ముంబై కోర్టు నుంచి గత నెలలో పారిపోయిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది అఫ్జల్ ఉస్మానిని పోలీసులు మళ్లీ పట్టుకున్నారు.
ముంబై కోర్టు దగ్గర గత నెలలో పారిపోయిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది అఫ్జల్ ఉస్మానిని పోలీసులు మళ్లీ పట్టుకున్నారు. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) ఆదివారం ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఉస్మాని నేపాల్ పారిపోయే ప్రయత్నాల్లో ఉండగా పోలీసులు నిఘా వేసి అదుపులోకి తీసుకున్నారు.
అహ్మదాబాద్, సూరత్లో జరిగిన బాంబు పేలుళ్లలో ఉస్మాని నిందితుడు. గత నెల 20న ముంబై మోకా కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో అతను పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. 38 ఏళ్ల ఉస్మాని సొంతూరు ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లా సంగార్పూర్ గ్రామం. ఉగ్రవాదిగా మారకముందు ముంబైలో కొంతకాలం హోటల్లో పనిచేశాడు.