irrigation projects
-
పాత ప్రాజెక్టుల బాగోగులు పట్టవా?
సాక్షి, హైదరాబాద్: కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏటా రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల బాగోగులకు మాత్రం నయాపైసా విదల్చడం లేదు. దీంతో రూ.లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు గాలిలో దీపంలా మారాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ (ఓ అండ్ ఎం)కు 2024–25 బడ్జెట్లో రూ.480 కోట్లు కేటాయించగా, మరో 26 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. సాగునీటి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల విలువ రూ.160 కోట్లకు ఎగబాకింది. మొత్తం 170 పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నీటిపారుదల శాఖ టోకెన్లు జారీ చేసినా, ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్ఓ) జారీ చేయకపోవడంతో వాటికి మోక్షం లభించడం లేదు. దయనీయంగా దేవాదులకాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు మినహా రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను ప్రభుత్వం.. ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించింది. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ చూస్తున్న కాంట్రాక్టర్ ఏడాదికాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేక చేతులెత్తేశారు. దీంతో కార్మికులు ఇటీవల పంప్‌హౌస్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. తక్షణమే బిల్లులు చెల్లించకపోతే మోటార్లను బంద్ చేసి నీటి పంపింగ్‌ను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. రెండేళ్ల పాటు ఓ అండ్ ఎం పనులు నిర్వహించేందుకు రూ.22 కోట్ల అంచనాలతో కాంట్రాక్టు అప్పగించగా, సదరు కాంట్రాక్టర్‌కు రూ.9 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే యాసంగి సాగు చివరి దశలో ఉండడంతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్‌కు సర్దిచెప్పి నీటి పంపింగ్ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.ఓ అండ్ ఎం లోపాలే శాపం!గతేడాది గోదావరికి వచ్చిన వరదల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు కొట్టుకుపోగా, నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. 500కి పైగా చెరువులకు కూడా గండ్లు పడ్డాయి. వీటికి నిర్వహణ లోపాలే కారణమనే ఆరోపణలొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యాలకు కూడా నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు ఓ కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక గత 11 ఏళ్లలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.9 లక్షల కోట్లు ఖర్చు చేయగా, ప్రాజెక్టుల నిర్వహణకు మాత్రం ఏటా రూ.100 కోట్లను కూడా ఖర్చు చేయడం లేదు. నెలకు కనీసం రూ.20 కోట్లు ఇచ్చినా ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పనులు చిన్నవే.. కాని అత్యంత కీలకం!రాష్ట్రంలో 40 వరకు భారీ, మధ్యతరహా జలాశయాలుండగా, వాటికి 1,884 గేట్లున్నాయి. 42 వేల కి.మీ. మేర ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, 900 కి.మీ. మేర పైప్డ్ కాల్వలు, 138 పంప్‌హౌస్‌లు, 115 సబ్స్టేషన్లతో పాటు కాల్వలపై బ్రిడ్జీలు, అక్విడక్ట్‌లు వంటి 1.3 లక్షల ఇతర నిర్మాణాలున్నాయి. జలాశయాల గేట్లకు గ్రీజింగ్, గేట్లు ఎత్తే క్రేన్లు, జనరేటర్లు, రోప్వైర్లకు మరమ్మతులు, కాల్వల్లో కలుపు మొక్కల తొలగింపు, దెబ్బతిన్న కాల్వలకు మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనులు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటి పనులు నీటిపారుదల శాఖలోని ఓ అండ్ ఎం విభాగం పరిధిలోకి వస్తాయి. స్థానిక చిన్నస్థాయి కాంట్రాక్టర్లే వీటిని చూస్తుండగా, బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టేందుకు వారు ముందుకు రావడం లేదు. ఏదైనా జలాశయం గేట్లకు గ్రీజింగ్కు ఏటా రూ.10 లక్షల లోపే వ్యయం కానుండగా, ఈ పనులు చేయకపోతే వరదల సమయంలో గేట్లు మొరాయించే ప్రమాదం ఉంటుంది. కాల్వల్లో కలుపు మొక్కలు, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుత యాసంగి సీజన్లో చాలా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని పెద్దసంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. -
ప్రాజెక్టుల నిర్మాణం.. ‘సాగు’దీతే
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగ చేసే.. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బడ్జెట్ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో చేపడతామని చెప్పిన సీఎం చంద్రబాబు.. కనీసం వాటినైనా గడువులోగా పూర్తి చేయడానికి సరిపడా నిధులను బడ్జెట్లో ఇవ్వకపోవడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో జలవనరుల శాఖకు రూ.18,019.66 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.17,142.06 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.877.60 కోట్లు) కేటాయించారు. ఇందులో రూ.15,576 కోట్లను సాగునీటి ప్రాజెక్టుల పనులకు (కేపిటల్ వ్యయం) ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పోలవరానికి కేటాయించిన రూ.5,756.82 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కాగా, 2024–25 బడ్జెట్లో ప్రాజెక్టులకు రూ.16,705.32 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.15,483.35 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.1,221.97 కోట్లు) కేటాయించారు. అయితే, సవరించిన బడ్జెట్లో రూ.5,906.76 కోట్లు కోత పెట్టి రూ.10,798.56 కోట్లు కేటాయించినట్లు ప్రస్తుత బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే.. గత బడ్జెట్ నిధుల్లో 35.36 శాతం కోత విధించినట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం కేటాయించిన నిధులను కూడా ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో విడుదల చేయడం అనుమానమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ప్రణాళికా రాహిత్యానికి పరాకాష్ట..» ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం.. తొలి దశలో పోలవరం, హంద్రీ–నీవా, వెలిగొండ, చింతలపూడి, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గోదా వరి–పెన్నా తొలి దశను చేపడతామంది. చింతలపూడి ఎత్తిపోతల, గోదావరి–పెన్నా తొలి దశను 2026, జూన్ నాటికి, పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌కు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో గత ప్రభుత్వమే పోలవరాన్ని కొలిక్కితెచ్చింది. వెలిగొండ తొలి దశ, హంద్రీ–నీవా, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం దాదాపుగా పూర్తి చేసింది.» రూ.1,400 కోట్లు ఖర్చు చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒకటో టన్నెల్ ద్వారా కృష్ణా జలాలను గత సెప్టెంబరు–అక్టోబరు నాటికే తరలించే అవకాశం ఉండేది. ఈ ప్రాజెక్టు పనులకు గత బడ్జెట్లో 393.49 కోట్లను కేటాయించిన సర్కార్.. అందులో కోత వేసి రూ.300.52 కోట్లతో సరిపెట్టింది. కనీసం ఆ నిధులను కూడా ఖర్చు చేయలేదు. తాజాగా 309.13 కోట్లు కేటాయించింది. తొలి దశ పూర్తి కావాలంటే రూ.1,458 కోట్లు, రెండో దశకు రూ.2,180 కోట్లు అవసరం. దీన్నిబట్టి చూస్తే ఆ ప్రాజెక్టు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యే అవకాశం లేదు.» ఒడిశాతో వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. గొట్టా బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార స్టేజ్–2లో అంతర్భాగమైన హిర మండలం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేలా వంశధార ఎత్తిపోతలను గత ప్రభుత్వం చేపట్టింది. ఇది పూర్తయితే వంశధార ఆయకట్టు రైతులకు పూర్తి ఫలాలను అందించవచ్చు. వంశధార–నాగావళి అనుసంధానం పనులను దాదాపు పూర్తి చేసింది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేసి ఖర్చు చేస్తే.. జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది.» చింతలపూడి ఎత్తిపోతల పూర్తికి రూ.2043.38 కోట్లు అవసరం. 2026 జూన్ నాటికి నీళ్లందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గత బడ్జెట్లో ఈ ఎత్తిపోతలకు రూ.150 కోట్లు చూపినా చివరకు రూ.3.08 కోట్లతో సరిపెట్టారు. ఇప్పుడు కేవలం రూ.30 కోట్లు కేటాయించింది. ఆ ఎత్తిపోతల ఎలా పూర్తవుతుందన్నది సర్కారుకే తెలియాలి.» 2026 జూన్ టార్గెట్‌గా పెట్టుకున్న గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ పూర్తి కావాలంటే రూ.5,372.31 కోట్లు అవసరం. గత బడ్జెట్లో పైసా కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో ఎలా పూర్తవుతుందన్నది ప్రభుత్వమే చెప్పాలి.» హంద్రీ–నీవా సుజల స్రవంతిలో డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి 2026 జూన్‌కు నీళ్లందిస్తామని గొప్పలు చెప్పింది. కానీ.. హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ గత ప్రభుత్వం చేపట్టిన పనులను.. 3,850 క్యూసెక్కులకు కుదించింది. రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూర్ బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తున్నా వెనక్కుతగ్గకుండా పూర్తి చేసేందుకే మొగ్గుచూపింది. డిస్ట్రిబ్యూటరీల పనులకు నిధులు కేటాయించని నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమే.» ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులకే నిధుల కేటాయింపు ఇలా ఉంటే.. మిగతావాటికి కేటాయింపు, విడుదల ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.» కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందించడానికి వీలుగా కాలువల మరమ్మతులు, డ్రెయిన్లలో పూడికతీత పనులకు అవసరమైన మేరకు నిధులు ఇవ్వకపోవడం గమనార్హం.» పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా కాకుండా.. 41.15 మీటర్ల ఎత్తు వరకే 119.40 టీఎంసీలు నిల్వ చేసేలా 2026 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157 కోట్లు ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు కేంద్రం గత, ప్రస్తుత బడ్జెట్లలో నిధులిచ్చింది. కానీ.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తే పూర్తి ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీళ్లందించే అవకాశం ఉంటుంది. -
యాసంగిలో 42.48 లక్షల ఎకరాల ఆయకట్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కళంగా ఉండడంతో యాసంగి సీజన్లో సిరుల పంట పండనుంది. 2024–25 యాసంగి సీజన్లో రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులతో పాటు చెరువులు, ఎత్తిపోతల కింద ఏకంగా 42,48,780 ఎకరాల ఆయకట్టుకు మొత్తం 354.88 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖలోని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇందులో 24,54,429 ఎకరాల తడి (వెట్), 17,94,351 ఎకరాల పొడి (డ్రై/మెట్ట) పంటలున్నాయి. వర్షాభావంతో ప్రాజెక్టుల్లో నీళ్లు లేక గతేడాది యాసంగిలో కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్‌తో పాటు కల్వకుర్తి, బీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద పంటల విరామం ప్రకటించాల్సి వచ్చింది. అప్పట్లో 28.95 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే స్కివం కమిటీ ప్రతిపాదించింది. మొత్తం మీద గత మూడేళ్లతో పోల్చితే 2024–25 యాసంగిలో ప్రాజెక్టుల కింద గణనీయంగా సాగు విస్తీర్ణం పెరగనుంది. ఎస్సారెస్పీ స్టేజీ–1,2 కింద 11.36లక్షల ఎకరాలకు నీళ్లు ఎస్సారెస్పీ స్టేజీ–1 కింద 4,40,903 ఎకరాల తడి, 3,58,569 ఎకరాల పొడి పంటలు కలిపి మొత్తం 7,99,472 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. స్టేజీ–2 కింద 2,59,230 ఎకరాల తడి, 77,400 ఎకరాల పొడి పంటలు కలిపి మొత్తం 3,36,630 ఎకరాల ఆయకట్టును కమిటీ ప్రతిపాదించింది. ఇక నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా ఉండగా, సాగర్ ఎడమ కాల్వ కింద 6,38,385 ఎకరాలను కమిటీ ప్రతిపాదించింది. ఇందులో 4,75,890 ఎకరాల తడి, 475890 ఎకరాల పొడి పంటలున్నాయి. కాళేశ్వరం కింద 93 వేల ఎకరాలకు నీళ్లు!కాళేశ్వరం ప్రాజెక్టు కింద 93 వేల ఎకరాల ఆయకట్టును స్కివం కమిటీ ప్రతిపాదించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు దెబ్బతిని ఉండడంతో వాటిలో నీళ్లను నిల్వ చేయడం లేదు. అయితే ఈ ప్రాజెక్టు కింద సాగుకు 34.86 టీఎంసీల జలాలు లభ్యతగా ఉన్నాయని స్కివం కమిటీ అంచనా వేసింది. మల్లన్నసాగర్, కొండపొచమ్మసాగర్ తదితర జలాశయాల్లో ఉన్న నిల్వలకు తోడు గా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయనున్న నీళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
కేటాయింపులకు నీళ్లొదిలారు
సాక్షి, అమరావతి: భారీ నీటిపారుదల శాఖలో పోలవరం మినహాయిస్తే ఇతర ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చూపుతూ పోలవరం ప్రాజెక్టుకు రూ.4,873 కోట్లు కేటాయించింది. వంశధార స్టేజ్–2, చింతలపూడి ఎత్తిపోతలు, వెలిగొండ, హంద్రీ–నీవాకు అరకొరగా నిధులే విదిల్చింది. గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. 2024–25 బడ్జెట్లో భారీ నీటిపారుదల రంగానికి (మేజర్ ఇరిగేషన్) రూ.15,483.35 కోట్లు, చిన్న నీటిపారుదల (మైనర్ ఇరిగేషన్) రంగానికి రూ.1,221.97 కోట్లు కలిపి మొత్తంగా జలవనరుల శాఖకు ప్రభుత్వం రూ.16,705.32 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పోలవరానికి రూ.2,807.68 కోట్లిచ్చిన కేంద్రంపోలవరం ప్రాజెక్టుకు 2024–25లో రూ.7,218.68 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రూ.4,841.93 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ.. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని చూపి రూ.4,873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం ఇప్పటికే అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు, రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.68 కోట్లు వెరసి మొత్తం రూ.2,807.68 కోట్లను అక్టోబర్ 9న విడుదల చేసింది. ఇందులో 75 శాతం ఖర్చు చేసి, వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపితేనే నిధులు విడుదల చేస్తామని షరతు విధించింది. వీటికి అరకొర కేటాయింపులే⇒ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువకు లైనింగ్ పనులకు రూ.2,516 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం రూ.867.75 కోట్లను కేటాయించింది. ⇒ జల్లేరు రిజర్వాయర్ నిర్మించకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలంటే రూ.3,782 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదలు పంపారు. ప్రభుత్వం రూ.150 కోట్లనే కేటాయించింది.⇒ గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ పూర్తి చేసి.. సాగర్ కుడి కాలువ ఆయకట్టును స్థిరీకరించాలంటే రూ.4,966.09 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ⇒ వెలిగొండ తొలి దశ పనులకు రూ.1,458 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపగా.. రూ.393.49 కోట్లు కేటాయించింది. ⇒ వంశధార స్టేజ్–2లో మిగిలిన పనుల పూర్తికి రూ.134.32 కోట్లు అవసరం. ఈ బడ్జెట్లో రూ.92.12 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం రూ.63.50 కోట్లు కేటాయించడం గమనార్హం.ఉత్తరాంధ్ర, సీమకు తీవ్ర అన్యాయంవెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. పోలవరం ఎడమ కాలువను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాకముందే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలను తెస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. దీనికి కేవలం రూ.63 కోట్లే కేటాయించారు. ఇక రాయలసీమలో తుంగభద్ర హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆధునికీకరణతోపాటు తెలుగుగంగ, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నాలుగు ప్యాకేజీలు నలుగురికి!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల టెండర్లలో పాతకథే పునరావృతమవుతోంది. టెండర్ నోటిఫికేషన్ జారీచేయకముందే ఏ ప్యాకేజీ పనులను ఎవరికి ఏ ధరకు అప్పగించాలో లోపాయికారీగా నిర్ణయించేస్తున్నారు. ఆ కాంట్రాక్టరుకే పనులు కట్టబెట్టేలా అధికారులకు కనుసైగ చేస్తున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధికధరకు కట్టబెట్టి.. ఖజానాపై భారం మోపి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమీషన్లు రాబట్టుకోవడానికి ఉన్నతస్థాయిలో మంత్రాంగం నడిచిందనే చర్చ జలవనరులశాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దోపిడీకి అడ్డొస్తుందనే నెపంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని గతనెల 15న ప్రభుత్వం రద్దుచేసింది. 2019 మే 30కి ముందు అమల్లో ఉన్న పద్ధతి ప్రకారమే టెండర్లు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.పోలవరం ఎడమకాలువలో నాలుగు ప్యాకేజీల్లో మిగిలిన రూ.787.38 కోట్ల విలువైన పనులకు నిర్వహించే టెండర్ల నుంచే పాతపద్ధతికి తెరతీశారు. టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే 2014–19 తరహాలోనే ముఖ్యనేత రంగంలోకి దిగారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే సంస్థకు రూ.293.66 కోట్లు, మిత్రపక్షానికి చెందిన తన సమీప బంధువైన ఎంపీ కుమారుడి సంస్థకు రూ.317.77 కోట్ల విలువైన ప్యాకేజీల పనులు.. మిగతా రూ.68.71 కోట్లు, రూ.107.84 కోట్ల విలువైన ప్యాకేజీల పనులను ఆదినుంచి ఆ స్థానంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించేలా మౌఖిక ఒప్పందం కుదిరినట్లు కాంట్రాక్టుసంస్థల వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించిన వారికే పనులు కట్టబెట్టాలంటూ పోలవరం అధికారులకు సంకేతాలు పంపారు. 6న ఫైనాన్స్ బిడ్ పోలవరం ఎడమకాలువ నాలుగు ప్యాకేజీల పనులకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో శుక్రవారం రాత్రి పోలవరం అ«ధికారులు బిడ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు. ఒకటో ప్యాకేజీ (0 కిలోమీటర్ల నుంచి 25.6 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనులకి రూ.68.71 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మూడో ప్యాకేజీ (51.6 కిలోమీటర్ల నుంచి 69.145 కిలోమీటర్లు+1,009 మీటర్లు)లో మిగిలినపని అంచనా విలువను రూ.107.84 కోట్లుగా ఖరారు చేశారు.ఐదు, ఐదు (ఏ) ప్యాకేజీ (93.7 కిలోమీటర్ల నుంచి 111 కిలోమీటర్ల వరకు+1,351 మీటర్లు)లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.293.66 కోట్లుగా, ఆరు, ఆరు (ఏ) ప్యాకేజీ (111 కిలోమీటర్ల నుంచి 136.78 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.317.17 కోట్లుగా నిర్ణయించారు. ఈ నాలుగు ప్యాకేజీ పనుల పూర్తికి 12 నెలలు గడువు పెట్టారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. టెక్నికల్ బిడ్ నవంబర్ 2న, ఫైనాన్స్ బిడ్ నవంబర్ 6న తెరిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.ఖజానా దోపిడీకి రంగం సిద్ధంరాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య పనులకు నిర్వహించిన టెండర్లలో అధికశాతం టెండర్లను 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టింది. అప్పట్లో 4.85 శాతం అధిక ధరను ‘ఫ్యాన్సీ’ నంబరు అంటూ కాంట్రాక్టు సంస్థలు, అధికారవర్గాలు వ్యంగ్యోక్తులు విసిరేవారు. ఇప్పుడు కూడా అదే ఫ్యాన్సీ నంబరును పాటిస్తూ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధికధరకు పనులు అప్పగిస్తారా.. లేదంటే అంతకంటే ఎక్కువధరకు పనులు కట్టబెట్టి ఖజానాకు తూట్లు పొడుస్తారా అన్నది తేలాలంటే నవంబర్ 6 వరకు వేచిచూడాల్సిందే. -
12 ప్రాజెక్టుల పేర్ల మార్పు
సాక్షి, అమరావతి: ఏపీలో 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. గోదావరి, కృష్ణా జలాలతో పల్నాడును సుభిక్షం చేయడానికి గత ప్రభుత్వం వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం (వైఎస్సార్పీ డీఎంపీ) కింద గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, వరికపుడిశెల ఎత్తిపోతలను చేపట్టింది. ఇప్పుడు వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం పేరును రద్దు చేసి ..గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, వరికపుడిశెల ఎత్తిపోతలుగా ఆ ప్రాజెక్టు పేరును మార్పు చేసింది.వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పేరును ముక్త్యాల ఎత్తిపోతలుగా, వైఎస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరును వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా, నర్రెడ్డి శివరామరెడ్డి రిజర్వాయర్ పేరును సర్వారాయసాగర్గా, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు బ్యారేజీ పేరును నెల్లూరు బ్యారేజీగా, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ పేరును సంగం బ్యారేజీగా మార్చింది.గొర్రిపాటి బుచ్చిఅప్పారావు తాటిపూడి రిజర్వాయర్ పేరును తాటిపూడి రిజర్వాయర్‌గా, అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పేరును హంద్రీ–నీవా సుజల స్రవంతిగా, వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు పేరును పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకంగా మార్చింది. బూచేపల్లి సుబ్బారెడ్డి మొగలిగుండాల మినీ రిజర్వాయర్ పేరును మొగలిగుండాల మినీ రిజర్వాయర్‌గా, రాకెట్ల నారాయణరెడ్డి ఎత్తిపోతల పేరును రాకెట్ల ఆమిద్యాల ఎత్తిపోతలుగా మార్చింది. -
భారీ వరదతో పెరుగుతున్న మిడ్ మానేరు నీటి మట్టం
-
ఆరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. గోదావరి బేసిన్లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.గోదావరి బేసిన్‌తో పాటు కృష్ణా బేసిన్లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలపై ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సీఎం ఆరా తీశారు. ఇప్పటికే చాలావరకు నిధులు ఖర్చుపెట్టి మధ్యలో వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయన్నారు. మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే గత ప్రభుత్వం వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయ -
ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..
-
సుజలాంధ్ర.. సుఫలాంధ్ర..
లక్ష్యాన్ని సాధించలేని వారే సాకులు వెతుక్కుంటారు. కార్యసాధకులకు సాకులు అడ్డురావు. అవకాశాలను అన్వేషించి మరీ లక్ష్యాలను సాధిస్తారు. ఇందులో మొదటి తరహా వ్యక్తి చంద్రబాబు అయితే రెండో తరహా నేత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. పద్నాలుగేళ్లు సీఎంగా పని చేశానని గొప్పలు చెప్పుకుంటూ.. తన కుప్పం నియోజకవర్గానికే నీటిని తెచ్చుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. ఐదేళ్ల పాలనలో మూడేళ్లలోనే ఆరుప్రాజెక్టులు పూర్తి చేసి, మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేసిన జల రుషి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. చంద్రబాబు పాలనంతా కరవు మయం. ఏటా కరవు మండలాల ప్రకటన. ప్రభుత్వ సాయం అందక రైతుల హాహాకారాలు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా విపత్తు రెండేళ్ల పాటు కర్కశంగా ఆర్థిక స్థితిని కుదేలు చేసినప్పటికీ, జగన్ ప్రభుత్వం సాకులు వెతుక్కోలేదు. జన సంక్షేమమేపరమావధి అనుకున్నారు. మూడేళ్ల వ్యవధిలోనే ప్రాజెక్టుల్లో నీటి ఉరవడిని మడుల్లోకి మళ్లించిన ఖ్యాతి జగన్‌కు మాత్రమే దక్కుతుంది. - ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి, సాక్షి, అమరావతి:సాక్షి, అమరావతి: రాష్ట్ర సాగునీటిరంగంలో నవచరిత్రను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లిఖించారు. కరోనా మహమ్మారి ప్రభావం.. లాక్ డౌన్ల దెబ్బతో దాదాపు రెండేళ్లపాటు దేశంలో ఎక్కడా ప్రాజెక్టుల పనులు చేయలేని పరిస్థితి. ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. కేవలం మూడేళ్లలోనే ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేశారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా.. బ్రహ్మంసాగర్ మట్టికట్టలకు డయాఫ్రమ్ వాల్ వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మొత్తం 6 రిజర్వాయర్లలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేశారు. యాజమాన్య పద్ధతుల ద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. చరిత్రలో మహోజ్వల ఘట్టం వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సాగునీటి ప్రాజెక్టులను ప్రణాళికాయుతంగా చేపట్టి, పూర్తి చేస్తున్నారు. 2019, మే 30 నుంచి ఇప్పటి వరకూ పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.35,268.05 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టులపై పెట్టిన ప్రతి పైసాను సది్వనియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. రైతులకు అందించారు. పెన్నా డెల్టా సుభిక్షం జల యజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలో మిగిలిన పనులను సీఎం వైఎస్ జగన్ రూ.216.88 కోట్లు వెచ్చిచి పూర్తి చేసి.. 2022, సెపె్టంబరు 6న జాతికి అంకితం చేశారు. తండ్రి ప్రారంభించిన బ్యారేజ్‌ల పనులను తనయుడు పూర్తి చేసి, జాతికి అంకితం చేయడాన్ని సాగునీటిరంగ చరిత్రలో మహోజ్వలఘట్టంగా అధికారవర్గాలు అభివరి్ణస్తున్నాయి. పెన్నా డెల్టాలో 4.83 లక్షల ఎకరాలకు సమర్థంగా నీళ్లందించడమే కాకుండా ఆ రెండు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిల ద్వారా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చారు. పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజలను వరద ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా డెల్టా ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల వాటిలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. ఆ తర్వాత గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్‌కు రూ.580 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌ను నింపడానికి సీఎం వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీల వల్ల 2019 వరకూ కేవలం నాలుగైదు టీఎంసీల నీటినైనా నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్ నిర్మించి.. లీకేజీలకు అడ్డుకట్ట వేసి.. పూర్తి స్థాయిలో అంటే 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. దశాబ్దాల కల సాకారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ. ఆ ప్రాజెక్టును 2005లో మహానేత వైఎస్ చేపట్టి పనులు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడటంతో వెలిగొండ పనులు పడకేశాయి. జగన్ అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టులో మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021, జనవరి 13 నాటికే పూర్తి చేశారు.రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ. పనులను పూర్తి చేసి.. రెండు సొరంగాలను మార్చి 6న జాతికి అంకితం చేశారు. ఇప్పటికే ఫీడర్ చానల్, నల్లమలసాగర్ పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. వెలిగొండతో ప్రకాశం జిల్లా రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. బాబు జమానా అవినీతి ఖజానా కడలిపాలవుతోన్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే సారి రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టులను చేపట్టారు. అప్పట్లోనే 23 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మిగతా 40 ప్రాజెక్టుల్లో(పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి) మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని 2014, జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. జూన్ 8, 2014 నుంచి మే 29, 2019 వరకూ సాగునీటి ప్రాజెక్టులకు రూ.68,293.94 కోట్లను ఖర్చు చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పట్టిసీమ, పురుషోత్తపట్నం మినహా మిగతా 40 జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు ఖర్చు చేశారు. శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే రూ.24,465.12 కోట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే.. సాగునీటి ప్రాజెక్టుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారన్నది అర్థం చేసుకోవచ్చు. నీటిపారుదల రంగ చరిత్రలో రికార్డు కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించారు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి. జగన్ అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి.. కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. కోటి ఎకరాలకు జలధారలు విభజన తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ దుర్భిక్షంతో రాష్ట్ర రైతులు, ప్రజలు తల్లడిల్లిపోయారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర నదులలో నీటి లభ్యత పెరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కలిపి ఏటా కోటి ఎకరాలకు జగన్ నీళ్లందించారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేశారు.రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులు సాధించి రాష్ట్రాన్ని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం వైఎస్ జగన్ నిలిపారు. వాతావరణ మార్పుల వల్ల కృష్ణా నదికి వరద రోజులు తగ్గిన నేపథ్యంలో.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజుల్లో దానిపై ఆధారపడ్డ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శరవేగంగా పోలవరం రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరాన్ని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సాకారం చేస్తూ జలయజ్ఞంలో భాగంగా చేపట్టి.. ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరంలో విధ్వంసం సృష్టించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021, జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవునా మళ్లించారు. చంద్రబాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి యథాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌పై కేంద్ర జలసంఘం స్పష్టత ఇచ్చాక.. ఆ పనులు పూర్తి చేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించి.. జాతికి అంకితం చేయనున్నారు.గండికోటలోకి బిరబిరా కృష్ణమ్మ గాలేరు–నగరిలో అంతర్భాగంగా అవుకు వద్ద రెండు సొరంగాలను చేపట్టారు. ఇందులో ఒక సొరంగం దివంగత సీఎం వైఎస్ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగాన్ని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. రెండు సొరంగాలను రూ.567.94 కోట్లతో పూర్తి చేసి.. నవంబర్ 30, 2023న సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు అవుకు వద్ద మూడో సొరంగం పనులను చేపట్టారు. ఈ పనులకు ఇప్పటికే రూ.934 కోట్లు ఖర్చు చేశారు. మూడో సొరంగమూ దాదాపు పూర్తయింది. దాంతో శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే వరద కాలువ ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించి.. గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. తద్వారా 2.60 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరందించనున్నారు. తద్వారా 1.31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 20 లక్షల మందికి తాగునీరందించనున్నారు. కుప్పానికి కృష్ణా జలాలు..: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను రూ.560.29 కోట్లతో సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి, ఫిబ్రవరి 26న జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపి, 6,300 ఎకరాలకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరందించనున్నారు. కుప్పం నియోజకవర్గానికి 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు అవినీతికి పాల్పడటం వల్ల కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేయలేక చేతులెత్తేస్తే.. జగన్ పూర్తి చేయడం అబ్బురం...అపూర్వం.వలసలకు అడ్డుకట్ట హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి లక్కవరం ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాల్లో 77 చెరువులను నింపడం ద్వారా పది వేల ఎకరాలను సస్యశ్యామలం చేసే లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని రూ.224.31 కోట్లు వెచ్చిచి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18, 2023న జాతికి అంకితం చేశారు. సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించడం ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని పశ్చిమ మండలాల్లో వలసలకు అడ్డుకట్ట వేశారు. కోనసీమలా రెండు పంటలు బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీల వల్ల గతంలో ఎన్నడూ మూడు నాలుగు టీఎంసీలు కూడా నిల్వ చేసిన దాఖాలాలు లేవు. తెలుగుగంగ ఆయకట్టుకు సాగునీటి మాట దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరికేవి కావు. బ్రహ్మంసాగర్ ఉన్నా ఏం ప్రయోజనం లేదని బాధపడేవాళ్లం. వైఎస్ జగన్ సీఎం అయ్యాక బ్రహ్మంసాగర్ లీకేజీలకు డయాఫ్రమ్ వాల్ వేసి అడ్డుకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు 17.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. దాంతో కోనసీమ తరహాలో ఆయకట్టులో రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు ఫలాలు నిజంగా రైతులకు అందుతున్నది ఇప్పుడే. – పోచంరెడ్డి రఘురాంరెడ్డి, సోమిరెడ్డిపల్లి, బ్రహ్మంగారిమఠం మండలం, వైఎస్సార్ జిల్లా. సంగం బ్యారేజ్‌తో కష్టాలు తీరాయి బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సంగం ఆనకట్ట శిథిలమవడంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందేవి కావు. పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు 2004లో మహానేత వైఎస్ నాడు సంగం బ్యారేజ్ పనులు చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా సాగాయి. మహానేత వైఎస్ మరణించాక బ్యారేజ్ పనులు పడకేశాయి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పనులు పూర్తి చేసి సమృద్ధిగా నీళ్లందిస్తున్నారు. దాంతో నాకున్న 13 ఎకరాలతోపాటు 40 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. – మల్లవరం రామకృష్ణ, పడుగుపాడు, కోవూరు మండలం -
ఉత్తరాంధ్రపై ఉత్తమాటలెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవీకాలం ఉన్నా చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో అధిక శాతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలే. ఆయన అకాల మరణం తర్వాత మూడో దఫా అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఆ ప్రాజెక్టుల పూర్తిపై చిత్తశుద్ధి చూపించలేదు. మొక్కుబడిగా నిధులు కేటాయించడమే తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. తన తండ్రి ఆశయాల మేరకు జలయజ్ఞం పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వీటిపై దృష్టి సారించారు. అయితే, కరోనాతో రెండేళ్లు వృధా అయ్యాయి. ఇక భూసేకరణలో ఇబ్బందులు, న్యాయవివాదాలు తలెత్తినా వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటన్నింటినీ విస్మరించి ‘ఈనాడు’లో రామోజీరావు ఎప్పటిలాగే విషంకక్కారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఈ దుస్థితిలో చిక్కుకుపోవడానికి చంద్రబాబు నిర్లక్ష్య పాలనే కారణమన్న విషయాన్ని మరుగునపరచడానికి ఆయన నానాపాట్లు పడ్డారు. ‘ఉత్తరాంధ్రంటే ఉత్తదనుకుంటివా?’ శీర్షికతో శుక్రవారం అవాస్తవాలను వండివార్చారు. ఇష్టారాజ్యంగా దగాకోరు రాతలు రాశారు. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా ఈనాడు క్షుద్ర రాతలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. మడ్డువలస విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస వద్ద సువర్ణముఖి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ప్యాకేజీ–1 పనులను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.130.60 కోట్ల వ్యయంతో పూర్తిచేయించారు. తద్వారా 24,877 ఎకరాల మేర భూములు సస్యశ్యామలంగా మారాయి. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ప్యాకేజీ పనుల కోసం రూ.26.90 కోట్లను మంజూరు చేశారు. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు జరుగుతున్నాయి. వంశధార శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పనుల పూర్తికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 2,407.79 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. రానున్న జూన్‌కల్లా పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వంశధార ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం 2004 నుంచి 2019 వరకూ అంటే 15 ఏళ్లలో రూ.1,614.82 కోట్లు ఖర్చుచేయగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి నేటివరకూ అంటే నాలుగేళ్ల 10 నెలల కాలంలో రూ.400.40 కోట్లు ఖర్చుచేసింది. అయినప్పటికీ ఒడిశా అభ్యంతరాలతో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం తప్పట్లేదు. ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో గొట్టా బ్యారేజీ కుడికాలువపై ఎత్తిపోతల పథకం నిర్మించి హిరమండలం రిజర్వాయరులో 12 టీఎంసీల వరకూ నీటిని నింపాలనే భగీరథ ప్రయత్నానికి ప్రభుత్వం నడుంబిగించింది. 2022 సెప్టెంబర్ 14న రూ.176.35 కోట్ల నిధులను మంజూరుచేసింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. వచ్చే అక్టోబరు నాటికి ఇవి పూర్తికానున్నాయి. మహేంద్రతనయ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్ ప్రాజెక్టు నిర్మాణానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాంది పలికారు. తర్వాత వచ్చిన చంద్రబాబు దీన్ని పూర్తిచేయడంపై చిత్తశుద్ధి చూపించలేదు. విపరీతమైన జాప్యంతో ఆ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రద్దుచేసి, సవరించిన అంచనాలతో రూ.852.45 కోట్లతో 2022 సెప్టెంబరు 14న పరిపాలన ఆమోదాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. జంఝావతి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో నిర్మాణ పనులను ప్రారంభించినా అంతర్రాష్ట్ర సమస్యతో జంఝావతి ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. చంద్రబాబు తన పాలనలో ఏరోజు కూడా దాన్ని పూర్తిచేయడంపై దృష్టి పెట్టలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యాంను అక్కడ నిర్మించి జాతికి అంకితం చేశారు. రెండో ప్యాకేజీ కింద కాలువ అభివృద్ధి పనులను ప్రస్తుతం రూ.3.26 కోట్లతో చేపడుతున్నారు. తారకరామతీర్థ సాగర్ ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే విజయనగరం జిల్లాలోని కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట గ్రామాల వారికి పునరావాస పనులు ప్రస్తుతం పురోగతి సాధించాయి. కొన్నేళ్లుగా సారిపల్లి గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్న రూ.77 కోట్ల పునరావాస ప్యాకేజీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2006 నుంచి 2019 వరకూ రూ.166.80 కోట్లు.. భూసేకరణకు రూ.57.06 కోట్లు ఖర్చుచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటివరకూ రూ.56.56 కోట్లను నిర్మాణ పనులకు, భూసేకరణకు రూ.25.33 కోట్లను ఖర్చుచేసింది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి విజయనగరం పట్టణ ప్రజలకు సమృద్ధిగా తాగునీరు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేయిస్తోంది. తోటపల్లి ఉత్తరాంధ్రలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 1,31,221 ఎకరాల ఆయకట్టుతో పాటు అదనంగా మరో 11,221 ఎకరాలను స్థిరీకరించేందుకు ఉద్దేశించిన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చారు. ఆయన మరణానంతరం చంద్రబాబు కేవలం ప్రారంభోత్సవం చేశారు. కనీసం పిల్ల కాలువల నిర్మాణాన్ని సైతం గాలికి వదిలేశారు. ఆ మిగులు పనులను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. రూ.123.21 కోట్లు మంజూరు చేసి పరిపాలనామోదాన్ని ఇచ్చింది. నేటి వరకూ 64.59 కోట్లను వెచ్చించారు. 2025 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి గజపతినగరం బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల చిన్నచూపు ఫలితంగా పనులు పడకేశాయి. వీటిన్నింటినీ రద్దుచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22న తాజా అంచనాలతో రూ.137.80 కోట్లతో మిగులు పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులిచ్చింది. ప్రసుత్తం భూసేకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
మీలా ఆత్రుత పడం.. తప్పులు చేయం
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరాన్ని తొందరగా కట్టేయాలనే ఆత్రుత తప్ప అసలు ఆ ప్రాజెక్టు మనుగడ గురించి ఆలోచించలేదు. కటాఫ్‌వాల్ డిజైన్ మార్చకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఆర్సీసీతో కట్టి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. ఇసుకను సరైన విధంగా గట్టిపర్చలేకపోవడం వల్ల నష్టం జరిగింది. ఆర్సీసీతో వాల్ కట్టి ఉంటే రాఫ్ట్ కుంగేది కాదు.. డ్యామ్ కుచించుకుపోయి పగుళ్లకు ఆస్కారం ఏర్పడేది కాదు’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డలోని ఈ మూడు పిల్లర్లే కాదని, అన్నారంలో కూడా బుడగలు వస్తున్నాయని, సుందిళ్ల బ్యారేజీలో సీపేజీ మొదలైందని చెప్పారు. ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దానిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆత్రుత పడేది లేదని, తప్పులు చేసేది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం శిల్పాన్ని చెక్కిందే తానని, తన మెదడులోనే ప్రాజెక్టు డిజైన్ ఉందని చెప్పే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి ఉంటే తనకున్న సమస్యకు పరిష్కారం చెప్పేవారు కదా అని ఎద్దేవా చేశారు. నాడు ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో కలిసి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పవిత్ర దేవాలయం అని చెప్పిన కేసీఆర్‌కు అదే ప్రాజెక్టు బొందలగడ్డ ఎలా అయిందని ప్రశ్నించారు. పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే.. కనీస పరిశోధనలు లేకుండానే కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మించి ప్రజాధనాన్ని ధుర్వినియోగం చేశా రని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మట్టి పరీక్షలు, ఇతరాత్ర పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే ప్రాజెక్టులను కట్టడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి వ్యవసాయానికి నీటిని అందించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న వాదన అర్థరహితమన్నా రు. నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయలేరా అని కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని విమర్శించారని, అక్టోబర్ 21, 2023 రోజునే పిల్లర్లు కుంగిపోయాయని, అప్పటి నుంచి దాదాపు 45 రోజుల పాటు కేసీఆరే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నా రని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అంచనాలు పెంచి అవినీతి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగానికి అడ్డు వచ్చిన భట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ల అంచనాలు పెంచారని చెప్పారు. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు నిట్టనిలువునా చీలిపోవడానికి గత పాలకులే కారణమని, అన్నారం, సుందిళ్ల కూడా అవే పరిస్థితుల్లో ఉన్నాయన్నా రు. 15.5 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో చేపట్టాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు. రూ.38 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు వివిధ పను ల కోసం ఖర్చు చేయగా, మరో రూ.28 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు బీఆర్ఎస్ అవినీతితో వ్యయం పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన రాజీవ్‌సాగర్, ఇంది రా సాగర్ ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని, రీ డిజైనింగ్ పేరుతో రూ.23 వేల కోట్లకు పెంచి ఇప్పటివరకు ఎకరానికి కూడా నీరివ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు ఖర్చు, నిర్వహణ ఖర్చు కలిపి ఏటా రూ.20 వేల కోట్లు అవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా కట్టాలని భట్టి ప్రశ్నించారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల పూర్తికి మరో రూ.97 వేల కోట్లు అవసరమని, ఖర్చు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై చేసిన 1.81 లక్షల కోట్ల వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందని పేర్కొంది. ప్రభుత్వం శనివారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మాణం కొనసాగిన, పూర్తయిన, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, వ్యయం, సాగులోకి వచ్చిన ఆయకట్టు వంటి అంశాలను అందులో వెల్లడించింది. గత సర్కారు అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగి, పగుళ్లు వచ్చిందని.. మరో రెండు బ్యారేజీలు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. 2014 వరకు రాష్ట్ర నిధులతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే.. 2014 తర్వాత అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టుల ను నిర్మించడం వల్ల అప్పుల భారం పెరిగిపోయిందని తెలిపింది. వచ్చే పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని వివరించింది. ప్రాజెక్టులపై శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు.. ► 2014కు ముందు ఆయకట్టు 57.79 లక్షల ఎకరాలు. ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు రూ.54,234 కోట్లు. ► 2014–2023 మధ్య రూ.1.81 లక్షల కోట్ల వ్యయంతో.. 15.81 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ► కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల కోసం రూ.1.29 లక్షల కోట్ల ఖర్చు జరిగింది. ► రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు అంచనా 1.27 కోట్ల ఎకరాలు.. ఇప్పటికే ఉన్న ఆయకట్టు 73.6 లక్షల ఎకరాలు. ► ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి మిగతా 53.98 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే రూ.97,774 కోట్లు కావాలి. ► వచ్చే ఐదేళ్లలో అప్పులు, వడ్డీల కింద రూ.77,369 కోట్లు చెల్లించాలి. ► కాళేశ్వరానికి రూ.93,872 కోట్లు ఖర్చుచేసి 98,590 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చారు. ► పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు రూ.36 వేలకోట్లు వ్యయం చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ► పదేళ్లలో కృష్ణాజలాల దోపిడీ 4 రెట్లు పెరిగింది. ► సాగునీటికోసం ఉద్యమించిన పార్టీ అధికారంలోకి వచ్చాక ఒంటెద్దు పోకడ పోయింది. ► కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి గత ప్రభుత్వం 2015లోనే అంగీకరించింది. ► శ్రీశైలం నుంచి రోజుకు 9.3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేలా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు గత ప్రభుత్వం సహకరించింది. ► పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీ సామర్థ్యానికి కుదించింది. ► గత ప్రభుత్వ తీరువల్ల శ్రీశైలంపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ► కృష్ణా నీటి వాటాల్లో మనకు అన్యాయం జరిగింది. న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోయాం. ► జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు తుమ్మిడిహెట్టి వద్ద రూ.38,500 కోట్లతో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. 160 టీఎంసీలు ఎత్తిపోసి, 16 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూపొందించింది. ► ఎల్లంపల్లికి ఒకదశలో నీటిని పంపు చేయాల్సిన చోట రీడిజైన్ చేసి అనవసరంగా వ్యయం పెంచారు. ప్రాణహిత–చేవెళ్లకు విద్యుత్ వ్యయం ఏటా రూ.1,010 కోట్లు అయి ఉండేది. కాళేశ్వరం ద్వారా రూ.10వేల కోట్లు అవుతోంది. ► కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు 162.36 టీఎంసీలు ఎత్తిపోసి.. అందులో 30 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. ► ఈ ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ నియంత్రణ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ► మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ దెబ్బతిని, పిల్లర్స్ కుంగి కదిలిపోయాయి. ఈ బ్యారేజీలోని లోపం మొత్తం ప్రాజెక్టు పనితీరుపైనే ప్రభావం చూపు తుంది. విజిలెన్స్ నివేదిక సైతం లోటుపాట్లను సవివరంగా వెల్లడించింది. ► కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉంది. పాలమూరు–రంగారెడ్డికి ఏఐ బీపీ కింద నిధులు తెస్తాం. కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటివాటా కోసం చర్యలు తీసుకుంటాం. -
CWC సూచనల ప్రకారమే ప్రాజెక్ట్‌లు కట్టాం: హరీష్
-
Fact Check: గొప్పగా చేసినా.. ‘పచ్చ’ రాతలేనా?
పాలన సవ్యంగా సాగిపోతుంటే పాపం రామోజీకి నిద్రపట్టడం లేదు. పథకాలు సక్రమంగా అమలవుతుంటే ఆయన విష‘పత్రిక’కు నచ్చడం లేదు. ప్రభుత్వానికి ప్రజాభిమానం రోజురోజుకూ పెరిగిపోతుంటే సహించడం లేదు. క్రమ పద్ధతిలో ప్రాజెక్టులు పూర్తవుతుంటే ఆ ‘పచ్చ’కళ్లకు కనిపించడం లేదు. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయి... తప్పుడు కథనాలతో జనాన్ని తప్పుదారి పట్టించి... వికృతానందం పొందాలని తెగ తాపత్రయపడుతున్నారు. ‘బాబు’ కళ్లలో ఆనందం చూడాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు. వాస్తవమేంటో కళ్లకు కనిపిస్తున్నా... జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగే ప్రాజెక్టులపైనా లేనిపోని ఆరోపణలు చేసి ఓ కథనాన్ని వండివార్చేశారు. కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులు పరుగులు పెట్టింది ఈ ప్రభుత్వంలోనే అన్నదిప్రజలందరికీ అర్థమవుతున్నా... పాపం ఈనాడుకే ఎందుకో తెలియడం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే ‘ఈనాడు’ రామోజీరావు ఓర్వలేకపోతున్నారు. రైతుల్లో సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు రోజురోజుకూ పెరుగుతుండటం.. అది చంద్రబాబు రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూండటంతో పచ్చబ్యాచ్ ఆందోళన చెందుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పుంఖానుపుంఖాలుగా సీఎం వైఎస్ జగన్‌పై విషపు రాతలకు తెగబడుతున్నారు. అ కోవలోనే ప్రాజెక్టులపై అబద్ధాలను అచ్చేసింది. గడచిన 57 నెలల్లో కరోనా ప్రభావం వల్ల దాదాపు 24 నెలలు ప్రపంచమే స్తంభించిపోయింది. మిగిలిన 33 నెలల్లోనే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, అవుకు రెండో టన్నెల్, లక్కసాగరం ఎత్తిపోతలను పూర్తి చేసి, జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ఆ జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించనున్నారు. మరో 14 ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడం, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కండలేరు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ♦ తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువకు లైనింగ్ చేయడం ద్వారా సకాలంలోనే వెలిగోడు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లను నింపుతున్నారు. ఏటా కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. ♦ చంద్రబాబు అవినీతి వల్ల విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి.. ప్రణాళికాయుతంగా సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. నిర్వాసి తులకు పునరావాసం కల్పించి, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ చానల్, స్పిల్ వేను పూర్తి చేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని పోలవరం స్పిల్ వే మీదుగా మళ్లించారు. ♦ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణకు సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే దాన్ని చేపట్టి.. ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేయడం ద్వారా పోలవరం ఫలాలను రైతులకు అందించడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ♦ 57 నెలల్లో సాగునీటి ప్రాజెక్టులకోసం వెచ్చించినది రూ.32,161.49కోట్లు ♦ సాగునీటికి నోచుకున్న మొత్తం విస్తీర్ణం 9.86 లక్షల ఎకరాలు నాడు బాబు నిర్లక్ష్యంపై ప్రశ్నించలేదెందుకు? 2014 జూలై 28వ తేదీన టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని ప్రకటించారు. 2014, జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.68,293.95 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. జీవో 22, జీవో 63లను అడ్డుపెట్టుకుని అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. ఆస్థాన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి భారీ ఎత్తున దోచుకున్నారు. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తికి పోలవరం పనులే తార్కాణం. సబ్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికే చంద్రబాబు ప్రతి సోమవారాన్ని సమీక్షల పేరుతో పోల‘వరం’గా మార్చుకున్నారని అప్పటి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలవరంలో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టారు. చంద్రబాబు దోపిడీలో రామోజీ కి వాటా ఉండటం వల్లే అప్పట్లో సాగునీటి ప్రాజెక్టులో సాగిన దోపిడీపై ఒక్క అక్షరమైనా ఈనాడులో అచ్చేయ లేదన్నది బహిరంగ రహస్యం. -
తెలంగాణ ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
నెల రోజుల్లో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్‌లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్‌రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్‌ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీచదవండి.. లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా -
రెండేళ్లలో పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను వచ్చే రెండేళ్లలోగా పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం, బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాల కింద కాల్వలతో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ కాల్వలను పూర్తి చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. 10 ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో చెట్లు, పూడికతో నిండిపోయాయన్నారు. సత్వరమే నిర్వహణ పనులు చేపట్టాలని, బెడ్, సైడ్ లైనింగ్ పనులను ఈ ఏడాదే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద తొలి దశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో భూసేకరణ, కాల్వల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు రూ.100 కోట్లు, పనుల కోసం మరో రూ.100 కోట్లను సత్వరంగా విడుదల చేస్తామని, పనులు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. వచ్చే ఏడాదిలో పనులు పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది..: కోమటిరెడ్డి గత ప్రభుత్వం నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పనులు చివరి దశలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అసెంబ్లీలో తాను ఎన్నో మార్లు మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి!
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అంబేడ్కర్ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు చర్చ జరుగుతోంది. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి... అక్కడి నుంచి కాల్వలు, సొరంగాలు, లిఫ్టుల ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి నీళ్లను ఎత్తిపోసే అంశాన్ని కొత్త ప్రభుత్వం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరంతో పోల్చితే తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీ నుంచి ఎల్లంపల్లిలోకి నీళ్లను ఎత్తిపోయడానికి నిర్వహణ వ్యయం తక్కువ కానుంది. ఈ నేపథ్యంలో వార్ధా బ్యారేజీ, చెన్నూరు ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం పక్కనబెట్టనుందని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఈ నెల 29న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి డి.శ్రీధర్‌బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాక తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని కాంగ్రెస్ గతంలో చాలాసార్లు ఆరోపణలు చేసింది. చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడాన్ని కొత్త ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా ఎంచుకొనే అవకాశం ఉంది. వార్ధా, చెన్నూరు లిఫ్ట్ బదులు తుమ్మిడిహట్టి... గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి దాని స్థానంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తుమ్మిడిహట్టి వద్ద గతంలో ప్రతిపాదించిన బ్యారేజీకి బదులుగా.. వార్ధా బ్యారేజీని నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు సరఫరా చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసింది. మేడిగడ్డ బ్యాక్‌వాటర్ నుంచి చెన్నూరు నియోజకవర్గానికి సాగునీటి సరఫరా చేసేందుకు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సైతం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే వార్ధా బ్యారేజీ, చెన్నూరు ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సిన అవసరం ఉండదు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే చెన్నూరుకు గ్రావిటీతోనే సాగునీరు సరఫరా చేయడానికి అవకాశం ఉండగా గత ప్రభుత్వం అనవసరంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని అప్పట్లో పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు ఆరోపించారు. వేచిచూస్తున్న కాంట్రాక్టర్లు.. బిల్లులు వస్తాయనే భరోసా లేకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎత్తిపోతల పథకాల పనుల కొనసాగింపుపై కాంట్రాక్టర్లు సైతం పునరాలోచనలో పడ్డారు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలపై స్పష్టత వచ్చే వరకు వేచిచూసే ధోరణిలో కాంట్రాక్టర్లు ఉన్నారని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ప్రభు త్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర, నాగమడుగు వంటి ఎత్తిపోతల పథకాల పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో లోపాలు బయటపడటంతో వాటిపై ఆధారపడి నిర్మిస్తున్న ఈ మూడు ఎత్తిపోతల పథకాలను కొనసాగిస్తారా లేదా? అనే అంశంపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే వరకు వేచిచూడాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు తెలిసింది. భూసేకరణకు సంబంధించిన న్యాయ చిక్కులతో కొంతకాలం కిందే సంగమేశ్వర ఎత్తిపోతల పనులు ఆగిపోగా బసవేశ్వర పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. నాబార్డు నుంచి సంగమేశ్వర కోసం రూ. 2,392 కోట్లు, బసవేశ్వర కోసం రూ. 1,774 కోట్ల రుణం కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు మంజూరు కాలేదు. -
ప్రాజెక్టులపై రాజకీయాలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంను నాలుగేళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు, లిఫ్టులు, వందల కిలోమీటర్ల కాలువలు అని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దని, వాటిని బదనాం చేసి తెలంగాణకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. బ్యారేజీల్లో సమస్యలు అత్యంత సాధారణమన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిర్మాణం తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని, రెండేళ్ల క్రితం శ్రీశైలం పవర్ హౌస్ పంపులు కూడా నీట మునిగాయని గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం, రంగాల వారీగా రాష్ట్రం పురోగమించిన తీరుపై గురువారం హైదరాబాద్‌లో ఆయన గణాంకాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిండుకుండల్లా 46 వేల చెరువులు ‘మిషన్ భగీరథ ద్వారా రూ.37 వేల కోట్లు ఖర్చు చేసి 58 లక్షల కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాం. దీని స్ఫూర్తితో కేంద్రం ‘హర్ ఘర్ జల్’పథకాన్ని ప్రారంభించింది. దీనితో పాటు అనేక తెలంగాణ పథకాలు కేంద్రం, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన 46 వేల చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. సాగునీటితో సంపదను సృష్టించాం. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అన్నపూర్ణగా మారింది. రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పింది. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలపగా, జీఎస్డీపీ అత్యంత వేగంగా పెరిగింది. రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందింది. పేదరికాన్ని తగ్గించిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. తండాలు గ్రామ పంచాయతీలుగా మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటివి కేసీఆర్ పాలనలోనే జరిగాయి..’అని కేటీఆర్ తెలిపారు. ధరణితో పారదర్శకంగా రిజిస్ట్రే షన్లు ‘భూ యజమానుల వేలి ముద్రకు అధికారమిచ్చి ‘ధరణి’ద్వారా పారదర్శకంగా భూ లావాదేవీలు జరిగేలా చూస్తున్నాం. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, పల్లె ప్రగతితో గ్రామ స్వరాజ్యం, గ్రీన్ కవర్ 7.7శాతానికి పెంపు, హరిత నిధి ఏర్పాటు వంటి వాటికి ప్రాధాన్యతను ఇచ్చాం. మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, వేయి గురుకుల పాఠశాలల ఏర్పాటు, 32 కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటివి మా ప్రభుత్వం సాధించిన విజయాలు. గ్రేటర్లో మెట్రో రైలు వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)కింద రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 72 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు వ్యవస్థను అభివృద్ధి చేశాం. మరో 450 కిలోమీటర్ల మేరకు దీన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతోంది. భవిష్యత్తులో ప్రతిరోజు నీటి సరఫరాకు ప్రయత్నిస్తున్నాం. మురుగునీటి పారుదల శుద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మునిసిపాలిటీలో సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నాం..’అని కేటీఆర్ తెలిపారు. కేంద్రంలోని దుర్మార్గ ప్రభుత్వం తెలంగాణకు అప్పులు పుట్టకుండా కుట్ర చేస్తోందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రజలకు కరెంటు ఉండదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
రామోజీ.. వంచనలు మీ బాబు పేటెంట్
సాక్షి, అమరావతి : చంద్రబాబు నేతృత్వంలోని గజదొంగల ముఠాలో సభ్యుడైన రామోజీరావుకు ఈ నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రతిదీ తప్పుగానే కనిపిస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వం ఏం చేసినా అందులో కోడిగుడ్డుపై ఈకలు పీకడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత చంద్రబాబు పాలనలో సాగు నీటి రంగం కుదేలైనప్పటికీ మారుమాట్లాడని ఈ పెద్దమనిషి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ‘నిర్మించకుండా వంచన.. అడ్డగోలుగా అంచనా’ అంటూ మంగళవారం మరోమారు విషం కక్కారు. ఎందుకంటే.. డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో..) పద్ధతిలో ప్రభుత్వ ఖజానాను అప్పట్లో దోచుకున్నారు కాబట్టి. ఇప్పుడూ చంద్రబాబు హయాంలో సాగినట్లు సాగుతోందని భ్రమపడి వాస్తవాలను వక్రీకరించారు. ఈ దుష్ప్రచార కథనంలో ఆరోపణలు.. వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పడకేశాయి. సవరించిన అంచనాలతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. సాగు, తాగునీటి సౌకర్యం మృగ్యం. వాస్తవం: సాగునీటి ప్రాజెక్టుపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వైఎస్ జగన్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రాధాన్యతా క్రమంలో వడివడిగా ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. గతేడాది నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను పూర్తి చేసి.. జాతికి అంకితం చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్, హంద్రీ–నీవా నుంచి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 68 చెరువులను నింపే పథకం పూర్తి చేశారు. వెలిగొండ మొదటి సొరంగం ఇప్పటికే పూర్తి చేశారు. రెండో సొరంగం దాదాపుగా పూర్తి కావస్తోంది. వెలిగొండ తొలి దశ దాదాపుగా పూర్తయింది. వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్–2 ఫేజ్–2 కూడా పూర్తి కావస్తోంది. పోలవరం, తోటపల్లి బ్యారేజ్, తారకరామతీర్థసాగరం నుంచి హంద్రీ–నీవా వరకు అన్ని ప్రాజెక్టులనూ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. 2019 మే 30 నుంచి ఇప్పటి వరకు సాగునీటి ప్రాజెక్టులపై రూ.28 వేల కోట్లు వ్యయం చేసి, 5.03 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.17,368 కోట్లు అవసరమని 2014 జూలై 28న సాగునీటి ప్రాజెక్టులపై విడుదల చేసిన శ్వేతపత్రంలో చంద్రబాబు స్పష్టం చేశారు. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు చంద్రబాబు రూ.68,293.34 కోట్లు ఖర్చు చేశారు. కానీ.. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. కేవలం 3.4 లక్షల ఎకరాల పాత, కొత్త ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగారు. దీన్ని బట్టి చూస్తే అడ్డగోలుగా అంచనాలు పెంచింది.. పనులు చేయకుండా వంచించింది.. బిల్లులు కాజేసింది చంద్రబాబేనన్నది నిజం కాదా రామోజీ? ఆరోపణ: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంచనా వ్యయం 2019లో రూ.2022.20 కోట్లు ఉంటే ఇప్పడు రూ.18,271.31 కోట్లకు.. వెలిగొండ ప్రాజెక్టు అంచనా రూ.5,564.22 కోట్లు ఉంటే ఇప్పుడు రూ. 8,054.30 కోట్లకు ఇలా ప్రాజెక్టుల అంచనా వ్య యాన్ని రూ.24,827.23 కోట్లకు పెంచేశారు. నిర్మాణాలు చేపట్టడం లేదు. చింతలపూడి ఎత్తిపోతల అంచనాను రూ.4,909 నుంచి రూ.9,543 కోట్ల కు పెంచుతూ ప్రతిపాదనలు పంపారు. వాస్తవం: పోలవరం ఎడమ కాలువ నుంచి 63.2 టీఎంసీలను తరలించి.. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు నీళ్లందించాలనే లక్ష్యంతో రూ.7,214.10 కోట్లతో 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ పథకంలో తొలి దశ కింద 5.8 టీఎంసీలను తరలించే పనులను రూ.2022.20 కోట్లతో 2018లో చంద్రబాబు చేపట్టారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 63.2 టీఎంసీలను తరలించి.. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రూ.17,050.20 కోట్లతో పనులు చేపట్టడానికి 2022 జూన్ 17న అనుమతి ఇచ్చింది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూసేకరణ వ్యయం, నిర్వాసితుల పునరావాస వ్యయం, 2019 నాటితో పోల్చితే పనుల పరిమాణం పెరిగింది. దీని వల్లే అంచనా వ్యయం పెరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డిజైన్లను ఇప్పటికే జల వనరుల శాఖ ఆమోదించింది. భూ సేకరణ చేస్తూ వడివడిగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక వెలిగొండ ప్రాజెక్టును 2016, 2017, 2018, 2019 నాటికి పూర్తి చేస్తానంటూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాటలు మార్చుతూ వచ్చారు. సొరంగాల తవ్వకంలో ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం)లకు మరమ్మతుల పేరుతో రూ.66 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి.. వాటిని మింగేశారు. రెండు సొరంగాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి.. అస్మదీయులకు అప్పగించిన చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు తప్ప పనులు చేయలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక వెలిగొండను ప్రాధాన్యతగా చేపట్టి.. 2021 జనవరి 13 నాటికే మొదటి సొరంగాన్ని పూర్తి చేశారు. రెండో సొరంగం దాదాపుగా పూర్తికావొచ్చింది. నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు భూసేకరణ చేయాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టాల్సి ఉంది. అందువల్లే వాటి అంచనా వ్యయం పెరిగింది. చింతలపూడి ఎత్తిపోతలను 53.5 టీఎంసీల మేరకు చేపట్టినా జల్లేరు రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని ఎనిమిది టీఎంసీలకే అప్పట్లో పరిమితం చేశారు. ఇప్పుడు ఆ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 14 టీఎంసీలకు పెంచారు. దీని వల్ల అదనంగా భూసేకరణతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. అందువల్లే దాని అంచనా వ్యయం పెరిగింది. ఇంత చిన్న విషయం మీకు తెలియదా రామోజీ? రాష్ట్ర విభజన నేపథ్యంలో కేవలం ఐదు లక్షల ఓట్ల ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సాగునీటి ప్రాజెక్టులను కమీషన్లు కురిపించే కామధేనువుగా మల్చుకున్నారు. కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. ఆపై అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారు. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి, చేయని పనులకు కూడా బిల్లులు చెల్లించి ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు ఇదే లక్ష్యంగా సాగిన పాలనపై పల్లెత్తు పదం రాయని రామోజీ.. ఉల్టా చోర్ కొత్వాల్ కా డాంటే అన్నట్లు.. అంటే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఇప్పుడు రోత రాతలు రాస్తున్నారు. నిజంగా ఈ సామెత నాడు దోపిడీలో భాగస్వామియైన ‘ఈనాడు’ రామోజీకి అతికినట్లు సరిపోతుంది. అడ్డగోలుగా అంచనాల పెంపు అంటే ఇదీ ♦ విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ 2013–14 ధరలతోనే పూర్తి చేస్తానని అంగీకరిస్తూ 2016 సెప్టెంబరు 7న చంద్రబాబు దక్కించుకున్నారు. ఆ మరుసటి రోజే అంటే 2016 సెప్టెంబరు 8న పోలవరం హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని 2015–16 ధరలను వర్తింపజేస్తూ రూ.5,535.41 కోట్లకు పెంచేశారు. ఇదీ వంచన అంటే. అడ్డగోలుగా అంచనాల పెంపు అంటే ఇదీ రామోజీ! అందులో రూ.2,917.78 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో తన కొడుకు వియ్యంకుడికి చెందిన నవయుగకు చంద్రబాబు కట్టబెట్టడంతో అప్పట్లో మీరు నోరుమెదపలేదన్నది వాస్తవం కాదా రామోజీ? ♦ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మిగిలింది. ఆ కాంట్రా క్టర్‌పై 60–సీ నిబంధన కింద వేటు వేసి, అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి.. దొడ్డిదారిన సీఎం రమేష్‌కు అప్పగించింది ఎవరు? ప్రభుత్వ ఖజానా నుంచి రూ.వంద కోట్లకుపైగా దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నది చంద్రబాబు కాదా? దీనిని వంచన, దోపిడీ అనక ఇంకేమంటారు రామోజీ? -
ఎలాంటి సింహమో ప్రజలు తేలుస్తారు..
పులివెందుల : మనం కొదమ సింహాలమా, వృద్ధ సింహాలమా.. గ్రామ సింహాలమా అనేది ప్రజలు తేలుస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల పర్యటనలో బుధవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భయస్తుడు కాబట్టే తాను ధైర్యవంతుడిని అని చెప్పుకునేందుకు మాటిమాటికి కొదమ సింహం అని అంటున్నాడని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులను సందర్శించేందుకు ఆయన ఏ ధైర్యంతో వస్తున్నాడో అర్థంకావడంలేదన్నారు. ఒక అబద్ధాన్ని కళ్లు ఆర్పకుండా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించలేమని భావించి దాన్ని 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్సార్‌దే. దీనిని అడ్డుకునేందుకు అప్పట్లో ధర్నాలు చేయించిన విషయం బాబు మరిచిపోయినా ప్రజలు మర్చిపోలేదు. అలాగే, గండికోట రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు కుదించిన ఘనుడు చంద్రబాబే. వైఎస్సార్ వచ్చాక 27టీఎంసీలుగా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులో ఎన్నడూ పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 27టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని నింపి సీమకు నీళ్లిస్తున్నారు. నిర్వాసితులకు రూ.950కోట్ల పరిహారం ఇవ్వబట్టే ఇది సాధ్యమైంది. అలాగే, చిత్రావతి ప్రాజెక్టు కూడా. తన 14ఏళ్ల పాలనలో ఏనాడూ సీమ ప్రాజెక్టుల గురించి పట్టించుకోని పెద్ద మనిషి చంద్రబాబు. డ్రిప్‌లో రూ.వెయ్యి కోట్ల బకాయి పెట్టి అబద్ధాలా.. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలో ఆయా కంపెనీలకు రూ.1,000 కోట్ల బకాయిలు పెట్టడంతో స్కీం నిర్విర్యమైపోయింది. జగనన్న సీఎం అయ్యాక వాటిని చెల్లించి గత ఏడాది పునఃప్రారంభించారు. పంటల బీమా విషయంలోనూ చంద్రబాబు ఇచ్చిన దానికంటే రెండు రెట్లకు పైగా జగన్ ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ జిల్లాలో 2012కు సంబంధించిన శనగపంట బీమా 2014–19 వరకు పెండింగ్‌లో ఉండేది.. జగనన్న వచ్చాక తొలి ఏడాదిలోనే రూ.112కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. పైడిపాలెం వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్.. పైడిపాలెం రిజర్వాయర్ వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్. ఆయన హయాంలో 90శాతం పనులు పూర్తయ్యాయి. దానిని కూడా బాబు తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు. కడప ఎయిర్పోర్ట్ రన్‌వే కోసం రూ.75కోట్లు జగనన్న ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు రన్‌వే విస్తరణ జరిగి పెద్ద ఫ్లైట్లు వస్తున్నాయంటే అది జగన్ చలవే. అలాగే, కుప్పాన్ని కూడా గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్. ఇక జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. ఇవేవీ చంద్రబాబుకు కనిపించడంలేదు. మరోవైపు.. తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని తన సోదరి, చంద్రబాబు, బీజేపీలోని టీడీపీ నేతలు, వ్యవస్థలోని ఒక పెద్ద మనిషి కలిసి రెండున్నరేళ్లుగా పన్నాగం పన్నారు. వారి అంతిమ లక్ష్యం వైఎస్సార్సీపీని, జగన్‌ను ఇబ్బంది పెట్టడమే. వివేకా కేసులో వాస్తవాలను పక్కన పడేసి రాజకీయ కోణంలో ముందుకు తీసుకువెళుతున్నారు. క్షమాపణ చెప్పి మాట్లాడాలి ఇక తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మం సాగర్‌కు నీరు రావాలంటే కావాల్సిన కాలువ రిపేర్లు చేయాలని అనేకసార్లు విన్నవించినా చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ వచ్చిన తర్వాత ఆ కాలువలన్నీ ఆధునికీకరణ చేసి లైనింగ్ చేయించారు. ముందు ఈ ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పి మాట్లాడాలి. -
‘చంద్రబాబూ.. ఒక్క ఎకరాకైనా నీరిచ్చావా?’
ఢిల్లీ: ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పులివెందుల మీటింగ్‌లో తనపై చేసిన విమర్శలకు ఢిల్లీ వేదికగా ఘాటుగా స్పందించారాయన. తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడని.. ఆ మాటకొస్తే పొలవరాన్ని అనుకున్న టైంకి ఎందుకు పూర్తి చేయలేకపోయారని చంద్రబాబును నిలదీశారాయన. ‘‘చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అంబోతులకు ఆవులు సప్లయి చేసి రాజకీయాలలో పైకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది. పోలవరం 2018కల్లా చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదు ?. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు?. కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయా ఫ్రం వాల్ ఎందుకు కట్టారు ?. రాయల సీమలో ఒక్క ప్రాజెక్టు కు అయినా బాబు శంకుస్థాపన చేశారా ? అని నిలదీశారాయన. బ్రో సినిమాలో నన్ను గిల్లారు బ్రో చచ్చిన సినిమా. అయినా బ్రో సినిమా గురించి నేను మాట్లాడితే చంద్రబాబుకి ఏం నొప్పి?. బ్రో సినిమాలో నన్ను పొలి ఉన్న క్యారెక్టర్ చూపించి నన్ను గిల్లారు. నా పేరు తో సినిమా క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారు అందుకే నేనీ సినిమా గురించి మాట్లాడుతున్నా. బ్రో సినిమాకి పవన్ నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు?. నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి అని డిమాండ్ చేశారు. వాళ్ల చలవవల్లే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎకరాకు అయినా నీరిచ్చావా?.. ఇవ్వలేదు అంటూ చంద్రబాబుపై అంబటి ఫైర్ అయ్యారు. ఆ 14 ఏళ్లు ఏం చేయలేనివాళ్లు.. ఇప్పుడేం చేస్తారు. రాయలసీమ ప్రాజెక్టులు దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్ చలవ వల్లే పూర్తయ్యాయి. ఢిల్లీ పర్యటన సారాంశం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిశా. పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని కోరాను. డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బ తింది. కొత్తది కట్టడానికి, రిపేర్లకు దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుంది. గైడ్ బండ్ కుంగడానికి కారణాలు తెలుసుకోవడానికి నిజ నిర్ధరణ కమిటీ వేశాం అని అంబటి మీడియాకు వివరించారు. -
నీటిపారుదల శాఖకు 5,950 మంది వీఆర్ఏలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలోని 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహా యకు(వీఆర్ఏ)ల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగు లుగా కొనసాగుతున్నారు. వారి సేవలను అదే శాఖలో క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త పేస్కేల్‌ను వర్తింపజే యాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ.19 వేల మూల వేతనంతో కలిపి మొత్తం రూ.23 వేల స్థూల వేతనం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 5,950 మంది వీఆర్ఏలతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాల నుంచి మరో 200 మందిని లస్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 98 కింద 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపి లస్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీఆర్ఏలను లస్కర్లుగా నియమిస్తామని ఆయన చాలా ఏళ్ల కిందే ప్రకటించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి. -
ఆ జిల్లాలు పచ్చబడటం మీకు ఇష్టం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వివక్షా పూరితంగా ఉందని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్య శ్యామలం చేసేందుకు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అయితే ఈ జిల్లాలు పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతున్నప్పటికీ.. ఇంకా అదే ధోరణితో వ్యవహరించడాన్ని తెలంగాణ ప్రజల తరఫున వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి రాసిన బహిరంగ లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరిపై తీవ్ర నిరాశతో ఈ లేఖ రాసినట్లు తెలిపారు. తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం ‘తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలైన నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారా యణపేట, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణం. 12.03 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని, ప్రజలకు తాగునీటికి భరోసా అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయం. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాని పరిధిలోని కోట్లాది ప్రజల జీవితాల్లో కచ్చితంగా గుణాత్మక మార్పు వస్తుంది. తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు కరువు కాటకాలతో తల్లడిల్లేవి. తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్‌నగర్ జిల్లా వలసల పాలయింది. అయితే మిషన్ భగీరథతో నల్లగొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టాం. కానీ కేంద్రం అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తోంది. జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. పాలమూరు పక్కనే ఉన్న కర్ణాటకలోని ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను మంజూరు చేసిన కేంద్రం, పాలమూరు రంగారెడ్డికి మొండిచేయి చూపించడం తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం..’ అని కేటీఆర్ ఆ లేఖలో ధ్వజమెత్తారు. నీటివాటా తేల్చలేదు.. ‘కృష్ణా జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్రం తాత్సారం చేస్తోంది. నీటి వినియోగ అంశం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర జాబితాలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వాడుకోలేని దుస్థితిలోకి తెలంగాణను నెట్టివేశారు. కృష్ణా నీళ్లలో 500 టీఎంసీల వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకోకుండా, కనీసం ట్రిబ్యునల్‌కి పంపకుండా 9 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..’ అని విమర్శించారు. -
మధ్యతరహా ప్రాజెక్టుకు.. మరమ్మతులు ఎప్పుడో?
మంగపేట: మండల పరిధిలోని నర్సింహాసాగర్ వద్ద మల్లూరువాగుపై నిర్మించిన మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టు మరమ్మతు పనులు ఇంకెప్పుడు చేస్తారని ప్రాజెక్టు ఆయకట్టు రైతులు అధికారులను, పాలకులను ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్తున్నారే తప్పా శ్రద్ధ చూపడం లేదని మండిపడుతున్నారు. 26 అడుగుల నీటిమట్టం సామర్థ్యంతో 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రాజెక్టును ప్రారంభించారు. 1980లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా ఆయకట్టు భూములకు సాగునీటిని వదిలారు. నర్సింహాసాగర్, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, వాగొడ్డుగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి వరకు 17 కిలోమీటర్ల కుడి కాల్వ ద్వారా సుమారు 4,300 ఎకరాలు, బాలన్నగూడెం, తిమ్మంపేట, మంగపేట, చెరుపల్లి తదితర గ్రామాల వరకు 8 కిలోమీటర్ల ఎడమ కాల్వ ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరు అందాల్సి ఉంది. 27 ఏళ్ల నుంచి ప్రాజెక్టు నిర్వహణపై సంబంధిత ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేకపోవడం ప్రాజెక్టు అభివృద్ధిపై పాలకులు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో నిరాదరణకు గురైంది. 2007లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.16 కోట్ల జపాన్(జైకా) నిధులు మంజూరు అయ్యాయి. పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో అసంపూర్తిగా చేసి కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, అధికారులు కాజేశారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కుడి ఎడమ కాల్వల తూములకు ఏర్పడిన లీకేజీలకు మరమ్మతుల పేరుతో నాయకులు, అధికారులు కుమ్మకై ్క లక్షల రూపాయలు కాజేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిని మరిచి సంబురాలు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా అధికారులు, పాలకులు ప్రాజెక్టు అభివృద్ధిని మరిచి సంబురాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు. 2015లో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి చందూలాల్ ప్రాజెక్టును సందర్శించారు. వెంటనే ప్రాజెక్టు అభివృద్ధికి, కుడి, ఎడమ కాల్వలు, తూముల నిర్మాణం ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్ నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడిచినా అతీగత లేదు. ఇప్పుడేమో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చెరువుల పండుగలో భాగంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టని ప్రాజెక్టులో నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు. అధికారుల తీరు రైతులకు శాపం ప్రాజెక్టుపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం పట్టిచుకోక పోవడం తమకు శాపంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. తూముల లీకేజీల పనులు వేసవి కాలంలో చేపట్టాల్సి ఉండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీరు చేరిన తరువాత కొందరు స్థానికులతో సంబంధిత అధికారులు కుమ్మక్కై నాసిరకంగా మరమ్మతులు చేపట్టడంతో యథావిథిగా లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పోతుందని రైతులు వాపోతున్నారు. కాల్వల్లో షిల్టు పేరుకుపోయి సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చెరువు కట్టపై చెట్లను తొలిగించక పోవడంతో కట్టపై నుంచి నడిచి వెళ్లే వీలులేకుండా మారింది. చెరువు మత్తడి వద్ద గైడ్ వాల్స్ కోతకు గురై ధ్వంసమయ్యాయి. అపరాన్ రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మత్తడి నుంచి వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తే మత్తడికే ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. -
రైతుకు అసలైన భరోసా
సాక్షి, అమరావతి : వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కారు ఏర్పాటైన తరువాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పథకాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, విత్తన సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆయిల్‌పామ్ రైతులకు సబ్సిడీ, పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంపు, విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ఏర్పాటు వంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ప్రాజెక్టులు నిండుకుండలు.. నిండా పంటలు పాలించే మారాజు మనసున్న వాడైతే.. ప్రకృతి పులకిస్తుందని రుజువైంది. నాలుగేళ్లుగా కరువుతీరా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు ఎగసిపడుతున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్య ఏటా సగటున 153.95 లక్షల టన్నులు నమోదు కాగా.. 2019–23 మధ్య ఏటా సగటున 165.40 లక్షల టన్నులకు పెరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉద్యాన పంటల దిగుబడులు సైతం పెరిగాయి. 2014–15లో 305 లక్షల టన్నులుగా ఉన్న ఉద్యాన పంటల దిగుబడులు.. ప్రస్తుతం 368.83 లక్షల టన్నులకు పెరిగింది. మూడు రెట్లు పెరిగిన కేటాయింపులు టీడీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.61,758 కోట్లు వెచ్చించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రూ.1,70,571.62 కోట్లను వెచ్చించింది. మరో ఏడాదికి కేటాయించే మొత్తాన్ని కలిపితే గత ప్రభుత్వం కంటే.. మూడు రెట్లకు పైగా నిధులు కేటాయించినట్టు తేటతెల్లమవుతోంది. కరోనా విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రూ.1.49 లక్షల కోట్ల సాయాన్ని నేరుగా రైతులకు అందించి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. సున్నా వడ్డీ.. ఉచిత బీమా సున్నా వడ్డీకే పంట రుణాలివ్వడంతోపాటు ప్రతి పంటను ఈ క్రాప్‌లో నమోదు చేస్తూ పైసా భారం పడకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. కోతలకు ముందే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర దక్కని పంటలను కొనుగోలు చేస్తోంది. విపత్తుల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా సొమ్ము సైతం అందిస్తోంది. సేంద్రియ సాగుతోపాటు చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. మెట్టప్రాంత పంటలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరాటంకంగా అందిస్తోంది. పల్లెసీమల రూపురేఖలు మార్చిన ఆర్బీకేలు గతంలో విత్తనాల కోసం రైతులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఎరువుల కోసం ప్రైవేట్ డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుమందులను కొనాల్సి వచ్చేది. ఎండల్ని తట్టుకోలేక అన్నదాతలు ఏటా పదుల సంఖ్యలో రైతులు మతిచెందేవారు. అదునులోపు విత్తనం దొరక్క దళారుల వద్ద నకిలీ, నాసిరకం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేసేవారు. విత్తనాల కోసం రైతుల పాట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చేవి. ఆర్బీకేల రాకతో రైతుల కష్టాలు తొలగిపోయాయి. ఇప్పుడు సీజన్‌కు ముందే రెడీ సాగు ఉత్పదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో రైతుల వెతలకు చెక్ పడింది. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను గ్రామస్థాయిలో నిల్వ చేసి రైతులకు నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఆర్బీకేల్లోని కియోస్‌్కల్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటైన మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. 10,778 ఆర్బీకేల ద్వారా దుక్కి పనులు ప్రారంభం కాకముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. ముందుగానే అగ్రి ల్యాబ్స్‌లో టెస్ట్ చేసి మరీ నాణ్యమైన సీడ్‌ను పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా చూద్దామంటే విత్తనాల కోసం ఎక్కడా బారులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే చింత ఎవరిలోనూ కనిపించడం లేదు. నకిలీల ఊసే ఎక్కడా వినిపించడం లేదు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు, ఈ–క్రాప్ నమోదు, పంటల బీమా, పంట నష్టపరిహారం ఇలా ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి రైతుకు అందేలా ఆర్బీకే సిబ్బంది కృషి చేస్తున్నారు. గతంలో పశువుకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేయగానే క్షణాల్లో వీహెచ్ఏ ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నరు. నాణ్యమైన ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. ఫలితంగా గతంతో పోలిస్తే పాల దిగుబడి రెట్టింపయ్యిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగు చేస్తున్న ప్రతి రైతుకు లైసెన్సు జారీతో పాటు నాణ్యమైన ఫీడ్‌ను అందజేస్తున్నారు. అగ్రి ల్యాబ్‌లు.. యంత్ర సేవా కేంద్రాలు.. గోదాములు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 చోట్ల వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌ను నెలకొల్పుతోంది. ఇందుకోసం ఒక్కొక్క ల్యాబ్‌కు రూ.81 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. రూ.6.25 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లు, రూ.75 లక్షల అంచనా వ్యయంతో రీజనల్ స్థాయిలో నాలుగు సమన్వయ కేంద్రాలను, గుంటూరులో రాష్ట్రస్థాయిలో రూ.8.50 కోట్ల అంచనాతో విత్తన జన్యు పరీక్ష కేంద్రాన్ని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 70 అగ్రి ల్యాబ్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను స్వల్ప అద్దె ప్రాతిపదికన వారి ముంగిటకే తీసుకెళ్లాలన్న సంకల్పంతో రూ.691 కోట్లతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో 500 టన్నుల సామర్థ్యంతో 1021, రూ.75లక్షల అంచనాతో 100 టన్నుల సామర్థ్యంతో 113 గోదాముల నిర్మిస్తున్నారు. వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి గోదాములు నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. -
సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: కడలి పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు దివంగత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా వరుసగా నాలుగేళ్లు ఖరీఫ్, రబీలో కోటి ఎకరాలకు నీళ్లందించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం వరుసగా నాలుగేళ్లు ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో ఏటా సగటున 50 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. నాడు దుర్భిక్షం.. నేడు సుభిక్షం ♦ టీడీపీ హయాంలో 2014–19 దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం సుభిక్షంగా మారింది. ♦ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల (45.77 టీఎంసీలు), గండికోట (26.85 టీఎంసీలు), చిత్రావతి (పది టీఎంసీలు), సోమశిల (78 టీఎంసీలు), కండలేరు(68.03 టీఎంసీలు), గోరకల్లు (12.44 టీఎంసీలు), అవుకు (4.15 టీఎంసీలు) రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. ♦ తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్‌లో 2019 నుంచే ఏటా గరిష్ట స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020లో గరిష్ట స్థాయిలో 17.74 టీఎంసీలను నిల్వ చేశారు. తద్వారా తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా మార్గం సుగమం చేశారు. ♦ శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులను నింపేలా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలను ఆధునికీకరించే పనులను చేపట్టారు. మహోజ్వల ఘట్టం సాగునీటి ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత క్రమంలో చకచకా పూర్తి చేస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. ఈ రెండు బ్యారేజ్‌ల ద్వారా నెల్లూరు జిల్లాలో 4,84,525 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా పరీవాహక ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయంగా రూపుదిద్దుకున్న పోలవరం పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ మహానేత వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. వంద శాతం వ్యయం భరించి పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్ల దాహంతో 2013–14 ధరలకు తామే పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు చెప్పడంతో 2016 సెపె్టంబర్ 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. ఆ తర్వాత లాభాలు వచ్చే పనులను చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు గాలికి వదిలేశారు. కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం. చంద్రబాబు పాపాల ఫలితంగా గోదావరి వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు. -
ప్రాజెక్టులకు నిధుల పరవళ్లు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులకు 2023–24 వార్షిక బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,908.10 కోట్లను కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించిన సీఎం వైఎస్ జగన్ గతేడాది పెన్నా డెల్టా జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేసి సెపె్టంబరు 6న జాతికి అంకితం చేయడం తెలిసిందే. తద్వారా పెన్నా డెల్టాలో 4.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందేలా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందించారు. ఈ ఏడాదీ ప్రాధాన్యతగా గుర్తించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వీలుగా నిధులు కేటాయించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తయ్యేలా తగినన్ని నిధులు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం పనుల పూర్తికి నిధులు కేటాయించారు. హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను మళ్లించి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో 68 చెరువులను నింపి సాగు, తాగునీటిని అందించే పథకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేటాయించారు. పోలవరంపై ప్రత్యేక దృష్టి.. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. కేంద్రం రూ.3 వేల కోట్లకుపైగా రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తున్నా రాష్ట్రమే నిధులను వెచ్చిస్తోంది. ఈ బడ్జెట్లోనూ పోలవరంకు సింహభాగం నిధులు రూ.5,042.47 కోట్లు కేటాయించింది. చంద్రబాబు నిర్వాకాలతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతతో ఏర్పడిన అగాధాల పూడ్చివేత పద్ధతులపై డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సూచనల మేరకు దృష్టి పెట్టాం. తర్వాత వరదల్లోనూ ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి సత్వరమే పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది. జలయజ్ఞం ఫలాలే లక్ష్యంగా.. సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుల జీవనోపాధులను పెంచడానికి దోహదం చేసేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. తోటపల్లి, పుష్కర, తాటిపూడి, తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన ఆయకట్టుకు నీళ్లందించే ఉప కాలువలు, పిల్ల కాలువలను పూర్తి చేయడానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు చేశాం. ఉత్తరాంధ్రలో కీలకమైన తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా నిధులు కేటాయించింది. కర్ణాటక పరిధిలో తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణ పూర్తి చేసి రాష్ట్ర కోటా నీటిని పూర్తి స్థాయిలో రాబట్టి రాయలసీమ రైతులకు నీళ్లందించడమే లక్ష్యంగా తుంగభద్ర బోర్డుకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది. -
ఏది నిజం?: ప్రాజెక్టులు పూర్తవుతుంటే ఎందుకంత కుళ్లు రామోజీ?
అధికారంలో చంద్రబాబు తప్ప వేరెవరైనా ఉంటే..? ఆ ప్రభుత్వం చేసే మంచిపనులేవీ రామోజీరావుకు కనిపించవు. చంద్రబాబు గనక ఉంటే... ఆయనెంత దుర్మార్గం చేసినా అస్సలు కనిపించదు. అదే తన మార్కు పాత్రికేయమని ఆయన పదేపదే నిరూపిస్తున్నారు. మంగళవారం నాడు ‘ప్రాజెక్టులకు పైసల్లేవు’ అంటూ అచ్చేసిన కథనమూ అలాంటిదే. ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం రూ.17,368 కోట్లతోనే 40 జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ప్రకటించారు. అంతకు రెండున్నర రెట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ కొత్తగా నీళ్లందించలేకపోయారు. కానీ రామోజీరావు ఎప్పుడూ దీన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పుడు డీపీటీ (దోచుకో– పంచుకో– తినుకో) పద్ధతిలో బాబు దోచుకున్నదాంట్లో తన వాటా భేషుగ్గా అందేసింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఖర్చుపెట్టే ప్రతి పైసాకూ తగ్గ ప్రతిఫలం రైతుకు దక్కాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు. అది బాబుకే కాదు. ఎల్లో ముఠాలో ఎవ్వరికీ సుతరామూ నచ్చటం లేదు. అందుకే ఈ రాతలు. అసలీ రాతల్లో నిజమెంత? కొంతైనా ఉందా? చూద్దాం... వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రక్షాళన చేసి.. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకత తెచ్చారు. రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరంలో ఏకంగా రూ.865 కోట్లు ఆదా చేశారు. అన్ని ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ వల్ల రూ.2,090 కోట్లు ఆదా అయింది. కానీ కరోనా మహమ్మారి విజృంభణతో రెండేళ్లు ప్రాజెక్టుల పనులపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితీ దెబ్బతింది. అయినా సరే.. నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. పెట్టే ప్రతి పైసా ప్రతిఫలం రైతులకు దక్కేలా ప్రణాళికాయుతంగా సీఎం వైఎస్ జగన్ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు. ఇప్పటిదాకా రూ.23,289 కోట్లను ప్రాజెక్టుల పనులకు ఖర్చు చేసి.. కొత్తగా 1,03,692 ఎకరాలకు సాగునీరు అందించారు. 4,84,500 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2019, 2020, 2021, 2022లలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కోటి ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీళ్లందించి చరిత్ర సృష్టించారు. కాకపోతే ఇవేవీ రామోజీ కళ్లకు కన్పించవు. ఎందుకంటే.. అధికారంలో ఉన్నది వైఎస్ జగన్ కాబట్టి!. తమ డీపీటీకి అడ్డుకట్ట పడింది కాబట్టి!!. మహోజ్వల ఘట్టం కన్పించలేదా? పెన్నా డెల్టాకు జీవనాడుల్లాంటి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజ్ పనులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు వాటిని పూర్తి చేయలేకపోయారు. వైఎస్ జగన్ వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించి గత సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. తండ్రి చేపట్టిన రెండు బ్యారేజ్‌లను తనయుడు పూర్తి చేసి, జాతికి అంకితం చేయడం నీటిపారుదల రంగ చరిత్రలో మహోజ్వల ఘట్టమని రైతులు, నిపుణులు ప్రశంసించారు. కానీ.. ఇది రామోజీకి కన్పించకపోవడం దురదృష్టకరం. కళ్లుండి చూడలేకపోతే ఎలా..? ► గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో 160 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో ఐదేళ్లపాటు పనులు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సొరంగాన్ని పూర్తి చేయించారు. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను గండికోట రిజర్వాయర్‌కు తరలించడానికి సిద్ధమయ్యారు. ► వెలిగొండ ప్రాజెక్టును ఇదిగో అదిగో అని ఐదేళ్లూ దాటవేసిన చరిత్ర చంద్రబాబుది. కానీ.. వైఎస్ జగన్ వెలిగొండపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే మొదటి సొరంగాన్ని పూర్తి చేయించారు. రెండో సొరంగం పనులు వేగంగా సాగుతున్నాయి. నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. ఈ ఏడాదే వెలిగొండ తొలి దశ ద్వారా కృష్ణా జలాలను తరలించి దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలను సుభిక్షం చేయడానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ► కర్నూల్ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని 9 దుర్భిక్ష మండలాల్లో 10,130 ఎకరాలకు నీళ్లందించేందుకు హంద్రీ–నీవా నుంచి 1.238 టీఎంసీలను ఎత్తిపోసే పథకం పనులను రూ.180.67 కోట్లను ఖర్చు చేసి, దాదాపుగా పూర్తి చేశారు. ► అత్యంత వెనుకబడ్డ శ్రీకాకుళం జిల్లాను సుభిక్షం చేయడమే లక్ష్యంగా వంశధార స్టేజ్–2 ఫేజ్–2లో మిగిలిన పనులతోపాటు వంశధార–నాగావళి అనుసంధానాన్ని ఈ ఏడాదే పూర్తి చేసి, జాతికి అంకితం చేసే దిశగా పనుల్లో వేగం పెంచారు. వంశధార ఫలాలను పూర్తి స్థాయిలో అందించడానికి హిరమండలం ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో చేపట్టిన తారకరామతీర్థసాగరం, తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల పనుల్లోనూ వేగం పెంచారు. మరి శరవేగంగా పూర్తవుతోన్న ఈ ప్రాజెక్టులను కళ్లుండి చూడలేకపోతే ఎలా రామోజీరావు గారూ? బాబు పాపం వల్లే పోలవరం పనుల్లో జాప్యం.. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా కాఫర్ డ్యామ్‌లు, అప్రోచ్ చానల్, స్పిల్ వే, íస్పిల్ చానల్, పైలట్ చానల్లను పూర్తి చేయకుండా చంద్రబాబు.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. 2019, జూన్‌లో గోదావరికి వచ్చిన వరదలు కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక కోతకు గురైంది. కోతకు గురైన ప్రదేశాన్ని యథా స్థితికి తెచ్చి... డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దాకనే ప్రధాన డ్యామ్ పనులు చేయాలి. చంద్రబాబు ఈ పాపానికి పాల్పడకపోయి ఉంటే.. ఈ పాటికి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారు. బాబు చేసిన తప్పులను సరిదిద్దడానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో పాటు జాతీయ స్థాయిలో అనేక మంది నిపుణులను సంప్రతిస్తూనే... స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి, 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. ఈ నెలాఖరుకు దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి కానుంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల మేరకు డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్ది.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ చేపట్టి, శరవేగంగా పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం.. జలాశయాల్లో గరిష్ట నిల్వ ► కృష్ణా డెల్టాకు జీవనాడి వంటి పులిచింతల ప్రాజెక్టులో 2019, మే వరకూ ఎన్నడూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయలేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం, తెలంగాణకు పరిహారం చెల్లించకపోవడమే అందుకు కారణం. కమీషన్లు రావనే ఉద్దేశంతో చంద్రబాబు ఆ పనులు చేయలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, తెలంగాణకు పరిహారం చెల్లించి 2019, ఆగస్టులోనే పులిచింతలలో గరిష్ట స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేశారు. కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. ► బ్రహ్మంసాగర్ రిజర్వాయరు గరిష్ట సామర్థ్యం 17.85 టీఎంసీలు. కానీ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు ఉండటంతో నిల్వ సామర్థ్యం నాలుగైదు టీఎంసీలకు పడిపోయింది. 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు... ఎన్నడూ లీకేజీలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదు. రాయలసీమను సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనే రాలేదు. ఆ నాలుగైదు టీఎంసీలతోనే నెట్టుకొచ్చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... యుద్ధప్రాతిపదికన బ్రహ్మంసాగర్ మట్టికట్టలో లీకేజీలున్న చోట రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. లీకేజీలకు అడ్డుకట్ట వేసి ఏకంగా 17.85 టీఎంసీలను నిల్వ చేసి... ఆయకట్టు చివరి భూములక్కూడా నీళ్లిచ్చారు. ► గండికోట రిజర్వాయర్ గరిష్ట సామర్థ్యం 26.85 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో ఐదారు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని దుస్థితి ఉండేది. పునరావాసం గురించి బాబు ఆలోచించనే లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. గత రెండేళ్లుగా గరిష్టంగా నీటిని నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రిజర్వాయర్‌లో 26.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ► చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఫలితంగా నాలుగైదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేని పరిస్థితి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. రెండేళ్లుగా సీబీఆర్‌లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం సీబీఆర్‌లో 9.6 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా సోమశిల, కండలేరు, గోరకల్లు, అవుకు రిజర్వాయర్లలో 2019, సెప్టెంబరు నాటికే గరిష్ట స్థాయిలో నీటిని నిల్వచేశారు. ఇలాంటి వాస్తవాలను రాస్తే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు చేస్తున్న మేలు బయటపడుతుందని... అబద్ధాలు రాయటానికే అలవాటు పడ్డారు రామోజీరావు!! ఇదీ... బాబు అడ్డగోలు దోపిడీ.. ► పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.17,368 కోట్లు అవసరమని 2014, జూలై 8న నీటిపారుదల ప్రాజెక్టులపై విడుదల చేసిన శ్వేతపత్రంలో నాటి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ► 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ నీటిపారుదల ప్రాజెక్టులపై రూ.68,293 కోట్లు ఖర్చు చేసినట్లు టీడీపీ చెబుతోంది. కానీ ఇందులో నీరు–చెట్టు పథకానికి, పోలవరానికి పెట్టిన వ్యయాన్ని మినహాయిస్తే ప్రాజెక్టులపై రూ. 45,393 కోట్లు ఖర్చుపెట్టింది. కానీ.. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేదు. ► దీనికి ప్రధాన కారణం... జీవో 22, జీవో 63లను అడ్డంపెట్టుకుని అంచనా వ్యయాలను భారీగా పెంచేశారు. కాంట్రాక్టర్లతో కలిసి ఖజానాను దోచుకున్నారు చంద్రబాబు. ► ఈ దోపిడీ రామోజీకి కమ్మగా కన్పించింది. ఎందుకంటే దోపిడీ చేసిన సొమ్మును ఈ ఎల్లో ముఠా మొత్తం దోచుకో.. పంచుకో.. తినుకో పద్ధతిలో పంచేసుకున్నారు కాబట్టి. ► ఇక నీరు–చెట్టు కింద టీడీపీ కార్యకర్తలు పనులు చేయకుండానే చేసినట్లు చూపించి రూ.10 వేల కోట్లకుపైగా లాగేశారు. ► పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ సర్కార్ రూ.10,584 కోట్లు ఖర్చు పెడితే.. అందులో రూ.పది వేల కోట్లకుపైగా కేంద్రం రీయింబర్స్ చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కుడి, ఎడమ కాలువ ద్వారా గ్రావిటీపై నీళ్లందించవచ్చు. కానీ.. కుడి కాలువ ద్వారా నీళ్లందించడానికి రూ.1,900 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల, ఎడమ కాలువ ద్వారా నీళ్లందించడానికి పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టిన చంద్రబాబు.. ఆ రెండు ప్రాజెక్టు పనులను ఒకే కాంట్రాక్టర్‌కు ఇచ్చి.. భారీ కమీషన్లు కొట్టేశారు. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన ఈ రెండు ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ రూ.250 కోట్లను ప్రభుత్వానికి జరిమానాగా విధిస్తే.. దానిపై సుప్రీం కోర్టులో పోరాటం చేయాల్సి వస్తోంది. 2019 నుంచి ఆ రెండు ఎత్తిపోతల పథకాల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా తోడలేదు. అంటే.. వాటిపై వ్యయం చేసిన రూ.3800 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే కదా? ఇలాంటి కఠిన వాస్తవాలను ‘ఈనాడు’ పత్రిక ఎందుకు రాయదు? ► చివరకు కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను రూ.477 కోట్లతో ప్రారంభించి.. ఆ తర్వాత వ్యయాన్ని రూ.622 కోట్లకు పెంచి.. అస్మదీయ కాంట్రాక్టర్‌తో కలిసి సులువైన మట్టి పనులు చేసి, కమీషన్లు వసూలు చేసుకుని చంద్రబాబు చేతులు దులుపుకుంటే.. ఇప్పుడు ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి చంద్రబాబు దరిద్రపు మోసాలేవీ రామోజీకి కనిపించకపోవటమే ఈ రాష్ట్రం దురదృష్టం. -
3 ప్రాజెక్టులకు టీఏసీ లైన్‌క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన తెలంగాణలోని మూడు సాగునీటి ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ (టీఏఏసీ) ఆమోదం లభించింది. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర(చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాక–కొరట బ్యారేజీ, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలకు టీఏసీ ఆమోదం ఇస్తున్నట్లు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. జూలై 2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసి న గెజిట్ నోటిఫికేషన్లో ఈ మూడింటినీ ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘం పరిధిలోని వివిధ డైరెక్ట రేట్లు ఈ డీపీఆర్‌లను కూలంకషంగా పరిశీలించి ఆమోదించాయి. అనంతరం డీపీఆర్‌ల పరిశీలనకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బోర్డు భేటీలో వీటి అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించినా, బోర్డు తన రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపింది. కేంద్ర జల సంఘం ఏపీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పున: సమీక్షించి వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులను టీఏసీ సిఫారసు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ 3 ప్రాజెక్టులపై చర్చించారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వం తరుఫున హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూధన్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకూ ఆమోదం తెలుపనున్నట్టు పంకజ్ ప్రకటించారు. -
జూన్‌లో కుప్పానికి హంద్రీ-నీవా జలాలు
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం నియోజకవర్గానికి వచ్చే ఏడాది జూన్ నాటికి నీళ్లందించేలా పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించి గడువులోగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2 పూర్తి స్థాయి ఫలాలను ముందస్తుగా అందించడానికి గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోత పనుల టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఈ ఎత్తిపోతలకు డిసెంబర్లో శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా తారకరామ తీర్థ సాగరంలో మిగిలిన పనులకు టెండర్లు పిలిచామని, నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని వివరించారు. మహేంద్ర తనయ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టి రూ.852 కోట్లతో అంచనాలను సవరించామని, మిగిలిన పనుల పూర్తికి చర్యలు చేపట్టామని తెలిపారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో 3.4 కి.మీ. మేర పనులు మిగిలాయని అధికారులు పేర్కొనగా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టడానికి అవసరమైన భూ సేకరణకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతగా పనులు చేపట్టాలని సూచించారు. కొత్తవి పూర్తి చేయటంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించి క్రమం తప్పకుండా తనిఖీలతో అవసరమైన పనులు చేపట్టాలని నిర్దేశించారు. అత్యంత ప్రాధాన్యతగా పోలవరం.. పోలవరంను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తూ పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతం(అగాధాలు), డయాఫ్రమ్‌వాల్ పటిష్టతను తేల్చడం, ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టే ప్రణాళికపై అధికారులతో చర్చించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా గోదావరిలో 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా తొలుత కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు పరీక్షలు, వాటిలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీ డిజైన్లు ఖరారు చేస్తేగానీ చేపట్టమలేమన్నారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటానికి, డయాఫ్రం వాల్ పటిష్టతపై నిర్ధారణల కోసం సీడబ్ల్యూసీ సూచించిన మేరకు పరీక్షలను నవంబర్ మధ్యలో ప్రారంభిస్తామన్నారు. వాటి తుది ఫలితాలు డిసెంబరు ఆఖరుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ ఫలితాల ఆధారంగా కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత విధానం, డిజైన్లను సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుందన్నారు. పరీక్షల్లో వెల్లడయ్యే ఫలితాల ఆధారంగా డయాఫ్రమ్ వాల్‌పై సీడబ్ల్యూసీ ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ పరీక్షలు చేస్తున్న సమయంలోనే దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తి కాగానే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసి సీడబ్ల్యూసీ ఖరారు చేసిన డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఆలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గోదావరికి రెండో అతి పెద్ద వరద ప్రవాహం గోదావరిలో వరద ప్రవాహం నిరంతరం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 1990 తర్వాత అత్యధికంగా ఈ ఏడాది గోదావరికి అతి పెద్ద వరద ప్రవాహం వచ్చిందన్నారు. ఈ ఏడాది జులై 18న అత్యధికంగా 25.92 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 14న కూడా 15.04 లక్షల క్యూసెక్కులు, ఆగస్టు 19న 15.92 లక్షల క్యూసెక్కులు, సెప్టెంబరు 16న 13.78 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. ఇప్పటికీ రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగుతోందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి 1990లో 355 రోజుల పాటు ప్రవాహం రాగా 7,092 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయన్నారు. 1994లో ధవళేశ్వరం బ్యారేజీకి 188 రోజులు వరద ప్రవాహం రాగా 5,959 టీఎంసీలు కడలిలో కలిశాయి. 2013లో 213 రోజులు వరద రాగా 5,921 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ ఏడాది ధవళేశ్వరం బ్యారేజీకి 136 రోజుల పాటు వరద ప్రవాహంతో 6,010 టీఎంసీలు సముద్రంలో కలిశాయన్నారు. సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీళ్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,164.10 టీఎంసీలు కృష్ణా జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 119.2 టీఎంసీల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట నుంచి 34.8 టీఎంసీల నాగావళి జలాలు, నెల్లూరు బ్యారేజ్ నుంచి 92.41 టీఎంసీల పెన్నా జలాలు ఇప్పటిదాకా కడలిలో కలిశాయని అధికారులు వెల్లడించారు. నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని, ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో 90 శాతాన్ని నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తున్నామన్నారు. వరదను సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు ప్రాజెక్టుల ఫలాలు అందించాలని సీఎం జగన్ సూచించారు. ఎత్తిపోతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు ఏళ్ల తరబడి నిర్వహణ సరిగ్గా లేక మూలనపడుతున్నాయని అధికారులు పేర్కొనగా నిర్వహణపై ఎస్వోపీ (నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక)లు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో నిర్వహించడంపై కసరత్తు చేయాలని సూచించారు. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఎత్తిపోతల నిర్వహణకు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి మెరుగైన పద్ధతి రూపొందించాలన్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున రైతుల పర్యవేక్షణలో ఎత్తిపోతలను సమర్థంగా నిర్వహించేలా అవగాహన కల్పించి శిక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, వివిధ ప్రాజెక్టుల సీఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. -
రుణ ఆంక్షలపై తగ్గిన కేంద్రం!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఏప్రిల్ నుంచి వివిధ సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) సంస్థలు రుణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సదరు రుణాల పునరుద్ధరణపై ఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఆర్ఈసీ నుంచి రూ.992.25 కోట్ల రుణం విడుదలైంది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కు కూడా రుణాలను పునరుద్ధరించడానికి ఆర్ఈసీ, పీఎఫ్సీలు ముందుకు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరిస్తున్న రుణాలతో.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత.. తాజా రుణాలు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. పీఎఫ్సీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.340 కోట్ల రుణం విడుదలైనట్టు వార్తలు వచ్చినా అధికారులు ధ్రువీకరించలేదు. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జరిగిన యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి రూ.992.25 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ రెండు రోజుల కింద విడుదల చేయగా.. జెన్కో వెంటనే నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు బిల్లుల బకాయిలను చెల్లించిందని అధికార వర్గాలు తెలిపాయి. రుణాల పునరుద్ధరణ జరగడంతో యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా పూర్తి చేయగలమని జెన్కో చెబుతోంది. బడ్జెట్ రుణాల్లో చేరుస్తామంటూ ఆపేసి.. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితికి మించి అప్పులు చేశారంటూ, కొత్త రుణాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కొద్దినెలల కింద ఆంక్షలు విధించింది. కార్పొరేషన్ల పేరిట తీసుకుంటున్న రుణాలను కూడా రాష్ట్ర బడ్జెట్ రుణాల కింద లెక్కగడతామని పేర్కొంది. ఈ క్రమంలో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకోసం ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రావాల్సిన రుణాలు నిలిచిపోయాయి. జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి.. ఆర్ఈసీ/పీఎఫ్‌సీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటేనే మిగులు రుణాలు విడుదల చేస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో.. కేంద్రం పెట్టిన ఆంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. రుణాల కోసం జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్‌తో ఆర్ఈసీ/పీఎఫ్‌సీల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ వెంటనే రుణాలను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖలు రాశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం.. కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రుణాల పునరుద్ధరణపై చర్చలు జరిపింది. రాష్ట్రంపై ఆర్థిక ఆంక్షలు విధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ బహిరంగంగా ఆరోపణలు సైతం చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగి రుణాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందాల మేరకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఆర్ఈసీ నుంచి రూ.1,200 కోట్లు, పీఎఫ్సీ నుంచి రూ.2,000 కోట్ల రుణాలు రావాల్సి ఉంది. దీనితో కాళేశ్వరం మూడో టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
ప్రాజెక్టులన్నీ చకచకా
దేవుడి దయ వల్ల వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతన్నల మొహంలో చిరునవ్వు కనిపిస్తోంది. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. అంతటా ఒక మంచి వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీని జాతికి అంకితం చేస్తున్నాం. ఈ రోజు ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే కాదు.. దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు 26 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకున్నాం. ప్రతి ప్రాజెక్టును కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తామని హామీ ఇస్తున్నాను. మీ అందరి చల్లని దీవెనలతో దేవుడు మరింతగా మంచి చేసే అవకాశం ఇవ్వాలని.. తద్వారా రైతన్నలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సంగం, నెల్లూరు బ్యారేజీలు మాత్రమే కాకుండా, దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల నాన్నగారు ప్రదర్శించిన చిత్తశుద్ధిని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ.. 26 ప్రాజెక్టులనూ నిర్మిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను జాతికి అంకితం చేశారు. సంగం, నెల్లూరు బ్యారేజీల వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, సంగం బ్యారేజీ వద్ద దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగం బ్యారేజీ వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మనందరి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.320 కోట్లు ఖర్చు చేసి.. సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగు నీటిని స్థిరీకరించామని.. తద్వారా ఆత్మకూరు, నెల్లూరు రూరల్.. సర్వేపల్లి, కోవూరు, కావలి నియోజకవర్గాలకు మంచి చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామన్నారు. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.85 లక్షల ఎకరాలకు వరప్రదాయిని అయిన సంగం బ్యారేజీని ప్రాధాన్యతా ప్రాజెక్టుగా చేపట్టి, నిర్మాణంలో వేగం పెంచి పూర్తి చేశామని చెప్పారు. ‘మనం అధికారంలోకి వచ్చాక 9 నెలలు తిరక్క ముందే కోవిడ్ సమస్య వచ్చింది. మరోవైపు పెన్నా నదిలో వరుసగా రెండేళ్ల పాటు వరదలు వచ్చాయి. అయినా అన్ని ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ఈ ప్రాజెక్టు పనుల మీద దృష్టి పెట్టి పూర్తి చేశాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. చిత్రంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరుల దివంగత సీఎం వైఎస్సార్ వల్లే మోక్షం ► దాదాపు 140 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారి హయాంలో సంగం వద్ద కట్టిన ఆనకట్ట కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. అయినా గత పాలకులెవరూ దీనిని పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టు చేపట్టి, నెల్లూరు జిల్లాకు మంచి చేయాలని ఆలోచించలేదు. ► దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేందుకు అడుగులు ముందుకు పడ్డాయి. 2006లో సంగం బ్యారేజ్ పనులు, ఆ తర్వాత నెల్లూరు బ్యారేజీ పనులు ప్రారంభమయ్యాయి. ► 2009లో నాన్నగారు మన మధ్య నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత ఈ రెండు ప్రాజెక్టులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఆ పెద్దాయనకు కొడుకుగా, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయగలిగానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టీడీపీ హయాంలో ముహూర్తాలు తప్ప పనుల్లేవు ► 2014లో రాష్ట్రం విడిపోయాక టీడీపీ ప్రభుత్వ హయాంలో.. సంగం బ్యారేజీ కోసం కేవలం రూ.30.85 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి.. 2018 నాటికి పూర్తి చేస్తామని మరోసారి.. 2019 నాటికి పూర్తి చేస్తామని ఇంకోసారి చెప్పారు. ఇలా ముహూర్తాల మీద ముహూర్తాలు మార్చుకుంటూ పోయారే తప్ప.. ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏరోజూ ఆలోచన చేయలేదు. ► వారు చేసిందల్లా ప్రాజెక్టుల్లో రేట్లు పెంచేయడం, ఎస్కలేషన్ ఇచ్చేయడం.. ఆ తర్వాత కమీషన్లు దండుకోవడమే. చంద్రబాబు హయాం అంతటా ఇదే తీరున అడుగులు పడటం చూశాం. గౌతమ్ జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు.. ► మనందరి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు కోవిడ్ సమస్యలు, మరోవైపు వరదల వంటి ప్రతికూల పరిస్థితులు. అయినా మూడేళ్లనే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసి సంగం ప్రాజెక్టును పూర్తి చేశాం. నాకు మిత్రుడు, మంచివాడు, ఆత్మీయుడు అయిన మేకపాటి గౌతంరెడ్డి నిజానికి ఈరోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్టును ప్రారంభించే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సింది. ► గౌతమ్ హఠాన్మరణంతో మనందరికీ దూరమయ్యాడు. ఆ రోజు గౌతమ్ సంస్మరణ సభలో చెప్పిన మాటను ఈ రోజు నిలుపుకున్నాం. అతని జ్ఞాపకార్థం సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ అని పేరు పెడుతున్నాం. తద్వారా గౌతమ్ చిరస్థాయిగా ఎప్పుడూ మన మనస్సులోనే ఉంటాడు. ఈ బ్యారేజ్ వల్ల ఇప్పుడు పెన్నా డెల్టా కనిగిరి కాలువ కింది 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద మరో 63 వేల ఎకరాలు, కావలి కాలువ కింద మరో 75 వేల ఎకరాలు వెరసి.. 3.85 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ జరుగుతుంది. బ్యారేజీల ప్రారంభోత్సవ సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం నెల్లూరు బ్యారేజీకి వైఎస్సార్ శ్రీకారం ► 150 సంవత్సరాల క్రితం నిర్మించిన నెల్లూరు ఆనకట్ట శిథిలావస్థకు చేరితే, పట్టించుకునే నాథుడు లేక దాదాపు లక్ష ఎకరాలకు నీరందించలేని స్థితికి చేరింది. అప్పట్లో ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి చొరవ చూపడం వల్ల మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. ► ఆనాడు ప్రాజెక్టు వ్యయం రూ.147 కోట్లుగా అంచనా వేస్తే.. రూ.86 కోట్లు ఖర్చు చేసి, ప్రియతమ నేత ప్రాజెక్టును పరుగులు తీయించగలిగారు. నాన్నగారు చనిపోయాక ఈ ప్రాజెక్టు మళ్లీ నిర్లక్ష్యానికి గురైంది. మనందరి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టునూ పూర్తి చేసి.. జాతికి అంకితం చేస్తున్నాం. రూ.85 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా ► సోదరుడు, ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి.. కొన్ని సమస్యలు చెప్పారు. జాతీయ రహదారి నుంచి సంగం బ్యారేజ్‌కు నేరుగా రహదారి నిర్మాణానికి రూ.15 కోట్లు అవుతుందన్నారు. అది మంజూరు చేస్తున్నాను. ► ఆత్మకూరు నియోజకవర్గంలో 12 ఇరిగేషన్ పనులకు సంబంధించి రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా. నియోజకవర్గంలో 25 ఊళ్లకు రహదారి నిర్మాణానికి రూ.14 కోట్లు, ఆత్మకూరు మున్సిపాల్టీకి స్పెషల్ గ్రాంట్ కింద రూ.12 కోట్లు, సంగం ప్రాజెక్టు నుంచి సంగం పంచాయతీకి నీటి సదుపాయం కోసం రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నాం. మొత్తమ్మీద దాదాపు రూ.85 కోట్ల విలువైన ఈ పనులన్నింటికీ అనుమతులు మంజూరు చేస్తున్నాను. ► ఈ కార్యక్రమంలో దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులరెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మానుగుంట మహీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్‌రావు, కమ్యూనిటీ డెవెలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు మేయర్ స్రవంతి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. వరుణుడి ఆశీర్వాదం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించి, నెల్లూరు బ్యారేజీ జాతికి అంకితం చేసేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటి వరకూ ఎండ వేడిమితో ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా మేఘావృతమై చిరుజల్లులు మొదలయ్యాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జోరున వర్షం ప్రారంభమెంది. సీఎం పర్యటన ముగిసే వరకు నెల్లూరులో వర్షం కురుస్తూనే ఉంది. బ్రిడ్జి కమ్ బ్యారేజీ ప్రారంభించి, సీఎం తిరుగు ప్రయాణం కాగానే అక్కడా వర్షం ఆరంభమైంది. సంగంలో సైతం బహిరంగ సభ తర్వాత వాన జల్లులు పడ్డాయి. ఇదంతా కళ్లారా చూసిన వారు.. ముఖ్యమంత్రికి దేవుడి చల్లని దీవెనలు ఉన్నాయని, వరుణ దేవుడూ ఆశీర్వదించారని చర్చించుకున్నారు. ఇదో అద్భుత సన్నివేశం సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను సీఎం జగన్ ఒకేసారి ప్రారంభించడం అద్భుతమైన సన్నివేశం. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండిటికీ శంకుస్థాపన చేశారు. తండ్రి సంకల్పించిన ఈ రెండు ప్రాజెక్టులను తనయుడు సాకారం చేయడం చరిత్రలో అరుదుగా జరిగే విషయం. స్వాతంత్య్రానంతరం వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని వినియోగించుకోవడానికి ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. వైఎస్సార్ వచ్చాకే జలయజ్ఞం పేరుతో ఆ దిశగా అడుగులు పడ్డాయి. ఆ మహానేత మనందరి మధ్య నుంచి వెళ్లిపోయాక ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్.. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. – జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు -
వైఎస్ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులు
వంగూరు: దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డికి పాలమూరు జిల్లా అంటే అమితప్రేమ అని, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా డిండిచింతపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లోని కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని, అయితే కల్వకుర్తి ప్రాజెక్టులో మిగిలిన పదిశాతం పనులు పూర్తిచేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. డిండిచింతపల్లి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు దుందుభి వాగుపై వైఎస్సార్ వంతెన నిర్మిస్తే, కేసీఆర్ ఆ వంతెనపై బస్సులు కూడా నడిపే పరిస్థితిలో లేరన్నారు. ఉద్యమకారుడని తెలంగాణ ప్రజలు అధికారం అప్పగిస్తే పాలనను గాలికి వదిలి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఉన్నత చదవులు చదివిన విద్యార్థులు సైతం కూలీ పనులకు వెళున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు మళ్లీ వైఎస్సార్ పాలన రావా లని కోరుకుంటున్నారని, అది కేవలం వైఎస్సార్టీపీతోనే సాధ్యమని అన్నారు. -
రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులను, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ.. 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) చీఫ్ అడ్వైజర్ డి. పాండురంగారెడ్డితో పాటు ఇద్దరు పిల్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర జల శక్తి కార్యదర్శి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, గోదావరి రివర్ మేనేజిమెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, కేంద్ర జలవనరుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. నంబర్ కేటాయించండి... తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదంపై తాము పిల్ దాఖలు చేయలేదని, పిల్‌కు నంబర్ కేటాయించేలా హైకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చేసేలా నోటిఫికేషన్ ఉందని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులపై నియంత్రణ, నిర్వహణ చేసేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రాజెక్టులపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవడమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తన పరిధిలోకి తీసుకుంటోందని చెప్పారు. ‘తెలంగాణకు జలవనరుల వాటాను పెంచకుండా కేంద్రం దగా చేస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళతాయి. ఇది తెలంగాణ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని సమాఖ్య పాలన స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం ఏర్పాటయ్యే నదీ జలాల యాజమాన్య బోర్డులకు తెలుగు రాష్ట్రాలు.. సిబ్బంది, అధికారులు, ఫైళ్లు, వాహనాలను అందించాలి. అంతేకాకుండా రివర్ బోర్డులకు తెలంగాణ, ఏపీ రూ.200 కోట్లు చొప్పున రూ.400 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించిందీ కేంద్రం చెప్పలేదు. నిధులు ఇచ్చేందుకు, నోటిఫికేషన్‌ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు. హైకోర్టు జోక్యం చేసుకుని.. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి సమాఖ్య పాలన స్ఫూర్తిని కాపాడాలి’అని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. విచారణార్హత ఉంది.. పిల్లోని అంశాలు అంతర్రాష్ట్ర జల వివాద అంశం కాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెలువరించిన నోటిఫికేషన్‌ను సవాలు చేసిన పిల్‌కు విచారణార్హత ఉందన్నారు. పిల్ దవిచారణార్హతపై పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించే నిమిత్తం విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. -
కృష్ణాపై 6 ప్రాజెక్టులకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలోని కల్వకుర్తి (అదనపు 15 టీఎంసీలతో సామర్థ్యం పెంచింది), నెట్టెంపాడు (సామర్థ్యం పెంచనిది)తోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ఎత్తిపోతల పథకాలకు మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో ఈ ఆరు ప్రాజెక్టులను చేర్చి వాటి నిర్మాణం పూర్తికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న తెలంగాణ, ఏపీ వాదనలతో కేంద్ర జలశక్తి శాఖ ఏకీభవించింది. ఈ ఆరు ప్రాజెక్టులకు మరోసారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇందుకు అనుగుణంగా 2021 ఏప్రిల్ 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు సవరణలు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిగా వివాదం: రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం ద్వారా కృష్ణా బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలతోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండకు ఏడాదిలోగా అపెక్స్ కౌన్సిల్ (కేంద్ర మంత్రి చైర్మన్‌గా, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులు) నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని గెజిట్‌లో రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని రెండు రాష్ట్రాలపై కృష్ణా బోర్డు ఒత్తిడి తెచ్చింది. గడువులోగా అనుమతులు పొందకుంటే పనులు నిలుపుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. విభజన చట్టం ద్వారా ఆ ఆరు ప్రాజెక్టులకు కేంద్రమే అనుమతి ఇచ్చిందని.. ఈ నేపథ్యంలో మళ్లీ వాటికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఇటు కృష్ణా బోర్డుకు, అటు కేంద్ర జలశక్తి శాఖకు ఇరు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. దీంతో ఈ ఆరు ప్రాజెక్టులకు తాజాగా కేంద్రం మినహాయింపు కల్పించింది. అనుమతుల కోసం వీటి డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రాజెక్టుల నిర్వహణను మాత్రం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా బోర్డుకు అప్పగించాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. నెట్టెంపాడు విస్తరణకు అనుమతి తప్పదు... తెలంగాణ వచ్చాక కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా అదనంగా 15 టీఎంసీలు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా అదనంగా 2.5 టీఎంసీల కృష్ణా జలాల తరలింపునకు విస్తరణ పనులు చేపట్టగా కల్వకుర్తి విస్తరణకు మాత్రం కేంద్రం మినహాయింపు కల్పించింది. దీంతో నెట్టెంపాడు విస్తరణ పనులకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని లేనిపక్షంలో పనులు నిలుపుదల చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. నెట్టెంపాడు విస్తరణతోపాటు తెలంగాణలో కృష్ణాపై నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఉదయసముద్రం, కోయిల్‌సాగర్, ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పథకాలు, ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు అనుమతి తీసుకోవాల్సి రానుంది. -
'అప్పు'డేమైంది..?.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే నిలిపివేసిన రుణాల విడుదలకు అనుమతి స్తామని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. రుణమిచ్చే సంస్థ, రుణం తీసుకునే సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగస్వామ్యం కావాలని కేంద్రం పట్టు పడుతోంది. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలా జరిగితే కార్పొరేషన్లు తీసుకునే రుణాలు రాష్ట్ర రుణ ఖాతాలోకి వెళ్తాయి. తద్వారా రాష్ట్రం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకునే రుణాలు తగ్గుతాయని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అప్పుడు లేని షరతులు ఇప్పుడెందుకు? రుణ ఒప్పందాల సమయంలో లేని షరతులు అకస్మాత్తుగా ముందుకు తీసుకుని రావడంపై రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రుణాల్లో ఇప్పటికే 70 శాతం వరకు విడుదల చేశాక ఇప్పుడు ఈ త్రైపాక్షిక ఒప్పందం అంటూ మెలిక పెట్టడంపై సీఎం కేసీఆర్ కూడా అగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తీసుకున్న రుణాలపై నెలవారీ చెల్లింపుల్లోనూ ఎక్కడా డిఫాల్ట్ కాలేదని, అయినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ఈ విధంగా కేంద్రం వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై పలుమార్లు రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం.. చివరి ఆప్షన్‌గా కోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం ఉత్తర్వులతో నిలిచిన నిధులు రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్ఈసీ) సహా నాబార్డ్ వంటి సంస్థలు రూ.76,900 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.43 వేల కోట్లు విడుదల చేయగా, వాటి ఖర్చు సైతం జరిగిపోయింది. మరో రూ.33 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా త్రైపాక్షిక ఒప్పందాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఫలించని అధికారుల చర్చలు త్రైపాక్షిక ఒప్పందం అంటే రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాల్సి వస్తుంది. అదే జరిగితే కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి చేరుతాయి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ఇతర రుణాలు తగ్గిపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రంతో చర్చలకు రాష్ట్ర ఉన్నతాధికారులు నడుం బిగించారు. నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఢిల్లీకి వచ్చిన సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లు కేంద్ర ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో సీఎం కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రుణాల అంశంపై ఆర్ధిక రంగ నిపుణులు, మాజీ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఢిల్లీలోని తన నివాసంలో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. గురువారం కూడా ఇద్దరు, ముగ్గురు ఆర్థిక, న్యాయ నిపుణులతో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులకు అనుమతులకూ కొర్రీలు! కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి విషయంలో కూడా కేంద్రం అనేక కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు గడిచిన మూడురోజులుగా ఇరిగేషన శాఖ అధికారులు ఈ విషయమై కేంద్ర జల సంఘం, జల శక్తి శాఖల చుట్టూ తిరుగుతున్నా పెద్ద ఫలితం లేదని చెబుతున్నారు. ఒక అంశంపై స్పష్టత ఇస్తే, మరో అంశాన్ని కేంద్రం ముందుకు తీసుకొస్తోందని, సీతారామ, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, రామప్ప–పాకాల, తుపాకులగూడెం ప్రాజెక్టుల విషయంలో కాలుకు వేస్తే వేలికి..వేలికేస్తే కాలుకు అన్న చందంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కూడా కేంద్రం తీరుపై ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి తదుపరి కార్యాచరణపై గురువారం ఇద్దరు, ముగ్గురు ఎంపీలతో మాట్లాడినట్లు తెలిసింది. -
ప్రాజెక్టుల అప్పగింతపై మళ్లీ పాతపాటే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీయాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) అధికార పరిధిని నిర్వచిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని షెడ్యూల్–2లో పొందుపర్చిన 11 ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంపై తెలుగు రాష్ట్రాలు మళ్లీ పాతపాటే వినిపించాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మినహా మరే ప్రాజెక్టును అప్పగించే ప్రసక్తేలేదని తెలంగాణ మరోసారి తేల్చి చెప్పింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఏపీ పట్టుబట్టింది. దీంతో ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు మెంబర్ కన్వీనర్ అజగేషన్ నేతృ త్వంలో గురువారం జలసౌధలో నిర్వహించిన సబ్ కమిటీ సమావేశం ఫలితం లేకుండానే ముగి సింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈ మోహ న్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రమణ్య ప్రసాద, ఏపీ నుంచి సీఈ పుల్లారావు పాల్గొన్నారు. ఏపీ తమ పరిధిలోని తోట వెంకటాచలం లిఫ్టు, తాడిపూడి పంప్‌హౌస్, సీలేరు పవర్ కాంప్లెక్స్‌ల అప్పగింతపై బోర్డుకు నోట్‌ను అందించింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులను సైతం స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరిస్తామని షరతు విధించింది. తెలంగాణ లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ఉన్న కాకతీయ క్రాస్ రెగ్యులేటర్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్, చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం లోని గంగారం పంప్‌హౌస్, దుమ్ముగూడెం వెయిర్, నావిగేషన్ చానల్, లాక్స్లను అప్పగిం చాలని గోదావరి బోర్డు కోరగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. సీడ్‌మనీ కింద రూ.200 కోట్లు కోరిన బోర్డు సీడ్‌మనీ కింద రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు విడుదల చేయాలని బోర్డు కోరగా, ఖర్చుల ప్రతిపాదనలను సమర్పిస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ తెలిపింది. పెద్దవాగు నిర్వహణకు సీడ్‌మనీగా రూ.1.45 కోట్లతోపాటు సిబ్బందిని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ బదులిచ్చింది. పెద్దవాగు ఆధునీకరణకు రూ.78 కోట్ల వ్యయం కానుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తే బోర్డుకు నిధులిస్తామని తెలిపింది. ఒక ఎస్ఈ, ఇద్దరు ఈఈ, నలుగురు జేఈ, ఇతర ఉద్యోగులను బోర్డుకు కేటాయించేందుకు తెలంగాణ అంగీకరించింది. -
రాష్ట్రాన్ని తడిపిన తపన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పచ్చబడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిరకాల కల సాకారమయ్యే క్రమంలో రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను దాటింది. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేసేందుకు పడిన తపన సత్ఫలితాలిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృతరీతిలో సాగునీటి వసతి కల్పనకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. రీడిజైనింగ్, రీ–ఇంజనీరింగ్ చేపట్టడంతో ప్రాజెక్టులన్నీ కొత్తరూపు సంతరించుకున్నాయి. దీంతో సాగునీటి విస్తీర్ణం పెరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల ప్రాజెక్టుల పూర్తితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. డిండి, గట్టు ఎత్తిపోతల, చనాఖా–కొరాటా ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరామ్‌సాగర్ వంటి ప్రాజెక్టుల కాల్వలను ఆధునీకరించింది. సాగునీటి రంగాభివృద్ధికి 8 ఏళ్లలో ఏకంగా రూ.1.52 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణ ఆవిర్భవించి 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రగతినివేదికలో ఈ విషయాలను పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం ముందు తీరం నుంచి ఐదు దశలలో నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేయాలన్న లక్ష్యంతో రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 70 శాతం పనులు పూర్తయ్యాయి. 6 జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో గల 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు గోదావరి నీటిని తరలించి భద్రాద్రి–కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తులోకి లిఫ్టు చేసి రాష్ట్రంలో బీడువారిన భూములకు అందించడానికి ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మించింది. కాళేశ్వరంలో భాగంగా గోదావరిపై మూడు బ్యారేజీలు, 20 భారీ లిఫ్టులు, 21 పంప్‌హౌస్‌లు, 18 రిజర్వాయర్లు, 1,832 కి.మీ. పొడవున సొరంగాలు, పైప్లైన్లు, కాల్వలతో కూడిన నెటవర్క్‌ను కేవలం 36 నెలల రికార్డు సమయంలో నిర్మించింది. ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ సాగునీరందిస్తుంది. కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరంగా 100 టీఎంసీల జలాలను నిల్వ చేయవచ్చు. -
Andhra Pradesh: సాగునీటి సవ్వడులు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి నిధులను ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. దీనికి సంబంధించి రూ.2,559.37 కోట్లు కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని, జల్ శక్తితో చర్చించి త్వరగా నిధులు రప్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గొట్టా బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి హిర మండలం రిజర్వాయర్‌ను నింపేలా ఎత్తిపోతల పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయడంతోపాటు నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. సాగునీటి పనులపై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 29న జరిగిన సమీక్షలో నిర్దేశించిన లక్ష్యాలు, తీసుకున్న చర్యలపై అధికారుల నివేదిక ఆధారంగా ప్రాజెక్టుల వారీగా సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యాంశాలు ఇవీ... సాగునీటి పనులపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సీడబ్ల్యూసీ రాక.. డిజైన్లపై నెలాఖరుకు స్పష్టత పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ పనులను జూలై 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తి కాగా కోతకు గురైన ప్రాంతం ఇసుకతో పూడ్చివేత పనులు 76 శాతం పూర్తి చేసినట్లు వివరించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ డిజైన్లపై ఇన్వెస్టిగేషన్ పూర్తైన నేపథ్యంలో ఈనెల 11న సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులు పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈనెల 18న డిజైన్లపై డీడీఆర్పీ(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం జరగనుంది. డిజైన్లపై నెలాఖరుకు స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. పీపీఏ అనుమతితోనే పోలవరం పనులు.. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇంకా రూ.2,559.37 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) అనుమతి ఇచ్చిన తర్వాతే ప్రతి పనీ జరుగుతోందన్నారు. పనులను వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. కేంద్ర అధికారులతో సమావేశం సందర్భంగా రీయింబర్స్ అంశాన్ని ప్రస్తావించాలని ఆదేశించారు. పెన్నాపై సకాలంలో జంట బ్యారేజీలు.. నెల్లూరు, సంగం బ్యారేజీ పనుల పురోగతిని వివరిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సకాలంలో వీటిని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. వాయువేగంతో వెలిగొండ సొరంగం ► వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని సమీక్షలో అధికారులు తెలిపారు. ► 2014–19 మధ్య గత సర్కారు హయాంలో టన్నెల్ –1 పనులు కేవలం 4.33 కిలోమీటర్లు మాత్రమే జరిగాయి. అంటే రోజుకు కేవలం 2.14 మీటర్ల పని మాత్రమే గత ప్రభుత్వ హయాంలో జరిగిందని అధికారులు వెల్లడించారు. ► వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019–2022 వరకు కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 2.8 కిలోమీటర్లు తవ్వి మొదటి టన్నెల్‌ను పూర్తి చేశారు. అంటే రోజుకు 4.12 మీటర్ల మేరకు టన్నెల్ పనులు జరిగాయని అధికారులు తెలిపారు. ► వెలిగొండ టన్నెల్–2కు సంబంధించి 2014–2019 మధ్య రోజుకు 1.31 మీటర్ల పని మాత్రమే జరగ్గా 2019–22 మధ్య రోజుకు 2.46 మీటర్ల పనులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు 500 మీటర్లపైన టన్నెల్ తవ్వకం పనులు చేస్తున్నట్లు చెప్పారు. ► సెప్టెంబరులో టన్నెల్–1 ద్వారా వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ► టన్నెల్–1 ద్వారా నీటిని విడుదల చేస్తూనే టన్నెల్–2లో పనులను నిర్విఘ్నంగా కొనసాగించి 2023 జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఆలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌లోకి వంశధార ఎత్తిపోత.. ► కేంద్రానికి సమర్పించిన వంశధార ట్రిబ్యునల్ తుది నివేదికపై ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్సెల్పీ) దాఖలు చేయడంతో ఆ అవార్డు అమల్లోకి రాలేదని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల నేరడి బ్యారేజీ పనులను ప్రారంభించడంలో జాప్యం చోటు చేసుకుని హిర మండలం రిజర్వాయర్‌ను నింపడం కష్టంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో గొట్టా బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి హిర మండలం రిజర్వాయర్ నింపవచ్చునని ప్రతిపాదించారు. దీనికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్ ఈ ఎత్తిపోతలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సుమారు రూ.189 కోట్లు వ్యయం కానుంది. నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ► వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారం చెల్లింపుపై సీఎం జగన్ సమీక్షించారు. ఇందుకు దాదాపు రూ.226.71 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ మార్చిలోనే ఉత్తర్వులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ► వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను శరవేగంగా పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ► గజపతినగరం బ్రాంచ్ కెనాల్, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్నారు. వలసలను నివారించేలా.. ► తాగు, సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి నీటి ఎద్దడిని నివారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కర్నూలు పశ్చిమ ప్రాంత ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. నీటి కొరత కారణంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని నివారించేందుకు ప్రాజెక్టులు దోహదం చేస్తాయన్నారు. ► చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని అందించాలని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ► మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ► భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్ కెనాల్, జీఎన్ఎస్ఎస్ ఫేజ్ –2 (కోడూరు వరకు), జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ లిఫ్ట్ స్కీం, ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నుంచి యూసీఐఎల్ సప్లిమెంట్, రాజోలి, జలదిరాశి రిజర్వాయర్లు (కుందూ నది), రాజోలి బండ డైవర్షన్ స్కీం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం – 5 లిఫ్ట్ స్కీంలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. సమీక్షలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, జలవనరులశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి కేరాఫ్ పల్నాడు
‘దాస్యమూ, దోపిడీ, దారిద్య్రమూ హెచ్చి, పాడిపంటల మేలు బంగారు నా తల్లి, కరవు కాపురమైందిరా పలనాడు.. కంటనీరెట్టిందిరా’ అంటూ కవి పులుపుల ఎంతో ఆవేదన చెందాడు ఆనాడు. ఇక మళ్లీ అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఈ పలనాటి సీమ దరి చేరకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఇక్కడి మాగాణుల్లో ఆయకట్టు పెంచి ఆదాయ వనరులు పుష్కలంగా పెంపొందించేందుకు అన్ని అవకాశాలు కల్పించింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు నేడు ఫలనాడుగా మారనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వరికిపూడిశెల ప్రాజెక్టు కూడా రానుండటంతో పల్నాడు జిల్లాలో ఆయకట్టు పెరగనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పలనాడులోకే సాగునీటి ప్రాజెక్టులన్నీ రావడం విశేషం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాచర్ల నియోజకవర్గంలో ఉంటే, పులిచింతల ప్రాజెక్టు పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో ఉంది. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 41.8813 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 544.90 అడుగులకు చేరింది. ఇది 198.6870 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 4,459, ఎడమకాలువకి 6,097, ఎస్ఎల్బీసీకి 1,650, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగునీటికి ఇబ్బందులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. వెనకబడిన పల్నాడు ప్రాంతంలో చెంతనే కృష్ణానది ఉన్నప్పటికీ సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బుగ్గవాగు రిజర్వాయర్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరు సరైన సమయంలో అందక పంటలు ఎండుముఖం పట్టేవి. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరికపూడిశెలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ ఎత్తిపోతల పూర్తి అయితే 73 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా చూడవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బొల్లాపల్లి మండలంలో 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందటంతో పాటు వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అలాగే ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో కూడా సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. నూజెండ్ల మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసేందుకు సర్వే పూర్తి చేశారు. నూజెండ్ల మండలం కంభంపాడు, కొత్తపాలెం, పువ్వాడ, ములకలూరు, ఉప్పలపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు వాణిజ్య పంటలకు పల్నాడు కేరాఫ్‌గా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పండే పత్తి, మిర్చి పంటలు 90 శాతం పల్నాడులోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది రికార్డు స్థా యిలో 2,66,640 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సుమారు రెండు లక్షల ఎకరాల వరకూ పల్నాడు ప్రాంతంలోనే సాగైంది. జిల్లాలో మాచర్ల, దుర్గి, రెంటచింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజు పాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, ఫిరంగిపురం, మేడికొండూరు, అమరావతి, బెల్లంకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల తదితర మండలాల్లో విస్తారంగా మిర్చి పంట సాగు చేశారు. మరోవైపు పత్తిని తీసుకుంటే జిల్లాలో 4,23,750 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది గులాబీ రంగు పురుగు ఉధృతి వల్ల 2,73, 950 ఎకరాల్లోనే సాగు అయ్యింది. అందులో కూడా 90 శాతం పల్నాడులోనే సాగు అయ్యింది. పల్నాడు ప్రాంతంలో 2.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో 7,13,142 ఎకరాలు సాధారణ విస్తీర్ణం ఉంది. భవిష్యత్‌లో కూడా వాణిజ్య పంటల కారణంగా పల్నాడు జిల్లాకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్రంలో అధిక ఆదాయం పొందే జిల్లాల్లో పల్నాడు కూడా నిలిచే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. -
పరవళ్లు.. పరుగులు
గడువులోగా పోలవరం.. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించిన అన్ని డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిందని, జూలై 31 నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పూడ్చాలనే విధానంపై ఏప్రిల్ 1న ఢిల్లీలో జరిగే సమావేశంలో కొలిక్కి వస్తుందని, మిగతా డిజైన్లు కూడా వీలైనంత త్వరగా ఖరారవుతాయన్నారు. సీడబ్ల్యూసీ అధికారుల వెంటపడి మరీ డిజైన్లకు అనుమతులు సాధించి గడువులోగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారుల వెంటబడి మరీ ఆమోదించుకోవడం ద్వారా నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరంతో సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ పూర్తైన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు. నగదు బదిలీ రూపంలో పరిహారం పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో పునరావాసం కల్పిస్తున్నామన్నారు. మొదటి ప్రాధాన్యత కింద ముంపు గ్రామాల నుంచి తరలించే నిర్వాసితులకు ఆగస్టు నాటికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఇందులో 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 7,962 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించామన్నారు. 3,228 నిర్వాసిత కుటుంబాలు ఓటీఎస్(వన్‌టైమ్ సెటిల్మెంట్)కు దరఖాస్తు చేసుకున్నాయని, మిగతా 9,756 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. నగదు బదిలీ (డీబీటీ) విధానంలో నిర్వాసితులకు వేగంగా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆగస్టుకు అవుకు టన్నెల్–2 సిద్ధం నెల్లూరు బ్యారేజీ పనులను పూర్తి చేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని చెప్పారు. దీనిపై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన 77.5 మీటర్ల పనులను 120 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి లైనింగ్‌తో సహా టన్నెల్‌ను పూర్తి చేసి ప్రస్తుత సామర్థ్యం మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉదయగిరి, బద్వేలుకు వెలిగొండ జలాలు.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–2 పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. నెలకు 400 మీటర్ల మేర టన్నెల్ తవ్వకం పనులు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని మరింత పెంచి నెలకు 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేపడతామని తెలిపారు. వెలిగొండ టన్నెల్–1 ద్వారా సెప్టెంబర్‌లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను తరలించి తొలిదశ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2023 నాటికి టన్నెల్ –2 సహా అన్ని రకాల పనులను పూర్తిచేసి రెండు టన్నెళ్ల ద్వారా శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించే పనులకు టెండర్లు పిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. నేరడి బ్యారేజీతో రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అక్టోబరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వంశధారపై గొట్టా బ్యారేజి ఎగువ నుంచి హిర మండలం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని దాదాపుగా ఆంధ్రప్రదేశే భరిస్తోందని.. బ్యారేజీని నిర్మిస్తే ఒడిశా కూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.ఇరు రాష్ట్రాలకూ నేరడి బ్యారేజీ ప్రయోజనకరమన్నారు. వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వడివడిగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ► తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులనూ వేగవంతం చేయాలన్నారు. ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు. ► తారకరామ తీర్థసాగరంలో రిజర్వాయర్ పనులు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొనగా మిగిలిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేయాలని సీఎం సూచించారు. సారిపల్లిని ముంపు గ్రామంగా గుర్తించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. ► మహేంద్ర తనయ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మిగిలిన పనులకు ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రధాన కాలువ తవ్వడానికి అవసరమైన భూమిని వేగంగా సేకరించి పనులు వేగవంతం చేయాలన్నారు. ► సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
వీలైనంత త్వరగా ప్రాజెక్టు డిజైన్లు తెప్పించుకోవాలన్న:సీఎం జగన్
-
Irrigation Projects: గడువులోగా పూర్తిచేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఇరిగేషన్ ప్రాజెక్టులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తిచేయాల్సిన పనులపైనా అధికారులతో సీఎం విస్తృత సమీక్ష చేపట్టారు. ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలను సీఎం నిర్దేశించారు. అనుకున్న గడువులోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ►పోలవరంలో దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌డ్యాంలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చ ►డౌన్ స్ట్రీం కాఫర్ డ్యాంకు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయని, జులై 31 కల్లా పని పూర్తవుతుందని తెలిపిన అధికారులు ►ఈసీఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని తెలిపిన సీఎం ►వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలన్న సీఎం ►వెంటపడి మరీ పనులు చేయించుకోవాలన్న సీఎం ►ఆర్ అండ్ ఆర్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టామన్న అధికారులు ►ప్రాధాన్యతా క్రమంలో కుటుంబాలను తరలిస్తున్నామన్న అధికారులు ►మొదటి ప్రాధాన్యత కింద తరలించాలనుకున్న వారిని ఆగస్టుకల్లా తరలించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ►మొదటగా ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20946 కుటుంబాల్లో ఇప్పటికే 7962 మందిని తరలించామన్న అధికారులు. ►3228 మంది ఓటీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన 9756 మందిని తరలించాలన్న అధికారులు. ►వీరిని త్వరగా పునరావాసం కల్పించాలన్న సీఎం. ►డీబీటీ పద్ధతుల్లో ఆర్ అండ్ ఆర్ కింద ప్యాకేజీలు చెల్లించాలన్న సీఎం. ►నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్–2, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వర్క్స్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 1 నుంచి నీటి విడుదల, ఇదే ప్రాజెక్టులో టన్నెల్–2 పనులు, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్ –2లో ఫేజ్–2 పనులపైనా సీఎం సమీక్ష ►నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తిచేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నామన్న అధికారులు ►సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయన్న అధికారులు. మే 15 నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తామన్న అధికారులు సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని ఆదేశించిన సీఎం ►అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన పనులు కేవలం 77.5 మీటర్లు, ఈసీజన్లో పనులు పూర్తిచేస్తామన్న అధికారులు ►120 రోజుల్లో పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేశామన్న అధికారులు. ►లైనింగ్ సహా ఆగస్టుకల్లా పనులు పూర్తయ్యేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ►పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్–2 పనులపై సీఎం సమీక్ష ►నెలకు 400 మీటర్ల మేర పనులు చేస్తున్నామన్న అధికారులు ►ఇది మరింతగా పెంచి 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేస్తామన్న అధికారులు. టన్నెల్ 1 ద్వారా సెప్టెంబర్ నెలలో నీటి సరఫరా ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం ►2023 నాటికి టన్నెల్ –2 సహా అన్నిరకాల పనులు పూర్తిచేసి.. రెండు టన్నెళ్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ►వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న అధికారులు ►అక్టోబరు నాటికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►వెలగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించడానికి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం ►వంశధార నదిపై గొట్టా బ్యారేజి వద్ద నీటిని లిఫ్ట్ చేసి హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపింగ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిచాలని ఆదేశం ►వంశధారపై నేరడి వద్ద బ్యారేజీకి సన్నాహాలపైనా సీఎం సమీక్ష. ►ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపుగా ఏపీనే భరిస్తోందని, బ్యారేజీ నిర్మాణం చేస్తే ఒడిశాకూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందన్న సీఎం. ►ఇరు రాష్ట్రాలకూ ఇది ప్రయోజనకరమన్న సీఎం. వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష ►తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్, తారరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష. ►తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు. ►గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద పనులనూ వేగవంతం చేయాలన్న సీఎం. ►ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశం ►తారకరామ తీర్థసాగర్‌లో రిజర్వాయర్ పనులు పూర్తికావొచ్చాయన్న అధికారులు. మిగిలిన పనులు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశాలు ►సారిపల్లి గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని ఆదేశాలు ►టన్నెల్ సహా ఇతర పనులూ కొనసాగుతున్నాయన్న అధికారులు ►మహేంద్ర తనయ ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష ►ప్రాజెక్టును పూర్తిచేయడానికి తదేక దృష్టిపెట్టాలన్న సీఎం ►ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశం ►ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలన్న సీఎం ►మెయిన్ కెనాల్‌ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలన్న సీఎం ►దీనికి సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలన్న సీఎం సమీక్షా సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
బంగారు తెలంగాణ చేసుకున్నం.. ఇక బంగారు భారతం చేద్దాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకున్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతదేశంగా మార్చుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అమెరికా కంటే గొప్పగా మన దేశాన్ని తయారు చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘మనం అమెరికాకు వెళ్లడం కాదు, ఇతర దేశాల ప్రజలే మన దేశం వీసాలు తీసుకొని వచ్చే గొప్ప సంపద, వనరులు, యువశక్తి మనకున్నాయి. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర షోషించాలి. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఢిల్లీ వరకు కొట్లాడతా. నేను జాతీయ రాజకీయాల్లో పనిచేస్తున్నా.. పోదా మా? జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా..? ఢిల్లీ వరకు కొట్లాడుదామా..? దేశాన్ని బాగు చేసుకుందామా..?’అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నిం చారు. దీంతో ‘కొట్లాడదాం..కొట్లాడదాం’అంటూ సభికులు ప్రతిస్పందించారు. ‘ఎక్కడైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.. మతం పేరు తో ఘర్షణలు పడితే పెట్టుబడులు రావు. దీనిపై గ్రామాల్లో చర్చించాలి. అన్ని వర్గాలు, కులాలు, మతాలు బాగుండాలి..’అని సీఎం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ‘తెలంగాణలో రైతులు చనిపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా అమలు చేస్తున్నాం. ఎలాంటి లంచం ఇవ్వకుండానే రైతులకు రైతుబంధు అందుతోంది. ఠంచనుగా వారి ఖాతాల్లో పడుతోంది. రూ.రెండు వేలు పింఛన్లు ఇవ్వడంతో తెలంగాణాలోని వృద్ధులకు గౌరవం పెరిగింది. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యకు రూ.20 లక్షలు స్కాలర్షిప్లు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమతో 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. జహీరాబాద్ నిమ్జ్‌లో ఉద్యోగాలు రానున్నాయి..’అని కేసీఆర్ తెలిపారు. మన పథకాల కోసం మహారాష్ట్ర ప్రజల ఒత్తిడి రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మెచ్చుకున్నారని సీఎం చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రజలు ఈ పథకాలను తమకు కూడా అమలు చేయాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తున్నారని ఠాక్రే తెలిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు చీకట్లో ఉంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నది ఒక్క తెలంగాణలోనే అని చెప్పారు. రెండోసారి ప్రజలు దీవించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బహిరంగ సభలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి (నారాయణఖేడ్), చంటి క్రాంతికిరణ్ (అందోల్), మాణిక్‌రావు (జహీరాబాద్), మదన్‌రెడ్డి (నర్సాపూర్), పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు) తదితరులు పాల్గొన్నారు. చిమ్నీబాయి అనే ఓ గిరిజన మహిళను సీఎం కేసీఆర్ వేదికపైకి పిలిపించుకొని కాసేపు ముచ్చటించారు. చిమ్నీబాయిది సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండా. గతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా తాను ఆ తండాకు వెళ్లిన సందర్భంలో.. గ్రామంలోని సమస్యలను ఆమె వివరించిన విషయాన్ని మంత్రి హరీశ్ తన ప్రసంగంలో తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి తాగునీరు వస్తోందని, రోడ్డు సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. ఈ నేపథ్యంలో చిమ్నీబాయిని వేదికపైకి ఆహ్వానించిన కేసీఆర్, ఆ గ్రామం బాగోగులపై కాసేపు ముచ్చటించారు. -
పనులు పరుగెత్తాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాదిలో చేయాల్సిన ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు, గట్టు ఎత్తిపోతల పథకం, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మిగులు పనులు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. అలాగే డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన బ్యారేజీ, చెన్నూర్ ఎత్తిపోతల పథకం, కడెం నదిపై నిర్మించ తలపెట్టిన కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని సూచించారు. నీటిపారుదల, వైద్యారోగ్యం, రోడ్లు, భవనాల శాఖలపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేస్తే రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటామన్నారు. అనుమతులు రాకపోవడంపై అసహనం సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతల, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించి ఐదు నెలలు గడిచినా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ కోరుతున్న అన్ని వివరాలు, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్‌ను సత్వరం సిద్ధం చేసి సీడబ్ల్యూసీకి, గోదావరి బోర్డుకు సమర్పించాలని ఆదేశించారు. గోదావరి బోర్డు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఐదు ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర జల సంఘానికి పంపాలని సూచించారు. సచివాలయం పనుల్లో వేగం పెరగాలి ! కొత్త సచివాలయం భవనం పనులతో పాటు లాండ్ స్కేపింగ్, రక్షణ వ్యవస్థ వంటి అనుబంధ భవనాల పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. సచివాలయానికి పటిష్టమైన భద్రత కల్పించడానికి కావాల్సిన సదుపాయాలపై డీజీపీ మహేందర్ రెడ్డిని సంప్రదించి చర్యలు తీసుకోవాలన్నారు. అధునాతన సాంకేతికతతో 24 గంటల నిఘా కోసం నిర్మిస్తున్న పోలీసు కమాండ్ కంట్రోల్ భవనం పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. -
ఏకపక్ష వైఖరిని ఒప్పుకోం.. గోదావరి బోర్డు తీరును ఆక్షేపిస్తూ తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల సందర్శన, ప్రాజెక్టుల అప్పగింత నోట్ రూపకల్పన ప్రక్రియల్లో గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. జీఆర్ఎంబీ సబ్ కమిటీ సభ్యులెవరినీ ఇందులో భాగస్వాములుగా చేయకపోవడాన్ని తప్పుబట్టింది. సాధారణ ప్రక్రియకు విరుద్ధమైన ఈ వ్యవహార శైలిని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ సోమవారం జీఆర్ఎంబీ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టు సైట్ల సందర్శన, అప్పగింత నోట్ తయారీకి బోర్డు/సబ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ లేఖలో తెలిపింది. బోర్డు/సబ్ కమిటీ నిర్ణయాల మేరకే బోర్డు అధికారులు పనిచేయాలని కోరింది. బోర్డు సచివాలయం అధికారులెవరు సందర్శనకు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని, బోర్డు అనుమతి లేకుండా సందర్శన జరిపే అధికారుల అభిప్రాయాలను ఏమాత్రం అంగీకరించబోమని తెలిపింది. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు మినహా తెలంగాణలోని ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది. -
చేతులెత్తేసిన సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల స్వాధీనం, వాటి ఆపరేషన్, ప్రొటోకాల్ అంశాలపై అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగిన కృష్ణా బోర్డు సబ్ కమిటీ దీనిపై ప్రాథమిక దశలోనే చేతులెత్తేసింది. కేంద్ర జల సంఘం ఇంజనీర్లతో కలిసి తయారు చేసిన ముసాయిదా నివేదికపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో దానిపై వెనక్కి తగ్గింది. దీంతో పూర్తిస్థాయి బోర్డు భేటీలోనే ఈ అంశాన్ని తేల్చుదామంటూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖల ద్వారా సమాచారమిచ్చింది. కృష్ణా స్పెషల్ బోర్డు భేటీలో చేసిన నిర్ణ యం మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, సభ్యుడు రవికుమార్ పిళ్లైల నేతృత్వం లో సబ్ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్‌పై అధ్యయనం చేసేందుకు గత నెల 25, 26 తేదీల్లో శ్రీశైలం పరిధిలో పర్యటించింది. అనంతరం ఒక ముసాయిదా నివేదికను రూపొందించి రాష్ట్రాల పరిశీలనకు అందజేసింది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల కనీస నీటి మట్టం వరకు విద్యుత్ అవసరాలకు నీటిని వినియోగించుకోవచ్చని, 854 అడుగుల మట్టంలో నీరున్నప్పుడు తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకోచ్చని పేర్కొంది. బచావత్ అవార్డుకు విరుద్ధం: తెలంగాణ ఈ ముసాయిదాపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కమిటీ మార్గదర్శకాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కృష్ణా నీటి పంపిణీ, వినియోగంపై నిర్దిష్టమైన విధానాన్ని బచావత్ పేర్కొన్న నేపథ్యంలో ఆ విధానాన్నే అమ లుచేయాలని డిమాండ్ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అని పేర్కొన్నారని, కరెంట్ ఉత్పత్తి మినహా శ్రీశైలం నుంచి మరో ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ఆస్కారమే లేదని ఇటీవల లేఖలో స్పష్టం చేసింది. బోర్డుకు గానీ, కేంద్రానికి గాని బచావత్ అవార్డులో ని నిబంధనలను పునర్నిర్వచించే అధికారం లేదని తేల్చిచెప్పింది. దీంతో సబ్ కమిటీ వెనక్కి తగ్గింది. ఆయా అంశాలపై పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చ జరగాలని, అక్కడి అభిప్రాయం మేరకే నడుచుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ మేరకు బోర్డుతెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. -
CM YS Jagan: మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యా రంగంలో మనబడి నాడు–నేడు, ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమానికి కూడా పెద్దపీట వేయాలని స్పష్టంచేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైఎస్సార్ స్టీల్‌ప్లాంట్ తదితర కార్యక్రమాలు, అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘నాడు–నేడు’ సమర్థవంతంగా సాగాలి విద్యారంగంలో నాడు–నేడు అన్నది అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమమని సీఎం జగన్ స్పష్టంచేశారు. ఇది సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. మనబడి నాడు–నేడు మొదటి విడతలో ఇప్పటివరకూ రూ.3,650 కోట్లు ఖర్చుచేశారు. రెండో విడత కింద 12,663 స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకు దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అలాగే, ఆస్పత్రుల నాడు–నేడుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలపైనా సమీక్షిస్తూ.. వెంటనే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఉద్దానం, పులివెందుల, డోన్లలో కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ పనులను వేగంగా పనులు పూర్తిచేయాలని, అలాగే ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021–22లో విద్యా కానుకకు రూ.790 కోట్లు విద్యాకానుక కింద పిల్లలకు నోట్ పుస్తకాలు, బూట్లు, డిక్షనరీ, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం 2021–22లో రూ.790 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే.. జగనన్న గోరుముద్ద కోసం 2021–22లో రూ.1,625 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. రోడ్లపై మరింత దృష్టి రహదారుల నిర్మాణం, మరమ్మతులపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. మే చివరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని.. ఇప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించగా వీటి టెండర్లపైనా మరింత దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపైనా దృష్టి పెట్టాలన్నారు. పనులు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల అమరావతి వెళ్లడానికి మంచి రోడ్డు సౌకర్యం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఇక పేదల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయలు కూడా పెద్దఎత్తున ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు.. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వీటితోపాటు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్‌చంద్ర, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ. కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శులు ఎన్. గుల్జార్, కేవీవీ సత్యనారాయణ, జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డీ మురళీధరరెడ్డి, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏఎంఆర్డీఏ కమిషనర్ కే విజయ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘పూర్తి చేసేదెప్పుడో’ అంటూ వంకర రాతలు.. పూర్తి చేస్తోంది ఇప్పుడే..
..అస్మదీయుడు అధికారంలో ఉంటే.. తప్పు చేసినా ఒప్పేనని వంకర రాతలు అచ్చేయడంలో ‘ఈనాడు’ తనకు తానే సాటి. ..అదే తస్మదీయుడు అధికారంలో ఉంటే.. ఒప్పు చేసినా తప్పేనని నీచపు రాతలు అచ్చేయడంలో ఆ పత్రికే మేటి. గడచిన రెండున్నరేళ్లలో దాదాపు 16 నెలలపాటు కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ప్రపంచ, దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇన్ని ఇబ్బందుల్లోనూ.. సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు దన్నుగా నిలవడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులకూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించడం ద్వారా పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల చరిత్రలో తొలిసారిగా గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వచేశారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేస్తున్నారు. 2019, 2020లలో కోటి ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు.. ఈ ఏడాదీ అదే స్థాయిలో నీళ్లందిస్తున్నారు. ..తన వాడు కాకుండా.. పరాయివాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ఈనాడుకి కడుపుమంట. నిజమైన కడుపులో మంటకు చికిత్స చెయ్యొచ్చు. కానీ.. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో వచ్చే కడుపుమంటకు ఏ మందు ఉంటుంది? ‘‘పూర్తి చేసేదెప్పుడో’’ శీర్షికతో సోమవారం ఆ పత్రికలో అదే కడుపుమంటతో ఓ కథనం ప్రచురించారు. అందులోని నిజానిజాలేమిటో చూద్దాం.. సాక్షి, అమరావతి: కరోనా ప్రతికూల పరిస్థితులు.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. వరదలు ముంచెత్తినా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు భరోసా కల్పిస్తూనే 28 నెలల్లో రూ.14,971.79 కోట్లను సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చుచేసింది. 2019, 2020లలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగాయి. ఓ వైపు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూనే.. పంట విరామ సమయంలో ప్రాజెక్టుల పనులను సర్కారు పరుగులు పెట్టిస్తోంది. దాంతో సకాలంలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. పెన్నా డెల్టాకు పునరుజ్జీవం పోసే నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తయ్యాయి. వాటిని ఈ ఏడాదే ప్రారంభించనున్నారు. వంశధార ప్రాజెక్టు రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో జీవచ్ఛవంలా మార్చిన పోలవరం ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవం పోశారు. రీయింబర్స్ చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నా.. రాష్ట్ర ఖజానా నుంచే నిధులు కేటాయిస్తూ పోలవరం పనులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. స్పిల్ వే పూర్తయింది. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేసి జూన్ 11 నుంచే గోదావరి వరదను స్పిల్ వే గేట్ల ద్వారా మళ్లించారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తికానుంది. చదవండి: (ఏపీపై ‘ఈనాడు’ డ్రగ్స్ విషం) సుభిక్షం చేసే దిశగా వడివడిగా అడుగులు.. అతివృష్టి.. అనావృష్టి పరిస్థితులవల్ల కృష్ణా నది నుంచి శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి వరద వచ్చే 40 రోజుల్లోగానే ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేందుకు కాలువల సామర్థ్యాన్ని పెంచే పనులను సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. 854 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నా శ్రీశైలం నుంచి నీటిని తరలించి.. సాగు, తాగునీటి కష్టాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. తద్వారా దేశంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక రచించారు. గోదావరి జలాలను తరలించి పల్నాడును.. కృష్ణాపై మూడు బ్యారేజీల ద్వారా కృష్ణా డెల్టా, కొల్లేరును పరిరక్షించడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి శ్రీకారం చుట్టారు. బడ్జెట్ కేటాయింపులతోపాటూ నాలుగు ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్)లను ఏర్పాటుచేశారు. జాతీయ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తేవడం ద్వారా నిధుల కొరతలేకుండా చేసి.. సకాలంలో పూర్తిచేయడానికి ప్రణాళిక రచించారు. ‘చంద్ర’ దోపిడీ ఇంపుగా కనిపించిందా? పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతోనే పూర్తిచేస్తామని జూలై 28, 2014న సాగునీటి ప్రాజెక్టులపై నాటి సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టంచేశారు. 2014, జూన్ 8 నుంచి మే 29, 2019 వరకూ సాగునీటి ప్రాజెక్టులకు రూ.56,228.75 కోట్లను టీడీపీ సర్కార్ ఖర్చుచేసింది. ఈ సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయింది. కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి.. మిగిలిన పని అంచనా వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి.. అడిగినంత కమీషన్ ఇచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి ఖజానాను దోచేయడంవల్లే రూ.56,228.75 కోట్లు ఖర్చుచేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయింది. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేకపోయింది. కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు మార్చారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు సాగించిన దోపిడీ అప్పట్లో ఈనాడుకు ఇంపుగా అనిపించినట్లుంది. ఈ పనులు కంటికి కన్పించడం లేదా? ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు అభివృద్ధిచేసే పనులను రూ.570.45 కోట్లతో చేపట్టారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు 2020లో పీహెచ్ఆర్ ద్వారా దాదాపు 8 నెలలపాటు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది జూలై నుంచి విడుదల చేస్తున్నారు. పంట విరామ సమయంలో ఈ పనులు చేస్తున్నారు. ► ఎస్సార్బీసీ, గాలేరు–నగరి కాలువ సామర్థ్యాన్ని 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచడం.. ఈ క్రమంలో అవుకు వద్ద 10వేల క్యూసెక్కులు, గండికోట వద్ద మరో 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అదనపు టన్నెళ్ల తవ్వకం పనులు చేపట్టారు. ఈ టన్నెళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పంట విరామ సమయంలో కాలువ పనులు చేస్తున్నారు. ► రూ.3,825 కోట్ల వ్యయంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను డీపీఆర్ తయారీకి అవసరమైన మేర పూర్తిచేశారు. ఈ ఎత్తిపోతలపై తెలంగాణ సర్కార్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ అనుమతి తీసుకుని.. ఆ ఎత్తిపోతలను పూర్తిచేసే దిశగా సర్కార్ చర్యలు చేపట్టింది. ► కమీషన్ల కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశ పనులకు 2019 ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచిన చంద్రబాబు సర్కార్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. తొలిదశతోపాటూ రెండో దశ పనులను వైఎస్సార్సీపీ సర్కార్ చేపట్టింది. ఈ రెండు దశల పనులు సర్వే పూర్తి కాగా.. పనులు జరుగుతున్నాయి. ► దుర్భిక్ష పల్నాడుకు గోదావరి జలాలను తరలించేందుకు రూ.6,020 కోట్లతో చేపట్టిన వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులు చకచకా సాగుతున్నాయి. ► తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చేందుకు రూ.2,145 కోట్లతో ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులను సర్కార్ చేపడితే.. దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించి, మోకాలడ్డుతున్నారు. ఇవేవీ ఈనాడు కంటికి కన్పించలేదేమో!? -
విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం: శంకర నారాయణ
సాక్షి, అనంతపురం జిల్లా: హంద్రీనీవాను ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. బాబు పూర్తి చేశారని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హంద్రీనీవాకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు ఇప్పటికి రైతులు గుర్తొచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం అని దుయ్యబట్టారు. (చదవండి: వారికి ఎవరి రికమండేషన్ అవసరం లేదు: పేర్ని నాని) టీడీపీ నేతలు డ్రామాలు: తలారి రంగయ్య రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోలేదని ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. ఇప్పుడు సీమ ప్రాజెక్టుల భవిష్యత్ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాయలసీమలో తాగు,సాగునీటి కష్టాలు తొలగేలా సీఎం జగన్ పకడ్బందీ చర్యలు చేపట్టారని తలారి రంగయ్య అన్నారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం, సాగర్
సాక్షి, అమరావతి: కృష్ణాబోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ల నుంచి నేరుగా నీటిని తీసుకునే సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. శ్రీశైలం, సాగర్ల కింద తెలంగాణ పరిధిలోని 9 అవుట్లెట్లను స్వాధీనం చేసుకున్నప్పుడే తమ భూభాగంలోని 6 అవుట్లెట్లను స్వాధీనం చేసుకోవాలని కృష్ణాబోర్డుకు షరతు పెట్టింది. శ్రీశైలం స్పిల్‌వే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం (మల్యాల పంపు హౌన్), ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం డ్యామ్ నిర్వహణ సర్కిల్ ఆఫీస్ సిబ్బంది 39 మంది, శ్రీశైలం సెక్షన్ ఆఫీసు, సబ్ డివిజన్ ఆఫీసుకు చెందిన సిబ్బంది 142 మంది.. మొత్తం 181 మంది సిబ్బందిని కృష్ణాబోర్డుకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని, నాగార్జున్‌సాగర్ కుడికాలువపై ఉన్న విద్యుత్ కేంద్రాన్ని కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలోని శ్రీశైలం, సాగర్, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, సాగర్ స్పిల్‌వే, సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటర్, ఎడమకాలువ హెడ్ రెగ్యులేటర్, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం, సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, సాగర్ వరద కాలువలను బోర్డు స్వాధీనం చేసుకున్నప్పుడే తమ ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం షరతు విధించింది. అలాగే శ్రీశైలం ఎగువన జూరాల ప్రాజెక్టుతోపాటు, దానిపై అవుట్లెట్ల నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కృష్ణాబోర్డును కోరింది. వాటిని స్వాధీనం చేసుకోకపోతే దిగువనున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు వచ్చే ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ప్రధాన రిజర్వాయర్లపై నేరుగా నీటిని తీసుకునే ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. స్వాధీనం సందర్భంగా అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ, జెన్కో సీఈలు బోర్డుకు సహకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: ‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’ -
తొలుత ఉమ్మడి ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిలోకి తొలిదశలో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు వెళ్లనున్నాయి. ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చే గెజిట్‌లో భాగంగా కృష్ణాబోర్డు మొదట శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను, గోదావరి బోర్డు పెద్ద వాగు ప్రాజెక్టునుతమ ఆధీనంలోకి తీసుకోను న్నాయి. ఈ మేరకు కేంద్రం సైతం స్పష్టత ఇచ్చి నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అంశాలపై స్పష్టత కోసం, రాష్ట్రాల అభిప్రాయాలను వినేందుకు 10, 11 తేదీల్లో బోర్డుల సబ్ కమిటీ భేటీలు, 12న పూర్తి స్థాయి భేటీలు ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేర కు తెలుగు రాష్ట్రాలకు బోర్డులు లేఖలు రాశాయి. చైర్మన్లతో కేంద్ర అదనపు కార్యదర్శి భేటీ గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ.. గురువారం ఉదయం రెండు బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌తో భేటీ అయ్యారు. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులు, వాటి వివరాలు, సీఐఎస్ఎఫ్ భద్రత, రాష్ట్రాలు అందించిన సమాచారం, వాటి అభ్యంతరాలు, ఇంతవరకు పూర్తి చేసిన చర్యలు తదితరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల ఆధీనానికి సంబంధించి రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయని, మూడు ప్రాజెక్టుల విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు సానుకూలతతో ఉన్నాయని తెలిపినట్లుగా సమాచారం. శ్రీశైలం, సాగర్, పులిచింతల విషయంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో వాటిని మొదటగా బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకొని పర్యవేక్షణ మొదలు పెట్టాలని సూచించినట్లుగా తెలిసింది. మిగతా ప్రాజెక్టులపై చర్చించేందుకు వీలైనంత త్వరగా బోర్డు భేటీలు నిర్వహించి రాష్ట్రాల అభిప్రాయం కోరాలని చెప్పినట్లుగా బోర్డుల వర్గాలు తెలిపాయి. వరుస భేటీలు పెట్టిన బోర్డులు గెజిట్ అమలుకు మరో వారం రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, బోర్డులు తమ పనిలో వేగం మరింత పెంచనున్నాయి. వచ్చే ఆది, సోమ వారాల్లో రెండు బోర్డుల సబ్ కమిటీల భేటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఆ వెంటనే పూర్తి స్థాయి స్పెషల్ బోర్డు భేటీలను ఈ నెల 12న నిర్వహించనున్నాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల కార్యదర్శులకు బోర్డులు లేఖలు రాశాయి. ఏయే ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచాలన్న దానిపై ఈ సమావేశాల్లో మరింత స్పష్టత తీసుకోనున్నాయి. -
Telangana: నిండుకుండలా చెరువులు
సాక్షి, హైదరాబాద్: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలన్నీ నిండుగా ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని సగానికి పైగా చెరువులు పూర్తిగా నిండి అలుగు దుంకుతున్నాయి. మొత్తం 43,870 చెరువులకు గాను 27 వేల చెరువులు పూర్తిగా నిండి మత్తడి పోస్తున్నాయి. మరో 6,243 వేలకు పైగా ఏ క్షణమైనా నిండి పొంగిపొర్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లంతా స్థానికంగానే ఉండి ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలుగు దుంకుతున్నాయి.. ప్రస్తుతం కరీంనగర్, గజ్వేల్, ఖమ్మం, వరంగల్ డివిజన్ల పరిధిలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. కరీంనగర్ డివిజన్లో 2,889 చెరువులకు గానూ 1,500, వరంగల్ జిల్లాలో 2,946 చెరువులకు 1,720 చెరువులు నిండిపోయాయి. ఖమ్మంలో 1,409 చెరువులకు గానూ ఏకంగా 1,400 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గజ్వేల్ డివిజన్లోని 6,308 చెరువుల్లో 4 వేల చెరువులు నిండాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 1,246 చెరువుల్లో మూడు, నాలుగు చెరువులు మినహా మిగతా చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయి. కృష్ణా బేసిన్లో సూర్యాపేట జిల్లాలో 1,314 చెరువుల్లో 985 చెరువులు, నల్లగొండలోని 1,927 చెరువుల్లో 800 చెరువులు నిండినట్లు సాగునీటి శాఖ రికార్డులు చెబుతున్నాయి. చెరువుల కట్టలు తెగకుండా రెవెన్యూ, మున్సిపల్, వాతావరణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం 12 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం నిండేందుకు సిద్ధంగా నిజాంసాగర్, సింగూరు ప్రస్తుత వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండుకోగా, సింగూరు, నిజాంసాగర్‌లు కూడా నిండే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిజాంసాగర్‌కు స్థానిక వాగుల నుంచి 26,823 క్యూసెక్కుల మేర వరద కొనసాగుతుండగా, పూర్తిస్థాయి నిల్వ 17.80 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 12.93 టీఎంసీలకు చేరింది. ఇక సింగూరుకు 23,646 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 25.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో ఈ ప్రవాహాలు మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. శ్రీరాంసాగర్‌కు 24,510 క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదవుతుండగా, 44,940 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీనితో ఎల్లంపల్లికి 86 వేల క్యూసెక్కులు, లోయర్ మానేరుకు 58 వేల క్యూసెక్కుల మేర వరద నమోదవుతోంది. -
ప్రాజెక్టులపై వివరణివ్వండి
సాక్షి,హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వార్థపూరిత వైఖరి వల్ల రాష్ట్ర ప్రజల నీటి హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడిందని, ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలు, విషయాలపై వివరణ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ మోసపూరిత నిర్ణయాల వల్ల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా కోల్పోతున్నామని ఆయన ఆరోపించారు. ఇప్పటికే కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు దక్కాల్సి ఉండగా, 299 టీఎంసీలకు ఒప్పుకుని రాష్ట్రానికి ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చి తద్వారా వచ్చే కమిషన్ల కోసం పొరుగు రాష్ట్రానికి సహకరిస్తున్నారని, కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆర్ఎల్ఐఎస్ టెండర్ ప్రక్రియ పూర్తికి అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు. ఇరురాష్ట్రాల జలవివాదాలపై చర్చకు రెండుబోర్డులూ కేఆర్ఎంబీ సమావేశాలు నిర్వహిస్తున్నా ఈ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందని తాము హెచ్చరించినా సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరగబోతోందన్నారు. -
చంద్రబాబుపై శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
-
చంద్రబాబుకు ఆ అర్హత లేదు: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, కడప: సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు రాయలసీమ నీటి కష్టాలను తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నపుడు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో బాబు దిట్ట అని, ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతలపై తన విధానామేమిటో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డి బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘‘796 అడుగులు దాటకుండా తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తోడేస్తుంటే.. చంద్రబాబు, మైసూరారెడ్డి ఎక్కడికి వెళ్లారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు కాబట్టి భయపడ్డారా?.. పాలమూరు - రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు నీటిని తరలించి.. రాయలసీమను ఎందుకు ఎండగడుతున్నారు?రాయలసీమ హక్కులను కాపాడేందుకే మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగే వరకు పోరాటం చేస్తాం. శ్రీశైలంలో నీటి కేటాయింపులు జరిగినా విద్యుత్ ఉత్పత్తి పేరుతో.. తెలంగాణ నీటిని తోడేస్తుంది..ఇది న్యాయమా’’ అని ప్రశ్నించారు. ‘‘నీటి కేటాయింపులను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై వైఎస్సార్, వైఎస్ జగన్‌లకు తప్ప.. ఏ ఒక్కరికీ చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? ట్రిబ్యునల్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏ వైఖరి ఉందో.. చంద్రబాబు కూడా అదే ధోరణిలో వంత పాడుతున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. -
దోచుకోవడానికే రీ డిజైన్
అశ్వాపురం: సాగునీటి ప్రాజెక్టులు రీడిజైన్ చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పాలకులు దోచుకుంటున్నారని సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను రూ.3,400 కోట్లతోనే పూర్తి చేశారని చెప్పారు. ఆ ప్రాజెక్టులకు ఇప్పుడు రీడిజైన్ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. మెరుగైన పరిహారం డిమాండ్ చేస్తూ సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శనివారం వారు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం బాబూరావు, ఎన్డీ నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ, ఆయకట్టు విస్తీర్ణం ఏమాత్రం పెరగకుండా అంచనా వ్యయం మాత్రం వేల కోట్లకు పెంచడమేంటని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల కింద నాడు వైఎస్ హయాంలో 6 లక్షల ఎకరాలే సాగయిందని, ఇప్పుడు కూడా సీతమ్మ సాగర్ కింద కూడా 6 లక్షల ఎకరాలే సాగయ్యేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. భూనిర్వాసితులకు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. -
జల వివాదం: నిరంతర విద్యుదుత్పత్తి.. ఇద్దరికీ నష్టమే
శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులు దాటాకనే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా అవసరాల కోసం కృష్ణా బోర్డు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే.. ఆ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించాలి. కానీ ప్రస్తుత నీటి సంవత్సరం మొదటి రోజునే అంటే జూన్ 1న శ్రీశైలంలో 808.4 అడుగుల్లో కేవలం 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. కృష్ణా బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఆదేశించినా నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేసింది. జూన్ 1 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి ద్వారా 26.05 టీఎంసీలను దిగువకు వదిలేసింది. విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం ఇప్పటికే 848 అడుగులు దాటి ఉండేది. శ్రీశైలం.. తెలంగాణ: జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో నీటి మట్టం ఎంత గరిష్టంగా ఉంటే.. విద్యుత్ అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ ఎత్తులో నీటి మట్టం ఉన్నప్పుడు పది వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్.. నీటి మట్టం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు 20 వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్‌కు సమానం. తక్కువ ఎత్తు నుంచే తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల శ్రీశైలం నీటి మట్టం పెరగలేదు. దీనివల్ల తెలంగాణకూ నష్టమే. శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటిపోవడం వల్ల తీవ్ర కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్లందించలేని దుస్థితి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు: శ్రీశైలంలో నీటి మట్టం కనీసం 848 అడుగులకు చేరితేనే దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు, చెన్నై నగరానికి అత్యవసరాల కోసం రెండు వేల క్యూసెక్కులనైనా తరలించే వీలు ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. నాగార్జునసాగర్.. విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ శ్రీశైలం నుంచి వదిలేస్తున్న జలాలకు స్థానికంగా కురిసిన వర్షం వల్ల వచ్చే ప్రవాహం తోడవడంతో జూన్ 1 నుంచి ఇప్పటిదాకా నాగార్జునసాగర్‌లోకి 28.26 టీఎంసీలు వచ్చాయి. విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ 31.22 టీఎంసీలను దిగువకు వదిలేసింది. తెలంగాణ: సాగర్‌లో 510 అడుగుల కంటే నీటి మట్టం దిగువకు చేరితే హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేయడం సాధ్యం కాదు. సాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు కింద కింద ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఆంధ్రప్రదేశ్: సాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం, ఎడమ కాలువ ద్వారా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. పులిచింతల.. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం కోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. విజయవాడ సర్కిల్ ఎస్ఈ ఆయకట్టుకు రోజు నిర్దిష్టంగా ఎన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలో ప్రతిపాదనలు పంపితేనే.. ఆ మేరకు నీటిని వినియోగిస్తూ తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేయాలి. కానీ తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి ప్రారంభించింది. సాగర్ నుంచి తెలంగాణ సర్కార్ వదిలేస్తున్న ప్రవాహానికి స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వచ్చే ప్రవాహం తోవడంతో ఇప్పటిదాకా పులిచింతల ప్రాజెక్టులోకి 36.64 టీఎంసీలు వస్తే విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు. 6.67 టీఎంసీలను తెలంగాణ సర్కార్ దిగువకు వదిలేసింది. ఇందులో 5.55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలో కలిశాయి. మిగిలిన జలాలు నదిలో ప్రవాహం రూపంలో ఉన్నాయి. తెలంగాణ: తక్కువ ఎత్తు నుంచి ఉత్పత్తి చేయడం వల్లే.. ఎక్కువ నీటిని ఉపయోగించినా తక్కువ విద్యుత్తే అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్: కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, పశ్చి మగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఖరీఫ్ పంటలకు రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు. దీంతో పులిచింతల నుంచి తెలంగాణ వదిలేసిన నీటిని వదిలేసినట్లుగా వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తోంది. ఇలా ఇప్పటిదాకా 5.55 టీఎంసీలు వృథా అయ్యాయి. బోర్డు పరిధి.. ప్రాజెక్టులు కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా విభజన చట్టం సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసినా పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దీంతో తరచూ జల వివాదాలు ఉత్పన్నమవుతున్నా బోర్డు చేతులెత్తేస్తోంది. ఈ వివాదాలకు పరిష్కారం దొరకాలంటే ప్రాజెక్టులపై అజమాయిషీ తమకే ఇవ్వాలని బోర్డు కోరుతోంది. బేసిన్ పరిధిలో తెలంగాణ, ఏపీల నియంత్రణలోని ప్రాజెక్టులు, ఇప్పటికే చేపట్టిన, కొత్తగా చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకునేందుకు ముసాయిదాను ఇరు రాష్ట్రాలకు పంపింది. ట్రిబ్యునల్ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తిని సైతం పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఏడేళ్లుగా బోర్డు, తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా దీనిపై తేలడం లేదు. పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు ఇవే... బోర్డు పరిధి నోటిఫై అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చుమర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడ్డ కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి రానున్నాయి. -
'నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతుంది..'
సాక్షి, అమరావతి: సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లకు అడ్డుతగులుతూ, తన అనూనయులతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించిన చంద్రబాబు రైతు ద్రోహి అని, అలాంటి వ్యక్తి చిత్తూరు గడ్డపై పుట్టడం ఆ జిల్లా వాసుల దురదృష్టమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. గతంలో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్ట్‌లపై ప్రసాద్ నాయుడు అనే తన అనుకూలస్తుని చేత కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు సీమ ఎత్తిపోతల పథకంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిత్తూరు జిల్లా ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్నాడని ఆరోపించారు. అప్పట్లో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంను ప్రసాద్ నాయుడు చేత కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడేమో సీమ ఎత్తిపోతల పథకంతో పాటు జగన్ గారు మొదలు పెట్టిన చిత్తూరు ప్రాజెక్టులపై స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించాడు రైతు ద్రోహి. — Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2021 రైతులు చల్లగా ఉంటే ఓర్వలేని చంద్రబాబు.. సొంత జిల్లా ప్రాజెక్ట్‌లపైనే స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించాడని ఆరోపించారు. తనకు రాజకీయ బిక్షపెట్టిన సొంత గడ్డకు మేలు చేయాల్సింది పోయి, సాగునీటి ప్రాజెక్ట్‌లకు అడ్డుతగులుతూ, ఆ ప్రాంత రైతుల కడుపు కొడుతున్న రైతు ద్రోహి చంద్రబాబు అని విమర్శించాడు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం.. పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలోని 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించిన చంద్రబాబును చూసి నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోందని పేర్కొన్నారు. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్లు పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చిత్తూరు జిల్లాలో 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు. నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోంది బాబూ!— Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2021 -
జల జగడం
సాక్షి నెట్వర్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్టుల వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద భారీగా మోహరించారు. అడ్డుకున్న తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసుల పహారా పెట్టి మరీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా డ్యామ్ వ ద్ద దాదాపు 240 మంది పోలీసులను మోహరించింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి ఏపీ జలవనరులశాఖ అధికారులు బయలుదేరగా కుడి కా లువ ఎస్ఈ గంగరాజును తెలంగాణ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. కాగా సాగర్ నూతన బ్రిడ్జి వద్ద గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ శాంతిభద్రతలను పరిశీలించారు. పులిచింతలలో వినతిపత్రం అందజేత మరోవైపు పులిచింతలలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ఏపీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు 300 మంది పోలీసులను ఉంచింది. పులి చింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ బాబు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్దకు వెళ్లి వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. చెక్‌పోస్టులు.. ముమ్మరంగా తనిఖీలు.. కర్నూలు జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. -
ఆ పాపం కేసీఆర్‌దే: భట్టి విక్రమార్క ఫైర్
సాక్షి, హైదరాబాద్: నీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్‌కు స్పష్టత లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తెలుగుగంగ ప్రారంభమైందని.. అప్పుడు కేసీఆర్ మంత్రిగా ఉన్నారని.. ఆ సమయంలో తెలంగాణ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. జనంలో ఇప్పుడు కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే ఇలా ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విక్రమార్క శుక్రవారం మాట్లాడుతూ... ‘‘తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కృష్ణ, గోదావరి నీళ్ళును పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవాలనే మన ఉద్యమాలు మొదలయ్యాయి. కానీ దురదృష్టం ఏమిటంటే.. ఈ రెండు నదులపై కేసీఆర్ ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల వల్ల ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డి పాడు పాపం... కేసిఆర్‌దే.. ‘‘1985-86 ప్రాంతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం పోతిరెడ్డిపాడు మొదలు పెట్టినప్పుడు నువ్వేం చేశావు. ఆనాడు కరువు మంత్రిగా ఉన్న కేసీఆర్.. పోతిరెడ్డిపాడుకు నాంది పలికాడు. దానికి ఆయనే బాధ్యుడు. మీ నాయకత్వంలోనే పోతిరెడ్డిపాడు మొదలైంది. దాదాపు 406 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా రోజుకు ఒక్క టీఎంసీ లెక్కన 15 టీఎంసీలు చెన్నై నగరానికి తాగునీళ్లు తీసుకునిపోయే పోతిరెడ్డిపాడును మొదలు పెట్టిందే మీరు. ఓపెన్ కెనాల్ పెట్టడం వల్లే వాళ్లు రిజర్వాయర్లు పెట్టి నీళ్లు తోడుకోవడం, ఇంత అడ్డగోలుగా నీళ్లు తీసుకెళ్లడం జరిగేది కాదు. అప్పుడు మంత్రిగా ఉన్న కేసీఆర్ ఏం చేశారు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భట్టి ధ్వజమెత్తారు. పాపం కేసీఆర్ చేసి.. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌పై నిందలా? ‘‘కృష్ణా నదిపై కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులు పాలమూరు - రంగారెడ్డి, డిండి మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకూ కొన్ని వేల కోట్లరూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటివరకూ కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా?? కొత్త ప్రాజెక్టులతో కేసీఆర్ నీళ్లు ఇవ్వకపోగా.. గత ప్రాజెక్టులు కట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో 3.4 లక్షల ఎకరాలు, ఎస్సెల్బీసీ ఎఎంఆర్ తో 3.7 లక్షల ఎకరాలు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, మొత్తం 9 లక్షల 10 వేల ఎకరాలు. వీటితో పాటు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 6 లక్షల 40 వేల ఎకరాలు15 లక్షల 50 వేల ఎకరాలకు కేసీఆర్ రాకముందే నీళ్లు ఇచ్చాయి. భావోద్వేగాలు రెచ్చ గొట్టి .. రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. తప్పంతా కేసీఆర్‌దే. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏడాది పాటు ఆగి ఇప్పుడు... మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీ.ఓ ఇచ్చిన రోజే మాట్లాడేవారు. ఏడాది వరకూ ఎందుకు మాట్లాడలేదు. పాపం మీరు చేసి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై నిందలా’’ అని భట్టి.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. చదవండి: Huzurabad: బిగ్‌ఫైట్‌కు టీఆర్ఎస్, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్ ఎందుకిలా! -
అవుకు సొరంగం పనులు కొలిక్కి..
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి మరో తార్కాణమిది. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (బలహీనమైన మట్టి పొరలు) వల్ల తవ్వలేకపోతున్నామని గత ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పుడు ఆ సొరంగాన్ని హిమాలయ పర్వతాల్లో సొరంగాల తవ్వకానికి వినియోగిస్తున్న అత్యాధునిక పోర్ ఫిల్లింగ్ టెక్నాలజీతో ప్రభుత్వం తవ్వుతోంది. ఈ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఆగస్టు నాటికి 1,038 మీటర్ల పొడవున్న సొరంగాన్ని లైనింగ్‌తో సహా పూర్తి చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి.. 2.60 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీలను తరలించి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్సార్ గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టారు. చేతులెత్తేసిన గత టీడీపీ సర్కార్ శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్ఎంసీ) నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు తరలించేలా కాలువ తవ్వే క్రమంలో అవుకు వద్ద 6 కి.మీ. పొడవున జంట సొరంగాల(ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యం)ను తవ్వాలి. ఇందులో ఒకటో సొరంగాన్ని 5.835 కి.మీ. పొడవున.. రెండో సొరంగాన్ని 4.962 కి.మీ. మేర తవ్వకం పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. మొదటి సొరంగంలో 165 మీటర్ల మేర మాత్రమే పనులు మిగిలాయి. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ఒకటో సొరంగంలో మిగిలిన 165 మీటర్ల పనులను ఫాల్ట్ జోన్ సాకు చూపి పూర్తి చేయలేక చేతులెత్తేసింది. చివరకు ఫాల్ట్ జోన్లో సొరంగం తవ్వకుండా.. పక్క నుంచి కాలువ(లూప్) తవ్వి చేతులు దులుపుకుంది. అవుకు రెండో సొరంగం పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో సొరంగం తవ్వకం పనులు వేగవంతమయ్యాయి. రెండో సొరంగంలో మిగిలిన 1,038 మీటర్లలో ఇప్పటికే 615 మీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఫాల్ట్ జోన్లో 165 మీటర్ల పనులు చేసేందుకు ‘పోర్ ఫిల్లింగ్’ను ఉపయోగిస్తున్నారు. ఇందుకు హిమాచల్ నుంచి నిపుణులను రప్పించారు. -
Kharif Crop: ఖరీఫ్‌కు రెడీ
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ పంటలకు నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గోదావరి డెల్టాకు జూన్ 15న నీటిని విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పోలవరం స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ పనులు పూర్తవడం ఆధారంగా రెం డు మూడ్రోజుల ముందే అంటే జూన్ 12నే గోదా వరి డెల్టాకు నీటి విడుదల చేసే అవకాశాలను పరి శీలిస్తున్నట్లు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా వచ్చే జలాలు, కృష్ణా వరద ప్రవాహాల ఆధారంగా కృష్ణా డెల్టా, వంశధారలో ప్రవాహాల ఆధారంగా వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. మిగతా ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద, నీటి లభ్యతను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని నీటిని విడుదల చేయనున్నారు. రెండేళ్లుగా కళకళ.. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతలు, చిన్న నీటివనరుల విభాగం కింద రాష్ట్రంలో 1.33 కోట్ల ఎకరాల ఆయకట్టు ఉంది. 2019–20, 2020–21 నీటి సంవత్సరాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో గత రెండేళ్లుగా రికార్డు స్థాయిలో ఖరీఫ్, రబీ పంటల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. అదే తరహాలో ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాల నేపథ్యంలో వరద నీటిని ఒడిసి పట్టి సమర్థవంతంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా జలవనరుల శాఖ ప్రణాళిక రచించింది. స్పిల్ వే మీదుగా వరద మళ్లింపు.. పోలవరం స్పిల్ వే మీదుగా గోదావరి వరద మళ్లింపు పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, స్పిల్ వే పనులు పూర్తవుతూనే వరదను పోలవరం స్పిల్ వే మీదుగానే దిగువకు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవుతూనే గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 11.70 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరి వరద మట్టం 14 మీటర్లు దాటాక పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించడాన్ని ప్రారంభిస్తారు. పులిచింతల్లోకి వచ్చే వరద, ప్రకాశం బ్యారేజీకి తరలించే గోదావరి జలాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలన్నది నిర్ణయం తీసుకుంటారు. వంశధారలో వరద ప్రవాహం ప్రారంభం కాగానే గొట్టా బ్యారేజీ కుడి కాలువ ద్వారా వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. నాగావళిలో వరద ప్రవాహం ఆధారంగా తోటపల్లి బ్యారేజీ కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. మిగిలిన ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద ప్రవాహం, నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. శివారు భూములకూ నీళ్లందేలా.. గత రెండేళ్ల తరహాలోనే ఆయకట్టు చివరి భూములకూ సమర్థంగా నీళ్లందించేలా జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు కాలువలకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన 807 మరమ్మతుల పనులను కడా(ఆయకట్టు ప్రాంత అభివృద్ది సంస్థ) నేతృత్వంలో రూ.104.21 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనులను జూన్ 15లోగా పూర్తి చేయాలని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు డెడ్‌లైన్ విధించారు. కాలువలోకి నీటిని విడుదల చేసేలోగా మరమ్మతు పనులు పూర్తయితే నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందన్నది అధికారుల ఉద్దేశం. తద్వారా ఆయకట్టు చివరి భూములకూ సమృద్ధిగా నీళ్లందించనున్నారు. -
సకాలంలో ప్రాజెక్టుల ఫలాలు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోగా సకాలంలో పూర్తి చేసి, వాటి ఫలాలను రైతులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రణాళికాయుతంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా అవాంతరాలు లేకుండా చూడటం ద్వారా గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై బుధవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయకపోయినా పనులు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరంతో సహా ఇతర ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే నిధులు విడుదల చేస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో జరిగిన పనులతో పోల్చితే.. ఈ 18 నెలల కాలంలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాక, మిగిలిన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. 45 రోజులు అత్యంత కీలకం ► వర్షాలు వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనులపై మరింతగా దృష్టి సారించడంలో భాగంగా కాఫర్ డ్యాంలో ఖాళీలు పూర్తి చేయడం, అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, స్పిల్ గేట్ల బిగింపు, ప్రధాన డ్యాం (ఈసీఆర్ఎఫ్ – ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) తదితర కీలక పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ► మే నెలాఖరుకు కాఫర్ డ్యాంలో ఖాళీలను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి సంబంధించిన అప్రోచ్ చానల్ పనులు వేగంగా జరుగుతున్నాయని, వాటిని కూడా మే నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ► దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. కాఫర్ డ్యాంలో ఖాళీలను పూర్తి చేయడం, అప్రోచ్ చానల్‌ను పూర్తి చేయడం అన్నది అత్యంత ఆవశ్యకమన్నారు. ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్పిల్ చానల్లో మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ► రానున్న 45 రోజులు అత్యంత కీలకమని, వర్షాలు వచ్చేలోగా ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. వర్షాలు వచ్చేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. గోదావరికి వరద వచ్చినా స్పిల్ వే మీదుగా మళ్లించి.. కాఫర్ డ్యాంల మధ్య ఈసీఆర్ఎఫ్ పనులను చేపట్టి గడువులోగా పూర్తి చేయవచ్చని చెప్పారు. జలవనరుల శాఖపై సమీక్షలో అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి ► ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టులుగా చేపట్టిన నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్–2, వెలిగొండ ప్రాజెక్టు, వంశధార – నాగావళి అనుసంధానం, వంశధార ఫేజ్–2 స్టేజ్ –2 పనులపై సీఎం వైఎస్ జగన్ లోతుగా సమీక్షించారు. ► నెల్లూరు, సంగం బ్యారేజీలు మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. అవుకు టన్నెల్–2లో కెమికల్ పోరింగ్ పనులు వేగంగా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. తద్వారా ఆగస్టు నాటికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించేలా అవుకు టన్నెళ్లను సిద్ధం చేస్తామన్నారు. ► వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–1 ఇప్పటికే పూర్తయిందని, డిసెంబర్ నాటికి రెండో టన్నెల్‌ను పూర్తి చేస్తామని వివరించారు. వెలిగొండ టన్నెల్–1 ద్వారా సెప్టెంబర్ నాటికి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ► దీనిపై సీఎం స్పందిస్తూ.. నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టండి ► వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2 పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2లో అంతర్భాగమైన నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ► నేరడి బ్యారేజీ నిర్మాణంలో ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహేంద్ర తనయ, మడ్డువలస ఫేజ్–2, తారక రామ తీర్థసాగరం తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా చేపట్టి శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ► రాయలసీమ కరువు నివారణ పథకం, పల్నాడు కరువు నివారణ పథకం కింద చేపట్టనున్న ప్రాజెక్టులను ప్రణాళికాయుతంగా పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ► ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాగు నీటి ప్రాజెక్టుల ప్రగతిపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవాంర సమీక్ష నిర్వహించారు. పోలవరంతో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రగతిపై చర్చించారు. కాఫర్ డ్యాంలో ఖాళీలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్పిల్ ఛానల్లో మట్టి, కాంక్రీట్ పనులను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. నెల్లూరు, సంగం బ్యారేజీలను మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. డిసెంబర్ నాటికి వెలిగొండ రెండో టన్నెల్ పూర్తవుతుందన్నఅధికారులు.. వంశధారలో ఫేజ్-2, స్టేజ్ -2 పనులు జులై నాటికి పూర్తి చేస్తామన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: బీళ్ల చెంతకు నీళ్లు -
నీటి పారుదలకు భారీగా నిధులు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే సాగునీటి శాఖకు మళ్లీ నిధుల వరద పారింది. ద్రవ్యలోటు కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గగా.. ఈసారి సర్కారు అధికంగా ఇచ్చింది. ప్రధాన ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టు లక్ష్యాలకు అనుగుణంగా నీటిని పారించాలన్న నిర్ణయానికి అనుగుణంగానే బడ్జెట్లో నిధులను పెంచింది. శాఖకు మొత్తంగా రూ. 16,931 కోట్లు కేటాయించగా అందులో ప్రగతి పద్దు కింద రూ. 6,424.28 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 10,506.58 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉండటంతో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు పెరిగాయి. గతేడాదికన్నా ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు రూ. 5,878 కోట్ల మేర పెరిగినప్పటికీ కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మ సాగర్, వరద కాల్వ వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాలే కీలకం కానున్నాయి. ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో... ఈసారి బడ్జెట్లో భారీ ప్రాజెక్టులకు రూ. 15,651.20 కోట్లు కేటాయించగా మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులకు రూ. 1,221 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. అయితే పలు ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో కేటాయింపుల్లేవు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు కాకుండా మార్జిన్ మనీ కింద చెల్లించేందుకు రూ.8 వేల కోట్ల మేర కోరారు. అయినా రూ. 918 కోట్లే్ల కేటాయించారు. ఇక పాలమూరు–రంగారెడ్డికి సైతం బడ్జెట్ నుంచి రూ.6 వేల కోట్లు కోరినా రూ. 960 కోట్లు, సీతారామకు రూ.689 కోట్లు, డిండికి రూ.545 కోట్ల మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సైతం రూ. వెయ్యి కోట్లు కోరగా రూ. 50 కోట్లు కేటాయించారు. అన్నింటికన్నా ముఖ్యంగా పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ. 1,500 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా రూ. 400కోట్ల మేర కేటాయింపులు చేశారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తయి చెక్‌డ్యామ్‌ల నిర్మాణమే చేపడుతుండటంతో మైనర్ ఇరిగేషన్‌కు కోతపడింది. ఈ ఏడాది రూ. 1,196 కోట్లే సర్దారు. మళ్లీ రుణాలే.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రాజెక్టుల పనులు గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదు. జూన్, జూలై నాటికే కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ సహా గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనికితోడు పాలమూరు–రంగారెడ్డిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉద్దండాపూర్ వరకు కనీసం ఒక టీఎంసీ నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలతోనే కనీసం రూ. 15 వేల కోట్ల మేర ఖర్చు చేసి ఈ రెండు ప్రాజెక్టులను గట్టెక్కించేలా ప్రణాళికలు వేశారు. ఇక సీతారామ ఎత్తిపోతలలో సత్తుపల్లి ట్రంక్ కింద కనీసం లక్ష ఎకరాలు పారించాలని గతంలోనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. దేవాదులను ఈ సీజన్లో 100 శాతం పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పనుల పూర్తికి కనీసం రూ. 12 వేల కోట్ల నుంచి రూ. 15 వేల కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. ఈ మేర ఖర్చు కోసం ప్రభుత్వం మళ్లీ రుణాలపైనే ఆధారపడాల్సి రానుంది. సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి మరో కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా రూ. 17 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతించారు. మిగిలిన నిధులతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ. 20 వేల కోట్లకుపైగా రుణాలతోనే ప్రాజెక్టులను గట్టెక్కించే అవకాశాలున్నాయి. ‘కాళేశ్వరం’ నిర్వహణకే రూ. 7 వేల కోట్లు... బడ్జెట్లో నిర్వహణ పద్దుకు కేటాయింపులు భారీగా పెంచారు. గతేడాది తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.10,506.58 కోట్లకు పెంచారు. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల తిరిగి చెల్లింపులకు నిర్వహణ పద్దు కింద రూ. 5,219 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 7 వేల కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 91 వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు జరగ్గా అందులో రూ. 76 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ మొత్తంలోంచే రూ. 44 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 32 వేల కోట్లు లభ్యతగా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కార్పొరేషన్ రుణాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. చీఫ్ ఇంజనీర్ డివిజన్లవారీగా ప్రగతి పద్దు కింద కేటాయింపులు (రూ. కోట్లలో) విజన్ కేటాయింపు రామగుండం 100 గజ్వేల్ 930 కరీంనగర్ 100 ఆదిలాబాద్ 255 నిజామాబాద్ 54 వరంగల్ 85 సంగారెడ్డి 20 నల్లగొండ 959.89 మహబూబ్‌నగర్ 25 ఖమ్మం 5 మంచిర్యాల 100 కామారెడ్డి 100 జగిత్యాల 50 ములుగు 50 సూర్యాపేట 40.30 వనపర్తి 312 నాగర్ కర్నూల్ 1,035 కొత్తగూడెం 700 హైదరాబాద్ – ప్రధాన ప్రాజెక్టుల కింది కేటాయింపులు ఇలా (రూ. కోట్లలో) ప్రాజెక్టు కేటాయింపు కాళేశ్వరం 918 పాలమూరు–రంగారెడ్డి 960 సీతారామ 689.48 డిండి 545.42 ఎస్ఎల్బీసీ 331.41 కల్వకుర్తి 75 నెట్టెంపాడు 192.75 భీమా 57 దేవాదుల 49.90 ఎల్లంపల్లి 99.88 లోయర్ పెన్‌గంగ 199.50 మిషన్ కాకతీయ 750 -
సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో పూర్తిచేయడం ద్వారా వాటి ఫలాలను రైతులకు అందించాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో తొలివిడత కింద చేపట్టిన పోలవరం, వెలిగొండ, నెల్లూరు, సంగం బ్యారేజీలు, అవుకు సొరంగం (టన్నెల్), వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం పనులను గడువులోగా పూర్తిచేయాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ ఛానల్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేయాలని.. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్ డ్యామ్వల్ల నిర్వాసితులు ఎవరూ ముంపు బారిన పడకుండా వారికి పునరావాసం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ల అనుమతుల కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. రెండో విడత ప్రాధాన్యత కింద చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘంగా సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షిస్తున్న సీఎం జగన్ గడువులోగా పోలవరం పూర్తిచేయాల్సిందే.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్చూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని.. అందువల్ల దీనిని నిర్దేశించుకున్న గడవులోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ.. ఫిబ్రవరి 10 నాటికి స్పిల్ వే బ్రిడ్జి పూర్తిచేస్తామని.. స్పిల్ ఛానల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఏప్రిల్ నాటికి స్పిల్ వేకు 48 రేడియల్ గేట్లను అమర్చుతామని.. అప్రోచ్ ఛానల్‌ను మే నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. అలాగే, ఎగువ కాఫర్ డ్యాంలో రీచ్–1ను మార్చి నెలాఖరుకు, రీచ్–2ను ఏప్రిల్ నెలాఖరుకు, రీచ్–3ను మే నెలాఖరుకు, రీచ్–4ను మార్చికల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా కాఫర్ డ్యాం పనులు పూర్తవుతాయని.. స్పిల్ వే మీదుగా గోదావరి వరదను మళ్లించి.. కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)ను నిర్విఘ్నంగా చేపట్టడం ద్వారా గడవులోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ప్రత్యేకాధికారిని నియమించండి కాగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకుండా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. డిజైన్ల అనుమతుల కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. రేడియల్ గేట్లకు అమర్చే హైడ్రాలిక్ సిలిండర్లలో మిగిలిన వాటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం కాకుండా చూసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్ డ్యాం కారణంగా నిర్వాసితులు ఎవరూ ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని.. గోదావరికి వరద వచ్చేలోగా ప్రాధాన్యత క్రమంలో నిర్దేశించకున్న ప్రణాళిక ప్రకారం సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. శరవేగంగా పెన్నాపై జంట బ్యారేజీలు పెన్నా నదిపై నిర్మిస్తున్న నెల్లూరు, సంగం బ్యారేజీల పనులను కూడా గడువులోగా పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు బ్యారేజీలో సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మార్చి 31లోగా గేట్లను బిగించే పనులు పూర్తవుతాయని.. ఏప్రిల్‌లో బ్యారేజీ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే, సంగం బ్యారేజీలో రెండు వారాల్లో గేట్లను బిగించే పనులను ప్రారంభిస్తామని.. మార్చి ఆఖరుకు పూర్తిచేసి దీనిని కూడా ఏప్రిల్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని అధికారులు వివరించారు. వేగంగా అవుకు టన్నెల్ పనులు.. గాలేరు–నగరి సుజల స్రవంతిలో ఇప్పటికే రెండు టన్నెల్స్ నుంచి దాదాపు 14వేల క్యూసెక్కుల వరకూ నీటిని సరఫరా చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. వర్షాలు, లూజ్ సాయిల్వల్ల అవుకు రెండో టన్నెల్లో 134 మీటర్ల తవ్వకం పనులు సంక్లిష్టంగా మారాయని.. సొరంగంలో విరిగిపడ్డ మట్టిని తొలగించే పనులు, పటిష్టం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశామని అధికారులు వివరించారు. జూలై నాటికి రెండో టన్నెల్ పనులు పూర్తిచేస్తామని.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను సరఫరా చేస్తామని చెప్పారు. సకాలంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి.. ఇక వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–1 తవ్వకం పనులపై అధికారులు మాట్లాడుతూ.. అవి పూర్తయ్యాయని.. లైనింగ్ పనులు చేస్తున్నామని సీఎంకు వివరించారు. టన్నెల్–1 హెడ్ రెగ్యులేటర్ పనులూ పూర్తిచేశామన్నారు. టన్నెల్–2 హెడ్ రెగ్యులేటర్ పనులను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించి.. మూడున్నర నెలల్లో పూర్తిచేస్తామన్నారు. వీటిని ఆగస్టుకల్లా పూర్తిచేసేందుకు ప్రయస్తున్నామని చెప్పారు. ఈ రెండు టన్నెళ్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేస్తామన్నారు. నల్లమలసాగర్ నిర్వాసితులకు అక్టోబర్ నాటికి పునరావాసం కల్పించే పనులను పూర్తిచేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఆయకట్టుకు నీళ్లందించే కాలువల తవ్వకం పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. వేగంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులు.. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల అంశం చర్చకు రాగా.. వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశలోని మూడు ప్యాకేజీల్లో మిగిలిన పనులను జూలై నాటికి పూర్తిచేసి.. ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. వంశధార–నాగావళి అనుసంధానం పనులను జూన్‌కల్లా పూర్తిచేస్తామన్నారు. – అలాగే, తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ బ్యారేజీలో మిగిలిన పనులను 2022, జూన్ నాటికి పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద 15 వేల ఎకరాలకు 2022, జూన్ నాటికి నీళ్లందించేలా పనులను పూర్తిచేస్తామని చెప్పారు. తారాకరామ తీర్థసాగరం పనుల్లో న్యాయపరమైన వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుని.. డిసెంబర్, 2022 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వారు వివరించారు. మహేంద్రతనయ ప్రాజెక్టును జూన్, 2022 నాటికి పూర్తిచేసే దిశగా పనులను వేగవంతం చేశామన్నారు. – ఇదిలా ఉంటే.. రెండో దశ ప్రాధాన్యత కింద చేపట్టే ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వాటితోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కూడా కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ఐదు ఎస్పీవీలపై ప్రత్యేక దృష్టి మరోవైపు.. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టులు, కృష్ణా–కొల్లేరు సెలైనటీ మిటిగేషన్ ప్రాజెక్టులు, ఏపీ స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి సంబంధించి ఏర్పాటుచేసిన ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్)లపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలపైనా సీఎం జగన్ సమీక్షించారు. వీటికి నిధుల సమీకరణపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. రాయలసీమ, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు రుణం ఇచ్చేందుకు వివిధ ఆర్థిక సంస్థలు సూత్రప్రాయంగా అంగీకరించాయని చెప్పారు. మిగిలిన ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టామన్నారు. వరికిపూడిశెల ఎత్తిపోతల పనులు వేగంగా చేస్తున్నామని అధికారులు వివరించారు. -
కృష్ణా బోర్డే సుప్రీం
సాక్షి, అమరావతి: నీటి పంపిణీ వివాదాలకు తెర దించేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని ఖరారు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. బోర్డు పరిధిపై కృష్ణా బోర్డు పంపిన ముసాయిదాపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ ముసాయిదాను ఆమోదించడం ఇక లాంఛనమే. జనవరి మొదటి వారంలో కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ.. పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు సరపడా ఉన్నా.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుండటమే అందుకు నిదర్శనం. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడంతో బోర్డు కేటాయింపులు ఉన్నా సరే రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటోంది. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో ఇదే అంశాన్ని ఎత్తిచూపిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. ♦ కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార న్యాయస్థానం) –2 తీర్పును నోటిఫై చేసే వరకు బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వాదనను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి తోసిపుచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌కు ఉన్న విచక్షణాధికారాలతో బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని స్పష్టం చేశారు. ♦ కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకు 2015లో కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులు చేస్తామని తేలి్చచెప్పారు. (కేంద్రం కోర్టులోకి ‘నియంత్రణ’) కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు తుంగభద్ర నదిపై.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హెచ్చెల్సీ తుమ్మిళ్ల ఎత్తిపోతల ఎల్లెల్సీ - కేసీ కెనాల్ ఆర్డీఎస్ కృష్ణా నదిపై.. జూరాల ప్రాజెక్టు: తెలంగాణ 1.జూరాల ప్రాజెక్టు, జలవిద్యుత్కేంద్రం 2.జూరాల కుడి కాలువ, ఎడమ కాలువ 3.భీమా ఎత్తిపోతల 4.నెట్టెంపాడు ఎత్తిపోతల 5.కోయిల్‌సాగర్ ఎత్తిపోతల శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, (తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి) 1.కల్వకుర్తి ఎత్తిపోతల 2.కుడి విద్యుత్కేంద్రం 2.ఎడమ విద్యుత్కేంద్రం 3.హంద్రీ–నీవా (మల్యాల) 3.పాలమూరు–రంగారెడ్డి, డిండి 4.హంద్రీ–నీవా (ముచ్చుమర్రి) 4.ఎస్సెల్బీసీ 5.వెలిగొండ - నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ 1.సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2.జలవిద్యుత్కేంద్రం 3.ఏఎమ్మార్పీ 4.ఎఫ్ఎఫ్సీ 5.హైదరాబాద్ తాగునీటి పథకం పులిచింతల ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.పులిచింతల ప్రాజెక్టు స్పిల్ వే 1.జలవిద్యుత్కేంద్రం ప్రకాశం బ్యారేజీ 1.కృష్ణా డెల్టా కాలువలు చిన్న నీటి వనరుల విభాగం: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.భైరవానితిప్ప ప్రాజెక్టు 1.సీతారామభక్త ఎత్తిపోతల 2.గాజులదిన్నె ప్రాజెక్టు 2.డిండి ప్రాజెక్టు 3.మూసీ ప్రాజెక్టు 4.పాలేరు ప్రాజెక్టు.. తదితర చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు.. ► కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 23న బోర్డు పరిధిపై ముసాయిదాను కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం కేంద్రానికి పంపారు. దిగువ కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తోపాటు జూరాల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలను బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. ► ఈ ప్రాజెక్టుల స్పిల్ వే లతోపాటు జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు బోర్డు పరిధిలోకి తేవాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులైన భైరవానితిప్ప, గాజులదిన్నె, డిండి, మూసీ, పాలేరు ప్రాజెక్టులు, సీతారామభక్త ఎత్తిపోతల పథకాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ ముసాయిదాపై ఇప్పటికే కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోద ముద్ర వేశారు. ఇక ఆ శాఖ మంత్రి ఆమోద ముద్ర వేయగానే బోర్డు పరిధిని కేంద్రం నోటిఫై చేయనుంది. ► ఈ ప్రాజెక్టుల వద్ద పనిచేసే ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డు పరిధిలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నీటి లభ్యతను బట్టి.. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమై వివాదాలకు తావు లేకుండా ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తుంది. () -
గజేంద్ర సింగ్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు గంటకుపైగా కొనసాగింది. కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి మూడురోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. శనివారం పౌరవిమానయాన, హౌసింగ్‌శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
ప్రాజెక్టులకు ప్రాధాన్యం
గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. రూ.803.96 కోట్ల వ్యయంతో అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పనులు చేపట్టే విధంగా గత ప్రభుత్వ హయాంలో 2018 జనవరి 24వ తేదీన జీఓ జారీ చేసినా పనులు మాత్రం జరగలేదు. మన ప్రభుత్వం అదే సొమ్ముతోనే అదనంగా రెండు రిజర్వాయర్లను నిర్మించి, అదనంగా మరో 3.3 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో ఏరకంగా లంచాలు కట్టడి చేస్తున్నామో చెప్పడానికి ఇదే నిదర్శనం. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) పథకంలో భాగంగా 3 జలాశయాల నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దీంతో రాయలసీమలో దాదాపు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. హంద్రీ–నీవాలో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 5.40 టిఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్నా జలాశయానికి సంబంధించిన ప్రధాన కాలువ, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి జలాశయాలు నిర్మిస్తాం. తద్వారా 75 వేల ఎకరాలకు సాగునీటితో పాటు, పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. సాక్షి, అమరావతి: సాగునీటి వసతి కల్పన ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగు పడి, పేదరిక నిర్మూలనకు దోహద పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతులు, రైతు కూలీల జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే కాకుండా.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అందుకే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులో భాగంగా మూడు జలాశయాల నిర్మాణానికి అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి వద్ద వర్చువల్ విధానంలో బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ హంద్రీ–నీవాలో అంతర్భాగంగా మూడు జలాశయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం ఎన్నికలప్పుడు నామ్ కే వాస్తేగా చేపట్టామంటే.. చేపట్టామన్నట్లు చేసి, ఆ తర్వాత వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు ఆ పథకం పనులు మొదలు పెట్టడమే కాకుండా.. వాటి సామర్థ్యం పెంచి అదనంగా మరో రెండు రిజర్వాయర్ల పనులు కూడా చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎన్నికలప్పుడు ఇదే రాప్తాడు నియోజకవర్గం మీదుగా నేను పోతున్నప్పుడు ఆ రోజు ప్రజలందరూ చూపిన ఆ ప్రేమ, అభిమానం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు అడుగు ముందుకు వేస్తున్నాను. వర్చువల్ విధానంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి అనిల్ 75 వేల ఎకరాలు సస్యశ్యామలం ► అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల ద్వారా జీడిపల్లి జలాశయం నుంచి 90 రోజుల్లో 7.216 టీఎంసీలను తరలించి.. అప్పర్ పెన్నార్‌తోపాటు కొత్తగా నిర్మించే సోమరవాండ్లపల్లి, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ జలాశయాలను నింపుతాం. బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించి, సస్యశ్యామలం చేస్తాం. ► ఈ ప్రాజెక్ట్ కోసం 5,171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు 53.45 కి.మీ. ప్రధాన కాలువ, అందులో భాగంగా 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్ కట్టడాలను నిర్మిస్తాం. ► కొత్తపల్లి, ఆత్మకూరు, బాల వెంకటాపురం, మద్దలచెరువు వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపడతాం. ప్రస్తుతం 1.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న అప్పర్ పెన్నార్ జలాశయానికి అదనంగా ముట్టాల జలాశయాన్ని 2.024 టీఎంసీలు, తోపుదుర్తి జలాశయాన్ని 0.992 టీఎంసీలు, దేవరకొండ జలాశయాన్ని 0.89 టీఎంసీలు, సోమరవాండ్లపల్లి జలాశయాన్ని 1.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నాం. ► అప్పర్ పెన్నార్ జలాశయం ద్వారా 10 వేల ఎకరాలు, ముట్టాల జలాశయం ద్వారా 18,700 ఎకరాలు, తోపుదుర్తి జలాశయం ద్వారా 18 వేల ఎకరాలు, దేవరకొండ జలాశయం ద్వారా 19,500 ఎకరాలు, సోమరవాండ్లపల్లి జలాశయం ద్వారా 8,800 ఎకరాలకు నీరు అందుతుంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రతిపాదన మేరకు ఈ ప్రాజెక్టుకు డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా పేరు పెడుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులిచ్చింది. అనంతపురం పరిస్థితుల్లో మార్పు దేవుడి దయతో కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో పరిస్థితులు మారుతున్నాయి. జలాశయాలన్నీ నీటితో నిండాయి. మీ అందరి చల్లని దీవెనలతో మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలూ అమలు చేస్తున్నాం. ఆసరా, చేయూత, అమ్మఒడి, రైతు భరోసా, విలేజ్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు.. ఇలా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రజాభ్యుదయమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తాడేపల్లి నుంచి మంత్రి అనిల్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వెంకటంపల్లి పైలాన్ వద్ద కార్యక్రమంలో మంత్రులు బొత్స, అప్పలరాజు, శంకర నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్‌రెడ్డి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. -
బీళ్ల చెంతకు నీళ్లు
సాక్షి, అమరావతి: బీడు భూముల్లోనూ నీరు పారించి.. రైతన్నల ఇంట సిరులు పండించేలా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికతో వడివడి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 42 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో 2024 నాటికి పూర్తి చేసేలా మున్ముందుకు వెళుతోంది. ఇందుకు రూ.20,264 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. వీటిని పూర్తి చేయడం ద్వారా కొత్తగా 24,82,071 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. వీటిని పూర్తి చేయడం ద్వారా 25,54,285 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి.. మొత్తమ్మీద 50,36,356 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సీజన్లోనే 6 ప్రాజెక్టుల్ని పూర్తి చేసేలా.. గాలేరు-నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం, వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార ప్రాజెక్టు స్టేజ్-2 ఫేజ్-2, వంశధార-నాగావళి నదుల అనుసంధానం పనులను ఈ సీజన్లోనే పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లందించడం ద్వారా కరువన్నదే లేని ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కార్యక్రమం చేపట్టారు. సుమారు రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. అందులో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. దానికయ్యే వ్యయాన్ని భరిస్తామని హామీ ఇచ్చింది. దీనిని 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘జలయజ్ఞం’ కింద చేపట్టిన మిగిలిన 42 ప్రాజెక్టులనూ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించింది. మూడు విభాగాలుగా.. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధుల సమీకరణ, సాగులోకి వచ్చే ఆయకట్టు ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను మూడు విభాగాలుగా జల వనరుల శాఖ వర్గీకరించింది. కొత్తగా లక్ష ఎకరాలు సాగులోకి వచ్చే, రూ.500 కోట్లలోపు వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద గుర్తించింది. రూ.500 కోట్ల కంటే ఎక్కువ వ్యయం చేయాల్సిన ప్రాజెక్టులు, కొత్తగా లక్ష కంటే ఎక్కువ ఎకరాలు సాగులోకి వచ్చే వాటిని రెండో ప్రాధాన్యతగా గుర్తించింది. ఈ రెండు విభాగాల కిందకు రాని ప్రాజెక్టులను మూడో ప్రాధాన్యత కింద వర్గీకరించింది. ఈ మూడు విభాగాల్లోని ప్రాజెక్టుల పనులను సమాంతరంగా చేస్తూ.. 2024లోగా అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా రూపొందించిన ప్రణాళికకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోద ముద్ర వేశారు. పకడ్బందీగా ప్రణాళికతో.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరిగితే అంచనా వ్యయం పెరగడంతోపాటు.. వాటి ఫలాలను రైతులకు అందించడం ఆలస్యమవుతుందని భావించిన ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేయడానికి రూపొందించిన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తోంది. మొదటి ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో ఆరింటిని వచ్చే మార్చిలోగా పూర్తి చేసే లక్ష్యంతో ఉంది. మరోవైపు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2022 నాటికి పూర్తి చేసేలా పనులను వేగవంతం చేసింది. ద్వితీయ ప్రాధాన్యం కింద చేపట్టిన సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్, ముసురుమిల్లి, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ తదితర ప్రాజెక్టులను 2022 నాటికి పూర్తి చేయనుంది. తృతీయ ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో హెచ్చెల్సీ ఆధునికీకరణ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాలను 2024 నాటికి సమగ్రంగా పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. 2024 నాటికి జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద చేపట్టి, నిర్మాణంలో ఉన్న 42 ప్రాజెక్టులనూ ప్రాధాన్యత క్రమంలో 2024 నాటికి పూర్తి చేస్తాం. జలయజ్ఞ ఫలాలను రైతులకు పూర్తి స్థాయిలో అందించి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం. - డాక్టర్, పి.అనిల్‌కుమార్ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి 50 లక్షల ఎకరాలు సస్యశ్యామలం: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే 50.36 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. వీటిని 2024 నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ దిశగా పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తున్నాం. - ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జల వనరుల శాఖ 42 ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక ఇదీ.. ప్రాధాన్యత విభాగం ప్రాజెక్టుల సంఖ్య పూర్తి చేసేందుకు అయ్యే నిధులు (రూ.కోట్లలో) కొత్త ఆయకట్టు స్థిరీకరణ అయ్యే ఆయకట్టు (ఎకరాలు) మొదటి 19 15,005 22,77,039 8,82,214 ద్వితీయ 9 1,104 1,35,547 1,43,722 తృతీయ 14 4,155 69,485 15,28,349 మొత్తం 42 20,264 24,82,071 25,54,285 -
మే నాటికి పనులు పూర్తవ్వాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ -2 పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతి అంశంపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. నీటి పారుదలా శాఖా మంత్రి అనిల్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మే నాటికి పనులు పూర్తవ్వాలి సమీక్షా సమావేశంలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే నాటికి పూర్తి చేయాలని, అంతకు ముందే కాఫర్ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. అంతేగాకుండా పోలవరం నుంచి విశాఖపట్నం తాగు నీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు కోసం కూడా ఆలోచన చేయాలని నిర్దేశించారు. అదే విధంగా, ఎటువంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని, తద్వారా పవర్ వినియోగం లేకుండా చేసే అవకాశాలనూ చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పుడు కూడా బ్యాక్ వాటర్ (అప్లెక్స్ లెవల్)తో ఎక్కడా ఏ సమస్యలు తలెత్తకుండా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం జగన్ అదేశించారు. (చదవండి: మోదీ, షాలకు సీఎం జగన్ కృతజ్ఞతలు) పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులోని మొదటి సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండో సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి రెండు టన్నెల్స్‌లో నీళ్లిచ్చే కార్యక్రమం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ వారిని ఆదేశించారు. అవుకు టన్నెల్-2 అవుకు టన్నెల్-2 పనుల్లో ఫాల్ట్ జోన్లో మిగిలిన 137 మీటర్లు సొరంగం పనిని మార్చి నాటికి పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మొత్తంగా 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అదే విధంగా, అవుకు మూడో టన్నెల్‌కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని అధికారులు వివరించగా... సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఉద్దేశించిన ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) రిజిస్ట్రేషన్ పూర్తైందని తెలిపిన అధికారులు అందుకు సంబంధించిన లోగోను చూపారు. ఇందుకు అంగీకారం తెలిపిన సీఎం జగన్... ఈ మేరకు ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. మరోవైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరులో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీటిని నింపి.. రైతులకు నీరు విడుదల చేసిన విషయాన్ని తెలపగా... ఇప్పటికైనా పూర్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు నింపగలిగామని అన్నారు. అదే విధంగా గండికోటలో కూడా ప్రస్తుత నీటి నిల్వ 18 టీఎంసీలు.. గతంలో కంటే అధిక స్ధాయిలో నిల్వచేయగలిగామని అధికారులు తెలపగా... 20 టీఎంసీల వరకు నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు. -
మెట్ట రైతు మేలు కోసం
-
3 రాజధానులతో మూడు ప్రాంతాలకు సమన్యాయం
మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు నీరు, తాగునీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40 వేలకోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నాం. పల్నాడులో కరువు నివారణ కోసం వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు, చింతలపూడి ఎత్తి పోతలను శర వేగంగా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రకు నీటి పరంగా న్యాయం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేసేలా రూ.15 వేల కోట్లతో ప్రాజెక్టును చేపట్టాం. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.3,500 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులతోపాటు మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, వ్యవసాయం విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. సోమశిల ప్రాజెక్టు హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పెన్నా నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. మొత్తంగా మెట్ట ప్రాంతాలైన దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుందని చెప్పారు. ఇందుకోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా కంపసముద్రం, గుండెమడకల రిజర్వాయర్ల నిర్మాణం, క్రాస్ మిషనరీ (సీఎం), క్రాస్ డ్రైనేజీ (సీడీ) పనుల ద్వారా 18.5 కి.మీ గ్రావిటీ కాల్వల నిర్మాణం, పంపింగ్ స్టేషన్, రెండు ఎలక్ట్రో ప్రెషర్ మెయిన్లు.. వీటన్నింటిని నిర్మించబోతున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఇదే ప్రాజెక్టుకు సంబంధించి రూ.527.53 కోట్లతో ఎన్నికల ముందు హడావిడిగా పనులు మొదలు పెట్టినా ఏదీ జరగలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా వ్యయాన్ని రూ.459 కోట్లకు తగ్గించామని చెప్పారు. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.68 కోట్లు ఆదా అయిందని, అవినీతికి చెక్ పెట్టామని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సోమశిల హై లెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కండలేరు, రాళ్లపాడు జలాశయాలను వేగంగా నింపేలా చర్యలు ► నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. వాటి పనులు నత్తనడకన జరుగుతుంటే, పరిస్థితి మార్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. దేవుడి దయతో పనులు పూర్తవుతున్నాయి. ► పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి, కండలేరు జలాశయాన్ని వేగంగా నింపడానికి సోమశిల–కండలేరు కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు పెంచేలా అభివృద్ధి (డబ్లింగ్ వర్క్స్) పనులను రూ.918 కోట్ల వ్యయంతో చేపడతాం. ► రాళ్లపాడు జలాశయాన్ని వేగంగా నింపడానికి సోమశిల–రాళ్లపాడు కాలువ సామర్థ్యాన్ని 720 క్యూసెక్కుల నుంచి 1,440 క్యూసెక్కులకు పెంచుతూ అభివృద్ధి చేసే పనులను రూ.632 కోట్ల వ్యయంతో చేపట్టనున్నాం. ► కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆ శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. పైలాన్ వద్ద మంత్రులు అనిల్, మేకపాటి గౌతమ్రెడ్ది తదితరులు హాజరయ్యారు. ఈ ఏడాదే ఆరు ప్రాజెక్టులు పూర్తి ► జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. 2022 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించే విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ► వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ తొలి దశ, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను ఈ ఏడాదే పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. -
ప్రాజెక్టుల పురోగతిపై నిజాలకు నీళ్లు
ఎల్లోవైరస్ కమ్మేసిన కళ్లకు ఇంతకన్నా ఏం కనిపిస్తుంది? ఎందుకంటే వీళ్లకు చంద్రబాబైతే ఓకే!. చంద్రబాబు మాత్రమే ఓకే!!. ఆయన నిద్రపోతున్నా రామోజీ కళ్లకు రన్నింగ్ చేస్తున్నట్లే కనిపిస్తాడు. అదంతే!!. టీడీపీ సర్కారు హయాంలో వెలిగొండ ప్రాజెక్టు సొరంగాన్ని సగటున రోజుకు ఒకే ఒక్క అడుగు తవ్వారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సొరంగం పనులను చూస్తే సగటున రోజుకు 7 మీటర్లు తవ్వుతున్నారు. కానీ ‘ఈనాడు’ కళ్లకు ఏనాడూ ఇది కనిపించదు. అధికారంలో ఉన్నది బాబు కాదు కనుక ఇప్పుడు పనులు అత్యంత నెమ్మదిగా సాగుతున్నాయని రాసేస్తారు. ఇక సంగం బ్యారేజీ దిగువన పెన్నాపై కొత్త బ్యారేజీ నిర్మాణాన్ని 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టారు. సింహభాగం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. చంద్రబాబు హయాంలో పనులు కదిలితే ఒట్టు. అదనపు బిల్లుల రూపంలో కాంట్రాక్టు సంస్థకు రూ.70 కోట్లు చెల్లించేసి మరో 20 కోట్లు బాకీ పెట్టారు తప్ప పనులైతే కదల్లేదు. వైఎస్ జగన్ హయాంలో పనులు ఊపందుకుని 82.26 శాతం పూర్తయ్యాయి. మిగతావి వేగంగా పూర్తిచేసి త్వరలో బ్యారేజీని ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. ఇవేవీ రామోజీ కళ్లకు కనిపించవు. నీళ్లొదిలేశారు కనక నిజాలతో వీళ్లకు పనిలేకపోవచ్చు. కానీ నిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ సవివర కథనం... 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో కేవలం 600 మీటర్ల పనులు మాత్రమే చేశారు. అంటే రోజుకు సగటున 0.32 మీటర్ల మేర.. అంటే ఒక అడుగు మాత్రమే పనులు జరిగాయి. 2019 నవంబర్ నుంచి 2020 అక్టోబర్ 30 వరకు 2,512 మీటర్ల పనులు చేశారు. అంటే.. రోజుకు సగటున ఏడు మీటర్ల చొప్పున సొరంగం తవ్వారు. మార్చి నుంచి జూలై వరకూ లాక్డౌన్ కొనసాగింది. జూన్ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిశాయి. ఇన్ని అడ్డంకుల్లోనూ రోజుకు సగటున ఏడు మీటర్ల చొప్పున సొరంగం తవ్వారు. సాక్షి, అమరావతి: కడలిలో కలుస్తున్న నదీ జలాలను ఒడిసి పట్టి.. బంజరు భూములకు మళ్లించి.. కరువన్నదే ఎరుగని నేలగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి రచించిన ప్రణాళికను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడం ద్వారా వాటి ఫలాలను రైతులకు అందించడానికి చర్యలు చేపట్టారు. ఈ సీజన్లో గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం–2, వెలిగొండ తొలి దశ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార ఫేజ్–2, స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా మార్చి 23 నుంచి లాక్ డౌన్ విధించడంతో కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. జూన్ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వరదలు వస్తున్నాయి. అయినప్పటికీ షెడ్యూలు ప్రకారమే పనులు సాగుతుండటం గమనార్హం. ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయకుండానే రూ.68,293.94 కోట్ల వ్యయం ► 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులు, నీరు–చెట్టు పథకాల కింద రూ.68,293.94 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేకపోయింది. ► జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63(పరిమాణాల ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్లకు అదనపు నిధులను దోచిపెట్టారు. తద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు దండుకున్నారు. ► మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. వాటిని తన ఖాతాలో వేసుకునే దుస్సాహసానికి టీడీపీ సర్కార్ పాల్పడింది. అప్పట్లో సింహభాగం పూర్తయిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడంలోనూ టీడీపీ సర్కార్ విఫలమైంది. కానీ ఈ వైఫల్యాలు అప్పట్లో ‘ఈనాడు’కు కన్పించకపోవడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. 17 నెలల్లో రూ.8,090.4 కోట్లు వ్యయం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రాధాన్యత ప్రాజెక్టులకు రూ.8,090.4 కోట్లు ఖర్చు చేసింది. మొదటి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యత ప్రాజెక్టులను వరుసగా మూడేళ్లలో పూర్తి చేయడం ద్వారా బంజరు భూములను సస్యశ్యామలం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పోలవరం పనులు చకచకా ఐదు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా 2005లో అప్పటి సీఎం వైఎస్సార్ అడుగులు ముందుకు వేశారు. కుడి, ఎడమ కాలువ పనులు సింహభాగం పూర్తి చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, తామే పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే కమీషన్ల కోసం చంద్రబాబు ఈ ప్రాజెక్టును నిరీ్వర్యం చేశారు. నిర్మాణ బాధ్యతను తీసుకుని.. జలాశయం పనుల్లో స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించి, మధ్యలో వదిలేసి గ్రామాలను గోదావరి వరద ముంపునకు గురిచేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలన్నింటినీ ప్రక్షాళన చేసి రూ.838 కోట్లు ఆదా చేసింది. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా సీఎం జగన్ కార్యాచరణ రూపొందించి, పనులను పరుగెత్తిస్తున్నారు. వరద ఉధృతిలోనూ 24 గంటలూ స్పిల్ వే పనులు జరుగుతున్నాయి. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు, వాటి మధ్య ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు, కాలువలను జలాశయానికి అనుసంధానించే కనెక్టివిటీ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వంశధార–నాగావళి అనుసంధానం ► శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం వద్ద నాగావళి నదిపై 1959లో ఆనకట్ట నిర్మించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కుడి కాలువ కింద 18,362, ఎడమ కాలువ కింద 18,691 ఎకరాల ఆయకట్టు ఉంది. వంశధారలో జూన్ నుంచే వరద ప్రారంభమైతే.. నాగావళి నదిలో వరద ఆలస్యంగా ప్రారంభమవుతుంది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీళ్లందించలేని పరిస్థితి. ► వంశధార రెండో దశలో హిరమండలం రిజర్వాయర్ నుంచి 33.583 కి.మీ పొడవున తవ్వే హైలెవల్ కెనాల్ ద్వారా రోజుకు 600 క్యూసెక్కుల వంశధార జలాలను తరలించి.. నారాయణపురం ఆనకట్ట జలవిస్తరణ ప్రాంతం వద్ద నాగావళిలోకి తరలించడం ద్వారా నారాయణపురం ఆనకట్ట ఆయకట్టులో ఖరీఫ్ పంటలకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. నారాయణపురం ఆనకట్ట కింద 37,053 ఎకరాలను స్థిరీకరించనున్నారు. హైలెవల్ కెనాల్ తవ్వకం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్‌లోగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అవుకు సొరంగం ► గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను గండికోట జలాశయానికి తరలించాలి. కాలువలో అవుకు జలాశయానికి ముందు పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 5.75 కి.మీల పొడవున రెండు సొరంగాలు(టన్నెల్స్) తవ్వాలి. కుడి సొరంగంలో ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు) అడ్డు రావడంతో ప్రత్యామ్నాయంగా రెండు మళ్లింపు సొరంగాలు తవ్వి పది వేల క్యూసెక్కులను మాత్రమే తరలించేలా పనులు చేపట్టారు. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కుడి సొరంగంలో 165 మీటర్ల మేర ఏర్పడిన ఫాల్ట్ జోన్‌ను, ఎడమ సొరంగాన్ని పూర్తి చేసి.. 20 వేల క్యూసెక్కులు తరలించేలా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. ► 22 మీటర్ల పని పూర్తయ్యింది. ఆ తర్వాత వర్షాలతో మట్టి పెళ్లలు ఊడిపడటంతో పనులకు సాంకేతిక సమస్య ఏర్పడింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కెమికల్ గ్రౌటింగ్ ద్వారా పైకప్పును స్థిరీకరించి.. పైపులను అమర్చి లైనింగ్ చేసే పనులు చేపట్టారు. నిపుణులైన కార్మికులను రప్పించి.. 143 మీటర్ల మేర గ్రౌటింగ్ పనులను వేగవంతం చేశారు. వెలిగొండ ► శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద జలాల్లో 43.50 టీఎంసీలను తరలించి.. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాళెం, దర్శి, కొండెపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84 వేల ఎకరాలు, వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించడం.. 15.25 లక్షల మంది దాహార్తి తీర్చేందుకు వెలిగొండ ప్రాజెక్టును 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ చేపట్టారు. ► ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయాన్ని అనుసంధానం చేసేలా 18.820 కి.మీల పొడవున ఒకటి.. 18.838 కి.మీల పొడవున మరో సొరంగం తవ్వాలి. వైఎస్సార్ హయాంలో మొదటి సొరంగంలో 15.2 కి.మీ మేర పనులు, రెండో సొరంగంలో 10.75 కి.మీ పనులు పూర్తయ్యాయి. ► టీడీపీ సర్కార్ హయాంలో మొదటి టన్నెల్లో 600 మీటర్లు.. రెండో సొరంగంలో 416 మీటర్ల మేర మాత్రమే పనులు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మొదటి టన్నెల్లో 2,512 మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 265 మీటర్ల పనులను పూర్తి చేసి, డిసెంబర్లో ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో టన్నెల్‌ను జూన్‌కు పూర్తి చేయనున్నారు. వంశధార ఫేజ్–2, స్టేజ్–2 ► శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వంశధార ప్రాజెక్టు రెండో దశకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో శ్రీకారం చుట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులకు ముందస్తుగా ఫలాలను అందించాలని ప్రాజెక్టు డిజైన్ల్లో మార్పులు చేశారు. ► భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్ (మత్తడి) నిర్మించి, రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను వరద కాలువ ద్వారా తరలించి 0.0686 టీఎంసీల సామర్థ్యంతో సింగిడి వద్ద ఒకటి, 0.404 టీఎంసీలతో పారాపురం వద్ద మరొకటి.. హిరమండలం వద్ద 19.05 టీఎంసీల సామర్థ్యంతో ఇంకో రిజర్వాయర్‌ను నిర్మించే పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే 75 శాతం పనులు పూర్తయ్యాయి. ► గత టీడీపీ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వరద కాలువలో మిగిలిన పనులు పూర్తి చేసింది. హిరమండలం రిజర్వాయర్‌లో మిగిలిన పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఆయకట్టుకు నీళ్లందించే పిల్ల కాలువల పనులు జరుగుతున్నాయి. 2021 జూలైలో ప్రాజెక్టును ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంగం బ్యారేజీ ► పెన్నా నదిపై బ్రిటీష్ సర్కార్ హయాంలో 1882–86లో నిర్మించిన సంగం బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కాన్పూర్ కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడం కష్టంగా మారింది. ► ఈ నేపథ్యంలో పాత బ్యారేజీకి దిగువన 0.45 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా సంగం బ్యారేజీ కమ్ వంతెన నిర్మాణ పనులను 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి పెన్నా డెల్టాకు జీవం పోసేందుకు శ్రీకారం చుట్టారు. బ్యారేజీ పనులకు రూ.32 కోట్లు ఖర్చు చేశారు. సాంకేతిక సమస్యల వల్ల 2013 ఆగస్టు నుంచి పనులు ఆగిపోయాయి. ► బ్యారేజీని పరిశీలించిన నిపుణుల కమిటీ బ్యారేజీ పొడవును 846 నుంచి 1,195 మీటర్లకు పెంచాలని సూచించింది. ఆ మేరకు 2016 ఫిబ్రవరిలో పనులు చేపట్టారు. 2016 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు చేసిన పనులకు బిల్లులు, ధరల సర్దుబాటు కింద అదనపు బిల్లుల రూపంలో టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు రూ.70 కోట్లు చెల్లించింది. మరో రూ.20 కోట్లు బకాయి పెట్టింది. ఊపందుకున్న పనులు ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సంగం బ్యారేజీ పనులు ఊపందుకున్నాయి. పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. ► బ్యారేజీకి కుడి వైపు అప్రోచ్ బండ్స్, దిగువన గైడ్ బండ్స్ పనులు పురోగతిలో ఉన్నాయి. బ్యారేజీకి 85 సర్వీసు గేట్లకు గాను 70 గేట్లు పూర్తయ్యాయి. 9 స్టాప్ లాగ్ గేట్లకు గాను ఒక గేటు పూర్తయ్యింది. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. గేట్లను ఎత్తడానికి, దించడానికి వాడే హాయిస్ట్ మెకానిజం పనులకు సంబంధించి 85 గేట్లకుగాను 37 గేట్లకు బిగించే పనులు పూర్తయ్యాయి. 200 మంది కార్మికులు పగలు, రాత్రి షిఫ్టుల ప్రకారం పని చేస్తున్నారు. ► పెన్నా నదిలో వరద ఉధృతి తగ్గగానే మిగిలిన కాంక్రీట్ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. 2019 మే నుంచి ఇప్పటి వరకు బ్యారేజీ పనులకు రూ.41 కోట్లు ఖర్చు చేశారు. బ్యారేజీ పనుల్లో 82.26 శాతం పూర్తయ్యాయి. మిగతా 17.74 శాతం పనులను త్వరితగతిన పూర్తి చేసి, బ్యారేజీని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద బ్యారేజీ పనులకు ఇప్పటిదాకా రూ.163.00 కోట్లు ఖర్చు చేశారు. నెల్లూరు బ్యారేజీ ► సంగం బ్యారేజీ దిగువన పెన్నాపై 1855లో బ్రిటీష్ సర్కార్ నిర్మించిన నెల్లూరు బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో 99,925 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ ఆయకట్టుకు జీవం పోయడానికి పాత బ్యారేజీకి 50 మీటర్ల దిగువన కొత్తగా బ్యారేజీ నిర్మాణ పనులను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో చేపట్టారు. సింహభాగం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ► 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు బ్యారేజీ పనులకు గ్రహణం పట్టుకుంది. కాంట్రాక్టర్ చేసిన పనులకు రూ.1.54 కోట్లను కూడా టీడీపీ సర్కార్ చెల్లించలేదు. ► వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు గాడిలో పడ్డాయి. లాక్డౌన్ సమయంలో మినహా మిగిలిన రోజుల్లో నిర్విరామంగా పనులు జరుగుతున్నాయి. ► ఇప్పటి వరకు 86.35 శాతం పనులు పూర్తయ్యాయి. వాటికి రూ.127.64 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 13.65 శాతం పనులను శరవేగంగా పూర్తి చేసి, బ్యారేజీని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ఆయకట్టుకు సాగు నీరుతోపాటు నెల్లూరు నగర దాహార్తి తీరుతుంది. కోవూరుకు రవాణా ఇబ్బందులు తీరతాయి. -
సిబ్బంది లేనిదే నిర్వహణ ఎలా?
తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాలకు నీళ్లందించాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తోంది. కానీ ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ప్రాజెక్టులలో ఇంజ నీర్లను భర్తీ చేస్తున్నది గానీ, ప్రాజెక్టుల నిర్వహణలో కీలకమైన వ్యవస్థ వర్క్ ఛార్జ్డ్ సాంకేతిక ఉద్యోగులను, కార్మికులను భర్తీ చేయడం లేదు. ప్రాజెక్టులు, కాల్వల ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందించే లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు నేడు నామమాత్రంగా మిగిలిపోయారు. ప్రాజెక్టులపై వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది మెకానికల్ పనులను నిర్వహిస్తూ ప్రాజెక్టులను కాపాడేవారు. నట్లు, బోల్ట్, స్పానర్, స్టీరింగ్, విద్యుత్ సిబ్బంది ప్రాజెక్టులకు జవసత్వాలుగా పని చేస్తారు. వీరు మజ్దూర్, హెల్పర్, ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్, ఫోర్‌మెన్ పేర్లతో వివిధ కేటగిరిల్లో ప్రాజెక్టులపై పని చేస్తుంటారు. ఉదాహరణకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఐదు వేల మంది వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది పని చేశారు. ప్రాజెక్టుల భారీ గేట్లు ఆపరేట్ చేయడం, వాటికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులు, మాన్యువల్స్ ప్రకారం మరమ్మతులు నిర్వహించడం లాంటి పనులు సాంకేతిక సిబ్బంది చేయాల్సి ఉంటుంది. బ్రిటిష్ హయాంలో, ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలలో వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది సాంకేతికపరమైన అనుభవం కలిగి స్కిల్డ్, సెమీ స్కిల్ట్ నిపుణులుగా నిర్వహణ, మరమ్మత్తుల పనులు నిర్వహించేవారు. అదే ఒరవడిని స్వాతంత్య్రానంతరం వివిధ ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2/94 యాక్ట్ తెచ్చింది. దీనివలన రెగ్యులరైజేషన్ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు దాకా వెళ్లి 212 జీవో తెచ్చుకున్నారు. అది కొంతమందికి మాత్రమే ఉపయోగపడింది. ఎన్ఎంఅర్లుగా, కంటింజెంట్‌గా పనిచేస్తున్న సిబ్బంది 20, 30 ఏళ్లు గడిచినా పర్మినెంట్ కాలేదు. గత 30 సంవత్సరాలుగా కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో అనుభవం కలిగిన సిబ్బంది క్రమంగా రిటైర్ అవుతున్నారు. వారి స్థానాలలో సిబ్బందిని మాత్రం భర్తీ చేయడం లేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నిర్వహణ అనుభవం, అర్హత కలిగిన వాళ్లు లేకపోవడంవల్ల తరచుగా ప్రమాదాలు జరిగి నష్టం వాటిల్లుతోంది. 2009లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు గత వంద సంవత్సరాలలో కనీవినీ ఎరుగని వరద వచ్చింది. ఆనాడు కొద్దిమందిగా ఉన్న అనుభవం కలిగిన సిబ్బంది ప్రాణాలకు తెగించి గేట్ల సమర్థవంత నిర్వహణ ఫలి తంగా ప్రాజెక్టులకు పెనుప్రమాదం తప్పింది. ప్రభుత్వం వర్క్ఛార్జ్డ్ సిబ్బందిని ప్రశంసించింది. ప్రాజెక్టులపై ఆపరేషన్ మెయింటెనెన్స్ సిబ్బంది నియామకాలను త్వరలో చేపడతామని శాసనసభలో నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. కానీ నేటికీ అతీగతీ లేదు. ఒక ప్రాజెక్టు పూర్తయితే దాని మీద ఎంత మంది సిబ్బంది ఉండాలి? ఏ కేటగిరిలు కావాలి? తగు విధంగా నివేదికలను అందజేయాలని ప్రభుత్వాలు వివిధ కమిటీలు వేశాయి. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐజే.నాయుడు చైర్మన్‌గా మరో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ, అర్.కె.కొండల్రావు ఆధ్వర్యంలో ముగ్గురు ఇంజనీర్లతో కూడిన కమిటీ, ఆ తర్వాత ఎన్.సుబ్బరామిరెడ్డి కమిటీ... ఆయా కమిటీలు ప్రభుత్వాలకు నివేదికలను అందించడం జరిగింది. వివిధ సిఫార్సులను చీఫ్ ఇంజనీర్స్ బోర్డు కూడా ఆమోదించింది. కానీ ఆచరణలో ఎక్కడా ఆ సిఫార్సులు అమలు జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 170 ప్రాజెక్టుల వరకూ ఉండేవి. ప్రతి ప్రాజెక్టులో వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది కీలకంగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2/94 యాక్ట్‌కు సవరణలు తీసుకొచ్చి సిబ్బంది భర్తీతో పాటు, ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తారని భావించారు. ఆనాడు ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్న హరీశ్‌రావు దృష్టికి కూడా ఈ విషయాన్ని సంఘాలు తీసుకువెళ్ళాయి. మాకోసం కాదు, ప్రాజెక్టులను కాపాడుకోవటం కోసం సిబ్బంది అవసరమని చెప్పారు. అలాగే కేసీఆర్ అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ‘అధికారం చేపట్టగానే ముందుగా శ్రమదోపిడీకి మారుపేరైన ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్త్తం. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ మాటే వినబడదు. ప్రభుత్వ వ్యవస్థలలోని అన్ని శాఖలలో ఉద్యోగాల భర్తీ జరిపి తీరుతాం’. అధికారంలోకొచ్చి ఆరేండ్లు గడిచిపోయింది. 2/94 యాక్ట్ సవరణ జరగలేదు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కాలేదు. ప్రభుత్వ ఖాళీల భర్తీ లేదు. ఇప్పటికైనా కేసీఆర్ తన వాగ్దానాలను నిలుపుకోవాలి. -జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి రంగానికి చెందిన ప్రాజెక్ట్‌లు లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడంతో పాటు కొత్తవాటి కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం రూ. 96550 కోట్లు వ్యయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నిర్మాణంలో ఉన్న వాటిని రూ.84092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు పూర్తి చేయడానికి రూ.72458 కోట్లు ఖర్చు చేయాలి. ఈ నిధులు సమీకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ఎస్పీవీలు (స్పెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేస్తుంది. ఓ వైపు పోలవరం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో చురుగ్గా పనులు చేయిస్తున్న ప్రభుత్వం, మరోవైపు ఇతర ప్రాజెక్ట్లపైన అదే విధంగా దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్ట్‌లో కుడి, ఎడమ కాలువులు గతంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తయ్యాయి. ప్రధాన జలాశయ నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తుండడంతో గతంలో పనిచేసిన సంస్థను ప్రభుత్వం రద్దు చేసి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)కు అప్పగించిన సంగతి తెలిసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి దాకా మొత్తం ప్రాజెక్ట్‌లో 71.46 శాతం పనులు పూర్తి కాగా ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కీలకమైనవి. స్పిల్ వే కాంక్రీట్, స్పిల్ వే ఛానెల్ లలో ఎంఈఐఎల్ పనిచేపట్టిన తరువాత 2.80 లక్షల ఘనపు మీటర్ల పని ఆరు నెలల కాలంలో జరిగింది. అదే సమయంలో స్పిల్ ఛానెల్, పవర్ హౌజు, గ్యాప్-1,2,3 లకు సంబంధించిన మట్టి, రాతికట్టి, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోదావరికి వరదలు ఉన్నప్పటికీ పనులు ఆగకుండా స్పిల్ వే కాంక్రీట్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులను కొనసాగిస్తున్నారు. వరద తగ్గిన తరువాత అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలతో పాటు స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్‌లను గ్యాప్ - 1,2,3 పనులను ఎంఈఐఎల్ ఏకకాలంలో చేపడుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ర్టంలో గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మూడు రకాల ప్రాధాన్యతలను నిర్ణయించారు. అందులో భాగంగా వచ్చే ఏడాది కొన్ని ప్రాజెక్ట్ లను వినియోగంలోకి తెచ్చేందుకు బడ్జెట్లు కేటాయించగా ఇతర ప్రాజెక్ట్ లను మూడు నుంచి నాలుగేళ్ళ సమయంలో పూర్తి చేయడానికి లక్షాలను నిర్దేశించారు. ప్రాజెక్ట్‌ల పూర్తికి నిధుల కొరత ప్రధాన అవరోధం కానుంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎసస్పీవీలను ఏర్పాటు చేశారు. అందులో ఎస్పీవీ-1 కింద రాయలసీమలో కరువు నివారణకు రూ.39980కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేయనున్నారు. ఎస్పీవీ-2 కింది ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తిచేయడానికి ఐదేళ్ల కాలంలో రూ. 8787 కోట్లు ఖర్చు చేస్తారు. ఎస్పీవీ - 3 ద్వారా ఏపి రాష్ర్ట నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరుతో రూ.12702 కోట్లు ఐదేళ్ల కాలంలో సమీకరించనున్నారు. ఎస్పీవీ-4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా - పెన్నాల అనుసంధానం కోసం రూ.7636కోట్లు ఐదేళ్ల కాలంలో ఖర్చు చేస్తారు. ఎస్పీవీ-5 కార్యక్రమం క్రింద కృష్ణా-కొల్లేరు సెలినిటి మిటిగేషన్ కార్యక్రమం ద్వారా రూ.3356 కోట్లు సమీకరిస్తారు. సాగునీటి ప్రాజెక్ట్‌లకు నిధుల సమీకరణకు ఎస్పీవీలు ఏర్పాటు చేయడం అరుదైనది కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టుదల వల్ల వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను పరుగులు పెట్టించి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐదేళ్ళలో రూ. 39980 ఖర్చు.. ఆ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్ రెగ్యులేటర్ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం కాకుండా పనులు పరుగులు పెట్టించాలన్నారు. చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని, వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని అలాగే ఆ ప్రాజెక్ట్ ల్లో నీరు నిండితే ఆయా ప్రాంత రైతులు ఉపయోగకరం అన్న విషయంపై రైతులకు నచ్చచెప్పి, అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా పూర్తి చేయాలని, ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ పనులను పరుగులు పెట్టిస్తోంది. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్ ఇప్పటికే పూర్తయిందని, వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 48 గేట్ల బిగించేలా పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల్లో ఆయా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా రైతుల పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్ట్ లపై దృష్టి.. ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నరు. వంశధార–నాగావళి అనుసంధానం పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. మొత్తం 33.5 కి.మీ కు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని పట్టుదలతో ఏపి ప్రభుత్వం ఉంది. వంశధార స్టేజ్–2 సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో చర్చించాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్ రిజర్వాయర్పూర్తైతే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే 24,600 ఎకరాలకు నీరందుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టులోడిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. -
సకాలంలో ప్రాజెక్టులు పూర్తవ్వాలి
గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి. చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందని రైతులకు వివరించాలి. వరుసగా రెండో ఏడాది సోమశిల నిండింది. గేట్లు ఎత్తడంతో కండలేరుకు జలాలు చేరుతున్నాయి. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కుల నీటిని మనం తీసుకెళ్లొచ్చు. నీటి మట్టం 854 అడుగులు ఉంటే కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకెళ్లాలి. అదృష్టవశాత్తు ఇప్పుడు 881 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ఇది ఎక్కువ రోజులు ఉండదు. అందుకే వరద జలాలను ఒడిసి పట్టి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలి. ఆ మేరకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీటిని ఒడిసి పట్టి, ప్రాజెక్టులను నింపాలి. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందే. –సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులను పూర్తి చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి. వేగంగా సాగుతున్న పనులు ► ‘ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్న అవుకు సొరంగం–2 పనులు వేగంగా సాగుతున్నాయి. సీపేజీ వల్ల సొరంగంలో మట్టి చేరింది’ అని అధికారులు వివరించారు. నిపుణుల కమిటీ సలహా ప్రకారం పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ► వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తయ్యాయి. మొదటి సొరంగంలో 413 మీటర్ల మేర పనులు మిగిలాయి. వర్షాల వల్ల నల్లమల అడవుల్లో పనుల్లో జాప్యం జరుగుతోంది. మొదటి సొరంగం పనులు నవంబర్ నాటికి, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ పై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ వడివడిగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ► వంశధార–నాగావళి అనుసంధానం పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. మొత్తం 33.5 కి.మీల హైలెవల్ కెనాల్కుగాను 25 కి.మీల పనులు పూర్తయ్యాయి. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను మార్చి నాటికి పూర్తి చేస్తాం. వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్ రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి.. ఒడిశా సీఎంతో సమావేశం కోసం లేఖ రాశాం. సమాధానం రావాల్సి ఉంది. ► శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పూర్తయితే నందిగం, మెలియపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని, 24,600 ఎకరాలకు నీరందుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేశామని.. దీన్ని కూడా ప్రాధాన్యత కింద పూర్తి చేస్తామన్నారు. ► తారకరామ తీర్థసాగరం రిజర్వాయర్ ప్రాజెక్టును 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ► తోటపల్లి ప్రాజెక్టులో భాగమైన గజపతినగరం బ్రాంచ్ కాల్వ పనులు 43 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు, భూసేకరణ కోసం రూ.139 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తయితే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. షెడ్యూల్ ప్రకారం పోలవరం ► షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలవరానికి రీయింబర్స్మెంట్ రూపంలో రావాల్సిన రూ.3,805 కోట్ల విడుదలకు సంబంధించిన అంశంపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో చర్చించడానికి సోమవారం ఢిల్లీ వెళ్లాలని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌లను ఆదేశించారు. ► ‘పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువల పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే లక్ష్యం. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు ఇప్పటికే పూర్తి. వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 48 గేట్లు్ల బిగిస్తాం. కోవిడ్ వల్ల స్పిల్ వే కాంక్రీట్ పనుల్లో కాస్త జాప్యం జరిగింది’ అని అధికారులు వివరించారు. అవసరమైన ఉద్యోగుల సర్దుబాటు ► జల వనరుల శాఖలో అవసరాలను బట్టి అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని.. డ్యామ్‌లు, కాలువలు, వాటర్ రెగ్యులేషన్‌కు అవసరమైన లష్కర్లను, అవసరమైన చోట మెకానికల్, ఎలక్ట్రికల్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకోవాలని సీఎం ఆదేశించారు. ► సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు వద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టాలని, చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నింపాలని ఆదేశాలు జారీ చేశారు. సజావుగా భూసేకరణ చేపట్టి, సహాయ, పునరావాస ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు వద్దని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు.(చదవండి: బెస్ట్ సీఎం వైఎస్ జగన్: నటుడు అలీ) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్ రెగ్యులేటర్ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలి. భారీ వర్షాలతో పొటెత్తుతున్న వరదనీటిని ఒడిసి పట్టాలి’’అని సూచించారు. ‘‘చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలి. వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలి. గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం. ఈ విషయం గురించి రైతులకు అవగాహన కల్పించాలి. వారికి నచ్చచెప్పాలి. ఈ రెండు ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందన్న విషయంపై రైతులకు వివరించాలి’’అని అధికారులకు సూచించారు. (చదవండి: విద్యలో విప్లవం) ప్రాజెక్టుల పురోగతి సమీక్షా సమావేశంలో భాగంగా.. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని, అదే విధంగా... వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్న అవుకు–2వ సొరంగం పనులు కూడా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే మధ్యలో సీపేజీ వల్ల సొరంగంలో మట్టి చేరిందని పేర్కొనడంతో, నిపుణుల కమిటీ సలహా ప్రకారం అవసరమైన పనులు చేపట్టి పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఇక ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ సీజన్లో నల్లమల అడవుల్లో కొండలపై నుంచి నీరు పడుతుండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రికి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఈ ఏడాది డిసెంబరు నాటికి వంశధార–నాగావళి అనుసంధానం పూర్తయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని సమీక్షలో పేర్కొన్నారు. మొత్తం 33.5 కి.మీ కు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉందని, వాటన్నింటినీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఇక బీఆర్ఆర్ వంశధార స్టేజ్–2 ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో సమావేశానికి లేఖ రాయగా, ఇంకా సమాధానం రావాల్సి ఉందని వెల్లడించారు. మహేంద్ర తనయ రిజర్వాయర్ శ్రీకాకుళం జిల్లాలో మహేంద్ర తనయ నదిపై ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పూర్తైతే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని, 24,600 ఎకరాలకు నీరందుతుందని సీఎం జగన్ అన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని కూడా ప్రాధాన్యత కింద పరిగణించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ మేరకు పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టులోడిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని వివరించారు. ప్రాజెక్టులోభాగమైన గజపతినగరం బ్రాంచ్ కాల్వ పనులు 43 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు, భూసేకరణ కోసం రూ.139 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు సమీక్షా సమావేశంలో వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంలో ఏ మార్పు లేదని, ఆ దిశలోనే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్ ఇప్పటికే పూర్తైందన్న అధికారులు, వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 48 గేట్ల బిగిస్తామని చెప్పారు. కొంత మంది కార్మికులకు కోవిడ్ రావడం వల్ల స్పిల్ వే కాంక్రీట్ పనుల్లో కాస్త జాప్యం జరిగిందని వివరించారు. ఉద్యోగుల సర్దుబాటు జల వనరుల శాఖలో పనులు కొనసాగుతున్న చోట్ల అవసరాలను బట్టి, అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని, డ్యామ్‌లు, కాల్వలు, వాటర్ రెగ్యులేషన్‌కు అవసరమైన లష్కర్‌ను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకోవాలని నేటి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. అదే విధంగా డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ సిబ్బంది నియామకానికి సీఎం అనుమతి ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల పునరుద్ధరణకు రూ.778 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, అభివృద్ధి (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్) రెండు, మూడో విడత అమలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద రూ.778 కోట్ల వ్యయంతో 31 సాగునీటి ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. పథకం అమలు కోసం ప్రత్యేకంగా స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.5 కోట్లను ఫిబ్రవరి 25న మంజూరు చేసింది. పథకం అమలును పర్యవేక్షించడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ అధ్యక్షుడు ఏబీ పాండ్య అధ్యక్షతన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్ఆర్పీ)ని ఏర్పాటు చేసింది. 2020–21 నుంచి పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది. చేపట్టే పనులివీ.. ► ఈ పథకం కింద సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి అవసరమైన నిధుల్లో.. 70 శాతాన్ని ప్రపంచ బ్యాంకు రుణం, కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇస్తాయి. మిగతా 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ► జలాశయాల స్పిల్ వే నుంచి నీరు లీకవుతుంటే.. వాటిని అరికట్టడానికి గ్రౌటింగ్ (స్పిల్ వేపై బోరు బావి తవ్వి.. అధిక పీడనంతో కాంక్రీట్ మిశ్రమాన్ని పంపడం ద్వారా స్పిల్ వే పునాదిలో ఏర్పడిన పగుళ్లను మూసివేయడం) చేస్తారు. లీకేజీలు మరీ అధికంగా ఉంటే స్పిల్ వేకు జియో మెంబ్రేన్ షీట్ అమర్చుతారు. ► స్పిల్ వే గేట్లను ఎత్తడానికి దించడానికి వీలుగా ఏర్పాటు చేసిన హాయిస్ట్‌లకు మరమ్మతులు చేస్తారు. గేట్లు పూర్తిగా పాడైతే.. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. ► వాటి నిర్వహణ నిమిత్తం నిధులను సమకూర్చుకోడానికి జలాశయాల్లో చేపల పెంపకం, పర్యాటక అభివృద్ధి పనులు చేపడతారు. నిధులు రాబట్టని గత సర్కార్ ► దేశంలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో 2015లో కేంద్ర ప్రభుత్వం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (డ్రిప్)ను ప్రారంభించింది. మొదటి దశలో ఏడు రాష్ట్రాల్లోని 198 ప్రాజెక్టులను రూ.3,467 కోట్లతో అభివృద్ధి చేసింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ► ‘డ్రిప్’ రెండు, మూడు దశలను ఈ ఏడాది జూన్ నుంచి కేంద్రం అమలు చేస్తుండగా.. రాష్ట్రానికి సింహభాగం నిధులు రాబట్టి జలాశయాలను అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ► ‘డ్రిప్’ రెండో దశలో రాష్ట్రంలో 31 జలాశయాల అభివృద్ధికి రూ.778 కోట్లను మంజూరు చేయాలంటూ సీడబ్ల్యూసీకి రాష్ట్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ► రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోద ముద్ర వేసి ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. -
ప్రజా నాయకుడి దూరదృష్టి
నిజమైన ప్రజానాయకుడు ప్రజలు కోరుకున్నది ఇవ్వడం కాకుండా ప్రజలకు ఏది అవసరమో అది చేస్తారు. అలా చేసిన వారే చిరకాలం ప్రజలలో ఉంటారు. అలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నేత వైఎస్సార్. తెలుగు రాష్ట్రాల వరకు నీటికి సంబంధించి ఆంగ్లేయుల తర్వాత సమగ్రమైన ప్రణాళికను రూపొందించినవారు వైఎస్సార్ మాత్రమే అని చెప్పక తప్పదు. కేసీ కెనాల్, కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ ఆంగ్లేయులను గుర్తుతెస్తే, పులిచింతల, పోలవరం, శ్రీశైలం కనీస నీటిమట్టం, పోతిరెడ్డిపాడు వెడల్పు, ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం టెయిల్ పాండ్, పాలమూరు ఎత్తిపోతల పథకం లాంటివి వైఎస్సార్‌ను గుర్తుకుతెస్తాయి. వైఎస్సార్ అన్ని ప్రాంతాల నీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో కొందరు ఒకేసారి ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రాధాన్యత క్రమంలో చేస్తే బాగుంటుందన్నారు. (చదవండి: ఇక్కడెవరైనా అమృతం తాగి ఉన్నారా? ) ఆ సమయంలో వైఎస్సార్, ‘అన్ని ప్రాంతాలకు ఉపయోగపడే ప్రాజెక్టుల రూపకల్పన చేసి ప్రజల ముందు ఉంచితే కాల క్రమంలో వాటిని ప్రజలు సాధించుకుంటారు’ అన్నారు. నేడు చాలా ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రజలు పోరాడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వాలు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. నాగార్జున సాగర్ జలాశయం నిర్మాణానికి నాటి ప్రభుత్వం 92 కోట్ల రూపాయల అప్పుతెచ్చి నిర్మించింది. అప్పు చేసి కట్టడం అవసరమా? అని చర్చ జరిగింది. అప్పును తీర్చడమే కాదు, అపారమైన సంపదను నీటి ప్రాజెక్టులు సృష్టిస్తాయని నాటి ప్రధాని నెహ్రూ ముందుకు సాగారు. వైఎస్సార్ కూడా అదే స్ఫూర్తితో ప్రాజెక్టుల విషయంలో వ్యవహరించారు.( చదవండి: అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం) దశాబ్దాల కల పోలవరం నేడు సాకారం వైపు అడుగులు వేస్తోంది అంటే అందుకు వైఎస్ చొరవ కీలకం. వారు చేపట్టిన కుడికాల్వ పైనే పట్టిసీమ, ఎడమ కాల్వపై పురుషోత్తమ పట్నం రూపుదిద్దుకున్నాయి. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి వారి ఆలోచనే. డెల్టా అవసరాలకు పులిచింతల రూపకల్పన చేశారు. దుమ్ముగూడెం పథకం ఆయన దూరదృష్టికి ఉదాహరణ. ఆయనపై రాజకీయ కోణంలో పోతిరెడ్డిపాడు విషయంలో నాడు వివాదం చేశారు. నేడు తెలంగాణ ప్రాజెక్టులకు సీమలో తలపెట్టిన నిర్మాణాల వల్ల నష్టం అని విమర్శలు చేస్తున్న వారు గుర్తుకుతెచ్చుకోవాల్సిన అంశం దక్షిణ తెలంగాణలో ఏ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారో వాటి రూపకల్పన చేసింది వైఎస్సార్ అన్న విషయాన్ని మరువకూడదు.( చదవండి: నాకు తెలిసిన మహనీయుడు ) రాయలసీమ ఉద్యమం ప్రధాన లక్ష్యం నీరు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడు వెడల్పు, శ్రీశైలం నీటిమట్టం, గండికోట రిజర్వాయర్, కుందూ నదిపై నిర్మాణాలు, గాలేరు నగరి, హంద్రీనీవా పనులకు ప్రాధాన్యత ఇచ్చినారు. నాడు వారు చేసిన కృషి వల్లే కొంత మేరకు అయినా రాయలసీమకు నీరు అందుతోంది. ప్రజానాయకుడు తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు వారి తర్వాత కూడా ప్రాధాన్యత కలిగివుంటాయి. అదే ఆ నాయకుడి దూరదృష్టిని తెలియజేస్తుంది. - మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం -
ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ...
సాక్షి, హైదరాబాద్: విస్తారంగా వర్షాలు.. పరవళ్లు తొక్కుతున్న ప్రవాహాలు.. నిండుకుండల్లా ప్రాజెక్టులు.. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న తాజా దృశ్యం. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు బిరబిరా వస్తూ సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఊపిరిలూదాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయగా, గోదావరిలో సింగూరు, నిజాంసాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తేశారు. రెండు, మూడు రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకునే అవకాశాలున్నాయి. నిండేందుకు సిద్ధంగా ఎస్సారెస్పీ... ఎగువ నుంచి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటంతో ఎస్సారెస్పీ జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 90.31 టీఎంసీలకుగానూ 78 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆదివారం ఉదయం 52 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగా, అది మధ్యాహ్నానికి 18 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా, నీటి ప్రవాహాల్లో హెచ్చుతగ్గులున్నాయి. 23 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడుతున్న నేపథ్యంలో విస్తారంగా వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రవాహాలు పుంజుకుంటే రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండొచ్చని భావిస్తున్నారు. 90 టీఎంసీలకు గానూ 85 టీఎంసీల మేర నీరు చేరిన వెంటనే గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. బోసిపోయిన సింగూరు, నిజాంసాగర్... అన్ని ప్రాజెక్టులకు భిన్నంగా సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు దర్శనమిస్తున్నాయి. అవి పూర్తిగా బోసిపోయి కనిపిస్తున్నాయి. సింగూరులో 29.91 టీఎంసీలకు కేవలం 2.81 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. స్థానిక పరీవాహకం నుంచి 1,122 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో ఇంతవరకు కేవలం 2.80 టీఎంసీల మేర మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీలకు కేవలం 1.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో కొత్తగా వచ్చి చేరిన నీరు కేవలం ఒక టీఎంసీ మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 4.50 టీఎంసీల లభ్యత ఉంటే అందులో కొత్తగా వచ్చింది 3.80 టీఎంసీలు. గత ఏడాదితో పోలిస్తే ప్రాజెక్టులో 4 టీఎంసీల మేర అధికంగా నిల్వ ఉంది. వచ్చే సెప్టెంబర్‌లో భారీ తుఫాన్లు వస్తే ఈ ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు వస్తాయేమోనని ఇంజనీర్లు ఆశాభావంతో ఉన్నారు. -
ప్రాజెక్టులు ఇక పరుగులు
సాక్షి, అమరావతి: వరద నీటిని ఒడిసి పట్టడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి రైతులకు వాటి ఫలాలు అందించాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్తవాటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న అవుకు టన్నెల్–2, వెలిగొండ తొలిదశ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి నదుల అనుసంధానం, వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనుల పురోగతిపై బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రాజెక్టుల పనులపై లాక్డౌన్, కోవిడ్ ప్రభావం చూపాయని, ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సిందేనని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. సీఎం సమీక్ష వివరాలివీ.. సకాలంలో పూర్తి కావాల్సిందే.. ► ఇటీవల వర్షాలకు అవుకు టన్నెల్–2 మార్గంలో మట్టి జారిందని, దీన్ని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని సమీక్షలో అధికారులు తెలిపారు. గడువులోగా అక్టోబర్ నాటికి అవుకు టన్నెల్–2 పూర్తి చేస్తామన్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి అదనంగా మరో 10 వేల క్యూసెక్కులను తరలించే ఈ టన్నెల్ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ► తోటపల్లిలో మిగిలిపోయిన పనులు సహా విజయనగరం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తామని, ఆ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ► పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ నుంచి డిసెంబర్ మొదటి వారంలో నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. ఒక్క ఏడాదిలోనే సుమారు 2.2 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వకం పూర్తైందన్నారు. ► నెల్లూరు బ్యారేజీలో సివిల్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, గేట్ల బిగింపు ప్రారంభించామని, మొత్తం 86.35 శాతం పనులు పూర్తయ్యాయని, నవంబరు ఆఖరు నాటికి బ్యారేజీని పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. సంగం బ్యారేజీ కూడా నవంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ► వంశధార స్టేజ్–2 ఫేజ్–2లో భాగమైన నేరడి బ్యారేజీ పనులకు సంబంధించి చర్చల కోసం ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో లేఖ రాశామని, ఆ ప్రభుత్వాన్ని సంప్రదించి తేదీలను ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. జంఝావతిపై ఒడిశాతో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ► అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనని సీఎం జగన్ ఆదేశించారు. లాక్డౌన్ సమయంలోనూ పోలవరం పనులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పోలవరం స్పిల్ వే పియర్స్ సగటు ఎత్తు 28 మీటర్లు కాగా ఇప్పుడు వాటి ఎత్తు 51 మీటర్లుగా ఉందని, శరవేగంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. వర్షాకాలంలోనూ నిరాటంకంగా పనులు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెప్టెంబరు 15 కల్లా స్పిల్ వే పియర్స్ పనులు పూర్తవుతాయన్నారు. ఎడమ కాలువ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. పోలవరం సహాయ పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ► పోలవరంపై కేంద్రం నుంచి రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.2,300 కోట్ల రీయింబర్స్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, మరో రూ.2,277.34 కోట్ల రీయింబర్స్‌కు సంబంధించి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా పంపుతామని అధికారులు తెలిపారు. ► రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగమైన ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో 10 టీఎంసీలు నిల్వ చేసేలా సహాయ, పునరావాస ప్యాకేజీ పనులను పూర్తి చేయాలన్నారు. -
‘పోలవరం పునరావాస పనులపై దృష్టి పెట్టాలి’
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరాగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్-2, పూల సుబ్బయ్య వెలిగొండ టన్నెల్-1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్ట్-2లో ఫేజ్-2 పనుల ప్రగతిపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై కరోనా ప్రభావం చూపిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుంటున్నాయని వివరణ ఇచ్చారు. వరద సమయంలోనూ పోలవరం పనులు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అక్టోబరు నాటికి అవుకు టన్నెల్-2 పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల వర్షాలకు సొరంగ మార్గంలో మట్టి జారిందని, దాన్ని అరికట్టడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. అనుకున్న ప్రకారం అక్టోబరు నాటికి అదనంగా మరో 10వేల క్యూసెక్కుల నీరు వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. (తమ్ముడూ బాగున్నారా.. అన్నా ధన్యవాదాలు) విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తోటపల్లిలో మిగిలిపోయిన పనులు సహా వివిధ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు ఖర్చుపెడితే ఇక్కడ అన్ని ప్రాజెక్టులూ పూర్తవుతాయన్నారు. నెలకు కొంత మొత్తాన్ని కేటాయించుకుంటూ పోతే ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని సీఎం తెలిపారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ నుంచి డిసెంబర్ మొదటి వారంలో నీటి విడుదలకు సిద్ధం చేస్తామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 2.2 కిలోమీటర్లు తవ్వగలిగామని అధికారులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు టన్నెల్-2ను వేగంగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. నెల్లూరు బ్యారేజీలో సివిల్ పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికారులు వివరించారు. గేట్ల బిగింపు ప్రక్రియను మొదలుపెట్టామని మొత్తంగా 86.35శాతం పనులు పూర్తి అయినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. నవంబరు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. సంగం బ్యారేజీ కూడా నవంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. (వైఎస్సార్ చేయూతను ప్రారంభించడం నా అదృష్టం) వంశధార ప్రాజెక్టు రెండో ఫేజ్-2 పనుల ప్రగతిపై సీఎం జగన్ ఆరా తీశారు. వంశధార - నాగావళి లింకు పనులు డిసెంబరు చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు వచ్చే మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఒడిశా సీఎంతో చర్చల కోసం సీఎం జగన్ లేఖ రాసిన అంశాన్ని గుర్తు చేశారు. దీని రిప్లై కోసం వేచి చూడకుండా, వారితో మాట్లాడి ఒడిశా సీఎంతో చర్చలకు ఖరారు చేయాలన్నారు. అలాగే జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రగతిని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. కోవిడ్ సమయంలో కూడా పనులు కొనసాగించామని తెలిపారు. పోలవరం స్పిల్‌వే పిల్లర్స్ ఈ ప్రభుత్వం వచ్చేనాటికి సగటు ఎత్తు 28 మీటర్లు కాగా, ఇప్పుడు 51 మీటర్లుగా ఉందని తెలిపారు. సెప్టెంబరు 15కల్లా స్పిల్‌వే పిల్లర్స్ పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు చెప్పారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నామని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఎడమ కాల్వ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పోలవరం సహాయ పునరావాస పనులపైనా సమీక్షించిన సీఎం వైఎస్ జగన్.. పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గండికోటలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా అవసరమైన ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈసారి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపాలని అధికారులకు సూచించారు. చిత్రావతిలో 10 టీఎంసీల నీటిని కూడా నిల్వచేయాలని అధికారులకు తెలిపారు. గండికోట-పైడిపాలెం లిఫ్ట్ అప్‌గ్రెడేషన్ పనులు కూడా త్వరగా మొదలు పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులు పనులు త్వరితగతిన మొదలుపెట్టాలని సూచించారు. టెండర్ ప్రక్రియ జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లిందని అధికారులు సీఎంకి వివరించారు. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ చేసే లిఫ్ట్ పనులు కూడా త్వరగా మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కూడా వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ , సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం, జవవనరుల శాఖ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకూ సాగునీరు
సాక్షి, హైదరాబాద్: ‘గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసింది. ఉద్యమ స్ఫూర్తితో చెరువులను పునరుద్ధరించింది. ఇలా చేసిన పనుల ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే మార్గం. ఇప్పటివరకు తెలంగాణ సాగునీటికి గోస పడ్డది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడింది. అలా వచ్చిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. ఇందుకు కార్యాచరణ ప్రణా ళిక సిద్ధం చేయాలి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వీలైనంత ఎక్కువమంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధా న్యం ప్రభుత్వానికి మరోటి లేదని, దీనికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సాగునీరు అందని ప్రాంతా లను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ‘ముందుగా చెరువులను నింపాలి. తర్వాత రిజర్వా యర్లను నింపాలి. చివరికి ఆయకట్టుకు నీరందించాలి. ఈ విధంగా ప్రణాళిక ప్రకారం నీటి సరఫరా ఉండాలి. దీనివల్ల వానాకాలంలో లభించే నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం సాధ్య మవుతుంది. తెలంగాణలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలి. ఫలితంగా భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు రూ.45 వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్న బోర్లకు నీరందు తుంది. అటు కాల్వలు, ఇటు చెరువులు, మరోవైపు బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుంది’’అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు పంపించడానికి అనువుగా కాల్వల సామర్థ్యం ఉందా లేదా మరోసారి పరిశీలించాలి. అవసరమైతే కాల్వల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి’అని సూచించారు. ఎస్సారెస్పీ కింద 30 లక్షల ఎకరాలు పండాలి ‘శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు వీలైనంత ఎక్కువ ఆఫ్ టేక్ పాయింట్స్ (తూములు) ఏర్పాటు చేసి, ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలి. నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్సారెస్పీ వరకు రెండు టీఎంసీల నీటిని తరలించే వెసులుబాటు కలిగింది. కాబట్టి ఎస్సారెస్పీ పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించాలి. వరద కాలువ, కాకతీయ కాలువ, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఏడాది పొడవునా నిండే ఉంటాయి. అవి జీవధారలుగా మారతాయి. ఎస్పారెస్పీ ప్రాజెక్టులో కూడా ఎప్పుడూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచాలి. అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా ఎస్సారెస్పీని వాడుకోవాలి. గోదావరి నుంచి నీరు వస్తే నేరుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాలి. లేదంటే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని తరలించాలి’’అని సీఎం చెప్పారు. ‘ఎస్ఆర్ఎస్పీ పరిధిలోని వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులున్నాయి. వాటిలో కొన్నింటికి నీరు అందడం లేదు. అలా నీరు అందని చెరువులను గుర్తించాలి. వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ తూములు పెట్టి ఆ చెరువులన్నింటినీ నింపాలి. ఈ పని రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి కావాలి. అటు ఎస్సారెస్పీ నుంచి, ఇటు కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీరందే అవకాశం ఉంది. వరద కాలువ 365 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. కాబట్టి వరద కాలువ ద్వారా ఇప్పటి వరకు ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలకు నీరు ఇవ్వాలి. వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య భాగంలోనే కాకుండా, వరద కాలువ దక్షిణ భాగంలో ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని చెరువులను నింపాలి. ఈ పని ఆరు నెలల్లో పూర్తి కావాలి. ఎల్లంపల్లి నుంచి అందే నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారు. దాన్ని మార్చాలి. ఎల్లంపల్లి నుంచి 90 వేల ఎకరాల లోపే ఆయకట్టుకు నీరందించడం సాధ్యమవుతుంది. మిగతా ఆయకట్టుకు ఎస్సారెస్పీ ద్వారా నీరు అందించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే చెరువులకు కృష్ణా జలాలు.. ‘ఈ ఏడాది కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు. కాబట్టి వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి. రామల్పాడు రిజర్వాయర్ నింపాలి. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డి 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఉజ్వలంగా రాష్ట్ర సాగునీటి రంగం... ‘తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారింది. భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు వచ్చాయి. చెరువులు బాగుపడ్డాయి. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడింది. వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆపరేషన్ రూల్స్ రూపొందించాలి. నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతీ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తుంది. ప్రతీ ఏడాది వేసవిలోనే అన్ని ప్రాజెక్టుల్లో అవసరమైన మెయింటనెన్స్ పనులు, రిపేర్లు చేసుకోవాలి. జూన్ నాటికి సర్వం సిద్ధం కావాలి. పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలి. ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రతీ జోన్‌కు ఒక సీఈని బాధ్యుడిగా నియమించాలి. సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలి. గతంలో మాదిరిగా భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడిసి అని నాలుగు విభాగాలుగా ఉండవద్దు. నీటి పారుదల శాఖ అంతా ఒకే విభాగంగా పనిచేయాలి. అధికారులకు కావాల్సిన అధికారాలు అప్పగించాలి. ప్రతీస్థాయి అధికారికి అత్యవసర పనులు చేయడం కోసం నిధులు మంజూరు చేసే అధికారం కల్పించాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రితో ఫోన్లో సంభాషించిన కథలాపూర్ జడ్పీటిసి భూమయ్య, రైతు శ్రీపాల్‌లను కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమీక్షలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఎస్పీవీ
సాక్షి, అమరావతి: రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వందశాతం ప్రభుత్వ నిధులతో ప్రత్యేక వాహక సంస్థ పనిచేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో దీనిని రిజిస్టర్ చేయాల్సిందిగా జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీవీ ఏర్పాటుకు జలవనరులశాఖ నుంచి రూ.5 కోట్ల పెట్టుబడి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘రాయలసీమ ప్రాంతానికి నీటి లభ్యతను పెంచేందుకు ఏస్పీవీ ఏర్పాటు చేస్తున్నాం. 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ఎస్పీవీ పనిచేస్తుంది. ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని సీఎస్ నీలం సాహ్ని జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: ‘సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి’) -
గత సర్కారు నిర్వాకం.. 29,616.29 కోట్ల భారం
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ ప్రణాళికా రాహిత్యం, అవగాహన లేమి, చిత్తశుద్ధి లోపించడం సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా పరిణమించిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తేల్చి చెప్పింది. బడ్జెట్లో కేటాయించిన నిధులను ప్రాజెక్టులకు ఖర్చు చేయకపోవడంలో ఔచిత్యం ఏమిటని తప్పుబట్టింది. పనుల్లో తీవ్ర జాప్యం చేయడం వల్ల అంచనా వ్యయం భారీగా పెరిగి రాష్ట్ర ఖజానాపై రూ.29,616.29 కోట్ల మేర భారం పడిందని పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వాటి ఫలాలు రైతులకు అందలేదని, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని తీవ్రంగా దెబ్బ తీసిందని స్పష్టం చేసింది. బడ్జెట్లో కేటాయించిన మేరకు నిధులను ఖర్చు చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని పేర్కొంది. 2017–18కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన ‘కాగ్’ గత సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ బుధవారం శాసనసభకు నివేదిక ఇచ్చింది. కాగ్ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ కాగితాల్లోనే కేపిటల్ వ్యయం... ► రాష్ట్రంలో 2014–15 నుంచి 2017–18 వరకు బడ్జెట్లో కేపిటల్ వ్యయం కింద కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో టీడీపీ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ఈ వ్యవధిలో గత సర్కార్ 27 సాగునీటి ప్రాజెక్టులపై రూ.43,031.61 కోట్లు ఖర్చు చేసినా ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. ► కేటాయించిన మేరకు వ్యయం చేసి ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. పనుల్లో జాప్యం వల్ల ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.28,423.64 కోట్ల నుంచి రూ.58,039.93 కోట్లకు పెరిగింది. దీనివల్ల ఖజానాపై రూ.29,616.29 కోట్ల మేర భారం పడింది. రైతులకు అందని ఫలాలు.. ► గత సర్కారు నాలుగేళ్లలో 27 సాగునీటి ప్రాజెక్టులకు రూ.43,031.61 కోట్లు ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. ఒక్క ఎకరాకూ కొత్తగా నీళ్లందించిన దాఖలాలు లేవు. అంటే ప్రాజెక్టుల ఫలాలు రైతులకు దక్కలేదన్నది స్పష్టమవుతోంది. ► 2017–18లో చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయలేదు. చింతలపూడి ఎత్తిపోతలకు సంబంధించి రూ.311.60 కోట్లు, తాడిపూడి ఎత్తిపోతలకు సంబంధించి రూ.113.28 కోట్లను ఖర్చు చేయకపోవడంతో నిష్ఫలమయ్యాయి. దీంతో పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ► సకాలంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోవడం వల్ల రైతులకు వాటి ఫలాలు అందకపోకగా పనుల అంచనా వ్యయం రూ.582.41 కోట్లకు పెరిగింది. ► బడ్జెట్లో కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేసి ఉంటే అధిక శాతం ప్రాజెక్టులు పూర్తయ్యేవని, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ఫలాలు అందేవని, తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేదని కాగ్ తేల్చింది. -
సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదులపై ఆయా నదీ యాజమాన్య బోర్డుల టెక్నికల్ అనుమతి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్ (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)లు సమర్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఆదేశించాయి. పూర్తి అనుమతులు వచ్చే వరకు ఆయా ప్రాజెక్టుల పనులు చేయొద్దని స్పష్టం చేశాయి. కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, గోదావరి బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలను అతిక్రమించి రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే బోర్డులకు సమర్పించాలని ఆదేశించారు. ఎంపీ సంజయ్ లేఖకు స్పందన ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకా వత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రమంత్రి ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులపై వెంట నే సమావేశం నిర్వహించాలని కృష్ణాబోర్డును ఆదేశించారు. ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని ఏపీని ఆదేశించాలని సూచించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించా రు. కేంద్రమంత్రి ఆదేశాలతో జలవనరుల శాఖ కృష్ణాబోర్డు అధికారులకు లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, బోర్డు అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముం దుకు వెళ్లకుండా నిలువరించాలని ఆదేశించింది. జూన్ 4న నిర్వహించే కృష్ణా బోర్డు సమావేశంలో ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించేలా ఏపీ అధికారులను పట్టుబట్టా లని సూచించారు. గోదావరి బోర్డుకు ఏపీ ఫిర్యాదు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల ఫేజ్–3, మిషన్ భగీరథ, చనకా – కొరటా సహా పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు బోర్డుకు సమర్పించాలని, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేస్తున్న ఈ ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలని బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. చదవండి: గొర్రెల పెంపకంలో మనదే అగ్రస్థానం -
'దక్షిణ తెలంగాణను ఎడారి చేయడమే కేసీఆర్ లక్ష్యం'
సాక్షి, నల్గొండ : పట్టణంలోని మామిళ్లగూడెంలో కరోనాతో చనిపోయిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబసభ్యులను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం పలువురు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. దయాకర్ రెడ్డి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ' పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో 203ను తక్షణమే రద్దు చేయాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంతో నాగార్జునసాగర్‌కు చుక్క నీరు రాదు. కుట్రలో భాగంగానే దక్షిణ తెలంగాణను ఎడారి చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కమీషన్ల కోసమే గోదావరి నీళ్లను కృష్ణాలో కలుపుతామంటున్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏడారిగా మారుతుంది. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పక్కన పెట్టారు. అందుకే ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి మేమెంతా సిద్ధంగా ఉన్నాం. జూన్ 2న ప్రాజెక్టుల వద్ద తలపెట్టిన ధర్నాలను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలి. పార్టీలకు అతీతంగా అందరూ ఈ పొరాటంలో కలిసి రావాలి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి రూ. వెయ్యి కోట్లు ఇస్తే ప్రాజెక్టు పూర్తి అయ్యేది. కానీ నిధులన్ని కేసీఆర్ కుటుంబానికి, నీళ్లు మాత్రం ఆంధ్ర ప్రాంతానికి తరలి పోతున్నాయి. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి. ఖబద్దార్ కేసీఆర్... ఇక ముందు నీ ఆటలు సాగవు. పోతిరెడ్డిపాడు ఇష్యూను పక్కదోవ పట్టించేందుకే కొండపోచమ్మలో సంబరాలు నిర్వహిస్తున్నారు. కొండపోచమ్మ ద్వారా కూడా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు... తగిన సమయంలో బుద్ధి చెబుతారంటూ' మండిపడ్డారు. లండన్‌లో భారత సంతతి వైద్యుడి మృతి వారం రోజుల్లోనే రైతులకు తీపి కబురు -
నిండేదెప్పుడు?... కరువు తీరేదెన్నడు?
-
అన్యాయం కాదు.. సమన్యాయం
‘‘రాయలసీమ కరువు నివారణ కోసం పలు ప్రాజెక్టులు చేపడితే ఎలా వివాదాస్పదం చేస్తున్నారో మీకు తెలుసు. మన యుద్ధం ఒక్క తెలుగుదేశం, చంద్రబాబుతో మాత్రమే కాదు.. ఒక ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం. ఒక టీవీ–5తో యుద్ధం చేస్తున్నాం, ఒక ఏబీఎన్‌తో చేస్తున్నాం. ఒక చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం’’ సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. కరువు ప్రాంతం రాయలసీమకు నీటిని సరఫరా చేస్తామంటే వివాదాస్పదం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో మనం కూడా 800 అడుగుల నుంచే 3 టీఎంసీలను తీసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామని, రూ.27 వేల కోట్ల వ్యయంతో ఈ ఏడాదే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఇరు రాష్ట్రాలు తమ వాటా ప్రకారమే నీటిని వాడుకుంటాయని, తద్వారా రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నారని, పోతిరెడ్డిపాడుపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణతో సమానంగా శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటామని, దీనివల్ల ఇద్దరికీ సమన్యాయం జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగదని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మిగతా ప్యాకేజీలకు ఈ ఏడాదే టెండర్లు పిలుస్తామని తెలిపారు. ‘మన పాలన– మీ సూచన’లో వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ..మంగళవారం క్యాంపు కార్యాలయంలో అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదిస్తున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు రూ.వెయ్యి కోట్లకుపైగా ప్రజాధనం ఆదా.. వ్యవసాయం బతకాలంటే నీటి అవసరాలు తీరాలి. అందుకోసం ప్రాజెక్టులు పూర్తి కావాలి. ప్రాజెక్టుల్లో అవినీతిని పూర్తిగా తొలగించి సరైన మార్గంలో పెట్టేందుకు సంవత్సరం పట్టింది. జలవనరుల శాఖలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1,095 కోట్లు ఆదా చేశాం. దీన్ని పట్టించుకోకుంటే నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయేది. ఇకపై యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తవుతాయి. ఈ ఏడాదే వీటిని ప్రారంభిస్తాం.. వంశధార ఫేజ్ –2, వంశధార–నాగావళి అనుసంధానం పూర్తిచేయాలి, వెలిగొండ టన్నెల్–1, నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తిచేయాలి. అవుకు టన్నెల్ కూడా పూర్తి కావాలి. ఈ ఏడాది వీటిని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. పూర్తిచేసి జాతికి అంకితం కూడా చేస్తాం. కోవిడ్ వల్ల పోలవరం పనులు కాస్త నెమ్మదించాయి. కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లారు. అయినా సరే వేగవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. పోలవరాన్ని 2021 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక పనులు పరుగులెత్తిస్తాం. నిండేదెప్పుడు?... కరువు తీరేదెన్నడు? ఇవాళ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు రాని పరిస్థితి నెలకొంది. కారణం.. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 881 అడుగులు ఉండాలి. అప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోగలం. నీటి మట్టం 854 అడుగులకు పడిపోతే 7 వేల క్యూసెక్కులను మాత్రమే తరలించగలిగే పరిస్థితి మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయి? కరువు ఎప్పుడు తీరుతుంది? మరోవైపు కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతూ పోతోంది. అటూ ఇటూ ప్రాజెక్టులు కడుతున్నారు. మన దగ్గర వరద కేవలం 10 నుంచి 12 రోజులు మాత్రమే ఉంటుంది. మరి అలాంటప్పుడు మన ప్రాజెక్టులు ఎప్పుడు నిండాలి?’ పక్కన తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు వారికి 800 అడుగుల్లోనే ఉన్నాయి. కాబట్టి దీనికి పరిష్కారం.. శ్రీశైలం నుంచి తెలంగాణ 800 అడుగుల ఎత్తులోనే నీరు డ్రా చేస్తోంది. మనం కూడా అదే ప్లాట్‌ఫామ్ మీద పంపులు పెట్టి, 3 టీఎంసీలు డ్రా చేసుకోవచ్చు. ఆ విధంగా వారు 800 అడుగుల్లో, మనమూ 800 అడుగుల్లో ఉంటాం. ఎవరికి కేటాయించిన నీటిని వారు వినియోగించుకుంటారు. ఎవరికీ నష్టం, కష్టం ఉండదు. న్యాయం అనేది సమానంగా జరుగుతుంది. ఈ ఏడాది కృష్ణమ్మ కరుణించడంతో.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలకు దేవుడి దయతో నీళ్లు వచ్చాయి. 12 ఏళ్ల తర్వాత కృష్ణా నదిలోకి ఇంత భారీగా నీరు వచ్చింది. రాయలసీమ ప్రాజెక్టులకు ఎప్పుడూ లేని విధంగా నీటిని పంపించగలిగాం. 45.77 టీఎంసీల గరిష్టస్థాయిలో పులిచింతలను నింపాం. సోమశిలలో కూడా 78 టీఎంసీలతో గరిష్టస్థాయిలో నింపాం. కండలేరులో 59.75 టీఎంసీల నీరు నింపగలిగాం. రాష్ట్రం సుభిక్షం ► రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ కింద రూ.27 వేల కోట్లతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంచబోతున్నాం. ఆ కాలువ ప్రస్తుత సామర్థ్యం 17,500 క్యూసెక్కులు కాగా 50 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీటిని తీసుకొస్తే చాలా ప్రాంతాలకు నీరు అందుతుంది. ఎందుకంటే అక్కడ అవసరాలు 25 వేల క్యూసెక్కులే కాబట్టి మిగిలిన నీటిని రాయలసీమకు తరలించవచ్చు. రాష్ట్రం అన్ని విధాలా బాగు పడుతుంది. ఆ విధంగా రైతులకు తోడుగా ఉంటాం. ఆ టెండర్లు కూడా పిలుస్తాం. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యయం రూ.17 వేల కోట్లు. ఈ ఏడాది కొన్ని ప్యాకేజీలకు టెండర్లు పిలుస్తాం. ఇప్పటికే ఒక ప్యాకేజీకి టెండర్లు పిలిచాం. కష్టకాలంలో ఆదుకున్నారు లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ రూ.5 వేలు ఇచ్చి ఆదుకున్నారు. కష్టకాలంలో ఈ డబ్బు రావడం ఎనలేని సంతోషాన్నిస్తోంది. – మహబూబ్ తాహెర్, జామియా మసీదు మౌజన్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా మహదానందంగా ఉంది కరోనా కారణంగా ప్రభుత్వాదేశాలతో ఆలయాన్ని మూసేశాం. భక్తులు లేకపోవడంతో ఆదాయం లేకుండాపోయింది. ధూప, దీప నైవేద్యాలకు కూడా ఇబ్బందిగా మారింది. అయినాసరే స్వామివారికి క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తున్నాం. 10 రోజుల క్రితం వలంటీర్ మా ఆలయానికి వచ్చి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందంటూ బ్యాంకు ఖాతా నెంబర్, ఇతర వివరాలు రాసుకెళ్లారు. నమ్మలేదు. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం ఎక్కడ సాయం చేస్తుందిలే అనుకున్నాం. కానీ, ఊహించని రీతిలో ఈరోజు మా ఖాతాల్లోకి రూ.5వేలు జమయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. ఆ లక్ష్మీనారాయణస్వామి ఆశీస్సులతో ఆయన మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. – డి. సారంగపాణి అయ్యంగార్, అర్చకులు, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం, అవనిగడ్డ, కృష్ణా జిల్లా ఏ ప్రభుత్వం ఇలా పట్టించుకోలేదు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా ఇలా ఇమామ్‌లు, మౌజన్లు, పూజారులు, పాస్టర్లకు ఆర్థిక సహాయం అందించిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటోంది. రెండు నెలలుగా చర్చిలు, దేవాలయాలు, మసీదులు మూతపడ్డాయి, దీంతో పేద పాస్టర్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. సీఎం అందించిన ఆర్థిక సాయం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. లబ్ధి పొందిన వారంతా ఆయనకు రుణపడి ఉంటారు. – రెవరెండ్ పిట్టా మల్లిరాజు, ప్రభువైన ఏసుక్రీస్తు సంఘం, రాజమహేంద్రవరం జగన్‌కు అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వక్ఫ్‌బోర్డు ద్వారా నెలవారీ జీతాలు పొందని ఇమాం, మౌజన్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల పక్షాన నిలబడి వారిని ఆదుకుంటున్న సీఎంకు అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. -
‘మే 29 రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నేరవేరే రోజు’
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రజల ఆకాంక్ష 29వ తేదీతో నెరవేరబోతుందని టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ఫొన్ కాల్ మేరకు చేబర్తి చెరువుకు తుం ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టు కోసం అటవీ అభివృద్ధి సంస్థ 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ప్రతాప్‌తో పాటు సర్పంచ్ అశోక్‌లు, మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో కొండపోచమ్మ సాగర్ ప్రారంభం కాబోతోందని చెప్పారు. (మర్కూక్ గ్రామ సర్పంచ్‌కు కేసీఆర్ ఫోన్!) తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయిందే నీళ్ల కోసమన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్‌కు పాదాభివందనం అని ఆయన వ్యాఖానించారు. గతంలో సరైన సమయంలో వర్షాలు పడక రైతులు నష్టపోయేవారు, ఇకముందు ఆ పరిస్థితి రాష్ట్రానికి లేదన్నారు. ఎక్కడైనా వంపుకు ఉన్న ప్రాంతానికి నీళ్లు వస్తాయి కానీ కేసీఆర్ కృషి వల్ల ఎత్తుకు నీటిని తరలించుకుంటున్నామన్నారు. మనంజన్మలో సాధ్యమవుతుందా అని అనుకున్న.. అసాధ్యమైన పనిని కేసీఆర్ సుసాధ్యంతో చేశారని వ్యాఖ్యానించారు. అలాగే చేబర్తి గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఫోన్ చేసి మీ చెరువు నింపుతామని సీఎం కేసీఆర్ చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా గ్రామం తరుపున కేసీఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్) -
నీళ్ల పేరిట నిధుల ఎత్తిపోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనాలోచితంగా, తప్పుడు నిర్ణయాలతో ముందు కెళ్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నీళ్లను సాకుగా చూపి అడ్డుగోలుగా నిధులు ఎత్తిపోస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, వాటికి నిధులివ్వకుండా ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతలకే రూ. లక్ష కోట్లు ఖర్చు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా అందించగల గోదావరి, కృష్ణా జలాలను వదిలిపెట్టి ఎత్తిపోతలకే ఎందుకు మొగ్గుచూపుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనాలోచిత నిర్ణయాలను ఎండగట్టేందుకే కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల వద్ద దీక్షలకు దిగనున్నామన్న ఉత్తమ్ సోమ వారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... అదనపు టీఎంసీకన్నా.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి మిన్న.. కాంగ్రెస్ హయాంలోనే కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా, ఎస్ఎల్బీసీ, దేవాదుల వంటి పథకాలు చేపట్టి 85 శాతం పూర్తి చేశాం. మరో రూ. 2–3 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీళ్లొ స్తాయి. కానీ వాటిని ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టింది. తమ్మిడిహెట్టి ద్వారా వచ్చే గ్రావిటీ గోదావరి నీటిని వదిలేసి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టింది. కాళేశ్వరం ద్వారా ఇంతవరకు ఒక్క ఎకరా కొత్త ఆయకట్టుకైనా నీళ్లిచ్చారా? కాళేశ్వరం ద్వారా ఎత్తిపోయకున్నా ఎస్సారెస్పీలోకి వచ్చిన వరద జలాల ద్వారా స్టేజ్–2 ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కేవలం రూ. 2 వేల కోట్లు ఖర్చవుతుంది. దీనిద్వారా సుమారు 100 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా సుందిళ్లకు తరలించి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా కేసీఆర్ ఎందుకు దీని నిర్మాణం చేయలేదు? రెండో టీఎంసీ నీటిని ఎత్తిపోయకుండానే కాళేశ్వరం ద్వారా 3వ టీఎంసీ నీటి ఎత్తిపోతలు చేపట్టారు. ఈ నిధులను తమ్మిడిహెట్టి, పెండింగ్ ప్రాజె క్టులపై ఖర్చు చేస్తే బాగుంటుంది కదా. కృష్ణాపై ఏపీ కొత్త ప్రాజెక్టులు కడితే రాష్ట్రానికి నీరు గగనమే.. ఇప్పటికే కృష్ణా నదిలో వరద ప్రవాహాలు కరువయ్యాయి. ఆగస్టులో ఎగువ నుంచి వరద వచ్చినా 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం నిండి అక్కడి నుంచి సాగర్ వరకు నీరొచ్చేందుకు మరో నెలకుపైగా సమయం పడుతోంది. శ్రీశైలంపై ఆధార పడి తెలంగాణలో కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు న్నాయి. ఇవన్నీ ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అవసరాలు తీర్చేవే. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏపీ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచినా, కొత్తగా రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేలా కొత్త పథకాలు చేపట్టినా తెలంగాణకు నీరు దక్కడం గగనమే. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీరు రావాలంటేనే సెప్టెంబర్ పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటిని ఎప్పటికప్పుడే తీసుకుంటే అక్టోబర్, నవంబర్ వరకు నీరు రాదు. అదే జరిగితే సాగర్ కింది ఆయకట్టు 6.40 లక్షల ఎకరాలతోపాటు ఏఎంఆర్పీ తాగు, సాగునీటి అవసరాలకు పూర్తిగా విఘాతమే. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారే. ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపేందుకే దీక్షలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలపై తీరని భారం పడనుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా రూ. వేల కోట్ల వడ్డీలు, కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న డిమాండ్‌తో జలదీక్షలు చేయనున్నాం. జూన్ 2న కృష్ణా ప్రాజెక్టుల వద్ద, 6న గోదావరి ప్రాజెక్టుల వద్ద పార్టీ నేతలు, శ్రేణులు దీక్షలు చేస్తారు. గ్రావిటీ ద్వారా కృష్ణా నీటిని తీసుకొచ్చే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డితో కలసి నేను దీక్షలో కూర్చుంటా. పాలమూరు ప్రాజెక్టులోని లక్ష్మీదేవునిపల్లి వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుర్తి వద్ద వంశీచంద్‌రెడ్డి, ఎల్లూరు వద్ద నాగం జనార్దన్‌రెడ్డి, నెట్టెంపాడు వద్ద సంపత్, కర్వెన వద్ద చిన్నారెడ్డి దీక్షలో కూర్చుంటారు. -
కేసీఆర్‌కు ఫ్యాషన్‌గా మారింది: వివేక్
సాక్షి, పెద్దపల్లి : అబద్దాలు చెప్పడం, ఇచ్చిన హామీలను విస్మరించడం సీఎం కేసీఆర్‌కు ఫ్యాషన్‌గా మారిందని మాజీ ఎంపీ గడ్డం వివేక్ విమర్శించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంలో ప్రతిపక్షాలను కేసీఆర్ నిందించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 12 కిలోల బియ్యంలో 10 కిలోలు కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతుల ధాన్యం కొనుగోలు కూడా కేంద్రమే బరిస్తోందని గుర్తుచేశారు. రైతు బంధును నిలిపివేసే కుట్రలో భాగంగానే పంటలపై సీఎం కేసీఆర్ ఆంక్షలను విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతల పట్ల వారి సమస్యల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే రూ. లక్ష వరకు రుణమాఫీని ఒకే దఫాలో అమలు పరచాలని డిమాండ్ చేశారు. చదవండి: కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది! కరోనాకు ప్రైవేట్ వైద్యం -
శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు
సాక్షి, పోలవరం: గోదావరి నదిపై మేఘా మహాయజ్ఞం ఆరంభమైంది. అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. కుయుక్తులతో, రాజకీయ కక్షలతో వేసే, వేయించే కేసులు, భారీ వరదల వంటి అవాంతరాలు ఎదురుకాని పక్షంలో దేశంలోనే పెద్దదైన బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరంను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ప్రణాలికలు రూపొందించింది. ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. పుష్కర కాలం క్రితం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ప్రాజెక్ట్ నిర్మాణం నత్త నడక కన్నా నెమ్మదిగా జరిగాయి. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారు. రివర్స్ టెండరింగ్ లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును ప్రభుత్వానికి రూ 628 కోట్లు ఆదా అయ్యేలా మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఆ వెంటనే పనుల వేగం పెరిగింది. ప్రభుత్వం, మేఘా సర్వశక్తులు సమీకరించి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నాయి. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మేఘా పట్టుదల, కార్మికులు, సిబ్బంది వల్ల పనులు చకచకా నడుస్తున్నాయి. 3. 07 లక్షల ఘణపు మీటర్ల కాంక్రీట్ పనిని ఈ ఏడాది ఆగష్టు నాటికి పూర్తి చేయాలనీ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న మేఘా అందుకు అవసమైన ఇంజనీరింగ్ సిబ్బంది, విభాగాల వారి నిపుణులు, అధునాతన యంత్రాలు, సుమారు ఐదు వేలకు పైగా కార్మికులను షిప్ట్‌ల వారీగా పని చేయిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం దూకుడుగా కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని పరిశీలించటంతో పాటు జలవనరులశాఖ అధికారులు, సిబ్బంది, మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఉత్సాహ పరచటంతో పాటు మార్గ నిర్ధేశం చేసేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 27న గురువారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ కాలానికి పోలవరం ప్రాజెక్ట్ జలాశయం లో ప్రధానమైన స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ పూర్తి చేసేలా ప్రభుత్వం, మేఘా సంస్థ ప్రణాళికలు రూపొందించాయి. ఇప్పటికే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా పేరు గాంచిన కాళేశ్వరం, పట్టిసీమ, హంద్రీనీవా వంటి అనేక పధకాలను చేపట్టి పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ పోలవరం పనులు చేపట్టటంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పూర్తి అవుతుందనే నమ్మకం ప్రజలు, అధికారులు, ముఖ్యంగా పోలవరం ఆయకట్టు ప్రాంత రైతులకు వచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్ వే లోనే 53 బ్లాక్ ల నిర్మాణం కీలకం. ఈ పనిని గడువులోగా పూర్తి చేసేందుకు మేఘా పనులు చేపట్టింది. అందుకు అవసరమైన లక్ష్యాలను నిర్ధేశించుకుంది. బాబు తప్పిదంతో పనుల ఆలస్యానికి కారణం రివర్స్ టెండరింగ్ లో పనులు దక్కించుకున్న మేఘా వాటిని ప్రారంభించటానికి మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. తొలుత స్పిల్ వే నిర్మించిన అనంతరం కాపర్ డ్యామ్ వగైరా నిర్మిస్తే ముంపు సమస్య వచ్చేది కాదు. కాపర్ డ్యామ్ వల్ల పలు ప్రాంతాలు మునిగి పోయాయి . పోలవరం స్పిల్ వే లో నాలుగు టి ఎం సి ల నీరు నిల్వ ఉంది. రోడ్స్ అన్ని పాడై పోయాయి. నీటిని తోడి, రోడ్స్ సరి చేసేందుకు మూడు నెలల విలువైన సమయాన్ని మేఘా వెచ్చించాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సమస్య లేకపోతె ప్రాజెక్ట్ పనుల్లో సింహభాగం చివరి దశకు వచ్చేవి. ప్రస్తుతం పోలవరం పనులు ఊపందుకున్నాయి. జలాశయంలో కీలకమైన స్పిల్‌వే లో 53 బ్లాకులను నిర్మించాలి. ఒక్కొక్క బ్లాకు 55 మీటర్ల ఎత్తు ఉంటుంది . వీటిని పూర్తి చేసే పనులు ఊపందుకున్నాయి. ఒక బ్లాకులో ఒక మీటర్ ఎత్తు నిర్మించడానికి (కాంక్రీట్ వేయడానికి) నాలుగు రోజుల సమయం పడుతుంది. సరాసరిన ప్రతీరోజు 12 బ్లాకుల్లో ఎత్తు పెంచే పని చురుగ్గా జరుగుతోంది. ఈ మొత్తం స్పిల్‌వేలో రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల పనిచేయాలి. గత ఏడాది వరదల వల్ల ఎదురైనా అడ్డంకులను అధిగమించి జనవరి నెలాఖరు నాటికి 25 వేల క్యూబిక్ మీటర్ల పనిని ఎంఇఐఎల్ పూర్తిచేసింది. ఫిబ్రవరిలో 40 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. మార్చిలో 50 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసి, మిగిలిన పనిని ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో పూర్తిచేయాలని మైల్ స్టోన్ గా పెట్టుకున్న మేఘా సంస్థ జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో ముందుకు సాగుతోంది. రోజుకు 15 వందల క్యూబిక్ మీటర్ల పనిచేయాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్‌వేలోని పియర్స్, ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్ డ్యామ్ పునాది పనులు మేఘా మొదలుపెట్టింది. జలాశయంలో కీలకమైన మోడీ గ్యాపులలో 1,3కి సంబంధించిన డిజైన్లు ఆమోదం పొందే పని మేఘా చేపట్టింది. పోలవరం జలాశయం ఒక్కటైనా దీనిని మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంటారు. గ్యాప్1తో పాటు స్పిల్ వే, ఎర్త్ కమ్ ర్యాక్‌ఫిల్ డ్యాం కీలకమైనవి. ఇందులో గ్యాప్3ను 150 మీటర్ల పొడవుతో చిన్నపాటి కాంక్రీట్ డ్యామ్‌గా పూర్తిచేయాలి. గ్యాప్2లో ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్ డ్యాం ఉంటుంది. దీనినే ప్రధానమైన జలాశయంగా పిలుస్తారు. దీని పొడవు 1.75 కిలోమీటర్లు ఉంటుంది. గ్యాప్1లో కూడా ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్ డ్యామే నిర్మించాలి. దీని పొడవు 450 మీటర్లు ఉంటుంది. ప్రాజెక్ట్‌లో ర్యాక్‌ఫిల్ డ్యాం పనులు చేపట్టడానికి అవసరమైన వైబ్రో కంప్యాక్షన్ పరీక్షలను మేఘా నిర్వహిస్తోంది. అదే సమయంలో ప్రాజెక్ట్‌కు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణం వల్ల ప్రాజెక్ట్ పనిజరుగుతున్నప్పుడు వరదలు వస్తే నీటిని మళ్లించడం వీలవుతుంది. గ్యాప్1లో డయాఫ్రం వాల్, స్పిల్ వే ఎగువ, దిగువన కాంక్రీట్ పనులు ప్రారంభించడానికి మేఘా ఏర్పాట్లు చేసుకుంది. వచ్చే ఏప్రిల్‌కు పోలవరంలో మెజారిటీ పనులు పూర్తి పోలవరం ప్రాజెక్ట్‌లోని ముఖ్యమైన పనులను పూర్తిచేయడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ లక్ష్యాలను పెట్టుకోంది. స్పిల్‌వే కాంక్రీట్పనిని 5 నెలలో అంటే 2020 జూన్ నెలఖరు నాటికి పూర్తిచేయాలనేది ఆ లక్ష్యాలలో ఒకటి. ఇందులో భాగమైన బీమ్‌లు అంతకన్నా ముందే మే నెలఖరు నాటికి పూర్తిచేయాలనే ప్రణాళిక ప్రకారం పనులు వేగిరం అయ్యాయి. స్పిల్‌వేకు సంబంధించిన బ్రిడ్జ్ పనులు పూర్తికి ఏడు నెలల సమయం పడుతుంది. స్పిల్ వే చానెల్‌కు సంబంధించిన బ్రిడ్జ్ పనులు 2021 మే నాటికి పూర్తికావాలి. ఈ పని మొత్తంగా 14 నెలల సమయం పడుతుంది. ఇందుకు సంబంధి ఇప్పుడు డిజైన్ల అనుమతులు తీసుకొని చకచకా పనులు చేయనున్నారు. డివైడ్ వాల్, ట్రైనింగ్‌వాల్, గైడ్ వాల్ లాంటివి 5 నెలల్లో అంటే ఈ ఏడాది మే నెలఖరుకు పూర్తిచేయాలి. ప్రాజెక్ట్ కోటింగ్, సర్ఫేస్ డ్రస్సింగ్, తారు రహదారి లాంటి ఫినిషింగ్ పనులు 2021 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో లక్షా ముప్పైవేలు సాగులోకి రావడంతో పాటు 80 టిఎంసీల నీటిని కృష్ణకు తరలించడమే కాకుండా గోదావరి డెల్టాలో 13 లక్షల ఆయకట్టు రబీలో స్థిరీకరించి ఎడమ కాలువ క్రింద లక్షా అరవైవేల ఎకరాలకు నీరందిస్తారు. విశాఖ నగరానికి తాగునీటి అవసరాల కోసం 23.44 టిఎంసీల నీరు అందిస్తారు. -
‘సాగునీటి’కి కోతే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో సాగునీటి శాఖకు మళ్లీ కోతపడే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, కేంద్ర కేటాయింపుల్లో తగ్గుదల నేపథ్యంలో ఈమారు సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లో మినహా అంతకుముందు ఏడాదుల్లో వరుసగా రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది రూ.10 వేల కోట్లకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎప్పటి మాదిరే రుణ సంస్థల నుంచి ప్రధాన ప్రాజెక్టులకు తీసుకుంటున్న రుణాల ద్వారానే మళ్లీ గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకే.. ఆర్థిక మాంద్యం దెబ్బతో గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో సాగునీటి శాఖకు కేవలం రూ.8,476.17 కోట్లకు తగ్గించింది. ఇందులో మేజర్ ఇరిగేషన్‌కు రూ.7,794.30 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.30 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింది కేటాయింపులను పక్కనపెడితే ప్రగతిపద్దు కింది కేటాయింపులు కేవలం రూ.6,500 కోట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 2019–20 వార్షికంలో ఏప్రిల్ నుంచి ఇంతవరకు రూ.18 వేల కోట్ల మేర ఖర్చయింది. ఇందులో రూ.10 వేల కోట్ల మేర రుణాల ద్వారా చేసిన ఖర్చు కాగా, మిగతా రూ.8 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధిక నిధుల ఖర్చు జరిగింది. వచ్చే వార్షిక బడ్జెట్లో రూ.21 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి, మరో రూ.22 వేల కోట్లు రుణాల రూపేణా కేటాయించాలని సాగునీటి శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్ర వాటా తగ్గడం, ఆర్థిక మాంద్యం ఛాయలు తగ్గకపోవడంతో ఈ ఏడాది సైతం బడ్జెట్లో కేటాయింపులు రూ.10 వేల కోట్లకు మించి ఉండవని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇందులోనూ మునుపటి మాదిరే కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధికంగా కేటాయింపులు దక్కే అవకాశం ఉంది. పాలమూరు–రంగారెడ్డికి రూ.2 వేల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు మరో రూ.2 వేల కోట్లు, దేవాదులకు రూ.600 కోట్లు, తుపాకులగూడెంకు రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. రాష్ట్ర బడ్జెట్ నిధులతో పాటే ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా గరిష్టంగా రూ.15 వేల కోట్ల మేర రుణాలతోనే ఈ ప్రాజెక్టులకు నిధుల లభ్యత పెంచనున్నారు. పాత ప్రాజెక్టులకు నిరాశే.. ఇక పాత ప్రాజెక్టులకు మాత్రం మళ్ళీ నిరాశ తప్పేలా లేదు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాతో పాటు ఎల్ఎల్బీసీ టన్నెల్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కోత తప్పదని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కనిష్టంగా రూ.1,200 కోట్లు అవసరముంది. అయితే ఇప్పటికే సాగునీటి శాఖ పరిధిలో రూ.10 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులుండగా, ఇందులో ప్రధాన పనులకు సంబంధించి రూ.5,500 కోట్లున్నాయి. ప్రస్తుతం బడ్జెట్లో ప్రవేశపెట్టే నిధులు పనులకు సంబంధించిన పెండింగ్ పనులకే చెల్లిస్తే, మిగిలే నిధులు చాలా తక్కువ. ఇవీ ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఖర్చుచేస్తే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కష్టతరంగా మారనుంది. -
సాగునీటి ప్రాజెక్ట్‌లపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: నిర్దేశిత సమయంలోగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలను పరిశీలించి తుది ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సహా ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. (రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్) గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, రాయలసీమలో కరువు నివారణ కోసం చేపట్టాల్సిన కాల్వల విస్తరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై ముందుకెళ్లాలన్నారు. వీటిపై మరింత అధ్యయనం చేసి, అనుసరించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, నిర్దేశిత సమయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు. (బాబు పాలనలో సీమ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం) పోలవరం నుంచి విశాఖకు ప్రత్యేక పైప్‌లైన్‌పై కూడా ప్రణాళిక సిద్ధం చేయాలని, పోలవరం, వెలిగొండ, చిత్రావతి, గండికోట ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలవరం మినహా ప్రస్తుతం కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు రూ.25,698 కోట్లు, రాయలసీమ కరువు నివారణ పనుల కోసం రూ.33,8689 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం రూ.15,488 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. (‘పెండింగ్’ పాపం ఎవరిది?) -
ఎక్కడికక్కడే నీటి కట్టడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్ డ్యామ్‌లు నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మొత్తం ఎన్ని చెక్ డ్యామ్‌లు అవసరమో గుర్తిం చి, అందులో సగం చెక్ డ్యాములను ఈ ఏడాది, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించాలని చెప్పా రు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ప్రతి ఏటా చేపట్టాలని ఆదేశిం చారు. చిన్న నీటి వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, భానుప్రసాద్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్సీలు మురళీధర్ రావు, విజయ్ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, సీఈలు వీరయ్య, హమీద్ ఖాన్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రానికి సాగునీటి సమస్య తీరుతోంది. కాళేశ్వ రం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులతో గోదావరి నది నుంచి మన వాటా ప్రకారం పుష్కలంగా నీటిని తీసుకుంటాం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 500కు పైగా టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎస్ఆర్ఎస్పీలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ లాంటి రిజర్వాయర్లు నింపుకుంటాం. అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీరిస్తాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలధార ఉంటుంది. పంటలు సంవృద్ధిగా పండుతాయి. పంటలకు నీళ్లిచ్చే క్రమంలో పడుబాటు నీళ్లు, వర్షం నీళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ నీళ్లు సహజంగా ఏర్పడిన వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందికి వెళ్లిపోతాయి. ఈ నీళ్లను ఎక్కడికక్కడ ఆపడానికి విరివిగా చెక్ డ్యామ్‌లు నిర్మించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్ డ్యామ్‌లున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని మంజూరు చేయాలి? అనే లెక్కలు తీయాలి. అవసరమైనన్ని చెక్ డ్యామ్‌లను గుర్తించిన తర్వాత వాటిలో సగం ఈ ఏడాదే నిర్మించాలి. దీని కోసం జనవరి 15 నాటికి టెండర్లు పిలవాలి. మిగతా సగం చెక్ డ్యామ్‌లను వచ్చే ఏడాది నిర్మించాలి. వీటి నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం’అని ముఖ్యమంత్రి చెప్పారు. చెరువుల నిర్వహణకు నిధులు.. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణకు బడ్జెట్లో నిధులిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్పూర్తితో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించుకున్నాం. ఈ చెరువులు ఊరికి బతుకు దెరువుగా ఉపయోగపడుతున్నాయి. పునరుద్ధరించుకున్న చెరువుల కట్టలు, తూములు, కాల్వలు, ఇతరత్రా మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయాలి. దీనికోసం ప్రతీ ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. ప్రతీ వేసవిలో చెరువులోని పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లోకి తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలి. వ్యవసాయ శాఖ, రైతు సమన్వయ సమితి, గ్రామ పంచాయతీలు సమన్వయంతో వ్యవహరించి పూడిక మట్టిని పొలాలకు తరలించుకునేలా చూడాలి. గతంలో మాదిరిగా నీరటి కాడు వ్యవస్థను పునరుద్ధరించాలి. వీఆర్ఏలలో ఒకరికి చెరువుల పని అప్పగించాలి. చెరువుల్లో మొలిచే మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి’అని కేసీఆర్ అన్నారు. అక్టోబర్ నాటికే అన్నీ నింపాలి.. వర్షాకాలం ఆరంభంలోనే కడెం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు ఎల్లంపల్లికి చేరుకునే అవకాశం ఉన్నందున, వేసవి కాలంలోనే ఎల్లంపల్లి నీటిని ఎస్ఆర్ఎస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లకు సూచించారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు ఎప్పుడూ నీటి కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో నింపాలని సూచించారు. మిర్యాలగూడ డివిజన్లోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి నీళ్లివ్వడానికి అనువుగా ఎత్తిపోతల పథకం నిర్మించే అంశాన్ని పరిశీలించాలని, సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మారిన నీటిపారుదల వ్యవస్థ స్వరూపం మేరకు నీటి పారుదల శాఖను ఐదారుగురు ఈఎన్సీల పరిధిలోకి తీసుకురావాలని, దీనికి తగ్గట్టు శాఖను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈఎన్సీలు తమ పరిధిలోని ప్రాంతంలో అన్ని రకాల నీటి వనరులను పర్యవేక్షించాలని చెప్పారు. భారీ, మధ్య తరహా, చిన్న తరహా అనే తేడా లేకుండా నీటి పారుదల శాఖ ఒకే విభాగంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ వివరించారు. -
మరికొన్ని ప్రాజెక్టులకు లీకేజీ ముప్పు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మరికొన్ని ప్రాజెక్టులకు కూడా లీకేజీ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కర్ణాటకలో కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదలతో నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్టుల కట్టలు ఎప్పుడు తెగుతాయో అనే భయం ఆయా ప్రాంతాల ప్రజలను, అధికారులను వెంటాడుతోంది. సరళాసాగర్ ప్రాజెక్టు కట్టకు గండి పడడంతో ఉలిక్కిపడ్డ ఇరిగేషన్ శాఖ అధికారులు అలాంటి సమస్యలున్న ప్రాజెక్టులు, చెరువులపై దృష్టి సారించారు. ప్రియదర్శిని జూరాల, దేవరకద్ర ప్రాజెక్టులతో పాటు పలు సాగునీటి కాలువలు, చెరువులకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఏటా వేసవిలోనే చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల కట్టలు, గేట్లను పరిశీలించి కాలువ కట్టల మరమ్మతు, తూముల నిర్వహణ, పూడికతీత పను లు చేపట్టాల్సి ఉంటుంది. అయితే రెండేళ్ల నుండి నిధులు లేవని.. అందుకే మరమ్మతు చేపట్టలేకపోతున్నామని ఇరిగేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యం లో సాంకేతిక సిబ్బందితో కూడిన ప్రాజెక్టు భద్రతా కమిటీ జూరాల ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. జూరాలకు పదిహేనేళ్ల నుంచి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రాజెక్టు గేట్లకు తప్పు ఏర్పడింది. జూరాల గేట్లకు సమస్య వస్తే.. ఈ ప్రాజెక్టు కింద ఉన్న నెట్టెంపాడు, భీమా–1, 2, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం పడుతుంది. ఫలితంగా వాటి పరిధిలో ఉన్న మరో ఐదు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటి సమస్య వస్తుంది. జూరాల ఇలా.. వరదల కారణంగా దెబ్బతిన్న జూరాల కరకట్ట కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టుకూ ముప్పుపొంచి ఉంది. ఉమ్మడి జిల్లా అంతటికీ వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టును 1984లో బహుళార్థ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యంతో జూరాల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు షట్టర్ల సమీపంలోని కరకట్ట మొన్నటి వరదల కారణంగా పూర్తిస్థాయిలో దెబ్బతింది. పుష్కరఘాట్లతో పాటు ఏర్పాటుచేసిన కరకట్ట కూడా నీటి ప్రవాహానికి కూలిపోయింది. వీటిని అధికారులు గుర్తించినా ఇప్పటివరకు మరమ్మతు చేసే ప్రయత్నాలు కూడా చేపట్టక పోవడంతో భవిష్యత్తులో మళ్లీ వరదలు వస్తే కరకట్ట పూర్తిగా కొట్టుకపోయి ప్రాజెక్టు దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. కోయిల్‌సాగర్.. కోయిల్‌సాగర్ గేటు నుంచి నీటి లీకేజీ దేవరకద్ర మండల పరిధిలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకూ లీకేజీ ముప్పు ఉంది. ప్రాజెక్టుకు 13 గేట్లు ఉండగా.. రెండు గేట్ల కింది భాగం నుంచి నీరు మెల్లగా లీకేజీ అవుతోంది. గతేడాది ప్రాజెక్టు గేట్లకు కింది భాగంలో కొత్త వాచర్లు వేసిన తరువాత లీకేజీ సమస్య కాస్త తీరింది. అయినా కొన్ని చోట్ల లీకేజీ అవుతూ నీరు వృథాగా పోతోంది. మరోపక్క.. ఏడు దశాబ్దాల క్రితం గచ్చురాయితో నిర్మించిన ప్రాజెక్టు అలుగు నుంచి నీటితడి బయటకు వస్తోంది. ప్రమాదం జరగక ముందే అలుగును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇటు డ్యామ్ కట్ట సైతం పలు చోట్ల కోతకు గురైంది. ప్రాజెక్టులోకి వెళ్లే మెట్లు ధ్వంసమై ఏడాది దాటినా ఇప్పటికీ మరమ్మతుకు నోచుకోలేదు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 31.3 అడుగుల వరకు నీరుంది. ఇదిలా ఉండగా నాలుగు దశాబ్దాల నుంచి ప్రాజెక్టు గేట్లు, కట్టకు ఎలాంటి మరమ్మతు చేపట్టలేదు. డ్యామ్ కట్టపై ఉండే ప్లాట్‌ఫాం సైతం మరమ్మతు లేక మట్టి కొట్టుకుపోయింది. శిథిలావస్థలో ఆర్డీఎస్ కాల్వ.. డి–25 సమీపంలో కోతకు గురైన ఆర్డీఎస్ ప్రధాన కాల్వ వడ్డేపల్లి మండల పరిధిలోని ఆర్డీఎస్ ప్రధాన కాల్వ డిస్ట్రిబ్యూటరీ 24 నుంచి 28 వరకు శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల క్రితం కెనాల్‌కు ఇరువైపులా అతికించిన సిమెంట్ బిల్లలు శిథిలమై కాలువ కోతకు గురవుతోంది. ఈ ఏడాది సెపె్టంబర్లో కాలువకు గండి పడింది. మూడు రోజుల పాటు సాగునీరందక రైతులు ఆందోళన చెందారు. కేఎల్ఐ.. కేఎల్ఐ 10వ కి.మీ. వద్ద సిమెంటు దిమ్మె భాగంలో కొట్టుకుపోయిన మట్టి రైతులకు వరప్రదాయిని అయిన మహాత్మాగాంధీ లిఫ్టు ఇరిగేషన్ (ఎంజీ కేఎల్ఐ) ప్రాజెక్టు కాలువలు నాణ్యతా లోపాలతో కోతలకు గురవుతున్నాయి. గుడిపల్లి రిజర్వాయర్ నుంచి అచ్చం పేట వరకు 90కి.మీ. దూరం ప్రవహించే బ్రాంచ్ కెనాల్ నాణ్యతా లోపంతో అక్కడక్కడ కోతకు గురైంది. అదే కాల్వను అనుసరించి ఏర్పాటు చేసిన సబ్ కెనాల్ సైతం అక్కడక్కడ కోతకు గురైంది. -
కరువు సీమలో జలసిరులు!
‘రాయచోటి గురించి క్లుప్తంగా రెండే రెండు మాటలు చెప్పాలంటే.. తాగునీరు, సాగునీటి కోసం అల్లాడుతున్న నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. రాయలసీమే వెనకకబడిన ప్రాంతమైతే అందులోనూ అత్యంత వెనకబాటుకు గురైన ప్రాంతం రాయచోటి. దివంగత వైఎస్సార్‌ను అత్యధికంగా ప్రేమించే ప్రాంతం కూడా ఇదే. వైఎస్సార్ ఈ ప్రాంత దుస్థితిని చూసి వెలిగల్లు రిజర్వాయర్ నిరి్మంచారు. రాయచోటిలో ఔటర్ రింగ్‌రోడ్డు కూడా తెచ్చారు. నాన్న చనిపోయిన తరువాత రాయచోటి గురించి పట్టించుకోవాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఒక్కరంటే ఒక్కరు కూడా లేని పరిస్థితిని పదేళ్లుగా చూస్తున్నాం. గత సర్కారు హయాంలో రాయచోటి అభివృద్ధి కోసం మున్సిపల్ చైర్ పర్సన్ నిధులు అడిగితే పార్టీ మారి తమ కండువా కప్పుకుంటే రూ.3 కోట్లు ఇస్తామని నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఇవాళ అడక్కపోయినా ఆర్నెళ్లు తిరగక ముందే రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2,000 కోట్లకు పైచిలుకు ఖర్చు పెడుతున్నామని సగర్వంగా చెబుతున్నా. మీ అందరి ఆశీర్వాదం, దేవుడి దయతో మన ప్రభుత్వం నేడు అధికారంలోకి వచి్చంది. మీ కష్టాలు తీర్చేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’ ‘మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఇక్కడే.. ఇదే రాయచోటిలో ఎన్నికల వేళ నేను ఓ మాటిచ్చా. రాయచోటిలో ఎప్పటి నుంచో వక్ఫ్ బోర్డు, విద్యాశాఖ మధ్య వివాదం నెలకొన్న నాలుగు ఎకరాల స్థలాన్ని ముస్లింల అభ్యున్నతి కోసం వక్ఫ్ బోర్డుకు ఇస్తామని చెప్పాం. రేపటికల్లా ఆ కార్యక్రమం పూర్తి చేస్తామని ఇదే వేదిక నుంచి చెబుతున్నా (ప్రజల హర్షధ్వానాలు). రాయచోటిలో జూనియర్ కాలేజీ, హైస్కూలు వినియోగించుకునే గ్రౌండ్‌ను అత్యాధునిక క్రీడా మైదానంగా రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తాం’ గత ప్రభుత్వం కాలువలను పట్టించుకోకపోవడం, సామర్థ్యాన్ని పెంచకపోవడం, సహాయ పునరావాసం డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు నీళ్లు ఉన్నా డ్యాముల్లో నింపలేని దుస్థితి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఇక మార్చేస్తాం.– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి కడప: సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు ప్రధాన కాలువలను విస్తరించి కరువును పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రూ.60,000 కోట్లు వెంచించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు గోదావరి, కృష్ణా వరద జలాలను తరలించనున్నట్లు సీఎం ప్రకటించారు. మరో రూ.23 వేల కోట్లు ఖర్చు చేసి పోతిరెడ్డిపాడుతోపాటు కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, హంద్రీ–నీవా, అవుకు, గండికోట తదితర ప్రాజెక్టుల ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు చెప్పారు. దీనివల్ల రాయచోటితోపాటు తంబళ్లపల్లి, పీలేరు, చిత్తూరు, మదనపల్లి, పలమనేరు, కుప్పం ప్రాంతాలకు మేలు జరుగుతుందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రూ.2 వేల కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. రిజర్వాయర్లున్నా నింపలేని దుస్థితి ‘‘రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో మనమంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ఏడాది శ్రీశైలంలో వరదలు వచ్చాయి. ఎనిమిది సార్లు గేట్లు ఎత్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 800 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇన్ని రోజులు కృష్ణా నది నిండుగా ప్రవహించినా రాయలసీమలోని ప్రాజెక్టులు మాత్రం నిండని పరిస్థితి కనిపిస్తోంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటంటే గండికోట పూర్తి సామర్థ్యం 26 టీఎంసీలు కాగా ఇంత భారీ వర్షాలు, పైనుంచి నీళ్లు వచి్చనా కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం.చిత్రావతి కెపాసిటీ 10 టీఎంసీలు అయితే నింపగలిగింది కేవలం ఆరు టీఎంసీలు మాత్రమే. 17.3 టీఎంసీల కెపాసిటీ కలిగిన బ్రహ్మంసాగర్‌లో కేవలం ఎనిమిది టీఎంసీలు మాత్రమే నింపగలిగే అధ్వానమైన పరిస్థితి. రిజర్వాయర్లు ఉన్నా నీటిని నింపుకోలేని దుస్థితిలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులున్నాయి. కాలువలు సరిగా లేకపోవడం, నీళ్లు పూర్తి స్థాయిలో తరలించే సామర్థ్యం లేకపోవడం, సహాయ, పునరావాసానికి డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఈరోజు నీళ్లున్నా డ్యాముల్లో నింపుకోలేని పరిస్థితిలో రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కనిపిస్తున్నాయి. బహిరంగ సభకు హాజరైన జనవాహినిలో ఒక భాగం గతంలో చేపడితే దశ, దిశ మారేది మన ప్రభుత్వం వచ్చి కేవలం ఆర్నెళ్లే అయింది. ఆర్అండ్ఆర్ కింద బాధితులను తరలించాలంటే సర్వేలు జరగాలి, ఎస్టిమేట్లు తయారు కావాలి, ఇళ్ల స్థలాల కేటాయింపు జరగాలి, స్ట్రక్చరల్ ఇవాల్యూయేషన్ జరగాలి, పేమెంట్ ఫర్ రీ లొకేషన్ చేయాలి. ఇవన్నీ నిబంధనల ప్రకారం చేయాలంటే కనీసం ఎనిమిది నుంచి పది నెలలు పడుతుంది. ఈ పనులన్నీ కూడా గతంలో కనుక చేసి ఉంటే, కాస్తో కూస్తో డబ్బులు కనుక ఇచ్చి పనులు చేసి ఉంటే ఈపాటికి రాయలసీమలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపించేవి. ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి కాలువల సామర్థ్యం పెంచి ఉంటే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులో ప్రాజెక్టుల దశ, దిశ మారిపోయి ఉండేవి. సామర్థ్యం పెంచి వరదను సది్వనియోగం చేసుకుంటాం కృష్ణా నదికి వరదలు 40–50 రోజులకు మించని పరిస్థితి కనిపిస్తోంది. ఆ వరద వచి్చనప్పుడే రాయలసీమలోని ప్రతి డ్యామ్ నిండాలి, నెల్లూరు, ప్రకాశంలోనూ ప్రాజెక్టులు నిండాలి. దీనికోసం ఏం చేయాలనే ఆలోచన జరిగింది ఈ ఆర్నెళ్లలో. ఈ దిశగా ముందడుగు వేస్తూ వరద జలాలను సద్వినియోగం చేసుకుంటాం. ►పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ►తెలుగుగంగ సామర్థ్యం 11,500 క్యూసెక్కుల నుంచి 18,000 క్యూసెక్కులకు పెంచుతాం. ►కేసీ కెనాల్, నిప్పులవాగు కెపాసిటీని 12,500 క్యూసెక్కుల నుంచి 35,000 క్యూసెక్కులకు పెంచుతాం. ►ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి)ని 21,700 క్యూసెక్కుల నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుతాం. ►హంద్రీ–నీవా కెపాసిటీని 6,000 క్యూసెక్కులు చేస్తాం. ►అవుకు నుంచి గండికోటకు 20,000 క్యూసెక్కుల నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుతున్నాం. ►గండికోట కాలువల సామర్థ్యాన్ని 4,000 నుంచి 6,000 క్యూసెక్కులకు పెంచుతాం. ► గండికోట నుంచి చిత్రావతికి తరలించే నీటిని 2,000 నుంచి 4,000 క్యూసెక్కులకు పెంచబోతున్నాం. ►గండికోట నుంచి పైడిపాలెం ప్రాజెక్టుకు తరలించే జలాలను వెయ్యి క్యూసెక్కుల నుంచి 1,500 క్యూసెక్కుల దాకా పెంచబోతున్నాం. ►గండికోటకు దిగువన మరో 20 టీఎంసీలతో రిజర్వాయర్‌కు ప్రతిపాదనల తయారీ రైతుల కోసం ఎంత చేసినా తక్కువే.. కాలువల సామర్థ్యం పెంచే పనులకు రూ.23 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెప్పినప్పుడు నేను అన్న మాట ఒక్కటే... ‘ప్రాజెక్టులు నిండాలి, రైతుల కోసం ఎంత చేసినా కూడా తక్కువే, యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయాలి’ అని ఆదేశించాం. ఎక్కడైతే మంచి మనసుంటుందో అక్కడ దేవుడి దయ ఉంటుంది, ప్రజల చల్లని దీవెనలు ఉంటాయి. మీ చల్లని దీవెనలతో, దేవుడి దయతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని వినయంగా తెలియజేస్తున్నా. జీఎన్ఎస్ఎస్ అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కడలిలో కలిసే నీటిని సీమకు తరలిస్తాం.. ఇవాళ రాయలసీమ ప్రాంతంలో నీళ్లు రాని పరిస్థితి చూస్తున్నాం. కృష్ణా నది పరిస్థితి ఎలా ఉందో రోజూ చూస్తున్నాం. కృష్ణా నది నుంచి శ్రీశైలానికి వచ్చే నీటి ప్రవాహంపై 47 ఏళ్లుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) రికార్డులు చూస్తే కేవలం 1,200 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. ఇక పదేళ్ల లెక్కలు చూస్తే 1,200 టీఎంసీల నుంచి 600 టీఎంసీలకు పడిపోయిన దుస్థితి. ఐదేళ్లకు సంబంధించిన రికార్డులు తిరగేస్తే 600 టీఎంసీల నుంచి 400 టీఎంసీలకే పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గోదావరి జలాలు 3,000 టీఎంసీలు సముద్రం పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కడలిలో కలిసి పోతున్న ఈ నీటిని రాయలసీమకు తరలించే కార్యక్రమం చేపట్టాం. బొల్లాపల్లి మీదుగా తరలించి గుంటూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేస్తాం. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాతోపాటు రాయలసీమలో ఇక కరువనేది ఎప్పుడూ రాకుండా చేసేందుకు గోదావరి జలాలను బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్‌కు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీనికోసం రూ. 60 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెప్పారు. పోలీస్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమేరకు ప్రణాళిక రూపొందించి అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడుతున్నాడు మీ బిడ్డ. మీ అందరినీ నేను కోరేది ఒక్కటే. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి మీ బిడ్డ నడుం బిగించాడు. మీ బిడ్డకు మీ దీవెనలు కావాలి. మీ బిడ్డకు దేవుడి దగ్గర మీ ప్రార్థనలు కావాలి. మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి దయతో ఇవన్నీ గొప్పగా చేసి మళ్లీ మీ దగ్గరికి వచ్చి చెప్పే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నా’’ ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు అంజద్‌బాష, నారాయణస్వామి, మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, అనిల్‌కుమార్ యాదవ్, చీప్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ద్వారకనాథరెడ్డి, మాజీ మేయర్ సురేబాబు, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. రాయచోటిపై సీఎం జగన్ వరాల జల్లు ►రూ.1,272 కోట్లతో జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల అనుసంధానానికి సీఎం జగన్ శంకుస్థాపన ►రూ.40 కోట్లతో ఝరికోన లిఫ్ట్ ►రూ. 86.50 కోట్లతో వెలిగల్లు లిఫ్ట్ ►రూ.15 కోట్లతో వెలిగల్లు కుడికాలువ లైనింగ్ ►రూ. 340.60 కోట్లతో రాయచోటి పట్టణ సుందరీకరణ, తాగునీటి సరఫరా ►రూ. 23 కోట్లతో రాయచోటి ఆస్పత్రి 50 నుంచి 100 పడకలకు విస్తరణ ►రూ. 10 కోట్లతో రాయచోటి స్కూలు భవన నిర్మాణం. ►రూ.11.55 కోట్లతో గ్రామ, వార్డు సచివాలయాల భవనాల నిర్మాణం ►రూ.15.52 కోట్లతో నియోజకవర్గంలో సీసీ రోడ్లు ►రూ.31.07 కోట్లతో సీసీ ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ ►రూ.4 కోట్లతో తాగునీటి పథకం ►రూ.18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు కాంప్లెక్స్ (బాలురకు) ►రూ.18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు కాంప్లెక్స్ భవనం ►రాయచోటికి డీఎస్పీ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు కడపలో పోలీస్ కార్యాలయం ►రూ.20.95 కోట్లతో కడపలో జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణం ►రూ.1,272 కోట్లతో జీఎన్ఎస్ఎస్– హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల అనుసంధానానికి సీఎం జగన్ శంకుస్థాపన -
బాబు పాలనలో సీమ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీమ ప్రాజెక్టుల పట్ల చూపిన శ్రద్ధను వక్రీకరిస్తూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ ప్రాజెక్టులపై జరిగిన చర్చ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడారు. సీమలోని ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్ ప్రభుత్వం వేసిన ఇంటర్‌లోకేటరీ అప్లికేషన్‌ను (ఐఏ) టీడీపీ సభ్యులు ప్రతిసారి వక్రీకరిస్తున్నారని తప్పుపట్టారు. కృష్ణా జలాలను ట్రిబ్యునల్ బచావత్ అవార్డులో 2,130 టీఎంసీలుగా నిర్ధారించిందన్నారు. అందులో ఏపీకి 800 టీఎంసీలకుపైగా, కర్ణాటకకు 700 టీఎంసీలకుపైగా, మహారాష్ట్రకు 500 టీఎంసీలకుపైగా కేటాయించిందని గుర్తు చేశారు. అంతకుమించి వచ్చే మిగులు జలాలకు ప్రాజెక్టులు కట్టుకుంటే వాటికి హక్కు మాత్రం రాదని బచావత్ అవార్డులో ఉందన్నారు. తర్వాత బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దేన్నీ పట్టించుకోలేదని విమర్శించారు. -
అంచనాలు పెంచి.. ఆశలను తుంచి
సాక్షి, శ్రీకాకుళం : గత టీడీపీ ప్రభుత్వం అంచనాలకు మించి ఖర్చు చేసింది. కానీ ఆ డబ్బు సొంతవారి జేబుల్లోకే వెళ్లింది. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయలేదు సరికదా అంచనాలను అమాంతంగా పెంచేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తమ సన్నిహితులకు, బినామీలకు అంచనాలను పెంచేసిన కాంట్రాక్ట్‌లను అప్పగించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇంత చేసినా ఆ పనులు మాత్రం పూర్తి చేయలేకపోయారు. 87 ప్యాకేజీ పనులు 64శాతం కాగా, 88 ప్యాకేజీ పనులు 81 శాతం, హిరమండలం రిజర్వాయర్ పనులు 88 శాతం, మహేంద్రతయన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు 42 శాతం మాత్రమే జరిగాయి. కానీ చెల్లింపులు మాత్రం అంతకుమించి జరిగాయి. అంతేకాకుండా పనుల్లో అక్రమాలు, లోపాలు చోటు చేసుకున్నట్టు సమాచారం. కొత్త ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇదే విషయాన్ని గుర్తించి నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. ముడుపుల కోసం చూపించిన శ్రద్ధ ప్రాజెక్టులపై చూపించలేదన్న విషయం స్పష్టమైంది. ఇరిగేషన్‌పై విజి‘లెన్స్’ అమాంతంగా అంచనాలు పెంచడం, పనులు అశించిన మేర జరగకపోవడం, అంతకుమించి బిల్లుల చెల్లింపులు చేయడం, రూ.1075 కోట్లతో తొలి అంచనాలు గల వంశధార, బాహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టును రూ.6,326.62కోట్లకు పెంచి సింగిల్ టెండర్లతో ఎన్నికలకు ముందు ఖరారు చేయడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. విజిలెన్స్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ కూడా ప్రారంభించారు. ముఖ్యంగా వంశధార ప్రాజెక్టు సర్కిల్ గత పర్యవేక్షక ఇంజినీర్ సురేంద్రరెడ్డిపై 33 అభియోగాలతో విజిలెన్స్‌కు ఫిర్యాదు వెళ్లింది. దానితో విచారణ షురూ అయింది. ఇప్పటికే సంబంధిత ప్రాజెక్టు పనుల రికార్డులను విజిలెన్స్ అధికారులు తీసుకుని వెళ్లి విచారణ జరుపుతున్నారు. దీంతో ఇరిగేషన్లో ఒక టెన్షన్ నెలకొంది. ఎవరి వల్ల ఎవరు బుక్ అయిపోతారోనన్న భయం పట్టుకుంది. సురేంద్రరెడ్డి కేంద్రంగానే ఎక్కువగా విచారణ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన హడావుడి, దందా అంతా ఇంతా కాదని ఇరిగేషన్ వర్గాలే చెప్పుకుంటున్నాయి. చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు జరిగాయని, పనుల బిల్లుల చెల్లింపులు కూడా జరిగిన వాటికన్నా ఎక్కువగా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అధికార దుర్వినియోగం కూడా చేశారన్న అభియోగాలు ఉన్నాయి. వీటిన్నింటిపైనా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇప్పుడిది ఇరిగేషన్లో కలకలంగా మారింది. ⇔ చేయని పనులకు 87ప్యాకేజీలో రూ. 14.68కోట్ల, 88వ ప్యాకేజీలో రూ. 3.18కోట్లు మేర చెల్లింపులు చేశారు. నిర్దేశిత సమయంలో ఆయకట్టుకు నీళ్లందకపోవడమే కాదు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం పడింది. ⇔ హిరమండలం రిజర్వాయర్ పనులను తొలుత రూ. 353.50కోట్లకు అప్పగించా రు. ఇదే పనికి తర్వాత రూ. 407.99 కోట్లకు అంచనాలు పెంచేశారు. అయినప్పటికీ పనులు పూర్తి కాలేదు. ⇔ మహేంద్ర తయన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులను 2007–08లో రూ. 123.25 కోట్లకు ఒప్పందం కుదిరింది. 2016లో ఇదే ప్రాజెక్టు అంచనాలను రూ. 466.28 కోట్లకు పెంచారు. ⇔ ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్లు ఖరారు చేసిన వంశధార, బాహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టును అయితే 2015లో రూ. 1075కోట్లతో అంచనాలు రూపొందించగా 2019 ఫిబ్రవరి 11న టెండర్లు పిలిచే నాటికి రూ. 6,326.62 కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. ⇔ వంశధార ప్రాజెక్టు రెండో దశ అంచనా వ్యయాన్ని రూ. 933 కోట్ల నుంచి రూ. 1616.23 కోట్లకు 2016 ఫిబ్రవరి 26న పెంచారు. ⇔ 87వ ప్యాకేజీ పనులను 2005లో హార్విన్ సంస్థకు రూ. 72.64కోట్లకు అప్పగించా రు. రూ. 11.48కోట్ల విలువైన పనులను ఆ సంస్థ చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్ వేటు వేసి, రూ. 61.16కోట్ల పనుల వ్యయాన్ని రూ.181.58కోట్లకు పెంచేసి 18 నెలల్లో పూర్తి చేసేలా అప్పటి టీడీపీ ఎంపీ, చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టు సంస్థకు అప్పగించారు. అంచనా వ్యయా న్ని ఒకేసారి 300 శాతం పెంచినా సీఎం రమేష్ సంస్థ సకాలంలో పనులు పూర్తి చేయలేదు. పనులు పూర్తి చేయని రిత్విక్ సంస్థకు అదనంగా రూ. 11.35కోట్ల విలువైన పని అప్పగించారు. పనులకు మించి బిల్లుల చెల్లింపు చేశారు. ⇔ 88 ప్యాకేజీ పనులను 2005లో రూ. 66.68 కోట్లకు శ్రీనివాస కన్స్ట్రక్షన్ దక్కించుకుంది. 2016నాటికి అది రూ. 20.76కోట్ల విలువైన పనులు చేసింది. 2016లో ఆ సంస్థపై చం ద్రబాబు సర్కార్ వేటు వేసింది. మిగిలిన రూ. 45.92కోట్ల విలువైన పనుల వ్యయా న్ని రూ. 179.51కోట్లకు పెంచేసి సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్ సంస్థకు అప్పగించింది. నేటికీ ఆ పనులు పూర్తి కాలేదు. సరికదా ఆ సంస్థకే అదనంగా రూ. 18.91 కోట్ల పనులను అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసింది. -
చంద్రబాబు నిర్లక్ష్యం.. నీటి నిల్వకు శాపం
సాక్షి, అమరావతి: ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన కాలువలను విస్తరించడంలో, పెండింగ్ పనులను పూర్తి చేయడంలో గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో నేడు వరద నీటిని ఒడిసి పట్టలేని దుస్థితి నెలకొంది. తాగు, సాగునీటి ప్రాజెక్టుల గురించి అప్పడే కాస్త శ్రద్ధ చూపి ఉంటే ఇప్పుడు తరలిస్తున్న నీటికి రెట్టింపు తరలించి నిల్వ చేయడానికి వీలుండేది. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు.. కనీసం కాలువల విస్తరణలో మిగిలిపోయిన చిన్న చిన్న పనులను సైతం పూర్తి చేయక పోవడం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారింది. అరకొరగా మిగిలి ఉన్న జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సైతం విఫలమవడం వల్లే వరద నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే అవకాశం లేకుండా పోయిం దని సాగు నీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. అన్ని కాలువలపై శీతకన్ను శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఒడిసి పట్టి.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని అప్పట్లోనే 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. గత ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు దీనిని 80 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే శ్రీశైలానికి వరద వచ్చినప్పుడు రోజూ 7.5 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. తద్వారా కృష్ణా వరద నీటిని ఒడిసి పట్టి.. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలో అంతర్భాగమైన వెలిగోడు, గోరకల్లు, అవుకు, గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు, చిత్రావతి తదితర జలాశయాలను కేవలం 40 రోజుల్లోనే నింపి ఉండవచ్చు. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ, ఎస్సార్బీసీ కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని కనీసం 30 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే నేడు తక్కువ రోజుల్లోనే అనుకున్న మేరకు నీటిని తరలించడానికి వీలయ్యేది. వెలిగోడు రిజర్వాయర్‌కు జలాలను తరలించే కాలువకు కనీసం లైనింగ్ చేయించిన పాపాన పోలేదు. గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచి ఉండింటే గోరకల్లు, అవుకు జలాశయాలను యుద్ధ ప్రాతిపదికన నింపి ఉండవచ్చు. బ్రహ్మంసాగర్‌కు నీటిని సరఫరా చేసే కాలువ, నిప్పులవాగు సామర్థ్యాన్ని పెంచే పనులను సైతం చేపట్టక పోవడం వల్ల ఇవాళ ఎంతగా నష్టపోయామో కళ్లెదుటే కనిపిస్తోంది. ముందు చూపు కరువు అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు–నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే గండికోట జలాశయాన్ని 10 రోజుల్లో నింపి ఉండవచ్చు. గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాలెం, మైలవరం రిజర్వాయర్లను యుద్ధ ప్రాతిపదికన నింపి ఉండటానికి వీలుండేది. గాలేరు–నగరి కాలువ సామర్థ్యాన్ని పెంచి ఉంటే ఆ ప్రాజెక్టు రెండో దశలో వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్మిస్తున్న వేణుగోపాలసాగర్, అడవికొత్తూరు, శ్రీనివాససాగర్, పద్మసాగర్ తదితర జలాశయాలను త్వరితగతిన నింపడానికి ఉపకరించేది. నిప్పులవాగు పరిస్థితీ అంతే. దీని ప్రవాహ సామర్థ్యాన్ని 30–35 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా వచ్చే నీటిని వేగంగా తరలించడానికి అవకాశం ఉండేది. సోమశిల రిజర్వాయర్ నుంచి కండలేరు రిజర్వాయర్‌కు ప్రస్తుతం రోజుకు 0.8 టీఎంసీలకు మించి నీటిని తరలించలేని పరిస్థితి. ఆ కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వి ఉంటే ఈ పాటికి కండలేరు నిండుగా నీటితో కళకళలాడుతుండేది. వెలిగొండ ప్రాజెక్టులో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేసి ఉంటే 53 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉండేది. హంద్రీ–నీవా పరిస్థితీ అంతే.. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలను తరలించడం ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు.. 30 లక్షల మందికి తాగు నీరు అందించడమే లక్ష్యంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. గత ఐదేళ్లలో ఈ కాలువను చంద్రబాబు 10–12 వేల క్యూసెక్కులకు విస్తరించి ఉంటే నేడు కృష్ణా వరద జలాలను మరింతగా ఒడిసి పట్టడానికి వీలుండేది. తద్వారా దీనిపై ఆధారపడ్డ కృష్ణగిరి, పందికోన, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల ప్రాజెక్టులను త్వరితగతిన నింపడంతో పాటు దాదాపు 1000 చెరువులను నింపి ఉండవచ్చు. మొత్తంగా కాలువలను విస్తరించడంపై చంద్రబాబు దృష్టి సారించి ఉంటే ఇప్పుడు కనీసం 200 – 250 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసి ఉండవచ్చని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి 793.145 టీఎంసీలు సముద్రంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 31 నుంచి ఇప్పటి వరకు శ్రీశైలానికి ఎనిమిది దఫాలుగా వరద వచ్చినా సరైన రీతిలో ఆ నీటిని ఉపయోగించుకోలేక పోయామంటే గత సర్కారు నిర్లక్ష్యమేనని చెబుతున్నారు. ఈ ఏడాది మే 30న అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కాలువల పరిస్థితులు సక్రమంగా లేకపోయినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా వరద జలాలను తరలించి ఒక వైపు తెలుగుగంగ, ఎస్సార్బీసీ ఆయకట్టుకు నీళ్లందిస్తూనే.. వెలిగోడులో 16.42 టీఎంసీలు, గోరకల్లులో 8, అవుకులో 3.13, గండికోటలో 11.96, చిత్రావతిలో 6.48, మైలవరంలో 6.18, బ్రహ్మంసాగర్‌లో 5.01, సోమశిలలో 72.95, కండలేరులో 42.06 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. సీఎం వైఎస్ జగన్ తెలంగాణ సర్కార్‌తో చర్చించి.. పునరావాసం సమస్యను పరిష్కరించడం వల్ల పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. కనీసం 650 టీఎంసీలను ఉపయోగించుకోలేకపోయాం పోలవరం పూర్తయి ఉంటే 196 టీఎంసీలను నిల్వ చేసే అవకాశం ఉండేది. 301 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా 25 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అదనంగా 80 టీఎంసీలు సరఫరా చేయడం ద్వారా కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయి ఉంటే 53 టీఎంసీలను మళ్లించడం ద్వారా 4.32 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉండేది. ఈ సీజన్లో ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 3,727.918 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. పోలవరం, చింతలపూడి, తాడిపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి పథకాలను చంద్రబాబు పూర్తి చేసి ఉంటే.. సముద్రంలో కలిసిన జలాల్లో కనీసం 650 టీఎంసీలకుపైగా వినియోగించుకునే అవకాశం ఉండేది. బంజరు భూములు సస్యశ్యామలయ్యేవి. వంశధార స్టేజ్–2లోని ఫేజ్–2లో మిగిలిపోయిన పనులను ఐదేళ్లలో పూర్తి చేయడంలో చంద్రబాబు విఫలయ్యారు. దీంతో హీరమండలం రిజర్వాయర్‌లో 20 టీఎంసీలకు గాను కేవలం 5.61 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు గొట్టా బ్యారేజీ నుంచి వంశధార జలాలు 119.89 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. పెండింగ్ పనులు పూర్తి చేసి ఉంటే.. సముద్రంలో కలిసిన వంశధార జలాల్లో కనీసం 25 నుంచి 30 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉండేది. ఈ సీజన్లో ఏకంగా 4,640.953 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిశాయి. -
సత్వర ఫలితాలిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం నిర్మాణం ఉన్న ప్రాజెక్టులతోపాటు అత్యవసరంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులను గుర్తించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారని, రైతులకు సాగునీరు.. ప్రజలందరికీ తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సాగు, తాగునీరు అందించడానికి నీటిపారుదల ప్రాజెక్టుల పనులను ప్రధాన్యతా క్రమంలో, సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. కృష్ణా వరదపై ఆధారపడ్డ జలాశయాలను 40 రోజుల్లోగా నింపడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకు చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సమీకరించుకున్న ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. వరద సమయంలోనే ప్రాజెక్టులన్నీ నిండాలి రాష్ట్రంలో భారీ, మధ్య తరహా, చిన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 982.35 టీఎంసీలని.. ప్రస్తుతం వాటిలో 831.46 టీఎంసీల(84.64 శాతం) నీరు నిల్వ ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది ఇదే సమయానికి 523.49 (53.29 శాతం) టీఎంసీలు నిల్వ ఉండిందని చెప్పారు. జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనులు.. పెండింగ్‌లో ఉన్న పనులను నివేదించారు. పోలవరం, వంశధార, వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా సహా కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులపైనా అధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. కృష్ణా నదికి ఇన్ని రోజులు వరద వచ్చినా, కొన్ని రిజర్వాయర్లు నిండకపోవడానికి కారణాలు ఏమిటని అధికారులను ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి, కృష్ణా వరదను ఒడిసి పట్టి.. వరద వచ్చిన 40 రోజుల్లోగానే గాలేరు–నగరి, తెలుగుగంగ, సోమశిల, కండలేరు తదితర ప్రాజెక్టులను నింపడానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులు సోమశిల నిర్వాసితులకు పరిహారం చెల్లించండి నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడుకు వెళ్లే కాల్వ సామర్థ్యాన్ని పెంచి, నీటిని తరలించే ఆలోచన చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. కంభం చెరువుకు వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కాలువల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సోమశిల జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 78 టీఎంసీలుకాగా.. కొన్ని ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడం వల్ల 72.36 టీఎంసీలను మాత్రమే నిల్వ చేశామని అధికారులు చెప్పారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని వెంటనే పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో ముసురుమల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.60 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 0.56 టీఎంసీలను నిల్వ చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోతున్నామని, మార్చి నాటికి గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆలోగా పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సోమశిల–కండలేరు కాలువకు మరో సమాంతర కాలువ కండలేరు జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలుకాగా, ఇప్పటిదాకా 32.30 టీఎంసీలు నింపామని అధికారులు సీఎంకు తెలిపారు. సోమశిల నుంచి కండలేరుకు ప్రస్తుతం ఉన్న కాలువ ద్వారా రోజుకు 0.8 టీఎంసీలను మించి తరలించడానికి సాధ్యం కాదని చెప్పారు. దాంతో వరద నీటిని ఒడిసి పట్టి కండలేరును నింపడానికి వీలుగా సోమశిల – కండలేరు వరద కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి రూ.20 కోట్లు ఇవ్వాలన్న స్థానిక ప్రజాప్రతినినిధుల విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. వరదను వదలొద్దు.. కృష్ణా నదికి ఇంత వరద వచ్చినా రాయలసీమలోని కొన్ని రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండకపోవడంపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా, వాటి సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ సామర్థ్యం 12.44 టీఎంసీలుకాగా.. ఇప్పటి వరకు 7.75 టీఎంసీలను నిల్వ చేశామని అధికారులు సీఎంకు వివరించారు. అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉండటం.. అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ గేట్లు బిగించకపోవడం వల్ల పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన అటవీ అనుమతులు సాధించడంతోపాటు గేట్లు బిగించే పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అవుకు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 4.15 టీఎంసీలుకాగా.. అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నందున 3.16 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశామని అధికారులు చెప్పారు. అటవీ అనుమతులు తక్షణమే వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. అలగనూరు రిజర్వాయర్‌లో కుంగిపోయిన గట్టు పనులను నవంబర్ నాటికి పూర్తిచేస్తామని, జలాశయంలో రెండు టీఎంసీలను నిల్వ చేస్తామని అధికారులు వివరించారు. సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సుమారు రూ.1,40,715 కోట్లు అవసరం అవుతాయని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టును 41.15 కాంటూర్ పరిధిలో పూర్తి చేయడానికి రూ.11,172 కోట్లు, 45.72 కాంటూర్ పరిధిలో పూర్తి చేయడానికి రూ.34,488 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై కొత్తగా ప్రతిపాదించిన మూడు బ్యారేజీల నిర్మాణం సహా.. కొత్తగా చేపట్టిన, ప్రతిపాదన దశల్లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తెలుగుగంగ – ఎస్పీవీబీఆర్ కాలువ సామర్థ్యం పెంచాలి శ్రీపోతులూరి వీరబ్రహ్మం రిజర్వాయర్(ఎస్పీవీబీఆర్) నిల్వ సామర్థ్యం 17.73 టీఎంసీలుకాగా.. ఇప్పటిదాకా కేవలం రూ.4.50 టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారని.. జలాశయాన్ని నింపక పోవడానికి కారణాలు ఏమిటని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. తెలుగుగంగ నుంచి ఎస్పీవీబీఆర్కు 5 వేల క్యూసెక్కులను తరలించేలా కాలువ తవ్వినా.. ఆ కాలువ ద్వారా కేవలం 1300 నుంచి 2000 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యమవుతోందని అధికారులు వివరించారు. కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు.. కుందూ నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్పీవీబీఆర్ను నింపే ప్రతిపాదనలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు సంబంధించి నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు పూర్తి చేయాలన్నారు. గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) నిల్వ సామర్థ్యం 11.10 టీఎంసీలు కాగా.. ఇప్పటిదాకా 2.62 టీఎంసీలు మాత్రమే నింపడానికి గల కారణం ఏమిటని సీఎం ప్రశ్నించారు. సీపేజీ కారణంగా పూర్తిగా నింపలేకపోతున్నామని, గ్రౌటింగ్ పనులు చేస్తున్నామని, వెంటనే పూర్తి చేస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. హంద్రీ–నీవా నుంచి నుంచి నీటిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. హంద్రీ–నీవా నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటిని ఇవ్వడంపై ప్రతిపాదనలు తయారు చేయాలని, తుంగభద్ర కెనాల్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడం, సమాంతరంగా మరో కాలువ తవ్వడం ద్వారా కృష్ణా వరద జలాలను సద్వినియోగం చేసుకుని రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఆదేశించారు. తిరుపతి సమీపంలోని కళ్యాణి డ్యాం, ఎన్టీఆర్ జలాశయం ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నింపడంపైనా సీఎం అధికారులతో చర్చించారు. కృష్ణా నదికి ఇంత వరద వచ్చినా రాయలసీమలోని కొన్ని రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండలేదు. చిత్రావతి, బ్రహ్మంసాగర్‌ల పరిస్థితి ఏమిటి? కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉంటే వాటిని విస్తరించేందుకు వెంటనే ప్రతిపాదనలు రూపొందించండి. వరద వచ్చిన 40 రోజుల్లోనే జలాశయాలను నింపుకోవాలి. వరదను ఒడిసి పట్టండి.. శ్రీకాకుళం జిల్లాలో వంశధార స్టేజ్–2లోని ఫేజ్–2లో అంతర్భాగమైన హిరమండలం రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 19.3 టీఎంసీలుకాగా ప్రస్తుతం 5.61 టీఎంసీలను నిల్వ చేశామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. వరద కాలువ పనుల్లో కొంత భాగం మిగిలాయని.. వాటిని 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. మిగిలిపోయిన వరద కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఎనిమిది వేల క్యూసెక్కులు ప్రవహించేలా చర్యలు తీసుకోవడం ద్వారా వంశధార వరదను ఒడిసి పట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వంశధార స్టేజ్–2 ఫేజ్–2లో నేరడి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీపై విస్తృతంగా చర్చించారు. ట్రిబ్యునల్ ఆదేశాలు.. కోర్టు తీర్పుల తాజా పరిస్థితిని సమీక్షించిన సీఎం.. సమస్య పరిష్కారానికి తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయి.. నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం వల్ల నీటిని నిల్వ చేయలేని ప్రాజెక్టులు, అటవీ అనుమతులు లేక.. భూసేకరణ జరగక ఆగిపోయిన ప్రాజెక్టులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులు, కొత్తగా అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను గుర్తించండి. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడానికి నవంబర్ 8 నాటికి ప్రణాళిక సిద్ధం చేయండి. -
కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేసేలా రూపొందించిన సరికొత్త వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు..రానున్న 30 ఏళ్ల కాలంలో అంటే 2051 సంవత్సరం నాటికి రాష్ట్రంలో పెరిగే జనాభా, పశు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ డ్రింకింగ్ వాటర్ స్లప్లయి కార్పొరేషన్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తుంది. ఏడాది మొత్తం సరఫరాకు అవసరమయ్యే నీరు ఏ ఏ సాగునీటి ప్రాజెక్టులలో అందుబాటులో ఉంటుందన్నది అంచనా వేసి.. ఆయా ప్రాజెక్టుల నుంచి వాటికి సమీపంలో ఉండే ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా నీటి తరలించడానికి వీలుగా ప్రాజెక్టు రూపకల్పన ఉంటుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. - ఈ ప్రాజెక్టు ద్వారా రోజూ గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి 105 లీటర్లు, పట్టణ, మున్సిపల్ ప్రాంతంలో135 లీటర్లు, నగరాల్లో ఉండే వారికి 150 లీటర్ల చొప్పన నీటి సరఫరా చేస్తారు. - ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి ఇంటికి మధ్య నీటి సరఫరా సమయంలో 10 శాతానికి మించి నీరు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. - నిర్ణీత ప్రామాణిక ప్రమాణల మేరకు ఉండే నీటినే సరఫరా చేస్తారు. - ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే నిధులను ప్రభుత్వ కేటాయింపులకు తోడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టును ప్లబిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ), హైబ్రీడ్ యానిటీ విధానంలో కాంట్రాక్టుకు అప్పగించేందుకు అనుమతి తెలిపింది. -
రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా మండు వేసవిలో సైతం తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.46,675 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 2022 నాటికి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స, అనిల్‌కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెరిగే జనాభాను అంచనా వేసి, 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ డిజైన్‌ను అధికారులు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 46,982 నివాసిత ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని 110 పట్టణ, నగర పాలక ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని, మొదటి దశలో రూ.37,475 కోట్లు, రెండో దశలో రూ.9,200 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు అమలుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి రూ.2,500 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. భూగర్భ జలాల వినియోగం నిలిపివేత! వాటర్ గ్రిడ్ పథకంలో.. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు. తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితి ఇకలేదని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. గిరిజన ప్రాంతాల్లో నదులు, నీటి వనరులు, రిజర్వాయర్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల కోసం జలజీవన్ మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా వినియోగించుకోవాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ప్రాంతాల వారీగా ఎంత నీరు అవసరం? జలాశయాలు, నదులు, ఇతర వనరుల్లో ఉన్న నీటి లభ్యత ఎంత? అనేదానిపై సమగ్ర సమాచారం సేకరించాలని మంత్రులు ఆదేశించారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
పంట పండింది
సాక్షి, అమరావతి: భారత దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ మరోసారి తన ఘనతను చాటుకుంటోంది. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా సాగు నీరందించడంతో అత్యధిక విస్తీర్ణంలో వరిసాగు చేశారు. కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా వరద జలాలను ఒడిసి పట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు, ఏపీఎస్సైడీసీ (ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ) కింద ప్రస్తుత నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి మే 31)లో ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీటిని అందించింది. దీంతో ఈ నెల 4వ తేదీ వరకు మొత్తం 59.48 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. ఇందులో ఒక్క వరి విస్తీర్ణమే 49.71 లక్షల ఎకరాలు. కాగా, గత ఏడాది ఖరీఫ్, రబీల్లో వివిధ ప్రాజెక్టుల కింద 32.53 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని విడుదల చేయడం గమనార్హం. సాధారణం కన్నా అధికంగా.. శ్రీకాకుళం, కృష్ణా, కర్నూల్, వైఎస్సార్ కడప జిల్లాల్లో సాధారణం కన్నా అధిక విస్తీర్ణంలో ఈసారి వరి సాగుచేశారు. వంశధార ప్రాజెక్టు నుంచి కేసీ (కర్నూల్–కడప) కెనాల్ వరకూ ఏ ప్రాజెక్టు ఆయకట్టును చూసినా పచ్చని పైర్లతో కళకళాడుతున్నాయి. వరి సాగు విస్తీర్ణం పెరగడం.. నీటి కొరత లేకపోవడంతో దిగుబడులు రికార్డు స్థాయిలో వచ్చే అవకాశం ఉందని నిపుణులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల కింద 70.44, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల కింద 25.60, ఏపీఎస్సైడీసీ కింద 8.34 వెరసి 104.38 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత పదేళ్లలో ఎన్నడూ ఇందులో సగం ఆయకట్టుకూ సక్రమంగా నీళ్లందించిన దాఖలాల్లేవు. ఈ ఏడాది జూన్‌లో సక్రమంగా వర్షాలు కురవనప్పటికీ జూలై చివర్లో నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. దీంతో ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూలై 31న శ్రీశైలానికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు.. జూన్ ఆఖరు నుంచే గోదావరి, వంశధార నదుల్లో ప్రారంభమైన వరద ఉధృతి ఇప్పటికీ కొనసాగుతోంది. ఆయకట్టుకు నీటి విడుదల ఈ పరిస్థితుల్లో గోదావరి, వంశధార, కృష్ణా, పెన్నా వరద ప్రవాహాన్ని ఒడిసి పట్టి.. అధిక విస్తీర్ణానికి నీళ్లందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నీటి యాజమాన్య పద్ధతులను అనుసరించి.. ఆయకట్టు చివరి భూములకు కూడా నీళ్లందేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. దాంతో జూన్ మొదటి వారంలోనే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, వంశధార ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత కృష్ణా నదిలో వరద ఉధృతికి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిపోవడంతో నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకు ఆగస్టు రెండో వారంలో నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, వంశధార నీటిని కూడా విడుదల చేశారు. తుంగభద్ర పరవళ్లు తొక్కడంతో ఆగస్టు మొదటి వారంలో కేసీ కెనాల్, హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ కాలువ)లకూ నీటిని విడుదల చేశారు. పెన్నా డెల్టా, సోమశిల, కండలేరు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. తోటపల్లి, నారాయణపురం ఆనకట్ట, జంఝావతి, మడ్డువలస, ఒట్టిగడ్డ, ఏలేరు, ఎర్రకాల్వ, పుష్కర ఎత్తిపోతల, తాడిపూడి ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల ఆయకట్టుకూ నీళ్లందిస్తున్నారు. భూమికి పచ్చాని రంగేసినట్టు.. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో వంశధార స్టేజ్–1 కింద 1,47,733, వంశధార స్టేజ్–2 కింద 63,694, నారాయణపురం ఆనకట్ట కింద 35,200, తోటపల్లి (పాత రెగ్యులేటర్) కింద 37,567, తోటపల్లి బ్యారేజీ(కొత్తది) కింద 53,841 వెరసి 3,38,035 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. దాంతో ఆ జిల్లాలో సాధారణం కన్నా అధిక విస్తీర్ణంలో వరి సాగుచేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాలు కూడా వరి పైరుతో కళకళాడుతున్నాయి. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకు 2014–15 నుంచి ఇప్పటివరకూ వరికి నీళ్లందించలేదు. టీడీపీ సర్కార్ ఐదేళ్లపాటు సాగర్ ఆయకట్టులో వరి సాగును అనధికారికంగా నిషేధించింది. కానీ, ఈ ఏడాది సాగర్ ఆయకట్టులో పంటల సాగుకు ప్రస్తుత సర్కార్ ఎలాంటి షరతులు విధించలేదు. దాంతో ఐదేళ్ల తర్వాత సాగర్ ఆయకట్టులో ఈ ఏడాది వరి సాగుచేస్తున్నారు. ఇక రాయలసీమలో కేసీ కెనాల్ కింద 2.65 లక్షల ఎకరాలు, ఎస్సార్బీసీ కింద 1.53 లక్షల ఎకరాలు, తెలుగుగంగ కింద 1.13 లక్షల ఎకరాల్లో ఇప్పటికే వరి సాగుచేశారు. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టులో ఇప్పటికే 80 వేల ఎకరాలలో వరి సాగుచేశారు. తెలుగుగంగ, పెన్నా డెల్టా, హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టులో వరి నాట్లు కొనసాగుతున్నాయి. ఇలా.. శ్రీకాకుళం జిల్లా నుంచి దుర్భిక్ష అనంతపురం జిల్లా వరకూ ఏ ప్రాజెక్టు కింద ఆయకట్టును చూసినా వరి పైరుతో భూమికి పచ్చాని రంగేసిన తరహాలో కళకళలాడుతున్నాయి. -
ఇక సాగునీటి ప్రాజెక్టుల పనులు చకచకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. మిగిలిపోయిన పనుల వ్యయం.. ఆయకట్టు ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, 2020 నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. మిగతా ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) నుంచి తక్కువ వడ్డీకి రుణ సమీకరణ చేయడం ద్వారా పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కొరత ఎదురుకాకుండా చూడాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు నాబార్డు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నాబార్డు తొలి విడతగా రూ.రెండు వేల కోట్లను అక్టోబర్ 15లోగా సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఏ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎంత నిధులు అవసరమో తెలిపితే.. నిధుల లభ్యతను బట్టి సర్దుబాటు చేస్తామని సూచించింది. ఆంధ్రప్రదేశ్ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్డీసీ)కు పెండింగ్ ప్రాజెక్టులను బదిలీ చేసి, నాబార్డు నుంచి రుణాన్ని సమీకరించడానికి జలవనరుల శాఖ సిద్ధమైంది. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా తదితర నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి వాటిని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయజ్ఞం చేపట్టారు. 2014 నాటికి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులకు రూ. 80,559.98 కోట్లు వ్యయం చేశారు. 27 ప్రాజెక్టులను పూర్తిచేసి 52.05 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. ఒక్క ఎకరాకూ నీళ్లందించని చంద్రబాబు సర్కార్ జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగతా ప్రాజెక్టులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని జూలై 23, 2014న విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. 34.42 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. కానీ, ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేకపోయారు. అంచనాలను పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానాను కొల్లగొట్టారు. పనుల్లో జాప్యం లేకుండా నిధుల విడుదల జలయజ్ఞం ప్రాజెక్టుల పనుల్లో ఈ ఏడాది హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ తొలిదశ, వంశధార, తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్, చింతలపూడి, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులను పూర్తిచేయాలని నిర్ణయించారు. మిగతా ప్రాజెక్టుల పనుల్లోనూ జాప్యం చేయకుండా చూడాలని సీఎం సూచించారు. 2019–20 బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 13,139.05 కోట్లను కేటాయించారు. పనుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు నెలవారీగా నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు పెండింగ్ బిల్లులకు చెల్లింపులు చేస్తూ.. అక్రమాలు జరిగిన ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై జలవనరుల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వర్షాలు తగ్గుముఖం పట్టగానే సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు. వర్షాలు తగ్గగానే శరవేగంగా పనులు జలయజ్ఞం ఫలాలను రైతులకు శరవేగంగా అందించడానికి ప్రణాళిక రచించాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులను నాలుగు విభాగాలుగా వర్గీకరించాం. వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ తొలి దశ, వంశధార, తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్, చింతలపూడి తదితర ప్రాజెక్టుల పనులను 2020 నాటికి కచ్చితంగా పూర్తి చేస్తాం. పనులకు నిధుల కోసం నాబార్డుతో చర్చలు జరిపాం. తొలి విడతగా రూ. 2 వేల కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఈనెలాఖరుకు వర్షాలు తగ్గుముఖం పడతాయి. నదుల్లో వరద తగ్గుతుంది. నవంబర్ నుంచి ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేస్తాం. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ►దివంగత వైఎస్సార్ జలయజ్ఞం ప్రారంభ సంవత్సరం 2004 ►2014 నాటికి పూర్తయిన ప్రాజెక్టులు 27 ►వ్యయం రూ. కోట్లలో 80,559.98 ►సాగు నీరు అందిన భూమి విస్తీర్ణం52.05 లక్షల ఎకరాలు ►2019–20 బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తం రూ. 13,139.05కోట్లు -
సాగునీటి సమస్యపై జిల్లా నేతలతో చర్చించిన సీఎం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజాంసాగర్, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల, ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది తాగునీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. సాగునీరు, తాగునీరు, పోడు భూముల సమస్యను ప్రజలతో చర్చించి, శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే నెలలో రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తానని సీఎం ప్రకటించారు. ‘పునరుజ్జీవం’తో ... ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో భరోసా లభించినట్లయిందని కేసీఆర్ పేర్కొన్నారు. గుత్ప అలీసాగర్‌ల మాదిరిగానే మరికొన్ని చోట్ల ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి.. బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సాగునీరు అందివ్వాలని సీఎం చెప్పారు. ఇందుకోసం తక్షణం సర్వే చేపట్టాలని, ఏఏ గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చనేది తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి ఏటా 90 టీఎంసీలకు తక్కువ కాకుండా ఎస్సారెస్పీని నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దీని నుంచి ఎంత వీలయితే అంత ఆయకట్టుకు నీరివ్వాలని చెప్పారు. నిజాంసాగర్ ఆధారిత గ్రామాలకు.. రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండినా.. సింగూరు, నిజాంసాగర్‌లకు మాత్రం చాలినంత నీరు రాలేదన్నారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ సారి మంచినీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి, పరిగి నుంచి, కోమటిబండ నుంచి, ఎస్సారెస్పీ నుంచి.. ఇలా ఎలా వీలయితే అలా.. వీలయినన్ని మిగతా చోట్ల ట్యాంకర్ల ద్వారా, బోర్ల ద్వారా నీరందించాలన్నారు. ఒక్క ఏడాదే సింగూరు, నిజాంసాగర్ పరిధిలో ఈ సమస్య ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి మల్లన్నసాగర్ ద్వారా ఈ రెండు ప్రాజెక్టులకు నీరందుతుందన్నారు. ప్రజలు వేసవిలో ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. పోడుభూముల సమస్యకూ పరిష్కారం.. ఉమ్మడి జిల్లాలోని కొన్ని చోట్ల పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇబ్బందులున్నాయని, అటవీ , రెవెన్యూశాఖ మధ్య కూడా వివాదాలున్నాయని సీఎం అన్నారు. వచ్చే నెలలో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులు పర్యటించి స్థానికులతో చర్చించి అటవీ సంబంధమైన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామన్నారు. అదే సందర్భంగా సాగునీటి కోసం, మంచినీటి కోసం శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని సీఎం వెల్లడించారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, హన్మంత్‌షిండే, బిగాల గణేష్‌గుప్త, సురేందర్, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, ఎస్ఈలు శంకర్, సుధాకర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. -
జలాశయాలన్నీ నిండాయి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జలాశయాలు నిండటంతో సాగు, తాగునీటికీ ఢోకా లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సింగూరు, నిజాంసాగర్‌లకు మాత్రం చాలినంత నీరు రాలేదని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది తాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎండబ్ల్యూఎస్, పరిగి, కోమటి బండ, ఎస్ఆర్ఎస్పీ.. వీటిల్లో వీలైన ప్రాజెక్టు నుంచి వీలైనన్ని గ్రామాలకు నీరందించాలని సూచించారు. మిగతా చోట్ల ట్యాంకర్ల ద్వారా, బోర్ల ద్వారా నీరు అందించాలని కోరారు. ఈ ఒక్క ఏడాదే సింగూరు, నిజాంసాగర్ పరిధిలో సమస్య ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి మల్లన్న సాగర్ ద్వారా నీరందుతుందని చెప్పారు. వచ్చే వేసవిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని చోట్ల పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలున్నాయని అన్నారు. వచ్చే నెలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించి స్థానికులతో చర్చించి అటవీ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సాగునీరు, మంచినీటి కోసం శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. నిజామాబాద్‌కు కొత్త లిఫ్టులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గుత్ప, అలీసాగర్ మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజవర్గాలకు సాగునీరు అందివ్వాలని పేర్కొన్నారు. ఇందుకు తక్షణమే సర్వే జరిపి, లిఫ్టులు ఎక్కడ పెట్టి, ఏయే గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చో తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఏటా 90 టీఎంసీలకు తక్కువ కాకుండా ఎస్సారెస్పీని నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దీని నుంచి ఎంత వీలైతే అంత ఆయకట్టుకు నీరివ్వాలని సూచించారు. సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, హనుమంతు షిండే, బియ్యాల గణేశ్ గుప్తా, సురేందర్, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, ఈఎన్సీలు శంకర్, సుధాకర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్ పాల్గొన్నారు. సభలో మాట్లాడుతున్న కేసీఆర్ -
‘పెండింగ్’ పాపం ఎవరిది?
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేయటంతో ప్రస్తుత నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి మే 31 వరకు)లో శనివారం ఉదయం ఆరు గంటల వరకు కృష్ణా, గోదావరి, వంశధార నుంచి 3,128.08 టీఎంసీలు బంగాళాఖాతం పాలయ్యాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి 365.47 టీఎంసీలు, ధవళేశ్వరం నుంచి 2701.04 టీఎంసీలు, గొట్టా బ్యారేజీ నుంచి 61.57 టీఎంసీలు కడలిలో కలిశాయి. దివంగత వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా చేపట్టి సింహభాగం పూర్తి చేసిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తే కృష్ణా, గోదావరి జలాలతో బంజరు భూములు సిరులు కురిపించేవి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యం ఇవ్వడంతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్ వరద నీటిని ఒడిసిపట్టి పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడానికి నడుం బిగించారు. ఈ దుస్థితి గత సర్కారు నిర్వాకమే.. వరద వచ్చినప్పుడు ఒడిసిపట్టి శ్రీశైలం జలాశయం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను 2004లో చేపట్టిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 నాటికే పూర్తి చేశారు. రూ.15 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. 2009 నాటికే గాలేరు–నగరి, తెలుగుగంగ పనులు సింహభాగం పూర్తి చేశారు. అవుకు టన్నెళ్లలో కొంత భాగం, గండికోట సహాయ, పునరావాస ప్యాకేజీలో కొంత భాగం మాత్రమే మిగిలాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు 2019 మే వరకు పూర్తి చేయలేకపోయాయి. అవుకు టన్నెళ్ల పనులు చేయకుండా ఒక లూప్ మాత్రమే వేశారు. గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 12 టీఎంసీలకు మించి నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. తెలుగు గంగ ప్రధాన కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి ఉంటే బ్రహ్మంసాగర్‌లో 17.76 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం లభించేది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలోనూ ఇదే తీరు. వెలిగొండ ఒకటో సొరంగం పనుల్లో 3.6 కి.మీ.లు, రెండో సొరంగంలో 8.037 కి.మీ.ల పనులే మిగిలాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నా వీటిని పూర్తి చేయలేకపోయారు. వీటిని పూర్తి చేసి ఉంటే 43 టీఎంసీల కృష్ణా జలాలను ఒడిసిపట్టి దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉండేది. కమీషన్ల కోసం పోలవరం దక్కించుకుని.. దివంగత వైఎస్సార్ 2009 నాటికే పుష్కర, తాడిపూడి, చాగల్నాడు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేశారు. పోలవరంలో కుడి, ఎడమ కాలువల పనులను సింహభాగం పూర్తి చేశారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును పట్టుబట్టి కేంద్రం నుంచి దక్కించుకున్న టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదు. ఇది పూర్తైతే 301 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉండేది. ఉత్తరాంధ్ర, సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతలను పూర్తిచేసి ఉంటే మరో 130 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం దక్కేది. పునరావాసం కల్పించకపోవడంతో.. వంశధార, తోటపల్లి పనుల్లో సింహభాగం పనులను దివంగత వైఎస్సార్ 2009 నాటికే పూర్తి చేశారు. కేవలం రూ.236.17 కోట్లు ఖర్చు చేసి పునరావాసం కల్పించి ఉంటే తోటపల్లిలో పూర్తి సామర్థ్యం మేరకు 2.10 టీఎంసీలు నిల్వ చేసే అవకాశం ఉండేది. పునరావాసం కల్పించకపోవడం వల్ల 1.7 టీఎంసీలను మాత్రమే నిల్వ చేస్తున్నారు. వంశధారలో మిగిలిన పనులకు రూ.462.31 కోట్లు ఖర్చు చేసి ఉంటే 2.10 లక్షల ఎకరాలు సస్యశ్యామలమయ్యేవి. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి పెండింగ్ పనులు పూర్తి చేసి ఉంటే సముద్రంలో కలిసిన వంశధార జలాల్లో కనీసం 40 టీఎంసీలు వినియోగించుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేసే అవకాశం ఉండేది. వరద నీటిని ఒడిసిపట్టే ప్రణాళిక.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. 2020 జూన్ నాటికి వంశధార, తోటపల్లి, వెలిగొండ తొలిదశ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, చింతలపూడి తొలిదశ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ తదితర ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 2021 నాటికి పోలవరంతోపాటు సింహభాగం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వరద నీటిని ఒడిసిపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని నిర్ణయించారు. -
నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి
నీళ్ల కోసం జిల్లాల మధ్య కొట్లాటలు ఉండకూడదు.. ఆప్యాయతలు పంచుకునే వాతావరణం ఉండాలి. మహేంద్రతనయ నుంచి హంద్రీ–నీవా వరకు పెండింగ్ ప్రాజెక్టులన్నీ నాలుగేళ్లలో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ప్రాజెక్టులకు నిధులు భారీగా కేటాయిస్తాం. ప్రతి రూపాయినీ సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వరద జలాలను ఒడిసిపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి, వంశధార వరద జలాలను ఒడిసిపట్టి బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నాలుగేళ్లలోగా పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లాలవారీగా ఏ ప్రాజెక్టులను ఏ ఏడాది పూర్తి చేయవచ్చో నివేదిక ఇస్తే వాటినే ఆయా సంవత్సరాల్లో ప్రాధాన్య ప్రాజెక్టులుగా పరిగణిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టును పరిశీలించినా స్కామ్‌లే కనిపిస్తున్నాయని, రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని నిర్మూలించాలని ఆదేశించారు. ప్రతీ రూపాయిని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా, శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలవారీగా అధ్యయనం చేసి నీటి లభ్యత ఉంటే కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచిన కొత్త ప్రాజెక్టుల పనులు, 25 శాతం లోపు పూర్తయిన ప్రాజెక్టుల పనులను నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు చేపట్టాలని సీఎం సూచించారు. తొలిసారిగా పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులకుపైగా తరలింపు.. దేవుడి దయ వల్ల ఈ ఏడాది కృష్ణా నదికి రెండోసారి వరద వచ్చిందని.. వరద జలాలు భారీగా సముద్రంలో కలుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే రాయలసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ప్రాజెక్టులు నింపడానికి చాలా సమయం పడుతోందని, లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులకు సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న రాయలసీమ ప్రాజెక్టులు 120 రోజులపాటు వరద జలాలను మళ్లించేలా చేపట్టినవని తెలిపారు. కృష్ణా నదికి 120 రోజులు వరద వస్తుందన్న లెక్కలు సవరించాలని.. 30 నుంచి 40 రోజులు మాత్రమే వరద ఉంటుందని లెక్క వేసి ఆలోగా వెలిగొండతోపాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులను నింపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేవలం 6 నుంచి 8 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమని, ఈసారి వచ్చిన వరదల వల్ల జలయ/æ్ఞం తొలి ఫలాలను అందుకున్నామని అధికారులు వివరించారు. తొలిసారిగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కులకుపైగా తరలించామన్నారు. వెలుగోడు నుంచి కడపకు వెళ్లే తెలుగుగంగ కాలువ లైనింగ్ పనులు పూర్తి కాలేదని, అందువల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు ఆశించినంత మేర నీటిని తీసుకెళ్లలేకపోయామని అధికారులు తెలిపారు. సమస్యలపై ఒడిశా సీఎంతో చర్చిస్తాం.. వంశధార రెండో దశలో భాగమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తోందని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు నివేదించారు. జంఝావతిపై కూడా ఒడిశా అభ్యంతరాల వల్ల పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించలేకపోతున్నామన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ నివేదిక ఇస్తే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వంశధార కెనాల్ లైనింగ్ పనులు, హీరమండలం రిజర్వాయర్ నుంచి హైలెవల్ కెనాల్ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.తోటపల్లి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వకు వీలుగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. మహేంద్ర తనయ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఉద్దానంలో కలుషితమైన భూగర్భ జలాలు తాగి ప్రజలు మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నారని, నదీ జలాలను అందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వెలిగొండ పనులు వేగంగా పూర్తి కావాలి వెలిగొండ మొదటి సొరంగంలో 1.56 కి.మీ. మేర పనులు మిగిలాయని అధికారులు వివరించగా వాటిని వెంటనే పూర్తి చేయాలని, రెండో సొరంగం పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు జోలదరాసి, రాజోలి బ్యారేజీల నిర్మాణ పనులను చేపట్టాలని నిర్దేశించారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు వరికపూడిశెల ప్రాజెక్టులో అన్ని దశలను ఒకేసారి చేపట్టాలని సూచించారు. గుంటూరు చానల్‌ను పొడిగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ల తయారీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. నిర్వాసితులకు ఉదారంగా పునరావాసం.. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులో నీరు నిల్వ చేయాలంటే నిర్వాసితులకు ఆలోగా పునరావాసం కల్పించాలన్నారు. అందుకే సహాయ, పునరావాస(ఆర్అండ్ఆర్) ప్యాకేజీ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించామని గుర్తు చేశారు. వరదల్లో మునిగిన ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వచ్చే సీజన్‌లోగా ఆ ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలన్నారు. ఈ సీజన్లో ఉత్పన్నమైన పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, మానవతా దృక్పథంతో నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు. ‘‘ఆక్వా సాగు కారణంగా కాలువలు కలుషితంగా కాకుండా చూడాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయండి. నీటి కాలుష్యానికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలి. కలుషిత నీటిని తాగడం వల్లే ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతిదీ కలుషితం అవుతోంది. దీనివల్లే ఇంతకుముందు అరుదుగా కనిపించే క్యాన్సర్ వ్యాధి ఇప్పుడు విస్తృతమైంది’’ – సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
లక్ష కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరో లక్ష కోట్ల నిధుల అవసరం ఉంది. లక్ష కోట్ల మేర ఖర్చు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన 1.24 కోట్ల ఎకరాల ఆయకట్టు రాష్ట్రంలో సాగులోకి రానుంది. మొత్తంగా రాష్ట్రంలోని 38 భారీ, మధ్యతరహా ఎత్తిపోతల పథకాల పూర్తికి రూ.2.19 లక్షల కోట్ల మేర అవసరం ఉండగా, ఇందులో ప్రభుత్వం ఇప్పటికే 1.15 లక్షల కోట్ల మేర ఖర్చు చేసింది. మరో 1.04 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో అధికంగా కాళేశ్వరం ఎత్తిపోతలపైనే రూ.54 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ ఏడాది నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి రోజుకు ఒక టీఎంసీ నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోసేలా పనులు చేయాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా రూ.10 వేల కోట్ల రుణాలు సేకరించగా, దీని నుంచే అధికంగా ఖర్చు చేయనుంది. లక్ష్యం మేరకు పనులు పూర్తయితే ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాదికే 7 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యంగా ఉంది. రాష్ట్రంలో మొత్తంగా 1.24 కోట్ల ఎకరాలకు ఆయకట్టు వసతి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 70.1 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.77 లక్షల ఎకరాల మేర సాగులోకి రాగా, రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.9 లక్షల ఎకరాలను సాగులోకి తేగా, మరో 53.33లక్షల ఎకరాలను వృద్ధిలోకి తేవాల్సి ఉంది. రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం ఇలా.. - మొత్తం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు: 38 - ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన మొత్తం: రూ.2,19,513.9 కోట్లు - ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం: రూ.1,15,417.72 కోట్లు - ఇంకా ఖర్చు చేయాల్సిన మొత్తం: రూ.1,04,096.18 కోట్లు - రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఖర్చు చేసిన మొత్తం: రూ.80 వేల కోట్లు - ప్రాజెక్టులతో సాగులోకి రావాల్సిన ఆయకట్టు: 70.1 లక్షల ఎకరాలు - ఇప్పటివరకు సాగులోకి వచ్చిన ఆయకట్టు: 16.77 లక్షల ఎకరాలు - ఇంకా సాగులోకి రావాల్సింది: 53.33 లక్షల ఎకరాలు -
ప్రాజెక్టుల్లో అవినీతిపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు, అవినీతిపై అధ్యయనం చేసేందుకు గాను కాంగ్రెస్ పక్షాన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీ రెండు నెలల్లో నివేదికిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతి యా చెప్పారు. దీన్ని గవర్నర్‌తో పాటు కేంద్రానికి సమర్పించి టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. గాంధీభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్, భట్టి, ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ కోదండరెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను వెలికి తీస్తామన్నారు. యురేనియం తవ్వకాల అంశం గిరిజనులకు మాత్రమే పరిమితం కాలేదని, మానవాళితో పాటు జీవవైవిధ్యంపై కూడా ప్రభావం చూపుతుందని, ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ వీహెచ్ నేతృత్వంలోని మరో కమిటీ పనిచేస్తుందని తెలిపారు. 15న సభ్యత్వ నమోదు ప్రారంభం.. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించిందని, ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో సభ్యత్వ నమోదు ప్రారంభి స్తామని ఉత్తమ్ చెప్పారు. పార్టీలో సభ్యులుగా చేరే వారికి బీమా సదుపాయం కల్పించే బాధ్యతలు భట్టితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై ఉంచామన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా జిల్లా స్థాయిలో పార్టీ శిక్షణా కార్యక్రమాలుంటాయని, కాంగ్రెస్ సిద్ధాంతాలను వాడవాడలా ప్రచారం చేసేందుకు 10 మంది నేతలను ఏఐసీసీ ఇచ్చే శిక్షణకు పంపుతామన్నారు. ఈ నెల 9న కాంగ్రెస్ నేతలు అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 11న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలోని ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. -
జూరాలకు పాలమూరు నీళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాలకు నీటి లభ్యత పెంచే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుంది. కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు రెండు సీజన్లలోనూ సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి వచ్చే నీటితో కోయిల్‌సాగర్, సంగంబండ రిజర్వాయర్లను నింపుతూనే జూరాల వరకు నీటిని తరలించే ప్రణాళిక రచిస్తోంది. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంజనీర్లు ఆ పనిలో పడ్డారు. ఈ ప్రతిపాదనపై జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడాదంతా నీటి లభ్యత జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, నికర నిల్వ సామర్థ్యం 6.80 టీఎంసీలు మాత్రమే. దీనికింద 1.02 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుపై ఆధారపడి నెట్టెంపాడు (21.42 టీఎంసీ), భీమా (20 టీఎంసీ), కోయిల్ సాగర్ (3.9 టీఎంసీ) ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. అన్ని ప్రాజెక్టుల కింద కలిపి 5.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. జూరాలకు వరద ఉండే రోజు ల్లోనే నీటిని ఎత్తిపోసే వీలుంది. దీనికి తోడు వరద నీటికి ఎగువ నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడాల్సి ఉంటోంది. ఒక సీజన్లో మాత్రమే జూరాలలో నీటి లభ్యత ఉంటుండగా, రెండో సీజన్‌కి కనీసం తాగునీటి అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. దీంతో జూరాలకు నీటి లభ్యతను పెంచేందుకు వీలుగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కర్వెన రిజర్వాయర్‌కు తరలించే నీటిని జూరాలకు తరలించాలని సీఎం ఇటీవల ఇంజనీర్లను ఆదేశించారు. కర్వెన రిజర్వాయర్ నుంచి ప్రత్యేక కెనాల్స్‌ను ఏర్పాటు చేసి నీటిని నారాయణపేట్ నియోజకవర్గానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నారాయణపేట వరకు ఏర్పాటు చేసిన కెనాల్ ద్వారా కోయిలకొండ మండల సమీపంలో ఉన్న పెద్దవాగు నుంచి కోయిల్‌సాగర్‌ను నింపా లని ప్రతిపాదించారు. నారాయణపేట జాయమ్మ చెరువు నుంచి ఉట్కూర్ మీదుగా సంగంబండ రిజర్వాయర్ వరకు పాలమూరు ఎత్తిపోతల పథకం జలాలు తరలించి, అటు నుంచి జూరాలకు నీటిని తరలించాలన్నది ప్రస్తుత ప్రతిపాదనగా ఉంది. ఈ ప్రతిపాదనలపై ఇంజనీర్లు కసరత్తు మొదలు పెట్టారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే జూరాలకు ఏడాదంతా నీటి లభ్యత ఉండనుంది. అనుసంధానంపై మంత్రుల సమీక్ష పూర్వ పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పాలమూరు–రంగారెడ్డి నీళ్లు జూరాలకు తరలింపు, కొత్త ఎత్తిపోతల పథకాలపై శనివారం మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు హరితప్లాజాలో ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, ఈఎన్సీ మురళీధర్, సీఈలు ఖగేందర్, రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భం గా గత వేసవిలో జూరాల కింద తాగునీటి అవసరాలకు కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి నీటిని తీసుకో వాల్సి వచ్చిందని, భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా కర్వెన రిజర్వాయర్ నుండి సంగంబండ, సంగంబండ నుండి జూరాల రిజర్వాయర్‌కు నీటిని నింపేలా ప్రతిపాదనలు వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నిర్ణయించారు. -
మిడ్ మానేరుకు వచ్చింది కాళేశ్వరం నీళ్లు కాదు..
సాక్షి, వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అవాస్తవాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం హన్మకొండలోని హరిత హోటల్లో ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యలతో కలిసి ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాళేశ్వరం జలకళ అంతా అబద్ధమనీ, సీఎం చెప్తున్నట్టు మిడ్‌మానేరుకు కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సారథ్యంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే మిడ్‌మానేరుకు నీళ్లు వచ్చాయని వివరించారు. అప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్టులో 5 మోటార్లను బిగించి 7, 8 పంపు సెట్లు నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులతో టీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ నుంచి అన్నారంకు 12 టీఎంసీలు, అన్నారం నుంచి సుందిళ్లకు 6 టీఎంసీలు తెచ్చామంటున్న కేసీఆర్, ఆ నీళ్లన్నీ తిరిగి గోదావరిలో కలిసి కిందికి వెళ్లిపోయాయని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. జలహారతి పేరుతో పాలాభిషేకాలు చేసుకోవడం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు. -
పాలమూరు ప్రాజెక్టులకు ఊపిరి
సాక్షి, గద్వాల : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చివరి దశలో ఉన్న ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టనున్న వాటికి నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. పెండింగ్ బకాయిలతో నత్తనడక ఉన్న పనుల్లో వేగం, నిధుల లేక ఆగిన వాటిలో కదలిక రానుంది. వీటన్నింటిని వచ్చే వేసవిలో పూర్తి చేసి 2020 ఖరీఫ్‌లో సాగునీటిని అందించాలని నిర్ణయించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు 15రోజుల క్రితమే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.పది వేల కోట్లు మంజూరు చేసింది. గట్టు ఎత్తిపోతల పథకం తుది డీపీఆర్‌ను పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను త్వరలోనే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఇంజనీర్లను ఆదేశించారు. అలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల రెండో దశ పనులకు నిధుల కొరత తీరనుంది. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చివరి దశలో ఉన్న నెట్టెంపాడు, కేఎల్ఐ, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. వచ్చే ఖరీఫ్‌లోనే ‘పాలమూరు’ మొదటి దశ నుంచి సాగునీరు అందించాలని సీఎం సూచించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో సాగుకు పండుగ రాబోతుంది. కరవు జిల్లా సస్యశ్యామలంగా పాడిపంటలకు నెలవుగా మారనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా సాగని పనులు 2018–19లో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.990 కోట్లు కేటాయించారు. అయితే కేవలం రూ.580 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ నాలుగు ప్రాజెక్టుల పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 403.74 కోట్లకు పెరిగింది. దీంతో పనులను జాప్యం చేస్తూ వచ్చారు. అలాగే ప్రాజెక్టుల పనులకు అడ్డంకిగా ఉన్న భూసేకరణ చెల్లింపులు సైతం నిలిచి పోడానికి కారణమయ్యాయి. దీంతో రెండేళ్లుగా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేదు. తాజా గా నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించడంతో ప్రాజెక్టులు పూర్తయ్యేం దుకు అవకాశం ఏర్పడింది. ఓటాన్ అకౌంట్లో ప్రాజెక్టులకు కేటాయించిన రూ.983 కోట్లతోపాటు మరో రూ.403 కోట్లు మంజూరు చేస్తే ఇవి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు మోక్షం ఆర్డీఎస్ పరిధిలో 55 వేల ఎకరాలకు శాశ్వతంగా అందించే లక్ష్యంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టి మొదటి దశను పూర్తి చేశారు. రెండో దశలో మూడు జలాశయాలను నిర్మాణంతో పాటు కాల్వను ఆధునికీకరించాల్సి ఉంది. దీనికి రూ.440 కోట్లు అవసరమవుతాయి. త్వరలోనే నీటిపారుదల శాఖ టెండర్ల ప్రక్రియను చేపట్టనుంది. జలాశయాలు పూర్తి చేయడం, ఆర్డీఎస్ కాల్వను రూ.70 కోట్లతో ఆధునికీకరిస్తే అలంపూర్ నియోజకవర్గంలో ఆయకట్టు సాగు స్థిరీకరించవచ్చు. ప్రస్తుతం మోటార్ల నుంచి నేరుగా పాటుకాల్వలోకి నీటిని విడుదల చేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గట్టు ఎత్తిపోతల పథకానికి.. జూరాల ప్రాజెక్టు ద్వారా వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చడానికి నాలుగేళ్లుగా కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తోంది. తాగునీటికి 2 టీంఎసీలలు విడుదల చేసినా 0.75 టీఎంసీలు మాత్రమే జూరాలకు చేరుతున్నాయి. కర్ణాటకను ఏటా నీటి కోసం వేడుకునే పరిస్థితి నుంచి శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం నిర్ణయించారు. అందుకు గాను నెట్టెంపాడుకు నీరు అందించడానికి ఉపయోగపడేలా గట్టు ఎత్తిపోతలను 15 టీఎంసీల నీటినిల్వతో చేపట్టనున్నారు. జూరాల జలాశయం నుంచి నేరుగా గట్టు ఎత్తిపోతలకు నీటిని పంపింగ్ చేసేలా పథకం రూపొందించారు. ఈ ప్రాజెక్టు పనులు మరో నెల రోజుల్లో కార్యరూపంలోకి రానున్నాయి. -
కాంగ్రెస్ వరుస పాదయాత్రలు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఖరీఫ్ సీజన్ ఊపందుకున్న తరుణంలో ఇంకా ప్రారంభం కాని, పూర్తికాని ప్రాజెక్టుల సాధన, కాళేశ్వరం ప్రతిపాదిత స్థలం, ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు రద్దు లాంటి అంశాలతో పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రణాళిక రచించింది. ఈ మేరకు ఈ నెలాఖరులో మూడు యాత్రలకు శ్రీకారం చుట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ యాత్రల్లో పాల్గొననున్నారు. ఉదయసముద్రం కోసం నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించే ఉదయసముద్రం–బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం కోసం ‘రైతుసాధన యాత్ర’పేరుతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారు. నల్లగొండ శివారు పానగల్లు వద్ద ఉన్న ఉదయసముద్రం ప్రాజెక్టు నుంచి 100 కి.మీ. నడిచి ఆయన రాష్ట్ర సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయమైన జలసౌధ వరకు చేరుకోనున్నారు. ఈ నెల 26 నుంచి నాలుగు రోజులపాటు 5 వేల మంది రైతు లతో నిర్వహించనున్న ఈ యాత్రలో నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టాలని కోరుతూ నిర్వహించనున్న ఈ యాత్రకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇక ఈ నెల 26నే ఉత్తమ్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం గురించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు టీపీసీసీ ఆధ్వర్యం లో యాత్ర చేపడుతున్నారు. తమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా గోదావరి నీరు తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేదని, అవినీతి కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారంటూ ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో ఈ యాత్ర చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు సాగునీటి కోసం ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రద్దుకు నిరసనగా యాత్ర చేపట్టి మొదటి రోజు శంకర్పల్లి ధోబీపూర్ నుంచి చేవెళ్ల వరకు, రెండో రోజు మన్నెగూడ వరకు, మూడో రోజు పరిగి వరకు, నాలుగో రోజు షాద్‌నగర్ వరకు 88 కి.మీ. మేర యాత్ర సాగించనున్నారు. -
రివర్స్ టెండరింగ్‌కు మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి : రివర్స్ టెండరింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుత ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్తోపాటు కొత్త ప్రాజెక్టుల్లో టెండరింగ్ విధానంపై మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 22వ తేదీన నిర్వహించిన చీఫ్ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు రూపొందించింది. ఈ జాబితాలో 29 అంశాలను నిర్ధేశించింది. ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయ సమీక్ష తర్వాతే రివర్స్ టెండరింగ్ కార్యచరణ ప్రారంభంకానుంది. నిర్మాణంలో ప్రాజెక్టు నుంచి కాంట్రాక్టు సంస్థను తప్పించిన అనంతరం మిగిలిన పనులను అసలు ఒప్పంద రేట్లతో జలవనరుల శాఖ ప్రాథమిక అంచనా విలువను నిర్దారించనుంది. ప్రాథమిక అంచనా విలువతో సదరు ప్రాజెక్టు మిగిలిన పనులపై ప్రభుత్వం ఈ- టెండరింగ్‌కు వెళ్లనుంది. అలాగే ఈ-టెండరింగ్‌లో పాల్గొనే సంస్థ ఏపీలో రిజిస్టర్ కావాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఒకవేళ బిడ్డర్ రాకపోతే మిగిలిన పనుల్ని చిన్న చిన్న ప్యాకేజీలుగా విడదీసి ఈ-టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించింది. కాగా, పోలవరం పనులను సమూలంగా ప్రక్షాళన చేసి అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం నిపుణుల కమిటీ సిఫార్సులను పోలవరం ప్రాజెక్టుకు వివరించిన రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు అనుమతి తీసుకుంది. -
నీళ్లొస్తున్నాయని ఊరిస్తున్నారు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన ఎస్పారెస్పీ, నిజాం సాగర్, సింగూరు నీళ్లు లేక ఎండిపోతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం కాళేశ్వరం నీళ్లొస్తున్నాయంటూ మాటలతో ఊరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆయన మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మీడియా కన్వీనర్ సుధాకరశర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓవైపు గోదావరి వరదలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ప్రాజెక్టుల కింద ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయంటూ మాటలతో ఊరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివరకు మేడిగడ్డ నుంచి అన్నారం సుందిళ్ల, ఎల్లంపల్లి ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అందించారో సీఎం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. -
‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’
సాక్షి, అమరావతి : ఒక్క గేటు ప్రారంభ యాడ్ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 2.30 కోట్లు ఖర్చు చేశారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆ గేటు పూర్తి కాకముందు ప్రారంభానికే చంద్రబాబు ప్రజాధనాన్ని దుబారా చేశారని మండిపడ్డారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అవకతవకలను పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయంలో ప్రాజెక్టుల అంచనాలను ఇష్టరాజ్యంగా పెంచేశారు. గాలేరు నగరి ప్రాజెక్టు ప్యాకేజి 29లో రూ. 171 కోట్లు పని అయితే రూ. 166 కోట్ల పని జరిగింది. మిగిలింది కేవలం రూ.5 కోట్ల పని మాత్రమే. కానీ ఆ ఐదు కోట్ల రూపాయల పనిని రూ. 137 కోట్లకు పెంచారు. ప్రాజెక్టులకు భారీ ఎత్తున రేట్లు పెంచిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు హయంలో నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగింది. ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి, అక్రమాలు చోటుచేసుకోకుండా.. దేశ చరిత్రలో రివర్స్ టెండరింగ్ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. దీని ప్రకారం జ్యూడిషియల్ అనుమతి తర్వాతే టెండర్ వస్తుంది. గత ప్రభుత్వానికి శిలాఫలకాలు తప్ప.. ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న ధ్యాస లేకుండా పోయింది. మేజర్ ప్రాజెక్టులపై కమిటీలు వేస్తున్నామ’ని తెలిపారు. అంతకుముందు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అవినీతి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురంలో రూ. 150 కోట్ల పనులను గత ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న వారికి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో రూ. 6 కోట్లు అధికంగా చెల్లించారని అన్నారు. ప్రాజెక్టుల నిధుల కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల అంచనాలు ఇష్టరాజ్యంగా పెంచేశారని మండిపడ్డారు. నిబంధనలకు విర్ధుంగా కాంట్రాక్టులను తమకు అనుకూలంగా ఉన్నవారికే కట్టబెట్టారన్నారు. గత ప్రభుత్వం హయంలో ప్రాజెక్టులో రూ. 60వేల కోట్ల దోపిడి జరిగిందని ఆరోపింది. ఈ దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో 23.49 లక్షల నీళ్లు వచ్చాయని గుర్తుచేశారు. చంద్రబాబు హయంలో రాష్ట్రం అప్పులమయంగా మారిందని తెలిపారు. పునరావాస కేంద్రాల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ దుర్వినియోగమైంద’ని విమర్శించారు. -
40 రోజులే ... ఇంకా సినిమా చాలా ఉంది..
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టపడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన గురువారం సభలో మాట్లాడుతూ.. ’ఎవరు చేత ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని ఆ భగవంతుడు సంకల్పిస్తాడో వాళ్లే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేంద్రం నుంచి అనుమతుల తీసుకురావడం దగ్గరి నుంచి కాలువ పనుల వరకూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయి. ప్రాజెక్టుకు సంబంధించి సర్వహక్కులు వైఎస్సార్‌కే ఉన్నాయి. ఆ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా ఆయన తనయుడు వైఎస్ జగనే. పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్సార్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు దోచేశారు. గత అయిదేళ్లలో పొరుగు రాష్ట్రంతో అనేక విబేధాలు ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తుంటే... దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై కమిటీ వేశాం. నివేదిక ఆధారంగా రివర్స్ ట్రెండింగ్‌కు వెళతాం. అన్నీ తీస్తాం. మా పాలనకు కేవలం 40 రోజులే అయింది. సినిమా ఇంకా చాలా ఉంది. మా ప్రభుత్వం ప్రాజెక్టులు ఆపేస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత సర్కార్ చేయని పనులను కూడా చేసినట్లు మీడియా ప్రచారం కోసమే పాకులాడింది. మేమలా కాదు చెప్పిన పనులన్నీ పారదర్శకంగా చేసి చూపిస్తాం. వచ్చే ఎన్నికల్లో 23 సంఖ్యను తగ్గించుకోకుండా ఉండండి’ అంటూ ఎద్దేవా చేశారు. -
మరపురాని మహానేత
ఆపదలో ఉన్నవారికి ఆయువుపోశారు. అన్నార్తుల ఆకలి తీర్చారు. జలయ జ్ఞంతో ప్రాజెక్టులను పరుగులెత్తించారు. పాడిపంటలకు జీవం పోసి రాష్ట్రాన్ని సుభిక్షం చేశారు. సంక్షేమాన్ని జనానికి చేరువచేశారు. మగ్రాభివృద్ధి అంటే ఏమిటో రుచిచూపించారు. అన్ని వర్గాలకూ ఆసరాగా నిలిచి అందరికీ దేవుడయ్యారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించారు. పల్లెలకే ఆస్పత్రులు తరలివచ్చే ప్రక్రియను జయవంతం చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువు ఉచితంగా అందించారు. ఆపదలో ఆదుకునేందుకు 108 ప్రవేశపెట్టారు. ఆయన పాలనా కాలం స్వర్ణయుగంగా మార్చారు. అంతేనా... దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఆయనే డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన భౌతికంగా దూరమై దశాబ్దం గడిచినా ఇంకా జనం మదిలోనే ఉన్నారు. సాక్షి , విజయనగరం : రామరాజ్యం అంటే వినడమే తప్ప చూసింది లేదు. కానీ రాజన్నరాజ్యాన్ని ఇప్పటితరంవారంతా చూశారు. ఆయన పాలనలో ఎంతో మంది లబ్ధి పొందారు. అన్ని వర్గాలవారికీ ఏదో రూపంలో సాయం అందించారు. ఆయన పాలనా కాలాన్ని ఇప్పటికీ స్వర్ణయుగంగానే భావిస్తుంటారు. అలాంటి గొప్ప పాలకుడు... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పావురాలగుట్ట మింగేసిందని తెలిసి జిల్లాలో 17 మంది తనువు చాలించారు. ఆనాడు ఉబికిన కన్నీటి ఉప్పెన తడి నేటికీ ఆరలేదు. తన తండ్రిపై అంతటి ప్రేమాభిమానాల ను పెంచుకున్న కుటుంబాలను వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2011, మార్చి, మే నెలాఖరులో ఓదార్పు యాత్ర నిర్వహించి ఓదా ర్చారు. నేడు సీఎం అయి తన తండ్రి వైఎస్ఆర్ ఆశయ సాధనకు జగన్ పాటుపడుతున్నారు. నేడు ఆ మహా నాయకుడి 70వ జయంతి. జిల్లాలో ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి చిరస్మరణీయం. ఆయన పథకాలతో లబ్ధిపొందినవారి జీవితాలు ఎందరికో సాక్షీభూతం. ప్రజాప్రస్థానంతో చేరువ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో రాష్ట్రంలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ఓ చరిత్ర సృష్టించింది. నాడు ఆయన జిల్లాలో పర్యటించి ప్రతి ఒక్కరిని పలకరించా రు. జనం గుండెతట్టి వారి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా తరతమ భేదాలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారు. అందుకే ఆయన్ను జనం తమ గుండెల్లో గుడి కట్టుకుని నేటికీ పూజిస్తున్నారు. ఆయన హయాంలో అడిగిన వారందరికీ ఫీజులు, స్కాలర్ షిప్పులూ అందజేశారు. అప్పట్లో ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా వారికి ఫీజులు చెల్లించేవారు. వారి పేరున కళాశాలల యాజామాన్యాల ఖాతాల కు ఆ డబ్బులు చేరేవి. అలా 2009 నుండి 2014 సంవత్సరాలకు సంబంధించి స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ పొందినవారు 2లక్షల98 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇందుకోసం రూ.318 కోట్లను వైఎస్ ప్రభుత్వం వెచ్చించింది. విజయనగరంలో యూత్ హాస్టల్ ఆయన చలవే... విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ దగ్గరలోని కనపాకలో యూత్ హాస్టల్ భవనాన్ని వైఎస్ నిర్మించారు. పట్టణానికి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించి... నిరంతరం జనానికి నీరందించేందుకు వీలుగా నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు బడ్జెట్ భారీగానే కేటాయించారు. 2004 నుంచి 2009 వరకు చీపురుపల్లి నియోజకవర్గంలో రూ. 84 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పధకాన్ని నియోజకవర్గానికి మంజూరు చేశారు. చీపురుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల, టీటీడీ కల్యాణ మండపాలు మంజూరయ్యాయి. వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌కు వైఎస్సార్ నిధులు మంజూరు చేశారు. సాలూరు నియోజకవర్గంలోని మెం టాడ, పాచిపెంట, సాలూరు మండలాల్లోని గ్రామాలకు రహదా రులు, వంతెనల నిర్మాణాలు జరిగాయి. ఆపదలో ఆదుకునే అపరసంజీవిని జిల్లాలో ఏ పల్లెలోనైనా ఆపద సంభవిస్తే వెంటనే అక్కడివారిని ఆస్పత్రికి ఉచితంగా తరలించేందుకు ప్రవేశపెట్టిన 108 వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చారు. నాడు ప్రతి రెండు మండలాలకు ఒక వాహనం ఉండటంతో ఫోన్ చేసిన క్షణంలోనే వాహనాలు ప్రత్యక్షమయ్యేవి. ఇకదీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా తనిఖీలు నిర్వహించడమే గాకుండా మందులు కూడా అందించేందుకు వీలుగా పల్లెలకే 104 వాహనాలను పంపించే ఏర్పాటు చేశారు. దీనివల్ల లక్షలాదిమంది లబ్ధి పొందారు. నిరుపేదలు చిన్నపాటి రోగానికి వైద్యం పొందలేక మరణాన్ని ఆశ్రయిస్తుంటే ఆరోగ్యశ్రీతో ఆదుకుని లక్షల విలువైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశా రు. దానివల్ల జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొంది ఈ రోజు సంపూ ర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చి... నాడు నష్టాల్లో కూరుకుపోయిన రైతాంగానికి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ఆయన హయాంలో జిల్లాలోని వేలాదిమంది రైతులకు రుణమాఫీ జరిగి ప్రతి ఇంటా ఆనందాన్ని విరబూయించారు. కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదలకు మేలు చేశారు. కేవలం రూ. 75లు మాత్రమే ఉన్న సామాజిక పింఛన్‌ను రూ. 200కు పెంచిన అవసానదశలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు బతుకుపై భరోసా కల్పించారు. ఇవన్నీ జిల్లావాసులు మరచిపోలేదు. అందుకే ఆనాటి స్వర్ణయుగం మళ్లీ వైఎస్ తనయుడితో వస్తుందన్న నమ్మకంతో జగన్మోహన్రెడ్డి విజయానికి ఎంతగానో పాటుపడ్డారు. జిల్లాలోని తొమ్మిది శాసనసభ, ఎంపీ స్థానాన్ని వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. ఆయన సైతం తండ్రిబాటలో నడుస్తూ సంక్షేమానికి పాటుపడుతున్నారు. వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. అంతేగాకుండా ఆయన పేరుతో వినూత్నంగా పింఛన్ పథకాన్ని ప్రారంభించనున్నారు. వైఎస్ ఆశయ సాధనకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. అపరభగీరథుడు వైఎస్ మహానేత రాజశేఖరరెడ్డి జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టించి అపరభగీరథునిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నిర్మించిన ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి ఆయన హయాంలోనే 90శాతం పనులు పూర్తి చేయించారు. అంతేగాకుండా... బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుకుంటూ తోటపల్లి సాగునీటి కాలువ ఏర్పాటైంది. గజపతినగరంలో తోటపల్లి చానల్ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు పైలాన్ ప్రారంభోత్సవం చేశారు. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి ప్రాజెక్టు ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో ఒడిశాతో ఉన్న సరిహద్దు వివాదంతో సంబంధం లేకుండా రబ్బర్ డ్యామ్‌ను రూ. 6 కోట్లతో నిర్మించి దేశంలోనే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ డ్యామ్ వల్ల 3వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. పార్వతీపురం మండలం అడారిగెడ్డ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించారు. జలయజ్ఞంలో భాగంగానే పెద్దగెడ్డ రిజర్వాయర్ నిర్మించారు. తాటిపూడి జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. వెంగళరాయ సాగర్, ఆండ్ర రిజర్వాయర్ ఆధునికీకరణకు నిధులు విడుదల చేసి జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు తనవంతు కృషి చేశారు. మక్కువ మండలంలో సురాపాడు ప్రాజెక్టు నిర్మించార. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోగల పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు తారకరామతీర్థసాగర్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం 2007లోనే సుమారు రూ. 187 కోట్లను విడుదల చేశారు. నెల్లిమర్ల పట్టణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థం మంచినీటి పధకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. చక్కెర కర్మాగారానికి కొత్త ఊపిరి జిల్లాలోని భీమసింగిలో గల ఏకైక సహకార చక్కెర కర్మాగారం మూతపడటంతో దానిపై ఆధారపడిన వందలాది కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి. చెరకు పండించే రైతులకు భరోసా లేకుండా పోయింది. పాదయాత్రగా జిల్లాకు వచ్చిన మహానేత దాని పరిస్థితిని స్వయంగా పరిశీలించి దానిని తెరిపించేందుకు హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఆయన ముఖ్యమంత్రి కాగానే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి కర్మాగారాన్ని తెరిపించి మళ్లీ కార్మికులు, రైతుల్లో ఆనందాన్ని నింపారు. -
మరుపురాని మహానేత
ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాపైనా చెరగని ముద్రవేశారు. ఆరోగ్యశ్రీతో ఎందరికో ప్రాణాలు పోసి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి.. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచారు. నిమ్స్, కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలి అడుగులు పడింది వైఎస్ హయాంలోనే. హ్యాండ్లూమ్ పార్క్, మూసీ కాల్వల ఆధునికీకరణ మహానేత ఘనతే. సోమవారం వైఎస్సార్ జయంతి సందర్భగా ఉమ్మడి జిల్లాలో మహానేత హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలైన సంక్షేమ పథకాలపై ప్రత్యేక కథనాలు.. సాక్షి, యాదాద్రి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేరరెడ్డి హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పై చెరగని ముద్ర వేశారు. వైఎస్ చేపట్టిన పథకాలతో లబ్ధిపొందిన వారు ఆయనను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత, సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన అభివృద్ధి ప్రదాతగా వైఎస్సార్ నేడు కీర్తించబడుతున్నారు. జిల్లాలో చేనేత పరిశ్రమను నుమ్ముకుని జీవిస్తున్న వేలా దిమంది వృత్తిదారుల కోసం భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం కనుముక్కుల శివారులో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను ప్రారంభించారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 10వేల మందికి నేడు ఉపాధి లభిస్తోంది. ప్రాణహిత చేవేళ్ల పథకం రూపకల్పన సాగు నీటి వసతి లేని జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల ద్వారా గోదావరి నదీజలాలను అందించడానికి బస్వాపురం రిజర్వాయర్ ప్రతిపాదించి పనులను పూర్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి పథకం పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ 15,16 ద్వారా బస్వాపురం రిజర్వాయర్, సాగునీటి కాల్వల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం రీడిజైనింగ్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్ రూపకల్పన చేసిందే. జిల్లాలో వృథాగా పోతున్న మూసీ జలాలను రైతులకు అందించడానికి బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను మంజూరు చేసి జిల్లా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్సార్. ఆలేరులో ఆరోగ్యశ్రీ ప్రారంభం.. ఆలేరులో ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007లో ప్రారంభించారు. భువనగిరి మండలం వడాయిగూడెంలో 2009లో రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభించారు. ఫ్లోరిన్నీటి నివారణకు ఆలేరు నియోజకవర్గానికి రూ.70కోట్లతో ఉదయసముద్రం నుంచి కృష్ణా నీటి సరఫరా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇదేకాక ఉమ్మడి జిల్లాలోనే ఫ్లోరైడ్ నివారణకు అంకురార్పణ చేసిన మహనీయుడు రాజశేఖరరెడ్డి. యాదగిరిగుట్టలో రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం పనులను నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధిపై చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్సార్. బీబీనగర్‌లో ఎయిమ్స్.. వైఎస్ చలవే.. బీబీనగర్ శివారులోని రంగాపూర్ వద్ద నిమ్స్‌ను ప్రా రంభించింది వైఎస్సారే. ప్రస్తుతం కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్ వైఎస్ ప్రారంభించిన నిమ్స్‌లోనే కావడం విశేషం. అప్పట్లోనే ఎయిమ్స్ తరహాలో నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని తపించిన దార్శనికుడు వైఎస్. 2005 డిసెంబర్ 31న శంకుస్థాపన చేశారు. నిమ్స్ పనుల కోసం రూ.100 కోట్లను మంజూరు చేశారు. అనంతరం 2009 ఫిబ్రవరి 22న ఆస్పత్రిని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం నిమ్స్‌లో ఓపి సేవలను ప్రారంభించింది. త్వరలో ఎయిమ్స్వైద్య కళాశాల, పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. అపరసంజీవని.. 108 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 వాహనం అపరసంజీవనిగా మారింది. 108వాహన సేవలతో మంది క్షతగాత్రులకు ప్రాణాలు కాపాడుతున్నారు. 2005లో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు వాహనాలను మాత్రమే కేటాయించి నిర్వాహణ బాధ్యతలను జేవీకే సంస్థకు అప్పగించారు. రెండేళ్ల కాలంలో మంచి ఫలితాలను రావడంతో 2007లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 34 వాహనాలను కేటాయించారు. నిత్యం వందలాది రోడ్డు ప్రమాద బాధితులతో పాటు పాముకాటు, ప్రసవ వేదనలతో బాధపడుతున్న వారిని, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులకు 108 సిబ్బంది తరలించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. కేవలం 108 నంబర్‌కు ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే కుయ్.కుయ్ మంటూ సంఘటన స్థనానికి చేరుకుని బాధితులను సకాలంలో సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వారిని కాపాడడంలో 108 నిజంగా అపరసంజీవనిగా నిలుస్తోంది. జిల్లాఓ 108 సేవలకు ప్రారంభించిన నాటి నుంచి అంటే 2005 నుంచి 2009 సంవత్సరం నాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ ఎమర్జెన్సీ కేసులు 28,999 , ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కేసులు 6,659, రోడ్డు ప్రమాదాల కేసులు 5,322 మందిని సకాలంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్రను పోషించింది. 108 సేవలను మరింత బలోపేతం చేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలని, వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. వెలుగులు నింపిన ‘ రాజీవ్ ఆరోగ్యశ్రీ’ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపింది. కారొఇ్పరేట్ స్థాయి వైద్యాన్ని పొందలేక ఎంతోమంది నిరుపేదల ప్రాణాలను వదిలిన సంఘటనలు చూసిన వైఎస్సార్ ఒక డాక్టర్‌గా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించాలని నిర్ణయించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉమ్మడి జిల్లాలో 2009 నాటికి 18,101 మంది ప్రాణాలను కాపాడింది. తెల్లరేషన్ కార్డును తీసుకుని వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల విలువ చేసే వైద్యాన్ని పొంది ప్రాణాలను దక్కించుకున్న వారంతా నేడు వైఎస్ రాజశేఖరరెడ్డిని దేవునితో సమానంగా చేతులెత్తి మొక్కుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు అనే బేధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ రకాల జబ్బులకు చికిత్సలు పొందడంతో పాటు శస్త్ర చికిత్సలను చేయించుకున్నారు. ముఖ్యంగా ఖరీదైన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల, అత్యవసర చికిత్సలు, కీళ్ల, మెదడు, కేన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, మూత్రకోశ వ్యాధుల వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలను పొందారు. ఇందుకుగాను సుమారు రూ.53 కోట్ల 22లక్షల 44 వేల 316 రూపాయలు ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే తాము ఏమైపోయే వారమో అని జిల్లాలోని నిరుపేదలు పేర్కొంటున్నారు. తమకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణభిక్ష పెట్టారని.. తాము బతికున్నంతకాలం వైఎస్సార్‌ను మరిచిపోలేమని అంటున్నారు. గోదావరి జలాలు అందించిన అపరభగీరథుడు 50ఏళ్లుగా కరువుకాటకాలు.. దర్భిక్ష పరిస్థితులతో ఉండే తుంగతుర్తి ప్రాంతానికి శ్రీరాంసాగర్ కాల్వ ద్వారా గోదావరిజలాలను తీసుకొచ్చిన అపరభగీరథుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశఖరరెడ్డి. ఎస్సారెస్పీ రెండోదశ పనులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 1996 మార్చి 6న తిరుమలగిరి మండలం ప్రగతినగర్ వద్ద అప్పటి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. అయితే వైఎస్సార్ ప్రతిపక్షనేతగా 2003లో ప్రగతినగర్ వద్ద టీడీపీ ప్రభుత్వం వేసిన శిలాపలకం వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సారెస్పీ రెండోదశ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్పారెస్పీ రెండోదశ పనులకు జలయజ్ఞం కింద నిధులు రూ.550 కోట్లు కేటాయించి 80శాతం పనులను పూర్తి చేశారు. 2009 ఫిబ్రవరి 19న వెలిశాలలో ట్రయల్‌రన్‌లో భాగాంగ నీటిని విడుదల చేశారు. ఈ జలాలతో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి రైతన్న గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్. ఈ కాల్వ ద్వారా ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 70వేల ఎకరాలకు, జిల్లాలో 2లక్షల 57వేల ఎకరాలకు నీరందుతున్నది. తాగునీటి ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. పేద విద్యార్థులకు వరంలాంటిది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజురీయిబర్స్మెంటు పథకం పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వరంలాంటిది. ఈ పథకంతోనే నేను ఇంజనీరింగ్ వరకు చదువుకోగలిగాను. ఈ ఫీజురీయంబర్స్‌మెంటు రాకముందు చాలామంది ఆడపిల్లలు ఇంటర్మీడియేట్లోనే చదువులను మానివేసేవారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌తో అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి స్థిరపడ్డారు. ఇప్పుడు నా స్నేహితురాళ్లు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. – కె. ప్రియాంక, ఇంజనీరింగ్ విద్యార్థిని, మిర్యాలగూడ -
జలయజ్ఞ ప్రదాత.. వైఎస్సార్
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి.. వేలాది మందికి లబ్ధిచేకూర్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. రెతేరాజు అని నమ్మి శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని ఎత్తిపోసేందుకు మహాత్మాగాంధీ కేఎల్ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటిని తీసుకువచ్చారు. ఆయన తీసుకువచ్చిన పథకాలు నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ, 108, 104 ఆరోగ్య సేవలతో పాటు వృద్ధులు, వితంతువుల సామాజిక భద్రతకోసం పెన్షన్లు అందించారు. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, అభయహస్తం, జలయజ్ఞం, ఫీజురీయింబర్స్‌మెంట్, భూపంపిణీ, మహిళలకు పావళా వడ్డీకే రుణాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేదలపాలిట వరంలా మారాయి. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికీ ఆయన తీసుకువచ్చిన పథకాలు లబ్ధిని చేకూర్చాయి. నేడు ఆయన ప్రజల మద్యలో లేకపోయినా వారి మదిలో చిరస్థాయిగా నిలిచేలా పథకాలను రూపొందించారాయన. జిల్లా ప్రజలు ఎన్నటికీ మరువరు.. జిల్లా వాసులు ఆయనను ఎన్నటికీ మరువలేరు. జలయజ్ఞంలో భాగంగా రూ.2.813కోట్లుతో నల్లగొండ జిల్లాకు 3లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ఎస్ఎల్బీసి టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రారంభించి ఈప్రాంత వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మరో భారీనీటిపారుదల పథకం కల్వకుర్తి ఎత్తిపోతల. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో జలయజ్ఞంలో భాగంగా కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీ రేగుమాన్ గడ్డ ప్రాంతంలో శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని 3.40లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 25టీఎంసీల నీటి కేటాయింపు చేస్తూ రూ.2.990కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. ల్లాపూర్ నియోజకవర్గానికి వైఎస్.రాజశేఖరరెడ్డి పలుమార్లు వచ్చారు. 2004 నియోజకవర్గానికి వచ్చి ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,995కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సింగోటం శ్రీవారిసముద్రాన్ని మినీ రిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించారు. అక్కడే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరును మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదోసారి కొల్లాపూర్‌లో పర్యటించి రూ.110కోట్ల వ్యయంతో సోమశిల–సిద్దేశ్వరం వంతెనకు, రూ.85కోట్ల వ్యయంతో కల్వకుర్తినుంచి నంద్యాల వరకు డబుల్‌లైన్ రహదారి పనులకోసం పైలాన్లను ఆవిష్కరించారు. ఆరోగ్యశ్రీ ఆదుకుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,88,896మంది రోగులు లబ్ధి ఆరోగ్య శ్రీ పేదలకు సంజీవని..ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎంతో మంది పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్సలు పొందారు. విలువైన వైద్యం చేయించుకోలేని సామాన్యులకు సైతం ఆరోగ్య శ్రీ ద్వారా కార్పోరేట్ స్థాయిలో వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. పేద ప్రజల కోసం అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం వల్ల ఎంతో మంది వైద్యం చేయించుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య శ్రీ పథకం 2007లో ఐదు ఆస్పత్రుల్లో ప్రారంభం చేయడం జరిగింది. ఆరోగ్య శ్రీ పథకం కింద 948రకాల చికిత్సలు చేసుకోవడానికి వీలు కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 2007 నుంచి 2017వరకు 1,88,896మంది రోగులు ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేసుకోవడం జరిగింది. దీనికోసం ప్రభుత్వాలు ఆయా ఆస్పత్రులకు ఈ 11ఏళ్ల కాలంలో రూ.49కోట్ల 74లక్షలు చెల్లించడం జరిగింది. 108వాహనాలతో వైద్య సేవలు కుయ్..కుయ్ మంటూ గ్రామాల్లోకి వచ్చి బాధితులను ఆస్పత్రికి చేర్చడంలో కీలక బాధ్యత వహిస్తున్నాయి 108 అంబులెన్స్‌లు. ఈ సేవలను ప్రారంభించింది.. అభివృద్ధి చేసింది.. వైఎస్సార్యే. ప్రమాదం.. ఆకస్మిక ఆనారోగ్యం.. ఏదైనా కావొచ్చు లేదా అపస్మారకస్థితికి చేరుకున్న వారినైనా సరే క్షణాల్లో ఆస్పత్రికి తీసుకొచ్చి వారికి మెరుగైన వైద్యం అందించేలా చేసింది. ఈ 108 అంబులెన్స్‌ల వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలు నిలిచాయి. పీయూ అభివృద్ధికి పునాది పాలమూరు: వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఉన్నత చదువుల కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవ చూపించి జిల్లాకు యూనివర్శిటీని మంజూరు చేయడం జరిగింది. ఉస్మానియా పీజీ సెంటర్‌ను స్థాయి పెంచుతూ 2008లో జిల్లాకు పాలమూరు యూనివర్శిటీ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత బండమీదిపల్లి శివారు ప్రాంతంలో దాదాపు 175ఏకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా 2008 ఆగష్టు 28న అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా పీయూ ప్రారంభానికి శిలఫలాకం వేశారు. తర్వాత భవన నిర్మాణ పనులు, హాస్టల్ నిర్మాణులు ప్రారంభం చేసి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం పీయూను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వత పీయూకు వీసీ గోపాల్‌రెడ్డిని నియామించి త్వరగా అభివృద్ది పనులు చేయాలని వీసీని ఆయన ప్రోత్సహించారు. మొదట్లో 5కోర్సులతో 8మంది ఆచార్యులతో ప్రారంభించిన పీయూ ప్రస్తుతం 19కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పీయూ పరిధిలో 3పీజీ కళాశాలలు, 94డిగ్రీ కళాశాలలు పని చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం పీయూలో అన్ని కోర్సులలో కలిపి 1800మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 9బ్యాచ్‌లు ఇక్కడి నుంచి వెళ్లాయి. అంటే దాదాపుగా 17వేల మంది విద్యార్థులు పీయూలో ఉన్నత విద్యను అభ్యసించి వెళ్లారు. యూనివర్సిటీ ప్రారంభం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీ ఇంతటి అభివృద్ధి చెందడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డియేనని స్థానిక విద్యార్థులు చెబుతున్నారు. నెట్టెంపాడుతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు ధరూరు (గద్వాల): రెండు దశాబ్దాల నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు సస్యశ్యామలయ్యాయి. 2006లో రూ.1448 కోట్ల అంచనా వ్యయంతో మండలంలోని గుడ్డెందొడ్డిలో నెట్టెంపాడు ఎత్తిపోతలకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీజం పడింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. గద్వాల నియోజకవర్గంలోని గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు, కేటీదొడ్డి మండలాలతో పాటు అలంపూర్‌లోని ఇటిక్యాల తదితర మండలాలకు ఈ జలాలు అందుతున్నాయి. కరువు నేలలు సాగులోకి వచ్చాయి. ఆ ఘనత వైఎస్‌కే దక్కింది. ఏడు రిజర్వాయర్లను నిర్మించారు. అలాగే, ప్రయదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న 234 మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల వైఎస్ చలవే దేవరకద్ర: కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పునాది పడింది. వైఎస్ తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో నాలుగు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి నీటిని కొయిల్‌సాగర్‌కు తరలించడానికి సాంకేతికంగా రూపకల్పన చేశారు. కృష్ణట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కోయిల్‌సాగర్‌కు 3.90 టీఎంసీల నీటిని వినియోగించు కోడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేశారు. 50,250 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఆయకట్టును నిర్దేశించి రూ.359 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడానికి ప్రభుత్వ పరంగా పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. 2006లో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి వైఎస్ శంఖుస్థాపన చేశారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు కృషి అలంపూర్: 87వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఆర్డీఎస్ నిరాదరణకు గురికాగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాని ఆధునీకరణకు ముందుకు వచ్చారు. కాలువల లైనింగ్, హెడ్‌వర్క్స్ వద్ద పూడికతీత, డిస్టిబ్యూటరీల నిర్మాణాలు చేపట్టడానికి అప్పట్లో రూ.112 కోట్లు కేటాయించారు. అంతేగాక, అలంపూర్, ర్యాలంపాడు గ్రామాలను కలుపుతూ తుంగభద్ర నదిపై వంతెన నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు కావడంతో వాటి శంకుస్థాపనతో పాటు పనుల్లో పాల్గొన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లావెంకట్రామిరెడ్డికి వైఎస్ఆర్తో ఉన్న అనుబంధంతో ఆయన అలంపూర్ నియోజకవర్గాన్ని మూడు సార్లు రావడం జరిగింది. వైఎస్సార్ పాలన సువర్ణయుగంగా ప్రజల గుండెల్లో గుర్తుండిపోయింది. వైఎస్ దయ వల్లే ఎంటెక్ చేశా నాపేరు అనిల్ సాగర్ మాది కొత్తకోట పట్టణం. పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబం. ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేదు. ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ రావడంతో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం రాజశేఖర్‌రెడ్డికి ఇష్టమైనటువంటి ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా. రాజశేఖర్‌రెడ్డి పుట్టిన రోజు నాడే నా పుట్టినరోజు కావడంతో అదృష్టంగా భావిస్తున్నాను. – పి.అనిల్‌కుమార్ సాగర్, కొత్తకోట ‘ఆరోగ్యశ్రీ’తో ఆపరేషన్ చేయించుకున్నా నా పేరు సంగ నర్సింహులు, మాది నారాయణపేట పట్టణం. 2007వ గుండెకు సంబంధిత వ్యాధి లక్షణాలు కనిపించాయి. వైద్యులు అపరరేషన్ చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో అపరేషన్ చేయించుకున్నా. అప్పట్లో ఆపరేషన్‌కు ఖర్చు రూ. 1.50 లక్షలు అయింది. నేను బతికి ఉన్నా అంటే వైఎస్సార్ పుణ్యమే. ఆయన మా గుండెలో చిరస్మరణీయులుగా ఉంటారు. – సంగ నర్సింహులు, నారాయణపేట -
ఐదింటిపై మూడో కన్ను
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల్లోనే కాదు.. రాజధాని నిర్మాణం, పురపాలక, పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖల పరిధిలో చేపట్టిన పనుల్లో కూడా జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు థర్డ్ పార్టీ విచారణ పరిధిని పెంచడంతోపాటు సభ్యుల సంఖ్యను కూడా 5కు పెంచింది. రిటైర్డు ఈఎన్సీలు రోశయ్య, బి.నారాయణరెడ్డి, సుబ్బరాయశర్మ, ఐఐటీ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్, నాక్ డైరెక్టర్ పీటర్లను థర్డ్ పార్టీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. పేదల ఇళ్లలోనూ కమీషన్ల పర్వం.. టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల తరహాలోనే తాత్కాలిక సచివాలయం, శాశ్వత పరిపాలన భవనాలు, రహదారుల అంచనా వ్యయాలను భారీగా పెంచేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు అంచనా వ్యయాన్ని సగటున కి.మీ.కి రూ.59 కోట్లుగా నిర్ణయించి కాంట్రాక్టర్లకు అప్పగించడమే దీనికి తార్కాణం. తాత్కాలిక సచివాలయం, శాశ్వత భవనాల నిర్మాణ పనుల్లోనూ ఇదే రీతిలో అంచనాలు పెంచేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో వాటర్ గ్రిడ్, ఏఐడీబీ (ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు) రుణంతో చేపట్టిన రహదారుల పనుల్లోనూ అంచనా వ్యయాన్ని పెంచేసి భారీగా దోచుకున్నారు. రహదారులు, భవనాల శాఖ పరిధిలో చేపట్టిన రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే మాదిరిగా దోపిడీ జరిగింది. పురపాలక శాఖలో ప్రధానంగా పీఏంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.20,535 కోట్ల నుంచి రూ.38,265.88 కోట్లకుపైగా పెంచేసి లబ్ధిదారులపై రూ.17,730.88 కోట్ల రుణభారాన్ని మోపి టీడీపీ పెద్దలు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలను థర్డ్ పార్టీ ద్వారా నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్ పార్టీ విచారణకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. అవి ఇలా ఉన్నాయి.. - శాఖలవారీగా, ప్రాజెక్టుల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను థర్డ్ పార్టీ పరిశీలించాలి. - ఒక ప్రాజెక్టు డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేక డీపీఆర్‌ను రూపొందించకుండా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? అన్నది తేల్చాలి. - అంచనా వ్యయాన్ని ఖరారు చేసేటప్పుడు పనుల పరిమాణాన్ని అవసరం లేకున్నా అమాంతం పెంచేశారా? లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. - ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్ పిలిస్తే ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్ కమిటీ)ను, లంప్సమ్(ఎల్ఎస్)–ఓపెన్ విధానంలో టెండర్ పిలిస్తే చీఫ్ ఇంజనీర్స్ కమిటీలను సంప్రదించి అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలి. - టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేటప్పుడు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించేలా నిబంధనలు విధించారా? అనే అంశాన్ని తేల్చాలి. - నిబంధనలను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లను కట్టడి చేయడం, కుమ్మక్కు చేయడం వల్ల అధిక ధరలకు పనులు కట్టబెట్టారా? లేదా? దీనివల్ల ఖజానాకు ఎంత నష్టం? అన్నది పరిశీలించాలి. - ఇప్పటివరకు చేసిన పనుల నాణ్యతను పరిశీలించాలి. నాణ్యతకు, పరిమాణానికి, బిల్లుల చెల్లింపులకు తేడాలుంటే వాటిని ప్రత్యేకంగా గుర్తించాలి. - శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా ఈ అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. -
కీలక శాఖలపై సీఎం జగన్ సమీక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ పలు కీలక శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఆయన గురువారం ఉదయం వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టారు. సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిజానికి వ్యవసాయ శాఖపై సమీక్ష నిన్న(బుధవారం) జరగాల్సి ఉండగా, రంజాన్ పర్వదినం సందర్భంగా రద్దు అయింది. రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులు, ఖరీఫ్ సీజన్లో రైతులకు నీటి లభ్యత, వివిధ ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీరు తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. ఇక జన వనరుల శాఖపై ముఖ్యమంత్రి రెండోసారి సమీక్ష జరుపుతున్నారు. పోలవరం సహా సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ఆయన అధికారులతో సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశించారు కూడా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైఎస్ జగన్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఆర్థిక, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్యాశాఖపై ఆయన సమీక్ష జరిపారు. -
వరదొస్తే.. అంతేనా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో నీటి పారుదల శాఖ చూపుతున్న నిర్లక్ష్య వైఖరి పెను ప్రమాదాలను కొని తెచ్చేలా ఉంది. జూన్ నుంచి ప్రాజెక్టులకు వరద మొదలయ్యే అవకాశాలున్నా.. ఇంతవరకు గేట్ల నిర్వహణ, కాల్వల ద్వారా నీటి సరఫరా పరిశీలనా సిబ్బంది, జనరేటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషీయన్లు, లష్కర్ల నియామకాల్లో అంతులేని జాప్యం చేస్తోంది. అంచనాకు మించి వరదలొచ్చే సందర్భాల్లో సిబ్బంది కొరతతో ముప్పు పొంచి ఉన్న సందర్భాలు కళ్లముందే కనిపిస్తున్నా, ఆ శాఖ అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. గతం మరిచారా? గోదావరి, కృష్ణా నదీ పరివాహకంలో ఆకస్మిక వరదలు రావడం రాష్ట్రానికి కొత్తేమీ కాదు. గోదావరి బేసిన్‌లోని మూడేళ్ల కింద ఎల్లంపల్లికి తక్కువ సమయంలోనే ఎక్కువ వరద రావడంతో మిడ్‌మానేరు కట్ట తెగిపోయింది. 2016లో సింగూరులో 20 రోజుల్లోనే 75 టీఎంసీల మేర వరద రాగా, గేట్ల నిర్వహణ సరిగా లేక వాటిని ఎత్తడంలో నానా తంటాలు పడాల్సి వచ్చింది. గతేడాది కడెం ప్రాజెక్టు రెండో నంబర్ గేటు కౌంటర్ వెయిట్ తెగిపోయిన కారణంగా నీటి ఒత్తిడికి పక్కకు ఒరిగి గేటు తెరుచుకోలేదు. సాత్నాల ప్రాజెక్టులోనూ 45 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులోకి 90 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇదే సమయంలో కరెంట్ పోవడం, జనరేటర్‌పై పిడుగు పడటంతో గేట్లు మూయడంలో అయోమయం నెలకొంది. గేట్లు మూసే ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు ఎవరూ లేకపోవడం, వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కృష్ణా బేసిన్లోనూ 2009లో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 25 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద రాగా, అదే ఏడాది నాగార్జునసాగర్‌కు 14.5 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 11.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ సమయంలో శ్రీశైలం పవర్ హౌజ్ మునిగిపోయింది. వీరే కీలకం... వరదలు వచ్చే సమయాల్లో వర్క్ ఇన్స్పెక్టర్లు, గేటు ఆపరేటర్లు, హెల్పర్లు, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, లష్కర్ల పాత్ర కీలకం. అయితే నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ సహా సుద్ధవాగు, స్వర్ణ, మత్తడివాగు, పాలెంవాగు, తాలిపేరు, కిన్నెరసాని, జూరాల, సింగూరు వంటి ఏ ప్రాజెక్టుల పరిధిలోనూ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్‌కు తగినంత సిబ్బంది లేరు. మొత్తంగా అన్ని రకాల సిబ్బంది కలిపి 5,600 మంది వరకు అసవరం ఉండగా ప్రస్తుతం 1,700 మంది మాత్రమే ఉన్నారు. కనిష్టంగా మరో 3 వేల మందిని నియమించాల్సి ఉన్నా ఇంతవరకు వారి నియామకాలపై నీటి పారుదల శాఖ జాప్యం చేస్తూ వస్తోంది. జూన్‌లో వర్షాలు మొదలు కాకముందే నీటి పారుదల శాఖ మేల్కొనాలని నీటి పారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కమీషన్ల ‘భూషణ్’!
ఆయనో ఐఏఎస్ అధికారి.. కార్యదర్శి హోదాలో ఉన్నారు. నెలకు రూ.1,72,200 జీతం. ఆయన ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు అనధికారికంగా చెబుతున్న లెక్కల ప్రకారం రూ.84 లక్షల నగదు, రూ.26 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆయన ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డే దొంగిలించాడు. కానీ ఐఏఎస్ అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఆయన ఇంట్లో రూ.4.50 కోట్లకుపైగా నగదు, భారీ ఎత్తున బంగారం చోరీకి గురయ్యాయి. నెలకు రూ.1,72,200 వేతనం వచ్చే ఆ ఐఏఎస్ ఇంట్లో అంత భారీ ఎత్తున నగదు ఎలా వచ్చిందన్నది బహిరంగ రహస్యమే. ప్రభుత్వ పెద్దల బాటలోనే కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన కమీషన్లలో ఇది కొంత మాత్రమేనని ఐఏఎస్ అధికారవర్గాలే చెబుతున్నాయి. సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ దోపిడీకి వ్యూహం రచించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 2016లో చిన్న నీటిపారుదల, భారీ నీటిపారుదల శాఖలను విలీనం చేసి జలవనరుల శాఖగా నామకరణం చేశారు. అత్యంత ప్రధానమైన జలవనరుల శాఖకు ముఖ్యకార్యదర్శి హోదా కలిగిన ఐఏఎస్ అధికారిని నియమించాలి. కానీ జూనియర్ ఐఏఎస్ శశిభూషణ్ కుమార్‌ను సీఎం చంద్రబాబు ఏరికోరి నియమించారు. ఇందుకు ప్రతిఫలంగా నిబంధనలకు విరుద్ధమైన ప్రతిపాదనలకు సైతం ఆయన ఆమోదముద్ర వేశారు. కమీషన్లు చెల్లించని కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడమే ఆలస్యం ఆగమేఘాలపై పూర్తి చేశారు. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి పెద్దలు సూచించిన కాంట్రాక్టర్లకే నామినేషన్ పద్ధతిలో లేదంటే జీవో 94కి విరుద్ధంగా టెండర్ నోటిఫిషన్ ద్వారా అప్పగించేశారు. ఈ వ్యవహారంలో పనుల విలువలో ఒక శాతం కమీషన్ గిట్టుబాటు అయినట్లు జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం నుంచి వంశధార, గాలేరు–నగరి, హంద్రీ–నీవా సుజల స్రవంతి దాకా ఇదే తంతు. జీవో 94 చాటున వసూళ్లు.. ఉమ్మడి రాష్ట్రంలో 2003 జూలై 1న జారీ చేసిన జీవో 94 ప్రకారమే సాగునీటి టెండర్లను నిర్వహించాలి. ఈ జీవోను అడ్డుపెట్టుకుని ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే అధిక ధర (ఎక్సెస్)కు పనులు కట్టబెట్టి భారీ ఎత్తున వసూలు చేసుకునేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా స్కెచ్ వేశారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపి ప్రాజెక్టుల పనులను పంచేశారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన సీఈలు జీవో 94కు విరుద్ధంగా టెండర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. వీటిని ఆమోదించాలంటే జీవో 94ను ఉల్లంఘిస్తూ రూపొందించిన టెండర్ నిబంధనలను జలవనరుల శాఖ కార్యదర్శి ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. దీన్నే అస్త్రంగా చేసుకున్న శశిభూషణ్‌కుమార్ టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి ఒక శాతం చొప్పున కమీషన్ వసూలు చేసుకున్నట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. టెండర్లలో దోపిడీకి ఆధారాలు ఇవిగో.. - వైకుంఠపురం బ్యారేజీ పనులకు 13.19 శాతం ఎక్సెస్‌కు నవయుగ–ఆర్వీఆర్(జేవీ) షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్సెస్‌కు షెడ్యూలు కోట్ చేస్తే టెండర్ రద్దు చేయాలి. కానీ కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్‌పై ఒత్తిడి తెచ్చి సీవోటీ ఆమోదం కోసం పంపారు. ఈలోగా ఐదు శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేస్తే టెండర్ రద్దు చేయాలన్న నిబంధన నుంచి సడలింపు ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. దీంతో టెండర్‌పై సీవోటీ ఆమోదముద్ర వేసింది. - వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ టెండర్లలో జాయింట్ వెంచర్ల (ఒకరు కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడటం)కు అవకాశం లేదని నిబంధన విధించారు. కానీ సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ ఎత్తిపోతల్లో జాయింట్ వెంచర్లు కూడా టెండర్లలో పాల్గొనవచ్చునని నిబంధన చేర్చారు. దీన్ని ఆమోదిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. - కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం కోసం జీవో 94కు విరుద్ధంగా ఏకంగా ఎనిమిది నిబంధనలను టెండర్ నోటిఫికేషన్లోచేర్చారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టాక జీవో 94 నుంచి సడలింపు ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. - గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, వంశధార–బాహుదా నదుల అనుసంధానం నుంచి ముక్త్యాల ఎత్తిపోతల వరకూ 17 ప్రాజెక్టుల పనుల టెండర్లలోనూ ఇదే కథ. అధికారంతమున దోపిడీకి సంపూర్ణ సహకారం.. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు అంటే జనవరి నుంచి మార్చి మొదటి వారం వరకూ 17 ప్రాజెక్టుల పనులకు నిర్వహించిన టెండర్లలో అక్రమాలకు జలవనరుల శాఖ కార్యదర్శి సంపూర్ణ సహకారం అందించారు. 2014కి ముందు పారదర్శకంగా టెండర్లు నిర్వహించడం వల్ల గరిష్టంగా 27 శాతం నుంచి కనిష్ఠంగా 8.77 శాతం లెస్ (తక్కువ) ధరలకు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అయింది. కానీ టీడీపీ సర్కారు 17 ప్రాజెక్టులకు నిర్వహించిన టెండర్లలో నలుగురు కాంట్రాక్టర్లకే రూ.18,648.71 కోట్ల విలువైన పనులు దక్కాయి. కాంట్రాక్టర్లు ముందే కుమ్మక్కు కావడంతో గరిష్టంగా 13.19 శాతం నుంచి కనిష్టంగా 3.52 శాతం ఎక్సెస్ (అధిక) ధరకు కోట్ చేసి షెడ్యూళ్లను దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. ముందే జీవో 94 నుంచి సడలింపు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన టెండర్లను సీవోటీ రద్దు చేస్తుంది. అయితే సీవోటీ నిర్ణయం తీసుకోక ముందే టెండర్ నిబంధనలకు జీవో 94 నుంచి సడలింపు ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ప్రభుత్వ పెద్దలు ఉత్తర్వులు జారీ చేయించారు. దీంతో ఆ పనుల టెండర్లను సీవోటీ ఆమోదించింది. అనంతరం వీటిని ఆగమేఘాలపై కాంట్రాక్టర్లకు కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. 17 ప్రాజెక్టుల్లో కమీషన్ల డబ్బే చోరీ..! జనవరి నుంచి మార్చి మొదటి వారం వరకూ నిర్వహించిన 17 ప్రాజెక్టుల టెండర్లలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కింద వసూలు చేసిన డబ్బులనే శశిభూషణ్ కుమార్ విజయవాడలో సూర్యారావుపేటలోని తన ఇంట్లో దాచినట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలే చెబుతున్నాయి. కొంత డబ్బును ఇతర ప్రాంతాలకు తరలించినా ఎన్నికల షెడ్యూలు వెలువడటం, తనిఖీలు పెరగడంతో రూ.4.50 కోట్లకుపైగా ఇంట్లోనే దాచారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కర్ణాటకలోని హసన్ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దీంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు ఇంటి భద్రతను అప్పగించి ఆయన హసన్ వెళ్లారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకూ అంటే గత నెల 18వ తేదీ వరకూ ఆయన హసన్‌లోనే విధులు నిర్వహించారు. ఇదే సమయంలో బెంగాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు బిస్వాస్ డబ్బులు, బంగారు అభరణాలను చోరీ చేసి ఉడాయించాడు. తాను స్వయంగా అన్వేషించినా ఫలితం లేకపోవడం, పోలీసు కేసు పెట్టి విషయం బయటకు పొక్కితే ఏసీబీ, సీబీఐ, ఐటీ, ఈడీ అధికారుల విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తించిన శశిభూషణ్‌కుమార్ సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టిన పోలీసులు మూడు రోజుల క్రితం సెక్యూరిటీ గార్డు బిస్వాస్‌ను అదుపులోకి తీసుకున్నా అధికారికంగా వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. చోరీ చేసిన సొమ్ములో పది శాతం మాత్రమే రికవరీ చేశారని సమాచారం. కాగా, శశిభూషణ్ ఇంట్లో జరిగిన చోరీ విలువ రూ. 6.35 లక్షలు మాత్రమేనని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అయితే నిందితుడి వద్ద రూ. 6.35 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలతో పాటు అదనంగా ఉన్న నగదు, 3 ఫోన్లు, రిస్ట్‌వాచ్ మొత్తం రూ.18.03 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పడం గమనార్హం. -
వలస జీవుల తీర్పెటో..?
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో నెలకొన్న కరువే.వ్యవసాయ భూములున్నా సాగుకు నీరు లేక.. స్థానికంగా చేసేందుకు పని దొరక్క పొట్ట కూటి కోసం ముంబై.. పూణె.. కర్ణాటక.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు గుర్తొస్తాయి. దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది పాలకులు మారినా.. వలసజీవుల తల రాతలు మారడం లేదు. పరాయి ప్రాంతాల్లో వారు పడుతోన్న కష్టాలు గుర్తుకొస్తాయి. ‘స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశామలం చేస్తాం.. నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అంటూ ప్రతిసారీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే హామీలు గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్లీ వలస జీవులతో మన నాయకులకు పని పడింది. ఈ నెల 11 తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డ ఎంపీ అభ్యర్థులు తాజాగా వలస జీవుల ఓట్లనూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్యకర్తలు.. కుల.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు తాజాగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న వలస కూలీలు, కార్మికుల ఓట్లపై దృష్టి సారించారు. మూడున్నర లక్షలకు పైనే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలో 15,05,190మంది, నాగర్‌కర్నూల్ పరిధిలో 15,88,746మంది ఓటర్లున్నారు. రెండు సెగ్మెంట్ల నుంచి మూడున్నర లక్షలకు పైగా మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులుగా పని చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి పెద్ద మొత్తంలో ముంబయి, బెంగళూరు, పూణె నగరాల్లో ఉంటున్నారు. మక్తల్ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ మంది ముంబైలో ఉంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు, అనుచరులు వారికి ఫోన్లు చేస్తున్నారు. ఉగాది పండుగకు రాకున్నా.. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. ఉగాదికి తమ సొంతూర్లకు విచ్చేసిన వారి వివరాలు తీసుకుని వారిని కలుస్తున్నారు. ఎన్నికల తర్వాతే వెళ్లాలని అప్పటి వరకు ఏవైనా ఖర్చులున్నా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందరి నోటా అదే మాటా.. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ప్రచారాన్ని వేగిరాన్ని పెంచిన ఎంపీ అభ్యర్థులందరూ ‘వలస’ ఓట్లు రాబట్టేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభ్యర్థులు తాము గెలిస్తే వలసలకు అడ్డుకట్ట వేసేలా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఇలాంటి హామీలే ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తుందని.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని.. తమను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని, వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటూ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు తెలుసని.. ఎంపీగా గెలిస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎవరూ వలస వెళ్లకుండా, వలస వెళ్లిన వారిని రప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి హామీలు ఇస్తున్నారు. వలస వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేస్తామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వలస జీవులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
భగీరథ సారథి..వైఎస్
సాక్షి, అమరావతి : ఒకనాడు అన్నపూర్ణగా భాసిల్లిన తెలుగు నేల దుర్భిక్షం బారిన పడటాన్ని చూసి చలించిపోయిన మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి... కరువనేది ఎరుగుని నేలగా మార్చడానికి జలయజ్ఞం చేపట్టారు. సముద్రం వైపు ఉరకలెత్తుతున్న గోదావరిని... పరుగులిడుతున్న కృష్ణవేణిని... కదలిపోతున్న వంశధారను తెలుగు నేలలకు మళ్లించి... సస్యశ్యామలం చేయడానికి అహోరాత్రులు శ్రమించారు. ఐదేళ్లలోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 17 ప్రాజెక్టులు సంపూర్తిగా, మరో 24 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 18.48 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు. 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. కేవలం రూ.17,368 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలతో అధికారం చేపట్టి... ఐదేళ్లలో రూ.65,345.45 కోట్లు ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్కదానినీ గట్టెక్కించలేకపోయారు చంద్రబాబు. వైఎస్ హయాంలోనే పూర్తయినవాటికి గేట్లు ఎత్తుతూ, అదంతా తన ఘనతేనంటూ పూటకో నాటకం, రోజుకో రియాలిటీ షోతో రక్తికట్టించారు. ఉమ్మడి ఏపీ 1994 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల కరవు కాటకాలతో అలమటించింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత.. సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్‌ను కదలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆ సందర్భంగా బాస చేశారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే... అనేక ప్రాజెక్టులకు కార్యరూపం ఇచ్చారు. 2004–05లో రాష్ట్ర బడ్జెట్ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ, రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చేశారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. గేట్లెత్తి... గొప్పలు వైఎస్ హయాంలో పూర్తయిన తోటపల్లి, గాలేరు–నగరి, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి జాతికి అంకితం చేసి వాటిని తానే చేసినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఐదేళ్లలో ప్రాజెక్టుల పేరుతో టీడీపీ ప్రభుత్వంలోని వారు దొరికినంత దోచుకున్నారు. ఇందులో సీఎం బినామీలు, కోటరీ కాంట్రాక్టర్లకు తప్ప రైతులకు ప్రయోజనం చేకూరలేదని మాజీ సీఎస్‌లు ఐవైఆర్, అజేయ కల్లం పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. తాజాగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సైతం ప్రాజెక్టుల టెండర్లలో చంద్రబాబు సర్కారు అక్రమాలను ఎత్తిచూపి, అందుకు తాను బాధ్యత వహించలేనని హై పవర్ కమిటీ నుంచి తప్పుకోవడం గమనార్హం. బాబు కుయుక్తులను తట్టుకుని మహా నేత చేపట్టిన జలయజ్ఞంపై అప్పట్లో చంద్రబాబు కుయుక్తులకు దిగారు. సరిహద్దు రాష్ట్రాలను ఉసిగొల్పుతూ ప్రాజెక్టులను అడ్డుకునేలా న్యాయస్థానాల్లో కేసులు వేశారు. చివరకు సొంత నియోజకవర్గం కుప్పంలో పాలార్ నదిపై ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన జలాశయం పనులకు అడ్డుతగిలి, దానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో కేసులు వేసేలా తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారని నాడు టీడీపీ సీనియర్ నేతలే విమర్శించారు. చంద్రబాబు సైంధవుడిలా అడుగడుగునా అడ్డుతగిలినా వైఎస్ వెనుకడుగు వేయలేదు. అప్పుడు... ఇప్పుడు... వైఎస్ మరణం జలయజ్ఞానికి శాపంగా మారింది. 2009 నుంచి 2014 మధ్య రూ.44,851.71 కోట్లు ఖర్చు చేసి... మిగిలిన కొన్ని పనులే పూర్తి చేయగలిగారు. విభజన నేపథ్యంలో రూ.17,368 కోట్లతో అంతా అయిపోతుందని అధికారం చేపట్టిన తొలినాళ్లలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. కానీ, ఇప్పటికి రూ.65,435.45 కోట్లు ఖర్చు చేసినా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ లేదు. పారదర్శకంగా టెండర్లు... ప్రాజెక్టుల పనులకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ విధానంలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి వైఎస్ పారదర్శకత పాటించారు. దీంతో దేశ, విదేశాల నుంచి కాంట్రాక్టర్లు వచ్చారు. వారి మధ్య టెండర్లలో పోటీతో సగటున 15 శాతం తక్కువకే బిడ్లు దాఖలై ఖజానాకు రూ.పదివేల కోట్లపైగా ఆదా అయ్యాయని సాగునీటి ప్రాజెక్టుల సలహాదారు సీతాపతిరావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి సీవీఎస్కే శర్మ పలు వేదికలపై పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పనులు శరవేగంగా పూర్తిచేసేలా వైఎస్ పరుగులు పెట్టించారు. బడ్జెట్ కేటాయింపుల కన్నా అధికంగా ఖర్చు చేశారు. వంశధార రెండో దశ ప్రాజెక్టుకు ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తే, వెంటనే రీ డిజైన్ చేసి, ట్రిబ్యునల్‌ను ఒప్పించి మెప్పించారు. వైఎస్ చలవతోనే రైతులకు మేలు నాకు హంద్రీ–నీవా కాలువ కింద ఎకరం పొలం ఉంది. ఇందులో వేరుశనగ పంట వేశా. నీటికి కొరత లేకపోవడంతో పంట బాగా వచ్చింది. మళ్లీ ఇప్పుడు రెండో పంటగా జొన్న వేశా. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా రెండు పంటలకు నీటికి ఎలాంటి ఢోకా లేదు. ఇదంతా వైఎస్సార్ పుణ్యమే. ఆయన చలువతో ఎంతో మంది రైతులకు మేలు జరుగుతోంది. – చిన్నగొల్ల చిట్టిబాబు, పందికోన -
ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్ల రుణం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్ల మేర రుణం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) అంగీకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్.కె.జోషి, జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు , ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఢిల్లీలో పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఎల క్ట్రో మెకానికల్ వర్క్స్‌కు ఆర్థిక సహకారం అందించే విషయంపై చర్చించారు. తెలంగాణ జి.ఎస్.డి.పి., రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు, ఆర్థిక క్రమశిక్షణ, తిరిగి చెల్లించే సామర్థ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న పీఎఫ్సీ తెలంగాణ ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు రూ.18 వేల కోట్ల మేర రుణం ఇచ్చేందుకు పీఎఫ్సీ అంగీకారం తెలిపిందని వెల్లడించాయి. గతంలోనూ పీఎఫ్సీ నిధులు పీఎఫ్సీ గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులకు, విద్యుత్ రంగ సంస్థలకు నిధులు సమకూర్చింది. తెలంగాణలో నిర్మిస్తున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, ఇతర నిర్మాణాలకు విద్యుత్ సంస్థలకు రూ.23 వేల కోట్లను పీఎఫ్సీ మంజూరు చేసింది. గతంలో నూ తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టుల ఎలక్ట్రో మెకానికల్ పనుల కోసం రూ.17 వేల కోట్లను అందించింది. తాజాగా మరో రూ.30 వేల కోట్లు అందించడానికి అంగీకరించింది. ఈ సందర్భంగా పీఎఫ్సీ చైర్మన్‌కు తెలంగాణ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది. వేగవంతం కానున్న ప్రాజెక్టులు తెలంగాణలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం భారీ నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. రాష్ట్ర బడ్జెట్లోనే ఏటా రూ.25 వేల కోట్ల మేర నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం నిర్మాణం చివరిదశలో ఉండగా పాలమూరు, సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మా ణం వేగంగా జరుగుతోంది. అందుకోసమే పీఎఫ్సీ నుంచి రుణం తీసుకునేందుకు చర్చలు జరిపి సఫలమైంది. -
'లక్ష'మేవ జయతే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా ఉన్న నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగం లోకి తేవడం, సుమారు రూ.2లక్షల కోట్ల ఖర్చుతో.. 1.25కోట్ల ఎకరాలకు పైగా సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఓ యజ్ఞంలా సాగుతోంది. నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు.. కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూమికి సాగు యోగ్యత కల్పించడం లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతోంది. రాష్ట్ర పరీవాహకంలో లభించే ప్రతి నీటిచుక్కనూ పరీవాహక ఆయ కట్టుకు మళ్లించడం, అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం.. వరదలు వచ్చినపుడు గరిష్టంగా వీలైనంత నీటిని ఒడిసిపట్టు కునేందుకు చేస్తున్న భగీరథ యజ్ఞంలో ఇప్పటికే కొత్తగా 16.65లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మరో 10లక్షల ఎకరాలను సాగులోకి తేనుంది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై లక్ష కోట్ల ఖర్చు చేయగా.. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏకంగా రూ.70వేల కోట్ల ఖర్చు చేసి కొత్త రికార్డులు నెలకొల్పింది. మరో లక్ష కోట్లు ఖర్చు చేసైనా.. కోటికిపైగా ఎకరాలకు నీరిందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డు స్థాయిలో ఖర్చు.. రుణాలే కీలకం! మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సాగునీటిపై ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. ఐదేళ్లలో సాగునీటికై రూ.70వేల కోట్ల మేర ఖర్చు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.20,040కోట్ల మేర నిధులు ఖర్చు చేయగా.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసాంతానికి రూ.21,489కోట్లు ఖర్చు చేశారు. ఇది మార్చి నాటికి రూ.23వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. 2017–18లో కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.13,107కోట్లు మేర ఖర్చు చేయగా, కార్పొరేషన్ రుణాల ద్వారానే రూ.9,013కోట్లు ఖర్చుచేశారు. ఈ ఏడాది ఏకంగా రూ.15వేల కోట్ల మేర ఖర్చు చేయగా, ఇందులో రుణాల ద్వారా రూ.12,739కోట్లు ఖర్చుచేశారు. ఇక దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వలకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయగా, వీటి ద్వారా మరో రూ.2,800 కోట్లు ఖర్చు చేశారు. ఇక పాలమూరు–రంగారెడ్డికి సైతం ఈసారి రూ.17వేల కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే మొత్తంగా ప్రభుత్వం తీసుకునే రుణాలు రూ.70వేల కోట్లను చేరనున్నాయి. నిర్వహణకే తడిసి మోపెడు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాల నిర్వహణ మున్ముందు కత్తిమీద సాము కానుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రానుంది. 2020–21 నుంచి 2024–25 వరకు రానున్న ఐదేళ్ల కాలానికి ఏకంగా విద్యుత్ అవసరాలకు వెచ్చించే ఖర్చు, నిర్వహణ భారం కలిపి ఏకంగా రూ.40,170కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ఇందులో విద్యుత్ అవసరాల ఖర్చే ఏకంగా రూ.37,796కోట్లు ఉండగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374కోట్లు ఉండనుంది. ఈ ఏడాదికే కొత్తగా 4,689 మెగావాట్ల విద్యుత్ అదనంగా అవసరంగా ఉండగా, ఇప్పటికే ఉన్న అవసరంతోకలిపి అది 6,099 మెగావాట్లకు చేరనుంది. మొత్తంగా 2021–22 నాటికి మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,722 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం అవుతుంది. ఆయకట్టు.. పనిపట్టు! ఇక రాష్ట్రంలో మొత్తంగా 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 70లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.65లక్షల ఎకరాలమేర సాగులోకి రాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.78లక్షల ఎకరాలను సాగులోకి తేగలిగింది. మరో 54లక్షల ఎకరాలను వృద్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది జూన్ ఖరీఫ్ నాటికి కనిష్టంగా 12లక్షల ఎకరాలకైనా కొత్తగా నీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న ఆయకట్టు లక్ష్యాలను చేరాలంటే భూసేకరణ అత్యంత కీలకంగా మారనుంది. ప్రాజెక్టుల పరిధిలో మరో 58వేలకు పైగా భూమి సేకరించాల్సి ఉండటం ప్రభుత్వానికి పరీక్ష పెడుతోంది. ‘కాకతీయ’కు నిధుల కరువు చిన్న నీటివనరుల పునరుద్ధరణకై చేపట్టిన మిషన్ కాకతీయ అనుకున్న లక్ష్యాలని చేరింది. మొత్తం 4 విడతల ద్వారా చేపట్టిన పనులతో 8టీఎంసీల నీటి నిల్వ పెరగడంతో పాటు 13.8లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అయితే 3,4వ విడత పనుల పూర్తికి 800 కోట్ల మేర బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ పనులు పూర్తి జరగడం లేదు. కాళేశ్వరా.. కదిలిరా! ఈ ఏడాదిలో రైతుల ఆశలన్నీ కాళేశ్వరం ద్వారా మళ్లించే గోదావరి జలాలపైనే ఉన్నాయి. ఖరీఫ్ నాటికి కనిష్టంగా 100 టీఎంసీల నీటిని ఆయకట్టుకు మళ్లిస్తారని రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించగా, ఇందులో ఇప్పటికే మెజార్టీ పనులు పూర్తయ్యాయి. బ్యారేజీల్లో గేట్ల బిగింపు పూర్తవుతుండగా, పంప్‌హౌజ్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియలో వేగం పెరిగింది. ఎట్టిపరిస్థితుల్లో మార్చి, ఏప్రిల్ నాటికి మిడ్‌మానేరు వరకు పనులు పూర్తిచేసి కనిష్టంగా 90–100 టీఎంసీల నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇక మిడ్‌మానేరు కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్పనులు జరుగకున్నా, ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫీడర్ ఛానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ మొదలు కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించడం ద్వారా 8–9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఏర్పడనుంది. -
చెక్‌డ్యామ్‌లు.. తూముల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ చేపట్టిన మాదిరే ఈ ఐదేళ్ల కాలంలో యుద్ధ ప్రాతిపదికన చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మిషన్ కాకతీయ కింద ఇప్పటికే 35వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ పూర్తయిన దృష్ట్యా, ఇకపై ప్రతినీటి బొట్టును చెరువుకు మళ్లించేలా ప్రాజెక్టు కాల్వల నుంచి తూముల నిర్మాణం, అవసరమైన చోట్ల వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ రెండు దఫాలుగా అధికారులకు మాస్టర్ ప్లాన్ వివరించగా, ఇరిగేషన్ ఇంజనీర్లు సైతం వర్క్‌షాప్‌లు నిర్వహించి రాష్ట్రంలో చెక్‌డ్యామ్, తూముల నిర్మాణంపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో 250 చెక్‌డ్యామ్‌లకు చాన్స్ కృష్ణా బేసిన్లో 311 నీటి ప్రవాహ వాగులపై ఇప్పటికే 281 చెక్‌డ్యామ్‌లు ఇప్పటికే ఉండగా, మరో 250 వరకు నిర్మించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇక ఇదే బేసిన్ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపడుతుండగా, ఆ ప్రాజెక్టుల పరిధిలోని కాల్వలను, సమీప చెరువులకు అనుసంధానించి, ఇందుకు అవసరమైన చోట తూముల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాజెక్టుల కాల్వల నుంచి సుమారు 3 వేల చెరువులను నింపే అవకాశాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక గోదావరి బేసిన్లో ఇప్పటికే 372 ప్రధాన వాగులను గుర్తించగా, వీటిపై 229 చెక్‌డ్యామ్‌లు ఉండగా, మరో 200 నుంచి 300 కొత్త చెక్‌డ్యామ్‌లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఎస్సారెస్పీ పరిధిలో 19 తూములకు ఓకే.. ఇక కాళేశ్వరం, సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీ, వరద కాల్వ ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఎస్సారెస్పీ పరిధిలో కొత్తగా 19 తూముల నిర్మాణానికి లైన్‌క్లియర్ అయింది. మిగతా చోట్ల తూముల నిర్మాణంపై సర్వే జరుగుతోంది. 15 రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి బడ్జెట్లో ఈ పనులకే రూ.వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని బట్టి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం లేని పక్షంలో భారీ ప్రాజెక్టులకు తీసుకుంటున్న మాదిరే బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూర్చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. -
రైతుబంధు సూపర్!
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గమనించి పరిస్థితులకు అనుగుణంగానే సలహాలు, సూచనలు ఇస్తామని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. మూడేళ్లుగా తెలంగాణ వృద్ధిరేటు వేగంగా ముందుకెళ్తోందన్న ఆయన.. రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ వంటివి రైతాంగ సమస్యల పరిష్కారానికి కీలకమైన ముందడుగని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో ఆర్థిక సంఘం చెప్పేదేమీ ఉండదని.. జాతీయాభివృద్ధి మండలిదే తుది నిర్ణయమని ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ విషయంలో ఉత్తర, దక్షిణ భారతాలంటూ వేర్వేరుగా చూడటంలో అర్థం లేదని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారంలో తెలంగాణ, ఏపీల్లో 15వ ఆర్థిక సంఘం పర్యటించనున్న నేపథ్యంలో ఎన్కే సింగ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ విశేషాలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఓ ఆర్థికవేత్తగా, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏడాదిగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ హోదాలో ఉన్నారు. ఈ కాలంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి? ఎన్కే సింగ్: ఆర్థిక సంఘం చైర్మన్లు ఎవరైనా చెప్పేదొక్కటే. కఠినమైన సవాళ్లున్నాయి. అయితే చాలా పరిమితుల్లో పనిచేయాల్సిన కారణంగా.. ఈ సమస్యలను వీలైనంత త్వరగా నైపుణ్యంతో పరిష్కరించడం కష్టమవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితిని మూడు అంశాలు మార్చేశాయి. మొదటిది.. ప్రణాళికా సంఘం పనితీరులో మార్పుతీసుకురావడం. ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులను పక్కాగా ప్లాన్ చేయడం. ఈ ఏడాది రెవెన్యూ, మూలధనం లోటుంది. కానీ దీన్ని అధికారులు అంగీకరించరు. రెండోది.. జీఎస్టీపై ఆర్థిక సంఘానికి పూర్తి పట్టుంటుంది. ఇది ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం. సంప్రదాయంగా వస్తున్న ఆర్థిక సమాఖ్య విధానంలో ఉన్న చాలా సమస్యల్లో జీఎస్టీ ద్వారా సానుకూల మార్పులొచ్చాయి. కామన్ మార్కెట్లో భారత్‌కు భారీ ప్రయోజనాలు చేకూరేందుకు అవకాశాలు కల్పించింది. మూడోది.. రాష్ట్రాలు కోల్పోతున్న రెవెన్యూను తిరిగి పొందే సామర్థ్యాన్ని పెంపొందించడం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ సమస్యలపై మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇవి ఆర్థిక సంఘం ముందున్న ప్రధానమైన సవాళ్లు. ప్రశ్న: జనాభా నియంత్రణ విషయంలో చర్యలు తీసుకున్నప్పటికీ తమకు అన్యాయం జరుగుతోందంటూ దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై మీరేమంటారు? జవాబు: నివేదికలో ఏయే అంశాలుండాలనే దానిపై ఆర్థిక సంఘం ప్రమేయం ఉండదు. ఇది పూర్తిగా భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఒకసారి నిబంధనలు రూపొందించాక వీటి ఆధారంగా పనిచేయడమే ఆర్థికసంఘం పని. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నది వాస్తవం. ఈ విషయంలో మేమేమీ చేయలేం. వీటితోపాటుగా పలు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జనాభా నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలుంటాయి. సమానత్వం, సామర్థ్యం మధ్య సమన్వయం చేయడం అంత సులువేం కాదు. భౌగోళిక అంశాల ఆధారంగా జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను విస్మరించడం ఆర్థిక సంఘం ఉద్దేశం కాదు. ఈ విషయంలో మేం చాలా విశాల ధృక్పథంతో ఉన్నాం. అసలు జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడటం.. వాస్తవాలను తప్పుదారి పట్టించడమే. ఉత్తరాది రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, పంజాబ్, ఒడిశాలు ఈ విషయంలో ఎంతో ప్రగతిని కనబరిచాయి. అందుకే ఆర్థిక సంఘం.. రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యం, ప్రజలకోసం ఏవిధంగా నిధుల వినియోగం చేస్తున్నాయనేదాన్నే విశ్వసిస్తుంది. 14, 15వ ఆర్థిక సంఘాలు ఇంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడలేదు. ఈ దిశగా ఆర్థిక సంఘం ఏమైనా పునరాలోచన చేస్తుందా? గతేడాది మేలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినపుడు ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేక హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదనే అంశాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పాను. ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా జాతీయాభివృద్ధి మండలి పరిధిలోకి వస్తుంది. ఇది పూర్తి రాజకీయ పరమైన అంశం. ఈ విషయంలో ఆర్థిక సంఘం ఇచ్చే సూచనలేమీ ఉండవు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. కర్ణాటకతోపాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు నష్టం చేస్తాయంటూ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ (ఆర్థికాంశాలు) చైర్మన్ వీరప్ప మొయిలీ పేర్కొన్నారు? ఈ విషయం నాకు తెలియదు. ఆర్థికపరమైన అంశాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఈ వ్యాఖ్యలు చేసుంటే.. దీనిపై మేం స్పందించడం సరికాదు. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం.. అప్పుల్లో కూరుకుపోవడంపై మీరేమంటారు? గత మూడేళ్లలో తెలంగాణ గణనీయమైన ఆర్థిక వృద్ధిరేటు సాధించింది. గతంలో కంటే చాలా మెరుగైన ఫలితాలు సాధించింది. సాగునీటి పారుదల అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. చెరువులను పునరుద్ధరిస్తోంది. సాగుకోసం భూగర్భ జలాలను పెంచేలా ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సానుకూల అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఇందుకు ప్రోత్సహించాలి. దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పులు, ఆర్థిక లోటు, అనవసర ఖర్చులు తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాకు నివేదిక అందింది. హైదరాబాద్ పర్యటనలో ఆ రాష్ట్ర అకౌంట్ జనరల్‌తో మాట్లాడతాం. పూర్తి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి తదితర అంశాలపై సూచనలు ఇస్తాం. ఇటీవలి మీ పంజాబ్ పర్యటనలో అక్కడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అలాంటి సూచనలేమైనా ఇస్తారా? వీటిపై ముందుస్తు ఊహాగానాలు చేయలేం. పంజాబ్ పరిస్థితులు అక్కడి సమస్యలు వేరు. అక్కడి ప్రభుత్వం చాలా అప్పుల్లో కూరుకుపోయినందుకు సూచనలిచ్చాం. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ కోసం కేంద్ర నిధులివ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది? రుణాలను కూడా మాఫీ చేయాలని అడుగుతోంది? రాజ్యాంగ పరిధిలో నిబంధనలకు అనుగుణంగా పనిచేయడమే మా లక్ష్యం. ఒక రాష్ట్రానికి ఎక్కువ మేలు చేద్దామని ప్రయత్నిస్తే.. మిగిలిన రాష్ట్రాలకూ అది అమలవుతుంది. ఆర్టికల్ 275 కింద ఒక్కో రాష్ట్రం ద్రవ్యలోటును కూడా మేం పరిగణించాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా పోల్చి చూడాలి. తెలంగాణ పూర్తి ఆర్థిక స్థితిని చూశాకే ఏమైనా సూచనలు చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తాం. వృద్ధి పథంలో ఉన్న తెలంగాణకు ఎఫ్ఆర్బీఎం కింద ఏమైనా అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలుంటాయా? మేం విశాల ధృక్పథంతో ఆలోచిస్తాం. ఇందులో భాగంగా పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం 3% ఆర్థిక లక్ష్యంలో 0.5% వెసులుబాటు కల్పించారు. మేం ఏం చేయాలనేది అన్ని విషయాలు క్రోడీకరించి నిర్ణయిస్తాం. ఆర్థిక సంఘం దృష్టిలో.. తమకు నిధులు కావాలంటున్న మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిస్థితేంటి? ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ దిశగా మాకు ప్రతిపాదనలు పంపాయి. మేం ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో పర్యటించాం. దాదాపు ప్రతిచోటా ఈ డిమాండ్ కనిపించింది. 14వ ఆర్థిక సంఘం కేవలం పంచాయతీల నిధుల విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకోవడంపై మేం అధ్యయనం చేస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడు అంచెల వ్యవస్థకు నిధులిస్తే బాగుంటుందని భావిస్తున్నాం. రాజకీయ ప్రజాకర్షణ కోసం తెలంగాణ సహా పలు రాష్ట్రాలు రుణమాఫీకి జై కొట్టడంపై మీరేమంటారు? ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయం. ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు. ఆర్టికల్ 293 కింద ఆర్థిక స్థోమత అంశాన్ని మాత్రం మేం పరిశీలిస్తాం. అయితే.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యకు రుణమాఫీ ఒక్కటే పరిష్కారం కాదని మేం బలంగా విశ్వసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టాల్లో ఉంది. 14వ ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా కేంద్రం ఎందుకు వారికి సహకరించడం లేదు? రెవెన్యూ లోటు నిధులు (ఆర్డీజీ) ఏ ఒక్కరి సొంత నిర్ణయం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నిధుల సంక్రమణ విషయంలో ఆర్థిక సంఘం స్వతంత్రంగా సమీక్ష చేస్తుంది. ఒక్కో రాష్ట్రం పరిస్థితిని గమనిస్తాం. ప్రతి రాష్ట్రం ఆర్డీజీ కావాలంటుంది. కానీ అందరికీ ఇవ్వలేం. ఈ అంశంలో కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల సరఫరా విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాకు స్పష్టత వచ్చింది. కేంద్రం ఏం ఆలోచిస్తుందనేది ఇంకా తెలియాలి. దీనికోసమే వేచి చూస్తున్నాం. ఆ తర్వాతే ఆర్డీజీకి అర్హులా? కాదా? అనే అంశాన్ని పరిశీలిస్తాం. ప్రజాకర్షక పథకమైన రైతుబంధుపై విమర్శల గురించి మీరేమంటారు? రైతుసమస్యలకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు తీసుకున్న చర్యలో రైతుబంధు కీలకమైంది. ఒడిశా ప్రభుత్వం కూడా కాలియా పేరుతో ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం కూడా ప్రతి రైతుకు రూ.6వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చింది. చాలారాష్ట్రాలు రైతు సమస్యలను పరిష్కరించేందుకు తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్రయత్నిస్తున్నాయి. స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ పర్యటనలో ఆ ప్రభుత్వంతో చర్చిస్తాం. ఎఫ్ఆర్బీఎం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) విషయంలోనూ ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంఘం రాష్ట్రాల సమస్యలను పట్టించుకోదంటూ కేసీఆర్ చేస్తున్న విమర్శలపై? తెలంగాణకు వీలైనంత సహాయం చేయాలనేదే నా ఉద్దేశం. ఆ రాష్ట్రం ఆర్థికంగా పరుగులు పెట్టే విషయంలో మేం చేయాల్సినవన్నీ చేస్తాం. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణకు ఎక్కువ అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయి. -
కాలంతో పోటీగా కాళేశ్వరం
సాక్షి, సిరిసిల్ల: నాలుగేళ్ల బడ్జెట్లో ఏటా రూ.25 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసమే కేటాయించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. కాలంతో పోటీగా కాళేశ్వరం ప్రాజెక్టు పరుగెడుతోందని, దీని వెనుక కేసీఆర్ దార్శనికత, నిపుణుల శ్రమ దాగి ఉందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు, ప్యాకేజీ – 9 పనులను సోమవారం ఆయన పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు మల్కపేట రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మాణం, పంపుహౌస్, రిజర్వాయర్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల కళ్లలో ఆనందం చూడటం కోసమే ముఖ్యమంత్రి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు – 9వ ప్యాకేజీని సకాలంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదట 11 టీఎంసీల సామర్థ్యంగా ఉన్న ఈ ప్యాకేజీని ప్రస్తుతం 141 టీఎంసీ సామర్థ్యానికి పెంచామని చెప్పారు. అంతర్గత టన్నెల్ నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, కేవలం ఒక కి.మీ దూరం మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. మూడు టీఎంసీల సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్ 90 శాతం వరకు పూర్తయిందని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం మాత్రమే పెండిం గ్లో ఉందన్నారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌కు అవసరమైన భూ సేకరణను వీలైనంత త్వరగా చేయాలని ఇన్చార్జి కలెక్టర్ యాస్మిన్‌బాషాను కోరారు. ప్యాకేజీ – 9 పనులు వచ్చే సెప్టెంబర్ కల్లా దాదాపుగా పూర్తి కానున్నట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికన చేయండి తెలంగాణ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా భూ నిర్వాసితుడని చెప్పారు. ఎగువమానేరు ముంపులో భాగంగా సర్వం కోల్పోయినవారు కాబట్టి ఆయనకు నిర్వాసితుల బాధలన్నీ తెలుసని అన్నారు. న్యాయమైన పరిహారం చెల్లిస్తూనే, సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణలోని కోటీ 25 లక్షల ఎకరాలకు నీరందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. మెట్ట ప్రాంతమైన సిరిసిల్లకు సెప్టెంబర్ వరకు రెండు పంటలకు నీరు అందబోతుందని అన్నారు. -
కమీషన్లు దండుకుని ఎన్నికల్లో వెదజల్లే వ్యూహం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల జీవనోపాధుల అభివృద్ధి పథకం కాస్తా అధికార పార్టీ నేతలకు జీవనోపాధి కార్యక్రమంగా మారుతోంది. ఎన్నికలకు రెండు నెలల ముందు రూ.2 వేల కోట్ల వ్యయంతో మధ్య, చిన్న తరహా నీటివనరుల అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయిస్తున్నారు. అధిక అంచనా వ్యయంతో కూడిన ఈ పనులను అస్మదీయులకు కట్టబెట్టి, భారీ ఎత్తున కమీషన్లు దండుకుని.. ఆ డబ్బును ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వ్యయం చేసేందుకు భారీ స్కెచ్ వేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద ఆయకట్టులో రైతుల జీవనోపాధి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల జీవనోపాధుల అభివృద్ధి పథకం (ఏపీఐఎల్‌ఐపీ ) రెండో దశను ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) రూ.1,700 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మిగతా రూ.300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. రెండో దశ అమలును పర్యవేక్షించడానికి జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సన్నిహితునికి చెందిన నిప్పాన్ కోయి సంస్థను ఎంపిక చేశారు. కన్సల్టెన్సీ ఫీజు కింద ఏకంగా రూ.61.29 కోట్లను ఆ సంస్థకు కట్టబెట్టారు. తాజాగా నీటివనరుల అభివృద్ధి, ఆధునికీకరణ పనులను కూడా అస్మదీయులకే కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునే వెసులుబాటును టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలకు ప్రభుత్వ పెద్దలు కల్పించారు. ఇదే అదనుగా టెండర్లలో టీడీపీ ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట కుడి కాలువ(50 కిమీ)లు కింద 18,362 ఎకరాలు, ఎడమ కాలువ, ఎడమ హైలెవ్ కాలువ (54.60 కిమీ) కింద 18,691 ఎకరాలు వెరసి 37,053 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. రూ.91.12 కోట్లతో టెండర్లు పిలిచారు. నారాయణపురం ఆనకట్ట, ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల(ప్యాకేజీ–ఎ)కు రూ.49.41 కోట్లతో, కుడి కాలువ ఆధునికీకరణ పనుల(బీ ప్యాకేజీ)కు రూ.41.71 కోట్లతో లంప్సమ్(ఎల్ఎస్) ఓపెన్ విధానంలో టెండర్లు పిలిచారు. వీటి నిబంధనలను అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రజాప్రతినిధి సూచించిన వారికే పనులు అప్పగించారు. ఈ వ్యవహారంలో రూ.18 కోట్లకుపైగా కమీషన్లు చేతులు మారినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీ కింద 10,500 ఎకరాల ఆయకట్టు ఉంది. మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ పనులకు రూ.49.64 కోట్లతో టెండర్లు పిలిచి.. కీలక మంత్రి సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించారు. ఈ వ్యవహారంలో రూ.8 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అనంతపురం జిల్లాలో పెన్నార్–కుముద్వతి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ.16.83 కోట్లతో నిర్వహించిన టెండర్లలోనూ టీడీపీ ఎమ్మెల్యే సూచించిన వారికే పనులు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రూ.3.2 కోట్లకుపైగా కమీషన్లు ముట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే జిల్లాలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ.18.94 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 4న ఈ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా రూ.3.50 కోట్లకుపైగా కమీషన్ల రూపంలో దండుకునేందుకు కీలక మంత్రి పావులు కదుపుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లాలో కృష్ణాపురం రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు రూ.25.75 కోట్లతోను.. అరణియార్ రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు రూ.30.65 కోట్లతోనూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు ఫిబ్రవరి 4న కట్టబెట్టి.. రూ.11 కోట్లకుపైగా ముడుపులు వసూలు చేసుకోవడానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జికి ప్రభుత్వ పెద్దలు అవకాశం కల్పించారు. కమీషన్లు ఇచ్చిన వారికే టెండర్లు! శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం ఆనకట్ట, కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ, చిత్తూరు జిల్లాలో అరణియార్, కృష్ణాపురం జలాశయాలు, అనంతపురం జిల్లాలో ఎగువ పెన్నార్, పెన్నార్–కుముద్వతి తదితర చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు నిర్వహిస్తున్న టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అంచనాల్లో వంచన నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనుల్లో ప్యాకేజీ–ఎ కింద ఎం–15 కాంక్రీట్ పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.4,407.60 వంతున వ్యయం అవుతుందని లెక్కకట్టిన జలవనరుల శాఖ అధికారులు, పాకేజీ–బి పనుల్లో అదే రకమైన పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.5,184.90 చొప్పున ఖర్చు అవుతుందని తేల్చారు. మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ పనుల్లో కాంక్రీట్ పనుల వ్యయం కూడా క్యూబిక్ మీటర్‌కు రూ.5,883.50కు (2018–19 ఎస్ఎస్ఆర్ మేరకు క్యూబిక్ మీటర్‌కు ఖర్చుయ్యేది రూ.3,900లే కావడం గమనార్హం) పెంచేశారు. అరణియార్, కృష్ణాపురం రిజర్వాయర్లు, పెన్నార్–కుముద్వతి ప్రాజెక్టు, ఎగువ పెన్నార్ జలాశయం తదితర ప్రాజెక్టుల ఆధునికీకరణ పనుల్లోనూ ఇదే ఎత్తున తప్పుడు అంచనాలతో వ్యయాన్ని పెంచేయడం గమనార్హం. -
‘రూ.4,500 కోట్లు చెల్లించండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు తక్షణ అవసరంగా కనిష్టంగా రూ.4,500 కోట్లు చెల్లించాలని సాగునీటి శాఖ ప్రభుత్వానికి సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఉన్న పనులకు త్వరితగతిన బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఒక్కో ప్రాజెక్టు నుంచి మొదటి ప్రాధాన్యతగా ఏ పనులకు బిల్లులు చెల్లించాలన్న వివరాలు సేకరిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఏకంగా రూ.10వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే రూ.వెయ్యి కోట్లు, దేవాదులలో రూ.668 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలో కలిపి మరో రూ.400 కోట్లు, డిండిలో రూ.319 కోట్లు, సీతారామలో రూ.126 కోట్లు, ఎల్లంపల్లిలో రూ.321 కోట్లు, పెన్‌గంగలో రూ.84 కోట్లుండగా, అత్యధికంగా పాలమూరు–రంగారెడ్డి పరిధిలో రూ.1,620 కోట్లు, మిషన్ కాకతీయకు సంబంధించి రూ.880 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సందర్భంగా నిధుల అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి నిధులు విడుదల చేయాలని సూచించారు. దీంతో ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు వివరాలు సమర్పించారు. భూసేకరణ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ బిల్లులను చెల్లించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
కమీషన్లు ఇస్తేనే బిల్లులు!
సాక్షి, అమరావతి: సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మాటేమోగానీ.. కమీషన్లు వసూలు చేసుకోవడంలో మాత్రం సీఎం చంద్రబాబు ఆరితేరిపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జలవనరుల శాఖ నుంచి రహదారులు, భవనాల శాఖ వరకూ అన్ని శాఖల పరిధిలో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి పర్సంటేజీలు తీసుకోవడం.. దుబారా ఖర్చులతో రాష్ట్ర ఖజానాను గుల్ల చేశారు. గత నాలుగు నెలలుగా ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపునకు ఏ నెలకు ఆ నెల చేబదుళ్లు(ఓవర్ డ్రాఫ్ట్) చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. వివిధ శాఖల పరిధిలో చేసిన పనులు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు రూ.12 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల కొరతను సాకుగా చూపి బిల్లులు చెల్లించడానికి పీఏవో(పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు) అధికారులు నిరాకరిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న సీఎం చంద్రబాబు.. కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లించేలా పీఏవోలకు తన కార్యాలయం(సీఎంవో) నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తున్నారు. దీనిపై నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం పెరిగినా ఆర్థిక ఇబ్బందులేనా? ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.600 కోట్ల మేర ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిపడింది. ఆ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలను ప్రైవేటు ఆసుపత్రులు నిలిపేయడంతో లబ్ధిదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబోదిబోమంటున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి ఖజానాకు రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.30,390.62 కోట్ల ఆదాయం వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.34,890 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ.4,500 కోట్ల మేర అధికంగా ఆదాయం వచ్చినట్లు స్పష్టమవుతోంది. అవినీతి అక్రమాలకు తావు లేకుండా, దుబారా ఖర్చు చేయకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉత్పన్నమయ్యే అవకాశమే ఉండేవి కాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దుబారాతో ఖజానా కుదేలు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దలు సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకూ అన్ని పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారు. ఒక్క జలవనరుల శాఖలోనే 23 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.58,107.86 కోట్ల మేర భారం పడింది. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలు.. ధర్మపోరాట దీక్షల పేరుతో ఒక్కో సభకు రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతి, అక్రమాలు.. దుబారా ఖర్చు వల్లే రాష్ట్ర ఖజానా కుదేలైపోయిందన్నది స్పష్టమవుతోంది. రాష్ట్ర సొంత పన్నుల ద్వారా ఖజానాకు ఆదాయం పెరిగినా.. పన్నుల వాటా కింద కేంద్రం నుంచి యథావిధిగా నిధులు అందుతున్నా.. ప్రభుత్వ పెద్దల కమీషన్లకు, దుబారా వ్యయానికి సరిపోవడం లేదు. దాంతో గత నాలుగు నెలలుగా చేబదుళ్లతోనే నెట్టుకొస్తున్నారు. చేబదుళ్లు రూ.2 వేల కోట్లకు పైగా చేరుకున్నాయి. కోటరీ కాంట్రాక్టర్లకే బిల్లులు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు పెన్షన్ పోగా మిగిలే నిధులను సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన బిల్లులను పీఏవోలు చెల్లిస్తారు. ఆర్థిక పరిస్థితి దిగజారడాన్ని ఆసరాగా చేసుకున్న సీఎం చంద్రబాబు.. సీఎంవో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారికి మాత్రమే బిల్లులు చెల్లించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయించారు. సాగునీటి ప్రాజెక్టులు, రాజధానిలో రహదారుల పనులు చేస్తున్న కోటరీ కాంట్రాక్టర్లలో తాను అడిగినంత కమీషన్లు ఇచ్చే వారికి మాత్రమే బిల్లులు చెల్లించేలా పీఏవోలకు ఎప్పటికప్పుడు సంకేతాలు పంపుతున్నారు. గత నాలుగు నెలలుగా చంద్రబాబు కోటరీలోని ముగ్గురు కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తుండటమే ఇందుకు తార్కాణం. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 కోట్లకుపైగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించడం లేదు. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. దాంతో గత రెండు నెలలుగా పిల్లలకు పాలు, గుడ్లు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. -
రెండేళ్లలో అద్దంలా .. గ్రామీణ రహదారులు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్లలో తెలంగాణలోని అన్ని రహదారులను అద్దంలా మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారులకే ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బీటీ(డాంబర్) రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది? వాటిని అద్దంలా తయారు చేయడానికి ఏం చేయాలి? అనే విషయంపై ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.దీనికి అవసరమైన బడ్జెట్ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం ద్వారా రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు సాధించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు–భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా అవసరమైన చోట రహదారులకు మరమ్మతులు చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన వంతెనలకు మరమ్మతులు చేయాలని, ఇరుకు బ్రిడ్జిలను వెడల్పు చేయాలని చెప్పారు. దీనికోసం రోడ్లు, భవనాల శాఖలోని ఈఎన్సీ స్థాయి నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి అధికారుల సదస్సు నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ప్రతీ రోడ్డు పరిస్థితిని సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాలని కోరారు. జిల్లా, మండలం అనే తేడా లేకుండా... ఏ పార్టీ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం పక్కన బెట్టి... ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్లుమరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సైతం రోడ్ల మరమ్మతు పనులను చేయించుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ నుంచి రోడ్లు–భవనాల శాఖకు, ఆ శాఖ నుంచి జాతీయ రహదారులకు రోడ్లు బదిలీ , నిర్వహణ, మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రోడ్లు నిర్మాణం పూర్తయ్యే వరకు పాత రోడ్లు పాడుపడినా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రోడ్లను బదిలీ చేసే సందర్భంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే కార్యాలయాలు పూర్తిచేయాలి.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణం చేపట్టామని, వాటి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించిన నివాసగృహాలను ఎమ్మెల్యేలకు కేటాయించనున్నట్లు తెలిపారు.ముఖ్య కార్యదర్శులు సునీల్‌శర్మ, కె.రామకృష్ణారావు, రోడ్లు–భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) గణపతిరెడ్డి, ఎస్.ఇ.చంద్రశేఖర్, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులకు వెంటనే భూ పరిహారం... కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణం సందర్భంగా భూమిని కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందివ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ముథోల్ నియోజవకర్గం పరిధిలోని రైతులకు పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆయన స్పందించారు. వెంటనే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్న సుద్ధవాగు ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురైన ప్రజలకు భూ పరిహారం, పునరావాసం ప్యాకేజీ ఇవ్వాలని, ముథోల్ కమ్యూనిటీ హాల్‌ను అప్ గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే కోరారు. -
రైతుకు నీరందించడమే ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: రైతులకు సాగునీరు అందించడానికన్నా మించిన ప్రాధాన్యత మరొకటి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరగాలని, నిధుల కొరత లేదని చెప్పారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి వెంట వెంటనే బిల్లులు చెల్లించనున్నట్లు వెల్లడించారు. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంతో పాటు, పెద్దవాగు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమగ్ర వ్యూహం రూపొందించుకుని నిర్మాణాలు ప్రారంభించాలని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిధుల విడుదలకు సిద్ధం.. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు రూ.77,777 కోట్ల వ్యయమైందని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘భూ సేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి, ఆర్ఆర్ ప్యాకేజీల కోసం మరో రూ.22 వేల కోట్లు ఖర్చు చేశాం. మొత్తంగా ఇప్పటివరకు రూ.99,643 కోట్లు ఖర్చయింది. ఈ ఏడాది మార్చి నాటికి మరో రూ.7 వేల కోట్లకు పైగా వ్యయం కానుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు వ్యయం రూ.1.07 లక్షల కోట్లకు చేరనుంది. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టులతో పాటు, మిషన్ కాకతీయ పనుల కోసం మరో రూ.1.17 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. రాబోయే ఐదేళ్లలో ఈ నిధులు ఖర్చు చేసి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం. అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలు కృషి చేయాలి. నిర్మాణాల కోసం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని స్పష్టంచేశారు. ఆదిలాబాద్ జిల్లా చరిత్రను మార్చాలి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులు ఓ జోక్‌గా మారాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ఎన్నికలప్పుడు ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఓట్లు అడుక్కోవడమే తప్పా ప్రాజెక్టులు కట్టి నీళ్లివ్వలేదు. అత్యధిక వర్షపాతం, పుష్కలమైన నీటి లభ్యత కలిగిన ఆదిలాబాద్ జిల్లా చరిత్ర మార్చాలి. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి దాని ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలి. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజక వర్గంలో 56,900 ఎకరాలకు, ఆసిఫాబాద్‌లో 38,830 ఎకరాలకు, చెన్నూరులో 31,500 ఎకరాలకు, బెల్లంపల్లి నియోజక వర్గంలో 72,770 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి, 20 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి సీడబ్ల్యూసీ అంగీకారం తెలిపింది. దీనిద్వారా ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వడానికి సమగ్ర వ్యూహం రూపొందించాలి. అలాగే అక్కడే పారే పెద్దవాగుకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. చాలా నియోజకవర్గాల గుండా వెళ్తుంది. ఈ పెద్దవాగు నీటిని వినియోగించుకోవడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. పెన్‌గంగ ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చనఖా–కొరటా ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి. కుఫ్టి రిజర్వాయర్ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వాటాను వినియోగించుకోవాలి కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా గోదావరి బేసిన్లో రాష్ట్రం వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ‘ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించాను. నీటి పారుదల శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఈ ప్రాజెక్టు పనులను సందర్శించారు. మొత్తం గోదావరి బేసిన్లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చేయాల్సిన పనులపై పూర్తి అవగాహన వచ్చింది. ఈ అవగాహనతో ఈ నెలాఖరులోగా కార్యాచరణ ఖరారు చేయాలి. ఫిబ్రవరిలో స్వయంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తాను. అదే నెలలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై కార్యాచరణ రూపొందిస్తాం. వర్షాకాలం వరకు వేగంగా పనులు చేసుకునే అవకాశముంది. వెంటనే కార్యరంగంలోకి దిగాలి..’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తొలుత నీటిని చెరువులకు మళ్లించాలి ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని మొదట చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్ మానేరు నుంచి ఎస్పారెస్పీ వరకు, ఇటు మల్లన్నసాగర్ వరకు నీరు అందుతుందన్నారు. అలా వచ్చిన నీటిని మొదట చెరువులకు తరలించేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.కాల్వలపై తూములు నిర్మించి, చెరువులను నింపాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, సీఈలు హరిరామ్, శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈలు విష్ణుప్రసాద్, వేణు, ఈఈ రామకృష్ణలు పాల్గొన్నారు. -
అన్నీ ప్రాధాన్యమే.. వేటికి ముందు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి శాఖలో నిర్మాణం కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల చెల్లింపులపై అధికారుల్లో మథనం మొదలైంది. పనులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు భారీగా ఉండటం, అందుకు తగ్గట్లు నిధుల విడుదల జరగకపోవడంతో వారు కిందామీద పడుతున్నారు. ప్రాజెక్టుల ప్రాధాన్యతను గుర్తించి అందుకు తగ్గట్లే నిధులను విడుదల చేయడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించగా, అన్నీ ప్రాధాన్యతవే అంటూ ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు నివేదిక ఇస్తుండటంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. భారీగా పేరుకుపోయిన బకాయిలు.. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఏకంగా రూ.7,683 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే రూ.967 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేసి నీళ్లిచ్చే ప్రాజెక్టుల జాబితాలో ఉన్న దేవాదులలో రూ.668 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలో కలిపి మరో రూ.400 కోట్లు, డిండిలో రూ.319 కోట్లు, సీతారామలో రూ.126 కోట్లు, ఎల్లంపల్లిలో రూ.321 కోట్లు, పెన్‌గంగలో రూ.84 కోట్లుండగా, అత్యధికంగా పాలమూరు–రంగారెడ్డి పరిధిలో రూ.1,607కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవిగాక మిషన్ కాకతీయకు సంబంధించి సైతం రూ.877 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక శాఖను నీటిపారుదల శాఖ అధికారులు అడిగినప్పుడల్లా నిధుల విడుదలపై దాటవేత ధోరణే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సందర్భంగా నిధుల అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి నిధులు విడుదల చేయాలని, పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు రుణాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వేటికి తక్షణ అవసరముంటుందో, ఆ వివరాలు పంపాలని ప్రాజెక్టుల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాదుల నుంచి ఎల్లంపల్లి వరకు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఇంజనీర్లు తక్షణ నిధుల అవసరంపై నివేదికలు సమర్పిస్తున్నారు. ఇందులో తమ పరిధిలో అన్నీ ప్రాధాన్యత ఉన్నవేనని, వాటికి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. దేవాదులకు ఏకంగా రూ. 511 కోట్లు చెల్లిస్తేనే పనులు ముందుకు కదులుతాయంటూ అధికారులు నివేదించగా, ఆదిలాబాద్‌లోని పెన్‌గంగ, చనాకా–కొరటాతో పాటు ఇతర మధ్యతరహా ప్రాజెక్టులకు కలిపి రూ.120 కోట్లు వెంటనే ఇవ్వాలని ఆ జిల్లా అధికారులు విన్నవించారు. సీతారామ కింద ఈ ఖరీఫ్ నుంచే నీటిని ఆయకట్టుకు పారించాలంటే పెండింగ్ బిల్లుల్లో రూ.120 కోట్లు ఇవ్వాలని అక్కడి నుంచి వినతులు వచ్చాయి. ఎస్సారెస్పీ తొలి దశకు రూ.110 కోట్లు, ఎల్లంపల్లికి రూ.60 కోట్లు, మిషన్ కాకతీయకు తక్షణంగా రూ.150 కోట్లు ఇవ్వాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ వినతులపై శాఖ ఈఎన్సీలతో సీఎస్ ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చర్చలు జరపనున్నారు. అక్కడ వడపోత చేశాకే నిధుల విడుదల జరుగనుంది. ‘పాలమూరు’రుణాలపై కదలిక.. ఇక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈ దఫా ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి అవసరమైన రుణాలను పొందే ప్రక్రియను వేగిరం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు మొత్తంగా రూ.17,570 కోట్ల మేర రుణాలు కావాలంటూ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రమేశ్ ఈఎన్సీకి లేఖ రాశారు. ఈఎన్సీ నుంచి రుణాల ప్రతిపాదన లేఖ ప్రభుత్వానికి వెళ్లనుంది. అక్కడ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే రుణాల ప్రక్రియ మొదలు కానుంది. -
నీరు, నేల సాక్షిగా.. స్వాహా పర్వం
సీఎం చంద్రబాబు తొలుత విడుదల చేసిన శ్వేతపత్రంలో వెల్లడించిన మేరకు చూస్తే.. పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తయుండాలి. రాష్ట్రం సస్యశ్యామలమై ఉండాలి.. కానీ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. అదనంగా ఒక్క ఎకరా ఆయకట్టుకూ నీళ్లివ్వలేదు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రూ.20 వేల కోట్లు, నీరు–చెట్టు కింద రూ.పది వేల కోట్లు, చెరువులు, వాగులు, వంకల్లో పూడిక తీసిన మట్టి, ఇసుక అమ్మకం ద్వారా రూ.25 వేల కోట్లు.. వెరసి రూ.55 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఎవరైనా ఇంటికి పునాదులు వేసి.. గృహ ప్రవేశానికి రండంటూ అందరినీ పిలిచి భోజనం పెడితే ఏమంటాం? పిచ్చోడంటాం.. లేదా మనందరినీ తప్పుదోవ పట్టించడానికి చెవిలో పూలు పెడుతున్నాడంటాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సరిగ్గా ఇదిగో ఇలానే చేస్తున్నారు. – వైఎస్ జగన్ బాబు పుణ్యమా అని మా బతుకులిలా తగలడ్డాయి.. మాది నిరుపేద కుటుంబం. రెండెకరాల చిన్న రైతును. నాలుగేళ్లుగా చినుకు లేదు. పంటలు పండే పరిస్థితి లేదు. అప్పుడప్పుడు పడ్డ కొద్దిపాటి వర్షానికి కంది, మిరప, పత్తి లాంటి పైర్లు వేసినా ఆ తర్వాత వర్షాల్లేక ఎండిపోవడం మామూలైంది. పంటలు వేయడమే మానుకున్నాం. సేద్యాన్ని పక్కన పెట్టాం. కడుపు నిండాలంటే రెక్కల కష్టం తప్పలేదు. ఇక్కడ పనుల్లేకపోవడంతో వలస వెళ్లక తప్పలేదు. వరి కోతలకు కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు.. చెరకు నరకడానికి శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు పోతున్నాం. ఒంట్లో సత్తా ఉన్నన్నాళ్లు నేను వెళ్లే వాడిని. ఇప్పుడు కష్టంగా ఉంది. మా పిల్లలు వెళుతున్నారు. నెల కిందట తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో వరి కోతలకు వెళ్లి.. ఆదివారం తిరిగొస్తుండగా లారీ ప్రమాదంలో మా పిల్లలకు గాయాలయ్యాయి. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారు. అలా జరగకుండా ఉన్నట్లయితే గుంటూరు జిల్లాలో వరి కోతలకు వెళ్లేవారు. ఏడేళ్లుగా వలసపోతూనే ఉన్నాం. ఏడాదిలో మూడు నెలలే కూలి ఉంటుంది. దాంతోనే కుటుంబం మొత్తం బతకాల్సి వస్తోంది. బతుకు దుర్భరంగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పనులను చంద్రబాబు సర్కారు పూర్తి చేయకపోవడంతో ఆయకట్టు రైతులమైన మా బతుకు భారమైంది. పొలాలన్నీ బీళ్లే. తిండి గింజలు, పశువుల మేత దొరికే పరిస్థితి లేదు. ప్రాణప్రదంగా పెంచుకున్న పశువులను కబేళాలకు తరలించి రైతులందరం ఇతర ప్రాంతాలకు కూలికెళ్లి బతుకీడుస్తున్నాం. మా బతుకులిలా తగలడ్డాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ పనులు వేగంగా జరిగాయి. అప్పుడే పనులు పూర్తయి నీరొచ్చి మా బతుకులు మారతాయన్న ఆశ చిగురించింది. ఆయన చనిపోయాక చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండ పనులను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారన్న నమ్మకం ఉంది. – నార్లగడ్డ సుబ్బయ్య, వెంకటరెడ్డి పల్లె, పుల్లలచెరువు మండలం, ప్రకాశం జిల్లా ఆయ‘కట్టు’కథలు.. కమీషన్ల పర్వాలు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయి వరుస ఓటములతో కుంగి కుదేలైన టీడీపీని అధికారంలోకి తేవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టుల జపం చేసి, అధికారంలోకొచ్చాక తన అక్రమార్జనకు వాటిని వనరులుగా మార్చుకున్నారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు మినహా మిగతా పెండింగ్ ప్రాజెక్టుల పనులను కేవలం రూ.17,368 కోట్లతోనే పూర్తి చేస్తానంటూ సాగునీటి ప్రాజెక్టులపై 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ.. నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.63,657.62 కోట్లు ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.10,227.92 కోట్లు, నీరు–చెట్టు కింద చేసిన పనులకు రూ.15,806.70 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. మిగతా రూ.37,623 కోట్లను పెండింగ్ ప్రాజెక్టుల పనులకు ఖర్చు చేశామని చెబుతున్నా ఒక్క ప్రాజెక్టూ పూర్తయింది లేదు. నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన రూ.63,657.62 కోట్లను సక్రమంగా వినియోగించుకుని ఉండుంటే.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ దాదాపుగా పూర్తయ్యేవని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జల సంరక్షణ, భూగర్భ జల వనరుల పరిరక్షణ ముసుగులో నీరు–చెట్టు కింద పనులు చేయకుండానే చేసినట్లు చూపి దోపిడీ చేయకుండా ఆ నిధులను పోలవరం ప్రాజెక్టుకు మళ్లించి ఉంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చేవని జల వనరులశాఖ అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. కమీషన్ల వర్షం కురిపించే కామధేనువులుగా సాగునీటి ప్రాజెక్టులను మార్చేయడం వల్ల ఈ దుస్థితి నెలకొంది. జలయజ్ఞం కింద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన గుండ్లకమ్మ, పుష్కర, తాడిపూడి, గురురాఘవేంద్ర, భూపతిపాలెం, ముసురుమిల్లి, ఎర్రకాల్వ, తోటపల్లి తదితర 11 ప్రాజెక్టులు ముగింపు దశకు చేరుకున్నాయని, మిగిలిపోయిన ఐదు శాతం పనులు పూర్తి చేస్తే కొత్తగా 2,03,628 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చని 2013–14 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ 11 ప్రాజెక్టులను కేవలం రూ.780 కోట్లతో పూర్తి చేయవచ్చని అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనుల్లో పెద్దగా కమీషన్లు రావనే నెపంతో ఆ పనులకు టీడీపీ సర్కార్ ప్రాధాన్యమివ్వలేదు. గాలేరు–నగరి తొలి దశ, హంద్రీ–నీవా తొలి దశ, తెలుగుగంగ ప్రాజెక్టులు 2014 నాటికే పూర్తయ్యాయి. కానీ ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను టీడీపీ ప్రభుత్వం చేపట్టలేదు. దీనివల్ల 6.45 లక్షల ఎకరాలకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధి ఉంటే.. ఆ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసేది. కానీ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసిన సర్కారు.. పాత కాంట్రాక్టర్లను తొలగించి, కమీషన్లు ఇచ్చిన వారికి పనులు అప్పగించింది. అయినా ఆ పనులను పూర్తి చేయలేకపోయింది. దాంతో నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో.. ఎప్పుడో పూర్తయి, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులనే చంద్రబాబు మళ్లీ ప్రారంభించి.. అది తన ఘనతగా చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతుండటంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నుంచి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వరకూ ఇదే కథ. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన భూమి 199.04 లక్షల ఎకరాలుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బోరు బావుల కింద 104.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందేవి. కానీ నాలుగున్నరేళ్లుగా ఆయకట్టు తగ్గిపోతూ వస్తోంది. గరిష్టంగా 76 లక్షల ఎకరాలకే సాగునీరు అందించినట్లు జల వనరుల శాఖ రికార్డులే చెబుతున్నాయి. కానీ.. క్షేత్ర స్థాయిలో ఆ మేరకు కూడా సాగునీళ్లు అందిన దాఖలాల్లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. పొలం వదిలేసి.. డ్రైవర్‌గా వెళ్తున్నా... నాకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఓ కుమార్తెకు పెళ్లి చేశా. మరో కుమార్తె ఇంటర్, కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నాకు నాలుగెకరాల మామిడి తోట ఉంది. మూడేళ్లుగా కాపు తగ్గుతూ వస్తోంది. బోరు బావి తవ్వాలంటే రూ.80 వేలవుతోంది. అంత డబ్బు పెట్టలేని పరిస్థితి. పోనీ అప్పు తెద్దామన్నా ఆర్థికంగా చితికిపోయిన నాకు ఎవరిస్తారు? అప్పు దొరికే పరిస్థితి లేదు. తోటలో చెట్లన్నీ ఎండిపోయాయి. కష్టాలన్నీ ఒక్కసారిగా మొదలయ్యాయి. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఒకప్పుడు ఎంతో మంది కూలీలకు పని కల్పించిన నేను.. ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్‌ను కూడా అమ్మేశాను. పండ్ల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ కూలీగా పని చేసేందుకు మహారాష్ట్రకు కూలీగా వెళ్లాను. అక్కడ భాష రాక బతుకు భారమై మళ్లీ ఇంటికొచ్చాను. పొట్టకూటి కోసం ఇక్కడే ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నా. చంద్రబాబు సర్కారు అన్నదాతలను ఆదుకోదని తేలిపోయింది. నా గోడు వినేవారు లేరు. వైఎస్ జగన్ వస్తేనే మళ్లీ నాకు మునుపటి బతుకు వస్తుంది. ఆయనే ఉచితంగా బోరు వేయిస్తానన్నారు. పెట్టుబడికి డబ్బులు కూడా ఇస్తానన్నారు. ముఖ్యంగా మా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తవుతాయి. మా పొలాలకు నీరొస్తుంది. – అమ్మనబ్రోలు నాగయ్య, కొల్లూరుపాడు, ఉలవపాడు పంచాయతీ, ప్రకాశం జిల్లా. చంద్రబాబు ఇలా చెప్పారు.. చంద్రబాబు 2014 ఎన్నికప్పుడు.. అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ దశల వారీగా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం మినహా మిగిలిన ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతోనే పూర్తి చేస్తాం. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి గ్రావిటీ ఆయకట్టుకు నీళ్లందిస్తాం. నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తాం. సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను మళ్లించి రెండు కోట్ల ఎకరాలకు నీళ్లందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. చంద్రబాబు చేసిందిదీ..: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేశారు. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గత నాలుగున్నరేళ్లలో రూ.37,952.92 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 23 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మాత్రం రూ.96,060.73 కోట్లకు పెంచేశారు. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.58,107.86 కోట్లు పెంచేశారు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున కమీషన్లు తీసుకున్నారనేది స్పష్టమవుతోంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నారు. ఆ తర్వాత పనులన్నీ నామినేషన్‌పై కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ఇంకా నోటిఫై చేయక ముందే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేందుకు కర్ణాటక సర్కార్ చర్యలు తీసుకుంటున్నా, ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో అదనపు నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదు. కృష్ణా నదీ జలాల విషయంలోనే కాదు.. గోదావరి జలాలపై రైతుల హక్కుల పరిరక్షణలోనూ అదే కథ. చివరకు వంశధార జలాలపై ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను కూడా పరిరక్షించలేకపోయారు. అపర భగీరథుడు వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా, దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధికెక్కింది. కానీ 1995 నుంచి 2004 వరకు వరుస కరవులతో వ్యవసాయం సంక్షోభంలో పడింది. పది మందికి పట్టెడన్నం పెట్టే రైతులు ఆకలితో అలమటించారు. ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను మళ్లించి.. బంజరు భూములను సస్యశ్యామలం చేసి, కరవును శాశ్వతంగా తరిమికొట్టేందుకు 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. తె లుగునేలను కరువనేదే ఎరుగని సీమగా మార్చాలని, దేశ ధాన్యాగారంగా నిలపడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ నామధేయాన్ని సార్థకం చేసి.. రైతేరాజు అన్న నానుడిని నిజం చేసే దిశగా వేగంగా అడుగులేశారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2004లో రూ.లక్ష కోట్ల బడ్జెట్ లేదు. కానీ.. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. వాటిని పూర్తి చేయడం ద్వారా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పక్కాగా ప్రణాళిక వేసుకున్నారు. ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా మొక్కవోని స్థైర్యంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో.. అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లను ఖర్చుచేసి 16 ప్రాజెక్టులను పూర్తిగా, 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయడం ద్వారా 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగం చరిత్రలో ఇదో చెరిగిపోని రికార్డు. అధిక శాతం ప్రాజెక్టు పనులను ఓ కొలిక్కి తెచ్చిన వైఎస్.. జలయజ్ఞం ఫలాలను సంపూర్ణ స్థాయిలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో అమరుడయ్యారు. మహానేత స్ఫూర్తి.. అదే ఆర్తి.. తెలుగునేలను సుభిక్షం చేయడానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞాన్ని చేపడితే.. దాన్ని పూర్తి చేసి, ఫలాలను రైతులకు అందించే గురుతర బాధ్యతను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీసుకున్నారు. ఆయన ప్రకటించిన నవరత్నాలలో జలయజ్ఞానికి పెద్దపీట వేశారు. మహానేత చేపట్టిన జలయజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేసే సమర్థత.. ప్రణాళిక ఒక్క వైఎస్ జగన్‌కే ఉన్నాయని సాగునీటి రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు, రైతులు స్పష్టీకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులను సమీక్షించి.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యం కింద పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తాం. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కడలి పాలవుతున్న గోదావరి జలాలను పొలాలకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలను దేశపు ధాన్యాగారంగా తీర్చిదిద్దుతాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తాం. ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తాం. వంశధార, తోటపల్లి, జంజావతి, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులను శరవేగంగా పూర్తిచేసి ఉత్తరాంధ్రను సుభిక్షం చేస్తాం. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ, గుండ్లకమ్మ, సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసి దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించి, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలు, కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీళ్లందించేలా చూస్తాం. నిర్వాసితులుగా మారిన ప్రజలకు పునరావాసం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతాం. -
త్యాగానికి బహుమానం అవమానం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వస్వాన్ని త్యాగం చేసిన నిర్వాసితులకు మెరుగైన రీతిలో పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ముంపు గ్రామాలకు చెందిన వేలాది నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించింది. తద్వారా ఈ కుటుంబాల్లోని దాదాపు లక్షలాదిమంది నిర్వాసితులను రోడ్డున పడేసింది. పోలవరం, వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగమైన హిరమండలం రిజర్వాయర్, గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో భాగమైన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని అమలు చేయకుండానే పోలీసులను ప్రయోగించి, బలవంతంగా ఉన్న ఊళ్ల నుంచి ఖాళీ చేయించింది. భూసేకరణ చట్టాన్ని అపహాస్యం చేసి.. భూసేకరణ చట్టం–2013 ప్రకారం.. నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీని అమలు చేయాలి. మార్కెట్ విలువకు రెండున్నర రెట్లు అధికంగా పరిహారాన్ని చెల్లించి భూములను సేకరించాలి. భూసేకరణలో నిర్వాసితులను దోచేస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు.. వారికి పునరావాసం కల్పించే విషయంలోనూ లూటీ చేస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం.. నిర్వాసితులకు జీవనోపాధి, ఇంటి సామగ్రి రవాణా, ఏడాది పనిదినాల కల్పనతో కలిపి ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.6.36 లక్షలు, గిరిజన కుటుంబాలకు రూ.6.86 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. పునరావాస కాలనీని నిర్మించి, అన్ని మౌలిక సదుపాయాలతో వారికి ఆశ్రయం కల్పించాలి. ఇళ్లు నిర్మించుకోవడానికి నిధులు ఇవ్వాలని కోరితే.. నిర్మాణానికయ్యే మొత్తాన్ని నిర్వాసితులకు అందజేయాలి. ముంపు గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఉంటే వారిని ప్రత్యేక కుటుంబంగా గుర్తించి.. ఇదే రీతిలో ప్యాకేజీని వర్తింపజేయాలి. పోలవరం ప్రాజెక్టులోనే 371 గ్రామాలు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల 499 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇందులో పోలవరం ప్రాజెక్టులోనే 371 గ్రామాలు ఉండటం గమనార్హం. ప్రాజెక్టుల వల్ల 1,62,870 కుటుంబాలకు చెందిన ఏడు లక్షల మంది ప్రజలు నిర్వాసితులుగా మారుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామసభలు నిర్వహించాలి. తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారుల జాబితాను అందుబాటులో ఉంచాలి. కానీ.. టీడీపీ కీలక నేతలతో కుమ్మక్కైన ఉన్నతాధికారులు గ్రామసభలకు మోకాలడ్డారు. తాము నియమించుకున్న దళారీల ద్వారా ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించినవారు నిర్వాసితులైనా, కాకున్నా లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పిస్తున్నారు. ఆ జాబితా మేరకే పరిహారం చెల్లిస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు. నిర్వాసితుల జీవితాలతో చెలగాటం ప్రభుత్వం పునరావాస కాలనీల్లో ఐదు సెంట్ల భూమిని కేటాయించి పక్కా గృహాన్ని నిర్మించి ఇవ్వాలి. పోలవరం నిర్వాసితులకు మాత్రమే ఇళ్లను నిర్మిస్తున్న సర్కార్.. మిగిలిన ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కేటాయించి.. నిర్మాణానికి రూ.60 వేల నుంచి రూ.70 వేలను మాత్రమే ఇస్తోంది. కానీ.. సర్కార్ నిర్మిస్తోన్న ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. కేవలం సెంటు సెంటున్నర భూమిలో ఇరుకైన ఒకే గది, దానికి అనుబంధంగా చిన్న వంట గది, మరుగుదొడ్డి నిర్మించి ఇస్తున్నారు. వాస్తవంగా ఈ ఇంటి నిర్మాణానికి రూ.లక్షకు మించి వ్యయం కాదు. కానీ.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.9 లక్షల నుంచి రూ.4.25 లక్షల వరకూ అంచనా అవుతుందని లెక్కలు వేసి ఆ పనులను గంపగుత్తగా టీడీపీ ఎమ్మెల్యేలకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఇందులో రూ.వందలాది కోట్ల కమీషన్లు చేతులు మారుతున్నాయి. ఒక్కో చోట.. ఒక్కో రీతిలో పరిహారం ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్కో ప్రాజెక్టులో ఒక్కో రీతిలో పరిహారం అందజేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గిరిజనులకు రూ.6.86 లక్షల చొప్పున పరిహారం ఇస్తుంటే.. గిరిజనేతరులకు రూ.6.36 లక్షల చొప్పున అందజేస్తోంది. గండికోట నిర్వాసితులకు కొందరికి రూ.3.75 లక్షల చొప్పున, మరికొందరికి రూ.4.89 లక్షల చొప్పున పరిహారాన్ని మంజూరు చేసింది. ఇక హిరమండలం రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. భూమి ఒక చోట.. ఇళ్లు మరో చోట పోలవరం, హిరమండలం పునరావాస కాలనీలకు సమీపంలోనే గిరిజనులకు ఒక్కో కుటుంబానికి కనీసం 2.5 హెక్టార్ల సాగు భూమికి బదులుగా అంతే స్థాయిలో సాగు భూమి కేటాయించాలి. కానీ.. సర్కార్ తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. నిర్వాసితులను బస్సులో తీసుకొస్తున్న అధికారులు పునరావాస కాలనీల సమీపంలోని భూములను చూపించి.. వాటినే మీకు ఇస్తున్నామని చెప్పి నమ్మబలుకుతున్నారు. ఆ తర్వాత పునరావాస కాలనీకి 25 కి.మీ.ల దూరంలో కొండలు, గుట్టల్లోని భూములను కేటాయిస్తున్నారు. ఒక్కో గిరిజనుడికి గరిష్టంగా ఐదు ఎకరాల భూమిని ఒకే చోట చూపించాలి. కానీ.. ఎకరం, అరెకరం చొప్పున సర్కార్ ఐదారు చోట్ల భూమిని కేటాయిస్తుండటంతో వాటిని తామెలా సాగు చేసుకోగలుగుతామని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ట్రిబ్యునల్ విచారణలో ఉన్న భూములను సర్కార్ సేకరించకూడదు. కానీ.. కోర్టుల్లో విచారణలో ఉన్న భూములను కూడా సేకరించిన అధికారులు.. నిర్వాసితులకు కేటాయిస్తున్నారు. భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన గిరిజనులను స్థానికులు అడ్డుకుంటున్నారు. -
మధ్యంతర బడ్జెట్ పెడదామా?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పూర్తి స్థాయిలో ఉండాలా? మధ్యంతర బడ్జెట్ పెట్టుకోవాలా? అనే విషయాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ‘కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రాలకు ఏం ఇస్తారో తెలియదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలా.. మధ్యంతర బడ్జెట్ పెట్టుకుని, కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అనుసరించే విధానానికి అనుగుణంగా తిరిగి బడ్జెట్ పెట్టుకోవాలా.. అనే దానిపై అధ్యయనం చేయాలి’అని సీనియర్ అధికారులకు సీఎం సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, వైద్యశిబిరాల నిర్వహణ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈసారి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించినట్లే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించాలని ఆదేశించారు. పెన్షన్లతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతీ హామీని అమలు చేయాల్సి ఉన్నందున, బడ్జెట్లో కేటాయింపులు జరపాలని సూచించారు. ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో మాట్లాడి సూచనలు తీసుకోవాల న్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభు త్వం పూర్తిగా ఏర్పాట్లు చేసిందని వివరించారు. ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ కంటి వెలుగు శిబిరాల మాదిరిగానే ప్రజలందరికీ చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఫిబ్రవరిలో ఈ శిబిరాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. ఈ దఫా ప్రాజెక్టులన్నీ పూర్తి కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ, డిండి, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం లాంటి ఎత్తి పోతల పథకాలన్నీ ఈ దఫాలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టు పని ఎంత వరకు వచ్చింది.. ఇంకా ఎంత మిగిలి ఉంది? దానికి ఎంత డబ్బులు కావాలి.. తదితర అంశాలపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సీఎస్ ఎస్కే జోషి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, రాజేశ్వర్ తివారీ, వికాస్ రాజ్, శాంతకుమారి, స్మితా సబర్వాల్, నీతూ ప్రసాద్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రబీ ఆశలు సజీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రబీలో నీరిచ్చే అవకాశాలు సజీవమయ్యాయి. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటిలభ్యత ఉండటంతో అక్కడ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే, మిగతా నీటిని రబీ అవసరాలకు ఇవ్వాలని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) నిర్ణయించింది. ఎస్సారెస్పీ, కడెం, నాగార్జున సాగర్ పరిధిలో నిర్ణీత ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉండగా, నిజాంసాగర్, సింగూరు, జూరాల ప్రాజెక్టు ల్లో నిల్వలు ఆశించినంత లేని కారణంగా కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. తొలి ప్రాధాన్యం తాగునీటికే... రాష్ట్రంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం శివమ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌తోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కింద తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో చర్చించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యతిస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు కనీస నీటి మట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్సీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టు నుంచి నీటి విడుదల కోసం రైతుల నుంచి వస్తున్న డిమాండ్లపై చర్చ జరిగింది. ఎస్సారెస్పీలో తాగునీటి కోసం పక్కన పెట్టగా కాకతీయ కెనాల్‌కు 15 టీఎంసీల నీటిని పంటలకు సప్లిమెంటేషన్ చేసేలా విడుదల చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నీటితో కనిష్ఠంగా 2 నుంచి 3 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. ఇక లక్ష్మి కెనాల్, సరస్వతి కెనాల్ కింద చెరో 1.6 టీఎంసీల నీటితో 40వేల ఎకరాలకు ఇవ్వవచ్చని వివరించారు. దీనికి శివమ్ కమిటీ ఓకే చెప్పింది. ఇక కడెం కింద సైతం 2 టీఎంసీలతో గూడెం లిఫ్ట్ ద్వారా 20వేల ఎకరాలకు నీరిచ్చేందుకు సమ్మతించింది. నాగార్జునసాగర్ కింద ప్రస్తుతం 23 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నందున దీనిద్వారా కనిష్టంగా 2.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయం జరిగినట్లుగా తెలిసింది. అయితే ఎన్ని తడులకు ఇవ్వాలి, ఎన్ని కిలోమీటర్ల వరకు ఇవ్వాలన్న దానిపై తుది నిర్ణయం ఇంకా చేయలేదు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాలు, గడ్డెన్నవాగు కింద మరో 2వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. -
మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు మింగేద్దాం
సాక్షి, అమరావతి: ఎన్నికలు ముంచుకొస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 15 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. కనీసం హైడ్రలాజికల్ క్లియరెన్స్.. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) కూడా లేకుండానే.. లైన్ ఎస్టిమేట్ల(ఉజ్జాయింపు అంచనాలు) ఆధారంగానే రూ.17,367 కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలవాలని జలవనరుల శాఖ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ప్రేమతో ఇదంతా చేస్తోందనుకుంటే తప్పులో కాలేసినట్లే.. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, కోటరీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, వారికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లుగా ఇచ్చే రూ.1,700 కోట్లను కమీషన్ల కింద దండుకునేందుకు వ్యూహరచన చేశారు. ఈ సొమ్మును వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశ, నాగావళి(తోటపల్లి) కాలువల ఆధునికీకరణ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే వాటిని కట్టబెట్టాలంటూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)పై ఒత్తిడి తెస్తున్నారు. జనవరి రెండో వారంలోగా మిగిలిన ప్రాజెక్టుల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు హుకుం జారీ చేస్తుండడం గమనార్హం. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక మిగిలిపోయిన ప్రాజెక్టుల పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పనులకు ప్రభుత్వం రూ.44,877.24 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టయినా పూర్తయిన దాఖలాలు లేవు. కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లందించలేకపోయారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇం‘ధనం’ సమకూర్చుకోవడానికి కొత్త ప్రాజెక్టులను తెరపైకి తెచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో జనవరిలోగా ఆయా ప్రాజెక్టుల పనులను కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి.. మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇచ్చే రూ.1,700 కోట్లను కమీషన్ల రూపంలో నొక్కేయడానికి పక్కాగా స్కెచ్ వేశారు. లైన్ ఎస్టిమేట్లే ఆధారం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ వంశధార ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. కానీ, వంశధార ప్రాజెక్టు రెండో దశలో కీలకమైన నేరడి బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వంశధార–బాహుదా నదుల అనుసంధానాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ దీనికి సంబంధించిన సర్వే ప్రక్రియే పూర్తి కాలేదు. లైన్ ఎస్టిమేట్లు ఆధారంగా టెండర్లు పిలవాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) కుడి కాలువ తవ్వుకోవడానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. నాలుగు టీఎంసీల నీటిని కేటాయించింది. గత నాలుగున్నరేళ్లుగా ఆర్డీఎస్ కుడి కాలువకు సంబంధించి డీపీఆర్ తయారు చేయడంలో సర్కార్ విఫలమైంది. ఇప్పుడు లైన్ ఎస్టిమేట్ల ఆధారంగా ఆ పనులకు టెండర్లు పిలవాలని అంటున్నారు. కర్నూలు–కడప(కేసీ) కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించి గుండ్రేవుల రిజర్వాయర్ సర్వే పనులు కూడా పూర్తి చేయలేని సర్కార్.. ఆ పనులను చేపడతామని చెబుతుండటంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. కుప్పంలో 21 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు రూ.41.70 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం పరిధిలో పాలార్ నదిపై నిర్మించిన 21 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు, పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.41.70 కోట్లు మంజూరు చేసింది. ఈ చెక్‌డ్యామ్‌ల కింద ఒక్క ఎకరా ఆయకట్టు కూడా లేదు. కానీ, వాటి మరమ్మతు, పునరుద్ధరణ వల్ల 5,527 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునని పేర్కొంటూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చెక్‌డ్యామ్‌ల మరమ్మతు, పునరుద్ధరణ పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అస్మదీయ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, కమీషన్లు కొల్లగొట్టడానికి ఉన్నతస్థాయిలో ప్రణాళిక రచించినట్లు సమాచారం.