
సాక్షి, అమరావతి: రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వందశాతం ప్రభుత్వ నిధులతో ప్రత్యేక వాహక సంస్థ పనిచేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో దీనిని రిజిస్టర్ చేయాల్సిందిగా జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీవీ ఏర్పాటుకు జలవనరులశాఖ నుంచి రూ.5 కోట్ల పెట్టుబడి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘రాయలసీమ ప్రాంతానికి నీటి లభ్యతను పెంచేందుకు ఏస్పీవీ ఏర్పాటు చేస్తున్నాం. 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ఎస్పీవీ పనిచేస్తుంది. ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని సీఎస్ నీలం సాహ్ని జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
(చదవండి: ‘సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి’)
Comments
Please login to add a commentAdd a comment