కుటుంబ కలహాలతో వివాహిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.
భువనగిరి: కుటుంబ కలహాలతో వివాహిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో సగానికి పైగా కాలిపోయిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం హన్మపురంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన జమాలుద్దీన్(38), జహంగీర్‌బీ(33) దంపతులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురైన జహంగీర్‌బీ ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.