రాంగోపాల్‌పేట్: రైల్వే స్టేషనలో ప్రయాణికుల దృష్టి మరల్చి విలువైన లగేజీతో పాటు నగదును కొట్టేస్తున్న ఓ ముఠాలోని ముగ్గురు నిందితులపై గోపాలపురం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.
రాంగోపాల్‌పేట్: రైల్వే స్టేషనలో ప్రయాణికుల దృష్టి మరల్చి విలువైన లగేజీతో పాటు నగదును కొట్టేస్తున్న ఓ ముఠాలోని ముగ్గురు నిందితులపై గోపాలపురం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ (25), సరోజ్ కుమార్ (19), రవిశంకర్ కుమార్ (24) నగరానికి వలస వచ్చి ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరు గత కొంత కాలంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషనకు వచ్చి రైల్వే టికెట్ కన్ఫమ్ కాని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను టార్గెట్ చేసుకునేవారు. వారి దగ్గరకు వెళ్లి ఒకడు టీసీగా పరిచయం చేసుకుని టికెట్ కన్ఫమ్ చేయిస్తామని నమ్మించి వారి లగేజీ, డబ్బుతో ఉడాయించే వాళ్లు. గోపాలపురం పోలీస్ స్టేషన పరిధిలో రెండు, చిలకలగూడ పోలీస్ స్టేషన పరిధిలో ఒక కేసులో నిందితులుగా ఉన్నారు. నిందితులను ఈ నెల 5న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు వారిపై పీడీ ఆక్ట్ నమోదు చేయాలని సీపీ దృష్టికి తీసుకుని వెళ్లారు. కమిషనర్ ఆదేశాల మేరకు పీడీయాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.