Top Stories
ప్రధాన వార్తలు

వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డా. పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు.'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పునర్వ్యవస్థీకరణవైఎస్సార్‌సీపీలో 'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను PAC మెంబర్లుగా పార్టీ నియమించింది. PAC శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, PAC కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.PAC మెంబర్లు1. తమ్మినేని సీతారాం2. పీడిక రాజన్న దొర3. బెల్లాన చంద్రశేఖర్4. గొల్ల బాబురావు, ఎంపీ5. బూడి ముత్యాలనాయుడు6. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ7. పినిపే విశ్వరూప్8. తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ9. ముద్రగడ పద్మనాభం10. పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు)11. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు12. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)13. వెలంపల్లి శ్రీనివాస్14. జోగి రమేష్15. కోన రఘుపతి16. విడదల రజిని17. బొల్లా బ్రహ్మనాయుడు18. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ19. నందిగం సురేష్ బాబు20. ఆదిమూలపు సురేష్21. పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్22. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి23. కళత్తూరు నారాయణ స్వామి24.ఆర్కే రోజా25. వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంపీ26. షేక్ అంజాద్ బాషా27. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి28. అబ్దుల్ హఫీజ్ ఖాన్29. మాలగుండ్ల శంకర నారాయణ30. తలారి రంగయ్య31. వై.విశ్వేశ్వర రెడ్డి32. మహాలక్ష్మి శ్రీనివాస్33. సాకే శైలజానాథ్

హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఇప్పటివరకూ ముగ్గురు అసువులు బాసారు. నిన్న(శుక్రవారం) జరిగిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, ఈరోజు(శనివారం) జరిగిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ను చూసే అడిషనల్ డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ తెలిపారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ 118 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.కేంద్ర బలగాలను మోహరించండివక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో కోల్ కతా హైకోర్టు స్పందించింది. నిరసన ర్యాలీలను అదుపులోకి తేవడంతో పాటు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రధానంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జంగీపూర్ లో కేంద్ర బలగాలను దింపాలని ఆదేశాల్లో పేర్కొంది.శాంతించండి.. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయంనిరసన కార్యక్రమాలు తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.వక్ఫ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని నిరసన కారులకు హామీ ఇచ్చారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.Shopping malls and shops are being looted in Shamsherganj, Murshidabad, in the name of peaceful protests against Waqf Amendment Act...Bangladeshi style of loot is happening....Is West Bengal steadily transforming to West Bangladesh ! pic.twitter.com/R2NmSNpo11— Sourish Mukherjee (@me_sourish_) April 12, 2025 Anyone has the right to PEACEFULLY protest against the Wakf law if they have a problem with it : NO ONE has right to resort to arson and violence in name of religion . West Bengal govt must come down hard on ALL involved. Spare NO ONE irrespective of community. In a surcharged… pic.twitter.com/t8IWRq0UD3— Rajdeep Sardesai (@sardesairajdeep) April 12, 2025

పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పంత్ కేవలం 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పంత్.. ఆ తర్వాత కూడా తనకు అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంత్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన రిషబ్.. 8 సగటుతో కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ ఆట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. రూ.27 కోట్ల దండుగ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మెగా వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను లక్నో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది సీజన్లో పంత్ చేసిన స్కోర్లు..ఢిల్లీ క్యాపిటల్స్: 0 (6)సన్‌రైజర్స్ హైదరాబాద్: 15 (15)పంజాబ్ కింగ్స్: 2 (5)ముంబై ఇండియన్స్: 2 (6)కోల్‌కతా నైట్ రైడర్స్: బ్యాటింగ్ చేయలేదుగుజరాత్ టైటాన్స్: 21 (18)ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో పూరన్(61), మార్క్రమ్(28) హాఫ్ సెంచరీలతో మెరిశారు.చదవండి: IPL 2025: సెన్సేషనల్ సుదర్శన్.. ఆరు మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలు

రాజాసింగ్‌తో బండి సంజయ్ చర్చలు సఫలం
హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్ గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకించడంతో బండి సంజయ్ రంగంలోకి దిగారు. అయితే గౌతంరావును గెలిపించడానికి కృషి చేస్తానని బండి సంజయ్ కు రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ లైన్లలోనే పని చేస్తానని రాజాసింగ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో కార్పొరేటర్లతో కో ఆర్డినేషన్ చేస్తానని రాజా సింగ్ తెలిపారు. ఈ క్రమంలోనే గౌతంరావును అక్కడకు రప్పించి రాజాసింగ్ తో కరాచలనం చేయించారు బండి సంజయ్. దీనిలో రాజాసింగ్, గౌతంరావులు పరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు. అదే సమయంలో పార్టీలో ఇబ్బంది లేకుండా చూసుకుంటానని రాజాసింగ్‌కు బండి సంజయ్ కూడా భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ పోటీలో ఉండాలని బండి సంజయ్ పట్టుబట్టి మరీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లోనే తిష్టవేసిన బండి సంజయ్.. కార్పోరేటర్లతో కూడా సమావేశమయ్యారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలుగోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ సందర్భంగా ముందుగా పాతబస్తీలోని ఆకాష్ పురి హనుమాన్ దేవాలయానికి బండి సంజయ్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయానికి చేరుకునే క్రమంలో రాజాసింగ్.. బండి సంజయ్‌కు స్వాగతం పలికారు. కేటీఆర్ పై విమర్శలుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు బండి సంజయ్. హెచ్ సీయూ భూముల అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘ బీజేపీ ఎంపీ ఉంటే పేరు ఎందుకు బయటపెట్టడం లేదు. కేటీఆర్ కళ్లు, చెవులు దొబ్బినాయ్.. వాడు, వీడు అని మాట్లాడుతున్నాడు. HCU భూముల కోసం కోట్లడింది మేము. ఎబివిపి కార్యకర్తలు ఇప్పటికీ జైల్ లో ఉన్నారు. HCU భూముల అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందని మాకు నమ్మకం ఉంది. రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవు’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీల పొత్తుపై ఆ రాష్ట్ర సీఎం , డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఇదొక ఓడిపోయే అవినీతి కూటమి అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టి అధికారం కోసం అర్రులు చాస్టున్న కూటమి, బీజేపీ చేతిలో బందీగా మారిన బానిస పార్టీ అంటూ మండిపడ్డారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్త పెట్టుకున్న సంగతి తెలిసిందే. అన్నా డీఎంకేతో పొత్తు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న(శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో(2026 అసెంబ్లీ ఎన్నికల్లో) ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడినట్లు అమిత్ షా పేర్కొన్నారు.దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ‘ రెండు పార్టీల సిద్ధాంతాల్లో క్లారిటీ అనేది లేదు. ఏదో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి.. అన్నా డీఎంకేతో సంధి కుదుర్చుకున్నారు. నీట్ అంశాన్ని ఏఐఏడీఎంకే వ్యతిరేకించింది. ఇదే తరహాలో రాష్ట్రంలో త్రి భాషా విధానంలో హిందీ భాషను రుద్దే అంశాన్ని, వక్ప్ యాక్ట్ ను, డీలిమిటేషన్ అంశాన్ని కూడా అన్నాడీఎంకే వ్యతిరేకించింది. మరి అటువంటప్పుడు బీజేపీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంది.ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునేటప్పుడు కామన్ మినిమమ్ ప్రాగ్రామ్(సీఎంపీ) అనేది ఒకటి ఉంటుంది కదా. మరి వీటి గురించి హోంమంత్రి అమిత్ షా ఏమీ మాట్లాడలేదు. అలాగే అన్నాడీఎంకే నేతలు కూడా ఏమీ నోరు విప్పలేదు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి పొత్తు కుదుర్చుకున్నారు. అదే పనిగా డీఎంకేపై, నాపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. నీట్ ను సీబీఐ దర్యాప్తు చేస్తుంది కదా.. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేశారు అమిత్ షా. సీబీఐ అనేది కేంద్రం చేతుల్లోనే కదా ఉండేది’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు స్టాలిన్.

చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
బీజింగ్: చైనాను భీకర గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ఇసుక తుపాను, భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్, డాక్సింగ్‌లో 693 విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు, రైళ్లను కూడా నిలిపివేశారు. దుమ్ము తుపానులు చెలరేగడంతో.. అధికారులు పర్యాటక ప్రదేశాలను మూసేశారు.చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అలర్ట్ చేసింది. దేశంలోని ఉత్తర, తీర ప్రాంతాలలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ సబ్వే, హై-స్పీడ్ రైలు మార్గాలతో సహా కొన్ని రైలు సేవలను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత ఏడాది చైనాలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన తుపానులు, వరదల్లో అనేక మంది మరణించారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. మే నెలలో దక్షిణ చైనాలో కురిసిన వర్షాలతో ఒక రహదారి కూలిపోయి 48 మంది మరణించిన సంగతి తెలిసిందే.April 12, China was hit by a nationwide gale and dust storm that was rare in history, with the maximum gust reaching 46.8m/s! The sandstorm blew from Mongolia all the way to the Yangtze River and may even affect Hong Kong! pic.twitter.com/8mO795JEep— Jim (@yangyubin1998) April 12, 2025

తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
సాక్షి, తిరుపతి: తిరుమల గోశాలలో గోవుల మృతి ఘటనపై మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల వ్యవధిలో పలు గోవులు చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గోవుల మృతి విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ద్వారా తెలిసింది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాను’’ అని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.Fmr TTD Chair Karunakar Reddy has alleged that in the past 3 months, several sacred indigenous cows have died due to illness and lack of proper feed at TTD Goshala. I am gathering more information, Art 48 of the Indian Constitution, its State’s duty to protect them. PIL underway.— Subramanian Swamy (@Swamy39) April 12, 2025టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవుల మృతిపై వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న(శుక్రవారం) సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘టీటీడీ గోశాలలో దేశవాలి అవులు వందకు పైగా మృత్యువాత పడ్డాయి. నిర్వాహకులు ఈ విషయం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆవులు ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు. డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్ చార్జిగా నియమించారు. ఆయనకు గోపరిరక్షణకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.

నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
సాధారణంగా తాము తీసిన చిత్రాల్లోని తప్పొప్పుల గురించి నిజాయితీగా సమీక్షించుకునే దర్శకులను మనం చూడలేం. ఇక సినిమా రూపొందించే సమయంలో తమపై ఉన్న సామాజిక బాధ్యతను కూడా గుర్తించుకోవడం అంటే అలాంటి దర్శకుల్ని భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ డైరెక్టర్ తాను తీసిన సినిమాలోని సన్నివేశాల గురించి తానే చెప్పి...అవి అలా తీసి ఉండకూడదని, సమాజంపై వ్యతిరేక ప్రభావం చూపే అలాంటి సీన్స్ తీసి, రాసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పడం ఓ విశేషం. అంతేకాదు...ఈ చిత్రం అతనికి గణనీయమైన ప్రశంసలు విజయాన్ని అందుకున్నది కావడం మరింత విశేషం. దర్శకుడు అరుణ్ కుమార్ ఇటీవల తెరకెక్కించిన 'వీర ధీర శూరన్' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు అంతకు ముందు దర్శకత్వం వహించిన సేతుపతి (2016) గురించి ప్రస్తావించాడు. విజయ్ సేతుపతి రమ్య నంబీస్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ తమిళ యాక్షన్ డ్రామా హిట్ అయినందుకు ఆయన గర్వపడలేదు. పైగా ఆ సినిమాలో ఆక్షేపణీయ అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే అవి ఆ సమయంలో గుర్తించేందుకు తనకు అవసరమైన అనుభవం లేదని అన్నాడు. తాను తీసిన ఆ సన్నివేశాన్ని యువతులు సోషల్ మీడియాలో పంచుకోవడం గమనించాక మాత్రమే ఒక సినిమా ప్రభావం ఎంత ఉంటుంది? అనేది తనకు స్పష్టమైందని కూడా అతను చెప్పాడు.సేతుపతిలో ఉన్న ఆ సన్నివేశం ఏమిటంటే...‘నన్ను కొట్టినా.. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి ప్రేమగా నన్ను అక్కున చేర్చుకుంటాడు. అందుకే అతనంటే ఇష్టం’ అని రమ్య నంబీస్సన్ అంటుంది. అంటే మగవాళ్లు ఆడవాళ్లపై శారీరక హింసను ప్రేరేపించేదిగా ఆ సంభాషణ ఉండడం గమనార్హం. ఆ సన్నివేశం తీయడంతో పాటు ఆ సినిమాకు రచయిత కూడా అయిన అరుణ్‌కుమార్ ఇప్పుడు దాని గురించి బాధపడ్డారు. ‘‘అది తప్పు. అప్పట్లో నేను ఏం చేశానో..నాకు అనుభవం లేదు’’ అంటూ ఆయన వెల్లడించాడు. కోట్ల మంది సినిమా చూస్తారని, అది అలా అలా విస్త్రుతం అవుతూనే ఉంటుందని కాబట్టి, మన సినిమాల్లో మనం ఒక చిన్న తప్పు చేస్తే, అది ఎప్పటికీ చేసినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అమ్మాయిలు ఆ సన్నివేశాన్ని వారి వాట్సాప్ స్టేటస్‌గా పోస్ట్ చేయడం చూసి తాను బాధపడడం మాత్రమే కాదు నిజంగా భయపడుతున్నా కూడా అంటూ తానీ సన్నివేశం తీసినందుకు ఇప్పుడు క్షమాపణలు అన్నాడాయన. .అదే విధంగా. ‘‘సేతుపతిలో, ఓ పిల్లవాడు తుపాకీని పట్టుకోవడం రమ్య పాత్ర అకస్మాత్తుగా దాన్ని లాక్కునే మరో సన్నివేశం ఉంది. పిల్లవాడికి ఆయుధం ఇవ్వకూడదని తెలిసినా అలా చేయడం తప్పే’’అన్నారాయన. విజయ్ సేతుపతి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన పన్నైయరుమ్ పద్మినియుమ్ (2014)తో చిత్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత, అరుణ్ కుమార్ మరో నాలుగు చిత్రాలకు నాయకత్వం వహించాడు, వీటిలో ఎక్కువ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. ఏదేమైనా విజయవంతమైన తన చిత్రంలోని లోపాల్ని తానే చెబుతూ వాటిని పునరావృతం కానివ్వనని అంటున్న తమిళ దర్శకుడు అరుణ్ కుమార్ వైఖరి నిజంగా మెచ్చదగింది. ఒక హిట్ చిత్రాల దర్శకుడు సినిమా విజయవంతం అయిందని సరిపెట్టుకోకుండా తన సినిమా గురించి తాను నిజాయితీగా సమీక్షించుకోవడం సామాజిక బాధ్యత పట్ల తన వంతు పాత్ర పోషిస్తూ క్షమాపణలు అడగడం.. హింస, సెక్స్, వయోలెన్స్‌చుట్టూనే పరిభ్రమిస్తూన్న సినిమాల్ని చూసి విరక్తికి గురవుతున్నవారికి ఊరట అనే చెప్పాలి... చుట్టూ కమ్ముకున్న చీకటిలో కానవస్తున్న వెలుగురేఖ లాంటిదే అని చెప్పాలి.

అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
2025లో కూడా లేఆప్స్ సర్వ సాధారణం అయిపోయాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం లెక్కలు మించిన ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ (GM) చేరింది.జనరల్ మోటార్స్ కంపెనీ.. ఆల్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ జీరో ప్లాంట్ నుంచి 200 మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వీరిని మళ్ళీ ఎప్పుడు ఉద్యోగాల్లోకి తీసుకుంటారు అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా.. ఉత్పత్తి సర్దుబాటులో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగుల తొలగింపుకు.. టారిఫ్‌ల ప్రభావం కాదని సంస్థ స్పష్టం చేసింది.కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఫ్యాక్టరీ జీరోలో దాదాపు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్లాంట్‌లో సంస్థ హై ప్రొఫైల్ ఈవీ మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో చేవ్రొలెట్ సిల్వరాడో, జీఎంసీ సియెర్రా ఈవీ, హమ్మర్ ఈవీ పికప్ వంటి వాటితో పాటు రాబోయే కాడిలాక్ ఎస్కలేడ్ ఐక్యూ ఉన్నాయి.ఇదీ చదవండి: యూపీఐ సేవల్లో అంతరాయం.. స్పందించిన ఎన్పీసీఐ

Intelligence alert: అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది. సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు 2008 ముంబై 26/11 మారహోమానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారి, లష్కరే ఉగ్రవాది తహవూర్ రాణా విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించాయి. దీంతో హోం శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువ నిఘా ఉంచాలని సూచించింది. మరోవైపు.. నిఘా సంస్థలు రైల్వే శాఖను ప్రత్యేకంగా అప్రమత్తం చేయడం గమనార్హం.
అభిషేక్ సూపర్ సెంచరీ.. పంజాబ్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్
ఉప్పల్‌లో అభిషేక్ విధ్వంసం.. 40 బంతుల్లోనే సెంచరీ
IPL 2025: మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డు..
నేపాల్‌కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
ఆకట్టుకునేలా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
తిరుమలలో మరో అపచారం
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
'ఛావా' టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
తలుపులు కనపడటం లేదంటే.. ట్రంప్ వచ్చి వెళ్లాడనుకుంటా సార్!
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
బేబీ.. ఇలా అయితే కష్టమే!
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
రాజాసింగ్‌తో బండి సంజయ్ చర్చలు సఫలం
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా?.. ఇప్పటికైనా పృథ్వీ షాను తీసుకోండి!
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
IPL 2025: మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డు..
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
ప్రాణం తీసిన వేగం
పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
LSG VS GT: డబుల్ సెంచరీ కొట్టిన శార్దూల్ ఠాకూర్
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
మరో ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం హిట్ సినిమా
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
LSG VS GT: రికార్డులు సృష్టించిన గిల్-సాయి సుదర్శన్ జోడీ
జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం.. వీటికి మినహాయింపు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్‌పోర్ట్‌లు
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
IPL 2025: పూరన్ సిక్సర్ల సునామీ.. గుజరాత్‌ను చిత్తు చేసిన లక్నో
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్‌స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
మార్పు తథ్యమేనా?.. సీఎం పదవిపై మంత్రి శ్రీధర్‌బాబు రియాక్షన్
వచ్చేవారం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
ఉప్పల్‌లో అభిషేక్ విధ్వంసం.. 40 బంతుల్లోనే సెంచరీ
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
నేపాల్‌కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
మదరాసి విడుదల తేదీ ఖరారైందా..?
పంజాబ్ కింగ్స్‌పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
Menopause Awareness: ఇల్లు అండగా ఉండాలి!
హైదరాబాద్‌లో పెరుగుతున్న స్మార్ట్ ఇళ్లు..
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
అనంత్ లవ్యూ, సర్ప్రైజ్ కేక్ కట్, వీడియో వైరల్
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
ఇక బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
ఐవీఎఫ్ సెంటర్ నిర్వాకం: మరొకరి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
అప్పు చేసి ఫీజులు
పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
సరిగ్గానే దిద్దుతున్నారా?
ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
LSG VS GT: మిచెల్ మార్ష్ ఎందుకు ఆడటం లేదు.. ఈ హిమ్మత్ సింగ్ ఎవరు..?
అభిషేక్ సూపర్ సెంచరీ.. పంజాబ్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్
ఉప్పల్‌లో అభిషేక్ విధ్వంసం.. 40 బంతుల్లోనే సెంచరీ
IPL 2025: మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డు..
నేపాల్‌కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
ఆకట్టుకునేలా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
తిరుమలలో మరో అపచారం
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
'ఛావా' టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
తలుపులు కనపడటం లేదంటే.. ట్రంప్ వచ్చి వెళ్లాడనుకుంటా సార్!
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
బేబీ.. ఇలా అయితే కష్టమే!
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
రాజాసింగ్‌తో బండి సంజయ్ చర్చలు సఫలం
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా?.. ఇప్పటికైనా పృథ్వీ షాను తీసుకోండి!
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
IPL 2025: మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డు..
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
ప్రాణం తీసిన వేగం
పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
LSG VS GT: డబుల్ సెంచరీ కొట్టిన శార్దూల్ ఠాకూర్
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
మరో ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం హిట్ సినిమా
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
LSG VS GT: రికార్డులు సృష్టించిన గిల్-సాయి సుదర్శన్ జోడీ
జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం.. వీటికి మినహాయింపు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్‌పోర్ట్‌లు
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
IPL 2025: పూరన్ సిక్సర్ల సునామీ.. గుజరాత్‌ను చిత్తు చేసిన లక్నో
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్‌స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
మార్పు తథ్యమేనా?.. సీఎం పదవిపై మంత్రి శ్రీధర్‌బాబు రియాక్షన్
వచ్చేవారం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
ఉప్పల్‌లో అభిషేక్ విధ్వంసం.. 40 బంతుల్లోనే సెంచరీ
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
నేపాల్‌కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
మదరాసి విడుదల తేదీ ఖరారైందా..?
పంజాబ్ కింగ్స్‌పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
Menopause Awareness: ఇల్లు అండగా ఉండాలి!
హైదరాబాద్‌లో పెరుగుతున్న స్మార్ట్ ఇళ్లు..
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
అనంత్ లవ్యూ, సర్ప్రైజ్ కేక్ కట్, వీడియో వైరల్
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
ఇక బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
ఐవీఎఫ్ సెంటర్ నిర్వాకం: మరొకరి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
అప్పు చేసి ఫీజులు
పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
సరిగ్గానే దిద్దుతున్నారా?
ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
LSG VS GT: మిచెల్ మార్ష్ ఎందుకు ఆడటం లేదు.. ఈ హిమ్మత్ సింగ్ ఎవరు..?
సినిమా

నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
సాధారణంగా తాము తీసిన చిత్రాల్లోని తప్పొప్పుల గురించి నిజాయితీగా సమీక్షించుకునే దర్శకులను మనం చూడలేం. ఇక సినిమా రూపొందించే సమయంలో తమపై ఉన్న సామాజిక బాధ్యతను కూడా గుర్తించుకోవడం అంటే అలాంటి దర్శకుల్ని భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ డైరెక్టర్ తాను తీసిన సినిమాలోని సన్నివేశాల గురించి తానే చెప్పి...అవి అలా తీసి ఉండకూడదని, సమాజంపై వ్యతిరేక ప్రభావం చూపే అలాంటి సీన్స్ తీసి, రాసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పడం ఓ విశేషం. అంతేకాదు...ఈ చిత్రం అతనికి గణనీయమైన ప్రశంసలు విజయాన్ని అందుకున్నది కావడం మరింత విశేషం. దర్శకుడు అరుణ్ కుమార్ ఇటీవల తెరకెక్కించిన 'వీర ధీర శూరన్' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు అంతకు ముందు దర్శకత్వం వహించిన సేతుపతి (2016) గురించి ప్రస్తావించాడు. విజయ్ సేతుపతి రమ్య నంబీస్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ తమిళ యాక్షన్ డ్రామా హిట్ అయినందుకు ఆయన గర్వపడలేదు. పైగా ఆ సినిమాలో ఆక్షేపణీయ అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే అవి ఆ సమయంలో గుర్తించేందుకు తనకు అవసరమైన అనుభవం లేదని అన్నాడు. తాను తీసిన ఆ సన్నివేశాన్ని యువతులు సోషల్ మీడియాలో పంచుకోవడం గమనించాక మాత్రమే ఒక సినిమా ప్రభావం ఎంత ఉంటుంది? అనేది తనకు స్పష్టమైందని కూడా అతను చెప్పాడు.సేతుపతిలో ఉన్న ఆ సన్నివేశం ఏమిటంటే...‘నన్ను కొట్టినా.. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి ప్రేమగా నన్ను అక్కున చేర్చుకుంటాడు. అందుకే అతనంటే ఇష్టం’ అని రమ్య నంబీస్సన్ అంటుంది. అంటే మగవాళ్లు ఆడవాళ్లపై శారీరక హింసను ప్రేరేపించేదిగా ఆ సంభాషణ ఉండడం గమనార్హం. ఆ సన్నివేశం తీయడంతో పాటు ఆ సినిమాకు రచయిత కూడా అయిన అరుణ్‌కుమార్ ఇప్పుడు దాని గురించి బాధపడ్డారు. ‘‘అది తప్పు. అప్పట్లో నేను ఏం చేశానో..నాకు అనుభవం లేదు’’ అంటూ ఆయన వెల్లడించాడు. కోట్ల మంది సినిమా చూస్తారని, అది అలా అలా విస్త్రుతం అవుతూనే ఉంటుందని కాబట్టి, మన సినిమాల్లో మనం ఒక చిన్న తప్పు చేస్తే, అది ఎప్పటికీ చేసినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అమ్మాయిలు ఆ సన్నివేశాన్ని వారి వాట్సాప్ స్టేటస్‌గా పోస్ట్ చేయడం చూసి తాను బాధపడడం మాత్రమే కాదు నిజంగా భయపడుతున్నా కూడా అంటూ తానీ సన్నివేశం తీసినందుకు ఇప్పుడు క్షమాపణలు అన్నాడాయన. .అదే విధంగా. ‘‘సేతుపతిలో, ఓ పిల్లవాడు తుపాకీని పట్టుకోవడం రమ్య పాత్ర అకస్మాత్తుగా దాన్ని లాక్కునే మరో సన్నివేశం ఉంది. పిల్లవాడికి ఆయుధం ఇవ్వకూడదని తెలిసినా అలా చేయడం తప్పే’’అన్నారాయన. విజయ్ సేతుపతి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన పన్నైయరుమ్ పద్మినియుమ్ (2014)తో చిత్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత, అరుణ్ కుమార్ మరో నాలుగు చిత్రాలకు నాయకత్వం వహించాడు, వీటిలో ఎక్కువ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. ఏదేమైనా విజయవంతమైన తన చిత్రంలోని లోపాల్ని తానే చెబుతూ వాటిని పునరావృతం కానివ్వనని అంటున్న తమిళ దర్శకుడు అరుణ్ కుమార్ వైఖరి నిజంగా మెచ్చదగింది. ఒక హిట్ చిత్రాల దర్శకుడు సినిమా విజయవంతం అయిందని సరిపెట్టుకోకుండా తన సినిమా గురించి తాను నిజాయితీగా సమీక్షించుకోవడం సామాజిక బాధ్యత పట్ల తన వంతు పాత్ర పోషిస్తూ క్షమాపణలు అడగడం.. హింస, సెక్స్, వయోలెన్స్‌చుట్టూనే పరిభ్రమిస్తూన్న సినిమాల్ని చూసి విరక్తికి గురవుతున్నవారికి ఊరట అనే చెప్పాలి... చుట్టూ కమ్ముకున్న చీకటిలో కానవస్తున్న వెలుగురేఖ లాంటిదే అని చెప్పాలి.

స్కిట్ వివాదం.. యాంకర్ రవి మరో వీడియో
ఓ స్కిట్ కారణంగా యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నారు. నందీశ్వరుడిని పెట్టి చేసిన ఓ సీన్ వల్ల హిందు సంఘాలు భగ్గుమన్నాయి. ఈ విషయమై ఇదివరకే క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశాడు. మరింత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) నేను చత్రపతి శివాజీని ఫాలో అయ్యే వ్యక్తిని.. హనుమాన్ చాలీసా చదివే వ్యక్తిని.. పొద్దున లేచినప్పటి నుంచి మనసులో శివుని మంత్రం జపించే వ్యక్తిని.. నేను హిందువునే. నా మతం అంటే నాకు ఇష్టం.. అందరిలా మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవ్యక్తిని. యూట్యూబ్‌లో మేం చేసిన స్కిట్ లేదు. చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం.సోషల్ మీడియాలో నా ఫోన్ నంబర్ పెట్టి హిందూ మతాన్ని హర్ట్ చేశానని అంటున్నారు. దీంతో నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అందులో ఓ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. షోలో స్టేజీపై నందీశ్వరుడిని పెట్టిన తర్వాత చెప్పులు విప్పి నిష్టతో చేసిన స్పూఫ్ అది. ఎవరినో హర్ట్ చేయాలని చేసిన స్కిట్ కాదు. సినిమాలో ఉన్నట్లే సీన్ రీ క్రియేట్ చేశాం. ఇలాంటివి భవిష్యత్తులో జరుగకుండా జాగ్రత్తగా ఉంటాం అని రవి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బేబీ.. ఇలా అయితే కష్టమే!) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl)

ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లపైనే.. ఆ సీన్లలో సిగ్గెందుకు?
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. పాత్ర డిమాండ్ చేస్తే నచ్చకపోయినా సరే ఇంటిమేట్ సీన్స్‌లో నటించాల్సిందే. తెరపై రొమాన్స్ చేస్తున్నప్పడు ఒక్కోసారి హీరోయిన్లు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి. అయితే, వాటిని బహిరంగంగా హీరోయిన్స్ చెప్పుకోలేరు. అయితే, బాలీవుడ్‌కు చెందిన ఈషా గుప్తా ఒక వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్ చేయడం తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.2012లో జన్నత్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈషా గుప్తా(Esha Gupta) తెలుగులో 'వినయ విధేయ రామ' మూవీలోని పాటలో సందడి చేసింది. అయితే, ఆశ్రమ్ సీజన్ 3 (2022) వెబ్ సిరీస్‌లో సోనియాగా మెప్పించిన ఈ బ్యూటీ.. బాబీ డియోల్‌తో(Bobby Deol) ఒక ఇంటిమేట్ సీన్లో దుమ్మురేపింది. తాజాగా ఆ సీన్ గురించి ఇలా చెప్పింది. 'బాబీ డియోల్‌తో ఇంటిమేట్ సీన్ చేయడం నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. చాలా ఇష్టంతోనే చేశాను. అలాంటి సీన్స్ చేయడంలో ఎందుకు సిగ్గు ఉంటుంది. అప్పటికే పదేళ్ల పాటు చిత్రపరిశ్రమలో ఉన్నాను. పరిణతి చెందిన వ్యక్తులతో ఎలాంటి సీన్స్ చేసినా సమస్య ఉండదు. బాబీ డియోల్ అప్పటికే అలాంటి రొమాన్స్ సీన్స్ చేసి ఉంటాడు. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆయన కూడా గతంలో కంటే ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. కథ మేరకు మాత్రమే ఆయన నాతో సన్నిహితంగా నటించాడు. తనని తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది బాబీ డియోల్‌కు తెలుసు.' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆశ్రమ్ వెబ్ సిరీస్‌లో బాబీతో ఉన్న ఇంటిమేట్ సీన్లను చూసిన వారు తనను సమర్థించగలరని ఆశిస్తున్నానని చెబుతూ ఆ ఇంటర్వ్యూను ఈషా ముగించింది.

బేబీ.. ఇలా అయితే కష్టమే!
ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయి రావడమే అరుదు. అలాంటిది వచ్చిన అవకాశాల్ని ఎంతో జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. కానీ 'బేబీ' వైష్ణవిని చూస్తుంటే మాత్రం తప్పటడుగులు వేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వరసపెట్టి రెండు ఫ్లాప్స్ పడ్డాయి. షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య.. సినిమాల్లోనూ బన్నీ, నాని సరసన సహాయ పాత్రలు చేసింది. ఎప్పుడైతే 'బేబి' మూవీతో హీరోయిన్ గా మారిందో ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇలాంటప్పుడే ఆచితూచి కథలు ఎంచుకుని అడుగులు వేయాల్సి ఉంటుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) ఈ క్రమంలోనే దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా నటించిన 'లవ్ మీ' అనే హారర్ మూవీ చేసింది. ఇదొక సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి గుర్తులేదు. తాజాగా టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' చేసింది. ఇదైనా ఈమె దశ మారుస్తుందనుకుంటే మళ్లీ నిరాశే ఎదురైంది.సినిమా ఫ్లాప్ కావడానికి వైష్ణవి చైతన్య పూర్తి కారణం కాకపోవచ్చు. కానీ ఇలా వరస సినిమాలు ఫెయిల్ అవుతున్నాయంటే అందులో వైష్ణవి స్క్రిప్ట్ సెలక్షన్ లాంటి పొరపాట్లు కూడా ఉంటాయి. ఇకముందైనా మంచి కథల్ని ఎంచుకుని మూవీస్ చేస్తే సరి. లేదంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.(ఇదీ చదవండి: 'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ))
న్యూస్ పాడ్‌కాస్ట్

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు
క్రీడలు

పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పంత్ కేవలం 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పంత్.. ఆ తర్వాత కూడా తనకు అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంత్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన రిషబ్.. 8 సగటుతో కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ ఆట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. రూ.27 కోట్ల దండుగ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మెగా వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను లక్నో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది సీజన్లో పంత్ చేసిన స్కోర్లు..ఢిల్లీ క్యాపిటల్స్: 0 (6)సన్‌రైజర్స్ హైదరాబాద్: 15 (15)పంజాబ్ కింగ్స్: 2 (5)ముంబై ఇండియన్స్: 2 (6)కోల్‌కతా నైట్ రైడర్స్: బ్యాటింగ్ చేయలేదుగుజరాత్ టైటాన్స్: 21 (18)ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో పూరన్(61), మార్క్రమ్(28) హాఫ్ సెంచరీలతో మెరిశారు.చదవండి: IPL 2025: సెన్సేషనల్ సుదర్శన్.. ఆరు మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలు

పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపించారు. మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఊతికారేశారు.ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగులను క్రాస్ చేసింది. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన టీమ్‌గా ఆర్సీబీ సరసన పంజాబ్ నిలిచింది. ఆర్సీబీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకుంది. అయితే ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పేరిటే ఉంది. 2011 ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌పై పంజాబ్ కేవలం 2.5 ఓవర్లలోనే 50 పరుగులను అందుకుంది. ఇక ప్రస్తుత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36), ఫ్రబ్ సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఔటయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్ మొత్తం ఒకే ఆటతీరుతో పంజాబ్ దూసుకుపోతుంది.చదవండి: IPL 2025: సెన్సేషనల్ సుదర్శన్.. ఆరు మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలు

IPL 2025: పూరన్ సిక్సర్ల సునామీ.. గుజరాత్‌ను చిత్తు చేసిన లక్నో
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్), సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్) రాణించారు.వాస్తవానికి ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది.తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకుని గుజరాత్‌ను ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేశారు. రూథర్‌ఫోర్డ్ 22 (19 బంతుల్లో 3 ఫోర్లు), బట్లర్ 16 (14 బంతుల్లో 2 ఫోర్లు), షారుక్ ఖాన్ 11 నాటౌట్ (6 బంతుల్లో సిక్సర్), సుందర్ 2 (3 బంతుల్లో), తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన లక్నో..మార్క్రమ్ (31 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్), పూరన్ (34 బంతుల్లో 61; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి సిక్సర్ల సునామీ సృష్టించాడు. మిచెల్ మార్ష్ గైర్హాజరీలో (కూతురు అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు) ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ (18 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 21) ఓ మోస్తరుగా రాణించాడు. బదోని సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 2, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సందర్ తలో వికెట్ తీశారు.

పంజాబ్ కింగ్స్‌పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
Srh vs Pbks live Updates and highlights: పంజాబ్ కింగ్స్‌పై ఎస్ఆర్హెచ్ ఘన విజయంఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి పుంజుకుంది. ప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిర్ధేశించిన 246 పరుగుల భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ పంజాబీ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 66) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.అభిషేక్ శర్మ సెంచరీ..పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో తన తొలి ఐపీఎల్ సెంచరీని అభిషేక్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి.తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన హెడ్.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ విజయానికి 45 బంతుల్లో 74 పరుగులు కావాలి.11 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 154/011 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 154 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(59), అభిషేక్ శర్మ(88) ఉన్నారు.అభిషేక్ శర్మ ఫిప్టీఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(49), అభిషేక్ శర్మ(67) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్..246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.క్రీజులో హెడ్(22), అభిషేక్ శర్మ(18) ఉన్నారు.పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్(42), ఆర్య(36), స్టోయినిష్(11 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు.హర్షల్ నాలుగు వికెట్లు..18 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో 42 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.శ్రేయస్ అయ్యర్ ఫిప్టీ..పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అయ్యర్ 53 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.రెండో వికెట్ డౌన్..ప్రభ్ సిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రాన్.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.పంజాబ్ తొలి వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన ఆర్య.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్లు..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో ప్రభుసిమ్రాన్ సింగ్(17), ప్రియాన్ష్ ఆర్య(12) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.జట్టులోకి హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ వచ్చాడు. మలింగకు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. పంజాబ్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పు చేయలేదు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ,
బిజినెస్

సొంతింటికే 25 శాతం సంపాదన: లేటెస్ట్ సర్వే
సాక్షి, సిటీబ్యూరో: మన దేశంలో అత్యంత ధనవంతులు తమ సంపదలో 22–25 శాతం మొత్తాన్ని తాము ఉండాలనుకుంటున్న ఇంటి కొనుగోలుకే వెచ్చిస్తున్నట్లు నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా సర్వే వెల్లడించింది. రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన 18–35 ఏళ్ల వయస్సు గల వారిలో 89 శాతం మంది సంపన్న భారతీయులు తమ ప్రాపర్టీని అద్దెకు ఇవ్వడంకంటే అందులో తాము ఉండటానికే మొగ్గు చూపిస్తున్నారు.కోటి డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు కలిగిన భారతీయ అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు తమ సంపదలో 22–25 శాతాన్ని తాము నివసించాలనుకునే ప్రధాన ఇంటికి కేటాయిస్తున్నారని, వారి హోల్డింగ్స్‌లో 80–90 శాతం దేశంలోనేకేంద్రీకృతమై ఉన్నాయని నివేదిక వెల్లడించింది.దేశంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య 2024లో 6 శాతం మేర పెరిగి 80,686 నుంచి 85,698కు చేరుకుందని, బిలియనీర్ల సంఖ్య 191కు పెరిగిందని వెల్త్ రిపోర్ట్ వెల్లడించింది. 2028 నాటికి వారి సంఖ్య 93,753కు పెరుగుతుందని అంచనా. హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలకే వస్తున్నాయి.విదేశీ పెట్టుబడుల విషయానికొస్తే.. ఎక్కువ మంది హెచ్ఎన్ఐలు యూఏఈ, యూకే వంటి దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 47 శాతం మంది లగ్జరీ కార్లలో పెట్టుబడులకు, 28 శాతం మంది హైఎండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.

అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
2025లో కూడా లేఆప్స్ సర్వ సాధారణం అయిపోయాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం లెక్కలు మించిన ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ (GM) చేరింది.జనరల్ మోటార్స్ కంపెనీ.. ఆల్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ జీరో ప్లాంట్ నుంచి 200 మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వీరిని మళ్ళీ ఎప్పుడు ఉద్యోగాల్లోకి తీసుకుంటారు అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా.. ఉత్పత్తి సర్దుబాటులో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగుల తొలగింపుకు.. టారిఫ్‌ల ప్రభావం కాదని సంస్థ స్పష్టం చేసింది.కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఫ్యాక్టరీ జీరోలో దాదాపు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్లాంట్‌లో సంస్థ హై ప్రొఫైల్ ఈవీ మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో చేవ్రొలెట్ సిల్వరాడో, జీఎంసీ సియెర్రా ఈవీ, హమ్మర్ ఈవీ పికప్ వంటి వాటితో పాటు రాబోయే కాడిలాక్ ఎస్కలేడ్ ఐక్యూ ఉన్నాయి.ఇదీ చదవండి: యూపీఐ సేవల్లో అంతరాయం.. స్పందించిన ఎన్పీసీఐ

హైదరాబాద్‌లో పెరుగుతున్న స్మార్ట్ ఇళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత ఇంటి స్వరూపం మారిపోయింది. ఇంటిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది. రియల్ టైమ్‌లో ట్రాక్ చేసే స్మార్ట్ కెమెరాలు, డిజిటల్ లాక్స్, స్మార్ట్ వీడియో డోర్ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్‌గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్ చూపిస్తే చాలు ఆటోమెటిక్‌గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.ఇంట్లో మనం లేకపోయినా ఎవరైనా అతిథులొస్తే ఫోన్లో నుంచే గుమ్మం తెరిచి స్వాగతం పలకొచ్చు. గదిలోకి రాగానే లైట్లు వాటంతటవే ఆన్, ఆఫ్ అవుతుండటం వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్ ఉపకరణాలను జోడిస్తున్నారు.కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లోని హైఎండ్ ప్రాజెక్ట్‌లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్‌లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది.

సూపర్ సేవర్ ప్యాక్.. 98 రోజుల కొత్త రీచార్జ్ ప్లాన్
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రారంభిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రీఛార్జ్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కాస్త పొదుపైన, 98 రోజుల సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డేటాతోపాటు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.జియో రూ.999 ప్లాన్జియో ప్రస్తుతం తన రూ .999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందింవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు.ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ 90 రోజులపాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను, సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు. అలాగే ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.జియో రూ.1,049 ప్లాన్రూ .999 ప్లాన్‌తో పాటు, దీనికి దగ్గర ఉండే రూ .1,049 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది. దీంతో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వినియోగదారులు 50 జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా పొందుతారు. ఇది కమ్యూనికేషన్‌తో పాటు స్టోరేజ్ అవసరాలకు అనువుగా ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం (డిస్నీ + హాట్‌స్టార్) కు 90 రోజుల మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ5, సోనీలైవ్ యాక్సెస్ లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.
ఫ్యామిలీ

మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..
మాతృత్వం ఓ వరం అంటారు. అదిపొందలేక బాధపడుతున్న వాళ్లెందరో. ప్రస్తుత జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, జంక్ఫుడ్లతో మాతృత్వం మసకబారుతోంది. ముఖ్యంగా తల్లులు, కాబోయే తల్లులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టీనేజ్ వయసు నుంచే ఆడపిల్లలు మంచి ఆహారపు అలవాట్లు తీసుకునేలా కేర్ తీసుకుంటే..పెళ్లయ్యాక అలాంటి సమస్యలుబారిన పడరని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు తల్లలు ఆరోగ్యం కోసం ప్రతి ఏడాది ఏప్రిల్11న 'మాతృత్వ సంరక్షణ దినోత్సవం' పేరుతో ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే రోజు మహాత్మాగాంధీ భార్య కస్తుర్బా గాంధీ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా అమ్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా..? కాబోయే తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. బారతదేశంలో మాతృత్వ సంరక్షణ పరంగా మెరుగ్గా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిని వర్గాల్లో మాత్రం ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రసూతి మరణాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటమే అత్యంత ఆందోళన కలింగించే అంశం. పట్టణాల్లో అమ్మల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రసూతి మరణాలు తగ్గించే విషయాల్లో బేషుగ్గానే ఉన్నా..పేదరికం, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ సమస్య ఓ సవాలుగా ఉంది. ప్రధాన కారణాలు.. తీవ్రమైన రక్తస్రావం, ఇన్షెక్షన్లు, అధిక రక్తపోటు, అసురకక్షిత గర్భస్రావాలు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం తదితరాలని చెబుతున్నారు నిపుణులు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకి వీటిపై కొంత అవగాహన ఉంది, పైగా అందుబాటులో ఆస్పత్రులు, ఆరోగ్య నిపుణుల సలహాను సులభంగా పొందగలరు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇంకా నాటు వైద్యాన్నే ఆశ్రయించడం, గర్భిణితో ఉండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేమి తదితరాలు ప్రసూతి మరణాల ప్రమాదాన్నిపెంచుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం చొరవతో..ప్రసూతి మణాలు అడ్డుకట్టే వేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని అంగన్వాడి, హోమ్ డాక్టర్ వంటి పథకాలతో అమ్మలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలతో తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పురోగతి సాధిస్తోంది కూడా. పూర్తి స్థాయిలో ఈ ఆరోగ్య అసమానతలను అధిగమించాలంటే..కేవలం అవగాహన కార్యక్రమాలతోనే సాధ్యం. అందుకోసమే ప్రభుత్వాలు తల్లిపిల్లల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం తదితరాలపై అవగాహన కల్పిస్తున్నాయి. గర్భస్రావాలు జరగకుండా ఉండేలా.. ఆడపిల్లల ఆరోగ్యం కోసం పౌష్టిక ఆహారం అందించేలా కొన్ని రకాల పథకాలను కూడా ఇస్తుండటం గమనార్హం. అయితే అవి ఇంకా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నప్రజలకు పూర్తి స్థాయిలో చేరకపోవడంతోనే భారత్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉందంటున్నారు నిపుణులు. అందువల్లే ఏటా ఈ దినోత్సవం రోజునైనా పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అందించే ఆరోగ్య సంరక్షణ పథకాలపై అవగాహన కల్పించడం, మాతృత్వ మధురిమను రక్షించేకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి కార్యక్రమాలతో చైతన్యపరుస్తున్నారు. అంతేగాదు స్కూళ్లు, కాలేజ్‌లు, కార్యాలయాల్లో పెద్దఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత ముఖ్యం అని అంటున్నారు గైనకాలజిస్టులు. కాగా, ఇక ఈ ఏడాది "ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు" అనే థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లుల ఆరోగ్యం కోసం..పోషకాహారం తీసుకోవడంగర్భనిరోధక మాత్రలు వైద్యులు పర్యవేక్షణలోనే వాడటం, అతిగా వాడకం నిరోధించటం తదితరాలు..ప్రసవం ముందు, తదనంతరం సరైన జాగ్రత్తలు తీసుకోవడంసరైన ఫ్యామిలీ ప్లానింగ్దీంతోపాటు కుటుంబ సభ్యుల సహకారం తదితరాలతో అమ్మల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలాగే మన కుటుంబానికి ఆధారమైన ఆమె ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇద్దాం. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం)

'మనసున్న మారాజు'.. చూపులేకపోతేనేం.. సమాజానికి వెలుగు పంచుతున్నాడు..!
మనసు లేని వాళ్లు చూపు ఉన్నప్పటికీ...సమాజాన్ని చూడలేరు. మనసు ఉన్న వాళ్లు చూపు లేకపోయినప్పటికీ సమాజాన్ని చూస్తారు. సమాజానికి తమ వంతుగా తోడ్పడతారు. అలాంటి ఒక యువకుడు పంచగుడి మహేశ్... తన కళ్లే తనకు సహకరించవు. అడుగు దూరం దాటి ఏమీ చూపించవు. రెండో అడుగు నుంచి అంతా చిమ్మచీకటే. అయినా...ఏదో ‘వెలుగు’ను చేరుకోవాలన్న తపన తనను నడిపిస్తోంది. ‘నాకు చూపొక్కటే సమస్య అన్నా..’ అని సింపుల్‌గా తన అంధత్వాన్ని కొట్టిపారేస్తాడు. ‘సమస్య లేని మనిషి ఉంటడా..!’ అంటూ తన సమస్యను లైట్‌గా తీసుకోమంటాడు మహేశ్.మనసుతో చూస్తాడు!మహేశ్‌కు కంటిచూపు లేదు. అందుకే ఆయన మనసుతో చూస్తున్నాడు. నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన పంచగుడి మహేశ్ తాను నెలకొల్పిన ‘దివ్యాంగశక్తి ఫౌండేషన్ ద్వారా సమాజసేవ చేస్తున్నాడు. ఇటీవల దివ్యాంగులైన ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వితంతువుకు రెండుగదుల ఇంటిని నిర్మించి ఇచ్చాడు.వాలేగాం టు నాందేడ్వాలేగాం గ్రామానికి చెందిన పంచగుడి అనూషబాయి, లక్ష్మణ్ దంపతులకు మహేశ్, శ్రీకాంత్ కుమారులు, భాగ్యశ్రీ కుమార్తె. పెద్దకొడుకైన మహేశ్‌కు అడుగు దూరం వరకు అది కూడా ఒక కన్ను ఐదు శాతమే కనిపిస్తుంది. రెండో కుమారుడు శ్రీకాంత్‌కు ఐదేళ్ల వయసులో వచ్చిన అనారోగ్య సమస్యతో రెండు కళ్లూ దెబ్బతినడంతో పూర్తిగా అంధుడయ్యాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అనూష–లక్ష్మణ్ దంపతులు తమ కొడుకులను బాగా చదివించాలనుకున్నారు. మహేశ్ మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకాలోని బొదిడి అంధుల పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. ఇంటర్, బీకామ్ డిగ్రీ నాందేడ్ జిల్లాలోనే పూర్తిచేశాడు. నాందేడ్‌లో ఉన్నప్పుడే దివ్యాంగుల కోసం ఏర్పాటైన ‘సక్షమ్’ సంస్థలో చురుకుగా పనిచేశాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్వగ్రామానికి వచ్చేశాడు.దివ్యాంగిశక్తి ఎంటర్ప్రైజెస్నాందేడ్ నుంచి వచ్చిన మహేశ్ నిర్మల్ జిల్లాలో ‘సక్షమ్’ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాడు. మిత్రుల సూచన మేరకు బెంగళూరులో ఒకేషనల్ ట్రైనింగ్‌కు వెళ్లాడు. 2016లో తన ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్ తయారు చేశాడు. తెలిసినవాళ్లకు విక్రయించాడు. మంచి స్పందన రావడంతో 2017లో ‘దివ్యాంగశక్తి ఎంటర్ప్రైజెస్’ పేరిట భైంసా మండలం మాటేగాం గ్రామంలో చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకు పీఎంఈజీపీ నుంచి రూ.15 లక్షల ఆర్థికసాయం అందడం తోడైంది. ఈ యూనిట్లో ‘దివ్యాంగశక్తి’ పేరిట ఫ్లోర్‌క్లీనర్ నుంచి గ్లాస్ క్లీనర్స్ వరకు ఎన్నో తయారు చేస్తున్నాడు. వీటితో పాటు బయోడిగ్రేడబుల్ కవర్స్ విక్రయిస్తున్నాడు. నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తన ప్రొడక్ట్స్‌ను మార్కెటింగ్ చేస్తున్నాడు. ఈ యూనిట్ ద్వారా తాను ఉపాధి పొందడంతోపాటు మరో ఆరుగురికి ఉపాధి అందిస్తున్నాడు. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్, ఫొటోలు: బాతూరి కైలాష్దివ్యాంగ శక్తి... తన వ్యాపారసంస్థ ‘దివ్యాంగశక్తి’ పేరిటనే 2021లో ఫౌండేషన్ ప్రారంభించాడు మహేష్. సమాజానికి తన వంతుగా కొంత ఇవ్వాలి అనేది అతడి విధానం. తన ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులు, అనాథలు, వృద్ధులకు సేవలు అందిస్తున్నాడు. మూడేళ్లుగా పది, ఇంటర్ పాసైన దివ్యాంగులకు సహకారం అందిస్తున్నాడు. వారి కోసం పరీక్షలు రాసిచ్చే వారిని సన్మానిస్తున్నాడు. సర్కారు బడి పిల్లలకు ఉచితంగా బ్యాగులు అందిస్తున్నాడు. ఇటీవల చుచుంద్ గ్రామంలో రూ.30వేలు ఖర్చుచేసి వాటర్ ప్యూరిఫయర్ ఏర్పాటు చేశాడు.(చదవండి: సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లండిలా..!)

సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలంటే గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి ఉంటుంది. నిత్యం భక్తుల రద్దీగా ఉండే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలగాలంటే అంత సులభం కాదు. అయితే గంటల కొద్దీ.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా కేవలం ఒక్కరోజులోనే స్వామి దర్శనం చేసుకునేలా ఐఆర్సీటీసీ ‘గోవిందం’ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ‘గోవిందం టూర్’లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేస్తారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నెంబర్ 12734లో సాయంత్రం 5.25 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 6.10గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి నల్గొండకు రాత్రి 7.38 గంటలకు చేరుతుంది. తెలంగాణ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాల మీదుగా ‘గోవిందం టూర్’ రైలు ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి హోటల్‌కు భక్తులు వెళ్లి చెక్ ఇన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరుతారు. ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6.25 గంటలకు ట్రైన్ నెంబర్ 12733 ఎక్కుతారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, అక్కడ నుంచి లింగంపల్లికి ఉదయం 7.35గంటలకు చేరుకుంటుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణీకులకు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఏసీ వాహనంలో రవాణా, హోటల్లో బసతో పాటు, వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం స్పెషల్ ఎంట్రీని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. ఈ టూర్లో బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ తరహా టూర్ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. కేటగిరీ వారిగా ధరలు..సింగిల్ షేరింగ్: 3(ఏసీ): రూ.6790లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.4940లుట్విన్ షేరింగ్3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.3800లుత్రిపుల్ షేరింగ్3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.3800లుపిల్లలకు బెడ్(5 నుంచి 11 ఏళ్లు)3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.2890లు పిల్లలకు బెడ్ లేకుండా3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.2890లు (చదవండి:

సూట్స్‌ని స్టైలిష్‌గా కుట్టేదాం ఇలా..!
సూట్స్ కోసం ఖరీదైన ఫ్యాబ్రిక్స్ కొనుగోలు చేయడం మాత్రమే కాదు వాటిని అంతే స్టైల్‌గా స్టిచ్ చేయడం కూడా ముఖ్యమే. ఎంత మంచి బ్రాండెడ్ క్లాత్ తీసుకున్నా స్టిచ్చింగ్ కుదరకపోతే.. ఆ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే. ముఖ్యంగా విభిన్న హోదాల్లో ఉంటూ సూట్స్ ధరించేవారికి ఆ హోదాకు తగ్గట్టు కుట్టు కూడా కుదరాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్స్ తామే స్టిచ్చింగ్ సేవలను అందిస్తున్నాయి. ఈ విషయంలో మరొక అడుగు ముందుకేసిన.. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్. హైదరాబాద్ నగరవాసులకు ఉచితంగా స్టిచ్చింగ్ సేవల్ని పరిచయం చేస్తూ మేడ్ ఫర్ యూ స్టిచ్డ్ ఫర్ ఫ్రీ పేరిట ఓ కాన్సెప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ రిటైల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రణవ్ డేవ్ తెలిపారు. ఈ పంధాను మరిన్ని బ్రాండ్స్ అనుసరిస్తే.. వేల రూపాయలు వ్యయమయ్యే స్టిచ్చింగ్ సేవలు ఉచితంగా అందించే పరిస్థితి కనిపిస్తోంది. (చదవండి: సమ్మర్లో కాటన్ డ్రెస్‌లతో స్టైలిష్‌గా ఉండొచ్చు ఇలా..!)
ఫొటోలు


SRH vs PBKS : ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)


హైదరాబాద్‌లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)


చాహల్‌తో డేటింగ్ నిజమేనా? ఆర్జే మహ్వాష్ (ఫోటోలు)


సీరియల్ బ్యూటీ స్రవంతి.. భర్తతో సరదాగా ఇలా (ఫొటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ స్టిల్స్


ఒంటిమిట్ట : కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం (ఫోటోలు)


తెలంగాణ అమరనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)


హరిత యాత్రలో అలసిన వనజీవి.. రామయ్య అరుదైన చిత్రాలు


హైదరాబాద్ : ఘనంగా ఉస్మానియా మెడికల్ కళాశాల స్నాతకోత్సవం (ఫొటోలు)


ఉప్పల్‌లో ప్రాక్టీస్ అదరగొట్టిన SRH, పంజాబ్ ప్లేయర్స్ (ఫొటోలు)
అంతర్జాతీయం

మెల్బోర్న్లోని భారత కాన్సులేట్‌పై దాడి
మెల్బోర్న్: ఆస్ట్లేలియాలో మెల్బోర్న్లో ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గతంలోనూ పలుమార్లు కార్యాలయం గోడల నిండా అభ్యంతర చిత్రాలు, వ్యాఖ్యలు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఘటనపై కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్ కార్యాలయం అధికారులకు సమాచారం అందించింది. దేశంలోని భారత దౌత్య, కాన్సులేట్ కార్యాలయాలకు, అధికారులకు రక్షణ కలి్పస్తామని ఆ్రస్టేలియా ప్రభుత్వం హామీ ఇచి్చందని హై కమిషన్ వెల్లడించింది. కార్యాలయం గేటు వద్ద గోడపై అర్ధరాత్రి దాటాక అభ్యంతరకర చిత్రాలు గీసినట్లు తెలుస్తోందని, దీనిపై దర్యాప్తు చేపట్టామని విక్టోరియా పోలీసులు శుక్రవారం తెలిపారు.

గ్రీన్హౌస్ ఉద్గారాలపై గ్లోబల్ ట్యాక్స్
లండన్: గ్లోబల్ వార్మింగ్ కట్టడి దిశగా కీలక ముందడుగు పడింది. ఈ దిశగా ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలపై గ్లోబల్ ట్యాక్స్ విధించేందుకు మొట్టమొదటిసారిగా రంగం సిద్ధమైంది. షిప్పింగ్ వనరుగా ఉన్న ప్రధాన దేశాలు ఇందుకు అంగీకారం తెలిపాయి. దీని ప్రకారం.. నౌకలు విడుదల చేసే ప్రతి టన్ను కార్బన్ డయాక్సైడ్‌పై ఇకపై కనీసం 100 డాలర్ల చొప్పున పన్ను విధించనున్నాయి. ఆయా దేశాల నౌకలు లక్ష్యాలను చేరలేకపోయినా, ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ నెట్ జీరో ఫండ్‌కు నిధులందించకున్నా 2028 నుంచి ఈ ట్యాక్స్‌ను వసూలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం లండన్‌లో 60కిపై దేశాలు ప్రతినిధులతో ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ (ఐఎంవో) సమావేశం జరిగింది. అయితే అగ్ర రాజ్యం అమెరికా మాత్రం దీనికి గైర్హాజరు కావడం గమనార్హం. ఓడల్లో వాడే ఇంధనానికి సైతం ఈ సమావేశం పలు ప్రమాణాలను నిర్దేశించింది. మొత్తం ఉద్గారాల్లో షిప్పింగ్ వాటా 3 శాతమని ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. ఓడల సంఖ్యతో పాటు వాటి పరిమాణం పెరుగుతుండటం, అందుకు అనుగుణంగా ఇంధన వాడకం విపరీతంగా పెరిగి పోతుండటంతో రానున్న రోజుల్లో షిప్పింగ్ ఉద్గారాలు ఇంకా ఎక్కువవుతాయని భావిస్తున్నారు. ఐఎంవో భేటీలో కుదిరిన ఒప్పందంపై సెక్రటరీ జనరల్ ఆర్సెనియో డొమింగెజ్ హర్షం వెలిబుచ్చారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, షిప్పింగ్ ఆధునీకరణకు ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఈ బృందం అర్థవంతమైన ఏకాభిప్రాయాన్ని సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్‌కు వాన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీసమేతంగా భారత్‌కు వస్తున్నారు. భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో కలిసి ఏప్రిల్ 21 నుంచి మూడు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటిస్తారని సమాచారం. ఉషవి తెలుగు మూలాలున్న విషయం తెలిసిందే. అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఆమె భారత్ రానుండటం ఇదే తొలిసారి. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తదితరులతో వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్య తదితర రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశముంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా ఏప్రిల్ 21–24 తేదీల్లోనే భారత్‌లో పర్యటించనున్నారు. వాన్స్ ఉన్నతస్థాయి చర్చల్లో ఆయన కూడా భాగస్వామి కానున్నారు.తాజ్‌మహల్ సందర్శన భారత పర్యటన సందర్భంగా వాన్స్ దంపతులు తాజ్‌మహల్‌ను కూడా వీక్షించనున్నారు. ఆగ్రాతో పాటు జైపూర్‌ను కూడా వాళ్లు సందర్శిస్తారని తెలుస్తోంది.

చైనా.. తగ్గేదేలే!
బీజింగ్: అమెరికా, చైనా టారిఫ్ పోరు మరింత ముదిరింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరినట్టు అమెరికా గురువారం ప్రకటించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. అయితే, ‘‘మాపై అమెరికా ఇప్పటికే సుంకాలను అవాస్తవిక రీతిలో పెంచేసింది. ఇంకా పెంచితే ఇక అర్థముండదు. ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఓ నవ్వులాట ఉదంతంగా నిలిచిపోతుంది. అమెరికా ప్రస్తుత టారిఫ్‌లను భరిస్తూ ఆ దేశ దిగుమతులను చైనా మార్కెట్లోకి అనుమతించడం ఇప్పటికే అసాధ్యంగా మారిపోయింది. కనుక మాపై అమెరికా టారిఫ్‌లను ఇంకా పెంచేసినా మేం మాత్రం ఆ దేశంపై అదనపు సుంకాలు విధించబోం’’ అని స్పష్టం చేసింది. ఈ మతిలేని దూకుడు ఎవరికీ మేలు చేయదని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని అభిప్రాయపడింది. ‘‘అందుకే టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు ఇప్పటికీ చైనా సిద్ధంగానే ఉంది. మావైపు నుంచి తలుపులు తెరిచే ఉన్నాయి. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటామనే ఆశిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అయితే ఏ చర్చలైనా సమానత్వం, పరస్పర విశ్వాసాల ప్రాతిపదికన జరగాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. ట్రంప్ టారిఫ్‌లను అమెరికా ప్రజలే విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారత్ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం ఫెంటానిల్ సుంకంతో కలిపి అది 145 శాతానికి చేరినట్టు వైట్‌హౌస్ గురువారం స్పష్టతనిచి్చంది.ఏకాకిగా మిగులుతారు అమెరికాపై జిన్‌పింగ్ ధ్వజం కలసికట్టుగా ఎదుర్కొందాం ఈయూ దేశాలకు పిలుపుఅమెరికా టారిఫ్‌లపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారిగా స్పందించారు. అవి ఫక్తు ఏకపక్ష పోకడలంటూ మండిపడ్డారు. ‘‘టారిఫ్‌ల యుద్ధంలో ఎవరూ గెలిచేదుండదు. ఇలా ప్రపంచం మొత్తానికీ వ్యతిరేకంగా వెళ్తే ఏకాకులు కావడం మినహా ఒరిగేదేమీ ఉండదు’’ అంటూ హితవు పలికారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో శుక్రవారం బీజింగ్‌లో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్‌కు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘ఇది మన అంతర్జాతీయ బాధ్యత కూడా. మన సంయుక్త స్పందన ఇరుపక్షాలకు మాత్రమే గాక మొత్తం అంతర్జాతీయ సమాజానికీ మేలు చేస్తుంది. స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని కాపాడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘చైనా ఏనాడూ ఇతరుల దయపై ఆధారపడలేదు. 70 ఏళ్లుగా స్వయంసమృద్ధినే, కష్టాన్నే నమ్ముకుంది’’ అని జిన్‌పింగ్ స్పష్టం చేశారు.
జాతీయం

'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
తమిళనాడు: విడదీస్తారనే భయంతో పెళ్లి చేసుకున్న ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అరుంబాక్కం గ్రామానికి చెందిన మణికంఠన్(27) ఇళ్లకు టైల్స్ వేసే పనిచేస్తుంటాడు. ఇదివరకే వివాహం జరిగిన ఇతను భార్యను వదిలి ఒంటరిగా జీవిస్తున్నాడు.ఈక్రమంలో కడలూరు జిల్లా నెల్లికుప్పం గ్రామానికి చెందిన కోకిల(19) కడలూరులోని ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసి కోకిల కుటుంబసభ్యులు కడలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న ఇద్దరూ విచారణకు రావాలని పోలీసులు తరచూ ఫోన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గురువారం ఉదయం బైకులో ఇద్దరూ కలిసి కడలూరుకు బయలుదేరారు. పోలీసులు ఇద్దరిని విడదీస్తారని భయంతో ఇద్దరూ లత్తేరి సమీపంలోని పట్టివూరు రైలు పట్టాల వద్దకు వెళ్లి ఇద్దరూ కౌగిలించుకొని పట్టాలపై తలపెట్టి పడుకున్నారు. ఆ సమయంలో రైలు వారిపై వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన ప్రయాణికులు జోలార్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు.

ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తూ.. దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. ఈ క్రమంలో దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు.. ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో ముంబై టీమ్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ తుపాన్ రావడంతో దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్లో షేర్ చేశారు.వివరాల ప్రకారం.. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షం కురిసింది. అంతకుముందు.. దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల ఎఫెక్ట్‌తో ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 205 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 50 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.Crazy wx! Gale and dust-storms at Dwarka, New Delhi.Heard from a friend at IGI airport, his aircraft was moving and guess what, he’s still on ground. You can imagine the wind speed then. #delhirain #delhiweather pic.twitter.com/BIOdq0bOq7— Anirban 👨💻✈️ (@blur_pixel) April 11, 2025ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు అని ఒక ప్రయాణికుడు తెలిపారు.Delhi NCR is under a heavy dust storm! Visuals from Gurgaon — very intense dust storm hits Gurugram. Stay safe everyone! pic.twitter.com/IqGVen4kLb— The Curious Quill (@PleasingRj) April 11, 2025ఇక, శ్రీనగర్ నుండి ఢిల్లీకి ముంబైకి సాయంత్రం 4 గంటలకు కనెక్టింగ్ విమానం ఉంది. మా విమానం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది, కానీ దుమ్ము తుఫాను కారణంగా చండీగఢ్‌కు మళ్లించబడింది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లింది అని ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న మరో ప్రయాణీకుడు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.Flight Indigo 6E2397 jammu To delhi experiencing a dust storm, affecting takeoffs and landings and potentially causing air traffic congestion at delhi airport we are diverted to jaipur after long 4 hrs waiting to land at delhi now waiting in aircraft at jaipur airport for… pic.twitter.com/2GDeO19UK1— Dr. Safeer Choudhary (@aapkasafeer) April 11, 2025 Very strong #DustStorm Hit Delhi ncr#DelhiWeather pic.twitter.com/REZY7o8v5y— Raviiiiii (@Ravinepz) April 11, 2025आज दिल्ली में बवंडर 🌪️ आ गया …सभी अपने घर में सुरक्षित रहें 🙏🏻#delhiweather #sandstorm #DelhiRains #delhi pic.twitter.com/OCf4ZE7BfS— Shivam Rajput (@SHIVAMespeare) April 11, 2025 మరోవైపు.. ఢిల్లీలోని కక్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో ప్లేయర్స్‌ను గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్లాలని రోహిత్ శర్మ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ROHIT SHARMA, WHAT A CHARACTER 😀👌 pic.twitter.com/Ifz1YlNHX4— Johns. (@CricCrazyJohns) April 11, 2025 कल रात आए आंधी–तूफान का भयानक मंजर देखिए, गुरुग्राम का हैं वीडियो#Gurugram #Thunderstorm #WeatherUpdate #DelhiWeather pic.twitter.com/EMu90l1Bjf— Vistaar News (@VistaarNews) April 12, 2025

సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
సేలం : తంజావూరులో అరెస్టు చేసిన అన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు చెల్లెల్లలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వ్యవహారంగా నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ షర్మిలను అధికారులు వెయిటింగ్ లిస్ట్‌కు బదిలీ చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా నడుక్కవేరిలోని అరసమర వీధికి చెందిన వ్యక్తి దినేష్ (32). అతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇదిలా ఉండగా దినేష్ బంధువు ఏప్రిల్ 8వ తేదీన మరణించాడు. దినేష్ తన బంధువులతో కలిసి నడుక్కావేరి బస్‌స్టాప్ వద్ద సంతాప కార్యక్రమానికి హాజరు కావడానికి నిలబడి ఉండగా, నడుక్కవేరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక సబ్–ఇన్స్పెక్టర్ సంఘటనా అక్కడికి చేరుకుని, దినేష్‌పై కేసు నమోదు చేసినట్లు, విచారణకు రావాలని చెప్పి, దినేష్‌ను మోటార్ సైకిల్ పై నడుక్కావేరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దినేష్ చెల్లెల్లు కూడా వారిని అనుసరించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ తమ సోదరుడిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. దినేష్ సోదరీమణులలో ఒకరికి పెళ్లి చూపులకు వరుడి తరపు వారు వస్తున్నారని తెలిపినప్పటికీ స్టేషన్లో ఉన్న పోలీసులు వినిపించుకోకుండా బహిరంగ ప్రదేశంలో కత్తితో బెదిరించాడంటూ దినేష్‌పై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. అదే విధంగా అక్కడ ఉన్న పోలీసులు దినేష్ సోదరీమణులను ఏకవచనంతో మాట్లాడి దూషించి బయటకు పంపించారని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు ఇంటికి వెళ్లి పురుగుమందు తెచ్చి నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ముందు ఉంచి, తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు వారిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో బుధవారం ఓ చెల్లెలు మరణించింది. మరో చెల్లెలికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.బంధువుల ఆందోళనఈ విషయం తెలుసుకున్న దినేష్ బంధువులు తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రి అత్యవసర విభాగం ముందు గుమిగూడి నిరసన తెలిపారు. అప్పుడు దినేష్ సోదరి మరణానికి న్యాయం జరగాలని, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, పుదుక్కోట జైలు నుంచి దినేష్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈతంజావూరు నగర డీఎస్పీ సోమసుందరం, ఇన్స్పెక్టర్లు చంద్ర, జగతీశ్వరన్ ఆసుపత్రి ముందు నిరసనకారులతో చర్చించారు. ఈ స్థితిలో నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ షర్మిలను వీఆర్‌కు బదిలీ చేస్తూ తంజావూరు జిల్లా సూపరింటెండెంట్ రాజారాం గురువారం ఆదేశాలు జారీ చేశారు.

అయోధ్య గెస్ట్‌హౌస్‌లో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో తీసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగుచూసింది. అయోధ్యలోని ఒక గెస్ట్ హౌస్‌లో బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్లో వందల వరకు వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. అయోధ్యలోని రామాలయం గేట్ నంబర్-3 దగ్గరలో రాజా గెస్ట్ హౌస్ ఉంది. రామాలయం దర్శనం కోసం అయోధ్యకు వచ్చిన వారు ఈ గెస్ట్‌హౌస్‌లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే, తాజాగా వారణాసికి చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వచ్చారు. శుక్రవారం సదరు రాజా గెస్ట్‌హౌస్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో సదరు మహిళ.. బాత్రూమ్లో స్నానం చేస్తుండగా.. గెస్ట్‌హౌస్‌లో పనిచేసే సౌరభ్ తివారీ అనే యువకుడు ఆమెను వీడియో తీశాడు. అది గమనించిన ఆమె.. ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేస్తున్న వారు అతడిని పట్టుకున్నారు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. నిందితుడు సౌరభ్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ఫోన్ తీసుకుని పరిశీలించగా.. మహిళలు స్నానం చేస్తున్న పది వీడియోలను, అనేక అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.🚨 Ayodhya | A 30-year-old female devotee was secretly filmed while bathing at Raja Guest House near Gate No. 3 of the #Ayodhya Ram Temple.Another disturbing breach of women's privacy in UP.#Ayodhya #WomenSafety #PrivacyViolation #UPNews #indtoday pic.twitter.com/uWRtfpouvV— indtoday (@ind2day) April 11, 2025ఈ క్రమంలో బాధితురాలు మాట్లాడుతూ.. నేనుస్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లాను. బాత్రూమ్లో పైన ఒక టిన్ షెడ్ ఉంది. నేను స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా పైన ఒక నీడ కనిపించింది. అప్పుడు ఎవరో మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేయడం చూశాను. నేను భయపడి, అరిచి, నా బట్టలు వేసుకుని బయటకు పరిగెత్తాను. గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఇతర అతిథులు కూడా బయటకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నారు అని తెలిపారు.
ఎన్ఆర్ఐ

Ugadi 2025 సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్‌సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్‌లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్‌కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్‌లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్‌లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్‌కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్‌గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్‌లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
సేలం : తంజావూరులో అరెస్టు చేసిన అన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు చెల్లెల్లలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వ్యవహారంగా నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ షర్మిలను అధికారులు వెయిటింగ్ లిస్ట్‌కు బదిలీ చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా నడుక్కవేరిలోని అరసమర వీధికి చెందిన వ్యక్తి దినేష్ (32). అతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇదిలా ఉండగా దినేష్ బంధువు ఏప్రిల్ 8వ తేదీన మరణించాడు. దినేష్ తన బంధువులతో కలిసి నడుక్కావేరి బస్‌స్టాప్ వద్ద సంతాప కార్యక్రమానికి హాజరు కావడానికి నిలబడి ఉండగా, నడుక్కవేరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక సబ్–ఇన్స్పెక్టర్ సంఘటనా అక్కడికి చేరుకుని, దినేష్‌పై కేసు నమోదు చేసినట్లు, విచారణకు రావాలని చెప్పి, దినేష్‌ను మోటార్ సైకిల్ పై నడుక్కావేరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దినేష్ చెల్లెల్లు కూడా వారిని అనుసరించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ తమ సోదరుడిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. దినేష్ సోదరీమణులలో ఒకరికి పెళ్లి చూపులకు వరుడి తరపు వారు వస్తున్నారని తెలిపినప్పటికీ స్టేషన్లో ఉన్న పోలీసులు వినిపించుకోకుండా బహిరంగ ప్రదేశంలో కత్తితో బెదిరించాడంటూ దినేష్‌పై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. అదే విధంగా అక్కడ ఉన్న పోలీసులు దినేష్ సోదరీమణులను ఏకవచనంతో మాట్లాడి దూషించి బయటకు పంపించారని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు ఇంటికి వెళ్లి పురుగుమందు తెచ్చి నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ముందు ఉంచి, తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు వారిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో బుధవారం ఓ చెల్లెలు మరణించింది. మరో చెల్లెలికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.బంధువుల ఆందోళనఈ విషయం తెలుసుకున్న దినేష్ బంధువులు తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రి అత్యవసర విభాగం ముందు గుమిగూడి నిరసన తెలిపారు. అప్పుడు దినేష్ సోదరి మరణానికి న్యాయం జరగాలని, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, పుదుక్కోట జైలు నుంచి దినేష్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈతంజావూరు నగర డీఎస్పీ సోమసుందరం, ఇన్స్పెక్టర్లు చంద్ర, జగతీశ్వరన్ ఆసుపత్రి ముందు నిరసనకారులతో చర్చించారు. ఈ స్థితిలో నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ షర్మిలను వీఆర్‌కు బదిలీ చేస్తూ తంజావూరు జిల్లా సూపరింటెండెంట్ రాజారాం గురువారం ఆదేశాలు జారీ చేశారు.

యువతీ యువకుడిపై దౌర్జన్యం.. వీడియో వైరల్
బెంగళూరు: బెంగళూరులో యువతీ యువకుడిపై దౌర్జన్యం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిందూ యువకుడి జతలో బైకుపై మాట్లాడుతూ కూర్చొన్న యువతిని ఐదు మంది నిందించి దాడికి యత్నించారు. ఘటనపై మైనర్ యువకుడితో పాటు మహిం, అఫ్రిది, వాసిం, అంజుంలను పోలీసులు అరెస్ట్ చేశారు.మూడు రోజుల క్రితం తన స్నేహితుడి జతలో బుర్కా ధరించిన యువతి బైకుపై కూర్చొని మాట్లాడుతుండగా ఐదు మంది వెళ్లి దాడికి యత్నించారు. యువకుడితో అసభ్యంగా మాట్లాడారు. ఎందుకు కూర్చున్నావు, మానం, మర్యాద లేదా అంటూ ఇద్దరిని నోటికొచ్చినట్లు నిందించారు. యువతిని తల్లిదండ్రుల నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తరగతి స్నేహితుడితో మాట్లాడుతున్నా తమ తల్లిదండ్రుల నంబర్ మీకెందుకని ప్రశ్నించిన ఇద్దరిపై దాడికి యత్నించారు. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. The #BengalauruPolice arrested four individuals, including a minor, on Friday in connection with a case of moral policing reported under the Chandra Layout police station limits in #Bengaluru.The accused allegedly confronted a #Muslim woman for speaking with a youth from #Hindu… pic.twitter.com/uoyPgU6jv8— Hate Detector 🔍 (@HateDetectors) April 11, 2025

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్‌జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/cwB2QDewFD— Kumaruuu💙 (@CalmnessSoull) April 11, 2025
వీడియోలు


KTR: సీఎం రేవంతే ఒక ఫేక్


రాజధాని బీజింగ్ లో భారీ వర్షం, చరిత్రలో చూడని రేంజ్ లో ఈదురు గాలులు


బీఆర్ఎస్ నేతలు కక్షగట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు : శ్రీధర్ బాబు


రెడ్ బుక్ రాజ్యాంగానికి గురజాల DSP జగదీష్ బలి


నేనే పోస్టులు పెడతా.. నీకు చేతనైనది చేసుకో జగదీశ్వరికి పుష్పశ్రీవాణి స్వీట్ వార్నింగ్


తిరుమల గోశాల ఘటనపై సుబ్రమణ్య స్వామి సీరియస్


వక్ఫ్ చట్టాన్ని బెంగాల్ లో అమలు చేయం: దీదీ


దేశ చరిత్రలో ఇదే తొలిసారి... సీఎం స్టాలిన్ సంచలనం


మీడియాను తీసుకురండి వెళ్దాం.. టీడీపీకి భూమన సవాల్


తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టుల నిరసన