Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Expresses Deep Shock Over On Fireworks Explosion Incident In Anakapalle District1
అనకాపల్లి అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

తాడేపల్లి,సాక్షి: అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. ఈ విషాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం,మరికొందరు తీవ్రంగా గాయపడడంపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైఎస్సార్‌సీపీ నాయకులను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. 13-04-2025బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ సీఎం @ysjagan దిగ్భ్రాంతి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తివైయస్‌.జగన్‌ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ…— YSR Congress Party (@YSRCParty) April 13, 2025

A 30 Day Warning For Foreign Nationals Staying In US2
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి

వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025 వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

TTD Chairman BR Naidu Responds To TTD Goshala Incident3
గోశాల ఘటనపై టీటీడీ ఛైర్మన్‌ చులకన వ్యాఖ్యలు!

సాక్షి, తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు, పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. గోశాలలో గోవుల మృతిని టీటీడీ చైర్మన్ అంగీకరించారు. టీటీడీ గోశాలలో ఇప్పటివరకు 22 గోవులు చనిపోయాయాన్న టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు.. ఇంట్లో మనుషులు చనిపోరా అంటూ చులకనగా వ్యాఖ్యానించారు. మరో వైపు, గోశాలలో 40 ఆవులు చనిపోయాయని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. గోవుల మరణాలపై కూటమి నేతల తలోమాట మాట్లాడుతున్నారు.గోశాలలో గోవుల మరణాలపై మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ బీఆర్‌ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. అన్నిచోట్ల కేసులు నమోదు చేయిస్తాం.. ఇప్పటికే కొందరు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళి ఉద్దేశించి టీటీడీ చైర్మన్‌ వ్యాఖ్యానించారు. గోశాలలో డాక్టర్లు తక్కువగా ఉన్నారంటున్న టీటీడీ ఛైర్మన్‌.. అదనపు వైద్యులను నియమిస్తామని తెలిపారు.

Mallidi Satyanarayana Reddy Recalls Incident With Nithin And His Father About Movie4
రూ.75 లక్షలు అడ్వాన్స్‌.. నితిన్‌ మోసం చేశాడు: నిర్మాత

హీరో నితిన్‌కు అడ్వాన్స్‌గా రూ.75 లక్షలిస్తే చివరకు ఆ సినిమానే చేయం అని చేతులెత్తేశాడు అంటున్నాడు నిర్మాత సత్యనారాయణ రెడ్డి. ఈయన.. ఢీ, భగీరథ, బన్నీ వంటి చిత్రాలను నిర్మించాడు. ఈయన కుమారుడు వేణు అలియాస్‌ వశిష్ట (Mallidi Vassishta) డైరెక్టర్‌గా బింబిసారతో భారీ హిట్‌ కొట్టాడు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తున్నాడు.వశిష్ట ఇన్ని కష్టాలు పడ్డాడా?అయితే ఈ విజయాలకు ముందు వశిష్ట ఎన్నో కష్టాలు పడ్డాడు. వాటిని తం‍డ్రి సత్యనారాయణ (Mallidi Satyanarayana Reddy) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'నితిన్‌ 'ఇష్క్‌' సినిమా సమయంలో ఆయన తండ్రి సుధాకర్‌ రెడ్డి చాలా సమస్యల్లో ఉన్నారు. అప్పుడు నేను ఆ సినిమాను కొని వైజాగ్‌లో డిస్ట్రిబ్యూషన్‌ చేశాను. ఆయనకు ఎప్పుడైనా అవసరముంటే డబ్బులిచ్చేవాడిని. అలా మేము క్లోజ్‌ అయ్యాం.రూ.75 లక్షలు అడ్వాన్స్‌నా కుమారుడు వేణు (వశిష్ట)కు డైరెక్షన్‌ అంటే ఇష్టం ఉందని తెలిసి.. నితిన్‌ (Nithiin)తో సినిమా చేద్దాం అన్నాడు. మావాడిని నితిన్‌కోసం కథ రాసుకోమన్నాను. మేము ఓ నిర్మాతను సెట్‌ చేసుకున్నాం. ఆయనతో నితిన్‌కు అడ్వాన్స్‌గా రూ.75 లక్షలు, కెమెరామెన్‌ ఛోటాకు రూ.10 లక్షలు ఇప్పించాం. దాదాపు ఆ ప్రాజెక్ట్‌ మీద రెండుకోట్లు ఖర్చుపెట్టాం. కానీ వాళ్లకు మావాడు చెప్పిన కథ నచ్చలేదు. వేరేవాళ్లు రాసుకున్న కథను వశిష్టతో డైరెక్షన్‌ చేయిద్దామని ఫిక్స్‌ చేశారు.(చదవండి: అభిమానులపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ)వాడికి పెద్ద రేంజ్‌ ఉందటగా!ఇంతలో అఆ సినిమా రిలీజై పెద్ద హిట్టయింది. అఆ తర్వాత కొత్త డైరెక్టర్‌తో సినిమా చేస్తే మావాడి రేంజ్‌ పడిపోతుంది అని సుధాకర్‌ అన్నాడు. వాడికి పెద్ద రేంజ్‌ ఉంది కదా.. అది పడిపోతుందట.. అందుకని తర్వాత చేద్దాం అన్నారు. డబ్బులిచ్చిన నిర్మాతను పిలిపించి మాతో సినిమా చేయడం లేదని చెప్పేశారు. కాకపోతే నితిన్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాం. మీరే నిర్మాతగా ఉండండి అన్నారు. అప్పుడా నిర్మాత.. నేను మీతో పార్ట్‌నర్‌షిప్‌ చేయడానికి రాలేదు, నా డబ్బు నాకిచ్చేయండి అన్నారు. అలా మోసపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేశాం.కొత్త డైరెక్టర్‌తో ఎందుకని..మా వాడికి అల్లు శిరీష్‌ (Allu Sirish) క్లోజ్‌ఫ్రెండ్‌. మంచి కథ రాసుకోరా.. నేనే చేస్తా అని శిరీష్‌ ముందుకొచ్చాడు. సినిమా ముహూర్తం కూడా భారీగా జరిగింది. సరిగ్గా అప్పుడే శ్రీరస్తు.. శుభమస్తు సినిమా వచ్చి హిట్టయింది. దాంతో ఇలాంటి విజయం తర్వాత కొత్త డైరెక్టర్‌తో చేయడం ఎందుకు? అని శిరీష్‌ ఆలోచనలో పడ్డాడు. మాతో సినిమా చేయనన్నాడు. అల్లు అరవింద్‌ ఫీలయ్యాడు. నీకు ఎవరు కావాలో చెప్పు.. హీరోగా తీసుకొస్తా అని అరవింద్‌ మావాడిని అడిగాడు.హీరోగా ట్రై చేయమన్నాకానీ అప్పటికే వాడు చాలా బాధలో ఉన్నాడు. అది చూసి డైరెక్షన్‌ వదిలెయ్‌.. హీరోగా చేయరా అన్నాను. వాడిని హీరోగా లాంచ్‌ చేస్తూ సినిమా మొదలుపెట్టాం. కానీ, అది వర్కవుట్‌ కాదనుకున్నాడు. ఆ సినిమా వదిలేసి మళ్లీ డైరెక్షన్‌ మీదే పడ్డాడు' అని చెప్పుకొచ్చాడు. ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వశిష్ట ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా తీస్తుండటం మెచ్చుకోదగ్గ విషయం.చదవండి: గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ

Fire Accident In Anakapalli District5
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య

విశాఖ,సాక్షి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు.ప్రమాదంపై పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో మృతుల సంఖ్య అంతకంత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆదివారం కావడంతో బాణా సంచా కేంద్రంలో పని చేసేందుకు 15మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు,ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ విచారణకు ఆదేశించారు. బాణాసంచా పేలుడు ప్రమాదంలో చనిపోయిన మృతుల వివరాలుసంగరాజు గోవిందు (40), కైలాస పట్నందాడి రామలక్ష్మి (40), రాజంపేటపురం పాప (40), కైలాసపట్నంగుంపెన వేణుబాబు (35)సానా పతి బాబురావు (65)అప్పికొండ పల్లయ్య (60)దేవర నిర్మల (35), వేటపాలెం

RR VS RCB: Sanju Samson Lean Patch Continues In IPL 20256
IPL 2025, RR VS RCB: సంజూ శాంసన్‌ను టార్గెట్‌ చేస్తున్న అభిమానులు

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సీజన్‌లో శాంసన్‌ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక హాఫ్‌ సెంచరీ చేశాడు. అది కూడా సీజన్‌ తొలి మ్యాచ్‌లో. తాజాగా శాంసన్‌ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో అతడు 19 బంతుల్లో బౌండరీ సాయంతో 15 పరుగులు మాత్రమే చేసి కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్‌ పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుత సీజన్‌లో శాంసన్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతుండటంతో రాయల్స్‌ అభిమానులు విసిగిపోయారు. శాంసన్‌ను తిట్టిపోస్తున్నారు. మెగా వేలానికి ముందు కీలక​ ఆటగాళ్లను వదులుకున్న విషయంలోనూ శాంసన్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌లో రాయల్స్‌ దుస్థితికి శాంసనే కారకుడని విమర్శిస్తున్నారు.ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో శాంసన్‌ స్కోర్లు..15(19)41(28)38(26)20(16)13(11)66(37)ఈ మ్యాచ్‌లో స్టంపౌటైన శాంసన్‌ మరో అనవసరపు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో స్టంపౌట్‌తో కలుపుకుని శాంసన్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 6 సార్లు డకౌటయ్యాడు. యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో (ఐపీఎల్‌లో) అత్యధిక సార్లు స్టంపౌటైన రికార్డు ఫాఫ్‌ డుప్లెసిస్‌ పేరిట ఉంది. డుప్లెసిస్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏడు సార్లు స్టంపౌటయ్యాడు.ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్లు (ప్రస్తుతమున్న వారిలో)..7 - ఫాఫ్ డుప్లెసిస్6 - సంజు శాంసన్5 - మోయిన్ అలీ5 - దీపక్ హుడా5 - విరాట్ కోహ్లీ5 - మన్దీప్ సింగ్5 - అజింక్య రహానే5 - డేవిడ్ వార్నర్మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాజ​స్థాన్‌ 15 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. శాంసన్‌ (15), రియాన్‌ పరాగ్‌ (30) ఔట్‌ కాగా.. యశస్వి జైస్వాల్‌ (64), ధృవ్‌ జురెల్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్‌ పాండ్యా, యశ్‌ దయాల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.కాగా, ప్రస్తుతం రాయల్స్‌ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ ఐదో స్థానంలో ఉంది. రాయల్స్‌ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, మూడింట ఓడగా.. ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి రెండిటిలో ఓటమిపాలైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. గుజరాత్‌, లక్నో, కేకేఆర్‌ వరుసగా స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్‌ ఆరు, సన్‌రైజర్స్‌, ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ వరుసగా 8 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి.

Komatireddy Rajagopal Reddy Sensational Comments On Jana Reddy7
జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా: తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటుంది.. జానారెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఆయన షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయని.. ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పా?. పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను. నాకు చాలా బాధగా ఉంది. నన్ను చూసి అందరూ భయపడుతున్నారు. అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి?. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు.. కేపాసిటీ బట్టి వస్తుంది. 30 ఏళ్లు మంత్రి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.

Gold Price Hits All-Time High in 2025 - Will The Rally Continue?8
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..

2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ రేటు 23 శాతం పెరిగింది. ఏప్రిల్ నెలలో మాత్రమే పసిడి ధర 5 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. శనివారం నాటికి బంగారం ధరలు గరిష్టంగా రూ. 95,670 వద్ద నిలిచాయి.అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. ట్రాయ్ ఔన్సుకు $3,263 రికార్డు గరిష్ట స్థాయిని తాకిన తర్వాత కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి $3,254.90 వద్ద ముగిసింది. ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుదల ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది.బంగారం రేటు ఎందుకు పెరుగుతోందిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్.. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించగా.. చైనాపై సుంకాలను మాత్రం 125 శాతానికి పెంచారు. చైనా కూడా ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వృద్ధి చుట్టూ అనిశ్చితిని పెంచాయి. దీంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులకు గ్యారెంటీ లేదు. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెడితే.. అది సురక్షితమైన ఆస్తిగా భావించేవారు సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఎక్కువమంది బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇది గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. 200 మంది ఉద్యోగులు బయటకుబంగారం ధరలు తగ్గుతాయా?వాణిజ్య యుద్ధం, డాలర్ విలువ తగ్గడం, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ట్రాయ్ ఔన్సుకు $3,300 నుంచి $3,500 వరకు పెరుగుతాయని చెబుతున్నారు.భారతదేశంలో 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం రూ. 97,000 కు చేరుకుంటుందని HDFC సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ 'అనుజ్ గుప్తా' అన్నారు. ధరలు పెరుగుదల ఇలాగె కొనసాగే అవకాశం ఉందని.. ఎల్కేపీ సెక్యూరిటీస్ , కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది కూడా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేదని స్పష్టంగా అర్థమవుతోంది.

More Policemen Affected by the Red Book Constitution in Andhra Pradesh9
ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి మరో 11మంది పోలీసులు బలి

గుంటూరు,సాక్షి: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి మరింత మంది పోలీసులు బలయ్యారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్‌ చేసినా సరే.. ముసుగు వేయలేదంటూ పోలీసులుపై కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఎల్లో మీడియా ఆదేశాలతో పదకొండు మంది పోలీసులపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మీడియా ముందు ముసుగు వేసి చూపించినందుకు పోలీస్ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. శనివారం ఎస్పీ ప్రెస్ మీట్ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్ మీట్‌లో హాజరు పరచేందుకు పోలీసులు ప్రయత్నించారు.అయితే, నేను ముసుగు వేసుకొను అని గోరంట్ల మాధవ్ పోలీసులు తేల్చి చెప్పారు. గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ఎందుకు ప్రెస్ మీట్ ముందు హాజరు పరచలేదని ఎస్పీని ఎల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్‌మీట్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టనందుకు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సీతారామయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. ఆకస్మితంగా బదిలీ చేసి డీజీపీ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డీఎస్పీతో పాటు మరో పదిమంది పోలీసుల పైన వేటు పడింది. అరండల్ పేట సీఐ వీరాస్వామితో పాటు ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశించింది.

Used Car Market Sees Digital Growth More Women Buyers in India 202510
మారుతున్న ట్రెండ్.. 2025లో ఆ కార్లకే డిమాండ్!

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో చాలామంది సొంతంగా వాహనం కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కార్ల కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025 మొదటి త్రైమాసికంలో కార్ల అమ్మకాలకు సంబంధించిన డేటాను యూజ్డ్ కార్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ విడుదల చేసింది.స్పిన్నీ డేటా ప్రకారం.. 2025 మొదటి త్రైమాసికంలో ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్‌లో గణనీయమైన మార్పులను నివేదించింది. అమ్మకాలలో 77 శాతం డిజిటల్ లావాదేవీల ద్వారా జరుగుతున్నాయి. మహిళా కొనుగోలుదారుల సంఖ్య 28 శాతం పెరిగింది. మొదటిసారి కారు కొనుగోలు చేసినవారు 74 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్ కార్ల అమ్మకాలు 29 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలు, పూణేలలో కార్ల కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా బ్రాండ్ కార్లను అధికంగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారని నివేదిక ద్వారా తెలుస్తోంది. తెలుపు, బూడిద, ఎరుపు రంగు కార్లకే డిమాండ్ ఎక్కువని స్పిన్నీ స్పష్టం చేసింది.డిజిటల్ లావాదేవీలు 2023లో 70 శాతం, 2024లో 75 శాతం ఉండగా 2025 మొదటి త్రైమాసికంలో 77 శాతానికి చేరింది. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న వారిలో 57 శాతం మంది లోన్ ద్వారానే కార్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మహిళా కొనుగోలుదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2024లో 26 శాతం మంది మహిళా కొనుగోలుదారులు ఉండగా.. 2025 నాటికి వీటి సంఖ్య 28 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఏదంటే..60 శాతం మంది మహిళలు ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌లను ఇష్టపడుతుంటే.. 18 శాతం మంది కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. లోన్ ద్వారా కార్లను కొనుగోలుచేస్తున్న మహిళలు 27 శాతం ఉన్నారని నివేదికలో వెల్లడైంది.రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి వాహనాలు అధిక ప్రజాదరణ పొందుతుండగా.. కాంపాక్ట్ SUVల విభాగంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ ఉన్నాయి. అమ్మకాల్లో 84 శాతం పెట్రోల్ కార్లు, 10 శాతం డీజిల్ కార్లు, 4 శాతం CNG కార్లు, 2 శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. టాటా నిక్సన్ ఈవీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ కూడా బాగా అభివృద్ధి చెందితోంది. అంటే కొనుగోలుదారుల్లో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement