Russia
-
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయకుండా తాము రష్యాను ఆపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రతీ వారం వేలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. మేము రష్యాతో మాట్లాడుతున్నాం. దాడులను ఆపాలని మేము కోరుకుంటున్నాం. నిరంతరం రష్యా బాంబు దాడులు చేయడం సరికాదు. దాడుల కారణంగా ప్రతీ వారం వేలాది పౌరులు చనిపోతున్నారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. కాల్పులు విరమణపై చర్చలు జరుగుతున్నాయి. రష్యాను ఒప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన అనంతరం.. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక.. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.#WATCH | On the ongoing Russia-Ukraine war, and if any peace deal is expected, US President Donald Trump says, "We are talking to Russia, we would like them to stop. I don't like them bombing on and on, and every week thousands of young people being killed."(Source - US Network… pic.twitter.com/L15l0oECdw— ANI (@ANI) April 7, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రైవీరిపై శుక్రవారం రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 18 మంది మరణించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించిన తీరుపై జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రైవీరిపై జరిగిన దాడి విషయంలో అమెరికన్ ఎంబసీ స్పందన పేలవంగా ఉంది. అంత పెద్ద దేశం ఇలాంటి బలహీన ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది. చిన్నారులను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు ‘రష్యన్’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. యుద్ధం ముగియాలి. అయితే ఈ ఉద్రిక్తతలను ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదు. కాల్పుల విరమణను కాకుండా చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని మాస్కో ఎంచుకుంటోంది. అందుకే ఆ దేశంపై పూర్తిస్థాయి ఒత్తిడి తీసుకురావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రష్యా దాడిపై జపాన్, స్విట్జర్లాండ్ దేశాల రాయబార కార్యాలయాలు స్పందించిన తీరును జెలెన్స్కీ ప్రశంసించారు. -
యూకే అణు జలాంతర్గాములపై రష్యా నిఘా!
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) అణు జలాంతర్గాములపై రష్యా ప్రత్యేకంగా నిఘా పెట్టిందా? సముద్రంలో వాటి కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రహస్యంగా సెన్సార్లు ఏర్పాటు చేసిందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. యూకే చుట్టుపక్కల ఉన్న సముద్ర జలాల్లో కొన్ని సెన్సార్ పరికరాలను బ్రిటిష్ రాయల్ నేవీ గుర్తించినట్లు సమాచారం. రష్యా తమ అణు జలాంతర్గాములపై నిఘా పెట్టినట్లు యూకే ఆరోపిస్తోంది. తమకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నట్లు రష్యాపై ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తమ ఆయుధ సంపత్తిని దెబ్బతీయాలన్నదే రష్యా ప్రయత్నంగా కనిపిస్తున్నట్లు అనుమానం వ్యక్తంచేస్తోంది. ఈ పరిణామాన్ని దేశ భద్రతకు ముప్పుగా సైనికాధికారులు అభివరి్ణంచారు. అట్లాంటిక్ మహా సముద్రంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని, రష్యా కార్యకలాపాలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రష్యా అధినేత పుతిన్ చేపట్టిన గ్రేజోన్ యుద్ధ వ్యూహంలోనే భాగంగానే తమ అణు జలాంతర్గాములను రష్యా టార్గెట్ చేసుకున్నట్లుగా యూకే అధికారులు అనుమానిస్తున్నారు. సముద్ర గర్భంలోని రహస్య కేబుల్స్‌తోపాటు పైప్లైన్లు, కీలక పరికరాలను ధ్వంసం చేయడం ద్వారా పరోక్ష యుద్ధం సాగించడమే గ్రేజోన్ వ్యూహం. ఇది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని చెబుతున్నారు. గత 15 నెలల వ్యవధిలో బాల్టిక్ సముద్రంలో 11 డీప్–సీ కమ్యూనికేషన్ కేబుల్స్ ధ్వంసమయ్యాయి. సముద్ర గర్భంలోని తమ మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి కృషి చేస్తున్నామని యూకే అధికారులు అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగినప్పటి నుంచి బ్రిటన్–రష్యా మధ్య పిల్లి, ఎలుక తరహాలో పోరాటం జరుగుతూనే ఉంది. అది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని యూకే నిపుణులు అంటున్నారు. -
ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
వాషింగ్టన్: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్‌చుప్‌గా ఆసియా రీజియన్‌లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్‌లోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్‌వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా.. షెల్టర్‌లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్ రీజియన్‌లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్‌లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్ఎస్ నిమిట్జ్హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్, యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్‌ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ వద్ద యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారీయర్‌ను, మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది. -
పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తన సైనిక బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో పడింది. మరో 1,60,000 మంది సైనికుల నియామకానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా పిలుపునిచ్చారు. జూలై నాటికి ఈ రిక్రూట్మెంట్ పూర్తి కానుంది.వివరాల ప్రకారం.. రష్యా సైనిక బలం పెంచే యోచనలో ఉన్నారు అధ్యక్షుడు పుతిన్. ఇందులో భాగంగానే 1,60,000 మంది సైనికుల నియామకానికి రంగం సిద్ధం చేశారు. 18–30 ఏళ్ల మధ్య వయసున్న పురుషులను సైన్యంలోకి తీసుకోనున్నారు. 2011 నుంచి ఇప్పటిదాకా రష్యా నిర్బంధ సైనిక రిక్రూట్మెంట్లలో ఇదే అతి పెద్దది. వచ్చే మూడేళ్లలో ఇది 1.8 లక్షలకు పెరగనుంది.ఇక, సైన్యం పరిమాణాన్ని 24 లక్షలకు, క్రియాశీల సైనికుల సంఖ్యను 15 లక్షలకు పెంచుకుంటామని పుతిన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కొత్త సైనికులను యుద్ధానికి పంపబోమని, ఈ నియామకాలకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యకు వారిని పంపబోమని వెల్లడించింది. Putin’s War Machine Expands: 160,000 More Drafted as Ceasefire Stalls! —largest conscription since war began. pic.twitter.com/AoTrzrzdCB— Kristin Sokoloff (@KSOKUNCENSORED) April 1, 2025 -
రష్యాను టెన్షన్ పెడుతున్న కొత్త వైరస్.. భయాందోళనలో రష్యన్లు!
మాస్కో: రష్యాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతుచిక్కని వైరస్ కారణంగా రష్యా ప్రజలకు విపరీతమైన దగ్గుతో నోటిలో నుంచి రక్తం పడుతుందనే కథనాల్లో పేర్కొన్నాయి. వీరికి కోవిడ్ టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చిందని.. ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశాయి. మరోవైపు.. ఈ కథనాలను రష్యా అధికారులు ఖండించారు. వైరస్ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.వివరాల ప్రకారం.. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి. అలెగ్జాండ్రా అనే మహిళ ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందని.. కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిపిందని నివేదికలు వెల్లడించాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో.. దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. పలు నగరాల్లో ప్రజలు వారాలతరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదే సమయంలో మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధ పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అలాగే, తాము కోవిడ్ టెస్టులు చేపించుకున్నప్పటికీ పాజిటివ్ రాలేదని చెప్పుకొచ్చారు. ఈ వైరస్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలిపారు.🦠 Unknown virus emerges in Russia: people suffer from high fever and bloody cough for weeksAccording to media reports, the symptoms of those infected are identical: it begins with typical aches and weakness, but after a few days, the virus drains the person, making it… pic.twitter.com/0tsDsCfLv8— NEXTA (@nexta_tv) March 29, 2025దీంతో, కొత్త వైరస్‌పై తీవ్ర చర్చ మొదలైంది. ఈ వార్తలపై తాజాగా రష్యా అధికారులు స్పందించారు. ఈ క్రమంలో సదరు అధికారులు స్పందిస్తూ.. ఈ నివేదికలను ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని.. కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్లు నిర్ధరించారని తెలిపారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దానిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇక, కొత్త వైరస్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.🇷🇺 A mystery outbreak causing patients to cough up blood and suffer from a prolonged high fever has been reported in Russia, sparking fears of a new pandemic. However, Russian authorities have denied claims of an unidentified virus and have not disclosed the number of infections… pic.twitter.com/B03IPo3kPG— 🔴 Press review and more 🛰️ (@EUFreeCitizen) April 1, 2025 -
రష్యా, ఫ్రాన్స్, జర్మనీ బెస్ట్
ఐదు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇటీవల యువత ధోరణి మారుతోంది. ఇప్పుడు వారి దృష్టి రష్యా, ఫ్రాన్స్, జర్మనీ అలాగే న్యూజిలాండ్ వంటి దేశాలకు మళ్లుతోంది. తమ చక్కటి భవిష్యత్ కోసం ఈ దేశాలను ఎంపిక చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీసా విధానాలు, వ్యయాలు, ఉద్యోగ అవకాశాలు వంటివి ఇందుకు కారణం. భారతీయ విద్యార్థులు కొత్త విదేశీ విద్యా గమ్యస్థానాలను ఎందుకు ఎంచుకుంటున్నారు... ఈ దేశాలు అందించే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్యూఎస్,యూకేల్లో కఠిన విధానాలుఅమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు విద్యార్థుల ఆకర్షణ క్రమంగా కోల్పోతుండడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న కఠిన వీసా విధానాలు, అధిక ఫీజులు, విద్యను అభ్యసించిన తర్వాత ఉపాధి అవకాశాలు పరిమితం కావడం వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు పొందుదామనుకున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోతున్న విషయం జగద్విదితమే. ఇక కెనడాకు విద్యార్థుల ఎన్రోల్మెంట్లు తగ్గడానికి దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రధాన కారణం. ఇప్పటికీ అగ్ర దేశాలే.. కానీ.. అయితే రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయి తప్ప కెనడా, అమెరికా, బ్రిటన్లను అవి అధిగమించేశాయని భావించడం సరికాదు. గత మూడు సంవత్సరాల్లో (2022–2024) భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశాలలో చదివేందుకు ఎంపిక చేసుకున్న దేశాల జాబితాలో అగ్ర స్థానంలో కెనడా, అమెరికా, బ్రిటన్‌లున్నాయి. అయితే ఈ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారి సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ ఎందుకు?⇒ రష్యా: రష్యా విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే తక్కువ ట్యూషన్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య విషయంలో రష్యా తన ప్రత్యేకతను చాటుతోంది. అమెరికా, బ్రిటన్లలో పోల్చితే రష్యాలో ప్రవేశ ప్రక్రియ సైతం సరళంగా ఉంటోంది. అలాగే ప్రవేశ పరీక్షల సంఖ్య కూడా తక్కువ. ఇక ఆయా దేశాలతో పోల్చితే రష్యాలో జీవన వ్యయాలూ చాలా తక్కువగా ఉంటున్నాయి. ⇒ జర్మనీ: ఉచిత లేదా తక్కువ ఖర్చుతో విద్యావకాశాలు జర్మనీ ప్రత్యేకత. దీనితోపాటు జర్మనీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన ఆరి్థక వ్యవస్థను కలిగి ఉంది. 4.92 ట్రిలియన్ డాలర్లతో దేశం ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆరి్థక వ్యవస్థగా ఉంది. అంతర్జాతీయ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. జర్మన్ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి. ⇒ ఫ్రాన్స్: అమెరికా, బ్రిటన్లతో పోల్చితే ఫ్రాన్స్ తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తోంది. పెద్ద సంఖ్యలో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా కోర్సులను అందిస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులకు అక్కడ చదవడం సులభమవుతోంది. పట్టభద్రులయ్యాక అంతర్జాతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో ఉండి పనిచేసేందుకు అవకాశం ఉంది. ⇒న్యూజిలాండ్: ఈ దేశం భారత్ విద్యార్థులకు ప్రాచుర్యం పొందిన మరో దేశంగా మారింది. అనుకూలమైన వీసా నియమాలు, పనిచేయడానికి సులభమైన అవకాశాలు దీనికి ఒక కారణంకాగా, దేశంలోని విశ్వవిద్యాలయాలు మంచి విద్య, పరిశోధన అవకాశాలను అందిస్తున్నాయి. వీటన్నింటికీ మించి న్యూజిలాండ్ ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గమనార్హం. ఆయా అంశాలు ఈ దేశాన్ని విద్యార్థులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ⇒ పోలాండ్, ఇటలీ, స్వీడన్ : పోలాండ్ తక్కువ వ్యయంతో విద్యా అవకాశాలు అందిస్తోంది. ఇటలీ విషయానికి వస్తే స్కాలర్షిప్లు ఇస్తూ ట్యూషన్ ఫీజుల వెసులుబాటును కల్పిస్తోంది. ఇక స్వీడన్లో ఇంగ్లీషులో బోధించే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ లభిస్తున్నాయి. -
50 వేల ఏళ్ల నాటి పిల్ల మమొత్..!
పిల్లలూ... ఇక్కడ మీరు టేబుల్ మీద చూస్తున్నది ఏమిటో తెలుసా? ఏనుగు. కాని ఏనుగు కాదు. పూర్వకాలపు ఏనుగు. ఐస్ఏజ్ కాలం నాటిది. ఇప్పటి ఏనుగులా కాక ఒంటి నించి రోమాలతో ఉండేది. దానిని ‘మమొత్’ అంటారు. డైనోసార్లలాగానే ఇది కూడా భారీ ఆకారంతో ఉండేది. దీనికి పెద్ద పెద్ద దంతాలు ఉండేవి. కాని డైనోసార్లలాగానే 4000 ఏళ్ల క్రితం మమొత్లు కూడా అంతరించి పోయాయి. దానికి కారణం ఏమిటో అంతుపట్టలేదు కాని ఏదైనా మహమ్మారి కావచ్చని శాస్త్రవేత్తల ఊహ. అయితే వీటి కళేబరాలు రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలో దొరుకుతూనే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది రష్యాలోని ‘ఎకుషియా’ అనే చోట మంచు పొరల కింద దొరికిన పిల్ల మమొత్ కళేబరం. ఇది పిల్ల ఏనుగే అయినా దీని బరువు 180 కిలోలు ఉంది. ఇది 50 వేల ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఆ కళేబరానికి ‘నెక్రోప్సీ’ చేస్తున్న ఫొటోలు ఇవి. మనిషి మృతదేహాన్ని కోసి పరీక్ష చేస్తే ‘అటాప్సీ’. జంతువులను కోసి పరీక్ష చేస్తే ‘నెక్రోప్సీ’. ఈ పరీక్షల వల్ల మమొత్లకు సంబంధించిన మరిన్ని జీవన రహస్యాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు. (చదవండి: 'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ..) -
ఇప్పుడు పుతిన్ వంతు.. త్వరలో భారత్‌కు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) భారతదేశ ఆహ్వానాన్ని మన్నించారు. త్వరలో ఆయన భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ధృవీకరించారు. ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక ఆయన భారత్‌కు వస్తుండడం ఇదే.నరేంద్ర మోదీ(Narendra Modi) మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పుతిన్‌ను ప్రధాని మోదీ భారత్‌కు ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానంపై ఇప్పుడు క్రెమ్లిన్ వర్గాలు ఒక ప్రకటన చేశాయి. మోదీ మూడోసారి గెలిచాక మా దేశానికే మొదట వచ్చారు. ఇక ఇప్పుడు మా వంతు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అని సెర్గీ ప్రకటించారు. అయితే ఆ పర్యటన ఎప్పుడు ఉంటుందనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.భారత్-రష్యా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉక్రెయిన్ యుద్ధం సైతం దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పైగా రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య చర్చలు.. శాంతి ఒప్పందం ద్వారానే యుద్ధం ముగుస్తుందని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది.పుతిన్ గతంలో చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు. 2000 సంవత్సరంలో అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ఆయన భారత భూభాగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సదస్సులు, ద్వైపాక్షి ఒప్పందాల కోసం 2004, 2010, 2012, 2014, 2018, 2021లో పర్యటించారు. ఇక భారత ప్రధాని హోదాలోనూ నరేంద్ర మోదీ నాలుగుసార్లు రష్యాకు వెళ్లారు. 2015లో బ్రిక్స్ సదస్సు కోసం తొలిసారి అక్కడికి వెళ్లిన ఆయన.. 2017, 2019, కాస్త గ్యాప్ తర్వాత 2024లో రష్యాలో పర్యటించారు. -
సిరియాను కుదుటపడనివ్వరా?
అరవై సంవత్సరాలపాటు అస్సాద్ వంశ నియంతృత్వంలో మగ్గి గత డిసెంబర్లో విముక్తి చెందిన సిరియా ప్రజలు కుదుట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అందుకు రెండు శక్తుల నుంచి సవాళ్లు ఎదురవుతు న్నాయి. ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన బషార్ అల్– అస్సాద్, ఇజ్రాయెల్! అస్సాద్ సవాలు కనీసం పరోక్షమై నది, ఇజ్రాయెల్‌ది ప్రత్యక్షమైనది. డిసెంబర్ మొదటి వారంలో అస్సాద్ పతనం తర్వాత సిరియాను మరిచిపోయిన ప్రపంచం, పది రోజుల క్రితం అకస్మాత్తుగా పెద్ద ఎత్తున సాయుధ ఘర్షణ వార్తలు రావటంతో ఉలిక్కిపడింది. ఆ విధంగా దృష్టి ఉక్రెయిన్ యుద్ధం నుంచి కొద్ది రోజులపాటు ఇటు మళ్లింది. వారం రోజులపాటు ఆ ఘటనలలో సుమారు 1,500 మంది చనిపోయినట్లు అంచనా. అస్సాద్ పతనానికి ముందు పది రోజులపాటు సాగిన తిరుగుబాటులోనూ అంతమంది చనిపోలేదు.తిరగబడిన అలావైట్ తెగఈ ఘర్షణలకు కారణం, అస్సాద్‌కు చెందిన మైనారిటీ అలావైట్ తెగవారు తిరగబడటం! వారు ప్రధానంగా సిరియాలోని పశ్చిమ ప్రాంతాన మధ్యధరా సముద్ర తీరం వెంట నివసిస్తారు. వారు తెగను బట్టి మైనారిటీ మాత్రమేగాక, మతం రీత్యానూ మైనారిటీ. దేశంలో సున్నీలది మెజారిటీ కాగా వీరు షియాలు. షియా రాజ్యమైన ఇరాన్, అస్సాద్‌ను బలపరచటానికి గల కారణాలలో ఇది కూడా ఒకటి. తిరుగుబాటు విజయవంతమైనప్పటి నుంచి అలావైట్లలో సహజంగానే భయం ఏర్పడింది. వారు లెబనాన్‌కు తరలి పోవటం మొదలైంది. తిరుగుబాటు నాయకుడు అహమద్ అల్–షరారా, అటు వంటి ఆందోళనలు అక్కర లేదనీ, దేశంలోని అన్ని తెగలు, మతాలు, వర్గాలను ఏకం చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోవటం తన లక్ష్యమనీ మొదటి రోజునే ప్రకటించారు.కానీ అలావైట్ షియాలకు, సున్నీలకు మధ్య స్థానికంగా కొన్ని కలహాలు జరగగా, ఉన్నట్లుండి అలావైట్ల పక్షాన సాయుధులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ప్రభుత్వ సేనలు మోహరించగా ఘర్షణలు తీవ్ర రూపం తీసుకున్నాయి. వారం రోజులలో 1,500 మంది చనిపోయినట్లు అనధికార అంచనా కాగా, ప్రభుత్వం చేసిన ప్రకటనను బట్టి వారిలో సుమారు 200 మంది సైనికులున్నారు. మిగిలిన 1,300 మందిలో అలావైట్ పౌరులు ఎందరో, సాయుధ దళాల వారెందరో తెలియదు. అస్సాద్ సైన్యంలోని ఒక దళం తిరిగి ఒకచోట చేరి దాడులు ఆరంభించింది. అది స్థానికంగా జరిగిన పరిణామమా, లేక ప్రస్తుతం రష్యాలో తలదాచుకున్న అస్సాద్ ప్రమేయ ముందా అనేది తెలియదు. అందుకు అవకాశాలు తక్కువన్నది ఒక అభిప్రాయం. ఆయనకు రష్యా మొదటి నుంచి మద్దతునివ్వటం, ప్రస్తుతం ఆశ్రయాన్నివ్వటం నిజమే అయినా, సిరియా కొత్త ప్రభు త్వంతో సత్సంబంధాలకు ప్రయత్నిస్తున్నది. మధ్యధరా సముద్రపు తూర్పు తీరాన భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో గల సిరియాలో రష్యాకు ఒక నౌకా స్థావరం, ఒక వైమానిక స్థావరం ఉన్నాయి. యూరప్‌ను ఎదుర్కొనేందుకు అవి చాలా అవసరం. అందువల్ల సిరియా కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల ద్వారా ఆ స్థావరాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యా ఇంతకాలం అస్సాద్‌కు పూర్తి మద్దతుగా ఉండినప్పటికీ, తమ కొత్త పరిస్థితులలో రష్యా సహాయం అనేక విధాలుగా అవసరం గనుక, అల్–షరారా కూడా అందుకు సుముఖత చూపుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో అస్సాద్‌ను సిరియాలో తన పాత సైనిక దళాల ద్వారా ఘర్షణలకు రష్యా అనుమతించటం జరిగేది కాదు. పరోక్షంగానైనా అస్సాద్ ప్రోత్సాహం లేక ఇది జరిగేది కాదనే అభిప్రాయమూ ఉంది.అందరినీ ఏకం చేసే దిశగా...ఈ తర్కాన్ని బట్టి చూసినపుడు, ఘర్షణలకు కారణం అస్సాద్ సైన్యానికి చెందిన స్థానికమైన ఒక సైనిక దళమని భావించవలసి ఉంటుంది. అల్–షరారా ప్రకటించింది కూడా అదే. ఆ ఒక్క దళాన్ని చివరకు తుడిచి పెట్టామన్నారాయన. అయితే, ఇటువంటి పరిస్థితి తిరిగి తలెత్తబోదనే హామీ ఏమైనా ఉందా? దేశ నిర్మాణంలో అలావైట్లు కూడా భాగస్వాములని, వివిధ వర్గాల మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండబోవని తమ తిరుగుబాటు విజయవంతమైన మొదటిరోజునే స్పష్టం చేసిన తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరారా, గమనార్హమైన పని ఒకటి చేశారు. అది – ఘర్షణలపై నియమించిన విచారణ కమిటీలో అలావైట్లను కూడా చేర్చటం! ఘర్షణలలో తమ వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపైనా చర్యలుంటాయని ప్రత్యే కంగా చెప్పారు. ఈ వైఖరిలో రాజకీయమైన, పరిపాలనాపరమైన వివేకం కన్పిస్తాయి. సున్నీలు, షియాలు, క్రైస్తవులు, కుర్దులు, ద్రూజ్లు మొదలైన తెగలతోపాటు ప్రాంతాల వారీగా కూడా చీలి పోయి ఉన్న దేశాన్ని ఏకం చేయటం, ఒకటిగా ముందుకు నడిపించటం తేలిక కాదు. అగ్రస్థానాన గల నాయకుడు, తన పార్టీ, ప్రభుత్వం, సైన్యం అందరూ దార్శనికతతో ఏకోన్ముఖంగా పనిచేస్తే తప్ప ఆ లక్ష్యం ముందుకు సాగదు.అటువంటి పరిణతిని అల్–షరారా మొదటినుంచి చూపుతుండటం విశేషం. తిరుగుబాటు ఇంకా విజయ వంతం కాక ముందు నుంచే ఈ అవసరాలు ఆయనకు అర్థమైనాయనుకోవాలి. అందు వల్లనే ఇస్లామిక్ స్టేట్ సంస్థతో సంబంధాలను కొన్ని సంవత్సరాల ముందే తెంచి వేసుకున్నారు. అధికారానికి వచ్చిన మొదటి రోజునే తన పోరాట కాలపు అజ్ఞాతనామం అబూ మొహమ్మద్ జొలానీని, అసలు పేరు అహమద్ అల్–షరారాకు మార్చుకున్నారు. పౌర హక్కులు, మహిళల హక్కుల పరిరక్షణ చేయగలమన్నారు. అస్సాద్ కాలపు ఖైదీలందరినీ వెంటనే విడుదల చేశారు. ఆర్థికాభివృద్ధి, దేశాభివృద్ధి మొదటి ప్రాధాన్యాలని ప్రకటించారు.ఈ ప్రకటనలన్నీ మొదటి 24 గంటలలోనే వెలువడ్డాయి. అసద్‌పై వేర్వేరు ప్రాంతాలలో తిరుగుబాట్లు చేస్తుండిన వర్గాలు ముందుకు వచ్చి తమ దళాలను ప్రభుత్వ సైన్యంలో విలీనం చేయాలన్న విజ్ఞప్తికి కుర్దులు మొదలైన కొందరు సానుకూలంగా నిర్ణయించారు. షరారాను తీవ్రవాదిగా, తన సంస్థ హయాత్ తహరీర్ అల్–షామ్‌ను ఇస్లామిస్టు తీవ్రవాద సంస్థగా ప్రకటించిన వివిధ దేశాలు ఆ ముద్రను తొలగించటం, డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయాలను తిరిగి తెరవటం, షరారాతో సమావేశానికి ప్రతి నిధులను పంపటం వంటి ప్రక్రియలు మొదలయ్యాయి. ఇక ప్రధా నంగా మిగిలింది అమెరికా. వారి ప్రతినిధులు కూడా కలిసి సాను కూలంగా స్పందించటం, ఆంక్షలు ఎత్తివేయగలమనటం చేశారు గానీ, ట్రంప్ అధికారానికి రావటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.ఇజ్రాయెల్ ముప్పుఇదిట్లుండగా షరారా ఈ నెల 13న చాలా ముఖ్యమైన చర్య ఒకటి తీసుకున్నారు. అది – దేశానికి కొత్త రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని నియమిస్తూ, తాత్కాలిక రాజ్యాంగం ఒకటి ప్రకటించటం! అందులోని అంశాలలో తను మొదట పేర్కొన్న అన్ని విధాలైన హక్కులు ఉన్నాయి. అయితే, సిరియన్ తిరుగుబాటు విజయవంతమైన రోజునే సిరియాకు చెందిన గోలన్ కనుమలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. అక్కడి నుంచి ఖాళీ చేయబోమని, అక్కడ ఇజ్రా యెలీల సెటిల్మెంట్లు పెంచగలమని ప్రకటించింది. సిరియా దక్షిణ ప్రాంతం యావత్తును నిస్సైనిక మండలంగా మార్చగలమని హెచ్చ రించింది. పాశ్చాత్య దేశాలతోపాటు, ఐక్యరాజ్యసమితి ఖండించినా వెనుకకు తగ్గటం లేదు. సిరియాకు ఈ ముప్పు ఎట్లా పరిణమించ వచ్చునన్నది పెద్ద ప్రశ్న అవుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలు
ద్విపాత్రాభినయం చేసే హీరోల సినిమాలకు ఒకప్పుడు జనాదరణ బాగుండేది. ఇద్దరూ ఒకరే అని తెలిసినా రెండు వేషాలతో మెప్పించే తీరు చూసి జనం ముచ్చటపడేవారు. ప్రపంచ యవనికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అలాంటి పాత్రల్లోనే జీవిస్తున్నారు. యూరప్‌లో శాంతిమంత్రం పఠిస్తారు. రష్యా–ఉక్రెయిన్లు రాజీ పడాలంటారు. అందుకు షరతులు పెట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గెంటేసినంత పనిచేస్తారు. పశ్చిమాసియాలో ఇరాన్‌కు స్నేహ హస్తం అందిస్తారు. గాజాలో మారణహోమానికి ఇజ్రాయెల్‌ను ప్రోత్సహిస్తారు. యెమెన్‌లో వైమానిక దాడులకు తానే ఆదేశాలిస్తారు. ఒక అగ్రరాజ్యాధినేత ఏకకాలంలో ఇన్ని వైరుద్ధ్యాలు ప్రదర్శించటం గతంలో ఎప్పుడూ లేదేమో! ఒకపక్క జెలెన్స్కీ మూడో ప్రపంచయుద్ధ ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారని ఆరోపించిన ట్రంప్... వేరొకచోట అదే ప్రమాదానికి దారితీసే పోకడలకు ఎందుకు పాల్పడుతున్నారో అనూహ్యం. తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్, గాజాల్లో శాంతి సాధిస్తానని పదే పదే ట్రంప్ చెప్పారు. కానీ దాని అర్థం ఇదా అని అమెరికా పౌరులే ఆశ్చర్యపోతున్నారు. రష్యా– ఉక్రెయిన్ లడాయి మూడేళ్లపాటు ఎడతెరిపి లేకుండా ఎందుకు కొనసాగిందో అందరికీ తెలుసు. జో బైడెన్ ఏలుబడిలోని అమెరికా... యూరప్ దేశాలతో చేతులు కలిపి ఉక్రెయిన్ ద్వారా రష్యాను చికాకుపరిచి, ఆ వంకన నాటోను తూర్పున విస్తరించే ప్రయత్న పర్యవసానమే ఆ యుద్ధం.రష్యా–ఉక్రెయిన్ల విషయంలోనే ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు జెలెన్స్కీ షరతులు పెట్టడాన్ని ఏమాత్రం సహించలేని ట్రంప్... అదే రకంగా వ్యవహరించిన పుతిన్‌తో సౌమ్యంగా ఉంటున్నారు. జెలెన్స్కీ తమ భద్రతకు గ్యారెంటీ ఇవ్వాలన్నారు. దురాక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇప్పించాలని కోరారు. నాటో సభ్యత్వం కావా లని అడిగారు. కానీ పుతిన్ అసలు కాల్పుల విరమణకే అంగీకరించలేదు. మూడు రోజులక్రితం మళ్లీ రెండోసారి మాట్లాడాక పరిమిత కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. పరస్పరం ఇంధన గ్రిడ్ల పైనా, ఇతర మౌలిక సదుపాయాలపైనా దాడులు చేసుకోవద్దన్నది ఆయన ప్రతిపాదన. ఉక్రెయిన్ ఏం చేయాలో ట్రంప్, పుతిన్‌లు నిర్ణయించారు. నల్లసముద్ర ప్రాంతంలో ఇరు నావికాదళాల దాడుల నిలిపివేతపై కూడా ఒక అంగీకారానికొచ్చాక శాంతి చర్చలు మొదలవు తాయంటున్నారు. ఇవన్నీ గమనిస్తూ కూడా తమ సార్వభౌమత్వం విషయంలో రాజీపడేదేలేదని ఇప్పటికీ జెలెన్స్కీ బడాయి పోతున్నారు. ఉక్రెయిన్ భూభాగంలోని క్రిమియాను రష్యా 2014లో ఆక్రమించగా, 2022లో యుద్ధం మొదలయ్యాక తూర్పు ఉక్రెయిన్‌లోని మరో నాలుగు ప్రాంతాల్లో భూభాగాన్ని సైతం అది సొంతం చేసుకుంది. మొత్తానికి ఉక్రెయిన్‌లోని అయిదోవంతు భూభాగం రష్యా అధీనంలో ఉంది. ఇందులో అంగుళం భూమిని కూడా వదలబోనని పుతిన్ పదే పదే చెబుతున్నారు. పశ్చిమాసియాలో ట్రంప్ కనీసం ఈమాత్రం కూడా చేయటంలేదు. తమ బందీలను హమాస్ మిలిటెంట్లు విడుదల చేయలేదన్న సాకుతో గాజాలో ట్రంప్ అండతోనే ఇజ్రాయెల్ నరమేధం సాగి స్తోంది. మొన్న మంగళవారం వైమానిక దాడుల్లో 413 మంది పౌరులను హతమార్చగా గురువారం ఇజ్రాయెల్ సైన్యం నేరుగా విరుచుకుపడి 70 మందికి పైగా పౌరులను కాల్చిచంపింది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఉపయోగించిన భాష కూడా అభ్యంతరకరంగా ఉంది. తమ బందీలను హమాస్ విడిచిపెట్టేవరకూ దాడులు తప్పవని, ఆ సంస్థకు ఆశ్రయం కల్పించినంతకాలమూ సాధా రణ పౌరులు కనీవినీ ఎరుగని రక్తపాతం చవిచూడాల్సివస్తుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ హెచ్చరించారు. బందీల అప్పగింత ప్రక్రియ పూర్తయ్యాక గాజా పౌరులను ప్రపంచంలో కోరుకున్న ప్రాంతాలకు తరలిస్తారట. లేనట్టయితే భారీ వినాశనం తప్పదట. యెమెన్‌లో సైతం ట్రంప్ తీరుతెన్నులు అలాగే ఉన్నాయి. గతవారం ఆ దేశంలో హౌతీ మిలి టెంట్ల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాల్లో 40 వైమానిక దాడులు జరిపించారు. గాజా వాసులను ఇజ్రాయెల్ బెదిరిస్తున్న మాదిరే హౌతీలనూ, వారికి మద్దతిస్తున్నదని భావిస్తున్న ఇరాన్‌నూ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌పై నేరుగా యుద్ధం చేసే అవసరాన్ని తప్పించుకోవటానికీ, ఆ దేశాన్ని అణు చర్చలకు ఒప్పించటానికీ హౌతీలపై విరుచుకుపడటమే మార్గమని ఆయన భావిస్తున్నట్టు కనబడు తోంది. కానీ హౌతీలు సులభంగా లొంగివచ్చే రకం కాదు. వారు ఎర్ర సముద్రంలో మాటుగాసి అంతర్జాతీయ నౌకా రవాణాను అడ్డుకుంటున్న మాట వాస్తవమే అయినా వారితో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించటమే తెలివైన పని. గాజాలో ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ ఆపగలిగితే హౌతీలను చర్చలకు ఒప్పించటం సులభం.అమెరికాలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తన రేటింగ్ శరవేగంగా పడిపోయిన వైనం ట్రంప్ గమనించాలి. మిత్రదేశాలపై సైతం సుంకాల మోత మోగించటం, ఉపాధి కల్పనకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలించకపోవటం ఇందుకు తక్షణ కారణం కావొచ్చుగానీ... యూరప్‌లో అరకొర శాంతి యత్నాలు, ఇజ్రాయెల్‌లో సాగుతున్న నరమేధం, హౌతీలను అదుపు చేయలేకపోవటం వంటివి కూడా ఆయనపై మరింత వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పలుకుబడి సైతం క్షీణిస్తోంది. అందువల్లే చిత్తశుద్ధితో శాంతికి యత్నించటమే ట్రంప్ ముందున్న ఏకైక మార్గం. అప్పుడే ఇంటా బయటా అన్నీ చక్కబడతాయి. లేనట్టయితే మున్ముందు సమస్యలు మరింత ఉగ్రరూపం దాలుస్తాయి. -
రష్యా క్రూడ్‌తో అమెరికాకు ఇంధనం
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడాది కాలంలో 724 మిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును ఇంధనంగా మార్చి అమెరికాకు ఎగుమతి చేసింది. ‘‘2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్యకాలంలో 2.8 బిలియన్ యూరోల శుద్ధి చేసిన ఇంధనాన్ని భారత్, టర్కిలోని ఆరు రిఫైనరీల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. ఇందులో 1.3 బిలియన్ యూరోల విలువ చేసే ఇంధనం రష్యా చమురుతో తయారైనది’’అని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) ఒక నివేదికలో వెల్లడించింది.గుజరాత్‌లోని రిలయన్స్ జామ్‌నగర్ యూనిట్ల నుంచి అమెరికా రెండు బిలియన్ యూరోల పెట్రోల్, డీజిల్‌ను దిగుమతి చేసుకోగా.. ఇందులో 724 మిలియన్ యూరోల (రూ.6,733 కోట్లు సుమారు) విలువైన ఇంధనం రష్యా ముడి చమురు ఆధారితమేనని తెలిపింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో రష్యా నేరుగా ఎగుమతి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. గుజరాత్‌లోని వాదినార్లో రష్యా రోజ్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీకి 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ ఉంది. ఈ సంస్థ సైతం గతేడాది కాలంలో అమెరికాకు 184 మిలియన్ యూరోల ఇంధనాన్ని ఎగుమతి చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులోనూ 124 మిలియన్ యూరోల విలువ మేర రష్యా ముడి చమురు ఆధారితమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ ఎంఆర్‌పీఎల్ సైతం అమెరికాకు 42 మిలియన్ యూరోల విలువైన ఇంధనాన్ని ఎగుమతి చేయగా, ఇందులో 22 మిలియన్ యూరోల మేర రష్యా ముడి చమురుతో చేసిందేనని ఈ నివేదిక తెలిపింది. -
విరామం అంటూనే విరుచుకుపడింది
కీవ్: అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు తలూపిన రష్యా చిట్టచివర్లో తల ఎగరేసింది. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే సమరనినాదం చేసింది. మంగళవారం రాత్రి నుంచి నిరాటంకంగా రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్లో సంభాషించిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. ముఖ్యంగా డోనెట్సక్ ప్రాంతంలోని నగరాలపై 150 డ్రోన్ల దాడులు జరిగాయి. వీటితోపాటు కీవ్, ఝిటోమిర్, చెరి్నహీవ్, పోల్టావా, ఖర్కీవ్, కిరోవోహార్డ్, డినిప్రోపెట్రోవ్సŠక్, చెర్కసే ప్రాంతాలపైనా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. అయితే ప్రాణనష్టం వివరాలు వెల్లడికాలేదు. ఉక్రెయిన్ సైతం డ్రోన్లకు పనిచెప్పింది. రష్యా ప్రాంతాలపై డ్రోన్ దాడులుచేసింది. 57 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేస్తోందని ఆరోపించింది. ‘‘కాల్పుల విరమణ చర్చల వేళ ఇలా దాడులతో ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో చర్చలు రైలు పట్టాలు తప్పే ప్రమాదమొచ్చింది’’ అని రష్యా రక్షణ శాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. -
చైనాలో మేడిన్ రష్యా
బీజింగ్/హాంకాంగ్: మన దేశంలోని అనేక వస్తువులపై మేడిన్ చైనా అని ఉంటుంది. అంత పెద్ద ఉత్పత్తిదారు అయిన ఆ దేశంలో మాత్రం ఇప్పుడెక్కడ చూసినా ‘మేడిన్ రష్యా’ అనే కనబడుతోంది. దుకాణాల మీద చైనా, రష్యాల జెండాలు.. లోపల రష్యా వస్తువులు. చాక్లెట్లు, కుకీల నుంచి తేనె, వోడ్కాల దాకా అన్ని రష్యన్ ఉత్పత్తులకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఉన్నట్టుండీ ఈ క్రేజ్ పెరగడంపై కొందరు చైనీయులే విస్తుపోతున్నారంటే ఇటీవలి మార్పును అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మార్పు వెనుక పెద్ద కథే ఉంది... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించారు. ఆంక్షలతో సతమతమవుతున్న రష్యాకు చైనా కీలకమైన ఆర్థిక వనరుగా మారింది. ద్వైపాక్షిక వాణిజ్యం ఏటేటా రికార్డుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ చైనా, రష్యాలు మునుపెన్నడూ లేనంతగా దగ్గరయ్యాయి, అమెరికా పట్ల వారి శత్రుత్వం, ప్రపంచంపై ఆ దేశ ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే ధోరణి దీనితో వేగవంతం అయ్యింది.ఆహారోత్పత్తులకు డిమాండ్ చౌకైన రష్యన్ చమురు, గ్యాస్, బొగ్గు.. చైనా దిగుమతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ ఐస్ క్రీం, తీపి బిస్కెట్లు, పాల పొడి వంటి రష్యా ఆహార ఉత్పత్తులకు ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు చైనా వ్యాపారులు పోటీ పడుతున్నారు. చైనా వ్యాపార రికార్డుల ప్రకారం, 2022 నుంచి రష్యన్ వస్తువుల వాణిజ్యంలో 2,500 కంటే ఎక్కువ కొత్త కంపెనీలు చేరాయి. అందులో దాదాపు సగం కంపెనీలు గత సంవత్సరంలోనే నమోదయ్యాయి.వీటిలో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. రష్యా నుంచి అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటున్నా.. చైనాలో బెస్ట్ సెల్లర్ మాత్రం రష్యా తేనె, చాక్లెట్లు. సహజ పదార్థాలతో చేసిన ఈ ఉత్పత్తులు అధికనాణ్యతను కలిగి ఉన్నాయని, ఆరోగ్యకరమైనవని చెబుతున్నారు. ఇవి కేవలం రష్యన్ ఉత్పత్తుల దుకాణాలుగా మాత్రమే కాదు, ఆ దేశ సంస్కృతి, ప్రత్యేకతలను ప్రదర్శించే విండోలుగా మారాయి.పుతిన్‌కూ విస్తృత ఆదరణ...రష్యా వస్తువులకు మాత్రమే కాదు, అధ్యక్షుడు పుతిన్‌కు కూడా చైనా ప్రజల్లో విస్తృత ఆదరణ ఉంది. బీజింగ్‌లోని తిన్హువా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ గత ఏడాది విడుదల చేసిన సర్వేలో 66 శాతం మంది రష్యా పట్ల పూర్తి సానుకూలతను, మిగిలినవారు కొంత అనుకూల వైఖరిని ప్రకటించారు. దీనికి భిన్నంగా 76% మంది అమెరికా పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు.మేడిన్ రష్యా ఫెస్టివల్ ఏప్రిల్ 2023 నాటికి టావోబావో, జేడీతో సహా మాస్కోకు చెందిన 300కి పైగా కంపెనీలు చైనా ఇ–కామర్స్ ప్లాట్ఫామ్లో చేరాయి. 2024లో ‘మేడ్ ఇన్ రష్యా ఫెస్టివల్ అండ్ ఫెయిర్’ అతిపెద్ద నగరాలైన షెన్యాంగ్, డాలియన్లలో జరిగింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 150కి పైగా రష్యన్ కంపెనీలు పాల్గొన్నాయి. 23లక్షల డాలర్ల విలువైన రష్యన్ వస్తువులను చైనా వినియోగదారులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించాయి. ఇదే అదనుగా ‘నకిలీ రష్యన్ వస్తువులు’ కూడా తయారవుతున్నాయి. ఈ వివాదం ఎలా ఉన్నా.. రష్యా పట్ల చైనా ప్రజలకు ఉన్న అనుబంధాన్ని, బీజింగ్, మాస్కో మధ్య వాణిజ్య సంబంధాలకు అద్దం పడుతూ చైనా వ్యాప్తంగా దుకాణాలు పెరుగుతున్నాయి. -
పాతికేళ్ల బంధం, ఒక్కసారి లే నేస్తమా : వైరల్ వీడియో
మనుషులైనా, జంతువులైనా మనసుంటుంది. అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయి. అపురూపమైన ఆ అనుబంధం (Friendship) తెగిపోతే.. కలకాలం తోడునీడగా ఉన్న ఆత్మీయ నేస్తం.. అందనంత దూరం వెళ్లిపోతే.. మనుషులైతే గుండె పగిలేలా రోదిస్తారు. మరి మూగజీవి ఏం చేస్తుంది. మూగగానే రోదిస్తుంది. ఈ మాటలకు అక్షర సత్యం అనేలా ఒక వీడియో నెట్టింట పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. అసలేంటీ కథ.. తెలుసుకుందాం..పాతికేళ్ల బంధాన్ని వీడిన శాశ్వతంగా కన్నుమూసిన తన భాగస్వామిని ఒక ఏనుగు (elephant) చలించి పోయింది. ఎలాగైనా దాన్ని తట్టి లేపాలని ప్రయత్నించింది. తొండంతో గుండెలకు హత్తుకోవాలని తపించిపోయింది. కానీ తనవన్నీ వృధా ప్రయత్నాలనీ, ఇకలాభం లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ సమయంలో పశువైద్యులను దగ్గరకు రానీయలేదు.బాజా వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం జెన్నీ, మాగ్డా అనే ఏనుగులు రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో ఉండేవి. 25 సంవత్సరాలకు ఇవి రెండూ పార్టనర్స్‌గా ఉండేవి. వివిధ ఫీట్లు చేస్తూ జనాలను అలరించేవి. వయసుమీద పడటంతో సర్కస్ వర్క్‌నుంచి విముక్తి లభించింది. ఈ వారం జెన్నీ కన్నుమూసింది. దీంతో తన నేస్తం అలా నిర్జీవంగా పడి ఉండటం మాగ్డా తట్టుకోలేకపోయింది. దాన్ని లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. గంటల తరబడి దాని చుట్టూ తిరిగింది. కన్నీరు పెట్టుకుంది. ఆఖరికి వెటర్నరీ వైద్యులను కూడా దగ్గరికి రానివ్వలేదు. చివరికి జెన్నీకి కన్నీటి వీడ్కోలు(Mourns) పలికింది. ఇది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. వారు దృశ్యాలను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు హృదయాలను తాకింది. ఏనుగు దుఃఖం చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు.😢💔 An elephant mourns her deceased friendIn occupied Crimea, the famous elephant Jenny passed away due to illness.Her companion, Magda, refused to let people approach for hours, hugging Jenny and staying by her side for a long time. pic.twitter.com/nY5FRJueHp— Based & Viral (@ViralBased) March 14, 2025 -
మళ్లీ రష్యా వశమైన సుడ్జా టౌన్
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా క్రమంగా పైచేయి సాధిస్తోంది. ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతుండగానే, మరోవైపు ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. రష్యా సరిహద్దు అయిన కర్క్స్ ప్రాంతంలోని అతిపెద్ద పట్టణం సుడ్జా మళ్లీ రష్యా సేనల చేతుల్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని తమ బలగాలు తరిమికొట్టినట్లు రష్యా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కర్క్స్‌లోని తమ సైనిక కమాండర్లను రష్యా అధినేత పుతిన్ బుధవారం కలిశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో సుడ్జా టౌన్ రష్యా వశం కావడం గమనార్హం. సుడ్జా పట్టణం ఉక్రెయిన్–రష్యా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. రష్యా పరిధిలోకి వచ్చే ఈ పట్టణాన్ని గతంలో ఉక్రెయిన్ సేనలు ఆక్రమించాయి. ఇక్కడ 5,000 మంది నివసించేవారు. యుద్ధం మొదలైన తర్వాత చాలామంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. యుద్ధంలో తాము కోల్పోయిన భూభాగాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవడం అతిపెద్ద విజయంగా రష్యా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనిపై ఉక్రెయిన్ అధికార వర్గాలు ఇంకా స్పందించలేదు. -
రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ అటాక్
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దానికి ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్గురు మృతిచెందగా 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడితో రష్యా అప్రమత్తమైంది. 337 డ్రోన్లలో 91 డ్రోన్లను కూల్చేసింది. ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది. రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ తెలిపారు. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులుశాంతి చర్చలు(జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచింది. రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్‌లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు. -
రష్యా దాడులకు ఉక్రెయిన్ ప్రతీకారం
-
శాంతి చర్చల వేళ.. ఎయిర్‌స్ట్రైక్స్‌తో భీకర దాడులు
కీవ్: శాంతి చర్చల వేళ రష్యా సైన్యం(Russia Military) భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. తాజాగా.. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ తెలిపారు. అయినప్పటికీ.. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులు శాంతి చర్చలు(Ukraine Peace Talks) జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం. రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్‌లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సమాచార సహాయం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే రష్యా తన దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం. -
రూ. 1.5 లక్షల కోట్లకు రష్యా చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ దాదాపు 112.5 బిలియన్ యూరోల (సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) ముడి చమురు కొనుగోలు చేసినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (క్రియా) ఒక నివేదికలో తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన 2022 ఫిబ్రవరి 24 నుంచి శిలాజ ఇంధనాలకు సంబంధించి రష్యాకు లభించిన చెల్లింపుల వివరాలను ఇందులో పొందుపర్చింది. దీని ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా శిలాజ ఇంధన ఎగుమతుల ద్వారా 835 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జించినట్లు వివరించింది. చైనా అత్యధికంగా 235 బిలియన్ యూరోల (170 బిలియన్ యూరోల చమురు, 34.3 బిలియన్ యూరోల బొగ్గు, 30.5 బిలియన్ యూరోల గ్యాస్) ఇంధనాలు కొనుగోలు చేసింది. భారత్ 205.84 బిలియన్ యూరోల ఇంధనాలను కొనుగోలు చేసింది. ఇందులో 112.5 బిలియన్ యూరో క్రూడాయిల్, 13.25 బిలియన్ డాలర్ల బొగ్గు ఉంది. యుద్ధం వల్ల విధించిన ఆంక్షలతో రష్యా చమురు చౌకగా లభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్ గణనీయంగా కొనుగోళ్లు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బ్యారెల్‌కి 18–20 శాతం వరకు లభించిన డిస్కౌంటు ఇటీవలి కాలంలో 3 డాలర్ల దిగువకు పడిపోయింది. -
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడి.. 14 మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న క్రమంలో కూడా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. డోబ్రాపిలియా ప్రాంతంపై జరిగిన మిస్సైల్ దాడిలో 14 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ తూర్పు నగరం డోబ్రాపిలియా, ఖార్కివ్ ప్రాంతంలోని ఒక స్థావరంపై రాత్రిపూట రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐదుగురు పిల్లలు సహా 37 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.కాగా, రెండు రోజుల క్రితం జెలెన్స్కీ సొంత పట్టణంలోని కూడా క్షిపణి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి సమయంలో క్రీవి రీహ్‌లోని ఓ హోటల్‌పై రష్యా క్షిపణిదాడిలో నలుగురు మృతి చెందారు. ఆ హోటల్లో తమ దేశ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. 112 షాహెడ్, డెకాయ్ డ్రోన్లను, రెండు బాలిస్టిక్ ఇస్కందర్ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానికదళం ప్రకటించింది.యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని కూడా అమెరికా నిలిపేసింది. మరో వైపు, ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసిన సంగతి విదితీమే.గత గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. -
రష్యాకు ట్రంప్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరేదాకా రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్‌లు విధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టంచేశారు. ఆలస్యం కాకముందే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని హితవు పలికారు. నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యాను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, రష్యా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్‌లు వసూలు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు, టారిఫ్‌లను మరోసారి తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్ను, మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ ప్రభుత్వం వాటికి తలొగ్గుతుందా? అనేది చూడాలి. -
రష్యాను చేసుకున్నట్లు.. చైనాను కూడా..!
ఉక్రెయిన్ ను బెదిరించి.. రష్యాను మచ్చిక చేసుకున్నట్లు అలాగే చైనాను మచ్చిక చేసుకుందాం సార్! -
అమెరికా దెబ్బకు జెలెన్స్కీ యూటర్న్.. ట్రంప్ బిగ్ ప్లాన్?
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ మరోసారి స్పందించారు. ట్రంప్‌తో సంవాదం జరగడం నిజంగా విచారకరమని జెలెన్స్కీ చెప్పారు. విభేదాలు సరి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు.ఈ సందర్భంగా ట్రంప్‌తో చర్చలు జరగాల్సిన విధంగా జరగలేదని జెలెన్స్కీ అంగీకరించారు. ఉక్రెయిన్–అమెరికా మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, కమ్యూనికేషన్ నిర్మాణాత్మకంగా ఉండేలా జాగ్రత్తపడతామని వెల్లడించారు. అమెరికా కోరుతున్న అరుదైన ఖనిజాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనిపై ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే, ఉక్రెయిన్‌కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) నుంచి ఈ స్పందన వచ్చింది.ఇదే సమయంలో యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు. తొలిదశలో ఖైదీల విడుదలతో పాటు క్షిపణులు, దీర్ఘ శ్రేణి డ్రోన్లు, ఇంధన వనరులు, ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులపై నిషేధం వంటి వాటికి రష్యా అంగీకరిస్తే తదుపరి దశల ద్వారా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు. బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.అమెరికా ఇచ్చిందెంత? 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ ఉక్రెయిన్‌కు 300 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. యూరప్ దేశాలు మాత్రం 100 బిలియన్ డాలర్లే ఇచ్చాయని అన్నారు. కానీ, ఆమెరికా ఇచ్చింది 182.8 బిలియన్ డాలర్లేనని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అందులో నిజం లేదని, అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందిన సాయం 119.7 బిలియన్ డాలర్లు మాత్రమేనని జర్మనీకి చెందిన కీల్ ఇన్స్టిట్యూట్ స్పష్టంచేసింది. పుతిన్‌ను నిలువరించేది ఖనిజాల ఒప్పందం మాత్రమే: వాన్స్రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ ప్రయత్నాలను నిలువరించగలిగేది యూఎస్– ఉక్రెయిన్ మధ్య కీలక ఖనిజాల ఒప్పందం మాత్రమేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇది మాత్రమే ఆచరణ సాధ్యమైన పరిష్కారమన్నారు. యుద్ధం ముగిశాక బ్రిటన్, ఫ్రాన్స్‌ల సారథ్యంలో ఏర్పాటయ్యే అంతర్జాతీయ బలగాలతో ఉక్రెయిన్‌కు ఎటువంటి భద్రతా ఉండదని వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్.. గత 30, 40 ఏళ్లుగా ఎలాంటి యుద్ధాలు చేయని ఏవో కొన్ని దేశాలకు చెందిన 20 వేల బలగాల కంటే అమెరికాతో కీలక ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంటే ఉక్రెయిన్‌కు మెరుగైన భద్రత లభిస్తుందని చెప్పారు. భద్రతకు గ్యారెంటీ కావాలన్నా, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఆక్రమించుకోరాదనుకున్నా ఉక్రెయిన్‌కు అమెరికా మాత్రమే ఆ గ్యారంటీ ఇస్తుందని తెలిపారు. -
పుతిన్‌కు ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికా ప్లాన్ ఏంటి?
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విస్టు మీద ట్విస్ట్ ఇస్తున్నారు. రష్యాకు పూర్తి మద్దుతుగా నిలుస్తూ ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia)పై అమెరికా గతంలో విధించిన ఆంక్షలను తొలగించాలని ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం తర్వాత నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యాపై పలు ఆంక్షలు విధించారు. పుతిన్‌ను కంట్రోల్ చేసేందుకు ట్రేడింగ్‌కు సంబంధించిన ఆంక్షలు పెట్టారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ ఆంక్షలను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపుతో పాటు మాస్కోతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు.ఇందులో భాగంగా రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని విదేశీ వ్యవహరాలు, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను వైట్‌హౌస్ కోరినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆంక్షలను తొలగించే క్రమంలో ప్రతిగా మాస్కో నుంచి వాషింగ్టన్ ఏం ఆశిస్తుందనే విషయాలు మాత్రమే తెలియాల్సి ఉంది. దీంతో, అమెరికా ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ జెలెన్స్కీకి ట్రంప్ వరుస షాక్‌లిస్తున్నారు. తాజాగా రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ఈ మేరకు వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందం విషయం సందర్బంగా ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. BREAKING: The U.S. is preparing to ease sanctions on Russia as President Trump pushes to restore ties and end the war in Ukraine - Reuters pic.twitter.com/D1b16R5WMT— Libs of TikTok (@libsoftiktok) March 3, 2025 -
ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన...ఇక మా సారథ్యంలో: బ్రిటన్
లండన్/కీవ్/వాషింగ్టన్: అమెరికాకు బదులుగా ఇకపై ప్రపంచ పెద్దన్న పాత్రను పోషించేందుకు బ్రిటన్ సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. రష్యాతో ఘర్షణకు తెర దించి ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇక బ్రిటన్ సారథ్యం వహిస్తుందని ఆ దేశ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రకటించారు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు సైనికంగా, ఆర్థికంగానే గాక అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. ‘‘ఈ ప్రయత్నాల్లో ఇతర దేశాలనూ కలుపుకుని సాగుతాం. ఇందుకు అమెరికా చాలా కీలకం’’ అని చెప్పారు. ఉక్రెయిన్ విషయమై స్టార్మర్ చొరవ తీసుకుని మరీ ఆదివారం యూరప్ దేశాలతో లండన్‌లో అత్యవసర భేటీ నిర్వహించడం తెలిసిందే. అందులో చర్చించిన అంశాలను సోమవారం ఆయన పార్లమెంటుకు వివరించారు. ఈ విషయంలో స్టార్మర్‌కు విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వాగ్యుద్ధం ఇబ్బందికర పరిణామాలకు దారి తీసిందని స్టార్మర్ అన్నారు. అగ్ర రాజ్యంతో పటిష్టమైన సంబంధాలు బ్రిటన్‌కు చాలా ముఖ్యమని చెప్పారు. అమెరికా భరించబోదు రష్యాతో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదంటూ జెలెన్స్కీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఆ దిశగా ఒప్పందం ఇప్పటికైతే సుదూరంలోనే ఉందన్నారు. వీటిపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘జెలెన్స్కీ చేసిన అత్యంత పనికిమాలిన ప్రకటన బహుశా ఇదే! ఆయనను అమెరికా ఇక ఎంతమాత్రమూ భరించబోదు’’ అని స్పష్టం చేశారు. ‘‘జెలెన్స్కీకి కావాల్సింది శాంతి కాదని మొదటినుంచీ చెప్తూనే ఉన్నా. అదే నిజమని మరోసారి తేలింది. అలాంటి వ్యక్తికి యూరప్ దేశాల సంఘీభావమా? అవి అసలు ఏమనుకుంటున్నాయి?’’ అంటూ మండిపడ్డారు. జెలెన్స్కీతో ట్రంప్ వాగ్యుద్ధం యాదృచ్ఛికమేమీ కాదని, పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని జర్మనీ కాబోయే చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అనుమానం వెలిబుచ్చారు. -
వైట్ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ షాక్ తగిలింది. ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు అంటే ఒక్క లీటరు చమురు ఇవ్వబోమని అమెరికా సైన్యానికి ఇంధనం సరఫరా చేసే నార్వే దేశ చమురు, యుద్ధనౌకల్ని సరఫరా చేసే హాల్ట్బ్యాక్ బంకర్స్ (Haltbakk Bunkers) సంస్థ ఖరాఖండీగా చెప్పేసింది. వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల (Volodymyr Zelensky)మధ్య మాటలు మంటలు రేపాయి. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇందుకు అమెరికా పెద్దన్నగా వ్యవరిస్తోంది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య బహిరంగంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని ట్రంప్ పట్టుబట్టారు. భవిష్యత్‌లో రష్యా మరోసారి దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తారా?, అందుకు మీరు భరోసా ఇస్తారా జెలెన్ స్కీ ఎదురు ప్రశ్నవేశారు. జెలెన్స్కీ ఎదురు ప్రశ్నించడంతో ట్రంప్,జేడీ వాన్స్ లు నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునేలా మాటమాట పెరిగింది.WOW. After yesterday’s Oval Office ambush of President Zelensky, Haltbakk Bunkers, one of Norway’s leading marine fuel providers, announced that it will no longer refuel U.S. Navy vessels, urging other European firms to follow suit.The United States is weaker and more isolated… pic.twitter.com/D9w32n1xBA— Republicans against Trump (@RpsAgainstTrump) March 1, 2025 ఈ పరిణామంలో ప్రపంచ దేశాలు వ్లాదిమిర్ జెలెన్స్కీకి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు జెలెన్స్కీకి బాసటగా నిలిచాయి. తాజాగా, నార్వేజియన్ దేశం మరో అడుగు ముందుకు వేసింది. చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని అమెరికాకు సరఫరా చేసే నార్వేజియన్ దేశ సంస్థ haltbakk బుంకెర్స్ కీలక ప్రకటన చేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో పహారా కాస్తున్న అమెరికా సైనిక బలగాలకు సరఫరా చేసే ఇంధనాన్ని తక్షణమే ఆపేస్తున్నట్లు వెల్లడించింది. అందుకు వాషింగ్టన్లో శుక్రవారం అమెరికా, ఉక్రెయిన్ దేశాల దౌత్య సమావేశంలో జరిగిన వివాదమేనని తెలుస్తోంది. హల్ట్ బ్యాక్ బంకర్స్ తన ప్రకటనలో 2024లో అమెరికా సైనిక బలగాలకు సుమారు 30,00,000 లీటర్ల ఇంధనాన్ని సరఫరా చేసింది. వైట్ హౌస్‌లో దేశాధ్యక్షుల మధ్య జరిగిన వాగ్వాదంలో జెలెన్స్కీకి అండగా నిలుస్తోంది. అందుకే మా సంస్థ అమెరికా సైనిక బలగాలకు ఇంధన సరఫరా చేయడం వెంటనే ఆపివేయాలని నిర్ణయించుకుంది’ అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఏమైందో ఏమో కొద్ది సేపటి తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసినట్లు సమాచారం. -
ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్స్కీ కీలక ట్వీట్
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య వైట్ హౌస్ వేదికగా జరిగిన చర్చలు పూర్తిగా విఫలం కావడమే కాదు.. ఆ చర్చ కాస్తా ‘ మూడో ప్రపంచ యుద్ధం’ అని ట్రంప్ నోట వచ్చే వరకూ వెళ్లింది. అంటే రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమంటూనే ట్రంప్ చెప్పిన ప్రతీ దానికి తలాడించలేదు జెలెన్ స్కీ. పూర్తిగా తమ భూభాగంపై ఎటువంటి కాల్పులు, బాంబుల మోత లేకుండా చూస్తామని అమెరికా తరఫున మీరు(ట్రంప్) మాటిస్తేనే మీతో వాణిజ్య ఖనిజాల ఒప్పందంపై సంతకం చేస్తామని కరాఖండీగా చెప్పేశారు జెలెన్ స్కీ.తమ భూ భాగంలో నివసిస్తే వేరే వాళ్ల పెత్తనం ఏమిటని జెలెన్ స్కీ కాస్త గట్టిగానే స్వరం వినిపించారు. ఇది ట్రంప్ కు నషాళానికి ఎక్కినట్లుంది. రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోకపోతే మూడో ప్రపంచం యుద్ధం వచ్చినా రావొచ్చు అని ట్రంప్ హెచ్చరించారు. దాంతో వారి మధ్య చర్చ సంగతి పక్కన పెడితే, వాగ్వాదమే ఎక్కువ కనిపించింది.ఇలా వాదోపవాదాల నడుమనే ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయకుండా వైట్ హౌస్ వీడారు జెలెన్ స్కీ. అయితే జెలెన్ స్కీ వైఖరి కచ్చితంగానే ఉందనే అభిప్రాయమో, ట్రంప్ పై కోపమో తెలీదు కానీ కొన్ని దేశాలు మాత్రం ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి. కెనడా, బ్రిటన్ తో సహా పలు కీలక దేశాలు జెలెన్ స్కీకి జై కొట్టాయి.మీ సపోర్ట్ ఎప్పుడూ కీలకమే.. కానీ మాకు స్వేచ్ఛ కూడా అవసరంఅయితే ఇలా ట్రంప్ తో వాదించి వెళ్లిన జెలెన్ స్కీ గురించి ప్రపంచం అంతా చర్చించుకునే తరుణం ఇది. అగ్రదేశం, ఆ దేశ అధ్యక్షుడ్ని ఎదిరించి వాదించిన సిసలైన నాయకుడు అని, ‘వీడు మగడ్రా బుజ్జి’ అని సోషల్ మీడియా వరల్డ్ అనుకుంటున్న తరుణం.. అయితే ట్రంప్ తో వాగ్వాదం తర్వాత జెలెన్స్కీ.. తమకు యూఎస్ సపోర్ట్ అనేది కీలకమని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ సపోర్ట్ చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా జెలెన్ స్కీ ట్వీట్ చేశారు. ‘ మీ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఇప్పటివరకూ రష్యాతో వార్ లో మాకు అందించిన ప్రతీ సహకారం మరువలేనింది. ఉక్రెయిన్ ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడే ఉంటారు.ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఆయన యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. యుద్ధాన్ని ముగించడానికి మా కంటే ఎక్కువ కోరుకునే వారు ఎవరూ ఉండరు. కానీ మేము యుద్ధంతోనే జీవనం సాగిస్తున్నాం. మా స్వాతంత్య్యం కోసం మేము చేస్తున్నా పోరాటం.. మా ప్రతీ ఒక్కరి ఆశయం, ఆశ కూడా మాకు స్వేచ్ఛగా మనుగడ సాగించడమే’ అని రాశారు. America’s help has been vital in helping us survive, and I want to acknowledge that. Despite the tough dialogue, we remain strategic partners. But we need to be honest and direct with each other to truly understand our shared goals.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025 It’s crucial for us to have President Trump’s support. He wants to end the war, but no one wants peace more than we do. We are the ones living this war in Ukraine. It’s a fight for our freedom, for our very survival.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025 -
సినెర్ నామినేషన్ ఉపసంహరణ.. కారణం ఇదే
లండన్: ప్రపంచ నంబర్‌వన్, ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘లారెస్’ అవార్డుకు దూరమయ్యాడు. ఇటీవల అతనిపై మూడు నెలల నిషేధం విధించడంతో ‘స్పోర్ట్స్ ఆస్కార్’గా ప్రఖ్యాతిగాంచిన ఈ అవార్డు బరిలో లేకుండా పోయాడు. లారెస్ ప్రపంచ క్రీడా అకాడమీ (ఎల్డబ్ల్యూఎస్ఏ) అతని నామినేషన్‌ను ఉపసంహరించింది. దీంతో సినెర్ రేసులో లేడు. ఈ విషయాన్ని ఎల్డబ్ల్యూఎస్ఏ చైర్మన్ సీన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ ధ్రువీకరించారు.ఇటలీ సూపర్‌స్టార్ సినెర్‌పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) విధించిన నిషేధం అమలవుతుండటంతో అవార్డు బరి నుంచి అతని పేరును తప్పించినట్లు తెలిపారు. ‘డోపింగ్ ఉదంతం దరిమిలా నిషేధంపై ‘వాడా’తో పాటు టెన్నిస్ వర్గాలతో చర్చించాం. నిషేధంలో ఉన్న ఆటగాడు విశ్వఖ్యాతిగాంచిన అవార్డు బరిలో ఉండటం సమంజసం కాదనే నిర్ణయానికి వచ్చాం. దీంతో సినెర్ నామినేషన్‌ను ఉపసంహరించాలని నిర్ణయించాం. దీనిపై సినెర్, అతని బృందానికి సమాచారమిచ్చాం’ అని ఫిట్జ్‌ప్యాట్రిక్ వెల్లడించారు. 23 ఏళ్ల సినెర్ గతేడాది మార్చిలోనే నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించింది.‘కావాలని తీసుకోలేదు. మర్ధన తైలం, లేదంటే ఇతరత్రా మందుల ద్వారా అది తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే’ యానిక్ స్వీయ వాంగ్మూలాన్ని ఐటీఐఏ పరిగణించి తదుపరి చర్యలు తీసుకోలేదు. దీన్ని యావత్ క్రీడావర్గాలు తప్పుబట్టాయి. ఐటీఐఏ పక్షపాత వైఖరిని గర్హించాయి. సెర్బియా దిగ్గజం జొకోవిచ్ సహా పలువురు టెన్నిస్ స్టార్లు... ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ని‘బంధనాలు’ అంటూ బాహాటంగానే దుమ్మెత్తి పోశారు. ‘వాడా’ సైతం అతని రెండు శాంపిల్స్ (నమూనాలు) పాజిటివ్ అని తేలాయి కాబట్టి కనీసం ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టుకు అప్పీల్ చేసింది. చివరకు సినెర్–ఐటీఐఏ–వాడాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 15న మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిషేధం విధించినప్పటికీ ఈ సీజన్లో అతని గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వేటకి ఏ ఇబ్బంది లేకపోయింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకున్న సినెర్... నిషేధం ముగిశాక తదుపరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ (మే 25 నుంచి)లో పోటీపడతాడు. ఇవీ చదవండిచెస్ ప్రపంచం సంతాపంఅంతర్జాతీయ చెస్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్ స్పాస్కీ (Boris Spassky-88) కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ చాంపియన్(Former World Champion) మరణించిన విషయాన్ని ‘ఫిడే’ గురువారం ప్రకటించింది. స్పాస్కీ మరణం పట్ల చెస్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. గ్యారీ కాస్పరోవ్, లెవాన్ ఆరోనియాన్, సుసాన్ పోల్గర్, విశ్వనాథన్ ఆనంద్ తదితరులు స్పాస్కీ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఫైనల్లో అనిరుద్ జోడీబెంగళూరు: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోరీ్నలో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) ద్వయం 6–4, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంటపై గెలుపొందింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు చెరో సెట్ సొంతం చేసుకున్నాయి.నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో అనిరుధ్–రే హో ద్వయం కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీతో అనిరుద్–రే హో జంట తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ 6–3, 7–6 (8/6)తో సిద్ధాంత్–పరీక్షిత్ (భారత్)లపై నెగ్గారు. -
చెస్ దిగ్గజం బోరిస్ స్పాస్కీ కన్నుమూత
అంతర్జాతీయ చెస్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్ స్పాస్కీ (88) మంగళవారం కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ చాంపియన్ మరణించిన విషయాన్ని ‘ఫిడే’ ప్రకటించింది. ప్రపంచ చెస్‌ను సోవియట్ యూనియన్ శాసిస్తున్న కాలంలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన వారిలో స్పాస్కీ కూడా ఒకడు.1969–1972 మధ్య అతను పదో వరల్డ్ చాంపియన్‌గా శిఖరాన నిలిచాడు. అయితే డిఫెండింగ్ చాంపియన్‌గా స్పాస్కీ బరిలోకి దిగిన 1972 వరల్డ్ చాంపియన్ పోరాటానికి ప్రపంచ చెస్‌లో ప్రత్యేక స్థానం ఉంది. సోవియట్ యూనియన్, అమెరికా మధ్య తీవ్ర వైరంతో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న ఆ కాలంలో స్పాస్కీతో అమెరికాకు చెందిన బాబీ ఫిషర్ చాలెంజర్‌గా తలపడ్డాడు. దాంతో ఈ సమరం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సమయంలో దీనికి ‘మ్యాచ్ ఆఫ్ ద సెంచరీ’గా గుర్తింపు వచి్చంది. సోవియట్ యూనియన్ వర్సెస్ అమెరికాగా మారిపోయిన ఈ 21 గేమ్‌ల పోరులో చివరకు 8.5–12.5 పాయింట్ల తేడాతో ఫిషర్ చేతిలో ఓడి స్పాస్కీ వరల్డ్ టైటిల్‌ను కోల్పోయాడు. నాలుగేళ్ల తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లి స్థిరపడిన స్పాస్కీ ఆ తర్వాత 21 ఏళ్ల పాటు ఆ దేశం తరఫున పోటీల్లో పాల్గొన్నా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 2013లో అతను తిరిగి స్వదేశానికి వచ్చేసి చివరి వరకు మాస్కోలోనే ఉండిపోయాడు. స్పాస్కీతో సమరంతో 1972లో జగజ్జేతగా నిలిచిన బాబీ ఫిషర్ 2008లోనే మరణించాడు.చదవండి: Champions Trophy: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. -
నేను అలా మాట్లాడానా?.. మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ట్రంప్ పలుమార్లు విమర్శలు గుప్పించారు. జెలెన్స్కీని టార్గెట్ చేసి నియంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా తాను అలా అనలేదంటూ ట్రంప్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమావేశం అయ్యారు. అనంతరం, ఇరువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించారు. ఇందుకు ట్రంప్ సమాధానం ఇస్తూ..‘నేను అలా అనలేదు కదా?. అలాంటా వ్యాఖ్యలు చేశానంటే నేనే నమ్మలేకపోతున్నాను. జెలెన్స్కీతో నాకు మంచి సంబంధాలున్నాయి. శనివారం మా ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరుగుతుందని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.ఇక, అంతకుముందు.. ట్రంప్, స్టార్మర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలంటే సంబంధిత చర్చల్లో ఉక్రెయిన్ను, ఐరోపా దేశాల నేతలను భాగస్వాముల్ని చేయాలని ఆయన కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో త్వరలో ట్రంప్ సమావేశం కానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధులెవ్వరూ లేకుండానే అమెరికా-రష్యా ప్రతినిధులు ఇటీవల చర్చించుకున్నప్పటి నుంచి ఇతర దేశాలు స్పందిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. జెలెన్స్కీ ఓ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని ట్రంప్ మండిపడ్డారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. Trump last week: Zelenskyy is a “dictator”Trump today: “Did I say that?” pic.twitter.com/kiCRee8Tbh— The Recount (@therecount) February 27, 2025 -
Russia-Ukraine war: మూడేళ్లలో 1,65,000 మంది రష్యా సైనికులు మృతి
మాస్కో: ఉక్రెయిన్‌తో పోరాడుతూ 165,000 సైనికులు మరణించారని రష్యన్ స్వతంత్ర వార్తా సైట్ మీడియాజోనా ప్రకటించింది. అందులో 95,000 మందికి పైగా సైనికుల వివరాలను పేర్లతో సహా వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లయిన సందర్భంగా సైనికుల మరణాలకు సంబంధించిన చిత్రాలు, అధికారిక సమాచారంతో కూడిన కథనాన్ని మీడియాజోనా సోమ వారం ప్రచురించింది. రష్యన్ కళాకారుడు వాసిలీ వెరెష్చాగిన్ 1,871లో ‘ది అపోథియోసిస్ ఆఫ్ వార్’చిత్రాన్ని వేలాది మంది సైనికుల ఫొటోల గ్రాఫిక్స్‌తో రూపొందించింది. ప్రతి ఎంట్రీలో సైనికుడి వయస్సు, మరణించిన తేదీ, ప్రాంతం, యూనిట్, అందుబాటులో ఉంటే ఫొటోలను కూడా ప్రచురించింది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు రష్యన్ మరణాల సంఖ్యను 393గా పేర్కొంది.రష్యన్ల మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు రెట్టింపవుతూ వచ్చిందని వెల్లడించింది. తమ విశ్లేషణ ప్రకారం 2024 యుద్ధంలో అత్యంత రక్తసిక్త సంవత్సరమని పేర్కొంది. 2022లో సుమారు 20,000, 2023లో సుమారు 50,000 మంది మరణించగా.. ఒక్క 2024లో 1,00,000 మంది చనిపోయాడని వెల్లడించింది. బీబీసీ రష్యన్ సర్వీస్, వలంటీర్ల బృందం సహకారంతో జాబితాను రూపొందించామని తెలిపింది. మౌనం వహించిన ప్రభుత్వం... దీనిపై వ్యాఖ్యానించడానికి క్రెమ్లిన్ నిరాకరించింది. ఈ ప్రచురణ గురించి తనకు తెలియదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. మరణాల సంఖ్యను ధ్రువీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు. ఇది నిజమో కాదో తనకు తెలియదని, మృతుల సంఖ్య సమాచారం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక హక్కని ఆయన అన్నారు. యుద్ధానికి సంబంధించిన మరణాల గణాంకాలను రష్యా చాలా అరుదుగా ఇస్తోంది. 2022 సెపె్టంబర్లో జరిగిన యుద్ధంలో 5,937 మంది సైనికులు మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అప్పట్లో తెలిపింది. మీడియాజోనాను రష్యన్ ప్రతి పక్ష కార్యకర్త ప్యోటర్ వెర్జిలోవ్ స్థాపించారు. కాగా, రష్యా ప్రభుత్వం మీడియాజోనాను ‘విదేశీ ఏజెంట్’గా ప్రకటించింది. వెర్జిలోవ్ను తీవ్రవాదుల జాబితాలో చేర్చింది. సైన్యం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని దోషిగా నిర్ధారించింది. మా సైనికులు 46 వేల మంది మరణించారు: జెలెన్స్కీ రష్యాతో యుద్ధంలో 46,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని, సుమారు 3,80,000 మంది గాయపడ్డారని అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. ఇతర అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కాగా, 70,000 మంది చనిపోయారని, 35,000 మంది గల్లంతయ్యారని తమ సైనిక వర్గాలు అంచనా వేశాయని స్వతంత్ర ఉక్రేనియన్ వార్ కరస్పాండెంట్ యూరీ బుటు సోవ్ డిసెంబరులో చెప్పారు. -
పుతిన్‌కు అండగా ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్ వైఖరి ఇదే..
ఐక్యరాజ్యసమితి: బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం గత మూడేళ్లుగా యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్నిరకాల సాయం చేస్తే తాజాగా ట్రంప్ సర్కార్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న ఉదంతం ఐక్యరాజ్యసమితి సాక్షిగా తొలిసారిగా బహిర్గతమైంది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో రష్యాను దురాక్రమణదారుగా పేర్కొంటూ యూరప్ దేశాలు చేసిన ఒక తీర్మానానికి ఎన్నో దేశాలు మద్దతు పలికితే అమెరికా వ్యతిరేకంగా ఓటేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇక, యుద్ధం మొదలుకావడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొండివైఖరే కారణమని పదేపదే ప్రస్తావిస్తున్న ట్రంప్ సర్కార్ వైఖరి సోమవారం ఐరాస వేదికగా తేటతెల్లమైంది. యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని, రష్యా సేనలు వెంటనే ఆక్రమణ భూభాగాల నుంచి వెనుతిరగాలని, పలు డిమాండ్లతో ఐరాసలో సోమవారం మూడు తీర్మానాలను పలు సభ్యదేశాలు ప్రతిపాదించాయి. ఒక బిల్లులో రష్యాను ఆక్రమణదారుగా పేర్కొన్నారు. అయితే రష్యాను ఆక్రమణదారుగా పేర్కొనడాన్ని సమర్థించబోనని అమెరికా తెగేసి చెప్పింది.రష్యా తప్పేంలేదన్నట్లు ప్రవర్తిస్తూ ఓటింగ్ వేళ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది. యూరప్ మిత్రదేశాలను కాదని ట్రంప్ సర్కార్ రష్యా అనుకూల వైఖరితో ముందుకెళ్లడం ఇప్పుడు యూరప్ దేశాల్లో చర్చనీయాంశమైంది. రష్యా సైన్యం తమ ప్రాదేశిక స్థలాల నుంచి వైదొలగాలని ఉక్రెయిన్ చేసిన ఒక తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా అమెరికా ఒత్తిడిచేసినట్లు తెలుస్తోంది. యూరప్ దేశాలు చేసిన మరో తీర్మానంలో ఓటేయకుండా అమెరికా దూరంగా ఉండిపోయింది. అమెరికా, యూరప్ దేశాల మధ్య సత్సంబంధాలు సన్నగిల్లుతు న్నాయనేది ఐరాస వేదికగా బహిర్గతమైంది.దూరంగా ఉండిపోయిన భారత్చర్చలు, సంప్రదింపుల ద్వారానే యు ద్ధాన్ని ముగించాలని మొదట్నుంచీ కోరుకుంటున్న భారత్ సైతం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. సర్వ ప్రతినిధి సభలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మా నంపై ఓటింగ్‌లో 176 దేశాలు పాల్గొనగా 93 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, ఉత్తరకొరియా సహా 18 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్, చైనా, ఇరాన్, ఇరాక్, బంగ్లాదేశ్, ఖతార్, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 65 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. ‘‘యుద్ధం కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇరుదేశాల మధ్య శాంతికి ప్రయత్నాలు చేద్దాం’’ అంటూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి ఫ్రాన్స్ మూడు సవరణలు సూచించింది. రష్యా కారణంగానే యుద్ధం మొదలైందని పేర్కొంది. దీనిపై రష్యా స్పందించింది. అసలు ఈ ఉద్రిక్తతలకు మూలకారణాలను ప్రస్తావించాలని రష్యా డిమాండ్ చేసింది. అయితే ఈ సవరణలను 93 దేశాలు సమర్థించగా 8 దేశాలువ్యతిరేకించాయి. 73 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. -
పుతిన్ నియంత కాదు: ట్రంప్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ‘నియంత’ అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘పుతిన్‌ను నియంతగా భావిస్తున్నారా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. తాను ఆ పదాలను అంత తేలికగా ఉపయోగించనని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అనంతరం సోమవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తే ఉక్రెయిన్‌లో యుద్ధం తొందరగా ముగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.‘‘మనం స్మార్ట్ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుందా అనేది కీలక చర్చనీయాంశమైంది. దీనిపై ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘సంప్రదింపులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే.. రష్యా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సంతకం చేయడానికి త్వరలోనే జెలెన్స్కీ అమెరికా వస్తారని ఆశిస్తున్నా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఏరోస్పేస్, వైద్య, సాంకేతిక పరిశ్రమలలో ఉపయోగించే కీలకమైన ఖనిజాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. అయితే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీవ్‌కు అందించిన 180 బిలియన్ డాలర్ల అమెరికన్ సహాయంలో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి ఖనిజాలపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చల అనంతరం పుతిన్‌ను కలుస్తానని ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందానికి పుతిన్ అంగీకరిస్తారని, అతను మరింత యుద్ధాన్ని కోరుకోవడం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదు: మాక్రాన్ అయితే.. ఉక్రెయిన్ సార్వబౌమత్వాన్ని పణంగా పెట్టి ఏ శాంతి ఒప్పందం జరగకూడదని మాక్రాన్ స్పష్టం చేశారు. ఏ శాంతి ఒప్పందంలోనైనా భద్రతా హామీలు ఉండాలని, శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదని మాక్రాన్ హెచ్చరించారు. ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపే ప్రతిపాదనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి పనిచేస్తామని మాక్రాన్ తెలిపారు. సుస్థిరత్వాన్ని ఏర్పరచడానికి యూరప్ సిద్ధంగా ఉందని, ఆ శాశ్వత శాంతిని సాధించడానికి బలమైన అమెరికా జోక్యం అవసరమని మాక్రాన్ నొక్కి చెప్పారు. అట్లాంటిక్ విభేదాలున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడితో చర్చలు ముందుకు సాగాయని మాక్రాన్ నొక్కి చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొత్త దౌత్య అవకాశం లభించిందన్నారు. -
మొత్తం ఖైదీల పరస్పర బదిలీకి సిద్ధం
కీవ్: రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు, ఇరుదేశాల్లో ఉన్న మొత్తం ఖైదీల మార్పి డికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయి న్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌పైకి రష్యా దండయాత్ర మొదలెట్టి సోమవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని కీవ్ నగరంలో జరిగిన సమావేశంలో జెలెన్స్కీ మాట్లాడారు. యుద్ధాన్ని ముగించే ప్రయ త్నంలో భాగంగా యుద్ధ ఖైదీల మార్పిడిని ఆయన ప్రతిపాదించారు. ‘ రష్యా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఉక్రేనియన్లను విడుదల చేయాలి. మా జైళ్లలోని రష్యన్లను మేం విడుదలచేస్తాం. యుద్ధ ఖైదీలందరినీ మార్పిడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. యుద్ధాన్ని ఇలా న్యాయబద్ధమైన మార్గంలో ముగిద్దాం’’ అని జెలెన్స్కీ అన్నారు. తమ దేశానికి నాటో సభ్యత్వం ఇస్తే ఉక్రెయిన్ అధ్యక్ష పదవి నుంచి వెంటనే వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఉక్రెయిన్ మూడేళ్ళ ప్రతిఘటనను, సైనికుల పోరాటపటిమ, వీరత్వాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంలో 2024 అక్టోబర్‌లో రష్యా, ఉక్రెయిన్ చెరో 95 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఖైదీల పరస్పర బదిలీ ప్రక్రియ ఇప్పటికి 58సార్లు జరిగింది. గత సెప్టెంబర్‌లో ఇరు దేశాలు 103 మంది ఖైదీలను విడుదల చేశాయి. భద్రతా సాయానికి బదులుగా కీలకమైన సహజ వనరులను సమకూర్చడంపై అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. -
జెలెన్స్కీ విషాదయోగం!
‘కర్ర గలవాడిదే బర్రె’ నానుడి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చాలా ఆలస్యంగా అర్థమైనట్టుంది. మూడేళ్లుగా అరువు తెచ్చుకున్న బలంతో రష్యా సేనలను ఢీకొడుతూ రేపో మాపో విజయం తన దేనన్న భ్రమల్లో బతికిన ఆయన, శాంతి కోసం పదవీత్యాగానికైనా సిద్ధమని తాజాగా ప్రకటించారు. అంతేకాదు... ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కావాలట! జో బైడెన్ హయాంలో ఆయనకు అటు డాలర్లూ, ఇటు మారణాయుధాలూ పుష్కలంగా వచ్చిపడ్డాయి. ఆ కాలంలో ఆయనకు ఎవరన్నా లెక్కలేకుండా పోయింది. నిరుడు ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సాధనలో భాగంగా తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీతో చర్చించారు. మోదీ వచ్చి వెళ్లిన వెంటనే ఆయన్ను హేళన చేస్తూ మాట్లాడారు. నియంతతో చేతులు కలిపి నీతులు బోధిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. దౌత్య మర్యాదల్ని అతిక్రమించారు. ఏడాది తిరగకుండా అంతా తలకిందులైంది. అణకువ ఒంటబట్టినట్టుంది. దురుసుగా, కఠినంగా, అవమానకరంగా మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవటానికి నానా పాట్లూ పడుతున్నారు. అందులో భాగంగానే తాజా ప్రతిపాదనలు చేశారు. వీటిని ట్రంప్ అంగీకరిస్తారని జెలెన్స్కీ ఎలా అనుకున్నారో అర్థంకాదు. ‘ఎన్నికల్లేకుండా అధికారం చలాయిస్తున్న నియంత’గా తనను నిందించిన ట్రంప్ పదవీ పరిత్యాగ ప్రకటనల్ని ఖాతరు చేస్తారనుకోవటం, మెచ్చుకోలు మాటలు మాట్లాడుతారనుకోవటం తెలివితక్కువతనం. నాటోకు తిలోదాకాలిచ్చేందుకు సిద్ధపడుతున్న ట్రంప్‌ను ఆ సంస్థ సభ్యత్వం ఇప్పించమనటం మూర్ఖత్వం.ఈ మూడేళ్ల యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ ముప్పుతిప్పలు పెట్టిన మాట వాస్తవం. అమెరికా, పాశ్చాత్య దేశాలు అందించిన క్షిపణులతో, డ్రోన్లతో రష్యా నగరాలపై దాడులు చేసి నష్టపరిచిన ఉదంతాలూ కోకొల్లలు. పర్యవసానంగా నేడో రేపో విజయం ఖాయమని భావించి దురాక్రమణకు దిగిన పుతిన్ అయోమయంలో పడిన సంగతి కూడా నిజం. ఒకపక్క అమెరికా, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలూ, మరోపక్క నేల రాలుతున్న సైనికుల ఉదంతాలూ, ధ్వంసమవుతున్న కీలక సైనిక స్థావరాలూ ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఉత్తర కొరియా నుంచి సైన్యాన్ని తీసుకొచ్చి రణరంగంలో ముందుకు నడిపించినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఇక దీన్నుంచి గౌరవప్రదంగా బయటికి రావాలనుకున్నా అన్ని దారులూ మూసుకు పోయాయి. చివరకు అణ్వాయుధాలనే నమ్ముకోక తప్పదన్న నిర్ణయానికి కూడా వచ్చారని కథనాలు వెలువడ్డాయి. నిజానికి ఆ ఒక్క భయమే అమెరికా, పాశ్చాత్య దేశాలను ముందుకు అడుగేయ నీయలేదు. మాటలకేం... కోటలు దాటేలా చెప్పారు. ఆచరణలో మాత్రం ఎంతసేపూ ఉక్రెయిన్ను ముందుకు తోసి లబ్ధి పొందుదామన్న ధ్యాస తప్ప అమెరికాకు మరేం పట్టలేదు. ఉక్రెయిన్ తీవ్ర నష్టాలు చవిచూసింది. గణనీయంగా భూభాగాన్ని కోల్పోయింది. తిరిగి స్వాధీనం చేసుకున్నవి సైతం అనంతర కాలంలో రష్యా సేనలకు చిక్కాయి. పట్టణాలు, నగరాలు శిథిలమయ్యాయి. ఒక దశలో సైన్యం చాలటం లేదని యువతీ యువకులకు సైనిక శిక్షణనిచ్చి ఉరికించారు. అయితే అదే మంత ఫలితం ఇవ్వలేదు. మొత్తంగా 3,80,000 మంది ఉక్రెయిన్ పౌరులు, సైనికులు గాయాల పాలయ్యారు. కాళ్లూ చేతులూ పోగొట్టుకున్న సైనికులు లక్షల్లోనే ఉంటారు. 46,000 మంది సైనికులు మరణించగా, వేలాదిమంది ఆచూకీ లేకుండా పోయారు. అనేకులు బందీలుగా చిక్కారు. ట్రంప్ దృష్టంతా ఉక్రెయిన్ నేలలో నిక్షిప్తమైవున్న అపురూప ఖనిజాలు, ఇతర సహజ వన రులపై ఉంది. మూడేళ్లుగా తాము 50,000 కోట్ల డాలర్లు ఖర్చుచేశామని అమెరికా లెక్కలు చెబు తోంది. కానీ అది 12,000 కోట్ల డాలర్లు మించదని ఉక్రెయిన్ మొత్తుకుంటున్నది. పది తరాల ఉక్రె యిన్ పౌరుల్ని పీల్చిపిప్పిచేసే అమెరికా ఒప్పందం ససేమిరా సమ్మతం కాదన్న జెలెన్స్కీ మొర వినే నాథుడే లేడు. ఇన్నాళ్లూ అమెరికా సలహాతో ఉక్రెయిన్‌కు అన్నివిధాలా అండదండలందించిన పాశ్చాత్య దేశాలు సైతం ట్రంప్‌ను ధిక్కరించదల్చుకుంటే తమతో మాట్లాడొద్దని చెప్పటం ఆయనకు మింగుడుపడటం లేదు. ఒకపక్క అమెరికా రూపొందిస్తున్న ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనల్ని పదిరోజులుగా ఉక్రెయిన్ వరసబెట్టి తిరస్కరిస్తుండగానే దాదాపు అంతా పూర్తయిందని, తుది దశ చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ అనటం జెలెన్స్కీని ఊపిరాడనివ్వటం లేదు. అమెరికా ప్రతిపాదన ఒప్పుకుంటే చమురు, సహజవాయువు, ఖనిజాలతోపాటు పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం సమర్పించుకోవాలి. తామిచ్చిన ప్రతి ఒక్క డాలర్‌కూ రెండు డాలర్లు చెల్లించాలన్నది అమెరికా డిమాండ్. ఇంత చేసినా ఉక్రెయిన్ రక్షణకు గ్యారెంటీ ఇవ్వటానికి తిరస్కరించటం, ముసాయిదా ఒప్పందంలో తొలుత ఉన్న ఆ మాటను తొలగించటం జెలెన్స్కీకి మింగుడుపడని అంశాలు.ఎవరో ప్రోత్సహిస్తే అక్రమంగా సింహాసనం అధిష్ఠించటం, ఎవరికోసమో పొరుగు దేశంపై తొడగొట్టడం ఎంత ఆత్మహత్యా సదృశమో వర్తమాన ఉక్రెయిన్ను చూసి అన్ని దేశాలూ గుణపాఠం నేర్చుకోవాలి. స్వీయప్రయోజనాలే సర్వస్వం అయిన యుగంలో బతుకుతూ అపరిపక్వతతో, అనాలోచితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు తననే కాటేస్తాయని జెలెన్స్కీ గ్రహించలేక పోయారు. ఒకనాడు అమెరికన్ కాంగ్రెస్‌లో యుద్ధ యోధుడిగా నీరాజనాలందుకున్న మనిషే ఇవాళ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మూడేళ్లలో ఎంత మార్పు! -
యుద్ధభూమిలో ఉక్రెయిన్.. మూడేళ్ళలో జరిగిన నష్టాలు
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమై.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజుకి (సోమవారం) నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం ఆ దేశ (ఉక్రెయిన్) ఆర్థిక వ్యవస్థ తిరోగమన సంకేతాలను సూచిస్తోంది. అలసిపోయిన దళాలు సైతం.. తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడుతూనే ఉన్నాయి.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, రష్యాతో శాంతి ఒప్పందాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ చర్చలలో ఉక్రెయిన్ భాగం కాకపోవడంతో.. కైవ్ దాని యూరోపియన్ మిత్రదేశాలు సైత షాక్‌కు గురయ్యాయి. అయితే యూరప్, కెనడా ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి.సోమవారం.. యూరప్, కెనడా నుంచి అగ్ర నాయకులు ఉక్రెయిన్‌కు తమ నిరంతర మద్దతును చూపించడానికి కైవ్ చేరుకున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా రాజధాని రైల్వే స్టేషన్లో ఉక్రేనియన్ అధికారులను కలిశారు.ఉక్రెయిన్ మనుగడ కోసం కాదుఈ పోరాటం.. కేవలం ఉక్రెయిన్ మనుగడ కోసం మాత్రమే కాదు, యూరప్ భవిష్యత్తు కోసం అని.. వాన్ డెర్ లేయన్ యూరప్ వైఖరిని స్పష్టం చేశారు. ముఖ్యంగా రష్యాతో ట్రంప్ శాంతి ప్రయత్నం.. కైవ్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉన్న ఒప్పందం గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సమయంలో, ఉక్రెయిన్ రక్షణను ఎలా బలోపేతం చేయాలనే దానిపై నాయకులు, అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు.యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తోంది, మాస్కోతో ప్రత్యక్ష చర్చలకు ఒత్తిడి తెస్తోంది. వారాంతంలో.. రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్, రాబోయే రోజుల్లో అమెరికా, రష్యా అధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతాయని ధృవీకరించారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ముఖాముఖి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.వ్లాదిమిర్ జెలెన్స్కీని.. ట్రంప్ నియంత అని అభివర్ణించారు. ట్రంప్ చర్యను ఎదుర్కోవడానికి యూరోపియన్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే.. యూరోపియన్ యూనియన్ మార్చి 6న బ్రస్సెల్స్‌లో తన ఉక్రెయిన్ విధానాన్ని చర్చించడానికి అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ నష్టాలుయుద్ధభూమిలో, ఉక్రెయిన్ భారీ నష్టాలను చూసింది. ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ ప్రకారం.. 2022 నుంచి ఉక్రెయిన్ తన భూమిలో దాదాపు 11% కోల్పోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు కోల్పోయిన మొత్తం భూమి 18 శాతం అని తెలుస్తోంది. ఇందులో క్రిమియా, డాన్‌బాస్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.దేశ జీడీపీ కూడా గణనీయంగా పడిపోయింది. రష్యాలో ధరల పెరుగుదల 9.5 శాతం ఉంటే.. ఉక్రెయిన్‌లో 12 శాతంగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం, యుద్ధం ప్రారంభంలో రష్యా స్థూల దేశీయోత్పత్తి (GDP) -1.3 శాతానికి పడిపోయింది. కానీ ఆ తర్వాత గత రెండు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 3.6 శాతానికి చేరుకుంది. కానీ ఇప్పుడు అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కారణంగా వివిధ రంగాలలో అమ్మకాలు మరియు ఆర్డర్లు పడిపోవడంతో రష్యన్ ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉక్రెయిన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం, ఈ సంవత్సరం GDP వృద్ధి 2.7 శాతానికి మందగించవచ్చని అంచనా.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?యుద్ధం కారణంగా.. 60 లక్షల కంటే ఎక్కువమంది ఉక్రేనియన్లు యూరప్‌కు పారిపోయారు. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్ అత్యధిక సంఖ్యలో ఆతిథ్యం ఇస్తున్నాయి. మరో 10 లక్షల అకంటే ఎక్కువమంది ఉక్రెయిన్లు రష్యాలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. యుద్ధంలో గాయపడిన, మరణించిన వారి సంఖ్య 40,000 కంటే ఎక్కువే. ఇందులో చాలామంది వైమానిక దాడులు, ఫిరంగి దాడులలో కన్నుమూశారు. మృతులలో 6,203 మంది పురుషులు, 669 మంది పిల్లలు ఉన్నారు. -
పుతిన్, జెలెన్స్కీ కలిసిపోవాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగియాలంటే జెలెన్ స్కీ, పుతిన్ కలిసిపోవాలని సూచించారు. ఇదే సమయంలో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ట్రంప్.రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య నేను కాల్పల విరమణను చూడాలనుకుంటున్నాను. ఆ ఒప్పందాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికైనా యుద్ధం ఆపాలని కోరుకుంటున్నాను. కీవ్, మాస్కో మధ్య యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలవాల్సిన అవసరం ఉంది. రెండు దేశాల్లో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి అది జరిగి తీరాలన్నారు.#WATCH | Washington | On the Russia-Ukraine conflict, US President Donald Trump says, "President Putin and President Zelenskyy have to get together because we want to stop the war and stop killing millions of people... I want to see a ceasefire, and I want to get the deal done...… pic.twitter.com/404opUoyGl— ANI (@ANI) February 21, 2025అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అమెరికాను పెద్దగా ప్రభావితం చేయదు. కానీ, యూరప్‌ను ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా అమెరికా భారీగా సాయం($300 బిలియన్ల) అందించింది. యూరప్ కూడా పెద్ద మొత్తంలో సాయం($100 బిలియన్ల) చేయాల్సి వచ్చింది. బైడెన్ వారికి డబ్బు ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో, ఖనిజ నిక్షేపాల్లో వాషింగ్టన్కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.మరోవైపు.. ట్రంప్ ఇప్పటికే జెలెన్స్కీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్స్కీ యుద్ధం వరకూ తీసుకొచ్చారని నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. -
అగ్ర రాజ్యాల స్నేహగీతం
రియాద్: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్నిరకాలుగానూ మూడేళ్లుగా దాదాపుగా వెలి వేసిన రష్యాతో ఏకంగా ఉన్నతస్థాయి చర్చలకు అమెరికా తెర తీసింది. దాని మిత్ర దేశం సౌదీ అరేబియా వేదికగా మంగళవారం జరిగిన ఈ చర్చలకు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ స్వయంగా సారథ్యం వహించడం విశేషం. సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అమెరికా, సౌదీ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదార్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ద్వైపాక్షిక బంధాలను మెరుగు పరుచుకోవడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడం ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. కానీ ఈ కీలక చర్చల్లో ఉక్రెయిన్‌కే ప్రాతినిధ్యం కల్పించకపోవడం విశేషం. దీనిపై ఆ దేశం తీవ్ర అసంతృప్తి వెలిగక్కింది. తమ భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఎలాంటి నిర్ణయాలనూ అంగీకరించబోయేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కుండబద్దలు కొట్టారు.ఉక్రెయిన్‌పై జరుపుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టడం ఏమేరకు సబబంటూ పలు యూరప్ దేశాలు కూడా నొసలు విరుస్తున్నాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో భావి కార్యాచరణపై యూరప్ దేశాలన్నీ సోమవారం కీలక సమావేశం జరపడం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయంగా సరికొత్త సమీకరణాలకు, పునరేకీకరణలకు దారితీసేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో ట్రంప్, పుతిన్ భేటీ ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిని చేయడం తెలిసిందే. అలా మూడేళ్లుగా అట్టడుగుకు దిగజారిన అమెరికా, రష్యా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా రూబియో, లవ్రోవ్ భేటీలో పలు నిర్ణయాలు జరిగాయి. వాషింగ్టన్, మాస్కో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు రూబియో మీడియాకు తెలిపారు.‘‘అలాగే ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీలైనంత త్వరగా భేటీ కానున్నారు. తేదీ తదితరాలు ఖరారు కావాల్సి ఉంది’’ అని వివరించారు. అధినేతలిద్దరూ గత వారం సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించుకోవడం తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ వెంటనే రష్యాపై యుద్ధంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తూ వస్తున్న సహాయ సహకారాలకు చాలావరకు తెర దించుతూ ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకున్నారు.ఈయూలో ఉక్రెయిన్ చేరికకు... అభ్యంతరం లేదు: రష్యాశాంతి చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి ద్మిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా అవసరమైతే జెలెన్స్కీతో చర్చలకు కూడా పుతిన్ సిద్ధమేనన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షునిగా జెలెన్స్కీ చట్టబద్ధతపైనే తమకు అభ్యంతరాలున్నాయంటూ మెలిక పెట్టారు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరడంపై తమకు అభ్యంతరాలు లేవన్నారు. ‘‘ఇలాంటివి ఒక దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన నిర్ణయాలు. వాటిలో వేలు పెట్టే ఉద్దేశం మాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు. కానీ రష్యా భద్రత తదితరాల దృష్ట్యా ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. -
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో రష్యా(Russia) ఓ అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో అవసమైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా దౌత్య వేత్తలతో రష్యా అధికారులు చర్చలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. మాస్కో నుంచి ఈ ప్రకటన వెలువడడం విశేషం.ఉక్రెయిన్ సంక్షోభం(Ukraine Crisis) ముగిసేలా ఓ ఒప్పందం కోసం ఈ సమావేశం జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆ చర్చల అజెండాపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోమని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక.. అమెరికాతో చర్చలు ఇరాన్‌తో సంబంధాలను దెబ్బ తీయొచ్చన్న వాదనను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. అయితే తమ ప్రతినిధులు లేకుండానే శాంతి చర్చలు జరుపుతుండడంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము లేకుండా జరిపే ఎలాంటి చర్చలకు, ఒప్పందాలకు తాము గుర్తింపు ఇవ్వబోమని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు నాటో దేశాలు కూడా రియాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకానొక దశలో.. ఇది మాస్కో-వాషింగ్టన్ మధ్య సంబంధాలు బలపర్చుకునే సమావేశాలుగానే నాటో మిత్రపక్షాలు భావిస్తున్నాయి. -
ఉక్రెయిన్‌పై ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్:రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి సంబంధించి తాము జరిపే చర్చల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్ను భాగస్వామిని చేస్తామని చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి16) ఫ్లోరిడాలో జరిగిన డేటోనా 500 కార్ రేసులకు విచ్చేసిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు.అయితే ఈ వారం సౌదీ అరేబియాలో జరిగే చర్చలకు జెలెన్స్కీ లేదా ఆయన ప్రతినిధులు హాజరవుతారా అన్నదానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. గత వారం రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ఫోన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సుదీర్ఘచర్చలు జరిపారు.దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో స్పందించారు.రష్యాతో జరిపే చర్చల్లో అమెరికా తమను కూడా భాగస్వామిని చేస్తే బాగుండేదన్నారు. అమెరికా మద్దతు లేకుండా తాము రష్యాను ఎదుర్కోలేమని, తాము ఎక్కువ కాలం జీవించలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కేవలం యుద్ధానికి విరామం ఇచ్చి ఇంకా శక్తి కూడగట్టుకుంటున్నారని చెప్పారు. యూరప్‌కు ఎప్పటికైనా రష్యాతో ముప్పు పొంచి ఉందని జెలెన్స్కీ హెచ్చరించారు. కాగా, గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ హయాంలో రష్యాతో యుద్ధం చేయడానికిగాను ఉక్రెయిన్‌కు భారీ సాయం అందిన విషయం తెలిసిందే. -
నవాల్నీ మృతికి ఏడాది
మాస్కో: వ్లాదిమిర్ పుతిన్ ఏకఛత్రాధిపత్యాన్ని ధిక్కరిస్తూ, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రష్యాలో కీలక విపక్షనేతగా ఎదిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అలెక్సీ నవాల్నీ మరణించి ఏడాది అయింది. ఈ ఏడాదిలో విపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చి ప్రభుత్వ వ్యతిరేకోద్యమాన్ని నడిపే సత్తా ఉన్న నేత లేకుండా పోయాడు. దాంతో రష్యా విపక్షాలు నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతున్నాయి. విపక్ష పార్టీల్లో ఐక్యత లోపించడం ప్రధాన సమస్యగా తయారైంది. 47 ఏళ్ల నవాల్నీ 2024 ఏడాది ఫిబ్రవరి 16న రష్యా మారుమూల ఆర్కిటిక్ ఖండ సమీపంలోని పీనల్ కాలనీ కారాగారంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆయన మరణానికి కారణాలను రష్యా వెల్లడించలేదు. దీంతో రష్యా ప్రభుత్వమే ఆయనను చంపేసిందని విపక్షాలు ఆరోపించాయి. 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు నవాల్నీపై నరాల సంబంధ విషప్రయోగం జరిగిన అంశాన్ని విపక్షాలు గుర్తుచేశాయి. నవాల్నీ మృతితో ఇప్పుడు పుతిన్ ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందని ఒలెగ్ ఇవనోవ్ వ్యాఖ్యానించారు. 2022లో ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడం మొదలెట్టాక నవాల్నీ మద్దతుదారు అయిన ఇవనోవ్ రష్యాను వీడి అమెరికాలోని లాస్ఏంజెలెస్లో స్థిరపడ్డారు. ‘‘ రష్యా విపక్షంలో ఇన్నాళ్లూ ఉన్న ఏకైక ఆశాదీపం నవాల్నీ. ఆ దీపాన్ని ఆర్పేశారు. ఇన్నాళ్లూ మా దేశంలో ఏదైనా మంచి మార్పు చోటుచేసుకుని, మంచి రోజులు వస్తాయని ఆశపడ్డాం. నవాల్నీ మరణంతో మా ఆశలు అడుగంటాయి. విపక్షాలు పుతిన్‌ను ఎదుర్కొంటాయన్న ఆశ దాదాపు పూర్తిగా చచ్చిపోయింది’’ అని ఇవనోవ్ ఆవేదన వ్యక్తంచేశారు. అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే నవాల్నీ మరణం తర్వాత ఆయన తరఫున వాదించిన లాయర్లనూ ‘తీవ్రవాదులు’గా పేర్కొంటూ పుతిన్ ప్రభుత్వం జైలుపాలుచేసింది. అరెస్టు భయంతో నవాల్నీ మద్దతుదారులు రష్యాను వీడారు. కొందరు స్వదేశంలో ఉన్నా మౌనంగా ఉండిపోయారు. -
మేం బతికే అవకాశాలు తక్కువే: ఉక్రెయిన్ అధ్యక్షుడు
కీవ్:రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ బతికి బట్టకట్టడం కష్టమేనన్నారు.డొనాల్డ్ ట్రంప్,పుతిన్‌ల మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చలపై జెలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.అమెరికా మద్దతు లేకుండా తాము జీవించే అవకాశాలు చాలా తక్కువ అని జెలెన్స్కీ అన్నారు. తమతో యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో యుద్ధానికి ఆయన మరింతగా సంసిద్ధమవుతున్నారని చెప్పారు.ఇంతేకాక రష్యాతో యూరప్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. యూరప్ ఇప్పటికైనా మేల్కొని,సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో యూరప్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.మరోవైపు రష్యాతో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకపోవడంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తంచేశారు. -
చెర్నోబిల్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తుందా?
-
రష్యా బీర్ క్యాన్‌పై మహాత్ముడి చిత్రం
న్యూఢిల్లీ: అహింస, మద్యపానం నిషేధం కోసం జీవితాంతం పోరాటం సాగించిన జాతిపితి మహాత్మాగాంధీ చిత్రం రష్యా బీర్ క్యాన్‌పై ప్రత్యక్షమైంది. రష్యాకు చెందిన రివార్ట్ అనే బీర్ బ్రాండ్‌పై మహాత్ముడి ఫొటోతోపాటు ఆయన సంతకాన్ని సైతం ముద్రించారు. సదరు కంపెనీ తీరపై సోషల్ మీడియాలో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్ క్యాన్ చిత్రాలను మాజీ ముఖ్యమంత్రి నందిని శతపథి మనవడు సుపర్నో శతపథి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని రష్యా దృష్టికి తీసుకెళ్లాలని, బీర్ క్యాన్‌పై గాం«దీజీ ఫొటో తొలగించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. మద్యపాన వ్యతిరేకి అయిన గాంధీజీ చిత్రాలన్ని బీర్ క్యాన్ ముద్రించి అమ్ముకోవడం తనకు ఆవేదనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ‘మీ మిత్రుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం చేరవేయండి, వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోండి’అని మోదీని కోరారు. సుపర్నో శతపథి షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది దీనిపై స్పందించారు. రష్యా బీర్ కంపెనీ తీరును తప్పుపట్టారు. -
రష్యా పైకి ‘ఆర్మీ ఆఫ్ యూరప్’
మ్యూనిక్: యూరప్ ఖండానికి అవసరమైన సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా లేదని అర్థమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో యూరప్ దేశాలు రష్యా దురాక్రమణ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘ఆర్మీ ఆఫ్ యూరప్’ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో జెలెన్స్కీ మాట్లాడారు. తమ ప్రమేయం లేకుండా, తమకు తెలియకుండా చేసుకునే ఒప్పందాలను ఉక్రెయిన్ అంగీకరించబోదని ఆయన తేల్చి చెప్పారు. అదేవిధంగా, యూరప్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు యూరప్ దేశాలకు కూడా ఆ చర్చల్లో స్థానం కల్పించాలన్నారు. శాంతి చర్చలు ప్రారంభించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయనీ విధంగా వ్యాఖ్యానించారు. యూరప్, అమెరికాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం ఇక ముగిసినట్లేనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు శుక్రవారం సదస్సులో పేర్కొన్న విషయాన్ని జెలెన్స్కీ గుర్తు చేస్తూ..‘ఇప్పటి నుంచి కొత్త పరిణామాలు సంభవించనున్నాయి. వీటికి యూరప్ సమాయత్తం కావాల్సి ఉంది’అని అన్నారు. ‘ఇతర దేశాల నుంచి మనకు బెదిరింపులు ఎదురైతే తమకు సంబంధం లేదని అమెరికా తెగేసి చెప్పేందుకు అవకాశముందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అమెరికాపై ఆధారపడకుండా యూరప్ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలంటూ గతంలో ఎందరో నేతలు చెప్పారు. అవును, మనకిప్పుడు సైన్యం కావాలి. అదే ఆర్మీ ఆఫ్ యూరప్’అని ఆయన స్పష్టం చేశారు.ముఖాముఖి చర్చలకు అంగీకరించడం ద్వారా పుతిన్ అమెరికాను ఏకాకిగా మార్చారన్నారు. -
రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్తత
-
రష్యన్ సైబర్ నేరస్తుడిని విడుదల చేసిన అమెరికా
వాషింగ్టన్: రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడానికి, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఖైదీల మార్పిడిలో భాగంగా బుధవారం రష్యాకు చెందిన సైబర్ నేరస్థుడు అలెగ్జాండర్ విన్నిక్ను అమెరికా విడుదల చేసింది. అమెరికన్ ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ను రష్యా విడుదల చేసినందుకు ప్రతిగా విన్నిక్ను విడుదలచేసినట్లు తెలుస్తోంది. విన్నిక్ మనీలాండరింగ్ ఆరోపణలపై 2017లో గ్రీస్‌లో అరెస్టయ్యారు. ఆయనను గ్రీస్ 2022లో అమెరికాకు అప్పగించింది. తన క్రిప్టోకరెన్సీ ఎక్సే్ఛంజ్ బీటీసీ–ఈ ద్వారా రాన్సమ్వేర్ దాడులు, ఐడీ చోరీ, మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు, ఇతర నేరాల ద్వారా 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నందుకు మనీలాండరింగ్ చట్టాల కింద విన్నిక్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేరాలను విన్నిక్ 2024 మేలో అంగీకరించాడు. అప్పటినుంచి జైలులో ఉన్నారు. మొత్తం 11 మంది విడుదల ఫోగెల్ విడుదల ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి తాము సరైన దిశలో వెళ్తున్నామనడానికి సంకేతమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్టŠజ్ అన్నారు. ఖైదీల మార్పిడి అమెరికా, రష్యాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పడానికి సహాయపడిందని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఇవి పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలే తప్ప ఉక్రెయిన్ కోణంలో చేస్తున్న పనులు కావని ఆయన స్పష్టంచేశారు. రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన బెలారస్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో అమెరికా పౌరుడిని కూడా విడుదల చేసినట్లు అమెరికా అధ్యక్షభవనం బుధవారం ప్రకటించింది. బెలారస్లో అన్యాయంగా నిర్బంధించబడిన ఒక అమెరికన్‌ను, ఇద్దరు రాజకీయ ఖైదీలు విడుదల అయ్యారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇతర దేశాల్లోని అమెరికా పౌరుల విడుదలకు కృషిచేస్తున్నామని రూబియో చెప్పారు. ఇవి ట్రంప్ మధ్యవర్తిత్వ సామర్థ్యానికి నిదర్శనమని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. గత నెలాఖరులో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విదేశ కారాగారాల నుంచి ఇప్పటిదాకా 11 మంది అమెరికన్లు విడుదలయ్యారు. -
పుతిన్‌తో ఫోన్ కాల్ ఎఫెక్ట్.. ఉక్రెయిన్‌కు షాకిచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై స్పందిస్తూ కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జెలెన్స్కీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.తాజాగా ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. అనంతరం, ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యా అధినేత పుతిన్‌తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించారు. అలాగని ఈ భేటీలో భారీ జప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడించారు.మరోవైపు.. రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్ బాంబు పేల్చారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణల్లోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. అలాగే, కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో, ఉక్రెయిన్‌కు డబుల్ స్ట్రోక్ తగిలింది.REPORTER: The borders and the lack of NATO membership -- ultimately these are both demands Russia has made. Is there not a danger of handing Russia a win?TRUMP: Well I think if you look at the war, the way the war is going, you'll have to make your own determination pic.twitter.com/ZGQru3Of2g— Aaron Rupar (@atrupar) February 12, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్‌తో ఫోన్‌కాల్ చర్చలపై జెలెన్స్కీ స్పందిస్తూ..‘మా మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయి. కీవ్‌లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడుకొన్నాం. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయి. తాను, పుతిన్‌తో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్, రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
రష్యా చెర నుంచి విడుదలైన అమెరికా టీచర్
వాషింగ్టన్: అన్యాయంగా రష్యా కారాగారంలో మూడేళ్లు జైలు జీవితం అనుభవించిన అమెరికాకు చెందిన ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ ఎట్టకేలకు ట్రంప్ ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. రష్యా నుంచి బయల్దేరిన ఫోగెల్ మంగళవారం రాత్రి అమెరికాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వైమానిక స్థావరంలో దిగారు. తర్వాత నేరుగా అధ్యక్ష భవనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. తన విడుదలకు అవిశ్రాంతంగా కృషిచేసినందుకు ట్రంప్‌కు ఆయన మనసారా కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో మాట్లాడి యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించిన వేళ పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ స్వయంగా రష్యాకు వెళ్లిమరీ ఉపాధ్యాయుడిని వెంట తీసుకురావడం విశేషం. తమ పౌరుని విడుదల కోసం చూపిన స్థాయిలోనే ట్రంప్ సర్కార్ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం చొరవ చూపుతుందని శ్వేతసౌధం ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ ఇదే చొరవను కొనసాగించాలని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తంచేశాయి. ఎవరీ ఫోగెల్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఫోగెల్ రష్యాలోని మాస్కో సిటీలో ఆంగ్లో– అమెరికన్ పాఠశాలలో దశాబ్దకాలంపాటు టీచర్‌గా చరిత్ర పాఠ్యాంశాలను బోధించారు. ఉపాధ్యాయునిగా ఉన్న కాలంలోనే మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో 2021 ఆగస్ట్‌లో ఆయనను రష్యా పోలీసులు అరెస్ట్‌చేశారు. చట్టవ్యతిరేకంగా 17 గ్రాముల గంజాయిని రష్యాకు తీసుకొస్తున్నారని ఆయనపై నేరాభియోగాలు మోపింది. 2022 జూన్‌లో ఆయనకు 14 ఏళ్ల జైలుశిక్ష వేశారు. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తీవ్రమైన వెన్ను సమస్య కారణంగా వైద్యుల సలహా మేరకే ఆయన గంజాయిని వాడుతూ, వెంట తెచ్చుకున్నారని అమెరికా పేర్కొంది. ఈయనను ‘‘పొరపాటున అరెస్ట్‌కు గురైన వ్యక్తి’గా అమెరికా అభివరి్ణంచింది. ఎలాగైనా ఆయనను విడుదలచేసి తీసుకొస్తామని నాటి బైడెన్ ప్రభుత్వం చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా అమెరికా జైళ్లో మగ్గిపోతున్న ఒక రష్యా పౌరుడిని విడుదలచేసి అందుకు ప్రతిగా టీచర్ ఫోగెల్ విడుదలను ట్రంప్ సుసాధ్యం చేశారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ ఖైదీల పరస్పర మారి్పడి అంశంపై వైట్‌హౌస్ స్పందించలేదు. త్వరలో మరో అమెరికన్ విడుదలై స్వదేశానికి రాబోతున్నారని తెలుస్తోంది. -
ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం అసాధ్యం
బ్రస్సెల్స్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపుతానంటూ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మొదటిసారిగా బుధవారం నాటో ప్రధాన కార్యాలయంలో ‘ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్’సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం అసాధ్యమన్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వంతో శాంతి ఒప్పందం కార్యరూపం దాలుస్తుందనే విశ్వాసం తనకు లేదన్నారు. అంతర్జాతీయ బలగాల దన్నుతో ఆ దేశం రష్యాతో చర్చలకు, శాంతి ఒప్పందానికి సిద్ధ పడాలని సూచించారు. అంతేకాదు, 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వదులు కోవాల న్నారు. ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు ఏ మేరకు సైనిక, ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉందో తెలుసుకోవాలనుకున్న నాటో దేశాలకు ఈ వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు. అంతేకాదు, ఉక్రెయిన్ రక్షణ, ఆర్థిక, సైనిక పరమైన అంశాలను ఇకపై యూరప్ దేశాలే చూసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని కూడా హెగ్సెత్ బాంబు పేల్చారు. ఒక వేళ శాంతి పరిరక్షక బలగాల అవసరముంటే అందులో అమెరికా బలగాల పాత్ర ఉండబోదని కూడా తేల్చేశారు. ఈ బలగాలతో రష్యా ఆర్మీకి ఘర్షణ తలెత్తే సందర్భాల్లో అమెరికా లేదా నాటో దేశాల నుంచి ఎటువంటి రక్షణలు కల్పించలేమన్నారు. ఉక్రెయిన్ కోరుతున్న భూభాగంలో కొంత ప్రాంతాన్ని రష్యా ఉంచుకుంటుందన్నారు. ‘ బదులుగా సమర్థమైన యూరప్, లేదా నాన్ యూరప్ బలగాలతో భద్రత కల్పించడం మంచిది. ఏదేమైనా, ఎలాంటి భద్రతా ఒప్పందం కుదిరినా ఉక్రెయిన్‌లో అమెరికా బలగాలను మోహరించబోం. ఉక్రెయిన్‌లో భవిష్యత్తులో చేపట్టే ఎలాంటి మిలటరీ మిషన్‌కైనా నాటోకు, సభ్య దేశాలకు ఎలాంటి పాత్రా ఉండదు. నాటోలోని ఏ దేశంపై దాడి జరిగినా మిగతా దేశాలన్నీ రక్షణగా నిలవాలన్న ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఉక్రెయిన్‌కు భవిష్యత్తులో అవసరమయ్యే సైనిక, ఇతరత్రా సాయంలో ఎక్కువ భాగాన్ని యూరప్ దేశాలే చూసుకోవాల్సి ఉంటుంది’అని కుండబద్దలు కొట్టారు. అయితే, హెగ్సెత్ చెప్పిన అంశాలు త్వరలోనే మూనిక్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ఇతర అధికారులతో జరిగే సదస్సులో జరిగే చర్చలను మరింత సంక్లిష్టంగా మారు స్తాయని భావిస్తున్నారు. -
ఉక్రెయిన్‌కు రష్యా ఝలక్
మాస్కో: ఉక్రెయిన్‌కు రష్యా ఝలక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనను మాస్కో వర్గాలు తోసిపుచ్చాయి శాంతి ఒప్పందంలో భాగంగా.. భూభాగాల పరస్పర మార్పిడికి సిద్ధమని జెలెన్స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు తమ దేశం ఏనాటికీ అంగీకరించబోమని రష్యా ప్రకటించింది.ఇది ఎన్నటికీ జరగదు. రష్యా తన భూభాగాన్ని మార్పిడి చేసే అంశాన్ని ఎన్నడూ చర్చించలేదు.. చర్చించబోదు కూడా అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా భూభాగాల్లో అడుగుపెట్టిన ఉక్రెయిన్ బలగాలను తరిమి కొట్టడం లేదంటే నాశనం చేస్తుందని పేర్కొన్నారాయన. రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచి పెట్టాలని జెలెన్స్కీ షరతు విధించారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ నడుస్తున్న వేళ.. కీవ్‌పై రష్యా బలగాలు డ్రోన్ దాడులు జరపగా ఒకరు మరణించారు. మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో.. శాంతి చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని జెలెన్స్కీ కోరుతున్నారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని చెబుతున్నారు. -
పుతిన్‌కు షరతు.. అమెరికాకు జెలెన్ స్కీ బంపరాఫర్!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా(Russia) ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను పుతిన్ విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను అప్పగిస్తామని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చొరవ చూపాలని చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యాతో భూభాగ మార్పిడికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచిపెడితే మా అధీనంలో ఉన్న కుర్స్క్‌ను వారికి అప్పగిస్తామం’ అని అన్నారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు. రష్యా నుంచి తమ భూభాగాలను ఉక్రెయిన్‌కు అప్పగించినందుకు అమెరికాలో పలు ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జెలెన్ స్కీ ప్రకటించారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డోనెస్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జాపోరిజ్జియా ప్రాంతాలను తన నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై పుతిన్‌కు మాత్రం పూర్తి నియంత్రణ లేదు. ఉక్రెయిన్‌పై యుద్దం సందర్భంగా కూడా రష్యా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.JUST IN: 🇺🇦🇷🇺 Ukrainian President Zelensky says he's prepared to offer a territory swap with Russia as part of peace deal negotiations to end the war. pic.twitter.com/N9w9uoYfnl— BRICS News (@BRICSinfo) February 11, 2025 -
ఉక్రెయిన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్:రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్దాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చు..కాకపోవచ్చు అని ట్రంప్ అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయినియన్లు.. రష్యన్లు కావొచ్చు..కాకపోవచ్చన్నారు. ఈ విషయంలో ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి రావొచ్చు రాకపోవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రష్యా,ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్ను త్వరలో ఉక్రెయిన్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చేవారం మ్యానిచ్‌లో జెలెన్స్కీతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఉక్రెయిన్‌పై తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా,సుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. -
శీతల దేశాల నేస్తం.. మార్కాపురం పలక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం అంటే.. అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ‘పలక’. ఆ పలక మీద ఓనమాలు నేర్చుకున్న ఎన్నో చిట్టి చేతులు.. ఉన్నతస్థానాలకు చేరాయి. అలాగే ఎన్నో శీతల దేశాలు కూడా మార్కాపురం పలక(Markapuram Matti Palaka)లను అక్కున చేర్చుకున్నాయి. మన దేశంలో వీటిని అక్షరాలు దిద్దేందుకు వినియోగిస్తే.. శీతల దేశాల్లో గృహ నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల బయట గడ్డ కట్టే చలి ఉన్నా.. గదిలో మాత్రం వెచ్చగా ఉంటుంది. అందుకే వీటికి శీతల దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రాసుకునే పలకల నుంచి డిజైన్ స్లేట్స్ వైపు అడుగులు.. పలకల గనులు మార్కాపురంతో పాటు తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో హరియాణా, రాజస్థాన్ ప్రాంతాల్లో పలకల గనులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా మార్కాపురం నుంచే పలకలు ఎగుమతి అవుతుంటాయి. 80, 90 దశకాల్లో వ్యాపారం జోరుగా సాగింది. ఆ రోజుల్లో ఏ చిన్నారి చేతిలో చూసినా మార్కాపురం పలకే ఉండేది.ఈ ప్రాంతంలో 100కి పైగా గనుల్లో కార్యకలాపాలు సాగేవి. వేలాది మంది గడ్డపారలు, సుత్తులతో పలకలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా తీసేవారు. అయితే కాలక్రమేణా రాసుకునే పలకల వినియోగం తగ్గడంతో వ్యాపారులు, తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు. గృహ నిర్మాణాల్లో ఉపయోగించేలా పలకల తయారీ మొదలుపెట్టారు. వీటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. చైనాతో పోటీ.. కరోనాతో డీలా అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, వియత్నాం, మలేసియా, సింగపూర్, ఇంగ్లండ్ తదితర దేశాలకు మార్కాపురం నుంచి పలకలను ఎగుమతి చేస్తుంటారు. క్రిస్మస్ వస్తుందంటే చాలు అమెరికా, ఇంగ్లండ్, రష్యా తదితరæ దేశాల్లో పాత డిజైన్ స్లేట్లను తొలగించి కొత్త వాటిని అమర్చుకుంటూ ఉంటారు. దీంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండేది. అదే సమయంలో చైనా కూడా భారీగా ఎగుమతులు మొదలుపెట్టారు. ఈ పోటీని తట్టుకుంటున్న సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం తలెత్తడంతో ఎగుమతులకు ఆటంకాలు ఎదురయ్యాయి.కరోనా తర్వాత ఈ పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింది. చాలా పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులతో మూతపడ్డాయి. కొందరు మాత్రమే ఎగుమతులు ప్రారంభించారు. మళ్లీ పుంజుకుంటున్న సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఎగుమతులపై పడింది. పలకల కంటైనర్లను సముద్రం ద్వారా పంపే ఖర్చు రెట్టింపు అయ్యింది. దీంతో ఎగుమతులు భారమయ్యాయని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కలిసొచ్చేనా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. చైనాకు, ఆ దేశానికి మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. పోటాపోటీగా దిగుమతి సుంకాలను పెంచుకుంటున్నాయి. దీంతో అమెరికాలో చైనా పలకల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మళ్లీ మార్కాపురం పలకలకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వ భవనాలకు మార్కాపురం డిజైన్ స్లేట్స్‌ను ఉపయోగించాలి. అలాగే ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఉచితంగా పలకలు ఇవ్వాలి. దీని వల్ల వేలాది మంది కార్మి కులకు పని దొరకడంతో పాటు పరిశ్రమ పుంజుకుంటుంది. అలాగే పలకల ఫ్యాక్టరీల యజమానులకు సబ్సిడీపై రుణాలు అందించాలి. కరెంటు చార్జీలతో పాటు క్వారీ చార్జీలను తగ్గించి.. ప్రభుత్వం ఆదుకోవాలి. – బట్టగిరి తిరుపతిరెడ్డి, డిజైన్ స్లేట్ వ్యాపారి -
ఉక్రెయిన్ భీకర దాడులు.. రష్యాలో విమానాల నిలిపివేత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉధృతమైంది. తాజా దాడుల నేపథ్యంతో కీవ్ సైన్యం రష్యా భూభాగాల్లో విరుచుకుపడుతోంది. అక్కడి ఇంధన స్థావరాల నాశనమే లక్ష్యంగా ముందుకు పోతోంది. దీంతో అప్రమత్తమైనట్లు మాస్కో వర్గాలు ప్రకటించుకున్నాయి. అస్ట్రాఖాన్ రీజియన్‌లోని ఇంధన స్థావరం ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని జరిపిందని అక్కడి గవర్నర్ ఇగోర్ బాబుష్కిన్ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఆ దాడిలో ఎటు వంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారాయన. అదే రీజియన్‌లోని గ్లాస్ ప్లాంట్‌పైనా, మరో ఎనర్జీ సెంటర్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులను కీవ్ వర్గాలు ధృవీకరించాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో.. అస్ట్రాఖాన్తో పాటు పలు రీజియన్లకు విమానాల సర్వీసులను రద్దు చేసినట్లు ఆ దేశ పౌరవిమానాయాన విభాగం రోసావయాట్షియా ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి.. రష్యాలోని ఎనర్జీ, రవాణా, సైన్య సంబంధిత ఉత్పత్తుల కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తూనే ఉంది.ఇదీ చదవండి: స్కూల్‌పై క్షిపణి దాడి.. పుతిన్‌దే బాధ్యత! -
బోర్డింగ్ స్కూల్‌పై దాడి.. రష్యా- ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు
కీవ్: రష్యాలోని కుర్స్క్ పరిధిలో గల సుడ్జా నగరంలోని ఒక బోర్డింగ్ స్కూల్‌పై దాడి జరిగింది. దీనిపై ఉక్రెయిన్, రష్యాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నగరం గత ఐదు నెలలుగా ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఈ దాడిలో నలుగురు మృతిచెందారని, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపారు. భవనం శిథిలాల నుంచి 84 మందిని ఉక్రెయిన్ దళాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయని ఉక్రెయిన్ తెలిపింది. పౌరులకు ఆశ్రయం కల్పించిన బోర్డింగ్ స్కూల్‌పై మాస్కో బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.ఆదివారం తెల్లవారుజామున పాఠశాలపై ఉక్రెయిన్ సైన్యం క్షిపణి దాడి చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించారని పేర్కొంది. ఇదిలా ఉండగా, శనివారం ఉక్రెయిన్‌లోని పోల్టావా నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌పై రష్యా సాగించిన క్షిపణి దాడిలో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగిందని, వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం తెలిపింది. ఐదు అంతస్తుల భవనంపై జరిగిన ఈ దాడిలో 17 మంది గాయపడ్డారని సమాచారం.మాస్కో ఉక్రెయిన్‌పై 55 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం రాత్రికి రాత్రే 40 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. ఖార్కివ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ సిన్యుహుబోవ్ తెలిపారు. పశ్చిమ రష్యాలోని ఐదు ప్రాంతాలలో రాత్రిపూట ఐదు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కుర్స్క్ ప్రాంతంలో మూడు డ్రోన్లను, బెల్గోరోడ్, బ్రయాన్స్క్ ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించారని ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మీడియాకు తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం -
నార్త్ కొరియా సైన్యం ఎక్కడ.. పుతిన్ ప్లాన్ మార్చాడా?
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ దళాలతో ధీటుగా పోరాడలేక ఉత్తర కొరియా సైనికులు తమ దేశానికి వెనుదిరుగుతున్నట్టు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. కిమ్ దళాలు దాదాపు ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయినట్టు తెలిపారు. ఈ క్రమంలో తాము పైచేయి సాధించినట్టు చెప్పుకొచ్చారు.తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ప్రతినిధి ఒలెక్సాండర్ కిండ్రాటెంకో మాట్లాడుతూ.. ‘గత మూడు వారాలుగా మాతో యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదు. మా సైనికుల చేతిలో ఓడిపోయి భారీ నష్టాలు చవిచూడటంతో వారు వెనుదిరిగినట్లు విశ్వసిస్తున్నాం. నార్త్ కొరియాకు చెందిన సైనికులు ఎక్కడా కనిపించడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక.. ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 వేల మంది కిమ్ సైనికులు సాయపడుతున్నారు. ప్రత్యేక శిక్షణ అనంతరం వీరిని కదన రంగంలో దింపినప్పటికీ.. మాస్కో, కొరియన్ సైనికుల మధ్య భాష సమస్య కారణంగా సమన్వయం లోపించింది. ఈక్రమంలోనే కిమ్ సైనికులు తమ దళాల చేతిలో మృతి చెందుతున్నారని కీవ్ ప్రకటించింది.మరోవైపు.. ఉక్రెయిన్ అధికారుల వ్యాఖ్యలపై రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ ఘాటు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ అధికారులు చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదు. దీనిలో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ప్రతిసారీ వ్యాఖ్యానించలేం అంటూ కొట్టిపారేశారు.ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ చేసిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు. అనంతరం.. యుద్ధం నిలిపేసేందుకు ఇరు దేశాధ్యక్షులు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఇదే సమయంలో ఈ చర్చలకు వచ్చేందుకు రష్యా నిరాకరిస్తే వారిపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తికరంగా మారింది.North Korea sent troops to aid Russia in its war against Ukraine. But after months of severe losses, they have been taken off the front line. pic.twitter.com/l92MDNiW48— ☻Joanna (@joanna952544) January 31, 2025 -
‘నేనంటే పుతిన్‌కు భయం’
కీవ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌పై (vladimir putin) ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) సెటైర్లు వేశారు. మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్నా మాతో చర్చలు జరిపేందుకు పుతిన్ భయపడుతున్నారు. శక్తివంతమైన నేత భయపడుతున్నారు’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఉక్రెయిన్-రష్యాల దేశాల యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ (donald trump) స్పందించారు. ఇరు దేశాదినేతలు యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి చర్చలు జరపాలని హితువు పలికారు. లేదంటే ఇరు దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే, ట్రంప్ హెచ్చరికలపై పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా మార్షల్‌లా విధించిన జెలెన్స్కీతో తాము చర్చలు జరపబోమన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు మేం సిద్ధం. జెలెన్స్కీ మాతో జరిగే చర్చల్లో పాల్గొంటే. నేను పాల్గొనను. మా తరుఫున ప్రతినిధుల్ని పంపిస్తాం. చర్చలు కూడా మాకు అనుకూలంగా జరగగాలి’ అని వ్యాఖ్యనించారు. Today, Putin once again confirmed that he is afraid of negotiations, afraid of strong leaders, and does everything possible to prolong the war. Every move he makes and all his cynical tricks are aimed at making the war endless.In 2014, Russia started a hybrid war against…— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 28, 2025పుతిన్ నిర్ణయంపై జెలెన్ స్కీ మండి పడ్డారు. పుతిన్ స్వార్ధపరడు. మూడేళ్లుగా యుద్ధం జరగుతుంటే కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మాతో మాట్లాడేందుకు పుతిన్ .. అదే అత్యంత శక్తివంతమైన నేత భయపడుతున్నారు.యుద్ధంపై అమెరికా-రష్యాలు చర్చలు జరిపితే అందులో ఉక్రెయిన్ పాల్గొనకపోతే ఎలా? అదే జరిగితే మా ప్రయోజనాలు దెబ్బతినట్లే. తన స్వలాభం కోసం పుతిన్ తన చర్యల ద్వారా డొనాల్డ్ ట్రంప్‌ను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన శాంతికి రష్యా కట్టుబడి ఉంటే యుద్ధానికి ముగింపు పలకొచ్చు. కానీ పుతిన్ ఆ పని మాత్రం చేయరు. ఉద్దేశ్యపూర్వకంగా చర్చలు జరపకుండా.. యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇష్టపడతారని’ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 👉చదవండి : మతిలేని యుద్ధం ఆపండి -
‘పుతిన్ హత్యకు అమెరికా కుట్ర?’
వాషింగ్టన్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ను హతమార్చేందుకు అమెరికా ప్రయత్నించింది. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అందుకు కారణం ప్రముఖ అమెరికన్ పండిట్, మాజీ ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్సన్ (Tucker Carlson)..తన ‘ది టక్కర్ కార్లసన్ షో’ పాడ్‌కాస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ రచయిత మాట్ తైబీతో పాడ్‌కాస్ట్‌లో కార్ల్సన్ మాట్లాడుతూ.. పుతిన్‌ను హత్య చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపణలు చేశారు. జోబైడెన్ ప్రభుత్వం పుతిన్‌ను చంపేందుకు ప్రయత్నించింది. ఇది పిచ్చి, మతిలేని చర్య అని అన్నారు. 🇺🇸🇷🇺 Tucker Carlson said that the Biden administration tried to kill Vladimir PutinThe goal is to start World War III and sow chaos. Carlson said this during an interview with journalist Matt Taibbi. pic.twitter.com/k7STerZxFg— Маrina Wolf (@volkova_ma57183) January 28, 2025అయితే, కార్లసన్ వ్యాఖ్యల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని జోబైడెన్ మద్దతు దారులు స్పష్టం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని, అందుకు అర్ధం పర్ధంలేని ఆధారాల్ని టెలికాస్ట్ చేసి ఫాక్స్ న్యూస్‌లో ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు పుతిన్‌ను హత్య చేసేందుకు జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించిన కార్లసన్ అందుకు తగిన ఆధారాల్ని ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా స్పందించలేదు, అయితే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ విషయంపై వ్యాఖ్యానించారు, పుతిన్ భద్రతను నిర్ధారించడానికి రష్యన్ ప్రత్యేక సేవలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. -
మతిలేని యుద్ధం ఆపండి
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో మతిలేని యుద్ధానికి ఇకనైనా తెరదించాలని రష్యా అధినేత పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హితవు పలికారు. యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్‌తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో సాధ్యమైనంత త్వరగా సమావేశమవుతానని చెప్పారు. యుద్ధం ఆపకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధించక తప్పదని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆంక్షల భయంతో పుతిన్ వెనక్కి తగ్గుతారని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అది నాకు తెలియదు అని ట్రంప్ బదులిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధక్షేత్రంలో అమాయకులు బలైపోతున్నారని, అందుకే తక్షణమే ఆ యుద్ధం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు. రష్యాతో సంధికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. అబార్షన్ వ్యతిరేక ఉద్యమకారులకు ట్రంప్ క్షమాభిక్షషికాగో: అబార్షన్లకు వ్యతిరేకంగా క్లినిక్‌ల వద్ద నిరసన తెలిపిన ఉద్యమకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వీరికి శిక్షలు విధించడం సరికాదని తెలిపారు. 2020 అక్టోబర్‌లో వాషింగ్టన్‌లోని అబార్షన్ క్లినిక్‌ను దిగ్బంధించి, తలుపులు మూసి తాళాలు వేసి నిరసన తెలిపిన లారెన్ హార్డీతోపాటు మరో 9 మంది సహ నిందితులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రకటన వర్తించనుంది. -
ట్రంప్‌తో చర్చలకు పుతిన్ రెడీ: రష్యా
మాస్కో: డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే ఈ విషయమై అమెరికా నుంచి స్పందన కోసం వేచి చేస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల అధినేతల మధ్య భేటీ త్వరలో ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం రష్యా స్పష్టత ఇవ్వలేదు.దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్ వర్చువల్‌గా మాట్లాడారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా,చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అయితే ట్రంప్ చేస్తున్న ఈ వాదనతో రష్యా మాత్రం ఏకీభవించలేదు. చమురు ధరలకు తాము యుద్ధం ఆపడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది. -
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
-
ఉక్రెయిన్ యుద్ధంలో అంతిమ క్రీడలు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనుండగా, రష్యా–ఉక్రెయిన్లు... యుద్ధంలో చివరి దశ క్రీడలు సాగిస్తున్నాయి. ట్రంప్ ఈ సమస్య పరిష్కారానికి తన ప్రతినిధిగా జనరల్ కీత్ కెల్లోగ్ అనే అనుభవజ్ఞుడిని నియమించారు. ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారైన కెల్లోగ్, ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై తన ఆలోచనలను ఇప్పటికే వివరించారు. ఈ పరిణామాల దృష్ట్యా రష్యా, ఉక్రెయిన్లు చర్చలకు సమ్మతిస్తూనే, అవి జరిగేలోగా యుద్ధంలో వీలైనంత పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయి.చర్చలు అంటేనే ఎవరి షరతులు వారు విధి స్తారు. మధ్యవర్తి అయినవారు ఇరుపక్షాల మధ్య రాజీ కోసం ప్రయత్నిస్తూనే, తమవైపు నుంచి కొన్ని ప్రతిపాద నలు చేస్తారు. వాటిపై చర్చల క్రమంలో ఒక రాజీ కుదురుతుంది. అయితే ప్రస్తుత అంశంపై చర్చలు త్వరలోనే ప్రారంభం కావచ్చు గానీ, రాజీ ఎప్పటికి జరిగేదీ ఎవరూ చెప్పలేరు. వంద రోజులన్న జనరల్ కెల్లోగ్ అయినా! ఉక్రెయిన్ తూర్పున తమ సరిహద్దుల వెంట గల డోన్ బాస్ ప్రాంతాన్నంతా పూర్తిగా తమకు వదలి వేయటం, 2014 నుంచితమ ఆక్రమణలో గల క్రిమియా దీవిని తిరిగి కోరక పోవటం, ఉక్రె యిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరినా, ఎప్పటికీ నాటోలో చేరక పోవటం అన్నవి రష్యా షరతులు. బ్లాక్ సీలో గల క్రిమియా, ముఖ్యంగా చలికాలంలో ఆ సముద్రం ఘనీభవించదు గనుక నౌకా రవాణాకు రష్యాకు తప్పనిసరి అవసరం. ఉక్రెయిన్ నాటోలో చేరినట్ల యితే రష్యా భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. సోవియట్ యూనియన్, వారి నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991లో రద్దయిన తర్వాత, అమెరికన్ నాటో కూటమి మాత్రం మరింత విస్తరిస్తూ, రష్యా సరిహద్దునే గల ఉక్రెయిన్ను కూడా చేర్చుకొన జూస్తుండటం మాస్కో భయానికి కారణం. తక్షణం యుద్ధం ఆగితేనే చర్చలురష్యా దృష్టి నుంచి గల పరిస్థితులు ఇవి కాగా, ఉక్రెయిన్ షరతులు రెండు. ఒకటి–క్రిమియాను, ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్ర మించిన డోన్ బాస్ భూభాగాలను తమకు తిరిగి అప్పగించటం. రెండవది–నాటోలో చేరే స్వేచ్ఛ తమకు ఉండటం. డోన్ బాస్‌లో రష్యా ఇప్పటికి 20 శాతానికి పైగా భాగాన్ని ఆక్రమించింది. ఇక ట్రంప్ ప్రతినిధిగా జనరల్ కెల్లోగ్ సూచిస్తున్నది, మొదట యుద్ధం వెంటనే ఆగిపోవాలి. ఇరు సైన్యాలు ఎక్కడివక్కడ నిలిచి పోవాలి. తర్వాత చర్చలు ఆరంభమవ్వాలి. రష్యా ఆక్రమణలో గల భూభా గాలు కనీసం కొన్నింటిని వదులుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధపడాలి. దానికి నాటో సభ్యత్వ విషయం నిరవధికంగా, కనీసం 20 ఏళ్లపాటు, వాయిదా వేయాలి. ఇందుకు రష్యా అంగీకరించనట్లయితే ఉక్రెయి న్కు తమ సహాయం కొనసాగిస్తారు. ఉక్రెయిన్ కాదంటే వారికి అన్ని సహాయాలూ నిలిపివేస్తారు.వీటన్నింటిపై చర్చలు ఏ విధంగా పురోగమించవచ్చునన్నది అట్లుంచి కొన్ని విషయాలు గమనించాలి. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతునిస్తూ రష్యా ఆక్రమణలో గల డోన్ బాస్ ప్రాంతాన్ని, క్రిమియాను వదలుకునేందుకు జెలెన్ స్కీ సిద్ధపడవలసి ఉంటుందని సలహా ఇస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసేందుకు రష్యా ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించ బోదని, అటువంటి షరతు వస్తే యుద్ధాన్ని కొనసాగించగలదని, అపుడు అమెరికా కూటమి ఎంత సహాయం చేసినా రష్యా మరిన్ని భూభాగాలు ఆక్రమిస్తూ పోగలదని, ఉక్రెయిన్ పక్షాన తాము ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే అవకాశం లేదని వారికి తెలుసు. తామూ, అమె రికా ఇప్పటికే ఎంత ఆధునిక ఆయుధాలనిచ్చినా రష్యాను ఉక్రెయిన్ నిలువరించలేక పోతున్నది. ఇప్పటికే రష్యా ఆక్రమణలో గల ప్రాంతా లను, క్రిమియాను వదులుకునేందుకు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్న సూచనలున్నాయి. కానీ, రష్యా డిమాండ్ చేస్తున్నట్లు డోన్ బాస్ ప్రాంతం యావత్తునూ వదిలేందుకు ససేమిరా అంగీకరించక పోవచ్చు. అట్లాగే, తాము నాటోలో ఎన్నటికీ చేరక పోవటాన్ని.ఇందుకు బహుశా ట్రంప్ కూడా సమ్మతించకపోవచ్చు.ట్రంప్ గెలుపుతో కొత్త చిక్కులు!అమెరికా, యూరప్‌లకు కూడా కొన్ని ఆందోళనలున్నాయి. సోవి యట్ యూనియన్ పతనం తర్వాత 10–15 సంవత్సరాలకు తమ అపారమైన సహజ వనరుల బలంతో పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకోవటం ప్రారంభించిన రష్యా.. చైనా, ఇండియా తదితర అనేక దేశాలతో మైత్రీ సంబంధాల అభివృద్ధితో ఆర్థికంగా, ఆయుధ బలం రీత్యా ఈసరికి శక్తిమంతంగా మారింది. అటువంటి స్థితిలో పుతిన్ ఉక్రెయిన్‌తో ఆగక తమకు కూడా సవాలుగా మారగలరన్నది అమెరికా, యూరప్‌ల సందేహం. అందువల్ల రష్యాను ఉక్రెయిన్ యుద్ధంలో ఓడించదలచారు గానీ అదీ సాధ్యం కాదని ఆంక్షల వైఫ ల్యంతో, తమ ఆయుధాల వైఫల్యంతో అర్థమైంది. అందుకే ఇపుడు రాజీ ప్రయత్నాలను సమర్థిస్తున్నారు. అనూహ్యంగా ట్రంప్ గెలుపు వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. రష్యా పట్ల కొంత మెతకదనం కలవాడనే పేరు తన మొదటి హయాంలోనూ కలిగి ఉండిన ఆయన, ప్రస్తుత యుద్ధం వల్ల అందరికీ నష్టమేనంటూ అసలు యుద్ధాన్నే వ్యతిరేకించారు. జెలెన్స్కీ వైఖరిని విమర్శించి ఆయన వాదనలను కొట్టివేశారు. ఉక్రెయిన్‌కు బైడెన్ ప్రభుత్వం ఆయుధాలు, నిధులు ఇవ్వటాన్ని తప్పుపట్టారు. అంతటితో ఆగక నాటోను, యూరో పియన్ యూనియన్ను సైతం వేర్వేరు విషయాలపై తప్పుపట్టడం మొదలు పెట్టారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) అనే తన నినాదానికి అనుగుణంగా ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెట్టించగలమని ప్రకటించారు. ఐరోపా దేశాలకు అమెరికా భయం!ఈ మార్పులను గమనించి, ఉక్రెయిన్ సందర్భంలోనే గాక ఇతరత్రా కూడా జంకిన యూరప్ నేతలు ట్రంప్‌కు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే కీడెంచి మేలెంచమన్నట్లు, ట్రంప్ రాక తర్వాత అమెరికా భాగస్వామ్యం పరిమితమైనప్పటికీ ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సహాయాలు అదే స్థాయిలో కొనసాగించాలని తీర్మానాలు చేశారు. కానీ, తమ సైనిక, ఆర్థిక శక్తి రెండూ క్రమంగా బలహీన పడుతున్నందున అది సాధ్యం కాదని గ్రహించి రాజీ ఆలోచనలు మొదలు పెట్టారు. పాశ్చాత్య దేశాల నుంచి ఇప్పటికి ఉక్రెయిన్‌కు సుమారు 130 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందగా అందులో సగం అమెరికాదే. ఆయుధాలతో పాటు ఆర్థిక సహాయాన్ని ట్రంప్ నిలిపివేస్తే ఉక్రెయిన్ అక్షరాలా కుప్పకూలుతుంది. ఇది యూరోపియన్ దేశాలను భయపెడుతున్న అతి పెద్ద విషయం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఉభయుల మధ్య రాజీని కుదర్చటం కెల్లోగ్కు సమస్య కాబోదు. బేరసారాలకు ఇరు దేశాల ఎత్తుగడపోతే, పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారే అవకాశా లున్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రచార సమయంలోనే అను మానించిన జెలెన్స్కీ రష్యాతో చర్చల సమయంలో పై చేయి సాధించలేక పోయినా కనీసం సమ ఉజ్జీ అయేందుకు కొన్ని ఎత్తుగడలను అనుసరించారు. తూర్పున విశాలమైన భూభాగాలను ఆక్రమించిన రష్యా, పోక్రొవ్ స్కీ అనే కీలకమైన నగరంపై దృష్టి కేంద్రీకరించింది. దానిని ఆక్రమిస్తే, ఆ మొత్తం ప్రాంతానికి గుండెకాయ వంటి కూడలి కేంద్రం తన అధీనమై ఉక్రెయిన్ తీవ్రంగా బలహీనపడుతుంది. ప్రస్తుతం ఆ నగరానికి కొద్ది కిలోమీటర్ల దూరానికి చేరిన రష్యన్ సేనలు, చర్చల లోగా దాని స్వాధీనానికి భీకర యుద్ధం సాగిస్తు న్నాయి. ఉక్రెయిన్ ఆ నగర రక్షణకు పోరాడుతూనే, రష్యాతో ఉత్తర సరిహద్దున గల కుర్స్క్ ప్రాంతంలోకి అకస్మాత్తుగా చొచ్చుకు పోయింది. చర్చలు జరిగినపుడు ఈ రెండు నగరాలు బేరసారాల కోసం ఉపయోగపడాలన్నది ఇరువురి ఎత్తుగడ. ఇటువంటి చివరి దశ యుద్ధ క్రీడలే మరికొన్ని సాగుతున్నాయి. రష్యా ఉత్తర కొరియన్ సేనలను రప్పించటం, ఉక్రెయిన్ యూరప్ సహాయంతో తన రాజ కీయ బేరసారాల శక్తిని పెంచుకోజూడటం, రష్యా పైకి దీర్ఘ శ్రేణి క్షిపణుల ప్రయోగం వంటివన్నీ అవే. మొత్తానికి ఈ చివరి దశ క్రీడ లకు జనవరి చివరిలోగా కొద్ది సమయమే మిగిలి ఉంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య పోరు కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది.ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.రష్యాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపింది. అలాగే, ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడినట్టు స్పష్టం చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడి నుంచి పంపించాలని కోరినట్టు ప్రకటన విడుదల చేసింది.మరోవైపు.. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ‘మాస్కోలోని భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు రప్పించేందుకు రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నాం. గాయపడిన జైన్‌ను కూడా విడుదల చేసి, ఇండియాకు పంపించాలని కోరాం’ అని వెల్లడించారు. -
సైనికుల్ని మార్చుకుందాం
కీవ్: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాకు ప్రతిపాదించారు. రష్యా నిర్బంధంలోని తమ సైనికులను వదిలేస్తే పట్టుబడ్డ ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నామన్న ఉక్రెయిన్ ప్రకటనను దక్షిణ కొరియా ధ్రువీకరించడం తెలిసిందే. ‘‘మా దగ్గర మరింతమంది కొరియా సైనికులున్నారు. రష్యా పట్టుకున్న మా సైనికులను అప్పగిస్తే ఉత్తర కొరియాకు వారి సైనికులను అప్పగించడానికి సిద్ధం’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని గురించిన వాస్తవాలను బయట పెట్టేవారికి, శాంతి స్థాపనకు ప్రయత్నించే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. బెడ్‌పై పడుకొన్న, దవడకు బ్యాండేజ్‌తో మంచంపై కూర్చున్న ఇద్దరు ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వీడియోను పోస్ట్ చేశారు. అందులో అనువాదకుల సహాయంతో జెలెన్స్కీ వారితో మాట్లాడుతూ కన్పించారు. ‘‘ఉక్రెయిన్‌తో పోరాడతామని నాకు తెలియదు. శిక్షణ మాత్రమేనని మా కమాండర్లు చెప్పారు’’అని ఆ సైనికులు చెప్పుకొచ్చారు. వారిలో ఒకరు ఉత్తరకొరియా తిరిగి వెళ్లాలని భావిస్తుండగా, అవకాశమిస్తే ఉక్రెయిన్‌లోనే ఉండిపోతానని రెండో సైనికుడు చెప్పాడు. 2022లో ఉక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా, ఉత్తర కొరియా సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మందికి పైగా సైనికులను పంపిందని ఉక్రెయిన్, అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించాయి. దీన్ని ఆ దేశాలు కొట్టిపారేశాయి. కానీ రష్యా సైన్యం ఉత్తర కొరియా సైనిక సాయంపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదని జెలెన్స్కీ అన్నారు. -
ఈ ఏడాది మన ముందున్న సవాళ్లు
గత సంవత్సరం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 11,973 మంది పౌరులు మరణించారు; ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు. మానవ జాతి చరిత్రలోనే 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. రికార్డు స్థాయిలో చలికాలం కూడా మొదలైంది. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పగలదనీ, కాబట్టి అది ప్రాణాంతకమనీ యువల్ నోవా హరారీ లాంటి మేధావులు నొక్కి చెబుతున్నారు. మానవ జాతి అంతం కోసం సైన్స్ సృష్టించిన రాక్షసి ఏఐ కానుందనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాళ్లు ఇవే. యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ విపరిణామం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రపంచ నాయకులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.నూతన సంవత్సరం రోజున కొన్ని పతాక శీర్షికలను చూద్దాం. అమెరికాలోని న్యూ ఓర్లి యన్స్‌లో సంబరాల్లో మునిగి తేలుతున్న వారిమీదికి ఓ ఉగ్రవాది బండిని నడిపించి 15 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ షంషుద్దీన్ జబ్బార్ ఆ గుంపుపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని హతమార్చారు. ఒకప్పుడు జబ్బార్ అమెరికన్ సైన్యంలో పనిచేశాడు. జరగనున్న ఉపద్రవ సంకేతాలను పసిగట్టడంలో ఇది అమెరికన్ నిఘా ఏజెన్సీల వైఫల్యమేనని చెప్పాలి. అతడికి నేరమయమైన గతం ఉంది. అయినా కఠినమైన భద్రతా తనిఖీ నుంచి తప్పించుకున్నాడు. ఈ నిర్లక్ష్యానికి అమాయకులైన అమెరికన్ పౌరులు మూల్యం చెల్లించారు.ఈ విషాదం అక్కడితో ముగిసిపోలేదు. న్యూ ఓర్లియన్స్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ ముందు ఒక ట్రక్కు పేలింది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఒక పాదచారి మరణానికి కారణమైన ఆ ట్రక్కు, అమెరికన్ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ సన్నిహత సహచరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఫ్యాక్టరీలో తయారైనది. ఇక మూడో ఘటన న్యూయార్క్‌లోని క్వీన్స్ బరోలో చోటుచేసుకుంది. అక్కడ నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యాసాన్ని రాసే సమయానికి అమెరికన్ పోలీసులు వాటిని స్పష్టమైన ఉగ్రవాద చర్యలుగా పేర్కొనలేదు. కానైతే ఈ వరుస ఘటనలు అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అశాంతిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.ఈ మూడు ఘటనలే కాకుండా, ఇతర ప్రాంతాలలో జరిగిన మరో రెండు, మన ప్రపంచంలో దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు జరగనున్నట్లు చెబుతున్నాయి. అవేమిటంటే, నూతన సంవత్సరం రాత్రి పూట, గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి 12 మందిని చంపేసింది. రెండవ ఘటనలో, గ్యాస్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసు కున్న ఉక్రెయిన్, రష్యా నుండి మిగిలిన యూరప్‌కు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఎముకలు కొరికే చలిని ఎదుర్కొనే యూరప్‌పై దాని ప్రభావం మాటేమిటి?ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్న డోనాల్డ్ ట్రంప్ కోసం ముళ్ల కిరీటం ఎదురుచూస్తోంది. ట్రంప్ అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయ రంగాలలో కూడా సవాళ్లతో పోరాడవలసి ఉంటుంది. న్యూ ఓర్లియన్స్, న్యూయార్క్, లాస్ వెగాస్ ఘటనలు మరోసారి అమెరికా అజేయం అనే భావనను దాని లోపలి నుండే ఛేదించవచ్చని స్పష్టంగా చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో, ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్ వివాదాన్ని ట్రంప్ సంతృప్తికరంగా ఎలా పరిష్కరించగలరు?నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న రష్యా–ఉక్రె యిన్ సైనిక ఘర్షణ రష్యా సైనిక శక్తిపై, దాని ఆధిపత్యంపై సందేహా లను రేకెత్తిస్తోంది. బలమైన నాయకుడైన వ్లాదిమిర్ పుతిన్ సైనిక శక్తిలో కూడా బలహీనతలు ఉన్నాయని గత మూడేళ్ల పరిణామాలు చూపిస్తున్నాయి. ఆయన పెంచుకున్న ప్రతిష్ఠకూ, సంవత్సరాలుగా ఆయన శ్రద్ధగా నిర్మించుకున్న ఖ్యాతికీ బీటలు వారుతున్నాయి. పతనమవుతున్న ఏకఛత్రాధిపతి ఇతరులను నాశనం చేయడానికి ఉన్న ప్రతి కిటుకునూ ఉపయోగిస్తాడనే వాస్తవానికి చరిత్ర సాక్ష్యంగా ఉంది. గ్యాస్ పైప్‌లైన్ స్వాధీన ఘటన జరిగినప్పటి నుండి, పుతిన్ తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం గురించి ఆందోళన కలుగుతోంది.అంటే 2025 సంవత్సరానికి ఉన్న ముఖ్యమైన ప్రాధాన్యత యుద్ధాలను ఆపడమేనా? ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ హక్కుల గణాంకా లను చూస్తే, యుద్ధాలు మానవాళిని ఎలా రక్తమోడిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ఆ డేటా ప్రకారం, 2024 జనవరి నుండి అక్టోబర్ 21 వరకు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 622 మంది పిల్లలతో సహా కనీసం 11,973 మంది పౌరులు మరణించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనల ప్రకారం, ఇజ్రా యెల్–హమాస్ యుద్ధంలో గత 14 నెలల్లో 17,000 మంది పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు.ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య అయిన వాతావరణ సంక్షోభాన్ని చూద్దాం. మానవ జాతి చరిత్రలో 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. వాతా వరణ సదస్సు విఫలమైనప్పటి నుండి, వాతావరణ చర్యలపై ఏకాభిప్రాయానికి రాబోయే సంవత్సరాల్లో సవాళ్లు తీవ్రమవుతా యనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చలి కాలం ప్రారంభమవడం కూడా దీనికి సూచన. ఈ సవాలును మరింతగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని ట్రంప్ గెలుపు బలహీనపరుస్తుంది. వాతా వరణ సంక్షోభంపై ఆయనకున్న తీవ్రమైన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే.మన దృష్టిని ఆకర్షించిన మరో సమస్య ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్. కృత్రిమ మేధ బలాలు, నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత, జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ కొన్ని సందర్భోచి తమైన ప్రశ్నలను లేవనెత్తారు. కృత్రిమ మేధ అబద్ధం చెప్పగలదని ఆయన నొక్కి చెప్పారు. చాట్‌జీపీటీ4ని ఓపెన్ ఏఐ ప్రారంభించి నప్పుడు, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘కాప్చా’ను పరిష్కరించమని వారు కోరినట్లు హరారీ సోదాహరణ పూర్వకంగా తెలిపారు. అయితే చాట్‌జీపీటీ4, ఆ కాప్చాను పరిష్కరించలేక పోయింది. తర్వాత దాన్ని టాస్క్‌రాబిట్ అనే వెబ్ పేజీకి యాక్సెస్ ఇచ్చారు. కాప్చాను ఛేదించే పనిని చాట్‌జీపీటీ4 ఔట్‌సోర్స్ చేసి, సర్వీస్ ప్రొవైడర్‌కు తనకు సరిగ్గా కళ్లు కనబడవనీ(మనిషి లాగే), తనకోసం చేసిపెట్టమనీ అడిగింది. దాంతో అల్గోరిథమ్‌ను రూపొందించిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పడం ఎలా నేర్చుకుందో వారు అర్థం చేసుకోలేకపోయారు.హరారీ, ఇతర ప్రజా మేధావులు కృత్రిమ మేధ పాత్రను ప్రశ్నించడానికి ఇదే కారణం. ఇది మానవులు రూపొందించిన స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల మొదటి సాధనం. కాబట్టి కృత్రిమ మేధ ప్రాణాంతకం అని వారు నొక్కిచెబుతున్నారు.దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తారనడంలో సందేహమే లేదు. 2024 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 21న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరాన్ని క్లోన్ చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు. దానిద్వారా న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని ఓటర్లకు వేలకొద్దీ ఆటోమేటెడ్ కాల్స్ చేశారు. ఈ ఆపరేషన్‌ను చేపట్టిన లింగో టెలికాం కంపెనీకి తర్వాత 1 మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా పడింది. భారతదేశంలో కూడా, నటి రష్మిక మందాన ఫొటోను మార్ఫింగ్ చేసిన ఉదంతాన్ని చూశాం. ప్రశ్న ఏమిటంటే, మానవ జాతి అంతం కోసం సైన్స్ ఒక రాక్షసిని సృష్టించిందా?మానవాళికి ముప్పు కలిగించే యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ అనే మూడు సవాళ్లపై 2025 సంవత్సరం ఒక ఏకాభిప్రాయాన్ని సాధించగలదా?శశి శేఖర్ వ్యాసకర్త ‘హిందుస్థాన్’ ప్రధాన సంపాదకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
యూరప్‌లో శాంతి తక్షణావసరం
ఒకప్పుడు ఉక్రెయిన్ తుది విజయం వరకూ మద్దతునిద్దామనే పశ్చిమ దేశాల ప్రజల అభిప్రాయం ఇప్పుడు క్రమేపీ తగ్గుతోంది. యూగోవ్ సర్వే సంస్థ తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్, యూకేలలో ప్రజాభి ప్రాయాన్ని సేకరించింది. ఈ ఏడు దేశాల ప్రజలు సంవత్సరం క్రితం ఇచ్చిన మద్దతుకు కట్టుబడి లేరు. ఉక్రెయిన్‌కు మద్దతునిచ్చే వారి సంఖ్య స్వీడన్లో 57 శాతం నుంచి 50 శాతానికి, యూకేలో 50 శాతం నుంచి 36 శాతానికి, డెన్మార్క్‌లో 51 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో శాంతి చర్చల ద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వెతకాలనే వారి సంఖ్య ఇటలీలో 45 శాతం నుంచి 55 శాతానికి, స్పెయిన్‌లో 38 నుంచి 46 శాతా నికి, ఫ్రాన్స్‌లో 35 నుంచి 43 శాతానికి, జర్మనీలో 38 నుంచి 45 శాతానికి పెరిగింది. జనవరి 20 నాడు అమెరికా అధ్యక్ష అధికార పగ్గాలు చేపట్టనున్న ట్రంప్ ఉక్రెయిన్‌కు మద్దతు ఉప సంహరించుకొనే అవకాశాలు ఉన్నాయని 62 శాతం జర్మనీ ప్రజలు, 60 శాతం స్పెయిన్ వాసులు, 56 శాతం బ్రిటన్ ప్రజలు, 52 శాతం ఫ్రెంచ్ జనాలు అభిప్రాయ పడ్తున్నారని యూగోవ్ వెల్లడించింది.ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై మూడేళ్లు నిండనున్నాయి. ఆర్థిక ఆంక్షలతో రష్యాను అదుపులోకి తెచ్చుకోవచ్చునని రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాల అంచనాలకు విరుద్ధంగా రష్యా చమురు వాణిజ్యంతో ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగానే ఉంచుకొంది. రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలే ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం పెరుగుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఫ్రాన్స్, జర్మనీ, యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రభుత్వాలు పతనమైపోతు న్నాయి. డిసెంబర్ ప్రారంభంలో ఫ్రెంచ్ ప్రధాని మైకెల్ బార్నియర్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేక కూలిపోయింది. జర్మన్ ఛాన్సలర్ షోల్జ్ తన ఆర్థిక మంత్రిని బర్తరఫ్ చేయటంతో 3 సంవత్సరాల సోషల్ డెమాక్రాట్స్–గ్రీన్స్–ఫ్రీ డెమాక్రటిక్ పార్టీల కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఓక్స్ వాగెన్, ఆడీ వంటి అనేక కార్ల కంపెనీలు మూత పడుతున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు జర్మనీ మద్దతు కూడా జర్మనీ ప్రజలు స్వాగతించటం లేదు.బ్రిటన్‌లో 22 నెలలు ఏలిన కన్సర్వేటివ్ ప్రధాని రిషి సునాక్ రాజీనామా చేసి ఎన్నికలకు పిలుపునివ్వగా లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ అవినీతి ఊబిలో కూరుకుపోయి, నేషనల్ అసెంబ్లీ తీర్మానాలను తన వీటో ద్వారా నిరోధించటంతో జనాగ్రహానికి గురై రాజీనామా చేయక తప్పలేదు. పశ్చిమాసియాలో గాజాపై యుద్ధం చేయిస్తూ 50 వేల వరకూ సామాన్య ప్రజల్ని చంపిన ఇజ్రాయెల్‌కు మద్దతు పలికిన అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ ట్రంప్ చేతిలో ఓటమి చెందారు. 2023లో ఉక్రెయిన్ విషయంలో బైడెన్ తప్పుడు నిర్ణయం తీసుకొన్నారని అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధం జరిగేలా చేసి... రష్యా, ఉక్రెయిన్ ప్రజలు ఒకరినొకరు చంపుకునేలా చూడటమే పశ్చిమ దేశాల లక్ష్యంగా ఉంది. అమెరికా ప్రత్యర్థి రష్యాను బలహీన పర్చటమే తమ ధ్యేయమని, అన్ని రంగాలలో నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్ప టికే అనేకసార్లు ప్రకటించారు. రష్యాతో నాటో దేశాలు దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకొన్నాయి. రష్యా సంపదను కొల్లగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయటమే అమెరికా ధ్యేయం.యుద్ధం ప్రారంభంలో శాంతి ఒప్పందాలకు ఉక్రె యిన్–రష్యాలు అంగీకరించాయని టర్కీ, ఇజ్రాయిల్ తెలిపాయి. రష్యా యుద్ధం విరమిస్తే, ఉక్రెయిన్ తటస్థ దేశంగా నాటో సభ్యత్వాన్ని కోరదనేది సారాంశం. అయితే అప్పటి యూకే ప్రధాని జాన్సన్ ఆఘ మేఘా లపై కీవ్ వెళ్లి ఉక్రెయిన్ ఆధ్యక్షుడు జెలెన్స్కీని ఒప్పందానికి దూరంగా ఉంచగలిగాడు. 9 ఏళ్ల క్రితం జరిగిన మిన్స్కు ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఎప్పుడూ గౌర వించలేదు. ఉక్రెయిన్ మిలిటరీ పరంగా బలం పుంజు కోటానికే మిన్స్కు ఒప్పందాన్ని ఎర వేశామని సాక్షాత్తు ఒకప్పటి జర్మనీ ఛాన్సలర్ మెర్కల్ ప్రకటించారు కూడా. ఫ్రాన్స్ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి లేమని ఒప్పుకొంది. నాటో దేశాలు యుద్ధానికే మొగ్గు చూపా యని టర్కీ విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కూడ తెలియజేశారు. లిండేగ్రాహం వంటి అమె రికా కాంగ్రెస్ సభ్యుడు ‘చివరి ఉక్రేనియన్’ వరకూ రష్యాతో పోరాటానికి బహిరంగ మద్దతు ఉంటుందని, ‘అమెరికా ప్రాణాలను పణంగా పెట్టకుండా ఉక్రెయి న్కు ఆయుధ సహాయం చేయటం అమెరికా ‘తెలివైన పెట్టుబడి’ అని అన్నారు.ఉక్రెయిన్‌లో ఏ ప్రాంత ప్రజలు కూడా నిరంతర యుద్ధానికి మద్దతు పలకటం లేదు. ఒకప్పుడు ఉక్రెయిన్ నాయకుల విజయంపై ఉన్న ఆశలను నేడు క్రమేపీ వదులుకొంటున్నారు. తాజా సర్వేల్లో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీపై భ్రమల్ని ప్రజలు వదులుకుంటున్నారు. ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్‌లు కుప్పకూలిపోతున్నాయి. నాటో భౌగోళిక విస్తరణకు ఉక్రెయిన్ భారీ మూల్యం చెల్లిస్తున్నది. సంఘర్షణ ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఉక్రెయిన్ ప్రజలు మరిన్ని ప్రాణ నష్టాలతో, ఆర్థిక నష్టాలతో అంత ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ స్పష్టతతో పశ్చిమ దేశాల వ్యూహం భవి ష్యత్తులో విఫలమవుతుంది. రష్యాపై ఉక్రెయిన్ శత్రు వైఖరిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే యుద్ధం ముగు స్తుంది. రష్యా కూడా శాంతి మార్గాలు వెతకాలి.బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,కేఎల్ యూనివర్సిటీ ‘ 98494 91969 -
ఉక్రెయిన్ డ్రోన్ దాడి..రష్యా జర్నలిస్టు మృతి
మాస్కో: ఉక్రెయిన్(Ukraine) చేసిన డ్రోన్ దాడిలో తమ జర్నలిస్టు అలెగ్జాండర్ మరణించారని రష్యా(Russia)కు చెందిన మీడియా సంస్థ ఇజ్వెస్టియా తెలిపింది. డోనెస్క్ ప్రాంతంలో హైవేపై కారులో వెళుతుండగా అలెగ్జాండర్‌పై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో అలెగ్జాండర్‌తో పాటు మరో న్యూస్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. ఇది కావాలని చేసిన దాడేనని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఓ ప్రకటనలో తెలిపారు. ఇది జెలెన్స్కీ ప్రభుత్వం చేసిన మరో దారుణ హత్య అని మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 15 మంది రష్యా జర్నలిస్టులు హత్యకు గురయ్యారని జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ తన నివేదికలో తెలిపింది.2022 ఫిబ్రవరిలో మెదలైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధం కొత్త ఏడాదిలో ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఈ యుద్ధం విషయంలో ఏం చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది. -
యుద్ధభూమిలో రక్తమోడుతున్న రష్యా
గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్‌పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది. రష్యా సేనలు రక్తమోడుతున్నా పుతిన్ పటాలానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని యుద్ధ విశ్లేషకులు తాజాగా ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా దళాలు 2024 సంవత్సరంలో భారీ మూల్యం చెల్లించుకున్నాయని, ఏకంగా 4,30,790 మంది రష్యా సైనికులు అంటే రోజుకు 1,180 మంది సైనికులు రణక్షేత్రంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యుద్ధరంగ మేథోసంస్థ ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’తాజాగా వెల్లడించింది. యుద్ధం మొదలవడానికి ముందు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని వీడియో ఫుటేజీలు, భౌగోళిక మార్పులకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి సంస్థ ఈ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే 45,720 మంది రష్యా సైనికులు చనిపోయారు. డిసెంబర్లో ఏకంగా 48,670 మంది మృతిచెందారని సంస్థ పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే దురాక్రమణకు గతేడాది రష్యా సైన్యం భారీ మూల్యం చెల్లించుకుంది. రష్యా ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధట్యాంక్‌లు, సైనికులను అంతంచేశాం’’అని ఉక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెస్కాండర్ సిరిస్కీ చెప్పారు. కొన్ని గ్రామాల నుంచి తిరుగుముఖం గత ఏడాది తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్ ప్రాంతంలోని 4,168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని రష్యా ఆక్రమించు కుంది. అయితే ఉక్రెయిన్ బలగాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో కొన్ని గ్రామాల నుంచి రష్యా సేనలు వెనుతిరిగాయి. ఈ గ్రామాల విస్తీర్ణం ఉక్రెయిన్ మొత్తం విస్తీర్ణంలో 0.69 శాతం ఉండటం గమనార్హం. 31,000 జనాభా ఉన్న కురకోవ్తోపాటు అవ్దీవ్కా, సెలిడోవ్, వులేదార్లు రష్యా వశమయ్యాయి. అవ్దీవ్కాను ఆక్రమించడానికి రష్యా చెమటోడ్చింది. అవ్దీవ్కా ఆక్రమణకు రష్యాకు నాలుగు నెలలు, సెలిడోవ్, కురకోవ్ల ఆక్రమణకు రెండు నెలల సమయం పట్టింది. ఇంతచేసినా వీటి గుండా మరింతగా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చు కుపోయే అవకాశం రష్యాకు దక్కలేదు. ఇంత నెమ్మదిగా ముందుకు సాగుతున్న రష్యాకు ఒక్క డోనెట్స్క్ ఆక్రమణకే మరో రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఈ లెక్కన మొత్తం ఉక్రేయిన్‌పై ఆధిపత్యం సాధించాలంటే ఇంకెంత కాలంపడుతుందో మరి. రోజుకు 28 చదరపు కి.మీ.ల ఆక్రమణ గత ఏడాది నవంబర్‌లో అధిక సైన్యంతో రష్యా ఆక్రమణ స్థాయిని పెంచింది. దీంతో అక్టోబర్‌లో రోజుకు 14 చదరపు కి.మీ.లుగా ఉన్న ఆక్రమణ స్థాయి నవంబర్‌కొచ్చేసరికి రెట్టింపైంది. అంటే రోజుకు 28 చదరపు కి.మీ.లకు పెరిగింది. అయితే డిసెంబర్లో ఉక్రెయిన్ సేనల ప్రతిఘటన పెరగడంతో రష్యా బలగాలు కాస్తంత నెమ్మదించి రోజుకు 18 చదరపు కి.మీ.ల స్థాయిలోనే ఆక్రమించుకోవడడం మొదలెట్టాయి. అయినాసరే డిసెంబర్ 29వ నాటికి లెక్కేస్తే ఏకంగా 2,100 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ పేర్కొంది. డిసెంబర్ 19వ తేదీన 191 చోట్ల భీకర యుద్ధం జరిగిందని ఒలెక్సాండర్ చెప్పారు. వేల సైనిక వాహనాలు ధ్వంసం రష్యాకు చెందిన వేల సైనిక వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. 3,689 యుద్ధట్యాంక్‌లను పేల్చేసింది. 13,000 యుద్ధట్యాంక్ మందుగుండును నాశనంచేసింది. ‘‘సముద్రజలాల్లో ఐదు రష్యా యుద్ధనౌకలను దాడిచేసి ముంచేశాం. 458 చిన్నపాటి యుద్ధ పడవలను పేల్చేశాం’’అని ఉక్రెయిన్ నేవీ విభాగం తెలిపింది. ‘‘మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి రప్పించిన సైనికులను రణరంగంలోకి పంపినా లాభంలేకుండా పోయింది. ఉ.కొరియా సైనికుల్లో పావు శాతం మంది ప్రాణంతీశాం. ఒక్క కురŠస్క్ రీజియన్‌లో 3,000 మందిని మట్టుబెట్టాం. వారిని సజీవంగా పట్టుకోవడం కుదరట్లేదు. చిక్కే అవకాశమున్న వాళ్లను తోటి రష్యన్లే ముఖాలు కాల్చేసి చంపేస్తున్నారు’’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల ప్రకటించారు. సైన్యంలోకి మరింతగా జనం ఉపాధి, మెరుగైన జీవనం కోసం అనధికారికంగా రష్యాలోకి చొరబడుతున్న శరణార్థులు, వలసదారులను ఈ ఏడాది ఏప్రిల్‌కల్లా పంపేస్తానని పుతిన్ చెప్పారు. అయితే రష్యా సైన్యంలో చేరితే మాత్రం వారికి చట్టబద్ధంగా ఇక్కడే ఉండనిస్తామని పుతిన్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో సైన్యంలోకి ఎక్కువ మంది చేరుతారని, వాళ్లందర్నీ ఉక్రెయిన్ యుద్దక్షేత్రంలోకి తరలించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. చమురు అమ్మకాలతో వస్తున్న అధిక లాభాలను యుద్దం కోసం రష్యా ఖర్చుచేస్తోంటే, పశ్చిమదేశాలు అందిస్తున్న ఆయుధాలు, ఆర్థికసాయంతో ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతోంది. లక్షలాది శ్రామికశక్తి లోటుతో రష్యా ఆర్థికవ్యవస్థ పలచబారుతుంటే, ప్రాణభయంతో కోట్లాది మంది ఉక్రేనియన్లు పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు వలసపోతూ దేశాన్ని ‘తక్కువజనాభాగల దేశం’గా మార్చేస్తున్నారు. ఇలాంటి యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందో మరి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బందీల విడుదల..జెలెన్స్కీ కీలక ట్వీట్
కీవ్:గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1358 మంది సైనికులు,పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. వారిని విడిపించేందుకు ఉక్రెయిన్ అధికారులు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. కొత్త ఏడాది 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని జెలెన్స్కీ తాజాగా ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు.రష్యా వద్ద బందీలుగా ఉన్న తమ సైనికులు,పౌరుల విడుదలలో మిత్ర దేశాల పాత్ర కీలకమని తెలిపారు. రష్యాతో యుద్ధం కూడా ఈ ఏడాది ముగియాలని ఈ సందర్భంగా జెలెన్స్కీ ఆకాంక్షించారు.2022లో ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది.ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన 30 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు.ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది.In 2024, we managed to bring 1,358 of our people back home to Ukraine from Russian captivity. These are our soldiers and civilians.Their fates are different, but they are equally happy to return home. Each and every one of them for the sake of whom a large Ukrainian team… pic.twitter.com/AxTPYlmYhv— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 3, 2025 ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..? -
బషర్ అసద్‌పై విష ప్రయోగం?
లండన్: రష్యాలో ఆశ్రయం పొందిన సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్(59)పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు రష్యా మాజీ గూఢచారిగా భావిస్తున్న జనరల్ ఎస్వీఆర్ అనే ఆన్లైన్ ఎకౌంట్లో ఈ విషయం బయటకు పొక్కిందని ‘ది సన్’పేర్కొంది. అసద్‌కు తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడంతో వైద్యం అందించారని తెలిపింది. అసద్‌పై హత్యా ప్రయత్నం జరిగిందనేందుకు ఇదే ఉదాహరణ అని సన్ పేర్కొంది. డిసెంబర్ మొదటి వారం కుటుంబం సహా వెళ్లిన అసద్ మాస్కోలోని సొంత అపార్టుమెంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయనకు వైద్యం అందుతోందని, సోమవారానికి పరిస్థితి కుదుటపడిందని సన్ తెలిపింది. -
రష్యాకు ఉక్రెయిన్ గ్యాస్ షాక్
మాస్కో/కీవ్: రష్యా నుంచి చౌకగా గ్యాస్‌ను సరఫరా చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరప్ దేశాలకు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేసింది. ఈ విషయంలో రష్యాతో కుదిరిన ఐదేళ్ల ఒప్పందం బుధవారం ముగిసింది. ఇకపై తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను అనుమతించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చిచెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరోవైపు అదనపు బిలియన్ డాలర్లు రష్యా సంపాదిస్తామంటే అనుమతించబోమని అన్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇదొక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఉక్రెయిన్ గుండా ఐరోపా ఖండానికి గ్యాస్ సరఫరా ఆగిపోవడాన్ని రష్యాపై మరో విజయంగా పోలాండ్ ప్రభుత్వం అభివరి్ణంచింది. రష్యా 1991 నుంచి ఉక్రెయిన్ భూభాగం ద్వారా యూరప్‌కు గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవడం, రష్యా నుంచి సహజవాయువు సరఫరా ఆగిపోవడం చరిత్రాత్మక ఘట్టమని ఉక్రెయిన్ ఇంధన శాఖ స్పష్టంచేసింది. → గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని ఉక్రెయిన్ పొడిగించకపోవడం ఊహించిన పరిణామమే. దీనివల్ల యూరప్ దేశాలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లక తప్పదు. రష్యా నుంచి చౌకగా వచ్చే గ్యాస్ స్థానంలో ఇకపై ఖరీదైన గ్యాస్‌ను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది.→ యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. దీనివల్ల రష్యాకు నష్టం జరుగుతోంది. రష్యా గ్యాస్ దిగ్గజం గాజ్ప్రోమ్ గత ఏడాది 6.9 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇలా జరగడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. → రష్యా నుంచి ఉక్రెయిన్ మార్గం కాకుండా టర్క్‌స్ట్రీమ్ లైన్ కూడా ఉంది. ఇది తుర్కియే, బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరప్‌నకు చేరుతోంది. → యూరప్‌లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని యూరేíÙయా గ్రూప్ ఎనర్జీ హెడ్ హెనింగ్ గ్లోస్టీన్ చెప్పారు. గ్యాస్ ధరల భారంతో విద్యుత్ చార్జీలు అమాంతం పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా గ్యాస్‌తో యూరప్ దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. → 2022లో ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభం కాకముందు యూరోపియన్ యూనియన్ దేశాలకు అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యా. 2021లో ఆయా దేశాలు తమ అవసరాల్లో 40 శాతం గ్యాస్‌ను రష్యా నుంచే పైప్‌లైన్ ద్వారా దిగుమతి చేసుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత 2023 నాటికి అది 8 శాతానికి పడిపోయింది. → అయితే యూరప్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం -
ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం
కీవ్:కొత్త ఏడాది సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. రాజధాని కీవ్ నుంచి ఆయన మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా తమ దేశంపై కొనసాగుతున్న రష్యా దురాక్రమణను అడ్డుకుని తీరుతామన్నారు.‘శాంతి మాకు బహుమతిగా రాదని తెలుసు. అన్ని వనరులున్న రష్యాను అడ్డుకుని శాంతిని సాధించేందుకు ఈ ఏడాది గట్టిగా పోరాడతాం.అమెరికాకు కొత్తగా రానున్న అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నా. పుతిన్ దురాక్రమణను ఆయన ఆపుతారనడంలో నాకెలాంటి సందేహం లేదు’అని జెలెన్స్కీ అన్నారు.కాగా, రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 2023తో పోలిస్తే 2024లో ఉక్రెయిన్ ఏడు రెట్ల భూభాగాన్ని నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్‌కు సహకారం తగ్గొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తమకు సహకరిస్తారని జెలెన్స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం. -
రివైండ్ 2024: ప్రపంచం ఓటేసింది..
అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోనుంది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్‌కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం! ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పై చిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజలు తీర్పు వెలువరించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్టు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవీ ఉన్నాయి... భారత ఓటర్ల పరిణతి భారత్‌లో సాధారణ ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువుగా ఎప్పుడో రికార్డు సృష్టించాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా ప్రశాంతంగా జరిగే తీరు చూసి ప్రపంచమంతా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టే ఏప్రిల్ నుంచి ఆరు వారాల వ్యవధిలో ఏడు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈసారి ఏకంగా ‘400కు మించి’అన్న బీజేపీ చివరికి మెజారిటీకీ కాస్త తక్కువగా 240 లోక్‌సభ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఈసారి ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక భారత ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి.ట్రంప్.. తగ్గేదేలే...! నానారకాల వాదాలతో విడిపోయిన అమెరికాలో ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. డొనాల్డ్ ట్రంప్ హవాకు అద్దం పట్టిన ఎన్నికలుగా నిలిచిపోయాయి. రిపబ్లికన్ల అభ్యరి్థత్వం సాధించడం మొదలుకుని ప్రధాన పోరు దాకా ఆద్యంతం ఆయన కనబరిచిన దూకుడు ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆయన ‘అమెరికా ఫస్ట్’నినాదం రెండోసారి ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం ఎక్కించింది. డెమొక్రాట్లకు అధ్యక్షుడు జో బైడెనే భారంగా మారారు. సకాలంలో తప్పుకోకపోవడం ద్వారా పార్టీ విజయావకాశాలకు తీవ్రంగా గండి కొట్టిన అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత మూలాలున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శాయశక్తులా ప్రయత్నించినా, ఆమెదే పైచేయి అని ప్రధాన మీడియా ఎంతగా హోరెత్తించినా ట్రంప్ ‘తగ్గేదే లే’అన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో ఏకంగా 312 ఓట్లను ఒడిసిపట్టి భారీ మెజారిటీతో విజయ దరహాసం చేశారు. రిషికి ఓటమి సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రజలు తమ ఆగ్రహమంతటినీ అధికార కన్జర్వేటివ్ పార్టీపై చూపించారు. ఆ పార్టీ 14 ఏళ్ల ఏలుబడికి తెర దించారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ సారథ్యంలో కన్జర్వేటివ్‌లు దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. లేబర్ పార్టీ నేత కియర్స్టార్మర్కు జనం పట్టం కట్టారు.పాక్‌లో ప్రహసనం పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా నిలిచాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ కుటుంబ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్–ఎన్) ఆద్యంతం ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని చేసినా జైలుపాలైన ఇమ్రా న్‌ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)ను అడ్డుకోలేకపోయింది. పీటీఐ గుర్తింపునే రద్దు చేసినా స్వతంత్రులుగానే నిలబడి అన్ని పారీ్టల కంటే ఎక్కువ సీట్లు నెగ్గి సత్తా చాటారు. దాంతో నానా పారీ్టలను కలుపుకుని షహబాజ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచి్చంది. లంకలో నవోదయం : కల్లోల శ్రీలంకలో సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వామపక్షవాది అనూర కుమార దిస్సనాయకే సాధించిన విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ దుస్థితికి ప్రధాన కారకులని భావించిన రాజపక్స కుటుంబాన్ని జనం రాజకీయంగా సమాధి చేశారు. పుతిన్ ఐదోసారి చెప్పుకోదగ్గ ప్రత్యర్థే లేకుండా జరిగిన ఎన్నికల్లో రష్యాలో పుతిన్ రికార్డు స్థాయిలో ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అది కూడా ఏకంగా 87 శాతం ఓట్లు సాధించారు. సోవియట్ అనంతర కాలంలో రష్యాలో ఇదే అత్యధిక మెజారిటీ. పుతిన్‌కు ప్రధాన అడ్డంకిగా మారడం ఖాయమని భావించిన విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను దుమారమే రేపింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికొలస్ మదురో విజయమూ వివాదాస్పదమైంది. పారిపోయిన నేతలుపొరుగు దేశం బంగ్లాదేశ్‌లో అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది కూడా జనవరిలో సాధారణ ఎన్నికలు ముగిసి షేక్ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రధాని కావడం ద్వారా అధికారాన్ని నిలబెట్టు్టకున్న ఐదు నెలలకే! అజ్ఞాత శక్తి కనుసన్నల్లో సాగినట్టు కని్పంచిన ‘ప్రజా ఉద్యమం’దెబ్బకు ఆమె పదవీచ్యుతురాలయ్యారు. అధికార నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో దాదాపుగా కట్టుబట్టలతో ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో రాజకీయ ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక సర్కా రు కొలువుదీరింది. నాడు మొదలైన అల్లర్లు, అరాచకాలు బంగ్లాలో నేటికీ కొనసాగుతున్నా యి. హిందువులతో పాటు మైనారిటీల భద్రతను ప్రమాదంలో పడేశాయి. అసద్‌లకు అల్విదా సిరియాలో అసద్‌ల 50 ఏళ్ల కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు డిసెంబర్లో తెర దించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోయారు. అలా నియంతృత్వ పాలనకు తెర పడ్డా దేశం మాత్రం అనిశ్చితితో కూరుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఘోర విమానం ప్రమాదంలో రష్యాదే తప్పు’.. ఇదిగో సాక్ష్యం
బాకో: ల్యాండింగ్ సమయంలో అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్ (Azerbaijan Airlines)కు చెందిన జె2-8243 విమానం కజకిస్థాన్ కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 38 మంది మృతి చెందగా..29 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ ప్రమాదంపై ఆదివారం (డిసెంబర్ 29) అజర్ బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రాంతం నుంచి జరిపిన కాల్పుల వల్లే అజర్ బైజాన్ విమానం ప్రమాదానికి గురైందని చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాల్ని మాస్కో దాచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్న రష్యా అందుకు బాధ్యత వహిస్తూ.. చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.‘అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదానికి గల కారణాల్ని దాచేందుకు రష్యాలోని ఓ వర్గం అసత్య ప్రచారం చేస్తుందని, తప్పుడు కథనాలతో మసిపూసి మారేడు కాయ చేస్తుంది. విమాన ప్రమాదం జరిగిన కారణ వేరయితే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాస్కో చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయి. చేసిన తప్పును అంగీకరించడం, అజర్ బైజాన్‌కు క్షమాపణలు చెప్పడం, విమాన ప్రమాదం జరిగిన తీరుతెన్నుల గురించి ప్రజలకు వివరించాలి అని’ఇల్హామ్ అలీయేవ్ రష్యాకు సూచించారు. President Aliyev: “First, Russia must apologize to Azerbaijan. Second, it must admit its guilt. Third, it must punish the culprits, hold them criminally responsible, and pay compensation to the Azerbaijani state as well as to the affected passengers and crew members. These are… pic.twitter.com/5N16w4Zhfw— Nasimi Aghayev🇦🇿 (@NasimiAghayev) December 29, 2024కాగా, ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్ని సమీపంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఆ సమయంలో రష్యా క్షిపణి తాకడం కారణంగా విమానం కూలిందంటూ ఉక్రెయిన్‌తో పాటు అజర్ బైజాన్ కూడా ఆరోపించింది. ఈ క్రమంలోనే అజర్ బైజాన్ విమాన ప్రమాదాన్ని రష్యా ‘విషాదకరమైన సంఘటన’ అని పిలిచినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్‌ను క్షమాపణలు కోరారు. కానీ, రష్యా జరిపిన క్షిపణుల ప్రయోగం వల్లే విమానం కూలినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. -
రష్యానే కూల్చిందా..?
-
రష్యా క్షిపణి వల్లే కూలిందా?
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లోని అక్తావ్ సమీపంలో బుధవారం విమానం కూలడానికి వెలుపలి శక్తుల ప్రమేయమే కారణమని అజెర్బైజాన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. వెలుపలి భౌతిక, సాంకేతిక పరమైన ప్రమేయం వల్లే విమానం కూలినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని శుక్రవారం వెల్లడించింది. ఈ విమానం కుప్పకూలడానికి రష్యా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థే కారణమని అంతకు ముందు వార్తలొచ్చాయి. రష్యా వైమానిక విభాగం ప్రతినిధి యడ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రోజ్నీ, వ్లాడికవ్కాజ్లలోని మౌలిక వసతులు, జనావాసాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. అందుకే గ్రోజ్నీలో ల్యాండ్ చేయకుండా విమానాన్ని దారి మళ్లించారని తెలిపారు. ‘దీన్నిబట్టి చూస్తే, ఆ ప్రాంతంలోని గగనతలాన్ని మూసివేసినట్లు అర్థమవుతోంది. అంటే, ఆ జోన్లోకి వచ్చే ఏదైనా విమానం తక్షణమే బయటకు రావాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదమే’అని విశ్లేషకులు అంటున్నారు. ‘విమానం గ్రోజ్నీలో ల్యాండయ్యేందుకు రెండుసార్లు ప్రయత్నించింది. అయితే, డ్రోన్ దాడుల భయంతో వేరే విమానాశ్రయాల్లో ల్యాండ్ చేయాలని అధికారులు పైలట్‌కు సూచించారు. అందుకే, పైలట్ అక్తావ్ ఎయిర్‌పోర్టు దిశగా విమానాన్ని మళ్లించారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కురుస్తున్న దట్టమైన మంచు ప్రమాదానికి కారణమైంది’అని యడ్రోవ్ వివరించారు. కానీ, రష్యా మీడియా విమాన ప్రమాదం గురించిన అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా ఆరోపించారు. క్షిపణి దాడిలో దెబ్బతిన్న విమానంలో ఆనవాళ్లు దొరక్కుండా చేయడానికి రష్యా అధికారులు సముద్రం దాటాలని పైలట్‌పై ఒత్తిడి చేశారని విమర్శించారు. విమానం కూలిన తర్వాత కేబిన్ నుంచి భారీగా పొగలు వస్తున్నట్లుగా చూపే వీడియోలు, ఫొటోలు కూడా ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. విమానం ముక్కలై మంటలు అంటుకోవడం, కాస్పియన్ సముద్ర తీరానికి సమీపంలో నేలను తాకి నల్లని పొగలు కమ్ముకుంటున్న వీడియో ఒకటి ఆన్లైన్లో కనిపిస్తోంది. ఘటనా ప్రాంతంలో విమానం ధ్వంసమైన తీరును గమనిస్తే రష్యా మిలటరీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే నేలకూలినట్లు కనిపిస్తోందని యూకేకు చెందిన ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్ మ్యాట్ బోరీ విశ్లేషించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. రష్యన్లే ఆ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ జాతీయ భద్రతాధికారి అండ్రీ కొవలెంకో చెప్పారు. యుద్ధం జరుగుతున్న వేళ గ్రోజ్నీ గగనతలాన్ని రష్యా మూసివేయకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. -
ఉక్రెయిన్‌లో బందీగా ఉత్తరకొరియా సైనికుడు
సియోల్:రష్యా(Russia) తరపున యుద్ధం చేసేందుకు వెళ్లిన ఉత్తరకొరియా(NorthKorea) సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బందీగా తీసుకువెళ్లాయని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.ఉక్రెయిన్(Ukraine)పై యుద్ధం చేసేందుకు వేలాది మంది సైనికులను ఉత్తరకొరియా రష్యాకు పంపిన విషయం తెలిసిందే.రష్యాలోని క్రస్క్ సరిహద్దు వద్ద గతంలో ఉక్రెయిన్ సైనికులు ఒక్కసారిగా రష్యాలోకి చొచ్చుకువచ్చి దాడి చేశారు.ఈ సమయంలోనే ఉత్తరకొరియా సైనికుడిని ఉక్రెయిన్ బలగాలు తీసుకువెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.రష్యాతో జరిగిన యుద్ధంలో వెయ్యి మంది ఉత్తరకొరియా సైనికులు మరణించారని ఇప్పటికే దక్షిణకొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించింది.రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉత్తరకొరియా సైనికులను రష్యా ముందుంచి పోరాడుతోందని తెలిపింది.ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు కౌంటర్ ఇచ్చే సామర్థ్యం లేకపోవడంతో ఉత్తరకొరియా సైనికులు భారీగా మృత్యువాత పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
కజకిస్తాన్ విమాన ప్రమాదం..రష్యా కీలక ప్రకటన
మాస్కో:కజకిస్తాన్‌లో జరిగిన విమానప్రమాదానికి తామే కారణమని జరుగుతున్న ఊహాజనిత ప్రచారాన్ని రష్యా ఖండించింది. విమాన ప్రమాదంపై ఊహాగానాలు ఆపాలని కోరింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై విచారణ పూర్తయ్యేదాకా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలడానికి రష్యా ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థే కారణమన అజర్బైజాన్ మీడియాలో కథనాలు ప్రచురితమవడంపై రష్యా స్పందించింది. బుధవారం(డిసెంబర్ 25) అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయలుదేరిన విమానాన్ని పొగమంచు కారణంగా తొలుత కజకిస్తాన్‌లోని అక్తౌకు మళ్లించారు. ఇక్కడే విమానం కుప్పకూలింది. ప్రమాదానికి ముందు విమానం కాస్పియన్ సముద్రంపై కాసేపు ఎగిరింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 67 మందిలో 29 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. -
ఉక్రెయిన్‌పై 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో రష్యా దాడి
కీవ్ : ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడుల తరహాలో ఉక్రెయిన్ దాడి చేసింది. కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తం 8 డ్రోన్లు చొచ్చుకెళ్లాయి. ఈ దాడికి రష్యా తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్‌పై 70మిసైళ్లు,100 డ్రోన్లతో విరుచుకుపడింది.క్రిస్టమస్ పర్వదినాన రష్యా చేసిన దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. తమ దేశ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అమానవీయంగా దాడి చేసిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘ప్రపంచం మొత్తం క్రిస్టమస్ వేడుకల్లో ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా భారీ ఎత్తున దాడికి దిగింది. దాడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వ్యూహాత్మకంగా జరిగింది. దాడి మాత్రమే కాదు. దాడి ఎప్పుడు చేయాలనేది ముందే నిర్ణయించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ విధ్వంసానికి తెరలేపారు. ఇంతకంటే అమానుషం ఏముంటుంది?’ అని జెలెన్స్కీ ప్రశ్నించారు. Every massive Russian strike requires time for preparation. It is never a spontaneous decision. It is a deliberate choice – not only of targets but also of timing and date.Today, Putin deliberately chose Christmas for an attack. What could be more inhumane? Over 70 missiles,… pic.twitter.com/GMD8rTomoX— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 25, 2024ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రష్యా భారీ దాడి చేసిందని ఉక్రెయిన్ ఇంధన మంత్రి జర్మన్ గలుష్చెంకో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శత్రువు(రష్యా) మళ్లీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా దాడి చేస్తోంది. శత్రు దాడి నుంచి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రతికూల ప్రభావం పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. నగరాలపై దాడులుఒక బాలిస్టిక్ క్షిపణి మంగళవారం సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్‌లోని అపార్ట్మెంట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. 15మంది గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 32 అపార్ట్మెంట్లతో కూడిన నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్ బ్లాక్‌పై దాడి జరిగినట్లు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఒలెక్సాండర్ విల్కుల్ టెలిగ్రామ్‌లో వెల్లడించారు.అదే సమయంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ బలగాలు 59 ఉక్రేనియన్ డ్రోన్లను రాత్రిపూట కూల్చివేసాయని, ఉక్రేనియన్ వైమానిక దళం నల్ల సముద్రం నుండి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే వాటిని వేటిపై ప్రయోగించారనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది. -
World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం
2024.. ప్రపంచమంతటినీ యుద్ధ భయం వెంటాడింది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా నిలిచాయి. దీనికితోడు భీకర విధ్వంసాన్ని సృష్టించే అణ్వాయుధాల ముప్పు కూడా తొంగిచూసింది. 2024లో ప్రపంచాన్ని అనునిత్యం భయానికి గురిచేసిన యుద్ధాలివే..రష్యా-ఉక్రెయిన్ 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2024లో మరింత తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు రష్యా అంతర్భాగంలో యూఎస్ఏ ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతించడం ద్వారా మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే హైపర్సోనిక్ ఐసీబీఎం క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించడం ద్వారా రష్యా అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడబోదన్న సందేశాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్న నాటో, అమెరికా, బ్రిటన్లపై దాడి చేస్తామని రష్యా పలుమార్లు హెచ్చరించింది. ఇది మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని మరింతగా పెంచింది.ఇజ్రాయెల్-హమాస్ 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రమంగా లెబనాన్, యెమెన్, ఇరాన్, సిరియాలను చుట్టుముట్టింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా యెమెన్ హౌతీలు.. ఏడెన్ గల్ఫ్‌లోని ఓడలను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్‌తో పాటు హౌతీలతోనూ పోరాడాల్సి వచ్చింది. హౌతీల దాడులను అరికట్టేందుకు అమెరికా, బ్రిటన్ కలిసి యెమెన్‌పై పలుమార్లు భారీ వైమానిక దాడులు నిర్వహించి, హౌతీల కీలక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ కూడా హౌతీలపై బలమైన ప్రతీకార దాడులను చేపట్టింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్‌లను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా జనం మృతిచెందారు.ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఇజ్రాయెల్ దళాలు హమాస్ నేతలను హతమార్చిన దరిమిలా ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడి చేపట్టింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఈ వైమానిక దాడిలో మరణించాడు. దీని తరువాత, కొత్త చీఫ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో హతమయ్యాడు. తరువాత గాజా తరహాలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో భూ ఆక్రమణకు పాల్పడింది. పేజర్లు, బ్యాటరీ బ్లాస్ట్లను ఉపయోగించి వేలాది మంది హెజ్బొల్లా యోధులను ఇజ్రాయెల్ అంతమొందించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.ఇజ్రాయెల్-ఇరాన్ ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణకు ముందు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్, హిజ్బుల్లా చీఫ్‌లు హసన్ నస్రల్లా, హషీమ్ సఫీద్దీన్లను అంతమొందించడంతో ఇరాన్ షాక్‌నకు గురయ్యింది. 2024 అక్టోబర్‌లో ఇరాన్ అకస్మాత్తుగా 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇది ప్రపంచమంతటినీ కలవరానికి గురిచేసింది. ఈ దాడి తరువాత, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ప్రత్యక్ష యుద్ధం ముప్పు మధ్యప్రాచ్యాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఇప్పటికే యూరప్‌లో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాద ముప్పును మరింత పెంచింది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్.. ఇరాన్‌పై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ సైనిక స్థావరాలను నాశనం చేసింది.సూడాన్- బంగ్లాదేశ్2024లో సూడాన్- బంగ్లాదేశ్‌లలో జరిగిన తిరుగుబాట్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఏప్రిల్ 2023 నుంచి సూడాన్ భీకర అంతర్యుద్ధంలో మునిగితేలుతోంది. జుంటా సైన్యం తిరుగుబాటు దరిమిలా సూడాన్ పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి. ఈ రెండింటి మధ్య సంవత్సరాల తరబడి భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేలాది మంది సైనికులు, ప్రజలు మరణించారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం సూడాన్‌లో జరిగిన ఈ అంతర్యుద్ధంలో 27 వేల మందికి పైగా జనం మరణించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం కారణంగా ప్రధాని షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు. అదిమొదలు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి.సిరియాలో.. సిరియాలో సాయుధ తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. వారు సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశం నుండి పారిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపధ్యంలో రష్యా అసద్‌కు ఆశ్రయం ఇచ్చింది. అనంతరం ఇజ్రాయెల్ సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి, ఆ దేశంలోని బఫర్ జోన్‌ను స్వాధీనం చేసుకుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: భారతీయులు అలెక్సాను అడిగిన ప్రశ్నలివే.. జాబితా షేర్ చేసిన అమెజాన్ -
షేక్ హసీనాపై రూ. 500 కోట్ల అవినీతి ఆరోపణలు
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) 5 బిలియన్ డాలర్ల అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కిలోమీటర్లు దూరంలో రష్యా ప్రభుత్వం పద్మ నది ఒడ్డున ఈశ్వర్ది జిల్లాలోని రూప్పూర్ వద్ద రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (Rooppur Nuclear Power Plant) పేరుతో రెండు అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తోంది. వాటిల్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ అణు విద్యుత్ ఏర్పాటులో షేక్ హసీనా భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.అనంతరం షేక్ హసీనాతో పాటు కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఆమె మేనకోడలు, యూకే ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్‌లను కూడా ప్రశ్నించేలా బంగ్లా మధ్యంతర ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.అయితే రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిధుల్ని హసీనా, జాయ్, తులిప్‌లు మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లను బదిలీ చేయడంపై స్థానిక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజా,విచారణలో భాగంగా నిధులు దుర్వినియోగం అవుతున్నా అవినీతి నిరోధక కమిషన్ (anti-corruption commission) ఎందుకు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందని ప్రశ్నించింది. ఈ పరిణామం తర్వాతనే షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారణకు మహ్మద్ యూనిస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏసీసీ నివేదిక ప్రకారం.. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలను నేషనల్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (ఎన్‌డిఎం) చైర్మన్ బాబీ హజ్జాజ్ వెలుగులోకి తెచ్చారు. -
అసద్ భార్య విడాకుల పిటిషన్
మాస్కో: పదవీచ్యుత సిరియా అధ్యక్షుడు బషర్ అల్–అసద్ భార్య ఆస్మా(49) విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రష్యాను వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కూడా ఆమె అభ్యర్థించారు. ఆమె దరఖాస్తును మాస్కోలోని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెలారంభంలో తిరుగుబాటుదార్లు అసద్ ప్రభుత్వాన్ని కూలదోయడం, అధ్యక్షుడు రష్యాకు కుటుంబం సహా పలాయనం కావడం తెలిసిందే. రష్యా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించింది. అయితే, వారిపై పలు ఆంక్షలను విధించింది. అసద్, ఆయన కుటుంబీకులను మాస్కో వీడి వెళ్లరాదని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని కట్టడి చేసింది. అసద్ తమ వద్ద దాచిన 270 కిలోల బంగారం, సుమారు రూ.17 వేల కోట్ల ధనంతోపాటు, మాస్కోలోని 18 అపార్టుమెంట్లు తదితర ఆస్తులను రష్యా ప్రభుత్వం స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్మా అల్–అసద్ రష్యాలో ఉండేందుకు అంగీకరించడం లేదని, పుట్టి పెరిగిన లండన్ వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. సిరియన్ల కుటుంబంలో లండన్‌లో జన్మించిన ఆస్మా అక్కడే చదువుకున్నారు. 25 ఏళ్ల వయస్సులో 2000వ సంవత్సరంలో సిరియా వెళ్లారు. అదే ఏడాది అసద్‌తో ఆమె వివాహమైంది. ఆమెకు ద్వంద పౌరసత్వం ఉంది. ఇలా ఉండగా, అసద్ సోదరుడు మహెర్ అల్–అసద్ అతడి కుటుంబానికి రష్యా అధికారికంగా ఆశ్రయం కల్పించలేదు. ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మహెర్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచి, ఆస్తుల్ని స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. -
రష్యాలో సిరియా మాజీ అధ్యక్షుడికి బిగ్ షాక్
మాస్కో: తిరుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో కుటుంబంతో సహా పారిపోయి.. మిత్రదేశం రష్యాను ఆశ్రయించాడు మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్. అయితే.. అక్కడా ఆశ్రయంలోనూ ఆయన స్థిమితంగా ఉండలేకుండా పోతున్నారని సమాచారం. ఈ క్రమంలో భార్య అస్మా రూపంలో ఆయన పెద్ద షాకే తగిలింది.తాజాగా.. బషర్ భార్య అస్మా ఆయన నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వరుస పరిణామాలు.. పైగా రష్యాలో ఆశ్రయం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలో తన స్వస్థలం లండన్ వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. రష్యాలో వాతావరణం తనకు ఏమాత్రం నచ్చలేదని.. తాను దేశం దాటేందుకు అనుమతివ్వాలని.. ఈ క్రమంలోనే తనకు విడాకులు మంజూరు చేయాలని.. రష్యా కోర్టులో ఆమె ఓ పిటిషన్ వేశారు. దేశం విడిచేందుకు తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు.మరోవైపు.. రష్యాలో ఆశ్రయం పొందినప్పటికీ బషర్‌కు ఉపశనం కలిగే అవకాశం లేదు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా, అలాగే రాజకీయాలకు దూరంగా ఉండేలా ఆయనపై ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన రష్యా విడిచి ఎటూ వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ అస్మా తన పిల్లలతో మాస్కో వీడేందుకే సిద్ధమైనట్లు టర్కీ,అరబ్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. అస్మా.. బ్రిటిష్-సిరియా సంతతికి చెందిన వ్యక్తి. లండన్‌లో జన్మించిన అస్మాకు 2000లో అసద్‌తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె సిరియాలో అడుగుపెట్టింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. సిరియా గత ఐదు దశాబ్దాలుగా బషర్ కుటుంబ పాలన గుప్పిట ఉంది. 1971 నుంచి చనిపోయేంత వరకు బషర్ తండ్రి హఫీజ్ అల్ అసద్ సిరియాను పాలించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అయిష్టంగానే డెంటల్ డాక్టర్ అయిన బషర్ అల్ అసద్ అధ్యక్ష పీఠం ఎక్కారు. అయితే అధికారంలోకి రాగానే నియంత పోకడలను కొనసాగించాడు బషర్. దీంతో ఆయన్ని గద్దె దింపేందుకు 20 ఏళ్లుగా పోరాటాలు సాగాయి. ఈ క్రమంలో జరిగిన అంతర్యుద్ధంలో 5 లక్షల మంది ప్రాణాలు పోయాయి. అయితే.. బషర్ విముక్త సిరియా కోసం పోరాడిన తిరుగుబాటుదారులు.. ఎట్టకేలకు ఈ నెల ప్రారంభంలో రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలిగారు. దీంతో ప్రాణభయంతో బషర్ కుటుంబ సభ్యులతో సహా రష్యాకు పారిపోయాడు. -
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
-
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి..విమానాశ్రయం మూసివేత
కీవ్ : రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 8 డ్రోన్లను రష్యాపై ప్రయోగించింది. శనివారం కజాన్ నగరంలో హైరైజ్ బిల్డింగ్స్‌పై డ్రోన్ దాడులు జరిపింది. మూడు అత్యంత ఎత్తైన బిల్డింగ్‌లను డ్రోన్లు ఢీకొట్టాయి. డ్రోన్ల దాడితో కజాన్ ఎయిర్‌పోర్టును మూసివేశారు. కజాన్‌కు ఈశాన్య నగరం ఇజెవ్‌స్క్‌లో, కజాన్‌కు దక్షిణంగా ఉన్న సరాటోవ్లో మరో రెండు విమానాశ్రయాలలో తాత్కాలిక ఆంక్షలను విధిస్తున్నట్లు వెల్లడించింది. రాజధాని మాస్కోకు తూర్పున ఉన్న కజాన్‌లోని నివాస సముదాయాలపై డ్రోన్ దాడి జరిగినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన వాటిలో పలు డ్రోన్లను కూల్చివేశామని రష్యా ప్రకటించింది. నివాస సముదాయాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. కజాన్ మేయర్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ నగరంలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు,ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.Russia witness 9/11 style attack!Drones/UAV's attack high-rise buildings in Kazan, residents evacuated, Alert Sounded pic.twitter.com/PMHthxQBxh— Megh Updates 🚨™ (@MeghUpdates) December 21, 2024 -
Year Ender 2024: విమాన ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు
2024 సోమవారం ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. ఇప్పుడు మనమంతా 2024 చివరిదశలో ఉన్నాం. ఈ ఏడాది పలు ఆనందాన్నిచ్చే ఘటనలతో పాటు విషాదాన్ని పంచే ఉందంతాలు కూడా చోటుచేసుకున్నాయి. వాటిలో విమాన ప్రమాదాలు ఒకటి. ఈ దుర్ఘటనల్లో పలువురు ప్రముఖులు కన్నుమూశారు.నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదంజూలై 24న సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం పోఖ్రాకు వెళుతుండగా ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఉదయం 11 గంటలకు త్రిభువన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. 21 ఏళ్ల నాటి ఈ విమానానికి మరమ్మతులు చేసి పరీక్షలకు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుని హెలికాప్టర్ మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దుల్లాహియాన్ సహా 9 మంది మృతిచెందారు. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో రెండు హెలికాప్టర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. పలు నివేదికల ప్రకారం పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు మధ్య పర్వత ప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలోని అజర్బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రష్యాలో విమాన ప్రమాదం2024 జనవరిలో రష్యా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 74 మంది మృతిచెందారు. బెల్గోరోడ్ ప్రాంతంలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరియు 9 మంది రష్యన్ సిబ్బంది ఉన్నారు. ఈ సంఘటన తర్వాత రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఉక్రెయిన్ నుండి ప్రయోగించిన క్షిపణి విమానాన్ని తాకిందని పేర్కొంది. ఉక్రెయిన్ దీనిని రష్యా కుట్రగా పేర్కొంది.మలావిలో కూలిన విమానంఈ ఏడాది జూన్‌లో మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మదిమంది విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విమాన ప్రమాదాన్ని మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా స్వయంగా ధృవీకరించారు. ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న సైనిక విమానం శకలాలు దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ఒక పర్వత ప్రాంతంలో కనుగొన్నారు. సౌలోస్ చిలిమా విమానం అదృశ్యమయ్యే ముందు దక్షిణ ఆఫ్రికా దేశ రాజధాని లిలాంగ్వేకు ఉత్తరాన 370 కిలోమీటర్ల దూరంలో ఎగురుతూ కనిపించింది. అననుకూల వాతావరణం, దృశ్యమానత సరిగా లేకపోవడం కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది.హాలీవుడ్ నటుని దుర్మరణంహాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఆలివర్ అతని ఇద్దరు కుమార్తెలు, పైలట్ జనవరి ఆరున కరేబియన్ ద్వీపం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. గ్రెనడైన్స్‌లోని పెటిట్ నెవిస్ ద్వీపంలో ఈ విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో కూలిపోయింది.చిలీ మాజీ అధ్యక్షుడి హెలికాప్టర్..చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా ఈ ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఆయన వ్యక్తిగత హెలికాప్టర్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో నలుగురు ఉన్నారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.ఆఫ్ఘనిస్తాన్‌లో విమాన ప్రమాదంజనవరి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో ఓ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఈ బిజినెస్ జెట్‌లో ఏడుగురు రష్యన్లు ఉన్నారు. వారు అక్కడికక్కడే మృతిచెందారు. విమానం ఇంజన్లో లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. విమానం మొరాకో కంపెనీకి చెందినది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే.. -
కుదిరితే కప్పు టీ
మాస్కో: భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత ప్రధానమంత్రులు ఎవరైనా సరే రష్యాతో అనుబంధానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. రష్యా అధినేతలు సైతం అదే రీతిలో స్పందిస్తుంటారు. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహం, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మోదీతో చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచదేశాల అధినేతల్లో తనకున్న కొద్ది మంది మిత్రుల్లో మోదీ కూడా ఒకరని అన్నారు.పుతిన్ తాజాగా మీడియా ప్రతినిధుల వార్షిక సమావేశంలో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తేనీరు సేవిస్తూ ఏ దేశ అధినేతతో సంభాషించాలని మీరు కోరుకుంటారు? అని ప్రశ్నించగా, భారత ప్రధాని మోదీతోపాటు జర్మనీ మాజీ చాన్స్‌లర్ హెల్ముత్ కోల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్విస్ చిరక్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో మాట్లాడడం ఇష్టమని, వారంతా తనకు మంచి స్నేహితులని స్పష్టంచేశారు. కుదిరితే వారితో టీ సేవిస్తూ సంభాషించడానికి ఇష్టపడతానని వెల్లడించారు.బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా, ఇండియాతో కూడిన ‘బ్రిక్స్’ కూటమి పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని పుతిన్ తేల్చిచెప్పారు. తమ కూటమి దేశాల ప్రయోజనాల కోసం తప్ప ఇతర దేశాలకు వ్యతిరేకంగా తాము పనిచేయడం లేదని వివరించారు. ఇదిలా ఉండగా, పుతిన్ వచ్చే ఏడాది మొదట్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రతిఏటా కనీసం ఒక్కసారైనా భేటీ కావాలని పుతిన్, మోదీ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. -
క్యాన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. అక్కడి పేషెంట్లకు ఉచితంగా!
వైద్యరంగంలో అద్భుతానికి రష్యా కేరాఫ్‌గా మారనుంది. క్యాన్సర్ జబ్బు నయం చేసే వ్యాక్సిన్‌ను రూపొందించడమే కాదు.. దానిని ఉచితంగా రోగులకు అందించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఆర్ఎన్ఏ(mRNA) ఆధారితంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌కు జనరల్ డైరెక్టర్ అయిన అండ్రే కప్రిన్ ప్రకటించారు.చాలా పరిశోధన సంస్థలు సమిష్టి కృషితో క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించాయని.. ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో కణతి(ట్యూమర్) పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్(వ్యాధికారక ఏజెంట్)ను నిరోధించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎలా పని చేస్తుందంటే.. కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్‌ను గుర్తించేలా మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. అలాగే.. రష్యా తయారుచేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఇదే తరహాలో పని చేయనుంది. అంటే..RNA(రిబోన్యూక్లియిక్ యాసిడ్) అనేది ఒక పాలీమెరిక్ అణువు, ఇది జీవ కణాలలో చాలా జీవసంబంధమైన విధులకు అవసరం. మెసేంజర్ ఆర్ఎన్ఏ పీస్‌ను వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. తద్వారా కణాలను ఒక నిర్దిష్టమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్‌ను విదేశీగా(బయటి నుంచి వచ్చిందిగా) గుర్తిస్తుంది. తద్వారా దానితో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే.. కాన్సర్ విషయంలో, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తుందన్నమాట.ఏఐ పాత్ర కూడా.. కాగా, ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ రూపకల్పనలో ఏఐ పాత్ర ఎంతో ఉందని రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించుకున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లను రూపొందించడానికి.. AI-ఆధారిత న్యూరల్ నెట్వర్క్ గణనలు అవసరమైన సమయాన్ని తగ్గించగలవని, ఈ ప్రక్రియను ఒక గంటలోపే పూర్తి చేయగలదని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అతిత్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్‌తో పాటు తర్వాతి తరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులను ప్రజలకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్పినట్లుగానే.. వచ్చే ఏడాది నుంచి క్యాన్సర్ వ్యాక్సిన్‌ను జనాలకు.. అదీ ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. -
ఉగ్ర ముద్ర తొలగించేలా.. పుతిన్ కీలక నిర్ణయం
మాస్కో: రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. పలు సంస్థలపై వేసిన ఉగ్రవాద ముద్ర తొలగించేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాద ముద్రను తొలగించే హక్కును కోర్టులకు అప్పగించింది. సంబంధిత చట్టాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ఆఫ్గాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటు దారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు అవకాశం రష్యాకు కలగనుంది. రష్యా తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. కోర్టులు సదరు సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. అనంతరం, ఉగ్రవాద జాబితాలో ఆయా సంస్థలకు కోర్టులు విముక్తి కలిగిస్తాయి. ఇందుకోసం రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఒక నిషేధిత సంస్థ ఉగ్రవాదానికి దూరంగా ఉందని వివరిస్తూ కోర్టుకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తి ఉగ్రవాద జాబితాలో సదరు సంస్థను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయొచ్చు. రష్యా ఉగ్రవాద జాబితాలో ఫిబ్రవరి 2003లో తాలిబాన్, 2020లో సిరియాను చేర్చింది. అయితే, 20 సంవత్సరాల యుద్ధం తర్వాత 2021 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆఫ్గన్ తాలిబాన్ ప్రభుత్వంపై రష్యా మెరుగైన సంబంధాలను కొనసాగిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో ఇప్పుడు తాలిబాన్ మిత్రదేశమని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు మార్లు వ్యాఖ్యానించారు. సిరియాలో ఆరు దశాబ్దాల అసద్‌ల కుటుంబ పాలన నుంచి సిరియాకు చెందిన హయత్ తహ్రీర్ అల్ షామ్ విముక్తి కలిగించింది. అదే సంస్థపై రష్యా విధించిన ఉగ్ర ముద్రను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్ మృతి
మాస్కో: రష్యా రాజధానిలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో రష్యా ఆర్మీ సీనియర్ జనరల్ మృత్యువాతపడ్డారు. ఆర్మీ అణు, జీవ, రసాయన భద్రతా విభాగం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్(54) మంగళవారం కార్యాలయానికి వెళ్లేందుకు తన నివాసం ఆవరణలోని కారు వద్దకు రాగా ఆ పక్కనే స్కూటర్లో అమర్చిన బాంబు పేలింది. ఘటనలో కిరిల్లోవ్తోపాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక తమ సీక్రెట్ సర్వీస్(ఎస్‌బీయూ) హస్తముందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. సోమవారం జనరల్ కిరిల్లోవ్‌పై పలు నేరారోపణలను సంధించిన ఎస్‌బీయూ, మరునాడే ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ముందుకు సాగుతున్న వేళ తాజా పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయి న్లో రష్యా పాల్పడు తున్న దారుణాల్లో కిరిల్లోవ్ కీలకంగా ఉన్నారంటూ కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఆయనపై ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ ఆర్మీపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి కిరిల్లోవ్ ఆదేశాలే కారణమని సోమవారం ఎస్‌బీయూ ఆరోపణలు చేసింది. ‘కిరిల్లోవ్ యుద్ధ నేరస్తుడు, తమ న్యాయబద్ధమైన లక్ష్యం’ అంటూ వ్యాఖ్యానించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో 4,800 పర్యా యాలకుపైగా రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు ఎస్‌బీయూ ఆరోపిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన క్లోరోపిక్రిన్ అనే విష వాయువును ఉక్రెయిన్ బలగాలపై రష్యా ప్రయోగించినట్లు అమెరికా అంటోంది. ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది.తగు రీతిలో ప్రతీకారం తప్పదుజనరల్ కిరిల్లోవ్‌ను చంపేందుకు స్కూటర్లో అమర్చిన బాంబును రిమోట్‌తో పేల్చినట్లు గుర్తించామని రష్యా అధికారులు చెప్పారు. రష్యా దీనిని ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఉక్రెయిన్ను తగు రీతిలో దండిస్తామని ప్రకటించింది. అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలోని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ స్పందిస్తూ..సైనిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఉక్రెయిన్ ఈ చర్యకు పాల్పడిందన్నారు. ఆ దేశ సైనిక, రాజకీయ నాయకత్వం ప్రతీకార చర్యలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. గతంలోనూ ఇటువంటి దాడుల్లో పలువురు రష్యా ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వీటికి ఉక్రెయినే కారణమని రష్యా నిందించింది.🛑Breaking🛑Senior Russian General Igor Kirillov, head of Russia’s NBC defense forces, killed in a scooter bomb explosion in Moscow (Dec 17). pic.twitter.com/Zn9hhzuz3D— Taymur Malik (@Taymur918) December 17, 2024 -
‘సిరియా విషయంలో రష్యా, ఇరాన్ జోక్యం వద్దు’
డెమాస్కస్: సిరియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారుల దాడులతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవడంతో ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో అసద్‌కు రష్యా, ఇరాన్ మద్దతుపై తుర్కీయో కీలక వ్యాఖ్యలు చేసింది.తాజాగా తుర్కీయే విదేశాంగ శాఖ మంత్రి హకస్ ఫిదాన్ మాట్లాడుతూ..‘సిరియా, డమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైంది. ఈ క్రమంలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలకు రష్యా, ఇరాన్‌లు మద్దతు ఇవ్వకూడదు. అసద్‌కు మద్దతు తెలిపే విధంగా వ్యవహరించకూడదు. ఇప్పటికే వారితో మేము చర్చించాం. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో, టెహ్రాన్లు అసద్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలు సహాయం చేసినప్పటికీ తిరుగుబాటుదారులే గెలిచేవారు. అయితే, ఫలితం మరింత హింసాత్మకంగా ఉండేది’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే తిరుగుబాటుదారుల కారణంగా సిరియా కల్లోల పరిస్థితుల నెలకొన్నాయి. అధ్యక్షుడు అసద్ పాలనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో దేశ రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు.మరోవైపు.. సిరియా తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన మొహమ్మద్ అల్ బషీర్ 2025 మార్చి ఒకటో తేదీదాకా పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అల్ బషీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు. -
గుకేశ్‌పై అక్కసు.. ప్రత్యర్థి కావాలనే ఓడిపోయాడంటూ
సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన 14 గేమ్‌ల పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్న్ ఓడించి గుకేశ్ విశ్వవిజేతగా నిలిచాడు. 13 గేమ్‌లు ముగిసేసరికి ఇద్దరూ 6.5–6.5 పాయింట్లతో సమంగా ఉండగా.. నిర్ణయాత్మకమైన ఆఖరి పోరులో గుకేశ్ తన స్కిల్స్‌ను ప్రదర్శించాడు.అయితే ఆఖరి గేమ్ కూడా ఇద్దరి మధ్య నువ్వానేనా అన్నట్టు సాగింది. కానీ గేమ్ డ్రా దిశగా సాగుతున్న సమయంలో 32 ఏళ్ల లిరెన్ భారీ తప్పదం చేశాడు. 55వ ఎత్తుగడలో రూక్(ఏనుగు)ను ఎఫ్2 గడిలోకి పంపించాడు. అతడి పేలవమైన మూవ్ చూసిన గుకేశ్ ఆశ్చర్యపోయాడు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాడు. వెంటనే ఆ ఎనుగును తన ర్యాక్‌తో గుకేశ్ చెక్ పెట్టాడు. ఆ తర్వాత ప్రత్యర్ధికి గుకేశ్ ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. తన 58వ ఎత్తులో కింగ్‌ను ఇ5 గడిలోకి పంపి తన విజయాన్ని గుకేశ్ లాంఛనం చేశాడు. అయితే గుకేశ్ విజయాన్ని యావత్తు భారత్ సెలబ్రేట్ చేసుకుంటుండగా.. రష్యా చెస్ ఫెడరేషన్ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది. చైనా గ్రాండ్ మాస్టర్ లిరెన్ కావాలనే ఓడిపోయాడని వ్యాఖ్యానించింది."గుకేశ్, లిరెన్న్ మధ్య జరిగిన చివరి గేమ్ ఫలితం నిపుణులు, చదరంగం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిర్ణయాత్మక గేమ్‌లో చైనీస్ చెస్ ఆటగాడి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. లిరెన్ ఉన్న స్థితిలో అతడు ఓడిపోతాడని ఎవరూ ఊహించలేదు.అతడు ఓటమి చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ప్రత్యేకంగా విచారణ జరపాలి" రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ ఆండ్రీ ఫిలాటోవ్ పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కావాలనే ఆండ్రీ భారత్‌పై విషం చిమ్ముతున్నాడని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
చైనాకు చెక్.. పుతిన్‌తో భారత్ భారీ ఒప్పందం
ఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహాకారంపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రష్యాతో భారత ప్రభుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.రష్యా పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ఒప్పందంపై చర్చించారు. రాడార్ వ్యవస్థకు సంబంధించిన భారీ రక్షణ ఒప్పందాన్ని రష్యాతో భారత్ కుదుర్చుకుంది. సుమారు నాలుగు బిలియన్ డాలర్ల ఖరీదైన ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థ వోరోనెజ్ రాడార్(Radar Voronezh)ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.దేశ రక్షణ విషయంలో కేంద్రం టెక్నాలజీని పెంచే ఉద్దేశంతో ముందడుగు వేసింది. మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే రాడార్ వ్యవస్థ కొత్త టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. అయితే, అల్మాజ్-ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తున్నది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది.Russia is talks to sell gigantic radar to india.Almaz-Antey’s Voronezh radar detects missiles, aircraft, and threats up to 6,000–8,000 km, supporting Russia’s missile defence network. pic.twitter.com/AmCWaX01Rs— Abhimanyu Manjhi (@AbhimanyuManjh5) December 10, 2024ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రాడార్లతో పసికట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. అధునాతన రాడార్ వ్యవస్థ చైనా, దక్షిణ, మధ్య ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా ముప్పును గుర్తించగలదు. దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది.ఇక, ఇటీవల అల్మేజ్-ఆంటే బృందం భారత్‌లో పర్యటించింది. మేకిన్ ఇండియాలో భాగంగా సుమారు 60 శాతం రాడార్ వ్యవస్థను భారతీయ కంపెనీల ఉత్పత్తులతోనే నిర్మించనున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గలో దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్డ్ డిఫెన్స్ , ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి. -
సిరియా సంక్షోభం.. అసద్ కుటుంబానికి అండగా పుతిన్
మాస్కో: తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని విడిచివెళ్లిపోవడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. ఇదే సమయంలో ఆయన విమాన ప్రమాదంలో మరణించారనే వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అసద్ రష్యాలో ఉన్నట్టు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. రష్యా మీడియా ప్రకటనలో ఊహాగానాలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.సిరియాలో తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో సిరియా అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా విమానంలో బయలుదేరారు. అనంతరం, ఆయన విమానం ఆచూకీ తెలియకపోవడంతో ప్రమాదానికి గురైనట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై మొదట రష్యా స్పందిస్తూ.. అసద్ చనిపోలేదని క్లారిటీ ఇచ్చింది. అనంతరం, అసద్ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పుకొచ్చాయి. ఈ ప్రకటనలో అసద్.. రష్యాలో సురక్షితంగా ఉన్నారని తెలిసింది.ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్ సిరియాను వీడారని రష్యా పేర్కొంది. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయానికి వచ్చారని, అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది.BREAKING: 🇸🇾🇷🇺 Bashar al-Assad and his family are in Moscow, Russia and have been granted asylum. pic.twitter.com/7vO9SBMoGA— BRICS News (@BRICSinfo) December 8, 2024 -
వెంటనే ఆ పిచ్చి పని ఆపేయండి.. రష్యా-ఉక్రెయిన్‌కు ట్రంప్ పిలుపు
వాషింగ్టన్ : ఉక్రెయిన్,రష్యా యుద్ధాన్ని పిచ్చితనంతో పోల్చారు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేందుకు తక్షణ కాల్పుల విరమణ, చర్చలు జరపాలని కోరారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో చైనా కీలక పాత్ర పోషించగలదని ట్రంప్ అభిప్రాయ పడ్డారు.2019లో అగ్ని ప్రమాదానికి గురైన ఫ్రాన్స్‌లోని నోట్రే డామ్ కేథడ్రల్‌ను పునఃప్రారంభించిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ,ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్లు ఒక ఒప్పందం కుదుర్చుకుని పిచ్చి (యుద్ధాన్ని)ని ఆపాలని జెలెన్ స్కీ కోరుకుంటున్నారు. ఉక్రెయిన్ ఇప్పటికే దాదాపు 400,000 మంది సైనికులను కోల్పోయింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలి. ఇందుకోసం ఇరుదేశాలు చర్చలు జరపాలి. చర్చలు జరిపేందుకు చైనా సహాయం చేస్తుంది. ఇరుదేశాల మధ్య చర్చలు జరగాలని, యుద్ధం ఆపాలని ప్రపంచం మొత్తం కోరుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
సిరియా అధ్యక్షుడి ఆచూకీ గల్లంతు.. రష్యా కీలక ప్రకటన
డమాస్కస్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ చెందారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. బషర్ అల్-అసద్ బ్రతికే ఉన్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. కానీ ఆయన జాడ గురించి ప్రస్తావించలేదు. ఆదివారం సిరియా దేశం మొత్తాన్ని రెబల్స్ పూర్తిగా ఆక్రమించారు. దీంతో బషర్ ఆల్-అసద్ అధ్యక్ష పదవిని రెబల్స్‌కు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో పరారయ్యారు. ఆ విమానాన్ని రెబల్స్ కూల్చి వేశారని, కూల్చి వేతతో బషర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.అయితే, అనూహ్యంగా రష్యా కీలక ప్రకటన చేసింది. శాంతియుతంగా అధికారాన్నిఅప్పగించాలని రెబల్స్ ఆదేశాలు ఇవ్వడంతో బషర్ అల్ అసద్ తన పదవిని విడిచిపెట్టారని, ఆపై దేశం విడిచి వెళ్లినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.కానీ, అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రష్యా చెప్పలేదు. దేశం వదిలే వెళ్లే సమయంలో జరిపిన చర్చలలో తాము పాల్గొనలేదని పేర్కొంది. మరోవైపు, సిరియాని రెబల్స్ స్వాధీనం చేసుకున్న పరిణామల నేపథ్యంలో రష్యా సైనిక స్థావరాలను హై అలర్ట్‌లో ఉంచామని, అయితే ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని పేర్కొంది.అసద్‌కు అండగా రష్యాసిరియాలో 2015లో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంపై పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. బషర్ ఆల్-అసద్ పదవి విడిచి పెట్టిన అనంతరం జరుగుతున్న వరుస పరిణామలపై రష్యా గమనిస్తుంది. -
అసద్ పాలన అంతం
డమాస్కస్/బీరూట్: అర్ధ శతాబ్దానికిపైగా అసద్ కుటుంబ అరాచక, నిరంకుశ పాలనలో, అంతర్యుద్ధంతో అణచివేతకు, వెనకబాటుకు గురైన పశ్చిమాసియా దేశం సిరియా చరిత్రలో కీలక పరిణామం సంభవించింది. ఒక్కో నగరాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న తిరుగుబాటుదారులు ఆదివారం దేశ రాజధాని డమాస్కస్‌లో కాలుమోపి అసద్ పాలనకు తెరదించారు. అధ్యక్షుడుసహా భద్రతా బలగాలు దేశాన్ని విడిచి పారిపోవడంతో ఇక సిరియాకు స్వేచ్ఛ లభించిందని తిరుగుబాటుదారులు ప్రకటించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయిన ప్రజలు ఆయన పాలన అంతమైందని తెల్సి వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. భద్రతా బలగాలు వదిలివెళ్లిన తుపాకులు టీనేజర్లు తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపి హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. అన్యాయంగా ఏళ్ల తరబడి కారాగారాల్లో చీకటి కొట్టాల్లో మగ్గిపోయిన అమాయకులందరినీ సయ్యద్నాయా జైలు నుంచి విడిపించినట్లు తిరుగుబాటుదారులు ప్రభుత్వ టెలివిజన్ ఛానెల్లో అధికారికంగా ప్రకటించారు. రక్షణశాఖ కార్యాలయం ఉన్న ప్రఖ్యాత ఉమాయద్ స్కే్కర్ వద్దకు చేరుకుని జనం మూడు నక్షత్రాలు, త్రివర్ణ సిరియా విప్లవ జెండాలను ఎగరేశారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘‘ ఇడ్లిబ్ నుంచి మొదలెట్టి డమాస్కస్ సిటీదాకా రావడానికి తిరుగుబాటు సింహాలకు ఎంతోకాలం పట్టలేదు. మా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం’’ అని స్థానికులు ఆనందంతో చెప్పారు. దేశాధ్యక్షుడు, సైనిక కాపలాలేని అధ్యక్ష కార్యాలయం, అసద్ కుటుంబ నివాసాల్లోకి జనం చొరబడి అక్కడి విలువైన వస్తువులు, నిత్యావసర సరకులు ఎత్తుకెళ్లారు. దేశం రెబెల్స్ చేతుల్లోకి వెళ్లడంపై దేశ ప్రధాని మొహహ్మెద్ ఘాజీ అల్ జలానీ స్పందించారు. ‘‘ అధ్యక్షుడు పారిపోయారు. నేనెక్కడికీ పారిపోలేదు. నా సొంతింట్లోనే ఉన్నా. అధికారంలోకి రాబోతున్న విపక్షాలు, తిరుగుబాటుదారులకు ఇదే నా ఆహ్వానం. అధికార మార్పిడికి సిద్ధం. ప్రజలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంచేయడం, లూటీచేయడం మానుకోవాలి’’ అని ప్రధాని ఘాజీ జలానీ వీడియో సందేశంలో ప్రకటించారు. నిరంకుశ పాలన ముగిందని తెలిసి గత 14 ఏళ్లుగా తుర్కియే, జోర్డాన్, లెబనాన్ దేశాల్లో తలదాచుకుంటున్న సిరియన్లు చాలా మంది మళ్లీ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఇడ్లిబ్ వద్ద జాతీయరహదారి వద్ద క్యూ కట్టిన కార్లతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లెబనాన్‌లోని మస్కా బోర్డర్ గుండా సిరియన్లు లోపలికి వస్తున్నారు. ‘‘ బషర్ పాలనతో పోలిస్తే ఇకపై సిరియాలో పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉండొచ్చు. అందుకే స్వదేశం వెళ్తున్నాం’’ అని హమా నుంచి శరణార్థిగా లెబనాన్‌కు వచ్చిన సమీ అబ్దెల్ లతీఫ్ చెప్పారు.మెరుపువేగంతో ఆక్రమణ2018 ఏడాది తర్వాత తిరుగుబాటుదారులు మళ్లీ డమాస్కస్ దాకా రాలేకపోయారు. కానీ నవంబర్ 27 నుంచి విపక్షాల దన్నుతో రెబల్స్ మెరుపువేగంతో ముందుకు కదిలారు. సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్న ఇరాన్, రష్యాల నుంచి అసద్ సైన్యానికి ఎలాంటి ఆయుధ, సైనిక సాయం లేకపోవడంతో తిరుగుబాటుదారులకు ఎదురే లేకుండాపోయింది. అలెప్పో, హమా, హోమ్స్ మొదలు సిరియా దక్షిణప్రాంతాన్నంతా ఆక్రమించిన రెబెల్స్ వడివడిగా రాజధాని డమాస్కస్ వైపుగా కదిలి విజయపతాకం ఎగరేశారు. హయత్ తహ్రీర్ అల్–షామ్(హెచ్‌టీఎస్) గ్రూప్ నేతృత్వంలో ఈ తిరుగుబాటుదారులు అసద్ సైన్యంతో పోరాడి యావత్ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. 2017 నుంచే వాయవ్య సిరియా మొత్తాన్ని పాలిస్తున్న హెచ్‌టీఎస్ గ్రూప్ ఇప్పుడు యావత్సిరియాను సురక్షిత దేశంగా ఏ విధంగా పాలిస్తుందో వేచిచూడాల్సిందే. అంతర్యుద్ధాన్ని రూపుమాపి, అమెరికా ఆంక్షలను తట్టుకుని దేశాన్ని ముందుకు నడిపించాల్సి ఉంది. అంతర్జాతీయ సమాజంతోపాటు, మైనారిటీల మెప్పు పొందేందుకు బహుళత్వాన్ని, పరమత సహనాన్ని సాధించేందుకు హెచ్‌టీఎస్ అధినేత అబూ మొహమ్మెద్ గోలానీ ఏ మేరకు సిద్ధపడతారోనని పశ్చిమాసియా దేశాలు ఎదురుచూస్తున్నాయి. ‘‘తక్షణం జెనీవాలో చర్చలు మొదలెట్టి కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు, సాధారణ రాజకీయ, అధికార మార్పిడి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి’’ అని ఐరాసలో సిరియా రాయబారి గెయిర్ పెడర్సన్ కోరారు. సిరియాలో అసద్పాలన అంతమైన నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, జోర్డాన్, రష్యా, తుర్కియే, ఖతార్ దేశాల విదేశాంగ మంత్రులు అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. అదును చూసి ఆక్రమించిన ఇజ్రాయెల్సిరియాతో సరిహద్దును పంచుకుంటున్న ఇజ్రాయెల్ ఈ పరిణామాన్ని తనకు అనువుగా మార్చుకుంటోంది. 1974లో కుదిరిన ఒప్పందాన్ని కాలరాస్తూ గోలన్‌హైట్స్ సమీప నిస్సైనికీకరణ(బఫర్‌జోన్) ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సేనలు ఆక్రమించాయి. యుద్ధం సందర్భంగా 1967 జూన్‌లో సిరియా నుంచి గోలన్‌హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన విషయం విదితమే. దేశం తమ స్వాధీనంలోకి వచ్చిన నేపథ్యంలో తన పేరును అహ్మద్ అల్షారాగా గోలానీ మార్చుకున్నారు. తొలిసారిగా డమాస్కస్‌లోని ఉమయ్యాద్ మసీదుకు వచ్చి అందరి సమక్షంలో ప్రసంగించారు. ‘‘ ప్రభుత్వ సంస్థల వద్ద కాల్పులు జరపకండి. అధికార మార్పిడి జరిగేదాకా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రధాని ఘాజీ జలానీ సారథ్యంలోనే పనిచేస్తాయి’’ అని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఆపేందుకు సోమవారం ఉదయం దాకా డమాస్కస్‌లో కర్ఫ్యూ విధించారు. ‘‘ సిరియా ఇప్పుడు అందరికీ. డ్రూజ్‌లు, సున్నీలు, అల్లవీట్, మైనారిటీలందరికీ సమాన హక్కులుంటాయి’’ అని రెబల్ కమాండర్ అనాస్ సల్ఖాదీ ప్రకటించారు. రెబల్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆదివారం యెమెన్ ప్రకటించింది. జర్మనీ, ఫ్రాన్స్‌సహా చాలా యూరోపియన్ దేశాలు అసద్ పాలన అంతంపై హర్షంవ్యక్తంచేశాయి. 🚨Breaking NewsDamascus has fallen. Syria Rebel forces took over the capital.🇸🇾 Assad is expected to leave the country soon, US officials say. pic.twitter.com/YAsXFu0lO1— MediaMan (@Mr_Sheriiii) December 8, 2024సురక్షితంగా భారతీయులు న్యూఢిల్లీ: అసద్ ప్రభుత్వం కూలిపోయి సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లినాసరే అక్కడి భారతీయులు క్షేమంగానే ఉన్నారని భారత సర్కార్ ఆదివారం స్పష్టంచేసింది. డమాస్కస్‌లో భారత రాయబార కార్యాలయం యథాతథంగా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్కడి భారతీయులతో ఇండియన్ ఎంబసీ సంప్రతింపులు జరుపుతోందని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆయా వర్గాలు వెల్లడించాయి.రష్యాలో అసద్ ?మిత్రదేశాలు ఇరాన్, రష్యాల నుంచి సైనికసాయం అందక, సొంత సైన్యంతో తిరుగుబాటుదారులను ఎదుర్కొనే సామర్థ్యంలేక అధ్యక్షుడు అసద్ దేశాన్ని వీడారు. రష్యా తయారీ ఇలూషిన్–ఐఎల్76 రకం సిరియా ఎయిర్‌ఫ్లైట్ నంబర్ 9218 విమానంలో ఆదివారం తెల్లవారుజామునే అసద్ దేశం వదిలి పారిపోయారని సిరియా స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అసద్ రష్యా లేదా ఇరాన్‌కు పారిపోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే అసద్‌కు, ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం కల్పించినట్లు ఆదివారం రాత్రి వార్తలు వెలువడ్డాయి. ఆయన మాస్కో చేరుకున్నట్లు తెలిపాయి. అసద్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారుల జాడ కూడా తెలీడంలేదు. సైన్యాధికారులు ఇరాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. దేశం విడిచివెళ్లడానికి ముందే అసద్.. తిరుగుబాటుదారులతో హడావిడిగా చర్చలు జరిపి శాంతియుతంగా అధికార మార్పిడిపై తగు సూచనలు చేసి వెళ్లారని రష్యా విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. ఇంకా తమ సైనిక స్థావరం సిరియాలోనే కొనసాగుతుందని రష్యా స్పష్టంచేసింది. రష్యా ముఖం చాటేయడంతోనే అసద్ పారిపోయాడని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.సుస్థిర శాంతి సాధ్యమా?ఇన్నాళ్లూ అసద్ ఏలుబడిలో యావత్ సిరియా లేదని వాస్తవ పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. 14 రాష్ట్రాలకుగాను కేవలం మూడు రాష్ట్రాల్లోనే అసద్ పాలన కొనసాగుతోంది. మిగతా చోట్ల వేర్వేరు తిరుగుబాటుదారుల కూటములు, మిలిటెంట్ ముఠాలు పాలిస్తున్నాయి. తక్కువ ప్రాంతానికి పరిమితమైనాసరే ఇరాన్, రష్యాల ప్రత్యక్ష సహకారం ఉండబట్టి అసద్ పరిపాలిస్తున్న ప్రాంతానికి మాత్రమే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్ నేషనల్ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్‌ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్‌టీఎస్ తిరుగుబాటుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. గోలన్హైట్స్సహా కొంతభాగాన్ని దశాబ్దాల క్రితమే ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది.زندانیان آزاد شده از زندان صیدنایاPrisoners released from Saydnaya Prison#دمشق #سوریه #Syria #Damascus #بشار_الأسد pic.twitter.com/HI0ZW6G9H0— Nima Cheraghi (@CheraghiNima) December 8, 2024 -
మేకిన్ ఇండియా పాలసీ భేష్ : పుతిన్
మాస్కో: భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా ఫస్ట్ పాలసీ మేకిన్ ఇండియా అద్భుతమని రష్యాలో జరుగుతున్న15వ వీటీబీ ఇన్వెస్ట్ ఫోరమ్‌లో కొనియాడారు. ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసం స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు అమోఘం. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రూపొందించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్లో స్థిరమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు మోదీ నేతృత్వంలోని భారత్ చేస్తున్న ప్రయత్నాలు భాగున్నాయి. ఈ సందర్భంగా భారత్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
పుతిన్, కిమ్ మధ్య కుదిరిన డేంజర్ డీల్..
మాస్కో: రష్యా, ఉత్తరికొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఏన్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకోనుంది.రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందం చేసుకున్నారు. అయితే, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం, ఆపత్కాల సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక, అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పుతిన్‌కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు పది వేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది. మరోవైపు.. రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో.. కిమ్‌కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. పైగా యుద్ధభూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌తో రష్యా పోరులో భాగంగా పుతిన్‌కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాస్ చేసినట్టు సమాచారం. #BREAKING North Korea, Russia defence treaty has come into force: KCNA pic.twitter.com/3ODW1bg5Bl— AFP News Agency (@AFP) December 4, 2024 -
ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు
న్యూయార్క్:సుదీర్ఘంగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తాజాగా ఆ దేశంపై సంచలన ఆరోపణలు చేసింది. సిరియాలో అంతర్యుద్ధానికి కారణమైన ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ రెబల్స్‌కు ఉక్రెయిన్ సాయం చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఐక్యరాజ్యసమితి(యూఎన్)లో అభ్యంతరం వ్యక్తం చేశారు. సిరియాలో అధ్యక్షుడు బషర్ అసద్ అల్ పాలనపై తిరుగుబాటు చేస్తున్న రెబల్స్‌కు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అండదండలున్నాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ తమకు ఆయుధాలు సరఫరా చేస్తున్న విషయాన్ని కొంత మంది రెబల్స్ బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు.రెబల్స్‌కు శిక్షణ కూడా ఇస్తున్నారన్నారు. కాగా,రెబల్స్ నుంచి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తూ తిరుగుబాటుదారులపై రష్యా వైమానిక దాడులు చేస్తోంది. -
భారత పర్యటనలో వ్లాదిమిర్ పుతిన్.. షెడ్యూల్ ఖరారు
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్.. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌కు రానున్నారు. పర్యటనకు సంబంధించి భారత్ పంపిన తాత్కాలిక షెడ్యూల్ తమకు అందిందని పుతిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దేశాల పర్యటనపై పుతిన్,మోదీల మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం.. ఇప్పటికే మోదీ రష్యాలో పర్యటించగా.. ఈ సారి పుతిన్ భారత్‌లో పర్యటించనున్నట్లు యూరి ఉషకోవ్ తెలిపారు.మోదీ ఈ ఏడాది రెండుసార్లు రష్యాలో పర్యటించారు. జులైలో రష్యా రాజధాని మాస్కోలో 22వ రష్యా-ఇండియా సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్‌లో మోదీ పాల్గొన్నారు. రెండోసారి ఈ అక్టోబర్ నెలలో కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరయ్యారు. -
Russia Ukraine War: నాటోలో చేర్చుకోండి.. యుద్ధం ఆపేస్తాం
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇరుదేశాల సైనికులు నీరసించిపోతున్నారు. శత్రుదేశంలో ఇక పోరాడలేమంటూ ఉక్రెయిన్, రష్యా జవాన్లు తేల్చిచెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలూ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యా సైన్యం అక్కడే తిష్టవేసింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ భూభాగాలు రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్‌లో ఐదింట ఒక వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. సాంకేతికంగా, చట్టపరంగా ఇది ఉక్రెయిన్ పరిధిలోనిదే. అయినప్పటికీ ప్రస్తుతం దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి పట్టులేదు. మరోవైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) కూటమిలో చేరికపట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉత్సాహం చూపిస్తున్నారు. కనీసం ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని అయినా నాటోలో చేర్చుకుంటే యుద్ధంతో అత్యంత కీలక దశను ముగించే అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా చాలా వేగంగా జరగాలని అభిప్రాయపడ్డారు. తాజాగా స్కైన్యూస్ సంస్థకు జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ అ«దీనంలో ఉన్న ప్రాంతానికి పూర్తి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వాలని నాటోను కోరారు. అలాగైతే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని తెలిపారు. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం భూభాగాన్ని.. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో సహా నాటోలో చేర్చుకోవాలని చెప్పారు. దాంతో రష్యా ఆక్రమించిన భూమిని దౌత్య మార్గాల్లో మళ్లీ తాము స్వా«దీనం చేసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పిస్తే రష్యాతో యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ స్పష్టంచేశారు. కానీ, సభ్యత్వం విషయంలో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ను ఇప్పటికిప్పుడు తమ కూటమిలో చేర్చుకోవడానికి నాటోలోని కొన్ని దేశాలు ఇష్టపడడం లేదని సమాచారం.ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
నన్ను క్షమించండి ఏంజిలా మెర్కల్ : పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. జర్మనీ మాజీ ఛాన్సలర్ (ప్రధాని) ఏంజిలా మెర్కల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. 17ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?పుతిన్‌కు శునకాలంటే మహా ప్రాణం. అందుకే దేశాది నేతలతో జరిగే సమావేశాల్లో సైతం శునకాలు పుతిన్‌తో దర్శనమిస్తుంటాయి. అయితే, 17ఏళ్ల క్రితం అంటే 2007 సోచి నగరంలో పుతిన్- అప్పటి జర్మనీ ప్రధాని ఏంజిలా మెర్కల్ మధ్య ఓ సమావేశం జరిగింది. అయితే ఆ మీటింగ్‌కు పుతిన్‌తో పాటు ఆయన పెంపుడు శునకం లాబ్రడార్ కోని కూడా తీసుకువచ్చారు. సమావేశంలో జరుగుతున్నంత సేపు మెర్కల్తో పాటు పుతిన్ చుట్టూ తచ్చాడుతూ కనిపించింది. దీంతో స్వతహాగా శునకాలంటే భయపడే మెర్కల్ లాబ్రడార్ కోని చూసి ఆందోళనకు గురయ్యారు. నాటి ఘటనపై తాను రాసిన పుస్తకంలో మెర్కల్ ‘ఫ్రీడమ్’ అనే టైటిల్‌తో ప్రస్తావించారు. అందులో పుతిన్ తనని భయపెట్టాలని తన శునకాన్ని సమావేశానికి తెచ్చారని అర్ధం వచ్చేలా రాశారు. తాజాగా విడుదల మెర్కల్ పుస్కకంలో 2007 నాటి ఘటనపై వ్లాదిమిర్ పుతిన్ బహిరంగంగానే స్పందించారు. మెర్కల్‌కు మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. -
పేరు మార్చుకుని పుతిన్ కూతురు రహస్య జీవనం.. ఎక్కడ ఉన్నారంటే?
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న నాటి నుంచి వ్లాదిమిన్ పుతిన్ ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే సమయంలో పుతిన్.. కుటుంబ సభ్యు గురించి కూడా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక, తాజాగా పుతిన్ రహస్య కుమార్తె తన పేరు మార్చుకుని పారిస్ లో ఉంటున్నారని సమాచారం. ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి మరో విషయం బయటకు వచ్చింది. పుతిన్, సెత్వాన్ క్రివోనోగిఖ్ కుమార్తె ఎలిజావేటా క్రివోనోగిఖ్ పేరు బయటకు వచ్చింది. ఎలిజావేటా ప్రస్తుతం తన పేరు మార్చుకుని లాయిజా రోజోవా అనే పేరుతో పారిస్ లో ఉంటున్నారని ఉక్రెయిన్ కు సంబంధించిన మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రోజోవా రహస్యంగా పారిస్ లో ఉంటున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. వ్యాపారవేత్త అయిన సెత్వాన్ క్రివోనోగిఖ్(49) పుతిన్ భాగస్వామిగా ఉన్నారని మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి. ఇక, అంతకుముందు కూడా పుతిన్ మరో కూతురు కేథరిన్ టిఖోనోవా గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. కేథరినా ఒక డ్యాన్సర్(జిమ్నాస్టిక్). ఆమె రష్యాకు చెందిన బిలియనీర్ ను వివాహం చేసుకుంది. వారిద్దరూ 2017లో విడిపోయారు.🚨 Vladimir Putin has an illegitimate daughter living under a pseudonym in Paris where she works as a DJ: pic.twitter.com/twtwfxWqyM— Emmanuel Rincón (@EmmaRincon) November 29, 2024 -
ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు: పుతిన్ షాకింగ్ కామెంట్స్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలే తనను షాక్ కు గురిచేశాయని తెలిపారు.పుతిన్ తాజాగా ఖజికిస్తాన్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ట్రంప్ వెనుకాడరు. అయితే, ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఆయన ప్రాణాలకు రక్షణ లేదు. అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. ఎన్నికల సమయంలో ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడులు జరిగాయి. వీటన్నింటినీ ట్రంప్ అర్థం చేసుకోవాలి అని సూచనలు చేశారు. ఇదే సమయంలో ట్రంప్.. యుద్ధాలను సైతం ఆపేయగలరని పుతిన్ కితాబు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాలో ట్రంప్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చడంతో ట్రంప్ చెవి దగ్గరి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో ట్రంప్ చెవికి గాయమైంది. -
అణుయుద్ధంగా మారనుందా?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అనూహ్యంగా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్ ఏటీఏసీఎంఎస్ క్షిపణులను రష్యా మీద ప్రయోగించింది. ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లను ఉపయోగిస్తోందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, బహుళజాతి స్వభావానికి విస్తరించినట్టయింది. దీనికితోడు పుతిన్ తమ అణ్వా యుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఆందోళనను రేకెత్తించారు. 1962 క్యూబా సంక్షోభంలో అమెరికా, రష్యాల్లోని రాబందులు ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, అధినేతలు వివేకంతో వ్యవహరించారు. కానీ, ఈ అస్థిర కాలంలో అలాంటి వివేకం సాధ్యమా?రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నవంబర్ 19 నాటికి 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్ 17న అమెరికా సైన్యపు టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎంఎస్)ను ఉపయోగించే అధికా రాన్ని ఉక్రెయిన్‌కు కట్టబెట్టగానే ఆ యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది.ఈ నిర్ణయం ద్వారా, ‘అంకుల్ జో’ ఎట్టకేలకు ‘ధైర్య ప్రదర్శన’ చేసినట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కాకతాళీయమో, ఉద్దేశ పూర్వకమో గానీ యుద్ధంలో ఆకస్మికమైన, ప్రమాదకరమైన పెరుగు దల స్పష్టంగా కనబడుతోంది.తీవ్రతను పెంచిన జో!దీర్ఘ–శ్రేణి పాశ్చాత్య తయారీ క్షిపణులను ఉపయోగించే ఆమోదం కోసం ఉక్రెయిన్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే యుద్ధాన్ని ఇద్దరు ప్రత్యర్థులకే పరిమితం చేసే వివేకంతో, సంయమనం చూపుతూ వాషింగ్టన్ దీనిని నిలిపి ఉంచింది. అలాంటిది బైడెన్ అధ్యక్షత దాని ‘అత్యంత బలహీన’ దశలో ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వైట్ హౌస్ పీఠం కోసం నవంబర్ మొదట్లో అమెరికా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, జనవరి 20న కొత్త అధ్యక్షుడు (డోనాల్డ్ ట్రంప్) బాధ్యతలు స్వీకరించే సంధి కాలం ఇది.ఉక్రెయిన్ తన కొత్త ఆయుధాలను ఉపయోగించడంలో ఎక్కువ సమయాన్ని పోగొట్టుకోలేదు. నవంబర్ 20న రష్యాలోని లక్ష్యాలపై ఏటీఏసీఎంస్ క్షిపణులను ప్రయోగించింది. పైగా, బ్రిటన్ సరఫరా చేసిన స్టార్మ్ షాడో క్షిపణులతో అనంతర దాడిని కొనసాగించింది.అంతకుముందు, ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లను కూడా ఉప యోగిస్తుందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. తద్వారా రష్యా– ఉక్రెయిన్ మధ్య నుండి యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, విస్తృత బహుళ జాతి స్వభా వానికి విస్తరించినట్టయింది.భయాన్ని పెంచిన రష్యాఅయితే మాస్కో దాదాపు వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. నవంబర్ 21న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తమ సైన్యం తూర్పు ఉక్రేనియన్ నగరమైన డ్నిప్రోపై ‘కొత్త సాంప్రదాయిక మధ్యంతర శ్రేణి క్షిపణి’ని ఉపయోగించి దాడి చేసిందని ప్రకటించారు. దీన్ని ఒరేష్నిక్గా వర్గీకృతమైన ప్రయోగాత్మక మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా గుర్తిస్తున్నారు.అమెరికన్, బ్రిటిష్ దీర్ఘ–శ్రేణి ఆయుధాల వినియోగానికి ప్రతి స్పందనగా, నవంబర్ 21న రష్యన్ సాయుధ దళాలు ఉక్రెయిన్ సైనిక–పారిశ్రామిక సముదాయాలలో ఒకదానిపై దాడిని నిర్వహించా యని పుతిన్ పేర్కొన్నారు. ‘హైపర్సోనిక్ ఒరేష్నిక్ క్షిపణిని ఉప యోగించడానికి కారణం ఏమిటంటే, అమెరికా నేతృత్వంలోని కూటమి ఈ యుద్ధాన్ని మరింత మారణ హోమంవైపు పెంచాలని నిర్ణయించుకుంటే, రష్యా దృఢమైన రీతిలో ప్రతిస్పందిస్తుంది. రష్యా ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉంది. ఎవరైనా ఇప్పటికీ దీనిని అనుమానించినట్లయితే, వారలా చేయకూడదు. ఎల్లప్పుడూ రష్యా ప్రతిస్పందన తగురీతిలో ఉంటుంది’ అని పుతిన్ పేర్కొన్నారు.ఈ ప్రతిస్పందన అణ్వాయుధ సహితంగా ఉంటుందా? అనేక ఐరోపా దేశాలు భయపడే ఘోరమైన దృష్టాంతం ఇది. పుతిన్ తమ అణ్వాయుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఈ ఆందోళనను మరింతగా రేకెత్తించారు.రష్యా మునుపటి అణు సిద్ధాంతం, సాంప్రదాయ నమూనాలో రూపొందినది. అంటే అణ్వాయుధం అంతటి విధ్వంసకరమైన సామ ర్థ్యాన్ని ఉపయోగించడం గురించి ఆలోచించకుండా, కేవలం ప్రత్యర్థిని, అంటే అమెరికాను ‘నిరోధించడానికి’ మాత్రమే ఉద్దేశించబడింది. రెండవ షరతు ఏమిటంటే, రాజ్య ఉనికికి ముప్పు కలిగించే సాంప్రదాయ సైనిక దాడిని తిప్పికొట్టడం.అయితే, మాస్కో సవరించి ప్రకటించిన నవంబర్ సిద్ధాంతం మొత్తం పరిధిని విస్తరించింది. అణుశక్తి మద్దతు ఉన్న అణుయేతర శక్తి ద్వారా ఎదురయ్యే ఏ దాడినైనా సరే... ఉమ్మడి దాడిగా పరిగణి స్తామని రష్యా పేర్కొంది. అలాగే, మిలిటరీ కూటమిలోని ఒక సభ్య దేశం (ఈ సందర్భంలో, అమెరికా నేతృత్వంలోని కూటమి) చేసే ఏ దాడినైనా మొత్తం కూటమి చేసిన దాడిగా పరిగణిస్తామని కూడా రష్యా స్పష్టం చేసింది.2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రారంభ దశ నుండి కూడా మాస్కో తన అణు సామర్థ్యం గురించి యోచిస్తోంది. అయితే, ఒక అవగాహన ప్రకారం రష్యా ఈ రెడ్ లైన్ ను దాటదనీ, దీనిని కేవలం ఒక బెదిరింపుగా మాత్రమే చూడాలనీ కొంరు పాశ్చాత్య వ్యాఖ్యాతలు కొట్టేశారు. కానీ అలాంటి ఆత్మసంతృప్తి తప్పుదారి పట్టించేదీ, ప్రమాదకరమైనదీ కావచ్చు.వివేకం కలిగేనా?అమెరికాకూ, మునుపటి సోవియట్ యూనియన్ కూ మధ్య 1962 క్యూబా క్షిపణి సంక్షోభం ఆ సంవత్సరం అక్టోబర్ మధ్యలో ప్రారంభమై ప్రపంచాన్ని దాదాపుగా అణుయుద్ధంలోకి నెట్టింది. అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ, సోవియట్ అధ్యక్షుడు నికితా కృశ్చేవ్ అనే ఇద్దరు నాయకులు చివరి నిమిషంలో ప్రదర్శించిన వివేకం కారణంగా ఈ విధ్వంసకరమైన పరస్పర హనన కార్యక్రమం నిలిచిపోయింది. వారు 1962 నవంబర్ 20న సంయుక్తంగా దీనికి ‘మంగళం పాడేయాలని’ నిర్ణయించుకున్నారు.రెండు దేశాల్లోని రాబందులు ఆ ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, శిఖరాగ్ర స్థాయిలో అధినేతలు దృఢమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. సోవియట్ జలాంతర్గామి కెప్టెన్ ప్రదర్శించిన వ్యూహాత్మక సంయమనం కారణంగా అదృష్టవశాత్తూ అణు నిషేధం ఉల్లంఘనకు గురికాలేదు. ప్రస్తుత అస్థిర కాలంలో అలాంటి సంయ మనం పాటిస్తారా?ఒరేష్నిక్ను ఆవిష్కరించడం ద్వారా, రేడియేషన్ లేకుండా అణ్వా యుధానికి దగ్గరగా ఉండే అసాధారణ సామర్థ్యాన్ని రష్యా ప్రదర్శించింది. ఒరేష్నిక్ అనేది 2,500 కి.మీ. పరిధి కలిగిన కొత్త తరం రష్యన్ మధ్యంతర శ్రేణి క్షిపణి అనీ, దీన్ని 5,000 కి.మీ. పరిధి వరకు విస్తరించవచ్చనీ రష్యన్ మీడియా నివేదించింది.సహజసిద్ధంగా హైపర్ సోనిక్ అయిన ఈ క్షిపణి వేగం ‘మాక్ 10–మాక్ 11’ మధ్య ఉంటుంది (గంటకు 12,000 కి.మీ. కంటే ఎక్కువ). అంటే దీన్ని గుర్తించడం కష్టం. పైగా, ప్రస్తుత క్షిపణి నిరోధక సాంకేతికత ఈ క్షిపణిని అడ్డగించలేదు. కాలినిన్ గ్రాడ్లోని రష్యన్ స్థావరం నుండి దీన్ని ప్రయోగిస్తే యూరోపియన్ రాజధానులను చాలా తక్కువ సమయంలో (సెకన్లలో) ఢీకొంటుంది: వార్సా 81; బెర్లిన్ 155; పారిస్ 412; లండన్ 416. రష్యా ఉప విదే శాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ అక్టోబర్ 3న ప్రకటన చేస్తూ, అణ్వా యుధ శక్తుల మధ్య ప్రత్యక్ష సాయుధ ఘర్షణ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయలేమని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటింది. ఇది క్లిష్టమైన శిఖరాగ్రానికి సిద్ధంగా ఉంది. ఒక పౌర అణు ప్రమాదం లేదా ఉద్దేశపూర్వక సైనిక సంఘటన రెండూ విపత్తుతో కూడి ఉంటాయి. పైగా అమెరికా పాలనలో అత్యంత బలహీనమైన ప్రస్తుత దశ ఏ సంభావ్యతకూ అవకాశం ఇవ్వకూడదు. బైడెన్ పాలన తర్వాత వస్తున్న ట్రంప్ 2.0 అధ్యక్షత విఘాతం కలిగించేదిగానూ, దుస్సాహ సికంగానూ ఉంటుంది. మొత్తం మీద 2025 సంవత్సరం మరింత అల్లకల్లోలంగా ఉండబోతోంది.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ఢిల్లీలోని సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రష్యాకు ఎదురుదెబ్బ.. దూసుకెళ్తున్న ఉక్రెయిన్ దళాలు!
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా రష్యా ఆధీనంలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి దిగాయి. జపరోజియాలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ సందర్భంగా రష్యా స్పందిస్తూ.. 24 గంటల్లో ఐదుసార్లు డ్రోన్ దాడులు జరిగినట్టు తెలిపింది. ఉక్రెయిన్ దాడుల్లో ప్లాంట్ పరిపాలన భవనం దెబ్బతిన్నట్టు పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్‌కు చెందిన మూడు డ్రోన్లను తాము కూల్చివేసినట్టు రష్యా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు అమెరికా అణ్వాయుధాలను సరఫరా చేయడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సందర్భంగా రష్యా సీనియర్ భద్రతా అధికారి డిమిత్రి మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు అణుయుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే, అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచంలోని అనేక మంది జీవితాలను బలిగొనేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్‌తో రష్యా పోరులో అమెరికా.. కీవ్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే కొత్త అణు విధానం ప్రకారం తాము స్పందిస్తామని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. రష్యా వద్ద మొత్తం 4,380 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిల్లో 1,700 వినియోగానికి సిద్ధంగా ఉంచారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పుతిన్ నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు పాల్పడిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు సిద్ధంగా ఉంచినట్టు ఆ దేశ సైనికుడు ఆంటోన్ చెప్పుకొచ్చాడు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు తాము కేవలం యుద్ధ విన్యాసాల సమయంలో మాత్రమే సాధన చేసే వాళ్లమని.. కానీ, కీవ్‌పై దండయాత్ర మొదలైన నాడే పూర్తిస్థాయి అణు దాడికి సిద్ధమైనట్లు వెల్లడించాడు. 🇷🇺🇺🇦The deputy head of Russia's Security Council, Dmitry Medvedev, has commented on discussions by US politicians and journalists about the transfer of nuclear weapons to Kiev:The very threat of transferring nuclear weapons to the Kiev regime can be seen as a preparation for a… pic.twitter.com/m92Vg3HeGK— dana (@dana916) November 26, 2024 -
మంటల్లో విమానం.. 89 మందిని సినీ ఫక్కీలో రక్షించిన సిబ్బంది
టర్కీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. రష్యా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ ప్లేన్కు మంటలు అంటుకున్నాయి. అయితే.. ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తతో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం అందరూ సురక్షితంగా బయటపడ్డారు.అజిముత్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం(రష్యా).. నల్ల సముద్రం తీరాన ఉన్న సోచి రిసార్ట్ నుంచి ప్రయాణికులను తీసుకుని టర్కీ అంటల్యా ఎయిర్‌పోర్టుకు చేరింది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగి.. క్రమంగా విమానానికి వ్యాపించాయి.విమానంలో 89 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వెంటనే పైలట్ విమానాన్ని రన్‌వేపై ర్యాష్ ల్యాడింగ్ చేశాడు. అయితే సకాలంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పందించారు. సినీ ఫక్కీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. విమానం నుంచి అందరినీ బయటకు రప్పించారు. మంటలను ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సదరు విమానం ఏడేళ్ల కిందటే సర్వీస్‌లోకి వచ్చిందని, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. This was the terrifying moment a plane the #Russian-made #Sukhoi Superjet 100 passenger plane from #AzimuthAirlines went up in flames following a nightmare landing at a #Turkish #Antalya airport. pic.twitter.com/QY3EmzdQBY— Hans Solo (@thandojo) November 25, 2024 -
ఉ.కొరియా చేతికి రష్యన్ గగనతల రక్షణ క్షిపణులు
సియోల్: ఉక్రెయిన్ యుద్ధం పరోక్షంగా ఉత్తర కొరియా, రష్యాల రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాల్లో పాల్గొనేందుకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు అక్టోబర్‌లో రష్యాకు తరలివెళ్లిన విషయం తెల్సిందే. ఉత్తరకొరియా సాయానికి బదులుగా రష్యా సైతం పెద్ద సాయమే చేసిందని దక్షిణకొరియా శుక్రవారం ప్రకటించింది. గగనతల రక్షణ క్షిపణులను ఉ.కొరియాకు రష్యా అందించిందని దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్సుక్కు జాతీయ భద్రతా సలహాదారు షిన్ వోన్సిక్ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు ఎస్బీసీ టీవీ కార్యక్రమంలో షిన్ మాట్లాడారు. ‘‘ ఉ.కొరియా గగనతల రక్షణ వ్యవస్థలో వాడే క్షిపణులను రష్యా సరఫరా చేసింది. వీటితోపాటు ఇతర ఉపకరణాలనూ ఉ.కొరియాకు పంపించింది. తమను ద్వేషించేలా దేశ వ్యతిరేక కరపత్రాలను తమ దేశంలోనే డ్రోన్ల ద్వారా జారవిడుస్తున్నారని, ఇది పునరావృతమైతే క్షిపణి దాడులు తప్పవని ఉ.కొరియా ఇటీవల ద.కొరియాను హెచ్చరించిన విషయం విదితమే. అయితే ఈ కరపత్రాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని ద.కొరియా స్పష్టంచేసింది. -
ప్రపంచాన్ని వల్లకాడు చేస్తారా..!
-
బైడెన్ తప్పుడు నిర్ణయం
అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోపడిన నేతను అమెరికా జనం ‘లేమ్ డక్ ప్రెసిడెంట్’ అంటారు. అధ్యక్షుడు జో బైడెన్ అంతకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయన్ను తప్పించి కమలా హారిస్‌ను బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్ చేయగలిగేదీ, చేసేదీ ఏమీ ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ ఉక్రెయిన్‌కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని ఉక్రెయిన్‌కు తెలిపారు. యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రిన్స్క్ ప్రాంతంలోని కరచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో... మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే. 2014లో పుతిన్ క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక వరసగా ఎనిమిదేళ్లపాటు జరిగిన ఘర్షణలు నివారించటానికి 2022లో వాటి మధ్య శాంతి ఒప్పందం ముసాయిదాను అమెరికా, బ్రిటన్లే రూపొందించాయి. చిత్రమేమంటే, ఆ ఒప్పందాన్ని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కూడా ఆమోదించాయి. ప్రాథమిక అవగాహన పత్రంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మనసు మార్చు కున్నారు. ఆ రెండు దేశాల సాయంతో అక్రమంగా అధికారంలోకొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వారి ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలగారు. ఆ తర్వాతే రష్యా దురాక్రమణ యుద్ధా నికి దిగింది. అసలు రెండు నెలల క్రితం నాటి స్థితికీ, ఇప్పటికీ వచ్చిన మార్పేమిటో, ఎందుకు మూడో ప్రపంచయుద్ధం ముప్పు తీసుకొచ్చారో బైడెన్ చెప్పాలి. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్ షాడోలను రష్యాపై ప్రయోగించటానికి బ్రిటన్ నిరుడు అనుమతించినప్పుడు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బైడెన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని ఆపనట్టయితే ఇది నాటో–రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని వివరించింది. దాంతో బైడెన్‌కు తత్వం బోధపడి బ్రిటన్ను వారించారు. అంతక్రితం 2022 మార్చిలో రష్యా గగనతలంపై ‘నో ఫ్లైజోన్’ విధించటానికి తమ మిగ్–29 యుద్ధ విమానాలను వాడుకోవచ్చని విదేశాంగమంత్రి బ్లింకెన్ పోలెండ్‌ను అనుమతించినప్పుడు అమెరికా ప్రతినిధుల సభంతా ఏకమై పెంటగాన్ అభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారించారు. దాంతో బైడెన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ‘నో ఫ్లైజోన్’ విధించటమంటే మూడో ప్రపంచయుద్ధానికి అంకురార్పణ చేసినట్టేనని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడేమైంది? తన పార్టీ చిత్తుగా ఓడి, కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడినప్పుడు అనుమతినీయటం అనైతికం, బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు... నేరం కూడా. ఒకపక్క జనవరిలో అధ్యక్షుడిగా రానున్న డోనాల్డ్ ట్రంప్ తన మొదటి కర్తవ్యం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపటమేనని ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి పనే రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ 1992లో చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలై ఇక 11 నెలల్లో దిగిపోతాననగా సోమాలియా దురాక్రమణకు ఆయన ఆదేశాలిచ్చారు. దాంతో కొత్తగా అధికారంలోకొచ్చిన క్లింటన్ అన్నీ వదిలిపెట్టి దానిపైనే చాన్నాళ్లు దృష్టి సారించాల్సి వచ్చింది. బైడెన్‌కు సైతం కేవలం 11 వారాలే గడువుంది. కనీసం నిర్ణయం తీసుకునేముందు సెనేట్ను సమావేశపరిచి సలహా తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది. ఈ నిర్ణయాన్ని పెంటగాన్ సీనియర్ అధికారులు వ్యతిరేకించారంటున్నారు.నిజానికి క్షిపణుల్ని వినియోగించే సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఉక్రెయిన్‌కు లేవు. అమెరికా నిఘా ఉపగ్రహాలు నిర్దిష్ట సమాచారం ఇస్తేనే, దాని ఆధారంగా అమెరికా సైనికాధికారులు రష్యా ఆయుధ గిడ్డంగిని ధ్వంసం చేశారని సాధారణ పరిశీలకులకు సైతం సులభంగా తెలుస్తుంది. రష్యా గ్రహించదనుకోవటం, పాపభారమంతా ఉక్రెయిన్‌పైనే పడుతుందనుకోవటం తెలివితక్కువతనం. మందుపాతరల వినియోగాన్ని పూర్తిగా ఆపేస్తామని ఐక్యరాజ్యసమితిలోని 161 దేశాలు కుదుర్చుకున్న ఓస్లో ఒడంబడికను అమెరికా, రష్యాలు కాదన్నాయి. ఆ ఒడంబడికకు కారణమైన మందు పాతరల నిరోధ ప్రచార సంస్థకూ, దాని అధ్యక్షుడు జోడీ విలియమ్స్కూ 1997లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మందుపాతరలివ్వాలన్న బైడెన్ తాజా నిర్వాకంవల్ల ఆ ఒడంబడికపై సంతకం చేసిన ఉక్రెయిన్ అపరాధిగా మారినట్టయింది. మందుపాతరల వల్ల కీయూవ్లోకి చొచ్చుకొస్తున్న రష్యా బలగాల వేగాన్ని కొంతవరకూ నిరోధించవచ్చు. కానీ ఆపటం అసాధ్యం. యుద్ధం పూర్త య్యాక సాధారణ పౌరులు వందలమంది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మందుపాతరలకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. బైడెన్ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజలముందు అమెరికా దోషిగా నిలబడాల్సివస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసు కోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. -
పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
-
ఉక్రెయిన్‌పైకి ఖండాంతర క్షిపణి ప్రయోగించిన రష్యా
కీవ్: అమెరికా తొలిసారిగా అందించిన శక్తివంత దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా మీదకు ప్రయోగించిన ఉక్రెయిన్ ఊహించని దాడిని ఎదుర్కొంది. యుద్ధంలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది. అభివృద్ధిచేశాక పరీక్ష కోసం పలుదేశాలు ఎన్నోసార్లు ఈ రకం క్షిపణులను ప్రయోగించినా యుద్ధంలో వినియోగించడం మాత్రం ఇదే తొలిసారికావడం గమనార్హం. మధ్యతూర్పు ఉక్రెయిన్‌లోని డినిప్రో నగరంపైకి బుధవారం రాత్రి ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) వచ్చి పడిందని ఉక్రెయిన్ టెలిగ్రామ్ మెసెంజింగ్ యాప్‌లో ప్రకటించింది. వేయి కిలోమీటర్ల దూరంలో రష్యాలో కాస్పియన్ సముద్రతీర ఆస్ట్రాఖన్ ప్రాంతం నుంచి అది దూసుకొచ్చిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. అయితే ఆ క్షిపణి సృష్టించిన విధ్వంసం, జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలను ఉక్రెయిన్ వెల్లడించలేదు. ‘‘ ఐసీబీఎంతోపాటు కింజార్ హైపర్సోనిక్ క్షిపణి, ఏడు కేహెచ్–101 క్రూజ్ క్షిపణులు వచ్చిపడ్డాయి. వీటిలో ఆరింటిని గాల్లోనే ధ్వంసంచేశాం. ఈ దాడిలో ఇద్దరు ఉక్రేనియన్లు గాయపడ్డారు. ఒక కర్మాగారం దెబ్బతింది. వికలాంగుల కోసం ఏర్పాటుచేసిన పునరావాసన శిబిరం నాశనమైంది’ అని స్థానిక యంత్రాంగం పేర్కొంది. అయితే ఆర్ఎస్–26 రూబెజ్ రకం ఐసీబీఎంను రష్యా ప్రయోగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్–26 క్షిపణి ఏకంగా 800 కేజీల మందుగుండును మోసుకెళ్లగలదు. 5,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్షిపణితోపాటు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ–ఎంట్రీ వెహికల్స్(ఎంఐఆర్వీ) సాంకేతికతనూ రష్యా వాడినట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఎంఐఆర్వీ టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి.క్షిపణితో హెచ్చరించారా?సాధారణంగా ఐసీబీఎంలను అణ్వస్త్రాల వంటి భారీ బాంబులను ప్రయోగించడానికి వినియోగిస్తారు. సాధారణ మందుగుండుతో రష్యా గురువారం ఐసీబీఎంను ప్రయోగించడం వెనుక వేరే ఉద్దేశ్యం ఉందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి అందుకున్న అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల అండ చూసుకుని విచక్షణారహితంగా తమపై దాడులకు తెగబడితే అణ్వాయుధం ప్రయోగించేందుకైనా వెనుకాడబోమని హెచ్చరించేందుకే రష్యా ఇలా ఐసీబీఎంను ప్రయోగించి ఉంటుందని భావిస్తున్నారు. అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసిన రెండు రోజులకే రష్యా ఉక్రెయిన్‌పైకి తొలిసారిగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. ‘‘ ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన రెండు బ్రిటన్ తయారీ స్టార్మ్ షాడో క్షిపణులు, ఆరు హిమార్స్ రాకెట్లు, 67 డ్రోన్లను నేలకూల్చాం’’ అని గురువారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టార్మ్షాడో క్షిపణులను తమ గగనతలరక్షణ వ్యవస్థలు కూల్చేశాయని రష్యా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే గురువారం ఉక్రెయిన్‌పై ఏ రకం ఖండాంతర క్షిపణిని ప్రయోగించారో, అసలు ప్రయోగించారో లేదో అన్న విషయాన్ని రష్యా వెల్లడించలేదు. ఇతర వివరాలు తెలిపేందుకు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా సాధారణ పత్రికా సమావేశంలో మాట్లాడుతుండగా ఆమెకు ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘ మనం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి గురించి పశ్చిమదేశాలు అప్పుడే మాట్లాడటం మొదలెట్టాయి. ఐసీబీఎంను వాడిన విషయాన్ని ప్రెస్మీట్లో ప్రస్తావించొద్దు’’ అని సంబంధిత ఉన్నతాధికారులు ఆమెకు ఫోన్లో చెప్పారు. సంబంధిత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఏమిటీ ఖండాంతర క్షిపణి?సుదూరంలోనే శత్రుస్థావరాలను తుదముట్టించేందుకు ఖండాంత క్షిపణి ఉపయోగపడుతుంది. 5, 500 కిలోమీటర్లకు మించి ప్రయా ణించగలవు. అణు, రసాయన, జీవాయుధాలను మోసుకెళ్లగలవు. సంప్రదాయక వార్‌హెడ్‌నూ మోస్తాయి. రష్యా వాడినట్లుగా చెబుతున్న ఆర్ఎస్26 రూబెజ్ క్షిపణి ఎంఐఆర్వీ టెక్నాలజీతో పనిచేసే ఘన ఇంధన మిస్సైల్. 2011 దీనిని అభివృద్ధిచేసి 2012లో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. అది ఆనాడు 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. ద్రవ ఇంధనంతో పోలిస్తే ఘన ఇంధన క్షిపణులను వాడటం చాలా తేలిక. నేలమాళిగ, మొబైల్ లాంఛర్ నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. ఇందులోని ఇంధనం, ఆక్సిడైజర్లను రబ్బర్‌లాంటి దానితో కలిపి మిశ్రమంగా తయారుచేసి ఒక గట్టి పెట్టెలో అమర్చుతారు. ప్రొపెలంట్ మండగానే ఇంధన ప్రజ్వలన రెప్పపాటులో భారీగా జరిగి క్షిపణి శరవేగంగా దూసుకుపోతుంది. ఇంధ్రధనస్సులాగా అర్ధచంద్రాకృతిలో ప్రయాణిస్తుంది. దాదాపు 4,000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వేగంగా కిందకు పడపోవడం మొదలవుతుంది. ఈ దశలో ఇది ఏకంగా ధ్వని వేగానికి పది రెట్లు వేగంగా దూసుకొస్తుంది. ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒకే క్షిపణిలో వేర్వేరు వార్హెడ్లను ఒకేసారి ప్రయోగించవచ్చు. ఇవి వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలవు. వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు. ఒకేసారి ప్రయోగించిన రెండు వార్హెడ్ల మధ్య దూరం 1,500 కిలోమీటర్ల దూరం ఉన్నాసరే వాటిని క్షిపణి ఖచ్చిత దిశలో జారవిడచగలదు. తొలుత కనిపెట్టిన అమెరికాఎంఐఆర్వీ టెక్నాలజీని తొలుత అమెరికా అభివృద్ధిచేసింది. 1970లో ఐసీబీఎంను పరీక్షించింది. 1971లో జలాంతర్గామి వెర్షన్లో ఎస్సీబీఎంను పరీక్షించింది. ఈ సాంకేతికతను 1970 చివర్లో నాటి సోవియట్ రష్యా అభివృద్ధిచేసింది. దీని సాయంతో ఐసీబీఎం, జలాంతర్గామి వెర్షన్ ఎస్ఎల్బీఎంను రూపొందించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా అమెరికా, రష్యాలు స్వల్ప, దీర్ఘ, ఖండాంతర క్షిపణులను ధ్వంసంచేశాయి. 1991 జూన్ ఒకటోతేదీలోపు మొత్తంగా 2,692 క్షిపణులను నాశనంచేశాయి. అయితే ఈ ఒప్పందం నుంచి 2019లో అమెరికా వైదొలగింది. -
Russia-Ukraine war: రష్యా సైన్యానికి ల్యాండ్ మైన్స్‌తో అడ్డుకట్ట!
కీవ్: యుద్ధంలో రష్యాను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌కు అమెరికా అండదండలు అందిస్తోంది. అమెరికా అందజేసిన లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో రష్యా భూభాగంలో సుదూర ప్రాంతంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడులు ఉక్రెయిన్‌కు అవకాశం లభించింది. అమెరికా మరో శుభవార్త చెప్పింది. తాము సరఫరా చేసిన యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించానికి ఉక్రెయిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ ప్రకటించారు. ఆయన బుధవారం లావోస్‌లో మీడియాతో మాట్లాడారు. యుద్ధంలో రష్యా సైన్యం వ్యూహం మార్చేస్తుండడంతో ఉక్రెయినవైపు నుంచి కూడా వ్యూహం మార్చక తప్పడం లేదని అన్నారు. రష్యా పదాతి దళాలు మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయని చెప్పారు. ఆయా దళాలను నిలువరించాలంటే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ల్యాండ్ మైన్స్ పెద్దగా ప్రమాదకరం, ప్రాణాంతకం కాదని లాడిన్ అస్టిన్ వివరణ ఇచ్చారు. శత్రు సైన్యం కదలికలను నియంత్రించడానికి ఇవి దోహదపతాయని చెప్పారు. -
ఉక్రెయిన్ను రష్యా ఏం చేయబోతోంది.? ఖాళీ అవుతున్న ఎంబసీలు
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.ఇటలీ ,గ్రీస్,స్పెయిన్లు కూడా కీవ్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్‌లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్, స్పెయిన్లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది. -
టెన్షన్..టెన్షన్: హాట్‌లైన్‌పై రష్యా సంచలన ప్రకటన
మాస్కో:అమెరికా-రష్యా మధ్య అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలకమైన హాట్‌లైన్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అమెరికా,రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే రెండు దేశాల అధ్యక్షులు చర్చించేందుకు ఓ సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని,ఇది వీడియో కూడా ప్రసారం చేయగలదని పెస్కోవ్ గతంలో చెప్పారు.అయితే ప్రస్తుతం ఇది వినియోగంలో లేదని తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. కాగా,రష్యాపై అమెరికా తయారీ లాంగ్రేంజ్ మిసైల్స్ వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వడంతో యూరప్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.దీనికి ప్రతిగా అణ్వాయుధాల ప్రయోగంపై నిబంధనలను రష్యా సరళతరం చేసింది.ఈ పరిణామాల నడుమ మంగళవారం(నవంబర్ 19) కీవ్ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులు చేశాయి.ఇందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు దాడి చేయవచ్చనే భయాలు పెరిగిపోయాయి. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా,రష్యా మధ్య హాట్‌లైన్ వాడకంలో లేదన్న వార్త మరింత భయాందోళనలకు కారణమవుతోంది. -
ఉక్రెయిన్‌లో అమెరికా ఎంబసీ మూసివేత
కీవ్ : రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని (ఎంబసీ) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు.ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. శత్రుదేశంపై ప్రయోగించింది. అయితే, ఉక్రెయిన్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమైంది. కీవ్‌పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. వెంటనే ఉక్రెయిన్‌లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు ఎంబసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా అందించిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించింది. ఈ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌కు తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. గత నెలలో ఉత్తర కొరియా అందిస్తున్న క్షిపణలతో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. -
ఆ మహా విపత్తుకు... 1,000 రోజులు!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సోమవారంతో అక్షరాలా వెయ్యి రోజులు నిండాయి. ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలు. వాటికింద నలిగి ముక్కలైన జ్ఞాపకాలు. కమ్ముకున్న బూడిద, పొగ చూరిన గ్రామాలు. లక్షల్లో ప్రాణనష్టం. లెక్కకు కూడా అందనంత ఆస్తి నష్టం. ఉక్రెయిన్ ఏకంగా నాలుగో వంతు జనాభాను కోల్పోయింది. వెరసి ఈ యుద్ధం 21వ శతాబ్దపు మహా విషాదంగా మారింది. నానాటికీ విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్నాయి.రావణకాష్టంలా... 2022 ఫ్రిబవరి 24. ఉక్రెయిన్‌పై రష్యా ఆకస్మికంగా దాడికి దిగిన రోజు. నాటినుంచి రావణకాష్టాన్ని తలపిస్తూ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతులేని ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా కనీసం 80,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక అంచనా వేసింది. మరో 400,000 మందికి పైగా గాయాపడ్డట్టు పేర్కొంది. రష్యా అయితే ఏకంగా 2 లక్షల మంది సైనికులను కోల్పోయిందని సమాచారం. లక్షలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఐరాస మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం గత ఆగస్టు 31 నాటికి ఉక్రెయిన్‌లో 11,743 మంది సామాన్య పౌరులు మరణించారు. 24 వేల మందికి పైగా గాయపడ్డారు. అయితే వాస్తవ గణాంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఐరాస అధికారులే అంటున్నారు. ఉక్రెయిన్‌లో జననాల రేటు కూడా రెండేళ్లుగా మూడో వంతుకు పడిపోయింది. ఏకంగా 60 లక్షల మంది ఉక్రెయిన్‌వాసులు శరణార్థులుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు.చిరకాలంగా రష్యా కన్ను 1991లో సోవియట్ యూనియన్ విచి్ఛన్నమయ్యే దాకా ఉక్రెయిన్ రష్యన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉండేది. కనుక దాన్ని తిరిగి రష్యా సమాఖ్యలో విలీనం చేయడమే లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నోసార్లు చెప్పారు. స్లావిక్, ఆర్థోడాక్స్ క్రైస్తవులైన ఉక్రెయిన్ ప్రజలు వాస్తవానికి రష్యన్లేనన్నది ఆయన వాదన. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున యుద్ధానికి త్వరలో తెర పడవచ్చన్న ఆశలు కూడా అడియాసలే అయ్యేలా ఉన్నాయి. అమెరికా అనుమతితో రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేయడంతో తాజాగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించేందుకు ఇంకా రెండు నెలల గడువుంది. ఆలోగా పరిణామాలు మరింతగా విషమిస్తాయా? పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతాయా? ఇప్పుడు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్న ప్రశ్నలివి.ఆర్థిక వ్యవస్థ పతనం.. యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా పతనమైంది. 2023లో స్వల్పంగా పుంజుకున్నా, రాయిటర్స్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, ఐరాస, ఉక్రెయిన్ ప్రభుత్వ అంచనాల ప్రకారం యుద్ధ నష్టం 2023 చివరికే ఏకంగా 152 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. రష్యా దాడుల్లో దేశ మౌలిక సదుపాయాలన్నీ నేలమట్టమయ్యాయి. విద్యుత్ తదితర రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పునర్నిర్మాణ, పునరుద్ధరణ పనులకు కనీసం 500 బిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్ ప్రభుత్వం అంచనా వేశాయి. దీనిముందు పాశ్చాత్య దేశాల నుంచి అందిన 100 బిలియన్ డాలర్లకు పై చిలుకు ఆర్థిక సాయం ఏ మూలకూ చాలని పరిస్థితి. పైగా అందులో అత్యధిక మొత్తం యుద్ధ అవసరాలపైనే వెచి్చంచాల్సి వస్తోంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు సగటున రోజుకు 14 కోట్ల డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఆహార ధాన్యాల ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉంటుంది. యుద్ధం దెబ్బకు అక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోవడం అంతర్జాతీయంగా ఆహార సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. -
కమ్ముకొస్తున్న అణుమేఘాలు. శరవేగంగా నాటకీయ పరిణామాలు. రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్‌లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
బైడెన్ గ్రీన్‌సిగ్నల్..రష్యాపైకి దూసుకెళ్లిన క్షిపణులు
కీవ్: అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు వాడేందుకు అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వగానే ఉక్రెయిన్ వాటి వాడకాన్ని మొదలు పెట్టింది. అమెరికా తయారీ లాంగ్రేంజ్ ఆర్మీ ట్యాక్టికల్(ఏటీఏసీఎంఎస్) మిసైల్‌ను మంగళవారం(నవంబర్ 19) రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించినట్లు సమాచారం. ఈమేరకు ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురించింది.రష్యా,ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు కథనాల సారాంశం. అమెరికా కంపెనీ లాక్హిడ్ మార్టిన్ తయారు చేసిన ఏటీఏసీఎంఎస్ లాంగ్రేంజ్ క్షిపణులు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. చాలా ఎత్తు నుంచి వెళ్లి లక్ష్యాలను తాకడం వీటి ప్రత్యేకత. ఈ క్షిపణులతో రష్యాలోని ఎంత దూర ప్రాంతంపై అయినా ఉక్రెయిన్ దాడులు చేసే వీలుంది.రష్యాపై లాంగ్రేంజ్ మిసైల్స్‌ను వాడేందుకు ఉక్రెయిన్ ఎప్పటినుంచో అమెరికాను అనుమతి అడుగుతోంది. అయితే బైడెన్ తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుందనగా తాజాగా అందుకు అనుమతిచ్చారు. అయితే ఉక్రెయిన్ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ఏ మలుపు తిరుగుందోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ మిసైళ్ల దాడి నిజమే: ధృవీకరించిన రష్యాతమ దేశంపైకి ఉక్రెయిన్ ఆరు అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు ప్రయోగించినందని రష్యా మిలిటరీ వెల్లడించినట్లు రష్యా మీడియా తెలిపింది. ఆరు మిసైళ్లలో ఐదింటిని రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోగా ఒక మిసైల్‌ను ధ్వంసం చేసింది.ధ్వంసమైన మిసైల్‌కు సంబంధించిన శకలాలు పడడంతో కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరంలో మంటలు లేచాయి. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా మిలిటరీ తెలిపింది. ఇదీ చదవండి: రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా -
అణ్వాయుధాల వాడకంపై పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో:ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రమవనుందా.. వెయ్యి రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక ముందు కొత్త మలుపు తిరగనుందా.. రెండు దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారనుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది.తాజాగా రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది.తాము అందజేసే లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన నేపథ్యంలో అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం. -
వెయ్యి రోజుల యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నేటికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఈ యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన సంఘర్షణగా రూపుదిద్దుకుంది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక మిలియన్(10 లక్షలు)కు పైగా జనం మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది.2022లో ప్రారంభమైన 21వ శతాబ్దపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుంచి నిరంతరం హృదయాన్ని కదిలించే వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ఆ దేశం ఎంతో బలహీనంగామారింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుద్ధంలో 80 వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారు. నాలుగు లక్షల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన వివరాల ప్రకారం రష్యన్ సైనికుల మరణాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని నివేదికలలో మరణించిన సైనికుల సంఖ్య సుమారు రెండు లక్షలు, గాయపడిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలుగా పేర్కొన్నారు. రెండు దేశాల జనాభా ఇప్పటికే క్షీణించింది. యుద్ధానికి ముందే ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా సంభవించిన భారీ మరణాల ప్రభావం ఇరు దేశాల జనాభా గణాంకాలపై కనిపిస్తోంది.మరణించిన సైనికుల డేటా గోప్యం?ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్‌లో ఆగస్టు 2024 నాటికి 11,743 మంది పౌరులు మరణించారు. 24,614 మంది గాయపడ్డారు. ముఖ్యంగా మారియుపోల్ వంటి రష్యన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించాయి. ఇదేకాకుండా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 589 మంది చిన్నారులు కూడా మరణించారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, గ్రౌండ్ దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. జాతీయ భద్రత కోసం యుద్ధంలో మరణించిన తమ సైనికుల డేటాను ఇరుపక్షాలు గోప్యంగా ఉంచాయని, పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇచ్చిన అంచనాలలో చాలా తేడా ఉందని ఒక ఈ మీడియా నివేదిక పేర్కొంది. సైనిక ప్రాణనష్టం విషయంలో కూడా రష్యాకు భారీ నష్టం వాటిల్లిందనే అంచనాలున్నాయి ఈ భీకర యుద్ధంలో ఒక్క రోజులో వెయ్యి మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ 2024, ఫిబ్రవరిలో 31 వేలకు పైగా ఉక్రేనియన్ సైనికులు మృతిచెందారని తెలిపారు.ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం మృతియుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఉక్రెయిన్‌లో దాదాపు నాలుగు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆరు మిలియన్లకు పైగా ఉక్రేనియన్ పౌరులు విదేశాల్లో ఆశ్రయం పొందారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభా 10 మిలియన్లకు పైగా తగ్గింది. ఇది అక్కడి జనాభాలో నాలుగింట ఒక వంతు. అంటే ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం తుడిచిపెట్టుకుపోయింది. యుక్రేనియన్ ప్రభుత్వం యుద్ధంలో రోజువారీ ఖర్చు 140 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ అని అంచనా వేసింది. ఉక్రెయిన్ 2025 ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ కోసం 26 శాతం అంటే 53.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంయుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2022లో 33 శాతం క్షీణించింది. 2023లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడి నష్టం 22 శాతానికి పరిమితమైంది. హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయ రంగాలు యుద్ధానికి అమితంగా ప్రభావితమయ్యాయి. ఉక్రెయిన్‌లోని రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో ఉక్రెయిన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింది.ఉక్రెయిన్‌లో కొంతభాగం రష్యా స్వాధీనంరాయిటర్స్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌లో ఐదవ వంతును రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతాలను తన అదుపులో ఉంచుకుంది. ఈ భాగం గ్రీస్ దేశ పరిమాణంతో సమానం. రష్యన్ దళాలు 2022 ప్రారంభంలో ఉక్రెయిన్‌లోని ఉత్తర, తూర్పు, దక్షిణ భాగాలలో దాడి చేసి, ఉత్తరాన కీవ్ శివార్లకు చేరుకుని, దక్షిణాన డ్నిప్రో నదిని దాటాయి. రష్యా దాదాపు ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని, దక్షిణాన అజోవ్ సముద్ర తీరాన్ని స్వాధీనం చేసుకుంది.పుతిన్‌కు గిట్టని ఉక్రేనియన్ గుర్తింపు ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. తరువాత సోవియట్ యూనియన్‌లో భాగమైంది. ఉక్రెయిన్ను మళ్లీ రష్యాలో విలీనం చేయడమే తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు సందర్భాల్లో చెప్పారు. పుతిన్ ఉక్రేనియన్ రాష్ట్ర హోదాను, గుర్తింపును తిరస్కరించారు. ఉక్రేనియన్లు నిజానికి రష్యన్లేనని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఇరు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం ప్రపంచ సంక్షోభానికి కూడా దారితీసింది. ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా
బ్రెజీలియా: ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి వేలాది మంది సైనికులను రష్యా దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విరుగుడుగా ఉక్రెయిన్, దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహానికి తెరతీశాయి. ఉక్రెయిన్‌కు అందజేసిన లాంగ్రేంజ్ మిస్సైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతి ఇచ్చారు.అమెరికా అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. బైడెన్ నుంచి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎం)ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం వాటిల్లే్ల అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రుదేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడుతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమదేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ జో బైడెన్‌పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అగ్నికి బైడెన్ ఆజ్యం పోస్తున్నారు: రష్యాఅమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ బైడెన్‌పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకో వాలని హెచ్చరించాయి. అయితే, ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ ఇంకా స్పందించలేదు. -
ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా దాడులు.. టార్గెట్ అదేనా..?
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్‌కు కీలకమైన పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్‌లో భారీగా పేలుళ్లు జరిగాయి.ఇక్కడి సిటీ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్ వంటి వాటిని వాడతారు.విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి. -
ఉక్రెయిన్‌పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో తలదాచుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తరచూ దాడులు చేస్తూ వస్తోంది.కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులు చేసింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకువచ్చిన డ్రోన్లను రష్యా వినియోగించినట్లు సమాచారం. కీవ్‌లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నారని, వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకుల్లోనే ఉండాలని ఉక్రెయిన్ అధికారులు వారికి సూచించినట్లు తెలుస్తోంది.మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేవారు. ఈ యుద్ధాన్నిశాంతింపజేయడంపై దృష్టి పెడతామని ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం -
ఇదేం చిత్రం..! జననాల రేటు పెంచడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..!
ఇంతకుముందు "జనాభా నియంత్రణ" అంటూ ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టేవి. కానీ ఇప్పుడు ఆ కథే అడ్డం తిరిగింది. బాబు.. "పిల్లల్ని కనండి ప్లీజ్" అంటూ వెంటపడుతున్నాయి దేశాలు. ఈ సమస్య ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. అందుకోసం ఆయా దేశాల అధికారులు జననాల రేటు పెంచేందుకు తీసుకుంటున్న చిత్ర విచిత్ర నిర్ణయాలు చూస్తే.. మరీ ఇంతలా దిగజారిపోవాలా..! అనుకుంటున్నారు చాలామంది. ఒకప్పుడు పిల్లలు వద్దు అని ప్రజల మనసుల్లో పాతకునేలా చేశాం. ఇప్పుడు కావాలంటే..ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు కూడా. జనాభాని పెంచేందుకు ఆయా దేశాలు అమలు చేస్తున్న స్కీమ్‌లు, విధానాలు వింటే గోప్యతకు భంగం వాటిల్లేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతలా ఆయా దేశాలు జనాభాను పెంచేందుకు ఏం చేస్తున్నాయనే కదా..!రష్యాలో జనాభా దారుణంగా తగ్గిపోతుంది. ఏం చేయాలో తెలియక అక్కడి అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి జననాల రేటుని పెంచాలనే నిర్ణయానికి వచ్చేసింది రష్యా. అందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను(సెక్స్ మంత్రిత్వ శాఖ) ఏర్పాటు చేసి జననాల రేటుని పెంచే బాధ్యతను చేపట్టాలని నిర్ణయించింది. ఆ విషయమై పిటిషన్‌ని కూడా దాఖలు చేశారు అధికారులు. ఇది జనాభాను పెంచే రష్యా పార్లమెంట్ కమిటీ అధిపతి నినా ఒస్తానియా సమీక్షలో ఉంది. పని ప్రదేశాల్లో కూడా జంటలను ఎక్కువ విరామం తీసుకుని పిల్లలనే కనేలా ప్లాన్ చేసుకోండని ప్రోత్సహిస్తున్నారు అక్కడి అధికారులు. అక్కడితో ఆగలేదు ఆఖరికి బెడ్రూంలోకి కూడా ఎంటర్ అయ్యిపోయే స్థాయికి దిగజారిపోయింది రష్యా ప్రభుత్వం. దయచేసి బెడ్రూంలోకి రాగానే పౌరులంతా మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయాలనే నిబంధనలు తీసుకొచ్చింది. అంతేగాదు పిల్లలను కనేలా ప్రోత్సహిస్తూ..జంటలకు రూ. 4 వేల రూపాయలు అందిస్తోంది. అదే కొత్తగా పెళ్లైన జంటలకు హోటల్లో గడిపేందుకు ఖర్చులు కింద ఏకంగా రూ. 22 వేల రూపాయల వరకు అందిస్తోంది. అలానే 18 నుంచి 23 మధ్య వయస్సు గల మహిళలకు బిడ్డను కనేలా రూ. 98,029 ఇస్తున్నారు. మొదటి బిడ్డకు ఏకంగా రూ.9.26 లక్షల వరకు పారితోషకం ఇవ్వడం విశేషం. అంతేగాదు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ఫ్యామిలీ ప్లాన్ గురించి, వ్యక్తిగత ఆరోగ్య సమాచారానికి సంబంధించిన డేటాను సేకరిస్తారు. దీంతోపాటు గతంలో పిల్లలను కలిగి ఉన్నారా..ఎంతమంది కావాలనుకుంటున్నారు వంటి పూర్తి సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనట. ఇతర దేశాల్లో..దక్షిణ కొరియాఈ దేశంలో జననాల రేటు ఘోరంగా తగ్గిపోతోంది. అక్కడి ప్రభుత్వాలు ఈ విషయమై రకరకాలుగా సన్నాహాలు చేస్తోంది. ఆ నేపథ్యంలోనే పార్క్‌లు, పబ్లిక్ మ్యూజియంలలో ప్రజలు వివాహాలు చేసుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. జస్ట్ జంటలుగా మారితేనే రూ.30,270 చెల్లిస్తోంది. అంతేగాదు వివాహం గురించి మాటలు జరిగితేనే ఏకంగా రూ. 60540 పారితోషకం అందిస్తోందట. ఇక పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ. 1210810ల పారితోషకాన్ని గిఫ్ట్‌గా పొందొచ్చు. జపాన్జపాన్ ప్రభుత్వం వివాహం చేసుకునే మహిళలకు ఏకంగా రూ. 3 లక్షలు పైనే చెల్లించేలా ఓ ప్రత్యేక స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. అయితే ఇది అంతగా వర్కౌట్ కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆకర్షించేలా.. వివాహానికి సంబంధించిన పథకాలను ప్రవేశ పెట్టే యోచనలో పడింది.చైనాచైనా ఒకప్పుడు ఒకే బిడ్డ అనే పాలసీతో ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. అలాంటి దేశం ఇప్పుడు తీవ్ర జనాభా కొరతతో పోరాడుతోంది. చైనా అంతట జననాల రేటు దారుణంగా పడిపోయింది. దీంతో పిల్లలను కనండి అంటూ ఉద్యోగులకు ఎన్నో వెసులుబాటులు, సౌకర్యాలు కల్పిస్తోంది. మూడో బిడ్డను కనేవారికి ఏకంగా రూ. 3లక్షలుగా పైగా విలువైన సబ్సిడీలను కూడా అందిస్తోంది.(చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?) -
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్‌కాల్
-
Tony Radakin: రోజుకు 1,500!
లండన్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు. ‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి. పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్ డీసీ : తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపి వేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ ఆదేశాలపై రష్యా మద్దతివ్వగా.. రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా నాటోలో చేరకుండా సుధీర్ఘకాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బదులుగా అమెరికా.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జోబైన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆర్ధికంగా,ఆయుధాల్ని అందించడంపై ట్రంప్ పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే ట్రంప్ ఉక్రెయిన్‌కు ఆయుధ సంపత్తిని సమకూర్చనుండడం ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌పై జెలెన్స్కీ ప్రశంసలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. అనంతరం ‘ మా ఇద్దరి మధ్య సంభాషణ సన్నిహితంగా జరిగింది. అమెరికా-ఉక్రెయిన్ దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగించేందుకు అంగీకరించాం. బలమైన, తిరుగులేని అమెరికా నాయకత్వం ప్రపంచానికి, న్యాయమైన శాంతికి చాలా అవసరం’ అని ఎక్స్ వేదికపై జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
ట్రంప్ మార్కు కనిపించేనా!
దూకుడుకు, ఆశ్చర్యకర నిర్ణయాలకు పెట్టింది పేరైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్నారు. ఈ పరిణామం అమెరికా మిత్ర దేశాల్లో భయాందోళనలకు, శత్రు రాజ్యాల్లో హర్షాతిరేకాలకు కారణమవుతోంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’అన్నదే మూల సిద్ధాంతంగా సాగుతానని తేల్చి చెప్పిన ఆయన అదే ప్రాతిపదికన విదేశాంగ విధానాన్ని పునర్నర్మీస్తారా? అదే జరిగితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరం. ఉక్రెయిన్ యుద్ధం నాటో పుట్టి ముంచేనా? రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే చెప్పారు. అదెలా అని మీడియా పదేపదే ప్రశ్నిస్తే ఒక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ సరిపెట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగించాలని, రష్యాతో ఆ దేశం శాంతి చర్చలు జరిపేలా చూస్తూనే షరతులు విధించాలని ట్రంప్ మాజీ జాతీయ భద్రతాధిపతులు ఇటీవల సూచించారు. నాటోలో ఉక్రెయిన్ ప్రవేశాన్ని వీలైనంత ఆలస్యం చేయడం ద్వారా రష్యాను తృప్తి పరచాలని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా వనరుల వృథాను అరికట్టడమే తన ప్రాథమ్యమని స్పష్టంగా చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్లకు పైగా ఉక్రెయిన్‌కు బైడెన్ సర్కారు అందిస్తూ వచ్చిన భారీ ఆర్థిక, ఆయుధ సాయాలకు భారీగా కోత పడవచ్చని భావిస్తున్నారు. అంతేగాక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా రష్యా, ఉక్రెయిన్ రెండింటిపైనా ట్రంప్ ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. స్వదేశంలో ఇమేజీ కోసం కనీసం తక్షణ కాల్పుల విరమణకైనా ఒప్పంచేందుకు ఆయన శాయశక్తులా ప్రయతి్నంచవచ్చు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్‌కు ట్రంప్ అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది నాటోలోని యూరప్ సభ్య దేశాలకు రుచించని పరిణామమే. కానీ నాటో కూటమి పట్ల ట్రంప్ తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా వాటి అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇది అంతిమంగా నాటో భవితవ్యంపైనే తీవ్ర ప్రభావం చూపవచ్చు. నాటో కూటమి రక్షణ వ్యయం తీరుతెన్నుల్లో భారీ మార్పులకు కూడా ట్రంప్ శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరుకుడు పడని పశ్చిమాసియా గాజా యుద్ధం, ఇరాన్‌తో ఇజ్రాయెల్ ఘర్షణ, దానిపై హమాస్‌తో పాటు హెజ్»ొల్లా దాడులతో అగి్నగుండంగా మారిన పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. తాను అధికారంలో ఉంటే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగేదే కాదని చెప్పుకున్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు, ఆ దేశంతో అణు ఒప్పందం రద్దు వంటి చర్యలకు ఆయన దిగవచ్చంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్‌పై ప్రతీకారం, హమాస్, హెజ్»ొల్లా తదితర ఉగ్ర సంస్థల నిర్మూలన విషయంలో నెతన్యాహు మొండిగా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు రక్షణ మంత్రినే ఇంటికి పంపించారు. కనుక ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. నిజానికి ట్రంప్ విధానాలే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీశాయన్నది ఆయన విమర్శకుల వాదన. వాటివల్ల పాలస్తీనియన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారంటారు. ఇజ్రాయెల్‌తో పాటు పలు అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు పాలస్తీనాను పూర్తిగా ఏకాకిని చేశాయి. ఇన్ని సంక్లిష్టతల నడుమ గాజా కల్లోలానికి ట్రంప్ చెప్పినట్టుగా తెర దించగలరా అన్నది వేచి చూడాల్సిన విషయమే. చైనా వ్యూహంలోనూ మార్పులు! అమెరికా విదేశాంగ విధానంలో చైనా పట్ల వైఖరి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది ప్రపంచ భద్రత, వాణిజ్యంపైనే ప్రభావం చూపుతుంది. ట్రంప్ అధికారంలో ఉండగా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు’గా పేర్కొన్నారు. పలు చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. దాంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగానే కోవిడ్ వచ్చి పడింది. దాన్ని ‘చైనీస్ వైరస్’గా ట్రంప్ ముద్ర వేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అనంతరం బైడెన్ సర్కారు కూడా చైనాపై ట్రంప్ సుంకాలను కొనసాగించింది. అమెరికాలో నిరుద్యోగం తదిరాలకు చైనా దిగుమతులను కూడా కారణంగా ట్రంప్ ప్రచారం పొడవునా ఆక్షేపించన నేపథ్యంలో వాటిపై సుంకాలను మరింత పెంచవచ్చు. అలాగే చైనా కట్టడే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పుచేర్పులకు ట్రంప్ తెర తీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ విధానానికి ఆయన తెర దించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. తైవాన్‌పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని కూడా ట్రంప్ పదేపదే చెప్పారు. కనుక తైవాన్‌కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కిమ్’ సైనికులు కొందరు చనిపోయారు: జెలెన్స్కీ
కీవ్: రష్యా తరపున తమపై యుద్ధంలో పాల్గొన్న ఉత్తరకొరియా సైనికుల్లో కొందరు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా పెద్దమొత్తంలో సైనికులను రష్యాకు పంపిన విషయం తెలిసిందే.తమపై యుద్ధానికి కుర్స్క్లో 11వేల మంది ఉత్తరకొరియా సైనికులను మోహరించినట్లు గతంలో జెలెన్స్కీ చెప్పారు. ఈనేపథ్యంలోనే తాజాగా అక్కడ జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆ సైనికుల్లో కొందరు ఉక్రెయిన్ దళాల చేతుల్లో మరణించినట్లు తెలిపారు. తాము ఈ తరహా కఠిన చర్యలు తీసుకోకపోతే ఉత్తరకొరియా మరిన్ని బలగాలను పంపే అవకాశం ఉందన్నారు. కాగా, రెండేళ్ల నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా తాజాగా ఎంటరైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్జోంగ్ఉన్కు సత్సంబంధాల వల్లే ఉత్తర కొరియా తమ సైనికులను రష్యాకు పంపిందని ఆరోపణలున్నాయి. యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామలుంటాయని ఉక్రెయిన్ ఇప్పటికే హెచ్చరించింది.ఇదీ చదవండి: కెనడాలో ఆ మీడియాపై నిషేధం -
అన్లిమిటెడ్ ఇంటర్నెట్! ‘అశ్లీలం’లో మునిగిపోయి..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు మంట తెప్పించే పని చేశారట ఆ దేశ సైనికులు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ దొరికిందనే ఆనందంలో అశ్లీలంలో మునిగిపోయి.. మిత్రదేశంలో నార్త్ కొరియా పరువు తీసేశారట. ఈ విషయాన్నిఆంగ్ల మీడియా ప్రముఖంగా ప్రచురించింది. రష్యా-ఉత్తర కొరియాల మధ్య బంధం ఎంతగా బలపడిందో తెలిసిందే. ఈ క్రమంలో.. మిత్రదేశానికి సహాయంగా ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటోంది. అయితే ఆ యుద్ధం కోసం వెళ్లిన సైనికులకు అపరిమితంగా ఇంటర్నెట్ అందించారట. దీంతో స్వేచ్ఛ దొరికినంతగా ఫీలైపోయి.. వాళ్లు ఎగబడి అడల్ట్ కంటెంట్ చూస్తూ ఉన్నారంటూ ఆధారాల్లేని కథనాలను బ్రిటిష్ పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక.. సోమవారం సుమారు ఏడు వేల మంది ఉ.కొ. సైనికులను ఉక్రెయిన్ సరిహద్దు గుండా ఉన్న పాయింట్లలో మోహరింపజేయించింది రష్యా. దానికంటే ముందు.. వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. అయితే బుధవారం జరిగిన తొలిసారిగా ఉక్రెయిన్ బలగాలతో నార్త్ కొరియా సైన్యం తలపడింది. -
ట్రంప్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ట్రంప్‌ను అభినందించారు. ట్రంప్‌ను ధైర్యశాలిగా అభివర్ణించారు. సోచిలో శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వైట్‌హౌస్‌లో తొలి విడతలో ట్రంప్ అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకగలనని ట్రంప్ అనడంపై స్పందిస్తూ.. కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని రష్యా అధ్యక్షుడు అన్నారు. జూలైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై మాట్లాడుతూ.. ఆయనపై ఒక అభిప్రాయానికి రావడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు. కాల్పులు జరిగి చెవి నుంచి రక్తమోడుతున్నా.. ట్రంప్ వెంటనే తేరుకొని పిడికిలి బిగించి.. ఫైట్, ఫైట్, ఫైట్.. అని నినదించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘ట్రంప్ చక్కగా స్పందించారు. ధైర్యంగా పరిస్థి తులను ఎదుర్కొ న్నారు. ధీశాలి’ అని కితాబి చ్చారు. గురువారం ట్రంప్ ఎన్బీసీ ఛానల్‌తో మాట్లాడు తూ.. పుతిన్‌తో మాట్లాడాలని భావిస్తున్నా నన్నారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని విలేకరులతో అన్నారు. సూపర్ పవర్ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలిప్రపంచంలోని అత్యంత బలీయమైన దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలన్నింటిలోకి భారత ఆర్థికవ్యవస్థే అతి వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. శుక్రవారం పుతిన్ సోచిలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
ఉక్రెయిన్‌పైకి దూసుకొచ్చిన 100 డ్రోన్లు
కీవ్: రష్యా శనివారం అర్ధరాత్రి నుంచి తమ భూభాగంపైకి 96 డ్రోన్లు, ఒక గైడెడ్ ఎయిర్ మిస్సైల్‌ను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. క్షిపణితోపాటు 66 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాలపైకి దూసుకెళ్లిన మరో 27 డ్రోన్లను పనిచేయకుండా జామ్ చేశామని తెలిపింది. ఒక డ్రోన్ బెలారస్ గగనతలంలోకి వెళ్లిందని వివరించింది. ఈ దాడులతో తమకెలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో రష్యా కనీసం 900 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500 డ్రోన్లు, మరో 30 క్షిపణులను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించిందని జెలెన్ స్కీ వివరించారు. తమకు తక్షణమే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు అనుమతివ్వాలని అమెరికా, పశ్చిమ దేశాలను ఆయన కోరారు. డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో కీలకమైన పరికరాలు రష్యాకు అందకుండా ఆంక్షలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.కాగా, ఉక్రెయిన్ తమ మూడు రీజియన్లపైకి ప్రయోగించిన 19 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. బెల్గొరోడ్ రీజియన్ ఒక వ్యక్తి గాయాలతో చనిపోయాడని పేర్కొంది. -
పాశ్చాత్య ఆధిపత్యం ముగిసేనా?
మొత్తం ప్రపంచపు ఆర్థిక నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున ‘బ్రిక్స్’ కూటమి చేయగలిగిందేమీ లేదన్నది గతంలో పాశ్చాత్య దేశాల ధీమా. కజాన్(రష్యా) కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగినా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందుకే పట్టించుకోలేదు. కానీ బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం పాశ్చాత్య దేశాల్లో కలవరం పుట్టిస్తోంది. అదే సమయంలో ఇండియా భాగస్వామిగా గల బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు వర్ధమాన దేశాల్లో కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. బహుళ ధ్రువ ప్రపంచమనీ, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమనీ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిక్స్ కూటమి కజాన్ డిక్లరేషన్ అక్టోబర్ 23న విడుదలైన తర్వాతి పరిణామాలను గమనించినపుడు ప్రధానంగా కనిపిస్తున్నవి రెండున్నాయి. ఒకటి – వర్ధమాన దేశాలన్నిటా ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం కావటం. రెండు – పాశ్యాత్య ప్రపంచంలో కలవరపాటు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పశ్చిమాసియా, మధ్య ఆసియా, కరీబియన్లతో పాటు యూరప్‌లోని సాధారణ స్థాయి ప్రభుత్వాధినేతలు, ఇతర నాయకులు, మేధావులు, యాక్టివిస్టుల అందరి ఆలోచనలూ ఒకే విధంగా ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు, ప్రకటించిన కార్యక్రమం అందరికీ తమ భవిష్యత్తు పట్ల కొత్త ఆశలు కల్పించటమే అందుకు కారణం. దానితో ఉన్నట్టుండి అందరూ బహుళ ధ్రువ ప్రపంచమని, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమని మాట్లాడుతున్నారు.మరొక వైపు పాశ్చాత్య ప్రపంచ స్పందనలను గమనించండి. మొదట బ్రిక్‌గా ఉండిన కూటమి ఆ తర్వాత బ్రిక్స్‌గా మారి కజాన్ కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించింది. కానీ ఆ కూటమిని అంత సుదీర్ఘ కాలంలో కూడా పాశ్చాత్య దేశాలు గానీ, వారి ఆధిపత్యాన నడిచే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు గానీ, అక్కడి నిపుణులు, మేధావులు గానీ లెక్క చేయలేదు. కజాన్ సమావేశం కన్నా ముందువరకు అందులో ఇండియా, చైనా (ఆసియా నుంచి), రష్యా (యూరప్ నుంచి), దక్షిణాఫ్రికా (ఆఫ్రికా నుంచి), బ్రెజిల్ (దక్షిణ అమెరికా నుంచి) ఉండేవి. అయిదు కూడా భౌగోళిక వైశాల్యం, జనాభా, ఆర్థికశక్తి, సైనిక బలం రీత్యా ప్రముఖమైనవే. వాటి ఉమ్మడి బలాలు మొత్తం యూరప్ కన్నా, కొన్ని విషయాలలో యూరప్‌తో పాటు అమెరికాను కలిపినా ఎక్కువే. అయినప్పటికీ పాశ్చాత్య కూటమికి తక్కిన ప్రపంచం పట్ల మొదటి నుంచి గల చులకన భావంతో వారటువంటి వైఖరి తీసుకుంటూ వచ్చారు.ఈ దృష్టికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఇతర దేశాలు ఏమి మాట్లాడి, ఏమి చేసినా, మొత్తం ప్రపంచపు ఆర్థిక, ద్రవ్య నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున బ్రిక్స్ చేయగలిగిందేమీ లేదన్నది వారి ధీమా. ఇందుకు ఒక కీలకం అమెరికన్ డాలర్; అంతే కీలకమైనవి ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్’ (బిఐఎస్), ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్; అదేవిధంగా, బ్రిక్స్‌తో సహా అత్యధిక దేశాల నగదు నిల్వలు పాశ్చాత్య కరెన్సీలలో ఉండటం, వారి అస్తులు కూడా అనేకం పాశ్చాత్య దేశాలలో ఉండటం; అన్నిదేశాల ఎగుమతి దిగుమతులు, పరస్పర చెల్లింపులు డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో కరెన్సీల ద్వారా జరగటం. ఈ ఆర్థిక ప్రాబల్యాలు పాశ్చాత్యులకు రాజకీయ, సైనిక ప్రాబల్యాలను కూడా సహజంగానే తెచ్చిపెడుతున్నాయి.ఈ వలయంలో చిక్కుకున్న బ్రిక్స్గానీ, మరొకటిగానీ చేయగలిగిందేమిటి? అందువల్లనే 2006 నుంచి 2024 కజాన్ డిక్లరేషన్ సమయం వరకు అమెరికా, యూరప్ బ్రిక్స్‌ను పట్టించుకోలేదు. అటువంటిది ఈ డిక్లరేషన్‌తో మొదటిసారి ప్రకంపనలు మొదలయ్యాయి. అందుకు కారణం బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం. ఇది వాస్తవ రూపంలో జరిగేందుకు మరికొన్ని సంప్రదింపులు అవసరమైనా, ఆ నిర్ణయం సూత్రరీత్యా జరగటమే పాశ్యాత్య కరెన్సీలకు పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదం. ఈ చెల్లింపులు ఇప్పటికే కొన్ని దేశాల మధ్య మొదలయ్యాయి కూడా! బ్రిక్స్ దేశాల డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి ఇప్పటికే ఏర్పడి పనిచేస్తున్నది. భవిష్యత్తులో బ్రిక్స్ సొంత కరెన్సీ ఆలోచన కూడా ఉంది. ఈ నిర్ణయాలపై కజాన్ అనంతరం పాశ్చాత్య దేశాలు అధికారిక ప్రకటనలైతే ఇంకా చేయలేదు. కానీ, అంతర్జాతీయ సెటిల్మెంట్స్ అన్నిటికీ నాడీ కేంద్రం వంటి బిఐఎస్ అధికారుల స్పందనను గమనిస్తే రహస్యం తెలిసిపోతుంది. ఆ చెల్లింపులు ఇప్పటి వలె డాలర్ల రూపంలో గాక బ్రిక్స్ నిర్ణయించినట్లు స్థానిక కరెన్సీలలో జరగటం అంతటా మొదలైతే అది ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకే ముప్పు కాగలదని నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేశారు వారు. దాని అర్థాన్ని సాధారణ భాషలో చెప్పాలంటే, డాలర్ ప్రపంచం తలకిందులవుతుందన్నమాట! చమురును భారీగా ఉత్పత్తి చేసే నైజీరియా ఇక నుంచి డాలర్‌కు బదులు తమ కరెన్సీ నైరాలో విక్రయించాలని ఈ వ్యాసం రాసే సమయానికి నిర్ణయించటం విశేషం.మనం చేసే పనిలోని మంచిచెడులను గ్రహించాలంటే మన ప్రత్యర్థి స్పందనలను గమనించాలంటారు. కజాన్ డిక్లరేషన్‌లోని 134 పేరాగ్రాఫ్‌లు యథాతథంగానే వర్ధమాన దేశాలన్నిటా తక్షణ ఉత్సాహాలకు, ఆశాభావాలకు కారణమయ్యాయి. పైన పేర్కొన్న బిఐఎస్ అధికారుల వ్యాఖ్యలు, కొందరు పాశ్చాత్య మేధావుల వ్యాఖ్యలను బట్టి, ఈ డిక్లరేషన్‌లోని ఆర్థికపరమైన ఆలోచనలు ఏ విధంగా వర్ధమాన దేశాలను పాశ్చాత్యుల కబంధ హస్తాల నుంచి విముక్తం చేయగల అవకాశం ఉందో వారికి బాగా అర్థమవుతున్నది. డాలర్ శక్తి, ఆర్థిక లావాదేవీల నియంత్రణ, వర్ధమాన దేశాల ముడి సరుకుల ధరల తగ్గింపు, అక్కడి మార్కెట్లలో తమ ఉత్పత్తుల ధరల పెంపు, ఆ యా దేశాల కరెన్సీ విలువల కుదింపు, తమ మాట వినని వారిపై ఆంక్షలు, తమ బ్యాంక్‌లలోని ఆ యా దేశాల నిధుల స్తంభన వంటివన్నీ పాశ్చాత్య దేశాలకు ఒక క్రీడగా మారి యథేచ్ఛగా సాగుతూ వస్తున్నాయి. ఇపుడిక క్రమంగా వీటన్నిటికి బ్రేకులు పడగలవన్నది వర్ధమాన దేశాలకు ఒక కొత్త ఆశాభావం అవుతుండగా, పాశ్చాత్య రాజ్యాలకు అదే గుబులు పుట్టిస్తున్నది. అందుకే, సౌదీ అరేబియా తన చమురును చైనాకు యువాన్‌లో కాక డాలర్లలో విక్రయించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నట్టు తాజావార్తలు చెప్తున్నాయి.కజాన్ డిక్లరేషన్‌లో ఐక్యరాజ్య సమితి తదితర అంతర్జాతీయ సంస్థలు, సంబంధాలతో నిమిత్తం గల పేరాగ్రాఫ్‌లు, వర్ధమాన దేశాల మధ్య వివిధ సహకారాలు, ఇతర సంస్కరణల గురించిన ప్రస్తావనలు కూడా వర్ధమాన దేశాలంతటా సానుకూల స్పందనలకు కారణమవుతున్నట్లు ఈ వారం రోజుల కథనాలు చెప్తున్నాయి. సాధారణంగా పాశ్చాత్య దేశాలకు అణగిమణగి ఉంటాయనే భావన గల పలు దేశాలు సైతం నెమ్మదిగా ధిక్కార స్వరంతో మాట్లాడుతూ బ్రిక్స్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నాయి. కూటమిలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా జరగాలనే అవగాహన ఉన్నందున, సభ్యదేశాల సంఖ్య వేగంగా పెరిగితే అందుకు చిక్కులు రాకుండా ఉండేందుకు కొత్తవారిని ఆచితూచి తీసుకోనున్నారు. కజాన్ దరిమిలా ప్రపంచంలో ఎన్నడూ లేని కొత్త మార్పునకు ఆరంభం జరుగుతున్నదని పలువురు పాశ్చాత్య మేధావులు సైతం భావిస్తున్నారు. ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు, కజాన్ డిక్లరేషన్ అమలులో తగినన్ని సాధక బాధకాలున్నందున జాగ్రత్తగా ముందడుగులు వేయవలసి ఉంటుందనే గుర్తింపు బ్రిక్స్‌లోనూ ఉంది.పోతే, అమెరికాతో ఎంత సాన్నిహిత్యం ఉన్నా భారతదేశం 2006 లోనే బ్రిక్స్‌లో చేరి, ఈ కజాన్ డిక్లరేషన్‌లోనూ సాహసవంతమైన విధంగా భాగస్వామి కావటం గమనించదగ్గది. ఏ అవసరాల కోసం అమెరికాకు సన్నిహితంగా ఉన్నా, తన మౌలికమైన, దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం తక్కిన వర్ధమాన దేశాలతో కలిసి నడవటమే సరైనదన్న గుర్తింపు ఉండటమే అందుకు కారణమనాలి, ముఖ్యంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తరచుగా తన ఇంటర్వ్యూలు, ప్రసంగాలలో చెప్తున్న మాటలు వినేవారికి ఇది స్పష్టమవుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా భారత్, చైనా, స్విట్జర్లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలుండడం గమనార్హం.ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 275 కంపెనీలు రష్యాకు సహకరిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాంతో ఉక్రెయిన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయంఅమెరికా ఆంక్షలు విధించిన భారత్‌కు చెందిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.అభర్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్డెన్వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ఎమ్సిస్టెక్గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్ఎల్పీఇన్నోవియో వెంచర్స్కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ఖుష్బూ హోనింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోకేష్ మెషీన్స్ లిమిటెడ్పాయింటర్ ఎలక్ట్రానిక్స్ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్షార్ప్లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రీఘీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ -
వారి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మిసైల్స్ కావాలి: ఉక్రెయిన్
కీవ్: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా సైనిక దాడులను ఎదుర్కొవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భావిస్తున్నారు. అందులో భాగంగానే రష్యాపై క్షిపణులను ప్రయోగించేందుకు తమ మిత్రదేశాల నుంచి అనుమతి అవసరమని తెలిపారు. శుక్రవారం సాయంత్రం జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు.‘‘రష్యా ఉక్రెయిన్ భూభాగంలో ఉత్తర కొరియా సైనికులను ప్రతి స్థావరాలు, వారి అన్ని శిబిరాలను మేం గమనిస్తాం. ఈ పరిస్థితుల్లో దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే.. మేం రష్యా దాడులకు నివారణగా కచ్చితంగా ప్రతిదాడిచేసే అవకాశం ఉంది. ఉక్రేనియన్లపై దాడి చేయటం కోసం ఉత్తర కొరియా సైన్యం ఎదురు చూస్తోంది. రష్యాకు మద్దతుగా మోహరించిన ఉత్తర కొరియా సేనలను దీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులు ప్రయోగించాలి. అందుకు తమ మిత్ర దేశాల మద్దతు అవసరం ఉంది. మా వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సౌలభ్యం ఉంటే వారిని అడ్డుకోవడానికి వినియోగిస్తాం’’అని వెల్లడించారు.చదవండి: ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు -
అమెరికా కొత్త ఆంక్షలు!
అనుకున్నది సాధించటం కోసం, మాట వినని దేశాలను దారికి తెచ్చుకోవటం కోసం ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించటం అమెరికాకు అలవాటైన విద్య. దాన్ని సహేతుకంగా వినియోగిస్తున్నామా... ఆశించిన ఫలితాలు వస్తున్నాయా దుష్పరిణామాలు పుట్టుకొస్తున్నాయా అనే ఆలోచన దానికి ఎప్పుడూ రాలేదు. ‘ప్రపంచంలో అగ్రజులం, మన మాట చెల్లుబాటు కావాలంతే...’ అన్న పట్టింపే అధికం. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి తోడ్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలపైనా, వ్యక్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఇందులో మన దేశానికి సంబంధించి 19 ప్రైవేటు సంస్థలున్నాయి. ఇంకా ఈ జాబితాలో చైనా, మలేసియా, థాయ్‌లాండ్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితరాలున్నాయి. ఈ దేశాలన్నీ రష్యాకు ఉపకరణాలు, విడిభాగాలు పంపుతున్నాయనీ, వీటితో ఆయుధాలకు పదునుపెట్టుకుని రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తోందనీ అమెరికా ఆరోపణ. వీటిల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విమాన విడిభాగాలూ ఉన్నాయంటున్నది. పరాయి దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఏ దేశానికైనా హక్కుంటుంది. కానీ ఆ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలూ, ద్వైపాక్షిక ఒప్పందాలూ వగైరా చూసుకోవటం, అంతకుముందు సంబంధిత దేశాలతో చర్చించటం కనీస మర్యాద. అమెరికా ఎప్పుడూ ఈ మర్యాద పాటించిన దాఖలా లేదు.ఎప్పుడూ స్వీయప్రయోజనాలే పరమావధిగా భావించే అమెరికా తన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి ఆంక్షల్ని ఆయుధంగా మలుచుకోవటం పాత కథే. అయితే ఈమధ్యకాలంలో ఇది బాగా ముదిరిందని ఒక అధ్యయనం చెబుతోంది. దాని ప్రకారం మొదటి ప్రపంచయుద్ధానికీ (1914–18), 2000 సంవత్సరానికీ మధ్య అమెరికా 200కు పైగా ఆంక్షలు విధించిందని తేలింది. చిత్రంగా అటు తర్వాత ఈ రెండు దశాబ్దాలపైగా కాలంలో ఈ ఆంక్షలు తొమ్మిదిరెట్లు పెరిగాయని ఆ అధ్యయనం వివరిస్తోంది. అంటే ఎనిమిది దశాబ్దాల కాలంలో అమెరికా విధించిన ఆంక్షల సంఖ్య చాలా స్వల్పం. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థికాంశాలు... ఒకటేమిటి అనేకానేక అంశాల విషయంలో ఈ ఆంక్షల జడి పెరిగిపోయింది. క్యూబా, వెనెజులా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలు ఈ ఆంక్షల పర్యవసానాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. అసలు అవతలి దేశంనుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పకుండానే వీటిని వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాఫల్య వైఫల్యాలను అమెరికా గమనంలోకి తీసుకుంటున్నదా లేదా అనే సంశయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆంక్షలవల్ల నెరవేరిన ప్రయోజనాలు ఆశించిన లక్ష్యాల్లో 34 శాతం దాటవన్నది ఆ అధ్యయన సారాంశం. ఈ ఆంక్షలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించి ఆ దేశంపై దండెత్తిన అమెరికా అంతకుముందూ ఆ తర్వాత దాన్ని ఆంక్షల చక్రబంధంలో బంధించింది. అందువల్ల పసిపిల్లలకు పాలడబ్బాలు మొదలుకొని ప్రాణావసరమైన ఔషధాల వరకూ ఎన్నో నిత్యావసరాలు కరువై లక్షలమంది మృత్యువాత పడ్డారు. తాను ఆంక్షలు విధించటంతో సరిపెట్టక మిత్రులైన పాశ్చాత్య దేశాలను కలుపుకోవటం అమెరికా విధానం. అంతా అయినాక, ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ ఉసురు తీశాక అక్కడ రసాయన ఆయుధాలున్నాయనటం పచ్చి అబద్ధమని తేలింది. మరి లక్షలమంది జనం ఉసురు తీసిన పాపం ఎవరిది? ఇరాన్లో సరేసరి... అక్కడ తన అనుకూలుడైన ఇరాన్ షా పదవీ భ్రష్టుడైంది మొదలుకొని ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇందువల్ల మన దేశం సైతం ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈ అర్థరహిత ఆంక్షల్ని దాటుకుని, నష్టం కనిష్ట స్థాయిలో ఉండేలా తెలివిగా వ్యవహరించే దేశాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2017–2021 మధ్య యూరప్ దేశాలకు రష్యాతో ఉన్న వాణిజ్యం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 5 శాతం తగ్గింది. అదే సమయంలో రష్యాకు ఆర్మేనియా, యూఏఈ, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్‌లతో వాణిజ్యం పెరిగింది. మరోపక్క ఈ దేశాలన్నిటితో యూరప్ దేశాల వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది. అంటే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న సరుకంతా ఈ దేశాలు యూరప్ దేశాలకు తరలిస్తున్నాయి. ఇక ఆంక్షల ప్రయోజనం ఏం నెరవేరినట్టు? రష్యా నుంచి మన ముడి చమురు దిగుమతులు భారీగా పెరగటం, యూరప్ దేశాలకు శుద్ధిచేసిన చమురునూ, గ్యాస్‌నూ మన దేశం విక్రయించటం ఇటీవలి ముచ్చట.అసలు ఆంక్షల వల్ల ఒరిగేది లేకపోగా నష్టం ఉంటుందని అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్ మిత్రదేశం. అసలే అమెరికాలో స్థిరపడిన ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర విషయంలో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. అవి మరింత దిగజారేలా ఆంక్షలకు దిగటం నిజంగా ప్రయోజనాన్ని ఆశించా లేక నాలుగురోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గొప్పలు చాటుకోవటానికా అన్నది అర్థంకాని విషయం. ఒకపక్క ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలువరించటం కోసమని తనకు తోచినట్టు చేసుకుపోతున్న అమెరికా... గాజా, వెస్ట్‌బ్యాంక్, లెబనాన్లలో రోజూ వందలమందిని హతమారుస్తున్న ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు నోరెత్తటం లేదు? తనవరకూ అమలు చేసుకుంటూ పోతానంటే అమెరికా విధించిన ఆంక్షలపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ అదే పని అందరూ చేయాలని శాసించటం తెలివితక్కువతనం. ఈ ఇంగితజ్ఞానం అమెరికాకు ఎప్పటికి అలవడుతుందో?! -
గూగుల్ ఆస్తులమ్మినా తీరనంత జరిమానా!
గూగుల్‌కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని మాస్కో కోర్టు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌ను ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమని కోర్టు తెలిపింది. ఈమేరకు రష్యా మీడియా సంస్థ ఆర్బీసీ(రాస్బైజెన్స్ కన్సల్టింగ్) వివరాలు వెల్లడించింది.ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం..‘మాస్కో కోర్టు గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కంపెనీ 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించిన తర్వాత ఈ ఛానెళ్లపై వేటు వేశారు. అందుకు వ్యతిరేకంగా మీడియా ఛానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించవలసి ఉంటుంది’ అని పేర్కొంది.‘గూగుల్ మరింత మెరుగవ్వాలి’క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘గూగుల్‌పై నిర్దిష్టంగా ఎంతమొత్తం జరిమానా విధించారో కచ్చితంగా చెప్పలేను. గూగుల్ మా దేశ కంపెనీలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదు. మీడియా సంస్థలు, బ్రాడ్కాస్టర్ల హక్కులను హరించకూడదు. కోర్టు నిర్ణయంతో గూగుల్ తన పరిస్థితిని మరింత మెరుగు పరుచుకునేందుకు వీలుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.2020లోనే కొన్ని ఛానెళ్లపై వేటుగూగుల్ రష్యాలోని ప్రైవేట్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ మెర్సెనరీ చీఫ్ ప్రిగోజిన్, ఒలిగార్చ్ మలోఫీవ్లకు చెందిన ఛానెళ్లను 2020లో బ్లాక్ చేసినట్లు రష్యాకు చెందిన ఎన్బీసీ న్యూస్ ఛానల్ తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ మరిన్ని ఛానెళ్లను నిషేధించిందని పేర్కొంది.రష్యా గూగుల్ ఎల్ఎల్సీ దివాలా!గూగుల్ మార్కెట్ విలువ మొత్తంగా అక్టోబర్ నాటికి 2.15 ట్రిలియన్ డాలర్లు(రూ.179 లక్షల కోట్లు)గా ఉంది. కానీ కంపెనీకి విధించిన జరిమానా చాలా రెట్లు ఎక్కువ. గూగుల్ రష్యాలోని తన అనుబంధ సంస్థ ‘గూగుల్ ఎల్ఎల్సీ’ దివాలా కోసం జూన్ 2022లో దాఖలు చేసింది. కానీ దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కోర్టు పేర్కొంది.(Apple: భారత్‌లో కొత్తగా నాలుగు అవుట్లెట్లు!)గూగుల్ స్పందన ఇదే..‘రష్యాతో కొన్ని చట్టపరమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. బ్లాక్ చేసిన ఛానెళ్లకు సంబంధించి కోర్టు కాంపౌండింగ్ పెనాల్టీలను విధించింది. అదే తుది నిర్ణయంగా జరిమానా కట్టాలని పేర్కొంటుంది. దీనిపై రష్యా జ్యుడిషియరీలో చర్చించాల్సి ఉంది. ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని తెలిపింది. -
అణు క్షిపణుల పరీక్షకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం
మాస్కో: ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ న్యూక్లియర్ ఫోర్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు కసరత్తు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని సైనిక అధికారులతో జరిగిన వీడియో సమావేశంలో పుతిన్ ఆదేశించారు. పుతిన్ ఆదేశాల మేరకు రష్యా అణు దళం అణు క్షిపణులను పరీక్షించడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్‌కు పెరుగుతున్న పాశ్చాత్య దేశాల మద్దతు నేపథ్యంలో అణుశక్తి సామర్థ్యాన్ని ప్రస్తావించిన పుతిన్.. రష్యాలోని అణు ఆయుధాగారం దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నమ్మదగిన హామీ అని పేర్కొన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొత్త హెచ్చరికలు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే, యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యమని పుతిన్ పునరుద్ఘాటించారు.కాగా కమ్చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్‌లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ను సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా, నాటో మిత్రదేశాలను హెచ్చరించారు. రష్యా పై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే, రష్యాపై నాటో యుద్ధం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి
ఇస్లామాబాద్: పాకిస్తాన్, రష్యా సైనికాధికారులు సమావేశం ఆ ఇరు దేశాల సాన్నిహిత్యాన్ని మరింత దగ్గర చేసింది. ఈ సమావేశంలో భద్రత, రక్షణ రంగాల్లో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ వీ ఫోమిన్ పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులతో విడివిడిగా సమావేశమై రక్షణ సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు.పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం 'ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ భద్రత, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు పక్షాలు చర్చించుకున్నాయి. రష్యాతో సంప్రదాయ రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడంతో పాటు ఉమ్మడి సైనిక విన్యాసాలు, పీఏఎఫ్ పరికరాల కోసం సాంకేతిక మద్దతు ఇరుదేశాల మధ్య ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా బ్రిక్స్‌లో సభ్యదేశంగా మారేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోంది. తమను బ్రిక్స్‌లో భాగం చేయాలని పాకిస్తాన్ రష్యాకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాది బ్రిక్స్ సభ్యత్వం కోసం పాకిస్తాన్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశానికి ఆహ్వానం రాకపోవడం గమనార్హం. భారత్ వ్యతిరేకత కారణంగా బ్రిక్స్‌లో పాకిస్తాన్‌కు సభ్యత్వం కల్పించలేదు.ఇది కూడా చదవండి: నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం -
భారత్-చైనా సరిహద్దు వివాదం.. స్పందించిన రష్యా
మాస్కో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట సైనికులను ఉపసంహరణపై భారత్, చైనాల మధ్య జరిగిన అవగాహనను రష్యా స్వాగతించింది. సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల నుంచి సంకల్పం, విశ్వాసం అవసరమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సోమవారం అన్నారు.‘‘ ఐదేళ్ల విరామం తర్వాత కజాన్‌లో చైనా, భారత్‌ల నేతల మధ్య తొలి సమావేశం జరగడాన్ని మేం (రష్యా) స్వాగతిస్తున్నాం. ఆనందం వ్యక్తం చేస్తున్నాం. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఇది.. చాలా సానుకూల పరిణామం. భారత్-చైనా సరిహద్దు వివాదం చాలా సంక్లిష్టమైన సమస్య.దీనికి సుదీర్ఘమైన చర్చల ప్రక్రియ అవసరం. భారత్, చైనా తమ మధ్య ఉన్న సరిహద్దు సమస్యలపై చివరికి విజయం సాధిస్తాయనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు.దానికి సంకల్పం, సహృదయం, నమ్మకం అవసరం. సామరస్యానికి ఇవి చాలా అవసరం’’ అని అలిపోవ్ తెలిపారు.అక్టోబరు 23న రష్యాలోని కజాన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల భేటీకి రెండు రోజుల ముందే ఎల్ఏసీ వెంట పెట్రోలింగ్ ఏర్పాట్లపై చైనాతో భారత్ ఒప్పందాన్ని ప్రకటించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి వచ్చాయి. చదవండి: 2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల! -
ఉమ్మడి భద్రత కోసం పనిచేయాలి: జిన్‌పింగ్
కజన్: గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా ఆధునికత దిశగా ముందుకు సాగుతుండడం ప్రపంచ చరిత్రలో, మానవ నాగరికతలో అపూర్వమైన ఘట్టమని చైనా అధినేత జిన్‌పింగ్ ప్రశంసించారు. శాంతి, ఉమ్మడి భద్రత కోసం బ్రిక్స్ ప్లస్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన బ్రిక్స్ ఔట్రీచ్ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్‌ప్లస్ దేశాల శాంతి ప్రపంచ శాంతితో ముడిపడి ఉందన్నారు. ఉమ్మడి ప్రగతి కోసం ఆయా దేశాలన్నీ స్వయంగా చోదక శక్తిగా మారాలని సూచించారు. దేశాల మధ్య సమాచార మారి్పడి, సంప్రదింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ గ్లోబల్ సౌత్‌ను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటామని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. తమ మూలాలను మర్చిపోవడం లేదన్నారు. ముగిసిన బ్రిక్స్ సదస్సు రష్యాలో మూడు రోజులపాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు కాగా, కొత్తగా ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. కూటమిలో సభ్యత్వం కోసం తుర్కియే, అజర్బైజాన్, మలేసియా దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు సైతం బ్రిక్స్‌లో చేరడానికి ఆసక్తి ప్రదర్శించాయి. ముగింపు సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సాగించిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. ప్రపంచంలో బ్రిక్స్ పాత్రను పశి్చమ దేశాలకు ప్రత్యామ్నాయంగా అభివరి్ణంచారు. -
S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం
కజన్: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచించారు. రష్యాలోని కజన్ నగరంలో బ్రిక్స్ ఔట్రీచ్/బ్రిక్స్ ప్లస్ సదస్సులో చివరి రోజు గురువారం జైశంకర్ మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. శాంతియుత చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి పెడితే వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాలని, ఎలాంటి మినహాయింపులు ఉండొద్దని తేల్చిచెప్పారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. పశి్చమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలపు సవాళ్లను ఎదిరించే విషయంలో కొత్తగా ఆలోచించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిందే ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందడం లేదని, ఈ నిజాన్ని బ్రిక్స్ వేదిక గుర్తించాలని జైశంకర్ కోరారు. కోవిడ్ మహమ్మారితోపాటు వేర్వేరు సంఘర్షణల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలపై భారం మరింత పెరిగిందన్నారు. వైద్యం, ఆహారం, ఇంధన భద్రత విషయంలో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సరిసమానమైన ప్రపంచ క్రమం’ అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి వలసవాద పాలన నుంచి వారసత్వంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలను సరి చేయాలన్నారు. సరుకుల సరఫరా కోసం దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాలన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని గౌరవిస్తూ ఆ దిశగా అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు తక్షణావసరమని జైశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. భద్రతా మండలిలో మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కలి్పంచాలని డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్∙సదస్సుకు పదికిపైగా బ్రిక్స్ సభ్యదేశాలతోపాటు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. -
అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా
న్యూయార్క్: ఉత్తర కొరియాకు చెందిన 3 వేల మంది సైనికులు రష్యాకు వెళ్లి డ్రోన్లు, ఇతర పరికరాలపై శిక్షణ పొందుతున్నారని దక్షిణ కొరియా వ్యాఖ్యలు చేసింది. దక్షిణ కొరియా వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉత్తర కొరియాకు సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో భాగంగా రష్యా ఆర్మీలో చేరితే సైనిక చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్‌తో పోరాటాని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్దతు పొందితే అది క్రెమ్లిన్ బలహీనతకు సంకేతమని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రష్యన్లు, ఉత్తర కొరియన్లు ఇక్కడ ఏమి చేయాలని నిర్ణయించుకుంటారో మేము చూస్తాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో చేరాలని నిర్ణయించుకుంటే చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా మారిపోతాయి. ఈ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం. సైనికులు ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు ఓడలో ప్రయాణించారు. రష్యన్ సైనిక శిక్షణా కేంద్రాలున్న ప్రాంతాలు వెళ్లారు. అయితే.. ఉత్తర కొరియా సైనికులు రష్యన్ మిలిటరీతో కలిసి యుద్ధంలోకి పాల్గొంటాయో లేదో స్పష్టత లేదు. ఉత్తర కొరియా సైనికులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఉక్రేయిన్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడేందుకు పశ్చిమ రష్యాకు వెళ్లవచ్చ. ఉక్రెయిన్ ప్రభుత్వానికి కూడా ఈ పరిస్థితి గురించి తెలియజేశాం. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటే.. రష్యాలో పెరుగుతున్న నిరాశ, బలహీనతకు సంకేతం అవుతుంది’’ అని అన్నారు. ఉత్తర కొరియా ఇప్పటివరకు 3వేల మంది సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా తెలుపుతోంది. ఇటీవల 1500 మంది సైనికులను ఉత్తర కొరియా రష్యాకు తరలించినట్లు దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. మరోవైపు.. రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించటం గమనార్హం.చదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
బ్రిక్స్ సదస్సు వేళ.. రష్యాపై భారీ సైబర్ దాడి
మాస్కో: రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు.‘‘రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్‌దాడికి లక్ష్యంగా చేసుకున్నారు. అధికారిక వెబ్సైట్, మౌలిక సదుపాయాలపై ఈ బుధవారం ఉదయం విదేశాల నుంచి భారీ సైబర్‌టాక్ ప్రారంభమైంది. అయితే.. మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఇలాంటి విదేశీ సైబర్ దాడులను శక్తిమంతంగా ఎదుర్కొంటోంది. అయితే బుధవారం చేసిన సైబర్ దాడి మాత్రం చాలా తీవ్రమైంది’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆంక్షలను లెక్కచేయకుండా మాస్కో ప్రపంచ స్థాయిలో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలను అక్టోబర్ 22-24 తేదీల్లో రష్యాలోని కజాన్‌లో జరుపుతోంది.Russian Foreign Ministry suffers ‘unprecedented’ #cyberattack - spox ZakharovaSpecialists are working to restore the functionality of the Russian Foreign Ministry's website after a large-scale DDoS attack, ministry spokesperson Maria Zakharova told TASS.The attack...RTNews pic.twitter.com/RS2ilmEhVJ— TifaniesweTs (@TifaniesweTs) October 23, 2024 రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కజన్ నగరంలో జరుగుతున్న ‘బ్రిక్స్’ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.చదవండి: PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు -
PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు
కజన్: సంఘర్షణలు, సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యమార్గాలే శ్రేయస్కరమని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. శాంతియుత మా ర్గంలో చర్చలు, సంప్రదింపులకే తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఏ సమస్యకైనా యుద్ధాలతో పరిష్కారం లభించందని స్పష్టంచేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు.రష్యాలోని కజన్ నగరంలో బుధవారం 16వ ‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశి్చతి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేలా బ్రిక్స్ సానుకూల పాత్ర పోషించగలదని చెప్పారు. బ్రిక్స్ వైవిధ్యంతో కూడిన, సమగ్ర వేదిక అని వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు ‘‘యుద్ధానికి కాదు.. చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. కోవిడ్–19 సంక్షోభాన్ని మనమంతా కలిసికట్టుగా అధిగమించాం అదే తరహాలో ముందు తరాలకు సురక్షితమైన, బలమైన, సౌభాగ్యవంతమైన భవిష్యత్తును అందించడానికి నూతన అవకాశాలు మనం సృష్టించగలం. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బ్రిక్స్‌పై ప్రపంచ దేశాలకు ఎన్నో అంచనాలున్నాయి. వాటిని నెరవేర్చేలా మనం పనిచేయాలి. ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి అన్ని దేశాలూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. అందరూ ఒకే ఆలోచనతో ఉంటేనే లక్ష్యం సాధించడం సులువవుతుంది. యువతను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు అవసరం. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర తీర్మానం చేసేలా మనమంతా కలిసి ఒత్తిడి పెంచాలి. అలాగే సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం కోసం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలు అవసరం. నిరి్ధష్ట గడువులోగా సంస్కరణలు వచ్చేలా మనం ఉమ్మడిగా ముందుకు సాగాలి. బ్రిక్స్‌లో మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ సంస్థలకు బ్రిక్స్ ప్రత్యామ్నాయం అనే భావన రాకూడదు. ఆయా సంస్థలను సంస్కరించే వేదిక అనే అభిప్రాయం అందరిలోనూ కలగాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని మనం కర్తవ్యంగా స్వీకరించాలి. ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్‌లోకి మరికొన్ని భాస్వామ్య దేశాలను ఆహా్వనించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కూటమి దేశాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి. అదేసమయంలో బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశాలను గౌరవించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. కూటమిలోకి మరో ఐదు దేశాలు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో చేరేందుకు గ్లోబల్ సౌత్ దేశాలు ఎంతగానో ఆసక్తి చూపుతున్నాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెప్పారు. ఈ విషయంలో ఆయా దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల పట్ల చురుగ్గా స్పందించాలని కూటమిలోని సభ్యదేశాలకు సూచించారు. కొత్త దేశాలను కూటమిలో భాగస్వాములుగా చేర్చుకోవాలని బ్రిక్స్ ప్రస్తుత సదస్సులో నిర్ణయించినట్లు తెలిపారు. బ్రిక్స్‌లో తాజాగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సభ్యదేశాలుగా చేరాయి. బ్రిక్స్ ప్రయాణంలో ఇదొక కీలకమైన ఘట్టమని జిన్‌పింగ్ చెప్పారు. ఆయన బుధవారం బ్రిక్స్ సదస్సులో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో బిక్స్ దేశాల్లో 10 ఓవర్సీస్ లెరి్నంగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. భారత ఆర్థిక ప్రగతి సూపర్: పుతిన్ భారత ఆర్థిక ప్రగతి అద్భుతమంటూ బ్రిక్స్ సదస్సు వేదిక సాక్షిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతించారు. ఈ విషయంలో బ్రిక్స్ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘‘హెచ్చు వృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని గురించి దేశాధినేతలుగా మనమంతా తరచూ మాట్లాడుతుంటాం. ప్రధాని మోదీ దాన్ని విజయవంతంగా సాధించి చూపిస్తున్నారు. 7.5 శాతం వృద్ధి రేటుతో భారత్‌ను మనందరికీ ఆదర్శంగా నిలిపారు. ఆయన సాధిస్తున్న విజయాలకు అభినందనలు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు మోదీకి ధన్యవాదాలు’’ అన్నా రు. ద్వైపాక్షిక వర్తకంలో భారత్, రష్యా సాధిస్తున్న వృద్ధి పట్ల పుతిన్ సంతృప్తి వెలిబుచ్చారు. ఉగ్రవాదంతో అందరికీ ముప్పు బ్రిక్స్ సదస్సు అనంతరం కూటమి నేతలు బుధవారం ఒక ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని ‘ఉమ్మడి ముప్పు’గా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క మతం, జాతీయత, నాగరికతకు సంబంధించింది కాదని ఉద్ఘాటించారు. అది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని బ్రిక్స్ కూటమి నేతలు నిర్ణయించారు. ప్రపంచానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులను కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరగబోయే కాప్–29 సదస్సులో వాతావరణ మార్పులకు సంబంధించి ఒక పరిష్కారం మార్గం వెలువడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. -
ఈ భేటీ శుభ పరిణామం
అయిదేళ్ల తర్వాత నైరుతి రష్యాలోని కజన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బుధవారం ద్వైపాక్షిక సమావేశం జరిగింది. బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ సందర్భంగా రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగటం శుభపరిణామం. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల గస్తీకి రెండురోజుల క్రితం అవగాహన కుదరటంతో అధినేతల భేటీ సాధ్యమైంది. ఈ విషయాన్ని మన విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం ప్రకటించటం... దానికి అనుగుణంగా చైనా వైపునుంచి కూడా ప్రకటన జారీకావటంతో వాతావరణం తేలికపడింది. అయితే గతాన్ని అంత తేలిగ్గా మరిచిపోరాదు. సరిగ్గా అయిదేళ్లనాడు ఇదే నెలలో తమిళనాడులోని మహా బలిపురం వేదికగా ఇరు దేశాధినేతలూ కలుసుకోగా ఆ తర్వాత ఏడాది తిరగకుండానే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి చైనా తన నైజం చాటుకుంది. దాంతో ఇరు దేశాల సంబంధాలూ కనీవినీ ఎరుగనంతగా దెబ్బతిన్నాయి. నిజానికి అంతక్రితం 2018లో మోదీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం వూహాన్ తరలివెళ్లిన నాటికే డోక్లాంలో రెండు దేశాల సైనికుల మధ్యా 73 రోజులపాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. డోక్లాం చిన్న అపశ్రుతి మాత్రమేనని, అంతా చక్కబడిందని అనుకుని మహాబలిపురంలో జిన్‌పింగ్‌కు ఘనమైన ఆతిథ్యం అందించిన కొద్దికాలా నికే మళ్లీ సరిహద్దుల్లో సమస్యలు తలెత్తాయి. 2020 ఏప్రిల్‌లో చైనా సైనికులు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను అతిక్రమించి గాల్వాన్ లోయలో చొరబాట్లకు పాల్పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్, డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమణలకు దిగి అక్కడ మన సైనికులు గస్తీ తిరగడానికి వీల్లేదని పేచీకి దిగారు. కర్రలు, ఇనుపరాడ్లతో మన జవాన్లపై దాడికి దిగి 21 మంది ఉసురు తీశారు.అంతంతమాత్రంగా సాగుతూవచ్చిన సంబంధాలు కాస్తా ఆ తర్వాత పూర్తిగా పడకేశాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య సంప్రదింపులు జరుగుతున్నా, అడపా దడపా సేనల ఉపసంహరణ జరిగినా మునుపటి సాన్నిహిత్యం లేదు. రెండు దేశాల విదేశాంగ మంత్రులూ 2020 సెప్టెంబర్‌లో సమావేశమై ఉద్రిక్తతల ఉపశమనానికి పంచసూత్ర పథకం రూపొందించారు. రక్షణ మంత్రుల స్థాయిలో కూడా చర్చలు జరిగాక వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు. 2022లో బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు, నిరుడు జోహన్నెస్ బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ అధినేతల సదస్సు సందర్భాల్లో మోదీ, జిన్‌పింగ్‌లు కలిసిన మాట వాస్తవం. అయితే అవి ముక్తసరి, మర్యాదపూర్వక భేటీలు మాత్రమే. ఆ తర్వాత ఎల్ఏసీలో పరిస్థి తులు స్వల్పంగా మెరుగుపడ్డాయి. అయినా మన హిమాచల్‌ప్రదేశ్ గ్రామాలకు చైనా తనవైన పేర్లు పెట్టడం, సరిహద్దుల్లో కొత్త గ్రామాలు సృష్టించటంవంటి గిల్లికజ్జాలకు మాత్రం కొదవలేదు. ఎల్ఓసీలో 45 ఏళ్లుగా ఇరు దేశాల సైనికులూ నిరంతరాయంగా గస్తీ కొనసాగిస్తున్న చోటులో చైనా దళాలు ఆక్రమణలకు దిగి ఇక్కడ గస్తీ కాయొద్దంటూ అభ్యంతరపెట్టడంతో 2020లో కొత్త వివాదం మొదలైంది. ఇలా మన జవాన్లు ఉండే చోటుకొచ్చి కవ్వింపులకు దిగి ఎదురుదాడి చేయ టమో, మానటమో మనవాళ్లే తేల్చుకోవాల్సిన స్థితి కల్పించటం చైనా మొదలెట్టిన కొత్త వ్యూహం. యధాతథ స్థితిని కాలరాసి ఆ ప్రాంతం ఎప్పటినుంచో తమదన్న తర్కానికి దిగటం చైనాకే చెల్లింది. 1962లో సైతం ఇలాంటి వైఖరితోనే మన దేశంపై దురాక్రమణకు తెగించింది. అంత వరకూ మన దేశం చైనాకు అన్నివిధాలా సహాయసహకారాలు అందజేసింది. చైనా ఆవిర్భావం తర్వాత దాన్ని గుర్తించటంలో మనం ముందున్నాం. ఆ తర్వాత ‘పంచశీల’ ఒప్పందం సైతం కుదిరింది. కానీ దానికి వెన్నుపోటు పొడిచింది చైనాయే.తాజాగా రెండు దేశాల మధ్యా సామరస్యత నెలకొనడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవ తీసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా తన ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవ టంలో వింతేమీ లేదు. ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీయెత్తున ఆయుధ సామగ్రి అందిస్తున్న ఆ దేశాలు రష్యాను ఆర్థిక ఆంక్షలతో కూడా దిగ్బంధించి దెబ్బ తీయాలని చూశాయి. ఆ తరుణంలో భారత్, చైనాలు రష్యానుంచి ముడి చమురు కొనుగోలుచేసి ఆదుకున్నాయి. అందుకే కావొచ్చు... ఆ రెండు దేశాలమధ్యా సామరస్యత సాధించి పాశ్చాత్య ప్రపంచానికి పుతిన్ షాక్ ఇచ్చారు. ఇరుగుపొరుగు దేశాలన్నాక సమస్యలు సహజం. ఇచ్చిపుచ్చు కునే ధోరణితో వ్యవహరించాలని, సామరస్యంగా మెలగాలని ఇరుపక్షాలూ అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. అటు చైనాకు ఆర్థికరంగంలో సమస్యలు ముంచుకొస్తున్నాయి. అక్కడ హౌసింగ్ రంగం తీవ్రంగా దెబ్బతిని దాని ఆర్థిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసింది. రుణభారం తడిసి మోపెడైంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దాన్ని సక్రమంగా పరిష్కరించకపోతే చైనాయే కాదు... చైనాతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. భారత, చైనాలు రెండూ జనాభాపరంగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్గల భారత్‌తో సంబంధాలు మెరుగుపడితే తన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవటానికి ఆ చర్య తోడ్పడుతుందన్న వివేకం చైనాకు ఉండాలి. అధినేతల మధ్య అవగాహన ఆచరణలో కనబడాలి. మాటకూ, చేతకూ పొంతన కుదరాలి. అప్పుడు మాత్రమే చెలిమి వర్ధిల్లుతుంది.