Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Inter Result 2025 Live Updates: Direct Link to Check AP Inter Result Online1
ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్‌ చేసుకోండిలా..

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.AP Inter Results 2025.. ఎలా చెక్‌ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్‌ చేయండి.➤ "AP Inter 1st Year / 2nd Year Results 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి.➤ వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.➤ భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌/ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.ఇదిలా ఉంటే.. ఇంటర్‌లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్‌ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించారు.

Padma Shri Vanajeevi Ramaiah Passed Away Condolences pour2
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఇక లేరు

సాక్షి, ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ‘వనజీవి’ రామయ్య(85) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.దరిపల్లి రామయ్య(Daripalli Ramaiah) స్వగ్రామం ఖమ్మం రూరల్‌ మండలంలోని ముత్తగూడెం. ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు కూడా. ఆ సమయంలో మల్లేశం సర్‌ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆపై పంటపొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సర్‌ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి.. దశాబ్దాలపాటు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారాయన. మనవళ్లకు మొక్కల పేర్లు!వనజీవి రామయ్య((Vanajeevi Ramaiah)కు భార్య జానకమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు వనజీవి రామయ్య.అలసిపోని వనజీవిఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఎండకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వయసు మీదపడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి పెంచమని సూచించారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించే వారు. ఆ మధ్య ఆయనకు ఓ యాక్సిడెంట్‌ అయ్యింది. ఆ వాహనదారుడిని శిక్షించే బదులు అతనితో వంద మొక్కలు నాటించాలని పోలీసులను ఆయన కోరారు. అలాగే.. రైతు బంధు, దళిత బంధులాగా హరిత బంధు కూడా ఇప్పించాలంటూ బీఆర్‌ఎస్‌ హయాంలో ఆయన ఓ విజ్ఞప్తి కూడా చేశారు.సీఎం రేవంత్‌ సహా ప్రముఖుల సంతాపంపద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం అని ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రచార సాధనాలుప్లాస్టిక్‌ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, ప్లాస్టిక్‌ కుండలు, రింగులు.. ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించుకోనంటూ వస్తువు లేదు. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది.. అక్షరాలు రాసి తలకు ధరించేవారు. అలా.. తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత’’ అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారాయన. అడిగిందే ఆలస్యం.. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారాయన.అవార్డులు, పాఠంగా రామయ్య జీవితంకోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. సాక్షి మీడియా సంస్థ సైతం ఆయన సేవలకుగానూ ఎక్సలెన్స్‌(Sakshi Excellence Award) అవార్డుతో సత్కరించింది. ఇక.. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు. 2017 సంవత్సరంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ (సామాజిక సేవ) పురస్కారం అందుకుంటూ..

Meta Whistleblower Alleges Mark Zuckerberg Fooling Americans3
జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు

మెటా అధినేత మార్క​ జుకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్‌ విజిల్‌బ్లోయర్‌(వేగు) సారా విన్‌ విలియమ్స్‌ సంచలన ఆరోపణలకు దిగారు. జుకర్‌బర్గ్‌కు అమెరికా ప్రయోజనాల కన్నా డబ్బే ముఖ్యమని, ఈ క్రమంలోనే చైనాతో చేతులు కలిపి తన సొంత దేశం జాతీయ భద్రతా విషయంలో రాజీ పడ్డారని వెల్లడించారామె. సెనేటర్‌ జోష్‌ హవ్యూలే నేతృత్వంలోని కౌంటర్‌టెర్రరిజం సబ్‌ కమిటీ ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. సీబీఎస్‌ కథనం ప్రకారం సారా విన్‌ వాంగ్మూలంలో.. చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాతో మార్క్‌ జుకర్‌బర్గ్‌ చేతులు కలిపారు. అందుకే.. పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్‌ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారామె. మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్‌ సెన్సార్‌షిప్‌ను టూల్స్‌ను రూపొందించింది. తద్వారా కంటెంట్‌ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్‌బర్గ్‌.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్‌ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?. ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు. సారా విన్‌ విలియమ్స్‌ గతంలో ఫేస్‌బుక్‌లో గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్‌లెస్‌ పీపుల్‌ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తంపై మెటా కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. ‘‘ఫేస్‌బుక్‌ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది’’ అని సెనేటర్‌ జోష్‌ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్‌బర్గ్‌కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్‌ విలియమ్స్‌ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Delhi Dust Storm Effect 205 Flights Delayed4
ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తూ.. దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. ఈ క్రమంలో దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు.. ఢిల్లీ క్రికెట్‌ స్టేడియంలో ముంబై టీమ్‌ ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈ తుపాన్‌ రావడంతో దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.వివరాల ప్రకారం.. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షం కురిసింది. అంతకుముందు.. దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల ఎఫెక్ట్‌తో ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 205 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 50 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.Crazy wx! Gale and dust-storms at Dwarka, New Delhi.Heard from a friend at IGI airport, his aircraft was moving and guess what, he’s still on ground. You can imagine the wind speed then. #delhirain #delhiweather pic.twitter.com/BIOdq0bOq7— Anirban 👨‍💻✈️ (@blur_pixel) April 11, 2025ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు ట్విట్టర్‌ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్‌ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు అని ఒక ప్రయాణికుడు తెలిపారు.Delhi NCR is under a heavy dust storm! Visuals from Gurgaon — very intense dust storm hits Gurugram. Stay safe everyone! pic.twitter.com/IqGVen4kLb— The Curious Quill (@PleasingRj) April 11, 2025ఇక, శ్రీనగర్ నుండి ఢిల్లీకి ముంబైకి సాయంత్రం 4 గంటలకు కనెక్టింగ్ విమానం ఉంది. మా విమానం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది, కానీ దుమ్ము తుఫాను కారణంగా చండీగఢ్‌కు మళ్లించబడింది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లింది అని ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న మరో ప్రయాణీకుడు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.Flight Indigo 6E2397 jammu To delhi experiencing a dust storm, affecting takeoffs and landings and potentially causing air traffic congestion at delhi airport we are diverted to jaipur after long 4 hrs waiting to land at delhi now waiting in aircraft at jaipur airport for… pic.twitter.com/2GDeO19UK1— Dr. Safeer Choudhary (@aapkasafeer) April 11, 2025 Very strong #DustStorm Hit Delhi ncr#DelhiWeather pic.twitter.com/REZY7o8v5y— Raviiiiii (@Ravinepz) April 11, 2025आज दिल्ली में बवंडर 🌪️ आ गया …सभी अपने घर में सुरक्षित रहें 🙏🏻#delhiweather #sandstorm #DelhiRains #delhi pic.twitter.com/OCf4ZE7BfS— Shivam Rajput (@SHIVAMespeare) April 11, 2025 మరోవైపు.. ఢిల్లీలోని కక్రికెట్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో ప్లేయర్స్‌ను గ్రౌండ్‌ నుంచి లోపలికి వెళ్లాలని రోహిత్‌ శర్మ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ROHIT SHARMA, WHAT A CHARACTER 😀👌 pic.twitter.com/Ifz1YlNHX4— Johns. (@CricCrazyJohns) April 11, 2025 कल रात आए आंधी–तूफान का भयानक मंजर देखिए, गुरुग्राम का हैं वीडियो#Gurugram #Thunderstorm #WeatherUpdate #DelhiWeather pic.twitter.com/EMu90l1Bjf— Vistaar News (@VistaarNews) April 12, 2025

He Came In the 8th Over Why Not Bring Him Early: Manoj Tiwary Slammed Dhoni5
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన ఈ ఫైవ్‌ టైమ్‌ చాంపియన్‌.. ఆ తర్వాత పరాజయ పరంపర కొనసాగిస్తోంది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.తద్వారా ఈ సీజన్‌లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసింది. సీఎస్‌కే చరిత్రలో ఇలాంటి పరాభవం ఇదే తొలిసారి. అది కూడా చెన్నైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) సారథ్యంలో ఈ చేదు అనుభవం ఎదుర్కోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ఆట తీరు, ధోని కెప్టెన్సీ తీరును భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి తీవ్రంగా విమర్శించాడు.ప్రత్యర్థి తెలివిగా ఆడితే.. వీరు మాత్రందిగ్గజ ఆటగాడు, కెప్టెన్‌ అయిన ధోని నుంచి ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదని.. అసలు వాళ్లకు మెదడు పనిచేయడం మానేసిందా అన్నట్లుగా మ్యాచ్‌ సాగిందని మనోజ్‌ తివారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి తెలివిగా ఆడి గెలుపొందితే.. చెన్నై జట్టు మాత్రం తెల్లముఖం వేసిందని ఎద్దేవా చేశాడు.‘‘సీఎస్‌కే పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ముఖ్యంగా గత మూడు- నాలుగు మ్యాచ్‌లలో వారి ప్రదర్శన మరీ నాసిరకంగా ఉంది. ఆటగాళ్ల షాట్ల ఎంపిక చెత్తగా ఉంటోంది. గత 20- 25 ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్న వాళ్లకు కూడా ఏమైంది?అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా?అసలు వారి ప్రణాళికలు ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. మీ జట్టులో ప్రస్తుత పర్పుల్‌ క్యాప్‌ విజేత నూర్‌ అహ్మద్‌ ఉన్నాడు. కానీ అతడిని మీరు ఎప్పుడు బౌలింగ్‌కు పంపించారో గుర్తుందా? ఎనిమిదో ఓవర్‌.. అవును ఎనిమిదో ఓవర్‌..ప్రత్యర్థి జట్టులోని సునిల్‌ నరైన్‌ తన తొలి బంతికే వికెట్‌ తీసిన విషయం మీకు తెలియదా? దీనిని బట్టి పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అంచనా రాలేదా? అలాంటపుడు మీ పర్పుల్‌ క్యాప్‌ విజేతను ముందుగానే ఎందుకు బౌలింగ్‌కు పంపలేదు?సాధారణంగా ధోని ఇలాంటి పొరపాట్లు చేయడు. చాలా ఏళ్లుగా అతడిని గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పు అయితే ఎన్నడూ చేయలేదు. కానీ ఈరోజు ఏమైంది? ఓటమి తర్వాతనైనా మీరు పొరపాట్లను గ్రహిస్తారనే అనుకుంటున్నా.అసలు మెదడు పనిచేస్తోందా?!మామూలుగా అయితే, అశ్విన్‌ లెఫ్టాండర్లకు రౌండ్‌ ది స్టంప్స్‌ బౌల్‌ చేస్తాడు. కానీ ఈరోజు అతడు కూడా ఓవర్‌ ది స్టంప్స్‌ వేశాడు. ధోని వంటి అనుభవజ్ఞుడైన, దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఉన్న జట్టులో ఇదేం పరిస్థితి? వాళ్లు మెదళ్లు పనిచేయడం ఆగిపోయాయా?’’ అంటూ మనోజ్‌ తివారి క్రిక్‌బజ్‌ షోలో సీఎస్‌కే, ధోనిపై విమర్శల వర్షం కురిపించాడు.కాగా చెపాక్‌లో కేకేఆర్‌తో టాస్‌ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులే చేసింది. స్పిన్నర్లు సునిల్‌ నరైన్‌ మూడు, వరుణ్‌ చక్రవర్తి రెండు, మొయిన్‌ అలీ ఒక వికెట్‌ తీయగా.. పేసర్లు వైభవ్‌ అరోరా ఒకటి, హర్షిత్‌ రాణా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ధనాధన్‌.. 10.1 ఓవర్లలోనే ఇక సీఎస్‌కే బౌలింగ్‌ అటాక్‌ను పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఆరంభించగా.. స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ను ఎనిమిదో ఓవర్లో రంగంలోకి దింపారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నూర్‌ తన ఓవర్లో కేవలం రెండు పరుగులే ఇచ్చినా.. మరో రెండు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ గెలుపు ఖరారైంది.సీఎస్‌కే విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్‌ పూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్‌ డికాక్‌ (23) రాణించగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సునిల్‌ నరైన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (18 బంతుల్లో 44) ఆడాడు. కెప్టెన్‌ అజింక్య రహానే (17 బంతుల్లో 20).. రింకూ సింగ్‌ (12 బంతుల్లో 15)తో కలిసి కేకేఆర్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు.చదవండి: వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని Game set and done in a thumping style ✅@KKRiders with a 𝙆𝙣𝙞𝙜𝙝𝙩 to remember as they secure a comprehensive 8️⃣-wicket victory 💜Scorecard ▶ https://t.co/gPLIYGiUFV#TATAIPL | #CSKvKKR pic.twitter.com/dADGcgITPW— IndianPremierLeague (@IPL) April 11, 2025

Worlds Highest Bridge Cutting Travel Time to One Minute6
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన

ఇప్పటికే అద్భుతాలకు నెలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతోంది. అదేమిటో తెలిసినవారంతా ఇప్పుటికే చైనా ప్రతిభకు కితాబిస్తున్నారు. చైనానోలోని గుయిజౌ ప్రావిన్స్‌లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి(Huajiang Grand Canyon Bridge) జూన్‌ 25న ఆవిష్కృతం కానుంది. ఇదే ప్రపంచాన్ని అబ్బురపరిచే మరో వండర్‌. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.చైనా ఈ నూతన వంతెనను.. రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు (₹2200 కోట్లు) వెచ్చించింది. ఇప్పటివరకూ ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట సమయం పడుతుండగా, ఈ వంతెన నిర్మాణంతో కేవలం ఒక్క నిముషం(One minute)లో ఈ వెంతెనను దాటేయవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది. China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high. Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches. One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ— Collin Rugg (@CollinRugg) April 8, 2025ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్‌ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని(Engineering ability) ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది. అగాథంలాంటి లోయ మీద, ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..

No Change in Tatkal Ticket Timings IRCTC Tweet7
తత్కాల్‌ బుకింగ్‌ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్‌సీటీసీ క్లారిటీ

ఆంగ్ల మీడియా కథనాలు ఐఆర్‌సీటీసీ (IRCTC) తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించాయి. వీటిని ఆధారంగా చేసుకుని మేము కూడా కథనం అందించాము. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేస్తూ అధికారికంగా వెల్లడించింది.ఏప్రిల్ 15 నుంచి కూడా తత్కాల్ టికెట్స్ బుకింగ్స్ సమయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి టైమింగ్ యథావిధిగానే ఉంటాయి. టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునే వారు ఇప్పటి వరకు ఉన్న సమయాన్నే పాటించాలి. ఆ సమయాల్లోని టికెట్స్ అందుబాటులో ఉంటాయి.Some posts are circulating on Social Media channels mentioning about different timings for Tatkal and Premium Tatkal tickets. No such change in timings is currently proposed in the Tatkal or Premium Tatkal booking timings for AC or Non-AC classes. The permitted booking… pic.twitter.com/bTsgpMVFEZ— IRCTC (@IRCTCofficial) April 11, 2025

Bigg Boss Fame Geetu Royal Left in Tears about Her Personal Life8
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్‌

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గీతూ రాయల్‌ (Geetu Royal) చెప్పినట్లు జనాలకు సింపతీ ఎక్కువే! ఎవరైనా బాధపడుతుంటే అస్సలు చూడలేరు. అన్నా, నేను రైతుబిడ్డనన్నా అని అమాయకంగా ముఖం పెట్టి ఓట్లు అడుక్కున్న పల్లవి ప్రశాంత్‌ను గెలిపించారు. అందరూ తనను ఒంటరి చేసి టార్గెట్‌ చేస్తున్నారన్న కౌశల్‌కూ విజయాన్ని అందించారు. బాలాదిత్య కన్నీళ్లతో సిగరెట్ల కోసం అర్థించినా వాటిని ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టిందని గీతూ రాయల్‌ను బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్‌ చేశారు.ఏడ్చేసిన గీతూ..ఎలాగో ట్రోఫీ మనదే అని డిసైడ్‌ అయిన గీతూ రాయల్‌కు ఎలిమినేషన్‌ పెద్ద షాకే ఇచ్చింది. బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ (Bigg Boss 6 Telugu) అయిపోయి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలోనూ పెద్దగా కనిపించడం లేదు. అలాంటిది గీతూ రాయల్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అందులో ఆమె మాట్లాడుతూ.. నేను బిగ్‌బాస్‌ బజ్‌ చేసేటప్పుడు మా ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. చనిపోదామనుకున్నాతల గోడకేసి కొట్టుకోవాలనిపించింది. ఎందుకీ లైఫ్‌.. చనిపోదాం అనుకున్న సమయంలో కూడా టీవీ షోలో పాల్గొని నాపై జోకులేస్తే నవ్వుకున్నాను. ఎందుకంటే నేను ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చనిపోతుంటే కూడా కచ్చితంగా ఓ వీడియో తీసే పోతాను (కన్నీళ్లు పెట్టుకుంటూ). నేను గట్టిగా మాట్లాడతాను కానీ నేను చాలా వీక్‌, చాలా ఎమోషనల్‌. బిగ్‌బాస్‌ షోకి వెళ్లినప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే నేనే విన్నర్‌ అనుకున్నాను. కట్‌ చేస్తే ఆరు వారాలకే ఎలిమినేట్‌ అయ్యాను. అందుకే వెళ్లలేదుబయట జనాల్ని చూశాక నేను విన్నర్‌ అవను అని అర్థమైంది. అందుకే రీఎంట్రీ ఆఫర్‌ చేసినా వెళ్లలేదు. పైగా అప్పటికే డిప్రెషన్‌లో ఉన్నాను. మనిషి ఆరోగ్యానికి హానికరమైన సిగరెట్లు దాచినందుకు నేను షో నుంచి బయటకు వచ్చేశాను అని తెలిసి నా బుర్ర పాడైపోయింది. ఒక డెలివరీ బాయ్‌ నా షూస్‌ దొంగతనం చేశాడని వీడియో చేస్తే కూడా నన్నే తిట్టారు. జనాలు నన్ను నెగెటివ్‌గానే చూస్తున్నారు.నాకు, నా భర్తకు గొడవఎక్కువగా షోలలో ఎందుకు కనిపించడం లేదంటే.. ఒకానొక సమయంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బిచ్చేవారు. కానీ, ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు. అందుకే వాటిని ఒప్పుకోవడం లేదు. ఇకపోతే నా భర్త వికాస్‌, నేను కలిసే ఉన్నాం. కాకపోతే ఇస్మార్ట్‌ జోడీ సమయంలో నాకు, నా భర్తకు గొడవ జరిగింది. గొడవయినప్పుడు తనతో మాట్లాడను. అలాంటిది ఆ షోకు వెళ్లి అంతా బాగున్నట్లు ఎలా నటించగలం? అందుకే ఆ షో రిజెక్ట్‌ చేశాను. మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత మళ్లీ కలిసిపోతాం అని గీతూ రాయల్‌ చెప్పుకొచ్చింది.చదవండి: సర్కస్‌ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం

Saurabh caught filming woman bathing in Ayodhya Raja Guest House9
అయోధ్య గెస్ట్‌హౌస్‌లో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో తీసి..

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగుచూసింది. అయోధ్యలోని ఒక గెస్ట్ హౌస్‌లో బాత్‌రూమ్‌లో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్‌లో వందల వరకు వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. అయోధ్యలోని రామాలయం గేట్‌ నంబర్‌-3 దగ్గరలో రాజా గెస్ట్‌ హౌస్‌ ఉంది. రామాలయం దర్శనం కోసం అయోధ్యకు వచ్చిన వారు ఈ గెస్ట్‌హౌస్‌లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే, తాజాగా వారణాసికి చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వచ్చారు. శుక్రవారం సదరు రాజా గెస్ట​్‌హౌస్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో సదరు మహిళ.. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా.. గెస్ట్‌హౌస్‌లో పనిచేసే సౌరభ్‌ తివారీ అనే యువకుడు ఆమెను వీడియో తీశాడు. అది గమనించిన ఆమె.. ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేస్తున్న వారు అతడిని పట్టుకున్నారు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. నిందితుడు సౌరభ్‌ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ఫోన్‌ తీసుకుని పరిశీలించగా.. మహిళలు స్నానం చేస్తున్న పది వీడియోలను, అనేక అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.🚨 Ayodhya | A 30-year-old female devotee was secretly filmed while bathing at Raja Guest House near Gate No. 3 of the #Ayodhya Ram Temple.Another disturbing breach of women's privacy in UP.#Ayodhya #WomenSafety #PrivacyViolation #UPNews #indtoday pic.twitter.com/uWRtfpouvV— indtoday (@ind2day) April 11, 2025ఈ క్రమంలో బాధితురాలు మాట్లాడుతూ.. నేనుస్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లాను. బాత్‌రూమ్‌లో పైన ఒక టిన్ షెడ్ ఉంది. నేను స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా పైన ఒక నీడ కనిపించింది. అప్పుడు ఎవరో మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేయడం చూశాను. నేను భయపడి, అరిచి, నా బట్టలు వేసుకుని బయటకు పరిగెత్తాను. గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఇతర అతిథులు కూడా బయటకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నారు అని తెలిపారు.

7 Hours Per Day we are Consuming Online Media10
రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?!

ఆధునిక సాంకేతికత కారణంగా నగర జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర నిత్య క్రియలతో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ టెక్నికల్‌ లైఫ్‌గా మారిపోయింది. ప్రధానంగా నగరవాసులు తమ జీవితంలో గ్యాడ్జెట్‌లను ఒక భాగంగా మార్చుకున్నారని.. ఉదయాన్నే నిద్ర లేపే అలారమ్‌ మొదలు రాత్రి నిద్రించే ముందు గంటల తరబడి మొబైల్‌ స్క్రీన్‌ చూడటం వరకూ ప్రతి క్షణం గ్యాడ్జెట్ల మధ్యనే గడుస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి మనిషి ఆరోగ్యం, ఫిట్నెస్, కమ్యూనికేషన్, విజ్ఞానం, వినోదం మొదలైన అనేక అంశాల్లో ప్రభావం చూపుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో దైనందిన జీవితంలో విచ్చలవిడి వినియోగం విజ్ఞానం, వినియోగమూ ఎక్కువే..! గ్యాడ్జెట్స్‌ మన సౌలభ్యం కోసం ఆహ్వానించినవే ఐనప్పటికీ.. వీటి వినియోగంలో మంచి- చెడూ ప్రయోజనా లున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్యాడ్జెట్స్‌పై ఎంత వరకూ ఆధారపడాలి, ఎంత వరకూ వినియోగించుకోవాలి, ఇవి చేస్తున్న మేలేంటి, కలిగిస్తున్న ముప్పు ఎంత అనేది విశ్లేíÙంచుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఈ గ్యాడ్జెట్ల ప్రభావాన్ని నియంత్రించాల్సిన అవసరముందని ఎన్‌సీఈఆర్‌టీ వంటి సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. స్మార్ట్‌ లైఫ్‌.. బ్యాడ్‌ రిజల్ట్‌.. ఆరోగ్య పరంగా ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లు వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా యాపిల్‌ వాచ్, ఫిట్‌బిట్, శామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్‌ వంటి డివైజ్‌లు మన హార్ట్‌ రేట్, నిద్ర, వాకింగ్‌ స్టెప్స్, క్యాలరీ బర్న్‌ వంటి వివరాలు మానిటర్‌ చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో ఎంతో దోహదపడుతున్నా. అదే సమయంలో మితిమీరిన స్క్రీన్‌ టైం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కళ్ల సమస్యలు వంటి దుష్పరిణామాలూ ఎదురవుతున్నాయి. ఫిట్నెస్‌ఫిట్నెస్‌ పరంగా షాఓమీ, ఎమ్‌ఐ బ్రాండ్, హానర్‌ బ్యాండ్‌లాంటివి మన వర్కౌట్‌ యాక్టివిటీలను ట్రాక్‌ చేస్తాయి. యూట్యూబ్, ఫిట్‌నెస్‌ యాప్‌ల ద్వారా ఇంట్లోనే వ్యాయామం చేయవచ్చు. దీని కోసం ఆన్‌లైన్‌ వేదికగా లెక్కకు మించిన వీడియోలు, సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఈ గ్యాడ్జెట్లపై ఆధారపడుతూ నిజమైన ఫిజికల్‌ యాక్టివిటీకి, వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతే ఫలితం కనబడదని కొందరు ఫిట్నెస్‌ ట్రైనర్ల సూచన. గ్యాడ్జెట్లతో 7 గంటలు.. స్మార్ట్‌ ఫోన్‌ సహాయంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో రోజంతా మునిగిపోయే స్థితికి చేరుకున్నారు. ఇది ఒంటరితనాన్ని, ఆత్మవిమర్శను పెంచే పెను ప్రమాదంగా మారింది. సోషల్‌ యాప్స్‌ సమాజానికీ, మనుషులకూ మధ్య సంధానకర్తగా మారాయి. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో చేరిపోతుండటం సాంకేతికత మాయాజాలమే. సామాజిక అభివృద్ధిలో ఇదొక కీలక మలుపు. కానీ ఈ వేదికగా లభ్యమయ్యే సమాచారంలో వాస్తవికత, నిజాలను తేల్చిచెప్పే అవకాశం అంతగా లేకపోవడంతో మంచి-చెడూ రెండు అంశాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. 2023లో ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎమ్‌ఏఐ), నిల్‌సెన్‌ సంయుక్తంగా నిర్వహించిన రిపోర్ట్‌ ప్రకారం.. భారతదేశంలో సగటు పౌరుడు రోజుకు సుమారు 7 గంటల పాటు డిజిటల్‌ గ్యాడ్జెట్లపై గడుపుతున్నాడు. ఇందులో 2.5 గంటలు సోషల్‌ మీడియా కోసం మాత్రమే వినియోగిస్తున్నాడని వెల్లడించారు. డిజిటల్‌ డిపెండెన్సీ.. వినోదం, గేమింగ్‌ రంగాల్లో ఈ గ్యాడ్జెట్లు మరో కొత్త యుగానికి నాంది పలికాయి. ఆక్యులస్‌ క్వెస్ట్, ప్లే స్టేషన్, వీఆర్‌ వంటి హెడ్‌సెట్లు వాస్తవిక అనుభూతిని అందిస్తూ, వినోదాన్ని సహజ అనుభూతిని పంచుతున్నాయి. ప్రస్తుత 5డీ టెక్నాలజీ గేమ్స్‌ అద్భుత వినోదంతో.. పాటు సమయాన్ని వృథా చేస్తోంది. భారతీయ పరిశోధన సంస్థ ఎయిమ్స్, ఐసీఎమ్‌ఆర్‌ నిర్వహించిన అధ్యయనంలో సుమారు 3000 మంది అత్యధిక స్క్రీన్‌ టైం వల్ల నిద్ర, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తేల్చింది. మరీ ముఖ్యంగా యువతలో డిజిటల్‌ డిపెండెన్సీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించాయి. ఆనందం.. ఆధిపత్యం కాకూడదు.. మొత్తానికి గ్యాడ్జెట్లు మన జీవితంలో అసాధారణ సౌలభ్యాలను, అనుకూలతలను తీసుచ్చినా, అవి మనిషిపై ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు మనమే జాగ్రత్తగా ఉండాలి. వాటిని సంతులితంగా వాడితే అవి వరంగా మారతాయి. లేకపోతే అవే మన స్వేచ్ఛను హరిస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్స్‌ చేపట్టిన పరిశోధనలో ఎక్కువగా మొబైల్‌ వాడకం వల్ల యువతలో ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం పెరిగినట్లు తేలింది. ఈ అధ్యయనంలో ‘నోమోఫోబియా’ (నో మొబైల్‌ ఫోబియా) అనే పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement