కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, దీంతో తెలంగాణ వ్యాప్తంగా సాగునీరు అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.
హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, దీంతో తెలంగాణ వ్యాప్తంగా సాగునీరు అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం వ్యవసాయ రంగం, వర్షాభావ పరిస్థితులపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
తెలంగాణలో వ్యవసాయరంగానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరముందని కేసీఆర్ చెప్పారు. 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. తెలంగాణలో కూరగాయల సాగు గణనీయంగా పెరగాల్సిన అవసరముందని కేసీఆర్ అన్నారు.