సాక్షి, అమరావతి: ఏపీలో 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. గోదావరి, కృష్ణా జలాలతో పల్నాడును సుభిక్షం చేయడానికి గత ప్రభుత్వం వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం (వైఎస్సార్పీ డీఎంపీ) కింద గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, వరికపుడిశెల ఎత్తిపోతలను చేపట్టింది. ఇప్పుడు వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం పేరును రద్దు చేసి ..గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, వరికపుడిశెల ఎత్తిపోతలుగా ఆ ప్రాజెక్టు పేరును మార్పు చేసింది.
వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పేరును ముక్త్యాల ఎత్తిపోతలుగా, వైఎస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరును వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా, నర్రెడ్డి శివరామరెడ్డి రిజర్వాయర్ పేరును సర్వారాయసాగర్గా, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు బ్యారేజీ పేరును నెల్లూరు బ్యారేజీగా, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ పేరును సంగం బ్యారేజీగా మార్చింది.
గొర్రిపాటి బుచ్చిఅప్పారావు తాటిపూడి రిజర్వాయర్ పేరును తాటిపూడి రిజర్వాయర్‌గా, అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పేరును హంద్రీ–నీవా సుజల స్రవంతిగా, వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు పేరును పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకంగా మార్చింది. బూచేపల్లి సుబ్బారెడ్డి మొగలిగుండాల మినీ రిజర్వాయర్ పేరును మొగలిగుండాల మినీ రిజర్వాయర్‌గా, రాకెట్ల నారాయణరెడ్డి ఎత్తిపోతల పేరును రాకెట్ల ఆమిద్యాల ఎత్తిపోతలుగా మార్చింది.
Comments
Please login to add a commentAdd a comment