కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) నేషనల్ పార్కు వాకర్స్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది.
హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) నేషనల్ పార్కు వాకర్స్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. పార్కు ప్రవేశ ఫీజును వృద్ధులకు రూ. 500 నుంచి రూ. 1000కి, ఇతరులకు రూ. 800 నుంచి రూ. 1500కి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 26 అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ ప్రధాన సంరక్షణాధికారి, డీఎఫ్‌ఓలకు నోటీసు లు జారీ చేసి, పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు జారీ చేశారు. ఫీజు పెంపు జీవోను సవాలు చేస్తూ నేచర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాహుల్ సింఘాల్ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ రామచంద్రరావు విచారించారు.