నేపాల్ రాజధాని ఖట్మాండ్లో బుధవారం రాత్రి భూమి కంపించింది.
ఖట్మాండ్: నేపాల్ రాజధాని ఖట్మాండ్లో బుధవారం రాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.2 భూకంప తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో అక్కడి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు.
భూ ప్రకంపనలతో.. ప్రజలంతా ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. ఈశాన్య ఖట్మాండ్‌కు 20 కిలో మీటర్ల దూరంలో భూ ప్రకపంనలు రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదై ఉన్నట్లు భూగర్భ శాస్త్రజ్ఞులు తెలిపారు.