Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP files petition in supreme court over Waqf Amendment Bill1
‘వక్ఫ్‌’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌

తాడేపల్లి,సాక్షి: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌ దాఖలు చేసింది. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకంగా వైఎస్సార్‌సీపీ ఓటు వేసిన విష‌యం తెలిసిందే. మైనారిటీ సమాజానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంద‌ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.ఇందులో భాగంగా వక్ఫ్‌ సవరణ బిల్లును ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో వైఎస్సార్‌సీపీ వ్య‌తిరేకించింది. గ‌తంలోనే వక్ఫ్‌ సవరణ బిల్లుపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేసింది. మళ్లీ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్ట‌డంతో లోక్‌స‌భ‌, రాజ్యసభలో వ‌క్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఓటేశారు. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం’ అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వైఎస్సార్‌సీపీ పేర్కొంది.కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో వక్ఫ్‌ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్‌ కావడంతో పాటు ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ సవరణ బిల్లు చట్టు రూపం దాల్చింది. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా, తాజాగా వైఎస్సార్ సీపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అందుకే వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో సవాల్ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారు. అందుకే వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13,14,25,26లను ఉల్లంఘిస్తోంది. ప్రాథమిక హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చటం వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమే. ఈ నిర్ణయం వక్ఫ్ బోర్డు పరిపాలన స్వాతంత్య్రాన్ని దెబ్బ తీస్తోందని వైఎస్సార్‌సీపీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. YSRCP has filed a petition in the Supreme Court challenging the Waqf Bill, citing serious constitutional violations and failure to address the concerns of the Muslim community.The Bill violates Articles 13, 14, 25, and 26 of the Constitution—provisions that guarantee…— YSR Congress Party (@YSRCParty) April 14, 2025

Chinese Freight Forwarder Advises American Clients on Donald Trump Reciprocal Tariffs2
ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!

ఓ వైపు అమెరికా.. మరోవైపు చైనా.. నువ్వా నేనా అన్నట్లుగా సుంకాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ విషయం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు, రెండు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో.. చైనా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను 125 శాతానికి పెంచింది.అమెరికా విధిస్తున్న సుంకాల భారీ నుంచి తప్పించుకోవడం ఎలా అని చాలామంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి ఓ మార్గం కూడా ఉంది. సుంకాల భారీ నుంచి తప్పించుకోవాలంటే.. ఇక స్మగ్లింగ్ చేయాలేమో అనే మీకు రావొచ్చు. అలాంటి సాహసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎలా తప్పించుకోవాలో క్లారిటీగా వెల్లడించే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.చైనా వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తే 145 శాతం సుంకాలను కట్టాల్సి ఉంటుంది. ఎగుమతి అంటేనే భారీ మొత్తం. కానీ చైనాలో వస్తువు కొని మనవెంట అమెరికాకు తెచ్చుకుంటే.. దానికి ప్రత్యేకంగా టారిఫ్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్ఉదాహరణకు ఒక అమెరికన్.. చైనాలో పర్యటించేటప్పుడు తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వాటిని తనతో పాటు అతని దేశానికి కూడా తీసుకెళ్లవచ్చు. ఇది పూర్తిగా లీగల్.. పర్సనల్ షాపింగ్ సర్వీస్ కిందికి వస్తుంది. అయితే ఎన్ని వస్తువులు కొనాలి?, ఎన్ని వస్తువులను తనతో పాటు తీసుకెళ్లవచ్చు అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటిస్తే.. మీపై టారిఫ్స్ ప్రభావం ఉండదు. ఇది ఒక్క అమెరికన్ ప్రజలకు మాత్రమే కాదు.. ఈ ఫార్ములాతో మీరు ఏ దేశీయులైన.. ఇతర దేశాల్లో వస్తువులను సుంకాలతో పనిలేకుండా హ్యాపీగా కొనేయొచ్చు.China is now providing tariff advice. 🤣 pic.twitter.com/esNxGshMe6— James Wood 武杰士 (@commiepommie) April 13, 2025

Farmers Fires on Nadendla Manohar3
డబ్బులెక్కడ సార్‌?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు

ఎన్టీఆర్‌జిల్లా,సాక్షి: ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వచ్చిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)కు ఎన్టీఆర్‌ జిల్లా రైతులు షాకిచ్చారు.జిల్లాలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోళ్లని పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చారు. మంత్రి రాకపై సమాచారం అందుకున్న రైతులు మార్కెట్‌ యార్డ్‌కు చేరుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రి మనోహర్‌ని నిలదీశారు. మిల్లర్లు తమను దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులైనా డబ్బులు పడలేదని ప్రశ్నించారు.

CM Revanth Reddy Bhu Bharathi Portal Launch4
‘ భూ భారతి’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో పోరాటలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు(సోమవారం) భూ భారతి పోర్టల్ ను ఆవిష్కరించారు సీఎం రేవంత్.. దీనిలోభాగంగా మాట్లాడుతూ.. ‘కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది. తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారు. చట్టాలను చట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా?, అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నాం. పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం. వివాద రహిత భూ విధానాలను తీసుకురావాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూఅధికారులపైనే ఉంది. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే మా ఉద్దేశం. గత పాలకుల్లా మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు మేం వ్యతిరేకం. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు.మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం. భవిష్యత్ లో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తాం. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ఈ వేదికగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి’ అని సీఎం రేవంత్ విజ‍్క్షప్తి చేశారు.

Tollywood Hero Nani Interesting Comments about Hit 3 Movie5
'అలా జరగకపోతే నన్ను నమ్మకండి'.. నాని ఆసక్తికర కామెంట్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మోస్ట్ వయొలెంట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్‌-3. ఈ సిరీస్‌లో శైలేశ్ కొలను డైరెక్షన్‌లో వస్తోన్న మూడో చిత్రం. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో ‍అర్జున్ సర్కార్‌ పాత్రలో నాని అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, టీజర్‌ చూస్తుంటే నాని గతంలో ఎన్నడు చూడని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా హిట్-3 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూశాక నాని వయొలెన్స్ ఓ రేంజ్‌లో ఉండనుందని అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. దీనికి హాజరైన హీరో నాని మీడియా ప్రతినిధులు ‍అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గతంలో కోర్ట్ మూవీ హిట్‌ కాకపోతే హిట్‌-3 చూడొద్దని చెప్పారు కదా? మరీ ఈ సినిమాకు ఏం చెబుతారని నానిని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందించారు.(ఇది చదవండి: మోస్ట్ వైలెంట్‍గా 'హిట్‌-3' ట్రైలర్‌.. మార్కోను మించిపోయిన 'నాని')నాని మాట్లాడుతూ..'ఈ సినిమాకు ఆ డైలాగ్ వాడితే నెక్ట్స్ సినిమాకు నేను నిర్మాతను కాదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను.. వాళ్ల ఎవరినో ఎందుకు పెడతాను. హిట్-3 లాంటి జోనర్‌ లాంటి సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం మే 1న ఫుల్ మీల్స్ పక్కా. కొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. ఇది కనక తప్పని మీకు అనిపిస్తే నెక్ట్స్ టైమ్ నానిని నమ్మకండి' అంటూ సరదా నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 'Next time Nani ni nammakandi, anthe'A BOLD STATEMENT by Natural Star @NameisNani.Betting big on himself and #HIT3.#HIT3Trailer TRENDING #1 on YouTube 💥💥▶️ https://t.co/BU8cVg4IJD#HIT3 in cinemas worldwide on 1st MAY, 2025.#AbkiBaarArjunSarkaarNatural Star… pic.twitter.com/ZWZlwKDwhu— Wall Poster Cinema (@walpostercinema) April 14, 2025

Axar Patel fined Rs 12 lakh, 6th captain penalised for slow over-rate6
IPL 2025: అక్ష‌ర్ ప‌టేల్‌కు భారీ షాక్‌.. రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్‌-2025లో ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. అయితే ఓట‌మి బాధ‌లో ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ పటేల్‌కు భారీ షాక్ త‌గిలింది. అక్ష‌ర్‌కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జ‌రిమానా విధించింది.ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ జట్టు నిర్ణీ సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ సీజన్‌లో తొలిసారి ఢిల్లీ స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేయడంతో... ఐపీఎల్‌ నియమావళి ప్రకారం ఆ జట్టు కెప్టెన్ అయిన అక్ష‌ర్ ప‌టేల్‌పై రూ. 12 లక్షలు జరిమానా విధించారు."ఢిల్లీ క్యాపిట‌ల్స్ సార‌థి అక్ష‌ర్ ప‌టేల్‌కు జ‌రిమ‌నా విధించాం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. ఆర్టికల్ 2.22 ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ ప్రకారం అక్ష‌ర్ కు రూ. 12 లక్షలు జరిమానా విధించాం’’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ‘స్లో ఓవర్ రేట్‌’ కారణంగా జరిమానా ఎదుర్కొన్న ఆరో కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ జాబితాలో సంజూ శాంస‌న్‌, రియాన్ ప‌రాగ్‌, హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, ర‌జత్ పాటిదార్ ఉన్నారు.కాగా ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ‌(59) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర్యాన్ రికెల్ట‌న్‌(41), సూర్య‌కుమార్‌(40), న‌మాన్ ధీర్‌(38) ప‌రుగుల‌తో రాణించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్, విప్ర‌జ్ నిగ‌మ్‌ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ సాధించారు. అనంత‌రం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ 19 ఓవర్‌లో వరుసగా మూడు రనౌట్లు అయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. చ‌ద‌వండి: IPL 2025: రోహిత్ శ‌ర్మ మాస్ట‌ర్ మైండ్‌.. డగౌట్​ నుంచే మ్యాచ్ తిప్పేసిన హిట్​మ్యాన్

KSR Comments Over YS Jagan Vision And CBN7
జగన్‌ విజన్‌ బాబు తలకెక్కిందా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు అసలు విజనరీ ఎవరో అర్థమై ఉండాలి. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ఒకే ఒక్క మంచి పనితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దూరదృష్టి, దార్శనికత ఏమిటో తెలిసి వచ్చి ఉంటుంది. బాబు ఇటీవల వెళ్లిన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అభివృద్ధి.. పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేయడం, చూసిన తరువాత కూడా బాబుకు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటన్న ఆత్మవిమర్శ చేసుకోకపోతే దానికి ఆయనే బాధ్యుడు అవుతాడు. వైఎస్‌ జగన్‌ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణలపై ఇప్పటివరకూ చంద్రబాబు ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక లేదా టీవీ ఛానల్‌లో రాసిన పచ్చి అబద్దాల వార్తలు మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకుని ఉంటారు. ఇంతకాలం తాను చేసిందేమిటన్న స్పృహ ఆయనకు వచ్చి ఉంటే మంచిదే. జగన్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేశారు. స్కూ​ల్స్‌లో బల్లల మొదలు, టాయిలెట్ల వరకు, పిల్లల డ్రెస్ మొదలు, వారు తినే ఆహార పదార్ధాల వరకు జగన్ పర్యవేక్షించేవారు. పిల్లలకు పోషకాహారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.అంతకుముందు చంద్రబాబు 2014 హయాం వరకు పాడైపోయి ఉన్న స్కూళ్లను ఒక విప్లవం మాదిరి జగన్ దశల వారీగా బాగు చేయించారు. ప్రభుత్వ స్కూళ్లు అంటే నరకప్రాయం అన్న అభిప్రాయాన్ని తొలగించి, వాటిని ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చి దిద్దారంటే అతిశయోక్తి కాదు. తాగునీటి సదుపాయంతోపాటు, స్కూల్ ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. టాయిలెట్స్‌ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పాఠ్య పుస్తకాలు రెండు భాషల్లో (ఇంగ్లీషు, తెలుగు)నూ చదువుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్జాతీయ స్థాయి ఐబీ కోర్సు, టోఫెల్ వంటి పరీక్షలకు మూడో తరగతి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్దులంతా జగన్ మామ అని పిలుచుకునేవారు.అన్నింటినీ మించి పిల్లలు స్కూళ్లు మానివేయకుండా అమ్మ ఒడి అనే స్కీమ్ ను తెచ్చి విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చేశారు. ఇంత చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తుండేది. కానీ, ఎన్నికల నాటికి వాస్తవం తెలుసుకుని విద్యార్ధి ప్రతీ ఒక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు వంటివారు ఎక్కాలు చదివినట్లు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీని మరిచారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. జగన్ సంస్కరణలు తీసుకు వస్తే వాటికి వ్యతిరేకంగా టీచర్లను టీడీసీ నేతలు రెచ్చగొట్టారు. మెగా డీఎస్సీ నిర్వహించి స్కూళ్లలో టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రచారం చేశారు.ఇన్ని హామీలు ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా ఉన్న ఐబీ సిలబస్ ఎత్తివేసింది. పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ఉందో, లేదో తెలియదు. టోఫెల్ కోచింగ్‌ రద్దు చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశే మంత్రి అయినా విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా మారే పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ జిల్లాలోని ముప్పాళ్లలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. వారు ఆంగ్లంలో మాట్లాడుతుంటే బహుశా ఆయన ఆశ్చర్యపోయి ఉండాలి. గతంలో ఆంగ్ల మీడియంను ఆయనతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యతిరేకించే వారు. చంద్రబాబుకు ఆ పిల్లలలో ఉన్న బలమైన ఆకాంక్ష ఏమిటో అర్థమై ఉండాలి.విద్యార్ధులు వారు చేస్తున్న ప్రయోగాల గురించి ఇంగ్లీష్‌లో వివరిస్తుంటే, బాబు గారు మధ్య, మధ్యలో ఎక్కువ భాగం తెలుగులోనే మాట్లాడారు. ఒక బాలిక ‘‘కలర్‌పుల్ గుడ్ మార్నింగ్’’ అని అన్నప్పుడు అలా ఎందుకు అన్నావు అని ప్రశ్నించి, ఇన్నోవేటివ్‌గా మాట్లాడావు కాబట్టి ఆకర్షించావు అని సీఎం వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన కేవలం ఆ బాలిక మాటలకే కాదు. మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు కూడా ఆకర్షితులై మరో బాలుడిని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అన్నప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని జవాబు ఇచ్చాడు. దానికి ఏమి చదవాలని అడిగితే ఇంగ్లీష్ అని చెప్పేసరికి చంద్రబాబు అవాక్కై ఉండాలి. కొంతకాలం క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో ఒక స్కూల్‌ ను సందర్శించి ప్రైవేటు స్కూళ్ల మాదిరి సదుపాయాలు ఉన్నాయని ప్రశంసించారు. మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న వాస్తవ పరిస్థితి గమనించి ఒకింత ఆశ్చర్యపడిన వీడియోలు గతంలో వచ్చాయి.ఇప్పుడు చంద్రబాబు స్వయంగా చూశారు. అయినా వారిలో అహం దెబ్బతింటుంది కనుక, జగన్ పాలనలో జరిగిన ఈ మార్పులను అంగీకరించడానికి మనసు అంగీకరించదు. అంతేకాక చంద్రబాబుకు ప్రభుత్వ స్కూళ్లపై అంత నమ్మకం ఉన్న మనిషి కాదని అంటారు. కొందరు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఆయన ఆప్త మిత్రుడు. అలాంటి వారిలో ఒకరైన నారాయణ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి. అయినా ఫర్వాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ స్కూళ్లను పాడు చేయకుండా వాటిని జగన్ టైమ్ నాటి ప్రమాణాలతో కొనసాగిస్తే మంచిదే. కాని పలు స్కూళ్లలో పారిశుద్ధ్యం కొరవడిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం గతంలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రత్యేక సిబ్బంది లేకపోవడమే. విద్యా రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు యథావిధిగా కొనసాగించితే ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలకు న్యాయం చేసినట్లవుతుంది. జగన్ ఫోబియాతో బాధపడుతున్న వారికి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. చంద్రబాబు స్కూల్‌కు రావడం సంతోషంగా ఉందని ఒక బాలిక అంది. ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆ బాలిక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందట.అంటే ఏదో మర్యాద కోసం అలా మాట్లాడిందే తప్ప ఇంకొకటి కాదేమో అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అదే జగన్ సీఎం హోదాలో వచ్చి ఉంటే తాము సంతోషానికి ఆ బాలికలు వంద కారణాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు స్కూల్‌కు వచ్చినా, రాకపోయినా పెద్దగా తేడా లేదన్న భావన ఉండవచ్చు. ఎందుకంటే వారేమీ తమ హయాంలో స్కూళ్లను ఇలా మెరుగు పరచలేదు కనుక. జగన్ మంచి చదువే పేద పిల్లలకు ఇచ్చే సంపద అని పలుమార్లు చెప్పేవారు. అదే చంద్రబాబు మాత్రం విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్నారు. తన మనుమడు దేవాన్శ్‌ను మంచి ప్రైవేటు స్కూల్‌లో చదివిస్తుండవచ్చు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలను కూడా అదే తరహాలో భావించి మంచి విద్య ఇవ్వడానికి యత్నిస్తే పేరు వస్తుంది. ఏది ఏమైనా విద్యకు సంబంధించి జగన్ విజన్ ను చంద్రబాబు అంగీకరించక తప్పదు కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Prime Minister Narendra Modi Sensational Comments On Kancha Gachibowli Lands8
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

హర్యానా: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్‌ బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు135వ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ హర్యానా రాష్ట్రం, యమునా నగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోని పాలనని ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది. బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి నష్టం, జంతువులకు ప్రమాదం జరుగుతుంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతుంది.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం జరుగుతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజల ఆందోళనతో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు, బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. వికసిత్‌ భారత్ కోసం బీజేపీ పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదంప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చింది. ఈ తరుణంలో కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ స్పందించారు.

No Indianorigin candidates in 2020 Singapore PM Wong vows to change that9
సింగపూర్‌ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం

సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి.

MLA Prem Sagar Rao Takes On Congress High Command10
అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ!

మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి రాకపోతే సహించేదే లేదని తేల్చిచెప్పారు. పదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తమకిచ్చే గౌరవం అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి, పార్టీలో ఉండి పార్టీని కాపాడుకున్న తమలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకపోతే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరిపోశానని ఆయన చెప్పుకొచ్చారు.వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లంటే..!వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకి మంత్రి పదవులు ఇస్తారా అని ప్రేమ్‌ సాగర్‌ రావు ప్రశ్నించడం కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు రాజగోపాల్‌ రెడ్డిని ఉద్దేశించే చేసినవే అంటూ విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒకానిక సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ చుక్కెదురు కావడంతో తిరికి సొంత గూటికే చేరిన రాజగోపాల్‌ రెడ్డిని ఉద్దేశించి ప్రేమ్‌ సాగర్‌ వ్యాఖ్యానించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇది కాంగ్రెస్‌ లో మరింత అలజడి రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ లో సీనియర్‌ నేతలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం ప్రతిపక్షాల పార్టీలు కౌంటర్లు వేయడానికి ఆస్కారం ఇచ్చినట్లయ్యింది. మంత్రి పదవుల పంచాయితీ మొదటికొచ్చిందా?తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు పూర్తయినప్పటికీ తమకు పదవి కావాలంటే తమకు కావాలంటూ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాస్త సస్సెన్స్ నెలకింది. కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు.తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకని జానారెడ్డి అన్నట్లు వార్తలు రావడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఎందుకు పదవులు ఉండకూడదని ప్రశ్నించారు. తమ శక్తి సామర్థ్యాలను బట్టే మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గిచూపుతోందని, ఇక్కడ కొంతమంది తమ పలుకుబడితో ఆ పదవిని రాకుండా అడ్డుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా పదవి ఇవ్వకపోతే అమీతుమీ తేల్చుకుంటాననే సంకేతాలు పంపడంతో అధిష్టానానికి మళ్లీ పదవుల పంచాయితీ తలనొప్పి షురూ అయ్యింది. తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ పంచాయితీ మళ్లీ మొదటికి రావడంతో అధిష్టానం మరోసారి చర్చలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement