Special Purpose Vehicle
-
ఎంఎస్ఎంఈ పోటీ పథకం పునరుద్ధరణ
న్యూఢిల్లీ: పునరుద్ధరించిన ఎంఎస్ఎంఈ కాంపిటీటివ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నూతన పథకంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం వ్యయాలను భరించనుంది. పాత పథకంలో కేంద్రం వాటా 80 శాతంగా ఉండడం గమనార్హం. ప్రతీ క్లస్టర్‌కు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాల్సిన నిబంధనను కూడా తొలగించింది. గతంలో 18 నెలల్లోగా అమలు చేయాలనే నిబందన ఉండేది. పునరుద్ధరించిన పథకంలో దశలు వారీగా పేర్కొంది. బేసిక్ రెండు నెలలు, ఇంటర్మీడియట్ ఆరు నెలలు, అడ్వాన్స్డ్ పన్నెండు నెలలుగా నిర్ణయించింది. అంటే ఈ వ్యవధిలోపు ప్రాజెక్టులను దశలవారీగా ఎంఎస్ఎంఈలు అమ లు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో తయారీ రంగానికి ఈ పథకం అమలు చేస్తామని, రెండో దశలో సేవల రంగానికి అమల్లోకి వస్తుందని ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్ తెలిపారు. -
సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఎస్పీవీ
సాక్షి, అమరావతి: రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వందశాతం ప్రభుత్వ నిధులతో ప్రత్యేక వాహక సంస్థ పనిచేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో దీనిని రిజిస్టర్ చేయాల్సిందిగా జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీవీ ఏర్పాటుకు జలవనరులశాఖ నుంచి రూ.5 కోట్ల పెట్టుబడి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘రాయలసీమ ప్రాంతానికి నీటి లభ్యతను పెంచేందుకు ఏస్పీవీ ఏర్పాటు చేస్తున్నాం. 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ఎస్పీవీ పనిచేస్తుంది. ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని సీఎస్ నీలం సాహ్ని జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: ‘సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి’) -
స్మార్ట్ సిటీకి త్వరలో శ్రీకారం
♦ 6న స్పెషల్ పర్పస్ వెహికల్ తొలి సమావేశం ♦ హాజరుకానున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ♦ జీవీఎంసీకి వారం రోజుల్లో రూ.376 కోట్లు ♦ కనీసం రూ.200 కోట్ల పనులకు సన్నాహాలు ♦ జూన్ 25న శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు ♦ త్వరలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌కు పునాదిరాయి సాక్షి, విశాఖపట్నం : దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు గత ఏడాది జూన్ 25న కేంద్రం ప్రకటించింది. అదే రోజున స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో స్మార్ట్ పనులకు శ్రీకారం చుట్టాలని జీవీఎంసీ కసరత్తు చేస్తోంది. స్మార్ట్‌సిటీ ప్రణాళికల అమలు కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికల్ తొలి సమావేశం ఈ నెల 6న భేటీ కానుంది. మున్సిపల్ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ తో సహా డెరైక్టర్లంతా హాజరు కానున్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా ఇప్పటికే మంజూరైన 15 మెగా వాట్స్ సామర్ధ్యంగల సాలిడ్ వేస్ట్‌మేనేజ్ మెంట్ ఎనర్జీ ప్లాంట్‌ను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ కోసం ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ)ని నియమించారు. ఇప్పటికే స్మార్ట్సిటీస్టేక్ హోల్డర్స్‌తో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అంశాల వారీగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన 15 సబ్ కమిటీలు గతనెల 31న ఎస్పీవీకి నివేదించింది. ఈనెల 6న జరుగనున్న ఎస్పీవీ భేటీలో కమిటీలు ఇచ్చిన నివేదికలపై చర్చించి కార్యాచరణను రూపొందించనున్నారు. త్వరలో నిధులు విడుదల తొలి ఏడాది చేప ట్టాల్సిన పనుల కోసం రానున్న వారం పదిరోజుల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వాటాల కింద రూ.346 కోట్లు విడుదల కానున్నాయి. ఈ నిధులను ఎస్పీవీ అకౌంట్లో జమ చేయనున్నారు. తొలి ఏడాది గుర్తించిన పనులకు సంబంధించి టెండర్లను పిలవడం, ఫైనలైజ్ చేయడం, వర్కు ఆర్డర్స్ ఇవ్వడం ఇలా అన్ని పనులు ఎస్పీవీ పర్యవేక్షణలో పీఎంసీ చేయనుంది. పథకం ప్రకటించిన జూన్-25న కనీసం రూ.200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టే విధంగా జీవీఎంసీ కమిషనర్ ప్రవీణకుమార్ కసరత్తు చేస్తున్నారు. ఐదేళ్ల కాలపరిమితితో ప్రణాళిక ఆర్కే బీచ్, రుషికొండ, కైలాసగిరి ప్రాంతాల్లో రూ.1602 కోట్లతో ఐదేళ్ల కాల పరిమితిలో స్మార్ట్‌సిటీ ప్రణాళికలను అమలు చేయనున్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు ఏడాదికి చెరో వందకోట్ల చొప్పున రూ.1000కోట్లు సమకూర్చనుండ గా, మిగిలిన రూ. 602 కోట్ల పనులను పీపీపీ పద్ధతిలో చేపట్టనున్నారు. స్మార్ట్‌సిటీ కోసం ఏంపికైన ప్రాంతంలో ప్రతిపాదించిన పనులతో పాటు తొలి ఏడాది రూ.139.96 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటు, ఆనందపురం మండలం గిరజాంలో 20 ఎకరాల్లో రూ.150 కోట్లతో 15 మెగావాట్స్ సామర్ధ్యంతో చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పీఎంఏవై (హౌసింగ్ ఫర్ ఆల్) స్కీమ్‌లో 20,030 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.110.79 కోట్లతో మల్టీస్టోరెడ్ పార్కింగ్ ఫెసిలిటీ పనులు చేపట్టనున్నారు. ఎస్పీవీ బేటీ అనంతరం ప్రాధాన్యం ప్రకారం ఏఏ పనులు చేపట్టాలో గుర్తిస్తామని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఏది ఏమైనా జూన్-25 నాటికి స్మార్ట్ సిటీలో తొలిదశలో అభివృద్ధి చేయనున్న ఆర్కే బీచ్, కైలాసగిరి, రుషికొండ ప్రాంతా ల్లో ప్రతిపాదించిన పనుల్లో కనీ సం రూ.200 కోట్ల విలువైన పనులనైనా ప్రా రంభించాలన్న పట్టుదలతో ఉన్నామని చెప్పారు. నిధుల ప్రణాళిక ఇలా.. (రూ. కోట్లలో) 5 ఏళ్ల కాలపరిమితిలో చేసే ఖర్చు... 1602 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా.. 1000 పీపీపీ పద్ధతిలో సమీకరించేది.. 602 తొలివిడత విడుదలయ్యే నిధులు.. 346 జూన్ 25న చేపట్టే పనుల విలువ.. 200 -
రైల్వే ప్రాజెక్టుల భారం రాష్ట్రంపైనే!
* పనులు జరగాలంటే నిధులు ఖర్చు చేయాల్సిందే * కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతోనే ప్రాజెక్టుల పూర్తి * సీఎం కేసీఆర్‌కు రైల్వే మంత్రి ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం భరించాల్సిందే! కొత్త రైళ్లో, కొత్త లైన్లో కావాలంటే ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు ఖర్చుచేయాల్సిందే!! హైదరాబాద్ పర్యటన లో భాగంగా రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు పరోక్షంగా ఇదే విషయాన్ని తేల్చిచెప్పారు. రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ద్వారానే ప్రాజెక్టుల పూర్తి సాధ్యమని తేటతెల్లం చేశారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండు కొత్త రైళ్లను ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడిన సురేశ్‌ప్రభు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడం సాధ్యమని చెప్పుకొచ్చారు. ‘‘పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చటం రైల్వేకు అతిపెద్ద సవాల్. దాన్ని అధిగమించేందుకే సంస్కరణలు చేపట్టబోతున్నాం. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కట్టుబడి ఉన్నా అది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యం. రైల్వే బడ్జెట్ తో ప్రమేయం లేకుండా నిరంతరాయంగా ప్రాజెక్టుల కేటాయింపు ఉంటుంది. సామాన్యులపై భారం వేస్తూ చార్జీలు పెంచుతారా అని అంతా అడుగుతున్నారు. రైల్వేపై భారం అంటేనే సామాన్యులపై భారం. ఎందుకంటే ైరె ళ్లను వాడుకునేదే వారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసిన సురేశ్‌ప్రభు ఈ మేరకు ప్రతిపాదన చేశారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్టు వెల్లడించారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం రైల్వే బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలను ఇప్పటికిప్పుడు పట్టాలెక్కించటం అసాధ్యమని సురేశ్‌ప్రభు మాటలు స్పష్టం చేస్తున్నా యి. ఒకవేళ ఎస్పీవీ విధానం అమలైతే రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను ఎస్పీవీ పరిశీలించి ముఖ్యమైనవాటిని రైల్వే బోర్డుకు పంపుతుంది. రైల్వేబోర్డు వాటిని పరిశీలించి ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ధారిస్తుంది. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చు ను భరించాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్టులపై వచ్చే లాభాన్ని అవసరమైతే అదే రాష్ర్టంలో కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తారు. రైల్వేను ప్రైవేటీకరించం: సురేశ్‌ప్రభు రైల్వేల పగ్గాలు శాశ్వతంగా ప్రభుత్వం వద్దే ఉంటాయని...దీన్ని ప్రైవేటీకరించబోమని రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పష్టం చేశారు. అయితే రైల్వేల అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సంస్థలోకి ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం (పీపీపీ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ఆహ్వానిస్తున్నామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ‘భారతీయ రైల్వేల సిగ్నల్ ఇంజనీరింగ్ సంస్థ’(ఇరిసెట్)లో ‘భారతీయ రైల్వేల్లో పీపీపీ, ఎఫ్‌డీఐలు’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో కలిసి సురేశ్‌ప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల కోసం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి భారీ డిమాండ్ ఉన్నా రైల్వేల ప్రస్తుత మౌలిక స్థితిగతులకు ఈ డిమాండ్లను తీర్చే సామర్థ్యం లేదన్నారు. బలహీనంగా ఉన్న రైల్వేల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని సంస్థ ఆధునీకరణ కోసం సాధ్యమైన అన్ని మార్గాల్లో ఆర్థిక వనరులను సృష్టించాల్సిన అవసరముందన్నారు. అందువల్ల పీపీపీ, ఎఫ్‌డీఐల అంశంపై రైల్వే ఉద్యోగులు అపోహలు పెట్టుకోరాదని సూచించారు. రైల్వేల ఆధునీకరణలో భాగంగా ఇస్రో, డీఆర్డీఓ వంటి సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరిస్తామన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ రక్షణలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద రక్షణ కల్పించడంతోపాటు రైళ్లను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన అవసరముందన్నారు. సదస్సులో దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవ, సీటీఆర్ఏఎం అధ్యక్షులు దేవిప్రసాద్ పాండే తదితరులు మాట్లాడారు. -
పోలవరం నిర్మాణానికి ఎస్పీవీ ఏర్పాటు
-
పోలవరం నిర్మాణానికి ఎస్పీవీ ఏర్పాటు
* కేంద్ర మంత్రివర్గం ఆమోదం సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించడానికి వీలుగా ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికల్) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విషయం విదితమే. జాతీయ హోదా దక్కితే ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 20వేల కోట్లు వ్యయుం కానున్నట్లు అంచనా. అందులో రూ. 18వేల కోట్లు కేంద్రం సమకూర్చనుంది. ప్రాజెక్టు అనుమతులు సంపాదించే బాధ్యతను కూడా కేంద్రమే తీసుకుంటుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, వారికి నష్టపరిహారం చెల్లించడం కూడా కేంద్రమే చూసుకుంటుంది. ఎస్పీవీ ఏర్పాటు చేయడం ద్వారా వేగంగా అనుమతులు సంపాదించడానికి, నష్టపరిహారం చెల్లించడానికి, పునరావాసం కల్పించడానికి వీలవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.