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. బిడ్డలకు ఏ కారణంగా అయినా మనిషి స్పర్శ తగిలితే వాటిని తిరిగి తమ దగ్గరకు రానీయవు. పులి కూనలను ఇక్కడి జనం ఇష్టం వచ్చినట్లు పట్టుకుని ఫొటోలు తీసుకోవడం, వాటితో ఆటలాడటం వంటి పనులు చేయడంతో పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పిల్లలను తల్లి చెంతకు చేర్చడంలో జాప్యం జరిగితే.. తల్లి వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. కాగా, మనిషి ముట్టిన వాసనలను పోగొట్టేందుకు వీలుగా అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరిస్తున్నారు. దీంతో పులి పిల్లల వంటిని తడపనున్నారు. అన్ని సందర్భాల్లో వర్తించదు మనిషి స్పర్శ తగిలితే పులులు కూనలను తిరస్కరించడం సహజమే అయినా ఇది అన్ని సందర్భాల్లో వర్తించదని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ పేర్కొన్నారు. తల్లికి, పిల్లలకు మధ్య ఉండే బలమైన బంధం, ప్రత్యేక పరిస్థితులు దీనికి మినహాయింపు కావచ్చన్నారు. అందువల్ల పిల్లల్ని జూకు తరలించడం కంటే తల్లి వద్దకు చేర్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శాస్త్రీయ పద్ధతుల్ని అవలంభిస్తాం పులి కూనలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆత్మకూరులోని అటవీ శాఖ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్లో గర్భంతో ఉన్న పులిని ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో గుర్తించామన్నారు. నాలుగు కూనలకు సరైన రక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ గుమ్మడాపురం గ్రామ శివార్లకు తీసుకొచ్చి ఉండవచ్చన్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల వన్యప్రాణి వైద్య నిపుణులు డాక్టర్ తోయిబా సింగ్ పులి కూనల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారన్నారు. కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటి ఆఫ్ ఇండియా నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చోంగ్ టెరాన్, విఘ్నేష్ పాల్గొన్నారు. -
24 గంటలు గడిచినా జాడలేని తల్లి పులి..బిక్కుబిక్కు మంటున్న కూనలు
సాక్షి, అమరావతి/కొత్తపల్లి: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులోని ఓ గోడౌన్లో సోమవారం ఉదయం నాలుగు పెద్దపులి పిల్లలు కనిపించడంతో కలకలం రేగింది. ఆ నాలుగు ఆడ పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పిల్లల కోసం తల్లి పులి వచ్చి దాడి చేస్తుందని పెద్దగుమ్మడాపురం గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామం నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. గ్రామస్తులు ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళుతుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ యువకుడు గ్రామానికి చివర నిర్మాణంలోని మల్టీపర్పస్ గోడౌన్ అవతలివైపునకు వెళ్లగా, పులిపిల్లల అరుపులు వినిపించాయి. మొదట జంగం పిల్లులుగా భావించినా.. దగ్గరకు వెళ్లి చూడగా నాలుగు పులి పిల్లలు కనిపించాయి. అతను వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగేశ్వరావు, సిబ్బంది పెద్దగుమ్మడాపురం చేరుకుని నాలుగు పులి పిల్లలను పరిశీలించారు. సుమారు 40రోజుల వయసు కలిగిన పులి పిల్లలను అడవిలోకి తీసుకువెళ్లి తల్లితో కలిపేందుకు ప్రయత్నించారు. మూడు గంటలు అడవిలో తిరిగినా తల్లి కనిపించలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పులిపిల్లలు డీలా పడిపోయాయాయి. దీంతో వాటికి పాలు పట్టించి బైర్లూటి రేంజ్లో ఉన్న జంతువైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షలు చేసి నాలుగు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో ఎండ పెరగడం, చెట్లకు మంట పెడుతుండటంతో వేడి తీవ్రత తట్టుకోలేక గ్రామంలోకి పెద్దపులి తన పిల్లలను తీసుకువచ్చి, ఒంటరిగా తిరిగి వెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆత్మకూరు సర్కిల్ సీఐ ఆర్జీ సుబ్రహ్మణ్యం పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయమై సున్నిపెంట బయోడైవర్సిటీ రేంజ్ అధికారి మహమ్మద్ హయత్ మాట్లాడుతూ గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని, పులి రాకను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పెద్ద పులికి రెండు, మూడు పిల్లలే పుడతాయని, అయితే నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడం చాలా అరుదని ఆయన తెలిపారు. ఎన్‌క్లోజర్‌లో పెట్టి.. తల్లి కోసం ఎదురుచూస్తూ.. పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బందితో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఏసీఎఫ్ (అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) ఆర్.శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పులి పిల్లలు దొరికిన సమీపంలోనే చిన్న ఎన్‌క్లోజర్‌లో వాటిని ఉంచి దూరం నుంచి తల్లి వస్తుందో.. లేదో.. అని గమనిస్తున్నట్లు తెలిపారు. చుట్టూ 50 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లల వాసన, అరుపులను బట్టి తల్లి వస్తుందని భావిస్తున్నామని, వస్తే వాటిని దానికి జత చేస్తామన్నారు. అలాకాకుండా అడవిలో వదిలేస్తే అవి ఇతర జంతువుల బారినపడతాయని చెప్పారు. ఐతే 24 గంటలు గడిచినా తల్లి పులి జాడ లేదు. దీంతో అధికారులు ఒకటి, రెండు రోజులు చూసిన తర్వాత కూడా తల్లి రాకపోతే వాటిని తిరుపతి జూకు తరలించి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆ కూనలు సంరక్షణ కోసం తిరుపతి వన్య ప్రాణి బృందం మంగళవారం ఆత్మకూరు రానుంది. ఇదిలా ఉండగా, సమీపంలోనే సంచరిస్తున్న తల్లి! పులి పిల్లలు లభించిన ప్రాంతంలోనే తల్లి పులి తిరుగుతున్నట్లు దాని గాండ్రిపుల ద్వారా అటవీ సిబ్బంది గుర్తించారు. ఈ తల్లి పులిని డిసెంబర్ నెలలో కెమెరా ట్రాప్‌లో గుర్తించినట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో అది గర్భంతో ఉంది. ఇప్పుడు దాని పిల్లలే పెద్దగుమ్మడాపురంలో ఉన్నట్లు భావిస్తున్నారు. (చదవండి: ఎంఎస్ఎంఈల్లో రాణిస్తున్న మహిళలు) -
కార్చిచ్చుకు పక్కా స్పాట్
సాక్షి, అమరావతి: అడవుల్లో చెలరేగుతున్న మంటలను వెంటనే నియంత్రించడానికి రాష్ట్ర అటవీశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పలుచోట్ల మంటలు చెలరేగాయి. వాటిని అటవీ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన నియంత్రించింది. చిన్న మంటలుగా ఉండగానే పసిగట్టి వాటిని ఆర్పేయడం ద్వారా అటవీ ప్రాంతాలను రక్షించగలిగారు. సాధారణంగా నవంబర్ నుంచి జూన్ వరకూ అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగుతాయి. డిసెంబర్ నుంచి నెమ్మదిగా పెరుగుతూ మార్చి నుంచి మే నెల వరకు ఎక్కువగా అడవులు తగలబడతాయి. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే రాయలసీమ ప్రాంతాలు, నల్లమల అడవుల్లో ఎక్కువగా మంటలను గుర్తించారు. గత నెలలో 5,972 చోట్ల మంటల్ని గుర్తించి ఆర్పేశారు. వైఎస్సార్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అత్యధికంగా 1,013 పాయింట్లలో మంటలను నియంత్రించారు. మంటలకు కారణాలు వర్షాకాలంలో అడవుల్లో గడ్డి బాగా పెరిగి వేసవి నాటికి అది ఎండిపోతుంది. ఎండల వల్ల, లేదా అడవుల్లో సంచరించే వ్యక్తులు కాల్చిపడేసే చుట్టలు, బీడీల వల్ల మంటలు చెలరేగుతాయి. ఇలాంటి మంటలను నియంత్రించడానికి అటవీ శాఖ ఫైర్ లైన్ ఏర్పాటు చేస్తుంది. తద్వారా మంటలు విస్తరించకుండా చూస్తారు. ఫైర్ ఫైటింగ్ పరికరాల ద్వారా మంటల్ని ఆర్పుతారు. అడవుల్లో మంటలు చెలరేగకుండా ఉండేందుకు సమీప గ్రామాల్లో అవగాహన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఇప్పటి వరకు 6,229 ప్రాంతాల్లో మంటలు ఏర్పడినా వెంటనే ఆర్పేశారు. 2022లో 14,452 పాయింట్లలో ఏర్పడిన మంటలను వెంటనే ఆర్పేసి అటవీ ప్రాంతాన్ని రక్షించగలిగారు. సమాచారం ఇలా.. అంతరిక్షం నుంచి భూమిని నిరంతరం క్షుణ్ణంగా పరిశీలించే ఎస్ఎన్పీపీ, మోడిస్ శాటిలైట్లు మంటల పాయింట్లను గుర్తించడానికి సహాయపడుతున్నాయి. అక్షాంశ, రేఖాంశాలతో సహా మంటల సమాచారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మానిటరింగ్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర అటవీ శాఖకు చేరుతుంది. మంటల సమాచారం అటవీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఫోన్లకు మెసేజ్‌ల రూపంలో వస్తుంది. రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఫైర్ మానిటరింగ్ సెల్ ఈ సమాచారాన్ని డీఎఫ్‌వోలకు పంపుతుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ద్వారా ఫిబ్రవరిలో మంటలను నియంత్రించగలిగారు. ఎక్కువ పాయింట్లలో వచ్చినా వెంటనే ఆర్పేశాం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అనూహ్యంగా ఎక్కువ పాయింట్లలో మంటలు వ్యాపించినా మా సిబ్బంది ద్వారా వెంటనే అదుపు చేశాం. ఆదివారం ఒక్కరోజే 825 పాయింట్లలో మంటలు ఏర్పడినట్లు శాటిలైట్ల నుంచి సమాచారం వచ్చింది. మా శాఖ వెంటనే అప్రమత్తమై వాటిని ఆర్పేసింది. ప్రతి సంవత్సరం పక్కా ప్రణాళికతో అడవుల్లో మంటలు వ్యాపించినా వెంటనే ఆర్పడం ద్వారా అటవీ ప్రాంతాన్ని కాపాడుతున్నాం. – ఎం రవిశంకర శర్మ, నోడల్ అధికారి, ఫైర్ మానిటరింగ్ సెల్, అటవీ శాఖ -
నంద్యాల: పులి కూనలపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో పెద్ద పులి కూనల లభ్యమైన ఘటనలో ఉత్కంఠ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన నాలుగు పులి కూనల్లో... రెండు పులి కూనల ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ టీమ్ సిబ్బంది పులికూనలను ఆడవిలో వదిలిన కానీ, అక్కడి నుంచి అవి కదలడం లేదు పులికూనలకు పాలు తాగించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నం చేసింది. నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా పులి కూనలు డీహైడ్రేషన్‌కు గురికావడంతో బైర్లుటి వైల్డ్ లైఫ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. పులి కూనల తల్లీ(పెద్దపులి) ఆచూకీ తెలుసుకునేందుకు ఇన్ఫ్రారెడ్(ట్రాప్) కెమెరాలను టైగర్ ట్రాకర్లు పరిశీలిస్తున్నారు. చదవండి: రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో -
కింగ్ కోబ్రాలు గూడు కట్టి.. గుడ్లు పెట్టి..
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కింగ్ కోబ్రాలు గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఎలా రక్షిస్తున్నారంటే.. మన రాష్ట్రంలో వెదురు పొదలు ఎక్కువగా ఉండే చోట కింగ్ కోబ్రా గూళ్లు ఎక్కువగా పెడుతున్నట్టు తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ గుర్తించాయి. పిల్లలు బయటకు వచ్చేంత వరకు వీటి గుడ్లను సంరక్షించేందుకు వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. గిరి నాగులు గుడ్లు పెట్టే దశ మార్చిలో ప్రారంభమై జూలై, ఆగస్టులో ముగుస్తుంది. ఆగస్టు నెలలో గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఆ గూళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లా మాడుగులలో మొదటిసారి ఒక గూడును పరిరక్షించి గుడ్లలోంచి పిల్లలు వచ్చాక వాటిని అడవిలో వదిలేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ గూళ్లపై సర్వే పూర్తి చేయగా.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టిన గూళ్లను వదిలి వెళ్లిపోయిన తరువాత గూళ్ల చుట్టూ వెదురు బొంగుల్ని పాతి ఇతర జీవులేవీ గుడ్లను తాకలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపై గూళ్ల చుట్టూ దోమ తెరలను ఆమరుస్తున్నారు. గుడ్లలోంచి గిరి నాగు పిల్లలు బయటకు వచ్చిన తరువాత వెదురు బొంగులు, దోమ తెరలను తొలగించి.. ఆ పిల్లల్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేస్తున్నారు. వీటిని ఎందుకు కాపాడుకోవాలంటే.. కింగ్ కోబ్రా ఆహార గొలుసులో అగ్ర స్థానంలో ఉంటుంది. అంటే గిరి నాగులు ఇతర అన్ని రకాల పాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటి వల్ల ఇతర పాముల జనాభా నియంత్రణలో ఉంటుంది. పర్యావరణంలో కింగ్ కోబ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. గిరి నాగులు ఉన్నచోట జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు లెక్కిస్తారు. సాధారణంగా ఇవి మనుషులు వస్తే.. తప్పించుకుని పోతాయి. ఈ పాముల కాటు వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు తక్కువ. కింగ్ కోబ్రాల రక్షణ కోసం పని చేస్తున్నాం ఐదారేళ్ల క్రితం వరకు గిరి నాగుల్ని స్థానికులు ఎక్కువగా చంపేసేవారు. ఆ సమయంలో అటవీ శాఖతో కలిసి కింగ్ కోబ్రా కన్జర్వేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. వాటి సంరక్షణ, ఇతర పాము జాతులపై అధ్యయనం, పాము కాటు నివారణే లక్ష్యంగా పని చేశాం. మేం చేపట్టిన చర్యలు ఫలించి గిరి నాగుల్ని చంపడం చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి గూళ్లు, వాటి సంతతి పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం. – కంఠిమహంతి మూర్తి, అధ్యక్షుడు, తూర్పు కనుమల వైల్డ్ సొసైటీ -
దశాబ్దం తర్వాత నల్లమలలో తోడేళ్ల జాడ
మార్కాపురం: పదేళ్ల కాలం అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలో తోడేళ్ల కదలికలు కనిపించాయి. ఇటీవల దోర్నాల–ఆత్మకూరు సరిహద్దులోని రోళ్లపాడు వద్ద తోడేళ్లు కనిపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇవి దోర్నాల– ఆత్మకూరు–శ్రీశైలం అటవీ ప్రాంతాల మధ్య కొద్ది సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటి అరుపు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి గుంపులుగా సంచరిస్తూ..జింకలు, గొర్రెలు, మేకలు, కుందేళ్లను చంపి తింటాయి. అత్యంత వేగంగా పరిగెడతాయి. పాతికేళ్ల క్రితం మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు, అర్థవీడు, దోర్నాల తదితర ప్రాంతాల్లో ఇవి ఉండేవి. పంట పొలాలకు రక్షణ చర్యలో భాగంగా రైతులు కరెంటు తీగలు పెట్టడంతో జంతువుల్ని వేటాడేందుకు పొలాల్లోకి వచ్చి విద్యుత్ వైర్లు తగిలి చనిపోయి వాటి సంఖ్య క్రమేపి తగ్గిపోయింది. గడిచిన పదేళ్ల కాలంలో నల్లమలలో తోడేళ్ల జాడ లేకపోవడంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నెల క్రితం రోళ్లపాడు అటవీ ప్రాంతంలో తోడేళ్ల జాడ ట్రాప్డ్ కెమెరాల్లో కనిపించింది. వాటి సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వన్య ప్రాణులను చంపవద్దు వన్య ప్రాణులను ఎవరూ చంపవద్దు. ఉచ్చులేసి వేటాడొద్దు. ఇటీవల రోళ్లపాడు ప్రాంతంలో తోడేళ్లు సంచరించాయి. రైతులు పొలాలకు విద్యుత్ కంచె వేయవద్దు. వన్య ప్రాణులను వేటాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎ.విగ్నేష్, డిప్యూటీ డైరెక్టర్, అటవీ శాఖ -
కళ్ల ముందు జింక ఉన్నా.. వేటాడని పులి.. వీడియో వైరల్..
పులి వేటాడితే మామాలుగా ఉండదు. అదనుచూసి చీల్చిచెండాడుతుంది. మరి అలాంటి వన్యమృగం కళ్ల ముందు జింక ప్రత్యక్షమైతే ఊరుకుంటుందా.. వెంటాడి వేటాడి దాని ఆకలి తీర్చకుంటుంది కదా..! కానీ ఈ పులి మాత్రం అలా చేయలేదు. జింక కళ్లముందే కదలాడుతున్నా దాన్ని అసలు పట్టించుకోలేదు. దాన్ని చూస్తూ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లింది తప్ప వేటాడేందుకు ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ అటవీ శాఖ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. 'పులి దానికి ఆకలిస్తేనే వేటాడుతుంది, లేదా ఎవరైనా హాని చేయాలని ప్రయతిస్తేనే దాడి చేస్తుంది. కళ్లముందు జింక ఉన్నా ఏమీ అనుకుండా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. పులి ఒక సాధవు.' అని అటవీ అధికారి ట్వీట్ చేశారు. The tiger is a monk. It won't bother you, or be bothered by you. It tries to maintain its composure as much as it can. Even if you are around it, it will most likely be unfazed. And even when a tiger expresses its aggression, it is mock. It's a construct. pic.twitter.com/FcxsduIMx2 — Ramesh Pandey (@rameshpandeyifs) March 1, 2023 ఈ వీడియోపై నెటిజ్లను భిన్నరకాలుగా స్పందించారు. పులి చాలా సైలెంట్‌గా వేటాడుతుంది, ఈ ఒక్క వీడియో చూసి దాన్ని సాధువు అనలేం అని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. ఆ జింకకు నిజంగా గట్స్ ఉన్నాయి. లేకపోతే పులికి ఎదురుగా అలా ఎందుకు నిలబడుతుంది? దాని జీవితంపై ఆశలు వదిలేసుకుని ఇలా చేసి ఉంటుంది. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే? -
శ్రీశైలం దేవస్థానానికి 4,500 ఎకరాలు ఇచ్చేందుకు రెడీ
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు అటవీశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ భూమికి సంబంధించిన సమస్య అటవీశాఖకు, దేవస్థానానికి మధ్య పెండింగ్‌లో ఉంది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి చెందిన భూముల వివరాలు పురాతన శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాయి. దాని ఆధారంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వెంటనే అటవీ, దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఉమ్మడిగా అత్యంత ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వే చేయించారు. వారు ఆ 4,500 ఎకరాల భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందినదేనని ధ్రువీకరించారు. దీంతో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కేంద్ర కార్యాలయంలో శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్.లవన్న, అటవీశాఖ డిప్యుటీ డైరెక్టర్ అలెన్‌చాంగ్‌టెరాన్ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఆ కాపీని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.మధుసూదన్‌రెడ్డి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.శ్రీనివాసరెడ్డిలకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖకు భూమిని అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని, ఆ వెంటనే దేవదాయ శాఖకు భూమిని అప్పగిస్తామని అలెన్‌చాంగ్‌టెరాన్ తెలిపారు. -
హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా..
ప్రముఖ నటుడు రోబో శంకర్ హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్ చిత్రాలతో ఆయన టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తనదైన నటన, కామెడీ డైలాగ్స్‌తో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించాడు. తమిళంలో మారి చిత్రంతో ఆయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ చానల్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్య్వూ చేసింది. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి ఈ సందర్భంగా రోబో శంకర్ ఇంటిని హోంటూర్గా చేసి తమ యూట్యూబ్‌లో ఛానల్లో షేర్ చేసింది. దీంతో రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ హోంటూర్‌లో రోబో శంకర్ ఇంట అరుదైన చిలకలు కనిపించాయి. దీంతో ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు రోబో శంకర్‌కు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. కాగా ఆయన కొంతకాలంగా అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే అరుదైన జాతి చిలుకలను పెంచుకుంటున్నాడు. చదవండి: బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్ కౌశల్ సంచలన కామెంట్స్, పోస్ట్ వైరల్ హోంటూర్ వీడియోలో వాటిని చూసిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకు ఫిర్యాదు చేయగా రోబో శంకర్ ఇంట వారు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆ చిలుకలను అటవీ శాఖ స్వాధినం చేసుకుని అతడి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఈ చిలుకలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. దీంతో అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్‌పై అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోబో శంకర్ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. రోబో సినిమాతో రోబో శంకర్ గుర్తింపు పొందాడు. -
పులిని చంపి వండుకుని తిన్నారు?
యర్రగొండపాలెం:(ప్రకాశం జిల్లా): పులిని చంపి వండుకుని తిన్నారని అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. పుల్లలచెరువు మండలంలోని అక్కచెరువు చెంచుగూడెంకు సమీపంలోని ఈతల కొండ, ఎర్రదరి ప్రాంతాల్లో దుప్పులు, మనపోతులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు కొంతమంది విద్యుత్ తీగలుపెట్టి జంతువులను వేటాడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన ఆ ప్రాంతంలో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులకు తెలిసింది. ఈ మేరకు ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు కూడా ఫారెస్ట్ అధికారులు సేకరించారు. ఈ పులిని కరెంటు తీగలు పెట్టి చంపారని, తోలును అడవిలో ఉన్న బావిలో వేసి, మాంసాన్ని వండుకుని తిన్నారని యర్రగొండపాలెంలోని అటవీశాఖ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ధ్రువీకరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడు పులులు సంచరిస్తున్నాయి పులిని చంపి దాని మాంసం వడుకుని తిన్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.నీలకంఠేశ్వరరెడ్డి వివరణ ఇచ్చారు. తమకు అందిన సమాచారం మేరకు అక్కపాలెం ప్రాంతంలో విచారణ చేపట్టామని ఆయన తెలిపారు. పులి సంచరిస్తోందని తెలిసిన వెంటనే పాదముద్రలు సేకరించామని, తద్వారా అక్కడ రెండు ఆడ పులులు, ఒక మగపులి సంచరిస్తోందని తేలిందని ఆయన వివరించారు. అటవీ జంతువులు ఎక్కువగా సంచరిస్తున్న ఆ ప్రాంతంలో సహజంగానే పులులు తిరుగుతుంటాయన్నారు. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమకు కూడా తెలిసిందని, దీనివల్ల పులులకు ప్రాణహాని ఉంటుందన్నారు. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి అటవీ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పులిని చంపినట్లు వస్తున్న వదంతులపై తమ దర్యాప్తు ఇంకా ముగియలేదని ఎఫ్ఆర్ఓ చెప్పారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? -
శ్రీశైలం అడవుల్లో అలుగుల అడుగులు
అలుగు.. ఒళ్లంతా పొలుసులు, మందపాటి తోక గల క్షీరద జాతి జంతువు. పగలంతా చెట్ల తొర్రలు, నేల బొరియల్లో దాక్కుని.. రాత్రి వేళ బయట సంచరించే నిశాచర జీవులివి. ఒంటరిగా జీవించడానికే ఇష్టపడే అలుగులు చీమలు, చెద పురుగులనే ఆహారంగా తీసుకుంటాయి. పొడవాటి సన్నని నాలుకతో వాటిని జుర్రుకుని తింటాయి. శత్రువు కనిపిస్తే బంతి మాదిరిగా చుట్టుకుపోయి.. ముప్పు నుంచి తప్పించుకునే నైపుణ్యం గల అలుగులు శ్రీశైలం అడవుల్లో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించింది. సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో అరుదైన భారతీయ అలుగుల (ఇండియన్ పాంగోలిన్) ఉనికిని గుర్తించారు. గతంలో ఈ ప్రాంతంలో విస్తృతంగా కనిపించే పాంగోలిన్లు అంతరించే దశకు చేరుకున్నాయి. నల్లమలతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లోనూ వాటి జాడే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నల్లమల అడవుల్లో మళ్లీ వాటి కదలికలను గుర్తించడంతో వన్యప్రాణి ప్రేమికుల్లో ఆశలు చిగురించాయి. శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు, మార్కాపురం పరిసరాల్లో పులుల జాడ కోసం పెట్టిన కెమెరా ట్రాపుల్లో పాంగోలిన్లు కూడా కనిపించాయి. కాకపోతే మిగిలిన జంతువులతో పోలిస్తే వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు నల్లమలలో జీవించే చెంచులు, లంబాడీలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాంగోలిన్ల ఉనికి, వాటి ఆవాసాలు, రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, రాష్ట్ర అటవీ శాఖ సంయుక్తంగా పరిశోధన ప్రారంభించాయి. వాటి ఆవాసాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రాంతాల్లో ఉండేందుకు అవి ఇష్టపడుతున్నాయి, వాటి జనాభా వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. పాంగోలిన్ల బొరియలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తూ వాటి గురించి తెలుసుకుంటున్నారు. అవి ఆహారం తినడానికి తవ్వే బొరియలు, నివాసం కోసం తవ్వే బొరియలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ బొరియల ఆధారంగా వాటి సంఖ్య, ఇతర వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే అక్కడ కెమెరా ట్రాప్‌లు పెట్టాలని భావిస్తున్నారు. అరుదైన పాంగోలిన్ జాతికి చెందినవి అలుగులను వివిధ ప్రాంతాల్లో వాలుగు, చిప్పల పంది తదితర పేర్లతోనూ పిలుస్తారు. ప్రపంచంలో 8 జాతుల పాంగోలిన్లు ఉన్నాయి. అందులో 4 ఆసియా ఖండంలో, మరో 4 ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఆసియాలో ఉన్న 4 జాతుల్లో రెండు జాతులు మన దేశంలో కనిపిస్తాయి. ఆ రెండింటిలో అత్యంత అరుదైన ఇండియన్ పాంగోలిన్ (మానిస్ క్రాసికాడాటా) జాతి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. నల్లమలలో గుర్తించింది ఈ జాతినే. ఇది చీమలు, చెద పురుగులను తింటుంది. అన్ని పాంగోలిన్ల మాదిరిగానే ఇండియన్ పాంగోలిన్ మందమైన పొలుసులతో కప్పబడి ఉంటుంది. తమను వేటాడే జంతువుల నుండి రక్షించుకోవడానికి ఈ పొలుసులు రక్షణ కవచంగా ఉపయోగపడతాయి. ప్రాణాపాయం, బెదిరింపులకు గురైతే ఇండియన్ పాంగోలిన్ బంతిలా ముడుచుకుపోతుంది. మన దేశంలోని హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్‌లో చైనీస్ పాంగోలిన్లు కనిపిస్తాయి. పాంగోలిన్ జాతులున్నా అంతరించిపోయే జీవులు జాబితాలో ఉన్నాయి. అవి నివసించే ఆవాసాలు ధ్వంసమవడం, వాటి పొలుసులు, మాంసాన్ని సంప్రదాయ వైద్యంలో వినియోగించడం కోసం అక్రమంగా వేటాడుతుండటంతో పాంగోలిన్ల ఉనికి ప్రమాదంలో పడింది. వాటిపై ఉండే పొలుసులను చైనీస్ మెడిసిన్‌లో విరివిగా వాడతారు. అందుకే వాటిని ఇష్టానుసారం వేటాడటంతో అవి అంతరించిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్న క్షీరదాల్లో మొదటి స్థానం వీటిదే. దక్షిణాదిలో తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో వీటి అక్రమ రవాణా ఎక్కువగా ఉంది. నల్లమలలో రక్షణకు అవకాశం ఎక్కువ ఇండియన్ పాంగోలిన్ అరుదైన జంతువు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇవి ఉన్నా అంతరించే దశలో ఉన్నాయి. శ్రీశైలం రిజర్వు పెద్దది కావడం, ఇక్కడి రక్షణ వ్యవస్థ బాగుండటం, పులుల సంఖ్య పెరుగుతుండటంతో పాంగోలిన్లకు ఎక్కువ రక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే అటవీ శాఖతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. వాటి ఉనికి, హాట్ స్పాట్స్, అక్రమ రవాణా ఏమైనా జరుగుతుందా వంటి వివరాలను తెలుసుకుంటున్నాం. – కంటి మహంతి మూర్తి, తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు -
విప్పపువ్వు.. గిరిజనుల కల్పతరువు
బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిపుత్రులకు అక్కడ లభించే ఉత్పత్తులు జీవనాధారం కల్పిస్తున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతుంటారు. కొందరు అడవిలో ఉండే వెదురుతో బుట్టలు, చాటలు వంటివి నైపుణ్యంలో తయారు చేసి విక్రయిస్తారు. మరి కొందరు తేనె సేకరణ, తునికాకు, అడ్డాకుతో పాటు పలు రకాల ఉత్పత్తులు సేకరిస్తారు. కాలానికి అనుగుణంగా ఉపాధిని ఇచ్చే వృక్షాల్లో ఇప్పచెట్లు ప్రధానమైనవి. వేసవిలో వీటి ద్వారా గిరిజనులు ఉపాధి పొందడానికి అనేక అవసరాలు ఉన్నాయి. విప్పపువ్వును గిరిజనులు తెల్లవారుజామునే అడవిలోకి వెళ్ళి సేకరిస్తారు. తెల్లవారుజామున చెట్లపై నుండి కిందపడిన ఇప్పపువ్వును మధ్యాహ్నానికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు. మూడు నెలల పాటు ఉపాధి మన్యం ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు విప్పచెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి విప్ప చెట్లు విరగపూస్తాయి. వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు. వీటిని సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు. విప్పపువ్వుతో ఔషధాలు తయారీ గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పపువ్వులో ఎన్నెన్నో ఔషధ విలువలు ఉండడంతో ఈ పువ్వును ఔషధాల తయారీకి విక్రయిస్తారు. ఇప్పపువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. విప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడంతో దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యా«ధులుకు ఔషధంగా పనిచేస్తుంది. సచ్ఛమైన విప్పపువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటున్నారు. వైద్యశాస్త్రంలోనూ ప్రాధాన్యం వైద్యశాస్త్రంలోనూ విప్పపువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది. అడవిలో లభించే ఇప్పపువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలున్నట్లు శాస్త్రీయంగా నిరూపించారు. భారత శాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో 1999లో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదారను తయారు చేసి జామ్, కేక్‌లు, చాక్లెట్లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. విప్పపువ్వు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మధ్యమధ్యలో ఎండిన వేప ఆకును వేస్తే నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. పశ్చిమ మన్యంలో 20 వేలకు పైగా విప్ప చెట్లు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో ఇప్పచెట్లు దాదాపుగా 20 వేలకు పైగా ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్పచెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు. గిరిజనులు సేకరించిన ఈ ఇప్పపువ్వులను జీసీసీ అధికారులే కాదు బయటి నుండి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ఇప్పపువ్వులో పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు గిరిజనులు చెప్తున్నారు. ప్రస్తుతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలంలో కొండరెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 5 వేల ఇప్ప మొక్కలు నాటాం పశ్చిమ అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా పెరిగిన ఇప్పచెట్లే కాకుండా అడవిలో ఉండే ఖాళీ ప్రదేశాల్లో సుమారు 5 వేల వరకూ విప్పమొక్కలను నాటి పెంచుతున్నాం. ఇప్పచెట్ల నుంచి వచ్చే పువ్వుల ద్వారా గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలాల్లో కొండరెడ్లు ప్రస్తుతం విప్పపువ్వు సేకరణలో ఉపాధి పొందుతున్నారు. – దావీదురాజు నాయుడు,అటవీ శాఖ డీఆర్ఓ, పోలవరం జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి మా గ్రామ సమీపంలోని అడవుల్లో విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులను గతంలో కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం జీసీసీ అధికారులు ఇప్పపువ్వు కొనుగోలు చెయ్యడంలేదు. ప్రస్తుతం ఇప్పపువ్వు సీజన్ ప్రారంభమవుతుంది. జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నాం. – కెచ్చెల బాలిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు– మోదేలు -
చిత్తడినేలలు.. జీవవైవిధ్య నిధులు
సాక్షి, అమరావతి: విలువైన చిత్తడినేలలు జీవవైవిధ్యానికి అత్యంత అవసరం. జీవవైవిధ్య సంరక్షణలో చిత్తడి నేలలది ముఖ్యపాత్ర. అందుకే వాటిని అనేక ప్రత్యేకతలున్న జీవావరణ వ్యవస్థలుగా పరిగణిస్తారు. గురువారం ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం కావడంతో వాటి ఆవశ్యకత, సంరక్షణపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సంవత్సర కాలంలో పూర్తిగాగానీ, చాలా భాగంగానీ నీటితో కప్పి ఉండే ప్రాంతాలను చిత్తడినేలలుగా పిలుస్తారు. మన రాష్ట్రంలో వివిధ రకాల చిత్తడినేలలున్నాయి. మంచినీటితో ఏర్పడిన కొల్లేటి సరస్సు, సముద్రపు నీటితో ఏర్పడిన పులికాట్ సరస్సు వాటిలో ముఖ్యమైనవి. మంచినీరు, ఉప్పునీరు కలవడం వల్ల ఏర్పడే ప్రత్యేక జీవావరణ వ్యవస్థలైన కాకినాడ సముద్రతీరంలోని కోరింగ మడ అడవులు, కృష్ణాతీరంలో కృష్ణ మడ అడవులు ప్రధానమైనవి. నేలపట్టు, సోమశిల బ్యాక్‌వాటర్‌లోని నరసింహ అభయారణ్యాలు కూడా చిత్తడినేలలే. మడ అడవులు పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో, వాతావరణంలోని కర్బన పదార్థాలను గ్రహించి జీవపదార్థాలుగా మార్చడంలో, వాటిని నిల్వ ఉంచడంలో విలువైనపాత్ర పోషిస్తాయి. ఇవి మామూలు చెట్ల కంటే కనీసం 4, 5 రెట్లు ఎక్కువ కర్బన పదార్థాలను గ్రహించి నిల్వచేస్తాయి. అనేక రకాల చేపలు, సముద్ర జీవులకు మడ అడవులు పునరుత్పత్తి ప్రదేశాలు. ఎంతో విలువైన పులసజాతి చేపలు, మాగా, బుడతమాగా చేపలకు మడ అడవులు చాలా అవసరం. కలుషితమవుతున్న చిత్తడినేలలు ప్రతి సంవత్సరం శీతాకాలంలో సైబీరియా తదితర ప్రాంతాల నుంచి కొల్లేరు, పులికాట్, నేలపట్టు వంటి చిత్తడినేలల వద్దకు అనేకరకాల పక్షులు వచ్చి జీవిస్తాయి. తిరిగి వేసవికాలంలో వాటి ప్రాంతాలకు తిరిగి వెళతాయి. అనేకరకాల నత్తలు, రొయ్యల జాతులు, క్రిమికీటకాలు ఈ చిత్తడి నేలల్లో జీవిస్తూ జీవవైవిధ్య సంపదని పరిపుష్టం చేస్తున్నాయి. వరదలను నివారించడం, వ్యవసాయ భూములను సంరక్షించడం, లక్షలాదిమంది తీరప్రాంత ప్రజల జీవనోపాధికి ఈ నేలలు ఉపయోగపడుతున్నాయి. కానీ ఆక్రమణలు, చేపలు, రొయ్యల అక్రమ చెరువులు, అశాస్త్రీయ సాగుపద్ధతులు, పురుగుమందుల వినియోగం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల చిత్తడినేలలు కలుషితమవుతున్నాయి. కొన్నిచోట్ల క్రమంగా అంతరించి పోతున్నాయి. దీనివల్ల అక్కడి జీవవైవిధ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రత్యేక జీవావరణ వ్యవస్థలు సమతుల్యతను కోల్పోతుండడంతో అనేక జీవజాతులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తడినేలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు విలువైన చిత్తడినేలల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో పలుచోట్ల నిర్వహించి వాటి ఆవశ్యకత, ప్రభావం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిత్తడినేలలను గుర్తించి వాటిని పరిరక్షించే కార్యక్రమం జరుగుతోంది. – డాక్టర్ శాంతిప్రియ పాండే, ఏపీసీసీఎఫ్ (వన్యప్రాణుల విభాగం), ఏపీ అటవీశాఖ జీవవైవిధ్య సంరక్షణకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చిత్తడినేలలను సంరక్షించడానికి ప్రభుత్వం ఈ ప్రాంతాలను అభయారణ్యాలుగా ప్రకటించి రక్షణ చర్యలు తీసుకుంటోంది. జీవవైవిధ్య సంరక్షణ చట్టం ప్రకారం ఏపీ జీవవైవిధ్య సంస్థ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో జీవవైవిధ్య సంరక్షణకు అవసరమైన వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేసింది. చిత్తడినేలలున్న ప్రాంతాలన్నింటిలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాములుగా చేసింది. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిది. – డి.నళినీమోహన్, అటవీశాఖ పూర్వ పీసీసీఎఫ్, బయో డైవర్సిటీ బోర్డు రిటైర్డ్ సభ్య కార్యదర్శి -
పాపం గజరాజులు! విద్యుత్ షాక్‌లు, రైలు ప్రమాదాలు, విష ప్రయోగాలు..
సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల అసహజ మరణాలు ఇటీవలకాలంలో పెరిగిపోతున్నాయి. రైలు ప్రమాదాలు, విద్యుత్ షాక్, వేటాడటం, విషప్రయోగం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 494 ఏనుగులు మృత్యువాతపడినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యుదాఘాతం కారణంగా 2017–18 నుంచి 2021–22 వరకు అత్యధికంగా 340 ఏనుగులు మృతిచెందినట్లు తెలిపింది. ఆ తర్వాత రైలు ప్రమాదాలబారిన పడి ఐదేళ్లలో 80 గజరాజులు మృతిచెందాయి. వేటాడి 41, విషప్రయోగం ద్వారా 25 ఏనుగులను చంపినట్లు వివరించింది. ఐదేళ్లలో అత్యధికంగా అసోంలో 121 ఏనుగులు వివిధ కారణాలతో మృత్యువాతపడ్డాయి. అతితక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది ఏనుగులు విద్యుత్‌షాక్‌తో మరణించాయి. ఏనుగుల దంతాల కోసం విషప్రయోగాలు చేస్తుండటం శోచనీయం. వివిధ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో విషప్రయోగం ద్వారా 25 ఏనుగులను చంపేశారు. కేవలం అసోంలోనే విషప్రయోగం చేసి ఏకంగా 21 ఏనుగులను హతమార్చారు. విద్యుత్ షాక్ వల్లే ఎక్కువ.. ► ప్రధానంగా విద్యుదాఘాతం వల్లే ఎక్కువగా ఏనుగులు మరణిస్తున్నాయి. ► అటవీ ప్రాంతానికి సమీపంలోని పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్ కంచెలను ఏర్పాటుచేస్తున్నారు. దీంతో ఆహారం, నీటి కోసం అడవి నుంచి బయటకు వస్తున్న ఏనుగులు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందుతున్నాయి. ఐదేళ్లలో విద్యుత్ షాక్‌కు గురై 340 ఏనుగులు మరణించాయి. ► విద్యుత్ షాక్ నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెలను తొలగించాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, విద్యుత్ ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ► భూమిపైన విద్యుత్ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, అండర్ గ్రౌండ్ లేదా, స్తంభాలపై మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు వెల్లడించింది. రైలు ప్రమాదాల కారణంగా... ► రైళ్లు ఢీకొని కూడా ఎక్కువగానే ఏనుగులు మృతి చెందుతున్నాయి. రైలు ప్రమాదాలబారిన పడి ఐదేళ్లలో 80 గజరాజులు మరణించాయి. ► రైలు ప్రమాదాల వల్ల ఏనుగుల మరణాల నివారణకు రైల్వే బోర్డు, పర్యావరణ–అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ► రైలు పైలెట్లకు పట్టాల చుట్టూ ఎక్కువ దూరం స్పష్టంగా కనిపించేలా ట్రాక్ వెంబడి చెట్లను తొలగించాలని, ఏనుగుల ఉనికి గురించి పైలెట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలని, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించాలని, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాస్‌లను నిర్మించాలని నిర్ణయించారు. ► ఏనుగుల ఉనికి ఉన్న ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లపై అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు నిరంతరం పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలను తీసుకుంటున్నారు. ఏనుగుల సంరక్షణకు ఆర్థిక, సాంకేతిక సాయం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో ఏర్పాట్లకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మనుషులు–ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడానికి ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో 32 ఎలిఫెంట్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. జాతీయ రహదారులపై ఎకో బ్రిడ్జ్‌ల ఏర్పాటు ద్వారా వన్యప్రాణులు సురక్షితంగా రహదారులు దాటేలా కసరత్తు జరుగుతోందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రపంచ బ్యాంకు సహాయం చేయనుందని పేర్కొంది. చదవండి: విదేశాలకు వలసల్లో మనమే టాప్.. దేశాన్ని వీడిన 1.80 కోట్ల మంది.. -
మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఇంత గొప్ప పరిపాలన ఎప్పుడూ చూడలేదన్నారు. నేను 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ రాలేదంటూ పొగడ్తలు కురిపించారు. చంద్రబాబు, పవన్‌లు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎవరెన్ని మాట్లాడినా ప్రజల అండతో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. చదవండి: (యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్) -
మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం
-
సర్పం.. ప్రకృతి నేస్తం! పాములు కాటు ఎందుకు వేస్తాయంటే?
తిరుపతి అలిపిరి: సర్పం (పాము) అంటేనే హడలిపోతారు. పేరు విన్నా.. చూసినా వణికిపోతారు. భయంతో పరుగులు తీస్తారు. పాము కనబడిందంటే రాళ్లు, కర్రలతో కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొన్ని కాటేయడం.. మనుషులు చనిపోవడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ప్రకృతికి పాములు జీవన నేస్తాలని నిపుణులు చెబుతున్నారు. పాముల వల్ల భూమికి, రైతులకు, అటవీ జంతువులకు ఎంతో ఉపయోగకరమని అంటున్నారు. అది ఎలా.. ఎందుకో.. మీరే చదవండి.. విషపూరితం నాలుగే ప్రపంచంలో మూడు వేల రకాల సర్పజాతులుండగా.. అందులో 300 జాతులు భారతదేశంలో ఉన్నాయి. వీటిలో 90శాతం కన్నా ఎక్కువ విషరహిత సర్పాలే. పాముకాటు మరణాలు కలిగించే అతి సాధారణమైన విషపూరిత జాతులు నాలుగు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. భయంతోనే కాటు ► మానవునికి పాములంటే ఎంత భయమో పాములకు కూడా అంతే భయం ఉంటుంది. ► పాము తారసపడినప్పుడు భయంతో పరుగులు తీయకుండా ఆ ప్రదేశం నుంచి మెల్లగా వచ్చేయాలని, భయం కలిగించడానికో.. తరమడానికో ప్రయత్నం చేస్తే కాటువేయడం ఖాయం. ► దాక్కున్న పాములను మాత్రమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. ► పామును చంపడం వంటివి చేయకూడదు. కనిపించేవన్నీ విషపూరితం కాదు మనకు కనిపించే ప్రతి పాము విషపూరితం కాదు. సాధారణంగా మన ప్రాంతంలో నాగుపాము, రాచనాగు, కట్లపాము, సా స్కేల్ వైపర్ (పోడపాము), రక్తపింజరి, బాంబు పిట్ వైపర్(పోడపాము), స్లేన్డర్ కోరల్ స్నేక్, కామన్ సీ స్నేక్ (సముద్రపు సర్పం)లు మాత్రమే విషపూరితమైనవి. బ్యాండెడ్ రేసర్, బ్లైండ్ స్నేక్, ఇలియాట్ షీల్డ్ టెయిల్, రెండు తలల పాము, కొండచిలువ, జెర్రిపోతు, రుసుల్స్ కుక్రి, రేడియేటెడ్ ర్యాట్ స్నేక్, ట్రింకెట్ పాము, కేట్ స్నేక్, బ్లాక్ హెడెడ్ స్నేక్, పసరిక పాము, నూనె పలుగుడు, జెర్రికట్ట పాము, మాను పాము, కడ్డీల సర్పము, నీటిపాము, కీల్‌బ్యాక్ వంటివి విషరహితమని నిపుణులు చెబుతున్నారు. బయోలాజికల్ పెస్ట్ కంట్రోలర్లుగా.. ప్రకృతిలో పాములు ఎలుకలను చంపి తినడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రైతులకు ఎలుకల వల్ల పంట నష్టం కలగకుండా తోడ్పడతాయి. విషరహిత సర్పమైన జెర్రిపోతు ఏడాదికి సుమారు 400 ఎలుకలను వేటాడి తింటుంది. అంతే కాకుండా పాములను తినే ప్రాణులు అడవిలో ఉంటాయి. వాటి ఆహారం కోసమైనా పాములను రక్షించాలి. పాములు రాకుండా జాగ్రత్తలు ఇలా.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యర్థ పదార్థాలను దిబ్బలుగా ఉంచరాదు. తద్వారా కప్పలు, బల్లులు, ఎలుకలు వచ్చి చేరుతాయి. వాటి కోసం పాములు వచ్చే అవకాశం ఉంది. పెరట్లో, ఇంటి ముందు నాటిన మొక్కలను ట్రిమ్ చేసి ఉంచితే పాములను కనిపెట్డానికి సులువుగా ఉంటుంది. గ్రామాలలో, పంట పొలాల్లో నేలపై పడుకొనేవారు తప్పనిసరిగా దోమతెరవంటివి వాడడం మంచిది. రాత్రిల్లో నడిచేటప్పుడు దివిటీ తప్పనిసరి. తుప్పు, ఎండు ఆకులలో అజాగ్రత్తగా చేతులు పెట్టరాదు. పాములపట్టడంపై అవగాహన పాములు కాపాడుకోవాల్సిన ఆవశ్యకంపై సోమవారం తిరుపతి శ్రీవేంకటేశ్వర జూ పార్క్‌లో విశాఖపట్టణం నుంచి వచ్చిన ఈస్టర్ణ్ ఘాట్ వైల్డ్ లైఫ్ సోసైటీ డైరెక్టర్ కేఎల్ఎన్ మూర్తి అవగాహన కల్పించారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అటవీశాఖాధికారులతో పాటు పలువురు విద్యార్థులకు క్యురేటర్ సెల్వం నేతృత్వంలో అవగాహన కల్పించారు. నాగుపామును పట్టుకొని అడవిలో ఎలా విడిచి పెట్టాలి అనే అంశంపై వివరించడంతో పాటు సాధారణంగా కనిపించే జెర్రిపోతును పట్టుకొనే విధానాలను ఆయన వివరించారు. ఆ మేరకు కొంతమంది అటవీశాఖ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పాములను రక్షించాలి పాములు సాధారణంగా భయంతోనే కాటేస్తాయి. పాములు అడవిలో మరొక జంతువులకు ఆహారంగా ఉంటాయి. ఆంధ్రాలో నమోదవుతున్న పాముకాట్ల నేపథ్యంలో పాములపై అవగాహన కల్పించేందుకు ఈస్టర్ట్ ఘాట్ సొసైటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సున్నితంగా, సులువుగా పామును పట్టుకొని ఎంపిక చేసుకున్న ప్రాంతంలో వాటిని వదిలిపెట్టేలా కొంతమందికి శిక్షణ ఇస్తున్నాం. అటవీశాఖ సహకారంతో యువకులకు శిక్షణ ఇస్తాం. – కె.ఎల్.ఎన్ మూర్తి ఈస్టర్న్ ఘాట్స్ సొసైటీ డైరెక్టర్ స్నేక్ క్యార్స్ వద్ద శిక్షణ యువకులు ముందుకు వస్తే నిష్ణాతులైన స్నేక్ క్యాచర్స్ వద్దకు పంపించి శిక్షణ ఇప్పిస్తాం. అటవీశాఖలో ఉన్న సిబ్బందిలో కొంతమందికి స్నేక్ క్యాచింగ్‌పై శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రజలకు అవగాహనతో పాటు పాములను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అటవీశాఖ ఆధ్వర్యంలో వలంటీర్లుగా నియమించి పాములు పట్టించే కార్యక్రమం జరుగుతుంది. దానికి కావలసిన వస్తు సామాగ్రిని అటవీశాఖ నుంచే సమకూరుస్తాం. – సెల్వం, క్యూరేటర్, జూపార్క్, తిరుపతి -
అటవీశాఖకు ప్రభుత్వ భూములు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: వివిధ పనుల నిమిత్తం అటవీశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూములకు అంతేమొత్తంగా నష్టపరిహారం కింద మరొకచోట భూములను కేటాయించేందుకు బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంపా) వివిధ జిల్లాల్లోని గ్రామాల పరిధిలో కొన్ని సర్వే నంబర్లలోని భూములను రిజర్వు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్లోని భూముల్లంక గ్రామంలో 314 ఎకరాలు, మండలం పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో జంగాలపల్లి రిజర్వు ఫారెస్ట్ కోసం 284 ఎకరాలు, హనుమకొండ జిల్లా, డివిజన్లోని ముల్కనూరు, ముత్తారం గ్రామాల పరిధిలో 124 ఎకరాలను రిజర్వు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్లోని చినబండిరేవు గ్రామం, 92 ఎకరాలు రిజర్వు చేశారు. మరికొన్ని జిల్లాల పరిధిలోనూ రిజర్వు అటవీప్రాంతం నిమిత్తం భూములను కేటాయిస్తూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
అటవీశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూపార్క్లను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అటవీశాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం అటవీశాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సందర్శకులను మరింతగా ఆకర్షించేలా తిరుపతి, విశాఖ జూపార్క్ లను తీర్చిదిద్దాలని కోరారు. దేశంలోని పలు జంతుసందర్శనశాలల్లో అదనంగా ఉన్న జంతువులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మన వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్న జంతువులను ఇతర జూలకు ఇచ్చి, వారి వద్ద ఉన్న జంతువులను మనం తెచ్చుకునే విధానం ఉందని, దీనిపై అధికారులు కసరత్తు చేయాలని కోరారు. అలాగే జామ్ నగర్‌లోని ప్రైవేటు జూలో ఉన్న జంతువులను కూడా ఎక్స్చేంజ్, లేదా కొనుగోలు ద్వారా కూడా సమీకరించుకోవచ్చని సూచించారు. దీనిపై వన్యప్రాణి విభాగం అధికారులు డిపిఆర్లు సిద్దం చేయాలని, నిర్ధిష్ట సమయంలోగా వాటిని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. తిరుపతిలో కపిలతీర్థం నుంచి జూపార్క్ వరకు మెమో ట్రైన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జూపార్క్‌కు సందర్శకుల సంఖ్య పెరిగేలా చేయవచ్చని అన్నారు. వివిధ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకారాన్ని పొందాలని అన్నారు. తిరుపతి జూపార్క్‌లో వైట్ టైగర్ సఫారీపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అటవీశాఖ నర్సరీల ద్వారా మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. తిరుపతి, రాజమహేంద్రవరం లోని రీసెర్చ్ సెంటర్ల ద్వారా అధిక ఫలసాయం, కలపను అందించే మేలుజాతి మొక్కలను అభివృద్ధి చేయాలని అన్నారు. తిరుపతిలోని బయోట్రిమ్ ద్వారా ఎర్రచందనంపై పరిశోధనలు చేసి, మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రైతుల నుంచి ఎర్రచందనంపై డిమాండ్ ఎక్కువగా ఉందని, ప్రైవేటు నర్సరీలు ఎక్కువరేట్లకు మొక్కలను విక్రయిస్తున్నాయని చెప్పారు. అటవీశాఖ నర్సరీల ద్వారా అందుబాటు ధరలోనే ఎర్రచందనం మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వెదురు, జీడిమామిడి, నేరేడు, ఉసిరి, చింత, యూకలిప్టస్ వంటి మొక్కలను నర్సరీల ద్వారా అందిస్తున్నామని, వీటిల్లో కూడా మరింత మేలైన జాతులను అభివృద్ధి చేయాలని సూచించారు. చదవండి: (సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు) రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కొత్తగా అటవీ అధికారుల శిక్షణకు అకాడమీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిదని అన్నారు. ఈ అకాడమీ ద్వారా అటవీశాఖ ఉద్యోగులు, అధికారుల్లో వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచాల్సి ఉందని, అకాడమీకి అవసరమైన చేయూతను అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అంతరించి పోతున్న అరుదైన జీవ, జంతుజాలంను పరిరక్షించుకునేందుకు బయో డైవర్సిటీ బోర్డ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న నగరవనాల్లో అరుదైన మొక్కల పెంపకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖతో సమన్యయం చేసుకుంటూ జీవవైవిధ్యం పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని బోర్డ్ అధికారులను ఆదేశించారు. నేషనల్ గ్రీన్ కార్ఫ్స్ ద్వారా జిల్లా స్థాయిలో ఎకో క్లబ్ లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా విద్యార్ధులకు పర్యావరణం పట్ల అవగాహనను కల్పించడం, స్థానికంగా ప్రజల్లోనూ పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్సెషల్ చీఫ్ సెక్రటరీ (ఇఎస్ఎఫ్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, డాక్టర్ బిఎంకె రెడ్డి (ఎపి బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్), ఇఎస్ఎఫ్&టి స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, వన్యప్రాణి విభాగం అడిషనల్ పిసిపిఎఫ్ శాంతిప్రియా పాండే, అడిషనల్ పిసిసిఎఫ్ (విజిలెన్స్) గోపీనాధ్, ఆర్పీ ఖజూరియా (పిసిసిఎఫ్- ప్రొడెక్షన్&అడ్మిన్), ఎకె నాయక్ (పిసిసిఎఫ్-ఐటి), పిఎవి ఉదయ్ భాస్కర్ (అకాడమీ డైరెక్టర్) తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో పులి...! భయంతో వణికిపోతున్న ఆ ప్రాంత ప్రజలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో మళ్లీ చిరుత పులుల అజలడి పెరిగింది. ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి సంచరిస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో జిల్లాలోని పలు రేంజ్‌ల పరిధిలో చిరుతలు జనం కంట పడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పశువులు, మేకలు మేపడానికి వెళ్లే కాపరులకు సైతం భయం పట్టుకుంది. రెండు రోజుల క్రితం నవీపేట్ మండలం అబ్బాపూర్ గుట్టల్లో చిరుత కదలికలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పాదముద్రలను చూసి చిరుతగా నిర్ధారించారు. ఇదే రేంజ్ పరిధిలోని మోకన్‌పల్లి శివారులో ఐదారు నెలల క్రితం కూడా చిరుతపులి కుక్కను వేటాడింది. అదే విధంగా కొన్ని రోజుల కిందట నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం అటవీ ప్రాంతంలో సైతం చిరుత కలకలం రేపింది. రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూసి వణికిపోయారు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్, వర్ని, ఆర్మూర్, కమ్మర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ కలిపి మొత్తం ఏడు రేంజ్‌లు ఉన్నాయి. జిల్లా అటవీ విస్తీర్ణం 2,14,659 ఎకరాల్లో(20.86శాతం)ఉండగా, అత్యధికంగా ఒక్క మోపాల్ మండలంలోనే 29,101 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. దీని తర్వాత ఇందల్వాయి, కమ్మర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ నార్త్ రేంజ్‌ల పరిధిలో అడవులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లోనే చిరుత పులులు ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 చిరుతలు ఉన్నట్లు ఫారెస్టు శాఖ గుర్తించినప్పటికీ, వీటిసంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం పెరిగి మేకలు, గొర్రెల మందలపై దాడులు చేస్తున్న క్రమంలో నిజామాబాద్ అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. కామారెడ్డి అడవుల నుంచి మన జిల్లాలోని వర్ని రేంజ్ పరిధిలోకి చిరుతలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టలు గుల్ల చేయడంతో.. జిల్లాలో సంచారం పెరడానికి గల కారణాలు ఆహారం, నీరే కాకుండా అవి ఏర్పర్చుకున్న ఆవాస ప్రాంతాల్లోని అడవులను ధ్వంసం చేయడం కూడా కారణం అవుతున్నాయి. మొరం తవ్వకాలు, వ్యవసాయం కోసం నేలను చదును చేసే పనులు చేపట్టి గుట్టలు, అడవులను కొల్లగొడుతున్నారు. తద్వారా శబ్దాలకు చిరుతలు, ఇతర వన్య ప్రాణులు సైతం జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతలు మనుషులు, గొర్రెలు, మేకలపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీరు దొరక్కపోవడంతో కూడా గ్రామాల శివారు ప్రాంతాల్లో వచ్చి కుక్కలు, మేకలను వేటాడుతున్నాయి. గుట్టలు, అడవులకు నిప్పు పెట్టడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. అయితే, అటవీ అధికారులు ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా చిరుతలు అక్కడక్కడా కంటపడుతూనే ఉన్నాయి. ఎక్కడైనా చిరుత పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే అడవులు, గుట్టల వెంట తిరిగే పశువులు, మేకల కాపారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలి జిల్లాలో పలు రేంజ్‌ల పరిధిలో చిరుత పులుల సంచారం పెరిగింది. ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడానికి రోడ్లను దాటుతున్నాయి. కామారెడ్డి జిల్లా పక్కనే ఉండడంతో అక్కడి ఫారెస్టు నుంచి కూడా జిల్లా అడవుల్లోకి వస్తున్నాయి. ప్రజలకు చిరుతలు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. చిరుతల కదలికలు ఉన్నచోట ఫారెస్టు అధికారులను, సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేశాం. – వికాస్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి -
సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం
సాక్షి, ఆళ్లగడ్డ: డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటే అవుననే అంటున్నారు శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులు. ఏళ్లతరబడిగా ఒకే తీరు పంటలు వేస్తూ దిగుబడులు రాక పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ఇప్పుడిప్పుడే ఇతర పంటలు, లాభదాయక సాగుపై దృష్టిసారిస్తున్నారు. నంద్యాల జిల్లాలో అటవీ సమీప గ్రామాల రైతులు ఎక్కువగా శ్రీగంధం, ఎర్రచందనం, అగర్ ఉడ్, మల్బరీ వేప, మహాగని తదితర పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొదటి రెండేళ్లు కష్టపడితే అవి పెరిగి పెద్దవై రూ.కోట్లలో ఆదాయం తెచ్చి పెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు అవసరం లేదు సిరి సంపదల గని శ్రీగంధం. అడవి సంపదలో రారాజు ఎర్రచందనం. ఇవి ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన ధర పలికే చెట్లుగా వెలుగొందుతున్నాయి. అయితే, ఇవి దట్టమైన అడవుల్లో మాత్రమే లభించే చెట్లు. వీటి చెక్కను ఎన్నో ఔషధాల్లో, కాస్మోటిక్లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం వీటి వినియో గం పెరగడంతో అంతరించి పోతున్న అరుదైన జాతి సంపదను స్మగ్లర్ల బారి నుంచి సంరక్షించుకునేందుకు ప్రభుత్వం వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో శ్రీగంధం మినహా మిగతా మొక్కలను సో షల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి కొన్ని రకాలు ఉచితంగా మరి కొన్ని రకాల మొక్కలు నామమాత్రపు ధరకు రైతులకు అందజేస్తోంది. దీంతో జిల్లాలో పలువురు వీటిని సా గు చేస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లో అమ్ముకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ శాఖ అనుమతులు ఇస్తోంది. దీంతో జిల్లాలో ప్ర స్తుతం ఎర్రచందనం, శ్రీగంధం సుమారు 80 హెక్టార్లలో సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీగంధం చెట్టు రైతుకు ఆదాయం.. వాతావరణ పరిరక్షణ శ్రీగంధం, ఎర్రచందనం పెంపకం చాలా తేలిక. అటవీ సాగు మొక్కలైన టేకు, జామాయిల్, సుబాబుల్ మొక్కలు మాదిరే వీటిని పెంచవచ్చు. నీరు నిలవని మెట్టభూములు వీటి సాగుకు అనుకూలం. ఈ మొక్కలకు ఎటువంటి క్రిమి కీటకాలు ఆశించవు. రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఏడాదికి నాలుగైదు సార్లు నీటితడులు, ఒకసారి పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. గంధం, చందనం సాగు రైతులకు ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. సాగు ఇలా.. ఎకరం విస్తీర్ణంలో 450 నుంచి 560 మొక్కలు నాటుకోవచ్చు. ఎర్రచందనం మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి ఉచితంగా అందజేస్తారు. శ్రీగంధం మొక్కలు ప్రైవేటు నర్సరీల్లో లభ్యమవుతాయి. మొక్కలు నాటిన మూడు, నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు, సాగు చేసుకోవచ్చు. సాగు వ్యయం ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు అవుతుందని అంచనా. పచ్చని బంగారం శ్రీగంధం ఎర్రచందనం తరువాత శ్రీగంధం కలపకు భారీ డిమాండ్ ఉంటుంది. దీని ఖరీదు కూడా ఎక్కువే. శ్రీగంధం చెక్కను సెంట్లు, అగరబత్తీలు, సబ్బులు, అందమైన బొమ్మలు తయారీలో వినియోగిస్తారు. ఒక కిలో ధర రూ. 8 వేల నుంచి రూ. 16వేల వరకు ఉంటుంది. 12 నుంచి 15 ఏళ్లు తరువాత ఒక్కో చెట్టు నుంచి 15 నుంచి 20 కిలోల వరకూ పొందవచ్చు. దీంతో ఒక్కో చెట్టు నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం లభిస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటిని దొంగల బారిన పడకుండా రక్షించుకోవాల్సి ఉంటుంది. పెరిగి పెద్దయితే ఎర్ర బంగారమే.. ఎర్రచందనం 15 సంవత్సరాల వయసు తరువాత ఈ చెట్లు గరిష్టంగా 20 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. వీటిని నరికితే ఎకరాకు 200 నుంచి 300 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏ – గ్రేడు దుంగలకు టన్ను రూ 60 లక్షలు, బి–గ్రేడు రూ. 40 లక్షలు, సీ–గ్రేడు రూ. 31 లక్షలు ధరలుగా నిర్ణయించారు. ఈ లెక్కన కనీసం సీ గ్రేడు రకానికి లెక్కేసినా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాగులో పాటించాల్సిన మెలకువలు ►నాటిన మొదటి సంవత్సరం మొక్కల బతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మొదటి రెండేళ్ల పాటు మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తరువాత మొక్కలు నేలలో స్థిరపడి బాగా పెరుగుతాయి ►వీటిని మెట్ట,గరప నేలల్లో సాగు చేయవచ్చు ►ఎకరాకు 560వరకు మొక్కలు నాటుకోవచ్చు ►మొక్కల మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి ►శ్రీ గంధం వేర్లకు సొంతంగా పోషకాలను గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. అందుబాటులో చెట్ల వేర్లతో శ్రీగంధం వేర్లు పెనవేసుకొని వాటి నుంచే తేమను పోషకాలను సంగ్రహిస్తాయి. ►నాటిన మూడేళ్ల వరకు శ్రీగంధానికి అందు బాటులో ఏదో ఒక మొక్క ఉండి తీరాల్సిందే. -
వెపన్స్ ఇస్తేనే విధులు నిర్వర్తిస్తామంటున్న అటవీ ఉద్యోగులు
-
ఎఫ్ఆర్వో కుటుంబానికి పరిహారం అందజేత
రఘునాథపాలెం/సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడులో ఇటీవల గొత్తి కోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల పరిహారం చెక్కును ఆయన భార్య భాగ్యలక్ష్మి, కూతురు, కుమారుడికి ఖమ్మం జిల్లా ఈర్ల పూడిలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం అందజే శారు. ఈ సందర్భంగా అటవీ శాఖ చీఫ్ కన్జర్వే టర్ (సీసీఎఫ్) భీమా నాయక్, ఖమ్మం, భద్రా ద్రి జిల్లాల డీఎఫ్ఓలు సిద్దార్థ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ.. మంత్రి పువ్వా డ అజయ్‌కుమార్, శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సహాయం వెంటనే అందేలా చొర వ తీసుకున్నారని చెప్పారు. శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదు కుంటుందని భరోసా ఇచ్చారు. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూ డా త్వరగా వచ్చేలా చర్యలు చేపడతామని హా మీ ఇచ్చారు. అనంతరం ఎఫ్ఆర్వో చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఎంపీపీ గౌరి, తహసీల్దార్ నర్సింహారావు, ఎఫ్ఆర్ఓ రాధిక తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ సూచనలకు అనుగుణంగా తమ రోజువారి విధుల్లో నిమగ్నమైనట్టు తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించాయి. శ్రీనివాసరావు హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాయి. అలాగే విధి నిర్వహణలో ఉన్న అటవీ ఉద్యోగుల రక్షణకు ముందుకు వచ్చి, క్షేత్ర స్థాయిలో సహకరిస్తున్న పోలీస్ శాఖకు, డీజీపీకి కూడా ధన్యవాదాలు తెలిపాయి. గొత్తికోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి ప్రకటించిన మిగతా హామీలను కూడా సకాలంలో నెరవేర్చి ఆ కుటుంబానికి ఊరట కలిగించాలని విజ్ఞప్తి చేశాయి. ఎఫ్ఆర్వో భార్యకు డిప్యూటీ తహసీల్దార్ హోదా ఉద్యోగంతో పాటు, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాయి. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెక్కును అందించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, అటవీ అధికారులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. -
నాటిన ప్రతి మొక్క.. చెట్టవ్వాల్సిందే!
సాక్షి, అమరావతి: మొక్కల పెంపకాన్ని మొక్కుబడిగా కాకుండా.. ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వాతావరణం, నేల స్వరూపాలకు తగినట్లుగా మొక్కలను పెంచేలా కొత్త గ్రీనింగ్ పాలసీ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్ని మొక్కలు నాటామనే సంఖ్యకు కాకుండా.. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని అటవీ శాఖ నిర్ణయించింది. గ్రో మోర్ వుడ్.. యూజ్ మోర్ వుడ్(ఎక్కువ కలప పెంచు.. ఎక్కువ కలప ఉపయోగించు) అనే నినాదానికి అనుగుణంగా కొత్త పాలసీకి రూపకల్పన చేస్తోంది. గతంలో కలపతో చేసిన వస్తువుల వినియోగం ఎక్కువగా ఉండేది. దీంతో కలప తరిగిపోయి.. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగింది. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల ప్రమాదమని గ్రహించిన ప్రజలు మళ్లీ చెక్క వస్తువుల వైపు చూస్తున్నారు. అలాగే వాతావరణంలో కూడా కర్బన ఉద్గారాలు పెరిగిపోయాయి. పచ్చదనం పెరిగితే తప్ప ఆక్సిజన్ ఉత్పత్తికి వేరే మార్గం లేదని తేలిపోయింది. ఇందుకు తగ్గట్టుగా మొక్కలు నాటే విధానాన్ని ఆధునికంగా, శాస్త్రీయంగా మార్చాలనే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏపీలోనూ ఇందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. అడవులతో పాటు వాటి వెలుపల, రోడ్లు, కాలువలు పక్కన, పార్కులు, ఇతర ప్రాంతాల్లో అక్కడి వాతావరణం, నేల స్వభావం, నీటి వనరుల లభ్యత, కలప అవసరాలకు అనుగుణంగా.. ఏ జాతి మొక్కలు నాటాలో నిర్ణయించేలా రాష్ట్ర అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లాలో వాణిజ్య నర్సరీలు రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీల స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చివేయాలని భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒకటి, రెండు వాణిజ్య నర్సరీలను ఆధునిక రీతిలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నర్సరీల్లో స్థానికంగా పెరిగే వృక్ష జాతులు, జన్యుమార్పిడి చేసిన మొక్కలు లభించేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో రెండు, మూడు చోట్ల పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యాధునికంగా మొక్కలు పెంచే విధానం, వేగంగా పెరిగే మొక్కలు తదితర కోణాల్లో పరిశోధనలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. సరికొత్తగా పచ్చదనం.. అడవులతో పాటు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో.. ప్రతి చోటా అక్కడి వాతావరణానికి తగినట్లుగా ఏ మొక్కలు నాటాలి, వాటి నిర్వహణ తదితరాలపై శాస్త్రీయంగా పరిశోధనలు చేయిస్తాం. ఎలాంటి మొక్కలు నాటాలో చెప్పడంతో పాటు.. అవి సక్రమంగా పెరిగేలా చూసేందుకు చర్యలు తీసుకుంటాం. కొత్త గ్రీనింగ్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో పచ్చదనం పెంపు సరికొత్తగా, నాణ్యంగా ఉండేలా చూస్తాం. – వై.మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
హమ్మయ్య.. గండం గట్టెక్కింది.. మహారాష్ట్రకు పయనమైన పులి
బెజ్జూర్: కుమురంభీం జిల్లా వాసు లకు పెద్దపులి నుంచి ఊరట కలిగింది. కుమురంభీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా హడలెత్తించిన పెద్దపులి మహారాష్ట్ర వైపు పయనమైనట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బెజ్జూర్ రేంజ్ పరిధిలోని నాగవెళ్లి, మొగవెల్లి గ్రా మాల సమీపంలోని ప్రాణహిత నది దాటినట్లు ఆనవాళ్లను గుర్తించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని వాంకిడిలో ఓ రైతును బలిగొన్న పెద్దపులి మరికొ న్ని పశువులపై కూడా దాడి చేసింది. దీంతో జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. చదవండి: తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు -
కొత్తగూడలోపెద్దపులి సంచారం
చింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసులకు పెద్దపులి భయం పట్టుకుంది. రోజుకో గ్రామంలో పులి ప్రత్యక్షమవుతూ కలవరపెడుతోంది. ఆదివారం చింతలమానెపల్లి మండలం కొత్తగూడ గ్రామ శివారులోని చెరువులో నీళ్లు తాగుతూ స్థానికులకు కన్పించింది. దీంతో వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి చెరువు వద్ద పెద్దపులి అడుగులను గుర్తించారు. పులి నీళ్లు తాగి బాబాసాగర్ గ్రామంవైపు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అనంతరం స్థానికులకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు. కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో పెద్దపులి సంచరిస్తోందని,అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ కూలీలు, రైతులు గుంపులుగా పొలాలకు వెళ్లాలన్నారు. పెద్ద పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం బాబాసాగర్ గ్రామంలో పులి సంచారంపై డప్పు చాటింపు వేయించారు. -
రాష్ట్రంలో కొత్తగా 100 ఎకో టూరిజం ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో వంద పర్యావరణ పర్యాటక (ఎకో టూరిజం) ప్రాజెక్టులను ప్రారంభించాలని అటవీ శాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి అటవీ శాఖ డివిజన్ పరిధిలో కనీసం 5 ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లు నెలకొల్పాలని సూచించారు. విశాఖ, తిరుపతి జూలలో ప్రజలను ఆకర్షించే విధంగా కొత్త జంతువులను తీసుకురావాలని మంత్రి చెప్పారు. కపిలతీర్థం నుంచి తిరుపతి జూ పార్క్ వరకు ట్రామ్ లేదా రోప్‌వే ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల వల్ల జన నష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జగనన్న లేఅవుట్లలో నాటేందుకు మొక్కలను సమకూర్చాల్సి ఉందన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణంలో వేగం పెరగాలి రాష్ట్రంలో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కేవీ విద్యుత్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి కొన్నిచోట్ల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని, మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఇంధనశాఖ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని చెప్పారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆక్వా జోన్ పరిధిలోని అర్హులైన రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తోందని, దీనిపై సర్కిళ్ల వారీగా ఎంత విద్యుత్‌ను సబ్సిడీపై అందిస్తున్నాం, జోన్ పరిధిలో ఎంత డిమాండ్ ఉందనే వివరాలను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. -
జంతువులు అడవికే పరిమితం!
సాక్షి, అమరావతి: ఏనుగులు, పులులు వంటి జంతువులు జనావాసాలు, పొలాల వద్దకు వచ్చి బీభత్సం సృష్టించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. జంతువులను అడవికే పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఒడిశా, తమిళనాడు అటవీ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కూడా నిర్ణయించింది. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన అటవీ శాఖాధికారుల సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఎనిమిదేళ్లలో 38 మంది మృత్యువాత ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇటీవల రెండు పులులు దారి తప్పి తూర్పుగోదావరి, అనకాపల్లి ప్రాంతాల్లోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి, పొలాల్లోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎలుగుబంట్లు, అడవి పందులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జంతువులు, మనుషులకు మధ్య సంఘర్షణలో 2014 నుంచి ఇప్పటివరకు 38 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలపై 15,198 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో మృతి చెందిన, గాయపడిన కుటుంబాలు, పంట, ఇతర నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లకుపైగా పరిహారం చెల్లించింది. పటిష్ట భద్రత ఏర్పాట్లు.. అవగాహన కార్యక్రమాలు.. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఏనుగులు ఎక్కువగా ఆవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ఏనుగులు వచ్చే మార్గాల్లో కందకాలు తవ్వడం (ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్‌లు), ఆర్సీసీ పిల్లర్లతో స్ట్రీమ్ బారికేడ్లు, రోడ్లపైకి వచ్చే మార్గాల్లో గేట్లు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో 24గంటలు తిరుగుతూ వాటిని గ్రామాల్లోకి రాకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను, ఎలిఫెంట్ ట్రాకర్లను నియమించనున్నారు. అదేవిధంగా ఏనుగులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు మిరపకాయ పొగ వేయడం, ఆముదం స్ప్రే చేయడం, తేనెటీగల సౌండ్ చేయడం ద్వారా వాటిని తిరిగి అడవి వైపు మళ్లించే అంశాలపై స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏనుగులు బయటకు రాకుండా అడవుల్లోనే వాటి కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్రలో ఎలిఫెంట్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల అధికారులతో సమన్వయం పెంచుకుని ఏనుగుల కదలికలపై సమాచారాన్ని వేగంగా మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. పులులను ట్రాప్ చేసేలా... తమ ఆవాసాల్లోకి వేరే పులులు రావడంతో అక్కడక్కడా పులులు దారి తప్పి అడవి నుంచి బయటకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలా బయటకొచ్చిన పులులు ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి ఆవులు, మేకలు వంటి జంతువులను చంపుతున్నాయి. ఇలాంటి ఘటనల నివారణ కోసం వాటిని ట్రాప్ చేసే కేజ్‌లు సమకూర్చుకోవడంతోపాటు కెమెరాల ట్రాప్లను పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. అవి అడవి దాటి రాకుండా చర్యలు చేపడుతున్నారు. -
నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ నోటిఫికేషన్ విడుదల
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అటవీశాఖకు సంబంధించి ఎనిమిది ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అలాగే సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోని ఎనిమిది కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ అక్టోబర్ 17న తెలిపారు. కాగా, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చునని పేర్కొన్నారు. కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టులకు నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఇతర వివరాలకు psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. -
‘వైల్డ్ లైఫ్ టూరిజం’కి న్యూ లుక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొంగొత్త హంగులతో ‘వైల్డ్ లైఫ్ టూరిజం’సిద్ధమవుతోంది. తెలంగాణలో పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో వచ్చేనెల రెండోవారంలో మొదలు కానుంది. ఏటీఆర్‌లోని ఫరాహాబాద్‌లో టైగర్ సఫారీని ఏడాదికొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ‘వైల్డ్‌లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్’లను అందుబాటులోకి తెచ్చి గతేడాది నవంబర్ 14న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ప్యాకేజీ టూర్లను అటవీశాఖ రూపొందించిన ఓ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే వీలుకల్పించారు. గతేడాది ప్రారంభించిన ఈ టైగర్ సఫారీని ఈసారి మరిన్ని సౌకర్యాలతో మరింత ఆహ్లాదాన్ని పంచేలా జంతుప్రేమికులను అలరించేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది. రాత్రి అడవిలో ప్రకృతి ఒడిలో సేదతీరేలా...: టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీలను కలు సుకుని వారి జీవనశైలిని తెలుసుకోవడం వంటి వాటితో పాటు మరిన్ని అదనపు ఆకర్షణలను జతచేస్తున్నారు. దా దాపు 24 గంటల పాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదతీ రేలా దీనిని రూపొందించారు. ఇందులో భాగంగా రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టిఇళ్లలో బసతో కొత్త అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమ య్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరి రక్షణ, పచ్చదనం కాపాడేందు కు అటవీశాఖ నిర్వహిస్తు న్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ సెంటర్‌ను, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్‌లను చూపిస్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. సాయంత్రానికి క్యాంప్‌కు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు పొద్దునే సందర్శకులను టైగర్ సఫారీకి తీసుకెళ్లడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్‌గైడ్‌లుగా వ్యవహరించనున్నారు. ఈసారి అంతా కొత్త కొత్తగా.. గత ఏడాదితో పోల్చితే కొత్త కాటేజీలు సిద్ధం చేయడంతో పాటు, టైగర్ సఫారీకి అనువైన 8 కొత్త వాహనాలను కొంటున్నాం. అట వీ, జంతుప్రేమికులకు ఆహ్లాదం పంచడంతోపాటు, ఇక్కడ గడిపే సమయం మధురానుభూతులను నింపేందుకు దోహ దపడే చర్యలు చేపడుతున్నాం. నూతనంగా అందుబాటులోకి తెస్తున్న కాటేజీలతో పాటు మట్టి ఇళ్లు, ఒక ట్రీ హౌస్, ఎయిరోకాన్ హౌస్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. గతేడాది టైగర్ సఫారీని మొదలుపెట్టినపుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయి. ఈ ఏడాది సఫారీ ఏరియాలో కాకుండా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో తరచుగా పులులు తారసపడుతుండటాన్ని బట్టి సంఖ్య పెరిగినట్టుగా అంచనా వేస్తున్నాం. చెంచుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పుట్టగొడుగులు, తేనేటీగల పెంపకంలో శిక్షణనిస్తున్నాం. – ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ గొప్పిడి, అమ్రాబాద్ డీఎఫ్ఓ -
అటవీశాఖ.. సరికొత్తగా
జిల్లాల పునర్విభజన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం అటవీ శాఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. వివిధ ఫారెస్టు రేంజ్‌ల మార్పులతో పాటు సెక్షన్లు, బీట్ల విభజన కూడా చేశారు. మార్కాపురం, గిద్దలూరు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలను పులుల అభయారణ్యం కిందకు మార్చారు. ఇప్పటి వరకు డీఎఫ్‌వో కేడర్ పోస్టులు ఉండగా.. వారి స్థానంలో డిప్యూటీ డైరెక్టర్లను కేటాయించారు. ఆ మేరకు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖను పునర్ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా రెగ్యులర్ ఫారెస్ట్ (రిజర్వు), వన్యప్రాణి సంరక్షణ విభాగాలుగా ఉన్న వాటిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఫారెస్ట్ విభాగాన్ని మొత్తం జిల్లాలోని 28 మండలాలతో కూడిన పరిధిని ఏర్పాటు చేస్తూ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయాన్ని గిద్దలూరు నుంచి జిల్లా కేంద్రం ఒంగోలుకు మార్చారు. ఒంగోలు డీఎఫ్ఓగా కే.మోహనరావును ప్రభుత్వం నియమించింది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే రెగ్యులర్ అటవీ శాఖ విభాగాన్ని మూడు రేంజ్‌లుగా, వాటి పరిధిలో 13 సెక్షన్లు, 31 బీట్లు ఉండేలా విభజించారు. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయం పరిధిలో మొత్తం 28 మండలాల పరిధిలో 1,11,834.140 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డులోని గతంలో ఒంగోలు రేంజ్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సామాజిక అటవీ విభాగానికి (సోషల్ ఫారెస్ట్) ఎలాంటి మార్పులు చేయలేదు. డీఎఫ్ఓ కార్యాలయం యధావిధిగా ఒంగోలులోనే ఉంటుంది. సామాజిక వన విభాగం డీఎఫ్‌వోగా ఉన్న మహబూబ్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సునీతను నియమించారు. గిద్దలూరు, గిద్దలూరు డీడీలు శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోకి... అటవీ విభాగాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మార్కాపురం, గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయాలు శ్రీశైలంలోని డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయం పరిధిలోకి వెళ్లిపోయాయి. గతంలో వన్యప్రాణి సంరక్షణ డివిజన్‌గా ఉన్న మార్కాపురాన్ని శ్రీశైలం పులుల అభయారణ్యంలోకి విలీనం చేశారు. ఇప్పటి వరకు మార్కాపురం డీఎఫ్‌వో కేడర్‌లో ఉండేది. దానికి డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించారు. దాంతో పాటు గిద్దలూరులో రెగ్యులర్ ఫారెస్ట్ (అటవీ డివిజన్)ను డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలుకు తరలించటంతో గిద్దలూరు ప్రాంతాన్ని పులుల అభయారణ్యం పరిధిలో చేర్చారు. గిద్దలూరు కార్యాలయాన్ని కూడా డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించి శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలోకి మార్చారు. గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని మండలాలతో పాటు, నల్లమల అభయారణ్యం ఉంటుంది. ఒంగోలు కార్యాలయంలో సేవలు అందుబాటులో ఒంగోలు నగరంలోని డీఎఫ్ఓ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. గతంలో ఏ పని కావాలన్నా జిల్లాలోని నలుమూలల నుంచి గిద్దలూరు డీఎఫ్ఓ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ప్రజలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ఒంగోలు డీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. – కే.మోహన రావు, డీఎఫ్ఓ, రెగ్యులర్ ఫారెస్ట్ -
నల్లమలలో పెరిగిన పులులు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 21
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోర్ ఏరియా విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో ఇప్పటివరకు 21 పులులు కెమెరాకు చిక్కాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎనీ్టసీఏ) నాలుగేళ్లకు ఒకసారి పులుల గణన చేపడుతుంది. 2018లో విడుదల చేసిన నివేదికలో అమ్రాబాద్ రిజర్వ్‌లో 12 పులులు ఉండగా, గతేడాది నాటికి వాటి సంఖ్య 16కి పెరిగింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో 21 పులులు చిక్కాయి. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పెరుగుతున్న ఆడ పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మొత్తం విస్తీర్ణం 2,611.39 చ.కి.మీ. కాగా, ఇందులో కోర్ ఏరియా 2,166.37 చ.కి.మీ. కోర్ ఏరియాపరంగా ఏటీఆర్ దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ సుమారు 200 వరకు పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అమ్రాబాద్ రిజర్వ్‌లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడ పులుల సంఖ్య పెరిగిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఆడపులులు ఏడు ఉండగా, మరో ఆరు పులి పిల్లలు ఉన్నాయి. ప్రజల మద్దతుతో... ఎనీ్టసీఏ మార్గదర్శకాల ప్రకారం పులుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. పులుల వేటను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతోపాటు స్థానిక ప్రజల్లో పులుల ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో అవగాహన కలి్పస్తోంది. తద్వారా పులుల సంరక్షణ కోసం స్థానిక ప్రజల మద్దతు పొందుతోంది. పులులకు ఆహారమయ్యే వన్యప్రాణుల సంతతి పెంచేందుకు ప్రత్యేకంగా 300 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. నల్లమలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరప్రాంతాల్లో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆడ పులులు, పిల్లల సంరక్షణ కోసం కృష్ణానది దాటి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కృష్ణాతీరంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే వారితో పులులకు ముప్పు పొంచి ఉండటంతో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాయింట్ రివర్ పెట్రోలింగ్ ద్వారా సుమారు 30 కి.మీ. పరిధిలో పులులు ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించేందుకు అవకాశం కలి్పస్తున్నారు. పులుల ఆవాసాలకు ఇబ్బంది లేకుండా.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జాయింట్ రివర్ పెట్రోలింగ్ చేపట్టాం. దీనిని ఇంకా విస్తరిస్తాం. పులుల ఆవాసాలకు ఇబ్బంది కలగకుండా స్థానికులకు అవగాహన కలి్పస్తున్నాం. ప్రజలు సైతం ఎంతగానో సహకరిస్తున్నారు. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
నల్లమల వన్యప్రాణులకు ప్లాస్టిక్ ముప్పు
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లోని వన్యప్రాణులు ప్లాస్టిక్ ప్రభావానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ కారణంగా ఈ అటవీ ప్రాంతంలోని జంతువుల ప్రవర్తనలో మార్పులు వస్తున్నట్లు అటవీ శాఖ అధ్యయనంలో తేలింది. వాటి శరీరాల్లోను మార్పులు వస్తున్నట్లు స్పష్టమైంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఉన్న బయోడైవర్సిటీ రీసెర్చి సెంటర్ నల్లమల అడవుల్లో పర్యావరణం, జీవావరణానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతం (నల్లమల అడవులు) పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి అనేక జంతువులకు ఆలవాలం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలానికి వెళ్లే మార్గం ఈ అడవిలోంచే ఉంది. లక్షలమంది యాత్రికులు వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు యాత్రికులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు, పాలిథిన్ కవర్లు వంటి వాటిని అటవీ ప్రాంతంలో రోడ్డు వెంబడి పడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఆకర్షిస్తుండడంంతో వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల పాలవుతున్నాయి. తెలియకుండా ప్లాస్టిక్‌ను తింటున్న అడవి జంతువులకు అనారోగ్యాలు వస్తున్నాయి. వన్యప్రాణుల శరీరంలో బయో–అక్యుమ్యులేషన్, బయో–మాగ్నిఫికేషన్ జరిగి ప్లాస్టిక్ కెమికల్స్ ఎక్కువగా పోగుపడుతున్నాయి. దీంతో అడవి జంతువుల సహజ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. వాటి శరీర హార్మోన్లలో మార్పులు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఆకలి తగ్గిపోవడంతో తినడం తగ్గి శక్తిహీనం అవుతున్నాయి. వాటి ఆహారపు అలవాట్లలోను తేడాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్)కు చెందిన అటవీ బృందం సాంకేతిక, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నల్లమలలోని విభిన్నమైన పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. నల్లమల పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడమే అత్యంత కీలకమైన అంశం కావడంతో అక్కడి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ‘మన ఎన్ఎస్టీఆర్–క్లీన్ అండ్ గ్రీన్ ఎన్ఎస్టీఆర్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. స్థానికంగా ఉండే చెంచు గిరిజనులను ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేయడానికి స్వచ్ఛ సేవక్‌లుగా నియమించింది. తద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేరు చేయించడంతోపాటు ప్రామాణిక పద్ధతుల్లో వాటిని రీసైక్లింగ్ చేస్తోంది. ప్రతి స్వచ్ఛ సేవక్కు అడవిలో జనసంచారం ఉండేచోట కొంత ప్రాంతాన్ని కేటాయించి ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే బాధ్యతను అప్పగించింది. ఘాట్‌రోడ్డు పక్కన చెత్తకుండీలు ఏర్పాటు చేసి యాత్రికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో వేసేలా సూచికలు పెట్టింది. ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాలను తెలిపేలా పలుచోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. ఈ చర్యల ద్వారా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల సమస్యలు రాకుండా చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వచ్ఛ సేవక్‌ల ద్వారా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను ఏరివేయించి రీసైక్లింగ్‌కు పంపుతున్నాం. ప్లాస్టిక్ అడవి జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాíస్టిక్‌ను శ్రీశైలం ప్రాంతానికి తీసుకురాకూడదు. యాత్రికులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలి. – వై.శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్, శ్రీశైలం -
చిత్తడి నేలల సమాచారానికి కమిటీ
సాక్షి, అమరావతి: చిత్తడి నేలల గురించి నిర్దిష్టమైన సమాచారం రూపొందించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, అటవీశాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో కూడిన వెట్ ల్యాండ్ బోర్డ్ తొలి సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండునెలల్లో ఈ కమిటీ ప్రాథమిక నివేదికను వెట్ ల్యాండ్ బోర్డుకు సమర్పిస్తుందని తెలిపారు. ప్రజల జీవనోపాధికి విఘాతం లేకుండా అలాగే చిత్తడి నేలల్లో జీవజాలం మనుగడకు ముప్పులేకుండా వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని 30 వేల ఎకరాల్లో చిత్తడి నేలలు ఉన్నట్లు గుర్తించిందన్నారు. వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నేలల్లో కొంతమేర ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2వ కాంటూరు వరకు చేపల చెరువులు విస్తరించాయన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సీజనల్‌గా వ్యవసాయం, ఇతర పంటలు సాగుచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని చిత్తడి నేలల్లో జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ అనేక రకాల జంతువులు, పక్షులు, జీవజాలం మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. కొల్లేరు, నేలపట్టు, పులికాట్, కోరింగ, శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో చిత్తడి నేలలున్నట్లు తెలిపారు. అరుదైన విదేశీపక్షులు వేల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వచ్చి కొల్లేరు, పులికాట్ ప్రాంతాల్లోని చిత్తడి నేలల్లో సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయని చెప్పారు. చిత్తడి నేలల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేసిందని, వాటి ఆధారంగా రాష్ట్రంలోను వెట్ ల్యాండ్ బోర్డు ఏర్పాటైందని తెలిపారు. అటవీ అధికారులు చిత్తడి నేలల సంరక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్, అటవీదళాల అధిపతి మధుసూదన్‌రెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధి కారులు ఎ.కె.ఝా, శాంతిపాండే తదితరులు పాల్గొన్నారు. -
అటవీ శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, అమరావతి: ఏపీలో కొత్త జిల్లాలకు అనుగుణంగా అటవీ శాఖను పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం అక్కడ కొత్తగా అటవీ శాఖాధికారులను నియమించింది. 26 జిల్లాల్లో 32 టెరిటోరియల్ డివిజన్లు, 12 సోషల్ ఫారెస్ట్ డివిజన్లు, వైల్డ్ లైఫ్ డివిజన్లకు డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో)లను నియమించింది. ఇందుకోసం ఇప్పుడు పనిచేస్తున్న డీఎఫ్‌వోలను బదిలీ చేసింది. ఆ డివిజన్లలో ఇతర అధికారులు, సిబ్బందిని కూడా నియమించింది. బుధవారం నుంచి కొత్త డివిజన్ల ప్రకారం అటవీ శాఖ పనిచేయనుంది. అటవీ, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖల స్వరూపం జిల్లాల వారీగా, రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా ఉండదు. ఒక జిల్లాలో 3, 4 డివిజన్లు.. కొన్నిచోట్ల 2 జిల్లాలకు కలిపి ఒక డివిజన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే జిల్లాల పునర్విభజన సమయంలో అటవీ శాఖ పునర్వ్యవస్థీకరణ జరగలేదు. అటవీ శాఖ స్వరూపాన్ని బట్టి పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. దీంతో 2 నెలల్లో కసరత్తు చేసి ఇటీవలే అటవీ శాఖను పునర్వ్యవస్థీకరించారు. వాటి ప్రకారం మంగళవారం సిబ్బందిని బదిలీ చేశారు. ప్రతి జిల్లాకు ఒక డివిజన్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రతి జిల్లాకు ఒక డివిజన్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ ఉన్నట్లే జిల్లా అటవీ శాఖాధికారి ఒకరు ఉండేలా చూశారు. ఆయా జిల్లాల్లో ఎక్కువ అడవి ఉంటే అక్కడ అదనంగా డివిజన్లు సృష్టించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా అటవీ శాఖాధికారిని నియమించారు. ఆ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో మరో 3 డివిజన్లు సృష్టించి వాటికి డీఎఫ్ఓలను నియమించారు. జిల్లాలో అటవీ శాఖను సమన్వయం చేసేది పాడేరులోని జిల్లా అటవీ శాఖాధికారే. ఇలా అన్ని జిల్లాలను అటవీ విస్తీర్ణాన్ని బట్టి పునర్వ్యవస్థీకరించారు. ఆ డివిజన్ల ప్రకారం బుధవారం నుంచి పరిపాలన ప్రారంభం కానున్నట్లు అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై. మధుసూదన్‌రెడ్డి తెలిపారు. -
లోసింగి అటవీ ప్రాంతంలో బుల్లి జింక స్వాధీనం
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): నర్సీపట్నం అటవీ రేంజ్ పరిధిలోని రోలుగుంట మండలం లోసింగిలో మౌస్ డీర్ (బుల్లి జింక)ను అటవీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వయసు కలిగిన వింత ప్రాణితో లోసింగి గ్రామంలో చిన్నారులు ఆడుకుంటుండగా జాన్ అనే వ్యక్తి గమనించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. నర్సీపట్నం రేంజర్ లక్ష్మీనర్సు, సిబ్బందితో లోసింగి గ్రామం వెళ్లి పిల్లల దగ్గర ఉన్న మౌస్ డీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మౌస్ డీర్‌ను డీఎఫ్‌వో సూర్యనారాయణ పరిశీలించి, ఇది అరుదైన ప్రాణి అని చెప్పారు. అటవీ అధికారుల సంరక్షణలో జాగ్రత్తగా ఉంచారు. ఆదివారం విశాఖ జూకు అప్పగిస్తున్నట్లు రేంజర్ తెలిపారు. -
చీతాల మేత కోసం చీతల్! తీవ్రదుమారం
భోపాల్: ప్రాజెక్టు చీతాలో భాగంగా.. నమీబియా నుంచి భారత్‌కు రప్పించిన చీతాల విషయంలో రోజుకో విమర్శ వినిపిస్తోంది. చీతాల రాకతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిసిందే. తాజాగా ఓ ప్రచారం వెలుగులోకి రావడంతో బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు నిరసనలకు దిగారు. చీతాల కోసం రాజస్థాన్ నుంచి తెప్పించిన చీతల్(మచ్చల జింక)లను మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో వదిలినట్లు ప్రచారం మొదలైంది. దీంతో రాజస్థాన్‌కు చెందిన బిష్ణోయ్ తెగ నిరసనలకు దిగింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాసింది ఆ తెగ. చీతల్ అనేది అంతరించిపోయే స్థితిలో ఉన్న జంతుజాలమని, అధికారులు తీసుకున్న అర్థంపర్థం లేని నిర్ణయంపై పునరాలోచన చేయాలని వాళ్లు ప్రధానిని లేఖలో కోరారు. అంతేకాదు.. హర్యానా ఫతేబాద్ కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించి.. మినీ సెక్రటేరియెట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే.. మధ్యప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఈ వివాదంపై స్పష్టత ఇచ్చారు. రాజస్థాన్ నుంచి చీతల్‌ను తెప్పించలేదని, ఎందుకంటే.. అలా తెప్పించాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి కునో నేషనల్ పార్క్‌లోనే 20వేలకు పైగా చీతల్స్ ఉన్నాయని, కాబట్టి, బయటి నుంచి తెప్పించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా.. నమీబియా(ఆఫ్రికా దేశం) నుంచి తెప్పించిన ఎనిమిది చీతాలను సెప్టెంబర్ 17వ తేదీన గ్వాలియర్ కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారాయన. ఛత్తీస్‌గఢ్(అప్పట్లో మధ్యప్రదేశ్) కొరియా జిల్లాలో 1947లో భారత్‌లో చివరి చీతా కన్నుమూసింది. ఆపై 1952 నుంచి చీతాలను అంతరించిన జాబితాలో చేర్చింది భారత్. ఇదీ చదవండి: డివైడర్‌పై పడుకోవడమే వాళ్లు చేసిన పాపం! -
ఆడపులుల అడ్డా.. నల్లమల
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లో మగ పులులకంటే ఆడ పులులే ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో 2022 సంవత్సరం పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. మొత్తం 73 పులులు ఉన్నట్లు కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. అందులో 49 ఆడ పులులే. 21 మాత్రమే మగ పులులు ఉన్నాయి. మూడు పులులు ఆడవో, మగవో గుర్తించలేకపోయారు. 2014లో రాష్ట్ర విభజన సమయానికి నల్లమలలో 37 పులులే ఉన్నాయి. అటవీ శాఖ సంరక్షణ చర్యలు పటిష్టంగా ఉండడంతో వాటి సంఖ్య అనూహ్యంగా 73కి పెరిగింది. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం, దోర్నాల ప్రాంతంలో (బ్లాక్–1) 18 పులులుంటే అందులో 6 మాత్రమే మగవి. 11 ఆడ పులులు. ఒక పులి లింగ నిర్ధారణ కాలేదు. బైర్లూటి, వెలిగోడు, నంద్యాల, గుండ్లబ్రహ్మేశ్వరం, బండి ఆత్మకూరు, చలమ, గుండ్లకమ్మ, తురిమెళ్ల ప్రాంతంలో (బ్లాక్–2) 26 పులులుంటే 8 మాత్రమే మగవి. 17 ఆడ పులులు. ఒక పులి ఆడదో, మగదో గుర్తించలేదు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని జీవీ పల్లి, వై పాలెం, వీపీ సౌత్ ప్రాంతాల్లో (బ్లాక్–3) 20 పులులుంటే ఆడ పులుల సంఖ్య 15. మగ పులులు 5 మాత్రమే. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. కొత్తగా విస్తరించిన ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని రుద్రవరం, చలమల, గిద్దలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, కడప, రాయచోటి, బద్వేల్, ఓనిపెంట,పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో (కొత్త కారిడార్) మొత్తం 9 పులులు ఉంటే రెండు మాత్రమే మగవి. 6 పులులు మగవి. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. ఒకదాని లింగ నిర్ధారణ చేయడం కుదరలేదు. ప్రతి పులి ప్రత్యేకతను గుర్తిస్తారు నాగార్జున్‌సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వులోని ఆత్మకూరు, మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కడప అటవీ డివిజన్లలో 905 ప్రదేశాల్లో 1800కిపైగా అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు రెండు కెమెరాలు పెట్టారు. పులులు వెళ్లే ప్రధాన దారుల్లో రెండు వైపులా రెండు జతల కెమెరాలు అమర్చారు. ఇవి వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షలకుపైగా ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేíÙంచి పులుల సంఖ్య, ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారలు మన చేతి రేఖల్లానే ప్రత్యేకంగా ఉంటాయి. రెండు వైపులా చారలను గుర్తించి వాటి ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన పులులను లెక్కిస్తారు. ఆడ, మగ పులుల్ని ఇలా గుర్తిస్తారు... పులుల్ని వాటి అడుగు జాడల (పగ్ మార్క్) ఆధారంగా గుర్తిస్తారు. ఆ అడుగుల్ని బట్టే అవి ఆడవో, మగవో నిర్ధారిస్తారు. మగ పులి అడుగు చతురస్రాకారంలో ఉంటుంది. ఆడ పులి అడుగు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. మగ పులి కాలి మడమ పెద్దగా, ఆడ పులి మడమ చిన్నగా ఉంటుంది. పటిష్టంగా పులుల పరిరక్షణ పర్యావరణ వ్యవస్థలో పులుల పరిరక్షణ అత్యంత కీలకం. వాటి పరిరక్షణలో రాష్ట్ర అటవీ శాఖ ముందుంది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య 73కి పెరగడమే ఇందుకు నిదర్శం. నాలుగేళ్లలో పులుల సంఖ్య 60 శాతం పెరగడం మంచి పరిణామం. – వై మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి సంరక్షణ చర్యల వల్లే.. 2008లో నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులులు ఉన్నాయా అనే అనుమానం ఉండేది. అప్పుడు కెమేరా ట్రాప్‌లు పెడితే 2, 3 మాత్రమే ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి వాటి సంరక్షణకు పెద్దఎత్తున చర్యలు చేపట్టడం మొదలైంది. పులుల వేటను దాదాపు నివారించి వాటి ఆవాసాలను పరిరక్షించేందుకు కింది స్థాయిలో అటవీ శాఖ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. దాని ఫలితంగానే వాటి సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. – విఘ్నేష్ అప్పావు, డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్, మార్కాపురం -
అపనమ్మకాలు..అపోహలతో గుడ్లగూబలు దూరం.. అసలు విషయం ఏంటంటే?
సాక్షి, అమరావతి: గుడ్లగూబలు మానవాళికి ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ఒక్క గాదె గుడ్లగూబ (బార్న్ ఔల్) తన జీవిత కాలంలో 11 వేల ఎలుకలను తింటుందని అంచనా. తద్వారా 13 టన్నుల ఆహార పంటలను కాపాడుతుందని ఒక పరిశోధనలో తేలింది. గుడ్లగూబలు ఎలుకలతోపాటు కీటకాలు, చిన్న పక్షులను వేటాడి తింటాయి. తద్వారా వాటితో మానవాళికి వ్యాధులు ప్రబలకుండా నివారిస్తాయి. ఇంత మేలు చేకూరుస్తున్న గుడ్లగూబలను అపోహలతో, అపనమ్మకాలతో మనుషులు దూరం చేసుకుంటున్నారు. అడవులు తగ్గిపోవడం, వేట వంటి కారణాలతో వీటి సంఖ్య తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరుదైన గుడ్లగూబలు దర్శనమిస్తున్నాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అత్యంత అరుదైన చుక్కల పొట్ట గద్దాకారపు గుడ్లగూబ (స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఔల్) కొద్ది రోజుల క్రితం నల్లమల అడవుల్లో కనిపించిందని అంటున్నారు. రాష్ట్రంలో ఈ జాతి గుడ్లగూబ కనిపించడం ఇదే తొలిసారి. అలాగే దట్టమైన అడవుల్లో మాత్రమే నివాసం ఏర్పరచుకునే గోధుమ రంగు అడవి గుడ్లగూబ (బ్రౌన్ వుడ్ ఔల్)లను పాపికొండలు, నల్లమల అడవుల్లో గుర్తించారు. శీతాకాలంలో రష్యా, యూరప్‌ల నుంచి మన దేశానికి వలస వచ్చే పొట్టి చెవుల గుడ్లగూబలు కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గడ్డి మైదానాల్లో కనిపించాయి. అలాగే చిత్తూరు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని గడ్డి మైదానాల్లో వీటి ఉనికి ఉన్నట్లు నిర్ధారించారు. రాష్ట్రంలో అత్యంత అరుదుగా కనిపించే గుడ్లగూబల జాబితాలో ఉన్న గడ్డి గుడ్లగూబ (ఈస్టర్న్ గ్రాస్ ఔల్) ఇటీవల కాలంలో ఎక్కడా కనిపించలేదు. సంరక్షణ అందరి బాధ్యత దట్టమైన అడవులు, కొండలు, గడ్డినేలలు కనుమరుగు కావడం, వేట వల్ల గుడ్లగూబలు, వాటి పరిధి నెమ్మదిగా తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గుడ్లగూబల సంరక్షణను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటివల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైంటిస్ట్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి మనదేశంలో 35 జాతులు కాగా ప్రపంచవ్యాప్తంగా 220కిపైగా, మన దేశంలో 35, మన రాష్ట్రంలో 12 రకాల గుడ్లగూబ జాతుల్ని గుర్తించారు. మనదేశంలో 16 రకాల గుడ్లగూబ జాతులను అక్రమ వ్యాపారానికి వినియోగిస్తున్నట్లు తేలింది. కొందరు చేతబడి, క్షుద్రపూజలు వంటి వాటికి వీటిని ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో గుడ్లగూబలు ఎత్తయిన భవనాలు, అపార్టుమెంట్లలో గూడు కట్టుకుంటున్నాయి. వాటిని ప్రజలు అపశకునంగా భావిస్తూ గూళ్లను నాశనం చేస్తున్నారు. దీంతో గుడ్లగూబల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఇతర పక్షులకు భిన్నంగా గుడ్లగూబలకు కళ్లు మనుషుల మాదిరిగా ముఖం ముందు ఉంటాయి. కానీ మనుషుల్లా కళ్లను కదిలించలేవు. అవి తలను 270 డిగ్రీల వరకు తిప్పి చూడగలుగుతాయి. ఈ సామర్థ్యంతోనే అవి రాత్రి వేళల్లో చురుగ్గా వేటాడతాయి. అవి మనుషుల మీద దాడిచేయవు. అపోహలు, అపనమ్మకాలు గుడ్లగూబలను మనుషుల నుంచి దూరం చేశాయి. -
అడవి తాకిన సంక్షేమం
ఒకటో తారీఖు వచ్చిందంటే పింఛన్ అందాల్సిందే. అది పట్టణమైనా, కీకారణ్యమైనా వలంటీర్లు వెళ్తున్నారు. నల్లమల అడవులూ అందుకు మినహాయింపు కాదు. శ్రీశైలానికి దాదాపు 25 కి.మీ. దూరంలో దట్టమైన అడవుల్లో ఉండే చెంచుల గూడెం నెక్కంటి పెంటకు వెళ్లడం సాహస యాత్రే. అక్కడ ఇద్దరు చెంచులకు మాత్రం టంచన్‌గా పింఛన్ అందుతోంది. ప్రతి నెలా అక్కడకు 14 కి.మీ. దూరంలోని పాలుట్ల పెంట నుంచి వలంటీర్ బయన్న ట్రాక్టర్‌పై వచ్చి పింఛన్ డబ్బులిస్తున్నాడు. సుమారు పది కుటుంబాలు ఉండే నెక్కంటి పెంటకు సోలార్ ద్వారా కరెంట్, బోరు నీటిని ప్రభుత్వం సమకూరుస్తున్నట్లు గిరిజన మహిళ చెవుల బసవమ్మ తెలిపింది. సున్నిపెంట నుంచి సాక్షి ప్రతినిధి ఐ.ఉమామహేశ్వరరావు: దేశవ్యాప్తంగా అంతరించి పోతున్న 75 గిరిజన తెగల్లో మన రాష్ట్రంలో నివసించే చెంచులు మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మనుగడ పోరాటం చేస్తున్న చెంచు గూడేల్లో వికసిస్తున్న అభివృద్ధి రేఖలు, వారి జీవనశైలిని పరిశీలించేందుకు సున్నిపెంట సమీపంలోని పలు ప్రాంతాలను రెండు రోజుల పాటు సందర్శించి దట్టమైన అడవుల్లో రాళ్లు రప్పలతో నిండిన బాటలో జీపు, కాలినడకన కిలోమీటర్ల మేర ప్రయాణించి ‘సాక్షి’ ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. మూడు జిల్లాల పరిధిలో దట్టమైన నల్లమల అడవుల్లో పర్వతాలతో కూడిన ప్రాంతాలే చెంచులకు ఆవాసాలు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో 171 చెంచు గూడేలున్నాయి. వీటిని చెంచు పెంటలుగా పిలుస్తుంటారు. కీకారణ్యంలో క్రూరమృగాలు, వన్యప్రాణులతో కలసి జీవించే వీరంతా బాహ్య ప్రపంచానికి రావాలంటే మొనదేలిన రాళ్లతో కూడుకున్న అటవీ మార్గంలో కిలోమీటర్ల తరబడి నడవాల్సిందే. వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ వీరి జీవనోపాధి. విల్లంబులు, చిన్నపాటి కత్తి వీరి ఆయుధాలు. గతంలో ఎలుగుబంటి, జింకలను వేటాడేవారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేస్తుండటంతో వేట వదిలేసి ప్రభుత్వం కల్పించే ఉపాధి అవకాశాలపై ఆధారపడుతున్నారు. భిన్న జీవన శైలి చెంచుల ఆహారపు అలవాట్లు సైతం చాలా సరళమైనవి. జొన్నలు, సజ్జలతో చేసిన జావ తాగుతారు. ఉడకబెట్టినవి, కాల్చిన దుంపలు, గడ్డలు తింటారు. చింతపండును బూడిదలో కలిపి తింటారు. ఉపాధి కోసం ఉదయం బయటకు వెళ్లేప్పుడు అన్నం తింటే తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాకే మళ్లీ ఆహారం తీసుకుంటారు. చెంచు గూడేల్లో పెద్ద ఇచ్చే తీర్పులకు కట్టుబడి ఉంటారు. వివాహ వేడుక పెద్దల అంగీకారంతో జరుగుతుంది. సంసారం పొసగకపోతే విడాకులు మామూలే. వితంతు వివాహాలు జరుగుతాయి. శివుడి ప్రతిరూపంగా లింగమయ్యను పూజిస్తుంటారు. డబ్బులు దాచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వరు. ఆహారాన్ని నిల్వ చేసుకోరు. ఏ రోజుకారోజు అనే రీతిలో జీవిస్తారు. అప్పుడప్పుడు కూలి పనులు చేసినా తమ జీవన విధానమైన అటవీ ఉత్పత్తుల సేకరణకే మొగ్గు చూపుతుంటారు. అడవి తల్లి.. అమ్మవారు శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అడవిలో కొలువైన ఇష్టకామేశ్వరి దేవి ఆలయం గురించి తెలిసిన వారు తక్కువే. అక్కడికి ప్రయాణం అంటే సాహసంతో కూడుకున్నదే. కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే అటవీ శాఖ అధికారుల అనుమతితో నడుస్తాయి. దట్టమైన అడవిలో బండరాళ్లు, మొనదేలిన రాళ్ల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు కుదుపుల మధ్య సాగే ప్రయాణంతో ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి చేరుకోవచ్చు. అడవి తల్లిని, అమ్మవారిని నమ్ముకుని దాదాపు 26 చెంచు కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి గూడెం అభివృద్ధి ఇలా.. మొత్తం 171 చెంచు గూడేలకు వాటర్ ట్యాంక్‌లు, బోర్లు, పైపులైన్ల ద్వారా ప్రభుత్వం మంచినీటి వసతి కల్పించింది. 166 గూడేలకు సోలార్‌తో విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. 164 గూడేలకు రోడ్డు మార్గం ఉంది. మొత్తం 6,912 కుటుంబాల్లో 3,561 కుటుంబాలకు ఇళ్లు ఉన్నాయి. జగనన్న కాలనీల్లో మరో 2,940 కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది. 2,364 ఇళ్లకు మరమ్మతులు చేపట్టేలా ప్రతిపాదనలు చేశారు. 14,071.29 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్, అసైన్డ్ భూములను 5,186 కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. నవరత్నాల ద్వారా వైఎస్సార్ రైతు భరోసా 2,411 మందికి, వైఎస్సార్ చేయూత మొదటి విడతలో 599 మందికి, రెండో విడతలో 825 మందికి అందించారు. వైఎస్సార్ ఆసరా 1,005 మందికి, వైఎస్సార్ పెన్షన్ కానుక 2,186 మందికి ఇస్తున్నారు. విద్య – వైద్యం నిరుపేద చెంచు కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 12 గురుకులాలు, 66 ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తోంది. నాడు–నేడు ద్వారా 9 గురుకులాలు, 42 పాఠశాలలు అన్ని వసతులతో నిర్మించారు. ఆరు సామాజిక, 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 126 సబ్ సెంటర్లలో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు.. మా నాన్నకు ఐదుగురు సంతానం. ప్రభుత్వం అటవీ శాఖలో నలుగురికి ఉద్యోగం ఇచ్చింది. విభిన్న ప్రతిభావంతుడినైన నాకు అటవీ శాఖ ద్వారా ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.12,500 ఇస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 63 బేస్ క్యాంపుల్లో నాలాంటి 300 మందికిపైగా చెంచు యువతకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. – చెవుల బసవయ్య, చెంచు యువకుడు గూడేనికే టీచర్ తాత ముత్తాతల కాలం నుంచి అడవి తల్లినే నమ్ముకుని జీవిస్తున్నాం. మా పిల్లలు చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం గూడేనికే టీచర్‌ను పంపిస్తోంది. ఆరు కిలోమీటర్ల దూరంలోని నెక్కంటి పెంట నుంచి రోజూ వచ్చే ఐటీడీఏ టీచర్ శ్రీను ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 20 మంది పిల్లలకు పాఠాలు చెబుతారు. ఒకటో తేదీనే వలంటీర్ మల్లిఖార్జున వచ్చి ఐదుగురికి పెన్షన్ డబ్బులిస్తున్నారు. – చిగుళ్ల వెంకటమ్మ, ఇష్టకామేశ్వరి గూడెం బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయాలు హైదరాబాద్ కేంద్రంగా 1975లో ఏర్పాటైన చెంచు ఐటీడీఏను 1988లో శ్రీశైలానికి తరలించారు. శ్రీశైలం ప్రధాన కేంద్రంగా 3,600 చ.కి.మీ విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండల్లో చెంచు ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. వారు సేకరించే అటవీ ఉత్పత్తులను బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయించేందుకు వన్ ధన్ వికాస కేంద్రాలు 10 కేటాయించాం. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.ప్రత్యేక కార్యాచరణతో వారికి ఆధార్ నమోదు చేపట్టాం. –రవీంద్రారెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్,శ్రీశైలం ఐటీడీఏ -
అటవీ శాఖ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రతి జిల్లాలో ఒక అటవీ డివిజన్ (టెరిటోరియల్ లేదా సోషల్ ఫారెస్ట్) ఏర్పాటు చేసింది. అవసరం లేని, కాలం చెల్లిన 6 డివిజన్లను మూసివేసి వాటి స్థానంలో కొత్తగా 9 డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో 26 జిల్లాలకు ఇప్పుడు 32 డివిజన్లు ఉన్నాయి. గతంలో 13 జిల్లాలకు 23 డివిజన్లు ఉండేవి. పునర్వ్యస్థీకరణ తర్వాత కొత్తగా పార్వతీపురం మన్యం, చింతపల్లి, రంపచోడవరం, రాజమండ్రి, కోనసీమ, భీమవరం, మచిలీపట్నం, బాపట్ల, పల్నాడు డివిజన్లు ఏర్పాటయ్యాయి. వెదురు, కలప వెలికితీత కోసం ప్రత్యేకంగా ఉన్న చింతూరు, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, గిద్దలూరు, నంద్యాల లాగింగ్ డివిజన్లను రద్దు చేశారు. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు కట్టినప్పుడు దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్‌ను కూడా రద్దు చేశారు. ► గతంలో సోషల్ ఫారెస్ట్, టెరిటోరియల్ డివిజన్లు విడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటినీ కలిపి ఒకటిగా చేశారు. గతంలో ఉన్న 13 సోషల్ ఫారెస్ట్ డివిజన్లను పదికి తగ్గించారు. ► పునర్వ్యవస్థీకరణ తర్వాత 3 జిల్లాల్లో మాత్రమే ఒకటికంటే ఎక్కువ డివిజన్లు ఏర్పాటయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు డివిజన్లు (పాడేరు, చింతపల్లి, చింతూరు, రంపచోడవరం) ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 3 డివిజన్లు (కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల), ప్రకాశం జిల్లాలో 3 డివిజన్లు (మార్కాపురం, గిద్దలూరు, ప్రకాశం) పెట్టారు. మిగిలిన 23 జిల్లాల్లో ఒక్కో డివిజన్ (టెరిటోరియల్) ఏర్పాటయ్యాయి. ► వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగానే ఉంచారు. ఏలూరు (కొల్లేరు, కృష్ణా అభయారణ్యాలు), సూళ్లూరుపేట (పులికాట్, నేలపట్టు అభయారణ్యాలు) వైల్డ్‌లైఫ్ డివిజన్లను అలాగే ఉంచారు. నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం డివిజన్లను అలాగే ఉంచారు. ఈ నాలుగింటికీ టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ పరిధి రెండూ ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరణ కొత్త పోస్టులు సృష్టించకుండా ఉన్న వాటినే సర్దుబాటు చేసి పునర్వ్యవస్థీకరణ చేశాం. దీనివల్ల పరిపాలన సౌలభ్యంతోపాటు జిల్లాకు ఒక డివిజన్ ఉంటుంది. రద్దు చేసిన డివిజన్లలోని ఉద్యోగులను కొత్త వాటిలో సర్దుబాటు చేస్తున్నాం. – వై మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అటవీప్రాంతం లేని జిల్లా పశ్చిమగోదావరి పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతం లేని జిల్లాగా ఉంది. నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన ఈ జిల్లాలో ఒక్క ఎకరం కూడా అటవీ భూమి లేదు. అయినా అక్కడ అటవీ డివిజన్ ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో అత్యధికంగా 8,03,039.45 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 10 వేల హెక్టార్లకంటె తక్కువ అటవీ విస్తీర్ణం ఉంది. విశాఖపట్నం 14,512 హెక్టార్లతో పూర్తి అర్బన్ అటవీ ప్రాంతంగా మారింది. -
పెద్దపులే.. వారి పెద్దమ్మ
అది దట్టమైన నల్లమల అడవి.. అందులో నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు వ్యక్తులు ఏవో పాదముద్రలు చూసి ఆగిపోయారు. అవేమిటని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి అడుగులుగా (పగ్ మార్క్) నిర్ధారించారు. అంటే దగ్గర్లోనే పులి ఉన్నట్లు గ్రహించారు. ఇంకా ముందుకెళ్తే ప్రమాదమని భావించి అక్కడే ఆగిపోయారు. ఆ అడుగుల ముద్ర చుట్టూ చిన్నచిన్న రాళ్లు పెట్టి వాటిపైన ఒక పారదర్శక అద్దం పెట్టారు. దానిపై స్కెచ్‌తో ఆ అడుగుల్ని గీశారు. అలాగే, ప్లాస్టర్ ఆప్ పారిస్‌తో కూడా ఆ పాదముద్రను సేకరించి వెనుదిరిగారు. – (నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి బి. ఫణికుమార్) ఆ ఐదుగురు ఎవరో కాదు.. పులుల రక్షకులు. నల్లమలలో జీవించే చెంచులు వారు. వన్యప్రాణుల మధ్యే వారి జీవనం. వాటితో తరతరాల అనుబంధం వారిది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని రోళ్లపెంట బేస్ క్యాంపు వద్ద వాళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేర్లు.. దంసం గురవయ్య, దాసరి నాగన్న, దంసం మొగిన్న, దార బయన్న, అంజి నాయక్. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య ఏటా పెరుగుతుండడంలో అటవీ శాఖతోపాటు నల్లమల చెంచుల పాత్ర ఎంతో కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా పులుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఈ ప్రాంతంలో వాటి ఆవాసాలు సురక్షితంగా ఉండడానికి ఈ చెంచులే ప్రధాన కారణం. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో పులుల రక్షణ బాధ్యత వారిదే. ఏడేళ్ల క్రితం అక్కడ కేవలం 37 మాత్రమే పులులు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 73కి పెరిగింది. అటవీ శాఖ తాజా పులుల గణనలో ఈ విషయం తేలింది. 63 బేస్‌క్యాంపుల బాధ్యత వీరికే.. అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగే చెంచులకు అక్కడి దారులు, నీటి చెలమలు, పులులు, మిగిలిన వన్యప్రాణులు, వాటి జీవన విధానం గురించి పూర్తిగా తెలుసు. పులుల్ని వారు పెద్దమ్మగా భావిస్తారు. అందుకే వాటిని సంరక్షిస్తారు. ఆంధ్రా ప్రాంతంలో ద్రవిడుల కంటే ముందు నుంచి చెంచులు నివసిస్తున్నారనే వాదన ఉంది. అనాదిగా నల్లమలలో వన్యప్రాణులతో కలిసి వారు జీవిస్తున్నారు. అడవి ఉంటేనే తమ మనుగడ ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే అడవిని, అందులోని వన్యప్రాణుల్ని సంరక్షిస్తారు. వీరికి అడవి ఆనుపానులు తెలుసు కనుకే వారి ద్వారానే అటవీ శాఖ పులుల సంరక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా.. ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల అటవీ డివిజన్లలో మొత్తం 63 బేస్ క్యాంపుల బాధ్యతను వారికే అప్పగించింది. అక్కడి నుంచే పులులు, ఇతర వన్యప్రాణులు, అటవీ సంరక్షణను చేపడుతున్నారు. ప్రతి బేస్ క్యాంపులో ఐదుగురు చెంచులతో ఒక బృందం ఏర్పాటుచేశారు. వీరిని పంచ పాండవులుగా పిలుస్తారు. అనేక తరాలుగా పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణలో చెంచులు భాగమయ్యారు. ఫ్రంట్లైన్లో ఉండి దట్టమైన అడవుల్లో పులులు, ఇతర జంతువులను ట్రాక్ చేయడంతోపాటు వాటి రక్షణ, అడవిలో పెట్రోలింగ్, సమాచారం సేకరించడానికి పనిచేస్తున్నారు. బేస్ క్యాంపులు వచ్చాక.. అంతకుముందు కూడా అటవీ శాఖాధికారులు వీళ్ల ద్వారానే నల్లమలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. చెంచులు ఏం చేస్తారంటే.. ► చెంచులకు అటవీ శాఖ శిక్షణనిచ్చింది. మొబైల్లో జీపీఎస్ ద్వారా అడవిలో తిరగడం, చెట్లకు కెమేరా ట్రాప్‌లు అమర్చడం, పులుల అడుగులు గుర్తించి ఆ ముద్రలను సేకరించడం వీరి ప్రధాన విధులు. ► ప్రతిరోజు తమ బేస్ క్యాంపు పరిధిలో 5 నుంచి 7 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ చేస్తారు. ► ఎం–స్ట్రైప్ అప్లికేషన్ ద్వారా జంతువుల ఫొటోలు తీస్తారు. వాటిని ప్రతి 10 రోజులకు అటవీ శాఖాధికారులకు ఇస్తారు. ► బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా? పులులు, ఇతర జంతువులకు ఏమైనా ఉచ్చులు వేశారా? స్మగ్లింగ్ వంటి సమాచారాన్ని సేకరించి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైర్లెస్ సెట్లో అధికారులకు సమాచారమిస్తారు. ► అడవిలో జరిగే ప్రతి కదలిక తెలిసేలా ఈ చెంచుల ఫ్రంట్‌లైన్ టీమ్ పనిచేస్తుంది. ► మొత్తం 300 మంది ఈ టీముల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ప్రతి క్యాంపులో మరో ముగ్గురు చెంచుల్ని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల ఏరివేతకు నియమించారు. ► ఈ పని ద్వారా అడవులు, పులుల సంరక్షణతోపాటు వారికి అటవీశాఖ ఉపాధి కల్పిస్తోంది. ► ఇక వీరి సేవలను గుర్తించిన నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీఎస్ఏ) గతంలోనే బెస్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చింది. ► ఆ తర్వాత దేశంలోని మిగిలిన అటవీ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో స్థానిక గిరిజన జాతుల్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు. పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 73 పులులు ఉన్నాయి. ఇది ఏడేళ్లలో ఊహించని పెరుగుదల. తమ శాఖ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇది సాధ్యమైంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టులో విస్తీర్ణపరంగా దేశంలోనే ఇది అతిపెద్దది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుదలను బట్టి ఈ అభయారణ్యం ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. – శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ కన్జర్వేటర్–డైరెక్టర్, టైగర్ ప్రాజెక్టు చెంచులది కీలకపాత్ర పులుల సంరక్షణలో చెంచులు కీలకంగా ఉన్నారు. బేస్ క్యాంపుల్లో వాళ్లు ఐదుగురు చొప్పున ఉంటారు. వారు పెట్రోలింగ్ చేస్తూ పులుల్ని ట్రాక్ చేస్తారు. పులుల గురించి అన్నీ తెలిసిన వారికే వాటి సంరక్షణలో భాగస్వాముల్ని చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం. – సందీప్‌రెడ్డి, సబ్ డీఎఫ్ఓ, ఆత్మకూరు ఫారెస్టు డివిజన్ పులి కనపడితే నిశ్శబ్దంగా ఉండిపోతాం ప్రతిరోజు 5–7 కిలోమీటర్ల మేర అడవిలో తిరుగుతాం. పులి, ఇతర జంతువుల్ని గమనిస్తూ ఉంటాం. అడుగుల్ని బట్టి అవి ఎటు వెళ్తున్నాయో తెలుసుకుంటాం. ఒకవేళ పులి ఎదురైతే నిశ్శబ్దంగా ఉండిపోతాం. దీంతో అది మా వైపు చూసినా వెళ్లిపోతోంది. హడావుడి చేస్తే దాడిచేస్తుంది. – దార బయన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ మంచినీటి కోసం సాసర్ పిట్లు కడతాం మా క్యాంపు చుట్టూ నాలుగైదు రూట్లలో తిరుగుతాం. ఒక్కో రోజు ఒక్కో రూట్లో వెళ్తాం. ఎండాకాలం జంతువులు నీటి కోసం అలమటిస్తాయి. వాటికోసం అడవిలో ఆఫీసర్లు చెప్పినట్లు సాసర్ పిట్లు కట్టి అందులో నీళ్లు నింపుతాం. పులులు, ఇతర జంతువులు వచ్చి ఆ నీటిని తాగుతాయి. – దంసం మొగిన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ పులుల క్రాసింగ్ టైమ్‌లో జాగ్రత్తగా ఉంటాం పులులు క్రాసింగ్ అయ్యే టైమ్‌లో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అవి కలిసే (మేటింగ్) సమయం. ఆ సమయంలో ఎవరైనా కనపడితే విరుచుకుపడిపోతాయి. వేటాడే సమయంలోనూ పులికి కనపడకూడదు. తనను అడ్డుకుంటున్నారని భావించి దాడిచేస్తుంది. మిగిలిన సమయాల్లో మనుషుల్ని చూసినా వెళ్లిపోతుంది. – అంజి నాయక్, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్