
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవాంర సమీక్ష నిర్వహించారు. పోలవరంతో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రగతిపై చర్చించారు. కాఫర్ డ్యాంలో ఖాళీలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్పిల్ ఛానల్‌లో మట్టి, కాంక్రీట్ పనులను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. నెల్లూరు, సంగం బ్యారేజీలను మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
డిసెంబర్ నాటికి వెలిగొండ రెండో టన్నెల్ పూర్తవుతుందన్నఅధికారులు.. వంశధారలో ఫేజ్-2, స్టేజ్ -2 పనులు జులై నాటికి పూర్తి చేస్తామన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: బీళ్ల చెంతకు నీళ్లు
Comments
Please login to add a commentAdd a comment