రష్యాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దక్షిణ రష్యాలోని కురిలె ఐలాండ్లో బుధవారం భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
మాస్కో: రష్యాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దక్షిణ రష్యాలోని కురిలె ఐలాండ్లో బుధవారం భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా, దీనివల్ల చోటుచేసుకున్న ఆస్తి, ప్రాణనష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సెవెరో కురిల్స్క్ వద్ద 34 కిలోమీటర్ల లోతులోని భూకంప కేంద్ర నుంచి ప్రకంపనలు వ్యాపించినట్లు తెలిసింది.